Pune police
-
పూజా ఖేద్కర్ కేసు.. ఆడీ కారు సీజ్ చేసిన పోలీసులు
ముంబై: అధికార దుర్వినియోగం, యూపీఎస్పీకి తప్పుడు అఫిడవిట్ సమర్చించారనే ఆరోపణలతో ఇటీవల ట్రైనీ ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్ వివాదాస్పదం అయ్యారు. ఇక, ఆమె వ్యవహారంపై ఏక సభ్య కమిటీ విచారణ జరుపుతోంది. అయితే తాజాగా ఆమెకు చెందిన లగ్జరీ ఆడీ కారును ఆదివారం పుణె పోలీసులు సీజ్ చేశారు. పూజా ఖేద్కర్ ఉపయోగించిన లగ్జరీ ఆడీ కారు తన పేరుమీద కాకుండా ఓ ప్రైవేట్ కంపెనీ యజమానిపై ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పుణె రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసు సదరు కంపెనీ ఓనర్‌కు నోటీసు జారీ చేసింది. అనంతరం ఆ కారును చతుర్శృంగి పోలీసులు తీసుకువెళ్లి.. పోలీసు స్టేషన్లో బారికేడ్ల మధ్య పెట్టారు. అయితే తాజాగా ఆమె ఆడి కారును పుణె పోలీసులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.చదవండి: పూజా ఖేద్కర్ ఎపిసోడ్: ‘నా కూతురు ఏ తప్పూ చేయలేదు’ఇక.. ఇటీవల మహరాష్ట్ర పూణే జిల్లాలో ట్రైనీ ఐఏఎస్ అధికారికగా పనిచేస్తున్న పూజా ఖేడ్కర్ తాను వినియోగించే ఆడీ కారుకు అనధికారికంగా రెడ్ బీకాన్ లైట్ల వినియోగం, గవర్నమెంట్ ఆఫ్ మహరాష్ట్ర అని స్కిక్కర్లు అంటించడంతో పాటు పైఅధికారులు లేని సమయంలో వారి ఛాంబర్లను అనుమతి లేకుండా ఉపయోగించుకోవడంపై వివాదం తలెత్తింది. అందుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులు జరుపుకున్న వాట్సప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది.చదవండి: పూజా ఖేద్కర్‌పై మరొకటి! ఆరోపణలు నిజమని తేలితే..ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి. దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ పేర్కొంది.చదవండి: Pooja khedkar: కూతురే కాదు తల్లి కూడా అదే దందా.. వీడియో వైరల్ -
‘పుణె పోర్షే కారు’ ప్రమాదం: పోలీసులపై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులపై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రమాద సమయంలో కారు నడిపిన మైనర్‌కు ఒకసారి బెయిల్ ఇచ్చి మళ్లీ కస్టడీలోకి తీసుకోవడం ఏంటని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. బెయిల్ మంజూరు తర్వాత కూడా మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచడంపై అతడి సమీప బంధువు ఫైల్ చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం(జూన్21) విచారించింది. పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజూష దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.‘కారు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఇది దురదృష్టకరమే. అయితే కారు నడిపిన మైనర్ కూడా ఒక రకంగా బాధితుడే. ఏ నిబంధన కింద బెయిల్తర్వాత అతడిని పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకుంటారు. ఇది నిర్బంధం కిందకు రాదా. కనీసం పోలీసులు బెయిల్ రద్దు పిటిషన్ కూడా వేయలేదు. కేవలం బెయిల్ ఆర్డర్ సవరించాలని పిటిషన్ వేశారు.దానిపైనే తీర్పు ఇస్తూ మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. ఏ రకమైన రిమాండ్ ఇది. ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చి మళ్లీ ఏ నిబంధనల ప్రకారం కస్టడీలోకి తీసుకున్నారు’అని బెంచ్ ప్రశ్నించింది.అయితే మైనర్ బెయిల్ ఆర్డర్ మార్చి అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపడం సరైనదే అని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో ఈ పిటిషన్‌పై తీర్పును కోర్టు మంగళవారానికి రిజర్వు చేసింది. కాగా, మే 19వ తేదీ తెల్లవారుజామున పుణెలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లను వేగంగా వచ్చిన పోర్షే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువ ఇంజినీర్లు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన మైనర్‌కు జువైనైల్ బోర్డు తొలుత బెయిల్ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా బెయిల్‌పై తీవ్ర నిరసన రావడంతో తర్వాత మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌కు పంపిస్తూ ఆదేశాల్లో మార్పు చేశారు. -
రోహిత్ శర్మకు ఫైన్ వేసిన పోలీసులు.. ఎందుకంటే?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పూణే ట్రాఫిక్ పోలీసులు ఊహించని షాకిచ్చారు. ముంబై – పూణే హైవేపై పరిమితికి మించిన వేగంతో కారును నడిపినందుకు మూడు చలాన్లు విధించారు. రిపోర్టుల ప్రకారం రోహిత్ శర్మ గంటకు 200 కి.మీ కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది. పూణే మిర్రర్ నివేదిక ప్రకారం.. అతి వేగంగా వెళ్తున్న రోహిత్ కారును ఓ పోలీస్ ఉన్నతాధికారి అడ్డగించి, పోలీసు ఎస్కార్ట్‌తో జట్టు బస్సులో ప్రయాణించాలని సూచించారు. కాగా పాకిస్తాన్‌తో మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లకు 5 రోజుల బ్రేక్ లభించింది. పాక్ మ్యాచ్ అనంతరం హిట్‌మ్యాన్ అహ్మదాబాద్ నుంచి హెలిక్యాప్టర్‌లో ముంబైకి చేరుకున్నాడు. అయితూ వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా ఆక్టోబర్ 19(గురువారం) పుణే వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు కుటుబంతో కలిసి గడిపిన రోహిత్ శర్మ పూణేలో ఉన్న జట్టుతో కలిసేందుకు రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నాడు. ముంబై నుంచి తన లంబోర్గిని ఉరుస్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 217 పరుగులు చేశాడు. చదవండి: World Cup 2023: మిచెల్ శాంట్నర్ అద్బుతం.. క్యాచ్ ఆఫ్‌ది టోర్నమెంట్! వీడియో వైరల్ -
ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌ను ఆపేసిన పోలీసులు.. వీడియో వైరల్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. పూణెలో నిర్వహించిన మ్యూజిక్షోను అర్ధాంతంరగా అడ్డుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం రాత్రి పుణెలో ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక రెహమాన్ తన బృందంతో కలిసి హుషారైన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. చదవండి: (బ్రేకప్ అయినా ఇంకా నేనే కావాలని కోరుకుంటున్నాడు: నటి) ఎంతో ఉత్సాహాంగా ఈవెంట్ జరుగుతుండగా పోలీసులు స్టేజ్‌పైకి వెళ్లి ప్రోగ్రాంను మధ్యలోనే ఆపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాత్రి 10గంటల వరకే షోకు అనుమతి ఉందని, సమయం మించిపోవడంతో ప్రోగ్రాంను ఆపేయాలంటూ రెహమాన్ టీంను కోరారు. రెహమాన్ చివరిగా ఓ పాట పాడి కార్యక్రమాన్ని ముగించారు. కాగా ఈ విషయంపై పూణె పోలీసులు వివరణ ఇస్తూ.. రెహమాన్ మేం వెళ్లే సమయానికి చివరి పాట పాడుతున్నారు. డెడ్‌లైన్ ముగియడంతో షోను ఆపేయాలను కోరాం. ఆయన కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు అంటూ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై రెహమాన్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం షోను ఆపేయాలంటే నిర్వాహకులతో మాట్లాడాలి.. అంతేకానీ ఇలా స్టేజ్‌పైకి ఎక్కి అవమానించకూడదు అంటూ కామెంట్స చేస్తున్నారు. చదవండి: (రజనీకాంత్ సినిమాకు ఆ కండీషన్ పెట్టిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్) Pune! Thank you for all the love and euphoria last night! Was such a roller coaster concert! No wonder Pune is home to so much classical music! We shall be back soon to sing with you all again! #2BHKDinerKeyClub @heramb_shelke @btosproductions EPI pic.twitter.com/UkBn09FwLj — A.R.Rahman (@arrahman) May 1, 2023 Extremely disappointing of #PunePolice to shut down #ARRahman ‘s concert in #Pune at 10.14PM. While the rule of 10pm cutoff is understood, this is nt how a visiting artist of his stature should hav been treated. He was almost on his finale song when this happened👇🏻cc @CPPuneCity pic.twitter.com/HYEor4wiYX — Irfan (@IrfanmSayed) April 30, 2023 Pune police stop AR Rahman concert midway citing court-mandated 10 pm deadline Read More: https://t.co/syWW1efdqq pic.twitter.com/jSZYm7chZt — Express PUNE (@ExpressPune) May 1, 2023 -
తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట
టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్‌కు తండ్రి మిస్సింగ్ కేసులో ఊరట లభించింది. సోమవారం తన తండ్రి మహదేవ్ జాదవ్ కనిపించడం లేదంటూ పుణేలోని అలంకార్ పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. కాగా మంగళవారం సాయంత్రం కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాలో ఉన్నట్లు అక్కడి సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహదేవ్ జాదవ్‌ను తమ వెంట తీసుకొచ్చి కేదార్ జాదవ్ కుటుంబసభ్యులకు అప్పగించారు. కేదార్ జాదవ్ తన తల్లిదండ్రులు మహదేవ్ జాదవ్, మందాకినిలతో కలిసి పుణేలోని కొథ్రూడ్లోని సిటీప్రైడ్ థియేటర్ సమీపంలో నివసిస్తున్నాడు. 75 సంవత్సరాల వయసు ఉన్న మహదేవ్ జాదవ్ డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారు. ఇంట్లోని పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న మహదేవ్ ఆ తర్వాత గేట్ తీసుకొని బయటికి వెళ్లారు. కొథ్రూడ్ జంక్షన్లో ఆటో ఎక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీంతో అలంకార్ పోలీసులను ఆశ్రయించిన కేదార్ జాదవ్ తండ్రి మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. ''కేదార్ జాదవ్ తండ్రి మహదేవ్ జాదవ్ కొంతకాలంగా మతిమరుపు(డిమెన్షియా) వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం మార్నింగ్ వాక్ కోసమని బయటికి వెళ్లిన మహదేవ్ జాదవ్ ముంద్వా ఏరియాకు చేరుకున్నాడు. తాను ఎక్కడ ఉన్నానో తెలియక కాస్త అయోమయానికి గురయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహదేవ్ కదలికలను గుర్తించాం. ప్రస్తుతం అతని మానసిక స్థితి సరిగ్గానే ఉందని.. కుటుంబసభ్యులకు అప్పగించామని'' సీనియర్ ఇన్స్పెక్టర్ అజిత్ లక్డే తెలిపారు. తన తండ్రిని క్షేమంగా అప్పగించినందుకు కేదార్ జాదవ్ అలంకార్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక 2014లో టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కేదార్ జాదవ్ 73 వన్డేల్లో 1389 పరుగులు, 9 టి20ల్లో 122 పరుగులు సాధించాడు. గతంలో సీఎస్కే, ఎస్ఆర్హెచ్లకు ప్రాతినిధ్యం వహించిన కేదార్ జాదవ్ 2022లో జరిగిన వేలంలో అమ్ముడిపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. చదవండి: హ్యాట్రిక్ గోల్స్‌తో రికార్డు.. సెంచరీ కొట్టిన మెస్సీ 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
హోటల్లో ప్రేయసితో భర్త.. భార్య చేసిన పనికి పరార్
భార్యకు తెలియకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్న ఆ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం పెంచుకున్న ఆ భార్య.. టెక్నాలజీ సాయంతో భర్త గుట్టును బయటపెట్టింది. ఊహించని ఆ పరిణామంతో ప్రేయసితో కలిసి తుర్రుమన్నాడు ఉన్నాడు ఆ మొగుడు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. పూణే పోలీసులు శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సదరు వ్యక్తి ఓ వ్యాపారవేత్త. అతని భార్య కూడా అదే కంపెనీకి డైరెక్టర్‌గా ఉంది. అయితే, 41 ఏళ్ల ఆ వ్యాపారవేత్త మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. వ్యాపారం పేరిట ఊర్లు పట్టుకుని తిరుగుతున్నానంటూ బిల్డప్‌లు ఇచ్చేవాడు. అయితే అతని వ్యవహారం ఆమెకు అనుమానం తెప్పించడం మొదలుపెట్టింది. దీంతో భర్త వాహనంలో జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చింది. గత ఏడాది నవంబరులో బెంగళూరు వెళుతున్నానని భార్యతో చెప్పాడు సదరు వ్యాపారి. కానీ, జీపీఎస్ లొకేషన్ మాత్రం.. ఆ వాహనం మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్టు చూపించింది. దీంతో ఆమె అనుమానం మరింత బలపడింది. వెంటనే భర్త బస చేసిన హోటల్ సిబ్బందిని ఆరా తీసింది. సీసీఫుటేజీని పరిశీలించగా.. మరో యువతితో అతగాడు లోపలికి వెళ్లాడు. పైగా ఆమే తన భార్య అంటూ.. భార్య పేరిట ఉన్న ఆధార్‌కార్డును చూపించాడట. ఆధార్‌కార్డు తనదని, పరిశీలించకుండా రూమ్ ఎలా కేటాయించారంటూ ఆమె హోటల్ సిబ్బందిపై ఫైర్ అయ్యింది. అంతేకాదు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత పూణే పోలీసులు.. తాజాగా 419 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, హోటల్ యవ్వారం భార్యకు తెలిసిపోవడంతో సదరు వ్యాపారవేత్త, అతడి ప్రేయసి ఆ సమయంలోనే పరార్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
మహారాష్ట్ర సీఎం భార్యపై అభ్యంతరకర పోస్టు..
పుణె: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రశ్మీ ఠాక్రేను బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిగా పేర్కొంటూ ట్వీట్ చేసిన బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి జితేన్ గజారియాపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. రశ్మీ ఠాక్రే ఫొటోపై మరాఠీ రబ్రీదేవిగా పేర్కొంటూ గజారియా పెట్టిన వివాదాస్పద పోస్టుపై శివసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో, ముంబై పోలీసులు గురువారం గజారియాను సుమారు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
Kiran Gosavi, NCB Witness In Aryan Khan Case, Arrest: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విట్నెస్, డిటెక్టివ్ కిరణ్ గోసవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. ఆర్యన్ అరెస్ట్ తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కారణ్ గోసవి ఇటీవలె ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన కిరణ్ గోసవి సహా ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. చదవండి: ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే.. ఆర్యన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కిరణ్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాతో తెగ వైరల్ అయ్యింది. అయితే తర్వాత గోసవి కనిపించకుండాపోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా ఇటీవలె మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. చదవండి: Aryan Khan: ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు? వాంఖెడే X నవాబ్ మాలిక్ -
వినూత్న ప్రచారం: ఇది మీరు కూడా చేయగలరు!
సాక్షి, ముంబై: మహారాష్ట్రను గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. అనేక జిల్లాలు, నగరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. గత వారం రోజుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా కరోనా సోకింది. మరోవైపు పుణేలో మినీ లాక్డౌన్ ప్రకటించారు. శనివారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదు. పుణె మున్సిపల్ కార్పొరేషన్లో శనివారం ఒక్కరోజే 5,778 కరోనా కేసులు నమోదు కాగా 37 మంది మృతి చెందారు. ఈనేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తేవడానికి పుణె పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కరోనా బారినపడకుండా అనుసరించాల్సిన ముందు జాగ్రత్త చర్యలతో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్ అయింది. కాగా, కొంత మంది ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడానికి నిరాకరిస్తున్నారు. అలాంటివారిని ఉద్దేశించి పుణే పోలీసులు ఈ వీడియోను రూపొందించారు. ‘మాస్క్ పెట్టుకోవడం చిరాకుగా ఉంది. అసలు మాస్క్ ను అసలు ధరించలేను’ అంటూ చెప్పే వారి కోసమే ఈ వీడియో అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. దివ్యాంగులు మాస్క్ పెట్టుకోవడానికి లేని ఇబ్బంది సాధారణ ప్రజలకు ఏంటి? మాస్క్ ను ఎల్లప్పుడూ ధరించాలని, బాధ్యత గల పౌరులుగా వ్యవహరించాలనేది వీడియో సారాంశం. ‘It’s feels so hot, can’t wear this mask’ - If you have used these words recently, then this video is for YOU.#WearAMask #COVIDSecondWave #coronavirus pic.twitter.com/9qKjXPCvLw — PUNE POLICE (@PuneCityPolice) April 4, 2021 చదవండి: మహారాష్ట్రలో కరోనా విజృంభణ -
పుణేలో చిక్కింది.. అబ్దుల్లా బాసిత్ అనుచరులే !
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మహారాష్ట్రలోని పుణేలో సోమవారం అరెస్టు చేసిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులూ అబ్దుల్లా బాసిత్ అనుచరులుగా తేలింది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న బాసిత్ స్పార్ట్ ఫోన్ వినియోగిస్తూ వివిధ యాప్స్ ద్వారా అనేక మందిని ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పుణేలో చిక్కిన ఇద్దరూ ఐసిస్ అనుబంధ సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖురాసన్ ప్రావెన్సీ (ఐఎస్కేపీ) మాడ్యుల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఎన్ఐఏ ప్రకటించింది. ఈ ఏడాది మార్చ్‌లో ఢిల్లీలో చిక్కిన కాశ్మీర్ జంటకు, ఇప్పుడు పుణేలో అరెస్టు అయిన ఇద్దరికీ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది. ఎన్ఐఏ అధికారులు సోమవారం పుణేలో అరెస్టు చేసిన నబీల్ ఎస్ ఖాత్రి ఓ జిమ్ నిర్వహిస్తుండగా... ఇతడి స్నేహితురాలు సాదియా అన్వర్ షేక్ జర్నలిజం చదువుతోంది. చంద్రాయణగుట్ట పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన అబ్దుల్లా బాసిత్ ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) రెండో సంవత్సరం వరకు చదివాడు. ఆన్లైన్ ద్వారా ఐసిస్‌కు సానుభూతిపరుడిగా మారాడు. 2014 ఆగస్టులో మరో ముగ్గురితో కలిసి పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకోవాలని భావించాడు. దీన్ని గుర్తించిన నిఘా వర్గాలు వీరిని కోల్‌కతాలో పట్టుకుని సిటీకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఈ ఉదంతంతో ఇతడిని కళాశాల యాజమాన్యం పంపించేసింది. ఆ తర్వాత హిమాయత్‌నగర్‌లోని ఓ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటీరియల్ డిజైనింగ్ కోర్సులో చేరినా తల్లిదండ్రుల ఒత్తిడితో మానేశాడు. 2015 డిసెంబర్లో ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిపోతున్నానంటూ ఇంట్లో లేఖ రాసిపెట్టి మరో ఇద్దరితో కలిసి వెళ్లిపోయాడు. అదే నెల 28న సిట్ పోలీసులు నాగ్‌పూర్‌లో వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన బాసిత్... ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటరŠూయ్వతో తన భావజాలంతో మార్పు రాలేదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు. ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన అబుదాబి మాడ్యుల్ కీలకంగా మారడంతో 2018 ఆగస్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఇతడు ఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లోనూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న బాసిత్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా అనేక మందిని ఆకర్షిస్తున్నాడు. సీఏఏకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతూ ఓ గ్రూపును తయారుచేయడం మొదలెట్టాడు. ఇలా ఇతడి వల్లో పడిన వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన భార్యాభర్తలు జహన్‌జెబ్ సామి, హీనా బషీర్ బేగ్ కీలకంగా మారారు. ఢిల్లీలోని ఓక్లా ఏరియాలో ఉన్న ఈ జంటను ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు మార్చ్‌లో పట్టుకున్నారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే నబీల్, సాదియాల పాత్ర వెలుగులోకి వచ్చింది. వీరు కూడా వివిధ యాప్స్ ద్వారా బాసిత్ ఇస్తున్న ఆదేశాల ప్రకారం సోషల్ మీడియా ద్వారా కొందరిని ఆకర్షించి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారు. బాసిత్, సామి, నబీల్‌లు దేశ వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాలని పథక రచన చేస్తున్నారు. నకిలీ పేర్లతో సిమ్ కార్డుల సమీకరించడంతో పాటు స్థానికంగా దొరికే పదార్థాలతో బాంబుల్ని తయారు చేయడం పైనా దృష్టి పెట్టారు. బాసిత్ ద్వారానే స్ఫూర్తి పొందిన పుణేకు చెందిన నబీల్, సాదియాలు ఐసిస్‌కు చెందిన ఖురాసన్ మాడ్యుల్లో ఉగ్రవాదులుగా మారారు. కశ్మీరీ జంట విచారణలో వీరి వ్యవహారం పైనా ఎన్ఐఏకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఇద్దరినీ అరెస్టు చేసింది. ఈ జంట నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ కాల్ డేటా విశ్లేషణ, విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా బాసిత్‌ను మరో సారి కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఎన్ఐఏ నిర్ణయించింది. తాజా పరిణామాల నేపథ్యంలో బాసిత్ కార్యకలాపాలపై తెలంగాణ పోలీసు విభాగానికీ కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. -
ఇందులో మాస్కు పెట్టుకున్న వ్యక్తిని గుర్తించండి
పుణె: అపాయంలోనూ ఉపాయం వెతకమన్నారు పెద్దలు. కరోనా మహమ్మారి బారిన పడకుండా మాస్కు ధరించండి అంటూ చెప్పకనే చెప్తున్నారు పుణె పోలీసులు. లాక్డౌన్ సడలింపులతో కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలందరూ కరోనాను తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తలు పాటించండి అంటూ పోలీసులు పదే పదే చెప్తూనే ఉన్నారు. మాస్కు పెట్టుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ స్వీయ రక్షణ చేసుకోండని సెలవిస్తున్నారు. తాజాగా పుణె పోలీసులు సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేస్తూ చాలెంజ్ విసిరారు. ఈ ఫొటోలో కరోనా బారిన పడకుండా జాగ్రత్త తీసుకుంటున్న వ్యక్తి ఎవరో చెప్పుకోండి చూద్దాం? అన్నారు. (నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది!) అదేంటి! అదెలా తెలుస్తుంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారనే ఓ క్లూ కూడా ఇచ్చారు. "ఆ వ్యక్తిని గుర్తించడం కరోనాకు కూడా కష్టమే, ఎందుకంటే సదరు వ్యక్తి ముఖానికి మాస్కు ఉంటుంద"ని పోలీసులు హింట్ ఇచ్చారు. ఇంకేముందీ.. నెటిజన్లు మాస్కు పెట్టుకుంది ఎవరా అని కళ్లు భూతద్దం చేసి మరీ వెతుకుతున్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే "మాస్కు మ్యాన్"ను కనుక్కోగలిగారు. ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తూ, నిరంతరం చైతన్యం కలిగిస్తున్న పుణె పోలీసులను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇంతకీ మీకు ఆ మాస్కు మ్యాన్ ఎక్కడా కనిపించకపోతే కింది ఫొటో చూసేయండి. (పుణె పోలీసుల వినూత్న ప్రయోగం!) -
లాక్డౌన్ : పోలీసులే కన్యాదానం చేశారు.
పుణె : లాక్డౌన్ వేళ దేశవ్యాప్తంగా పలువురు తమ పెళ్లిలను వాయిదా వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పుణెలో మాత్రం పోలీసులే దగ్గర ఉండి ఓ జంటకు పెళ్లిచేశారు. అంతేకాకుండా ఓ అసిస్టెంట్ పోలీసు ఇన్స్పెక్టర్ దపంతులు.. వధువు తల్లిదండ్రులుగా వ్యవహరించి కన్యాదానం కూడా చేశారు. వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆదిత్య సింగ్, వైద్యురాలిగా ప్రాక్టీస్ చేస్తున్న నేహా కుష్వాహ చిన్నప్పటి నుంచి స్నేహితులు. వీరిద్దరి తండ్రులు కూడా ఆర్మీలో కల్నల్స్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే ఆదిత్య, నేహాల మధ్య స్నేహం ప్రేమగా మారడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వారి నిశ్చితార్థం జరిగింది. మే 2 వ తేదీన డెహ్రాడూన్‌లో వీరి పెళ్లి జరపాలని నిశ్చయించారు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో ఈ జంట పుణెలో చిక్కుకుపోయారు. మరోవైపు వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వేర్వేరు ప్రాంతాల్లో ఉండిపోయారు. అయితే వీరి పెళ్లి తేదీ దగ్గర పడుతున్న సమయంలో వరుడి తండ్రి పుణె సిటీ పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. తన కొడుకు పెళ్లి జరిపించడానికి సాయం చేయాల్సిందిగా కోరాడు. దీంతో పోలీసులు ఆదిత్య సింగ్ వివాహనికి అన్ని ఏర్పాట్లు చేశారు. వధువు తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో.. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అతని భార్యతో కలిసి కన్యాదానం చేశారు. ఈ వేడుకకు డీసీపీతో పాటుగా పలువురు పోలీసులు హాజరయ్యారు. పెళ్లి జరుగుతున్న సమయంలో వధూవరులు మాస్క్‌లు ధరించి లాక్డౌన్ నిబంధనలు పాటించారు. ఈ వేడుకను వధూవరుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వీడియో కాల్ ద్వారా వీక్షించారు. అయితే కుటుంబ సభ్యులు హాజరుకాకపోయినప్పటికీ అనుకున్న సమయానికి తన పెళ్లి జరగడంపై వరుడు ఆదిత్య ఆనందం వ్యక్తం చేశారు. చదవండి : ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి.. మూడు రోజులు బస్సుల్లో ఉచిత ప్రయాణం -
గజిని ఫోటోతో పోలీసుల వినూత్న యత్నం
సాక్షి, పూణే: కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు వివిధ రకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా సివిల్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఒకచోట ట్రాఫిక్ పోలీసులు కరోనా గురించి రోడ్డు మీద డాన్స్ వేస్తూ అవగాహన కల్పిస్తే మరో చోట చేతులు ఎలా కడుక్కోవాలో ట్రాఫిక్ పోలీసులు చూపించారు. ఇక సోషల్‌మీడియాలో సైతం విభిన్న మీమ్స్‌తో కరోనాపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఇదేవిధంగా ప్రస్తుతం పూణే పోలీసులు 2008 లో వచ్చిన గజిని ఫోటోతో కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. (కరోనాపై పోరాటం: రంగంలోకి ‘మాయల ఫకీరు’) 1. Wear a mask 2. Practice social distancing 3. Wash hands frequently You don’t need to cover your entire body with tattoos for that, do you?#OnGuardAgainstCorona pic.twitter.com/CbJmLB9KoB — PUNE POLICE (@PuneCityPolice) April 14, 2020 గజిని సినిమా మొదటిలో అమీర్‌ఖాన్‌కు షార్ట్‌టర్మ్ మెమరీ ఉండటంతో అన్ని విషయాలను తన ఒట్టిన మీద టాటులా వేసుకుంటాడు. ఇప్పుడు పూణే పోలీసుల ఆ టాటు ప్లేసులో ఒక స్టికర్లాంటిది వేసి అన్ని మర్చిపోండి, కానీ మాస్క్ పెట్టుకోవడం మార్చిపోవద్దు అని రాశారు. దాంతో పాటు ఆ ఫోటోలో కోపంతో ఉన్న అమీర్‌ఖాన్ ముఖానికి మాస్క్ కట్టి ఉంది. ఈ ఫోటోని పూణే పోలీసులు తమ అఫిషియల్ ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి 1. మాస్క్ ధరించండి. 2. సామాజిక దూరం పాటించండి. 3. చేతులు తరచూ కడక్కోండి అనే క్యాప్షన్‌ను పోలీసులు జోడించారు. దీనికి అదనంగా పోలీసులు ఇందుకోసం మీరు మీ శరీరం మీద టాటులు వేయించుకోవల్సిన పనిలేదు, మీరూ వేయించుకుంటారా? అని జోడించారు. పోలీసులు చేసిన ఈ పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మీరు సామాన్యులకు పోలీసువారికి మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించారు అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా మిగిలిన వారు వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. (భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ) -
కోర్టు ముందుకు ‘ఎల్గార్’ కేసు నిందితులు
ముంబై: ఎల్గార్ పరిషద్–మావోయిస్టు లింకు కేసులో అరెస్టయిన ఏడుగురు శుక్రవారం ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసు విచారణను ఎన్ఐఏ తీసుకున్న కొద్దిరోజులకే నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. 2017కు సంబంధించిన ఈ కేసును పుణే పోలీసులు విచారణ జరుపుతుండగా, ఈ ఏడాది జనవరిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదలాయించారు. నిందితుల్లో సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, రోనా విల్సన్, సుధీర్ ధవలే, వరవరరావు, అరుణ్ ఫెర్రీరా, సుధా భరద్వాజ్, షోమ సేన్, వెర్నన్ గోన్సాల్వేస్ ఉన్నారు. వీరిని బుధవారమే ఎర్రవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం వీరిని కోర్టు జడ్జి డీఈ కొతాలికర్ ముందు ప్రవేశపెట్టారు. కాగా, తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. -
ఎన్ఐఏకు కోరెగావ్ కేసు
పుణే: 2018 కోరెగావ్–భీమా అల్లర్ల కేసు పుణే పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బదిలీ అయింది. ఈ మేరకు తమకు కేంద్ర హోంశాఖ నుంచి శుక్రవారం సమాచారం వచ్చినట్లు మహారాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజయ్ తెలిపారు. 2018లో చెలరేగిన కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో వామపక్ష నేతలు వరవరరావు, సుధీర్ ధావలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, షోమా సేన్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొన్సాల్వెస్, సుధా భరద్వాజ్‌లను అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్ట్ చేయడం తెల్సిందే. గత బీజేపీ ప్రభుత్వంలో కోరెగావ్–భీమాపై పెట్టిన కేసును తిరగదోడితే తమ బండారం బయటపడుతుందనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. -
భలే ఇచ్చారు పుణె పోలీసులు
జనవరి 12న జరిగింది ఈ సీన్. నిధి దోషి అనే యువతి పుణె పోలీసులకు ఓ ట్వీట్ పెట్టింది. ‘ధరోనీ పోలీస్ స్టేషన్ నెంబరు ఇవ్వగలరా.. అర్జెంటుగా కావాలి’ అని. వెంటనే పోలీసులు స్పందించారు. ‘అలాగే మేడమ్.. 020–27171190.. ఇదే ఆ నంబర్’’ అని ట్వీట్ చేశారు. తర్వాత చిక్లూ అనే సోగ్గాడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు. ‘ఆ యువతి.. నిధీ దోషి నెంబరు నాకు ఇవ్వగలరా?’ అని పుణె సిటీ పోలీసులకు ట్వీట్ పెట్టాడు. పోలీసులు వెంటనే అతడి ‘అభ్యర్థన’కు కూడా స్పందించారు. ‘సర్, ఆ మహిళ నెంబరును తెలుసుకోడానికి మీకు ఆసక్తి ఉన్నట్లే.. మీ నెంబరు తెలుసుకోడానికి మాకు అంతకు మించిన ఆసక్తిగా ఉంది.మీరెవరో గోప్యంగా ఉంచడం కోసం డైరెక్టు మెసేజ్ (డి.ఎం.) ఇవ్వండి’ అని ట్వీట్ చేశారు. దీనిపై మహిళా నెటిజన్లు పుణె పోలీసులపై అభినందనల ట్వీట్లు కురిపిస్తున్నారు. పుణె పోలీసుల ఆ సమయస్ఫూర్తి రిప్లయ్‌కి కొద్దిగంటల్లోనే పదహారు వేలకు పైగా లైకులు వచ్చాయి. నివేదిత అనే అమ్మాయి అయితే.. ‘ఐయామ్ యువర్ జబ్రా ఫ్యాన్ పుణె పోలీస్’ అని ట్వీట్ చేసింది. జబ్రా అంటే.. వీరాభిమాని. -
ఓ ట్వీట్‌తో అడ్డంగా బుక్కయ్యాడు!
సోషల్ మీడియాలో అసందర్భంగా కామెంట్ చేసిన ఓ వ్యక్తికి పుణె పోలీసులు గట్టి కౌంటర్ ఇచ్చారు. సాయం కోసం ప్రయత్నించిన మహిళ ఫోన్ నెంబర్ కావాలని అడగడంతో.. పోలీసులు అతనికి తమదైన శైలిలో జవాబిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ న్యాయ విధ్యార్థిని ధనోరి పోలీస్ స్టేషన్ నెంబర్ కావాలని ట్విటర్లో పూణె పోలీసులను కోరింది. దీనిపై స్పందించిన పూణె పోలీసు ట్విటర్ అధికార విభాగం.. ఆ మహిళకు ధనోరి పోలీస్ స్టేషన్ నెంబర్‌ను షేర్ చేశారు. అయితే ఇక్కడే ఓ నెటిజన్ పోలీసుల ట్వీట్‌కు స్పందిస్తూ.. ‘ప్లీజ్ నాకు ఆమె నెంబర్ ఇవ్వగలరా’ అని కామెంట్ చేశాడు. అతను అలా కామెంట్ చేయడంపై పూణె పోలీసులు ఘాటుగా స్పందించారు. అతన్ని హెచ్చరించడంతో పాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సార్, ప్రస్తుతం మీ నెంబర్ తెలుసుకోవడానికి మేము ఎక్కువ ఆసక్తిగా ఉన్నాం. ఎందుకంటే.. మహిళల నెంబర్లపై మీకు ఎందుకంతా ఆసక్తి ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. మీ గోప్యతకు మేము గౌరవం ఇస్తాం. అందుకే మీకు డైరక్ట్ మేసేజ్ చేస్తాం’ అని పేర్కొన్నారు. మహిళల పట్ల చులకన భావం ప్రదర్శించిన సదరు నెటిజన్‌కు పోలీసులు గట్టి కౌంటర్ ఇవ్వడంతో.. వారిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. @PuneCityPolice Can I get the number of Dhanori police station please. Need urgently! — Nidhi Doshi (@nidhidoshi12) January 12, 2020 @PuneCityPolice can i get her number please ? — Chiklu (@abirchiklu) January 12, 2020 Sir, we are more interested in your number currently, to understand your interest in the lady’s number. You may DM. We respect privacy. https://t.co/LgaD1ZI2IT — PUNE POLICE (@PuneCityPolice) January 12, 2020 -
వరవరరావు కేసు: ఎఫ్‌బీఐకు హార్డ్‌డిస్క్!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరేగావ్ హింసాకాండ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావును నవంబర్ 17 ,2018లో పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని వరవరరావు ఇంట్లో సోదాలు చేసిన అనంతరం పోలీసులు స్వాధినం చేసుకున్న హార్డ్ డిస్క్ ధ్వంసం కావడంతో.. అందులోని డేటాను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో డేటాను రాబట్టేందుకు పూణె పోలీసులు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)ను ఆశ్రయించారు. వరవరరావు ఇంటి నుంచి స్వాధీనం చేసుకొన్న హార్డ్ డిస్క్‌ను ఇప్పటికే నాలుగు ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపించారు. మొదట పూణేలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా.. ఎటువంటి డేటాను గ్రహించక పోవడంతో.. ఆ తర్వాత ముంబైలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీస్ డైరెక్టరేట్‌కు చేరవేశారు. అక్కడనుంచి డేటాను తెరవలేకపోవడంతో.. అనంతరం గుజరాత్, హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో తెరిచే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ధ్వంసమయిన హార్డ్ డిస్క్ నుంచి డేటాను పొందడం కష్టతరమవడంతో.. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐకు పంపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా 2017 డిసెంబర్ 31న పూణేలో మావోయిస్టుల మద్దతుతో ఎల్గర్ పరిషత్ సమావేశం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న ప్రసంగం, కులాల మధ్య అల్లర్లకు కారణమై.. భీమా కోరెగావ్‌లో హింసాకాండ చెలరేగింది. ఇక భీమా కోరేగావ్ ఘటనలో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఎల్గర్ పరిషత్-కోరెగావ్ భీమా కేసులో.. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించడం, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే నెపంతో వరవరరావును అరెస్టు చేశారు. అదేవిధంగా విప్లవ సంఘాల నేతలకు మావోయిస్టులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనే అభియోగాలతో సుధా భరద్వాజ్, సుధీర్ ధవాలే, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, మహేష్ రౌత్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, షోమా సేన్‌పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. -
ఊర్మిళపై అభ్యంతరకర పోస్ట్ : పుణే వ్యక్తిపై కేసు
పుణే : బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళ మటోండ్కర్‌పై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ చేసినందుకు పుణేకు చెందిన 57 సంవత్సరాల వ్యక్తిని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ధనుంజయ్ కుడ్తార్కర్ తన సోషల్ మీడియా ఖాతాను ఉపయోగించి ఊర్మిళా మటోండ్కర్‌పై అభ్యంతరకరమైన పోస్ట్ అప్లోడ్ చేశారని పుణేలోని విశారామ్బాగ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి వెల్లడించారు. ధనుంజయ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, నిందితుడిని ఇప్పటివరకూ అరెస్ట్ చేయలేదు. బాలీవుడ్ సహా పలు భాషా చిత్రాల్లో నటించిన ఊర్మిళ లోక్‌సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్ధి గోపాల్ షెట్టి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. -
ఖైదు కవితో కరచాలనం
ప్రధాని హత్యకు కుట్ర చేశారనే అర్థం పర్థం లేని ఆరోపణ కింద, నకిలీ ఉత్త రాలు సాక్ష్యాలుగా చూపి విప్లవ కవి వరవరరావును ఐదు నెలలుగా దుర్భరమైన పూణే జైల్లో నిర్బంధించారు. సెషన్స్ కోర్టులో బెయిల్ విచారణ సందర్భంగా కలిసే అవకాశం ఉంటుందని తెలిసి వీవీని చూడ్డానికి తెలంగాణ నుండి 26 మంది రచయితలు, ప్రజాసంఘాల మిత్రులం వెళ్లాం. నిరీక్షణలో అరుణ్ ఫెరేరా సహచరి పరిచయమైంది. అరుణ్ ఇదివరకే సుమారు ఐదేళ్లు జైలు జీవితం గడిపాడు. జెన్నిఫర్ కొడుకుని తలచుకుంటూ తను మొదటిసారి అరెస్టయినప్పుడు వాడికి రెండేళ్లని, విడుదలయ్యాక వచ్చిన తండ్రిని వింతగా చూస్తుంటే మీ నాన్న అని పరిచయం చేయవలసి వచ్చిందని చెప్పింది. ఇప్పుడు పన్నెండేళ్లొచ్చి విషయాలు అర్థం అవుతున్నాయి గనుక నాన్నను మళ్లీ ఎప్పుడు చూస్తానని అడుగుతున్నాడట. చివరికి వీవీని చూడగలిగాం. నల్లబడిన శరీర రంగు, సన్నబడ్డ దేహం, కానీ అదే ఉత్సాహం. దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకుంటే కళ్లను కప్పేస్తూ నీటిపొర. వీవీ ముఖంలో ఎన్నడూ లేనంతగా వృద్ధా ప్యం పైకి తేలింది. షోమాసేన్ బక్కచిక్కిపోయింది. చూపుడువేలితో అభినయిస్తూ చాలా సన్నబడ్డావని పరామర్శిస్తున్న మిత్రులకు ‘మంచిదేగా’ అని నవ్వుతూ సమాధానం చెప్తున్నారామె. సుధా భరద్వాజ్‌కు అభివాదం చేస్తుంటే విప్పారిన చిరునవ్వుతో ఆమె పలకరింపులు ప్రసన్నంగా ఉన్నాయి. బయట ఉంటే తీరిక లేకుండా ఉండే వీవీకి ఇక్కడి ఖాళీతనంతో పాటు ఉన్న భౌతిక స్థితి వల్ల, అననుకూల పరి సరాల్లో వయసు వల్ల తిరగబెట్టిన అనారోగ్యాల వల్ల చాలా అలసిపోయి కనిపిస్తున్నారు. ఇరుకు బెంచీలో ఆయన కోరికమీద పక్కన సర్దుకొని కూర్చున్నాను. అక్కడ సాయిబాబా, ఇక్కడ ఈయన? తనతో పాటు అదే బ్యారక్‌లో ఉంటున్న ఉరిశిక్షపడ్డ ఖైదీల గురించి, ముఖ్యంగా వారిలో కేవలం ముస్లింలుగా పుట్టినందువల్ల అల్‌ఖైదా ముద్ర వేయించుకున్న ఇద్దరని గురించి బాధపడుతున్న వీవీ, సాహిత్యం గురించి ముచ్చటిస్తూ తెలుగులో మాట్లాడక ఎన్నాళ్లయిందో అన్నప్పుడు తన స్థితిని ఆదివాసులతో పోల్చుకున్నారు. ఆదివాసుల భాష, సంస్కృతి, ఉనికి కూడా గల్లంతవుతున్నది కదా, అదింకెంత దుర్భరం అన్నారు. నోట్బుక్కులెన్నో కవిత్వం, అనువాదాలు, అనుభూతులతో నింపేసారు కానీ, తెలుగు కావడం వల్ల బైటికి పంపనివ్వడంలేదట. ఇంగ్లీషులో ఉత్తరాలు రాయగలిగినా, సహచరికి తెలియని ఇంగ్లీషు భాషలో రాయలేక మానేసానన్నారు. ఎనభైలలో జైలునుండి రాసిన ప్రేమలేఖల్లో సెన్సార్ అవుతున్న ప్రేమ గురించి బాధపడ్డ కవి, ఇప్పుడు ప్రేమను వ్యక్తీకరించే భాష కూడా చేతికందక విలవిల్లాడుతున్నాడా? అక్కడ నాగ్‌పూర్‌లో సాయిబాబాను కనీసం కుటుంబసభ్యులతో కూడా తెలుగు మాట్లాడనివ్వడం లేదని వసంత చెప్పింది. ప్రొఫెసర్ షోమాసేన్ ఆర్థరైటిస్ వల్ల కిందకూర్చోలేక, ఎన్నిసార్లు విన్నవించినా కుర్చీ ఇవ్వని జైలు కాఠిన్యంలో శరీరం కృశించిపోయే స్థితి. రిటైర్ అవ్వడానికి కొద్దిరోజుల ముందు ఈ కేసువల్ల నాగపూర్ యూనివర్సిటీ ఆమెను సస్పెండ్ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందని స్థితి. ప్రతిష్టాత్మక పీఎంఆర్‌డీ ఫెలోషిప్ సాధించిన చురుకైన పరిశోధక విద్యార్థి మహేశ్ రౌత్, తన చదువును, మనసును, ఆచరణను కూడా ఆదివాసులపై లగ్నం చేసినందుకు ఇక్కడ ఇలా వీళ్ల మధ్యకు వచ్చి చేరాడు. వీళ్ల బెయిల్ వినతిని తిరస్కరించమని ఆరోజు ప్రాసిక్యూషన్ చేసిన వాదనలో ఎల్గార్ పరిషత్ పేరు మీద దళితుల్ని సమీకరించడం అనే ‘నేరాన్ని’ గురించి పదేపదే ప్రస్తావించడం విన్నాం. వీవీని ఉద్దేశించి ‘బడా నేతా’ అంటున్నప్పుడు ఆయనకేసి చూస్తే నవ్వుతున్నారు. ఆయనే కాదు, ఆ తొమ్మిదిమందీ ఎవరిపేరు ప్రస్తావనకొచ్చినా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చిరునవ్వులు చిందిçస్తున్నారో, అంతగా కసి, ద్వేషం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతులో వినిపించి ఆశ్చర్యపోయాం. ఆ రోజే విన్న కొత్త వింత వాదన, భీమా కోరేగావ్ అల్లర్లలో నిందితులుగా సంఘ్‌పరివార్ నాయకులు శంభాజీ భిడే, మిలింద్ ఎక్బొటేల పేర్లు డిఫెన్స్ వారు తెస్తున్నారని, వారికి అందులో ఏ ప్రమేయం లేకున్నా కేసు తప్పుదారి పట్టించడానికే ఇందులోకి లాగుతున్నారని చెప్పడం. నిజానికి భీమా కోరేగావ్ అల్లర్ల మీద మొదట దాఖ లైన ఎఫ్ఐఆర్ ఆ ఇద్దరి మీదే! వీడ్కోలు సమయంలో బిగిసిన పిడికిలి చూస్తున్నప్పుడే కాదు ఎప్పటికీ వీవీ చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ‘‘దళితులు ఆదివాసీల జీవితాలను, పోరాటాలను గురించి మాట్లాడే స్వేచ్ఛను మేం కోల్పోయాం. అది బాధాకరమేగానీ, మా గురించి మాట్లాడే స్నేహితులు ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతే ఆ మాత్రం స్వేచ్ఛ త్యాగం చేసిన తృప్తి మిగులుతుంది’’. వ్యాసకర్త విరసం కార్యవర్గ సభ్యురాలు ఈ–మెయిల్ : varalurwa@gmail.com పి.వరలక్ష్మి -
వరవరరావుపై పుణే పోలీసుల చార్జిషీట్
పుణే : బీమా కొరేగావ్ కేసులో అర్బన్ నక్సల్స్‌పై పుణే పోలీసులు 1837 పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేశారు. పౌరహక్కుల కార్యకర్త, విరసం నేత వరవరరావు, గణపతి, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నోన్ గోన్సాల్వ్స్పై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. బీమా కొరేగావ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగంపై వరవరరావు సహా పలువురు హక్కుల కార్యకర్తలను గత ఏడాది పుణే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టులతో విప్లవ సంఘాల నేతలకు సంబంధాలున్నాయని, మావోయిస్టుల లేఖ ఆధారంగానే అర్బన్ నక్సల్స్‌ను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతుండగా, అకారణంగా తమను అరెస్ట్ చేశారని, మావోయిస్టుల లేఖ కల్పితమని వరవరరావు గతంలో పేర్కొన్నారు. -
మావోల లేఖల్లో దిగ్విజయ్ నంబర్
పుణె: ఎల్గార్ పరిషత్ కేసు విచారణలో భాగంగా తమకు లభించిన లేఖల్లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్ నంబర్ ఉందని పుణె పోలీసులు వెల్లడించారు. దాంతో చార్జిషీట్లో దానిని చేర్చామన్నారు. సెప్టెంబర్ 25, 2017న సురేంద్ర గాడ్లింగ్ అనే మానవహక్కుల కార్యకర్తకు మావోయిస్టు నేత నుంచి వచ్చిన ఒక లేఖలో దిగ్విజయ్ సింగ్‌దిగా భావిస్తున్న ఫోన్ నెంబర్ ఉందని తెలిపారు. ‘విద్యార్థుల సహకారంతో దేశవ్యాప్త నిరసనలను మనం మరింత తీవ్రతరం చేయాలి. సాధారణంగా పోలీసులు విద్యార్థులతో కఠినంగా వ్యవహరించలేరు. అది మనకు అనుకూలత. మన ఉద్యమాలకు సహకరించేందుకు కాంగ్రెస్ నేతలు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెంబర్లో మన మిత్రుడిని సంప్రదించగలరు’ అని ఆ లేఖలో ఉందన్నారు. ఆ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌దేనని పోలీసులు భావిస్తున్నారన్నారు. ఆ నంబర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లోనూ ఉందని ఒక పోలీసు అధికారి చెప్పారు. దిగ్విజయ్ స్పందిస్తూ.. ధైర్యముంటే తనపై చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌లకు సవాల్ విసిరారు. -
దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించనున్న పూణే పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ : అర్బన్ నక్సల్స్ కేసుకు సంబంధించి పూణే పోలీసులు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో స్నేహితుడి నెంబర్‌గా పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌కు చెందినదిగా పోలీసుల విచారణలో వెల్లడైందని డీసీపీ సుహాస్ బావ్చే చెప్పారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని, దీనిపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని పూణే పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల ద్వారా దేశవ్యాప్త నిరసనలకు సహకరించేందుకు కాంగ్రెస్ నేతలు సుముఖంగా ఉన్నారని కామ్రేడ్ సురేంద్రకు కామ్రేడ్ ప్రకాష్ రాసినట్టుగా చెబుతున్నఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల అరెస్ట్ అయిన కార్యకర్తలకు మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆధారాల కోసం పూణే పోలీసులు ఈ లేఖను కోర్టులో సమర్పించారు. కాగా లేఖలో పేర్కొన్న ఫోన్ నెంబర్ దిగ్విజయ్ సింగ్‌దేననే వార్తల నేపథ్యంలో దీంతో తనకెలాంటి సంబంధం లేదని దిగ్విజయ్ తోసిపుచ్చారు. -
భీమా–కోరెగావ్ కేసులో పోలీసులకు ఊరట
న్యూఢిల్లీ: భీమా–కోరెగావ్ అల్లర్ల కేసులో మహారాష్ట్ర పోలీసులకు సుప్రీంకోర్టు సోమవారం ఊరటనిచ్చింది. ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేసేందుకు డిసెంబర్ 1 వరకు పోలీసులకు సమయమిచ్చింది. అయితే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయలేకపోవడం వల్ల నిందితులకు బెయిల్ లభించే వరకు పరిస్థితిని తీసుకురావొద్దని కోర్టు ఆదేశించింది. నేర శిక్షా స్మృతి ప్రకారం తీవ్రమైన నేరారోపణలున్న కేసులు నమోదైన 90 రోజుల్లోపు పోలీసులు అభియోగపత్రాన్ని దాఖలు చేయలేకపోతే అరెస్టైన నిందితులకు బెయిలు లభిస్తుంది. భీమా–కోరెగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, నాగ్‌పూర్ విశ్వవిద్యాలయ అధ్యాపకుడు సోమ సేన్, దళిత హక్కుల కార్యకర్త సుధీర్ ధావలే, సామాజిక కార్యకర్త మహేశ్ రౌత, కేరళకు చెందిన రోనా విల్సన్‌లను ఈ ఏడాది జూన్‌లో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 2 నాటికి 90 రోజుల గడువు ముగియడంతో హక్కుల కార్యకర్తలకు బెయిలు రాకుండా ఉండేందుకు పుణేలోని ప్రత్యేక కోర్టు అభియోగపత్రాన్ని దాఖలు చేసేందుకు పోలీసులకు మరో 90 రోజుల గడువిచ్చింది. హక్కు ల కార్యకర్తలు హైకోర్టుకు వెళ్లడంతో పుణే కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టు కొట్టేసింది. దీంతో పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించి తమకు మరింత సమయం కావాలనీ, అప్పటి వరకు నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో పుణే కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. -
‘మావో’ లింకులపై బలమైన సాక్ష్యాలు
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలపై బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతోనే ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్ట్ చేశామని మహారాష్ట్ర బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేవలం అసమ్మతి, అభిప్రాయభేదం కారణంగా ఈ అరెస్టులు జరగలేదని స్పష్టం చేసింది. పుణెలోని భీమా కొరేగావ్‌లో గతేడాది డిసెంబర్ 31న ఎల్గర్ పరిషత్ సభ సందర్భంగా చెలరేగిన హింసకు మావోలతో కలసి కుట్రపన్నారంటూ విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వెర్మన్ గంజాల్వెజ్, సుధా భరద్వాజ్, గౌతమ్ నవలఖాల వంటి మానవహక్కుల కార్యకర్తలను పుణె పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఐదుగురిని విడుదలచేసి గృహనిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఈ సందర్భంగా అసమ్మతి, భిన్నాభిప్రాయం అన్నది ప్రజాస్వామ్యానికి రక్షక కవాటం వంటిదని కోర్టు పేర్కొంది. తాజాగా ఈ హక్కుల కార్యకర్తల అరెస్ట్‌ను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, దేవకి జైన్, సామాజికవేత్త సతీశ్ దేశ్‌పాండే, న్యాయ నిపుణుడు మజా దరువాలాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బుధవారం సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్లో మహారాష్ట్ర పోలీసులు స్పందిస్తూ.. ‘న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన ఐదుగురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ప్రస్తుతం విచారణ సాగుతుండగానే వీరు ఐదుగురు హక్కుల కార్యకర్తల బెయిల్ కోసం పిటిషన్ దాఖలుచేశారు. మేం అరెస్ట్ చేసిన ఐదుగురు నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీలో చురుగ్గా పనిచేస్తూ నేరపూరిత కుట్రలో భాగస్వాములయ్యారు. వీరు ఎల్గర్ పరిషత్ పేరుతో బహిరంగ సభను ఏర్పాటుచేశారు. రాజకీయ సిద్ధాంతాలు, భావజాలాల మధ్య భిన్నాభిప్రాయంతో ఈ ఐదుగురిని అరెస్ట్ చేయలేదు. వీరు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు బలమైన సాక్ష్యాలు లభించాయి. తనిఖీల సందర్భంగా వీరి ఇళ్లలోని కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరి కార్డుల్లో లభ్యమైన సమాచారాన్ని బట్టి వీరు సమాజాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నినట్లు తేలింది’ అని తెలిపారు. ‘రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, ఇతరుల నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో దేశంతో పాటు భద్రతాబలగాలపై దాడికి ప్రణాళిక, ఇతర కార్యకర్తలతో సమన్వయం తదితరాలపై కీలక సమాచారం లభిం చింది. అంతేకాకుండా వీరు తమ పార్టీలోకి నియామకాలను చేపట్టడంతో పాటు వారిని అండర్‌గ్రౌండ్ శిక్షణకు పంపడం, నిధుల సమీకరణ–పంపకం, ఆయుధాల ఎంపిక, కొనుగోలు, వీటిని దేశంలోకి అక్రమరవాణా చేసేందుకు మార్గాలను ఎంపికచేయడంలో భాగస్వాములయ్యారు. అరెస్టయినవారిలో కొందరు కూంబింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాత్మక పద్ధతులను మావోలకు అందజేస్తున్నట్లు ఆ పత్రాల్లో లభ్యమైంది’ అని పోలీసులు చెప్పారు. ధనరూపంలో వెలకట్టలేనిది జీవితం రేప్ బాధితులపై సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీః జీవితం అమూల్యమైనదని, ఏ కోర్టూ దాన్ని ధనరూపంలో వెలకట్టలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచార, యాసిడ్ దాడి బాధిత మహిళలకు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ(నల్సా) రూపొందించిన పరిహార పథకంపై విచారణ సందర్భంగా బుధవారం పైవిధంగా స్పందించింది. పైన పేర్కొన్న రెండు నేరాల్లో బాధిత మహిళకు కనిష్టంగా రూ.5 లక్షలు, గరిష్టంగా(మరణించిన పక్షంలో) రూ.10 లక్షలు చెల్లించాలని నల్సా సిఫార్సు చేసింది. ఈ పరిహార పథకాన్ని ఓ లాయర్ ప్రశ్నించగా..‘జీవితానికి వెలను నిర్ధారించలేం. దాన్ని ధనరూపంలో చెప్పలేం’ అని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు ఆమోదించిన నల్సా పరిహార పథకం అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఏపీలో 901 కేసుల్లో ఒక్కరికే... రేప్, యాసిడ్ దాడి బాధితుల్లో కేవలం 5 నుంచి 10 శాతం మందికే పరిహారం అందుతోందని నల్సా ధర్మాసనం దృష్టికి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది 901 కేసులు నమోదైతే ఒక బాధితురాలికే పరిహారం దక్కినట్టు వెల్లడించింది. పోక్సో చట్టం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1028 కేసులు నమోదైతే కేవలం 11 మంది బాధితులకే పరిహారం అందినట్లు తెలిపింది.