music video
-
సుధాకర్ కోమాకుల 'మెమొరీస్'మ్యూజిక్ వీడియో వచ్చేస్తోంది!
నారాయణ అండ్ కో చిత్రంతో అలరించిన యంగ్ హీరో సుధాకర్ కోమాకుల..ఇప్పుడు ‘మోమురీస్’అనే మ్యూజిక్ వీడియోతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మించారు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో 'మెమొరీస్' వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో నివ్రితి వైబ్స్ యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నివ్రితి వైబ్స్ వారు ఫ్యాన్సీ రేటుకు ఈ సాంగ్ రైట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది. గతంలో అన్వేష్ సైమా అవార్డ్స్ లో నామినేట్ అయిన 'చోటు' అనే షార్ట్ ఫిలింకి కాన్సెప్ట్ రైటర్ గా.. సోని మ్యూజిక్ లో విడుదలైన మరో షార్ట్ ఫిలిం 'మనోహరం'కి రైటర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. ఇప్పుడు మెమొరీస్ సాంగ్ వరుణ్ అనే యువకుడి కథని తెలియజేసే విధంగా ఉంటుంది. మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది. ఈ పాటని అరుణ్ చంద్రశేఖరన్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. -
దేవీ శరన్నవరాత్రులు: ప్రధాని మోదీ అద్భుత గిఫ్ట్, మాస్టర్ పీస్!
యావద్దేశం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్దమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీరాసిన ‘గర్బా’ సాంగ్ శనివారం రిలీజైంది. స్వయంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశారు. ఈ పాట విడుదలైన 9 గంటల్లో 1.9 మిలియన్ల వ్యూస్‌తో దూసుకు పోతుండటం విశేషం. ఈ సందర్బంగా టీం మొత్తానికి ధన్యవాదాలు చెప్పిన ప్రధాని ఈ పాటకు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. చాలా యేళ్ల క్రితం రాసిన గర్బా సాంగ్ ఇది అని పేర్కొన్నారు. చాలా జ్ఞాపకాలను ఇది గుర్తు చేస్తోందన్నారు. కొన్ని సంవత్సరాలుగా తాను ఏమీ రాయలేక పోయినప్పటికీ గత కొన్ని రోజులనుంచి ఈ కొత్త గర్బా పాట రాసానని, నవరాత్రి శుభ సందర్భంగా దీన్ని పంచుకుంటున్నా అంటూ మోదీ ప్రకటించారు. Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc — Narendra Modi (@narendramodi) October 14, 2023 ఈ గార్బో(గార్బా) పాటను ధ్వని భానుశాలి ఆలపించగా, తనిష్క్ బాగ్చి స్వరపర్చారు. 190 సెకన్ల ఈ వీడియోను దసరా సందర్భంగా విడుదల చేశారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నాని సొంత నిర్మాణ సంస్థ జుస్ట్ మ్యూజిక్ బ్యానర్‌పై దీన్ని రూపొందించారు. అద్భుతం,మాస్టర్ పీస్ దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మోదీజీ ఈ పాట రాశారంటే నమ్మలేకపోతున్నాం. గొప్ప సాహిత్యం, మంచి సంగీతంతో చాలా మంచి పాట అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ నవరాత్రికి ఈ పాట చరిత్ర సృష్టించబోతోంది. ఈ మాస్టర్ పీస్ గిఫ్ట్ ఇచ్చినందుకు లవ్ యూ మోదీ జీ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. -
'మెమొరీస్' తో వచ్చేస్తున్న సుధాకర్ కొమాకుల
నారాయణ అండ్ కో చిత్రం తర్వాత ప్రముఖ యువ నటుడు సుధాకర్ కొమాకుల 'మెమొరీస్' అనే మ్యూజిక్ వీడియోతో రాబోతున్నాడు. ఈ సాంగ్ ని సుధాకర్ తన సొంత బ్యానర్ సుఖ మీడియాలో నిర్మిస్తున్నాడు. శాన్ ఫ్యాన్సిస్కో నగరంలో ఈ పాటని రియల్ వరల్డ్ ఫుటేజ్, 2డి యానిమేషన్ తో కలిపి చిత్రీకరించారు. అతి త్వరలో 'మెమొరీస్' వీడియో సాంగ్ ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో యూట్యూబ్ వేదికపై రిలీజ్ చేయనున్నారు. వర్ధమాన ఫిలిం మేకర్ అన్వేష్ భాష్యం దర్శకత్వంలో ఈ సాంగ్ తెరకెక్కింది.మెమొరీస్ సాంగ్ కాన్సెప్ట్ విషయానికి వస్తే.. వరుణ్ అనే యువకుడు తన జర్నీలో ఫీలింగ్స్ కోల్పోయే స్థితి నుంచి తన గమ్యం ఏంటి అని తెలుసుకునే వాడిగా ఎలా మారాడు అనేది ఉంటుంది. ఈ పాటని వరుణ్ కంపోజ్ చేశారు. తెలుగులో ఈ పాటకి రాహుల్ సిప్లిగంజ్ గాత్రం అందించగా.. కన్నడలో వాసుకి వైభవ్ పాడారు. త్వరలోనే ఈ మ్యూజిక్ వీడియో విడుదల కాబోతుంది. -
ఇలా పరువు తీసుకోకండి.. నటుడిపై ట్రోలింగ్
కమెడియన్, డైరెక్టర్, నిర్మాత, నటీనటులు, డ్యాన్సర్లు, సింగర్లు.. దాదాపు అందరూ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నవారే. కొద్దోగొప్పో పాపులారిటీ వచ్చిందంటే చాలు సొంతంగా ఛానల్ పెట్టి అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు సెలబ్రిటీలు. అయితే కొన్నిసార్లు వారు చేసే వీడియోలు ఫ్యాన్స్‌కు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా ఇదే కోవలోకి వచ్చాడు బాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ గోవింద. 'ఆంఖెన్', 'రాజా బాబు', 'కూలీ నంబర్ 1', 'హీరో నంబర్ 1', 'దుల్హె రాజా' సినిమాల్లో నటించి కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోవింద గతేడాది గోవింద రాయల్స్ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. ఇందులో ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ చేసిన ఆయన తాజాగా మూడో మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశాడు. హల్లో అంటూ సాగే ఈ పాటను పాడింది, డైరెక్ట్ చేసింది ఆయనే కావడం విశేషం. అంతేకాదు, నిషా శర్మతో కలిసి డ్యాన్స్ చేశాడు గోవింద. ఇక ఇది చూసిన జనాలు ఇదేందయ్యా ఇది అని ఉలిక్కిపడుతున్నారు. ఈ పిచ్చిపాటలతో మమ్మల్ని చంపుకుతినొద్దంటూ ట్రోల్ చేస్తున్నారు. 'అతడి యాక్టింగ్‌కు పెద్ద ఫ్యాన్‌ను.. కానీ ఇలాంటి పిచ్చిపిచ్చి కంటెంట్‌తో వస్తుంటే చిరాకేస్తోంది. సైకియాట్రిస్ట్‌కు చూపిస్తే మంచిదేమో..', 'నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకో.. జనాలు ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. మీరింకా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నారు', 'ఇలా పరువు తీసుకోకుండా మీరు రిటైర్మెంట్ తీసుకోవచ్చు కదా, మీ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలా చేస్తున్నారు', 'ఇది 2022, ఇంకా 90లో ఉండకండి' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం 'మీ డ్యాన్స్ అదిరిపోయింది సర్', 'లెజెండ్ ఎప్పటికీ లెజెండే' అంటూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. -
నటన రంగంలోకి శ్రీదేవి మేనకోడలు, మ్యూజిక్ వీడియోతో కనువిందు
దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుటుంబం నుంచి మరో వారసురాలు వినోద ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. అయితే ఆమె చిన్న కూతురు అనుకుంటే పొరపాటు పడ్డంటే. ఆమె శ్రీదేవి మేనకోడలు శిరీష. ఓ ప్రైవేటు మ్యూజిక్ వీడియో సాంగ్‌లో ఆమె కనువిందు చేస్తోంది. కేరళ నేపథ్యంలో అక్కడి సాంప్రదాయంలో ఓ లవ్‌ట్రాక్‌పై ఈ మ్యూజిక్ వీడియో సాగింది. ప్రస్తుతం ఈ మ్యూజిక్ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్ మరో విశేషం ఎంటంటే ఇందులో మరో సీనియర్ నటుడు మనవడు కూడా నటించాడు. ‘నడిగర్ తిలకం’ శివాజీ గణేశన్ మనవడు దర్శన్, శిరీషకు జోడిగా నటించాడు. కొన్ని జనరేషన్లుగా లవ్ చేసుకుంటున్న జంటల ప్రేమ ఇతివృతంలో ఈ పాట సాగింది. ఇందులో శిరీష, దర్శన్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఓ సెలబ్రిటీ ప్యాకేజి అనదగ్గ ఈ మ్యూజిక్ వీడియోను సీనియర్ నటి పద్మిని మనవరాలు లక్ష్మి దేవి రూపొందించింది. చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు ‘యదలో మౌనం’ అంటూ సాగే ఈ మ్యూజిక్ వీడియోకు అచ్చు రాజమణి, వరుణ్ మీనన్ సంగీతం సమకూర్చారు. టాలీవుడ్ యువ గీత రచయిత పూర్ణాచారి సాహిత్యం అందించాడు. కాగా ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ సినీరంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాన్వి.. బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ హీరోయిన్గా సత్తా చాటుతోంది. ఇక రెండో కూమార్తె ఖుషి కపూర్ కూడా ఓ మంచి ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. -
జియోసావన్ లో మరో సరికొత్త ఫీచర్
దక్షిణ ఆసియాలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన సంగీత ప్రియులకు ఇష్టమైన జియోసావన్ మరో కొత్త ముందుకు వచ్చింది. జియోసావన్ టీవీ పేరుతో విదేయో కంటెంట్ అందించనుంది. ఇప్పటివరకు రేడియో, పాడ్ క్యాస్ట్ సేవలను అందించిన జియోసావ్న్ ఇప్పడు వీడియో సేవలను అందించనుంది. ప్రత్యేకమైన ఈ వీడియో ఫీచర్ వల్ల మరింత మందికి అద్భుతమైన కంటెంట్ అందించనున్నట్లు పేర్కొంది. జియోసావన్ ప్లాట్‌ఫాం విస్తృతంగా ప్రాచుర్యం పొందిన ఆడియో సేవలతో పాటు సంగీతం కోసం కొత్తగా టెలివిజన్ అనుభవాన్ని సృష్టిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు అత్యధిక నాణ్యత గల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది. వినియోగదారులు ఇప్పుడు హోమ్‌పేజీలోని క్రొత్త ట్యాబ్‌లో మ్యూజిక్ టీవీ ఛానెల్‌లను, మ్యూజిక్ వీడియో ప్లేజాబితాలను యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల చూడాలనుకుంటున్న వీడియోను వెంటనే చూడటానికి వీలు కలుగుతుంది. కొత్త ఫీచర్ వల్ల ఎందరో ప్రసిద్ద కళాకారులు చెందిన వీడియోలను సులభంగా చూడవచ్చు. చదవండి: చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి -
తండ్రైన గర్వం అతడిలో.. కానీ ఆమె ఎందుకలా..?
ఆడవాళ్లకు ఆనందాన్ని పంచడమే కాదు.. వాళ్ల కష్టాన్ని తుడిచేసే మనసూ మగవాళ్లకు రావాలి!.. ఆ ప్రయత్నాన్నే చూపించాడు ‘జనన్య’ అనే మ్యూజిక్ వీడియోలో .. డైరెక్టర్ అనిల్ ఆనంద్. డెలివరీ తర్వాత తల్లులు అనుభవించే పోస్ట్పోర్టమ్ డిప్రెషన్ మీద మగవాళ్లకు అవగాహన కల్పించే మ్యూజిక్ వీడియో అది.. మహిళలను వినడానికి పురుషులు తలవంచారంటే .. సమానత్వం దిశగా ఒక అడుగుపడ్డట్టే కదా! ఈ కథనానికి సందర్భం.. మహిళా దినోత్సవం.. ఆ ఇంట్లో శుభకార్యం. బాలసారె (బారసాల). ఇల్లంతా పూలతో అలంకరించారు. చుట్టాలు, ఆత్మీయులతో సందడిగా ఉంది. ఒక జంట లోపలికి వచ్చింది.. చేతుల్లో చంటిబిడ్డతో. భర్త ఉల్లాసంగా, సంతోషంగా ఉన్నాడు. కొత్తగా తండ్రైన గర్వం అతని మొహంలో తొణికిసలాడుతోంది. కాని బిడ్డను ఎత్తుకున్న ఆ తల్లే దిగులుగా.. విచారంగా.. ఇంకా చెప్పాలంటే బాధగా కనపడుతోంది. అందరూ నవ్వుతున్నారు కాని ఆమె మొహంలో నవ్వులేదు. తల్లి అయిన ఆనందమూ లేదు. ఆమె భావాలను అక్కడున్న వాళ్లెవరూ గమనించట్లేదు. ఆమె చేతుల్లోంచి బిడ్డను తీసుకున్నారు పెద్దవాళ్లు. వెంటనే ఆ తల్లి బాత్రూమ్లోకి వెళ్లి వెక్కివెక్కి ఏడుస్తోంది. ఎంతసేపటికీ భార్య రాకపోయేసరికి కంగారుగా బాత్రూమ్ దగ్గరకు వెళ్లి భార్యను పిలుస్తూ తలుపు కొట్టాడు. మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చింది ఆమె. తన భార్య దుఃఖంతో ఉందని అర్థమైంది అతనికి. ఎందుకో మాత్రం అర్థంకాలేదు. అడిగాడు ఆమెను. ఇదీ అని చెప్పలేకపోయింది కాని బిడ్డ పుట్టినప్పటి నుంచి తనలో కలుగుతున్న భావాలను బయటపెట్టింది. అప్పుడు భార్యను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు భర్త. తర్వాత.. వేడుక.. ఇల్లంతా పూలతో అలంకరించారు. చుట్టాలు, ఆత్మీయులతో సందడిగా ఉంది. ఆ తండ్రి ఉల్లాసంగా.. ఉన్నాడు. చేతుల్లో బిడ్డతో.. ఆనందంగా లోపలికి అడుగుపెట్టింది ఆ అమ్మ. బిడ్డను చూసి మురిసిపోతోంది. ప్రపంచంలోని సంతోషమంతా ఆ తల్లి మొహంలోనే తొణికిసలాడుతోంది. ఈ సీన్‌తో ఆ వీడియో అయిపోతుంది. అవును ఇది ఒక మలయాళంలో తీసిన మ్యూజిక్ వీడియో. పేరు.. జనన్య. అంటే మలయాళ భాషలో ‘భూమి’ అని అర్థమట. ఈ వీడియోకు దర్శకత్వం వహించింది ఆనంద్ అనిల్ కుమార్ అనే మలయాళ దర్శకుడు. మలయాళంలో హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్, అండర్‌వరల్డ్ అనే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ‘జనన్య’ మ్యూజిక్ వీడియో టీమ్ జనన్య ఎందుకు? అనిల్ ఆనంద్ భార్య సోనీ సునీల్.. తన స్నేహితురాలు అనుభవించిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించి భర్తతో చెప్పింది చాలాసార్లు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కాకుండా సొంతంగా ఏదైనా మ్యూజిక్ వీడియో చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సోనీ తన భర్త అనిల్‌కు సలహా ఇచ్చింది.. ‘దేనిమీదో ఎందుకు? నా ఫ్రెండ్ ఎక్స్‌పీరియెన్స్‌నే పాటగా మలిచి.. సంగీతం సమకూర్చి.. వీడియో తీయండి. పైగా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ మీద ముందు అవగాహన కావల్సింది పురుషులకే. అప్పుడే భార్యల మానసిక స్థితిని అర్థం చేసుకొని ఆ సమస్యనుంచి వాళ్లు బయటపడేలా సహాయం చేయగలరు’ అని. భార్య సూచన నచ్చింది అనిల్ ఆనంద్‌కు. వెంటనే పని మొదలుపెట్టాడు. ‘జనన్య’గా మ్యూజిక్ వీడియోను రూపొందించాడు. ఇప్పుడు అది యూట్యూబ్‌లో పెద్ద హిట్. ‘పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్’ అనేది నిజంగానే సీరియస్ ప్రాబ్లం. బిడ్డ పుట్టగానే తండ్రిగా గర్వపడతాం కాని.. భార్య మానసిక, శారీరక ఆరోగ్యాన్ని, ఆమె పరిస్థితిని పట్టించుకోం. అసలు ఆమె మానసికంగా కుంగిపోతుంది. అనే ఆలోచనే రాదు. అందుకే దీని గురించి ముందు ఎడ్యుకేట్ అవ్వాల్సింది మగవాళ్లమే. నా ఈ ‘జనన్య’ మ్యూజిక్ వీడియో ఆ సందేశాన్నే ఇస్తుంది’ అంటాడు దర్శకుడు అనిల్ ఆనంద్. -
ఇస్మార్ట్ స్టెప్స్
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నిధీ అగర్వాల్. ఆ జోష్‌తోనే ఇస్మార్ట్ స్టెప్స్ వేయడానికి రెడీ అవుతున్నారు. హిందీ ర్యాపర్ బాద్షాతో కలసి నిధీ అగర్వాల్ ఓ మ్యూజిక్ వీడియో చేశారు. ఈ వీడియో ఇవాళ రిలీజ్ కానుంది. ఈ మ్యూజిక్ వీడియోకు బలీందర్ యస్. మహంత్ దర్శకత్వం వహించగా ఈ పాటను బాద్షాయే రాసి, పాడి, సంగీతం సమకూర్చారు. ఈ వీడియోలో నిధీ గ్లామర్, తన స్టెప్స్, బాద్షా ర్యాప్ కచ్చితంగా మ్యూజిక్ లవర్స్‌కు ట్రీట్‌లా ఉంటుందని అనుకుంటున్నారు బాద్షా, నిధీ ఫ్యాన్స్. నిధీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో ‘జయం’ రవితో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే తెలుగులో తన తదుపరి సినిమా విశేషాలను ప్రకటించనున్నారు. -
ఈ టిక్‌టాక్ దీవానీని గుర్తుపట్టారా?
టిక్ టాక్ వీడియోతో ఉద్యోగం పోగొట్టుకున్న గుజరాత్‌కు చెందిన పోలీసు కానిస్టేబుల్ అర్పితా చౌదరి గుర్తున్నారా? ప్రస్తుతం ఇపుడు ఈమె ఉద్వాసనలు, హెచ్చరికలను పక్కన పెట్టి తనకిష్టమైన రంగంలో రాణించేందుకు సిద్ధమవుతోంది. పోలీస్ స్టేషన్లో టిక్‌టాక్ వీడియో చేయడంతో పై అధికారుల ఆగ్రహానికి గురైన ఆమె తాజాగా మరో వీడియోతో హల్ చల్ చేస్తోంది. సొంతంగా ఒక మ్యూజిక్ వీడియోను చేసి విడుదల చేసింది. టిక్‌టాక్ ని దివానీ పేరుతో వచ్చిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ వీడియోకు 20లక్షల 50వేలకు పై గా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ పాటను జిగ్నేష్ కవిరాజ్ పాడగా.. మయూర్ నదియా సంగీతం అందించాడు. మను రబారి లిరిక్స్‌ను రాశాడట. చదవండి : టిక్‌టాక్ వీడియో; మహిళా పోలీసు సస్పెండ్! -
ఆరు భాషలలో అమీగ మ్యూజిక్ వీడియో
డాక్టర్ ఆనంద్ రచన, దర్శకత్వంలో స్కూల్స్, కాలేజ్‌లలో జరిగే ర్యాగింగ్ కథాంశంతో రూపొందిన డాన్స్ మ్యూజికల్ వీడియో అమీగ. ఈ వీడియోతో అమెరికాలో డాన్స్ ప్రదర్షణలు చేసి ఎన్నో అవార్డ్ లు సొంతం చేసుకున్న త్రిశూల్ కలాపురం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు. బిగ్ బాస్ ఫేం తారిక, మహర్షి, రాజా ది గ్రేట్ ఫేం హాసిని ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ వీడియోను యన్‌యస్ నాయక్ సమర్పణలో పద్మా కలాపురం నిర్మించారు. ఆరు భాషల్లో రూపొందించిన ఈ వీడియోను ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ మ్యూజిక్ వీడియోకు మంచి రెస్సాన్స్ వస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న బాల నటి హాసిని ఈ వీడియోలో కీలక పాత్రలో కనిపించారు. అమీగ పాటను ప్రముఖ వర్ధమాన రచయిత శ్రీనివాస మౌళి రచించగా,తెలుగులో ఇండియన్ ఐడల్ రేవంత్, ఇంగ్లీష్ లో స్వీకర్ అగస్తి పాడడం విశేషం. డాక్టర్ ఆనంద్ దర్శకత్వ రూపొందిన ఈ వీడియోకు కిరణ్ మాస్టర్ కొరియోగ్రఫి అందించారు. ఈ వీడియో ప్రముఖ మ్యూజిక్ సంస్థ లహరి మ్యూజిక్ ద్వారా విడుదలయింది. వీడియో రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. త్రిశూల్ అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడని, అందమైన తారిక, హాసినిలు అదనపు ఆకర్షణగా ఈ పాటను గోవా, ఓక్రిడ్జ్ మరియు ఆంబిటస్ స్కూల్స్‌లో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి అమీగ టీం అందరిని ఆశీర్వదించాలని కోరారు. -
మ్యూజిక్ వీడియోలో ‘అర్జున్ రెడ్డి’
వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఓ మ్యూజిక్ వీడియోలో సందడి చేయనున్నారు. టాక్సీవాలా, గీత గోవిందం, నోటా, కామ్రేడ్ సినిమాలు చేస్తున్న విజయ్ ఇంత బిజీ షెడ్యూల్లోనూ మ్యూజిక్ వీడియోలో నటించేందుకు అంగీకరించాడు. భానుశ్రీ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వీడియోకు సౌరభ్, దుర్గేష్‌లు సంగీతమందిస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియోను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఈ వీడియోలో విజయ్ సరసన బెంగాళీ మోడల్ మాళవిక బెనర్జీ ఆడిపాడనుంది. ఇప్పటికేషూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
సింగర్‌గా మారిన ఫైర్‌బ్రాండ్ డీఐజీ
సాక్షి, బెంగళూరు : ఫైర్‌బ్రాండ్ పోలీసు అధికారిణిగా పేరొందిన కర్ణాటక డీఐజీ (జైళ్ల శాఖ) రూపా ముగ్దిల్ తనలో దాగున్న మరో ప్రతిభను బయటపెట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. 1965లో విడుదలైన మీనా కుమారి - ధర్మేంద్రల ‘కాజల్’ సినిమాలోని ‘తోరా మన్ దర్పణ్ కెహలాయె’ అంటూ సాగే పాటను ఆమె స్వయంగా ఆలపించారు. ‘ఈ పాట ఆడియో రికార్డింగ్ కోసం కేవలం అరగంట సమయం మాత్రమే పట్టింది. వీడియో చిత్రీకరణ కూడా నాలుగు గంటల్లో ముగించేశాం’ అని రూపా చెప్పారు. తమలో దాగున్న శక్తిని గుర్తించాలంటూ సాగే ఈ పాట తనలో ఎంతో స్ఫూర్తి నింపిందని, అందుకే ఈ వీడియో రూపొందించినట్లు తెలిపారు. మనసే అందరిలోని సంతోషం, దుఃఖానికి, సాధించే విజయాలు, అపజయాలకు కారణమని.. బలంగా అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీలేదని అందరూ గుర్తించాలన్నారు. ఈ వీడియో మ్యూజిక్ కంపోజర్‌గా కన్నడ సినీ దర్శకుడు అలెన్ వ్యవహరించారు. ఆర్జే శృతీరావు కోరిక మేరకు వీడియోను రూపొందించానని రూపా తెలిపారు. పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదీగా ఉన్న అన్నాడీఎంకే నేత శశికళకు ప్రత్యేకంగా రాజభోగాలు కల్పిస్తున్నారంటూ నివేదికనిచ్చి ఒక్కసారిగా సంచలనంగా రూపా నిలిచారు. గతంలో కూడా ధార్వాడ్(మధ్యప్రదేశ్) ఎస్పీగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమా భారతిని అరెస్ట్ చేసి ఆమె సంచలనం సృష్టించిన విషయం విదితమే. -
జైల్లో వేస్తా: సింగర్‌కు ట్రంప్ ఘాటు హెచ్చరిక
లాస్ ఏంజిల్స్: ప్రముఖ ర్యాపర్ స్నూప్ డగ్‌ను అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. తనను పరిహసిస్తూ మ్యూజిక్ వీడియోను తెరకెక్కించిన స్పూప్‌ను జైలుకు పంపిస్తానని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. మూడో రోజుల కిందట విడుదల చేసిన ఓ వీడియో సాంగ్‌లో ట్రంప్ అవతారంలో ఉన్న విదూషకుడిని ఫేక్ తుపాకీతో కాలుస్తున్నట్టు స్నూప్ చూపించారు. 'లావెండర్' పేరుతో రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియోలో అమెరికాలో పోలీసుల క్రూరత్వాన్ని, ట్రంప్ తీరును ఎండగట్టారు. ఇందులో అధ్యక్షుడిని రొనాల్డ్ క్లంప్ అంటూ పరోక్షంగా ట్రంప్ తీరును పరిహసించారు. ఈ వీడియోపై తాజాగా ట్రంప్ స్పందించారు. 'స్నూప్ డగ్ గతంలో ఇదేవిధంగా అధ్యక్షుడు ఒబామాకు గురిపెట్టి తుపాకీ కాలిస్తే ఏమయ్యేదో తెలుసా? జైలుకు వెళ్లాల్సి వచ్చేది' అంటూ పరోక్షంగా గాయకుడిని హెచ్చరించారు. ట్రంప్ తరఫు లాయర్లు సైతం ఈ మ్యూజిక్ వీడియోపై స్పందించారు. స్నూప్ డగ్ వెంటనే అధ్యక్షుడు ట్రంప్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
షూటింగ్ లో కాల్పులు: నటుడు మృతి
ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియన్ రాష్ట్రమైన క్వీన్స్లాండ్ రాజధాని నగరంలో ఒక మ్యూజిక్ వీడియో చిత్రీకరణలో అపశృతి దొర్లింది. ఒక బార్ లోపల ప్రమాదకరమైన షూటింగ్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో జరిగిన కాల్పుల్లో నటుడు(20) ప్రాణాలు కోల్పోయాడు బ్రిస్బేన్ లోని ఈగల్ లేన్ లో ఈ ప్రమాదం సంభవించింది. తుపాకులు, మందుగుండు సామాన్లు, ఇతర ఆయుధాలతో షూటింగ్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఛాతీలోబలమైన గాయం కారణంగా అతడు చనిపోయినట్టు క్వీన్స్ లాండ్ పోలీసులు చెప్పారు. అయితే మిగిలిన నటులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని డిటెక్టివ్ ఇన్సెక్టర్ అధికారి టామ్ తెలిపారు. అయితే షూటింగ్ లోఉపయోగించిన ఆయుధాలు నిజమైనవా, నకిలీవా అనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు. అయితే ఇది ప్రమాదమా.. కాదా అనేది ఇపుడే తేల్చలేమని చెప్పారు. షూటింగ్ లో ఉపయోగించిన ఆయుధాలు నిజమైనవా, నకిలీవా అనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు.మరోవైపు ఈగల్ లేన్ బార్ ను సోమవారం మూసివేస్తున్నట్టు ఫేస్ బుక్ ద్వారా బార్ యజమానులు ప్రకటించారు. పోలీసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కాగా స్థానికుల సమాచారం ప్రకారం ప్రముఖ హిప్-హాప్ బృందం ఆధ్వర్యంలో మ్యూజిక్ వీడియోను షూట్ చేస్తుండగా కాల్పులు శబ్దం వినిపించింది. అనేక మంది ఇతర నటులు కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్రీకరణ సమయంలో పెద్ద మొత్తంలో మందుగుండును పేల్చినట్టు తెలుస్తోంది. -
మెగాస్టార్‌తో సీఎం భార్య మ్యూజిక్ వీడియో!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ త్వరలోనే మ్యూజిక్ వీడియోతో ఆరంగేట్రం చేయబోతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె తొలిసారి మ్యూజిక్ వీడియోలో కనిపించబోతున్నారు. ‘ఫిర్ సే’ పేరిట రూపొందుతున్న ఈ మ్యూజిక్ వీడియోలో లలిత కళల ఇన్స్టిట్యూట్ అధిపతిగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ కోరుతూ అమృత వస్తుందని, వీరిద్దరి మధ్య సంభాషణతో ఈ మ్యూజిక్ వీడియో ప్రారంభమవుతుందని దీని డైరెక్టర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సీఎం సతీమణి అయిన అమృత గతంలో కునాల్ కోహ్లి ‘ఫిర్ సే’కు, ప్రకాశ్ ఝా తెరకెక్కించిన ‘.జై గంగాజల్’ సినిమాకు గాయనీగా నేపథ్యగానం చేశారు. దక్షిణ ముంబైలోని ఓపెరా హౌస్‌లో అమితాబ్, అమృత పాల్గొనగా.. ఈ వీడియో సాంగ్‌ను చిత్రీకరించామని దర్శకుడు అహ్మద్ ఖాన్ తెలిపారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఫార్మేషన్ (డర్టీ) : మ్యూజిక్ వీడియో అమెరికన్ సింగర్ బేయాన్స్ విడుదల చేసిన సింగిల్ ట్రాక్.. ‘ఫార్మేషన్ (డర్టీ)’. ఇందులో లయబద్ధంగా నాట్యమాడే బేయాన్స్తో పాటు ఆమె కూతురు బ్లూ ఐవీ కార్టన్‌ను కూడా చిన్న సన్నివేశంలో చూడొచ్చు. ప్రకృతి విలయాలు, నేరగ్రస్త మానవ స్వభావాలను థీమ్‌గా తీసుకుని, ‘లేడీస్.. అందరం ఒకటిగా ఫామ్ అవుదాం’ అనే అర్థంలో బేయాన్స్ ఈ పాటను పాడి, చిత్రీకరించారు. ఇందులోని మ్యూజిక్ మన చేత ఆన్ ది స్పాట్ డాన్స్ చేయిస్తుంది. వరద నీటిలో సగం మునిగిపోయి ఉన్న పోలీసు వాహనంపై బేయాన్స్ పడుకుని ఉండడంతో వీడియో మొదలౌతుంది. ‘మై డాడీ అలబామా.. మామా లూసీయానా.. యు మిక్స్ దట్ నీగ్రో విత్ దట్ క్రెయోల్ మేక్ ఎ టాక్సస్ బామా...’ అని బేయాన్స్ పాడుతున్నప్పుడు ఆ బీట్ ‘వ్రూమ్’ అంటూ వీక్షకుల్ని తనతో పాటు ఈడ్చుకుని వెళుతుంది. తప్పక చూడండి. బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ : డాన్ ఆఫ్ జస్టిస్ టీజర్ పోస్టర్లు, ట్రైలర్లు విడుదల అవుతూ ఊరిస్తున్నాయే కానీ.. ‘డాన్ ఆఫ్ ది జస్టిస్’ చిత్రం విడుదలయ్యే సమయం మాత్రం దగ్గరపడడం లేదు. ఈ ఏడాది మార్చి 25న రిలీజ్ కాబోయే ఈ అమెరికన్ సూపర్ హీరో ఫిల్మ్ కోసం ప్రేక్షకులు ఇంత ఇదిగా ఎదురు చూడడానికి 2013లో వచ్చిన దీని ప్రీక్వెల్ ‘మ్యాన్ ఆఫ్ స్టీల్’ ఒక కారణం అయితే, పోస్టర్లు, టీజర్లలోని ఉత్కంఠ భరిత సన్నివేశాలు ఇంకో కారణం. రెండు ప్రధాన క్యామిక్ క్యారెక్టర్లలో ఒకటైన బ్యాట్‌మ్యాన్ పాత్రను బెన్ ఎఫ్లెక్స్, సూపర్‌మ్యాన్ పాత్రను హెన్రీ కావెల్ పోషిస్తున్నారు. మానవాళిని విపత్తు నుండి కాపాడే ప్రయత్నంలో బ్యాట్మ్యాన్కీ, సూపర్మ్యాన్కీ మధ్య జరిగే పోరాటాలు పిల్లల్ని, పెద్దల్ని అలరిస్తాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. అద్దాలు బద్దలవడం, తుపాకులు మోతమోగడం, పిడిగుద్దుల ప్రతిధ్వనులు, వీటన్నిటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఈ తాజా ట్రైలర్‌లోని ప్రత్యేక ఆకర్షణలు. కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921) : ట్రైలర్ మరో బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ ‘కపూర్ అండ్ సన్స్ (సిన్స్ 1921)’ సినీ ప్రియుల కోసం సిద్ధం అవుతోంది. మార్చి 18న విడుదల అవుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, ఫవాద్ ఖాన్, ఆలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డెరైక్షన్ షకున్ బాత్రా. నిర్మాత కరణ్ జోహార్. నవ్వులు, కన్నీళ్లు, భావోద్వేగాలతో నడిచే ఈ కథలో కుటుంబ సంబంధాల్లోని సున్నితమైన హాస్యమే ఎక్కువగా ఉన్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. చిన్నప్పుడే విడిపోయి ఉంటారు. తొంభై ఏళ్ల తాతగారికి హార్ట్ ఎటాక్ అని తెలిసి తమ చిన్నప్పటి ఇంటికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి అదంతా ఓ ఫ్యామిలీ డ్రామా, కామెడీ డ్రామా. ట్రైలర్‌ను చూస్తూ కూడా మూవీని ఎంజాయ్ చెయ్యొచ్చు! -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
పుస్సీ రాయ్ట్ - చైకా : మ్యూజిక్ వీడియో నిడివి : 2 ని. 52 సె. హిట్స్ : 14,11,823 రష్యన్ జనరల్ ప్రాసిక్యూటర్ యూరి చైకాకు నేర ప్రపంచంతో ఉన్న అవినీతి, అక్రమ సంబంధాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీనిపై వెంటనే విచారణ జరిపి ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రష్యాలోని ‘పుస్సీ రాయ్ట్’ అనే ఫెమినిస్టు పంక్ రాక్ గ్రూపు తయారు చేసిన ఈ వీడియో ఇప్పుడు ఆ దేశంలో సంచలనం రేపుతోంది. అలాగని ఇది చూడడానికి మరీ నిస్సారమైన వీడియో ఏమీ కాదు. సామాజిక సందేశంతో పాటు, హాస్యం, వ్యగ్యం, స్పైస్ కూడా ఇందులో కలగలసి ఉన్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ మీ చేత లయబద్ధంగా దేశభక్తి నాట్యాన్ని చేయిస్తుంది. దేశభక్తి ఏ దేశంలోనైనా ఒకటే కదా. ‘విధేయంగా ఉండు.. ఒదిగి ఉండడం నేర్చుకో. లౌకిక విషయాల గురించి ఆలోచించకు. అధికారంలో ఉన్నవారికి అణకువతో ఉండు. ఎందుకంటే ఆ అధికారం దేవుడిచ్చిన కానుక’ అంటూ సెటైరికల్‌గా సాంగ్ సాగుతుంది. మి బిఫోర్ యు : ట్రైలర్ నిడివి : 2 ని. 47 సె. హిట్స్ : 13,49,169 ఇంగ్లండ్ రచయిత్రి జోజో మోయజ్ నవల ‘మీ బిఫోర్ యూ’ ఆధారంగా అదే పేరుతో వస్తున్న ఈ హాలీవుడ్ మూవీ ట్రైలర్ ని రెండు రోజుల క్రితమే యు.కె.లోని వార్నర్ బ్రదర్స్ కంపెనీ అప్లోడ్ చేసింది. వాలెంటైన్స్ డే వేళ కావడంతో ఈ ప్రేమకథా చిత్రం ప్రేయసీ ప్రియులలో ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ ఇది విడుదల కాబోతున్నది మాత్రం జూన్ (3)లో. ‘లివ్ బోల్డ్లీ’ అనే సందేశాన్నిచ్చే ఈ చిత్రం అంతా పూర్తిగా ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. కొన్నిసార్లు మనం ఊహించని విధంగా గొప్ప ప్రేమ వరంలా లభిస్తుంది. జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పుతుంది.. అనే అద్భుతమైన థీమ్‌తో తయారౌతున్న ‘మీ బిఫోర్ యూ’ చిత్రం ట్రైలర్ కూడా అంతే అద్భుతంగా ఉంది. పప్పీస్ ప్రిడిక్ట్ సూపర్ బౌల్ 50 నిడివి : 2 ని. 31 సె. హిట్స్ : 7,66,219 జిమ్మీ ఫాలెన్ ‘ది టునైట్ షో’లోని పప్పీ ప్రిడిక్టర్స్ గేమ్ ప్రోగ్రామ్ ఇది. వెరీ ఇంట్రెస్టింగ్. ఆట పేరు ‘సూపర్ బౌల్ 50 ఎడిషన్’. ఇందులో రెండు జట్లు ఉంటాయి. కరోలినా పాంథర్స్, డెన్వర్ బ్రాంకస్. జట్లు అంటే బౌల్స్ అన్నమాట. అలాగే ఇందులోని ఆటగాళ్లు తొమ్మిది పప్పీలు. రెండు బౌల్స్‌లో పప్పీ ఫుడ్ ఉంటుంది. ఈ తొమ్మిది పప్పీలు ఈ బౌల్స్కి దూరంగా ఒక అర లాంటి ప్రదేశంలో ఉంటాయి. జిమ్మీ ఫాలెన్ వచ్చి వాటిని గెట్.. సెట్.. గో.. అంటూ ఒకేసారి బౌల్స్ వైపు వదిలేస్తాడు. వాటిలో ఏ బౌల్‌పై ఎక్కువ సంఖ్యలో పప్పీలు ఎగబడి తింటాయో ఆ బౌల్ పేరున్న జట్టు గెలిచినట్టు. ఇంట్రెస్టింగ్ కదా! ఇంతకీ ఏ జట్టు గెలిచింది? వీడియో చూడండి మజా వస్తుంది.