IAF chopper
-
వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్.. ఆ తర్వాత ఏమైందంటే?
పాట్నా: వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన భారత ఆర్మీకి చెందిన ఐఏఎఫ్ హెలికాప్టర్ అదుపు తప్పి నీటిలో పడిపోయింది. హెలికాప్టర్ వరద నీటిలో పడిపోవడంతో పైలట్, జవాన్లను స్థానికులు పడవల సాయంలో సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకరారం.. కొద్దిరోజులుగా బీహార్‌లో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. కోసీ బ్యారేజ్ నుంచి భారీగా నీటి విడుదల కారణంగా అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. దీంతో, లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. దీంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు, వారికి సామాగ్రి ఇవ్వడానికి ఐఏఎఫ్ హెలికాప్టర్ బయలుదేరింది. Bihar: IAF chopper carrying flood relief material from Sitamarhi crashes in Muzaffarpur#greaterjammu pic.twitter.com/blHtCpMtxe— Greater jammu (@greater_jammu) October 2, 2024 బుధవారం ఒక ఐఏఎఫ్ హెలికాప్టర్ ద్వారా సీతామర్హి నుంచి వరద సహాయ సామగ్రిని పంపారు. అయితే ఔరాయ్‌లోని నయా గావ్‌లో వరద మయమంగా మారిన ప్రాంతంలో ఆ హెలికాప్టర్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయ్యింది. హెలికాప్టర్ సడెన్‌గా వరద నీటిలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో నీటిలోనే సగం వరకు హెలికాప్టర్ మునిగిపోయింది. అయితే, పైలట్, అందులోని జవాన్లు సురక్షితంగా ఉన్నారు, దీంతో, స్థానికులు పడవల్లో హెలికాప్టర్ వద్దకు చేరుకుని వారిని కాపాడారు. ఆ హెలికాప్టర్లో ఉన్న సహాయ సామగ్రిని మరికొందరు ఎత్తుకెళ్లారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. मुजफ्फरपुर में वायु सेना का हेलीकॉप्टर हुआ क्रैश, बाढ़ राहत सामग्री पहुंचाने के लिए भरा था उड़ान, Watch Video #HelicopterCrash #Muzaffarpur #BiharNews #BiharFlood #FloodNews pic.twitter.com/DqteaZ4Fkp— News4Nation (@news4nations) October 2, 2024 మరోవైపు.. ఈ ఘటనపై ఐఏఎఫ్ స్పందించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్, జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపింది. ప్రమాదం ఎలా జరిగిందో అధికారులు విచారణ చేపట్టనున్నారు. An ALH helicopter of the #IAF, which was engaged in flood relief operations in the Sitamarhi sector in Bihar, executed a precautionary landing in inundated area due to a technical issue. All crew are reported to be safe, with no damage to civilian life or property reported. #IAF…— Indian Air Force (@IAF_MCC) October 2, 2024ఇది కూడా చదవండి: రైలు పట్టాలపై బాంబు పేలుడు.. ఎగిరిపడిన ట్రాక్ -
పువ్వులు కాదు, ఆహారం కావాలి!
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితులకు చికిత్సలు అందిస్తోన్న ఆస్పత్రులపై ఆదివారం నాడు వైమానిక, నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు గులాబీ రెక్కలు చల్లడం, ఆస్పత్రుల్లో పని చేస్తోన్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలియజేయడంలో భాగంగా వైమానిక దళానికి చెందిన విమానాలు విన్యాసాలు చేయడం పట్ల సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్’ తనదైన శైలిలో స్పందించింది. ఓ పక్క వైద్య సిబ్బంది గ్లౌజులు, మాస్క్‌లు, కవరాల్ సూట్ల లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటే, మరోపక్క లాక్డౌన్ కారణంగా దేశంలో పేద ప్రజలు, వలస కార్మికులు ఆకలితో అలమటిస్తుంటే ఈ గులాబీ పూల వర్షాలేమిటీ, ఈ విమానాల విన్యాసాలు ఏమిటని పలువురు విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. ఆ గులాబీ రెక్కలను వెదజల్లే బదులు ఆహార పొట్లాలను జార విడిచినా పేదలకు పూట గడిచేదికదా ? అని మరికొందరు స్పందించారు. ( లాక్డౌన్ : తిండిలేక 200 కుక్కలు మృతి ) విమాన విన్యాసాలకు డబ్బును వృధా చేసే బదులు వలస కార్మికులకు ఆదుకునేందుకు ఆ డబ్బును ఖర్చు పెట్టి ఉంటే బాగుండేదని మరి కొందరు స్పందించారు. పైగా లాక్డౌన్ సందర్భంగా ప్రాణాలకు తెగించి అవిశ్రాంతంగా పనిచేస్తోన్న పారిశుద్ధ్య కార్మికులకు ‘గులాబీ రేకులు’ చల్లడం ద్వారా అదనపు పని భారం మోపారంటూ కొందరు విమర్శించారు. కార్టూనిస్టులు కూడా తమదైన శైలిలో స్పందించి వ్యంగ్య చిత్రాలను గీశారు. -
కనిపించని శత్రువుతో కదనం..
సాక్షి, గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): కరోనా వైరస్‌తో అహర్నిశలు పోరాడుతున్న వైద్య సిబ్బందికి అత్యుత్తమ గౌరవం దక్కింది. ఆకాశం నుంచి వాయుసేన పూలవర్షం కురిపించగా, వైద్యసిబ్బంది ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ అద్భుత ఘటనకు వేది కైంది.. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణం. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు వైద్యు లు, నర్సింగ్, పోలీస్, శానిటేషన్, పారా మెడికల్ సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న విషయం విదితమే. వీరికి సంఘీభావం ప్రకటించి, నూతన ఉత్సాహం నింపాలని భారత త్రివిధ దళాల అధిపతి పిలుపునిచ్చారు. దీంతో ఆదివారం ఉదయం 10.23 గంటలకు గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యసిబ్బందిపై వాయుసేన చేతక్ హెలికాప్టర్ పూలవర్షం కురిపించింది. భారత సైనిక దళం, బ్యాండ్ వాయిస్తూ వైద్య సిబ్బందికి సెల్యూట్ చేసింది. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజా రా వు, డిప్యూటీలు నర్సింహారావు నేత, శోభన్‌బాబు, టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, గాంధీ యూనిట్ ప్రెసి డెంట్ సుబోధ్కుమార్తోపాటు అన్ని విభాగాలకు చెందిన హెచ్ఓడీలు, వైద్యులు, స్టాఫ్‌నర్సులు, శానిటేషన్, పారా మెడికల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ‘అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న అన్ని విభాగాలకు అసలైన గౌరవం దక్కింది’ అని నగర కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. ఫీవర్ ఆస్పత్రిలో... సదరన్ స్టార్ ఆర్మీ వారియర్స్ ఆధ్వర్యంలో ఆదివారం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి పూల వర్షంతో సంఘీభావం తెలిపారు. సారే జహాసే అచ్చా.. గీతాన్ని బ్యాండ్‌తో ఆలపించి వైద్యులు, సిబ్బందిపై పూలవర్షం కురిపించారు. అరుదైన గౌరవం భారత త్రివిధ దళాలతో వందనం అందుకోవడం అరుదైన గౌరవం. రెట్టించిన ఉత్సాహంతో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. త్రివిధ దళాల అధిపతులు, సైనికులతోపాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. – రాజారావు, గాంధీ సూపరింటెండెంట్ -
వాయుసేన హెలికాప్టర్‌పై నక్సల్స్ కాల్పులు
చింతూరు/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శుక్రవారం నక్సల్స్‌కు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీ ఎన్కౌంటర్ సాగింది. అనంతరం నక్సల్స్ వాయుసేన(ఐఏఎఫ్) హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక ఐఏఎఫ్ కమాండో గాయపడ్డారు. చింతగుఫాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసులకు, నక్సల్స్‌కు నడుమ మధ్యాహ్నం భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లను తరలించడానికి హెలికాప్టర్ వెళ్లగా నక్సల్స్ దానిపైనా కాల్పులు జరిపారు. ఒక సీఆర్పీఎఫ్ జవాను, ఎన్కే తివారీ అనే ఐఏఎఫ్ కమాండో గాయపడ్డారు. గాయపడిన జవాన్లందరినీ జగదల్పూర్ ఆస్పత్రికి తరలించామని, అడవిలో ఇంకా ఎన్కౌంటర్ సాగుతోందని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు.