Gujarat: Business Man Illegal Relation Caught By Wife With GPS - Sakshi
Sakshi News home page

హోటల్‌లో ప్రేయసితో భర్త.. భార్య చేసిన పనికి పరారీలో వ్యాపారి

Feb 5 2022 9:57 AM | Updated on Feb 5 2022 12:42 PM

Gujarat Business Man Illegal Relation Caught By Wife With GPS - Sakshi

భార్యకు తెలియకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్న ఆ వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది.   భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం పెంచుకున్న ఆ భార్య..  టెక్నాలజీ సాయంతో భర్త గుట్టును బయటపెట్టింది. ఊహించని ఆ పరిణామంతో ప్రేయసితో కలిసి తుర్రుమన్నాడు ఉన్నాడు ఆ మొగుడు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..  

పూణే పోలీసులు శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సదరు వ్యక్తి ఓ వ్యాపారవేత్త. అతని భార్య కూడా అదే కంపెనీకి డైరెక్టర్‌గా ఉంది. అయితే, 41 ఏళ్ల ఆ వ్యాపారవేత్త మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. వ్యాపారం పేరిట ఊర్లు పట్టుకుని తిరుగుతున్నానంటూ బిల్డప్‌లు ఇచ్చేవాడు. అయితే అతని వ్యవహారం ఆమెకు అనుమానం తెప్పించడం మొదలుపెట్టింది. దీంతో భర్త వాహనంలో జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చింది. గత ఏడాది నవంబరులో బెంగళూరు వెళుతున్నానని భార్యతో చెప్పాడు సదరు వ్యాపారి. కానీ,  జీపీఎస్ లొకేషన్ మాత్రం.. ఆ వాహనం మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్టు చూపించింది. దీంతో ఆమె అనుమానం మరింత బలపడింది.

వెంటనే భర్త బస చేసిన హోటల్ సిబ్బందిని ఆరా తీసింది. సీసీఫుటేజీని పరిశీలించగా.. మరో యువతితో అతగాడు లోపలికి వెళ్లాడు. పైగా ఆమే తన భార్య అంటూ.. భార్య పేరిట ఉన్న ఆధార్‌కార్డును చూపించాడట. ఆధార్‌కార్డు తనదని, పరిశీలించకుండా రూమ్‌ ఎలా కేటాయించారంటూ ఆమె హోటల్‌ సిబ్బందిపై ఫైర్‌ అయ్యింది. అంతేకాదు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. 

సుదీర్ఘ విచారణ తర్వాత పూణే పోలీసులు.. తాజాగా 419 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, హోటల్‌ యవ్వారం భార్యకు తెలిసిపోవడంతో సదరు వ్యాపారవేత్త, అతడి ప్రేయసి ఆ సమయంలోనే పరార్‌ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement