శ్రీమఠం.. భక్తజనసంద్రం
మంత్రాలయం : అధ్యాత్మిక కేంద్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠం భక్తజనమయమైంది. శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం నుంచి కాలినడకన భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీమఠం క్షేత్రం భక్తజనులతో కళకళలాడింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు భక్తజన సందోహం మధ్య చెక్క, వెండి, బంగారు, స్వర్ణ రథాలపై రమణీయంగా ఊరేగారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు శనివారమే వేలాదిగా తరలివచ్చి రాఘవేంద్రుల సేవలో తరించారు. మంచాలమ్మ, రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, శ్రీమఠం ప్రాంగణంలో భక్తజనులతో కనువిందు చేశాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ..ఏర్పాట్లు పర్యవేక్షించారు.