ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు.. చేసింది ఇరవై సినిమాలు : నటి | Aakasa Veedhullo Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లు.. చేసింది ఇరవై సినిమాలు : నటి

Published Fri, Sep 2 2022 12:41 AM | Last Updated on Fri, Sep 2 2022 8:37 AM

Aakasa Veedhullo Movie Pre Release Event - Sakshi

గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నడ

గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో..’. గౌతమ్‌ కృష్ణ దర్శకత్వంలో మనోజ్‌ డీజే, డా. మణికంఠ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో గౌతమ్‌ కృష్ణ మాట్లాడుతూ – ‘‘ఓ కామన్‌మేన్‌ రాక్‌స్టార్‌ ఎలా అయ్యాడు? అన్నదే ఈ సినిమా కథ. ‘ఆకాశవీధుల్లో...’ పక్కా యూత్‌ఫుల్‌ చిత్రం. ఈ సినిమా ఓ స్లో పాయిజన్‌. యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. నాకు ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు.

ఈ సినిమా కోసం చాలా హార్డ్‌వర్క్‌ చేశాం’’ అన్నారు. ‘‘గౌతమ్‌ ఎమ్‌బీబీఎస్‌ చదువుతున్నప్పుడే ఈ సినిమా చేస్తానని అన్నాడు. మెడిసిన్‌ పూర్తి చేయమన్నాను. పీజీ కూడా పూర్తయ్యేది. కానీ సినిమాలపై ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చాడు. గౌతమ్‌కృష్ణ చాలా తెలివైనవాడు. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు నిర్మాత మనోజ్‌.  ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి నాలుగేళ్లవుతోంది. దాదాపు ఇరవై సినిమాలు చేశాను. కానీ ఓ మంచి సినిమా చేశాననే తృప్తి ఈ సినిమాతో కలిగింది’’ అన్నారు పూజిత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement