amruta
-
సెంట్రల్ జైల్ నుంచి విడుదలైన మారుతిరావు
సాక్షి, వరంగల్/ మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడలో గత ఏడాది జరిగిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన తిరునగరు మారుతిరావు ఆదివారం ఉదయం వరంగల్ సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యాడు. ఆయనతోపాటు మరో ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, ఖరీంలు కూడా విడుదలయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఈ ముగ్గురికి హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన మారుతిరావు, ఆయన సోదరుడిని కుటుంబసభ్యులు వెంట తీసుకెళ్లారు. ప్రణయ్ హత్యకేసులో నిందితులైన వీరిపై గత ఏడాది సెప్టెంబర్ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. వరంగల్ సెంట్రల్ జైలులో ఉన్న మారుతీరావు, శ్రవణ్‌కుమార్, ఖరీంలు బెయిల్ కోసం రెండు నెలల క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ సమయంలో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ కె.శ్రీనివాస్‌లు బెయిల్ ఇవ్వరాదని గట్టిగా వాదించారు. దాంతో హైకోర్టు నిందితుల బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, పీడీ యాక్టు కేసులో బెయిల్ కోరుతూ నిందితులు ముగ్గురు ఇటీవల హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖ లు చేయగా విచారించిన కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. చదవండి: మారుతీరావుతో మా కుటుంబానికి ముప్పు -
ప్రణయ్ ఇంట్లోకి ఆగంతకుడు!
సాక్షి, మిర్యాలగూడ : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఇటీవల పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ ఇంటి ఆవరణలోకి ఆదివారం తెల్లవారుజామున ఓ ఆగంతకుడు గోడ దూకి ప్రవేశించాడు. సీసీ కెమెరా ఫుటేజీలో ఆగంతకుడు గోడ దూకి వచ్చినట్టు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ఆవరణలో అతను సుమారు 8 నిమిషాలు అటూ ఇటూ తచ్చాడినట్టు గుర్తించారు. ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించిన ఆగంతకుడు , ఓ గదికి ఉన్న కిటికీ తలుపును తెరిచి చూశాడని, అనంతరం తిరిగి గోడ దూకి చర్చిరోడ్డు వైపు వెళ్ళినట్లు సీసీ కెమెరా ఫుటేజీలో ఉందని ప్రణయ్ తండ్రి బాలస్వామి తెలిపారు. అలికిడి విని లేచిన పోలీసులు ఆగంతకుడు వచ్చిన సమయంలో ప్రణయ్ కుటుంబ సభ్యులకు రక్షణగా ఉన్న పోలీసులు పైన గదిలో ఉన్నారు. తిరిగి వెళ్లే సమయంలో గోడ దూకిన అలికిడి విన్న పోలీసులు వెంటనే కిందకు వచ్చి బాలస్వామిని లేపారు. అనుమానం వచ్చిన బాలస్వామి వెంటనే సీసీ ఫుటేజీని పరిశీలించారు. సీసీ కెమెరాల్లో ఆగంతకుడు గోడ దూకి ఇంటి ఆవరణలో తిరిగిన దృశ్యాలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విషయాన్ని వన్‌టౌన్ స్టేషన్‌కు చేరవేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. సమగ్ర దర్యాప్తు చేపడతామని ప్రణయ్ కుటుంబ సభ్యులకు పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసులు లేకుంటే? ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడి నడుముకు నల్లని బెల్ట్ మాదిరిగా ఉందని, ఆ బెల్ట్‌కు ఏముందో అని.. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. ప్రణయ్ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తెలుసుకున్న ఎస్పీ ముందు జాగ్రత్తగా ఇద్దరు సాయుధ పోలీసులతో ప్రణయ్ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు భద్రత ఉందని తెలిసినా ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించాడంటే పక్కా ప్రణాళికతోనే వచ్చాడా..? అనే అనుమానం కలుగుతోందని ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆగంతకుడిని గుర్తిస్తే కాని అనుమానాలు నివృత్తి కావని అంటున్నారు. -
భయపడితే ప్రణయ్‌కు నచ్చదు : అమృత
మిర్యాలగూడ : ‘ఎక్కువ కులం ఏంటి.. తక్కువ కులం ఏంటి.. అసలు ఈ కులం అనేదాన్నే తొలగించాలి.. మన పిల్లల్ని మాత్రం ఈ కులం రొంపిలో పడకుండా బాధ్యాతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుదాం’.. ఇది ప్రణయ్ కల. ‘రిసెప్షన్‌కు ముందు రెండు రోజులు మేం వేర్వేరు గదుల్లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో మా భవిష్యత్తుకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఆ రెండు రోజులే రెండు యుగాలుగా అన్పించాయి. ఇప్పుడు నా పూర్తి జీవితం ప్రణయ్ లేకుండా గడపాలి. ఇది నాకు సాధ్యమవుతుందా..’ అంటూ గుండెలవిసేలా ఏడుస్తోంది అమృత. రెండు రోజులు ఒకరికి ఒకరు కనిపించకపోతేనే తట్టుకోలేని ఆ పసి హృదయాలు ఇప్పుడు జీవిత కాలం ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి. ‘పరువు’ అనే కనిపించని భూతం వారి నూరేళ్ల జీవితాన్ని మింగేసింది. ఇది నల్గొండ, మిర్యాలగూడలో జరిగిన విషాదాంత ప్రేమకథ చిత్రమ్. వైశ్య కులానికి చెందిన తిరునగరి అమృత వర్షిణిని పెళ్లాడటమే ప్రణయ్ చేసిన పాపం. కక్ష్య గట్టిన అమృత తండ్రి మారుతీరావ్ ప్రణయ్‌ని అతి కిరాతకంగా హత్య చేయించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. తన భర్తను చంపిన తండ్రికి ఉరి శిక్ష పడాలని అమృత కోరుకుంటోంది. తాను తన పుట్టింటికి వెళ్లేది లేదని.. అత్తింట్లోనే ఉండి కుల రహిత సమాజం కోసం పోరాటం చేస్తానంటోంది. ఈ సందర్భంగా అమృత చెప్పిన అంశాలు... ‘ప్రణయ్‌కు మొదటి నుంచి కులం అంటే నచ్చేది కాదు. కుల రహిత సమాజం కోసం కలలు కనేవాడు. ఈ విషయం గురించి అనేక సార్లు నాతో చర్చించేవాడు. కానీ మా ప్రేమ నా తల్లిదండ్రులకు నచ్చలేదు. కారణం ప్రణయ్‌ది తక్కువ కులం కావడం. ఈ కులాల పిచ్చి మా నాన్న లాంటి సైకోలకే కానీ మాకు కాదు. అందుకే ఇంట్లోంచి వెళ్లి పోయి వివాహం చేసుకున్నాం. ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నాను. మా బిడ్డ గురించి మేము ఎన్నో కలలు కన్నాం. మా బిడ్డను ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మంచి పౌరులుగా తీర్చి దిద్దుకోవాలని ఆశపడ్డాం’ అని తెలిపింది. అమృత మాట్లాడుతూ ‘ఇక్కడే ఉంటూ పాలీ హౌస్ ఏర్పాటు చేయాలనుకున్నాం. విదేశాలకు కూడా వెళ్లాలనుకున్నాం. మా కుటుంబ పరిస్థితుల వల్ల మేం చాలా త్వరగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఇప్పుడు 21 ఏళ్లు.. ప్రణయ్‌కి 24 ఏళ్లు. మా జీవితం ఇప్పుడే ప్రారంభమయ్యింది. ప్రపంచంలోని అన్ని సంతోషాలను పూర్తిగా అనుభవించాలనుకున్నాం. కానీ కులం మా కలల్ని చిధిమేసింది. నా ప్రణయ్‌ని నా నుంచి దూరం చేసింది. నన్ను, నా బిడ్డను ఒంటరి వాళ్లను చేసింది. కానీ నేను భయపడను. భయపడితే ప్రణయ్‌కు నచ్చదు. మా ప్రేమకు ప్రతిరూపమైన మా బిడ్డను ప్రణయ్ ఆశాయాలకు అనుగుణంగా, కుల పిచ్చికి వ్యతిరేకంగా నేనే పెంచుతాను’ అంటూ వివరించింది. అంతేకాక ‘మా అత్త మామలకు తోడుగా ఇక్కడే ఉంటాను. నా పుట్టింటికి వెళ్లను. ప్రణయ్‌ని చంపిన వారికి శిక్ష పడేంత వరకూ నా పోరటాన్ని కొనసాగిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. అమృత మామా గారు బాలాస్వామీ మాట్లాడుతూ.. ‘వీరిద్దరి ప్రేమ గురించి మాకు చెప్పినప్పుడు మేం వద్దని వారించాం. ఇలాంటి ప్రమాదాలు వస్తాయని ముందే హెచ్చరించాం. కానీ వారు తమ జీవితం గురించి, ప్రేమ గురించి చాలా నిజాయితీగా, బలంగా ఉన్నారు. ఇక చేసేదేం లేక వివాహనికి ఒప్పుకున్నాం. వారిద్దరూ ఎందో అన్యోనంగా ఉండేవారు. కానీ మేం ఊహించిందే జరిగింది. కులం మా అబ్బాయిని కాటేసింది. అమృత తన పుట్టింటికి వెళ్లనంటోంది. తనను మా దగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటాం’ అని తెలిపారు. ఈ హత్య గురించి పోలీసు ఉన్నతాధికారి ఒకరు ప్రణయ్ - అమృతల వెడ్డింగ్ రిసెప్షన్ వీడియో అమృత నాన్నలో కోపాన్ని తీవ్రంగా పెంచింది. కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే కాక తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వాటిని తన బంధువులు కూడా చూడటం వల్ల ఆయనకు తీవ్రమైన కోపం వచ్చింది. అందువల్ల ప్రణయ్‌ని అడ్డుతొలగిస్తే.. తన కూతురు తన దగ్గరకు వస్తుందని భావించాడు. అందుకే ఈ నేరానికి పాల్పడినట్లుగా మారుతీ రావ్ తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. -
ప్రణయ్ హత్య వెనుక పలువురు ప్రముఖులు!
సాక్షి, మిర్యాలగూడ : పెరుమాళ్ల ప్రణయ్ హత్య వెనుక తన తండ్రి తిరునగరు మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్‌తో పాటు ఓ తాజా మాజీ ఎమ్మెల్యే, పలువురి ప్రముఖుల హస్తం ఉందని ఆయన భార్య అమృత అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య వెనుక టీఆర్ఎస్ నాయకుడు, న్యాయవాది భరత్‌కుమార్, నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీం, వ్యాపారస్తులు రంగా శ్రీకర్, రంగా రంజిత్ కూడా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. తమను విడగొట్టేందుకు వేముల వీరేశం, భరత్, గూడూరు శ్రీను గతంలో ప్రణయ్‌ను, తనను బెదిరించారని అమృత ఆరోపించారు. ఎల్ఐసీ డబ్బులు కట్టలేదని గతంలో ప్రణయ్ నాన్నపై తప్పుడు కేసు పెట్టారని, ఈ విషయంలో తాము ఐజీ దగ్గరికి కూడా వెళ్లామని పేర్కొన్నారు. బిహార్ గ్యాంగ్‌తో తమను బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. ప్రణయ్ హత్యలో ఎంతమంది ఉన్నారో, వారినీ దారుణంగా చంపాలని అమృత డిమాండ్ చేశారు. ఇక.. తనకు అత్తా,మామలే తల్లిదండ్రులని, వీళ్ల దగ్గరే ఉంటానని తెలిపారు. -
జయ కూతురినంటూ పిటిషన్..కోర్టు ఆగ్రహం!
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసురాలినంటూ మరో మహిళ ముందుకొచ్చారు. జయలలిత కూతురిని తానేనని, కావాలంటే తనకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించవచ్చునని బెంగళూరు చెందిన అమృత అనే మహిళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా సుప్రీంకోర్టు ఎందుకొచ్చారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జయలలిత కూతురిని తానేనని ఈ నెల 22న అమృత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించేందుకు ముందుకురావడంతో ఈ పిటిషన ప్రాధాన్యం సంతరించుకుంది. జయలలిత కూతురైన తనను ఆమె సోదరి, భర్త పెంచి పెద్ద చేశారని, డిసెంబర్ 5న జయలలిత మృతిచెందిన తర్వాత తన జన్మరహస్యాన్ని వారు తనకు వెల్లడించారని అమృత తన పిటిషన్లో పేర్కొన్నారు. అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన జయలలి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే ఉండిపోయారు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ నేపథ్యంలో జయ వారసులమంటూ గతంలో కూడా కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. -
అవుకు రిజార్వయర్ పరిశీలన
అవుకు: అమృత స్కీమ్ సభ్యులు ఆదివారం అవుకు రిజర్వాయర్‌ను పరిశీలించారు. స్థానిక రిజర్వాయర్ నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రికి తాగునీటి తరలింపునకు ఎక్కడ సంప్ ఏర్పాటు చేయాలి, ఎంత మేర పైపులు, ఎంత కెపాసిటీ మోటార్లు ఉపయోగించాలి తదితర వాటిపై అంచనా వేసేందుకు వారు వచ్చినట్లు తాడిపత్రి మునిసిపల్ డీఈ రఘు కుమార్ వెల్లడించారు. అమృతస్కీమ్ సభ్యుల వెంట స్థానిక అధికారులు ఉన్నారు. -
మెగాస్టార్‌తో సీఎం భార్య మ్యూజిక్ వీడియో!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ త్వరలోనే మ్యూజిక్ వీడియోతో ఆరంగేట్రం చేయబోతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె తొలిసారి మ్యూజిక్ వీడియోలో కనిపించబోతున్నారు. ‘ఫిర్ సే’ పేరిట రూపొందుతున్న ఈ మ్యూజిక్ వీడియోలో లలిత కళల ఇన్స్టిట్యూట్ అధిపతిగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ కోరుతూ అమృత వస్తుందని, వీరిద్దరి మధ్య సంభాషణతో ఈ మ్యూజిక్ వీడియో ప్రారంభమవుతుందని దీని డైరెక్టర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సీఎం సతీమణి అయిన అమృత గతంలో కునాల్ కోహ్లి ‘ఫిర్ సే’కు, ప్రకాశ్ ఝా తెరకెక్కించిన ‘.జై గంగాజల్’ సినిమాకు గాయనీగా నేపథ్యగానం చేశారు. దక్షిణ ముంబైలోని ఓపెరా హౌస్‌లో అమితాబ్, అమృత పాల్గొనగా.. ఈ వీడియో సాంగ్‌ను చిత్రీకరించామని దర్శకుడు అహ్మద్ ఖాన్ తెలిపారు. -
బంగారు గొలుసు వివాదంలో సీఎం సతీమణి
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఓ వివాదంలో చిక్కుకున్నారు. స్థానిక గురువానంద్ స్వామి ఇచ్చిన బంగారు గొలుసును స్వీకరించి ఆమె చిక్కుల్లో పడ్డారు. గురువానంద్ స్వామీ తన జుట్టులోంచి తీసి ఇచ్చిన బంగారు గొలుసును సీఎం భార్య తీసుకుంటున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేయడంతో వివాదం రాజుకుంది. మూఢనమ్మకాలను ప్రోత్సహించారంటూ, ఆమెపై కేసులు నమోదు చేయాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మహారాష్ట్ర లోని అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి అధ్యక్షుడు అవినాష్ పాటిల్ స్పందించారు. సీఎం భార్య వైఖరిని తప్పుబట్టిన ఆయన ఇది శాస్త్రీయ దృక్పథానికి వ్యతిరేకమని వాదించారు. ముఖ్యంగా చేతబడులు, తాంత్రిక విద్యలను నిషేధించిన రాష్ట్రంలో సాక్షాత్తు ప్రభుత్వాధినేత భార్యే ఇలా వ్యవహరించడం తగదన్నారు. అటు ప్రతిపక్ష ఎన్సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ బ్లాక్ మ్యాజిక్ నివారణ యాక్ట్ కింద అమృతాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆ ఆరోపణలను సీఎం సతీమణి అమృత ఖండించారు. తనకు అద్భుతాలు, మాయలు మీద నమ్మకం లేదన్నారు. స్వామీజీ తనను ఆశీర్వదిస్తూ గొలుసు ఇచ్చారే తప్ప వేరే ఏమీ లేదని తెలిపారు. కాగా బ్లాక్ మ్యాజిక్ లాంటి ఇతర మూఢ నమ్మకాలను నిరోధించే క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ 2013 లో ఒక బిల్ ను ఆమోదించింది. -
పొదుపు డబ్బుల జమలో గందరగోళం
తూప్రాన్, న్యూస్‌లైన్: పొదుపు డబ్బులను ఒకే గ్రూపునకు రెండుసార్లు జమచేసి, వాటిలో కొంత డబ్బును తిరిగి తీసుకోవడంతో గందరగోళం నెలకొంది. ఇది గమనించిన సభ్యులు అధికారులను నిలదీశారు. దీనిపై అధికారులు వివరణ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఘనపూర్ పంచాయతీ పరిధిలోని వెంకటాపూర్‌కు చెందిన తులసీ గ్రూపు సంఘం సభ్యులకు గత ఏడాది మే 18న రుణం డబ్బులు రూ.50 వేలను పొదుపు ఖాతాలో ఐకేపీ సీఏ అమృత జమ చేశారు. అలాగే మరుసటి రోజు తిరిగి రూ.50 వేలను తులసీ గ్రూప్‌నకు చెందిన ఖతాలో పొరపాటున జమచేశారు. ఇది గమనించిన వారు వెంటనే ఆ ఖాతాలో పొరపాటున జమ చేసిన రూ.50 వేలను బ్యాంకు నుంచి డ్రా చేసి అదే గ్రామానికి చెందిన మరో గ్రూపు దీవెనాకు రుణంగా ఇచ్చారు. అయితే తులసీ గ్రూపు నకు చెందిన బ్యాంకు పాసు పుస్తకంలో రూ.50 వేల చొప్పున రెండు మార్లు ఉండడంతో గ్రామస్తులు గమనించి ఆదివారం గ్రామానికి వచ్చిన ఐకేపీ సీఏ.అమృత, సీసీ మమతలను నిలదీశారు. దీంతో గందరగోళ నెలకొంది. జరిగిన విషయాన్ని అధికారులు వివరించడంతో గ్రామస్తులు, గ్రూపు సభ్యులు శాంతిం చారు. అయితే మొదట ఐకేపీ సీఏ, సీసీలు పొంతన లేని సమాధానాలు చెప్పాడంతో గ్రామస్తులు అనుమానించారు. తులసీ గ్రూపు సభ్యులకు కేవలం రూ.50 వేల రుణం మాత్రమే ఇచ్చామని గ్రామస్తుల సమక్షంలో తీర్మానం రాసి ఇచ్చారు. ఈ విషయంలో ‘న్యూస్‌లైన్’ ఐకేపీ ఎపీఎంను వివరణ కోరగా గ్రామానికి చెందిన తులసీ గ్రూపునకు చెందిన పొదుపు డబ్బుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, బ్యాంకులో పొరపాటున వారి ఖాతాలో డబ్బులు జమచేశామన్నారు. అయినా తమ సిబ్బంది వెంటనే సరి చేశారని తెలిపారు.