జైల్లో వేస్తా: సింగర్‌కు ట్రంప్‌ ఘాటు హెచ్చరిక | Trump says Snoop Dogg should go to prison | Sakshi
Sakshi News home page

జైల్లో వేస్తా: సింగర్‌కు ట్రంప్‌ ఘాటు హెచ్చరిక

Published Thu, Mar 16 2017 11:53 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

జైల్లో వేస్తా: సింగర్‌కు ట్రంప్‌ ఘాటు హెచ్చరిక - Sakshi

జైల్లో వేస్తా: సింగర్‌కు ట్రంప్‌ ఘాటు హెచ్చరిక

లాస్‌ ఏంజిల్స్‌: ప్రముఖ ర్యాపర్‌ స్నూప్‌ డగ్‌ను అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘాటుగా హెచ్చరించారు. తనను పరిహసిస్తూ మ్యూజిక్‌ వీడియోను తెరకెక్కించిన స్పూప్‌ను జైలుకు పంపిస్తానని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. మూడో రోజుల కిందట విడుదల చేసిన ఓ వీడియో సాంగ్‌లో ట్రంప్‌ అవతారంలో ఉన్న విదూషకుడిని ఫేక్‌ తుపాకీతో కాలుస్తున్నట్టు స్నూప్‌ చూపించారు. 'లావెండర్‌' పేరుతో రూపొందించిన ఈ మ్యూజిక్‌ వీడియోలో అమెరికాలో పోలీసుల క్రూరత్వాన్ని, ట్రంప్‌ తీరును ఎండగట్టారు.

ఇందులో అధ్యక్షుడిని రొనాల్డ్‌ క్లంప్‌ అంటూ పరోక్షంగా ట్రంప్‌ తీరును పరిహసించారు. ఈ వీడియోపై తాజాగా ట్రంప్‌ స్పందించారు. 'స్నూప్‌ డగ్‌ గతంలో ఇదేవిధంగా అధ్యక్షుడు ఒబామాకు గురిపెట్టి తుపాకీ కాలిస్తే ఏమయ్యేదో తెలుసా? జైలుకు వెళ్లాల్సి వచ్చేది' అంటూ పరోక్షంగా గాయకుడిని హెచ్చరించారు. ట్రంప్‌ తరఫు లాయర్లు సైతం ఈ మ్యూజిక్‌ వీడియోపై స్పందించారు. స్నూప్‌ డగ్‌ వెంటనే అధ్యక్షుడు ట్రంప్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement