చింతూరు/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శుక్రవారం నక్సల్స్‌కు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీ ఎన్‌కౌంటర్ సాగింది. అనంతరం నక్సల్స్ వాయుసేన(ఐఏఎఫ్) హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఒక ఐఏఎఫ్ కమాండో గాయపడ్డారు.
చింతగుఫాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసులకు, నక్సల్స్‌కు నడుమ మధ్యాహ్నం భారీ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లను తరలించడానికి హెలికాప్టర్ వెళ్లగా నక్సల్స్ దానిపైనా కాల్పులు జరిపారు.
ఒక సీఆర్‌పీఎఫ్ జవాను, ఎన్‌కే తివారీ అనే ఐఏఎఫ్ కమాండో గాయపడ్డారు. గాయపడిన జవాన్లందరినీ జగదల్‌పూర్ ఆస్పత్రికి తరలించామని, అడవిలో ఇంకా ఎన్‌కౌంటర్ సాగుతోందని సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.
వాయుసేన హెలికాప్టర్‌పై నక్సల్స్ కాల్పులు
Published Sat, Nov 22 2014 5:47 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement