ratham
-
రామ రామ.. రథానికి నిప్పు
సాక్షి టాస్‌్కఫోర్స్: గుళ్లు, రథాలు వాళ్లే ధ్వంసం చేస్తారు.. గిట్టని వారిపై ఆ నింద వేస్తారు. వాళ్లే అపచారాలు చేస్తారు.. ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తారు. ఆలయాల ప్రతిష్టను వాళ్లే మంటగలుపుతారు.. ఎదుటి పక్షం వారికి నేరం అంటగడతారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ పెద్దల తీరిది. నాటి గోదావరి పుష్కరాలు మొదలు.. నేటి తిరుమల లడ్డూ వరకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాషీ్టకాలివి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని దుష్ప్రచారం చేసి, ప్రజల్లో చులకనవుతున్న టీడీపీ పెద్దలను.. ఆ వివాదం నుంచి గట్టెక్కించడానికి ఆ పార్టీ నేతలు మరో ఘాతుకానికి తెరలేపారు.'ఇందుకు అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ రామాలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. సుమారు మూడున్నర వేల మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో ఏటా శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల వారిని ఊరేగించే రథానికి నిప్పు పెట్టించారు. ఈ నెపాన్ని ప్రత్యర్థులపై వేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలని విఫలయత్నం చేసినా, ఈ దుర్మార్గానికి పాల్పడింది టీడీపీ వారేనని గ్రామమంతా కోడై కూస్తుండటంతో తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు.స్థానికుల కథనం మేరకు.. హనకనహళ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి, శ్రీరామాలయాలు ఊరి నడి»ొడ్డున పక్కపక్కనే ఉన్నాయి. ఈ ఊళ్లో ప్రజలు శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు సీతారాముల వారిని రథంపై ఊరేగిస్తారు. అనంతరం రథాన్ని ఆలయం పక్కనే ఉన్న షెడ్డులో ఉంచుతారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఇద్దరు వ్యక్తులు షెడ్డు తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. రథంపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఎదురింటిలో ఉండే అనసూయమ్మ అదే సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు రావడంతో రథమున్న షెడ్లో నుంచి మంటలు రావడం గమనించింది. వెంటనే ఆమె.. తన మామ ఎర్రిస్వామికి విషయం చెప్పింది. ఆయన ఇరుగు పొరుగు వారిని నిద్ర లేపి మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగం రథం కాలిపోయింది. అలజడి రేగడంతో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలంతా ఆలయం వద్దకు తరలివచ్చారు. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఘటన స్థలానికి చేరుకున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, పలువురు పోలీసు, దేవదాయ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించారు. కాగా, దుండగులిద్దరూ టీడీపీకి చెందిన వారని, ఉద్దేశ పూర్వకంగానే రథానికి నిప్పుపెట్టినట్లు పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. ముమ్మాటికీ ఇది టీడీపీ పనే.. ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరే కీలకమని భావిస్తున్నారు. అయితే వీరిద్దరినే అదుపులోకి తీసుకుంటే అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని, మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా చూపుతూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో టీడీపీ వారిని తప్పించి అమాయకులను బలి చేయాలని చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఇద్దరితో ఈ దుర్మార్గ పని చేయించిన వారెవరో కూడా స్పష్టం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాములోరి రథం దగ్ధం ఘటనలో బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. మంగళవారం ఉదయం వారు సంఘటన స్థలాన్ని సందర్శించి.. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, ఆర్డీఓ రాణీసుస్మితను అడిగి వివరాలు తెలుసుకొన్నారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్పష్టమవుతోందని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఆలయాల వద్ద, ఆలయాల పరిసర ప్రాంతాల్లో రథాలున్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.సమగ్రంగా దర్యాప్తు చేయండి: సీఎం చంద్రబాబుసాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనకనహాల్‌లో రాములోరి రథం దగ్ధం కావడంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులకు సీఎం సూచించారు. -
వస్తున్నాయ్.. సత్యదేవుని కొత్త రథాలు
అన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతిదేవి కోసం కొత్త రథాలు సిద్ధమవుతున్నాయి. రూ.1.42 కోట్ల వ్యయంతో నాణ్యమైన బస్తరు టేకుతో ఈ రెండు రథాలను అన్నవరం దేవస్థానం తయారు చేయిస్తోంది. వీటిలో రూ.34 లక్షలతో నిర్మించిన చిన్నరథం స్వామి, అమ్మవార్ల ఊరేగింపునకు సిద్ధమైంది. దీనికి వెండి రేకు తాపడం చేసేందుకు దాతల కోసం దేవస్థానం అన్వేషిస్తోంది. మరోవైపు రూ.1.08 కోట్లతో నిర్మిస్తున్న పెద్ద రథం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరో మూడు నెలల్లో ఈ రథం కూడా సిద్ధమవుతుందని చెబుతున్నారు. చురుగ్గా పెద్ద రథం పనులు ♦ రూ.1.08 కోట్లతో పెద్ద రథం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ♦ దీని ఎత్తు 33.9 అడుగులు, వెడల్పు 14 అడుగులు, పొడవు 23.5 అడుగులు. ♦ ఈ రథంపై వివిధ లతలు, దేవతామూర్తుల చిత్రాలు, వివిధ డిజైన్లు చెక్కుతున్నారు. ♦ పెద్ద రథం పీఠం నిర్మాణ పనుల్లో శిల్పులు నిమగ్నమయ్యారు. పెద్ద రథానికి సంబంధించి స్తంభాలు సైతం చెక్కుతున్నారు. ♦ సత్యదేవునికి ఇప్పటికే రెండు రథాలున్నాయి. వీటిలో ఒకటి వెండి రథం కాగా.. మరొకటి వైశాఖ మాసంలో జరిగే వార్షిక కల్యాణ మహోత్సవాల్లో మూడో రోజు స్వామి, అమ్మవార్లను ఊరేగించే రావణ బ్రహ్మ వాహనం. వెండి రథం శిథిలావస్థకు చేరింది. ♦ కొత్త రథం తయారు చేయించాలన్న ప్రతిపాదన పదేళ్లుగా ఉన్నా వివిధ కారణాలతో అధికారులు సాహసించలేదు. ♦ వెండి, బంగారం పనులు చేయించేటప్పుడు పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని వెనుకంజ వేశారు.అయితే.. గత ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నూతన రథం తయారీకి ఉపక్రమించారు. ♦ వెండి రథంతోపాటు స్వామి, అమ్మవార్లను కొండ దిగువన ఊరేగించేందుకు పెద్ద రథం కూడా తయారు చేయాలని నిర్ణయించారు. ♦ పాలకవర్గం ఆమోదంతో వీటి తయారీకు గత ఈవో ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆగస్ట్ నెలలో టెండర్లు పిలిచారు. ♦ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మురమళ్లకు చెందిన శ్రీమాణిక్యాంబ శిల్పకళ వుడ్ వర్క్స్ అధినేతలు కొల్లాటి కామేశ్వరరావు, కొల్లాటి శ్రీనివాస్ ఈ పనులను దక్కించుకున్నారు. సిద్ధమైన చిన్న రథం ♦ చిన్న రథం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ రథం ఎత్తు 14 అడుగులు, వెడల్పు 6.3 అడుగులు, పొడవు 7.5 అడుగులు ఉంది. నాలుగు స్తంభాలపై శిఖరం వస్తుంది. నాలుగు చక్రాల మీద అందమైన లతలు చెక్కారు. ♦ రథం మీద దేవతామూర్తుల చిత్రాలతో పాటు పలు ఆకర్షణీయమైన డిజైన్లు చిత్రీకరించనున్నారు. ముందు భాగంలో రెండు గుర్రాలను అమర్చారు. ♦ దీనిని టేకుతో తయారు చేయడానికి రూ.34 లక్షలు అవుతుండగా.. వెండి రేకు తాపడానికి సుమారు 300 కిలోల వెండి అవసరం కానుంది. దాతల సహకారంతో వెండి తాపడం చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిన్న రథం నిర్మాణం బాగుంది చిన్న రథం నిర్మాణం పూర్తయింది. చాలా బాగుంది. ఈవో కె.రామచంద్ర మోహన్ దీనిని పరిశీలించిన అనంతరం ట్రయల్ రన్ వేస్తాం. అనంతరం దీనిని స్వామివారి సేవలో ఎప్పుడు ఉపయోగించాలో ఈవో పండితులు, నిర్ణయిస్తారు. – ఉదయ్ కుమార్, డీఈ, అన్నవరం దేవస్థానం -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!
విజయ్ ఆంటోని, నందితాశ్వేతా, రమ్యానంభీశన్, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం రత్తం. ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సీఎస్ అముదమ్ దర్శకత్వం వహించారు. ఈయన ఇంతకుముందు తమిళ్ పడం, తమిళ్‌పడమ్–2 వంటి వినోదభరిత కథాచిత్రాలను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని పూర్తి భిన్నంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇతివృత్తంతో రూపొందించారు. ఇటీవలే బిచ్చగాడు-2 సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్ ఆంటోని. క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కథేంటంటే.. ముఖ్యంగా మీడియా నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం రత్తం. చిత్ర ప్రారంభంలోనే ఒక పత్రిక సహాయ సంపాదకుడిని ఆయన కార్యాలయంలోనే ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేస్తాడు. చనిపోయిన వ్యక్తి విజయ్ ఆంటోనికి మిత్రుడు. కాగా ఇంతకుముందు పత్రికలో పనిచేసిన విజయ్‌ఆంటోని ఈ తరువాత జర్నలిజానికి దూరంగా వేరే ప్రపంచంలో జీవిస్తుంటారు. అలాంటిది ఆయన మళ్లీ మీడియా ప్రపంచంలోకి రావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు కారణం ఏమిటి? జరుగుతున్న హత్యలకు కారణం ఎవరూ? వంటి అంశాలపై ఆయన ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. అయితే ఆ మిస్టరీని ఆయన ఛేదిస్తారా? అందుకు ఎలాంటి సాహసానికి పూనుకుంటారు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం రత్తం. ఇటీవలే విడుదలైన ఈ చిత్రాని ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విషాదం కాగా.. ఇటీవలే విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆయన పెద్ద కుమార్తె మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడింది. -
స్వర్ణ రథంపై శ్రీవారు ( ఫొటోలు)
-
అంతర్వేది రథం నిర్మాణానికి వేగంగా ఏర్పాట్లు
-
టీటీడీకి రూ. 5 కోట్ల డిపాజిట్
సాక్షి, తిరుపతి: వినాయక స్వర్ణరథం తయారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాకి గురువారం కాణిపాకం వినాయక దేవస్థానం రూ. 5 కోట్లను డిపాజిట్ చేసింది. ఈ మేరకు కాణిపాకం దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఆ మొత్తాన్ని వినాయక స్వర్ణరథం తయారీ కోసము డిపాజిట్ చేసినట్టు పేర్కొంది. గతంలో వినాయక బంగారు రథం తయారీ కోసం టీటీడీకి రూ. కోటి డిపాజిట్ చేసినట్టు కాణిపాకం దేవస్థానం వెల్లడించింది. అయతే తాజాగా కాణిపాకం వినాయక స్వర్ణరథం తయారీకి అంచనాలు పెరిగాయి. దీంతో రథం తయారికి రూ. 6.5 కోట్ల ఖర్చు అవుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. కాగా వచ్చే ఏప్రిల్ నాటికి వినాయక స్వర్ణరథం సిద్ధం చేసేందుకు టీటీడీ టెండర్లు పిలువనుంది. -
కూల్‌గా కంప్లీట్ అయింది
గీతానంద్, చాందినీ భగ్వనాని జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఎ. వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మించిన ‘రథం’ సినిమా రేపు విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో చిత్రనిర్మాత రాజా మాట్లాడుతూ – ‘‘ట్రైలర్‌కు, పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహపరచదు. రోటీన్ కథలకు ఈ చిత్రం భిన్నంగా ఉంటుంది. నిర్మాత చాలా కూల్‌గా సినిమాను కంప్లీట్ చేశారు. ఇక దర్శకుడు ఈ సినిమాను చించేసాడనే చెప్పుకోవాల’’న్నారు గీతానంద్. ‘‘ప్రతి ఒక్కరి కష్టమే రథం’’ అన్నారు చాందినీ. రమేష్ పుప్పాల, మధు, ఎస్.గోపాల్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరంటే ఇష్టం
‘‘టీవీ నుంచి సిల్వర్ స్క్రీన్కు రావడం హ్యాపీగా ఉంది. సినిమాల్లో అయితే డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే అవకాశం ఉంటుంది’’ అన్నారు చాందినీ భగ్వానాని. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో గీతానంద్, చాందినీ భగ్వానాని జంటగా రాజా దారపునేని నిర్మించిన ‘రథం’ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. చాందినీ మాట్లాడుతూ– ‘‘మాది ముంబై. ఆరేళ్లకే బాలనటిగా హిందీ సినిమాల్లో నటించాను. ఆ తర్వాత కొంచెం విరామం తీసుకుని చదువుపై దృష్టి పెట్టి ప్లస్ టు కంప్లీట్ చేశాను. ప్రముఖ టీవీ చానెల్స్‌లో నటిస్తూనే, మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశా. ‘రథం’ సినిమాలో అవకాశం వచ్చింది. మగవారి పట్ల సరైన అభిప్రాయం లేని ఓ అమ్మాయి జీవితంలోకి వచ్చిన ఓ అబ్బాయి తీసుకొచ్చిన మార్పు ఏంటి? అనేదే ఈ చిత్రకథ. హీరో గీతానంద్ నాకు తెలుగు డైలాగ్స్ పలకడంలో సహాయపడ్డారు. దర్శకుడు చంద్రశేఖర్ కూడా హెల్ప్ చేశారు. నాకు ఆయన తెలుగు చెబితే, నేను ఆయనకు హిందీ చెప్పాను (నవ్వుతూ). ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించగలగడం నా బలం. అలాగే ఎవరైనా బాగా నవ్వించినప్పుడు ఆ నవ్వును తొందరగా ఆపుకోలేను. అది నా బలహీనత. హిందీలో డబ్ అయిన చాలా తెలుగు సినిమాలు చూశాను. నాని, నాగచైతన్యల నటన అంటే ఇష్టం. హీరోయిన్స్‌లో సమంత, రకుల్‌ప్రీత్ సింగ్ ఇంకా హెబ్బా పటేల్ తెలుసు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘టీవీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉండదు. నేను లైంగిక వేధింపులను ఎదుర్కొనలేదు. మహిళలు వేధింపులు ఎదుర్కొన్న వెంటనే స్పందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నా భావన. ప్రస్తుతం ‘దిక్సూచి’ అనే సినిమాలో నటిస్తున్నాను. వేరే ఏ ప్రాజెక్ట్ కమిట్ కాలేదు’’ అన్నారు. -
రొటీన్‌గా ఉండదు
‘‘నేను పుట్టింది గుంటూరులో. పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోని నానమ్మ వద్దే. చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. కథలు చెప్పడమంటే ఇంకా ఇష్టం. నాకు తోచిన విషయాలని స్నేహితులకు కథలుగా చెప్పేవాణ్ణి’’ అని హీరో గీతానంద్ అన్నారు. గీతానంద్, చాందినీ భగ్వానాని జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రథం’. వినోద్ సమర్పణలో రాజగురు ఫిలింస్ పతాకంపై రాజా దారపునేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా గీతానంద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్న సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు పొందలేదు. సినిమాలపై ఇష్టంతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్, ‘నక్షత్ర’ అనే వెబ్ సిరీస్ చేశా. డైరెక్టర్‌గా అవకాశం రాకపోవడంతో నటనలో శిక్షణ తీసుకున్నా. నేను, చంద్రశేఖర్ కానూరి ఓ కథ అనుకున్నాం. ‘పంతం, తెలిసి తెలియక’ సినిమాలు ప్రారంభించినా మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత చంద్రశేఖర్ కానూరి ‘రథం’ కథ చెప్పారు. నిర్మాత రాజాగారు మాకు ఓ వెలుగులా తోడవడంతో ఈ సినిమా పూర్తయింది. ఈ చిత్రంలో నేను రైతుగా నటించా. అన్ని ఎలిమెంట్స్ ఉన్న చక్కటి ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాలో డీప్ రొమాన్స్ కథలో భాగంగానే ఉంటుంది. ఇది రొటీన్ సినిమాలా ఉండదు. మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
అందరూ కొత్తవాళ్లతో...
గీత్ ఆనంద్, చాందినీ భగ్వానాని జంటగా చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రథం’. వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను నిర్మాత నవీన్ ఎర్నేని, మోషన్ పోస్టర్‌ను డైరెక్టర్ బి.గోపాల్, సాంగ్ టీజర్‌ను సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ విడుదల చేశారు. చిత్ర నిర్మాత రాజా దారపునేని మాట్లాడతూ– ‘‘అందరూ కొత్తవాళ్లతో చేసిన చిత్రమిది. ఈ ఏడాది ‘రథం’ బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను. సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేయనున్నాం. చంద్రశేఖర్ మంచి హార్డ్‌వర్కర్. రూపాయికి పది రూపాయల అవుట్‌పుట్ ఇచ్చే వ్యక్తి. భవిష్యత్‌లో పెద్ద డైరెక్టర్ అవుతాడు’’ అన్నారు. ‘‘సినిమా విజయంపై మంచి అంచనాలతో ఉన్నాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు చిత్ర సమర్పకులు వినోద్. ‘‘సినిమా అంటే ప్యాషన్ ఉన్న టీమ్‌తో పనిచేశాను. రిలీజ్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు గీత్ ఆనంద్. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ ముత్యాల, సంగీతం: సుకుమార్ పమ్మీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నివాశర్మ. -
సిక్కోలుకు సత్యదేవుడు
ధర్మ ప్రచారానికి తరలిన ప్రచార రథం నేటి నుంచి జిల్లాలో వివిధ పట్టణాల్లో పర్యటన అన్నవరం : సత్యదేవుని ధర్మ ప్రచారరథం బుధవారం శ్రీకాకుళం జిల్లాకు బయల్దేరింది. రత్నగిరిపై ఈ ప్రచార రథానికి అన్నవరం దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు జెండా ఊపి పర్యటనను ప్రారంభించారు. ఈ ప్రచారరథం శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, పాలకొండ, వీరఘట్టం, కొత్తూరు, పాతపట్నం, కోరసవాడ, తుంబూరు, సారవకోట, శ్రీముఖ లింగం, నర్సరావుపేట, శ్రీకాకుళం, తదితర పట్టణాలలో ఈ నెల రెండో తేదీ నుంచి పర్యటించనుందని ఈఓ తెలిపారు. ప్రచారరథంలోని సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల దర్శనం, వీలున్న చోట స్వామి, అమ్మవార్ల శాంతికల్యాణాలు కూడా నిర్వహిస్తారని ఆయన తెలిపారు. -
శ్రీమఠం.. భక్తజనసంద్రం
మంత్రాలయం : అధ్యాత్మిక కేంద్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠం భక్తజనమయమైంది. శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం నుంచి కాలినడకన భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీమఠం క్షేత్రం భక్తజనులతో కళకళలాడింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు భక్తజన సందోహం మధ్య చెక్క, వెండి, బంగారు, స్వర్ణ రథాలపై రమణీయంగా ఊరేగారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు శనివారమే వేలాదిగా తరలివచ్చి రాఘవేంద్రుల సేవలో తరించారు. మంచాలమ్మ, రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, శ్రీమఠం ప్రాంగణంలో భక్తజనులతో కనువిందు చేశాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ..ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
హేమారెడ్డి మల్లమ్మ చైతన్యరథయాత్ర ప్రారంభం
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివ శరణి హేమారెడ్డి మల్లమ్మ చైతన్య రథయాత్ర ప్రారంభమైంది. సోమవారం జగద్గురు పీఠాధిపతి పండితారాధ్య శ్రీచెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ , కర్ణాటక రాష్ట్ర టెక్స్టైల్స్, దేవాదాయశాఖ మంత్రి రుద్రప్ప మనప్ప లుమాని, దేవస్థానం ఈఓ నారాయణభరత్ గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి రథాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో రథయాత్ర నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీశైలంలో ప్రారంభమైన చైతన్య రథయాత్ర కర్ణాటక రాష్ట్రంలో మీదుగా కూడళ సంగమం చేరుకుంటుందని పేర్కొన్నారు.