అనంతపురం జిల్లా హనకనహాళ్‌లో రాములోరి రథానికి నిప్పంటించిన దుండగులు
సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం
మంటలు వస్తుండటం గమనించి ఆర్పేసిన గ్రామస్తులు
అప్పటికే సగం కాలిపోయిన రథం
ఇది ముమ్మాటికీ టీడీపీ వాళ్ల పనేఅంటున్న గ్రామస్తులు
పోలీసుల అదుపులో ఇద్దరు కీలక వ్యక్తులు
వ్యవహారం టీడీపీకి చుట్టుకోకుండా పెద్దల మంతనాలు
సాక్షి టాస్‌్కఫోర్స్: గుళ్లు, రథాలు వాళ్లే ధ్వంసం చేస్తారు.. గిట్టని వారిపై ఆ నింద వేస్తారు. వాళ్లే అపచారాలు చేస్తారు.. ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తారు. ఆలయాల ప్రతిష్టను వాళ్లే మంటగలుపుతారు.. ఎదుటి పక్షం వారికి నేరం అంటగడతారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ పెద్దల తీరిది. నాటి గోదావరి పుష్కరాలు మొదలు.. నేటి తిరుమల లడ్డూ వరకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాషీ్టకాలివి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని దుష్ప్రచారం చేసి, ప్రజల్లో చులకనవుతున్న టీడీపీ పెద్దలను.. ఆ వివాదం నుంచి గట్టెక్కించడానికి ఆ పార్టీ నేతలు మరో ఘాతుకానికి తెరలేపారు.'
ఇందుకు అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ రామాలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. సుమారు మూడున్నర వేల మంది జనాభా ఉన్న ఈ ఊళ్లో ఏటా శ్రీరామనవమి పర్వదినాన శ్రీ సీతారాముల వారిని ఊరేగించే రథానికి నిప్పు పెట్టించారు. ఈ నెపాన్ని ప్రత్యర్థులపై వేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలని విఫలయత్నం చేసినా, ఈ దుర్మార్గానికి పాల్పడింది టీడీపీ వారేనని గ్రామమంతా కోడై కూస్తుండటంతో తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు.
స్థానికుల కథనం మేరకు.. హనకనహళ్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి, శ్రీరామాలయాలు ఊరి నడి»ొడ్డున పక్కపక్కనే ఉన్నాయి. ఈ ఊళ్లో ప్రజలు శ్రీరామనవమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు సీతారాముల వారిని రథంపై ఊరేగిస్తారు. అనంతరం రథాన్ని ఆలయం పక్కనే ఉన్న షెడ్డులో ఉంచుతారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఇద్దరు వ్యక్తులు షెడ్డు తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. రథంపై పెట్రోల్ చల్లి నిప్పంటించారు.
ఎదురింటిలో ఉండే అనసూయమ్మ అదే సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు రావడంతో రథమున్న షెడ్‌లో నుంచి మంటలు రావడం గమనించింది. వెంటనే ఆమె.. తన మామ ఎర్రిస్వామికి విషయం చెప్పింది. ఆయన ఇరుగు పొరుగు వారిని నిద్ర లేపి మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సగం రథం కాలిపోయింది. అలజడి రేగడంతో ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలంతా ఆలయం వద్దకు తరలివచ్చారు.
కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో ఘటన స్థలానికి చేరుకున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, పలువురు పోలీసు, దేవదాయ శాఖ అధికారులు ఘటన స్థలాన్ని సందర్శించారు. కాగా, దుండగులిద్దరూ టీడీపీకి చెందిన వారని, ఉద్దేశ పూర్వకంగానే రథానికి నిప్పుపెట్టినట్లు పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు.
ముమ్మాటికీ ఇది టీడీపీ పనే..
ఈ ఘటనలో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. వీరిద్దరే కీలకమని భావిస్తున్నారు. అయితే వీరిద్దరినే అదుపులోకి తీసుకుంటే అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని, మరో ముగ్గురిని కూడా అనుమానితులుగా చూపుతూ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో టీడీపీ వారిని తప్పించి అమాయకులను బలి చేయాలని చూస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. కాగా, ఈ ఇద్దరితో ఈ దుర్మార్గ పని చేయించిన వారెవరో కూడా స్పష్టం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, రాములోరి రథం దగ్ధం ఘటనలో బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. మంగళవారం ఉదయం వారు సంఘటన స్థలాన్ని సందర్శించి.. కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, ఆర్డీఓ రాణీసుస్మితను అడిగి వివరాలు తెలుసుకొన్నారు.
అనంతరం కలెక్టర్, ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు స్పష్టమవుతోందని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఆలయాల వద్ద, ఆలయాల పరిసర ప్రాంతాల్లో రథాలున్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
సమగ్రంగా దర్యాప్తు చేయండి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా కణేకల్ మండలం హనకనహాల్‌లో రాములోరి రథం దగ్ధం కావడంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. అగంతకులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులకు సీఎం సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment