ముగ్గురు మావోయిస్టుల లొంగుబాటు
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ముగ్గురు మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. జగదల్‌పూర్ జిల్లాలో యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది వద్ద శుక్రవారం వీరు లొంగిపోయారని పోలీసులు వెల్లడించారు.
లొంగిపోయిన ముగ్గురు సుక్మా ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నారని బస్తర్ జిల్లా ఇన్స్‌పెక్టర్ జనరల్ వివేకనంద సిన్హా వెల్లడించారు. ఎప్రిల్ 24న సుక్మా ప్రాంతంలోనే జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం దర్బా డివిజన్ కటెకళ్యాణ్ ఏరియా కమిటీలో కీలక సభ్యుడు హుంగా(30) సైతం మే 4న పోలీసుల ఎదుట లొంగిపోయాడు.