ప్రణయ్‌ హత్య వెనుక పలువురు ప్రముఖులు! | Big Shots Behind Pranay Murder Case, Reveals Amruta | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 16 2018 8:42 PM | Last Updated on Sun, Sep 16 2018 10:01 PM

Big Shots Behind Pranay Murder Case, Reveals Amruta - Sakshi

సాక్షి, మిర్యాలగూడ : పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య వెనుక తన తండ్రి తిరునగరు మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్‌తో పాటు ఓ తాజా మాజీ ఎమ్మెల్యే, పలువురి ప్రముఖుల హస్తం ఉందని ఆయన భార్య అమృత అనుమానం వ్యక్తం చేశారు. ప్రణయ్‌ హత్య వెనుక టీఆర్‌ఎస్‌ నాయకుడు, న్యాయవాది భరత్‌కుమార్, నకిరేకల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కరీం, వ్యాపారస్తులు రంగా శ్రీకర్, రంగా రంజిత్‌ కూడా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. తమను విడగొట్టేందుకు  వేముల వీరేశం, భరత్‌, గూడూరు శ్రీను గతంలో ప్రణయ్‌ను, తనను బెదిరించారని అమృత ఆరోపించారు.

ఎల్‌ఐసీ డబ్బులు కట్టలేదని గతంలో ప్రణయ్‌ నాన్నపై తప్పుడు కేసు పెట్టారని, ఈ విషయంలో తాము ఐజీ దగ్గరికి కూడా వెళ్లామని పేర్కొన్నారు. బిహార్‌ గ్యాంగ్‌తో తమను బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. ప్రణయ్‌ హత్యలో ఎంతమంది ఉన్నారో, వారినీ దారుణంగా చంపాలని అమృత డిమాండ్‌ చేశారు. ఇక.. తనకు  అత్తా,మామలే తల్లిదండ్రులని, వీళ్ల దగ్గరే ఉంటానని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement