
పూజిత పొన్నాడా, మహత్, నవీన్ నేనీ, పంకజ్ ముఖ్య తారలుగా ఎబిటి క్రియేషన్స్ పతాకంపై మాజీ ఎమ్మెలే గురునా«ద్ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్‌కే రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ’. కిశోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నటుడు సుమన్ క్లాప్ ఇవ్వగా, గురునా«ద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా గురునా«ద్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అందరూ తెలుగువారే నటిస్తున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. హీరో మహత్ మాట్లాడుతూ – ‘‘కొంత గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. మంచి సినిమా ద్వారా కమ్‌బ్యాక్ అయినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. కిశోర్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. నన్ను ప్రోత్సహించిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: హరి గౌర. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిదీపక్.
Comments
Please login to add a commentAdd a comment