GPS
-
సాంకేతికతతో వాహన చోరీకి చెక్
గుడ్లవల్లేరు: మన ఇంటి ఎదుట సీసీ కెమెరాలున్నా.. లాక్ చేసిన వాహనాలు సైతం చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాల చోరీని అరికట్టవచ్చు. ఒకవేళ వాహనాలు చోరీకి గురైనా దొంగలను ఇట్టే పట్టించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుంది. అదే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే విజయవంతమైంది. మన దేశంలో పట్టణాల్లో ఉపయుక్తమవుతోంది. లక్షల వ్యయంతో లారీలు, కార్లు, బైకులు కొనుగోలు చేసే వాహనదారులు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను కొంతఖర్చుతో అమర్చుకోవాలని పోలీసు, రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీపీఎస్ శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ జీపీఎస్ శాటిలైట్ నుంచి సిగ్నల్స్ వీటీఎస్కు వచ్చి అక్కడి నుంచి సెల్ టవర్ ద్వారా సర్వర్‌కు వస్తాయి. వీటీఎస్ పూర్తిగా వెబ్ ద్వారా పని చేస్తుంది. మన వాహనంలో జీపీఆర్ఎస్, ఆర్ఎఫ్డీ యూనిట్‌ను అమర్చుకోవాలి. సర్వర్ నుంచి యూజర్‌కు వివరాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. వీటిని కంప్యూటర్, ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్లకు అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా వాహనం ఎక్కడికి వెళ్తున్నా.. మొబైల్లో చూసుకోవచ్చు. మార్కెట్లో సెక్యూర్టీ డివైజ్లుటూ వీలర్స్‌కు సైతం సెక్యూర్టీ డివైజ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా వెహికల్ డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాహనాలకు అమర్చితే చోరీలకు కళ్లెం వేసినట్లే. చోరీ చేసినా డివైజ్ యాక్టివేట్ అయి ఇంజిన్ స్టార్ట్ కాకుండా పోతుంది. ఒకవేళ బైక్‌లో డివైజ్‌ను తొలగించినా బైక్ హారన్ మోగటంతో పాటు బండి స్టార్ట్ అవ్వదు. జీపీఆర్ఎస్ ద్వారా బైకిస్ట్ ఫోనుకు అనుసంధానం చేయటం వలన ఆ మొబైల్‌కు సమాచారం వెళుతుంది. ఫోనుకు అలెర్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. ఎన్నెన్నో ప్రయోజనాలు...👉మహిళల ప్రయాణంలో వెహికల్ ట్రాకింగ్‌తో ఎంతో మేలు చేకూరుతుంది. ప్రయాణంలో వారు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. గమ్యస్థానం చేరేంతవరకు ఆందోళన చెందకుండా ఉండవచ్చు. 👉 బ్యాంకులకు భారీ మొత్తం నగదును తరలించేటపుడు ఆ వాహనం ఎక్కడుందో బ్యాంకర్లు తెలుసుకోవచ్చు. 👉 దూర ప్రాంతాలకు వెళ్లే లారీలు, కార్లు, విలువైన వస్తువులు తీసుకువెళ్లే భారీ కంటైనర్లు ఎక్కడి వరకు వెళ్లాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.దొంగల్ని ఇట్టే పట్టేయవచ్చు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ దొంగల్ని సైతం ఇట్టే పట్టించేస్తుంది. కార్లు, లారీల యజమానులంతా రక్షణగా సాంకేతిక పరిజ్ఞానాన్ని నమ్ముకుంటే చోరీలను అరికట్టవచ్చు. మా శాఖతో పాటు రవాణా శాఖ వారు కూడా అన్ని వాహనాలకు సాంకేతికతను వినియోగించుకోవలసిందిగా ప్రచారం చేస్తున్నాం. – ఎన్.వి.వి.సత్యనారాయణ, గుడ్లవల్లేరు ఎస్.ఐ -
జీపీఎస్ ట్రాకర్‌తో రాబందు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో నాలుగు రోజులుగా కెమెరా లేని జీపీఎస్ ట్రాకర్‌తో తిరుగు తున్న రాబందును అటవీశాఖ అధికారు లు గురువారం చిన మిడిసిలేరు ప్రాంతంలో పట్టుకున్నారు. ఆదివారం నీరసంగా, కదల్లేని స్థితిలో నాయకకాలనీలోని ఏకలవ్య పాఠశాల సమీపంలో ఈ రాబందు కనిపించగా స్థానికులు మాంసాహారం పెట్టగా తినేసి వెళ్లిపోయింది. ఈ విషయం బయటపడటంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే మహారాష్ట్రకు చెందిన ముంబై నేచురల్ హిస్టరీ సొసైటీ వారు నాగపూర్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి ఆగస్టు 10న ఇలాంటి రాబందులను వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈ రాబందు ఎక్కువ దూరం వెళ్లలేకపోతుండటాన్ని జీపీఎస్ ద్వారా గుర్తించిన అక్కడి అధికారులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నట్లు తెలిసి అటవీశాఖ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వగా చర్ల రేంజ్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. రేంజ్ కార్యాలయానికి తరలించి ఆహారం అందించి పశువైద్యుల ద్వారా పరీక్ష చేయిస్తున్నారు. కాగా, తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఈ రాబందు తిరుగుతుండటంతో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులే పంపించారనే చర్చ జరిగింది. చివరకు పరిశోధనల కోసం విడిచిపెట్టినట్లు తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
సౌదీ అరేబియా ఎడారిలో చిక్కుకుని తెలంగాణ వాసి మృతి
ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన తెలంగాణ యువకుడు మృతి చెందాడు. సౌదీ అరేబియాలోని రబ్ అల్ ఖలీ అనే ఎడారిలో చిక్కుకుని 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆ ఎడారిలో దారితప్పి..ఎటు వెళ్లాలో తెలియక.. మరోవైపు తాగేందుకు నీరు, తినేందుకు ఆహరం లేక ఐదు రోజులుపాటు నరకయాతన అనుభవించి అత్యంత దయనీయ స్థితిలో చనిపోయాడు. వివరాల్లోకెళ్తే..కరీంనగర్‌కి చెంఇన 27 ఏళ్ల షెహజాద్ ఖాన్ బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ టెలికమ్యూనికేషన్స్ కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. తన డ్యూటీలో భాగంగా ఐదు రోజల క్రితం తన సహోద్యోగి అయిన సూడాన్ వాసితో కలిసి ఓ ప్రాంతానికి వెళ్లాడు. కానీ వారు వెళ్లే సమయంలో జీపీఎస్ సక్రమంగా పనిచేయలేదు.జీపీఎస్ పనిచేయకపోవడంతో వారిద్దరూ దారి తప్పిపోయారు. వారు వెళ్లాల్సిన గమ్యస్థానానికి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రుబా అల్ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు. ఎటు వెళ్లాలో తెలియక వాహనాన్ని అలాగే పోనిస్తూ ఉండగా అందులో పెట్రోల్ అయిపోయింది. తాము దారితప్పామనే విషయం మేనేజ్మెంట్కు చెబుదామన్నా కూడా ఇద్దరి మొబైల్స్ స్విచ్ఛాఫ్ అయ్యాయి. నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న రుబా అల్ ఖలీ ఎడారిని అత్యంత ప్రమాదకరమైన ఎడారిగా చెబుతుంటారు.దీంతో జనావాసాలు ఉన్న చోటుకు నడుచుకుంటూ అయినా వెళ్లిపోదామని షహబాద్ ఖాన్, అతని సహచరుడు అనుకున్నప్పటికీ.. ఎటుచూసినా ఎడారే కనబడటంతో ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో తమను ఆ దేవుడు కాపాడకపోతాడా అని అక్కడే ఎడారిలో నమాజ్ చేసుకుంటూ ఉండిపోయారు. ఈ క్రమంలో పైన ఎండ, కింద ఇసుక వేడితో వాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యారు. తాగేందుకు నీరు, తినడానికి అహారం లేక అక్కడే ప్రాణాలొదిలారు. సర్వీస్ కోసం వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు కనిపించకుండా వెళ్లారని యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఎడారిలో వారి వాహనం పక్కనే విగతజీవులుగా ఉన్న వారిద్దరినీ గుర్తించారు పోలీసులు. ఈ విషయాన్ని బాధితుడి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.(చదవండి: వైద్యుడి రూపంలోని రాక్షసుడు) -
చిచ్చు రేపిన జీపీఎస్... బాబు, పవన్ ల మధ్య దూరం
-
జీపీఎస్ గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి
అనకాపల్లి/భీమవరం: గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళన బాటపడ్డాయి. రాజపత్రాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలుచేస్తుందని ఆశించామని.. కానీ, మా ఆశలను వమ్ముచేస్తూ జీపీఎస్‌కు చట్టబద్ధత తెచ్చి గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడం చాలా అన్యాయమంటూ ఆదివారం అనకాపల్లిలోని సీఐటీయూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చినబ్బాయిలు విమర్శించారు. గెజిట్ కాపీలను దగ్థంచేశారు. పైగా.. జీపీఎస్ విధానాన్ని అమలుచేస్తూ పాత తేదీలతో రాజపత్రాన్ని విడుదల చేయడం దుర్మార్గమని చెప్పారు. జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలుచేస్తామని పవన్‌కళ్యాణ్, నారా లోకేశ్‌లు కూడా హామీ ఇచ్చారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని, పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లయ్యబాబు, ఎంవీ అప్పారావు, జిల్లా కార్యదర్శి శేషుబాబు, కోశాధికారి జోగా రాజేష్, మున్సిపల్ ఉపాధ్యాయుల నాయకులు సతీ‹Ù, మోడల్ స్కూల్ నాయకులు ఆశాలత, ఏపీసీపీఎస్ఈఏ నాయకులు ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలుచేస్తుందని భావించామని.. కానీ, అందుకు విరుద్ధంగా కొత్త ప్రభుత్వం జీపీఎస్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి, జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు అన్నారు. భీమవరంలో ఆదివారం వారు జీఓ కాపీలను దగ్థం చేశారు. కొలువుదీరిన ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అమలుచేయడం దేనికి సంకేతమని వారు ప్రశి్నంచారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు సీహెచ్ కుమారబాబ్జి, డి. ఏసుబాబు, ఎస్.రత్నరాజు, జి. రామకృష్ణంరాజు పాల్గొన్నారు. -
ఇంత ఘోరంగా మోసం చేస్తారా?
సాక్షి, అమరావతి/నూజివీడు/సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూటమి పార్టీలు మాట తప్పి తమను నిలువునా మోసం చేశాయని మండిపడ్డాయి. వెంటనే గెజిట్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకురావాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించాయి. ఇది దుర్మార్గం: ఎస్జీటీఎఫ్ ఎన్నికల ప్రచారంలో జీపీఎస్ దుర్మార్గమని ప్రచారం చేసి.. ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అని కూటమి ప్రభుత్వంపై సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం జీపీఎస్‌పై ముందుకు వెళ్లలేదన్నారు. కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సరైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చాయన్నారు. కానీ ఇప్పుడు ఏకపక్షంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేశాయని మండిపడ్డారు. మాట తప్పడం అన్యాయం: సీపీఎస్ ఉద్యోగుల సంఘం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సీపీఎస్, జీపీఎస్‌పై సమీక్ష జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామంటూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఎలాంటి సమీక్ష లేకుండా గెజిట్ జారీ చేశారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు గార్లపాటి సునీల్ మండిపడ్డారు. గెజిట్ రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సహనాన్ని పరీక్షించొద్దు: ఆప్టా ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న జీపీఎస్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(ఆప్టా) డిమాండ్ చేసింది. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి ప్రకా‹Ùరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. మేం కోరుకున్నది ఓపీఎస్: బీటీఏ కూటమి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ప్రభుత్వంపై బహుజన టీచర్స్ అసోసియేషన్(బీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోజ్ కుమార్, సీహెచ్.రమేశ్ మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుకున్నది పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్) మాత్రమేనన్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పిన కూటమి పారీ్టలు.. అధికారంలోకి వచ్చాక జీపీఎస్ గెజిట్ జారీ ద్వారా ముంచేసిందని మండిపడ్డారు. 16, 17 తేదీల్లో నిరసన: ఏపీటీఎఫ్ జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని.. 2004లోపు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన టీచర్లు, పోలీసులు, ఉద్యోగులకు ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 16, 17 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్టు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి తెలిపారు. బాలికలపై అత్యాచారాలను అరికట్టే లా, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని, 12వ పీఆర్సీ ప్రక్రియ మొదలుపెట్టాలని, ఆలోగా 30 శాతం మధ్యంతర భృతి విడుదల చేయాలన్నారు. పాత పెన్షన్ విధానమే కావాలి: పీఆర్టీయూ ఏపీ పాత పెన్షన్ విధానమే కావాలని.. జీపీఎస్ గెజిట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ–ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. 2023 జూలై నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాలని, అంతవరకు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
YS Jagan: కేంద్రంలోనూ జీపీఎస్..
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పెన్షన్ స్కీం (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం–సీపీఎస్) విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వైపే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగుల వేస్తోంది. 2004 నుంచి అమల్లోకి వచి్చన జాతీయ పెన్షన్ స్కీం ద్వారా ఉద్యోగులు రిటైరయ్యాక వారికి పెన్షన్ చాలా తక్కువగా వస్తోందని, పాత పెన్షన్ స్కీంను అమలుచేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.నిజానికి.. 2004లో తీసుకొచి్చన సీపీఎస్ ప్రకారం.. ఉద్యోగులు పది శాతం, ప్రభుత్వాలు పది శాతం పెన్షన్ నిధికి జమచేస్తాయి. మార్కెట్ అధారిత రిటర్న్‌ల ప్రకారం ఆ నిధి నుంచి ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ వస్తుంది. మార్కెట్లపై ఆధారపడటంతో ఇంత పెన్షన్ వస్తుందనే గ్యారెంటీ లేదు. కొందరు ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం బేసిక్ వేతనంలో కనీసం 20 శాతం కూడా పెన్షన్ వచ్చే పరిస్థితిలేదు. ఈ నేపథ్యంలో.. 2019 ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ మేరకు సీపీఎస్‌ను రద్దుచేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.అయితే, సీపీఎస్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయినందున దీనిపై జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సుదీర్ఘ కసరత్తు చేశారు. 2004కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ విధానంలో పదవీ విరమణ తర్వాత ఎక్కువ పెన్షన్ రావడం.. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి చాలా తక్కువ పెన్షన్ రావడం వంటి అసమానతలు నెలకొన్నాయి. అలాగని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విదానంలోకి వెళ్తే రాష్ట్రాల ఆరి్థక వ్యవస్థలపై భవిష్యత్తులో పెనుభారం పడటమే కాకుండా జీతాలు, పెన్షన్లు చెల్లించలేని పరిస్థితి నెలకొంటుందని ఆర్బీఐ వంటి సంస్థల అధ్యయనాలు పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో.. సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేయాలనే తపనతో జగన్ సర్కారు సుదీర్ఘ కసరత్తు చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేలా గ్యారెంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్‌ను)ను రూపొందించింది. దీని ప్రకారం.. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.1 లక్ష జీతం ఉంటే రిటైరైన తర్వాత రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. 62 ఏళ్లకు రిటైరైతే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలన్న ఆలోచనతో ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచారు.సీపీఎస్‌లో మార్పులకు కేంద్రం కమిటీ.. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వోద్యోగుల డిమాండ్ నేపథ్యంలో జాతీయ పెన్షన్ స్కీం విధానంలో మార్పులు చేయడానికి కేంద్ర ఆరి్థక శాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీనీ ఏర్పాటుచేసింది. ఉద్యోగులు, ప్రభుత్వం తమతమ కంట్రిబ్యూషన్‌ను కొనసాగిస్తూనే 2004 తర్వాత చేరిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ వచ్చేలా మార్గాలను కేంద్ర కమిటీ అన్వేíÙంచింది. ఇందుకు సంబంధించిన సిఫార్సులతో ఇటీవల కేంద్రానికి ఆ కమిటీ నివేదిక సమరి్పంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ కూడా జగన్ సర్కారు తీసుకొచ్చిన జీపీఎస్‌లోని అంశాలనే సిఫార్సు చేసిందని, ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇక అప్పట్లో ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో దేశమే ఈ పెన్షన్ స్కీంను అమలుచేసే పరిస్థితి రాబోతుందని చెప్పారు. ఇప్పుడు అక్షరాలా అదే నిజమవుతోంది. జగన్ సర్కార్ చేసిన మార్పులివే.. 2004 పెన్షన్ సంస్కరణలను కాపాడుతూనే వైఎస్ జగన్ సర్కార్ జాతీయ పెన్షన్ స్కీంలో మార్పులు చేస్తూ జీపీఎస్‌ను తీసుకొచ్చింది. – ఇటు రాష్ట్రంపై ఆర్థిక భారం పెద్దగా పడకుండా ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం చివరి నెల బేసిక్ వేతనంలో 50 శాతం పెన్షన్ గ్యారెంటీని జగన్ సర్కారు ఇచ్చింది. – తద్వారా ఏపీజీపీఎస్లో ఉద్యోగులు రిటైరయ్యాక చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌కు గ్యారెంటీ ఇస్తోంది. – అలాగే, ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి హమీ ఇచ్చిన పెన్షన్‌లో 60 శాతం పెన్షన్ వస్తుంది.– ద్రవ్యోల్బణం ప్రకారం డీఆర్ వస్తుంది. – అంతేకాక.. ఉద్యోగులకు హెల్త్ స్కీం వర్తిస్తుంది. -
దేశానికే ఆదర్శంగా నిలిచిన వైఎస్ జగన్ పాలన
-
ఆకాశంలో శాటిలైట్ల లెక్క తెలుసా?
ఇంటర్నెట్ నుంచి జీపీఎస్ దాకా..వాతావరణ అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకం. ఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతూనే ఉన్నాయి. మరి మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లు ఎన్ని?.. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఓసారి తెలుసుకుందామా.. మూడు కక్ష్యల్లో.. ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 11వ తేదీ నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు తిరుగుతున్నాయి. అవి కూడా భూమి చుట్టూ మూడు కక్ష్యలలో తిరుగుతున్నాయి. అవి జియో స్టేషనరీ ఆర్బిట్ (జీఈఓ), మీడియం ఎర్త్ ఆర్బిట్ (ఎంఈఓ), లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ). ఇందులో జీఈఓ కక్ష్యలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి. ఖర్చు చాలా ఎక్కువ. అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువ. జీఈఓభూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్య ఇది. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు అనువైన ప్రాంతమిది. అంటే జీఈఓలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమ్మీద ఒకేప్రాంతంపైనే ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లను ఈ కక్ష్యలోనే ఉంచుతారు. ఎంఈఓభూమికి పైన 2 వేల కిలోమీటర్ల నుంచి 30 వేల కిలోమీటర్ల మధ్య ఉండే ప్రాంతం ఇది. జీపీఎస్, గ్లోనాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు వంటివాటిని ఈ కక్ష్యల్లో తిరిగేలా చేస్తారు.ఎల్ఈఓభూమికిపైన కేవలం 150 కిలోమీటర్లనుంచి 450 కి.మీ. మధ్య ఉండే ప్లేస్ ఇది. ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్ష్యల్లో ఉంటాయి. స్టార్ లింక్ శాటిలైట్లతో.. ప్రస్తుతమున్న శాటిలైట్లలో అత్యధికం ‘స్టార్ లింక్’శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలోని స్టార్ లింక్ కోసం 6,050 శాటిలైట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో స్పేస్‌లోకి పంపినవే కావడం గమనార్హం. త్వరలోనే మరో 6వేల శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. - సాక్షి సెంట్రల్‌డెస్క్ -
అప్పుల్లో అడుగునే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి విస్పష్టంగా కీలక ప్రకటన చేసింది. ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా పాటిల్, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అది కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న రీతిలో రాష్ట్రం అప్పులు లేనే లేవని పంకజ్ చౌదరి జవాబుతో తేలిపోయింది. 15వ ఆర్థి క సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను ఆర్బీఐ అధ్యయనం చేసిన అనంతరం వివిధ రాష్ట్రాల అప్పులను వెల్లడించిందన్నారు. పేదలను ఆదుకున్న డీబీటీ.. కోవిడ్ సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీ వృద్ధితో పాటు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్డీపీ వృద్ధి క్షీణించగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2.1 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 17.6 శాతం నికర వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022–23లో ఏపీలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 శాతం నికర వృద్ధి నమోదైందన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 2022–23లో దేశంలో తొమ్మిదో స్థానంలో (రూ.2,19,518) ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా, ఆర్థి క కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నగదు బదిలీని కొనసాగించిన విషయం తెలిసిందే. -
మార్చి నాటికల్లా టోల్ ప్లాజాలుండవ్!
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మార్చి నాటికల్లా ప్రస్తుత హైవే టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టనుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ మొదలైనవి వీటిలో ఉండనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాలు తెలిపారు. వాహనాలను ఆపకుండా ఆటోమేటిక్‌గా టోల్ వసూళ్లకు ఉపయోగపడే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌కు సంబంధించి తమ శాఖ రెండు పైలట్ ప్రాజెక్టులను నిర్వహించినట్లు వివరించారు. 2018–19లో టోల్ ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండగా.. 2020–21లో ఫాస్ట్‌ట్యాగ్‌లను ప్రవేశపెట్టిన తర్వాత క్రమంగా 47 సెకన్లకు తగ్గింది. దీంతో చాలా ప్రాంతాల్లో నిరీక్షణ సమయం తగ్గినప్పటికీ జనాభా ఎక్కువ ఉన్న నగరాలకు దగ్గర్లో పీక్ అవర్స్‌లో ఇప్పటికీ కొంత ఎక్కువగా నిరీక్షించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సాంకేతికతల పరిశీలన ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆ వాహనాలకు GPSలు
-
ఉద్యోగుల జీపీఎస్‌కు జాతీయ స్థాయిలో ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దానిపై లోతుగా అధ్యయనం చేస్తారు. నిబంధనలను అనుసరిస్తూనే, లబ్ధిదారులకు సాధ్యమైనంత ఎక్కువ మేలు చేసేలా దానిని రూపొందిస్తారు. ఇటువంటిదే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షన్ స్కీము (ఏపీజీపీఎస్). కేంద్ర ప్రభుత్వం 2004లో చేసిన పింఛను సంస్కరణలను కాపాడుతూనే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అటు ఉద్యోగులకు, ఇటు ప్రభుత్వానికి మేలు చేసేలా ఆంధ్రఫ్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన ఈ స్కీమ్‌పై జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయి పత్రికలు కూడా వైఎస్ జగన్ తెచ్చిన జీపీఎస్‌ను మంచి పథకంగా అభివర్ణిస్తున్నాయి. దీనిపై ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘మింట్’ బ్యానర్ కథనమే ప్రచురించింది. ఏపీజీపీఎస్ పింఛను సంస్కరణలను ఎలా కాపాడుతోందో ఈ కథనం వివరించింది. పదవీ విరమణ చేసిన తరువాత చివరి నెల డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పింఛను వచ్చేలా ఉద్యోగులకు ఏపీజీపీఎస్ ద్వారా గ్యారెంటీ కల్పిస్తూనే, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా ఆర్ధిక భారం పడకుండా సరికొత్త సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిందని మింట్ పత్రిక ప్రశంసించింది. వివేచనతో వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం పాత పింఛను పథకంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై భవిష్యత్‌లో మోయలేని ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ పెన్షన్ స్కీము ద్వారా పింఛను సంస్కరణలు తెచ్చింది. మెజారిటీ రాష్ట్రాలు కూడా 2004 నుంచి జాతీయ పెన్షన్ స్కీమును అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 2004 నుంచి ప్రభుత్వంలో చేరిన ఉద్యోగులందరికీ జాతీయ పెన్షన్ స్కీము అమలు చేస్తున్నారు. దీనినే ఎంప్లాయీస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీముగా (సీపీఎస్) కూడా పేర్కొంటారు. ఇందులో పింఛను ఎంత వస్తుందనేది మార్కెట్ పరిస్థితులనుబట్టి ఉంటుంది. కచ్చితంగా ఎంత వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పాత పెన్షన్ స్కీము అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వీటిపై లోతుగా అధ్యయనం చేసింది. భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పెన్షన్ సంస్కరణలపై రాజీపడకుండా మధ్యే మార్గంగా ఏపీజీపీఎస్ను తీసుకువచ్చిందని మింట్ పత్రిక ప్రశంసించింది. ఒక వేళ భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేయకుండా పాత పింఛను పథకాన్నే అమలు చేస్తే పదేళ్ల తరువాత ఉద్యోగులకు జీతభత్యాలిచ్చే పరిస్థితి కూడా ఉండదని, మొదటికే మోసం వస్తుందని తెలిపింది. రాజకీయం కోసం ఆలోచన చేయకుండా భవిష్యత్ తరాల కోసం, ఉద్యోగుల డిమాండ్‌లో కూడా న్యాయం ఉందని భావించి సుదీర్ఘ కసరత్తు చేయడంతోపాటు వివేచనతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఇటు ఉద్యోగులకు పెన్షన్ గ్యారెంటీ ఇస్తూనే, మరోపక్క రాష్ట్రం భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఏపీజీపీఎస్ను హైబ్రీడ్ మోడల్లో అమలుకు నిర్ణయం తీసుకుంది. తద్వారా 2004 పెన్షన్ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడింది. పాత పింఛను స్కీమును అమలు చేస్తే 2041 కల్లా అప్పు కూడా పుట్టని దశకు రాష్ట్రం చేరుతుంది. అంతే కాకుండా 2050కల్లా ద్రవ్యలోటు 8 శాతానికి చేరుతుంది. ఇవీ పింఛను స్కీములు పాత పింఛను విధానంపాత పెన్షన్ స్కీము అమలు చేయడం కేంద్రంపైన, రాష్ట్రాలపైన ఆర్థికంగా పెనుభారం పడుతుంది. దీన్ని భవిష్యత్‌లో కొనసాగించడం సాధ్యం కాదు. పెన్షన్ల భారం 4.5 రెట్లు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో జీతభత్యాలు కూడా ఇవ్వలేనంతగా భారం అవుతుంది. 2004లో తెచ్చిన జాతీయ పింఛను పథకం జాతీయ పెన్షన్ స్కీము కింద ఉద్యోగులకు వచ్చే పెన్షన్ పరిమాణాన్ని మార్కెట్ పరిస్థితులు నిర్ణయిస్తాయి. ఎంత పెన్షన్ వస్తుందనేది కచ్చితంగా చెప్పలేరు. అయితే ఈ స్కీము రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీజీపీఎస్ ఉద్యోగుల పదవీ విరమణ చేసిన తరువాత చివరి నెలలో డ్రా చేసిన మూల వేతనంలో 50 శాతం పెన్షన్‌కు గ్యారెంటీ ఇస్తోంది. ఉద్యోగి మరణిస్తే జీవిత భాగస్వామికి ఆ పెన్షనలో 60 శాతం వస్తుంది. ద్రవ్యోల్బణం ప్రకారం డీఆర్ వస్తుంది. హెల్త్ స్కీము కూడా వర్తిస్తుంది. -
ఉద్యోగులకు మేలు చేసే జీపీఎస్
-
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సీజన్లో దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లుచేస్తోంది. కల్లంలో పంట కొనుగోలు దగ్గర నుంచి మిల్లుకు తరలించే వరకు ఎక్కడా జాప్యం లేకుండా రైతుకు సంపూర్ణ మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రోడ్ మ్యాప్‌ను సిద్ధంచేస్తోంది. రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) స్థాయిలో ధాన్యం రవాణాకు దాదాపు 30వేలకు పైగా వాహనాలను అందుబాటులో ఉంచనుంది. ప్రైవేటు కాంట్రాక్టు వాహనాలతో పాటు రైతుల సొంత వాహనాలకు భాగస్వామ్యం కల్పిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఆర్బీకేల్లో వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. నిజానికి.. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఖరీఫ్‌లో పంట ఆలస్యంగా సాగైంది. ఫలితంగా నవంబర్ రెండో వారం తర్వాత కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో పది వాహనాలు.. రాష్ట్రవ్యాప్తంగా 3,500కు పైగా ఆర్బీకే క్లస్టర్లలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. సీజన్లో ఒక్కో ఆర్బీకే క్లస్టర్లో దాదాపు 10 వాహనాలను కేటాయించనుంది. కాంట్రాక్టర్ల నుంచి ముందస్తుగా కొంత సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించిన అనంతరం వారికి ధాన్యం తరలింపు కాంట్రాక్టును ఇస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం నిర్దేశించిన మిల్లుకు మాత్రమే అవి చేరేలా ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పర్యవేక్షించనుంది. ఆ తర్వాత బఫర్ గోడౌన్లకు తరలిస్తారు. ఆర్బీకేల వారీగా వివరాల సేకరణ.. ధాన్యం సేకరణలో ఎటువంటి టార్గెట్లు లేకుండా రైతుల నుంచి పూర్తిస్థాయిలో పంట కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ ఆర్బీకేల వారీగా పంట ఎంత ఉంది? రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోగా ఎంతమేరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుంది? అన్నదానిపై జిల్లాల వారీగా సమగ్ర నివేదికను సిద్ధంచేస్తోంది. దీని ఆధారంగా ముందస్తుగానే గోతాలు, రవాణా, హమాలీలను సమకూర్చనుంది. అలాగే, 10వేల మందికిపైగా టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్పర్లను తాత్కాలిక ప్రాతిపదికపైన నియమిస్తోంది. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో కలిపి సుమారు 4–5 నెలల పాటు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఆయా జిల్లాల వారీగా జేసీల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియను చేపట్టింది. ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనుంది. ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం ఇక గతంలో పంట దిగుబడి అంచనా ఆధారంగా ఒక ఎకరాకు ఎన్ని ధాన్యం బస్తాలు వస్తాయో లెక్కించేవారు. అనంతరం..ఈ–క్రాప్‌లో రైతు నమోదు చేసిన పంట విస్తీర్ణ వివరాలను, దిగుబడి అంచనాను బేరీజు వేసుకుని పౌరసరఫరాల సంస్థ రైతు నుంచి నిర్దేశించిన సంఖ్యలో ధాన్యం బస్తాలను సేకరించేది. దీంతో కొనుగోలు కేంద్రాల పరిధిలో అవసరౖమెన గోనె సంచులు, రవాణా వాహనాలు, హమాలీలను వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరిగేది. ప్రస్తుతం పంట దిగుబడి అంచనాతో సంబంధంలేకుండా గడిచిన ఐదేళ్లలో ఏ సంవత్సరం ఎక్కువ దిగుబడి వచ్చిందో ఆ సంఖ్యను ప్రస్తుత సీజన్‌కు అన్వయించుకుని కొనుగోళ్లకు ముందస్తుగానే ఏర్పాట్లుచేస్తోంది. ప్రభుత్వం రైతుకు మద్దతు ధర కల్పించడంతో పాటు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చులను సైతం అందిస్తోంది. టన్నుకు గోనె సంచుల వినియోగానికి రూ.85, హమాలీల కూలి రూ.220, సగటున 25 కిలోమీటర్ల ధాన్యం రవాణాకు రూ.468 చొప్పున మొత్తం జీఎల్టీ (గన్నీ లేబర్ ట్రాన్స్‌పోర్టు) కింద టన్నుకు రూ.2,523 లబ్ధిచేకూరుస్తోంది. రైతులు మిల్లుకు వెళ్లొద్దు.. రైతులు ఆర్బీకేలో ధాన్యం అప్పగించిన అనంతరం ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) అందిస్తాం. అందులో రైతు కొనుగోలు కేంద్రానికి ఇచ్చిన ధాన్యం బరువు, ప్రభుత్వ నుంచి వచ్చే మద్దతు ధర మొత్తం ఉంటుంది. ఒక్కసారి ఎఫ్టీఓ ఇచ్చిన తర్వాత రైతుకు ధాన్యం బాధ్యత ఉండదు. మిల్లుకు ఆర్బీకే సిబ్బందే తరలిస్తారు. ఏదైనా సమస్య వస్తే మిల్లు వద్ద డెప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారిని కస్టోడియన్ ఆఫీసర్‌గా నియమించి పరిష్కరిస్తాం. ఆర్బీకేలో పరీక్షించిన తేమ శాతాన్ని ఫైనల్ చేస్తాం. దీనిపై రైతులకు అవగాహన కల్పించేలా వీడియోలను రూపొందిస్తున్నాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ మిల్లర్లు గోనె సంచులు ఇవ్వాల్సిందే.. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌకదుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులు సేకరిస్తున్నాం. వీటిని ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచుతాం. ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చేలా మిల్లర్లకు ఆదేశాలిచ్చాం. ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్లు దీనిపై దృష్టిసారించారు. మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగిస్తాం. – వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ -
'బ్రా' ధరించిన పాక్ కెప్టెన్.. షాక్ తిన్న ఫ్యాన్స్; వీడియో వైరల్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమాని అడగ్గానే జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. అయితే అతను ఇచ్చిన గిఫ్ట్ కంటే బాబర్ ఆజం తాను వేసుకున్న ఇన్నర్ వేర్‌ను చూసి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. సాధారణంగా పురుషులు బనియన్ లేదా ట్రక్ వేసుకోవడం చూస్తుంటాం. అయితే మహిళలు ధరించే బ్రాను పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ధరించడం ఆశ్చర్యపరిచింది. నిజానికి బాబర్ ఆజం వేసుకున్నది స్పోర్ట్స్ బ్రా. ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ బ్రా మార్కెట్లో ట్రెండింగ్ లిస్టులో ఉంది. స్పోర్ట్స్ బ్రా లాగా ఉండే దీనిని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారు. ఇది భుజాల మధ్య వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు వాడుతుంటారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది ధరించిన వ్యక్తి కూడా దానిని గుర్తించలేనంత తేలికగా ఉంటుంది. ఈ పరికరంలో GPS ట్రాకర్ ఉంటుంది. ఇది ప్లేయర్ తన రన్నింగ్ స్పీడ్‌ని లెక్కించుకునేందుకు వాడుతుంటారు. ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. ఇది ఆటగాళ్ల కదలికలను 3Dలో కొలుస్తూ.. వారి స్థానాలను ట్రాక్ చేస్తుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది. దీని నుంచి అందుకున్న సమాచారంతో సెంట్రల్ డేటాబేస్ అనుసంధానిస్తుంటారు. ఇది విశ్లేషకులు పరిశీలన చేసి, ప్లేయర్ ఫిట్నెస్ను అంచనా వేస్తుంటారు. టీమిండియా ఆటగాళ్లు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. 2018లో భారత కండిషనింగ్ కోచ్ శంకర్ బసు దీనిని టీమిండియాకు తీసుకువచ్చాడు. ఇక పాకిస్తాన్ జట్టు ఇటీవలే శ్రీలంకలో పర్యటించిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి లంకకు గట్టిషాక్ ఇచ్చింది. సిరీస్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్ టీమిండియాను రెండో స్థానంలోకి నెట్టేసింది. లంకతో సిరీస్ ముగిశాకా పాక్‌కు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ వరకు ఆ జట్టుకు విశ్రాంతి లభించినట్లే. Babar Azam Gifted his Test Jersey to a Young Fan So Cute🇵🇰💯. #BabarAzam #NoChangeNeededPCB pic.twitter.com/KBMtBAYFcE — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) July 27, 2023 చదవండి: Major League Cricket 2023: 'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!' -
‘థ్యాంక్యూ సీఎం సార్’.. సీపీఎస్‌కు బదులు మెరుగైన జీపీఎస్
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలను ఉదారంగా పరిష్కరించిన సీఎం జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల తరపున కృతజ్ఞతలు తెలిపినట్లు రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ బదులు మెరుగైన పెన్షన్ వచ్చేలా జీపీఎస్ తేవడం, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం పట్ల ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్మోహన్రెడ్డి ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయడానికి వేగంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. 27 శాతం ఐఆర్ ఇచ్చారని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని, ఇవన్నీ ధైర్యం గల ముఖ్యమంత్రిగా జగన్ చేశారని తెలిపారు. ఆ తర్వాత కరోనా మహమ్మారితో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోవడంతో వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారని, పీఆర్సీ కూడా ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోయారని, ప్రభుత్వ ఉద్యోగులుగా వీటిని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. జీపీఎస్ దేశానికే రోల్‌మోడల్ జీపీఎస్‌లో ఉద్యోగులకు తొలుత బేసిక్‌లో 30 శాతం వరకే పెన్షన్ వచ్చేలా ప్రతిపాదనలు చేస్తే ముఖ్యమంత్రి స్వయంగా బేసిక్‌లో 50 శాతం పెన్షన్ వచ్చేలా మార్పులు చేశారని, అలాగే సీపీఎస్‌లో లేని డీఆర్‌ను జీపీఎస్‌లోకి తెచ్చారని, గతంలోకన్నా మెరుగ్గా ఉందని సీపీఎస్ ఉద్యోగలు చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన జీపీఎస్ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారని, ఏ రాష్ట్రంలోనూ జీపీఎస్ ప్రయోజనాలు లేవని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయం సాహసోపేతమైనదని కొనియాడారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 15 వేల కుటుంబాలకు మేలు చేశారని అన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ 60 రోజుల్లో అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. జీపీఎస్ విధివిధానాలు వచ్చిన తరువాత ఉద్యోగుల్లో ఉన్న అపోహలు తొలిగిపోతాయని చెప్పారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు గత ప్రభుత్వం ఆరు నెలలకోసారి వేతనాలు ఇచ్చేదని, ఈ ప్రభుత్వంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటే వేతనాలు ఇస్తున్నారని తెలిపారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను నిర్మూలించారని గుర్తు చేశారు. 12వ పీఆర్సీని ముందుగానే ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతులు తెలిపినట్లు వెంకటరామిరెడ్డి తెలిపారు. అశోక్‌బాబుకు సవాల్ ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టీడీపీ నేత అశోక్‌బాబు మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారని, ఆయన బహిరంగ చర్చకు వస్తే టీడీపీ మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ, ఇప్పటి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినవి ఎన్ని అమలు చేసిందీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో చాలావరకు అమలు చేసిందని, ఇంకా ఏమైనా ఉంటే అమలు చేయడానికి ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను టీడీపీ ప్రభుత్వం రైగ్యులరైజ్ చేయలేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ధైర్యంగా 10 వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. చదవండి: ఏపీకి చల్లని కబురు.. మరో రెండు రోజుల్లో.. -
ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అడగకుండానే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసినందుకు.. సీపీఎస్ ఉద్యోగులకు ఊరటనిస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చి నందుకు.. పది వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు.. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎంతో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా సీఎం పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఉద్యోగుల కోసం పరితపిస్తున్న సీఎం జగన్ ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నారు. అడగకుండానే 12వ పీఆర్సీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా.. చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిర్ణయంతో వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించారు. ఏపీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసి... ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ ద్వారా 50 శాతం ఫిట్మెంట్తో పెరిగే ధరలకు అనుగుణంగా డీఏలు ఇచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పడం ద్వారా భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. మా కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. జగన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ఎత్తున పాలాభిషేకాలు చేస్తున్నారు. – బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం మానవతామూర్తి సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ 2008లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఇచ్చి న మాట మేరకు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి. గతంలో పీఆర్సీ కోసం రోడ్డెక్కితే టీడీపీ సర్కార్ గుర్రాలతో ఉద్యోగులను తొక్కించింది. ఇప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం వైఎస్ జగన్ పీఆర్సీని ప్రకటించి.. ఉద్యోగుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. – శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్జీవో సంఘం ఎప్పటికీ రుణపడి ఉంటాం.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రత్నాకర్ బాబు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత జీపీఎస్‌తో మేలు జరుగుతుందని భావిస్తున్నాం జీపీఎస్‌లో పది శాతం ఉద్యోగి షేర్, ప్రభుత్వ షేర్ కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారెంటీ పింఛన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. జీపీఎస్‌తో ఉద్యోగులకు 60 శాతం ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాం. – మురళీ మోహన్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత 15 ఏళ్ల సమస్యకు సీఎం పరిష్కారం ఆస్పత్రుల్లో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. రెగ్యులర్ ఉద్యోగులమైనా మాకు జీతాలు రావటం లేదు. కానీ సీఎం జగన్ దృష్టికి రాగానే ఒకే ఒక్క సంతకంతో సమస్య తీర్చారు. వైద్య విధాన పరిషత్ ద్వారా అత్యంత మెరుగైన సేవలు అందిస్తాం. – సురేష్ కుమార్, ఏపీవీపీ సంఘం నేత నా 23 ఏళ్ల సర్విసులో ఇది అద్భుతం నా 23 ఏళ్ల సర్విసులో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పరికరాలు ఏర్పాటు చేయడం అద్భుతం. కాంట్రాక్టు ఉద్యోగులమైన మమ్మల్ని రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – వీఏవీఆర్ కిశోర్, ఏపీ కాంట్రాక్టు ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
మీరు బాగుంటేనే ప్రజలు బాగు
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా సరే చేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములని, వారంతా చిరునవ్వుతో ఉండేలా చూస్తామని అన్నారు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని, ఉద్యోగుల మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కొత్తగా.. జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీం) తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, 12వ పీఆర్సీ ఏర్పాటు సహా పలు అంశాలపై ఈ నెల 7వ తేదీన జరిగిన కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సదర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ఏమన్నారంటే.. పరిష్కారాల కోసం తపనపడ్డాం ♦ ఉద్యోగుల మనసు కష్టపెట్టకూడదనే ఉద్దేశంతోనే పెన్షన్ సహా కొన్ని సమస్యల పరిష్కారాల కోసం రెండేళ్లుగా తపన పడ్డాం. గతంలో ఎవరూ కూడా ఒక పరిష్కారం కోసం ఇంతగా తపన పడిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి.. అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలనే ఆలోచన చేశాం. వీటన్నింటి దృష్ట్యా జీపీఎస్ తీసుకువచ్చాం. ♦ రిటైర్డ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించాం. బేసిక్ జీతంలో 50 శాతం అంటే రూ.లక్ష జీతం ఉంటే రూ.50 వేలు రిటైర్ అయిన తర్వాత పింఛన్ వస్తుంది. 62 ఏళ్లకు రిటైర్ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని ఆలోచన చేశాం. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం. ♦ ఉద్యోగులకు న్యాయం జరగాలి.. మరోవైపు నడపలేని పరిస్థితులు రాకుండా కూడా చూడాలని ఆలోచించాం. సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. దీనికోసం రెండేళ్లపాటు ఆర్థిక శాఖ సుదీర్ఘ కసరత్తు చేసింది. ఫలితంగా జీపీఎస్‌కు రూపకల్పన చేశాం. చదవండి: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి మంచి జరిగేలా అడుగులేశాం ♦ న్యాయంగా, ధర్మంగా ఉద్యోగులకు మంచి జరగాలని ప్రతి అడుగులో కనిపించే విధంగా చేశాం. ఇది సంతృప్తినిచ్చే అంశం. అసలు చాలా మంది ఎఫర్ట్ కూడా పెట్టరు. ఇంత ఆలోచన చేయాల్సిన పని ఏముందని అనుకుంటారు. అలా చేస్తే పరిష్కారం రాదు. అందుకే తొలిసారిగా పరిష్కారం దిశగా అడుగులు వేశాం. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా మంచి ఆలోచన చేశాం. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం. నా దగ్గరకు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన కంటే ముందు పదేళ్లను విండోగా అధికారులు నిర్ణయించారు. అలాగైతే మరీ ఆలస్యమవుతుందని ఐదేళ్లకు తగ్గించాం. తద్వారా గరిష్టంగా ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నాం. చిరునవ్వుతో ఉండేలా చేస్తాం ♦ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులను కూడా ప్రభుత్వంలో విలీనం చేశాం. 010 ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చినట్లుగా వీరికి జీతాలు సమయానికి రావు. పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో కూడా వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకున్నాం. ♦ ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వం వైపు నుంచి ఏ రకమైన మంచి జరగాల్సి ఉన్నా, మీ మొహంలో (ఉద్యోగులు) చిరునవ్వు ఉండేలా చేస్తాం. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలకూ మంచి జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. ♦ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఊహించినట్లే విషం కక్కారు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా రామోజీ?
ప్రభుత్వ నాన్ గెజెటెడ్ ఉద్యోగులకు సంబంధించి సీపీఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బదులు జీపీఎస్ అంటే గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను ఏపీ ప్రభుత్వం తీసుకు వస్తే, దానిలో ఉన్న పాజిటివ్, నెగిటివ్ పాయింట్లను విశ్లేషించవలసిన ఒక వర్గం మీడియా దారుణమైన రాతలకు పాల్పడింది. అసలు వార్తను కాకుండా, ఉద్యోగులకు దగా..దగా.. అంటూ పెద్ద బ్యానర్ హెడింగ్ పెట్టిన ఈనాడు మీడియాను ఏమనాలి!. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఈ రకంగా చండాలంగా మాట్లాడడానికి సాహసించలేదు. కాని ఈనాడు మాత్రం ఏదో విధంగా ఉద్యోగులను రెచ్చగొట్టాలని విశ్వయత్నం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు నిజంగా అసంతృప్తి చెంది ఉంటే ఈపాటికి ఎంత ఆదోళన వచ్చేది. అది జరగలేదనే బాధతో ఈనాడు మీడియా తనే ప్రతిపక్షం అనుకుని జర్నలిజం విలువలకు పాతరేస్తూ రాసింది. మామూలుగా అయితే ఏమి చేయాలి?. ముందుగా అసలు క్యాబినెట్ నిర్ణయం ఏమిటి? దాని పరిణామం ఏమిటి? అన్నదాని గురించి తొలుత వార్తను ఇవ్వాలి. ఆ తర్వాత నిజంగా ఎన్.జి.ఓ.లకు అన్యాయం జరిగితే దాని గురించి ఇవ్వవచ్చు. అవేమీ చేయకుండా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు దగా చేశారని నీచంగా రాశారు. గత ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మాట నిజమే. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై గట్టిగా పరిశీలన చేశారు. అదే సందర్భంలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టెక్నికల్ గా ఉన్న సమస్యలు ఇంతగా ఉంటాయని ఊహించలేదని, అయినప్పటికీ, దానికి ప్రత్యామ్నాయంగా మెరుగైన జీపీఎస్‌ను తీసుకు వస్తున్నామని కొంతకాలం క్రితమే ప్రకటించారు. ఇలా నిజాయితీగా ఎంతమంది చెబుతారు. గతంలో చంద్రబాబు నాయుడు రైతుల రుణమాఫీకి సంబంధించి ఎన్ని విన్యాసాలు చేశారో గుర్తు లేదా!. చివరికి రుణమాఫీ చేసేశాం అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. అలా అసత్యాలు చెప్పినవారేమో గొప్పవారట. ఇప్పుడు నిజాయితీగా సమస్యను వివరించినవారేమో దగా చేసినట్లట. ఇలా ఉంది ఈనాడు మీడియా సూత్రీకరణ. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జగన్ ఇచ్చిన హామీలు పదింటిలో ఎనిమిదిని నెరవేర్చితే దాని గురించి చెప్పరు. మిగిలిన రెంటిలో కొంతమేర తీర్చారు. అయినా సీపీఎస్ రద్దు చేయలేదని, దగా అని చెడరాశారు. మరి చంద్రబాబు టైమ్‌లో ఎందుకు దానిని రద్దు చేయలేదు?. పోనీ ఎన్.జి.ఓలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ఎన్ని అమలు చేశారు? వాటిపై ఎప్పుడైనా సమీక్షకు ఎల్లో మీడియా సిద్దం అవుతుందా? ఆ పని చేయరు. కేవలం బురదచల్లుడే లక్ష్యంగా పెట్టుకున్నారు. చదవండి: జగన్ దూకుడు.. పచ్చ బ్యాచ్‌కి కడుపులో మంట దీని అంతటికి ఒకటే కారణం. తమకు కావల్సినవారు అధికారంలో లేరన్న దుగ్దతో పాటు , తమ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలోని ఆర్ధిక అక్రమాలన్నిటిని జగన్ ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతోందన్న కసి, కక్షతో ఇలాంటి నీచమైన రాతలకు పాల్పడుతోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినా ఈ మీడియాది ఏడుపుగానే ఉంది. ఇంకా కొంతమంది ఉన్నారు.. వారికి అన్యాయం చేశారు అని రాస్తారు. ముందుగా ఈ నిర్ణయాన్ని స్వాగతించి ఆ తర్వాత రాస్తే ఫర్వాలేదు. ఆ పని చేయరు. సీపీఎస్ బదులు వచ్చిన జిపిఎస్ లో ఉద్యోగి రిటైర్ అయ్యాక చివరి నెల బేసిక్ లో ఏభై శాతం మొత్తాన్ని పెన్షన్ తో పాటు ఏటా రెండు రెండు కరువు భృతి(డి.ఆర్.) ఇవ్వాలని సంకల్పించారు. దీనివల్ల ఉద్యోగికి నష్టం ఏమీ ఉండదు. తొలుత చివరి జీతం బేసిక్ లో 33శాతం పెన్షన్ గా ఇవ్వాలని ప్రతిపాదించినా, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ దానిని ఏభై శాతంగా చేశారు. ఉన్నంతలో మెరుగైన స్కీమ్ తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది. దానికి ప్రధాన ఉద్యోగ సంఘాలు కూడా దాదాపుగా ఓకే చేశాయి. మంత్రివర్గ ఉప సంఘం భేటీలో ఈ మేరకు ఒక అవగాహన కూడా కుదిరింది. అయినా ఉద్యోగ ,ఉపాధ్యాయ సంఘాలు దీనిపై భగ్గుమంటున్నట్లుగా ఈనాడు, జ్యోతి వంటి తెలుగుదేశం మీడియా శక్తి వంచన లేకుండా దుష్ప్రచారం చేశాయి. ఒక విషయాన్ని విశ్లేషించడం వేరు. విషపూరితంగా రాయడం వేరు. ఎల్లో మీడియా చేస్తున్నది విషపూరిత ప్రచారమే తప్ప ఇంకొకటి కాదు. కొంతకాలం క్రితం టీచర్లు తమ డిమాండ్ ల కోసం విజయవాడకు వచ్చారు. అప్పుడు ఈ మీడియాలు పండగ చేసుకున్నాయి. కాని ఆ తర్వాత ప్రభుత్వం ఆయా అంశాలలో తీసుకుంటున్న శ్రద్ద కారణంగా అలజడి పెద్దగా లేదు. అది ఈనాడుకు, జ్యోతికి కడుపు మంటగా ఉంటోంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా వారు ప్రభుత్వంపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన మనసులో మాట పుస్తకంలో అసలు ప్రభుత్వపరంగా ఉద్యోగాలు ఇవ్వడాన్ని తప్పు పట్టారు. కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థను ప్రోత్సహించింది ఆయనే. తత్ఫలితంగానే ఒకే పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలలో భారీ వ్యత్యాసం చోటు చేసుకుంది. ఇప్పుడు జగన్ దానిని తొలగించే యత్నంచేస్తే అది కూడా వెన్నుపోటే అని తప్పుడు వార్తలు రాశారు. చంద్రబాబు 2004 కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు 54 మూసివేశారు. అప్పుడు ఆయనను గొప్ప సంస్కరణవాదిగా ఈనాడు ప్రచారం చేసింది. ఇప్పుడేమో టిడిపి పూర్తిగా తిరోగమనంలో ఉన్నా ఈనాడుకు తియ్యంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులతో వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉంటోంది. వారిని తన కుటుంబ సభ్యులని జగన్ పలుమార్లు ప్రకటించారు. అదే చంద్రబాబు టైమ్‌లో అయితే ఉద్యోగులను ఎన్ని రకాలుగా యాతనలకు గురి చేసేవారో అనుభవించినవారందరికి తెలుసు. కేవలం కొద్ది మంది నాయకులను మేనేజ్ చేసి చంద్రబాబు ప్రభుత్వం కధ నడిపేది. కాని జగన్ ఉద్యోగుల అవసరాలను తీర్చే క్రమంలో ముందుకు వెళుతున్నారు. ఈనాడు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఇంతగా గగ్గోలు పెడుతోంది కదా! తన సంస్థలలో ఉద్యోగుల పట్ల ఇలాగే కనికరంతో ఉంటున్నదా? వారికి కూడా మంచి పెన్షన్ స్కీమ్ ఇవ్వాలని ఎప్పుడైనా భావించిందా?ఈనాడుకు మంచి లాభాలే వస్తాయి కదా! కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల జీతాలపై అప్పుడప్పుడు ట్రిబ్యునల్లను ఏర్పాటు చేస్తుంటుంది. వారి సిఫారస్‌లను యాజమాన్యాలు అమలు చేయవలసి ఉంటుంది. కాని ఎప్పుడూ ఆ సిఫారస్ లను యాజమాన్యాలు ఒప్పుకునేవి కావు. ఈనాడు రామోజీరావు అయితే తన సంస్తలోని జర్నలిస్టులందరితో తమకు సగం జీతాలు ఇస్తే చాలని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడాచేయించుకున్న ఘట్టాలు ఉన్నాయి. అసలు తమ సంస్థలలో యూనియన్లనే అనుమతించని రామోజీరావు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల గురించి మాత్రం చాలా బాదపడుతున్నారు. వీరి రాతలను చూసి ఉద్యోగులు మోసపోకూడదనే ఈ విషయాలు చెప్పడం జరుగుతోంది. వారికి ఇంకేమైనా కోరికలు ఉంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పరిష్కరించుకోవచ్చు. ఈనాడు, జ్యోతి రాసే అబద్దాలు నమ్మి భిన్నమైన మార్గంలోకి వెళితే, అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వేధింపులు కాని, సమయం మించి పని కాని పెద్దగా లేవు. అదే చంద్రబాబు టైమ్ లో అయితే ఆయన సోది ఉపన్యాసం వినలేక చచ్చేవారమని పలువురు అధికారులు, ఉద్యోగులు వాపోతుండేవారు. జగన్ తాను మాట ఇచ్చిన నేపధ్యంలో దానిని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. అదే చంద్రబాబు అయితే దానిని ఎలా ఎగవేయాలా అని ఆలోచిస్తుంటారు. ఎన్నికల ప్రణాళికలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. కనుక ఉద్యోగులు వీటన్నిటిని గమనించి ప్రభుత్వంతో ఏర్పడిన సుహృద్భావ వాతావరణాన్ని కొనసాగిస్తారని ఆశిద్దాం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? -
ఉప్పొంగిన ఉద్యోగి!
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల విశ్రాంత జీవనానికి పూర్తి భరోసా కల్పిస్తూ జీపీఎస్ తేవడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధి కరణ, వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం తదితర నిర్ణయాలను కేబినెట్ ఆమోదించటాన్ని స్వాగతిస్తున్నారు. 20 ఏళ్ల కల నెరవేరిందని కాంట్రాక్టు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సంబరాలు చేసుకున్నారు. వేతనాలు, సెలవుల రెగ్యులరైజేషన్, ఇతర అంశాల్లో జాప్యానికి ఇక తెరపడనుందని పేర్కొంటున్నారు. గొల్లపూడిలోని ఏపీవీవీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ డాక్టర్ పి.సరళమ్మ, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, వైద్య విధాన పరిషత్ డాక్టర్ల జేఏసీ చైర్మన్ డాక్టర్ రోహిత్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డిని కలిసి యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్‌కి ధన్యవాదాలు తెలియచేస్తూ రాçష్ట్రవ్యాప్తంగా వారం పాటు సంబరాలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి పిలుపునిచ్చారు. ♦ దివంగత వైఎస్సార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్చిత్రపటాలకు విశాఖ కలెక్టరేట్ ఎదుట ఎన్జీవోలు, కాంట్రాక్టు ఉద్యోగులు క్షీరాభిషేకం నిర్వహించారు. సీఎం సార్ ధన్యవాదాలంటూ కృతజ్ఞతను చాటుకున్నారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో ఉరేగింపు నిర్వహించారు. పీఆర్సీ, బకాయిల చెల్లింపు తదితర నిర్ణయాలపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఈశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ ఉద్యోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ఎస్.చలం పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్లోని ఎన్జీవో హోమ్‌లో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ♦ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా భట్లవెల్లిలో సీఎం జగన్ చిత్రపటానికి వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఇందులో మంత్రి విశ్వరూప్ పాల్గొన్నారు. ♦ తెనాలిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలివ్వాలని నిర్ణయించటం సంతోషకరమన్నారు. ♦ చిత్తూరులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట, తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సూళ్లూరుపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు సీఎం చిత్రపటానికి క్షీభిషేకం నిర్వహించారు. ♦ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నెల్లూరు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 115 మంది కాంట్రాక్టు అధ్యాపకులు రెగ్యులరైజ్ కానున్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డితో కలసి నగరంలోని కేఏసీ జూనియర్ కళాశాల ఎదుట సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ♦ ముఖ్యమంత్రి జగన్ చేసిన మేలును జన్మలో మరువలేమని రాష్ట్ర కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం ప్రతినిధులు ఎస్.దొరబాబు, వేణుగోపాలరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు చాటుకున్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమను పట్టించుకోకపోగా జీతాలు పెంచిన పాపాన పోలేదని చెప్పారు. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధి కరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి విజయవాడ సత్యనారాయణపురంలోని కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ట్రేడ్ యూనియన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్, తిరుపతి జోనల్ ఇన్చార్జ్ నారపరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ♦ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధి కరణ నిర్ణయంపై ఏపీ పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఏలూరులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు చాటుకుంది. సుమారు 3,500 మంది రెగ్యులర్ కానున్నట్లు యూనియన్ జిల్లా అధ్యక్షుడు నల్లా అప్పారావు తెలిపారు. ♦ ఉత్తరాంధ్రలో జియ్యమ్మవలస, కురుపాం, బొబ్బిలిలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేయాలంటూ కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి పుష్పగుచ్ఛం అందజేశారు. -
Manifesto: 99 శాతం పూర్తి.. దేశ చరిత్రలోనే తొలిసారి
(సాక్షి, అమరావతి) : ఓట్లడిగేటప్పుడు వందలకొద్దీ హామీలివ్వటం... తీరా ఆ ఓట్లతో గెలిచాక హామీలను పక్కనబెట్టడం!. దశాబ్దాలుగా ఇక్కడ చూస్తున్నది అదే. అలవికాని హామీలను చూసి చూసి అలసిపోయిన జనం... ఎన్నికలప్పుడు పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకు విలువివ్వటమే మానేశారు. వాటినసలు చూడకుండానే పక్కనబెట్టేస్తున్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లో... ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. నాడు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్ సీపీ తరఫున ఒకే ఒక పేజీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తానని స్పష్టంగా చెప్పారు. జనం జై కొట్టారు. ఓ కొత్త చరిత్రకు అంకురార్పణ జరిగింది. మరి సింగిల్ పేజీ మేనిఫెస్టోతో ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేశారు? ఆ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేశారా? దీనికి నిజాయితీగా వినవచ్చే సమాధానం ఒక్కటే. అది... ‘ఆ రెండూ తప్ప’ అని!. ఎందుకంటే మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకున్న జగన్... తొలి ఏడాదే దాన్లో పేర్కొన్న 95 శాతం హామీలను అమల్లోకి తెచ్చారు. మిగిలిన సంక్లిష్టమైన హామీలను కూడా సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకుంటూ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. కాకపోతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను (సీపీఎస్) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను (ఓపీఎస్) తిరిగి అమల్లోకి తెస్తామన్న హామీని అమలు చేయలేకపోయారు. ఓపీఎస్‌ను తిరిగి తేవటం ఆచరణ సాధ్యం కాదని తేలినా... ఉద్యోగులకిచ్చిన హామీ మేరకు మెరుగైన పెన్షన్ పథకాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం రెండేళ్లుగా రకరకాల గ్రూపులతో చర్చించి కసరత్తు చేస్తూ వచ్చింది. చివరకు వారి ప్రయోజనాలను కాపాడేలా గ్యారంటీడ్ పెన్షన్ పథకానికి (జీపీఎస్) రూపకల్పన చేసింది. ఉద్యోగ వర్గాలంతా ఈ జీపీఎస్‌పై సంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీన్ని అమల్లోకి తేవటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది కూడా. ఇక అమలు కాని హామీల్లో రెండవది మద్య నియంత్రణ. దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గిస్తూ చివరకు దాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నా... రకరకాల సాంకేతిక, ఆర్థిక కారణాలతో పూర్తి స్థాయిలో ఆ హామీ అమలు కాలేదు. కాకపోతే నియంత్రణ దిశగా బలమైన అడుగులుపడ్డాయి. 2018–19తో పోలిస్తే విక్రయాలు 50 శాతానికన్నా తగ్గాయంటే నియంత్రణ దిశగా అడుగులు పడ్డాయన్నది స్పష్టంగా తెలియకమానదు. కాకపోతే ఈ రెండంశాలూ హామీ ఇచ్చినట్లుగా నూటికి నూరు శాతం అమలు కాలేదు కనక... మేనిఫెస్టోలో 99 శాతమే అమలయ్యిందని చెప్పాలి. నూటికి 99 శాతం మార్కులే ఇవ్వాలి. ఇక్కడ గమనించాల్సిందొక్కటే. అసలు మేనిఫెస్టోను ఇంత చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వాలను మనమెన్నడైనా చూశామా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఏం జరిగిందో ఎవరికి తెలియదని? 2014లో ఆయన ఇచ్చిన ఏ హామీనైనా గెలిచాక అమలు చేశారా? అసలు మేనిఫెస్టోనే పార్టీ వెబ్సైట్లో నుంచి తొలగించిన చరిత్ర ఆయనది. ఒకటికాదు రెండు కాదు... వందలకొద్దీ హామీలనిచ్చారు. కానీ తొలి నాలుగున్నరేళ్లూ ఒక్క హామీని కూడా పట్టించుకోలేదు. మళ్లీ 2019లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయనగా హడావుడిగా కొన్ని హామీలను అరకొరగానైనా అమలు చేశామని చూపించుకోవటానికి ప్రయత్నించారు. కొద్ది మంది ఖాతాల్లో రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతిని జమచేయటం... పసుపు కుంకుమ కింద మహిళల ఖాతాల్లో నగదు వేయటం... ఇవన్నీ ఎన్నికలకు కేవలం రెండుమూడు నెలల ముందు చేశారు. అంతేకాదు! ఈ రాష్ట్రానికి తీరప్రాంతమే మణిహా రమంటూ రకరకాల గ్రాఫిక్‌లు చూపించి... ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు పోర్టులకు శంకుస్థాపనలంటూ హడావుడి చేశారు. భోగాపురం విమానాశ్రయానిదీ అదే కథ. విచిత్రమేంటంటే ఇలా ఏ హామీనీ అమలు చెయ్యని చంద్రబాబు నాయుడు... 2019 ఎన్నికల్లో మాత్రం తాను చెప్పివన్నీ చేశానని, మళ్లీ గెలిపిస్తే ఇంకేదో చేస్తానంటూ స్వర్గాన్ని గ్రాఫిక్‌లలో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు కూడా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిజాయితీగా తన పనితీరుకు మార్కులు వేసుకుంటున్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేయటానికి ప్రయత్నించటంతో పాటు రెండంశాలు తప్ప మిగిలివన్నీ 100 శాతం అమలు చేశారు. 99 శాతం మార్కులు సాధించగలిగారు. రాజకీయ వర్గాలు ఈ రెండు మేనిఫెస్టోలనూ ‘విశ్వసనీయత– వంచన’తో పోలుస్తున్నది కూడా అందుకేనేమో!!. ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే.. రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలతో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించాక 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మరుక్షణమే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ.. వృద్ధాప్య పింఛన్‌ను పెంచే ఫైలుపై తొలి సంతకం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 56 శాతం పదవులు ఇచ్చి సామాజిక విప్లవానికి తెరతీశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. నవరత్నాలతో 95 శాతం హామీలను అమలు చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ మాట తప్పకుండా వాటిని కొనసాగించారు. ఉద్యోగులు అడగక ముందే 12వ పీఆర్సీ (పే రివిజన్ కమిషన్) ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం... సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా జీపీఎస్ (గ్యారంటీ పెన్షన్ స్కీమ్) విధానానికి ఆమోదం తెలపటం... కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడంతో మేనిఫెస్టో అమల్లో మరింత ముందడుగు వేసినట్లయింది. 99 శాతం హామీలను నెరవేర్చినట్లయింది. ఇబ్బందుల్లోనూ చెప్పిన దాని కంటే మిన్నగా.. 2020లో ప్రపంచ వ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి ప్రభావం రాష్ట్రంపైనా పడింది. ఆర్థిక ఇబ్బందులను సృష్టించింది. కరోనా కష్టకాలంలోనూ.. ఆర్థిక ఇబ్బందులున్నా హామీల అమల్లో సీఎం వైఎస్ జగన్ వెనుకంజ వేయలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ అమలు చేశారు. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతులకు ఇస్తాన ని మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్.. దాన్ని మరో వెయ్యి పెంచి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చేలా అమలు చేస్తున్నారు. అంటే.. రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు అదనంగా రూ. 17,500 ప్రయోజనం చేకూరుస్తున్నారు. మేనిఫె స్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర పథకాలనూ అమల్లోకి తెచ్చారు. 2019 ఎన్నికల తర్వాత.. జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్.. తిరుపతి లోక్‌సభ, ఆత్మకూరు, బద్వే లు శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సాధించడమే ఆయనపై జనానికున్న నమ్మకానికి నిదర్శనం. అర్హతే ప్రామాణికం కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అంతే పారదర్శకంగా అమలు చేస్తున్నారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.16,786 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇతరత్రా రూపాల్లో లబ్ధి చేకూర్చిన పథకాలు కూడా కలిపితే (డీబీటీ ప్లస్ నాన్ డీబీటీ) లబ్ధిదారులకు రూ.3.10 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి పేరిట ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతోపాటు పక్కా గృహాన్ని మంజూరు చేసి, నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇలా 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన దాఖాలు గతమెన్నడూ లేవు. -
సెల్యూట్ సీఎం సార్
సాక్షి, అమరావతి/లబ్బీపేట/రామచంద్రపురం/గుంటూరు మెడికల్/గాంధీనగర్: కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉన్నాయని పలు ఉద్యోగ సంఘాల నేతలు, జేఏసీల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చి ఎన్నో వేల కుటుంబాలకు మేలు చేకూర్చారని పేర్కొంటూ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 13,000 మంది ఉద్యోగులకు మేలు ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ప్రభుత్వ శాఖగా మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఏపీవీవీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో 13,000 ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేకూరనుందని చెప్పారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకూ 010 పద్దు ద్వారా జీతాలు చెల్లింపులు చేపడతారని వెల్లడించారు. కాగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని ఏరియా ఆసుపత్రి వద్ద ఏపీవీవీపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. నిరుద్యోగులకు ఎంతో ఊరట ఏపీలోని నిరుద్యోగులకు ఊరట కలిగించేలా కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. జాబ్ క్యాలెండర్‌కు 10,000 పోస్టులను గుర్తించడంపై హర్షం వ్యక్తం చేశారు. టెట్ కమ్ డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీస్, ఎస్ఐ, ఫైర్, జైల్ వార్డెన్స్, మెడికల్ అండ్ హెల్త్, సచివాలయాలు, వర్సిటీల్లో ఉన్న బోధన,బోధనేతర సిబ్బంది భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం శుభ పరిణామమన్నారు. జీపీఎస్ అమలుపై కృతజ్ఞతలు ఒకేసారి 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టి తమ జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా జీపీఎస్ అమలుతో పెన్షన్ భరోసా కల్పించినందుకు ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కృతజ్ఞతలు తెలిపింది. సీఎం జగన్‌కు తాము మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నట్లు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ జాని పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి రత్నం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరి, రామకృష్ణా రెడ్డి, హరీంద్ర, కిరణ్, కార్యనిర్వాహక కార్యదర్శి సుభాని, పుల్లారావు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు సీపీఎస్‌కు బదులుగా జీపీఎస్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలపడంపై సీఎం వైఎస్ జగన్‌కు పీటీడీ(ఆర్టీసీ) వైఎస్సార్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. 50 శాతం కనీస పింఛన్‌తో పాటు డీఏలు వర్తించే విధంగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేసింది. ఈ విధానంతో ఆర్టీసీ ఉద్యోగులకు గరిష్టంగా లబ్ధి చేకూరుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేఎం నాయుడు, ఉపాధ్యక్షురాలు లత తెలిపారు. జీపీఎస్‌తో ఎంతో మేలు కేబినెట్లో ఉద్యోగులకు సంబంధించి 5 అంశాలకు ఆమోదం లభించింది. డీఏ కోసం ఇచ్చిన జీవోను ర్యాటిఫై చేశారు. అన్ని జిల్లా కేంద్రాలకు సమానంగా 16% హెచ్ఆర్ఏ అమలు చేస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. కొత్త పీఆర్సీ కమిషన్ వేయడం అభినందనీయం. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు మేలు చేసేలా జీపీఎస్ తీసుకువచ్చారు. ఈ స్కీమ్ కిందకు వచ్చే వారికి చివరి పే స్కేల్లో 50% ఇస్తూ, దానికి అదనంగా డీఏ ఇచ్చేలా తీసుకున్న నిర్ణయం హర్షణీయం. పాత పెన్షన్ స్కీమ్‌కు, జీపీఎస్‌కు మధ్య ఒకటే తేడా ఉంది. పీఆర్సీ ఒక్కటే లేదు. డీఏ కూడా ఫిక్స్ చేశారు. ప్రతీ ఆర్నెల్లకు 2% డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. హౌస్‌సైట్స్ విషయంలో సీఎం సానుకూలంగా ఉన్నారు. జగనన్న లేఅవుట్లలో 10% కేటాయించారు. 20% డి స్కౌంట్ ఇచ్చారు. ప్రత్యేకంగా స్థలాలు కేటాయించేందుకూ సుముఖంగా ఉన్నారు. 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన అవుట్సోర్సింగ్ ఉ ద్యోగులను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్చి క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. – కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎం జగన్‌ది సంక్షేమ సంతకం ఇచ్చిన హామీల అమల్లో పేటెంట్ రైట్ ఏదైనా ఉంటే అది సీఎం వైఎస్ జగన్‌దే. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. సీఎం జగన్ సంతకమే సంక్షేమ సంతకం. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతో వారంతా సీఎం జగన్‌కు రుణపడి ఉంటారు. – పి.గౌతంరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ దశాబ్దాల కలను నెరవేర్చారు కాంట్రాక్ట్ ఉద్యోగుల దశాబ్దాల కలను సీఎం జగన్ నెరవేర్చారు. ఈ మేలును ఎన్నటికీ మరువలేము. కేబినెట్లో క్రమబద్ధీకరణ తీసుకున్న క్షణం మా ఇళ్లలో పండుగ వాతావరణం కనిపించింది. సుధీర్ఘ నిరీక్షణకు సీఎం జగన్ చరమగీతం పలికారు. – రవికుమార్, కొలకలూరి రత్నాకర్‌బాబు, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ ఫార్మాసిస్ట్స్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ చాలా సంతోషంగా ఉన్నాం సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ నిర్ణయం ఎంతో సంతోషానిచ్చింది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తోన్న వారికి మేలు జరుగుతుంది. ఇప్పుడు 1,500 మందిని క్రమబద్ధీకరిస్తారు. వీరితోపాటే మిగిలిన వారినీ క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం. – గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం రుణపడి ఉంటాము చంద్రబాబు సీఎంగా ఉండి 1994లో పోస్టుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ సీఎం జగన్ సానుకూల నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. మా కుటుంబాలు సీఎం జగన్‌కు రుణపడి ఉంటాయి. – ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం.. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కొత్త డీఏ అమలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. ఉద్యోగ, కార్మిక, పెన్షనర్ల సమస్యలు, డిమాండ్లపై కేబినెట్లో సానుకూల నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. –డీ శ్రీను, రాష్ట్ర అధ్యక్షుడు, డీపీఆర్టీయూ 10వేల కుటుంబాల్లో వెలుగులు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌ను కలిసి వైద్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాము. తాను అధికారంలోకి వస్తే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తానని జగన్ హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని నెరవేర్చారు. క్రమబద్ధీకరణ నిర్ణయంతో 10 వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. – అరవ పాల్, అధ్యక్షుడు ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ పీఆర్సీ ఏర్పాటు హర్షణీయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావలసిన 12వ పేరివిజన్ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయం. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. – వినుకొండ రాజారావు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ మంచి నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర చరిత్రలో ఏ సీఎం తీసుకోని గొప్ప నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 7 వేల మందికి లబ్ధి చేకూరనుంది. 2014 నాటికి సర్వీస్‌లో ఉన్నవారందరినీ క్రమబద్ధీకరించినట్లయితే మరో 4 వేల మందికి మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 110 మంది రెగ్యులర్ అవుతున్నారు. – బి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ -
ఉద్యోగికి ‘గ్యారెంటీ’ భరోసా.. సీపీఎస్‌తో పోలిస్తే మరింత మెరుగ్గా జీపీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శాశ్వత, కాంట్రాక్టు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను రూపొందించింది. దీనిద్వారా ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత చేకూరనుంది. రిటైర్ అయిన ఉద్యోగి చివరి నెల మూలవేతనంలో 50 శాతం పెన్షన్, ప్రతి ఆర్నెల్లకు ఒకసారి కరువు భృతి (డీఆర్) ఇవ్వడం ద్వారా మెరుగైన పెన్షన్‌ను అందించనుంది. దీంతోపాటు ఉద్యోగులు అడగకుండానే 12వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) ఏర్పాటుతోపాటు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ లాంటి కీలక అంశాలకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాకు వివరాలు వెల్లడించారు. మాట ప్రకారం సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగుల దశాబ్దాల కలను నెరవేర్చారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీర్చిదిద్దినట్లు వివరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి భద్రతనిచ్చేలా రూపొందించిన జీపీఎస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి వేణు ఇంకా ఏమన్నారంటే.. ఉద్యోగుల జీతాలను దాటేస్తుంది.. సీపీఎస్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లేకపోవడంపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీపీఎస్‌ను రద్దు చేస్తూ సంతకం చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. కానీ ఆ తర్వాత ఓపీఎస్‌ను మళ్లీ అమల్లోకి తెస్తే భవిష్యత్తు తరాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. పెన్షన్ల మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేసి మోయలేని స్థాయికి చేరుకుంటుంది. 2041 నాటికి రాష్ట్ర బడ్జెట్లో రూ.65,234 కోట్లు పెన్షన్ల కోసమే చెల్లించాల్సి వస్తుంది. రుణాలపై చెల్లింపులతో కలిపి రాష్ట్ర సొంత ఆదాయంలో 220 శాతానికి చేరుకుంటుంది. 2070 నాటికి ఈ చెల్లింపులు సుమారు రూ.3,73,000 కోట్లకు చేరుతుంది. ఏదో ఒక దశలో ఈ మోయలేని భారాన్ని తట్టుకోలేక 2003 మాదిరిగానే మళ్లీ ఓపీఎస్‌ను రద్దు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించి సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్‌ను తీసుకొచ్చాం. సీపీఎస్‌తో అనిశ్చితి.. ప్రస్తుత సీపీఎస్ విధానం 01–09–2004 తర్వాత ఉద్యోగాల్లో చేరిన వారికి వర్తిస్తుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్‌లో 10 శాతం జీతాన్ని పెన్షన్ ఫండ్‌కు బదిలీ చేస్తుండగా అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత కార్పస్‌లో 60 శాతాన్ని ఉద్యోగి తీసుకుని 40 శాతం సొమ్మును యాన్యుటీ పెన్షన్ స్కీంలో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంది. ఇదంతా మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. పూర్తి అనిశ్చితి ఏర్పడితే రావాల్సిన పెన్షన్‌కూ గ్యారెంటీ ఉండటం లేదు. బేసిక్ శాలరీలో 20.3 శాతమే పెన్షన్‌గా వచ్చే అవకాశం ఉండగా అది కూడా వడ్డీరేట్లపై ఆధారపడి వస్తుండటంతో భద్రత ఉండటం లేదు. జీపీఎస్‌తో గ్యారంటీ ఇలా.. సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానం ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్‌కు పూర్తి గ్యారంటీ ఇస్తుంది. ఇందులోనూ సీపీఎస్‌లో చెల్లించినట్లే ఉద్యోగి 10 శాతం పెన్షన్ వాటాగా చెల్లిస్తే ప్రభుత్వం కూడా అంతే కడుతుంది. ఉద్యోగ విరమణ సమయంలో చివరి జీతంలో బేసిక్‌లో 50 శాతం పెన్షన్‌గా అందుతుంది. ఇక్కడ సీపీఎస్‌తో పోలిస్తే పెన్షన్ 150 శాతం అధికంగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ప్రకటించే డీఏలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రెండు డీఆర్లు ఇస్తుంది. ఉదాహరణకు రిటైరైన ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతం రూ.లక్ష ఉంటే అందులో రూ.50 వేలు పెన్షన్‌గా వస్తుంది. ఏడాదికి రెండు డీఆర్‌లతో కలుపుకొని ఇది ఏటా పెరుగుతుంది. 62 ఏళ్లకు రిటైర్ అయ్యే వ్యక్తి మరో ఇరవై ఏళ్ల తర్వాత అంటే 82 ఏళ్ల వయసులో జీపీఎస్ ద్వారా రూ.1,10,000 పెన్షన్‌గా తీసుకుంటారు. తద్వారా రిటైర్డ్ ఉద్యోగి జీవన ప్రమాణాలను కాపాడినట్లు అవుతుంది. సీపీఎస్‌లో ఇలాంటి వెసులు బాటు లేదు. దేశానికే ఆదర్శంగా జీపీఎస్ దేశంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ ఓపీఎస్‌ను అమలు చేస్తున్నట్లు ప్రకటించినా అమల్లోకి తీసుకురాలేకపోతున్నాయి. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనే ఉద్దేశంతో సుదీర్ఘ కసరత్తు చేసి జీపీఎస్‌ను తీసుకొస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శంగా నిలవనుంది. 2070 నాటికి జీపీఎస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వ్యయం క్రమంగా పెరుగుతూ రూ.1,33,506 కోట్లకు చేరుకుంటుంది. ఇందులో రూ.1,19,520 కోట్లు ప్రభుత్వమే బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. మాట ఇచ్చి.. నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది 2014 జూన్ 2 నాటికి ఐదేళ్లు సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. కటాఫ్ తేదీకి 10 ఏళ్లు ఉండాలని అధికారులు సిఫార్సు చేస్తే సీఎం జగన్ ఐదేళ్లకు తగ్గించారు. దీంతో మేనిఫెస్టో హామీల్లో 99.50 శాతం అమలు చేసినట్లైంది. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్త జిల్లాల్లోనూ ఒకేలా హెచ్ఆర్ఏ ఉండేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో 16 శాతం హెచ్ఆర్ఏ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా కొన్ని జిల్లా కేంద్రాల్లో 12 «శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ 16 శాతానికి పెరుగుతుంది. 2022 జనవరి 1వతేదీ నుంచి డీఏ, డీఆర్ 2.73 శాతం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.200 కోట్ల అదనపు భారం పడనుంది. 6,840 కొత్త పోస్టుల మంజూరు నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెచ్చింది. వివిధ శాఖల్లో సుమారు 6,840 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదించింది. వీటిల్లో 3,920 రిజర్వ్ పోలీసు ఉద్యోగాలు సహా నూతన వైద్య కళాశాలలు, పలు విద్యా సంస్థల్లో భారీ ఎత్తున కొత్త పోస్టులను కల్పించింది. ప్రభుత్వంలోకి వైద్య విధాన పరిషత్ ఏపీ వైద్య విధాన పరిషత్ 1986 యాక్ట్‌ను రద్దు చేసి ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’ శాఖగా మార్చి ప్రభుత్వంలో విలీనం చేయడానికి వీలుగా చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైద్య విధాన పరిషత్ స్వయం ప్రతిపత్తి నుంచి ప్రభుత్వంలోకి మారడం ద్వారా 14,658 మంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 010 పద్దు కింద వేతనాలను చెల్లించనుంది. -
జీఎస్ఎల్వీ ప్రయోగం సక్సెస్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): రెండోతరం నావిగేషన్ ఉపగ్రహ సిరీస్‌లో మొదటిదైన ఎన్వీఎస్–01 ఉపగ్రహ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్‌లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(షార్)లోని రెండో లాంచింగ్ప్యాడ్ వేదికైంది. 27.5 గంటల కౌంట్‌డౌన్ ముగిశాక సోమవారం ఉదయం 10.42 గంటలకు ఎన్వీఎస్–01 ఉపగ్రహాన్ని 51 మీటర్ల పొడవు, 420 టన్నుల బరువైన జీఎస్ఎల్వీ రాకెట్ భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు (పెరీజి), భూమికి దూరంగా 36,568 కిలోమీటర్లు (అపోజీ) దీర్ఘవృత్తాకార భూ బదిలీ కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. 2,232 కేజీల ఉపగ్రహం అక్కడ స్ధిరంగా ఉన్నట్లు బెంగళూరు దగ్గర్లోని హసన్‌లోని గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ అందాయి. జీఎస్ఎల్వీ వాహకనౌకను వాడటం ఇది 15వ సారి. 2021 ఆగస్టులో ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎఫ్10 అపజయం పాలవడంతో ఆనాటి క్రయోజనిక్ స్థాయి తప్పిదాలను సరిచేసి ఈసారి ప్రయోగాన్ని విజయవంతం చేశారు. మరో రెండు మూడు రోజుల్లో మూడు దశల్లో పెరీజీని పెంచుతూ అపోజీని తగ్గిస్తూ భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాన్ని చేరుస్తారు. అమెరికా జీపీఎస్, రష్యా గ్లోనాస్ తరహాలో భారత సొంత నావిగేషన్ వ్యవస్థ అయిన నావ్ఐసీ(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్– గతంలో భారత క్షేత్రియ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ)ను బలోపేతం చేసే దిశగా ఈ కొత్త తరం ఉపగ్రహాన్ని ఒక పాత ఉపగ్రహం స్థానంలో భర్తీ చేస్తున్నారు. అయితే ప్రయోగం విజయవంతం కావడంతో షార్‌లోని మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడారు. ఇది ఇస్రో సాధించిన సమష్టి విజయమని అన్నారు. భారతదేశ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ ఉపగ్రహాలను ఆరు నెలకొకసారి ప్రయోగిస్తామని తెలిపారు. GSLV-F12/ NVS-O1 Mission is accomplished. After a flight of about 19 minutes, the NVS-O1 satellite was injected precisely into a Geosynchronous Transfer Orbit. Subsequent orbit-raising manoeuvres will take NVS-01 into the intended Geosynchronous orbit. — ISRO (@isro) May 29, 2023 తొలిసారిగా దేశీ అణుగడియారం ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు నావిక్ సిరీస్ కొత్త ఉపగ్రహాలు ఎంతగానో దోహదపడతాయి. గతంలో పంపిన ఉపగ్రహాల్లో ఎస్–బ్యాండ్, కె–బ్యాండ్, కేయూ–బ్యాండ్ లాంటి ఉపకరణాలను అమర్చారు. ఈసారి నావిక్–01 ఉపగ్రహంలో ఎల్–1, ఎల్–5, ఎస్–బ్యాండ్ సిగ్నల్స్ వ్యవస్థను అమర్చారు. ఎల్–1లో పౌరులకు ఉపయోగపడే సివిలియన్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ను పరిచయం చేశారు. సమయం, స్థానం అత్యంత ఖచ్చితంగా తెలిపే తొలిసారిగా దేశీయంగా తయారుచేసిన రుబీడియం అణుగడియారాన్ని ఉపగ్రహంలో అమర్చారు. ఆటమిక్ క్లాక్‌ను తయారుచేస్తే సత్తా ప్రపంచంలో చాలా తక్కువదేశాలకే ఉంది. నావిగేషన్ ఉపగ్రహాల వ్యవస్థలో ఇప్పటికే ఏడు ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థను అందిస్తున్నారు. ఇందులో నాలుగు ఉపగ్రహాలకు కాలపరిమితి ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవాటిని పంపుతున్నారు. కొత్త ఉపగ్రహాలతో భూ, జల, వాయు మార్గాల్లో పొజిషన్‌ను 20 మీటర్ల అత్యంత ఖచ్చితత్వంతో, 50 నానోసెకన్ల రియల్‌టైమ్‌తో చూపించడం, అత్యవసర సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహన చోదకులకు దిశా నిర్ధేశం, ఇంటర్నెట్తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఈ ఉపగ్రహ వ్యవస్థ దోహదపడుతుంది. దేశానికి ఆవల సైతం 1,500 కిలోమీటర్లదాకా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. -
కొంప ముంచిన గూగుల్ మ్యాప్.. నేరుగా సముద్రంలోకి - వీడియో
ఆధునిక కాలంలో టెక్నాలజీ వేగంగా పరుగులు పెడుతోంది. కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే చేతిలో స్మార్ట్‌ఫోన్ లేదా జిపిఎస్ నావిగేషన్‌కి సపోర్ట్ చేసే ఏదైనా పరికరం ఉండే చాలు. అయితే ఈ టెక్నాలజీ కొన్ని సార్లు ప్రమాదంలోకి నెట్టి వేస్తుంది. అలాంటి సంఘటన ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇటీవల వెల్లడైన ఒక వీడియో హవాయిలోని హోనోకోహౌ హార్బర్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక కారు ఏకంగా సముద్రపు నీటిలోకి దూసుకెళ్లడం, అందులో ఒక మహిళ ఉండటం చూడవచ్చు. అయితే చివరికి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ కారు నీటిలోకి వెళ్లడం వల్ల అందులో ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇందులో కనిపించే కారుని డ్రైవ్ చేస్తున్న మహిళ జిపిఎస్ నమ్ముకుని కారుని డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే అక్కడ సమీపంలో ఉన్న కొంత మంది ఈ సంఘటన గమనించి ఆమెను రక్షించారు. కాబట్టి ఎవరికీ ఎటువంటి హాని జరగకుండా ప్రాణాలతో బయటపడగలిగారు. ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే మొదటి సారి కాదు. (ఇదీ చదవండి: రూ. 2.5 కోట్ల ఉద్యోగం వద్దనుకున్నాడు.. ఇప్పుడు కోట్లలో టర్నోవర్ - ఎవరీ కన్హయ శర్మ?) గతంలో ఒక వ్యక్తి జిపిఎస్ నమ్ముకుని అడవిలో చిక్కుకుని నానా అగచాట్లు పడ్డాడు. ఇంకో సంఘటనలో కొంత మంది ప్రాణాలే కోల్పోయారు. కావున జిపిఎస్ అన్ని వేళలా గమ్యాన్ని చేరుస్తాయని నమ్ముకోకూడదు, కావున కొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తుల సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఆలా కాకుండా సొంత తెలివితేటలు నమ్ముకుంటే అనుకోని ప్రమాదాలను ఆహ్వానించినవారవుతారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
కదలకుండా చుట్టిరావొచ్చు! ‘పర్యాటకం’లో వర్చువల్ విప్లవం
సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో కూడా సాంకేతికత కీలకభూమిక పోషిస్తోంది. వర్చువల్, ఆగుమెంటెడ్ రియాల్టీ (వీఆర్, ఏఆర్) సరికొత్త పర్యాటక అనుభూతులను అందిస్తోంది. పర్యాటక ప్రదేశాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టిసారించాలని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకటించడం సాంకేతికత అవసరానికి ఊతమిస్తోంది. దీనితో పాటు నేషనల్ డిజిటల్ టూరిజం మిషన్‌లో భాగంగా యునిఫైడ్ టూరిజం ఇంటర్ఫేస్ కోసం కేంద్ర పర్యాటక శాఖ కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) వెబ్‌పోర్టల్, టూరిస్టు డెస్టినీ యాప్‌లను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఇప్పటికే ఏపీ మ్యూజియాల్లో వీఆర్, ఏఆర్‌లు విశేష ఆదరణ పొందుతున్నాయి. శిల్పారామాల్లో సైతం 12డి వర్చువల్ అనుభూతులను విస్తరిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో లేజర్ షో, ప్రొజెక్షన్ మ్యాపింగ్‌లను కూడా అభివృద్ధి చేస్తోంది. వర్చువల్ టూరిజం ఇలా.. వర్చువల్ టూర్లు కేవలం ఒకే స్థలంలో కూర్చోవడం ద్వారా పర్యాటకులు కోరుకునే ప్రదేశాలను చుట్టిరావచ్చు. దేశంలోని కళలు, సంస్కృతి, గొప్ప వారసత్వ సంపద దృష్ట్యా వర్చువల్ టూరిజం అద్భుతమైన వైవిధ్యాన్ని అందిస్తోంది. ఇక్కడ పర్యాటకులు వీఆర్ కళ్లజోళ్లు ధరించి రిమోట్ కంట్రోల్‌ను ఉపయోగిస్తూ గమ్యస్థానాల్లో కలియదిరిగే అనుభూతిని పొందుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఇలా.. తమిళనాడు టూరిజం శాఖ వీఆర్ ఆధారిత బుక్లెట్ల ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీని అభివృద్ధి చేసి వెబ్సైట్లో సైతం అందుబాటులో ఉంచింది. 2016లో గుజరాత్ టూరిజం సింధు లోయలోని లోథాల్, ధోలవీర, రాణి–కి–వావ్‌తో సహా అనేక పురాతన ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో లైవ్ యాక్షన్ వీఆర్ వీడియోలను రూపొందించింది. 2021లో కేరళ టూరిజం శాఖ వర్చువల్ టూర్ గైడ్ కోసం ఏఆర్ యాప్‌ని తీసుకొచ్చింది. ఇది రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను కలుపుతూ రియల్ టైమ్ ఆడియో వీడియో గైడ్‌గా ప్రసిద్ధి చెందింది. యాప్ సాయంతో.. నిత్యం పెరుగుతున్న పర్యాటక యాప్‌లతో ట్రావెల్, టూరిజం పరిశ్రమ పోటీపడాల్సి వస్తోంది. ఢిల్లీ టూరిజం శాఖ ‘దేఖో మేరే ఢిల్లీ’ యాప్.. అన్ని టికెట్ల బుకింగ్‌తో పాటు పర్యాటకులు ఒకే ప్లాట్ఫామ్లో సకల యాత్రలను ప్లాన్ చేసుకునే వీలుకల్పిస్తోంది. ప్రసిద్ధ వారసత్వ కట్టడాలను వైబ్‌సైట్ ద్వారా వర్చువల్ వాక్–త్రూలను అందిస్తోంది. మరోవైపు మ్యూజియాలు సైతం ఆన్లైన్ ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. (చదవండి: ఆక్వాకు ఉజ్వల భవిత..స్టేక్ హోల్డర్స్ సమావేశంలో కీలక నిర్ణయాలు) -
భారత్‌కు దిక్సూచి ‘నావిక్’.. జీపీఎస్ కంటే మెరుగైన సేవలు!
అది 1999.. కశ్మీర్‌లోని కార్గిల్ శిఖరాలను ఆక్రమించిన పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థలను తరిమికొట్టేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టింది. ఉగ్రవాదుల అనుపానులను తెలుసుకోవడానికి అమెరికా నావిగేషన్ వ్యవస్థ ‘గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) సహకారాన్ని ప్రభుత్వం కోరింది. అయితే భారత వినతిని అమెరికా తిరస్కరించింది. ఈ ఘటన భారత్ సొంతంగా నావిగేషన్ వ్యవస్థ రూపొందించుకునేందుకు బీజం వేసింది. అదే ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ (నావిక్). 2018 నుంచి దేశంలో రక్షణ, పోలీసు శాఖలు ఉపయోగిస్తున్న ఈ నావిక్ వ్యవస్థ త్వరలోనే దేశ ప్రజలకూ అందుబాటులోకి రానుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అవసరం.. ఆధునిక సమాచార, సాంకేతిక యుగంలో నావిగేషన్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు అమెరికా నావిగేషన్ వ్యవస్థ జీపీఎస్‌పైనే భారత్‌తో సహా పలు దేశాలు ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధాలు, ఉగ్ర దాడులు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో అమెరికా తన జీపీఎస్‌ను ఇతర దేశాలకు అందుబాటులో లేకుండా చేస్తోంది. దీంతో సొంత నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఆయా దేశాలకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా, జపాన్ వంటి దేశాలు సొంతంగా నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సొంత నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఇస్రోను ఆదేశించింది. దీంతో ‘ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు కింద ఇస్రో భారత నావిగేషన్ వ్యవస్థ.. ‘నావిక్’ను రూపొందించే ప్రక్రియను 2006లో ప్రారంభించింది. రూ.1,400 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2012 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అనివార్య కారణాలతో 2018 నాటికి ఇది పూర్తయింది. అప్పటి నుంచి కేంద్ర రక్షణ శాఖతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు శాఖలు నావిక్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు, ప్రకృతి విపత్తులు, సహాయ–పునరావాస కార్యక్రమాలు, వాహనాల ట్రాకింగ్ తదితర అవసరాలకు నావిక్‌ను ఉపయోగిస్తున్నారు. ‘జీపీఎస్’ కంటే కచ్చితం.. అమెరికా జీపీఎస్ కంటే నావిక్ మనదేశానికి సంబంధించినంతవరకు మెరుగైన, కచ్చితమైన నావిగేషన్ పరిజ్ఞానాన్ని అందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. భూస్థిర కక్ష్యలో 3,600 కి.మీ. ఎత్తులో ఉన్న 8 ఉపగ్రహాలను సమ్మిళితం చేసి ఈ నావిగేషన్ వ్యవస్థను రూపొందించారు. అమెరికా జీపీఎస్‌కు మార్గనిర్దేశం చేస్తున్న ఉపగ్రహాల కంటే నావిక్‌కు అనుసంధానించిన ఉపగ్రహాలు ఎక్కువ ఎత్తులో ఉండటం విశేషం. నావిక్.. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ బాండ్లను ఉపయోగించుకుంటూ పనిచేస్తోంది. దీంతో జీపీఎస్ కంటే మెరుగైన, కచ్చితమైన జియో పొజిషనింగ్‌తో కూడిన సమాచారాన్ని అందిస్తోంది. భారత భూభాగంతోపాటు మన దేశ సరిహద్దుల నుంచి 1,500 కి.మీ. పరిధిలో ప్రాంతానికి సంబంధించిన జియో పొజిషనింగ్ సమాచారాన్ని కూడా కచ్చితంగా అందించే సామర్థ్యం ‘నావిక్’ వ్యవస్థ సొంతం. కాగా అమెరికా, రష్యా, చైనాల నావిగేషన్ వ్యవస్థలు భూమి మీద ఏ ప్రాంతంలోనైనా జియో పొజిషనింగ్ సమాచారాన్ని అందించే సామర్థ్యం కలిగి ఉన్నాయి. అదే రీతిలో భూగోళమంతా నావిగేషన్ సమాచారాన్ని అందించే సామర్థ్యానికి నావిక్‌ను తీర్చిదిద్దే పనిలో ఇస్రో ఉంది. మరికొంత సమయం కావాలంటున్న కంపెనీలు.. ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న నావిక్‌ను దేశ ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. 2023 జనవరి నుంచి భారత్‌లో విక్రయించే మొబైల్ ఫోన్లలో నావిక్ పరిజ్ఞానాన్ని పొందుపరచాలని మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు యాపిల్, శాంసంగ్, షావోమీ మొదలైనవాటికి గత నెలలో స్పష్టం చేసింది. అయితే నావిక్ పరిజ్ఞానాన్ని పొందుపరిచేందుకు తమ మొబైల్ ఫోన్ల హార్డ్‌వేర్‌లో మార్పులు చేయాల్సి ఉన్నందున మరికొంత సమయం కావాలని కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 2023లో భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టాల్సిన మొబైల్ ఫోన్ల ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించినందున ఈ మేరకు గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేశాయి. అమెరికా జీపీఎస్‌ను అందిస్తున్న ఎల్1 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే ‘నావిక్’ను కూడా అందించాలని కొన్ని కంపెనీలు ప్రతిపాదించాయి. ఇలా అయితే జీపీఎస్, నావిక్ రెండింటిని అందించే రీతిలో మొబైల్ ఫోన్లను రూపొందించొచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ఇస్రో తిరస్కరించింది. తాము సొంతంగా ఎల్5 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీలోనే నావిక్‌ను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. ఈ విషయంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. కాగా దేశంలో విక్రయించే మొబైల్ ఫోన్లలో ఎప్పటి నుంచి నావిక్ అందుబాటులోకి రానుందనే అంశంపై త్వరలో స్పష్టత రానుంది. -
సౌర తుపాను!.. జీపీఎస్, రేడియో సిగ్నళ్లకు అంతరాయం
న్యూయార్క్: సౌర తుపాను మంగళవారం భూమిని తాకనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే జీపీఎస్, రేడియో సిగ్నళ్ల ప్రసారంలో అంతరాయం తప్పదు. ఈ నెల 19న సూర్యగోళం నుంచి విడుదలయ్యే పాము ఆకారంలోని ఫిలమెంట్ (సౌర తుపాను) ప్రభావం నేరుగా భూమికి ఢీకొట్టే ఆస్కారముందని డాక్టర్ తమిథా స్కోవ్ చెప్పారు. దీనివల్ల భూమిపై పలు ప్రాంతాల నుంచి ఆకాశంలో ధ్రువకాంతి (అరోరా) వీక్షించవచ్చని అన్నారు. అనంతరం మరికొన్ని చిన్నపాటి సౌర తుపాన్లు విరుచుకుపడే ప్రమాదముందన్నారు. ఈ నెల 20, 21న జి1–క్లాస్ తుపాను రావచ్చని స్పేస్‌వెదర్ సంస్థ ప్రకటించింది. సౌర తుపాను సమయంలో సూర్యుడి నుంచి వెలువడే శక్తి భూమిపై అన్ని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏడాదిపాటు ఉత్పత్తి చేసే కరెంటు కంటే లక్ష రెట్లు అధికం. -
జీపీఎస్‌తోనే భద్రత
సాక్షి, అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) కంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) చాలా మెరుగైందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. దానిపై చర్చించాలని మరోసారి ఉద్యోగ సంఘాలను కోరింది. సీపీఎస్ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) ప్రభుత్వం తట్టుకునే పరిస్థి తి లేదని, సీపీఎస్ వల్ల ఎలాంటి భద్రత లేదని చెప్పారు. అందుకే మధ్యేమార్గంగా జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనిగురించి లోతుగా చర్చించి ఇంకా మెరుగుపరిచేందుకు సల హాలివ్వాలని నేతలను కోరారు. జీపీఎస్ తమకు ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. అన్ని అంశాలపై మరింత లోతుగా చర్చించి అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు నష్టం లేకుండా నిర్ణయం తీసుకునేందుకు మరోసారి సమావేశమవుదామని మంత్రులు, ప్రభుత్వ సలహాదారు చెప్పారు. పీఆర్సీకి సంబంధించి ఇంకా విడుదల కావాల్సిన ప్రభుత్వ ఉత్తర్వులను త్వరగా విడుదల చేసేందుకు చర్య లు తీసుకుంటామని మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కార్యదర్శి ఎన్.గుల్జార్, కార్యదర్శి (సర్వీసెస్) హెచ్.అరుణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయ ణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ ఎన్.ప్రసాద్ పాల్గొన్నారు. -
ఉద్యోగ సంఘాలతో చర్చలు.. సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో జీపీఎస్‌పై చర్చించినట్లు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని ఉద్యోగులను కోరామన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని గతంలో చెప్పిన మాట వాస్తవమేనన్నారు. అయితే సీపీఎస్ వల్ల నష్టం కలుగుతుందనే జీపీఎస్ ప్రతిపాదన తెచ్చామన్నారు. జీపీఎస్‌తో ఉద్యోగులకు పెన్షన్ భద్రత కలుగుతుంది. సీపీఎస్ రద్దు వల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై భారం పడదు. కానీ ఓపీఎస్‌తో భవిష్యత్‌లో మోయలేని భారం పడుతుంది. అందుకే సీఎం జగన్ బాధ్యతగా భవిష్యత్ కోసం ఆలోచించారు. ఉద్యోగులకు నచ్చజెప్పి జీపీఎస్‌లో ఏమైనా అదనపు ప్రయోజనాలు కావాలంటే పరిశీలిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (ఎక్కడికెళ్లినా మాతృభూమిని మర్చిపోకండి: గవర్నర్ హరిచందన్) -
CPS వల్ల ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై భారం పడదు: సజ్జల
-
మొబైల్ ఫోన్లు కొంప ముంచుతున్నాయి!
యుద్ధంలో బాంబులు వేసుకోవడం మామూలే. ఆ బాంబులు ఎక్కడ వేయాలో నిర్ణయించడానికి రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో సెల్‌ఫోన్ లను వాడుతున్నారంటే ఎవరికీ వింతగా తోచడం లేదు. అవి అధునాతనమయిన స్మార్ట్ ఫోన్లయినా; కేవలం కాల్స్, మెసేజ్‌లు మాత్రమే పంపగల సింపుల్ ఫోన్లయినా సైనికులందరికీ అందుబాటులో ఉండి సాయం చేస్తున్నాయి. ఇరుపక్షాల వారు ఎదుటివారి కదలికలను, స్థావరాలను గుర్తించడానికి ఈ ఫోన్లు సాయపడుతున్నాయి. మొబైల్ ఫోన్లు అన్నీ దగ్గరలోని కమ్యూనికేషన్ టవర్‌కు సంకేతాలు పంపుతుంటాయి. వాటి ఆధారంగానే కాల్స్, మెసేజెస్ వీలవుతాయి. ఈ మధ్యన ఈ సంకేతాల ఆధారంగా నేరస్థులను, ఇతరులను అనుసరించి ఆరా తీయడం మామూలయింది. మూడు టవర్ల నుంచి సంకేతాలను ‘ట్రయాంగులేషన్’ అనే పద్ధతిలో విశ్లేషిస్తే, వాటిని పంపిన ఫోన్ ఉన్న స్థలం తెలిసిపోతుంది. దీంతో రష్యా–ఉక్రెయిన్ సైన్యాలు దీన్ని అనువుగా వాడుకుని శత్రుపక్షం ఆచూకీ సులభంగా తెలుసుకుంటున్నాయి. ‘ఇదేదో, ఇదుగో నేను నీ లక్ష్యాన్ని’ అని వీపు మీద బొమ్మ గీసుకుని తిరుగుతున్నట్లయిందని అంటారు యూకేలోని సర్రె విశ్వవిద్యాలయం పరిశోధకులు అలన్ వుడ్‌వర్డ్. ఇక రష్యావారు ఒక అడుగు ముందుకు వేసి ‘లియత్–3’ అనే సిస్టమ్‌ను తయారు చేశారు. ఇందులో మొబైల్ ఫోన్ టవర్స్లాగ పనిచేసే డ్రోన్స్ ఉంటాయి. అవి ఆరు కిలో మీటర్ల పరిధిలోనున్న సుమారు రెండు వేలకు పైగా మొబైల్ ఫోన్ల ఆచూకీ తెలుసుకునే శక్తి గలవి. ఈ రకంగా అధికారులను అనుసరించి మట్టుబెట్టిన సందర్భాల గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వివరంగా రాశారు. ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, టార్గెట్ అక్విజేషన్, రీకన్నాయిజాన్స్ అంటే కంప్యూటర్ వాడకం సాయంగా గమ్యాలను గుర్తించే ‘ఇస్తార్’ సిస్టమ్‌లు ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక క్షణాల్లో గమ్యాలను తెలుసుకుని మిసైల్స్ ప్రయోగించే వీలు కలుగుతున్నది. (క్లిక్: యుద్ధ నివారణే పాలకుల కర్తవ్యం!) ఇక స్మార్ట్ ఫోన్లలో ‘జీపీఎస్’ అనే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఉంటుంది. అది సులభంగా ఎదుటివారికి అందరి స్థావరాల ఉనికినీ అందజేస్తుంది. అన్నింటికీ మించి యుద్ధరంగంలోని సైనికులను భయానికి గురిచేసే, సందేశాలు కూడా మొబైల్ ఫోన్లలో వస్తున్నాయి అంటారు ‘కోపెన్ హేగెన్ యూనివర్సిటీ’ పరిశోధకులు గొలోవ్షెంకో. మీవాడు చనిపోయాడంటూ తప్పుడు సమాచారాన్ని అందించిన సందర్భాలను ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ బాధలు రెండు పక్షాల వారికీ తప్పడం లేదు. (క్లిక్: అందుకే రష్యాను సమర్థించక తప్పదు) బాల్టిక్ స్టేట్స్‌లోనూ, అఫ్గానిస్తాన్‌లో కూడా ఈ రకం పద్ధతులను వాడి సైనికులను మానసికంగా వ్యథకు గురిచేసిన సందర్భాలను గురించి గొలోన్షెంకో వంటి పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. రష్యా సైన్యం ఏప్రిల్ మొదటి తేదీన సుమారు 5 వేలమంది ఉక్రెయిన్, సైన్యాధికారులు, రక్షణ సిబ్బందికి మెసేజీలు పంపినట్టు సమాచారం. తాము కూడా ఇటువంటి సందేశాలు పంపుతున్నట్టు ఉక్రెయిన్ ఇంటీరియర్ అఫెయిర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫోన్ వాడుతున్న ప్రతి సైనికుడూ ఒక డేటా పాయింట్‌గా నిలచి, తమ గురించి సమాచారం వెదజల్లుతున్నట్లే లెక్క. అది సైనికులకు ప్రాణాపాయం కలిగిస్తున్నది. - డాక్టర్ కె.బి. గోపాలం రచయిత, అనువాదకులు -
హోటల్లో ప్రేయసితో భర్త.. భార్య చేసిన పనికి పరార్
భార్యకు తెలియకుండా మరో యువతితో సంబంధం కొనసాగిస్తున్న ఆ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. భర్త ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం పెంచుకున్న ఆ భార్య.. టెక్నాలజీ సాయంతో భర్త గుట్టును బయటపెట్టింది. ఊహించని ఆ పరిణామంతో ప్రేయసితో కలిసి తుర్రుమన్నాడు ఉన్నాడు ఆ మొగుడు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. పూణే పోలీసులు శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన సదరు వ్యక్తి ఓ వ్యాపారవేత్త. అతని భార్య కూడా అదే కంపెనీకి డైరెక్టర్‌గా ఉంది. అయితే, 41 ఏళ్ల ఆ వ్యాపారవేత్త మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. వ్యాపారం పేరిట ఊర్లు పట్టుకుని తిరుగుతున్నానంటూ బిల్డప్‌లు ఇచ్చేవాడు. అయితే అతని వ్యవహారం ఆమెకు అనుమానం తెప్పించడం మొదలుపెట్టింది. దీంతో భర్త వాహనంలో జీపీఎస్ పరికరాన్ని రహస్యంగా అమర్చింది. గత ఏడాది నవంబరులో బెంగళూరు వెళుతున్నానని భార్యతో చెప్పాడు సదరు వ్యాపారి. కానీ, జీపీఎస్ లొకేషన్ మాత్రం.. ఆ వాహనం మహారాష్ట్రలోని పూణేలో ఉన్నట్టు చూపించింది. దీంతో ఆమె అనుమానం మరింత బలపడింది. వెంటనే భర్త బస చేసిన హోటల్ సిబ్బందిని ఆరా తీసింది. సీసీఫుటేజీని పరిశీలించగా.. మరో యువతితో అతగాడు లోపలికి వెళ్లాడు. పైగా ఆమే తన భార్య అంటూ.. భార్య పేరిట ఉన్న ఆధార్‌కార్డును చూపించాడట. ఆధార్‌కార్డు తనదని, పరిశీలించకుండా రూమ్ ఎలా కేటాయించారంటూ ఆమె హోటల్ సిబ్బందిపై ఫైర్ అయ్యింది. అంతేకాదు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత పూణే పోలీసులు.. తాజాగా 419 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా, హోటల్ యవ్వారం భార్యకు తెలిసిపోవడంతో సదరు వ్యాపారవేత్త, అతడి ప్రేయసి ఆ సమయంలోనే పరార్ అయ్యారు. అప్పటి నుంచి వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
వుమెన్ సేఫ్టీ.. గొప్పగా ‘చెప్పు’కోవచ్చు!
తాడులా కనిపించేది ఎప్పుడు పామై కాటేస్తుందో తెలియదు. వెలుగులా గోచరించేది ఎప్పుడు చీకటై ముంచేస్తుందో తెలియదు... అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటారు. ఇందుకు ప్రత్యేకంగా వనరులు సమకూర్చుకోకపోయినా నిత్యజీవితంలో మనం ఉపయోగించే వస్తువులతోనే ‘మహిళల భద్రత’ కు అవసరమైన సాంకేతిక దన్ను అందిస్తుంది శాస్త్రీయజ్ఞానం. వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విఐటి, తమిళనాడు)కు చెందిన పరిశోధకులు మహిళలకు రక్షణ ఇచ్చే పాదరక్షలకు రూపకల్పన చేశారు. ‘మహిళా భద్రతకు ఎన్నో చట్టాలు ఉన్నా, ఎక్కడో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేము రూపొందించే పాదరక్షలు ఎంతో భద్రతను ఇస్తాయి’ అంటున్నారు ప్రాజెక్ట్ మేకర్స్. తమకు తాముగా జాగ్రత్తపడేలా, విపత్కరమైన పరిస్థితులలో రక్షణ పొందేలా చేసే ఈ స్మార్ట్ పాదరక్షలు ఆత్మరక్షణ ఆయుధాలుగా ఉపయోగపడతాయి. ఎటాకర్స్పై ప్రతిదాడి చేసే అవకాశం వీటిలో ఉంది. జీపిఎస్, జీఎస్ఎం మాడ్యూల్‌ను ఉపయోగించి ఈ పాదరక్షలను డిజైన్ చేశారు. ‘షూ’లలో జీపిఎస్, జీఎస్ఎం మాడ్యుల్ మినియేచర్ వెర్షన్ చిప్‌లను అమర్చుతారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎమర్జెన్సీ–కాంటాక్ట్‌ల కోసం ‘షూ’ను గట్టిగా నొక్కితే సరిపోతుంది. ఎటాకర్‌కు షాక్ ఇవ్వవచ్చు. ‘ఎటాకర్’ను గుర్తించే వీడియో లైవ్ స్ట్రీమింగ్ సాంకేతికత కూడా వీటికి ఉండడం మరో విశేషం. తాజా విషయానికి వస్తే... హిమాచల్‌ప్రదేశ్, సొలాన్ జిల్లాలోని జైపీ యూనివర్శిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (జెయుఐటీ)కి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు సరన్ష్ రోహిల్లా, సాంధిత్య యాదవ్‌లు మహిళలకు రక్షణ ఇచ్చే ‘స్మార్ట్’ షూస్‌ను అభివృద్ధిపరిచారు. ఇవి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ‘కాంటాక్ట్స్’ను అప్రమత్తం చేస్తాయి. లొకేషన్ గురించి తెలియజేస్తాయి. ‘డిజైన్ అండ్ ఎనాలసిస్ ఆఫ్ స్మార్ట్షూ ఫర్ వుమెన్ సేఫ్టీ’ పేరుతో పేపర్ సమర్పించారు. ‘మహిళల భద్రతకు సాంకేతిక జ్ఞానాన్ని విరివిగా వాడుకోవాల్సిన సమయం ఇది. ఇందులో మాది ఒక అడుగు’ అంటున్నారు సరన్ష్,సాంధిత్య. -
40 ఏళ్లుగా ప్రపంచానికి దూరంగా.. సన్యాసిలా బతుకుతున్నాడు
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా కట్టడి కోసం మూడు నెలల పాటు లాక్డౌన్ విధిస్తేనే జనాలకు పిచ్చిపట్టింది. మనుషుల్లో తిరగక.. బయటకు వెళ్లక ఇంటికే పరిమితం కావడం అంటే పెద్ద పనిష్మెంట్గా భావించారు. చుట్టూ నలుగురు మనుషులు, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా.. భారంగా గడిపారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వ్యక్తి మాత్రం మనకు చాలా భిన్నం. ఆయన గత 40 ఏళ్లుగా మనుషులకు చాలా దూరంగా.. ప్రకృతి ఒడిలో నివసిస్తున్నారు. గ్యాస్, కరెంట్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేకపోయినా సంతోషంగా జీవిస్తున్నారు. భౌతిక సుఖాలు పరిత్యజించి ఇలా సన్యాసిగా జీవించడం చాలా బాగుంది అంటున్న ఈ వ్యక్తి వివరాలు.. (photo cridit BBC) 40 ఏళ్లుగా అడవిలో నివసిస్తున్న ఈ వ్యక్తి పేరు కెన్ స్మిత్(74). ప్రస్తుతం అతడు స్కాట్లాండ్ రాన్నోచ్ మూర్ అంచున ఉన్న సమీప రహదారి నుంచి రెండు గంటలు లోపలకి ప్రయాణిస్తే కనిపించే లోచ్ ట్రీగ్‌లో ఓ చెక్క గదిలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతాన్ని లోన్లీ లోచ్ అని పిలుస్తారు. మనుషులకు దూరంగా ఉంటున్న కెన్ గురించి తొలుత 9 సంవత్సరాల క్రితం ఫిల్మ్ మేకర్ లిజ్జీ మెక్కెంజీకి తెలిసింది. ఆమె గత రెండెళ్ల క్రితం ఇతని గురించి బీబీసీ స్కాంట్లాండ్లో ‘ట్రైగ్ సన్యాసి’ పేరుతో డాక్యూమెంటరీ ప్రచురించింది. ఆ ప్రమాదంతో జీవితంలో మార్పు.. డెర్బీషైర్‌కు చెందిన కెన్ 15వ ఏట నుంచే పని చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 26వ ఏట ఉండగా దారి దోపిడి దొంగలు కెన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆ సమయంలో 23 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాడు. అతడి స్థితి చూసిన వారు.. కెన్ కోలుకోవచ్చు.. కానీ మాట్లాడలేడు.. నడవలేడు అన్నారు. అయితే వారి మాటలు అబద్ధం చేస్తూ కెన్ చాలా త్వరగా పూర్వపు జీవితాన్ని ప్రారంభించాడు. (photo cridit BBC) 22 వేల మైళ్లు ప్రయాణం... ప్రమాదం కెన్ జీవితాన్ని మార్చింది. ఎవరి మాటలు వినకూడదని నిర్ణయంచుకున్నాడు. ఆ సమయంలో అతడికి అడవిపై ఆసక్తి కలిగింది. ఇక నడక ప్రారంభించాడు. దాదాపు 22 వైల మైళ్లు నడిచి అలాస్కా సరిహద్దలో ఉన్న కెనడియన్ భూభాగమైన యుకాన్ చేరుకున్నాడు. కెన్ ఈ ప్రయాణంలో ఉండగానే అతడి తల్లిదండ్రులు మరణించారు. ఇంటికి వచ్చాక విషయం తెలుసుకున్న కెన్ గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి అతడి చాలా సమయం పట్టింది. తల్లిదండ్రుల మరణం తర్వాత పూర్తి ఒంటరిగా.. తల్లిదండ్రులు చనిపోయారు.. నా అన్న వాళ్లు ఎవరు లేరు. దాంతో ఇక జనవాసాలకు దూరంగా.. అడవిలోనే జీవించాలనుకున్నాడు కెన్. ఏకాంత ప్రదేశం కోసం వేల కొద్ది మైళ్లు ప్రయాణం చేసి చివరకు లోచ్ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అదే తనకు అనువైన స్థావరంగా భావించాడు. అక్కడే దుంగలతో ఓ చిన్నపాటి గదిని నిర్మించుకున్నాడు. (photo cridit BBC) నో గ్యాస్, నో కరెంట్... గత 40 ఏళ్లుగా ఒక్కడే.. ఆ చిన్న గదిలో నివసిస్తున్నాడు కెన్. గ్యాస్, కరెంట్ వంటి సదుపాయాలు లేవు. చేపలు పట్టడం, కూరగాయలు, బెర్రీస్ పండిచి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. అతడి దగ్గర ఓ జీపీఎస్ పర్సనల్ లోకేటర్ బీకాన్ ఉంది. ఇక ఒంటిరిగా బతకాలంటే.. కచ్చితంగా చేపలు పట్టడం రావాలంటాడు కెన్. కాపాడిన జీపీఎస్ పర్సనల్ లోకేటర్.. అయితే 2019లో తొలిసారి కెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఫిల్మ్‌మేకర్ లిజ్జీ కెన్ వద్ద నుంచి వెళ్లిన పది రోజుల తర్వాత, ఫిబ్రవరి 2019లో, కెన్ బయట మంచులో ఉన్నప్పుడు స్ట్రోక్‌కు గురయ్యాడు. అయితే అతడి ఉన్న జీపీఎస్ లోకేటర్ టెక్సాస్, హస్టన్‌లో ఉన్న రెస్పాన్స్ కేంద్రానికి ఎస్ఓఎస్ పంపడంతో కెన్ పరిస్థితి గురించి వారికి తెలిసింది. (photo cridit BBC) వారు ఈ విషయాన్ని వెంటనే యూకేలోని కోస్ట్‌గార్డ్‌కు తెలియజేశారు. వారు వెంటనే కెన్ను ఫోర్ట్ విలియమ్‌లోని ఆసుపత్రికి విమానంలో తరలించారు. అక్కడ అతను కోలుకోవడానికి ఏడు వారాలు పట్టింది. వైద్యులు అతనికి జనవాసంలో ఉండాలని కోరారు. కానీ కెన్ తన క్యాబిన్‌కు తిరిగి వచ్చాడు. నాకు ఏం కాదు 102 ఏళ్లు బతుకుతాను అంటున్నాడు కెన్. చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి పొరపాటున వేరే వారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! చేతి సైగతో మృగాడి చెర నుంచి తప్పించుకుంది... -
జీపీఎస్ అటెండెన్స్ వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికీ లేని సర్వీసు నిబంధనలు తమకెందుకని గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. మొబైల్ యాప్‌తో అటెండెన్స్ నమోదు, రోజంతా కార్యకలాపాలు, విధుల నిర్వహణపై జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ ఎందుకని వాపోతున్నారు. సోమవారం నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చిన జీపీఎస్ అటెండెన్స్‌ను పాటించలేమంటూ పర్మినెంట్ గ్రామ కార్యదర్శులతోపాటు జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సైతం జిల్లా కలెక్టర్లు మొదలు పీఆర్ కమిషనర్, కార్యదర్శి, సీఎస్‌దాకా వినతిపత్రాలను ఇస్తున్నారు. ఉదయం 8:30 గంటలకే... ఉదయం 8.30 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామకార్యదర్శులు సెల్ఫీ దిగి కొత్త డీఎస్ఆర్ మొబైల్ పీఎస్ యాప్ ‘క్యాప్చర్ జీపీ లొకేషన్’ఆప్షన్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలి. రోజుకు 12 గంటలకు పైబడి విధులు, కింది నుంచి పైస్థాయి వరకు పదిమంది దాకా బాస్‌లు, రోజూ వారడిగే నివేదికలు ఇలా అనేక బరువు బాధ్యతలతో పనిచేస్తున్న తమపై ఇప్పుడు జీపీఎస్ అటెండెన్స్ విధానాన్ని తీసుకురావడం సరికాదని అంటున్నారు. దీంతోపాటు రోజూ డీఎస్ఆర్ యాప్‌లో రోడ్లు, డ్రైన్లు తదితరాలతోపాటు పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, అవెన్యూ ప్లాంటేషన్, ఇంటింటి చెత్త సేకరణ వంటి ఐదు ఫొటోలు లైవ్‌లో అప్లోడ్ చేయాలి. జీపీఎస్ ద్వారా అటెండెన్స్ నమోదు చేశాకే డీఎస్ఆర్ యాప్‌లో మిగతా ఆప్షన్లు ఎంట్రీ చేయడానికి వీలవుతుంది. మాకెందుకు నాలుగేళ్ల ప్రొబేషన్ రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలున్నాయి. దాదాపు మూడువేల మంది పర్మినెంట్ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. రెండున్నరేళ్ల కింద ఏడున్నరవేల జూనియర్ పంచాయతీ సెక్రటరీలను (జేపీఎస్) నియమించారు. మరో రెండువేల మంది దాకా ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ జూనియర్ సెక్రటరీలు కూడా పనిచేస్తున్నారు. తొలుత జేపీఎస్‌లకు మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉండగా.. దాన్ని నాలుగేళ్లకు పెంచారు. మహిళా జేపీఎస్‌లకు ప్రసూతి సెలవులు సైతం ఇవ్వడం లేదు. ఇతర ప్రభుత్వోద్యోగులకు రెండేళ్ల ప్రొబేషన్ ఉంటే తమకు నాలుగేళ్లు ఎందుకని అంటున్నారు. నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి జీపీఎస్ ద్వారా ఫిజికల్ టచ్ లైవ్ లొకేషన్ అటెండెన్స్ నమోదు రద్దుచేయాలి. సెక్రటరీలకు నిర్దిష్ట పనివేళలు నిర్ణయించాలి. ఉపాధి హామీ పనులకు ఒక క్షేత్రస్థాయి సహాయకుడిని ఇవ్వాలి. పంచాయతీల్లో సాంకేతిక పనుల నిర్వహణకు ట్యాబ్లెట్, సిమ్‌కార్డు, ఇంటర్నెట్, డేటా కార్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 4 గ్రేడ్లుగా విభజించాలి. ప్రస్తుత సర్వీస్ రూల్స్ ప్రకారం 4 గ్రేడ్లు కొనసాగించాలి. –పి.మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు, పంచాయతీ సెక్రటరీల సంఘం పని ఒత్తిడి ఎక్కువ యాప్ ద్వారా జీపీఎస్ పద్ధతిలో అటెండెన్స్ నమోదు చేయొద్దని కలెక్టర్లను కోరాం. మేము లేవనెత్తిన అంశాలపై కలెక్టర్లు, పీఆర్ ఉన్నతాధికారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మా కార్యాచరణను ఖరారు చేస్తాం. సోమవారం నుంచి అటెండెన్స్ మాత్రం నమోదు చేయడం లేదు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విధుల నిర్వహణతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. –నిమ్మల వెంకట్ గౌడ్, అధ్యక్షుడు, జూనియర్ సెక్రటరీల సంఘం -
సూరీడుకి కోపమొచ్చిందా? అలా ఇప్పుడొస్తే.. అల్లకల్లోలమే!
అది 1859వ సంవత్సరం.. సెప్టెంబర్ ఒకటో తేదీ.. అంతా ఆఫీసుల్లో పనిచేసుకుంటున్నారు. ఉన్నట్టుండి రేడియోలన్నీ ఏదేదో చిత్రమైన శబ్దం చేస్తూ మూగబోయాయి.. కాసేపటికే టెలిగ్రాఫ్ లైన్లలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఆఫీసులు కాలిపోయాయి. ఒకటి రెండు చోట్లనో కాదు.. ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లోని చాలా దేశాల్లో ఇదే కలకలం. దీనంతటికీ కారణం ఓ సౌర తుఫాను.. ఇప్పుడు కూడా అలాంటి ఓ సౌర తుఫాను వస్తోంది. దాని రేడియేషన్, విద్యుదయస్కాంత శక్తి వల్ల సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. మరి ఈ సౌర తుఫానులు ఏంటి, ఎందుకు, ఎప్పుడు ఏర్పడుతాయి, ప్రమాదం ఏమిటన్న వివరాలు తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ఏమిటీ సౌర తుఫానులు సూర్యుడు కొన్ని కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలో కుతకుత ఉడుకుతూనే ఉంటాడు. ఆ పరిస్థితిలో హైడ్రోజన్ అణువులు సంలీనమై హీలియంగా మారుతూ భారీ ఎత్తున శక్తి విడుదల అవుతుంది. ఆ శక్తి కాంతి ‘ఫోటాన్ల’రూపంలో ప్రసరిస్తుంది. ఇదే మనకు అందే సూర్యరశ్మి. అయితే భారీ ఉష్ణోగ్రతలు, పీడనం వల్ల సూర్యుడిపై పదార్థమంతా ప్లాస్మా (ద్రవానికి, ఘనానికి మధ్య) స్థితిలో ఉంటుంది. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో మార్పులు జరిగినప్పుడు.. ఈ ప్లాస్మా తీవ్ర ఒత్తిడికి లోనై ఒక్కసారిగా విస్ఫోటం చెందుతుంది. ఆ ప్లాస్మాతో కూడిన విద్యుదయస్కాంత వికిరణాలు (ఎలక్ట్రో మ్యాగ్నటి క్ రేస్).. అతి వేగంతో అంతరిక్షంలోకి విడుదలవుతాయి. కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. మార్గమధ్యలో ఉండే గ్రహాలపై ప్రభావం చూపిస్తాయి. మనుషులకు ప్రమాదకరమా? సౌర తుఫానుల వల్ల మనుషులకు నేరుగా ప్రమాదం కలిగే అవకాశాలు అతి స్వల్పమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం, వాతావరణం కలిసి.. సూర్యుడి ప్లాస్మా వికిరణాలను, రేడియేషన్‌ను చాలావరకు అడ్డుకుంటాయని వివరిస్తున్నారు. చాలా శక్తివంతమైన సౌర తుఫానులు భూమిని తాకితే.. నేరుగా ఎండ తగిలే లా ఉన్నవారిపై కాస్త రేడియేషన్ ప్రభావం ఉండొ చ్చని, కానీ అది స్వల్పమేనని స్పష్టం చేస్తున్నారు. ప్రతి పదకొండు ఏళ్లకోసారి.. సూర్యుడి స్వీయ భ్రమణం, పాలపుంతలోని ఇతర నక్షత్రాల ప్రభావం వల్ల.. సూర్యుడి అయస్కాంత ధ్రువాలు ప్రతి 11 ఏళ్లకోసారి తారుమారు అవుతుంటాయి. అంటే ఉత్తర ధ్రువం దక్షిణంగా, దక్షిణ ధ్రువం ఉత్తరంగా మారుతుంటాయి. ఈ క్రమంలో అయస్కాంత శక్తి చిక్కుపడి ప్లాస్మా విస్ఫోటనం చెంది సౌర తుఫానులు ఏర్పడుతాయి. ప్రతి పదకొండేళ్లకు ఇలా సౌర తుఫానులు ఏర్పడుతున్నా.. కొన్నిసార్లు మామూలుగా, మరికొన్నిసార్లు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అవన్నీ కూడా అంతరిక్షంలో వివిధ దిక్కుల్లోకి విడుదలవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రమే భూమి వైపు వస్తుంటాయి. ►1859లో భారీ సౌర తుఫాను వచ్చినప్పటికి ఉన్న కమ్యూనికేషన్ టెక్నాలజీలు కేవలం రేడియో, టెలిగ్రాఫ్ లైన్లు మాత్రమే. అందువల్ల ఆ తుఫాను దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా రేడియోలు మూగబోయాయి. సౌర తుఫాను విద్యుదయస్కాంత ప్రభావం వల్ల ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లో టెలిగ్రాఫ్ లైన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ సౌర తుఫానును గుర్తించిన రిచర్డ్ క్యారింగ్టన్ పేరు మీదుగా.. ఆ ఘటనకు ‘క్యారింగ్టన్ ఈవెంట్’గా పేరు పెట్టారు. ►1989లో ఏర్పడిన సౌర తుఫాను కారణంగా కెనడాలో విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. అలా ఇప్పుడొస్తే.. అల్లకల్లోలమే.. 1859 నాటి స్థాయి సౌర తుఫాను ఇప్పుడు వస్తే.. కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోతాయని హార్వర్డ్ ఆస్ట్రానమీ శాస్త్రవేత్త అబ్రహం లోబ్ వెల్లడించారు. లక్షలాది పరికరాలు పాడైపోతాయని, కొద్దిరోజులు కోట్ల మంది చీకట్లో మగ్గాల్సి వచ్చేదని తెలిపారు. అదే జరిగితే కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. 2014లో ఒక భారీ సౌర తుఫాను వచ్చినా.. భూమి ముందుకు వెళ్లిపోవడంతో త్రుటిలో తప్పించుకున్నామ న్నారు. అదే 9 రోజులు ముందు వచ్చి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని వివరించారు. వచ్చే వందేళ్లలో ప్రమాదకర సౌర తుఫాను భూమిని తాకే అవకాశం ఉందని చెప్పారు. దేనిపై ప్రభావం.. ఎంత ప్రమాదం సౌర తుఫానుల కారణంగా విద్యుదయస్కాంత తరంగాలపై ఆధారపడి పనిచేసే కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా శాటిలైట్ సిగ్నళ్లు, జీపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నళ్లు, డీటీహెచ్ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడుతుంది. సౌర తుఫాను మరీ తీవ్రంగా ఉంటే పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ►సూర్యుడి ప్లాస్మా వికిరణాలు విద్యుత్ సరఫరా లైన్లపై ప్రభావం చూపిస్తాయి. ఓల్టేజీ ఒక్కసారిగా పెరిగిపోయి.. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటాయి. విద్యుత్ గ్రిడ్ కుప్పకూలిపోతుంది. వాటన్నింటినీ మరమ్మతు చేయడమో, కొత్తవి ఏర్పాటు చేయడమో జరిగేదాకా విద్యుత్ సరఫరా ఆగిపోయినట్టే. ఆకాశంలో అందమైన కాంతులు ఇవే.. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద అప్పుడప్పుడూ వివిధ రంగుల్లో అందమైన కాంతి పుంజాలు (అరోరాలు) ఏర్పడుతుంటాయి. వాటికి కారణం సూర్యుడి విద్యుదయస్కాంత వికిరణాలే. భూమివైపు వస్తు న్న ఆ వికిరణాలను భూమి వాతావరణం, అయస్కాంత క్షేత్రం అడ్డుకున్నప్పుడు ఏర్పడే చర్యల్లో.. అలా రంగురంగుల అరోరాలు ఏర్పడుతాయి. -
గంటకు 16 లక్షల కి.మీల వేగంతో దూసుకొస్తున్న సౌర తుపాను
విశ్వంలో ఒక శక్తివంతమైన సౌర తుపాను 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమిని సమీపిస్తోంది. ఈ తుఫాను నేడు లేదా రేపు భూమిని తాకే అవకాశం ఉంది. Spaceweather.com వెబ్ సైట్ ప్రకారం, సూర్యుని వాతావరణం నుంచి ఉద్భవించిన తుపాను సూర్యుడి వైపు ఉన్న భూమి సబ్-సోలార్ పాయింట్లో కేంద్రీకృతమైనట్లు అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. ఈ సౌర తుపాను కారణంగా ఉత్తర లేదా దక్షిణ ధృవం వద్ద నివసిస్తున్న ప్రజలు ఆకాశంలో అందమైన ఖగోళ కాంతి దృశ్యాన్ని చూడనున్నారు. ఈ ప్రాంతాలకు దగ్గరగా నివసిస్తున్న ప్రజలు రాత్రి పూట అందమైన అరోరాను చూసే అవకాశం ఉంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకారం సౌర తుఫాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. ఇంకా రాను రాను దాని వేగం మరింత పెరగనుంది. ఈ సౌర తుఫానుల వల్ల ఉపగ్రహ సంకేతాలకు అంతరాయం కలగవచ్చని నాసా తెలిపింది. స్పేస్ వెదర్ ప్రకారం, సౌర తుఫానుల కారణంగా భూమి బాహ్య వాతావరణం భారీగా వేడి చెందే అవకాశం ఉంది. ఇది ఉష్ణోగ్రతలు ఉపగ్రహాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇది జిపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. అలాగే, విద్యుత్ సరఫరా విషయంలో కూడా ఆటంకం కలుగుతుంది. ఈ సౌర తుపాను వల్ల ట్రాన్స్ ఫార్మర్ లు కూడా పేలే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీన భారీ సోలార్ ఫ్లేర్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు, ఇది భూ వాతారణంపైపు చాలా వేగంగా వస్తున్నట్లు తెలిపారు. -
కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి మరీ ప్రేమ వేధింపులు
సాక్షి, జూబ్లీహిల్స్: ప్రేమించాలంటూ వివాహిత వైద్యురాలిని వేదిస్తున్న ఓ వ్యక్తి.. ఆమె ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఇదెలా సాధ్యమయ్యిందో వైద్యురాలికి అంతు పట్టలేదు. చివరకు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు వ్యక్తి వైద్యురాలు ఎక్కడెక్కడికి ప్రయాణిస్తుందో తెలుసుకునేదుకు ఏకంగా ఆమె కారుకు జీసీఎస్ ట్రాకర్‌ను అమర్చినట్లు వెల్లడించాడు. ఆ వివరాలు.. బాధితురాలు జూబ్లీహిల్స్‌లో వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వనాథ్ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ వైద్యురాలిని వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఎన్ని సార్లు హెచ్చరించినా విశ్వనాథ్ తన తీరు మార్చుకోలేదు. వేధింపులు ఎక్కువ కావడంతో వైద్యురాలు దీని గురించి తన భర్తకు తెలిపింది. ఈ క్రమంలో వైద్యురాలి భర్త విశ్వనాథ్‌ని హెచ్చరించడం కోసం అతడి ఇంటికి వెళ్లాడు. విశ్వనాథ్ ఇంట్లో అతడితో పాటు మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారు. తమను హెచ్చరించడానికి వచ్చిన వైద్యురాలి భర్తపై విశ్వనాథ్, అతడి స్నేహితుడు శ్రీకాంత్ గౌడ్ ఉల్టా బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో వైద్యురాలు, ఆమె భర్త విశ్వనాథ్ మీద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో సంచలన విషయాలు తెలిసాయి. వైద్యురాలిని వెంటాడేందుకు విశ్వనాథ్ ఆమె కారుకు జీపీఎస్ ట్రాకర్‌ని అమర్చినట్లు వెల్లడించాడు. చదవండి: ‘నేను పోలీసుని.. మీ గురించి ఇంట్లో వాళ్లకు చెప్తాను’ -
గుడ్‌న్యూస్: ఎంత ప్రయాణిస్తే అంతే టోల్‌చార్జీ
న్యూఢిల్లీ: జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్టు కేంద్ర రవాణా, రహదారులు, ఎంఎస్ఎంఈల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. జాతీయ రహదారిపైకి ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిపోయిన పాయింట్ వరకు.. ప్రయాణించిన మేరే టోల్ చార్జీలను ఇందులో చెల్లించొచ్చన్నారు. కాకపోతే ఈ వ్యవస్థ రావడానికి రెండేళ్లు పట్టొచ్చని చెప్పారు. జాతీయ రహదారులపై టోల్ వసూళ్ల కోసం ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వాహనాల రద్దీ గణనీయంగా తగ్గినట్టు తెలిపారు. దీనివల్ల ఏటా రూ.20,000 కోట్ల మేర ఇంధనం రూపంలో ఆదా అవుతుందని, కనీసం రూ.10,000 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని వివరించారు. టోల్ ప్లాజాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన వ్యవస్థను మంత్రి సోమవారం ప్రారంభించారు. అదే విధంగా జాతీయ రహదారులకు రేటింగ్ వ్యవస్థను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి ఫాస్టాగ్‌ను దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. టోల్ ప్లాజాల వద్ద జాప్యాన్ని ఒక నిమిషం లోపునకే పరిమితం చేస్తామని మంత్రి చెప్పారు. టోల్ ప్లాజాలను ఆన్లైన్లోనే పర్యవేక్షించే వ్యవస్థ ఆదాయపన్ను, జీఎస్టీ, ఇతర అధికారులకు ముఖ్యమైన సాధనంగా మారుతుందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం రికార్డు స్థాయిలో రోజుకు 33 కిలోమీటర్లకు చేరుకున్నట్టు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.11,035 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. -
నావిక్-జీపిఎస్ చిప్‌ల తయారీకి బిడ్లు
న్యూఢిల్లీ: దేశీయంగా 10 లక్షల ఇంటిగ్రేటెడ్ నావిక్, జీపిఎస్ రిసీవర్ల డిజైన్, తయారీ, సరఫరా, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది. స్వదేశీ పొజిషనింగ్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి నావిక్ యూజర్ రిసీవర్లను వాణిజ్యపరం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికకు అనుగుణంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. భారత ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(నావిక్), జీపీఎస్ రిసీవర్లకు ఇవి వాడతారు. ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంని నావిక్ అని పిలుస్తారు. నావిక్‌ను భారతదేశంలోని వినియోగదారులకు ఖచ్చితమైన స్థానం సమాచార సేవలను అందించడానికి, భారత్‌తో పాటు సరిహద్దుల్లోని 1500 కిలోమీటర్ల పరిధిలో కూడా నావిగేషన్ సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించారు. నావిక్ వ్యవస్థ పూర్తిగా భారత నియంత్రణలో ఉంది. జీపీఎస్ ఒక్కదానికే పనిచేసే చిప్‌ల బదులు నావిక్‌ను కూడా అనుసంధానం చేస్తే, పట్టణాల్లో మరింత కచ్చితంగా నావిగేషన్ సేవలు అందంచే వీలుంటుంది. బిడ్లు సమర్పించేందుకు జనవరి 11ను గడువుగా నిర్ణయించారు. అర్హత కలిగిన బిడ్డర్లకు ప్రభుత్వం రాయితీలు కూడా ఇస్తుంది. (చదవండి: ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) -
ప్రపంచంలోనే అరుదైన జిరాఫీ ఇది
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో శ్వేత వర్ణ జిరాఫీలు చాలా చాలా అరదు. అలా అరుదైన జాతికి చెందిన ఓ జింకను రక్షించడం కోసం ప్రపంచంలో తొలిసారిగా ఓ శ్వేత జిరాఫీకి జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చారు. కెన్యాలోని గరిస్సా అటవి ప్రాంతంలో గత మార్చి నెల వరకు ఓ మగ, ఆడ, వాటికి ఓ పిల్ల జిరాఫీ ఉండేదట. వేటగాళ్లు ఆడ, పిల్ల జింకను చంపేయడంతో ఇప్పుడు ఆ ఒక్క మగ జిరాఫీ మాత్రమే బ్రతికి ఉందట. అలాంటి జిరాఫీ అది ఒక్కటే ఉన్నప్పటికీ దానికి ఇంతవరకు ఏ పేరు పెట్టలేదని, అయితే దాని రక్షణార్థం అది ఎప్పుడు, ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వీలుగా దాని కొమ్ముల్లో ఒకదానికి జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చినట్లు ‘ఇషాక్బినీ హిరోలా కమ్యూనిటీ కన్సర్వెన్సీ’ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆ అరుదైన జిరాఫీకి ప్రత్యేక జన్యు లక్షణం వల్ల తెల్ల రంగు వచ్చిందని, జన్యు లక్షణాన్ని ‘లూసిజమ్’ అని వ్యవహరిస్తారని కన్సర్వెన్సీ వర్గాలు తెలిపాయి. సోమాలియా సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ఈ జిరాఫీని దాని అరుదైన చర్మం కోసం మట్టుపెట్టడానికి వేటగాళ్లు పొంచి ఉన్నందున దానికి జీపీఎస్ ట్రాకర్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ జిరాఫీకి ఏ ఆపద రాకుండా ‘కేన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్, నార్తర్న్ రేంజ్ ల్యాండ్స్ ట్రస్ట్, సేవ్ జిరాఫీస్’ సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. -
నిజమైన ప్రేమంటే?
‘‘ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించకూడదు? నిజమైన ప్రేమంటే ఎలా ఉంటుంది? అని మా మా సినిమాలో చూపించాం’’ అన్నారు మురళీ రామస్వామి. జీపీయస్ హీరోగా, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరోయిన్లుగా మురళీ రామస్వామి (యం.ఆర్) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. రాహుల్ భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్‌పై పి.ఎస్ రామకృష్ణ(ఆర్.కె) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో మురళీ రామస్వామి మాట్లాడుతూ– ‘‘జీపీఎస్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాను తన నటనతో నిలబెట్టాడు. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రకథ నచ్చడంతో ముగ్గురు మిత్రులతో కలిసి నిర్మించాను. మా చిత్రాన్ని ‘అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలతో పోలుస్తున్నారు. అలాంటి సక్సెస్ఫుల్ సినిమాలతో పోల్చడం మంచిదే కానీ, మా సినిమా కొత్త ట్రెండ్‌ని సృష్టిస్తుంది. ఇకపై వచ్చే సినిమాలను ‘ప్రేమ పిపాసి’లా ఉందంటారు’’ అన్నారు పిఎస్ రామకృష్ణ. ‘‘మా చిత్రం గురించి మేం మాట్లాడటం కాదు. ఈ నెల 13న మా సినిమానే మాట్లాడుతుంది’’ అన్నారు జీపీఎస్. ‘‘పాటలు, పతాక సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్స్’’ అన్నారు మరో నిర్మాత రాహుల్ భాయ్. సినిమాటోగ్రాఫర్ తిరుమల రోడ్రిగ్జ్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ, పాటల రచయితలు సురేష్ గంగుల, అలా రాజు తదితరులు మాట్లాడారు. -
ప్యాషన్ మాత్రమే సరిపోదు
‘‘ఏ సినిమాకైనా ప్రేక్షకులు రావాలంటే కథ, వినోదం, పాటలు బాగుండాలి. మా ‘ప్రేమ పిపాసి’లో ఇవి చక్కగా కుదిరాయి. వాటితో పాటు యువతకి కావాల్సిన బోల్డ్ కంటెంట్ కూడా ఉంది’’ అన్నారు రామకృష్ణ (ఆర్.కె). జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్లుగా మురళీ రామస్వామి (ఎమ్.ఆర్) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమపిపాసి’. ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది. రామకృష్ణ (ఆర్.కె) మాట్లాడుతూ– ‘‘2000లో హైదరాబాద్ వచ్చాను. 2010 నుంచి కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నాను. గతంలో ఒక షార్ట్ ఫిలింలో నటించి, నిర్మించాను. మా హీరో, డైరెక్టర్ చెప్పిన కథ నచ్చడంతో ‘ప్రేమపిపాసి’తో సినిమా రంగంలో అడుగుపెట్టాను. హిందీలో ఇమ్రాన్ హష్మీ తరహాలో జీపీఎస్‌కి ఈ సినిమాతో లిప్ లాక్ హీరోగా పేరు వస్తుంది. ఈ రంగంలో రాణించాలంటే ప్యాషన్ ఉంటేనే సరిపోదు.. పక్కా ప్రణాళిక కూడా ఉండాలి. సినిమా చేయడం ఒక ఎత్తు అయితే విడుదల చేయడం మరో ఎత్తు అని ఈ చిత్రంతో తెలిసింది. మా బ్యానర్లో ఏడాదికి ఓ మంచి సినిమా చేయాలనుకుంటాను. ప్రస్తుతం ముగ్గురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాం’’ అన్నారు. -
నిజమైన ప్రేమ
జీపీయస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ఎస్.ఎస్. ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్ పతాకాలపై రాహుల్ భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి పి.ఎస్ రామకృష్ణ (ఆర్.కె) నిర్మాత. మురళీ రామస్వామి (యం.ఆర్) దర్శకుడు. ‘‘మా సినిమాను ఈ నెల 13న విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. యం.ఆర్. మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాకి మంచి హైప్ వచ్చింది. ఇటీవల మా సినిమా యూనిట్‌తో పాటు కొంతమంది యూత్‌కు సినిమా చూపించాం. అందరూ ఇప్పటి ట్రెండ్‌కన్నా అడ్వాన్డ్స్‌గా ఉందన్నారు. నిజమైన ప్రేమంటే ఎలా ఉంటుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’’ అన్నారు. ‘‘ట్రైలర్‌కు, ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు బజ్ వచ్చింది. త్వరలోనే మిగతా పాటలను విడుదల చేస్తాం. సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు జీపీయస్. -
ఇంటికే ఇసుక విజయవంతం
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో ఎక్కడ నుంచి బుక్ చేసుకున్నా ఇంటివద్దకే ఇసుక అందించే సరికొత్త విధానం నాలుగు జిల్లాల్లో విజయవంతం కావడంతో రాష్ట్రమంతా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం 9 జిల్లాల్లో ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకుని స్టాక్ యార్డుల నుంచి పొందే సదుపాయం ఉంది. నాలుగు జిల్లాల్లో మాత్రం వినియోగదారులు కోరిన చోటకే ఇసుకను అందచేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. మాఫియా, దళారీ వ్యవస్థలను నిర్మూలించడంతోపాటు అక్రమ రవాణా, తవ్వకాలను అడ్డుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. సరసమైన ధరలకు ఇసుకను అందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తోంది. రాష్ట్రమంతా డోర్ డెలివరీకి కసరత్తు గత ఏడాది సెప్టెంబరు 5వతేదీన కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) 60.44 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు సరఫరా చేసింది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఇసుకను అందించే విధానం తొలుత అమల్లోకి తెచ్చింది. ప్రజలకు మరింత సౌలభ్యం కోసం ఇసుక డోర్ డెలివరీ విధానాన్ని అమలులోకి తేవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన నేపథ్యంలో ప్రయోగాత్మకంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, వైఎస్సార్ జిల్లాల్లో ప్రవేశపెట్టింది. కిలోమీటర్ల వారీగా టన్ను / ట్రాక్టరుకు ఇసుక రవాణా చార్జీలను అధికారులు ఖరారు చేశారు. ఆన్లైన్లో డబ్బు చెల్లించిన వారికి ప్రస్తుతం ఈ నాలుగు జిల్లాల్లో ఇంటికే ఇసుక అందచేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఇప్పటికే 1.12 లక్షల మందికి డోర్ డెలివరీ చేశారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని ఇసుకను ఇక్కడి అవసరాలకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు చెక్ పోస్టులను పెంచడంతోపాటు మూడు వేల మందికిపైగా కొత్త సిబ్బందిని నియమిస్తోంది. 24 గంటలూ పనిచేసేలా శక్తివంతమైన సీసీ కెమెరాలను అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ నుంచే వాహనాల కదలికలపై నిఘా జీపీఎస్ పరికరాలు కలిగి ఉండి, భూగర్భ గనుల శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలనే ఇసుక సరఫరాకు అనుమతిస్తున్నారు. ఇసుక తరలించే వాహనాలు ఎక్కడ నుంచి బయలుదేరాయి? ఎక్కడకు వెళుతున్నాయి? దారి మళ్లుతున్నాయా? అనే విషయాలను విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచే పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. -
ట్రెండీ ప్రేమ పిపాసి
‘‘ప్రేమపిపాసి’ చిత్రం ట్రైలర్ చాలా ట్రెండీగా, ఎంగేజింగ్‌గా ఉంది. ట్రైలర్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో సినిమా కూడా అలాగే ఉంటుందన్న నమ్మకం ఉంది. కొత్తవాళ్ల ప్రయత్నం బాగుంది’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. జీపీయస్ హీరోగా, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. మురళీ రామస్వామి (ఎమ్ఆర్ ) దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్ పతాకాలపై రాహుల్ భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. పి.ఎస్.రామకష్ణ (ఆర్.కె) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ని మారుతి విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం ప్రేమ అనేది ఎంతో వాణిజ్యంగా మారిపోయింది. నిజాయతీ ప్రేమను వెతికేవాళ్లు మా సినిమా చూడొచ్చు’’ అన్నారు మురళీ రామస్వామి అన్నారు. ‘‘ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు పి.యస్.రామకష్ణ. జీపీయస్, సహ నిర్మాత రాహుల్ పండిట్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రాహుల్ పండిట్, జీఎస్ రావు, వై. వెంకటలక్ష్మి, అసోసియేట్ ప్రొడ్యూసర్: యుగంధర్ కొడవటి. -
ఆంధ్రప్రదేశ్‌లో జీపీఎస్ ట్రాకర్స్ తయారీ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీపీఎస్, ఐవోటీ పరికరాల తయారీ సంస్థ వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్... ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మంగళగిరి సమీపంలో రానున్న ఈ కేంద్రానికి కంపెనీ రూ.50 కోట్ల దాకా వెచ్చించనుంది. రోజుకు 2,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేస్తామని, 2020 జూలై నాటికి తయారీ ప్రారంభమవుతుందని వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ ఫౌండర్ కోణార్క్ చుక్కపల్లి చెప్పారు. సేల్స్ డైరెక్టర్ పి.ఆర్.రాజారామ్‌తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్లాంటులో ఏఐఎస్ 140 ప్రమాణాలు గల జీపీఎస్ పరికరాలను రూపొందిస్తామని, ఈ కేంద్రం ద్వారా 400–500 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. హైదరాబాద్ ప్లాంటు సామర్థ్యం రోజుకు 1,000 యూనిట్లని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పరికరాలకు భారీ డిమాండ్..: నవంబర్ 26 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక రవాణా వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ల వాడకం తప్పనిసరి చేశారు. 25,000 వాహనాల దాకా ఇసుక రవాణాలో నిమగ్నమై ఉన్నట్లు కోణార్క్ తెలిపారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏఐఎస్ 140 ధ్రువీకరణ పొందిన ఏకైక కంపెనీ మాదే. ఏపీలో ఉన్న డిమాండ్ కంపెనీకి కలిసొస్తుంది. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఇప్పటికి 2 లక్షల పైగా పరికరాల్ని విక్రయించాం. ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ట్రాకర్ల వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)లో 2 లక్షలకుపైగా యూనిట్లను విక్రయించాలని లకి‡్ష్యంచాం. ఏప్రిల్–సెప్టెంబర్‌లో 70,000 యూనిట్లు విక్రయించాం. ఏపీ ప్లాంటు కోసం వచ్చే ఏడాది మే నాటికి రూ.35 కోట్ల దాకా నిధులు సమీకరించనున్నాం’ అని కోణార్క్ వివరించారు. -
ఇసుక అక్రమ రవాణాకు జీపీఎస్‌తో 'చెక్'!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా.. ఇసుకను వినియోగదారులకు చేరవేసే వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను తప్పనిసరి చేయనుంది. రీచ్ నుంచి ఇసుకను తీసుకెళ్తున్న వాహనం స్టాక్ పాయింట్‌కు వెళుతుందా? లేక పక్కదారి పట్టిందా? అనే వివరాలను ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసేందుకు వీలు కలగనుంది. జీపీఎస్‌ను తప్పనిసరిగా సోమవారం(25వ తేదీ) నుంచి అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జీపీఎస్ అమర్చుకోవాల్సిందే.. ‘‘ఇసుక రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు ఇసుకను తీసుకెళ్లే అన్ని వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి. స్టాక్ పాయింట్ నుంచి బల్క్ ఆర్డర్లకు సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని కాంట్రాక్టు సంస్థలకు స్పష్టం చేశాం’’ – మునిస్వామి, ఏపీఎండీసీ జిల్లా మేనేజర్, అనంతపురం జీపీఎస్‌తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నదుల్లో వరదలు తగ్గిపోవడంతో ప్రస్తుతం రీచ్‌ల్లో పూర్తిస్థాయిలో ఇసుక వెలికితీసేందుకు అవకాశం ఏర్పడింది. రీచ్ నుంచి వెలికితీసిన ఇసుకను మొదట స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నారు. ఏయే స్టాక్ యార్డు నుంచి ఏయే స్టాక్ పాయింట్‌కు ఇసుకను తరలించాలనేది అధికారులు నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా దగ్గరలోని స్టాక్ పాయింట్లను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఇసుక యార్డు నుంచి ఇసుకను తీసుకెళ్లిన టిప్పర్లు నేరుగా స్టాక్ పాయింట్‌కు వెళుతున్నాయా? లేక పక్కదారి పడుతున్నాయా అనేదానిపై పర్యవేక్షణ నిరంతరం జరగడం లేదు. ఈ నేపథ్యంలో సదరు వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చడం ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని ట్రాక్ చేసే వీలుంటుంది. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లే వాహనాలను అమరావతిలోని కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. తద్వారా రీచ్‌లో వెలికితీసిన ఇసుక కచ్చితంగా స్టాక్ పాయింట్‌కు చేరనుంది. అంతేకాకుండా బల్క్ ఆర్డర్లకు ఇసుక సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ అమర్చడం ద్వారా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నేరుగా వినియోగదారుడికే ఇసుక చేరనుంది. -
మనిషిలో మరో కోణం
జీపీఎస్ హీరోగా కపిలాక్షీ మల్హోత్రా, సోనాక్షీ వర్మ కథానాయికలుగా నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. మురళీ రామస్వామి దర్శకత్వంలో ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాహుల్ భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిల్మ్స్, పి.ఎస్. రామకృష్ణ నిర్మించారు. ఈ సినిమా టీజర్ లాంచ్‌లో అతిథిగా పాల్గొన్న పి.వి.ఆర్. విష్ణు మాట్లాడుతూ– ‘‘సినిమాల పట్ల మంచి అభిరుచి ఉన్న నిర్మాత రామకృష్ణ. టీజర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు మురళి కష్టం తెలుస్తోంది’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. ఈ సినిమాతో జీపీఎస్ సంచలన హీరో అవుతారు. మురళి చాలా కష్టపడ్డారు. నా స్నేహితుడు యుగంధర్ వల్ల ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకువస్తున్నాను. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు రామకృష్ణ. ‘‘కంటెంట్ నచ్చి ఈ సినిమాలో భాగమయ్యాను’’ అన్నారు. ఈ సినిమా సహ–నిర్మాత రాహుల్ పండిట్. ‘‘ప్రతి మనిషిలోనూ మరో కోణం ఉంటుంది. అదే మా సినిమా’’ అన్నారు మురళి. ‘‘బ్రేక్ ద రూల్స్ అనేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు జీపీఎస్. -
దోపిడీ చేసిన వారే రాళ్లేస్తున్నారు
సాక్షి, అమరావతి: మొన్నటి వరకూ ఇసుక దందా ద్వారా దోచుకున్న వారే ఇప్పుడు ప్రభుత్వంపై రాళ్లేయాలని చూస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని వారే విమర్శలు చేస్తున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విమర్శలకు అవకాశం లేని విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇసుకపై సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా స్టాక్ యార్డులు పెంచాలని, వరద తగ్గిన వెంటనే రీచ్‌ల నుంచి వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు ఇసుక చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక మాఫియాకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించాలన్నారు. సీసీ కెమెరాలు, జీపీఎస్ విధానం ఇందుకు బాగా ఉపకరిస్తాయని చెప్పారు. కొత్తవిధానం అమలు ప్రారంభించిన వెంటనే వరదలతో రీచ్‌లు మునగడంవల్ల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయని, ఆ సమస్యలను త్వరితగతిన అధిగమించి ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ వరదలవల్ల వచ్చిన విరామ సమయాన్ని పరిస్థితులను సరిదిద్దుకోవడానికి సమర్థంగా వినియోగించుకోవాలని ఉద్బోధించారు. ఏ స్థాయిలో కూడా అవినీతికి ఏమాత్రం అవకాశం ఉండరాదన్నారు. ఎక్కడ ఎలాంటి లోపం ఉన్నా సరిదిద్దుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎవరు ఎక్కడ ఇసుక అక్రమ తరలింపు, తవ్వకాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని, మాఫియాపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇసుకకు కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. ఎప్పటినుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కూడా ముందస్తుగా తెలియజేస్తే నిర్మాణదారులు తదనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని, మోసం జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలన్నారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు వరదల కారణంగా ఇసుక తవ్వడానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్పారు. మొత్తం 102 రీచ్‌లకుగాను 25 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నామని వివరించారు. తవ్వి నదుల పక్కన పోసిన ఇసుక వరదల కారణంగా కొట్టుకుపోయిందని తెలిపారు. లంక భూములు కూడా మునిగిపోయాయని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, మార్కెట్లో ప్రస్తుతం 23 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. రవాణా విషయంలో 90 శాతం వరకు ఇబ్బందులు అధిగమించామని తెలిపారు. -
అడ్డగోలుగా ఆధార్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆధార్ కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలోనే వాటిని నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ ఈ నిబంధన ఆచరణలోకి రావడం లేదు. వెరసి ఈ కేంద్రాల నిర్వహణ అడ్డదిడ్డంగా మారింది. ఆధార్ నమోదు, మార్పుల విషయంలో అవకతవకలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నిర్వహించాలనే నిబంధనను సర్కారు తీసుకొచ్చింది. అవకతవకలకు పాల్ప డినప్పుడు అక్కడికక్కడే వెంటనే ఫిర్యాదు చేసే వీలుంటుందనే భావనతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు స్థలాల్లో ఉన్న కేంద్రాలను ప్రభుత్వ ఆవరణలోకి తరలించాలని సమాచార సాంకేతికశాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది. నిర్వహణ ఇష్టానుసారం... ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆవరణలోనే ఆధార్ కేంద్రాలను నిర్వహించాలనే నిబంధనను నిర్వాహకులు అటకెక్కించారు. నిర్దేశిత ప్రాంతానికి ఆధార్ కేంద్రాన్ని తరలించాలని జిల్లా కలెక్టర్ల నుంచి సూచనలు అందినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం వాటిని మార్చలేదు. పలు రకాల సాకులను చూపుతూ వాటిని ప్రైవేటు స్థలాల్లోనే నిర్వహిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ ఆవరణలో ఆధార్ కేంద్రాన్ని నిర్వహిస్తే నిబంధనల ప్రకారం వ్యవహరించాలనే ఆందోళనతోనే సాకులు వెతుకుతూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 973 ఆధార్ నమోదు కేంద్రాలున్నాయి. ఇందులో మీ–సేవా ఫ్రాంచైజీ (ఈఎస్డీ)కి చెందినవి 460 సెంటర్లున్నాయి. ప్రస్తుతమున్న వాటిలో ఈఎస్డీ ఎక్కువ భాగం ఉన్నప్పటికీ వాటి నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ కార్యాలయాల్లో లొకేషన్లు సైతం కేటాయించారు. సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా నిర్వహిస్తున్న కేంద్రాలు పూర్తిగా ప్రైవేటు ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. లొకేషన్ చూపినా చర్యలు శూన్యం.. ఆధార్ కేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే అంశాన్ని ఆన్లైన్ ద్వారా పరిశీలించవచ్చు. ఈ మేరకు సమాచార సాంకేతిక శాఖ వద్ద పరిజ్ఞానం ఉంది. ఆధార్ నమోదు సిస్టంను ఆన్ చేసిన వెంటనే అందులో జీపీఎస్ ద్వారా లొకేషన్ కనిపిస్తుంది. నిర్దే శిత లొకేషన్లో ఉంటేనే అను మతి ఇచ్చే అవకాశం ఉన్నతాధి కారులకు ఉంది. ప్రైవేటు లొకేషన్ చూపితే వెంటనే సర్వీ సును రద్దు చేయొచ్చు. కానీ స్పష్టమైన ఆదేశాలిచ్చిన అధికారులు అమలు తీరును మాత్రం పట్టించు కోవడం లేదు. ఈ కేంద్రాల నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయిలో జిల్లా మేనేజర్లు (డీఎం) నిఘా, పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల డీఎం లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ప్రైవేటు ప్రాంతాల్లోనే నిర్వహిస్తామంటూ కొందరు ఆధార్ కేంద్రాల నిర్వాహకులు డీఎంల చేతులు తడుపు తున్నారు. దీంతో ఇష్టానుసారంగా కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెంటర్లలో ఆధార్ నమోదుకు రూ. 100 నుంచి రూ. 250 వరకు వసూలు చేస్తున్నారు. ఆధార్ వివరాల్లో తప్పుల సవరణ, చిరునామా మార్పులు తదితరాలకు సంబంధించి రూ. 500పైబడి వసూలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదులు సైతం అందుతున్నాయి. కేంద్రాలపై నిఘా లేకపోవడంతో ఈ తంతు సాగుతున్నట్లు తెలుస్తోంది. -
ముంబై.. ఇదేం ట్రాఫిక్‌రా బై..
వాహనదారులు అత్యధికంగా ట్రాఫిక్ జామ్ బారిన పడుతున్న నగరాల్లో ముంబై ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజానీకం సాధారణ సమయాల్లో కంటే పీక్ అవర్స్‌లో 65 శాతం కంటే అధికంగా తమ విలువైన సమయాన్ని రోడ్డు పాల్జేసుకుంటున్నట్టు 2018 టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్స్‌తో, వాహనరద్దీతో విలవిల్లాడుతోన్న నగరాల్లో కొలంబియా, పెరూ, మాస్కో లాంటి మహానగరాలు కూడా ఉండటం గమనార్హం. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లోని నగరాలకంటే కూడా మన దేశంలోని ముంబై నగర ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తేలింది. బొగోటా, కొలంబియాల్లో వాహనాల రద్దీ 63 శాతంగానూ, లిమా, పెరూల్లో రద్దీ తీవ్రత 58 శాతంగానూ ఉంటే, న్యూఢిల్లీ 58 శాతం రద్దీతో ప్రపంచంలోనే ట్రాఫిక్ జామ్ తీవ్రతలో టాప్–5లో స్థానం సంపాదించింది. పై నాలుగు నగరాలు కూడా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోనివే కావడం గమనించాల్సిన విషయం. ఇక 56శాతం వాహనరద్దీతో ముప్పుతిప్పలు పడుతూ ఐదో స్థానంలో ఉన్న మాస్కో.. అభివృద్ధి చెందిన దేశాలకంటే కూడా అనేక ప్రమాణాల్లో వెనుకబడి ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. పదేళ్ల అధ్యయనం.. ప్రపంచవ్యాప్తంగా 400 నగరాల్లో ట్రాఫిక్ రద్దీని జీపీఎస్ ఆధారంగా అధ్యయనం చేసిన ఈ సంస్థ ముంబై మహానగరాన్ని ‘అత్యధిక వాహన రద్దీ ఉన్న నగరం’గా తేల్చింది. అయితే 8 లక్షల జనాభాకు పైబడిన నగరాలనే ఈ అధ్యయనంలో భాగస్వామ్యం చేశారు. వాహనాల రద్దీపై గత పదేళ్లుగా అధ్యయనం చేస్తోన్న ఈ సంస్థ తొలిసారిగా భారతదేశంలోని వాహన రద్దీ స్థాయిని అంచనా వేసింది. ఆనందించాలా.. బాధపడాలా..! ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ తీవ్రత పెరుగుతోందని టామ్ టామ్ అధ్యయన సంస్థకి చెందిన ప్రముఖుడు రాల్ఫ్ పీటర్ చెప్పారు. అయితే ఇది ఒకరకంగా ఆనందించాల్సిన విషయమూ, మరో రకంగా బాధపడాల్సిన విషయమూ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా బలోపేతమౌతోన్న ఆర్థిక వ్యవస్థను ఇది సూచిస్తోంటే, ట్రాఫిక్ జామ్ కారణంగా విలువైన సమయాన్ని కోల్పోతుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై దృష్టి పెట్టాలి.. దురదృష్టవశాత్తూ ప్రపంచమంతా కార్ల చుట్టూనే తిరుగుతోంది. అలాగే కార్ల కొనుగోలు, వాడకానికి సంబంధించిన నియమ నిబంధనలేవీ లేకపోవడం కూడా నష్టం చేకూరుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ని తగ్గించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పడం సుస్థిర పరిష్కారాలను సూచించగలుగుతుందని టామ్ టామ్ ఇండియా జనరల్ మేనేజర్ బార్బరా బేల్పెయిర్ అభిప్రాయపడుతున్నారు. -
ఫ్రెష్ లవ్‌స్టోరీ
జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ, మౌని, మమతశ్రీ చౌదరి ప్రధానపాత్రల్లో మురళి రామస్మామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సుమన్ కీలక పాత్రధారి. పి.ఎస్. రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్టు పూర్తయింది. మురళి రామస్వామి మాట్లాడుతూ– ‘‘ఇది నా తొలి సినిమా. ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సుమన్‌గారు బాగా సపోర్ట్ చేశారు. హీరోయిన్స్ కోసం 200 మందిని ఆడిషన్ చేశాం. జీపీఎస్ బాగా నటించాడు. టాకీ పార్ట్ పూర్తయింది. మిగిలిన ఒక పాటను త్వరలో చిత్రీకరిస్తాం. జూన్ లేదా జులైలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఇదో ట్రెండీ లవ్ స్టోరీ’’ అన్నారు రామకృష్ణ. ‘‘కథ చెప్పినప్పుడు ఇది సినిమానా లేక జీవితమా అనిపించింది. సుమన్గారితో నటించడం హ్యాపీ’’ అని జీపీఎస్ అన్నారు. -
జీపీఎస్ టెక్నాలజీతో విత్తనోత్పత్తి
సాక్షి, హైదరాబాద్: విత్తనోత్పత్తికి సాంకేతికతను విరివిగా వియోగించుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. జీపీఎస్, డ్రోన్, జియో ట్యాగింగ్, బార్ కోడెడ్ సాంకేతికతను ఉపయోగించి విత్తనోత్పత్తి చేయడం ద్వారా మార్కెట్లో కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేయొచ్చని పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటిగా మారి రైతులు లాభపడాలంటే విత్తనాల ఎంపిక కీలకమన్నారు. రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ‘ఇండో–జర్మన్ ప్రాజెక్టు ప్లానింగ్’ వర్క్ షాపులో ఆయన ప్రసంగించారు. ఇప్పటికే విత్తనోత్పత్తి, విత్తన ధ్రువీకరణలో తెలంగాణ మోడల్‌గా నిలిచిందని, దేశానికి కావాల్సిన విత్తనాల్లో 60 శాతం రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నా యని తెలిపారు. 400 విత్తన కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండటంతో విత్తన ప్రాసెసింగ్, నిల్వ పెద్ద ఎత్తున జరుగుతుందన్నారు. దేశాల మధ్య విత్తన ఎగుమతి, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రమోషన్ కౌన్సిల్‌ను ఏర్పా టు చేయాలని వివరించారు. యూరోపియన్ దేశాలకు కూడా విత్తన ఎగుమతులను ప్రోత్సహించవచ్చన్నారు. మార్కెట్లో కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్నవారిపై విత్తన చట్టం ప్రకారం తక్కు వ జరిమానా, శిక్షలు పడుతున్నాయని, విత్తన చట్టం లో మార్పులు చేయాలని అభి ప్రాయపడ్డారు. రాజేం ద్రనగర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇస్టా విత్తనపరీక్ష ల్యాబ్ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటేశ్వర్ రావు, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ సౌమిని సుంకర, జర్మన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు బీమా కింద రూ.338 కోట్లు అందజేత.. రైతు బీమా కింద ఇప్పటివరకు రూ.338.75 కోట్లు జమ చేసినట్లు పార్థసారథి పేర్కొన్నారు. రైతుల నామినీల బ్యాంకు ఖాతాకు 10 రోజుల్లోపే పరిహారం జమ చేస్తున్న ఎల్ఐసీ అధికారులను ఆయన అభినందించారు. బుధవారం సచివాలయంలో ఎల్ఐసీ అధికారులతో రైతు బీమా పథకంపై పార్థసారథి సమీక్షించారు. ఇప్పటివరకు 6,775 మంది రైతులు మృతి చెందగా, వారి నామినీలకు డబ్బు జమ చేసినట్లు పేర్కొన్నారు. -
సొంత వాహనాలకూ జీపీఎస్!
సాక్షి, సిటీబ్యూరో: సొంత వాహనం కొందరికి కల, ఎందరికో అవసరం. ప్రస్తుత కాలంలో కొన్ని ఉద్యోగాలు సైతం ద్విచక్ర వాహనం ఉన్నవారికే వస్తున్నాయి. అలాంటి వ్యక్తి తన వాహనాన్ని పోగొట్టుకుని, మరోటి కొనే శక్తి లేకుంటే ఆ పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి ఉదంతాలతో పాటు బ్యాంకులకు చెందిన ప్రజాధనం సైతం మోసగాళ్ల పాలు కాకుండా ఉండాలన్నా.. పోలీసులకు కాస్త పనిభారం తగ్గాలన్నా ఇటీవల కేంద్రం తీసుకున్న ‘జీపీఎస్ నిర్ణయం’ వ్యక్తిగత వాహనాలకూ వర్తించాలని పోలీసులు చెబుతున్నారు. ఇది ఎంతో అవసరం, ఉపయుక్తమని స్పష్టం చేస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు తప్పనిసరి... ప్రజా రవాణా వాహనాలకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ఏర్పాటు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి అమలులోకి తెచ్చింది. ఈ నిబంధన ప్రకారం ఆటోలు, ఈ–రిక్షాలు మినహా సెంట్రల్ మోటారు వెహికిల్స్ రూల్స్–1989 కిందకు వచ్చే అన్ని బస్సులు, స్కూల్ వాహనాలు, ట్యాకీలతో సహా ఇతర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఈ వ్యవస్థ ఉండాల్సిందే. నేషనల్ పర్మిట్ ఉన్న కమర్షియల్ వాహనాలకు సైతం జీపీఎస్ కిందికి వచ్చే వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ (వీఎల్టీ) తప్పనిసరి. దీంతోపాటు ప్యానిక్ బటన్ సైతం ఉంటేనే కొత్త వాటి రిజిస్ట్రేషన్, పాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణ సాధ్యమవుతుంది. దీనికి సంబంధించిన నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఏటా వేల సంఖ్యలో వాహనాల చోరీ హైదరాబాద్ నగరంలో ఏటా వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి వ్యక్తిగత వాహనాలు చోరీ అవుతున్నాయి. వీటిలో సగానికి ప్రాథమిక సమాచార నివేదికలు (ఎఫ్ఐఆర్) జారీ అవుతున్నాయి. ఆపై పోలీసులు తీసుకున్న చర్యల తర్వాత దొరుకున్న వాటి సంఖ్య 50 శాతం కూడా ఉండడం లేదు. మిగతా వాహనాల యజమానులు నష్టపోతున్నారు. ఈ వాహనాలకు ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో డబ్బు రావట్లేదు. ఇది అనేక మంది జీవితాలపై ప్రభావం చూపుతోంది. ఈ వాహన చోరీలకు ప్రధాన కారణం పార్కింగ్ సమస్య. ద్విచక్ర వాహనం ఆధారంగా ఉద్యోగం చేసే ఫీల్డ్ స్టాఫ్, ఉద్యోగాలకు వెళ్లిడానికి వీటిని వినియోగించే వారిలో అత్యధికులు సాధారణ జీవులే. వీరు ఇరుకైన ప్రదేశాల్లోని అద్దె ఇళ్లల్లో నివసిస్తుంటారు. వీటి ఆవరణల్లో పార్కింగ్ సదుపాయాలు లేకపోవడంతో రోడ్డు పైన, వీధుల్లోను నిలుపుకోవాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న చోరులు తస్కరిస్తున్నారు. జీపీఎస్ వ్యవస్థతో ఎంతో మేలు ఈ తరహా కేసుల దర్యాప్తు కోసం పోలీసులు సైతం శ్రమించాల్సి వస్తోంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు ఉండట్లేదు. అయినప్పటికీ వాహనచోదకులు తమ వాహనాలకు వీఎల్టీ వంటి పరిజ్ఞానం అమర్చుకోవట్లేదు. ఫలితంగా ఆశించిన ఫలితాలు రావట్లేదు. కమర్షియల్ వెహికిల్స్ మాదిరిగా వ్యక్తిగత వాహనాలకు జీపీఎస్ పరికరాల ఏర్పాటు తప్పనిసరి చేస్తే ఈ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. కేవలం వాహనాలు పోగొట్టుకున్న వారికి వీలైనంత త్వరగా వాటిని గుర్తించి అప్పగించడం పోలీసులకు తేలికవుతుంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాహనాలు ఖరీదు చేయడం, ఆపై నకిలీ పత్రాల ద్వారా వాటిని విక్రయించేసి రుణం ఎగ్గొట్టడం వంటి చేసే వారికీ చెక్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని యాజమాన్యాలు ద్విచక్ర వాహనాలపై విధులు నిర్వర్తించే తమ ఉద్యోగుల కదలికలూ ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. అయితే ఈ వాహనాలకు ఉండే జీపీఎస్ లేదా వీఎల్టీ పరికరాలు విడిగా ఉండే తీసి పారేసేందుకు ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఇంజన్‌కు కనెక్ట్‌గా, అంతర్భాగంగా ఏర్పాటు చేయించాలని పోలీసులు చెబుతున్నారు. అలా చేస్తే పరికరాన్ని తీస్తే బండి స్టార్ట్ కాకుండా ఉంటుందని, అప్పడే వీటి ఫలితాలు అందుతాయని పేర్కొంటున్నారు. విద్యార్థినులు,మహిళల భద్రత కోణంలోనూ ఆయా వాహనాలకు ట్రాకింగ్ సిస్టం ఉపయుక్తమని స్పష్టం చేస్తున్నారు. -
ఠాణాలకు డిజిటల్ అడ్రస్
సాక్షి, సిటీబ్యూరో: ‘రోడ్డపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగ్‌ను దుండగులు లాక్కుపోయారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి అతడు సమీపంలోని ఠాణాకు వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో తమ పరిధిలోకి రాదని చెప్పిన అధికారులు వేరే పోలీసుస్టేషన్ చిరునామా చెప్పి పంపారు. ఆ ఠాణాకు చేరుకోవడానికి బాధితుడికి కొంత సమయం పట్టింది. ఈ ఉదంతం అతడిని కొంత అసంతృప్తికి, అసౌకర్యానికి గురి చేసింది.’ .... రాష్ట్రంలో ఇలాంటి ఘటనలకు తావు లేకుండాచూడాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. అందులో భాగంగా ఠాణాలకు డిజిటల్ చిరుమానా ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. దీని ప్రకారం పోలీసుస్టేషన్ల పరిధులకు జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు వాటిని డైరెక్షన్స్‌తో సహా అధికారిక యాప్ ‘హాక్–ఐ’లో నిక్షిప్తం చేయనుంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా తాము ఉన్న ప్రాంతం ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా దానికి ఎలా చేరుకోవాలో కూడా యాప్ సూచిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. అనేక చోట్ల పరిధుల పరేషాన్... ఏదైనా ఓ ఉదంతం జరిగినప్పుడు కేసు నమోదు చేయాలన్నా, తదుపరి చర్యలు తీసుకోవాలన్నా జ్యూరిస్డిక్షన్గా పిలిచే పరిధి అత్యంత కీలకమైన అంశం. తమ పరిధిలోకి రాని కేసు విషయంలో ఓ పోలీసుస్టేషన్ అధికారులు కలగజేసుకుంటే చట్టపరంగానే కాకుండా ఇతర అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరైనా సరే నేరం చోటు చేసుకున్న పరిధిలోని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిందే. అయితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఈ పోలీసుస్టేషన్ల పరిధులు అనేవి పరేషాన్ చేస్తుంటాయి. రాజధానిలోని బంజారాహిల్స్ రోడ్ నెం.1 మాసబ్‌ట్యాంక్ చౌరస్తా నుంచి నాగార్జున సర్కిల్ వరకు విస్తరించి ఉంటుంది. ఈ ఏరియా మొత్తం బంజారాహిల్స్, పంజగుట్ట, హుమాయున్‌నగర్ పోలీసుస్టేషన్ల కిందికి వస్తుంది. ఈ రోడ్డునకు ఒక్కో వైపు ఒక్కో ఠాణా పరిధిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అనేక సందర్భాల్లో అటు బాధితులే కాదు కొన్నిసార్లు పోలీసులూ తికమకపడ్డారు. గూగుల్ మ్యాప్స్‌లో ఉన్నప్పటికీ... ఓ ప్రాంతంలో ఉన్న వ్యక్తి తన సమీపంలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్‌తో పాటు పోలీసుస్టేషన్లనూ తెలుసుకునే అవకాశం గూగుల్ మ్యాప్స్ ఇచ్చింది. అయితే ఇది కేవలం సమీపంలో ఉన్న వాటిని మాత్రమే చూపించగలుగుతుంది. దానికే మార్గాన్ని నావిగేట్ చేస్తుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్ దగ్గర నిల్చున్న వ్యక్తి ‘పోలీస్ స్టేషన్ నియర్ బై మి’ అని టైప్ చేస్తే అది సరూర్‌నగర్ ఠాణాను చూపించే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఈ ప్రాంతం మలక్‌పేట ఠాణా పరిధిలోకి వస్తుంది. పరిధులు అన్నవి ఆ మ్యాప్స్‌లో అనుసంధానించి లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉంటోంది. బాధితులు ఎవరైనా నేరం బారినపడినప్పుడు ‘100’కు కాల్ చేస్తే పోలీసు వాహనమే వారి వద్దకు వస్తుంది. ఇలాంటప్పుడు ఇబ్బంది లేకపోయినా... ప్రతి సందర్భంలోనే బాధితులు కాల్స్ చేయడం సాధ్యం కాదు... ఆ అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే పోలీసుస్టేషన్ల పరిధులు, చిరునామాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. హాక్–ఐలో లింకు రూపంలో... దీనికోసం పోలీసు అధికారిక యాప్ హాక్–ఐలో ప్రత్యేక లింకు ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధుల్నీ జియో ఫెన్సింగ్ చేస్తూ నావిగేషన్స్‌తో సహా ఇందులో నిక్షిప్తం చేస్తుంది. స్పార్ట్ ఫోన్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఓ ప్రాంతంలో నిల్చుని అది ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో తెలుసుకోవాలంటే ఈ లింకు ఓపెన్ చేస్తే చాలు. ఈ వ్యక్తి ఉన్న ప్రాంతాన్ని జీపీఎస్ ఆధారంగా గుర్తించే యాప్ ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో వెంటనే చెప్తుంది. మరింత ముందుకు వెళ్తే ఆ ఠాణాకు ఎలా చేరుకోవాలో కూడా స్పష్టంగా నావిగేట్ చేస్తుంది. అయితే రాష్ట్రంలోన్ని అన్ని ప్రాంతాల్లోనూ మొబైల్ డేటా సిగ్నల్స్ ఒకే విధంగా ఉండవు. దీంతో కొన్నిసార్లు నావిగేషన్, ఠాణా పరిధుల్ని యాప్ తప్పుగా చూపించే అస్కారం ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ట్రయల్ రన్ సందర్భంలో ఈ సమస్యల్ని గుర్తించి పరిష్కరించాలని నిర్ణయించింది. గరిష్టంగా రెండు నెలల్లో ఈ సదుపాయం హాక్–ఐలోకి వచ్చి చేసే ఆస్కారం ఉంది. -
ఎల్ఈడీ లైట్లు.. జీపీఎస్ సౌకర్యం
హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఇకపై ప్రయాణికులకు గొప్ప అనుభూతిని మిగల్చనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే గోదావరి ఎక్స్‌ప్రెస్ బోగీల్లో ఇకపై ఎల్ఈడీ లైట్లు, జీపీఎస్ సౌకర్యాలతో పాటు అదనపు హంగులు జతచేరనున్నాయి. పీయూష్ గోయల్ నేతృత్వంలోని భారతీయ రైల్వే చేపట్టిన ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా వివిధ రైళ్లలో వినూత్నమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనిలో భాగంగానే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని 24 బోగీలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ప్రారంభించినట్లు సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ అమిత్ వర్ధన్ సర్క్యులర్ విడుదల చేశారు. ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా 2018–19 సంవత్సరంలో మొత్తం మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని 640 బోగీలను వివిధ హంగులతో పునరుద్ధరించనున్నారు. తొలి విడతలో భాగంగా 140 బోగీలను.. రెండవ విడతలో మిగిలిన 500 బోగీలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి బోగీకి రూ. 60 లక్షలు కేటాయించారు. ఈ ఏడాది మార్చిలోగా ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంది. – సాక్షి, హైదరాబాద్ ఉత్కృష్ట ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్న కొత్త సొగసులు.. ►కలర్ స్కీంలో భాగంగా రొటీన్ ఎరుపు, పసుపు రంగుల్లో కాకుండా అందమైన పోలీయురిథేన్ (పీయూ) పెయింటింగ్‌లో రైలు బోగీలు ప్రయాణికులను ఆకట్టుకోనున్నాయి. ►బోగీల్లో జీపీఎస్ సదుపాయంతో ఎల్ఈడీ ఇండికేషన్ బోర్డ్‌లు, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంటాయి. ►అన్ని బోగీల్లో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తారు. ►టాయిలెట్లు, డోర్లు, బెర్త్‌ల మధ్యన, బోగీల లోపల అంతా అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. ►అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను ఆర్పే సాధనాలు అన్ని చోట్లా అందుబాటులో ఉంటాయి. అలాగే రైళ్లలోని వాష్బేసిన్లన్నీ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేసినవి అమరుస్తారు. ► తడిని పీల్చేలా, పొడిగా, పరిశుభ్రంగా ఉండేందుకు టాయిలెట్స్‌లో సైతం పాలిమెరైజ్డ్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు. ► బెర్త్‌లు సైతం మరింత సౌకర్యవంతంగా తయారు చేస్తున్నారు. -
ఆర్టీసీ... హైటెక్!
సాక్షి, హైదరాబాద్: ఆధునికత దిశగా ఆర్టీసీ ప్రయాణిస్తోంది. ప్రయాణికుల భద్రతకు సాంకేతికత తోడవుతోంది. రక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు భరోసా ఇస్తోంది. ప్రజారవాణాలో ఉన్న ప్రతి వాహనానికి జీపీఎస్(జియో పొజిషనింగ్ సిస్టమ్) తప్పనిసరి చేసింది. వాస్తవానికి ఈ ఆదేశాలు పాతవే అయినా.. జనవరి 1 నుంచి దేశంలోని అన్ని రవాణా సంస్థలకు తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జీపీఎస్ పరికరంతోపాటు ప్యానిక్ బటన్లు కూడా తప్పనిసరి చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రజారవాణా సంస్థల్లో టీఎస్ఆర్టీసీ అత్యంత కీలకమైనది. సంస్థ వద్ద దాదాపు 10,500 బస్సులున్నాయి. ఇందులో 2,200 అద్దె బస్సులు ఉన్నాయి. రోజూ 98 లక్షల మందికిపైగా వివిధ రూట్లలో ఈ బస్సుల్లో ప్రయాణం చేస్తారు. రోజూ రూ.12 కోట్ల కలెక్షన్ ఉంటుంది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 6 నెలల నుంచి హైదరాబాద్– కరీంనగర్– మెట్పల్లి మార్గంలో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. 400 బస్సులకు జీపీఎస్ పరికరాలను బిగించి పనితీరును పర్యవేక్షిస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు మార్చి ఆఖరునాటికి లేదా ఏప్రిల్ మొదటివారానికి కొలిక్కి వచ్చే అవకాశముందని సమాచారం. త్వరలో ఆర్టీపీఎస్ రద్దు? ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునేందుకు ‘రియల్ టైమ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టం’ (ఆర్టీపీఎస్) గ్రేటర్ పరిధిలో దాదాపు 600 బస్సుల్లో నిర్వహిస్తోంది. జీపీఎస్ అందుబాటులోకి వస్తే నగరంలోని ఆర్టీపీఎస్‌ను రద్దు చేసి దానిస్థానంలో జీపీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. నగరం ప్రైవేటు ట్రావెల్స్, ఓలా, ఉబర్ లాంటి వివిధ ప్రైవేటు క్యాబ్ సర్వీసులు కూడా జీపీఎస్, ప్యానిక్ బటన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ బస్సు ఎక్కడుందనే విషయాన్ని యాప్‌లో జీపీఎస్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రైవేటు రవాణా సంస్థల పోటీని తట్టుకోవచ్చని ఆర్టీసీ భావిస్తోంది. లారీలు, కార్లు కూడా...: మోటారు వాహన నిబంధనలు–1989 పరిధిలోకి వచ్చే అన్ని వా హనాలు అంటే బస్సులు, లారీలు, కార్లు ఇలా రవాణాకు వినియోగించే ప్రతి వాహనం ఇకపై జీపీఎస్, ప్యానిక్ బటన్లు అమర్చుకోవాలి. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, యాప్‌ల రూపకల్పన! పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తికాగానే అధికారులు జీపీఎస్ పరికరాల బిగింపు కోసం టెండర్లు ఆహ్వానిస్తారు. ఇకపై కొనుగోలు చేసే ప్రతి బస్సుకు చాసిస్‌తోపాటు జీపీఎస్, ప్యానిక్ బటన్లు కలిపి ఉండేలా చూసుకుంటారు. జీపీఎస్ కోసం ఎంజీబీఎస్‌లో ఒకటి(రాష్ట్రవ్యాప్త సర్వీసుల కోసం), జేబీఎస్లో (గ్రేటర్ హైదరాబాద్ బస్సుల కోసం) మరో కంట్రోల్ రూము ఏర్పాటు చేయనున్నారు. బస్సులు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకమైన యాప్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. డివైజ్ లేకపోతే నో పర్మిట్! ఏఐఎస్–140 పేరిట వెహికిల్ ట్రాకింగ్ పోర్టల్‌ను బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి చేసింది. ఇందులో ఏఐఎస్–140 ట్రాకింగ్ డివైజ్, వాహనం చాసిస్ వివరాలు నమోదవుతాయి. జీపీఎస్ పరికరం బిగించుకోకపోతే కొత్త వాహనాలకు అనుమతి, పాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను రవాణా శాఖ జారీ చేయదు. స్కూలు, ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లు, ఇతర రవాణా వాహనాలకు ఇకపై ఈ డివైజ్ బిగింపు తప్పనిసరి. భవిష్యత్తులో ఇవి లేని వాహనాలు రోడ్డుపైకి వెళ్లడానికి అనుమతి దొరకదు. -
ప్రజా రవాణాకు జీపీఎస్ తప్పనిసరి!
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్), పానిక్ బటన్ ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి త్వ శాఖ ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు నిబంధనలను మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చింది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనల ప్రకారం... ఆటో రిక్షాలు, ఈ– రిక్షాలు మినహా సెం ట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్– 1989 కిందకు వచ్చే అన్ని బస్సు లు, స్కూల్ బస్సులు, టాక్సీ వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ (వీఎల్టీ) పరికరాలు తప్పనిసరిగా ఉం డాలి. నేషనల్ పర్మిట్ ఉన్న కమర్షియల్ వాహనాలను సైతం ఈ నిబంధన కిందకు చేర్చా రు. జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్, పానిక్ బటన్ ఉంటేనే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇవి ఉంటేనే పాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల వాహనాలు.. భారత్‌లో ప్రస్తుతం 1.8 కోట్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఉన్నట్టు సమాచారం. అలాగే నేషనల్ పర్మిట్ ఉన్న ట్రక్స్ 75 లక్షలు ఉన్నాయని జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలు తయారు చేసే వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ వ్యవస్థాపకుడు కోణార్క్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ఇప్పటి వరకు ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు తమ వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సంస్థలే వాహన రాకపోకలను ట్రాక్ చేస్తున్నాయి. తాజా విధానంలో ప్రభుత్వమే రంగంలోకి దిగుతుంది. పన్ను ఎగ్గొట్టే వాహనాలను గుర్తించవచ్చు కూడా. మహిళలు, విద్యార్థులు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త నిబంధనను తెచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. వాహనం ప్రమాదానికి గురైతే ఎక్కడ జరిగిందో సులువుగా గుర్తించవచ్చు కూడా. ఏఐఎస్ ధ్రువీకరణ ఉంటేనే.. టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఏఐఎస్– 140 నేషనల్ వెహికిల్ ట్రాకింగ్ పోర్టల్‌ను అభివృద్ధి చేసింది. ట్రాకింగ్ డివైస్ వివరాలు, చాసిస్ నంబరును వాహన పోర్టల్‌కు అనుసంధానిస్తారు. దీంతో వాహనాల కదలికలన్నీ డేటా సెంటర్లో నిక్షిప్తం అవుతాయి. అవసరమైతే ట్రాన్స్పోర్ట్, పోలీసు శాఖలకు మాత్రమే ఈ సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. వీటి పర్యవేక్షణకు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇక నూతన నిబంధనల ప్రకారం ఏఐఎస్– 140 ధ్రువీకరణ ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ పరికరాలను మాత్రమే ఇందుకు వినియోగించాలి. తెలుగు రాష్ట్రా ల నుంచి వోల్టీ ఐవోటీ సొల్యూషన్స్ పరికరా లు ఈ సర్టిఫికేషన్ పొందినట్లు కోణార్క్ చెప్పారు. -
అ'దృశ్యం' కాదిక
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడంపై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టి పెట్టారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించిన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూసేందుకు పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు రాజకీయ పార్టీలు, నేతలపై డేగకన్ను వేస్తున్నారు. నోటిఫికేషన్ సైతం విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకావడంతో ఎలాంటి ఏమరుపాటుకు తావులేకుండా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. పాతబస్తీతో పాటు కొన్ని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై నగర పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల నేపథ్యంలో ఘర్షణలు, గొడవలు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తూ పలు ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క స్పెషల్ బ్రాంచ్‌లకు చెందిన సిబ్బంది సైతం ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసి, నివేదికలు తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసిన యంత్రాంగం పక్కా రక్షణ చర్యలకు సన్నాహాలు ప్రారంభించింది. వీటిలో భాగంగా అత్యంత సున్నిత, సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. వీటిలో పోలింగ్ పూర్తయ్యే వరకు అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ప్రతి ఘట్టమూ ‘రికార్డు’.. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటుకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) పరిజ్ఞానం కలిగిన వాహనాలను విస్తృతంగా వినియోగించాలని నిర్ణయించారు. మరోపక్క ప్రస్తుతం పోలీసు, కమ్యూనిటీల అధీనంలో ఉన్న సీసీ కెమెరాలను ఎన్నికల నిఘా కోసమూ వాడాలని పోలీసులు నిర్ణయించారు. ఈ కెమెరాలను వినియోగించి కార్యకర్తలు, అభ్యర్థుల కదలికలను గమనించడానికి సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. ఈ తతంగాలను ప్రధాన కమిషరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లలో రికార్డు చేస్తున్నారు. ప్రచార సరళి ప్రభావంతో ట్రాఫిక్ జామ్‌లకు తావులేకుండా తీసుకోవాల్సిన చర్యలనూ నిర్ణయించారు. మూడు కమిషనరేట్లలో ఉన్న శాంతి భద్రతల, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో డిజిటల్, వీడియో కెమెరాలు కొన్ని అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల నేపథ్యంలో మరికొన్ని ప్రైవేటు కెమెరాలను అద్దెకు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. వీటిని వినియోగించి ఎన్నికల్లోని ప్రతి ఘట్టాన్నీ రికార్డు చేయాలని నిర్ణయించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారం మెుదలుకొని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ దశలోనూ ఉల్లంఘనలకు తావు లేకుండా, అలాంటి వాటిని పాల్పడిన వారిని గుర్తించడం, చర్యలు తీసుకోవడానికి ఆధారాలుగా వినియోగించడానికి ఈ ఫీడ్‌ను వాడనున్నారు. బూత్‌ల ‘హద్దులు’ తేలుస్తున్న ఎలక్షన్ సెల్స్.. మూడు కమిషరేట్లలో పని చేస్తున్న ప్రత్యేక ఎలక్షన్ సెల్స్‌కు ఇప్పుడు ఓ చిక్కు వచ్చిపడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని పోలింగ్ బూత్‌ల్లో బందోబస్తు ఏర్పాటు చేయడానికి ప్రత్యేక ఎలక్షన్ సెల్ కసరత్తు చేస్తోంది. వివిధ పోలీసుస్టేషన్ల పరిధుల సరిహద్దుల్లోని పోలింగ్ బూత్‌లతోనే ఇప్పుడు సమస్య వచ్చిపడింది. ఇవి ఎవరి పరిధిలోని వస్తాయనేది తేల్చనున్నారు. సమస్యాత్మక బూత్‌లు ఉన్న చోట్ల మరింత పక్కాగా వ్యవహరించనున్నారు. ఆయా ఎలక్షన్ సెల్స్ జోన్ల వారీగా పోలీసుస్టేషన్ల పరిధులు, వాటిలోని పోలింగ్ బూత్‌లను గుర్తించే పనిలో పడ్డాయి. దీనికోసం పోలీసు అధికారులను పోలీసుస్టేషన్ల సరిహద్దుల్లో ఉన్న పోలింగ్ బూత్‌లకు పంపిస్తూ అవి ఏ స్టేషన్ కిందికి వస్తాయో తేలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాతే పూర్తిస్థాయి బందోబస్తు స్కీమ్‌లు రూపొందించనున్నారు. ప్రింటింగ్‌పై ‘ముద్ర’లుండాల్సిందే.. ఈసీ నిబంధనల్ని పక్కాగా అమలు చేస్తున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రింటింగ్ ప్రెస్‌లపైనా దృష్టి పెట్టనున్నారు. జోన్లు, డివిజన్ల వారీగా ఆయా ప్రెస్‌ల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ సమావేశాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల ముద్రణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దృష్టి పెట్టాల్సిన అంశాలను వారికి వివరించనున్నారు. ముద్రించే ప్రతిదానిపైనా ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ పేరు, ఏ పార్టీ/అభ్యర్థి కోసం ముద్రిస్తున్నారో వారికి సంబంధించిన పూర్తి వివరాలు తప్పక ముద్రించాలని స్పష్టం చేయనున్నారు. ప్రతి ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఓ రికార్డు ఏర్పాటు చేసి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుని వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని స్పష్టం చేయనున్నారు. వీటిని ఉల్లంఘించే ప్రింటింగ్ ప్రెస్ యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
గూగుల్ మ్యాప్‌తో మెట్రో పిల్లర్ నంబర్ల అనుసంధానం
-
గూగుల్ మ్యాప్‌తో ‘మెట్రో’ నంబర్ల అనుసంధానం
సార్.. మీకు కొరియర్ వచ్చింది.. మీ అడ్రస్ ఎక్కడ..? మెట్రో పిల్లర్ నంబర్ 1392 వద్దకు వచ్చేశావనుకో.. ఆ ఎదురు సందులో.. డాడీ క్యాబ్ బుక్ చేస్తున్నా.. సినిమా థియేటర్ అడ్రస్ ఎక్కడ..? మెట్రో పిల్లర్ నంబర్ 506.. దాని ఎదురుగానే షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్.. సాక్షి, హైదరాబాద్: త్వరలో నగరంలోని అడ్రస్‌లన్నింటికీ మెట్రో పిల్లర్లే మూలస్తంభంగా మారనున్నాయి. ఈ మేరకు మెట్రో రైలు పిల్లర్లను త్వరలో జీపీఎస్ సాంకేతికతతో గూగుల్ మ్యాప్ కు అనుసంధానించనున్నారు. వీటికి నంబర్లను కేటాయించడం ద్వారా పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతోపాటు వాణిజ్య, వ్యాపార సముదాయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్– ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మూడు మెట్రో కారిడార్లలో 66 కి.మీ. మార్గంలోని 2,541 మెట్రో పిల్లర్లకు దశలవారీగా నంబర్ల కేటాయింపు ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే ప్రకాశ్‌నగర్–రసూల్‌పురా మార్గంలో సీ1,300–సీ1,350 వరకు పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. నీలిరంగు బోర్డుపై తెలుపు అక్షరాలతో వీటిని చిన్నగా ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో పెద్ద పరిమాణంలో అందరికీ కనిపించేలా రేడియంతో ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎంఆర్ వర్గాలు తెలిపాయి. కాగా పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే తరహాలో మెట్రో పిల్లర్లు సైతం నగరవాసులకు ల్యాండ్‌మార్క్ చిహ్నలుగా మారనుండటం విశేషం. ఎల్బీనగర్ పిల్లర్ నం.1..? మెట్రో కారిడార్లలో ‘ఏ’కారిడార్‌గా పిలిచే ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ.) మార్గంలో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు వద్ద పిల్లర్ నం.1 ఏర్పాటుకానుంది. ఈ మార్గంలో మొత్తం 1,108 పిల్లర్లున్నాయి. ఇక జేబీఎస్–ఫలక్‌నుమా (15 కి.మీ.) మార్గాన్ని ‘బీ’కారిడార్‌గా పిలుస్తున్నారు. ఈ మార్గంలో మొత్తం 588 పిల్లర్లున్నాయి. నాగోల్–రాయదుర్గం (28 కి.మీ.) మార్గంలో 845 పిల్లర్లున్నాయి. ఈ మార్గంలోనే ప్రస్తుతానికి ప్రకాశ్‌నగర్–రసూల్‌పురా మార్గంలోనే సి1300–సి1350 వరకు నంబర్లను కేటాయించారు. ఇక మెట్రో రెండోదశ కింద ఎబ్బీనగర్–నాగోల్, ఎల్బీనగర్–ఫలక్‌నుమా, రాయదుర్గం–శంషాబాద్ ఎయిర్పోర్ట్ తదితర మార్గాల్లోనూ ఏర్పాటుచేసే పిల్లర్లతో వీటి సంఖ్య మరింత పెరగనుంది. జీపీఎస్‌తో అడ్రస్ ఈజీ... మూడు మెట్రో కారిడార్ల పరిధిలో ప్రస్తుతం పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు ఉన్నాయి. ఈ కారిడార్లకు రెండు వైపులా వేలాది కాలనీలు, బస్తీలున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ఈ రూట్లలో గ్రేటర్ సిటిజన్లే కాకుండా ఇతర జిల్లాల వాసులూ రాకపోకలు సాగిస్తారు. వీరికి ఇప్పుడు ఆయా కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలను తేలికగా గుర్తించేందుకు పిల్లర్ నంబర్లే ఆధారం కానున్నాయి. ఈ పిలర్ల నెంబర్లను జీపీఎస్ సాంకేతికతతో గూగుల్ మ్యాప్‌కు అనుసంధానం చేయనుండటంతో.. పిల్లర్ నంబర్ ఆధారంగా గమ్యస్థానం చేరుకోవచ్చు. -
మారుమూల ఠాణాలకు టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖ మరింత ఆధునిక సాంకేతికతను సంతరించుకునేందుకు కసరత్తు చేస్తోంది. మారుమూల ఠాణాలను సాంకేతికంగా బలోపేతం చేయనుంది. దీనికితోడు మరిన్ని కొత్త వాహనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖకు అత్యాధునిక వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా తెలంగాణ పోలీస్ బ్రాండ్ ప్రజల్లో గుర్తుండిపోయేలా వాహనాలపై తెలంగాణ పోలీస్ లోగోతోపాటు పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇంటర్సెప్టార్ తదితర పదాలను తీర్చిదిద్దారు. నాలుగేళ్ల క్రితం రూపొందించిన ఈ బ్రాండింగ్‌లో స్వల్ప మార్పు చేయాలని లోగో పొజిషన్, స్టిక్కరింగ్ కలర్లో కొంత మార్పు తీసుకురావాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. బ్లూకోల్ట్స్ వాహనాలకు టెక్నాలజీపరంగా మార్పులు, చేర్పులు చేసి ఘటనాస్థలి నుంచే ఫొటోలు, వీడియోలు, వివరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపే విధంగా అనుసంధానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో ఠాణాల నుంచి డీజీపీ కార్యాలయానికి అనుసంధానం ఏర్పడింది. ఎఫ్ఐఆర్, కేసు డైరీ, నిందితుల వివరాలు, ఫొటోలు.. ఇలా అన్ని క్షణాల్లో ఉన్నతాధికారుల చేతికి అందుతున్నాయి. కొనుగోలు చేసే పెట్రోలింగ్ వాహనాల్లో ట్యాబ్, జీపీఎస్ అనుసంధానం, జియో ట్యాగ్ చేసిన హాట్స్పాట్లు కనిపించేలా టఫ్ప్యాడ్లు అందుబాటులోకి రాను న్నాయి. ఏసీ సదుపాయం కలిగిన పెట్రోలింగ్ వాహనాలతో గల్లీ గస్తీని మరింత విస్తృతం చేసేందుకు అవకాశం కల్పించి ట్లు అయింది. ప్రతీ ఠాణాకు రెండు పెట్రోలింగ్వాహనాలు, 4 బ్లూకోల్ట్స్ కొత్త వాహనాలు అందించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. వాహనాల కొనుగోలుకు 500 కోట్లు నూతన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల నిమిత్తం పోలీస్‌శాఖకు మరిన్ని వాహనాలు అవసరమయ్యాయి. తాజాగా ఆరు వందలకుపైగా వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతేడాది హెచ్ఐసీసీలో జరిగిన పోలీస్ కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.500 కోట్లతో మరిన్ని కార్లు, పెట్రోలింగ్ బైకులు కొనుగోలు చేస్తున్నట్టు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి. -
మనకూ ‘టైమ్’ వచ్చింది..!
భారత ప్రామాణిక సమయం (ఇండియన్ స్టాండర్డ్ టైమ్–ఐఎస్టీ)కి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యర్థుల సైబర్ దాడుల నుంచి దేశాన్ని కాపాడుకోవడంతో పాటు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశీయంగా అధికారయుతమైన ప్రామాణిక సమయాన్ని ఖరారు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకసారి ఇది చట్టబద్ధమైతే మనదైన సొంత సమయాన్ని దేశవ్యాప్తంగా అన్నిరకాల సర్వీస్ ప్రొవైడర్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. దేశానికి అధికారిక ‘టైమ్‌కీపర్’గా వ్యవహరిస్తున్న నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ (ఎన్పీఎల్) నుంచే మొబైల్, ఇతర సర్వీస్ ప్రొవైడర్లంతా నిర్ధారిత సమయాన్ని తీసుకోవాలి. మొబైల్ టైమ్లన్నీ అమెరికావే.. ప్రస్తుతం భారత్‌లోని కోట్లాది సెల్‌ఫోన్ వినియోగదారులు తమ ఫోన్లలో అమెరికాకు చెందిన నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ఇస్తున్న టైమ్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన ఫోన్లతో పాటు, ఐఫోన్లు అమెరికాలోని నెట్వర్క్ టైమ్ ప్రోటోకాల్ సర్వర్ల నుంచే ఈ సమయాన్ని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మనవాళ్లు అత్యధికశాతం, మైక్రోసాఫ్ట్, ఐఫోన్ సాఫ్ట్వేర్లనే వాడుతుండడంతో ఈ ఫోన్లలో ఈ సమయాన్నే ఉపయోగిస్తున్నారు. ‘ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారన్న దాని ప్రాతిపదికన ఒక సెకన్ నుంచి కొన్ని సెకన్ల వరకు ఈ సమయాల్లో తేడాలుంటాయి. అమెరికాకు చెందిన సర్వర్ల నుంచి, ఆ దేశ సొంత టెక్నాలజీతో రూపొందించిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్( జీపీఎస్) నుంచే ఎక్కువ మటుకు ఈ టైమ్‌ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది’ అని ఎన్పీఎల్ డైరెక్టర్ దినేశ్ కె ఆస్వల్ తెలిపారు. తాము ఒక దేశం, ఒక సమయం అనే నినాదంతో ముందుకెళుతున్నందున, ఐఎస్టీ అనే ఒకే ప్రామాణిక, ఆధారిత సమయం ఉండాలన్నారు. మున్ముందు దేశ రక్షణ, భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఏటీఎం, ఆన్లైన్ లావాదేవీల విషయంలో కొన్ని సెకన్లు కూడా కీలకంగా మారతాయని ఎన్పీఎల్ సైంటిస్ట్ అశిష్ అగర్వాల్ వెల్లడించారు. ఐఎస్టీని గుర్తించని లీగల్ మెట్రోలజీ..! భారత లీగల్ మెట్రోలజీ యాక్ట్, 2009 దేశ ప్రామాణిక సమయంగా ఐఎస్టీని గుర్తించడం లేదు. ఈ చట్టానికి అనుగుణంగానే మనదేశంలో ప్రామాణిక బరువులు, కొలతలు అమలవుతున్నాయి. వీటి అధారంగానే వాణిజ్య, వ్యాపారాలు క్రమబద్దీకరిస్తున్నారు. చట్టబద్ధంగా ఒకే సమయాన్ని పాటించే ‘ ఏక విధానం’ ఆవశ్యకతను భారతీయ రైల్వే తత్కాల్ టికెటింగ్ వ్యవస్థ ఎత్తి చూపుతోంది. ఐఎస్టీ సమయాన్ని రైల్వేశాఖ అనుసరిస్తుంటే, ఓ వినియోగదారుడు తన ఫోన్లో మరో నెట్వర్క్ సమయాన్ని ఉపయోగిస్తున్న పక్షంలో రెండింటి మధ్య టైమ్‌లో వ్యత్యాసాల కారణంగా అతడు లాగిన్ అయ్యేప్పటికి టికెట్లన్నీ అమ్ముడైపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐస్రో), భారత వాయుసేన, విమానాశ్రయాలు, వివిధ బ్యాంకులు ఎన్పీఎల్ రూపొందించిన ఐఎస్టీనే ఉపయోగిస్తున్నాయి. అయితే లీగల్ మెట్రోలజీ చట్టాన్ని సవరించి అందులో ఐఎస్టీని చేర్చడానికి ముందే ఆ ప్రామాణిక సమయాన్ని పాటించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. టైమ్ తీరుతెన్నులు ఇలా ! ఢిల్లీలోని ఎన్పీఎల్ వద్ద కచ్చితమైన సమయ నిర్ధారణకు అయిదు క్లాక్ జనరేషన్ మాడ్యూల్ (సీజియమ్) గడియారాలు, ఓ హైడ్రోజన్ మాస్టర్క్లాక్ ఉన్నాయి. సంప్రదాయ గడియారాలు క్వాడ్జ్ క్రిస్టల్ కంపనాలపై పనిచేస్తుండగా, అందుకు భిన్నంగా ఆటమిక్ గడియారం సీజియం అణు శక్తిని ఉపయోగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 400కుపైగా సీజియమ్ గడియారాలున్నాయి. అందులో ఐదు భారత్‌లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్యూరో ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ సంస్థ వివిధదేశాల్లోని ఈ గడియారాలను సమన్వయం చేసి, ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సెకన్ ఒకే విధంగా మొదలయ్యేలా చూస్తుంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇక టూవీలర్స్‌కి జీపీఎస్
తిరుపతి మంగళం: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు టూవీలర్స్‌కి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను అమర్చకోవాలని తిరుపతి ఆర్టీఓ వివేకానందరెడ్డి సూచించారు. తిరుపతి ఆర్టీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా రు. అధునాతన బైక్‌లపై యువత రాత్రి వేళల్లో రేస్‌లో పాల్గొంటున్నారని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వీటిని అరికట్టేందుకు జీపీఎస్ ఎంతో దోహదపడుతుందన్నారు. దానికి తోడు వారి వారి పిల్లలు బైక్‌లపై ఎక్కడికి వెళుతున్నారో, ఎంత స్పీడు వెళుతున్నారన్న విషయాలను సెల్‌ఫోన్ ద్వారా తల్లిదండ్రులు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల భద్రత, భవిష్యత్ కోసం వారి బైక్‌లకు జీపీఎస్‌ను అమర్చాలని సూచించారు. మొట్ట మొదటిసారిగా జీపీఎస్ అమర్చిన టూవీలర్‌ను మంగళవారం తిరుపతిలోని టీవీఎస్ బైక్ షోరూంలో జిల్లా కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న, తిరుపతి సబ్‌కలెక్టర్ నిషాంత్‌కుమార్, తిరుపతి ఎస్పీ అభిషేక్ మొహంతి ప్రారంభిస్తారని తెలిపారు. -
బస్సులకు జీపీఎస్..!
రాయవరం (మండపేట): ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల బస్సులకు స్పీడ్ గవర్నర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్న రవాణా శాఖ, ఇప్పుడు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాల, కళాశాల బస్సులకు జీపీఎస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే రవాణాశాఖకు ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. జీపీఎస్ అమలు చేయడంపై మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు(ఎంవీఐ), పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో చర్చించి ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ విధానం అమలుపై బస్సుల యాజమాన్యాలతో అవగాహన, చైతన్య సదస్సులు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ఇటు యాజమాన్యానికి, ఇటు తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. యాజమాన్యాలకు అవగాహన జీపీఎస్ వ్యవస్థను అమలు చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలపై రవాణా శాఖ అధికారులు త్వరలో సంబంధిత యాజమాన్యాలతో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అలాగే తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చైతన్యం చేస్తారు. నాణ్యత ప్రమాణాల ఆధారంగా ధర రూ.4వేల నుంచి రూ.6వేల వరకు ఉంటుంది. జీపీఎస్ పరికరం బస్సులకు అమర్చడంలో సంబంధిత యాజమాన్యాలు అయిష్టత ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే జీపీఎస్ అమర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను సవిరంగా తెలియజేసి వారు అమర్చుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించనున్నారు. జీపీఎస్ వల్ల బస్సు డ్రైవర్ల పనితీరు క్షుణ్ణంగా తెలిసే వీలుంటుంది. జిల్లాలో పరిస్థితి ఇదీ.. జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాల బస్సులు సుమారు 3500 ఉన్నాయి. అనుకోని సంఘటన జరిగితే ఎక్కడ, ఎలా ప్రమాదం జరిగిందో జీపీఎస్ వల్ల తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాఠశాల/కళాశాల బస్సులు ఎలా వెళ్తున్నాయి అనే విషయాన్ని సెల్ఫోన్లోనే యాప్‌ను క్లిక్ చేసి చూసే వీలుంటుంది. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఏ ప్రాంతంలో జరిగిందో స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. ప్రత్యేక యాప్.. పాఠశాల, కళాశాల బస్సులకు జీపీఎస్ వ్యవస్థను అమర్చిన తర్వాత సంబంధిత వివరాలు తల్లిదండ్రులు, బస్సు యాజమాన్యాలు తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక యాప్ తయారు చేస్తున్నట్లు సమాచారం. యాప్‌ను జీపీఎస్‌కు అనుసంధానం చేసిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల సెల్ఫోన్లో ఈ ప్రత్యేక యాప్‌ను డౌన్లోడ్ చేయించి దాన్ని ఎక్కడి నుంచైనా పరిశీలించేలా చర్యలు చేపట్టనున్నారు. బస్సు బయలు దేరిన దగ్గర నుంచి పాఠశాల/కళాశాలకు చేరేంత వరకు ఎన్ని సార్లు ఆగింది, ఏ ఏ కూడళ్లలో అగింది, తదితర వివరాలు యాప్‌లో స్పష్టంగా తెలుస్తాయి. ఈ విధానం అందుబాటులోకి వస్తే విద్యార్థులకు మరింత భద్రత కల్పించినట్లవుతుంది. విద్యార్థుల భద్రత కోసమే.. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకునే పాఠశాల/కళాశాల బస్సులకు జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచించింది. జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు మంచి ఆలోచన. ఇది యాజమాన్యాలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుంది. జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం రూపొందించే నియమ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – జి.సంజీవ్‌కుమార్, ఎంవీఐ, మండపేట -
అద్దె కార్లే అతడి టార్గెట్
సాక్షి,సిటీబ్యూరో: తన ఇద్దరు అనుచరుల తో కలిసి టూరిస్ట్ మాదిరిగా వస్తాడు... నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కార్లు అద్దెకు తీసుకుంటాడు... వెంటనే రాష్ట్రం దాటేసి వాటి రూపురేఖలు మార్చేస్తాడు... ఈ వాహనాలను వినియోగించి కొన్నాళ్ళ పాటు గంజా యి స్మగ్లింగ్ చేసి ఆపై అమ్మేసి సొమ్ము చేసుకుంటాడు... ఈ పంథాలో నాలుగు రాష్ట్రాల్లో ‘పనితనం’ ప్రదర్శించిన అంతర్రాష్ట్ర దొంగను బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. ఇతడి ముఠా సిటీలోనూ నేరాలు చేసినట్లు వెలుగులోకి రావడంతో విషయం ఆరా తీయాలని ఇక్కడి అధికారులు నిర్ణయించారు. జీపీఎస్ ఉన్న హైఎండ్ వాహనాలే.. రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాకు చెందిన దిలీప్‌కుమార్ అలియాస్ సురేంద్ర సింగ్ ఈ ముఠా నాయకుడిగా అదే ప్రాంతానికి చెందిన బల్వీర్, ముఖేష్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురూ టూరిస్టుల మాదిరిగా దేశంలోని వివిధ నగరాలకు వెళ్తుంటారు. వెళ్ళే ముందే తమ ఫొటోలు, నకిలీ పేర్లు, చిరునామాలతో కూడిన గుర్తింపుకార్డులు తయారు చేసుకుని దగ్గర ఉంచుకుంటారు. ఎంపిక చేసుకున్న నగరానికి చేరుకున్న తర్వాత ట్రావెల్స్ కార్యాలయాల నుంచి కార్లను అద్దెకు తీసుకుంటారు. తామే వాహనాలను డ్రైవ్ చేసుకుంటామంటూ వాటి యాజమాన్యాలతో చెప్తారు. ఈ గ్యాంగ్ ట్రావెల్స్ నిర్వాహకులకు ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరిస్తుంది. సాధారణ కార్లు కాకుండా జీపీఎస్ పరిజ్ఞానం జోడించిన హైఎండ్ వాహనాలే అద్దెకు కావాలని అడుగుతుంది. దీంతో వాటిని ఇవ్వడానికీ యజమానులు వెనుకాడరు. ఇలా తీసుకునే సమయంలో ఈ ముగ్గురూ తమ వెంట తెచ్చుకున్న నకిలీ గుర్తింపు పత్రాలు దాఖలు చేస్తుంటారు. ఇలా కారు తమ చేతికి చిక్కిన వెంటనే రాష్ట్రం దాటేయడంతో పాటు సరిహద్దుల్లోనే జీపీఎస్ పరికరాలు, కారు నెంబర్ ప్లేట్లను తొలగించేస్తారు. ఏ రాష్ట్రానికి వెళ్తున్నారో అదే సిరీస్‌లతో కూడిన నకిలీ రిజిస్ట్రేషన్ నెంబర్లు తగిలించుకుంటారు. ఇలా వాహనాలను తీసుకుని నేరుగా గుజరాత్ లేదా రాజస్థాన్ చేరుకుంటారు. ‘కళ్ళల్లో’ పడే వరకు స్మగ్లింగ్... ఈ చోరీ వాహనాలను వినియోగించే దిలీప్ గ్యాంగ్ ఆ రెండు రాష్ట్రాల్లోనూ గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటుంది. పోలీసులకు తాము వినియోగిస్తున్న వాహనంపై అనుమానం వచ్చే వరకు అక్రమ రవాణా చేస్తుంది. అలా జరిగిందని తెలిసిన వెంటనే నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి ఆ వాహనాన్ని అమ్మేస్తుంది. ఆపై మరో నగరాన్ని టార్గెట్‌గా చేసుకుని ‘వచ్చి పోతుంది’. ఈ పంథాలో వీరు బెంగళూరులోని జయప్రకాష్ నగర్, జీవన్‌బీమా నగర్ల్లో ఉన్న జస్ట్ రైడర్, జూమ్ కార్ సంస్థల నుంచి రూ.40 లక్షల విలువైన రెండు హైఎండ్ కార్లను ఎత్తుకుపోవడంతో అక్కడ కేసులు నమోదయ్యాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు దిలీప్, బల్వీర్, ముఖేష్‌లు నిందితులుగా గుర్తించారు. వీరు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించి సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకుని బెంగళూరు తరలించారు. విచారణ నేపథ్యంలో ఈ చోర త్రయం ఇదే పంథాలో ముంబై, చెన్నై, హైదరాబాద్‌ల్లోనే కార్ల చోరీలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ముగ్గురి అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని బెంగళూరు పోలీసులు ఈ మూడు ప్రాంతాలకు అందించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న అధికారులు ఇక్కడ నమోదైన ఈ తరహా నేరాలపై ఆరా తీస్తున్నారు. త్వరలో ఓ ప్రత్యేక బృందాన్ని బెంగళూరు పంపనున్నట్లు తెలిసింది. -
సురక్ష బ్యాండ్‌తో లైంగిక వేధింపులకు చెక్
మహిళల రక్షణకు నిర్భయ లాంటి చట్టాలు చేసినా నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏదో ఒకచోట మహిళలు దాడులకు బలైపోతూనే ఉన్నారు. అలాంటి వాటికి చెక్ పెట్టడానికి సేఫ్ సిటీ ప్రణాళికలో భాగంగా బెంగళూరు మహా నగర పాలికె సురక్ష బ్యాండ్లను అందించనుంది. జీపీఎస్ ఆధారిత ఈ బ్యాండ్లు మహిళలకు సబ్సిడీ ధరతో అందజేయనుంది. సాక్షి,బెంగళూరు: బెంగళూరు నగరంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న లైంగిక వేధింపులు, దౌర్జన్యాల ఘటనలు అరికట్టడానికి పాలికె సరికొత్త సాంకేతిక రక్షణాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టే ఉద్దేశంతో రూపొందించిన సేఫ్‌సిటీ ప్రణాళికలో భాగంగా మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలపై బీబీఎంపీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది. అందులో భాగంగా నగరవ్యాప్తంగా మహిళలు, యువతులకు జీపీఎస్ ఆధారిత సురక్ష బ్యాండ్లను అందించడానికి నిర్ణయించుకున్నట్లు కేంద్రానికి అందించిన నివేదికలో పేర్కొంది. ఈ ప్రణాళిక అమలుకోసం పాలికె రూ.100 కోట్ల నిధులు కేటాయించాలంటూ నివేదికలో విన్నవించింది. మహిళల భధ్రత కోసం తీసుకోనున్న చర్యలు, అనుసరించిన ప్రణాళికలపై చర్చించి తమకు నివేదికలు అందించాలంటూ కొద్ది నెలల క్రితం దేశంలోని ప్రముఖ నగరాల పాలనా సంస్థలకు కేంద్రప్రభుత్వం సూచనలు జారీ చేసింది. నివేదికలు అందించిన అనంతరం నిర్భయ నిధుల పథకం ద్వారా ఆయా నగరాల్లో మహిళల భద్రత కోసం నిధులు కేటాయిస్తామంటూ కేంద్రప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇటీవల సమావేశమైన నగర పోలీసులు, పాలికె అధికారులు సురక్ష బ్యాండ్లను అందించడానికి నిర్ణయించుకొని ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో ప్రస్తావించారు. ఎలా పనిచేస్తుంది... పాలికె అందించనున్న సురక్ష బ్యాండ్లను జీపీఎస్‌తో అనుసంధానం చేయనున్నారు.« మహిళలు, యువతులు ధరించనున్న సురక్ష బ్యాండ్లలో ఆయా మహిళల, యువతుల కుటుంబ సభ్యులు, స్థానిక పోలీస్స్టేషన్లు తదితర ఏడు ఫోన్ నంబర్లు నమోదు చేయనున్నారు. ఏదైనా ఆపద తలెత్తిన సమయంలో వెంటనే సురక్ష బ్యాండ్ ద్వారా యువతులు కుటుంబ సభ్యులతో పాటు బ్యాండ్‌లో పొందుపరచిన ఏడు నంబర్లకు ఒకేసారి ప్రస్తుతం తామున్న ప్రదేశం, ఆపద గురించి సమాచారం చేరవేయవచ్చు. జీపీఎస్ ద్వారా పోలీసులు, కుటుంబ సభ్యులు వెంటనే యువతులు ఉన్న చోటుకు చేరుకోవడానికి ఈ సురక్ష బ్యాండ్లు ఎంతో సహకరించనున్నాయి. ధరల్లో సబ్సిడీ : మహిళల భధ్రత కోసం అందుబాటులోకి తేనున్న సురక్ష బ్యాండ్లను పాలికె సబ్సిడీ ధరల్లో మహిళలకు విక్రయించడాని కి నిర్ణయించుకుంది. ఒక్కో బ్యాండ్ తయారికీ రూ.800 ఖర్చు కానుండగా మహిళలకు రూ.400లకే విక్రయించడానికి పాలికె నిర్ణయించుకుంది. ప్రయోగాత్మకంగా పాలికె పరిధిలో పది లక్ష ల మంది మహిళలకు సురక్ష బ్యాండ్లు అందించనుంది. -
ఏ భాయ్ జర దేఖ్కే చలో..
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ మెసేజ్ రాగానే మన ఫోన్ అప్రమత్తం చేస్తుంది. మెయిల్, ఫేస్బుక్ పోస్టులు, షేర్, లైకులు వచ్చినా ఫోన్లో మెసేజ్ టోన్ వస్తుంది. వెంటనే ఆ సందేశాన్ని చూసుకుంటాం. మరి ప్రయాణం చేస్తున్నపుడు ప్రమాదకరమైన మూలమలుపో.. ప్రమాద స్థలమో వస్తే? మనకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? ఎలా గుర్తు చేస్తారు? అందుకోసమే ప్రమాద స్థలాలు సమీపిస్తుంటే మనల్ని అప్రమత్తం చేసే కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. సాంకేతికత వినియోగంతో మరో అద్భుతమైన సౌకర్యాన్ని వాహనదారులకు పోలీస్ శాఖ అందించబోతోంది. అలర్ట్ చేసేస్తుంది.. రాష్ట్రంలోని జాతీయ రహదారులపై పదే పదే ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా పోలీస్ శాఖ గుర్తించింది. రాష్ట్ర రహదారులు, అర్బన్ ప్రాంతాల్లోని రోడ్డు ప్రమాదాల ప్రాంతాలను గుర్తించింది. వీటిలో 2 నుంచి 5 ప్రమాదాలు జరిగిన ప్రతి ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించి అధికారులు జీపీఎస్ ట్యాగ్ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి 150 వరకు బ్లాక్ స్పాట్ల ట్యాగింగ్ పూర్తయ్యింది. జిల్లాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులపై మొత్తం కలిపి 560 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. వీటికి కూడా త్వరలోనే జీపీఎస్ ట్యాగ్ చేసేం దుకు చర్యలు చేపట్టారు. ఈ జీపీఎస్ ట్యాగింగ్‌లను గూగుల్ సంస్థకు అందించనున్నారు. దీంతో ప్రమాద స్థలానికి 200 మీటర్ల ముందే జీపీఎస్ ద్వారా అలర్ట్ మెసేజ్ వచ్చేలా చూడాలని భావిస్తున్నారు. ‘మెల్లగా వెళ్లాలి’లేదా ‘ప్రమాదకరమైన మలుపు ఉంది’అని ఆటోమేటిక్‌గా గూగుల్ లేదా జీపీఎస్ యాప్ అప్రమత్తం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సందేశం వస్తుందిలా..! ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. క్షణక్షణం సోషల్ మీడియా అప్డేట్స్ తదితరాల కోసం ఇంటర్నెట్ వాడుతున్నారు. తెలియని ప్రాంతానికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ లేదా జీపీఎస్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కూడా స్మార్ట్ఫోన్ల ద్వారా అప్రమత్తం చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. ప్రతి స్మార్ట్ ఫోన్లో లొకేషన్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా గూగుల్ సంస్థ నుంచి నేరుగా వాహనదారును అప్రమత్తం చేసేందుకు పోలీస్ శాఖ ప్రయత్నిస్తోంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు లొకేషన్ సర్వీస్ ఆన్‌లో ఉంటే బ్లాక్ స్పాట్స్‌కు 200 మీటర్ల ముందే ఆటోమేటిక్‌గా సందేశం వచ్చేలా లేదా అలారం మోగే సౌకర్యం అందుబాటులోకి తేనున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ప్రతి వాహనానికీ జీపీఎస్ తప్పనిసరి.. రాష్ట్రంలోని ప్రతి వాహనానికీ జీపీఎస్ కిట్ తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా పోలీస్, రవాణా శాఖ సంయుక్తంగా ప్రభుత్వానికి ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనివల్ల రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు చోరీ వాహనాల జాడ, నేరస్తుల గుర్తింపు సులువవుతుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా.. ఆటోలు, బస్సులు, స్కూల్ బస్సులు, లారీలు వంటి కమర్షియల్ వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రమాదాల నియంత్రణలో కీలకం.. ఏటా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల 6 వేల మంది మృతి చెందుతున్నారు. అనేక సందర్భాల్లో అతివేగం, ప్రమాదకర మలుపులు, రోడ్ ఇంజనీరింగ్ సమస్యలే ఇందుకు కారణమవుతున్నాయి. ఈ అప్రమత్త వ్యవస్థ వల్ల ప్రమాదాలను చాలా వరకు నియంత్రించొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కాల్ చేస్తే ‘కనిపెట్టేస్తారు’!
సాక్షి, హైదరాబాద్:నగరంలోని అబిడ్స్ ప్రాంతం. ఓ వ్యక్తికి హఠాత్తుగా ఆపద ఎదురైంది. వెంటనే ‘డయల్–100’కు కాల్ చేశాడు. ఆపై తను ఎక్కడ ఉన్నాడో చెప్పే పరిస్థితుల్లో అతడు లేడు. దీంతో బాధితుడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడికి చేరుకోవడానికి పోలీసులకు కొంత సమయం పట్టింది. ఇలాంటి పరిస్థితి చాలా సందర్భాల్లో నగర పోలీసులకు ఎదురవుతోంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసు విభాగం ‘డయల్–100’వ్యవస్థను ఆధునీకరిస్తోంది. బాధితుడు కాల్ చేసిన వెంటనే అతడు ఉన్న ప్రాంతాన్నీ తక్షణం గుర్తించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న ఈ విధానాన్ని.. మూడు నెలల్లో నగరంలోనూ అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. రెస్పాన్స్ టైమ్ తగ్గించడమే లక్ష్యం.. బాధితుల నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఎంత త్వరగా వారి వద్దకు చేరితే అంత ఎక్కువ మేలు జరిగే ఆస్కారం ఉంది. దీన్నే సాంకేతికంగా ‘పోలీసు రెస్పాన్స్ టైమ్’అంటారు. గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం, తక్కువ సమయంలో ఘటనాస్థలికి చేరడానికి నగరంలో గస్తీ విధులు నిర్వర్తించే రక్షక్, బ్లూకోల్ట్స్‌కు ‘రెస్పాన్స్ టైమ్’నిర్దేశిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే గస్తీ వాహనాలను ‘డయల్–100’తో అనుసంధానించారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ఆధారంగా పనిచేసే ఈ విధానం పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వాలంటే బాధితులు ఉన్న ప్రాంతాన్ని (లొకేషన్) పక్కాగా తెసుకోవాల్సి. ఇది సాధ్యమైతే రెస్పాన్స్ టైమ్‌ను గణనీయంగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ‘100’కాల్స్‌ను డైవర్ట్ చేసినప్పటికీ.. బాధితులు ‘100’కు ఫోన్ చేసి సహాయం కోరిన వెంటనే అక్కడి సిబ్బంది సదరు ఫిర్యాదుదారుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. గస్తీ వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చడంతో ‘100’సిబ్బందికి ఏ వాహనం ఎక్కడ ఉందో కచ్చితంగా తెలుస్తోంది. బాధితునికి సమీప ప్రాంతంలో ఉన్న వాహనానికే నేరుగా ఆ కాల్‌ను డైవర్ట్ చేస్తున్నారు. కాల్ అందుకున్న గస్తీ సిబ్బంది బా«ధితుడిని సమాచారం అడిగి అతను ఉన్న ప్రదేశానికి చేరుకోవడానికి కొంత సమయం పడుతోంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పోలీసులు.. ‘100’కు ఎవరైనా కాల్ చేస్తే వారు కచ్చితంగా ఎక్కడ నుంచి చేశారనేది కంప్యూటర్ తెరపై కనిపించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఫలితంగా ‘రెస్పాన్స్ టైమ్’గణనీయంగా తగ్గింది. లొకేషన్ తెలుసుకోవడానికి లింకేజీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ఓ ప్రైవేట్ సంస్థ అందించింది. నగర పోలీసులు ఆ సంస్థ ప్రతినిధులతో బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో బుధవారం సమావేశమయ్యారు. బాధితుడి లొకేషన్ తెలుసుకోవడానికి సెల్ సర్వీసు ప్రొవైడర్ల నుంచి లింకేజ్ తీసుకోవాలి. మొత్తం 11 సర్వీస్ ప్రొవైడర్ల నుంచి లింకేజ్‌కు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఢిల్లీకి చెందిన సంస్థ అందించనుంది. గరిష్టంగా మూడు నెలల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి నగర పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇది అమలైతే బాధితులకు సత్వర సహాయం అందడంతో పాటు బోగస్ కాల్స్‌కు చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు. -
‘అడ్రస్’ మెట్రోనే చెబుతుంది!
పిల్లర్లకు ప్రత్యేక సంఖ్యల కేటాయింపు - దీంతో చిరునామా గుర్తింపు సులభతరం - గూగుల్ మ్యాప్, జీపీఎస్‌లతో అనుసంధానం సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలు రాకతో ప్రయాణం సులభమవడమే కాదు... నగరంలోని చిరునామాలు కూడా సులువుగా గుర్తించేలా అడుగులు పడుతున్నాయి. మెట్రో రైలు పిల్లర్లకు ఆల్ఫాన్యూమరిక్‌తో పాటు ప్రత్యేక సంఖ్యలు కేటాయించి.. గూగుల్ మ్యాప్, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ (జీపీఎస్)లతో అనుసం«ధానించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నగరవాసులతో పాటు కొత్తగా వచ్చిన వారు ఎవరైనా మెట్రో పిల్లర్పైనున్న నంబర్ ఆధారంగా అడ్రస్సు సులువుగా కనుగొనే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించిన 11.6 కిలోమీటర్ల పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేలో పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. దీంతో ఆ మార్గంలో చాలా మంది చిరునామాలు చెప్పాలంటే పిల్లర్ల సంఖ్య చెబుతుంటారు. దీనివల్ల అడ్రస్ పట్టుకోవడం సులువైంది. ఇదే విధానం మెట్రో రైలు మార్గంలోని పిల్లర్లకూ అన్వయించనున్నారు. ఆదివారం మెట్రో రైలు భవన్లో హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వివిధ రోడ్లు, ప్రాంతా లు, సమీపంలోని కాలనీలకు వెళ్లే మార్గాలను సూచించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే... కారిడార్–1 (మియాపూర్–ఎల్బీనగర్ మార్గం)ను ‘ఏ’గా... కారిడార్–2 (జేబీఎస్–ఫలక్‌నుమా)ని ‘బీ’గా... కారిడార్–3 (నాగోల్–రాయదుర్గం)ని ‘సీ’గా పేర్కొంటూ మెట్రో పిల్లర్లకు ప్రత్యేక సంఖ్యలు కేటాయించనున్నారు. ఉదాహరణకు మియాపూర్–ఎల్బీనగర్ మార్గంలో కారిడార్ ప్రారంభమయ్యే మియాపూర్ స్టేషన్ వద్ద పిల్లర్‌కు ‘ఏ1’నంబర్‌ను కేటాయిస్తారు. అదే మార్గంలో అమీర్‌పేట స్టేషన్ వద్ద పిల్లర్‌ను ఏ450గా పేర్కొంటారు. ఎంజీబీఎస్–ఫలక్నుమాను కలుపుకుని ఉన్న మూడు కారిడార్లలో 2,748 పిల్లర్లున్నాయి. స్టేషన్ల వద్ద గేట్ నంబరింగ్... ప్రతి మెట్రో స్టేషన్లో నాలుగు ఎంట్రీలు, ఎగ్జిట్లు ఉంటాయి. ఉదాహరణకు అమీర్‌పేట స్టేషన్లో అమీర్‌పేట గేట్ 1, అమీర్‌పేట గేట్ 2 అని ఉంటుంది. జపాన్‌లోని టోక్యో లాంటి నగరాల్లో అంకెలతో ఉన్న గేట్లు వివిధ వేదికలు, ప్రాంతాలు, కార్యాలయాలకు మార్గాలు చూపెడతాయి. ఈ నంబరింగ్ వల్ల ప్రతి ఒక్కరూ సరైన ప్రాంతానికి చేరుకోగలుగుతారు. మెట్రో స్టేషన్లకు వచ్చే మార్గాలు, సమీప ప్రాంతాలకు వెళ్లే మార్గాల వివరాలు తెలిసేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. సూచనలుంటే పంపించండి.. ‘విజిటర్ ఫ్రెండ్లీ సిటీ’గా హైదరాబాద్‌ను మార్చేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వాగతిస్తున్నామని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రజల సూచనలను హెచ్ఎంఆర్ఎల్ వెబ్సైట్లో పోస్టు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్ ఉన్నతాధికారులు శివానంద్ నింబర్గి, అలని కుమార్ సైనీ, రాజీవ్ అయ్యర్, డీవీఎస్ రాజు, వినోద్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, బీఎన్ రాజేశ్వర్ పాల్గొన్నారు. -
ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి మీకు తెలుసా?
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించుకున్న నేవిగేషన్ శాటిలైట్ సిస్టం గురించి మీకు తెలియని విషయాలు ఇవే. మన నేవిగేషన్ వ్యవస్థకు ఇప్పటి వరకూ విదేశీ శాటిలైట్ల సహకారాన్ని తీసుకుంటున్నాం. మనం సొంతంగా రూపొందించుకున్న ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ అందుబాటులోకి వస్తే.. మనకూ సొంత నేవిగేషన్ శాటిలైట్ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ గురించి ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ వల్ల.. ప్రజలకు కచ్చితమైన రియల్ టైమ్ నేవిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకున్న ప్రాంతీయ నేవిగేషన్ వ్యవస్థ. రెండు రకాల సేవలను ఈ శాటిలైట్ ప్రజలకు అందిస్తుంది. మొదటిది.. స్టాండర్డ్ పొజిషన్ సేవలను అందురూ వినియోగించుకోవచ్చు.. కొన్ని సేవలను కేవలం మిలటరీ, బద్రతా ఏజెన్సీలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఐఆర్ఎన్ఎస్ఎస్ ప్రధానంగా 6 రకాల సేవలను అందిస్తుంది. అందులో భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సిస్టం. డిజాస్టర్ మేనేజ్మెంట, వెహికల్ ట్రాకింగ్ సిస్టం ప్రధానమైనవి. అమెరికన్ జీపీఎస్ సిస్టమ్‌లో ఒక ఆర్బిట్ఘలో 24 ఉపగ్రహాలు భూమికి సామాచారాన్ని అందిస్తాయి. అదే ఐఆర్ఎన్ఎస్ఎస్ విషయానికి వస్తే.. ఆర్బిట్ నాలుగు శాటిలైట్లు నిరంతరం భూమికి సమచారాన్ని అందిస్తాయి. అంతేకాక ఒక్కో శాటిలైట్.. తానున్న రీజియన్‌లో 1500 కిలోమీటర్ల ప్రాంతాన్ని స్కాన్ చేయగలదు. కచ్చితమైన కాలమానాన్ని ఐఆర్ఎన్ఎస్ఎస్ అందిస్తుంది. -
ఫీచర్ ఫోన్లలోనూ జీపీఎస్ తప్పనిసరి
తయారీ సంస్థలకు డాట్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: చౌక ఫీచర్ ఫోన్లలో ఖరీదైన జీపీఎస్ టెక్నాలజీకి బదులుగా ప్రత్యామ్నాయ టెక్నాలజీ ఉపయోగిస్తామన్న మొబైల్స్ తయారీ సంస్థల ప్రతిపాదనను టెలికం విభాగం (డాట్) తోసిపుచ్చింది. వినియోగదారులు ...ముఖ్యంగా మహిళల భద్రత దృష్ట్యా జీపీఎస్ తప్పనిసరని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ యూజర్లున్న ప్రాంతాన్ని సత్వరం కనిపెట్టగలిగేలా .. 2018 జనవరి 1 నుంచి దేశీయంగా విక్రయించే ఫీచర్ ఫోన్లు సహా అన్ని మొబైల్స్‌లోను జీపీఎస్ ఫీచర్‌ను పొందుపర్చాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఖరీదైన టెక్నాలజీ వల్ల ఫీచర్ ఫోన్స్ ధర 50 శాతం పైగా పెరుగుతుందని, కాబట్టి ప్రత్యామ్నాయ టెక్నాలజీని వాడేందుకు అనుమతించాలని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ (ఐసీఏ).. డాట్‌ను కోరింది. అయితే దీనికి అనుమతించలేదు. -
‘జీపీఎస్’ కీళ్ల మార్పిడి చికిత్స అద్భుతం
‘అమరావతి ఆర్థోప్లాస్టీ’ సదస్సులో డాక్టర్ నికోలస్ జేఏ తుల్ప్ లబ్బీపేట (విజయవాడ తూర్పు): గైడెడ్ పర్సనలైజ్డ్ సర్జరీ(జీపీఎస్) విధానంలో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలను వంద శాతం విజయవంతంగా నిర్వహించవచ్చని ప్రముఖ కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ నికోలస్ జేఏ తుల్ప్(నెదర్లాండ్) అన్నారు. విజయవాడ ఆర్థోపెడిక్ సొసైటీ, సన్‌రైజ్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘అమరావతి ఆర్థోప్లాస్టీ’ పేరుతో శనివారం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సు ను డాక్టర్ నికోలస్ ప్రారంభించి మాట్లాడారు. జీపీఎస్ విధానం ద్వారా చేస్తున్న కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు కచ్చి తత్వం, ఎక్కువ మన్నికతో అద్భుత ఫలితాలిస్తున్నా యని చెప్పారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం.నరేంద్రకుమార్ మాట్లాడుతూ జీపీఎస్ టెక్నాలజీని రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దే శంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం నికోలస్ నేతృత్వంలో జీపీఎస్ విధానంలో రివిజన్నీ, ప్రైమరీనీ ఆపరేషన్లు నిర్వహించి, లైవ్ టెలి కాస్ట్ ద్వారా సదస్సులో పాల్గొన్న వైద్యులకు వివరించారు. -
దొంగలను గుర్తించిన జీపీఎస్
- రెండు రోజుల క్రితం కర్ణాటకలో డీజిల్ ట్యాంకర్ అపహరణ - లారీ డ్రైవర్, క్లీనర్‌ను కట్టేసిన దుండగులు - జీపీఎస్ సహాయంతో విముక్తి కలిగించిన పోలీసులు - పోలీసుల అదుపులో ఒకరు, పరారీలో ఇద్దరు వెల్దుర్తి రూరల్: కేసుల ఛేదనలో పోలీసులకు ఆధునిక సాంకేతిక అభివృద్ధి ఎంతో సహకరిస్తుందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. కర్ణాటకలో అపహరణకు గురైన డీజిల్ ట్యాంకర్‌ను జీపీఎస్ సహాయంతో పోలీసులు గుర్తించారు. దుండగులు వెల్దుర్తి పట్టణ సమీపంలోని రామళ్లకోట రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపంలో దాచిన ట్యాంకర్ ఆచూకీని గురువారం రాత్రి గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కర్ణాటకలోని హసన్ జిల్లా కేంద్రంలోని హెచ్‌పీసీఎల్ కంపెనీ నుంచి ట్యాంకర్లో 20వేల లీటర్ల డీజిల్ నింపుకుని క్లీనర్‌తో పాటు డ్రైవర్ మణి బెంగళూరు వైపు బయలుదేరాడు. టౌన్ దాటగానే ముగ్గురు వ్యక్తులు పోలీసులు దుస్తుల్లో వచ్చి ట్యాంకర్‌ను ఆపి తాము అటు వైపు వెళ్లాలంటూ ఎక్కారు. ట్యాంకర్ హసన్ దాటి ఘాట్ ప్రాంతానికి చేరుకోగానే లారీ ఆపమని చెప్పి డ్రైవర్, క్లీనర్‌పై దాడి చేసి తాళ్లతో కట్టివేసి, ట్యాంకర్ క్యాబిన్‌లోనే సీట్ల కింద దాచారు. అక్కడ దారి మళ్లిన ట్యాంకర్‌ను కంపెనీ వారు జీపీఎస్ సిస్టం ద్వారా గుర్తించారు. కర్నూలు జిల్లా, రామళ్లకోట ప్రాంతంలో ఉన్నట్లు గురువారం సాయంత్రం గుర్తించి అక్కడి పోలీసులకు తెలుపగా, వారు వెల్దుర్తి పోలీసులకు సమాచారమందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఎస్ఐ, టీం రామళ్లకోట ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రోడ్డుపై ఎక్కడా జాడ కానరాలేదు. చివరకు రాత్రి 11 గంటల ప్రాంతంలో వెల్దుర్తి సమీపంలో వేణు ఇటుకల ఫ్యాక్టరీ పక్కన ముళ్ల పొదల మధ్య ట్యాంకర్‌ను గుర్తించారు. పోలీసులను చూసి ట్యాంకర్లో ఉన్న ముగ్గురు నిందితులు పరారవుతుండగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారయ్యారు. ట్యాంకర్ క్యాబిన్లో సీట్ల కింద కట్టేసిన డ్రైవర్ మణి, క్లీనర్‌ను బయటకు తీశారు. రెండు రోజులుగా తిండి, నీళ్లు లేక అపస్మారక స్థితిలో ఉండడం చూసి వారికి సపర్యలు చేశారు. పట్టుబడిన వ్యక్తి అభిషేక్‌ను విచారించగా దుండగులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వాసులుగా గుర్తించినట్లు ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపారు. నవీన్, హరీష్ పరారీలో ఉన్నారని, కేసు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఇకపై స్కూల్ బస్సుల్లో సీసీటీవి,జీపీఎస్
-
ఇకపై స్కూల్ బస్సుల్లో సీసీటీవీ, జీపీఎస్
న్యూఢిల్లీ: ఇకపై స్కూలు బస్సుల్లో సీసీటీవీల ఏర్పాటు, జీపీఎస్‌తో అనుసంధానం చేయాలని, వేగనియంత్రణ కలిగి ఉండాలని సీబీఎస్ఈ మార్గదర్శకాలను జారీచేసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న స్కూలు బస్సు ప్రమాద సంఘటన నేపథ్యంలో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి జవదేకర్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవాలని జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలని సీబీఎస్ఈ పేర్కొంది. ఇక బస్సు సిబ్బంది వ్యవహార శైలిని పరిశీలించేందుకు ప్రతీ బస్సుకు కనీసం ఒక విద్యార్థి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా చూడాలంది. బస్సుల్లో అలారం, సైరన్ ల వంటి ఏర్పాటు ఉండాలని, ఒక మొబైల్ ఫోను అందుబాటులో ఉంచాలంది. -
వృద్ధుల కోసం జీపీఎస్ బ్రాస్లెట్లు..
సాధారణంగా ఒక వయసు వచ్చిన వ్యక్తులకు మతిమరుపు రావడం చాలా సహజం. అది ఒక పరిధి వరకైతే ఒకే కానీ తమ సొంత ఇంటి అడ్రస్‌ను సైతం మర్చిపోయేలా ఉంటే మాత్రం ఎంతో ప్రమాదం. కాబట్టి మతిమరుపు లాంటి సమస్యలతో బాధ పడుతున్న వృద్ధుల కోసం చైనా అధికారులు ఓ కొత్త ఆలోచన చేశారు. ఇంటి నుంచి బయటకెళ్లిన వృద్ధులు మళ్లీ ఇళ్లు చేరడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించి.. వారికి ప్రత్యేక బ్రాస్లెట్లు ఇవ్వాలని నిర్ణరుుంచారు. జీపీఎస్‌తో కూడిన ఆ బ్రాస్లెట్లను వృద్ధులు ధరిస్తే వారు దారి తప్పిపోరుున లేక అడ్రస్ మర్చిపోయిన వారిని గుర్తించడం సులభమవుతుందని బీజింగ్ డిప్యూటీ మేయర్ వాంగ్ నింగ్ తెలిపారు. మతిమరుపు సమస్యలున్న 12,000 మంది వృద్ధులకు త్వరలోనే ఈ బ్రాస్లెట్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. వృద్ధులకు సంబంధించిన వారు తమ స్మార్ట్ ఫోన్లలో యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా వారి ఆచూకీని తెలుసుకోగలరని తెలిపారు. అంతే కాదు ఆ బ్రాస్లెట్తో వృద్ధులు ఎమర్జెన్సీ కాల్స్ సైతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 2015లోని సమాచారం ప్రకారం చైనా జనాభాలో 22 కోట్ల మంది 60 ఏళ్లకు పైబడినవారే.