
పుణె: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రశ్మీ ఠాక్రేను బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిగా పేర్కొంటూ ట్వీట్ చేసిన బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్‌చార్జి జితేన్ గజారియాపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. రశ్మీ ఠాక్రే ఫొటోపై మరాఠీ రబ్రీదేవిగా పేర్కొంటూ గజారియా పెట్టిన వివాదాస్పద పోస్టుపై శివసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో, ముంబై పోలీసులు గురువారం గజారియాను సుమారు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment