Pujita
-
పొట్టి స్కర్ట్‌లో పూజిత.. తెలుగమ్మాయి భలే అందంగా! (ఫొటోలు)
-
ఆకాశ వీధుల్లో మూవీ రివ్యూ
టైటిల్ : ఆకాశ వీధుల్లో నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి ప్రసాద్, బాల పరాశర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత గౌర్ తదితరులు నిర్మాతలు : మనోజ్ జెడి , డా. డీజే మణికంఠ దర్శకత్వం: గౌతమ్ కృష్ణ సంగీతం : జూడా శాండీ సినిమాటోగ్రఫీ:విశ్వనాధ్ రెడ్డి విడుదల తేది: సెప్టెంబర్ 2, 2022 ఈ మధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలు వారి సినిమా కథలను వారే రాసుకుంటున్నారు. కొంతమంది అయితే నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఇలా మల్టీ టాలెంట్‌తో ఇండస్గ్రీలో తమ మార్క్‌ను చూపించుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలోకి వచ్చాడు గౌతమ్ కృష్ణ. ‘ఆకాశ వీధుల్లో’సినిమాలో హీరోగా నటిస్తూనే దర్శకత్వ బాధ్యతలను చేపట్టాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 2) థియేటర్స్‌లో విడుదలైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం కథేంటంటే.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సిద్దు(గౌతమ్ కృష్ణ)కి మ్యూజిక్ అంటే ప్రాణం. చదువు అంతగా రాదు కానీ..సంగీతంపై మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే సిద్ధు తండ్రి(దేవీ ప్రసాద్)కి మాత్రం అది నచ్చదు. కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటాడు. ఇదే విషయం సిద్దుతో చెబితే..తనకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని, సంగీతం నేర్చుకుంటానని చెబుతాడు. తండ్రి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడు. ఎప్పటికైనా రాక్ స్టార్ అవుతానని కలలు కంటాడు. మ్యూజిక్ ప్రయత్నాలు చేస్తూనే.. నిషా(పూజితా పొన్నాడ)తో ప్రేమలో పడిపోతాడు. కొన్నాళ్ళ తర్వాత నిషా తో మనం లివింగ్ లో ఉందామని చెపుతాడు సిద్దు. నిషా మాత్రం తనకు లవ్‌పై నమ్మకం లేదని చెప్పి అతనికి దూరంగా ఉంటుంది.ప్రేమ విఫలం కావడంతో సిద్దు మద్యానికి, డ్రగ్స్‌కి అలవాటు పడతాడు. ఫ్రెండ్స్ చెప్పిన వినకుండా నిత్యం డ్రగ్స్ తీసుకుంటూ సంగీతాన్ని పూర్తిగా పక్కకి పెడతాడు. ఎవరు ఎన్ని చెప్పినా వినని పరిస్థితుల్లో ఉన్న సిద్దు తన గర్ల్ ఫ్రెండ్ నిషా ప్రేమను తిరిగి పొందగలిగాడా లేదా? సామాన్యుడైన సిద్దు చివరకు రాక్‌స్టార్ అయ్యాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. లవ్ ఫెయిల్యూర్‌తో హీరో డిప్రెషన్లో పడిపోవడం, తర్వాత కెరీర్‌పై దృష్టి పెట్టి విజయం సాధించడం. ఇలాంటి చిత్రాలు తెలుగులో చాలానే వచ్చాయి. ఆకాశ వీధుల్లో కూడా ఇదే కోవలోకి వస్తుంది. అయితే కథనం మాత్రం కొత్తగా ఉంటుంది. ప్రస్తుత యంగ్‌స్టర్స్ ఎలా ఉంటున్నారు? వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? మనలో మనకు జరిగే సంఘర్షణ ఎలా ఉంటుంది? కుటుంబ పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయనే అంశాలను తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు గౌతమ్. ఇందులో ఆయనే హీరో అవ్వడం కలిసొచ్చింది.కొన్ని లవ్ సీన్స్ మరియు ప్రయాణ సన్నివేశాలు కొత్తగా లేకపోయినా, ఆ సన్నివేశాలు మిమ్మల్ని కాసేపు నిమగ్నం చేస్తాయి హీరో పాత్రని ఇంకాస్త ఎస్టాబ్లిష్ చేస్తే బాగుండేది. దర్శకుడిగా గౌతమ్‌కి ఇది తొలి సినిమానే అయినా కథనం, సంభాషణలు ఇవన్నీ చక్కగా కుదిరేలా రాసుకున్నాడు. ఎవరెలా చేశారంటే.. గౌతమ్ కృష్ణకు ఇది మొదటి సినిమా అయినా అది తెరపై కనిపించకుండా..పాత్ర పరిధిమేరకు చక్కగా నటించాడు. అటు రొమాంటిక్ పాత్రలో, ఇటు రాక్ స్టార్ పాత్రలో రెండు షేడ్స్ వున్న పాత్రలలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. నిషా గా పూజిత పొన్నాడ తన లుక్స్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లలో యూత్ ను ఆకట్టుకుంటుంది. సిద్దు తండ్రిగా నటించిన దేవి ప్రసాద్.. మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించాడు. నిషా తండ్రిగా శ్రీకాంత్ అయ్యంగార్ బాగా యాక్ట్ చేశారు.సిద్దుకు తల్లిగా బాల పరాశర్, చెల్లి గా దివ్య నార్ని తమదైన నటనతో మెప్పించారు. ఫ్రెండ్స్ పాత్రలో నటించిన ఆనంద్ (రిషి),సత్యం రాజేష్ లు తన నటనతో ఆకట్టుకున్నారు . మీర్జాపూర్ ఫెమ్ హర్షిత గౌర్ స్పెషల్ అప్పిరియన్స్ గా అలరించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. జూడా శాండీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. సింగర్ కాల భైరవ ఆలపించిన ‘జతగా నువ్వు లేని ఏకాకిగా’ పాట ఆకట్టుకుంటుంది. విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. శశాంక్ నాగరాజు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు.. చేసింది ఇరవై సినిమాలు : నటి
గౌతమ్ కృష్ణ, పూజితా పొన్నడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో..’. గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో మనోజ్ డీజే, డా. మణికంఠ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ – ‘‘ఓ కామన్‌మేన్ రాక్‌స్టార్ ఎలా అయ్యాడు? అన్నదే ఈ సినిమా కథ. ‘ఆకాశవీధుల్లో...’ పక్కా యూత్‌ఫుల్ చిత్రం. ఈ సినిమా ఓ స్లో పాయిజన్. యూత్ బాగా కనెక్ట్ అవుతారు. నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్ చేశాం’’ అన్నారు. ‘‘గౌతమ్ ఎమ్‌బీబీఎస్ చదువుతున్నప్పుడే ఈ సినిమా చేస్తానని అన్నాడు. మెడిసిన్ పూర్తి చేయమన్నాను. పీజీ కూడా పూర్తయ్యేది. కానీ సినిమాలపై ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చాడు. గౌతమ్‌కృష్ణ చాలా తెలివైనవాడు. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు నిర్మాత మనోజ్. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లవుతోంది. దాదాపు ఇరవై సినిమాలు చేశాను. కానీ ఓ మంచి సినిమా చేశాననే తృప్తి ఈ సినిమాతో కలిగింది’’ అన్నారు పూజిత. -
రంగస్థలం ఫేమ్ 'పూజిత పొన్నాడ' ఫోటోలు
-
వెంకటలక్ష్మి ఎక్కడ?
పూజిత పొన్నాడా, మహత్, నవీన్ నేనీ, పంకజ్ ముఖ్య తారలుగా ఎబిటి క్రియేషన్స్ పతాకంపై మాజీ ఎమ్మెలే గురునా«ద్ రెడ్డి సమర్పణలో ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ’. కిశోర్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నటుడు సుమన్ క్లాప్ ఇవ్వగా, గురునా«ద్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా గురునా«ద్ రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో అందరూ తెలుగువారే నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్‌లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. హీరో మహత్ మాట్లాడుతూ – ‘‘కొంత గ్యాప్ తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాను. మంచి సినిమా ద్వారా కమ్‌బ్యాక్ అయినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. కిశోర్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు కామెడీ కూడా ఉంటుంది. నన్ను ప్రోత్సహించిన నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: హరి గౌర. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిదీపక్. -
ఆట ఆడింది ఎవరు?
ధీరేంద్ర, పూజిత జంటగా షిరిడిసాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ నిర్మిస్తోన్న ‘డర్టీగేమ్’ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ -‘‘సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అంశాలతో రాజకీయ నేపథ్యంలో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. డర్టీగేమ్ ఏంటి? అసలు ఈ గేమ్ ఆడింది ఎవరు? రిజల్ట్ ఏంటి? ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? ఈ మిస్టరీ ప్రశ్నలన్నిటికీ చిత్రంలో సమాధానాలు దొరుకుతాయి. సురేశ్, నిర్మాత తాడి మనోహర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు-పాటలు- కథనం- దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ, సంగీతం: సునీల్ కశ్యప్. -
ఓ ఐఏఎస్.. ఓ నటి.. ఓ గోపాల్
♦ వివాదాస్పదమైన ఐఏఎస్ అధికారిణి రేఖారాణి రెండో వివాహం ♦ విజయ్‌గోపాల్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న రేఖారాణి ♦ అతనితో తనకు ముందే పెళ్లయ్యిందన్న సినీ నటి పూజిత ♦ తనకు విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకున్నారని ఆరోపణ ♦ తమకు ప్రాణహాని ఉందని నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: దివంగత ఐపీఎస్ అధికారి పరదేశీనాయుడు సతీమణి, ఐఏఎస్ అధికారిణి రేఖారాణి రెండో వివాహం వివాదాస్పదమైంది. రేఖారాణి వివాహం చేసుకున్న విజయ్‌గోపాల్ అంతకు ముందే తనను పెళ్లిచేసుకున్నాడని.. తమకు పన్నెండేళ్ల కుమారుడున్నాడని.. తనకు విడాకులివ్వకుండానే మళ్లీ పెళ్లి చేసుకున్నాడని సినీ నటి పూజిత మంగళవారం నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. తనకు, తన కుమారునికీ ప్రాణభయం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్‌గోపాల్ పెళ్లి విషయాన్ని రేఖారాణి తల్లిదండ్రులే తనకు స్వయంగా చెప్పారని పూజిత పేర్కొనడం గమనార్హం. అయితే న్యాయపరంగా అన్నీ చూసుకున్నాకే విజయ్‌గోపాల్‌ను తాను రెండో వివాహం చేసుకున్నట్లు రేఖారాణి స్పష్టం చేశారు. మరోవైపు నటి పూజితతో తాను సహజీవనమే చేశానని, పెళ్లి చేసుకోలేదని విజయ్‌గోపాల్ అంగీకరించారు. అయితే రేఖారాణితో వివాహం గురించి ‘సాక్షి’ ఆయనను ప్రశ్నించగా స్పందించలేదు. కాగా, పూజిత గతంలో ఇద్ద రు పెళ్లాల ముద్దుల పోలీస్ తదితర సినిమాలతో పాటు రుతురాగాలు వంటి సీరియల్స్‌లోనూ నటించారు. విజయ్‌గోపాల్ గతంలో ఓ పత్రికలో సినిమా రిపోర్టర్‌గా, ఎంపీ వద్ద పీఏగా పనిచేశారు. ఈ సందర్భంగా పూజిత మీడియాతో ఏమన్నారంటే... ప్రాణహాని ఉంది... ‘‘విజయ్‌గోపాల్ పెద్ద మోసగాడు. అతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. విజయ్‌గోపాల్ నా భర్తే అనేందుకు కావాల్సిన అన్ని ఆధారాలను నేను కమిషనర్‌కు అందజేశాను. నాతో పాటు పలువురు అమ్మాయిలను మోసం చేసిన విజయ్‌గోపాల్‌ను తక్షణం అరెస్టు చేయాలి. విజయ్‌గోపాల్ ఐఏఎస్ అధికారిణి రేఖారాణిని వివాహం చేసుకున్న వ్యవహారంలో పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఈ పెళ్లి వ్యవహారం నేపథ్యంలో నాకు కొంత మంది నుంచి ప్రాణహాని ఉంది. ఐపీఎస్ అధికారిణి అంజనాసిన్హా నుంచి కూడా ప్రాణభయం ఉంది. అందుకే ఆరు రోజులుగా అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాను. ఇప్పుడు బయటకు వచ్చాను. నగరం నడిమధ్యలోనైనా ఈ విషయం తేల్చుకునేందుకు నేను సిద్ధం. రేఖారాణి, విజయ్‌గోపాల్ పెళ్లికి మొదటి సాక్షి అంజనా సిన్హానే. ఆమెను ఈ కేసు విచారణ నుంచి తప్పించాలి. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నాకు సహకరించాలి. విజయ్‌గోపాల్‌తో పరిచయం ఇలా.. ఒక సినిమా షూటింగ్లో విజయ్‌గోపాల్ సినిమా రిపోర్టర్‌గా నాకు పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో నన్ను ఫాలోఅప్ చేయడంతోపాటు నా తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకున్నాడు. వివాహ రిసెప్షన్ కూడా ఆయన ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకున్నాం. పెళ్లి అయిన తరవాత ఆయన నిజస్వరూపం నాకు తెలిసింది. నిత్యం గంటలకొద్దీ ఫేస్బుక్లో గడిపేవాడు. నా వద్ద ఉన్న నగదు, బంగారాన్ని కాజేశాడు. నా సంపాదన అంతా ఆయన చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది. ఒక రాత్రి చెప్పాపెట్టకుండా ఆయన పారిపోయాడు. ఆయన ఆచూకీ కోసం పలు మార్లు ప్రయత్నించా.. చివరకు ఈ పెళ్లి విషయం రేఖారాణి తల్లిదండ్రులే స్వయంగా నాకు చెప్పారు. నాకు విడాకులివ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం న్యాయపరంగా కరెక్ట్ కాదని, ఈ పెళ్లి ఆపమని వారే నాకు సలహా ఇచ్చారు. ఈ పెళ్లిపై తొలుత సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా వారు స్పందించలేదు.’’ వాళ్లు పదేళ్ల క్రితమే విడిపోయారు: రేఖారాణి పెళ్లి వివాదంపై ఐఏఎస్ అధికారిణి, శాప్ ఎండీ రేఖారాణి ‘సాక్షి’తో ఫోన్లైన్లో మాట్లాడారు. ‘‘విజయ్‌గోపాల్, పూజిత పదేళ్ల క్రితమే విడిపోయారు. వారిద్దరికీ వివాహం జరగలేదు. సహజీవనం మాత్రమే చేశారు. నేను అన్నీ లీగల్‌గా చూసుకునే పెళ్లి చేసుకున్నా. విజయ్‌గోపాల్‌తో రిలేషన్ వద్దని వదిలేసుకుంది. నా తల్లిదండ్రులు ఆమెకు సపోర్ట్ చేయడం నా బ్యాడ్‌లక్. నా వైపు నుంచి పూజితకు ఎలాంటి అపాయం లేదు’’ అని తెలిపారు. పూజితతో పన్నెండేళ్లు సహజీవనం చేశా: విజయ్‌గోపాల్ ‘‘పూజితను నేను పెళ్లి చేసుకోలేదు. కానీ పన్నెండేళ్లపాటు ఆమెతో సహజీవనం చేశా. మాకు ఒక కొడుకు ఉన్న మాట వాస్తవమే. కానీ పెళ్లి లాంటిదేమీ జరగలేదు. ఏడేళ్లుగా నాకు పూజితతో కాంటాక్ట్ లేదు. కనీసం ఆమె ఫోన్ నంబర్ కూడా నా వద్ద లేదు. పూజితకు ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించాలి. ఆమె ఉద్దేశం నాకు అర్థం కావడం లేదు. అన్ని విషయాలు కోర్టులో తేలుతాయి. పూజిత వెనక ఎవరో పెద్దల హస్తం ఉంది. కావాలనే ఆమెను రెచ్చగొడుతున్నారు. ఆ విషయాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి’’ -
ఆ ఆలోచనలు...
నేటి తరం యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాటి వల్ల జరిగే నష్టం ఏంటి? ఆ ఆలోచనల నుంచి తమ పిల్లల్ని తల్లితండ్రులు ఎలా కాపాడుకోవాలనే కథాంశంతో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో ‘ప్లేయర్’ ఫేం పర్వీన్ రాజు, పూజిత జంటగా లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై శేష సాయి దర్శకత్వంలో ఎంవీఎస్ సాయి కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభ మైంది. ఈ చిత్రానికి కెమేరా: శంకర్ కంతేటి, సంగీతం: కృష్ణ, సమర్పణ: అరుణా చలమ్ మాణిక్వేల్ -
మిర్చి ప్రాపర్టీ
హీరోయిన్లు లతాహెగ్డే, పూజిత(తుంటరీ ఫేంలు)లు మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో సందడి చేశారు. రేడియో మిర్చి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ‘మిర్చి ప్రాపర్టీ షో’ను శనివారం వీరు ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నామని రేడియో మిర్చి హైదరాబాద్ స్టేషన్ డెరైక్టర్ అరిందం మోండల్ చెప్పారు. రూ.60 లక్షల నుంచి అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న ఈ షో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. - మాదాపూర్ -
ధనలక్ష్మితో డీల్!
సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రం ‘డీల్ విత్ ధనలక్ష్మి’. మానస్, పూజిత, అంజలి, అర్చన, విజయభాస్కర్ రెడ్డి, సత్య ప్రధాన పాత్రల్లో వెంకట్ ప్రసాద్ (బాబీ) దర్శకత్వంలో ఏవీయస్ శ్రీనివాస్, కవిత సింహాచలం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇది పదిమంది కోసం పాటుపడే యువకుడి కథ . వినోద ప్రధానంగా నడిచే సస్పెన్స్ థ్రిల్లర్’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ నెల 10 నుంచి 30 వరకూ రాజమండ్రి, తాపేశ్వరం, సిద్దాంతం ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ చేస్తాం. ఏప్రిల్ 7 నుంచి 25 వరకూ హైదరాబాద్‌లో జరిపే రెండో షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: డా. జోశ్యభట్ల, కెమేరా: ఏవీ శ్రీనివాస్(బాబు). -
ఏడేళ్ల బాలిక కిడ్నాప్..!
రాజమండ్రి: చాక్లెట్ కొనుక్కునేందుకని బయటకు వచ్చిన ఏడేళ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండంలంలోని చదలవాడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు... ఏదో పెళ్లి విషయమై వీరవరం మండలం చెర్లంపూడి గ్రామానికి చెందిన పూజిత తల్లిదండ్రులతో కలసి అమ్మమ్మ గ్రామం చదలవాడకు వచ్చింది. అయితే బుధవారం ఉదయం 11 గంటల సమయంలో చాక్లెట్ కొనుక్కొనేందుకు బయటకి వచ్చిన పూజిత అప్పట్నుంచి కనిపించడం లేదు. పూజిత తండ్రి వీరవరం మండల ఎమ్మార్వో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. బాలిక కిడ్నాప్ గురవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పాప కోసం గాలిస్తున్నారు. -
ఆ నలుగురి మధ్య..
ముగ్గురు యువకులు, ఓ యువతి మధ్య ప్రేమకథ -‘నిన్నే కోరుకుంటా’. సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక ముఖ్య తారలు. గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణవ్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా నిర్మాతలు మల్కాపురం శివకుమార్, రామ సత్యనారాయణ పాల్గొన్నారు. -
నీటితొట్టెలోపడి చిన్నారి మృతి
కారేపల్లి మండలం మాదారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ పూజిత అనే మూడేళ్ల చిన్నారి నీటితొట్టెలో పడింది. ఎవరూ గమనించకపోవడంతో కాసేపటికే ప్రాణాలొదిలింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
రొమాన్స్... కామెడీ...
ఆనంద్‌రాజ్, సందీప్, పూజిత, సారిక ముఖ్యతారలుగా గణ మురళి దర్శకత్వంలో విద్యాసాగర్ మరిపి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. ఈ చిత్రం పాటలను నవంబరు 7న విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘యథార్థ ఘటనల ఆధారంగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించాం. అన్ని పాటలకూ ప్రణవ్ మంచి స్వరాలందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వర లో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: సాహు, బిట్ర ప్రకాశ్, కెమెరా: రామ్‌కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి. -
ఆమెది ఆత్మహత్యే..!
యువతి సజీవ దహనం కేసులో వీడిన మిస్టరీ మృతురాలు నందిగామకు చెందిన పూజితగా గుర్తింపు సీఏ పాస్ కాలేక పోతున్నాననే మనోవేదనే కారణం ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిన మృతురాలు హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఐపీఎస్, ఐఏఎస్ క్వార్టర్స్ వద్ద యువతి సజీవ దహనం కేసులో పంజగుట్ట పోలీసులు పురోగతి సాధించారు. మృతిచెందిన యువతి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన విద్యార్థి వాసిరెడ్డి పూజిత (19)గా తేలింది. ఆమె ధరించిన వాచీ, చెవిదిద్దులు, చెప్పుల ఆధారంగా హైదరాబాద్‌లోనే నివాసముంటున్న ఆ యువతి బాబాయ్ నరేష్ పూజిత మృతదేహాన్ని గుర్తించారు. నాలుగు సార్లు పరీక్షలు రాసినా సీఏ ఇంటర్లో తప్పిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పూజిత హైదరాబాద్‌కు వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన శ్రీనివాస్, అన్నపూర్ణ దంపతులకు రోహిత, పూజిత (19) కుమార్తెలు. రోహిత చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం చేస్తుండగా, పూజిత చార్టెడ్ అకౌంట్ (సీఏ ఇంటర్) చదువుతోంది. గతంలో పూజిత అమీర్‌పేటలో ఉంటూ సీఏ ఎంట్రన్స్ పరీక్షల కోసం కోచింగ్ తీసుకుంది. ఆ సమయంలోనే లక్డీకాపూల్‌లో బ్యాచిలర్‌గా ఉంటున్న బిహార్ రాష్ట్రానికి చెందిన అక్షయ్‌కుమార్‌తో పరిచయమైంది. ఇతను కూడా సీఏ చదువుతున్నాడు. ఇదిలావుండగా ప్రస్తుతం గుంటూరులో సీఏ ఇంటర్ చదువుతున్న పూజిత నాలుగు సార్లు పరీక్షలు రాసినా ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఈ నెల 19న తెల్లవారుజామున ఇంట్లో సూసైడ్‌నోట్ రాసి పెట్టి అదేరోజు తన స్నేహితుడు అక్షయ్‌ను చివరిసారిగా చూసేందుకు హైదరాబాద్ వచ్చింది. ఇద్దరూ కలిసి సికింద్రాబాద్‌లో షాపింగ్ చేశారు. పూజిత ఒక టీషర్టును తన స్నేహితుడికి కొనిచ్చింది. తరువాత తాను ఇంటికి వెళ్తానని చెప్పడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద రాత్రి 10 గంటలకు అక్షయ్ ఆమెకు వీడ్కోలు చెప్పి తన గదికి వచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు రాత్రి తనకు కొనిచ్చిన టీషర్టును అక్షయ్ విప్పి చూడగా అందులో పూజిత సూసైడ్ నోట్ దారికింది. అర్ధరాత్రి తరువాత అక్షయ్ సూసైడ్‌నోట్‌ను తీసుకుని నాంపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని వివరించాడు. అప్పటికే పూజిత కాలినగాయాలతో పంజగుట్ట పరిధిలోని మున్సిపల్ గార్డెన్లో శవమై తేలింది. రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి పూజిత తిరిగి పంజగుట్టకు చేరుకుంది. అదే రోజు అర్ధరాత్రి దాటిన తరువాత 1.20కి ఆమె గార్డెన్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి కాలిన గాయాలే కారణమని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అయితే సికింద్రాబాద్ నుంచి పంజగుట్టకు ఎలా వచ్చింది, పెట్రోల్ ఎక్కడ ఖరీదు చేసింది అనే వివరాలు తేలాల్సి ఉంది. కాగా పూజిత మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా మృతురాలి బంధువులు శని వారం అర్ధరాత్రి గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద ధర్నా చేశారు. ఇదిలా ఉండగా పూజిత మృతిపై ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న కథనాలపై మృతురాలి తల్లి అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ నోట్ రాసి తన కూతురు ఆత్మహత్య చేసుకుందని.. వేరే కారణాలు ఏమీ లేవని ఆమె వాపోతున్నారు. పూజిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి అయితే పూజిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని మృతురాలి తాత వాసిరెడ్డి రామలింగయ్య కోరారు. గాంధీ మార్చురీ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మనుమరాలి మృతికి కారణమైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఎస్సెమ్మెస్ ద్వారా: సూసైడ్ నోట్ రాసిన పూజిత తన సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లింది. ఫోన్‌ను పరిశీలించగా ఎస్సెమ్మెస్ ఆధారంగా విచారిస్తే తన బోయ్‌ఫ్రెండ్ అక్షయ్‌కుమార్‌కు ఆఖరు ఎస్సెమ్మెస్ చేసినట్లు తెలిసింది. సూసైడ్ నోట్:‘‘మమ్మీ నాకు బతకాలని లేదు. సోదరి రోహితకు కూడా ఉద్యోగం వచ్చింది. కానీ నాకు ఎప్పటికీ రాదు. డిగ్రీ పరీక్షలకు సిధ్దం అయ్యే సమయంలో ఓ లెసన్‌లో చదివాను. నిరుద్యోగులు డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకుంటారని. అది చదవగానే ఏడుపు వచ్చింది. నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నాకోసం ఏడవద్దు, రోహితకు ఏడెకరాల పొలం కట్నంగా ఇచ్చి పెళ్లి చేయండి. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుందామనుకున్నాను కాని దూరంగా వెళ్లి చనిపోదామని నిశ్చయించుకున్నాను. రూ.2000 తీసుకువెళ్తున్నాను, నేను పుట్టలేదు అనుకొండి. మీకు ఎప్పటికీ భారంకాను. ఈ రోజు రాత్రికల్లా చనిపోతాను. అక్కా ఆల్ ది బెస్ట్ కీప్ స్మైలింగ్’’అని రాసి ఉంది. ఇంట్లో రాసిన సూసైడ్‌నోట్‌ను పంజగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీషర్టులో లభించిన నోట్‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
జాతీయస్థాయి ఇన్‌స్పైర్‌లో జిల్లా విదార్థి ప్రతిభ
విద్యారణ్యపురి : న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో బుధవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్స్పై ర్లో వరంగల్‌కు చెందిన విద్యార్థిని పూజిత ప్రతిభ కనబరిచారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రస్థాయి ఇన్స్పై ర్ వరంగల్‌లో జరిగిన విషయం విదితమే. ఈ సందర్భంగా పది జిల్లాల నుంచి 35 ఎగ్జిబిట్లను జాతీయ స్థాయికి ఎంపిక చేయగా, ఇందులో జిల్లాకు చెందిన ఆరు ఎగ్జిబిట్లు ఉన్నాయి. వీటిని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించగా, వరంగల్‌లోని సిటీ హైస్కూల్ విద్యార్థిని పూజిత సురక్షిత రైల్వే క్రాసింగ్ ఎగ్జిబిట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతీ రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి మొదటి, ద్వితీయ బహుమతులు అందజేశారు. వీరిలో పూజిత ఇన్స్పైర్ ముగింపు సభలో మొదటి బహుమతిని ప్రముఖ శాస్త్రవేత్తల నుంచి అందుకుందని జిల్లా సైన్స్‌కేంద్రం అధికారి సిహెచ్ కేశవరావు బుధవారం సాయంత్రం వెల్లడించారు. -
ముగ్గురు విద్యార్థినుల అనుమానాస్పద మృతి
తాడేపల్లి: విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారి మృతదేహాలు గుంటూరు జిల్లా సీతానగరం సమీపంలోని కృష్ణానదిలో ఆదివారం తెల్లవారు జామున కనిపించాయి. రెండు జిల్లాల్లో కలకలం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరానికి చెందిన సరిపూడి పూజిత(17), తాడిగడపకు చెందిన యలమంచిలి నాగలక్ష్మి(17), పెనమలూరుకు చెం దిన బిళ్లా పల్లవి(17) విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీరంతా కలసి ఒకే బస్సులో వెళ్లి వస్తుండేవారు. ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం వారు కాలేజికి వెళ్లి తిరిగిరాలేదు. కానీ వారి పుస్తకాల బ్యాగ్ లు సీతానగరం సమీపంలోని నది ఒడ్డున శనివారం రాత్రి పోలీసులకు లభ్యమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున వారి మృత దేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఈ ముగ్గురు బాలికలు రెండు రోజుల నుంచి కళాశాలకు హాజరు కాలేదని చెబుతున్నారు. వారు ఇళ్లకు రాకపోయేసరికి తల్లిదండ్రులు స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి ఆచూకీ కోసం వాకబు చేశామని చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకున్నట్లు వారి బ్యాగుల్లో లభిం చిన దర్శనం టికెట్ల ద్వారా తెలుస్తోంది. శనివా రం సాయంత్రం వారు ఇసుక తిన్నెల్లో కనిపించినట్టు స్థాని కుల సమాచారం. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.