క్రేజీవాలా | taxiwala to release in june second week | Sakshi
Sakshi News home page

క్రేజీవాలా

Published Tue, May 22 2018 1:45 AM | Last Updated on Tue, May 22 2018 1:45 AM

taxiwala to release in june second week - Sakshi

విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘టాక్సీవాలా’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో జిఏ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.కె.ఎన్‌. నిర్మించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్‌ రెండవ వారంలో విడుదల చేయనున్నారు. నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. మాట్లాడుతూ– ‘‘విజయ్‌ దేవరకొండ క్రేజ్, పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం నిర్మించాం.

విజయ్‌ ఇమేజ్‌కి  తగ్గట్టుగానే అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేలా ‘టాక్సీవాలా’లో క్యారెక్టర్‌ను రాహుల్‌ తీర్చిదిద్దాడు. విజయ్‌ మ్యానరిజమ్స్‌ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. రాహుల్‌ టేకింగ్, సుజిత్‌ విజువల్స్, జేక్స్‌ మ్యూజిక్, కృష్ణకాంత్‌ లిరిక్స్, జాషువా స్టంట్స్‌ ఈ చిత్రంలో హైలైట్‌గా నిలుస్తాయి. స్ట్రాంగ్‌ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మించాం’’ అన్నారు. కళ్యాణి, మధునందన్, సిజ్జు మీనన్, రవి ప్రకాష్, రవి వర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement