మ్యూజిక్‌ వీడియోలో ‘అర్జున్‌ రెడ్డి’ | Vijay Deverakonda To Star In A Trilingual Single | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 26 2018 2:15 PM | Last Updated on Tue, Jun 26 2018 4:06 PM

Vijay Deverakonda To Star In A Trilingual Single - Sakshi

వరుస సినిమాలతో ఫుల్‌ ఫాంలో ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఓ మ్యూజిక్‌ వీడియోలో సందడి చేయనున్నారు. టాక్సీవాలా, గీత గోవిందం, నోటా, కామ్రేడ్ సినిమాలు చేస్తున్న  విజయ్‌ ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ మ్యూజిక్‌ వీడియోలో నటించేందుకు అంగీకరించాడు. భానుశ్రీ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వీడియోకు సౌరభ్, దుర్గేష్‌లు సంగీతమందిస్తున్నారు.

ఈ మ్యూజిక్‌ వీడియోను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఈ వీడియోలో విజయ్ సరసన బెంగాళీ మోడల్‌ మాళవిక బెనర్జీ ఆడిపాడనుంది. ఇప్పటికేషూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement