వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌.. ఆ తర్వాత ఏమైందంటే? | IAF Chopper Air Dropping Relief Material Makes Forced Landing In Bihar, Video Goes Viral | Sakshi
Sakshi News home page

వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌.. ఆ తర్వాత ఏమైందంటే?

Published Wed, Oct 2 2024 6:44 PM | Last Updated on Thu, Oct 3 2024 11:43 AM

 IAF Chopper Forced Landing In Bihar Video Viral

పాట్నా: వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన భారత ఆర్మీకి చెందిన ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ అదుపు తప్పి నీటిలో పడిపోయింది. హెలికాప్టర్‌ వరద నీటిలో పడిపోవడంతో పైలట్‌, జవాన్లను స్థానికులు పడవల సాయంలో సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకరారం.. కొద్దిరోజులుగా బీహార్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. కోసీ బ్యారేజ్‌ నుంచి భారీగా నీటి విడుదల కారణంగా అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి సామాగ్రి ఇవ్వడానికి ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ బయలుదేరింది.

 

 

బుధవారం ఒక ఐఏఎఫ్‌ హెలికాప్టర్ ద్వారా సీతామర్హి నుంచి వరద సహాయ సామగ్రిని పంపారు. అయితే ఔరాయ్‌లోని నయా గావ్‌లో వరద మయమంగా మారిన ప్రాంతంలో ఆ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీగా ల్యాండ్‌ అయ్యింది. హెలికాప్టర్‌ సడెన్‌గా వరద నీటిలో ల్యాండ్‌ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో నీటిలోనే సగం వరకు హెలికాప్టర్‌ మునిగిపోయింది. అయితే, పైలట్‌, అందులోని జవాన్లు సురక్షితంగా ఉన్నారు, దీంతో, స్థానికులు పడవల్లో హెలికాప్టర్‌ వద్దకు చేరుకుని వారిని కాపాడారు. ఆ హెలికాప్టర్‌లో ఉన్న సహాయ సామగ్రిని మరికొందరు ఎత్తుకెళ్లారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

 మరోవైపు.. ఈ ఘటనపై ఐఏఎఫ్‌ స్పందించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్‌, జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. ప్రమాదం ఎలా జరిగిందో అధికారులు విచారణ చేపట్టనున్నారు. 

ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై బాంబు పేలుడు.. ఎగిరిపడిన ట్రాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement