సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి విస్పష్టంగా కీలక ప్రకటన చేసింది. ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా పాటిల్, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు.
దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అది కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న రీతిలో రాష్ట్రం అప్పులు లేనే లేవని పంకజ్ చౌదరి జవాబుతో తేలిపోయింది. 15వ ఆర్థి క సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను ఆర్బీఐ అధ్యయనం చేసిన అనంతరం వివిధ రాష్ట్రాల అప్పులను వెల్లడించిందన్నారు.
పేదలను ఆదుకున్న డీబీటీ..
కోవిడ్ సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీ వృద్ధితో పాటు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్‌డీపీ వృద్ధి క్షీణించగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2.1 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 17.6 శాతం నికర వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022–23లో ఏపీలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 శాతం నికర వృద్ధి నమోదైందన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 2022–23లో దేశంలో తొమ్మిదో స్థానంలో (రూ.2,19,518) ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా, ఆర్థి క కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నగదు బదిలీని కొనసాగించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment