maharashtra CM
-
మీరూ ఏదో ఒకరోజు సీఎం అవుతారు
నాగ్‌పూర్: మీరు ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్నుద్దేశిస్తూ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యా ఖ్యానించారు. గురువారం నాగ్‌పూర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలనుద్దేశిస్తూ గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం ఫడ్నవిస్ మాట్లాడారు. సభలో ఉన్న అజిత్ పవార్, మరో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ‘‘ తెల్లవారుజామునే నిద్రలేచే అజిత్ పవార్ అప్పట్నుంచే ప్రజాసేవకు అంకితమవుతారు. ఫైళ్లు తిరగేస్తారు. నేను మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి పని మొదలుపెడతా. అయితే ఏక్నాథ్ షిండే మాత్రం అర్ధరాత్రిదాకా పనిచేస్తారు. చాన్నాళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ అజిత్ పవార్‌కు ‘శాశ్వత ఉపముఖ్యమంత్రి’ పేరు స్థిరపడిపోయింది. కానీ నేను మాత్రం ఒక్కటే ఆశిస్తున్నా. అజిత్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటారు’’ అని ఫడ్నవిస్ అన్నారు. ఎన్సీపీ చీఫ్ అయిన అజిత్ పవార్ ఈనెల ఐదో తేదీన ఆరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం తెల్సిందే. ఎప్పట్నుంచో ముఖ్యమంత్రి కుర్చీపై కన్నేసిన అజిత్ ఆ లక్ష్యసాధనలో భాగంగా బాబాయి శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపిన విషయం విదితమే. పార్టీని చీల్చినా సరే మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తనవైపే రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో ఎన్సీపీ పార్టీ గుర్తు, ఎన్నికల చిహ్నం రెండూ అజిత్‌కే దక్కాయి. ఇటీవల లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అజిత్ వర్గమే అత్యధిక స్థానాల్లో గెలిచి తమదే అసలైన ఎన్సీపీ అని నిరూపించుకుంది. -
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్
-
దేవేంద్ర ఫడ్నవీస్ అనే నేను..
ముంబై: మహారాష్ట్రలో ఎట్టకేలకు కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్కంఠకు తెరదించుతూ ఉప ముఖ్యమంత్రులుగా శివసేన (షిండే) నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్ పవార్) నాయకుడు అజిత్ పవార్ ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముంబై ఆజాద్ మైదాన్‌లో గురువారం సాయంత్రం అశేష జనవాహిని సమక్షంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సీఎం, డిప్యూటీ సీఎంలు మినహా మంత్రులెవరూ ప్రమాణం చేయలేదు. ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణం చేయడం ఇది మూడోసారి. వచ్చే వారం మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు మహాయుతి వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో నవంబర్ 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగా, 15 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కావడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవిపై ప్రతిష్టంభన తొలగకపోవడం, కీలక శాఖలపై మిత్రపక్షాలు పట్టుబట్టడంతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరిగింది. బీజేపీ అధిష్టానం జోక్యం చేసుకొని మిత్రపక్షాలను ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. మరోసారి ముఖ్యమంత్రి పదవి ఆశించిన ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడం పట్ల ఆయన భార్య, గాయకురాలు అమృత ఆనందం వ్యక్తం చేశారు. ఇదొక అద్భుతమైన రోజు అని చెప్పారు. ఫడ్నవీస్‌పై బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. #WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw— ANI (@ANI) December 5, 2024హాజరైన ప్రముఖులు కేంద్ర మంత్రులు అమిత్ షా, జె.పి.నడ్డా, రాజ్‌నాథ్æ, గడ్కరీ, శివరాజ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, ఎస్.జైశంకర్ హాజరయ్యారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), పుష్కర్‌సింగ్ ధామీ(ఉత్తరాఖండ్), నాయబ్‌సింగ్ సైనీ(హరియాణా), భూపేంద్ర పటేల్(గుజరాత్), ప్రమోద్ సావంత్(గోవా), హిమంతబిశ్వ శర్మ(అస్సాం), విష్ణుదేవ్ సాయి(ఛత్తీస్‌గఢ్), భజన్‌లాల్ శర్మ(రాజస్తాన్), మోహన్ యాదవ్(మధ్యప్రదేశ్), మోహన్‌చరణ్ మాఝీ(ఒడిశా), పెమా ఖండూ(అరుణాచల్‌ప్రదేశ్), ఎన్.బీరేన్‌సింగ్(మణిపూర్), మాణిక్ సాహా(త్రిపుర), నితీశ్ కుమార్(బిహార్), కాన్రాడ్ సంగ్మా(మేఘాలయా), నిఫియూ రియో(నాగాలాండ్), ప్రేమ్‌సింగ్ తమాంగ్(సిక్కిం), ఎన్.రంగస్వామి(పుదుచ్చేరి), ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నోయల్ టాటా, కుమార మంగళం బిర్లా, బాలీవుడ్ సినీ ప్రముఖులు షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, క్రికెట్ దిగ్గజం టెండూల్కర్‌తోపాటు వివిధ దేశాల దౌత్యవేత్తలు హాజరయ్యారు. శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మహా నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఆహా్వనించినప్పటికీ హాజరు కాలేదు. కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో అభినందనలు తెలియజేశారు. #WATCH | PM Narendra Modi congratulates Shiv Sena chief Eknath Shinde on taking oath as Maharashtra Deputy CM(Source: DD News) pic.twitter.com/dHQEzx4KFM— ANI (@ANI) December 5, 2024స్థిరమైన ప్రభుత్వం అందిస్తాంరాబోయే ఐదేళ్లపాటు స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందిస్తామని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన నేతృత్వంలో రాజకీయాల్లో ఇకపై స్పష్టమైన మార్పును చూస్తారని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమకు భారీ మెజార్టీ కట్టబెట్టారని, వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సామాజిక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తామని వివరించారు. ఈ నెల 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయని, 9న స్పీకర్‌ను ఎన్నుకుంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. #WATCH | PM Modi congratulates Devendra Fadnavis on taking oath as Maharashtra CM pic.twitter.com/LNVURj7pBQ— ANI (@ANI) December 5, 2024బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గురువారం సాయంత్రం వారు రాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’కు చేరుకొని సంబంధిత ద్రస్తాలపై సంతకాలు చేశారు. అధికార బాధ్యతలు చేపట్టారు. ఓ రోగికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఫడ్నవీస్ సీఎం హోదాలో తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. #WATCH | Maharashtra CM-designate Devendra Fadnvais arrives at Shree Mumbadevi Temple in Mumbai, ahead of his swearing-in ceremony later today. pic.twitter.com/Rt2HsJjeDd— ANI (@ANI) December 5, 2024షిండే రాజకీయ ప్రసంగం ప్రమాణ స్వీకార వేదికపై రాజకీయ ప్రసంగాలు చేయడం సంప్రదాయ విరుద్ధం. కానీ, షిండే మాత్రం ఆ సంప్రదాయాన్ని లెక్కచేయలేదు. గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం ప్రారంభించగానే, ఫార్మాట్లోని ‘నేను’ అని చదివి వెంటనే రాజకీయ ప్రసంగం మొదలుపెట్టారు. మోదీ, బాల్ ఠాక్రే, రాష్ట్ర ప్రజలను పొగడడం ప్రారంభించారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకొని షిండేను అప్రమత్తం చేశారు. దాంతో ఆయన ఫార్మాట్ ప్రకారం ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ పత్రాన్ని చదివారు. -
ఫలించిన బీజేపీ ప్లాన్.. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం
నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. ఈ కార్యక్రమానికి.. -
సీఎంగా హ్యాట్రిక్ కొడుతున్న బ్యాక్ బెంచర్
ముంబై: ఏబీవీపీ కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానం ఆరంభించిన దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ పట్ల విధేయత, అంకితభావం, పట్టుదలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఆయన 1970 జూలై 22న మహారాష్ట్రలోని నాగపూర్‌లో జన్మించారు. తండ్రి దివంగత గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో కీలక నాయకుడిగా వ్యవహరించారు. దేవేంద్ర 1989లో ఏబీవీపీలో చేరారు. 22 ఏళ్ల వయసులో నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్‌గా గెలిచారు. 1997లో 27 ఏళ్ల పిన్న వయసులోనే నాగపూర్ మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. తొలిసారిగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నాగపూర్ సౌత్‌వెస్ట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం విశేషం. మహారాష్ట్రలో మనోహర్ జోషీ తర్వాత రెండో బ్రాహ్మణ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతికి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఫడ్నవీస్ నిరుత్సాహపడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని విజయపథంలో నడిపించారు. సున్నిత మనస్కుడు ఫడ్నవీస్ పాఠశాలలో చదువుకునేటప్పుడు బ్యాక్ బెంచర్ అని ఆయన గురువు సావిత్రి సుబ్రమణియం చెప్పారు. ఫడ్నవీస్ ఎనిమిది నుంచి పదో తరగతి దాకా సరస్వతి విద్యాలయలో చదువుకున్నారు. తన విద్యార్థి అయిన ఫడ్నవీస్ చిన్నప్పుడు సున్నిత మనస్కుడిగా ఉండేవాడని, అందరినీ చక్కగా గౌరవించేవాడని, ఇతరులకు చేతనైన సహాయం చేసేవాడని, చాలా మర్యాదస్తుడని సావిత్రి సుబ్రమణియం తెలిపారు. చదువులో సగటు విద్యారి్థగానే ఉండేవాడని అన్నారు. అసాధారణమైన విద్యార్థి కానప్పటికీ బాగానే చదివేవాడనని వెల్లడించారు. బాగా పొడగరి కావడంతో తరగతిలో చివర వరుసలో కూర్చొనేవాడని పేర్కొన్నారు. -
సీఎం అభ్యర్థి, కేబినెట్ పదవులపై చర్చ
-
షిండేకు భారీ షాక్? శివసేన నేత కీలక వ్యాఖ్యలు
-
ఏక్నాథ్ షిండే రాజీనామా
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మంగళవారం రాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా షిండే వెంట ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఉన్నారు. నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని షిండేను గవర్నర్ కోరారు. మహారాష్ట్రలో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం మంగళవారం ముగిసింది. సాధ్యమైనంత త్వరగా నూతన ప్రభుత్వం కొలువుదీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎడతెగని ఉత్కంఠ మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహాయుతి భాగస్వామ్యపక్షాలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం. ముఖ్యమంత్రి ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమని ఆయా పార్టీలు చెబుతున్నాయి. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని పేర్కొంటున్నాయి. సీఎం పోస్టు కోసం బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నుంచి ఏక్నాథ్ షిండ్, ఎన్సీపీ(అజిత్‌పవార్) నుంచి అజిత్ పవార్ పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకోవడానికి అజిత్ పవార్ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త సీఎం ఎవరన్నదానిపై బుధవారం ఉదయం కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని శివసేన(షిండే) అధికార ప్రతినిధి సంజయ్ సిర్సాత్ చెప్పారు.మరోవైపు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిపారు. కానీ, అధికారికంగా ఆయన పేరు ఇంకా ఖరారు చేయలేదని అన్నారు. ఏ పార్టీకి ఎన్ని మంత్రిపదవులు, ఎవరెవరికి ఏయే శాఖలు ఇవ్వాలో నిర్ణయించిన తర్వాతే కొత్త సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీని సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. సీఎం ఎంపిక విషయంలో తమ పార్టీ అధిష్టానం తొందరపడడం లేదని తెలిపారు. మహాయుతిలో ఘర్షణకు తావులేకుండా సామరస్యపూర్వకంగా ముందుకు సాగాలన్నది తమ ఉద్దేశమని వివరించారు. -
మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా
-
ఏక్ నాథ్ షిండే సంచలన ట్వీట్..
-
సీఎం పీఠం కోసం ఏక్నాథ్ షిండే పట్టు
-
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠంపై ఉత్కంఠ
-
Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ బుధవారం తేల్చేశారు. ఏడాదిన్నరగా కొనసాగుతున్న అనిశి్చతికి తెరదించారు. శివసేన పార్టీ 2022 జూన్‌లో రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు రెండు పక్షాలుగా చీలిపోయారు. ఒక వర్గానికి నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే బీజేపీ, ఎన్సీపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వం వహిస్తున్నారు. తమ వర్గమే అసలైన శివసేన అంటూ ఇరువురు నేతలు వాదిస్తున్నారు. అవతలి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ షిండే, ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞాపనలు సమరి్పంచారు. వీటిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ తన నిర్ణయం ప్రకటించారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఉద్ధవ్ వర్గానికి చెందిన సునీల్ ప్రభును విప్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. ఈ తొలగింపు 2022 జూన్ 21 నుంచి వర్తిస్తుందన్నారు. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను అధికారికంగా విప్‌గా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేపై కూడా అనర్హత వేటు వేయడం లేదన్నారు. పార్టీ నుంచి నేతలను బహిష్కరించే అధికారం శివసేన చీఫ్‌కు లేదని పేర్కొన్నారు. 2018 నాటి శివసేన రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఉద్ధవ్ వర్గం కోరగా, స్పీకర్ అంగీకరించలేదు. 1999 నాటి రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. శివసేన ఎన్నికల సంఘం సైతం ఈ రాజ్యాంగాన్నే గుర్తించిందని పేర్కొన్నారు. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలకు గాను 37 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గంలోనే ఉన్నాయని గుర్తుచేశారు. స్పీకర్ నిర్ణయంపై షిండే వర్గంసంబరాలు చేసుకుంది. సీఎం ఏక్నాథ్ షిండే కూడా దీనిపై హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంను ఆశ్రయిస్తాం: ఉద్ధవ్ వర్గం స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని శివసేన(ఉద్ధవ్) ప్రకటించింది. స్పీకర్ నిర్ణయాన్ని అంగీకరించబోమని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఇదంతా బీజేపీ కుట్ర అని పార్టీ నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్ మండిపడ్డారు. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనను ఎవరూ అంతం చేయలేరన్నారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారమని ఆరోపించారు. షిండే వర్గమే అసలైన శివసేన అయితే తమ వర్గం ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలేదని ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య హత్యగా ఉద్ధవ్ ఠాక్రే అభివరి్ణంచారు. -
మరాఠా రిజర్వేషన్లకు ఓకే : ఏక్నాథ్ షిండే
ముంబై: విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రకటించారు. రిజర్వేషన్ల అమ లు విషయంలో చట్టపరిధిలో విధివిధానాలు ఖరారు చేయడానికి కొంత సమయం అవసరమని చెప్పారు. రిజర్వేషన్ల అంశంపై మరాఠా ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. రిజర్వేషన్ల కోసం మరాఠాలు చేపడుతున్న ఆందోళనలు, జరుగుతున్న హింసాకాండపై చర్చించారు. నిరవధిక దీక్ష విరమించాలని సామాజిక కార్యకర్త మనోజ్ జారంగీని కోరుతూ అఖిలపక్ష భేటీలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన(ఉద్ధవ్‌వర్గం) నాయకుడు అనిల్ పారబ్ తదితరులు సంతకాలు చేశారు. అనంతరం సీఎం షిండే మీడియాతో మాట్లాడారు. హింసకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించవద్దని రాజకీయ పారీ్టలకు సూచించారు. -
మా ఆదేశాలే అపహాస్యమా?
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, వారి వర్గం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ చేస్తున్న జాప్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. దీనిపై నిర్ణయాన్ని ఆయన నిరవధికంగా వాయిదా వేస్తూ పోజాలరని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ‘‘స్పీకర్ కాస్త విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని మేం భావించాం. నిర్దిష్ట కాలావధిలోగా ఈ అంశాన్ని పరిష్కరించాల్సిందిగా గత విచారణ సమయంలోనే ఆయనకు మేం స్పష్టంగా నిర్దేశించాం. ఇందుకు కాలావధి కూడా పెట్టుకోవాల్సిందిగా సూచించాం. ఆయన దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కని్పంచాలి. కానీ ఈ అంశంపై అసలు విచారణే జరపడం లేదు’’ అంటూ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు తలంటిపోశారు. ‘‘గత జూన్ నుంచీ ఈ విషయం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. మేమంతా గమనిస్తూనే ఉన్నాం. అసలు స్పీకర్ ఏమనుకుంటున్నారు? మా ఆదేశాలనే అపహాస్యం చేస్తారా? ఇదేమైనా ఆషామాషీ విషయమని అనుకుంటున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. ‘‘ఈ విషయంలో స్పీకర్‌కు కచి్చతంగా ‘సలహా’ అవసరం. వెంటనే ఎవరైనా ఆ పని చేయడం మేలు‘‘ అని స్పీకర్ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సీజేఐ సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకపోతే ఈ మొత్తం ప్రక్రియకు అర్థమే లేకుండా పోతుందన్నారు. ఈ అంశాన్ని ఎప్పట్లోగా తేలుస్తారో స్పష్టంగా పేర్కొంటూ మంగళవారం నాటికి తమకు టైమ్‌లైన్‌ను సమరి్పంచాలని ఆదేశించారు. లేదంటే ఈ విషయమై తామే నేరుగా ఆదేశాలిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. స్పీకర్‌ను బాధ్యున్ని చేయాల్సి వస్తుంది! మహారాష్ట్రలో పలువురు ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలు రద్దు చేయాలంటూ శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత ఉద్ధవ్‌ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ దాఖలు చేసిన పిటిషన్లపై ధర్మాసనం ముందు శుక్రవారం విచారణ కొనసాగింది. ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు కొనసాగించారు. దీనిపై జూలై 14న స్పీకర్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసినా ఇప్పటికీ ఏమీ జరగలేదని సీజేఐ దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి పక్షం వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవడం, ఇందులో పలు అంశాలను స్పీకర్ ముందుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న సొలిసిటర్ జనరల్ మెహతా వివరణతో సంతృప్తి చెందలేదు. ‘‘ఈ విషయమై మేం జూలై 14న స్పష్టమైన సూచనలు జారీ చేశాం. సెప్టెంబర్ 18న ఆదేశాలు కూడా వెలువరించాం. అయినా స్పీకర్ చేసిందేమీ లేదు. కనుక రెండు నెలల్లోగా దీనిపై ఆయన నిర్ణయం తీసుకోవాలని మేం ఆదేశించక తప్పడం లేదు’’ అన్నారు. ‘‘స్పీకర్ పదవికున్న హుందాతనం దృష్ట్యా తొలుత మేం టైంలైన్ విధించలేదు. కానీ ఆయన తన బాధ్యతలను నెరవేర్చకపోతే అందుకు బాధ్యున్ని చేయక తప్పదు’’ అని అన్నారు. -
'సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చా'.. విశాల్ సంచలన వీడియో రిలీజ్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ సంచలన కామెంట్స్ చేశారు. తన మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ రిలీజ్ కోసం లంచం తీసుకున్నారంటూ వీడియో రిలీజ్ చేశారు. ముంబయిలోని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఈ అనుభవం ఎదురైందని వెల్లడించారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, పీఎం నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. అంతే కాకుండా ట్వీట్‌తో పాటు మనీ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్స్ నంబర్లతో సహా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) విశాల్ ట్వీట్లో రాస్తూ..' వెండితెరపై సైతం అవినీతిని చూపిస్తున్నారు. దీన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, ముంబైలోని సీబీఎఫ్సీ (సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఆఫీసులో ఇంకా దారుణం జరుగుతోంది. నా సినిమా మార్క్ ఆంటోనీ హిందీ వర్షన్ కోసం 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన 2 లావాదేవీలు చేశా. ఒకటి స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, రెండు సర్టిఫికేట్ కోసం 3.5 లక్షలు చెల్లించాను. నా కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ రోజు సినిమా విడుదలైనప్పటి నుంచి మధ్యవర్తికి చాలా ఎక్కువ డబ్బు చెల్లించడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకోస్తున్నా. నేను ఇలా చేయడం నా కోసం కాదు. భవిష్యత్తులో రాబోయే నిర్మాతల కోసం. నేను కష్టపడి సంపాదించిన డబ్బు అవినీతికి ఇచ్చే అవకాశమే లేదు. అందరి కోసమే నా వద్ద ఉన్న సాక్ష్యాలు కూడా పెడుతున్నా. సత్యం ఎప్పటిలాగే గెలుస్తుందని ఆశిస్తున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. #Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l — Vishal (@VishalKOfficial) September 28, 2023 -
సీఎం షిండేకు ఎదురుదెబ్బ.. ఆ కేసులో హైకోర్టు మొట్టికాయలు!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నాగ్‌పూర్ ల్యాండ్ కేసులో బాంబే హైకోర్టు మొట్టికాయలు వేసింది. ఎంవీఏ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో.. కోర్టులో కేసు ఉన్నప్పటికీ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని నాగ్‌పూర్ అభివృద్ధి ట్రస్టును ఎలా ఆదేశించారని ప్రశ్నించింది. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అగాడీ(ఎంవీఏ) ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు ఏక్నాథ్ షిండే. 2021లో మురికివాడల పేదల కోసం కేటాయించిన 5 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్కువ ధరకే 16 మంది బిల్డర్స్‌కు కేటాయించారు షిండే. దీనిపై ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉన్నప్పటికీ షిండే ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. రూ.83 కోట్లు విలువ చేసే భూమికి నాగ్‌పూర్ అభివృద్ధి ట్రస్టుకు కేవలం రూ.2 కోట్ల లోపే దక్కాయని పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ చేస్తున్న బాంబే హైకోర్టు.. ఆ 5 ఎకరాలు భూమి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. ఈ కేసుపై సమాధానం ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను 2023, జనవరి 4కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: చేతిలో చంటి బిడ్డతో ఆ ఎమ్మెల్యే.. ఆమె సమాధానం వింటే అభినందించకుండా ఉండలేరు -
షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం?
ముంబై: ఎంతో నమ్మకంగా సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీలోనే తిరుగుబాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు ఏక్నాథ్ షిండే. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా ఏక్నాథ్ షిండే వర్గంలోనే చీలకలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన.. తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ మేరకు వెల్లడించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోని 40 మందిలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు పేర్కొంది సామ్నా. ఏక్నాథ్ షిండేను బీజేపీ తాత్కాలికంగా ఆ పదవిలో కూర్చోబెట్టిందని పేర్కొనటం గమనార్హం. ‘ఆయన ముఖ్యమంత్రి పదవి ఏ క్షణమైనా కోల్పోతారని ప్రతిఒక్కరికి అర్థమైంది. అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో షిండే వర్గం పోటీ చేయాలని భావించింది. కానీ, అందుకు బీజేపీ నిరాకరించింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చెప్పటం పూర్తిగా తప్పు. 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారిలోని చాలా మంది బీజేపీతో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ’అని ఉద్ధవ్ థాక్రే వర్గం పేర్కొంది. ఏక్నాథ్ షిండే తనకు తాను, మహారాష్ట్రకు చాలా నష్టం చేశారని, రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టరని పేర్కొంది శివసేన. షిండేను తమ స్వప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకోవటం కొనసాగిస్తుందని తెలిపింది. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలను ఉద్ఘాటించింది. ప్రభుత్వం 40 మంది ఎమ్మెల్యేలతో నడుస్తోందని, వారంతా సీఎంఓ నియంత్రణలో ఉన్నారని పేర్కొంది. నిర్ణయాలన్నింటిని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్నారని, ఆ నిర్ణయాలను షిండే ప్రకటిస్తున్నారని ఆరోపించింది. ఇదీ చదవండి: పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో వధువు పరార్.. వరుడికి ఫోన్ చేసి..! -
మహారాష్ట్రకు కొత్త సీఎం.. ఫోటోలు వైరల్!
ముంబై: ఏక్నాథ్ శిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో మొదలైన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే వర్గంతో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో కొన్ని ఫోటోలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీలో.. ఏక్నాథ్ షిండే కుమారుడు, లోక్‌సభ ఎంపీ శ్రీకాంత్ షిండే కూర్చోవటం వివాదానికి దారి తీసింది. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సూపర్ సీఎం: ఎన్సీపీ శివసేన వ్యవస్థాపకులు బాలా సాహేబ్ థాక్రే ఫోటో ముందు ఉన్న కుర్చీలో శ్రీకాంత్ షిండే కూర్చున్న చిత్రాలను ట్వీట్ చేశారు ఎన్సీపీ అధికార ప్రతినిధి రవికాంత్ వార్పే. ఆ కుర్చి వెనకాలే ఉన్న బోర్డుపై ‘మహారాష్ట్ర ప్రభుత్వం- ముఖ్యమంత్రి’ అని రాసి ఉంది. ఈ క్రమంలో సూపర్ సీఎం అంటూ పేర్కొన్నారు రవికాంత్. ఇది ఎలాంటి రాజధర్మమని ప్రశ్నించారు. మరోవైపు.. సీఎం కుర్చీపై జోకులు వేసిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు తన సానుభూతి తెలుపుతున్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు శివసేన నాయకురాలు ప్రియాంక ఛతుర్వేది. ఆధిత్య థాక్రే ఒక మంత్రిగా ప్రభుత్వ వ్యవహారాలు చూసుకుంటే వారికి సమస్య అనిపించిందని, కానీ, శ్రీకాంత్ షిండే కనీసం ఎమ్మెల్యే కాకపోయినా ఎలాంటి సమస్య లేదని ఎద్దేవా చేశారు. खा.श्रीकांत शिंदे यांना सुपर सीएम झाल्याबद्दल हार्दिक शुभेच्छा. मुख्यमंत्र्यांच्या गैरहजेरीत त्यांचे चिरंजीव मुख्यमंत्री पदाचा कारभार सांभाळतात.लोकशाहीचा गळा घोटण्याचे काम सुरूय.हा कोणता राजधर्म आहे?असा कसा हा धर्मवीर?@mieknathshinde @DrSEShinde pic.twitter.com/rpOZimHnxL — Ravikant Varpe - रविकांत वरपे (@ravikantvarpe) September 23, 2022 తిప్పికొట్టిన షిండే.. ఈ క్రమంలో విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు శ్రీకాంత్ షిండే. ఆ ఫోటో తన నివాసంలో తీసుకున్నదని, తన తండ్రి కోసం అధికారికంగా కేటాయించిన కుర్చీలో కూర్చోలేదని స్పష్టం చేశారు. అలాగే.. అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం సైతం కాదని, థానేలోని ప్రైవటు నివాసం, ఆఫీసుగా వెల్లడించారు. వెనకాల ఉన్న బోర్డును తరుచూ తరలిస్తుంటారని, తన నివాసం నుంచే వర్చువల్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నందున అక్కడ ఉందని వివరణ ఇచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ ఆఫీసును సీఎం, తానూ ఉపయోగిస్తానని వెల్లడించారు. ఇదీ చదవండి: సీఎంగా నా వారసుడిని వారే నిర్ణయిస్తారు: గెహ్లాట్ -
నేను నోరువిప్పితే భూకంపమే.. ఉద్ధవ్ థాక్రేకు సీఎం షిండే వార్నింగ్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేకు పరోక్ష హెచ్చరికలు చేశారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. తాను మాట్లాడటం మొదలు పెడితే భూకంపం వస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. అంతేకాదు తన గురువు, శివసేన ఫైర్ బ్రాండ్ ఆనంద్ దిఘే విషయంలో ఏం జరిగిందో కూడా తనకు తెలుసునని, తానే ప్రత్యక్ష సాక్షినని షిండే అనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2002లో రోడ్డు ప్రమాదానికి గురై ఆనంద్ దిఘే మరణించారు. ఇప్పుడు ఆయన ప్రస్తావనను షిండే తీసుకురావడం చర్చనీయాంశమైంది. అంతేకాదు శివసేన రెబల్ ఎమ్మెల్యేలను థాక్రే ద్రోహులు అనడంపైనా షిండే పరోక్షంగా స్పందించారు. మరి సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ సిద్ధాంతాలను పక్కనపెట్టిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. బాలాసాహెబ్ థాక్రే అసలు వారసులం తామే అని పేర్కొన్నారు. ఇటీవలే తన వర్గంలో చేరిన బాలాసాహెబ్ కోడలు, మనవడు కూడా తనకే మద్దతుగా నిలిచారని షిండే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీ చేసి మరోసారి అధికారం చేపడతామని షిండే ధీమా వ్యక్తం చేశారు. 288 సీట్లకు గాను 200కుపైగా స్థానాలు కైవసం చేసుకుంటామని జోస్యం చెప్పారు. చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు: ఉద్ధవ్ థాక్రే -
గాయపడ్డ మహిళా కానిస్టేబుల్.. పెద్ద మనసు చాటుకున్న సీఎం షిండే
సాక్షి,ముంబై: మహారాష్ట్ర నూతన సీఎం ఏక్నాథ్ షిండే మంచి మనసు చాటుకున్నారు. థానేలో బుధవారం ఓ సమావేశంలో పాల్గొని తిరిగివెళ్తుండగా అక్కడే గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఆయన గమనించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. దీంతో సిబ్బంది హుటాహుటిన ప్రత్యేక వాహనంలో కానిస్టేబుల్‌ను నగరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. థానే కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం షిండే. జులై 10న ఆషాడి ఏకాదశి సందర్భంగా విఠలుడిని ఆరాధించే వార్కీల ఏర్పాట్ల విషయంపై సమీక్ష నిర్వహించారు. ఆ రోజు పండరీపూర్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే వార్కీల వాహనాలకు టోల్ రుసుం తీసుకోవద్దని ఆదేశించారు. దీని కోసం వారు తమ వాహనాలకు స్టిక్కర్లు అంటించుకని స్థానిక పోలీసుల వద్ద నమోదు చేసుకుంటే సరిపోతుందన్నారు. ఈ సమావేశం అనంతరం షిండే కార్యాలయాన్ని వీడుతుండగా.. ఆయనను చూసేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ఆ సమూహంలో ఉన్న మహిళా కానిస్టేబుల్ గాయపడ్డారు. ఆమెను చూసిన షిండే.. కాసేపు ఆగి ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీ మద్దతుతో షిండే సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. -
Eknath Shinde: పిక్చర్ అభీ బాకీ హై!
‘కాస్తంత ఊపిరి తీసుకోనివ్వండి. కొద్దిరోజులుగా బోలెడంత హడావిడిలో ఉన్నా!’ మహారాష్ట్ర శాసనసభలో సోమవారం నాటి విశ్వాస పరీక్షలో నెగ్గిన వెంటనే విలేఖరులతో కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే అన్న మాటలివి. ‘నేను, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలసి కొత్తగా ఎవరిని మంత్రులుగా తీసుకోవాలో, వారికి ఏ శాఖలు కేటాయించాలో నిర్ణయిస్తాం’ అని ఆయన వివరించారు. రెండు వారాల రాజకీయ థ్రిల్లర్ తర్వాత సీఎం పదవి వచ్చి, సభలో బలం నిరూపించుకున్నా రన్న మాటే కానీ, బహుశా శిందే ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకొనే పరిస్థితి లేదు. శివసేన అధినాయకత్వంపై తిరుగుబాటుతో చివరకు సీఎం అయిన గత పక్షం రోజుల కన్నా ఎక్కువ పని ఆయనకు ఉంది. శాసనసభలో బలపరీక్ష వేళ అనుకూలంగా 164 – ప్రతికూలంగా 99 ఓట్లతో సంఖ్యాబలం తనకే ఉందని శిందే ధ్రువీకరించగలిగారు. అయితే, పార్టీలోనూ, ప్రజల్లోనూ బలం తనకే ఉందని శిందే నిరూపించుకోవాల్సిన సందర్భాలు రానున్నాయి. తిరుగుబాటు వేళ పరిణామాలపై, గవర్నర్ చర్యలపై సుప్రీమ్‌కోర్టులో సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంది. వెరసి మహానాటకం ముగిసిపోలేదు. అయినవాడైన శిందే గద్దెనెక్కగానే రాజ్‌భవన్ సహా అందరూ అతిగా సహకరిస్తున్నారు. అభిప్రాయాలే మార్చేసుకుంటున్నారు. 17 నెలలుగా శాసనసభ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నా, సభలో ఎన్నిక పెట్టి దాన్ని నిర్వహించకుండా ఉపేక్షించిన ఘనత మహారాష్ట్ర గవర్నర్‌ది. తీరా శిందే, ఫడ్నవీస్‌ల కొత్త సర్కార్ కొలువు తీరగానే రెండే రోజుల్లో ఎన్నికకు అనుమతి, బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వేకర్ గెలుపు చకచకా జరిగిపోవడం విడ్డూరం. మొన్నటిదాకా కొత్త స్పీకర్ ఎన్నికకు తేదీ నిర్ణయించడానికి నిరాకరిస్తూ వచ్చిన గవర్నర్‌లో ఈ హఠాత్ హృదయ పరివర్తనకు కారణమేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. మొన్నటి దాకా అసెంబ్లీ నియమాల సవరణలపై వివాదం సుప్రీమ్‌లో పెండింగ్‌లో ఉందంటూ ఆయన సాకులు చెబుతూ వచ్చారు. తీరా ఢిల్లీ పెద్దల ఆశీస్సులున్న సర్కారు రాగానే, కేసు సంగతి పక్కనబెట్టి స్పీకర్ ఎన్నికకు సిగ్నల్ ఇచ్చారు. స్పీకర్ ఎన్నికకు తేదీని నిర్ణయించడమే గవర్నర్ విధి. దాన్ని అడ్డం పెట్టుకొని, పూర్తిగా సభా వ్యవహారమైన స్పీకర్ ఎన్నికను గవర్నర్ ఇంతకాలం ఆపడం రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారూ రాజకీయాలకు అతీతులు కారనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఇక, గతంలో స్పీకర్ ఎన్నికంటూ జరిగితే, మహా వికాస్ అఘాడీ కూటమిలోని ఎమ్మెల్యేలు కొందరు క్రాస్ ఓటింగ్ వేస్తారని అప్పటి ప్రతిపక్ష బీజేపీ భావిస్తూ వచ్చింది. అప్పటికింకా శివసేనలో శిందే తిరుగుబాటు జరగనే లేదు. అందుకే, స్పీకర్ ఎన్నిక రహస్య ఓటింగ్‌లో సాగాలని కోరుతూ వచ్చింది. నాటి అధికార ఉద్ధవ్ ఠాకరే సర్కార్ మాత్రం క్రాస్ ఓటింగ్‌ను నివారించేందుకు ఓపెన్ బ్యాలెట్ విధానం కోరింది. అప్పుడు దాన్ని వ్యతిరేకించిన బీజేపీ తీరా శిందేతో కలసి తాము గద్దెనెక్కగానే ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరపడం అవసరాన్ని బట్టి అభిప్రాయాలు మార్చుకొనే వైఖరికి అచ్చమైన ఉదాహరణ. ‘మంత్రులు, శాఖల జాబితాలో బీజేపీ జాతీయ నాయకత్వం చెప్పే మార్పులు చేర్పులను బట్టి నడుచుకుంటాం’ అంటున్న శిందే తమ కొత్త సర్కారు ఎవరి చెప్పుచేతల్లో నడిచేదీ చెప్పకనే చెప్పారు. అయితే, ప్రభుత్వంపై ప్రభావం చూపే అంశాలు కొన్ని కోర్టులో ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. పాత హయాంలో కనీసం 16 మంది రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసుల వ్యవహారం, కొత్త స్పీకర్ ఎన్నిక అంశం అలాంటివే. రాజకీయంగా చూస్తే, మహారాష్ట్రలో పార్టీలు అధికారం వేటలో భాగస్వామ్య పక్షాలను నడిమధ్యలో వదిలేయడం, కొన్నాళ్ళకు మళ్ళీ చేతులు కలపడం ఆనవాయితీ. ముంబయ్ కార్పొరేషన్ ఎన్నికలు, శివసేన బలాన్నీ, బలగాన్నీ తన వైపు తిప్పేసుకొనే వ్యూహంతో అడుగేసిన బీజేపీ శిందేను ఎంతకాలం నెత్తిన పెట్టుకు మోస్తుందో చెప్పలేం. ఉద్ధవ్‌పై తిరగబడి వచ్చిన శిందే ముంబయ్‌లోనూ పట్టుసాధించి, అసలైన శివసేన, సైనికులం తామేనని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆయన రాజకీయ మనుగడ. గతంలో నారాయణ రాణే, రాజ్ ఠాకరేల తిరుగుబాటును తట్టుకున్నా, ఈసారి పార్టీ, పార్టీ చిహ్నం కూడా చేజారే దురవస్థలో పడ్డ ఉద్ధవ్‌కి ఇది జీవన్మరణ సమస్య. మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను గంప కింద కోళ్ళలా కాపాడుకోవడానికి ఆయన తంటాలు పడుతున్నారు. కొద్దిరోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలున్నందున ఈ ఎంపీలపై బీజేపీ జాలం తప్పదు. ఇప్పటికే 18 మంది శివసేన ఎంపీలలో 12 మంది తమ గూటికే వస్తారంటూ శిందే వర్గం ఎమ్మెల్యే ఒకరు చేసిన ప్రకటన సంచలనమైంది. గిరిజన మూలాలున్న ముర్మూకే మన మద్దతు ప్రకటిం చాలంటూ ఒక ఎంపీ మంగళవారం రాత్రే ఉద్ధవ్‌కు లేఖ కూడా రాయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో శిందే వైపు మొగ్గిన ప్రస్తుత ఛీఫ్ విప్ స్థానంలో లోక్‌సభలో మరొకరిని కొత్తగా నియమిం చడమే ఉద్ధవ్‌కి శరణ్యమైంది. అసెంబ్లీలో బలపరీక్ష వేళ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నలుగురు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ట్రాఫిక్, ఆలస్యమైంది లాంటి కుంటిసాకులు చెప్పి, ఓటింగుకు దూరమవడం ప్రతిపక్షాల్లో గుబులు రేపుతోంది. శరద్‌పవార్ మాత్రం శిందే, బీజేపీల దోస్తీ దీర్ఘకాలం సాగదనీ, కొత్త సర్కార్ నిలవదనీ బింకంగా చెబుతున్నారు. తన వెంట నిలిచిన ఎమ్మెల్యేలందరినీ తృప్తిపరచడం శిందేకు కత్తి మీద సామే. వరస చూస్తుంటే, శిందేకు ఇంకా చేతి నిండా చాలా పని ఉంది. పాపులర్ హిందీ డైలాగ్ ఫక్కీలో చెప్పాలంటే మహారాష్ట్రలో ‘పిక్చర్ అభీ బాకీ హై!' -
‘మహా’ సీఎం షిండే .. డిప్యూటీగా ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కరోజులోనే వేగంగా మారిపోయాయి. అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోయిన 24 గంటల్లోనే.. రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ శివసేన తిరుగుబాటు వర్గం–బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర నూతన (20వ) ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే(58), ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(51) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాత్రి 7.30 గంటల తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏక్నాథ్ షిండే తొలుత దివంగత శివసేన అగ్రనేతలు బాల్ ఠాక్రే, ఆందన్ డిఘేకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని, రాష్ట్రంలో అన్ని వర్గాలను తనతోపాటు కలుపుకొని ముందుకెళ్తానని షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన పట్ల ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోనని అన్నారు. మహారాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సీఎంగా తన నియామకం బాల్ ఠాక్రే సిద్ధాంతానికి, తన గురువు ‘ధర్మవీర్’ఆనంద్ డిఘే బోధనలకు లభించిన విజయమని వెల్లడించారు. ఫడ్నవీస్‌ను ఒప్పించిన బీజేపీ పెద్దలు మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండడం లేదంటూ దేవేంద్ర ఫడ్నవీస్ మొదట ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వ పరిపాలన సాఫీగా సాగడానికి తన వంతు సాయం అందిస్తానన్నారు. కొద్దిసేపటి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పందిస్తూ.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో ఫడ్నవీస్ ఒక సభ్యుడిగా కొనసాగుతారని తేల్చిచెప్పారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో మంత్రివర్గంలో చేరడానికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఫడ్నవీస్ అంగీకరించినట్లు సమాచారం. తదుపరి ముఖ్యమంత్రిగా షిండే పేరును ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. అంతకముందు గురువారం మధ్యాహ్నం ఏక్నాథ్ షిండే గోవా నుంచి చార్టర్డ్ విమానంలో ముంబైకి చేరుకున్నారు. ఫడ్నవీస్‌ను ఆయన నివాసంలో కలిసి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ నివాసం వద్ద ఆందోళనకు దిగిన కొందరు శివసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు కొందరు బీజేపీ నాయకులతో కలిసి రాజ్‌భవన్‌కు బయలుదేరారు. గవర్నర్ కోషియారీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కొందరు శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు ఫడ్నవీస్ వెల్లడించారు. రెబల్ ఎమ్మెల్యేలు ఒక శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రిగా చేయగలరా? అంటూ తాజా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే విసిరిన సవాలుగా జవాబుగా ముఖ్యమంత్రి పదవిని బీజేపీ వదులుకున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గం మద్దతుతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాలు సైతం వినిపించాయి. ఎన్నికలు రద్దుడాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది అధికారం కోసం జరిగిన పోరాటం కాదని ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్రంపై ఎన్నికలను రుద్దడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 2019 నాటి ప్రజాతీర్పును ఉద్ధవ్ ఠాక్రే–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి అపహాస్యం చేసిందని విమర్శించారు. బాలాసాహెబ్ బాల్ ఠాక్రే జీవితాంతం వ్యతిరేకించిన పార్టీలతో ఉద్ధవ్ నిస్సిగ్గుగా చేతులు కలిపారని మండిపడ్డారు. మహా వికాస్ అఘాడీ(ఏంవీఏ) సర్కారు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. షిండే వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తిరుగుబాటు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం వెనుక వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ప్రయోజనాలు లేవని ఏక్నాథ్ షిండ్ చెప్పారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తిరుగుబాటు బావుటా ఎగురవేశానని అన్నారు. ఏంవీఏ ప్రభుత్వంలో మంత్రులపై పరిమితులు విధించారని గుర్తుచేశారు. తన ఏకైక అజెండా అభివృద్ధి మాత్రమేనని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం కల్పించినందుకు గాను ఫడ్నవీస్‌పై షిండే ప్రశంసల వర్షం కురిపించారు. ఒక శివ సైనికుడిని సీఎంను చేస్తుండడం వెనుక ఫడ్నవీస్ పెద్ద మనసు ఉందన్నారు. తిరుగుబాటు అనేది పార్టీలో జరిగిన ఒక అంతర్మథనం అని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు షిండే కృతజ్ఞతలు తెలియజేశారు. షిండేకు శివసేన, కొన్ని చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిపి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది శాసనసభ్యులు తనకు మద్దతుగా ముందుకొస్తారని ఆయన చెప్పారు. శాసనసభలో బలనిరూపణపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది సభ్యులు ఉండగా, శివసేన తిరుగుబాటు వర్గం–బీజేపీ కూటమికి 170 మంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గోవా నుంచి షిండే రాక సందర్భంగా ముంబై పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే.. ముంబైకి బయలుదేరడానికి కంటే ముందు షిండే గోవాలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి ముంబైకి వెళ్తున్నట్లు చెప్పారు. మిగతా ఎమ్మెల్యేలంతా ప్రస్తుతానికి గోవాలోనే ఉంటారని వివరించారు. తమ ఫిర్యాదులను ఎంవీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని షిండే తన అనుచరులకు సూచించారు. నూతన సీఎం ఏక్నాథ్ షిండేకు ప్రధానమంత్రి మోదీ అభినందలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు సైతం అభినందనలు తెలియజేశారు. షిండేకు ఉద్ధవ్ అభినందనలు మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండేకు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభినందనలు తెలియజేశారు. ఈ నెల 2–3న అసెంబ్లీ భేటీ జూలై 2, 3 తేదీల్లో మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో తొలి మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. రెబల్స్‌కు విచారం తప్పదు: సంజయ్ రౌత్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వారి దారి వారు చూసుకున్నారని, అందుకు వారు ఎప్పటికైనా విచారించక తప్పదని శివసేన ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. రెబల్ ఎమ్మెల్యేల తీరు పట్ల తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే తరహాలో వస్త్రాలు ధరించిన వ్యక్తి ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో సదరు వ్యక్తి వీపు భాగంలో రక్తపు మరకలు ఉన్నాయి. ఉద్ధవ్‌కు వెన్నుపోటు పొడిచారని సంజయ్ పరోక్షంగా వెల్లడించారు. సరిగ్గా ఇదే జరిగిందని ట్వీట్లో వివరించారు. ఇకపై శివసేన రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లపై వివరణ ఇవ్వడానికి శుక్రవారం అధికారుల వద్దకు వెళ్తానని సంజయ్ రౌత్ తెలిపారు. రెబల్స్ వెళ్లే మార్గంలో తాము ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని, ఆ ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. వారి పని వారు చేసుకుంటారు, తమ పని తాము చేసుకుంటామని, తమ ఇరువురి దారులు వేరయ్యాయని వ్యాఖ్యానించారు. శివసేనలో తిరుగుబాటుకు కారణం ఎవరో తమకు తెలుసని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. -
ఫొటోగ్రాఫర్ నుంచి సీఎం దాకా..
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అనూహ్యంగా రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఫొటోగ్రఫీపై మంచి అభిరుచి కలిగిన ఉద్ధవ్ ప్రస్థానం ఆసక్తికరం. తండ్రిచాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి, ఓనమాలు నేర్చుకున్న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారు. మరాఠా పులి బాలాసాహెబ్ బాల్ ఠాక్రే–మీనా ఠాక్రే ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే 1960 జూలై 27న జన్మించారు. ముంబైలో బాలమోహన్ విద్యామందిర్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. ‘సర్ జె.జె.ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్’లో ఫొటోగ్రఫీ ప్రధాన సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2002లో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ జీవితం ప్రారంభమయ్యింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ప్రచార బాధ్యుడిగా సేవలందించారు. ఈ ఎన్నికల్లో శివసేన మెరుగైన ఫలితాలు సాధించడంతో పార్టీలో ఉద్ధవ్ ప్రతిష్ట పెరిగింది. 2003లో శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. 2006లో పార్టీ పత్రిక ‘సామ్నా’ చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2019లో రాజీనామా చేశారు. మోస్టు పాపులర్ సీఎం 2012లో బాల్ ఠాక్రే మరణించడంతో, 2013లో శివసేన అధినేతగా ఉద్ధవ్ ఠాక్రే పగ్గాలు చేపట్టారు. ఉద్ధవ్ నాయకత్వంలో మహారాష్ట్రలో 2014లో ఎన్డీయే ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా చేరింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీచేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఉద్ధవ్ కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపారు. మహా వికాస్ అఘాడీ పేరిట మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం పదవి ఉద్ధవ్‌ను వరించింది. మహారాష్ట్ర 19వ ముఖ్యమంత్రిగా 2019 నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేశారు. ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి నాయకుడు ఉద్ధవ్ కావడం విశేషం. 2021లో 13 పెద్ద రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ‘మోస్టు పాపులర్ సీఎం’గా ఉద్ధవ్‌కు అత్యుత్తమ ర్యాంకు దక్కడం గమనార్హం. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో సగం మంది మళ్లీ ఉద్ధవ్‌కే ఓటు వేస్తామని చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేకు చిన్నప్పటి ఫొటోగ్రఫీపై అమితాసక్తి. ఆయన తీసిన ఎన్నో ఫొటోలను ఎగ్జిబిషన్లను ప్రదర్శించారు. మహారాష్ట్ర ప్రకృతి అందాలను, కోటలను ఆయన కెమెరాల్లో చక్కగా బంధించారు. ఉద్ధవ్ 1989లో రష్మీ పటాంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఆదిత్య, తేజస్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శివసేన యువజన విభాగం అధ్యక్షుడైన పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర కేబినెట్లో పర్యాటకం, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. చిన్నకుమారుడు తేజస్ ఠాక్రే పర్యావరణ పరిరక్షకుడిగా, వైల్డ్‌లైఫ్ పరిశోధకుడిగా కొనసాగుతున్నారు. వివాదాలు.. ఆరోపణలు ► మహారాష్ట్ర ప్రభుత్వంపై ఠాక్రే కుటుంబ పెత్తనంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిపాలనలో ఉద్ధవ్ భార్య, కుమారుడి జోక్యం మీతిమీరుతోందంటూ సాక్షాత్తూ శివసేన ఎమ్మెల్యేలే రచ్చకెక్కారు. ► మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న అభియోగాలు ఉద్ధవ్‌పై ఉన్నాయి. ► పార్టీలో సంక్షోభం ముదురుతున్నా గుర్తించకపోవడం, నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం ఉద్ధవ్ పదవికి ఎసరు తీసుకొచ్చింది. ► అనైతిక పొత్తులను శివసేన నేతలు, ప్రజా ప్రతినిధులు జీర్ణించుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలతో తలపడి, ఫలితాల తర్వాత అవే పార్టీలతో జతకట్టడం చాలామందికి నచ్చలేదు. ► బలమైన నాయకుడైన ఏక్నాథ్ షిండేను పక్కనపెట్టి, సంజయ్ రౌత్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఎమ్మెల్యేలు సహించలేకపోయారు. -
దేనికైనా రెడీ.. ఉద్దవ్ థాకరే సంచలన ప్రకటన
-
Maharashtra Political Crisis: క్లైమాక్స్ కు చేరిన మహా సంక్షోభం..
-
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ ఠాక్రే కు కరోనా పాజిటివ్..
-
బీజేపీలో చేరితే దావూద్‌కూ మంత్రి పదవి: ఠాక్రే
ముంబై: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన నేత ఉద్ధవ్ థాకరే మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ నకిలీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఆయన శనివారం సాయంత్రం ముంబైలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఏకంగా మంత్రి పదవి కూడా ఇస్తారని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర నుంచి ముంబై నగరాన్ని వేరు చేసేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రలు సాగవని హెచ్చరించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో తమ కూటమి విచ్ఛిన్నమయ్యాక గాడిదలను తన్ని తరిమేశామని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. -
అమిత్ షా సవాల్‌కి సై.. బీజేపీతో పొత్తుపై ‘మహా’ సీఎం సంచలన వ్యాఖ్యలు
ముంబై: ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సవాలును స్వీకరిస్తున్నట్లు శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే చెప్పారు. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే జన్మదిన వేడుకల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉండడం వల్ల శివసేనకు 25 సంవత్సరాలు వృధాగా పోయాయనే ఇప్పటికీ నమ్ముతున్నానన్నారు. మహారాష్ట్రకు బయటకూడా శివసేన కార్యకలాపాలను విస్తరిస్తామని, జాతీయస్థాయికి ఎదుగుతామని చెప్పారు. బీజేపీ ఎదుగుదలలో సేనలాంటి పలు ప్రాంతీయ పార్టీల సహకారం ఉందని, ఆసమయంలో చాలాచోట్ల బీజేపీకి కనీసం డిపాజిట్లు వచ్చేవికాదని గుర్తు చేశారు. హిందుత్వకు అధికారమివ్వాలనే బీజేపీతో పొత్తుపెట్టుకున్నామని, అంతేకానీ అధికారం కోసం తామెప్పుడూ హిందుత్వను వాడుకోలేదని ఉద్దవ్ చెప్పారు. బీజేపీ అనుకూలవాద హిందుత్వ చేస్తుందని ఆయన విమర్శించారు. రాజకీయ అధికారం కోసమే బీజేపీ కాశ్మీర్లో పీడీపీతో, బీహార్‌లో జేడీయూతో పొత్తు పెట్టుకుందన్నారు. సేన, అకాలీదళ్ లాంటి పాత మిత్రులు పోవడంతో ఎన్డీఏ పరిధి తగ్గిందన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో తమ పొత్తును ఆయన సమర్ధించుకున్నారు. బీజేపీ మిత్రపక్షాలను వాడుకొని వదిలేస్తుందన్నారు. తాము బీజేపీని వదిలేశాము కానీ హిందుత్వను కాదని చెప్పారు. ఎప్పటికైనా ఢిల్లీ గద్దెను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, ఎన్సీపీలు బీజేపీలాగా కాదని, వ్యవస్థలను గౌరవిస్తాయని చెప్పారు. బాల్ ధాకరే జన్మదినోత్సవం రోజునే శివసేన ఆవిర్భవించింది. దీంతో పార్టీ, పార్టీ వ్యవస్థాపకుడి జన్మదిన వేడుకలను కలిపిజరుపుతారు. పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయాలని శివసైనికులకు ఉద్దవ్ పిలుపునిచ్చారు. ఇటీవలే ఉద్దవ్ వెనుముక సర్జరీ చేయించుకున్నారు. తన ఆరోగ్యంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. -
మహారాష్ట్ర సీఎం భార్యపై అభ్యంతరకర పోస్టు..
పుణె: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రశ్మీ ఠాక్రేను బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిగా పేర్కొంటూ ట్వీట్ చేసిన బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి జితేన్ గజారియాపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. రశ్మీ ఠాక్రే ఫొటోపై మరాఠీ రబ్రీదేవిగా పేర్కొంటూ గజారియా పెట్టిన వివాదాస్పద పోస్టుపై శివసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో, ముంబై పోలీసులు గురువారం గజారియాను సుమారు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనుద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నారాయణ్ రాణె మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేనెవరికీ భయపడను. నా వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదు. దేశానికి స్వాతంత్యం ఏ సంవత్సరంలో వచ్చిందో కూడా గుర్తుపెట్టుకోలేని ఒక ముఖ్యమంత్రిపై నేను చేసిన వ్యాఖ్యలు.. నాలోని ఆగ్రహానికి అక్షరరూపాలు. నేనేమన్నానో మీడియా మిత్రులకూ తెలుసు. చదవండి: చిన్న పార్టీల జోరు..అధిక సీట్ల కోసం బేరసారాలు అదెలా నేరమవుతుంది?. నిజానికి ఠాక్రే.. కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఇంతకంటే దారుణమైన మాటలతో విమర్శించారు. అమిత్ షాను ‘సిగ్గులేని వాడు’ అని, సీఎం యోగిని చెప్పులతో కొట్టాలని ఠాక్రే గతంలో దుర్భాషలాడారు’’ అని రాణె విమర్శించారు. శివసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయాలని చూసే వారి దవడలు పగలగొట్టాలని పార్టీ కార్యకర్తలకు ఠాక్రే గతంలో ఆదేశించారని రాణె గుర్తుచేశారు. నాసిక్ కేసులో అరెస్ట్ చేయబోం నాసిక్‌లో నమోదైన ‘రాణె వ్యాఖ్యల’ కేసులో ఆయనపై సెప్టెంబర్ 17తేదీ వరకు అరెస్ట్ లాంటి ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోబోమని బాంబే హైకోర్టుకు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేసుల నుంచి రక్షణ కల్పించాలంటూ రాణె పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమిత్ దేశాయ్ హాజరయ్యారు. కాగా, అరెస్ట్ సమర్థనీయమేనని మంగళవారం రాత్రి బెయిల్ సందర్భంగా మహాడ్ కోర్టు జడ్జి ఎస్ఎస్ పాటిల్ వ్యాఖ్యానించారు. కాగా, విచారణ నిమిత్తం సెప్టెంబర్ రెండున తమ ముందు హాజరవ్వాలని రాణెను నాసిక్ పోలీసులు నోటీసులు జారీచేశారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్ -
సీఎం హెచ్చరిక.. మరోసారి లాక్డౌన్ దిశగా..?
ముంబై: ‘మాస్క్ పెట్టుకోండి. భౌతికదూరం పాటించండి. పెళ్లిళ్లు వంటి వేడుకల్లో ప్రభుత్వం విధించిన అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించండి లేదంటే మరోసారి లాక్‌డౌన్‌కి సిద్ధం కండి’ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబై వాసులకి చేసిన హెచ్చరిక ఇది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ నెమ్మది నెమ్మదిగా సాధారణ జన జీవనం నెలకొంటూ ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు ఇంకా భయపెడుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉందని శివసేన పార్టీ పత్రిక సామ్నా తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జనవరి తర్వాత గత వారంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంతో పోల్చి చూస్తే రెండో వారంలో 14శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ముంబై, పుణే నుంచి అత్యధికంగా వస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నాగపూర్, థానె, అమరావతి పట్టణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితికి ఇంకా రెడ్ సిగ్నల్ పడకపోయినా, ఎల్లో వార్నింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ప్రమాద ఘంటికలు మోగడానికి ఎంతో సేపు పట్టదు అని రాష్ట్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి వ్యాఖ్యానించారు. మరోవైపు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఠాక్రే లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌనే శరణ్యమని హెచ్చరించారు. కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే.. ► కరోనా కట్టడికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం వంటివేవీ ప్రజలు చేయడం లేదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న 15 లక్షల మందికి జరిమానాలు వేయడంతో రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ వెల్లడించారు. ► ముంబైలో స్థానిక రైళ్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆంక్షల మధ్య తిరుగుతున్నాయి. మొదటి పదిహేను రోజుల్లోనే ఏకంగా 3 వేల మంది ప్రయాణికులు మాస్కులు లేకుండా తిరగడంతో జరిమానాలు విధించారు. గత వారంలో ముంబైలో రోజుకి సగటున వెయ్యి వరకు కేసులు పెరుగుతున్నాయి. ► ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలు కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమని భావిస్తున్నారు. విదర్భ, మరఠ్వాడా వంటి ప్రాంతాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అదే ప్రాంతంలోని అమరావతి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల రేటు 33శాతం పెరిగిందని రాష్ట్ర కోవిడ్ బృందం అధికారి డాక్టర్ ప్రదీప్ అవాతే చెప్పారు. కేవలం 199 మంది మాత్రమే ఉన్న ససుర్వె గ్రామంలో పంచాయతీ ఎన్నికల తర్వాత 62 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ► గత ఏడాదంతా కోవిడ్ కారణంగా వివాహాలు, ఇతర కుటుంబ వేడుకల్ని వాయిదా వేసిన ప్రజలు కొత్త ఏడాదిలో కరోనా కేసులు కాస్త తగ్గడంతో పెద్ద ఎత్తున ఫంక్షన్లు నిర్వహించడం, సమూహాల్లో తిరగడం కేసుల్ని పెంచి పోషించాయి. కరోనా ఆంక్షలివే ► పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు 50 మందికి మించి అతిథుల్ని ఆహ్వానించకూడదు ► నిరసన ప్రదర్శనలు, ర్యాలీలపై తాత్కాలిక నిషేధం ► ఒక భవనంలో ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదైతే రాకపోకలు పూర్తిగా నిషేధిస్తారు ► మాస్కులు పెట్టుకోకపోయినా, భౌతికదూరం పాటించకపోయినా భారీగా జరిమానాలు -
ఉద్యోగమివ్వండి.. లేదా పెళ్లయినా చేయండి
సాక్షి, ముంబై: నాకు ఉద్యోగమైనా ఇవ్వండి లేదంటే పిల్లను చూసి పెళ్లైనా చేయండంటూ... మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఓ యువకుడు రాసిన లేఖ సోషల్ మీడియాల్ హల్చల్ చేస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో అనేక మంది ఉపాధి కోల్పోవడంతోపాటు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి నేపథ్యంలో అనేక మంది అనేక రకాలుగా ప్రభుత్వాన్ని మద్దతు కోరుతూ లేఖలు రాస్తున్నారు. ఇలాంటి లేఖలలో వాషీం జిల్లాకు చెందిన గజానన్ రాథోడ్ అనే యువకుడు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో ముఖ్యంగా ‘నా వయసు 35 ఏళ్లు. ఇంత వరకు నాకు పెళ్లి కాలేదు. దీనికి కారణం నాకు ఇంకా ఉద్యోగం లభించకపోవడమే. ఇప్పటి వరకు నేను ఏడు సార్లు ఉద్యోగం కోసం ప్రిపేరై పరీక్షలు రాశాను, కాని చాలా తక్కువ మార్కులతో ఉద్యోగం దక్కలేదు. అయితే పెళ్లి కోసం పిల్లను చూసేందుకు వెళ్లినప్పుడు ఉద్యోగం ఉండాలన్న షరతు విధిస్తున్నారు. ఇలాంటి సమయంలో మీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడంలేదు. దీంతో ఉద్యోగంతోపాటు పెళ్లి కోసం పిల్ల లభించడం కూడా కష్టసాధ్యమైంది. ఇలాంటి సమయంలో నాకు అయితే జాబ్ ఇవ్వండి లేదంటే పిల్లను చూసి పెళ్లయినా చేయండం’టూ రాశాడు. గజానన్ రాథోడ్ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో కూడా ఇలాంటి అనేక లేఖలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ముఖ్యంగా బీడ్ జిల్లాలోని ఓ యువకుడు తనను ఒక రోజు ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ.. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారికి లేఖ రాశాడు. తనను ముఖ్యమంత్రిని చేస్తే మరాఠ్వాడాలోని సమస్యలన్నింటినీ పరిష్కస్తానని చెప్పుకొచ్చాడు. అదేవిధంగా ఆ యువకుడు తన స్వగ్రామం నుంచి ముంబైలో కోర్కెలు తీర్చేదైవంగా ప్రసిద్ధిగాంచిన లాల్‌భాగ్ రాజా వినాయకుని ఆలయం వరకు కాలినడకన వెళ్లి, పూజలు చేశాడు. ఇలా ఆ సమయంలో అతని చర్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. చదవండి: శిష్యురాలికి ట్రైనింగ్.. ఆ వ్యక్తి చనిపోయాడని.. గోడ లోపల ప్రియురాలి కుళ్లిన శవం -
అర్నబ్‌కు దక్కని ఊరట
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్‌కు బెయిల్ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్‌కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్‌కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్‌ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. -
లాక్డౌన్ ఒకేసారి ఎత్తేయడం సరికాదు: ఉద్ధవ్
ముంబై: లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేయడం సరి కాదనీ, దీని వల్ల రెండింతల నష్టం సంభవించవచ్చని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. రానున్న వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పెండింగ్ లోఉన్న జీఎస్టీ సొమ్ము రాష్ట్రప్రభుత్వానికి ఇంకా రాలేదని అన్నారు. వలస కార్మికుల తరలింపు కోసం పెట్టిన టికెట్ల ఖర్చులో కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా రాలేదన్నారు. మందుల కొరత కూడా ఉందన్నారు. -
విధాన మండలికి ఉద్ధవ్ ఠాక్రే ఏకగ్రీవం!
సాక్షి ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మహారాష్ట్ర విధాన మండలి (ఎంఎల్సీ)కి నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది స్థానాల కోసం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి అయిదుగురు, బీజేపీకి చెందిన నలుగురు ఇలా మొత్తంగా తొమ్మిది మంది బరిలో నిలిచారు. దీంతో విధాన మండలి ఎన్నికలు దాదాపు ఏకగ్రీవమ య్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు మే 27వ తేదీ లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం అనివార్యంగా ఉన్న సంగతి తెలిసిందే. తొలిసారిగా ఉద్ధవ్ తన నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన తన ఆస్తుల వివరాలు వెల్లడించాల్సి వచ్చింది. తనకు రూ. 143 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్లో తెలిపారు. -
3 తర్వాత లాక్డౌన్ సడలింపు పక్కా..
ముంబై: లాక్డౌన్ ఉపసంహరణపై సహనంతో జాగత్తగా వ్యవహరిస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. ఈ నెల 3 తర్వాత కచ్చితంగా లాక్డౌన్ సడలింపులు ఉంటాయని ఆయన వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించిన తర్వాత సడలింపులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. (ప్రత్యేక రైళ్లు వేయండి: మోదీ) ‘మే 3 తర్వాత కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో పరిస్థితులను అంచనా వేసిన తర్వాత కచ్చితంగా లాక్‌డౌన్‌ను సడలిస్తాం. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇప్పటివరకు మనం సాధించిందంతా వృథా అవుతుంది. కాబట్టి సంయమనంతో అప్రమత్తంగా వ్యవహరిస్తాం. కోవిడ్-19 గురించి అతిగా భయపడొద్దని ప్రజలను కోరుతున్నాను. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా కరోనా బారి నుంచి బయటపడొచ్చు. వైరస్ సోకిన కొన్ని రోజుల పసికందు నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇంటికి వెళ్లారు. వెంటిలేటర్‌పై ఉన్నవాళ్లు కూడా కోలుకున్నార’ని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు ఈనెల 3న ముగియనుంది. గడువు ఇంకా పొడిగిస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా బాధితులు ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం మహారాష్ట్రలో 10,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 459 మరణాలు సంభవించాయి. (కరోనా విపత్తు: భారీ ఉపశమనం) -
నేడే ‘మహా’ మంత్రివర్గ విస్తరణ!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తొలి మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. శివసేన చీఫ్ ఉద్ధవ్ సీఎంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరు చొప్పున మంత్రులుగా నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా, డిసెంబర్ 30న ఉద్ధవ్ మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని ఒక వార్తా చానెల్ వెల్లడించింది. ఆ చానెల్ ప్రకారం.. శివసేన నుంచి 13 మందిని, ఎన్సీపీ నుంచి 13 మందిని, కాంగ్రెస్‌కు చెందిన 10 మందిని మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు. శివసేన, ఎన్సీపీలకు 10 కేబినెట్, 3 సహాయ మంత్రి పదవులు ..కాంగ్రెస్ నుంచి 8 మంది కేబినెట్, ఇద్దరు సహాయ మంత్రులు కానున్నారు. అయితే, ఉద్ధవ్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుందనే విషయంపై స్పష్టత రాలేదు. ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. -
హిందుత్వని విడిచిపెట్టను
ముంబై: హిందుత్వ ఎజెండాను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఆదివారం ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరుని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సభనుద్దేశించి మాట్లాడారు. ‘‘హిందుత్వ భావజాలాన్ని నేను విడిచిపెట్టలేను. నా నుంచి ఎవరూ దానిని దూరం చేయలేరు‘‘అని వ్యాఖ్యానించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమంలో లౌకికవాదాన్ని అమలు చేస్తామని ప్రకటించిన రెండు, మూడు రోజుల్లోనే ఠాక్రే అసెంబ్లీ సాక్షిగా హిందూత్వపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘హిందు త్వని నిన్న అనుసరించాను. ఇవాళ అనుసరిస్తున్నాను. రేపు కూడా అనుసరిస్తాను’అని చెప్పారు. అర్ధరాత్రి ఏమీ చెయ్యను ఫడ్నవీస్‌పై కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఠాక్రే ప్రసంగం సాగింది. ఎన్నికలకు ముందు ఫడ్నవీస్ మళ్లీ నేనే వస్తా అన్న నినాదాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ‘నేను ఎప్పుడూ మళ్లీ వస్తానని చెప్పలేదు. కానీ ఈ సభకు వచ్చాను. మహారాష్ట్ర ప్రజలకి, ఈ సభకి నేను ఒక హామీ ఇస్తున్నాను. రాత్రికి రాత్రి ఏమీ చెయ్యను’ అంటూ ఫడ్నవీస్‌పై సెటైర్లు వేశారు. బీజేపీ–శివసేన మధ్య చీలికలు తేవడానికి ఫడ్నవీస్ ప్రయత్నించి ఉండకపోతే, తాను సీఎంగా గద్దెనెక్కేవాడిని కాదని వ్యాఖ్యానించారు. ఫడ్నవీస్ 25 ఏళ్లుగా తనకు మంచి మిత్రుడని, ఎప్పటికీ స్నేహితుడిగానే ఉంటారని చెప్పారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు. స్పీకర్‌గా రైతు బిడ్డ మహారాష్ట్ర అసెంబ్లీలో అనూహ్యంగా బీజేపీ స్పీకర్ రేసు నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలె ఏకగ్రీవంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. బీజేపీ తమ పార్టీ అభ్యర్థి కిసాన్ కఠోర్ అభ్యర్థిత్వాన్ని వెనక్కి తీసుకోవడంతో పటోలె స్పీకర్‌గా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్ దిలీప్ వాల్సె పాటిల్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మరికొందరు సీనియర్ ఎమ్మెల్యేలు పటోలెను సాదరంగా తోడ్కొని వచ్చి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. ఒకప్పుడు రైతు నాయకుడిగా పటోలె విశిష్టమైన సేవలు అందించారు. రైతు గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి స్పీకర్ పదవిని అందుకోవడం హర్షణీయమని ఠాక్రే వ్యాఖ్యానించారు. స్పీకర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న సంప్రదాయాన్ని కొనసాగించడానికే రేసు నుంచి తప్పుకున్నట్టు బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. నానా పటోలె 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. కానీ ప్రధాని మోదీ, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో విభేదాల కారణంగా 2017లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. విదర్భ ప్రాంతంలోని సకోలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పటోలె ఇటీవల ఎన్నికయ్యారు. -
దేవేంద్రజాలం..!
అది 1976 సంవత్సరం. ఎమర్జెన్సీ చీకటి రోజులు. అదే సమయంలో నాగపూర్‌లో ఒక ఆరేళ్ల అబ్బాయి ఇందిరా కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నాడు. ఆ అబ్బాయి తండ్రి జన్‌సంఘ్ కార్యకర్త గంగాధర్ రావు. అత్యవసర పరిస్థితిపై గళం విప్పినందుకు ఆయనని పోలీసులు బలవంతంగా కటకటాల్లోకి తోసేశారు. కళ్లెదుటే కన్నతండ్రి జైలుకి వెళ్లడంతో ఆరేళ్ల పిల్లాడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇందిర అన్న పేరుతో ఉన్న స్కూల్లో చదువుకోనని పట్టుపట్టాడు. వాళ్లమ్మ సరిత ఎంత నచ్చచెప్పినా వినలేదు. చివరికి ఆమె తన కొడుకుని సరస్వతి విద్యాలయకి మార్చింది. ఆ పిల్లాడు ఎవరో కాదు. ఇప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర గంగాధరరావు ఫడ్నవీస్. ఆరేళ్ల వయసులోనే సొంత నిర్ణయాలు తీసుకున్న ఫడ్నవీస్ స్వశక్తితోనే ఈ స్థాయికి ఎదిగారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రుల్లో పూర్తికాలం పదవిలో ఉన్న రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆయనకంటే ముందు వసంతరావు నాయక్ 11 ఏళ్ల పాటు సీఎంగా సేవలందించారు. ఫడ్నవీస్ స్వేచ్ఛా గీతిక మహారాష్ట్ర రాజకీయాల్లో మరాఠాల ఆధిపత్యమే ఎక్కువ. ఇప్పటివరకు మొత్తం 18 మంది ముఖ్యమంత్రులు పదవుల్ని చేపడితే వారిలో 11 మంది మరాఠీయులే. కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఏరికోరి అత్యంత విశ్వాసంతో బ్రాహ్మణుడైన దేవేంద్ర ఫడ్నవీస్‌పై సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. వారిద్దరూ తనపై ఉంచిన నమ్మకాన్ని ఈ అయిదేళ్లలో ఫడ్నవీస్ వమ్ము చేయలేదు. మహారాష్ట్ర ఆరు దశాబ్దాల చరిత్రలో పూర్తి స్వేచ్ఛ స్వాతంత్య్రాలతో పాలించిన సీఎం ఫడ్నవీస్ తప్ప మరొకరు మనకి కనిపించరు. కాంగ్రెస్, ఎన్సీపీ పాలనలో ముఖ్యమంత్రులు ప్రతీ చిన్న పనికి ఢిల్లీ పరుగులు పెట్టేవారు. ఇక శివసేన ముఖ్యమంత్రిని అప్పట్లో ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే రిమోట్ కంట్రోల్‌తో నడిపేవారు. స్వయంనిర్ణయాలు తీసుకునే ఫడ్నవీస్ గత అయిదేళ్లలోనే రాష్ట్రంలో చాలా మార్పులు తీసుకువచ్చారు. ప్రధాన పట్టణాలను కలుపుతూ 10 వేల కి.మీ. రోడ్లు వేయించారు. 18 వేల గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఏడు లక్షల ఇళ్లు కట్టించారు. మరో 10 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎన్నో నీటి పారుదల పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ అయిదేళ్ల కాలంలో మరాఠాలకు 16శాతం రిజర్వేషన్లపై కోర్టుల జోక్యంతో చట్టం తీసుకురావడంలో విఫలమైనా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫడ్నవీస్‌కు అదృష్టం కలిసివచ్చింది. ఈ ఏడాది జూన్‌లో బోంబే హైకోర్టు మరాఠాలకు విద్యా సంస్థల్లో 12 శాతం, ప్రభుత్వ ఉద్యోగాల్లో 13 శాతం రిజర్వేషన్లకు అనుమతినిచ్చింది. రైతు సమస్యల్లో విఫలం అన్ని రంగాల అభివృద్ధికి శక్తి వంచనలేకుండా కృషి చేసిన ఫడ్నవీస్ సర్కార్ రైతు సమస్యల పరిష్కారంలో విఫలమైంది. రైతు ఆత్మహత్యల్ని నివారించలేకపోయింది. బీజేపీ సర్కార్ ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీ అమలు క్షేత్రస్థాయిలో సరిగా జరగలేదు. వేలాది మంది రైతులు మాఫీపై ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే 808 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడమే దీనికి నిదర్శనం. ఛత్రపతి శివాజీ మహరాజ్ కృషి సమ్మాన్ యోజన పథకం కింద 34 వేల కోట్లకు పైగా మాఫీ చేస్తామన్న హామీలో 23 వేల కోట్లకు పైగా రుణాల్ని మాఫీ చేసినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. కానీ కాంగ్రెస్, ఎన్సీపీ మాత్రం అవన్నీ దొంగ లెక్కలని తిట్టిపోస్తున్నాయి. జితేంద్ర ఘాడ్గే అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ కింద తెలుసుకున్న సమాచారం ప్రకారం 2015 నుంచి 2018 మధ్య కాలంలో 6 వేల కోట్ల నుంచి 12 వేల కోట్ల వరకు మాత్రమే రుణ మాఫీ అమలు జరిగినట్టు వెల్లడైంది. బీజేపీలో వన్ మ్యాన్ షో ఎన్నికలకు ముందు శివసేనతో కలిసి కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి దాదాపుగా 40 మందికి పైగా కీలక నేతల్ని తమ వైపు వచ్చేలా గాలం వేశారు. 20 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలనూ తమ గూటికి లాగారు. ఎన్నికల్లో ఫడ్నవీస్ ఎవరి పేరు చెబితే వారికే అధిష్టానం టిక్కెట్లు ఇచ్చింది. ఇక ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్ షాలు కశ్మీర్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ జాతీయ భావాన్ని ప్రజల్లో రగిల్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఫడ్నవీస్ శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్ వంటి వారిని టార్గెట్ చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. షోలేలో అస్రాని పోషించిన జైలర్ పాత్రతో పవార్‌ని పోలుస్తూ ఇప్పుడు పవార్‌కి పవర్ లేదని ఆయన వెనుక ఒక్కరు కూడా లేరంటూ తిట్టిపోస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారం రాజకీయంగా ముందుకు అడుగులు వేస్తున్న ఫడ్నవీస్ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 24న విడుదయ్యే ఫలితాలతో వరసగా రెండోసారి గద్దెనెక్కే అవకాశాలే సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. టీఎన్ రఘునాథ, సీనియర్ జర్నలిస్టు, ముంబై -
21వ శతాబ్దపు నగరాలు నిర్మిద్దాం
ముంబై/ఔరంగాబాద్: 21వ శతాబ్దపు ప్రపంచానికి తగ్గట్లు మన నగరాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో భారతీయ నగరాల్లో భద్రత, అనుసంధానత, ఉత్పాదకత విషయంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేందుకు వీలుగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. దేశ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి రూ.100 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని ఆయన ప్రకటించారు. లేదంటే రాబోయే ఐదేళ్లలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం పగటి కలలాగే మిగిలిపోతుందని హెచ్చరించారు. ఒకరోజు పర్యటనలో భాగంగా శనివారం మహారాష్ట్రకు చేరుకున్న ప్రధాని మోదీ, ముంబైలో రూ.19,080 కోట్ల విలువైన మూడు మెట్రోలైన్ పనులతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సమగ్రాభివృద్ధిపై దృష్టి.. ‘గత ఐదేళ్లకాలంలో ముంబై నగరంలో మౌలిక ప్రాజెక్టులపై మేం రూ.1.5 లక్షల కోట్లను వెచ్చించాం. కేవలం ముంబైనే కాకుండా దేశంలోని అన్ని నగరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం మనం సొంతంగా మెట్రో రైలు కోచ్‌లను రూపొందిస్తున్నాం. మౌలికవసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా భారీగా ఉపాధి కల్పన జరుగుతోంది. చిన్న పట్టణాల్లో చేపట్టిన మెట్రో ప్రాజెక్టుల కారణంగా ఎక్కువమందికి జీవనోపాధి దొరుకుతోంది. గతంలో ఇంతవేగంగా ప్రాజెక్టు నిర్మాణం ఎన్నడూ జరగలేదు కాబట్టి ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదు’ అని మోదీ వెల్లడించారు. ముంబై మెట్రో కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏటా 2.5 కోట్ల టన్నులమేర తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ‘ఒకేదేశం–ఒకే కార్డు’ వ్యవస్థ కోసం ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సందర్భంగా బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థ తయారుచేసిన 500 మెట్రో కోచ్‌లను ప్రధాని ఆవిష్కరించారు. గణేశ్ ఆలయంలో పూజలు అంతకుముందు ముంబై విమానాశ్రయం నుంచి నేరుగా విలే పార్లేలోని గణేశ్ ఆలయానికి చేరుకున్న మోదీ, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం లోక్మాన్య సేవాసంఘ్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య తిలక్‌కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లో మహిళా స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)ను ఉద్దేశించి మాట్లాడుతూ..‘‘దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీఇంటికి తాగునీరు అందించేందుకు ‘జల్ జీవన్ మిషన్’ కింద రాబోయే 5 సంవత్సరాల్లో రూ.3.5 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నాం. మహిళలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలన్న రామ్మనోహర్ లోహియా కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. ముద్రా పథకం కింద ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రూ.లక్ష చొప్పున రుణాలు ఇస్తున్నాం’’ అని మోదీ తెలిపారు. ముద్రా పథకం కింద ఇప్పటివరకూ 14 కోట్ల మంది మహిళలు లబ్ధిపొందారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ పట్టణం, 10,000 ఎకరాల్లో విస్తరించిన ఔరంగాబాద్ ఇండస్ట్రియల్ సిటీని మోదీ ఆవిష్కరించారు. -
ముఖ్యమంత్రి మన అల్లుడే..!
సాక్షి, భైంసా(ముథోల్): ఏ ఎన్నికలు వచ్చినా కుభీర్ మండలంలోని పల్సి గ్రామస్తులకు మహారాష్ట్ర మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే, ఆయన సతీమణి వైశాలి పుట్టి పెరిగింది ఈ గ్రామంలోనే! ఈమె ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మొట్టమొదటి చైర్మన్ పల్సికర్ రంగారావు కూతురు. దీంతో ఎన్నికలు వచ్చిన ప్రతీసారి మా ఊరి అల్లుడే మహారాష్ట్ర సీఎంగా, కేంద్ర మంత్రిగా పని చేశారని ఇక్కడి వారు గర్వంగా చెప్పుకుంటారు. ఆయన పిళ్లుబాయి అల్లుడు.. పల్సికర్ రంగారావుకు ఇద్దరు భార్యలు మొదటి భార్య పుష్పకు ఒక కుమార్తె కాగా, రెండో భార్య పిళ్లుబాయికి ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పిళ్లుబాయి మొదటి కూతురు వైశాలిని విలాస్‌రావ్ దేశ్ముఖ్తో వివాహం జరిపించారు. వైశాలి–విలాస్‌రావ్ దంపతుల కొడుకు రితేష్ దేఖ్‌ముఖ్. బాలీవుడ్ హీరోగా రాణిస్తున్న రితేష్ తెలుగు సినిమా ప్రియులకు సుపరిచితమైన హీరోయిన్ జెనీలియాను వివాహం చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మొదటి చైర్మన్‌గా పని చేసిన రంగారావుకు ఊరిపేరే ఇంటి పేరుగా మారింది. అప్పట్లో ఈ ప్రాంతమంతా మహారాష్ట్రలో ఉండేది. పెద్ద భూస్వామి అయిన రంగారావును మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లావాసులు రంగారావు పల్సికర్ అని పిలుస్తుండేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాక ముథోల్ ప్రాంతాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలిపేశారు. రంగారావు అనారోగ్యంతో మృతి చెందినప్పుడు ఆయన అంత్యక్రియలు ఇక్కడే స్వగ్రామంలో చేశారు. నాడు సీఎంగా ఉన్న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తన మామ పెద్ద కర్మ నిర్వహించిన 12వ రోజు పల్సికి వచ్చారు. రంగారావు మరణానంతరం ఈ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరకాలం ఉండిపోయేలా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ భైంసా మండలంలోని వాడి గ్రామం దగ్గర సుద్దవాగుపై నిర్మించే మినీ ప్రాజెక్టుకు పల్సికర్ రంగారావు ప్రాజెక్టుగా నామకరణం చేశారు. పెళ్లిళ్లకు ప్రత్యేక ఆహ్వానం.. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పల్సి గ్రామ ప్రజలకు, మాజీ మంత్రి దివంగత గడ్డెన్న కుటుంబీకులకు, మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ కుటుంబీకులకు, డీసీసీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ కుటుంబీకులకు ఆహ్వాన పత్రికలు వచ్చేవి. ఫిబ్రవరి–3, 2012న బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్, హీరోయిన్ జెనీలియాల వివాహానికి కూడా పల్సి వాసులు ముంబయి సైతం వెళ్లారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ భార్య వైశాలి పెరిగిన ఇళ్లు ఇప్పటికీ పల్సిలో ఉంది. రంగారావు కుటుంబీకులంతా మహారాష్ట్రకు వెళ్లిపోయినా ఇంటిని మాత్రం భద్రంగా ఉంచుతున్నారు. గత ఏడాది మరమ్మతులు కూడా చేశారు. చుట్టూ గోడను రాతి బండతో నిర్మించారు. లోపల పెద్ద కోటను పోలిన కట్టడాలున్నాయి. కోట లోపల పచ్చని చెట్లను పెంచారు. రెండో అంతస్తును కట్టెతో అందంగా చెక్కారు. విలాస్‌రావ్ రాజకీయ ప్రస్థానం.. 1974లో బాబుల్‌గాం సర్పంచ్‌గా మొదలైన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు ఆయనను వరించాయి. 1976లో లాథూర్ తాలుకా పంచాయతీ సమితి అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేశారు. 1980, 85, 90ల్లో ఎమ్మెల్యేగా ఎన్నికై రెవెన్యూ, కోఆపరేటివ్, అగ్రికల్చరర్, హోం, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ మంత్రిగా, రెండుసార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. 2004లో మహారాష్ట్ర సీఎంగా రెండోసారి ఎన్నికైన ఆయన 2008 నవంబర్ 26న ముంబాయి పేలుళ్లకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం రాజ్యసభకు ఎన్నికై డిసెంబర్ 2011లో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. అనారోగ్యంతో 14 ఆగష్టు 2012న విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మృతిచెందారు. -
ప్రధాని పదవిపై మహారాష్ట్ర సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
తప్పైతే క్షమించండి : సీఎం భార్య
ముంబై : సెల్ఫీ కోసం రూల్స్ బ్రేక్ చేసిన మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ ఎట్టకేలకు క్షమాపణలు కోరారు. భారత్ తొలి దేశియ క్రూయిజ్ ఆంగ్రియా ప్రారంభం సందర్భంగా ఆమె భద్రతా వలయాన్ని దాటి సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై సర్వతా విమర్శలు రావడంతో క్షమాపణలు కోరారు. ‘ ఎవరైనా నేను చేసింది తప్పుని భావిస్తే దానికి నేను క్షమాపణలు చెబుతున్నా. నేను యువతకు చెప్పేది ఒకటే.. సెల్ఫీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.’ అని ఓ మరాఠీ ఛానల్‌కు తెలిపారు. అయితే తాను సెల్ఫీ దిగిన ప్రాంతం అంతప్రమాదకరమైనదేం కాదని తన చర్యను సమర్ధించుకున్నారు. గత శనివారం భారత్ తొలి దేశియ క్రూయిజ్ ఆంగ్రియాలో ప్రయాణించిన ఆమె పర్ఫెక్ట్ సెల్ఫీ కోసం రక్షణ గోడ దాటారు. భద్రతా సిబ్బంది ఎంత వారించిన ఆమె పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేయడంతో ఈ ఘటనపై సర్వత్రా విమర్శలొచ్చాయి. క్రూయిజ్ టూరిజాన్ని వృద్ధి చేయడంలో భాగంగా ఈ షిప్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి: సెల్ఫీ కోసం సీఎం భార్య రూల్స్ బ్రేక్ -
సెల్ఫీ కోసం సీఎం భార్య రూల్స్ బ్రేక్
ముంబై : సెల్ఫీ.. ప్రస్తుతం అందరికి ఓ ఫ్యాషన్‌గా మారింది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఒక్క క్లిక్కుమనిపించి వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అందరికి ఓ అలవాటైంది. మితిమీరిన ఈ ఫ్యాషన్‌తో కొంతమంది ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ఈ ట్రెండ్ సెలబ్రిటీలకు మినహాయింపు కాదు. ఇలానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత సైతం సెల్ఫీ కోసం రూల్స్ బ్రేక్ చేశారు. భారత్ తొలి దేశియ ప్రయాణీకుల నౌక ఆంగ్రియాలో ప్రయాణించిన ఆమె పర్ఫెక్ట్ సెల్ఫీ కోసం రక్షణ గోడ దాటారు. భద్రతా సిబ్బంది ఎంత వారించిన ఆమె పట్టించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు సరదాగా కామెంట్ చేస్తుంటే మరికొందరు ఆమె చర్యను తప్పుబడుతున్నారు. క్రూయిజ్ టూరిజాన్ని వృద్ధి చేయడంలో భాగంగా శనివారం ఈ షిప్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. #WATCH: Amruta Fadnavis, wife of Maharashtra CM Devendra Fadnavis, being cautioned by security personnel onboard India's first domestic cruise Angria. She had crossed the safety range of the cruise ship. pic.twitter.com/YYc47gLkHd — ANI (@ANI) October 21, 2018 -
సీఎం భార్యకు చేదు అనుభవం
ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు ఓ చేదు అనుభవం ఎదురైంది. శనివారం షోలాపూర్‌లో జరిగిన పతంజలి ఉత్పత్తుల ప్రచార కార్యక్రమానికి హజరైన అమృత ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు. పతంజలి ఉత్పత్తులకు ఎలాంటి మార్కెట్‌ను కల్పిస్తున్నారో స్వయం ఉపాధి మహిళా సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు కూడా అలాంటి మార్కెట్ సదుపాయాలనే కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో మహిళా కార్యకర్తలు వేదికకు వెలుపలకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కార్యక్రమం పూర్తయిన తర్వాత విడుదల చేశారు. ఈ ఘటనలో ఎవరి మీద కేసు నమోదు చేయలేదని పోలీసులు పేర్కోన్నారు. పతంజలి ఉత్పత్తులను ప్రజలు గుడ్డిగా నమ్ముతారని అమృత ఫడ్నవీస్ అన్నారు. పతంజలి ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని బాబా రాం దేవ్, దేశ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి, రాజ్యసభ ఎంపీ హేమమాలిని కూడా హజరయ్యారు. -
బీజేపీకి ఝలక్.. వద్దంటే వదిలేయండి!
సాక్షి, ముంబై : ‘సంకీర్ణ ప్రభుత్వంలో ఉంటారో వెళ్తారో తేల్చుకోండి’ అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విసిరిన సవాలుకు మిత్రపక్షం శివసేన ఘాటుగా బదులిచ్చింది. ‘మాతో పొత్తు వద్దనుకుంటే నిరభ్యంతరంగా వదిలేయండి’ అని సేన తన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పేర్కొంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోపే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ-సేన మైత్రికి తెరపడే అవకాశాలున్నట్లు ఊహాగానలు వినిపిస్తున్నాయి. వాటికి తగ్గట్లే నేతల విమర్శలు కూడా శృతిమించాయి. త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ? : గతవారం ఓ కార్యక్రమంలో సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతూ.. భాగస్వామిగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలపై ఎడతెగని విమర్శలు గుప్పించడం శివసేనకు తగదని, సంకీర్ణప్రభుత్వంలో ఉండాలో బయటికి వెళ్లాలో ఉద్దవ్ ఠాక్రే నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. అంతకుముందోసారి.. శీతాకాల సమావేశాల్లోపే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగొచ్చని సీఎం అన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన నారాయణ రాణేకు ఫడ్నవిస్ తన కేబినెట్లో చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. బీజేపీ మా సైద్ధాంతిక శత్రువు : సందర్భం చిక్కినప్పుడల్లా బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా సెటైర్లు వేస్తోన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. సోమవారం కూడా అదేపని చేశారు. శివసేనకు బీజేపీ సైద్ధాంతిక శత్రువని, కేవలం ప్రభుత్వం నడవటం కోసమే తాము మద్దతు ఇచ్చామని అన్నారు. అంతకుముందు ఆయన.. మోదీ ప్రభ తగ్గిపోయిందని, రాహుల్ గాంధీయే దేశాన్ని నడిపించగల నాయకుడని చేసిన వ్యాఖ్యలు సేన-బీజేపీల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. రౌత్‌కు కౌంటర్‌గా సీఎం ఫడ్నవిస్ సవాలు చేస్తే, ఇప్పుడు ఫడ్నవిస్‌కు సేన ఘాటు సమాధానమిచ్చింది. -
సీఎం హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు
ముంబై : లాతూర్ జిల్లా నిలంగా తాలూకాలో ఇటీవల జరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదం తరువాత తేరుకున్న హోం శాఖ ప్రముఖుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అందుకు విమానం, హెలికాప్టర్ల భద్రతపై త్వరలో ఒక నియమావళి రూపొందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునగంటివార్ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన నిమిషం వ్యవధిలోనే విద్యుత్ తీగకు తగులకుని క్రాష్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఫడ్నవీస్ పెను ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది. ఆ రోజు అసలేం జరిగింది..? తప్పు ఎక్కడ జరిగింది....? అనే వివిధ కోణాలలో విచారణ జరుగుతోంది. దీంతో హెలికాప్టర్లో బయలుదేరే ముందు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనేది కొత్త నియమావళి రూపొందించచనున్నట్లు మంత్రి మునగంటివార్ తెలిపారు. కొందరు ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు హెలికాప్టర్ టేకాఫ్ కాగానే ఒక్కసారిగా పెద్ద ఎత్తున దుమ్ము, దూలి గాలిలో పైకి లేచింది. దీంతో పైలట్‌కు ముందుకు వెళ్లేందుకు దారి కనిపించక ఏం చేయాలో తెలియెక, గందగోళానికి గురై ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ రోజు మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌పై నీళ్లు చల్లలేదు. కాగా హెలికాప్టర్ రెక్కల గాలికి దుమ్ము, దూళి గాలిలో ఎగరకుండా హెలీప్యాడ్‌ను తయారు చేయాల్సి ఉంటుంది. అంతేగాకుండా హెలిప్యాడ్‌కు వందమీటర్ల దూరంలో విద్యుత్ తీగలు గాని, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉండకూడదు. కాని ఆ రోజు ముఖ్యమంత్రి హెలికాప్టర్ కోసం తయారుచేసిన హెలిప్యాడ్‌కు కొద్ది దూరంలోనే విద్యుత్ తీగలున్నాయి. అంతేగాకుండా క్రాష్ ల్యాండ్ అయిన ప్రాంతానికి కూత వేట దూరంలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. అదృష్ట వశాత్తు దానిపై పడలేదు. లేని పక్షంలో ప్రాణ నష్టం జరిగేది. వీటన్నింటిని బట్టి కొన్ని నియమాలు పాటించలేదని ఈ ఘటన ద్వారా స్పష్టమైతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతోంది. త్వరలో వాస్తవాలు బయటపడతాయి. -
పెద్దాయనకు కోపం వచ్చింది!
మరాఠా పెద్దాయన శరద్ పవార్‌కు కోపం వచ్చింది. ఎన్నికల రాజకీయాల్లో తలపండిన కురువృద్ధుడైన ఈయన.. మొట్టమొదటిసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఇప్పటికి 50 ఏళ్లు దాటిపోయింది. అలాంటి పెద్దమనిషికి ఇప్పటి పరిణామాలు చూస్తే కోపం రాకుండా ఉంటుందా మరి. పుణెలోని ఎర్రవాడ ప్రాంతంలోగల మోఝే హైస్కూలు మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మాట్లాడారు. బీజేపీ, శివసేన రెండింటినీ ఆయన తిట్టిపోశారు. ఎక్కువగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఈ మధ్య కొత్తగా చేరుతున్నవాళ్ల అర్హతలు ఏంటా అని చూస్తే.. చాలామంది నేరచరితులేనని తెలుస్తోందని, ఒకళ్లపై 302, మరొకరిపై 376 సెక్షన్ల కింద కేసులుంటే మరికొందరు దోపిడీలు, హత్యాయత్నాల కేసులు ఉన్నవాళ్లని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కూడా స్వయంగా అలాంటి నేరస్థులకు సాదరస్వాగతం పలకడం చాలా దారుణమని పవార్ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనం కావడానికి ముఖ్యమంత్రే కారణమని, అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రాష్ట్రానికి హాని కలుగుతుందని చెప్పారు. దాదాపు గంట పాటు సాగిన ప్రసంగంలో మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన రెండింటిపైనా ఆయన దుమ్మెత్తిపోశారు. నేరస్థులను పార్టీలోకి తీసుకురావడానికి బాధ్యత బీజేపీదేనని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారని, మరోవైపు శివసేనలో అంతా దోచుకునేవాళ్లే ఉన్నారంటూ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అంటున్నారని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తప్ప వాళ్లకు మరేమీ రాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అదికారంలో ఉన్నప్పుడు తమ మధ్య విభేదాలున్నా తమలో తాము పరిష్కరించుకునేవాళ్లం తప్ప ఇలా రోడ్డున పడలేదని గుర్తుచేశారు. తమ పార్టీ వాళ్లు గత పదేళ్లుగా పుణె అభివృద్ధికి చాలా కష్టపడ్డారంటూ చివర్లో తెలిపారు. -
మెగాస్టార్‌తో సీఎం భార్య మ్యూజిక్ వీడియో!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ త్వరలోనే మ్యూజిక్ వీడియోతో ఆరంగేట్రం చేయబోతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె తొలిసారి మ్యూజిక్ వీడియోలో కనిపించబోతున్నారు. ‘ఫిర్ సే’ పేరిట రూపొందుతున్న ఈ మ్యూజిక్ వీడియోలో లలిత కళల ఇన్స్టిట్యూట్ అధిపతిగా అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ కోరుతూ అమృత వస్తుందని, వీరిద్దరి మధ్య సంభాషణతో ఈ మ్యూజిక్ వీడియో ప్రారంభమవుతుందని దీని డైరెక్టర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సీఎం సతీమణి అయిన అమృత గతంలో కునాల్ కోహ్లి ‘ఫిర్ సే’కు, ప్రకాశ్ ఝా తెరకెక్కించిన ‘.జై గంగాజల్’ సినిమాకు గాయనీగా నేపథ్యగానం చేశారు. దక్షిణ ముంబైలోని ఓపెరా హౌస్‌లో అమితాబ్, అమృత పాల్గొనగా.. ఈ వీడియో సాంగ్‌ను చిత్రీకరించామని దర్శకుడు అహ్మద్ ఖాన్ తెలిపారు. -
ముఖ్యమంత్రిగా ఆ పని చేయడం తప్పా!
'ముఖ్యమంత్రి బ్రోకర్లా మారారు.. పాకిస్థానీలకు వత్తాసు పలుకుతున్నారు' అని మిత్రపక్షం శివసేన చేస్తోన్న తీవ్ర ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల విషయంలో నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించే దిశగా సీఎం.. దర్శకనిర్మాతలకు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్)కు మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే సీఎంతో భేటీ తర్వాత రాజ్ ఠాక్రే 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' అని డిమాండ్ చెయ్యడంతో అందరితోపాటు ఫడ్నవిస్ కూడా ఖంగుతిన్నారట! తన అధికారిక నివాసం 'వర్ష'లో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం అసలేంజరిగిందో చెప్పుకొచ్చారు.. (సీఎం సమక్షంలో సినిమా వివాదానికి తెర!) 'నా ముందు రెండు దారులున్నాయి. ఒకటి.. ఆ సినిమా విడుదలయ్యే అన్ని థియేటర్ల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం. తద్వారా పండగ(దీపావళి)పూట పోలీసులు కుటుంబాలకు దైరంగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఆందోళనలు దారితప్పితే కొత్త సమస్యలు తలెత్తుతాయి. అందుకే నేను రెండో దారి.. అంటే చర్చలకు మొగ్గుచూపా. ఇరుపక్షాలను పిలిపించా. అక్కడ రాజ్ ఠాక్రే మూడు డిమాండ్లు మా ముందుంచారు. అందులో రెండింటికి(ఉడీ అమరజవాన్లకు నివాళులు అర్పించడం, భవిష్యత్ లో పాక్ నటులను తీసుకోకపోవడం) ఇరుపక్షాలు అంగీకరించాయి. ఇక మూడోదైన 'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి' డిమాండ్ ను మాత్రం నేను అక్కడికక్కడే ఖండించా. సైనిక సహాయనిధికి విరాళాలు డిమాండ్ చేయడం సరికాదని రాజ్ ఠాక్రేను వారించా' అని ఫడ్నవిస్ చెప్పారు. చర్చల ద్వారా మంచి ఫలితాన్ని రాబట్టిన తనను అభినందించాల్సిదిపోయి విమర్శలు గుప్పించడం అజ్ఞానమన్న సీఎం ఫడ్నవిస్.. కశ్మీర్ వేర్పాటువాదులతోనూ, తీవ్రవాదులతోనూ ప్రభుత్వాలు చర్చలు జరపడంలేదా?అని ప్రశ్నించారు. అమరజవాన్ల కుటుంబాలకు బాసటగా నిలవడంలో తప్పులేదని, అయితే అలా చేయాలని డిమాండ్ చేయడం మాత్రం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఎంఎన్ఎస్ పట్ల ప్రభుత్వానికి సాఫ్ట్ కార్నర్ ఉందన్న విమర్శలు అర్థంలేనివని అన్నారు. -
సీఎంపై సీనియర్ నటి మండిపాటు!
'యే దిల్ హై ముష్కిల్' (ఏడీహెచ్‌ఎం) సినిమా విడుదల విషయంలో ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే, చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీ కుదిర్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించినందుకు ఈ సినిమాపై ఎమ్మెన్నెస్ నిషేధం విధించింది. సీఎం సమక్షంలో జరిగిన చర్చల నేపథ్యంలో ఏడీహెచ్ఎంపై నిషేధం ఎత్తివేసేందుకు రాజ్ ఠాక్రే అంగీకరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాక్ నటులతో సినిమాలు తీయవద్దని, అలా సినిమాలు తీస్తే రూ. ఐదు కోట్లు భారత ఆర్మీ జవాన్ల సంక్షేమ నిధికి ఇవ్వాలని రాజ్ ఠాక్రే షరతులు పెట్టారు. అయితే, ఈ విషయంలో సీఎం స్థాయి వ్యక్తి రాజీయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఫడ్నవిస్ తీరును బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా తప్పుబట్టారు. 'ఎంత దారుణమైన పరిస్థితి ఇది! సీఎం బ్రోకరిజం చేసి రూ. 5 కోట్లకు దేశభక్తిని కొనుగోలు చేశారు. ఏడీహెచ్‌ఎం శాంతియుతంగా విడుదల అయ్యేలా చూస్తామని ఏకంగా కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చాక కూడా ఇలా జరిగింది’ అని షబానా వరుస ట్వీట్లలో మండిపడ్డారు. ’నేను దేశభక్తురాలినా? కాదా? అన్నది ఎమ్మెన్నెస్ నిర్ణయిస్తుందా? నేను రాజ్యాంగానికి బద్ధురాలిని కానీ, రాజ్ ఠాక్రేకు కాదు. నిజానికి ఆయన దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. 'యే దిల్ హై ముష్కిల్’ విడుదలకు కేంద్రహోంమంత్రి హామీ ఇచ్చినా ఆయనపై సీఎం ఫడ్నవిస్ ఏమాత్రం గౌరవం చూపలేదని, ఆయన నుంచి బీజేపీ వివరణ అడగాలని ఆమె డిమాండ్ చేశారు. -
సీఎం సమక్షంలో సినిమా వివాదానికి తెర!
ముంబై: రొమాంటిక్ సినిమా విషయంలో కొద్ది రోజులుగా కొనసాగిన సస్సెన్స్ థ్రిల్లర్ ఎట్టకేలకు ముగిసింది. సినిమా విడుదల కావాలంటే సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరి. కానీ ఓ సినిమా మాత్రం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వానిధేత, ఒక పార్టీ నేతల అనుమతితో విడుదలవుతోంది. భారతీయ సినిమా రంగంలో కీలక పరిణామంగా భావిస్తోన్న ఈ ఒప్పందానికి సీఎం అధికారిక నివాసం వేదికైంది. ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఉదయం జరిగిన కీలక భేటీలో.. కరణ్ జోహార్ దర్శకనిర్మాతగా రూపొందించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు అంగీకారం కుదిరింది. సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే, సినిమా విడుదల కోసం పాట్లు పడుతోన్న కరణ్ జోహార్ తోపాటు నిర్మాతల సంఘం అధ్యక్షుడు ముఖేష్ భట్ లు భేటీలో పాల్గొన్నారు. సినిమా ప్రారంభానికి ముందు ఉడీఉగ్రదాడిలో చనిపోయిన అమరజవాన్లకు నివాళులు అర్పిస్తూ ప్రకటన ఇవ్వడం, భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో పాకిస్థానీ నటీనటులను తీసుకోకపోవడం' అని రెండు డిమాండ్లకు దర్శకనిర్మాత తలొగ్గడంతో 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు లైన్ క్లియర్ అయింది. (రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..) సినిమా విడుదలను అడ్డుకోవద్దని, ఒకవేళ ఎవరైనా ఆ పనిచేస్తే తాటతీస్తామని సీఎం ఫడ్నవిస్ ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఎంఎన్ఎస్ ఒత్తిడి మేరకు ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు ఆ సినిమాను ప్రదర్శించేందుకు నిరాకరించారు. దీంతో చర్చలు అనివార్యం అయ్యాయి. డీల్ కుదిరిన పిమ్మట బయటికి వచ్చిన రాజ్ ఠాక్రే.. సినిమా విడుదలకు సహకరిస్తామని చెప్పారు. కరణ్ జోహార్ తరఫున ముఖేఖ్ భట్ మాట్లాడుతూ.. 'ఏ దిల్ హై ముష్కిల్ లో 300 మంది భారతీయులు పనిచేశారని, పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ ఆఫ్ట్రాల్ నాలుగు నిమిషాలు కనిపిస్తాడని, అయినాసరే సీఎంకు ఇచ్చిన రెండు హామీలను నిలబెట్టుకుంటామని చెప్పారు. (హీరోహీరోయిన్ల స్టన్నింగ్ ఫొటో) ఆందోళన మొదలైందిలా.. కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిచేయడం, 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకోవడం తెలసిందే. నాటి దాడిని ప్రపంచమంతా తీవ్రంగా ఖండించింది. బాలీవుడ్ ప్రముఖులు కూడా పాకిస్థాన్ తీరుపై భగ్గుమన్నారు. అయితే బాలీవుడ్ లో పనిచేస్తోన్న పాకిస్థానీ నటీనటులు మాత్రం ఉడీపై నోరు మెదపలేదు. దీంతో పాక్ యాక్టర్లను బహిష్కరించాలని ఎంఎన్ఎస్ ఆందోళనలు ప్రారంభించింది. స్థానబలం వల్ల క్రమంగా ఆ ఆందోళనలకు మద్దతు లభించింది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లోని నిర్మాతల మండళ్లు, ఎగ్జిబిటర్లు పాక్ నటులున్న సినిమాలను ప్రదర్శించబోమని తేల్చిచెప్పారు. అప్పటికే తాను తీసిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల తేదీని ప్రకటించిన కరణ్ జోహార్ కు ఎంఎన్ఎస్ నిర్ణయం శరాఘాతంలా మారింది. తనకు దేశం ముఖ్యమని, పరిస్థితులు మరోలా ఉన్నప్పుడు తీసిన సినిమాను ఇప్పుడు అడ్డుకోవడం తగదని కరణ్ జోహార్ పలు వేదికల నుంచి ఎంఎన్ఎస్ ను వేడుకున్నాడు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిసి సహాయాన్ని ఆర్థించాడు. చివరికి మహారాష్ట్ర సీఎం సమక్షంలో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, రణ్ బీర్ కపూర్, అనుష్క శర్మ, ఫవద్ ఖాన్ లు ప్రధాన తారగణం. 'బాద్ షా' షారూఖ్ ఖాన్ కూడా తళుక్కున మెరవనున్నారు. ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. యధావిథిగా దీపావళి కానుకగా అక్టోబర్ 28న 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జులై 15న కేసీఆర్, ఫడ్నవీస్ భేటీ
హైదరాబాద్: వచ్చే నెల 15న ముంబయిలో గోదావరి అంతర్రాష్ట్ర మండలి సమావేశం కానుంది. ఆ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మహారాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి, ఇరురాష్ట్రాల ఇరిగేషన్ కార్యదర్శులతో పాటు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, తుమ్మడిహట్టి, చనాఖా-కొరాటా బ్యారేజీల నిర్మాణం విషయమై తుది ఒప్పందం జరగనుంది. కాగా కొద్దిరోజుల క్రితం నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగింది. అనంతరం మహారాష్ట్ర సీఎంను ...హరీశ్ హైదరాబాద్ రావల్సిందిగా ఆహ్వానించారు. -
వచ్చే నెలలో తెలంగాణకు ఫడ్నవీస్
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చే నెలలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు. ఆయన ఈ సందర్భంగా ఫడ్నవీస్‌ను తెలంగాణ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. హరీశ్ ఆహ్వానానికి ఫడ్నవీస్ అంగీకారం తెలిపారు. దీంతో వచ్చే నెల రెండో వారంలో ఫడ్నవీస్ హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న హరీశ్ రావు నేరుగా ముంబై వెళ్లారు. అక్కడ నుంచి ఆయన హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం. -
సీఎంగారూ.. మంత్రిగారి పీఎస్ వేధించాడు
ముంబై: మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి దీపక్ సావంత్ వ్యక్తిగత కార్యదర్శి తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా డాక్టర్ ఆరోపించింది. జల్గావ్ జిల్లాకు వైద్యురాలు ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాసింది. గత మార్చిలో మంత్రి సావంత్‌ను కలిసేందుకు వెళ్లినపుడు ఆయన పీఎస్ సునీల్ మాలి తనను మరో ఛాంబర్లోకి తీసుకెళ్లి దాదాపు రెండుగంటల సేపు అనుచితమైన, వ్యక్తిగత సంబంధిత ప్రశ్నలు అడిగినట్టు వైద్యురాలు ఆరోపించింది. అతడిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరింది. ఈ ఘటన జరిగిన తర్వాత మూడు నెలల వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న మీడియా ప్రశ్నకు.. తనను బదిలీ చేస్తారని భయపడ్డానని ఆమె చెప్పింది. సునీల్ ఆగడాలపై ఫిర్యాదు చేసేందుకు ఇప్పుడు మరికొందరు ముందుకు వచ్చారని, దీంతో తాను సీఎంకు లేఖ రాశానని వెల్లడించింది. కాగా వైద్యురాలి ఆరోపణలను సునీల్ తోసిపుచ్చాడు. తనను అప్రతిష్టపాలుజేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించాడు. -
మహారాష్ట్ర సీఎంతో హరీష్‌రావు భేటీ
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీష్‌రావు మంగళవారం మధ్యాహ్నం భేటీయ్యారు. కాళేశ్వరం, తమ్మిడిహెట్టి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇరురాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులు, ఆనకట్టల నిర్మాణాలపై మహారాష్ట్రతో వివాదాలను పరిష్కరించే దిశగా ఈ భేటీ కొనసాగుతోంది. గోదావరి నదిపై ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌లు, ఆనకట్టల నిర్మాణాలకు సంబంధించి ముసాయిదాలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వానికిచ్చింది. తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ ఎత్తు 148 మీటర్లుగా ప్రతిపాదించారు. దీంతో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతాయని ఆ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. -
3 నెలల్లో 18 కేజీల బరువు తగ్గిన సీఎం
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కాస్త సన్నబడ్డారు. మూడు నెలల్లో 18 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రమబద్ధమైన ఆహార నియమాలు పాటించి బరువు తగ్గించుకున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసే నాటికి ఆయన బరువు 122 కేజీలు. గత డిసెంబర్ లో ఆయన మొదటిసారిగా వైద్యులను సంప్రదించారు. అప్పటి నుంచి డాక్టర్ల సూచనల మేరకు డైటింగ్ చేస్తున్నారు. అనవసర తిండి మానేశారు. జీవక్రియను మెరుగుపరిచే ఆహారం తీసుకుంటూ, వారానికి రెండు గంటలు పథ్యం పాటిస్తున్నారు. ఫలితంగా మూడు నెలల్లో 18 కేజీలు తగ్గారు. ఇప్పుడు ఆయన బరువు 104 కిలోలకు చేరింది. తన బరువును 88-90 కిలోలకు తగ్గించుకోవాలని ఫడ్నవీస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదే విధంగా ఆహార నియమాలు పాటిస్తే ఆయన కచ్చితంగా బరువు తగ్గుతారని డాక్టర్లు చెబుతున్నారు. బరువు తగ్గడంపై మాట్లాడేందుకు ఫడ్నవీస్ నిరాకరించారు. ఇది తన వ్యక్తిగత విషయమని, దీనిపై మాట్లాడాలనుకోవడం లేదని విలేకరులతో అన్నారు. తన భర్త బరువు తగ్గడంపై ఫడ్నవీస్ సతీమణి అమృత సంతోషం వ్యక్తం చేశారు. పని ఒత్తిడి, వేళాపాళాలేని తిండి కారణంగానే ఆయన బరువు పెరిగారని వెల్లడించారు. తాను ఐదారుకేజీలు బరువు తగ్గడంతో ఆయన కూడా తనను స్ఫూర్తిగా తీసుకున్నారని ఒకింత గర్వంగా చెప్పారు. -
సమస్యలు పరిష్కరించుకుందాం
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను కోరిన ఎంపీ కవిత నిజామాబాద్ కల్చరల్: తెలంగాణ, మహారాష్ట్రకు సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుందామని ఎంపీ కవిత.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరారు. ఎంపీ కవిత ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగిత్యాల టీఆర్ఎస్ ఇన్చార్జి సంజయ్‌కుమార్‌లు మంగళవారం ముంబైలో ఆయన అధికారిక నివాసంలో కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్యలోని సాలూర బ్రిడ్జి నిర్వహణ చర్చకు వచ్చినట్లు తెలిసింది. అప్పటి ఏపీ-మహారాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాయని, ప్రస్తుతం బ్రిడ్జి నిర్వహణకు తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చే విధంగా చూడాలని ఫడ్నవీస్‌ను కవిత కోరారు. ఇరురాష్ట్రాల ప్రయోజనాల కోసం లెండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, తెలంగాణకు నీటిని విడుదలచేయాలని ఫడ్నవీస్‌కు సమర్పించిన వినతిపత్రంలో కోరారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావుతో కూడా ఆమె భేటీ అరుు పలు అంశాలు చర్చించారు. -
ప్రాణహితకు ‘మహా’ సీఎం వ్యతిరేకి
మంత్రి పోచారం బాన్సువాడ: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాణహిత వద్ద ప్రాజెక్టు నిర్మించవద్దంటూ ఆందోళనలు చేశారని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నిం చారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో విలేకరులతో మాట్లాడుతూ ప్రాణహిత - చేవెళ్ల పథకాన్ని మరుగున పడేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం హాస్యాస్పదమన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి ఏటా సుమారు 1,000 టీఎంసీల నీరు వచ్చి గోదావరిలో కలుస్తోందని, కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి, సుమారు 470 టీఎంసీల నీటిని మళ్లించేందుకు రూ.35 వేల కోట్లతో పథకం రూపొందించామని తెలిపారు. కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరులోకి, అటు నుంచి మెదక్‌కు, తూఫ్రాన్‌కు, అక్కడి నుంచి హల్దీవాగు మీదుగా నిజాం సాగర్‌లోకి నీరు మళ్లిస్తామని వివరించారు. దీంతో 365 రోజుల పాటు కాలువల్లో నీరు ఉంటుందని, ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంగా మారుతుందని తెలిపారు. తెలంగాణలో ఉన్నది ‘మోతేబర్’ ప్రభుత్వమని, అందుకే ప్రపంచ బ్యాంకుతో పాటు జపాన్, అమెరికన్ తదితర బ్యాంకులు వేల కోట్ల అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ పథకాలను చూసి కాంగ్రెస్‌కు మతి పోతోందని, భవిష్యత్తులో ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. -
మంత్రుల కోసం విమానాలు ఆపారా?
రిజిజు, ఫడ్నవీస్ కోసం ఎయిరిండియా విమానాలు ఆపినట్టు ఆరోపణలు న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరేన్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కోసం ఎయిరిండియా విమానాలను నిలిపేసినట్టు ఆరోపణలు రావడం వివాదాస్పదమైంది. మంత్రుల కోసం విమానాలను ఆపేసి ప్రయాణికులను ఇబ్బం దుల పాలు చేయడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలపై నివేదిక ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) గురువారం పౌర విమానయాన శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఘటనలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని పౌరవిమానయాన శాఖ ఎయిరిండియాను ఆదేశించింది. ఎయిరిండియా నుంచి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని పౌరవిమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. జూన్ 24న లేహ్ నుంచి ఢిల్లీకి వచ్చే ఎయిరిండియా విమానంలో రిజిజు ప్రయాణించారు. అయితే రిజిజు, జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్, మరో సహాయకుని కోసం విమానంలో ఉన్న చిన్నారితో పాటు ముగ్గురు ప్రయాణికులను దించేశారని, దీని వల్ల విమానం గంట ఆలస్యమైందని వార్తలు వెలువడ్డాయి. ఇక జూన్ 29న ముంబై నుంచి అమెరికాకు వెళ్లే ఎయిరిండియా విమానం మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ సహాయకుడు కాలంచెల్లిన వీసాను తీసుకురావడంతో అసలు వీసాను తీసుకువచ్చే వరకూ విమానాన్ని నిలిపేశారని మీడియాలో వార్తలొచ్చాయి. క్షమాపణ చెప్పిన రిజిజు, అశోక్‌గజపతి తమ వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగడంపై కేంద్రమంత్రి కిరేన్ రిజిజు క్షమాపణ చెప్పారు. అయితే తమ గురించి కొందరు ప్రయాణికులను విమానం నుంచి దించేశారనే విషయం తనకు తెలియదన్నారు. కాగా, ఎయిరిండియా విమానం ఆలస్యం కావడానికి తాను కారణం కాదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పష్టం చేశారు. -
ఎన్సీపీ చీఫ్‌గా పవార్
ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రకటన పట్నా: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడిగా మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ (74) తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ ఆరో జాతీయ సమావేశాల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి టీపీ పీతాంబర్ ప్రకటించారు. 1999లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి ఎన్సీపీని స్థాపించినప్పటి నుంచి పవారే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ 16వ వార్షికోత్సవాల సందర్భంగా బుధవారమిక్కడ నిర్వహించిన జాతీయ సమావేశాలకు పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. అజిత్ గైర్హాజరీపై నాయకులను ప్రశ్నించగా తమకు సమాచారం లేదని చెప్పారు. 700 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో పవార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీపై విమర్శలు సంధించారు. విదేశీ గడ్డపై దేశ రాజకీయాల గురించి మాట్లాడుతూ మోదీ భారత్ పరువు మంట గలుపుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో కాషాయ ఎజెండాను, భావజాలాన్ని రుద్దుతున్నారంటూ నిప్పులు చెరిగారు. దీన్ని పెను సవాల్‌గా స్వీకరించి ఎన్సీపీ అడ్డుకుంటుందన్నారు. మతవాద శక్తులకు అడ్డుకట్ట వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పవార్ హెచ్చరించారు. రానున్న బిహార్ ఎన్నికలు దేశ రాజకీయాలను నిర్దేశిస్తాయని, దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ప్రతి భారీ మార్పు బిహార్ నుంచే వస్తుందని చెప్పారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత సామరస్యం దెబ్బతినిందన్నారు. -
పేద రైతులకు రుణాలిస్తే..బ్యాంకులేమీ మూతబడవు
వారిపట్ల ఉదారంగా వ్యవహరించండి... ఆర్బీఐ 80వ వార్షికోత్సవంలో బ్యాంకర్లకు ప్రధాని మోదీ సూచన ముంబై: రైతుల ఆత్మహత్యల ఉదంతాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో పేద రైతులకు రుణాలివ్వడం, వసూలు చేసుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలని బ్యాంకులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పేదలకు సహాయం చేయడం వల్ల బ్యాంకులేమీ మూతబడిపోవని వ్యాఖ్యానించారు. గురువారం రిజర్వ్ బ్యాంక్ 80వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు చెప్పారు. ‘ఆర్బీఐ 80వ వార్షికోత్సవ తరుణంలో.. రుణ భారంతో ఏ రైతూ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసేలా బ్యాంకింగ్ రంగాన్ని విస్తరించాలి. ఈ కలను సాకారం చేసుకోలేమా? పేదలకు చేయూతనివ్వడం వల్ల బ్యాంకులు మూతబడతాయని నేను అనుకోవడం లేదు’ అని ఆయన పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యల వల్ల కలిగే బాధ కేవలం పేపర్లు, టీవీ స్క్రీన్లకే పరిమితం కాకుండా బ్యాంకర్లు తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘మన దగ్గర రుణం తీసుకున్నందున ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడే అన్న బాధ బ్యాంకర్ల మనస్సులను కూడా కదిలిస్తోందా?’ అని మోదీ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను పేదలు, బడుగులప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మీరు నా నమ్మకాన్ని వమ్ముచేయరని ఆశిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఇన్ఫ్రా రంగ ప్రాజెక్టులకు భారీగా రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరించాలని రాజన్ సూచించారు. మరోవైపు ఆర్బీఐ ఎంతో ప్రొఫెషనలిజంతో దేశానికి సేవ చేస్తోందని జైట్లీ పేర్కొన్నారు. ఆర్బీఐకి మార్గదర్శ ప్రణాళిక.. ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సాధించేందుకు 20 ఏళ్ల మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆర్బీఐకి ప్రధాని సూచించారు. 2019లో మహాత్మా గాంధీ 150వ జయంతి, 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 2025లో ఆర్బీఐ 90వ వార్షికోత్సవం, 2035లో రిజర్వ్ బ్యాంక్ 100వ వార్షికోత్సవం లాంటి కీలకమైన మైలురాళ్లను నిర్దేశించుకుని తదనుగుణంగా లక్ష్యాలు పెట్టుకోవాలని ఆయన చెప్పారు. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషించగలదని చెప్పడానికి వంటగ్యాస్‌కి సంబంధించి నగదు బదిలీ పథకం, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు విజయవంతం కావడమే నిదర్శనమని ప్రధాని చెప్పారు. మరోవైపు, వంట గ్యాస్ సబ్సిడీని వదులుకునేలా బ్యాంకులు, పారిశ్రామిక సంస్థలు తమ తమ ఉద్యోగులను ప్రోత్సహించాలని మోదీ సూచించారు. ఈ విధంగా కాస్త స్తోమత ఉన్న వారు వదులుకుంటే .. సబ్సిడీ అవసరమున్న మరింత మంది పేదలకు దాన్ని అందించవచ్చని ఆయన చెప్పారు. రాజన్ .. ఓ మంచి టీచర్.. ఆర్థిక అంశాలపై రాజన్‌కి అపారమైన స్పష్టత, పట్టు ఉందని ప్రధాని కితాబిచ్చారు. ఆయన ఒక మంచి ఉపాధ్యాయుడని.. ఎంతటి క్లిష్టమైన అంశాన్నైనా మూడు, నాలుగు స్లైడ్స్లోనే వివరించగలరని మోదీ పేర్కొన్నారు. రాజన్‌తో రెండు నెలలకోసారి జరిగే సమావేశాలను ప్రస్తావిస్తూ ఆర్బీఐ, ప్రభుత్వం ఆలోచనా ధోరణి దాదాపు ఒకే విధ ంగా ఉంటుందని ఆయన చెప్పారు. రైతులకు తోడ్పాటు అందించడంతో పాటు వారి ఆత్మహత్యలు నివారించేటువంటి సృజనాత్మక సాధనాలతో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్కి సంబంధించి మార్గదర్శ ప్రణాళిక రూపొందించాలని బ్యాంకులకు ప్రధాని సూచించారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు చేయూతనిచ్చే బ్యాంకులు.. ఫ్యాక్టరీల కాలుష్యాన్ని తగ్గించే విధంగా సాగు చేసే రైతాంగానికి నిధులు సమకూర్చాలని ఆయన చెప్పారు. కరెన్సీ నోట్లకు స్వదేశీ పేపరు... కరెన్సీ నోట్లను ముద్రించేందుకు పేపరు, ఇంకును దిగుమతి చేసుకోవడం కాకుండా ఆర్బీఐ దేశీయంగా తయారయ్యే వాటినే వాడటంపై దృష్టి పెట్టాలని ప్రధాని పేర్కొన్నారు. ‘స్వదేశీ ఉత్పత్తుల కోసం పోరాడిన మహాత్మా గాంధీ బొమ్మను.. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కరెన్సీ నోట్లపై ముద్రిం చడం హాస్యాస్పదంగా ఉంటుంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కరెన్సీ పేపరు, ఇంకును దేశీయంగా తయారు చేయడంపై ఆర్బీఐ కసరత్తు చేయాలన్నారు. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే దేశీ పేపరుపైనే కరెన్సీ ముద్రణ జరగగలదని ఈ సందర్భంగా ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా చెప్పారు. -
ఆచరణాత్మక బడ్జెట్: ముఖ్యమంత్రి ఫడ్నవీస్
ఎంయూటీపీ-3కి రూ. 11,500 కోట్ల కేటాయింపుపై హర్షం ముంబై: కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఆచరణాత్మకమైందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సాంకేతిక ఆధారిత ఆధునికీకరణకు ప్రాధాన్యమిస్తూ రైల్వేలో పునరుజ్జీవనం నింపేందుకు కృషిచేస్తున్న ప్రధాని మోడీ, రైల్వే మంత్రి సురేశ్ ప్రభులకు కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ ప్రగతీ శీలమని, ఆచరణయోగ్యమని వర్ణించారు. ఎంయూటీపీ 3 కోసం రూ. 11, 500 కోట్లు కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు. బడ్జెట్‌పై శివసేన వ్యాఖ్యలకు సీఎం స్పందిస్తూ... బహుశా వారు బడ్జెట్‌ను సరిగా విని ఉండరు అని అన్నారు. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ మాత్రం సామాన్యులకు, ముఖ్యంగా ముంబై, మహారాష్ట్రకు ఏమాత్రం బడ్జెట్ ఉపయోగకరం కాదని విమర్శించాయి. చార్జీలు పెంచబోమన్న ప్రభు వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత మానిక్‌రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, రవాణా చార్జీలను 6.2 శాతం, ముంబై సబర్జన్ చార్జీలు 200 శాతం పెంచిందని విమర్శించారు. గత కొంతకాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో బడ్జెట్లో చార్జీలు తగ్గిస్తారని ఆశించామని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాలను కలిపేలా ఏర్పాటు చేయాలన్న రైల్వే లైన్ల నిర్మాణల ప్రస్తావనే తేలేదని విమర్శించారు. కాగా, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధికార ప్రతినిధి సచిన్ సావంత్ మాట్లాడుతూ... ముంబైలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ, మల్టీనోడల్ ట్రాన్స్‌పోర్టు హబ్ ఏర్పాటు చేస్తానన్న ప్రభు..తన మాట నిలబె ట్టుకోలేదని విమర్శించారు. -
సబ్సిడీ సిలిండర్లు నాకొద్దు: సీఎం
రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్లు ఏడాదికి కొన్ని వందల రాయితీ సిలిండర్లను వాడుతుంటారు. అయితే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాత్రం అందుకు భిన్నంగా, ఆదర్శంగా వ్యవహరించారు. తనకు సబ్సిడీ సిలిండర్ వద్దని.. దాన్ని తిరిగిచ్చేశారు. రాయితీ లేని గ్యాస్ సిలిండర్లనే తాను ఉపయోగిస్తానని చెప్పారు. తనతో పాటు సహచర మంత్రులు కూడా అందరూ రాయితీ లేని గ్యాస్ సిలిండర్లనే ఇళ్లలో వాడుకోవాలని దేవేంద్ర ఫడ్నవిస్ పిలుపునిచ్చారు. అల్పాదాయవర్గాలు, మధ్యతరగతి కోసం ఇస్తున్న సబ్సిడీని ఉన్నతాదాయ వర్గాల వాళ్లు కూడా వినియోగించుకోవడం వల్ల ప్రభుత్వాలపై సబ్సిడీ భారం పెరిగిపోతోందని ఇటీవల ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. దాంతో ఫడ్నవిస్ తనంతట తాను స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకుని ఆదర్శంగా నిలిచారు. -
బీజేపీకే పరిమితమైన కీలక శాఖలు!
ముంబై: దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో తాజాగా కేబినెట్ విస్తరణ జరిగినా.. కీలక శాఖలు మాత్రం బీజేపీకే పరిమితమయ్యాయి. దాదాపు రెండు నెలల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక విడిపోయిన శివసేన పార్టీ తిరిగి కలిసినా మంత్రి పదవుల విషయంలో మాత్రం సరైన ప్రాధాన్యత కల్పించలేదు. ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ వంటి కీలక పదవుల కోసం శివసేన పట్టుబట్టినా వారి ఆశలు తీరలేదు. ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ, రెవెన్యూ, జలవనరులు వంటి కీలక శాఖలను బీజేపీ తమ వద్దే ఉంచుకుంది. శివసేనకు ఐదు కేబినెట్ హోదా కల్గిన మంత్రిపదులతో పాటు, సహాయ హోదా కల్గిన 5 మంత్రి పదవులను మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 288 సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 121 మంది సభ్యులు, శివసేనకు 63 మంది సభ్యులు ఉన్నారు. కేబినెట్ లో చోటు దక్కిన వారు.. గిరీష్ బాపత్(బీజేపీ) గిరీష్ మహాజన్(బీజేపీ) దివాకర్ రావుత్(శివసేన) సుభాష్ దేశాయ్(శివసేన) రాందాస్ కదామ్(శివసేన) ఏక్ నాథ్ షిండే(శివసేన) చంద్రశేఖర్ బవాన్ కులే(బీజేపీ) బబాన్ రావ్ లోనికర్(బీజేపీ) డా.దీపక్ సవంత్(శివసేన) రాజ్ కుమార్ బడోలే(బీజేపీ) సహాయ హోదాలో ప్రమాణ స్వీకారం చేసినవారు.. రామ్ షిండే(బీజేపీ) విజయ్ దేశ్ ముఖ్(బీజేపీ) సంజయ్ రాథోడ్(శివసేన) దాదా భూజ్(శివసేన) విజయ్ శివథారే(శివసేన) దీపక్ కేశర్ కార్(శివసేన) రాజే అమ్రీష్(బీజేపీ) రవీంద్ర వాయ్ కర్(శివసేన) డా.రంజిత్ పటిల్(బీజేపీ) ప్రవీణ్ పోత్(బీజేపీ) -
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ
ముంబై: దాదాపు రెండు నెలల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక విడిపోయిన సైద్ధాంతిక సోదర పార్టీలు మళ్లీ కలిశాయి. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరేందుకు రంగం సిద్ధకావడంతో శుక్రవారం రాష్ట్ర కేబినెట్ ను విస్తరించారు. తాజాగా 20 మంత్రులకు అవకాశం కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో శివసేన -బీజేపీ చెరో పది మంత్రి పదవులను పంచుకున్నాయి. ఇందులో శివసేనకు ఐదు కేబినెట్ మంత్రి పదవులు దక్కాయి. మంత్రివర్గ విస్తరణలో బీజేపీ కూడా ఇదే బాటలో పయనించడం గమనార్హం. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఐదుగురు బీజేపీ సభ్యులకు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, మరో ఐదుగురు సహాయ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. 288 సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 121 మంది సభ్యులు, శివసేనకు 63 మంది సభ్యులు ఉన్నారు. సీట్ల సర్దుబాటులో వైఫల్యంతో ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేయడం తెలిసిందే. తాజాగా కేబినెట్ లో చోటు దక్కిన వారు.. గిరీష్ బాపత్(బీజేపీ) గిరీష్ మహాజన్(బీజేపీ) దివాకర్ రావుత్(శివసేన) సుభాష్ దేశాయ్(శివసేన) రాందాస్ కదామ్(శివసేన) ఏక్ నాథ్ షిండే(శివసేన) చంద్రశేఖర్ బవాన్ కులే(బీజేపీ) బబాన్ రావ్ లోనికర్(బీజేపీ) డా.దీపక్ సవంత్(శివసేన) రాజ్ కుమార్ బడోలే(బీజేపీ) సహాయమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు.. రామ్ షిండే(బీజేపీ) విజయ్ దేశ్ ముఖ్(బీజేపీ) సంజయ్ రాథోడ్(శివసేన) దాదా భూజ్(శివసేన) విజయ్ శివథారే(శివసేన) దీపక్ కేశర్ కార్(శివసేన) రాజే అమ్రీష్(బీజేపీ) రవీంద్ర వాయ్ కర్(శివసేన) డా.రంజిత్ పటిల్(బీజేపీ) ప్రవీణ్ పోత్(బీజేపీ) -
మిత్రులు మళ్లీ కలిశారు
‘మహా’ ప్రభుత్వంలో నేడు చేరనున్న శివసేన 5 కేబినెట్ పదవులు సహా 12 మంత్రి పదవులు ముంబై: పాతికేళ్ల బంధం నిలిచింది. దాదాపు రెండు నెలల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కుదరక విడిపోయిన సైద్ధాంతిక సోదర పార్టీలు మళ్లీ కలిశాయి. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. నేటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అందుకు వేదిక కానుంది. శివసేన తమ ప్రభుత్వంలో చేరుతోందని, ఆ పార్టీకి ఐదు కేబినెట్ హోదాలు సహా మొత్తం 12 మంత్రి పదవులు ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గురువారం ప్రకటించారు. అయితే, ఆ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోవడం లేదని, తన మంత్రివర్గంలో ఆ పదవి లేదని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ నుంచి కొత్తగా 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామన్నారు. శివసేన సీనియర్ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ఫడ్నవిస్ పాల్గొన్నారు. శివసేన చేరడంతో ఫడ్నవిస్ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించినట్లైంది. అలాగే, డిసెంబర్ 8 నుంచి నాగపూర్‌లో ప్రారంభమవుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. 288 సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి 121 మంది సభ్యులు, శివసేనకు 63 మంది సభ్యులు ఉన్నారు. సీట్ల సర్దుబాటులో వైఫల్యంతో ఈ రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేయడం తెలిసిందే. ‘బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్, ఎన్సీపీలకు వ్యతిరేకంగా ఓటేశారు. రెండు పార్టీలు కలవాలనేదే ఎమ్మెల్యేలు, కార్యకర్తల అభీష్టం కూడా. అందుకే ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఉద్ధవ్‌జీని కోరాను. ఆయన సానుకూలంగా స్పందించారు’ అని ఫడ్నవిస్ చెప్పారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తమ రెండు పార్టీల లక్ష్యమని శివసేన సీనియర్ నేత సుభాష్ దేశాయి అన్నారు. ప్రతిపక్ష నేత పదవి ఎవరికి? మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన చేరుతుండటంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య పోరు మొదలైంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 42 మంది, ఎన్సీపీకి 41 మంది సభ్యులు ఉన్నారు. అయితే, ఎన్నికల ముందు తమతో పొత్తు పెట్టుకున్న బహుజన వికాస్ అగధి పార్టీకి ఉన్న మూడు స్థానాలు, తమకు మద్ధతిస్తున్న ఒక స్వతంత్ర ఎమ్మెల్యేలను కలుపుకుంటే తమ సభ్యుల సంఖ్య 45కు చేరుతుంది కాబట్టి ప్రతిపక్ష నేత హోదా తమకే ఇవ్వాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. -
ఖడ్సేకు డిప్యూటీ సీఎం చాంబర్
సాక్షి, ముంబై: రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సేకు మంత్రాలయలోని ఆరో అంతస్తులో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి క్యాబిన్‌ను కేటాయించారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో తనకు ఉపముఖ్యమంత్రి పదవి రావచ్చని ఖడ్సే ఊహించారు. అయితే రెవెన్యూ శాఖ కేటాయించడంతో ఆయన కొంత అసంతృప్తికి లోనయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కాగా, ఆయనను ఈ విషయంలో కొంత శాంతింపజేయడానికే మాజీ ఉప ముఖ్యమంత్రి వినియోగించిన క్యాబిన్‌ను కేటాయించి ఉంటారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు క్యాబిన్లు, చాంబర్లు, బంగళాలు కేటాయించవచ్చని అందరూ భావించారు. కాని ఫడ్నవిస్ అలా చేయలేదు. సమావేశ మనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ క్యాబిన్‌ను ఖడ్సేకు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు మొదటి అంతస్తులో ఉన్న ఆర్.ఆర్.పాటిల్ క్యాబిన్, గ్రామాభివృద్ధి శాఖ మంత్రి పంకజా ముండేకు నాలుగో అంతస్తులో ఉన్న అదే శాఖ మాజీ మంత్రి జయంత్ పాటిల్ క్యాబిన్ కేటాయించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
సీఎం ఫడ్నవిస్‌కు అంత సీన్ లేదు..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యక్తిగతంగా మంచివాడే అయినా, ఆయనకు రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం, అనుభవం లేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నారాయణ్ రాణే ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత మొదటిసారి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఫడ్నవిస్ మంత్రివర్గంలో ఖడ్సే మినహా సమర్థులైన ఒక్కరూ లేరన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే సామర్థ్యం ఫడ్నవిస్ నాయకత్వంలోని మంత్రివర్గానికి లేదని వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి ప్రచార కమిటీ చైర్మన్‌గా తాను నైతిక బాధ్యత వహిస్తున్నానని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు గుర్తిస్తారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని పేర్కొన్న ఫడ్నవిస్ సీఎం పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే మాటమార్చారని దుయ్యబట్టారు. ఒకవేళ ఆయన ప్రత్యేక విదర్భకు కట్టుబడి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం శివసేన పడుతున్న పాట్లు చూస్తే జాలేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో అఫ్జల్ ఖాన్ సేన అంటూ బీజేపీని ఎద్దేవా చేసిన ఉద్ధవ్ ఇప్పుడు అధికారం కోసం ఆదే సేనలో చేరాలని ఆరాట పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి సమయంలో బాల్ ఠాక్రే ఉంటే అధికారాన్ని లాగి తన్నేవారని వ్యాఖ్యానించారు. అనంతరం ఎమ్మెన్నెస్, ఎంఐఎం పార్టీలపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఓ సీఎం.. ఐదోతరగతి పాపకు ఇంటర్వ్యూ!!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఇంటర్వ్యూలు కొత్త కాదు. కానీ, ఐదో తరగతి చదివే పాప ఆయనను ఇంటర్వ్యూ చేయాలనుకోవడమే వింత అనుకుంటే.. దానికి ఆయన స్పందించి, అధికారికంగా ఆమెను ఆహ్వానించి మరీ ఇంటర్వ్యూ ఇవ్వడం మరో పెద్ద విశేషం. దృష్టి హర్చంద్రాయ్ (11) అనే అమ్మాయి ముంబైలోని జేబీ పెటిట్ స్కూల్లో ఐదో తరగతి చదువుతోంది. ముఖ్యమంత్రి ప్రస్తుతం నివాసం ఉంటున్న సహ్యాద్రి గెస్ట్‌హౌస్ సమీపంలోని మలబార్ హిల్స్ వద్ద ఆమె ఉంటుంది. తన స్కూలు హోం వర్కులో భాగంగా సీఎం ఇంటర్వ్యూ తీసుకోవాలని దృష్టి భావించి.. ఆదివారం నాడు ఆయన ఇంటికెళ్లింది. కానీ సెక్యూరిటీ గార్డులు ఆమెను తిప్పి పంపేశారు. దాంతో.. తన క్లాసు పుస్తకం లోంచి ఓ పేజీ చించి.. దానిమీద సీఎంకు ఏకంగా ఓ లేఖ రాసేసింది. సెక్యూరిటీ గార్డులు తనను లోనికి అనుమతించడం లేదని, ఈ లేఖ అందితే తన సెల్‌ఫోనుకు కాల్ చేయాలని కోరింది. తన అడ్రస్ కూడా ఇచ్చి, . వీలైతే ఎవరినైనా పంపి అధికారికంగా తనను ఆహ్వానించాలని కూడా అడిగింది. ఈ లేఖను తేలిగ్గా తీసుకోవద్దంటూ ఓ ఫుట్‌నోట్ సైతం రాసింది. దాంతో.. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాగ్‌పూర్ వెళ్లడానికి ముందే తన సిబ్బందిని పంపి, ఆమెను పిలిపించుకుని ఇంటర్వ్యూ ఇచ్చి.. ఆ చిన్నారి హోం వర్కు పూర్తయ్యేలా చూశారు!! -
దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం
మహారాష్ట్రలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ రావు ఫడ్నవిస్ శుక్రవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె, గుజరాత్ సీఎం ఆనందిబెన్ పటేల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, లతా మంగేష్కర్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఎన్సీపీ నాయకులు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా హాజరయ్యారు. -
ముప్పుగ్రామాలను గుర్తిస్తామని హామీ
ముంబై: అసమర్థ ముఖ్యమంత్రి.. అంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను పృథ్వీరాజ్ చవాన్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఆగడాలు కొనసాగకుండా అడ్డుపడుతున్నందునే తనపై ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చవాన్ అనేక విషయాలపై మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల్లో పారదర్శకతను తీసుకురావాలనుకున్నాను. ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాను. భూమి ధరల పెరుగుదల ఏ కొందరికో లాభం చేకూర్చదని భావించాను. రియల్ ఎస్టేట్ సెక్టార్‌ను ప్రక్షాళను చేశాను. ఈ నిర్ణయాలు కొందరికి ఇబ్బం దిని కలిగించాయి. దీంతో వారు నాపై లేనిపోని ఆరోపణలు చేయడం, వాటిని పనిగట్టుకొని ప్రచారం చేయడం ప్రారంభిం చారు. అవి నన్ను ఎంతగానో బాధపెట్టాయి. ఆ బిల్డరు ఎవరనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రజా ప్రయోజనాల కోసం నా వైఖరిని మార్చుకోకూడాదని నిర్ణయించుకున్నా. ప్రత్యర్థులు చేస్తున్నట్లు నేను అసమర్థుడినే అయితే కీలక నిర్ణయాలు ఎలా తీసుకునేవాడిని..? ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మరాఠా రిజర్వేషన్ బిల్లును సభముం దుకు తెచ్చే ధైర్యం ఇంతకు ముందు ఎవరూ చేయలేదు. 2000 మురికివాడలను క్రమబద్ధీకరిస్తామని 2004, 2009 ఎన్నికల్లో హామీ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వాటిని నా ప్రభుత్వ హయాం లో పూర్తి చేశాం. కరువును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పటికీ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రస్థానంలోనే నిలబెట్టాం. గుజరాత్‌తో రాష్ట్రాన్ని పోల్చేందుకు నేను ఇప్పటికీ సిద్ధ మే. మరాఠా ఎలా ముందుందో నేను వివరిస్తాను. పోషకాహార లోపాన్ని కూడా తగ్గించాం. నేను అసమర్థుడినైతే ఇవన్నీ ఎలా జరుగుతాయి. రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ఒకటి చెప్పాలనుకుంటున్నా... పనిచేసినవారెవరో.. చేయనివారెవరో స్వయంగా మీరే నిర్ణయించుకోండి. నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో గమనించండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఏ కొంతమందికో ప్రయోజనం కలిగించడానికి కాద’న్నారు. రాణే విమర్శలను ఎప్పుడో మర్చిపోయా... తనపై విమర్శలు చేస్తూ.. తన పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేస్తూ మంత్రిపదవికి రాజీనామా చేసిన రాణేపై చవాన్ సానుభూతి ధోరణి కనబర్చారు. రాణే చేసిన విమర్శలన్నింటిని తానెప్పుడో మర్చిపోయానని చెప్పారు. జరిగిందేదో జరిగిపోయిందని, ఉధ్వేగంతో ఆయన ఏవేవో మాట్లాడారని, వాటన్నిం టిని నేను మర్చిపోయానని,కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాటిని మర్చిపోయారని తాను ఆశిస్తున్నానన్నారు. -
మహారాష్ట్ర సీఎంకు స్వల్పగాయాలు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ వెళుతున్న కాన్వాయ్ శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సీఎం చవాన్‌తోపాటు ఆయన కార్యదర్శి, మరో పోలీసు అధికారికి స్వల్పగాయాలయ్యాయి. మీరారోడ్‌లో జరగనున్న ఎన్నికల ప్రచారసభలో పాల్గొనేందుకు వెళుతుండగా రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రెస్ సమీపంలోని సిగ్నల్వద్ద కాన్వాయ్‌లోని పైలట్ కారును.. అదుపుతప్పి వచ్చిన ఓ వాహనం ఢీకొంది. దీంతో పైలట్ వాహనం వెనుక వస్తున్న మిగతా వాహనాల డ్రైవర్లందరూ సడన్‌బ్రేక్ వేశారు. ఫలితంగా కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఇందులో చవాన్ వాహనమూ ఉంది. ఈ ఘటనలో కారులో కూర్చున్న చవాన్, ఆయన కార్యదర్శి స్వల్పంగా గాయపడ్డారు -
‘సాక్ష్యాలు లేనందునే నిరాకరించా’
న్యూఢిల్లీ: ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణంలో మాజీ సీఎం ఆశోక్ చవాన్ పాత్ర ఉన్నట్టు ఎలాంటి ఆధారాలను సీబీఐ చూపించలేకపోయిందని రాష్ట్ర గవర్నర్ కె.శంకర నారాయణన్ అన్నారు. ఈ సొసైటీలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం కల్పించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి హోదాలో అశోక్ చవాన్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలపై సాక్ష్యాన్ని సీబీఐ సేకరించలేకపోయిందని న్యూఢిల్లీలో బుధవారం విలేకరులతో అన్నారు. దీన్ని ఆధారంగానే చేసుకునే చవాన్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతించలేదని వివరించారు. 2000వ సంవత్సరంలో ఫ్లాట్ల కేటాయింపులో చవాన్ క్రిడ్ ప్రో కోకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయని, అయితే 2004లో జూన్ 18న చవాన్ వదిన చేసుకున్న దరఖాస్తును తిరస్కరణకు గురైందన్నారు. 2000 సమావేశానికి, 2004 దరఖాస్తుకు చాలా కాలం వ్యత్యాసముందన్నారు. చివరగా 2008, నవంబర్ 10న ఆమెకు సభ్యత్వం ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సమయంలో చవాన్ రెవెన్యూ శాఖ మంత్రి కానీ, సీఎం హోదాలో కానీ లేరని తెలిపారు. సీఆర్పీసీ 197 సెక్షన్ కింద మాత్రమే చవాన్‌ను విచారించేందుకు సీబీఐ అనుమతి కోరిందని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద కాదని చెప్పారు. తన వద్దకు వచ్చిన అన్ని పత్రాలను పరిశీలించాకే సీబీఐ విచారణకు అనుమతించలేదని వివరించారు. గతంలో ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో సీఎం పదవికి అశోక్ చవాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కుంభకోణం నుంచి చవాన్ పేరును తప్పించాలంటూ ఇటీవల బాంబే హైకోర్టుకు వెళ్లిన సీబీఐకి చుక్కెదురైంది. -
సీఎం భార్యకు పంట నష్టపరిహారం
ముంబై: సాక్షాత్తు రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ భార్య సత్వశీల రైతు అవతారమెత్తారు. ఇదేమిటనుకుంటున్నారా? ఇది నిజమే?. 2011-12 కాలంలో పశ్చిమ మహారాష్ట్రలో ఏర్పడిన కరువు వల్ల పంటలు కోల్పోయిన రైతులకు సర్కార్ పంపిణీ చేసిన నష్టపరిహారం అందుకున్న వారిలో సత్వశీల పేరు కూడా ఉంది. ‘కరువు వల్ల వాటిల్లిన పంట నష్టంపై సర్వే చేశాం. కలెక్టర్ నేతృత్వంలోని ఓ కమిటీ చేసిన ప్రతిపాదనల ప్రకారం సత్వశీలకు రూ.మూడు వేల నష్టపరిహారాన్ని చెల్లించాం. అలాగే ఆమె తల్లి సోదరుడికి కూడా చెక్ అందించాం. ఆ ప్రాంతంలో నాలుగువేల మంది పంట కోల్పోయారని అంచనా వేశాం. వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేశామ’ని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చవాన్ భార్య సత్వశీలకు సాంగ్లీలోని బేదగ్ గ్రామంలో 2.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. అయితే నష్టపరిహారానికి సంబంధించి ఆమె నుంచి ఏ దరఖాస్తు రాలేదని చెప్పిన సదరు అధికారి సాధారణంగానే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో ఉన్న ఖాతాలో డబ్బు డిపాజిట్ అయ్యిందని వివరించారు. అయితే అధికారుల పనితీరుతో రైతులు నివ్వెరపోయారు. -
పవార్‌పై చవాన్ పోటీ?
ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే ఆయన సన్నిహితుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడకపోయినా ఎంసీఏ అధ్యక్ష పదవి కోసం వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో చవాన్ పోటీ చేస్తారని సమాచారం. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు ప్రత్యర్థిగా చవాన్ రంగంలోకి దిగుతారని చెబుతున్నారు. పవార్ కూడా ఈ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారని తెలియడంతో మేజ్గావ్ క్రికెట్ క్లబ్ చవాన్‌ను తమ ప్రతినిధిగా నామినేట్ చేసినట్లు తెలిసింది. -
సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులే: సీఎం
పింప్రి, న్యూస్‌లైన్: సంకీర్ణ ప్రభుత్వంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ విచారం వ్యక్తం చేశారు. అన్ని మిత్రపక్షాలను ఒప్పించి ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేయడం తలకు మించిన భారం అవుతోందన్నారు. పుణేలో ‘పుణే ఇంటర్నేషనల్ సెంటర్’ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన‘రి ఇన్వెహేటింగ్ ఇండియా పర్స్పెక్టివ్ ఫాం ది స్టేట్’ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని సర్వేల ఆధారంగా తెలుస్తోందన్నారు. బహుభాషా విధానంతో దేశంలో పొత్తుల ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని, ఇది దేశానికి మంచి కాదని అభిప్రాయపడ్డారు. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోవడంతో చిన్న చిన్న పార్టీలను కలుపుకొని ప్రభుత్వాన్ని నడిపించడం కష్టమవుతుందన్న విషయం అందరికీ తెలుసన్నారు. ఆయా ప్రాంతీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం తమ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలను కోరడం తెలిసిందేనన్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ స్థానాలను కట్టబెట్టాలని, అప్పుడే దేశ ప్రజల ప్రయోజనానికి పూర్తి స్వేచ్ఛతో పని చేయగలుగుతాయని వ్యక్తం చేశారు. దేశంలో నీరు, విద్యుత్, భద్రత, తీవ్రవాదం సమస్యగా మారాయన్నారు. ఈ సమావేశంలోపీఐసీ అధ్యక్షుడు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రఘునాథ్ మాశేల్కర్, రి ఇన్వేహేటింగ్ ఇండియా రూపకర్త దిలీప్ పాడగావ్కర్ తదితరులు పాల్గొన్నారు. విలాస్‌రావ్ సేవలు మరువలేనివి మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ సేవలు మరువలేనివని సీఎం పృథ్వీరాజ్ చవాన్ కొనియాడారు. ఆయన మొదటి వర్ధంతిని పురస్కరించుకొని పుణేలోని బీఎంసీసీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ‘విలాస్‌రావ్ జ్ఞాపకాలు’ అనే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలాస్‌రావ్ జీవితాన్ని ప్రేరణగా తీసుకోవాలన్నారు. ఎక్కడో లాతూర్‌లో పుట్టి, పుణేలో స్థిరపడి రాష్ర్ట ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా ఎదిగారన్నారు. ఈ క్రమంలో అందికీ అప్త మిత్రుడయ్యారన్నారు. ముంబైలో అతని పేరుమీద ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రాజకీయాల్లో ఆయనకు శత్రువులున్నా, బయటి ప్రచారంలో మాత్రం అందరికీ మిత్రుడిగా ఉండేవారని గోపీనాథ్ ముండే అన్నారు. కార్యక్రమంలో సహకార మంత్రి హర్షవర్ధన్ పాటిల్, శాసన సభ్యులు వినాయక్ మేటే, ఉల్లాస్ పవార్, నగర మేయర్ వైశాలీ బన్కర్, గోపీనాథ్ ముండే పాల్గొన్నారు.