కూల్‌గా కంప్లీట్‌ అయింది | Ratham Movie prerelease | Sakshi
Sakshi News home page

కూల్‌గా కంప్లీట్‌ అయింది

Published Thu, Oct 25 2018 12:41 AM | Last Updated on Thu, Oct 25 2018 12:41 AM

Ratham Movie prerelease - Sakshi

గీతానంద్, చాందినీ భగ్వనాని

గీతానంద్, చాందినీ భగ్వనాని జంటగా చంద్రశేఖర్‌ కానూరి దర్శకత్వంలో ఎ. వినోద్‌ సమర్పణలో రాజా దారపునేని నిర్మించిన ‘రథం’ సినిమా రేపు విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో చిత్రనిర్మాత రాజా మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా సక్సెస్‌ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. రోటీన్‌ కథలకు ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. నిర్మాత చాలా కూల్‌గా సినిమాను కంప్లీట్‌ చేశారు. ఇక దర్శకుడు ఈ సినిమాను చించేసాడనే చెప్పుకోవాల’’న్నారు గీతానంద్‌. ‘‘ప్రతి ఒక్కరి కష్టమే రథం’’ అన్నారు చాందినీ. రమేష్‌ పుప్పాల, మధు, ఎస్‌.గోపాల్‌రెడ్డి  తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement