Pankaj
-
తగ్గిన ఆర్థిక మోసాలు
సాక్షి, అమరావతి: గత రెండు సంవత్సరాలుగా దేశంలో వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు తగ్గాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే... 2022–23, 2023–24 ఆరి్థక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ఆర్థిక మోసాలు బాగా తగ్గడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. 2021–22లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో రూ.9,289 కోట్ల విలువైన ఆర్థిక మోసాలు జరిగాయని తెలిపారు. 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.3,607 కోట్ల విలువైన మోసాలు, 2023–24 ఆరి్థక సంవత్సరంలో రూ.2,175 కోట్ల విలువైన మోసాలు జరిగాయని పంకజ్ చౌదరి వివరించారు. మోసగాళ్లను అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవడంతో మోసాల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు.‘2021–22లో అత్యధికంగా పశి్చమ బెంగాల్లో 537 కేసుల్లో రూ.3,391 కోట్ల మోసం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 715 కేసుల్లో రూ.2,630 కోట్లు, మహారాష్ట్రలో 2,233 కేసుల్లో రూ.1,257 కోట్లు, 2022–23లో అత్యధికంగా ఢిల్లీలో 1,743 కేసుల్లో రూ.762 కోట్లు, 2023–24లో తమిళనాడులో అత్యధికంగా 6,468 కేసుల్లో రూ.663 కోట్ల మేర మోసం జరిగింది.’ అని ఆయన తెలిపారు. వాణిజ్య బ్యాంకులు, ఆరి్థక సంస్థల్లో మోసాలను నివారించేందుకు ఆర్బీఐ రిస్క్ మేనేజ్మెంట్పై ఇటీవల తగిన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. బ్యాంకుల్లో డెడికేటెడ్ డేటా అనలిటిక్స్ మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటును తప్పనిసరి చేసినట్లు తెలిపారు. మూడేళ్లలో యూపీఐ చెల్లింపుల్లో రూ.2,145 కోట్ల మోసం గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 26.99 లక్షల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల్లో రూ.2,145 కోట్ల మేర మోసం జరిగినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. లావాదేవీలు, చెల్లింపుల మోసాన్ని నివేదించే సాధనంగా ఆర్బీఐ మార్చి 2022 నుంచి వెబ్ అధారిత సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని అమలు చేస్తోందని చెప్పారు. అన్ని సంస్థలు చెల్లింపుల మోసాలను వెబ్ అధారిత సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీకి నివేదించాల్సి ఉంటుందన్నారు. లావాదేవీల మోసాలతోపాటు చెల్లింపు సంబంధిత మోసాలను నిరోధించేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఏఐ అండ్ ఎంఎల్‌ను వినియోగించడం ద్వారా మోసపూరిత లావాదేవీలను బ్యాంకులు తిరస్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఆన్‌లైన ఫైనాన్స్ భద్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. -
అలా అయితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మూడేళ్ల కనిష్టానికి పడిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రేట్లను తగ్గించొచ్చన్న అంచనాల నేపథ్యంలో దీనిపై పెట్రోలియం శాఖ సెక్రటరీ పంకజ్ జైన్ స్పష్టతనిచ్చారు.ముడి చమురు ధర కనిష్ట స్థాయి వద్ద స్థిరంగా కొనసాగితేనే పెట్రోల్, డీజిల్ రేట్ల సవరణకు అవకాశం ఉంటుందన్నారు. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర మంగళవారం 70డాలర్ల దిగువకు పడిపోవడం గమనార్హం. 2021 డిసెంబర్ తర్వాత ఇంత కనిష్టానికి రావడం ఇదే మొదటిసారి. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు సరఫరాపై హరీకేన్ ఫ్రాన్సిన్ ప్రభావం చూపించడంతో చమురు ధర గురువారం మళ్లీ 71 డాలర్లకు ఎగిసింది. ఈ ఏడాది కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించడం తెలిసిందే. అంతకుముందు రెండేళ్లుగా ధరల్లో ఎలాంటి సవరణ చేయలేదు. ఢిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా మీడియా ప్రతినిధులతో పంకజ్ జైన్ ఈ అంశంపై మాట్లాడారు. అంతర్జాతీయ చమురు ధరలు కనిష్టాల వద్ద స్థిరపడితే అప్పుడు ఆయిల్ కంపెనీలు ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు. మరోవైపు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నాయని.. రేట్లపై నిర్ణయానికి ముందు మరికొంత కాలం పాటు ఇదే విధానం కొనసాగాలని కోరుకుంటున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే రేట్లను తగ్గిస్తే.. మళ్లీ అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతే నష్టపోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో ఆయిల్ కంపెనీలు కొంత కాలం పాటు వేచి చూసే ధోరణిని అనుసరించాలనుకుంటున్నట్టు చెప్పాయి. మహారాష్ట్ర ఎన్నికల ముందు? ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రేట్లను తగ్గించొచ్చని బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఓ నివేదికలో తెలిపింది. ‘‘రాష్ట్రాల ఎన్నికల ముందు పెట్రోలియం రేట్లను తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి. మేము కూడా దీన్ని తోసిపుచ్చడం లేదు. జమ్మూ కశ్మీర్, హర్యానాకు సంబంధించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి మరో నెల రోజుల పాటు అమల్లో ఉంటుంది. దీంతో దీపావళి లేదా మహారాష్ట్ర ఎన్నికల ప్రవర్తా నియమావళి అమల్లోకి రావడానికి ముందు రేట్లను తగ్గించొచ్చు. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.2 వరకు తగ్గించొచ్చు. వచ్చే నెల రోజుల పాటు ఆయిల్ కంపెనీలు అసాధారణ మార్కెటింగ్ మార్జిన్లను సంపాదిస్తాయి. ఎల్పీజీపై నష్టాలను కూడా భర్తీ చేసుకోగలుగుతాయి. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో మార్కెటింగ్ మార్జిన్ లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.4.7/3.8 గా ఉంటే, జూలై–సెప్టెంబర్ కాలంలో మార్కెటింగ్ మార్జిన్లు లీటర్ పెట్రోల్/డీజిల్‌పై రూ.9.7/8గా ఉండొచ్చు’’అని ఎమ్కే గ్లోబల్ వివరించింది. దేశ చమురు అవసరాల్లో 85 % దిగుమతులపైనే ఆధారపడడం తెలిసిందే. -
యూపీలో మరో ఎన్కౌంటర్
యూపీలో మరో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ మన్నా సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన పంకజ్ యాదవ్‌పై యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) కాల్పులు జరిపింది. ఈ నేరస్తునిపై పై లక్ష రూపాయల రివార్డు ఉంది. ఈ ఎన్కౌంటర్లో పంకజ్ మృతిచెందాడు. కాగా బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ, మాఫియా షహబుద్ధీన్లకు పంకజ్ యాదవ్‌లకు షూటర్‌గా పనిచేశాడు. అలాగే డబ్బుల కోసం హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్‌గానూ పేరొందాడు. ఈ ఘటన గురించి పోలీసులు మీడియాతో మాట్లాడుతూ మధుర-ఆగ్రా హైవేలోని ఫర్హా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 4 గంటలకు ఎన్కౌంటర్ జరిగిందని ఎస్టీఎఫ్ తమకు తెలియజేసిందన్నారు. నేరస్తుడు పంకజ్ యాదవ్ తన సహచరులలోని ఒకరితో కలిసి బైక్‌పై ఆగ్రా వైపు వెళ్తున్నట్లు ఇన్ఫార్మర్ నుండి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్టీఎఫ్ బృందం అతనిని వెంబడించింది. ఆతను గ్రామం వైపు పరిగెడుతూ ఎస్టీఎఫ్ బృందంపై కాల్పులు ప్రారంభించాడు. దీనికి ప్రతిగా ఎస్టీఎఫ్ కూడా కాల్పులు జరిపింది. ఈ ఎన్కౌంటర్లో పంకజ్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సహచరుడు సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. దీంతో ఎస్టీఎఫ్ బృందం అతని కోసం గాలిస్తోంది.గాయపడిన పంకజ్‌ను మధుర జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే అక్కడి వైద్యులు అతనిని పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. యూపీ ఎస్టీఎఫ్ బృందం సంఘటనా స్థలం నుండి ఒక పిస్టల్, ఒక రివాల్వర్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుంది. పంకజ్ యాదవ్ మవులోని తాహిరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాణిపూర్ గ్రామ నివాసి. మన్నా సింగ్ హత్యలో ప్రమేయమున్న పంకజ్ యాదవ్‌పై హత్య, దోపిడీ తదితర 36 కేసులు నమోదయ్యాయి. పంకజ్ యాదవ్‌ను అరెస్టు చేయడానికి యూపీ పోలీసులు, యూపీ ఎస్టీఎఫ్ సిబ్బంది చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
ఐదేళ్లలో రద్దు చేసిన రుణాలు రూ. 9.9 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 9.90 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం రాజ్యసభకు తెలిపారు. 2019–20లో అత్యధికంగా రూ. 2.34 లక్షల కోట్లు రైటాఫ్ చేయగా ఆ తర్వాత సంవత్సరంలో ఇది రూ. 2.02 లక్షల కోట్లకు, 2021–22లో రూ. 1.74 లక్షల కోట్లకు తగ్గింది. తర్వాత సంవత్సరంలో ఇది తిరిగి రూ. 2.08 లక్షల కోట్లకు పెరగ్గా, గత ఆర్థిక సంవత్సరం రూ. 1.70 లక్షల కోట్లకు పరిమితమైంది.రైటాఫ్ చేసినంత మాత్రాన బాకీలను పూర్తిగా రద్దు చేసి రుణగ్రహీతలకు మేలు చేసినట్లు కాదని, వారు వాటిని చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపర్చుకునేందుకు, పన్ను ప్రయోజనాలు పొందేందుకు, మూలధనాన్ని మెరుగ్గా ఉపయోగించుకునేందుకు నిర్దిష్ట నిబంధనలకు లోబడి బ్యాంకులు మొండి బాకీలను రైటాఫ్ చేస్తుంటాయని పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని రాబట్టేందుకు బ్యాంకుల చర్యలు కొనసాగుతాయని తెలిపారు. గత అయిదేళ్లలో రూ. 1.84 లక్షల కోట్లు రికవర్ అయినట్లు మంత్రి చెప్పారు. -
భారీగా సైబర్ నేరాలు
సాక్షి, అమరావతి: దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఐదేళ్లలో సైబర్ నేరస్తులు ఏకంగా 44,599 మోసాలు చేసి.. రూ.2,137 కోట్లు కొట్టేశారు. అత్యధికంగా 2023–24వ ఆర్థిక సంవత్సరంలోనే 29,082 మోసాలతో రూ.1,457 కోట్లను కొల్లగొట్టారని ఇటీవల లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2019–20వ ఆర్థిక సంవత్సరం నుంచి 2023–24వ ఆర్థిక సంవత్సరం వరకు రూ.2,137 కోట్లు దోచేస్తే.. రూ.184 కోట్లే రికవరీ చేసినట్లు మంత్రి తెలిపారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితరాల ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. దేశంలో అత్యధికంగా హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మోసాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్పంగా గత ఐదేళ్లలో 575 సైబర్ మోసాలతో రూ.23.46 కోట్లను దోచేశారని తెలిపారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ద్వారా డిజిటల్ టెక్నాలజీల సురక్షిత వినియోగానికి వివిధ చర్యలు చేపట్టామన్నారు. ఆర్థిక నేరాలతో పాటు సైబర్ చీటింగ్‌లపై ఫిర్యాదుల కోసం కేంద్ర హోం శాఖ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930ను ప్రారంభించిందన్నారు. బాధితులు అధికారిక కస్టమర్ కేర్ వెబ్సైట్ లేదా బ్యాంకు శాఖల్లో కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని.. సోషల్ మీడియా ద్వారా కూడా అవగాహన కల్పిస్తోందని తెలిపారు. ఆర్బీఐతో పాటు బ్యాంకులు సైబర్ నేరాలపై ఎస్ఎంఎస్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. తద్వారా నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. -
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా..? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
-
అప్పుల్లో అడుగునే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి విస్పష్టంగా కీలక ప్రకటన చేసింది. ఏపీ అప్పుల్లో అగ్రస్థానంలో ఉందన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక శాఖ పునరుద్ఘాటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల అప్పులు, తలసరి ఆదాయం, వృద్ధి రేటుపై ఎంపీలు సంజయ్ కాకా పాటిల్, సంతోష్ కుమార్, దినేష్ చంద్ర యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. దేశంలో అప్పుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉందని లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అది కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న రీతిలో రాష్ట్రం అప్పులు లేనే లేవని పంకజ్ చౌదరి జవాబుతో తేలిపోయింది. 15వ ఆర్థి క సంఘం సిఫార్సులు, నిబంధనలకు లోబడే ఆంధ్రప్రదేశ్ అప్పులున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను ఆర్బీఐ అధ్యయనం చేసిన అనంతరం వివిధ రాష్ట్రాల అప్పులను వెల్లడించిందన్నారు. పేదలను ఆదుకున్న డీబీటీ.. కోవిడ్ సమయంలో (2020–21) ప్రస్తుత ధరల ప్రకారం దేశ జీడీపీ వృద్ధితో పాటు 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్డీపీ వృద్ధి క్షీణించగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2.1 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 17.6 శాతం నికర వృద్ధి నమోదైనట్లు తెలిపారు. 2022–23లో ఏపీలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి 14 శాతం నికర వృద్ధి నమోదైందన్నారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ 2022–23లో దేశంలో తొమ్మిదో స్థానంలో (రూ.2,19,518) ఉన్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించకుండా, ఆర్థి క కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నగదు బదిలీని కొనసాగించిన విషయం తెలిసిందే. -
క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ సహకారం కావాలి
న్యూఢిల్లీ: క్రిప్టో అసెట్స్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కలిసి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. వాటిని నియంత్రించాలన్నా లేక నిషేధించాలన్నా అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా సహకారం అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. వాటిపై పన్నుల విధింపు, ప్రమాణాల మీద పలు దేశాలు, సంస్థలు అధ్యయనం చేస్తున్నందున అన్నీ సమిష్టిగా కలిసి రావడమనేది ఎప్పటికి జరుగుతుందని నిర్దిష్టంగా చెప్పలేమని లోక్‌సభకు మంత్రి తెలియజేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణభారం రూ. 58.6 లక్షల కోట్లుగా (స్థూల దేశీయోత్పత్తిలో 52.2 శాతం) ఉండగా 2023 మార్చి 31 నాటికి ఇది రూ. 155.6 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 57.1 (శాతం) చేరిందని చౌదరి తెలిపారు. -
ఆ నటుడు నా చెప్పులు దొంగిలించాడు: బాలీవుడ్ యాక్టర్
మనోజ్ బాజ్‌పాయ్, పంకజ్ త్రిపాఠి.. ఇద్దరూ సినీ ఇండస్ట్రీలో తమ టాలెంట్ నిరూపించుకున్నవాళ్లే! కానీ ఓసారి పంకజ్ త్రిపాఠి.. మనోజ్ చెప్పులు దొంగిలించాడట. ఆ తర్వాత కొంతకాలానికి తనే స్వయంగా వెళ్లి వాటిని దొంగిలించింది తానేనని నిజం అంగీకరించాడట. తాజాగా ఈ విషయాన్ని మనోజ్ బాజ్‌పాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'ఓసారి హోటల్‌కు వెళ్లినప్పుడు నా చెప్పులు పోయాయి. నేనే ఎక్కడైనా విడిచిపెట్టి మర్చిపోయాననుకున్నా. కానీ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా షూటింగ్ సమయంలో పంకజ్ నా దగ్గరకు వచ్చి ఆ విషయం గుర్తుచేశాడు. పాట్నా హోటల్లో మీ చెప్పులు కనిపించకుండా పోయాయి కదా, వాటిని తనే తీసుకెళ్లినట్లు చెప్పాడు' అని మాట్లాడుతుండగా మధ్యలో పంకజ్ అందుకుని ఆరోజు ఏం జరిగిందో వెల్లడించాడు. 'ఆ రోజుల్లో నేను కిచెన్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నేను పని చేస్తున్న హోటల్‌కు మనోజ్ బాజ్‌పాయ్ వచ్చాడని తెలిసింది. దీంతో అతడు ఏ చిన్న అవసరం కోసం పిలిచినా నాకే చెప్పండి, నేనే వెళ్తాను అని మిగతా సిబ్బందికి చెప్పాను. అలా తన గదికి వెళ్లాను, కలిసి మాట్లాడాను. తర్వాత అక్కడి నుంచి వచ్చేశాను. ఆయన హోటల్ నుంచి వెళ్లిపోయేటప్పుడు చెప్పులు మర్చిపోయాడని తెలిసింది. వెంటనే నేను వాటిని ఆయనకు అప్పజెప్పకుండా నాకివ్వమని చెప్పాను' అని చెప్పుకొచ్చాడు పంకజ్ త్రిపాఠి. -
టన్నుల్లో దొంగ బంగారం
సాక్షి, అమరావతి: భారత్‌లో పసిడికి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఇదే స్మగ్లర్లకు కొంగుబంగారంగా మారింది. కోవిడ్ సమయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలతో 2020లో కొంత మేర బంగారం స్మగ్లింగ్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ తరువాత 2021, 2022 సంవత్సరాల్లో స్మగ్లింగ్ బంగారం పరిమాణం పెరిగింది. దేశంలో 2020 నుంచి 2022 వరకు అలాగే ఈ ఏడాది జనవరి వరకు స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్ బంగారం పరిమాణాన్ని ఇటీవల పార్లమెంట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. 2020 సంవత్సరంతో పోల్చి చూస్తే 2022లో స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్ బంగారం పరిమాణం 1,347.58 కేజీలు ఎక్కువగా ఉంది. 2020వ సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి వరకు స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్ మొత్తం బంగారం ఏకంగా 8,424.78 కిలోలు. ఈ కాలంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ 9,408 కేసుల్లో 4,635 మందిని అరెస్టు చేశారు. స్మగ్లర్లు ఉపయోగించే కొత్త కొత్త విధానాలు, పద్ధతులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంకజ్ తెలిపారు. మాదకద్రవ్యాలదీ అదే రూటు దేశంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా పెరుగుతోంది. 2020 ఏడాదిలో 55,622 డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో 73,841 మందిని అరెస్టు చేశారు. 2021లో 68,144 కేసుల్లో 93,538 మందిని, 2022 జనవరి నుంచి నవంబర్ వరకు 66,758 స్మగ్లింగ్ కేసుల్లో 80,374 మందిని అరెస్టు చేశారు. మూడేళ్లలో అత్యధికంగా 19.49 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో హెరాయిన్, కొకైన్ వంటివి కూడా ఉన్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వివిధ సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని పంకజ్ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. -
కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మేరకే ఏపీకి అప్పులు
న్యూఢిల్లీ: ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన మేరకే ఏపీకి అప్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నెట్ బారోయింగ్ సీలింగ్ లిమిట్ ఫిక్స్ చేస్తారని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణ కోసమే ఏపీఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమల్లో ఉందన్నారు. స్టేట్ లెజిస్లేచర్ ఎఫ్ఆర్బీఎంను పర్యవేక్షిస్తుందన్నారు. -
Pankaj Tripathi: వెండితెర వాజ్‌పేయి
భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ దివంగత ప్రముఖ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రవి జాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వాజ్‌పేయీగా పంకజ్ త్రిపాఠి నటిస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు. ‘‘అటల్ బిహారి వాజ్‌పేయి కేవలం రాజకీయవేత్త మాత్రమే కాదు...మంచి మానవతావాది, రచయిత, కవి కూడా. ఇలాంటి వ్యక్తి పాత్రలో నటిస్తున్నందుకు ఓ నటుడిగా నాకు సంతోషంగా ఉంది’’ అని పంకజ్ త్రిపాఠి పేర్కొన్నారు. ఈ సినిమాను అటల్ బిహారి వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా వచ్చే ఏడాది క్రిస్మస్కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
హత్య చేసి పారిపోతూ....మృతదేహంతో సెల్ఫీ వీడియో!
చిన్నచిన్న వాటికే పెద్దగా రియాక్ట్ అయిపోయి జీవితాలను నాశనం చేసుకుని కటకటాల పాలవుతున్నారు చాలామంది. ఏ చిన్న బాధ, అవమానం కలిగిన అవతలవాళ్లను కడతేర్చాలనేంత ఉద్రేకానికి గురవ్వడం...ఇరు జీవితాలను తెలియకుండానే చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి చేసి కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని పంకజ్ అనే వ్యక్తి సురేష్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఐతే పంకజ్ మద్యానికి బానిసై తరచు తాగుతూ ఇంటికి రావడంతో యజమాని సురేష్‌కి చిర్రేత్తుకొచ్చి గట్టిగా చివాట్లు పెడతాడు. ఆ తర్వాత పంకజ్ ఇంటి యజమానికి సురేష్, అతని కొడుకు జగదీష్‌లకు క్షమాపణలు చెప్పడంతో గొడవ సద్దుమణిగిపోయింది. ఐతే పంకజ్ ఇంటి యజమాని సురేష్ చాలా ఘోరంగా అవమానంగా తిట్టడాని, అందుకే తాను ఇక ఇంట్లో ఉండలేనని కొడుకు జగదీష్‌కి ఫోన్ చేసి చెబుతాడు. అంతేకాదు పంకజ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతాడు కూడా. ఐతే జగదీష్‌కి పంకజ్ తీరు మీద అనుమానం వచ్చి తండ్రి సురేష్ ఇంటికి వచ్చి చూస్తాడు. అంతే అక్కడ తండ్రి మృతి చెంది ఉండటం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ట్రేసింగ్ పరికరాల సాయంతో 250 కి.మీ దూరం వెంబడించి మరీ నిందితుడు పంకజ్‌ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో సురేష్‌ని సుత్తితో కొట్టి చంపినట్లు తెలిపాడు. అంతేకాదు చంపి వెళ్లిపోతూ సురేష్ మృతదేహంతో ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పంకజ్ వెళ్లిపోతూ తన వెంట సురేష్ ఐడీ కార్డు, మొబైల్ ఫోన్‌ని కూడా తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఐతే నిందితుడు తన మీద అనుమానం రాకుండా అక్కడ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడూ జగదీష్‌కి వేర్వేరు ప్రదేశాల నుంచి పోన్లు చేస్తూ ఉన్నాడు. ఆ భయమే అతన్ని పోలీసులకు సునాయసంగా చిక్కేలా చేసింది. (చదవండి: రాజస్థాన్ దళిత చిన్నారి మృతి వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. నీళ్ల కుండే లేదంట!!) -
సహారాలో భారీగా ఇరుక్కున్న ఇన్వెస్టర్లు.. మొత్తం లక్ష కోట్లు పైనే!
Sahara Group-Sebi ప్రయివేట్ రంగ సంస్థ సహారా ఇండియా గ్రూప్‌నకు చెందిన వివిధ సంస్థలు, పథకాలలో దాదాపు 13 కోట్లమంది ఇన్వెస్టర్లు ఇరుక్కున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ పార్లమెంటులో వెల్లడించారు. ఈ మొత్తం సొమ్ము రూ. 1.12 లక్షల కోట్లుగా తెలియజేశారు. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాలు, జస్టిస్ బీఎన్ అగర్వాల్ సూచనలమేరకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ.. సొమ్మును తిరిగి చెల్లించేందుకు వీలుగా పలు ప్రకటనలు జారీ చేసింది. తద్వారా తమ సొమ్మును తిరిగి పొందేందుకు ఇన్వెస్టర్లకు వీలు కల్పించినట్లు మంత్రి రాతపూర్వక సమాధానంలో వివరించారు. తదుపరి 2021 అక్టోబర్‌లో సెబీ మధ్యంతర ఆదేశాల కోసం సుప్రీం కోర్టులో మరోసారి అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఇది ప్రస్తుతం కోర్టువద్ద పెండింగ్‌లో ఉన్నట్లు పంకజ్ తెలియజేశారు. సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 47,245 కోట్లు, సహారా ఇండియన్ రియల్టీ కార్పొరేషన్లో రూ. 19,401 కోట్లు, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో రూ. 6,381 కోట్లు చొప్పున పెట్టుబడులు ఇరుక్కున్నట్లు వెల్లడించారు. ఇదేవిధంగా హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 12,958 కోట్లు, సహారాయన్ యూనివర్శల్ మల్టీపర్పస్ సొసైటీలో రూ. 18,000 కోట్లు, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో రూ. 8,470 కోట్లు నిలిచిపోయినట్లు తెలియజేశారు. కాగా.. సహారా గ్రూప్ ‘సెబీ సహారా రిఫండ్’ ఖాతాలో అసలు రూ. 25,781 కోట్లకుగాను దాదాపు రూ. 15,507 కోట్లు డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. చదవండి: టెక్కీలకు గడ్డుకాలం, వరస్ట్ ఇయర్‌గా 2022 -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. సూపర్
న్యూఢిల్లీ: దేశంలో ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు గణనీయంగా పెరిగాయి. ఈ పరిమాణం ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (2021 ఏప్రిల్) నవంబర్ 23 నాటికి 2020–21 ఇదే కాలంతో పోల్చిచూస్తే, 68 శాతం పెరిగి రూ.6.92 లక్షల కోట్లకు ఎగశాయి. ఆర్థిక శాఖ సహాయమంతి పంకజ్ చతుర్వేది లోక్‌సభ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు. ఆయన తెలిపిన సమాచారాన్ని పరిశీలిస్తే.. ► 2021–22 నవంబర్ 23 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6,92,834 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ మొత్తం 68 శాతం అధికమైతే, కోవిడ్ ముందస్తు కాలం 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే మాత్రం 27.29 శాతం అధికం. 2020–21 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 23 మధ్య నికర వసూళ్లు రూ.4.12 లక్షల కోట్లయితే, 2019–20 మధ్య ఈ మొత్తం రూ.5.44 లక్షల కోట్లు. ► 2021 నవంబర్ 23వ తేదీ వరకూ చూస్తే, రిఫండ్స్ జరక్క ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.8.15 లక్షల కోట్లు. 2021 ఇదే కాలంలో పోల్చితే స్థూల వసూళ్ల వృద్ధి 48.11 శాతం. ► ఇక పరోక్ష పన్నుల విషయానికి వస్తే వస్తు సేవల పన్నులో (జీఎస్టీ) గణనీయమై వృద్ధి ధోరణి కనబడుతోంది. 2020–21 జీఎస్టీ వసూళ్లు రూ.11.36 లక్షల కోట్లు. 2021–22 అక్టోబర్ వరకూ ఈ వసూళ్లు రూ.8.10 లక్షల కోట్లు. ► పన్ను ఎగవేతలను నిరోధించడానికి కేందం తీసుకుంటున్న చర్యలు ఫలితమిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు గణనీయంగా పెరగడానికి ఇదీ ఒక కారణం. ► 2021–22 బడ్జెట్లో పన్నుల ఆదాయం రూ.22.2 లక్షల కోట్లుగా కేంద్రం అంచనాలు వేసింది. ఇందులో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ ట్యాక్స్ రూపంలో రూ.5.47 లక్షల కోట్లుగా రావచ్చని అంచనా. 2020–21లో పన్నుల ఆదాయం రూ.20.2 లక్షల కోట్లు. -
వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి
ఉత్తరప్రదేశ్: సినిమాల్లో మాదిరి నిజ జీవితం అన్ని జరగవు. అయితే కొన్ని సంఘటనలు చూస్తే సినిమాల్లో మాదిరిగా చేస్తున్నారో లేక వాటిని స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్నారో కూడా తెలియదు. కానీ కాన్పూర్‌కి చెందిన పంకజ్ అనే వ్యక్తి 1999లో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాల్లో హీరో మాదిరిగా చేశాడు. (చదవండి: హౌరా బ్రిడ్జ్ పై జౌరా అనిపించే డ్యాన్స్) వివరాల్లోకెళ్లితే....గుర్గామ్‌లోని ఓ ప్రైమేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న పంకజ్ అనే వ్యక్తికి ఈ ఏడాది మేలో కోమల్ అనే ఆమెతో వివాహం అయ్యింది. అయితే పంకజ్ భార్య కోమల్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అతనితో మాట్లాడకుండా దూరంగానే ఉండేది. అంతేకాక తనతోనే కాక ఇంట్లో వాళ్ల ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉండేది. చివరికి అతను కోమలిని ఎంతో ప్రయత్నించి అడగగా ఆమె తాను పింటూ అనే వ్యక్తిని ప్రేమించినట్లు చెప్పింది. దీంతో పంకజ్ తన అత్తమామలకు ఈ విషయాన్నితెలియజేశాడు. అయితే పంకజ్ అత్తమామలు కోమల్‌కు సర్ది చెప్పడానికి ప్రయత్నించిన ఆమె అంగీకరించ లేదు. ఆ తర్వాత ఈ విషయం గృహ హింస నిరోధక విభాగం, ఆశాజ్యోతి సెంటర్‌కు చేరుకుంది. వారు పంకజ్కి అతని భార్య కోమల్, పింటూ, వారి బంధవులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే కోమల పింటూనే వివాహం చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకోవడంతో చివరికి పంకజ్ వారి వివాహానికి అంగీకరించాడు. ఈ మేరకు పంకజ్ దగ్గరుండి మరీ లాయర్ సమక్షంలో తన భార్య ప్రేమించిన పింటూతో ఘనంగా వివాహం జరింపించాడు. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) -
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రుణ పరిమితి
సాక్షి, న్యూఢిల్లీ : 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలకు గరిష్ట రుణ పరిమితిని నిర్దేశించామని, జీఎస్డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికలకు సంఘం సూచనలు చేస్తుందని రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. జీఎస్డీపీలో 4 శాతం వరకు రుణాలు తీసుకునేలా అనుమతించామన్నారు. 2018–22 వరకు ఆంధ్రప్రదేశ్‌కు విధించిన అప్పుల పరిమితి ప్రకారం.. 2018–19లో రూ.27,569 కోట్లు, 2019–20లో రూ.32,417 కోట్లు, 2020–21లో రూ.30,305 కోట్లు, 2021–22లో రూ.42,472 కోట్లను నికర గరిష్ట రుణ పరిమితిగా విధించామని మంత్రి తెలిపారు. 2019–20 కాలంలో పన్నుల రాబడి తగ్గినందున ప్రత్యేక పథకం కింద రూ.2,534 కోట్లు అదనంగా రుణం తీసుకునేందుకు అనుమతించామని వెల్లడించారు. ఇక 2020–21 కాలంలో జీఎస్డీపీపై రెండు శాతం అదనపు రుణాలకు అనుమతిచ్చామని, అందులో భాగంగానే ఏపీకి రూ.19,192 కోట్లకు అనుమతి మంజూరు చేశామన్నారు. దీనికి అనుగుణంగా ఎఫ్ఆర్ఎంబీ చట్టానికి రాష్ట్రాలు సవరణలు చూసుకోవాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు పంకజ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతేగాక.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మదింపు చేయలేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్ వెల్లడించిన లెక్కల ప్రకారం ద్రవ్యలోటు తొలుత రూ.68,536 కోట్లుగా లెక్కించారని, అయితే.. రాష్ట్ర బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటును రూ.54,369.18 కోట్లుగా లెక్కించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. అంతేగాక.. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాస్తవ ద్రవ్యలోటు రూ.53,702.73 కోట్లుగా తేలిందని కేంద్రమంత్రి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో ఇళ్లకు రూ.3లక్షలు ఇవ్వాలి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు చొప్పున ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి కోరారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.1.8 లక్షలు గిరిజన ప్రాంతాల వారికి సరిపోదన్నారు. గిరిజన ప్రాంతాలకు సరకు రవాణా ఖర్చు ఎక్కువవుతుందని, అందుకు రూ.3లక్షలు చొప్పున ఇవ్వాలని ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రస్తావించారు. ఆ రోడ్లను హైవేలుగా మార్చండి సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి నర్సీపట్నం, నర్సీపట్నం నుంచి తుని మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెం టరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి,లోక్ సభాపక్ష నాయకుడు పీవీ మిధున్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం మంగళవారం గడ్కరీతో సమావేశమైంది. విశాఖ జిల్లాలో విస్తృతమైన రోడ్ నెట్వర్క్ ఉన్నప్పటికీ నా నాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సబ్బవరం జం క్షన్ నుంచి వెంకన్నపాలెం, చోడవరం, వడ్డా ది, రావికమతం, కొత్తకోట మీదుగా నర్సీపట్నం వరకు ఉన్న రాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్–009), నర్సీపట్నం నుంచి గన్నవరం, కోట నందూరు మీదుగా తుని వరకు ఉన్న రహదారి (ఎస్‌హెచ్–156) అత్యంత రద్దీ కలిగి ఉన్నందున వీటిని జాతీయ రహదారులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. లోక్‌సభ సభ్యులు డాక్టర్ బి.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్, చింతా అనురాధ, మార్గాని భరత్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంజీవ్‌కుమార్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. రూ. 6,750 కోట్ల ‘ఉపాధి’ బకాయిలివ్వండి సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన రూ.6,750 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేం ద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. వైఎ స్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభా పక్షనేత మిథున్‌రెడ్డి సారథ్యంలో ఎంపీల బృందం మంత్రితో సమావేశమైంది. పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉపాధి పథకం కింద 18.4 కోట్ల పనిదినాలతో దేశంలోనే అత్యధిక పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన విలయం నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పేదలకు కనీసం ఒక కోటి పనిదినాలు కల్పించాలని గత ఏప్రిల్‌లో సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని తొమ్మిది జిల్లాల్లో విజయవంతంగా చేరుకోగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన భూముల రీసర్వేలో సర్వే రాళ్లు పా తే కూలీల వేతనాలను ఉపాధి పథకం కింద వినియోగించుకునేందుకు అనుమతించాలి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి ఉపాధి పథకం కింద లేబర్ బడ్జెట్‌ను సవరించాలి’.. అని మంత్రిని కోరారు. ‘కాఫీ’ పెంపకాన్ని అనుమ తించండి ఉపాధి హామీ పథకం కింద విశాఖ జిల్లా పాడేరులో కాఫీ తోటల పెంపకాన్ని గిరిజనులు చేపట్టేందుకు అనుమతించాలని కూడా విజయసాయిరెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. వారికి ఎంతో మేలు చేసినట్లవుతుందన్నారు. -
రాజ్యసభ: ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు
సాక్షి, ఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 2 లక్షల 46 వేల 519 కోట్ల రూపాయలు వసూలైనట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2020-21లో ఇదే కాలంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలైన మొత్తం 1 లక్ష 17 వేల 783 కోట్లు అని తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, పన్ను చెల్లింపుదారుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ముందస్తు పన్ను చెల్లింపులు అత్యధికంగా ఉండటంతో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరగడానికి కారణాలుగా మంత్రి విశ్లేషించారు. రెండో త్రైమాసికం ఇప్పుడే మొదలైనందున ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఏమేరకు వసూలు కాగలవో అంచనా వేయలేమని మంత్రి అన్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరోక్ష పన్నుల (జీఎస్టీ-నాన్ జీఎస్టీ కలిపి) ద్వారా 3 లక్షల 11 వేల 398 కోట్ల రూపాయలు వసూలైనట్లు మంత్రి చెప్పారు. వివాద్-సే-విశ్వాస్ పథకం కింద ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివాదాలను గణనీయమైన సంఖ్యలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద స్వీకరించిన డిక్లరేషన్లు 28.73 శాతం పెండింగ్ టాక్స్ వివాదాలున్నట్లు తెలిపారు. ఈ విధంగా పరిష్కారానికి నోచుకునే వివాదాల ద్వారా ప్రభుత్వానికి కూడా అదనంగా పన్ను ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఈ ఏడాది త్రైమాసికంలో గణనీయమైన మొత్తాల్లో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ళు ఆర్థిక రంగం తిరిగి దారిన పడుతోందని చెప్పడానికి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. పన్నుల వసూళ్ళు పెరిగితే దానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతుంది తద్వారా జాతీయ స్థూల ఉత్పత్తిని అది ప్రభావితం చేస్తుందని మంత్రి తెలిపారు. ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జవాబు.. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా కంపెనీలు స్థానికంగానే సామాజిక కార్యకలాపాలను నిర్వహించే విధంగా నిబంధనలను మారుస్తూ కంపెనీల చట్టాన్ని సవరించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ మంగళవారం రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. సీఎస్ఆర్ ప్రాజెక్ట్‌ల అమలులో స్థానిక ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది కేవలం మార్గదర్శకం మాత్రమే అని చెప్పారు. సవరించిన కంపెనీల చట్టంలో పొందుపరచిన నియమ నిబంధనల ప్రకారం కంపెనీలు సీఎస్ఐర్ కార్యకలాపాల కింద చేపట్టే ప్రాజెక్ట్‌ల విషయంలో జాతీయ ప్రాధాన్యతలు, స్థానిక ప్రాంత ప్రాధాన్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఈ చట్టం కింద సీఎస్ఐర్ కార్యకలాపాల్లో కంపెనీ బోర్డుదే తుది నిర్ణయం అవుతుంది. సీఎస్ఆర్ కార్యకలాపాల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ వంటివి సీఎస్ఐర్ కమిటీ సిఫార్సుల మేరకు ఉంటుందని అన్నారు. ఫలానా కార్యకలాపాలకు ఇంత మొత్తం ఖర్చు చేయాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోదని తెలిపారు. -
స్విస్ బ్యాంకుల్లో బ్లాక్‌మనీపై స్పందించిన కేంద్రం
న్యూ ఢిల్లీ: చాలా రోజుల తరువాత బ్లాక్ మనీ అంశం పార్లమెంట్లో వెలుగులోకి వచ్చింది. గత పదేళ్లలో స్విస్ బ్యాంకులో ఎంత నల్లధనం జమ అయ్యిందనే ప్రశ్నను కాంగ్రెస్ ఎంపీ విన్సెంట్ హెచ్. పాలా. ప్రభుత్వాన్ని అడిగారు. విదేశాల నుంచి స్వదేశానికి నల్లధనాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపమని విన్సెంట్ పార్లమెంట్లో లేవనెత్తారు. అంతేకాకుండా బ్లాక్‌మనీ వ్యవహారంలో ఎంతమందిని అరెస్టు చేశారని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని అడిగారు. పార్లమెంట్లో కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా ఆర్థిక శాఖ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. గత పదేళ్లలో భారత్ నుంచి స్విస్ బ్యాంకుల్లో జమచేసిన బ్లాక్‌మనీకి సంబంధించి అధికారికంగా అంచనా లేదని తెలియజేశారు. అయితే, విదేశాలలో నిల్వ చేసిన నల్లధనాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. ‘‘ది బ్లాక్ మనీ ఇంపోసిషన్ ఆఫ్ టాక్స్ యాక్ట్-2015’’ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం విదేశాలలో బ్లాక్‌మనీ జమచేసిన వారి కేసులపై సమర్థవంతంగా వ్యవహరిస్తుంది. బ్లాక్‌మనీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు ఛైర్మన్, వైస్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు వ్యవహరిస్తారు. ఇతర దేశాల్లో ఉన్న నల్లధనాన్ని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో భారత్ కలిసి పనిచేస్తోంది. బ్లాక్ మనీ యాక్ట్ కింద ఇప్పటివరకు 107 ఫిర్యాదులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బ్లాక్ మనీ యాక్ట్ సెక్షన్ 10 (3) / 10 (4) ప్రకారం, 2021 మే 31 వరకు 166 కేసులలో అసెస్మెంట్ ఆర్డర్లను జారీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. కాగా ఇందులో రూ .8,216 కోట్లు రికవరీ చేశామని కేంద్రం తెలిపింది. -
ఆ టెక్నిక్‌తో ఆఫీసుల్లోకి ఈజీగా వెళ్లేవాడిని : పంకజ్ త్రిపాఠి
పంకజ్ త్రిపాఠి అంటే అందరికీ ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత అతను ‘మసాన్’, ‘స్త్రీ’, ‘న్యూటన్’ తదితర సినిమాల్లో అద్భుతంగా నటించాడు. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అతను నటించిన వెబ్‌సిరీస్ ‘క్రిమినల్ జస్టిస్’ మంచి ప్రశంసలు పొందుతోంది. ఇప్పుడు క్షణం తీరిక లేని ఆర్టిస్టే అయినా ఒకప్పుడు అంటే 2000 సంవత్సరంలో అవకాశాల కోసం ఎక్కే గడప దిగే గడపగా అతను జీవించాడు. భార్యను స్కూల్ టీచర్‌గా చేర్చి ఆ వచ్చే జీతంతో బతుకుతూ అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు. అయితే ఆఫీసుల్లోకి అంత సులభంగా ఎవర్నీ రానివ్వరు. దానికి త్రిపాఠి ఒక టెక్నిక్ పాటించేవాడు. సినిమా తీయబోతున్న ప్రతి ఆఫీసుకు తన ఫోటోలతో వెళ్లి ‘ఈశ్వర్ గారు పంపారండీ నన్ను’ అని రిసెప్షన్లో చెప్పేవాడు. ‘ఈశ్వర్ గారు పంపారట’ అనేసరికి ఆ ఈశ్వర్ ఎవరో ప్రముఖుడనుకొని లోపలికి రానిచ్చేవారు. ఫొటోలు తీసుకుని మాట్లాడి ఆఖరున ‘ఇంతకీ ఏ ఈశ్వర్ గారండీ’ అని అడిగేవారు. అప్పుడు పంకజ్ ఆకాశం వైపు చూపించి ’ఆ ఈశ్వర్ అండీ. ఆయనే కదా భూమ్మీదకు మనందరినీ పంపింది’ అనంటే అందరూ నవ్వేసేవారట. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండటం వల్లే ఆయన అంత మంచి నటుడయ్యాడు. -
హీరోయిన్స్‌కు పోటీ ఇస్తాడన్నారు: నటుడు
‘‘నిజానికి చిన్నపుడు నేను చాలా డ్యాన్స్ చేసేవాడిని. ఐటం సాంగ్స్‌కి కూడా నర్తించేవాడిని. అందరూ నా డాన్స్‌ను మెచ్చుకునేవాళ్లు. ఊళ్లో నాటకాలు వేసే సమయంలో ఎక్కువగా ఆడ వేషాలు వేసేవాడిని. ఇదంతా చూసిన మా ఊరి పెద్దాయన ఒకరు.. ‘‘ఇదిగో ఈ అబ్బాయి ముంబైకి వెళ్తే.. టాప్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టేస్తాడు’’అని తరచూ అంటూ ఉండేవారు’’అంటూ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తాను కచ్చితంగా హిందీ చిత్రసీమలో ప్రవేశిస్తానని అందరూ అనుకునే వారని, కానీ తాను మాత్రం ఎన్నడూ నటుడిని అవుతానని ఊహించలేదని చెప్పుకొచ్చాడు.(చదవండి: దీపికను వెనక్కి నెట్టిన శ్రద్ధా కపూర్!) బరేలీ కీ బర్పీ, న్యూటన్, గుంజన్ సక్సేనా వంటి ఇటీవల విడుదలైన సినిమాలతో పాటు, సాక్రెడ్ గేమ్స్, మీర్జాపూర్ వంటి వెబ్‌సిరీస్‌లతో గుర్తింపు పొందాడు పంకజ్ త్రిపాఠి. నటి నేహా దుఫియా నిర్వహిస్తున్న ‘‘నో ఫిల్టర్ నేహా’’ చాట్ షోలో పాల్గొన్న అతడు తమ మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘మా గ్రామంలో నాటకాలు వేసేవాళ్లం. పదో తరగతి చదువుతున్న సమయంలో తొలిసారి అమ్మాయి వేషం వేశాను. అప్పటి వరకు ఆ పాత్ర పోషించిన అబ్బాయి ఒకరు సిటీకి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో నాటకం ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేనే ముందుకొచ్చి.. ఆ వేషం వేస్తా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా మా డైరెక్టర్ రాఘవ్ చాచా అయితే, నాన్న దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకున్న తర్వాతే వేషం ఇస్తా అన్నారు. కోపంతో లాఠీ పట్టుకుని నా వీపు విమానం మోగిస్తారేమో అని భయపడ్డా. కానీ నాన్న అభ్యంతరం చెప్పలేదు. నాకు నచ్చిన పనిచేసే స్వేచ్చ ఉందన్నారు. తర్వాత నేను ఎన్నో నాటకాల్లో భాగస్వామ్యమయ్యాను. కానీ ముంబైకి వస్తానని, బాలీవుడ్లో నటుడిగా స్థిరపడతానని ఎన్నడూ అనుకోలేదు. అప్పుడు సరదా కోసం చేసి నటన, ఇప్పుడు జీవితంగా మారింది’’అని పంకజ్ పేర్కొన్నాడు. ఇప్పుడు తనకున్న ఆర్థిక పరిస్థితితో సంతృప్తికరంగా ఉన్నానని, ఇకపై ఎండార్స్మెంట్లు, సినిమా ఆఫర్లు రాకపోయినా పెద్దగా బాధపడనని చెప్పుకొచ్చాడు. ఇక మంచు విష్ణు దూసుకెళ్తా సినిమాలో విలన్‌గా పంకజ్ త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన సంగతి తెలిసిందే. -
తపంచా.. తివాచీలో చుట్టిన శవం.. అక్కడ ఇవే..!
యు.పి.లో ఉన్న మీర్జాపూర్రెండు విషయాలకు ఫేమస్.ఒకటి కార్పెట్. రెండోది బ్లడ్ కార్పెట్. చేతిలో తపంచా.. తివాచీలో చుట్టిన శవం..ఇక్కడ తరచు కనిపించే దృశ్యాలు.మీర్జాపూర్లాగే.. మనిషిలోనూ రెండు ఉంటాయి. ఒకటి నిజాయితీ. రెండోది కుట్ర. కుట్రలో నిజాయితీని చుడితే నిజాయితీ కనిపించదు.నిజాయితీలో కుట్రను చుడితే కుట్ర కనిపించదు.కనబడినా, కనబడకపోయినా మీర్జాపూర్ మనిషిలో రెండూ ఉంటాయి. ఫ్యాక్షన్, వయొలెన్స్, వైవాహిక అసంతృప్తులు, వారసత్వ అధికారాల కోసం ఆరాటం.. అలక, పగ, కుట్ర.. ఇవన్నీ ‘మీర్జాపూర్’లో కనిపిస్తాయి. మీర్జాపూర్.. ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఊరు. ఆ ఊరి పేరుతో..అమెజాన్ ప్రైమ్ ప్రొడక్షన్ వెబ్ సిరీస్ ఇది. దర్శకత్వం: కరణ్ అన్షుమన్ ముఖ్య తారాగణం: పంకజ్ త్రిపాఠి (అఖండానంద్), దివ్యేందు (మున్నా), రసిక (బీనా). అఖండానంద్ వ్యాపారస్తుడు. మీర్జాపూర్లో తివాచీలు తయారు చేసే పరిశ్రమను నడిపిస్తుంటాడు. రంగురంగుల అందమైన తివాచీల కింద ఇంకో కర్మాగారమూ పనిచేస్తుంటుంది. ఆయుధాల ఫ్యాక్టరీ. ఆయన ప్రధాన ఆదాయ వనరు అదే. అక్కడ తుపాకీలను తయారు చేయించి అక్రమ రవాణా చేస్తాడు. తనూ ఉపయోగించుకుంటాడు. ఆ ఊళ్లో అఖండానంద్ అంటే టెర్రర్. ఎవరూ అతని జోలికి వెళ్లరు. ఆ కళ్లకు ఎదురుపడరు. ఆ నోటికి అడ్డుపడరు. స్వతహాగా అఖండానంద్ చాలా తక్కువ మాట్లాడ్తాడు. ఇషారాతోనే పని చేయించగల సమర్థుడు. అతనికి ఒక కొడుకు మున్నా (దివ్యేందు). ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ. గన్ అంటే అతనికి ఆటవస్తువు. ప్రాణాలంటే చెలగాటమే. ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ను, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్‌ను వెంటేసుకుని తిరుగుతుంటాడు. ఆఖరికి కాలేజ్‌కి కూడా ఆ ముగ్గురి తోడుతోనే వెళ్తాడు. డ్రగ్స్, మందు, అమ్మాయిలు ఏదైనా అంతే. వాటితోనే అతని ఉనికి. అఖండానంద్ భార్య రసిక. అఖండానంద్కు ఆమె రెండో భార్య. మున్నాకు పిన్ని. కానీ అలా పిలిపించుకోవడం రసికకు ఇష్టం ఉండదు. అలాగని ‘అమ్మా’ అని పిలిచీ తనను పెద్దదాన్ని చేయొద్దు అంటుంది. అందుకే అసలు మాటే మాట్లాడడు మున్నా.. ఎప్పుడో అవసరమైతే తప్ప. రసిక పుట్టింటి పేదరికం వల్ల తనకన్నా వయసులో చాలా పెద్దవాడు, బాగా ఆస్తి ఉన్న అఖండానంద్ను పెళ్లి చేసుకుంటుంది.. పుట్టింటిని బాగుపర్చాలనే ఆశతో. ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది కూడా. అఖండానంద్ తండ్రి కుల్‌భూషణ్ ఖుర్బందా. అఖండానంద్ చిన్నప్పుడు జరిగిన ముఠా తగాదాలో గాయపడి జీవితాంతం వీల్‌చైర్‌కే అంకితం అవుతాడు. మీర్జాపూర్లో అఖండుడు నేర చరిత్రతో ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా మీర్జాపూర్లో బలమైన వ్యక్తిగా ఎదుగుతాడు అఖండానంద్. ఇవన్నీ తండ్రి నుంచి వారసత్వంగా తీసుకున్నా.. తండ్రిని మించి ఎదుగుతాడు. తర్వాత తరం అయిన మున్నా కూడా అలాగే ఎదగాలనీ ఆశిస్తుంటాడు అఖండానంద్. కానీ మున్నాలోని ఆవేశం అతనిలోని విచక్షణను చంపేస్తుంటుంది. పైగా వారసత్వంగా అబ్బిన అధికారదర్పం మున్నాలో ఆలోచనను పుట్టనివ్వదు. అలాంటి ప్రవర్తనతోనే ఒకసారి ఓ పెళ్లి బారాత్ (ఊరేగింపు)లోకి వెళ్లి డ్యాన్స్ చేస్తూ మద్యం, డ్రగ్స్మత్తులో అత్యుత్సాహపడుతూ విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతాడు. ఆ తుపాకి గుళ్లకు గుర్రం మీదున్న పెళ్లికొడుకు చనిపోతాడు. ఆ ఘనకార్యానికి సంబరపడి ఆ రాత్రి మళ్లీ పార్టీ చేసుకుంటాడు మున్నా. ప్రత్యర్థులూ తక్కువేం కాదు ఆ కేసును వాదించడానికి ఒప్పుకుంటాడు రమాకాంత్ అనే ఓ లాయర్. నిజాయితీగా బతకాలనే ఆరాటం తప్ప అతిగా ఆశ, ఆస్తిలేని మధ్యతరగతి మనిషి. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు గుల్లూ, బబ్లూ. ఒక కూతురు. తుపాకీని చూడ్డం.. వాడ్డం ఈ కుటుంబానికీ అలవాటే. పెళ్లికొడుకును చంపిన కేసును రమాకాంత్ టేకప్ చేశాడని తెలిసి వాపస్ తీసుకోమని హెచ్చరించడానికి వెళ్తాడు మున్నా.. తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో. అప్పుడే తెలుస్తుంది ప్రేక్షకులకు రమాకాంత్ కుటుంబం కూడా గన్స్‌తో బాగా ఆడుకుంటుందని. హెచ్చరికలో భాగంగా ఆ ఇంటిల్లిపాదిని భయపెట్టేందుకు తుపాకీ ఎక్కుపెడ్తాడు మున్నా. వెంటనే రమాకాంత్ గన్ తీస్తాడు. కాల్పుల గేమ్ మొదలవుతుంది. ఆ ఆటలో రమాకాంత్ భార్య, కూతురు పిస్తోలు పేలుస్తారు. చావు తప్పి చెవి తెగిన మున్నా.. అనుచరుడిని తీసుకుని ఇంటికి పారిపోతాడు. విషయం తెలుసుకున్న అఖండానంద్.. మున్నాను కొట్టిన రమాకాంత్ కొడుకులిద్దరినీ ఇంటికి పిలిపిస్తాడు. ఒకడు జెమ్.. ఒకడు జిమ్ రమాకాంత్ కొడుకులు ఇద్దరిలో ఒకడు చదువులో జెమ్. ఇంకొకడికి జిమ్ పిచ్చి. 24 గంటలూ బాడీ బిల్డింగ్ మీదే ధ్యాస. చదువంటే బోర్. గ్యాంగ్‌స్టర్ కావాలనుకుంటుంటాడు. రమాకాంతేమో కొడుకులను సివిల్స్‌కి ప్రిపేర్ చేయడం కోసం నానాతంటాలు పడ్తుంటాడు. ఇంటికి పిలిపించుకున్న అఖండానంద్ ఆ అన్నదమ్ములిద్దరి యాటిట్యూడ్, ఎవరికీ వెరవని తనం చూసి.. వాళ్లముందు ఒక ఆఫర్ పెడ్తాడు. ఆ క్షణం నుంచి తనకు పనిచేయమని. అయిదు నిమిషాల తర్జనభర్జన తర్వాత సరే అంటారు. వాళ్లకు రెండు తుపాకులు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండీ ఇస్తాడు అఖండానంద్. బాడీ బిల్డింగ్ అంటే పిచ్చి ఉన్నవాడు పండుగ చేసుకుంటాడు వాటితో. ఆ తెల్లవారి నుంచే ఆ ఇద్దరూ అఖండానంద్ వ్యాపారాల్లో, పనుల్లో.. నేరాల్లో భాగస్వాములవుతారు. ఈ విషయం తెలిసిన రమాకాంత్ మండిపడ్తాడు. వద్దని వారిస్తాడు. అయినా వాళ్లు వినకపోగా మున్నాకు వ్యతిరేకంగా వాదిస్తున్న కేస్‌ను తిరిగి వెనక్కి తీసుకోమంటారు. ససేమిరా అంటాడాయన. అటునుంచి నరుక్కు రావడానికి చనిపోయిన పెళ్లికొడుకు పేరెంట్స్ దగ్గరకు వెళ్లి తుపాకీ పెడ్తారు కేసు వెనక్కి తీసుకొమ్మని బెదిరిస్తూ. చేసేదిలేక వెనక్కి తీసుకుంటారు. ఇలా నేరాల్లో, బిజినెస్‌లో తమ వ్యూహాలతో అఖండానంద్ను ఆకట్టుకుంటారు అన్నదమ్ములు ఇద్దరూ. ఈ వ్యవహారం మున్నాకు కంటగింపుగా మారుతుంది. తన ముందే తండ్రి తనకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఆ అన్నదమ్ములకివ్వడంతో ఉడికిపోతుంటాడు. వాళ్లను సాగనంపే ప్రయత్నంలో ఉంటాడు. కాలేజీ ఎన్నికలొస్తాయి మున్నా, గుల్లూ, బబ్లూ, వాళ్ల చెల్లితో పాటు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కూతుళ్లిద్దరూ ఒకే కాలేజ్‌లో చదువుతుంటారు. ఆ సీఐ.. అఖండానంద్ దగ్గర ముడుపులు తీసుకుంటూ ఆ గ్యాంగ్‌స్టర్ నేరాలను చూసీచూడనట్టు ఊరుకుంటుంటాడు. ఆయన పెద్ద కూతురిని మున్నా ఇష్టపడ్తుంటాడు. ఆ అమ్మాయేమో మున్నాను అసహ్యించుకుంటూ గుల్లూను ప్రేమిస్తుంటుంది. గుల్లూ వాళ్ల చెల్లి ఈ అక్కచెల్లెళ్లిద్దరికీ క్లోజ్ ఫ్రెండ్. సీఐ చిన్న కూతురు చదువులో కాలేజ్ టాపర్. బబ్లూకి ఆమె మీద గౌరవం పెరుగుతుంటుంది. కాలేజీ ఎన్నికల్లో మున్నా, సీఐ చిన్న కూతురు నిలబడ్తారు. మున్నా దాదాగిరి చేస్తూ అందరినీ విత్ డ్రా చేయిస్తుంటాడు. కానీ సీఐ కూతురి విషయంలో ఏమీ చేయలేకపోతాడు. సీఐ కూతురే ఎన్నికల్లో గెలుస్తుంది. ఆమెకు గుల్లూ, బబ్లూ సాయం చేశారని వాళ్ల మీద ఇంకా కక్ష పెంచుకుంటాడు. ఇంకోవైపు వ్యాపారపరంగానూ అతని తండ్రి వీళ్లకు పెద్ద పెద్ద టాస్కులు అప్పజెప్పుతూ వాళ్ల సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ ఉండటంతో తండ్రి మీదా కసి పెరుగుతుంది. ఇక్కడి నుంచి ట్విస్టులు కొడుకును కాదని బయటవాళ్లకు.. అదీ తన మీద దాడి చేసిన వాళ్లకు తమ సామ్రాజ్యంలో అంత స్థానం దొరకడం మున్నాలో పగను రగులుస్తుంటుంది. ఈ మాట ఒకసారి తండ్రితో కూడా అంటాడు. ‘‘పిచ్చివాడా.. యజమాని ఎప్పుడూ చేతికి రక్తం అంటించుకోవద్దు. ఇలాంటి కుక్కలను ఉపయోగించుకోవాలి. తుపాకీ ఉంది కదాని పేల్చకూడదు.. ఎవరి భుజం మీద పెట్టి పేల్చాలి.. ఎవరితో ఆ పని చేయించాలి అనే వ్యూహం మాత్రమే మనం పన్నాలి’’ అని బోధిస్తాడు. కాని ఈ లాజిక్ అతనికి అర్థం కాదు. ఆర్ఎంపీ డాక్టర్ అయిన అనుచరుడితో తండ్రిని చంపే ప్లాన్ వేస్తాడు. బెడిసికొడ్తుంది. ఆర్ఎంపీ అనుచరుడు చనిపోతాడు.. తండ్రి బతుకుతాడు. తండ్రి తనను అనుమానిస్తున్నాడని గ్రహించిన వెంటనే దాన్ని గుల్లూ, బబ్లూ మీదకు మళ్లించేలా పథకం వేస్తాడు. కృతకృత్యుడవుతాడు. వాళ్ల పని తేల్చమని కొడుకుకే బాధ్యత ఇస్తాడు. అప్పటికే గుల్లూకి సీఐ కూతురుతో పెళ్లయిపోయి ఉంటుంది. తమ క్లాస్మేట్ నిఖా అవుతుంటే అందరూ కలిసి వెళ్తారు. గుల్లూ అండ్ టీమ్ కోసం గాలిస్తున్న మున్నా ఆ విషయం తెలిసి అతనూ అక్కడికి వెళ్తాడు తన గ్యాంగ్‌తో. తుపాకుల తూటాతో బీభత్సం సృష్టిస్తాడు. పెళ్లికొడుకు చనిపోతాడు. అంతా భయకంపితులవుతారు. గుల్లూ చెల్లి మీద తుపాకీ గురిపెట్టి.. గుల్లూ, బబ్లూ అండ్ టీమ్ కదలకుండా చేస్తాడు. తన దగ్గరున్న గన్‌తో అడ్డు రాబోయిన బబ్లూని చంపేస్తాడు. ఎదురుదాడి చేయబోయిన గుల్లూని కాలిస్తే భుజానికి గాయమై కిందపడ్తాడు. భర్తను రక్షించుకోవడానికి ముందుకెళ్లిన సీఐ పెద్ద కూతురి మీదా తూటా పేలుతుంది. పెళ్లి హాలంతా రక్తసిక్తం. ఈలోపు గుల్లూ ఇషారాతో సీఐ చిన్న కూతురు కిందపడ్డ తుపాకీ తీసుకుని గురి పెట్టి మున్నా ఏకాగ్రతను చెదరగొడ్తుంటే గుల్లూ లేచి మున్నా మీద కాల్పులు జరుపుతాడు. ఆ యుద్ధంలో గుల్లు, వాళ్ల చెల్లి, సీఐ చిన్న కూతురు మాత్రమే ప్రాణాలతో మిగులుతారు. హిపోక్రసీకి ప్రతిబింబం ఇక్కడితో తొమ్మిది ఎపిసోడ్ల మీర్జాపూర్ ఫస్ట్ సీజన్ అయిపోతుంది. జీవితాల్లోని ప్రాక్టికాలిటీని మాత్రమే చూపించిన సిరీస్ ఇది. వీల్‌చైర్‌కి అంకితమైన ముసలి వ్యక్తి జియోగ్రఫీ, యానిమల్ ప్లానెట్ చానల్స్ చూస్తూ నిస్సహాయురాలైన ఆ ఇంటి కోడలి మీద తన అగ్లీనెస్ను ప్రదర్శించడం, భర్తతో ఒక బిడ్డను కనాలనుకునే ఆ కోడలు భర్త చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని ఆ ఇంటి వంటవాడి సమక్షంలో ఆదరణగా మలుచుకోవడం.. ఈ నిజాన్ని చూస్తున్న మామ ఆమెను బ్లాక్మెయిల్ చేయడం.. హిపోక్రసీ సమాజానికి అద్దంపడ్తాయి. అయితే మీర్జాపూర్... అడల్ట్స్ ఓన్లీ! – సరస్వతి రమ -
డిప్యూటీ ఎన్ఎస్ఏగా పంకజ్ శరణ్
న్యూఢిల్లీ: భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా సీనియర్ దౌత్యవేత్త పంకజ్ శరణ్‌ను కేంద్రం నియమించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ పంకజ్ నియామకానికి ఆమోదముద్ర వేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 1982 ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) బ్యాచ్‌కు చెందిన పంకజ్ 2015 నుంచి ఇప్పటివరకూ రష్యాలో భారత రాయబారిగా ఉన్నారు. ప్రధాని కార్యాలయంలో 1995–99 మధ్యకాలంలో డిప్యూటీ కార్యదర్శిగా, 2007 నుంచి 2012 వరకూ సంయుక్త కార్యదర్శిగా పంకజ్ పనిచేశారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో పంకజ్ సహాయకారిగా ఉండనున్నారు. -
వెంకటలక్ష్మి ఎక్కడ?
పూజిత పొన్నాడా, మహత్, నవీన్ నేనీ, పంకజ్ ముఖ్య తారలుగా ఎబిటి క్రియేషన్స్ పతాకంపై మాజీ ఎమ్మెలే గురునా«ద్ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ’. కిశోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నటుడు సుమన్ క్లాప్ ఇవ్వగా, గురునా«ద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా గురునా«ద్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అందరూ తెలుగువారే నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. హీరో మహత్ మాట్లాడుతూ – ‘‘కొంత గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. మంచి సినిమా ద్వారా కమ్‌బ్యాక్ అయినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. కిశోర్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. నన్ను ప్రోత్సహించిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: హరి గౌర. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిదీపక్. -
పంకజ్‌కు కాంస్యం
దోహా: తన కెరీర్లో 18వ ప్రపంచ టైటిల్ సాధించాలని ఆశించిన భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పంకజ్ అద్వానీకి నిరాశ ఎదురైంది. ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ (లాంగ్ అప్ ఫార్మాట్)లో పంకజ్ పోరాటం సెమీఫైనల్లోనే ముగిసింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో పంకజ్ 620–1250 పాయింట్లతో మైక్ రసెల్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. ఈ ఓటమితో పంకజ్‌కు కాంస్యం లభించింది. గతవారం ఇదే వేదికపై జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ (పాయింట్ల ఫార్మాట్) చాంపియన్‌షిప్‌లో పంకజ్ విజేతగా నిలిచాడు.