మెగాస్టార్‌తో సీఎం భార్య మ్యూజిక్‌ వీడియో! | chief minister wife shoots music video | Sakshi
Sakshi News home page

మెగాస్టార్‌తో సీఎం భార్య మ్యూజిక్‌ వీడియో!

Nov 30 2016 6:06 PM | Updated on Oct 8 2018 5:57 PM

మెగాస్టార్‌తో సీఎం భార్య మ్యూజిక్‌ వీడియో! - Sakshi

మెగాస్టార్‌తో సీఎం భార్య మ్యూజిక్‌ వీడియో!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి అమృత ఫడ్నవిస్‌ త్వరలోనే మ్యూజిక్‌ వీడియోతో ఆరంగేట్రం చేయబోతున్నారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ సతీమణి అమృత ఫడ్నవిస్‌ త్వరలోనే మ్యూజిక్‌ వీడియోతో ఆరంగేట్రం చేయబోతున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఆమె తొలిసారి మ్యూజిక్‌ వీడియోలో కనిపించబోతున్నారు. ‘ఫిర్‌ సే’ పేరిట రూపొందుతున్న ఈ మ్యూజిక్‌ వీడియోలో లలిత కళల ఇన్‌స్టిట్యూట్‌ అధిపతిగా అమితాబ్‌ బచ్చన్‌ కనిపిస్తారు. ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్‌ కోరుతూ అమృత వస్తుందని, వీరిద్దరి మధ్య సంభాషణతో ఈ మ్యూజిక్‌ వీడియో ప్రారంభమవుతుందని దీని డైరెక్టర్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు.

సీఎం సతీమణి అయిన అమృత గతంలో కునాల్‌ కోహ్లి ‘ఫిర్‌ సే’కు, ప్రకాశ్‌ ఝా తెరకెక్కించిన ‘.జై గంగాజల్‌’ సినిమాకు గాయనీగా నేపథ్యగానం చేశారు. దక్షిణ ముంబైలోని ఓపెరా హౌస్‌లో అమితాబ్‌, అమృత పాల్గొనగా.. ఈ వీడియో సాంగ్‌ను చిత్రీకరించామని దర్శకుడు అహ్మద్‌ ఖాన్‌ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement