పుణె: అపాయంలోనూ ఉపాయం వెతకమన్నారు పెద్దలు. కరోనా మహమ్మారి బారిన పడకుండా మాస్కు ధరించండి అంటూ చెప్పకనే చెప్తున్నారు పుణె పోలీసులు. లాక్‌డౌన్ సడలింపులతో కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలందరూ కరోనాను తక్కువ అంచనా వేయకుండా జాగ్రత్తలు పాటించండి అంటూ పోలీసులు పదే పదే చెప్తూనే ఉన్నారు. మాస్కు పెట్టుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ స్వీయ రక్షణ చేసుకోండని సెలవిస్తున్నారు. తాజాగా పుణె పోలీసులు సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేస్తూ చాలెంజ్ విసిరారు. ఈ ఫొటోలో కరోనా బారిన పడకుండా జాగ్రత్త తీసుకుంటున్న వ్యక్తి ఎవరో చెప్పుకోండి చూద్దాం? అన్నారు. (నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది!)
అదేంటి! అదెలా తెలుస్తుంది? అంటూ ప‌్రశ్నల వర్షం కురిపిస్తారనే ఓ క్లూ కూడా ఇచ్చారు. "ఆ వ్యక్తిని గుర్తించడం కరోనాకు కూడా కష్టమే, ఎందుకంటే సదరు వ్యక్తి ముఖానికి మాస్కు ఉంటుంద"ని పోలీసులు హింట్ ఇచ్చారు. ఇంకేముందీ.. నెటిజన్లు మాస్కు పెట్టుకుంది ఎవరా అని కళ్లు భూతద్దం చేసి మరీ వెతుకుతున్నారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే "మాస్కు మ్యాన్"ను కనుక్కోగలిగారు. ప్రజల్లో కరోనాపై అవగాహన కల్పిస్తూ, నిరంతరం చైతన్యం కలిగిస్తున్న పుణె పోలీసులను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇంతకీ మీకు ఆ మాస్కు మ్యాన్ ఎక్కడా కనిపించకపోతే కింది ఫొటో చూసేయండి. (పుణె పోలీసుల వినూత్న ప్రయోగం!)
Comments
Please login to add a commentAdd a comment