mantralayam
-
సింధనూరు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ఫ్రాంతి
గుంటూరు, సాక్షి: కర్ణాటక రాయ్‌చూర్ జిల్లా సింధనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థులు మరణించడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ఫ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారాయన. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా...వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నాను అని తన ప్రకటనలో పేర్కొన్నారాయన. In a tragic incident near Sindhanur taluk in #Raichur district, four people lost their lives when a vehicle carrying devotees overturned.The victims include three students from the Mantralayam Sanskrit School—Ayavandan (18), Sujendra (22), and Abhilash (20)—along with the… pic.twitter.com/ze2dALIfk1— South First (@TheSouthfirst) January 22, 2025మంగళవారం రాత్రి మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి బయల్దేరారు. అక్కడ నరహరి తీర్థుల ఆరాధనకు 14 మంది విద్యార్థులతో వాహనం బయల్దేరింది. ఈ క్రమంలో సింధనూరు సమీపంలో వాహనం బోల్తాపడింది. డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
పుట్టింటి గోవు.. ఆ ఇంటికి ఆదరువు
కుమార్తెకు పెళ్లిచేస్తే.. తోడుగా గోవును సాగనంపడం కొన్ని కుటుంబాల్లో ఆచారం. ఆస్తిపాస్తులు లేని గ్రామీణ పేదలు ఇలా గోవును కట్నంగా సమర్పించుకోవడం ఆనవాయితీ. ఆ నూతన వధూవరులిద్దరూ కట్నంగా వచ్చిన గోవును వరంగా భావించి.. దానిలోనే మహాలక్ష్మిని చూసుకున్నారు.పుట్టింటి కానుకతో మెట్టినింట కాసుల పంటగా మలుచుకున్నారు. ఆ గోవుతో ఏకంగా 150 ఆవుల పాడిని సృష్టించారు. నలుగురు పిల్లల పెళ్లిళ్లు మంద ఆదాయంతోనే కానిచ్చారు. కరువు సీమలో ఒక్క ఆవుతో కరువును జయించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది అయ్యమ్మ, వీరారెడ్డి కుటుంబం. – మంత్రాలయంఆ ఇంట అదే కామదేనువుకర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఎరిగేరి గ్రామానికి చెందిన మూకయ్య, బంగారమ్మ దంపతుల పెద్ద కుమార్తె అయ్యమ్మ. ఆమెకు 18వ ఏట కోసిగి గ్రామానికి చెందిన కామన్‌దొడ్డి వీరారెడ్డితో వివాహం నిశ్చయించారు. మూకయ్య స్థోమతకు తగ్గట్టు అయ్యమ్మకు కట్నంగా గోవును ఇవ్వాలని నిర్ణయించి సుమారు 30 ఏళ్ల క్రితం పెళ్లి బాజాలు మోగించారు. అప్పగింతల రోజున తండ్రి మూకయ్య ఓ పెయ్యి ఆవును అయ్యమ్మకు ఇచ్చి భర్తతో మెట్టినింటికి సాగనంపాడు. అయ్యమ్మ, వీరారెడ్డి అనుబంధం వరకట్నంగా వచ్చిన ఆవుతోనే మొదలైంది. గోవునే వరలక్ష్మిగా భావించి.. కూలీనాలి చేసుకుంటూ ఆ దంపతులిద్దరూ గోవును పెంచుకున్నారు. తొలి చూడిలోనే అది మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది. ఇలా ఏడాదికి రెండు ఆవుల చొప్పున జన్మించగా.. పుట్టిన ఆవుల సంతతిని విక్రయించకుండా కుటుంబ పోషణకు వనరుగా ఆ దంపతులు మలచుకున్నారు. కూలి పనులు మానేసి పశువులను పోషించుకుని కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ వచ్చారు. ఇలా 30 ఏళ్లలో ఆవుల సంతతి 150కి పెరిగింది. వారింట అడుగుపెట్టిన గోవు సుమారు 16 ఏళ్ల క్రితం మరణించగా.. దాని సంతతి మాత్రం ఇప్పటికీ వృద్ధి చెందుతూనే ఉంది.వలసబాట పట్టకుండా..ఏటా వయసు మళ్లిన ఆవులు, దూడలను విక్రయిస్తూ అయ్యమ్మ, వీరారెడ్డి దంపతులు బాగానే కూడబెడుతున్నారు. ఏటా 10 టన్నులకు పైగా ఆవు పేడను సైతం రైతులకు విక్రయిస్తూ ఆదాయం గడిస్తున్నారు. ప్రస్తుతం ఈ దంపతుల వద్ద 50 గోవులు ఉన్నాయి. కోసిగి ప్రాంతం కరువుకు ప్రసిద్ధి. ఇక్కడ వ్యవసాయ పనులు ముగియగానే ప్రజలంతా ఇతర ప్రాంతాలకు వలసపోతుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి బతుకు బండి నడుపుకుంటారు. ఏటా ఎంత లేదన్నా 15 వేల కుటుంబాలకు పైగా ఇక్కడి నుంచి వలస వెళ్తారు. అయితే, అయ్యమ్మ కుటుంబం ఏ ఒక్కరోజు వలసబాట పట్టలేదు. పాడితో కరువును జయించడం ఎలాగో అయ్యమ్మ కుటుంబానికి చూస్తే బోధపడుతుంది.ఊపిరి ఉన్నంత వరకు వదలనుమా అయ్యకు మేం ఐదుగురు కూతుళ్లం. నేను పెద్ద కూతుర్ని. మా నాన్న ఓ ఆవును కట్నంగా ఇచ్చాడు. తోబుట్టువులు నలుగురికి ఒక్కో ఆవును కట్నంగా ఇచ్చాడు. నేను అదే ఆవుతోనే జీవితం ఆరంభించాను. ఊపిరి ఉన్నంతవరకు పాడి పోషణను వదలను. నేను తనువు చాలించినా పాడిని వదల పెట్టవద్దని నా పిల్లలకు చెబుతాను. గోవులు లేకుంటే మా బతుకు ఎలా ఉండేదో ఊహించలేను. – కామన్‌దొడ్డి అయ్యమ్మ, కోసిగిఎప్పుడూ ఇబ్బంది పడింది లేదుఅత్తమామలు ప్రేమతో ఆవును కట్నంగా ఇచ్చారు. దానిని మేం దైవంగా స్వీకరించాం. ఆవు పోషిస్తూ పాడిని పెంచాం. ఏనాడూ పాడి పోషణలో విసుగు చెందలేదు. ఇబ్బంది పడింది కూడా లేదు. ఇద్దరం పాడిని చూసుకుంటూ సంసారం కొనసాగించాం. మేం ఇప్పటివరకు కరువును చూడలేదు. ఇక్కడి నుంచి ఎంతోమంది వలసపోతున్నారు. మేం మాత్రం ఏ రోజూ వెళ్లలేదు. మా మామ మూకయ్య నేటికీ మా ఆదర్శ జీవనంపై ఆనందం వ్యక్తం చేస్తాడు. – కామన్‌దొడ్డి వీరారెడ్డి, కోసిగిపైసా అప్పు లేకుండా పెళ్లిళ్లుఅయ్యమ్మ, వీరారెడ్డి దంపతులకు రాముడు, ఈరయ్య, వీరభద్ర, మహేష్, కుమార్తె రామేశ్వరమ్మతో కలిపి ఐదుగురు సంతానం. పెద్ద కుమారుడు రాముడికి 20వ ఏట వివాహం జరిపించారు. ఆ పెళ్లికి రూ.30 వేలు ఖర్చు కాగా.. మందలో కొన్ని దూడలను విక్రయించి గట్టెక్కారు. రెండో కొడుకు ఈరయ్యకు 21వ ఏట వివాహం జరిపించగా.. రూ.50 వేలు ఖర్చయ్యింది. దీంతో కొన్ని ఆవులు, దూడలను విక్రయించారు. మూడో కొడుకు వీరభద్ర పెళ్లికి రూ.1.50 లక్షలు ఖర్చు కాగా.. అందుకు కూడా లేగ దూడలను అమ్మి శుభకార్యం జరిపించారు. నాలుగో కుమారుడు మహేష్‌కు రెండేళ్ల క్రితం వివాహం చేయగా.. రూ.3 లక్షలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని కూడా కొన్ని దూడల్ని విక్రయించి సొమ్ము సమకూర్చుకున్నారు. ఇక ఒక్కగానొక్క కూతురు రామేశ్వరమ్మకు సంబంధాలు వెతుకుతున్నారు. -
టీడీపీ శ్రేణుల బరితెగింపు.. కర్రలు, కారంతో అటాక్
-
కర్నూలు : మంత్రాలయంలో వైభవంగా రాఘవేంద్రుడి మహారథోత్సవం (ఫొటోలు)
-
Mantralayam: తిరుగులేని నేతగా బాలనాగిరెడ్డి
మంత్రాలయం: యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి తిరుగులేని నేతగా నిరూపించుకున్నారు. మంత్రాలయం నియోజకవర్గం నుంచి నాల్గవ సారి సైతం విజయ బావుటా ఎగురవేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నటుడు బాలకృష్ణ ప్రచారం చేసినా టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి గట్టెక్కలేకపోయారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం నుంచి మొత్తం 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వై.బాలనాగిరెడ్డి, టీడీపీ అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి మధ్య ప్రధాన పోటీ సాగింది. మంత్రాలయం నియోజకవర్గంలో మొత్తం 2,08,350 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు, 1,02,155 మంది, మహిళలు 1,06,172 మంది , ఇతరులు 23 మంది ఉన్నారు. అందులో 1,76,077 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 84.51 శాతం పోలింగ్ నమోదైంది. కర్నూలు జిల్లా కేంద్రంలోని రాయలసీమ యూనివర్సిటీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి. విశ్వనాథ్ నేతృత్వంలో ఓట్ల లెక్కింపు సాగింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి కౌటింగ్ మొదలైంది. 17 రౌండ్ల గణన ప్రక్రియ జరిగింది. మొదటి రౌండ్లో టీడీపీ 341 ఓట్ల మెజార్టీతో బోణీ చేసుకుంది. తక్కిన రౌండ్లలో వైఎస్సార్ సీపీ ఆధిక్యత కొనసాగించింది. 17వ రౌండ్ ముగిసిన సమయానికి 12,805 ఓట్ల మెజార్టీతో బాలనాగిరెడ్డి విజయం సాధించారు. మంత్రాలయం నుంచి విజయం సాధించిన వై. బాలనాగిరెడ్డికి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్. రాఘవేంద్ర రెడ్డికి 74,857 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి మురళీ కృష్ణంరాజుకు 4,660 ఓట్లు , బీఎస్పీ అభ్యర్థి గుడిపి సామేల్‌కు 3589 ఓట్లు, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి ఆర్. రాఘవేంద్ర రెడ్డికి 608 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు ఎం. రాఘవేంద్ర రెడ్డికి 624 ఓట్లు, కె. నాగిరెడ్డికి 353 ఓట్లు, సి. పరమేష్‌కు 297 ఓట్లు , నోటాకు 2,674 ఓట్లు వచ్చాయి. -
లోకేష్ చేపట్టింది యువ గళం పాదయాత్ర కాదు.. యమ గళం
-
రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డుల ప్రదానోత్సవం
కర్నూలు/మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి గొప్ప తత్వవేత్త,మానవతావాది,కలియుగ కామధేను అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కొనియాడారు.. గురువారం సాయంత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం 352 వ ఆరాధనోత్సవాల్లో భాగంగా మఠం ఆవరణలో రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో విశిష్ట వ్యక్తులుగా పేరు గాంచిన ప్రముఖులకు రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ సమక్షంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట వ్యక్తులు ఎన్.చంద్రశేఖరన్, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, ముంబై, విద్వాన్ రామ విఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, ఎంఐటి వరల్డ్ పీస్ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వనాథ్ డి.కరడ్, పూణే గార్లకు రాష్ట్ర గవర్నర్ సమక్షంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ చేతుల మీదుగా రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ శ్రీ రాఘవేంద్ర స్వామి మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారని, భక్త ప్రహ్లాద అవతారంగా భావిస్తారని పేర్కొన్నారు. తుంగ భద్రా తీరంలో వెలిసిన మంత్రాలయం ప్రముఖ పుణ్య క్షేత్రం అని ప్రశంసించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. వ్యాస తీర్థ స్కీం, అన్నదాన స్కీం, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, ప్రాణదాన స్కీం, గోరక్షణ కేంద్రం వంటి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం సర్వ జన శాంతి పీఠం అని గవర్నర్ కొనియాడారు. శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందిన ప్రముఖులను ఈ సందర్భంగా గవర్నర్ అభినందించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం అందచేశారు. సన్మాన గ్రహీతలు చేస్తున్న సేవలను అభినందించారు. అవార్డులు అందుకున్న ప్రముఖులు ప్రసంగిస్తూ, శ్రీ రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్తి అవార్డులు పొందడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వీర వెంకట శ్రీశానంద, శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ పూర్వాశ్రమ తండ్రి ఎస్.గిరియాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అది వైఎస్సార్సీపీ ఘన చరిత్ర.. సంక్షేమానికి బంగారు బాట -
మంత్రాలయంలో వెలవెలబోతున్న తుంగభద్ర
సాక్షి, కర్నూలు: మంత్రాలయంలో తుంగభద్ర నది వెలవెలబోతుంది. నీళ్లు లేక భక్తులు స్నానాలకు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీమఠం అధికారులు తూతూ మంత్రంగా షవర్లు ఏర్పాటు చేశారు. మురుగునీటితో నిండిన తుంగభద్ర.. దుర్వాసన వెదజల్లుతుంది. కాగా, శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు అంగరవైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం విశ్వమోహనుడిని దర్శించుకుంటున్నారు. బుధవారం శ్రీమఠంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వేకువజాము నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలుత రాఘవేంద్రుల మూల బృందావనికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, పంచామృతాభిషేకాలు చేశారు. స్వామి బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే రాఘవేంద్రుల బృందావన ప్రతిమను బంగారు పల్లకీలో ఊరేగించారు. పూజామందిరంలో స్వామిజీ మూలరామ, వేదవ్యాసుల పూజోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చదవండి: మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు -
మంత్రాలయంలో వారం రోజుల పాటు ఆరాధన మహోత్సవాలు
మంత్రాలయం: భక్తకోటి కల్పతరువు శ్రీరాఘవేంద్రస్వామి. సశరీరంగా చింతామణి సదృశ్యులైన స్వామి వారి 352వ ఆరాధన సప్త రాత్రోత్సవ మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వారం రోజుల పాటు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఆరాధనోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. శ్రీరాఘవేంద్ర స్వామి ప్రశస్థి అవార్డులు అందుకోవడానికి ప్రముఖులు మంత్రాలయం రానున్నారు. ఏపీ రాష్ట్ర గవర్నర్ నజీర్.. పూర్వారాధన వేడుకల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఉత్సవాల నేపథ్యంలో వేదభూమి మంత్రాలయం విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతోంది. పూర్తయిన ఏర్పాట్లు ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి శ్రీమఠం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల వసతి కోసం హెచ్ఆర్బీ, భూ, దుర్గారమణ, నరహరి, పద్మనాభ డార్మెటరీలు, పాత పరిమళ విద్యానికేతన్ పాఠశాలలను కేటాయించారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు 50 మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. నదిలో నీటి కొరత దృష్టా పుణ్య స్నానాలకు వంద షవర్లు ఏర్పాటు చేశారు. మఠం సీఆర్ఓ, ప్రధాన ముఖధ్వారం, మఠం ప్రాకారం, అన్నపూర్ణ భోజనశాల దారిలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆరు లక్షల పరిమళ ప్రసాదాలు తయారు చేశారు. మహా రథోత్సవం సందర్భంగా హెలికాప్టర్ నుంచి పూలవాన కురిపించనున్నారు. అవార్డుల ప్రదానం ఆనవాయితీలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. పూర్వారాధన రోజున ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రాలయం రానున్నట్లు సమాచారం. విద్వాన్ రామవిఠలాచార్య, శతావధాని గరికపాటి నరసింహారావు, టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్, ఎంఐటీ శాంతి యూనివర్సిటీ వ్యవస్థాపకులు డా.విశ్వనాథ్‌కు రాయరు అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయనున్నారు. మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు. వేడుకల నిర్వహణ ఇలా.. ● మంగళవారం రాయరు ఉత్సవాలు ప్రారంభోత్సవంలో భాగంగా ధ్వజారోహణ, ధాన్యపూజ, రజిత మంటపోత్సవం, గో, గజ, తురగ పూజలు చేస్తారు. ● బుధవారం శాఖోత్సవం, రజత మంటపోత్సవం ఉంటుంది. ● గురువారం పూర్వారాధన సందర్భంగా రజత సింహ వాహనోత్సవం నిర్వహిస్తారు. ● శుక్రవారం మధ్యారాధన సందర్భంగా రాఘవేంద్రుల బృందావనానికి మహా పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్ర సమర్పణ ఉంటుంది. గజ, రజత, స్వర్ణ రథోత్సవాలు ఉంటాయి. ● శనివారం ఉత్తరారాధన సందర్భంగా మహా రథోత్సవం, వసంతోత్సవం జరుపుతారు. ● ఆదివారం శ్రీ సుజ్ఞానేంద్ర తీర్థుల ఆరాధన, అశ్వ వాహనోత్సవం ఉంటుంది. ● సోమవారం సర్వ సమర్పణోత్సవంలో భాగంగా బంగారు పల్లకీ, చెక్క, వెండి, బంగారు రథోత్సవాలు ఉంటాయి. -
చదువంటే ప్రాణం.. కన్న కలలు తీరకుండా.. కన్న పేగును చూసుకోకుండానే..
సాక్షి, మంత్రాలయం: ఆ తల్లి కన్న కలలు తీరకుండా తీరని లోకాలకు వెళ్లింది. కనులారా కన్న పేగును చూసుకోకుండానే కన్నుమూసింది. పేగు తెంచుకుని పుట్టిన నవజాత శిశువు (బాబు) సైతం క్షణాల్లోనే ఊపిరి వదిలాడు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కలచివేసింది. మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన పెద్ద దస్తగిరి, భీయమ్మ కూతురు చాంద్‌బీని పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన దస్తగిరికి ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేశారు. చదువుపై మక్కువ ఉండటంతో చాంద్‌బీ పత్తికొండ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ కోర్సు రెండో సంవత్సరం చదువుతోంది. తొలి కాన్పు కోసం పుట్టిల్లు రచ్చమర్రికి వచ్చింది. గురువారం చాంద్‌బీకి నొప్పులు మొదలు కావడంతో ఆదోనికి తీసుకెళ్లారు. అక్కడ సాధారణ కాన్పు జరిగింది. అయితే కాన్పు సమయంలో బ్లడ్ ప్రెజర్ (బీపీ) పెరిగి శిశువుకు పురుడు పోయగానే భయంతో ప్రాణాలు కోల్పోయింది. శిశువు సైతం మూడు నిమిషాల వ్యవధిలోనే ఊపిరి వదిలాడు. మొదటి కాన్పులోనే ఇద్దరు మృత్యువాత పడటంతో ఇంటిల్లిపాది శోక సంద్రంలో మునిగారు. చదవండి: (20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు
పుణె: 43 ఏళ్ల వ్యక్తి ప్రియురాలికి న్యాయం చేయాలంటూ ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ప్రభత్వ ప్రధాన కార్యాలయం అయిన మంత్రాలయ భవనం వద్ద చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు సదరు వ్యక్తి సేఫ్టి నెట్లో పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపన కథనం ప్రకారం....బీడు జిల్లాకు చెందిన బాపు నారాయణ మోకాషి తన గర్లఫ్రెండ్‌కి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం పై నుంచి దూకేశాడు. అతని గర్లఫ్రెండ్ అత్యాచారానికి గురైందని, ఆ తర్వాత ఆమె అవమానంతో 2018లో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి సదరు వ్యక్తి తన ప్రియురాలికి న్యాయం జరగాలంటూ పోలీస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఐతే పోలీసులు సరిగా దర్యాప్తు జరపకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. అదీగాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్‌ని కలిసి ఈ విషయం చెప్పి న్యాయం చేయాలని అభ్యర్థించేందుకు నవంబర్ 17 గురువారం మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. ఐతే క్యాబినేట్ సమావేశం ఉండటంతో బాపుకి షిండేని కలిసే అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై అతను మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయం ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. అక్కడ సేఫ్టి నెట్ ఉండటంతో అతను స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #Maharashtra: प्रेमिका को न्याय दिलाने के लिए प्रेमी ने लगाई छठी मंजिल से छलांग, नेट पर गिरने से बची जान#Mantralaya #Mumbai #WATCH #viralvideos2022 pic.twitter.com/c8dsn5Aufd — VDTV Bharat (@vdtv_bharat) November 18, 2022 (చదవండి: కాలేజీ ర్యాగింగ్‌లో వికృతక్రీడ.. స్టూడెంట్ పైశాచికత్వం!) -
వనపర్తి–మంత్రాలయం మధ్య నేషనల్ హైవే!
సాక్షి, హైదరాబాద్: వనపర్తి నుంచి గద్వాల మీదుగా మంత్రాలయానికి కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త జిల్లా కేంద్రమైన వనపర్తికి నేరుగా ఏ జాతీయ రహదారి అనుసంధానం లేదు. అలాగే గద్వాల నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయానికి సరైన రోడ్డు మార్గం లేదు. ఇప్పుడు వనపర్తిని గద్వాలతో అనుసంధానిస్తూ.. అక్కడి నుంచి మంత్రాలయానికి నాగులదిన్నె మీదుగా జాతీయ రహదారి నిర్మించే ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది. తెలంగాణ జాతీయ రహదారుల విభాగం నుంచి అందిన ప్రతిపాదనలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ పరిశీలిస్తోందని.. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల నుంచి ఏపీలోని మంత్రాలయానికి వెళ్లాలంటే.. కర్నూలు మీదుగా ప్రయాణిస్తున్నారు. అదే కొత్త హైవే ఏర్పాటై గద్వాల నుంచి ఐజా మీదుగా వెళ్తే దాదాపు 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. నాలుగు రహదారుల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ వచ్చే రెండేళ్లలో తెలంగాణలో నాలుగు జాతీయ రహదారులను విస్తరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సంవత్సరమే పనులు ప్రారంభం కానున్నాయి. మెదక్–ఎల్లారెడ్డి మధ్య 43.9 కిలోమీటర్ల రోడ్డును రూ.399.01 కోట్లతో రెండు వరసలు, పేవ్డ్ షోల్డర్స్‌తో.. ఎల్లారెడ్డి–రుద్రూరు మధ్య 37.28 కిలోమీటర్ల మార్గాన్ని రూ.499.88 కోట్లతో రెండు వరసల రోడ్డుగా విస్తరించనున్నారు. ఇక ఖమ్మం–కురవి మధ్య 37.43 కిలోమీటర్ల రోడ్డును రూ.455.76 కోట్లతో, ఆదిలాబాద్–బేల మధ్య 32.97 కిలోమీటర్ల రోడ్డును రూ.490.92 కోట్లతో విస్తరించనున్నారు. ఈ రోడ్ల నిర్మాణంతో తెలంగాణలోని మెదక్, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో మెరుగైన రోడ్ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
పెళ్లయిన వ్యక్తితో సహజీవనం.. కారులో మంత్రాలయం వచ్చి..
సాక్షి, మంత్రాలయం రూరల్: మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. నిద్రమాత్రల పొడి తాగి ప్రేమజంట ఆత్మహత్యకు ప్రయత్నించగా వ్యక్తి మృతి చెందాడు. మహిళ చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఏరేడు మండలం ఉల్వలపాడు గ్రామానికి చెందిన వేణు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విష్ణుప్రియ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. బుధవారం రాత్రి కారులో మంత్రాలయం చేరుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వెంట తెచ్చుకున్న నిద్రమాత్రల పొడిని నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గురువారం ఉదయం విష్ణుప్రియ అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంటుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగుచూసింది. అక్కడ పడిఉన్న వేణు (32)ను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విష్ణుప్రియను 108 ద్వారా ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. వేణు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి భార్య సాయిప్రతిష, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విష్ణుప్రియ గత కొద్ది రోజులుగా కనిపించడం లేదని దర్శి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదై విచారణలో ఉంది. ఈ మేరకు దర్శి పోలీసుల సమక్షంలో విష్ణుప్రియను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చదవండి: (డేటింగ్ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు) -
కుప్పకూలిన ప్రభుత్వం.. బోసిపోయిన శివసేన కార్యాలయాలు
సాక్షి, ముంబై: మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోవడం, ఆ తర్వాత శివసేన తిరుగుబాటు నేత షిండే ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టడం ఊహించని విధంగా అతి తక్కువ సమయంలో చోటుచేసుకున్నాయి. కానీ, నాటకీయ పరిణామాల మధ్య చోటు చేసుకున్న ఈ తతంగంవల్ల మంత్రాలయలో ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రుల కార్యాలయాలు, చాంబర్లు, శివసేన శాఖలు నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా మారిపోయాయి. ఉద్ధవ్ ఠాక్రే బుధవారం రాత్రి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మంత్రాలయలో తమ చాంబర్లలో, కార్యాలయాలలో ఉన్న ఫైళ్లు, వ్యక్తిగత లగేజీ సర్దుకుని తమ తమ నివాస బంగ్లాలకు వెళ్లిపోయారు. కొత్త ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మంత్రులు ఇంకా కొలువుదీరకపోవడంతో మంత్రాలయ పూర్తిగా బోసిపోయింది. ఇటు పాత మంత్రులు లేక అటు కొత్తమంత్రులు కొలువు దీరకపోవడంతో కార్యాలయాలు, చాంబర్లు ఖాళీగా కనిపించాయి. ముఖ్యం గా మంత్రాలయలో మంత్రులెవరు లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఐదో, ఆరో అంతస్తులో ఇదివరకు కనిపించిన సందర్శకుల సందడి ఇప్పుడు కనిపించడం లేదు. మంత్రాలయలో ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నతాధికారులు, క్లర్క్‌లు, కిందిస్థాయి ఉద్యోగులు మాత్ర కనిపిస్తున్నారు. కానీ, ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు, ప్యూన్లు, డ్రైవర్లు, వారి కార్లు కనిపించకుండా పోయాయి. ఎప్పుడూ మంత్రులు, వారిని కలిసేందుకు వచ్చే ప్రముఖ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల, సంస్థల ప్రముఖులు, సామాన్య ప్రజల రాకపోకలతో బిజీగా చదవండి: ప్రియమైన ఉపముఖ్యమంత్రి గారూ.. మీరు చాలా గ్రేట్! శివసేన కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి దాదాపు 55 ఏళ్ల కిందట హిందూ హృదయ్ సామ్రాట్ బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ ఇప్పుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో రెండుగా చీలిపోయింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో శివసేన పార్టీ కార్యాలయాలు, నగరంలో అక్కడక్కడున్న వందలాది శాఖలు నిర్మానుష్యంగా మారిపోయాయి. శాఖలు, స్థానిక కార్యాలయాల్లో శివసేన మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పదాధికారులు కూర్చుండేవారు. అక్కడికి వచ్చే సామాన్య ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్, షిండే వర్గాలుగా చీలిపోవడంతో ఏ కార్యాలయం, ఏ శాఖ ఎవరి అధీనంలోకి వస్తుంది? ఎవరు సొంతం చేసుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. షిండే తిరుగుబాటు చేయడంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. దీంతో పార్టీ కార్యాలయం, శాఖలో ఎక్కడ చూసిన ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. మొన్నటివరకు పార్టీ కార్యాలయాల ఎదుట షిండేకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన శివసైనికులు ఇప్పుడు పత్తాలేకుండా పోయారు. ప్రస్తుతం రాజకీయ వాతావరణం వేడిగా ఉండటంతో అందరు ఇళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. దీనికి తోడు నగరంలో అనేక చోట్ల, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. శివసేన కార్యకర్తలు ఇళ్ల నుంచి బయట పడకపోవడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చని అంటున్నారు. -
15 ఏళ్ల క్రితం వివాహం.. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని
సాక్షి, మంత్రాలయం రూరల్(కర్నూల్): అనుమానం పెనుభూతంగా మారి భార్యను ఓ భర్త హతమార్చాడు. ఈ ఘటన మాధవరం తండా గ్రామంలో వెలుగు చూసింది. స్థానికులు, మాధవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గోవిందనాయక్ వంట మాస్టారుగా పనిచేస్తున్నాడు. ఈయనకు విజయాబాయితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయాబాయిని(35) గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, గోవిందునాయక్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చదవండి: టీడీపీ కార్యకర్తల వీరంగం.. పెట్రోల్ బంక్‌పై దాడి -
మంత్రాలయంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
-
రికార్డులలో పేర్లున్నాయ్ కానీ.. ఊళ్లు లేవ్
చరిత్ర పుటల్లో చెదరని చరితం ఆ గ్రామాల సొంతం. భౌతికంగా అక్కడ ఊళ్లు లేకపోయినా రికార్డుల్లో చిరునామాలు మాత్రం ఉన్నాయి. గతంలో అక్కడ ప్రజలు నివసించే వారని చెప్పేందుకు ఆనవాలుగా శిథిల గోడలు, బావులు, గ్రామ చావిడిలు దర్శనమిస్తున్నాయి. ఇదీ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలోని ఈచనహాల్, గుర్రాలదొడ్డి, కాటదొడ్డి, కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం, కలవలగుండు, పుట్టకుంట, పెండేకల్లు, ఎండపల్లి గ్రామాల పరిస్థితి. దొంగల బెడదతో.. కౌతాళం–ఉరకుంద గ్రామ రోడ్డులో ఈచనహాల్ గ్రామం ఉండేది. ఒకప్పుడు దాదాపు 40 కుటుంబాలు ఆ ఊళ్లో నివాసం ఉండేవి. గ్రామం వంకను ఆనుకుని ఉండటం.. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేకపోవడంతో రాత్రిళ్లు దొంగలు ఇళ్లలో ప్రవేశించి విలువైన వస్తువులు అపహరిస్తుండేవారట. దొంగల బెడద భరించలేక అక్కడ ఉన్న కుటుంబాలు ఓబుళాపురం, కామవరం, కౌతాళం గ్రామాలకు వలస వెళ్లి పోయారు. బంగారమ్మవ్వ, ఆంజనేయస్వామి ఆలయాలు, శిథిలమైన గ్రామచావిడి, రాతి బావి ఇప్పటికీ గ్రామానికి సాక్షీభూతంగా నిలిచాయి. రెవెన్యూ రికార్డులలో 816 ఎకరాల సాగుభూమి ఈచనహాల్ గ్రామ పంచాయతీ పేరుపైనే ఉండటం విశేషం. ఈచనహాల్ గ్రామానికి చెందిన గ్రామ చావిడి (శిథిలస్థితిలో) పట్నం బాటలో పెండేకల్లు కోసిగి మండల కేంద్రానికి ఈశాన్య దిశగా పెండేకల్లు ఉండేది. చాలా కాలం క్రితం దాదాపు 35 కుటుంబాలు అక్కడ నివాసం ఉండేవి. ఏళ్ల క్రితం నుంచి ఒక్కొక్కరు మండల కేంద్రానికి వలసబాట పట్టారు. కోసిగిలో వారిని పెండేకల్లు ఇంటిపేరుతోనే ఇప్పటికీ పిలుస్తున్నారు. దాదాపు 150 కుటుంబాలు కోసిగిలో ఉన్నాయి. గ్రామ గుర్తుగా పెండేకల్లు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గ్రామానికి సంబంధించి రెవెన్యూ రికార్డులో 1423.16 ఎకరాల సాగుభూమి ఉంది. వరద పోటుతో.. కౌతాళం మండలంలో తుంగభద్ర నది ఒడ్డున ఒకప్పుడు కాటదొడ్డి, గుర్రాలదొడ్డి ఉండేవి. ఏళ్ల క్రితం గుర్రాలదొడ్డి పూర్తిగా కనుమరుగైంది. ఆ పక్కనే ఉన్న కాటదొడ్డిలో 20 కుటుంబాలకుపైగా ఉండేవి. వరద పోటుకు కుటుంబాలన్నీ గుడికంబాలి, కుంభళనూరు గ్రామాలకు వలస వెళ్లాయి. రెవెన్యూ రికార్డుల్లో 418 ఎకరాలు సాగుభూమి కాటదొడ్డి గ్రామం పేరుపైనే ఉంది. గుర్రాలదొడ్డి గ్రామం పేరుపై ఎలాంటి ఆస్తులు లేవు. కోసిగి మండలంలోని బాత్ర బొమ్మలాపురం ప్రస్తుత ఆర్డీఎస్ ఆనకట్టను ఆనుకుని ఉండేది. వరదల కారణంగా ఊరంతా కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. కొందరు అగసనూరు, సాతనూరు, కందకూరు గ్రామాల్లో స్థిరపడ్డారు. బాత్ర బొమ్మలాపురం పేరుపై 600 ఎకరాల భూములు రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఉన్నాయి. గ్రామం గుర్తుగా మారెమ్మ ఆలయం మాత్రం దర్శనమిస్తుంది. ప్లేగు వ్యాధి కారణంగా.. ప్లేగు వ్యాధి కారణంగా ఎన్నో పల్లెలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతోంది. ఈ కోవలోనే కోసిగి మండలం కలవలగుండు, పుట్టకుంట, ఎండపల్లి గ్రామాలు కనుమరుగైనట్లు పెద్దలు పేర్కొంటున్నారు. కలవలగుండు గ్రామంలో 574.95 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రస్తుతం పొలాలు పల్లెపాడు, చింతకుంట, పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్నారు. కలవలగుండు ప్రాంతంలో సుంకులమ్మ ఆలయం, కొండపై, కింద భాగాల్లో రాతి రోళ్లు ఉన్నాయి. కోసిగి మండలం అర్లబండ, కడదొడ్డి గ్రామాల మధ్యలో పుట్టకుంట అనే గ్రామం ఉండేది. అంతుచిక్కని వ్యాధి కారణంగా కుటుంబాలు అర్లబండ బాట పట్టాయి. కోసిగి మండలం దుద్ది గ్రామం దక్షిణ దిశగా ఎండపల్లి గ్రామం ఉండేదట. శతాబ్దాల క్రితమే గ్రామం కనుమరుగై పోయింది. దుద్ది, కోసిగి గ్రామాల్లో ఎండపల్లి వాసులు నివాసం ఉంటున్నారు. కొందరు ఎండపల్లి ఇంటి పేరుగా కొనసాగుతున్నారు. ప్లేగు వచ్చి ఊరు వదిలారు నా పేరు శివారి గజ్జయ్య. మాది కోసిగి మండలం పల్లెపాడు గ్రామం. మా గ్రామానికి దక్షిణ దిక్కున నాలుగు తరాల క్రితం కలవలగుండు అనే ఊరు ఉండేదని మా పెద్దలు చెప్పేవారు. ఇప్పటికీ ఆ గ్రామం ఆనవాలుగా బండరాళ్లపై రోళ్లు, పాడుబడిన గోడలు ఉన్నాయి. అక్కడే సుంకులమ్మ ఆలయం, కొంత దూరంలో ఆంజనేయస్వామి విగ్రహాలున్నాయి. అప్పట్లో ప్లేగు వచ్చి ఊరు ఖాళీ అయ్యిందట. మా ముత్తాతల నాడే వలస నా పేరు గోపాలు. మా ముత్తాతలు ఈచనహాల్ నుంచి కౌతాళం మండల కేంద్రానికి వచ్చారట. అందుకే మా ఇంటి పేరు ఈచనహాల్గా మారిందట. దోపిడీ దొంగల బెడద కారణంగా మా ముత్తాతలు ఊరిని వదిలేసి వచ్చారని చెబుతారు. ఇప్పటికీ మాకు ఆ గ్రామ పొలిమేరలోనే రెండు ఎకరాల భూమి ఉంది. వరదలకు ఊరు ఖాళీ నా పేరు ఈరన్న. మాది కాటదొడ్డి గ్రామం. గ్రామంలో గతంలో 20 కుటుంబాలకుపైగా ఉండేవారు. గతంలో వరదలకు ఊరు ముంపునకు గురి కావడంతో కుటుంబాలన్నీ కుంబళనూరుకు మారాయి. ఆంజనేయస్వామి గుడి ఉండటంతో పూజారులుగా మా మూడు కుటుంబాలు ఇక్కడే ఉండిపోయాం. -
వైభవం.. రాఘవేంద్రుల ఆరాధనోత్సవం
మంత్రాలయం రూరల్/తిరుమల: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని గురురాఘవేంద్ర స్వామివారి 350వ ఆరాధన మహోత్సవ వేడుకలు మంగళవారం కన్నుల పండువగా సాగాయి. స్వామి వారు బృందావన ప్రవేశం చేసిన శుభ దినాన వేదభూమి పులకించింది. నవరత్న రథంపై ఊరేగిన రాఘవేంద్రులు భక్తులకు కనువిందు చేశారు. ఆనవాయితీలో భాగంగా టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత శ్రీ రాఘవేంద్రస్వామి వారికి వెంకన్న పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా పట్టువస్త్రాలను గ్రామ దేవత మంచాలమ్మ సన్ని«ధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలోత్సవ మండపంలో పట్టువస్త్రాలను ఉంచి ఊంజల సేవ చేపట్టారు. వాటిని శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి అలంకరించి విశేష పూజలు గావించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి టీటీడీ అదనపు ఈవో «ధర్మారెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతకు శ్రీ రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫలమంత్రాక్షితలను ఇచ్చి ఆశీర్వదించారు. కాగా, ఈ నెల 21న ప్రారంభమైన స్వామి వారి ఆరాధన మహోత్సవాలు 27తో ముగియనున్నాయి. -
ఏపీలో 1,200 కోట్లతో ఎంఎస్ఏఎఫ్ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ తయారీలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రీస్ (ఎంఎస్ఏఎఫ్) కొత్తగా అత్యాధునిక స్టీల్ ప్లాంటును నెలకొల్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద 4 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. ఇందుకోసం సంస్థ రూ.1,200 కోట్లు పెట్టుబడి చేస్తోంది. తద్వారా 1,800 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్లాంటు సిద్ధమవుతుందని కంపెనీ డైరెక్టర్ గౌతమ్ గనెరివాల్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఇప్పటికే సంస్థకు తెలంగాణ, ఏపీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు. వీటి సా మర్థ్యం 2021లో 2.5 లక్షల మెట్రిక్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం సంస్థలో 8,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. గ్రూప్ టర్నోవర్ రూ.2,100 కోట్లు. కంపెనీ నుంచి కొత్త ఉత్పాదన.. ఎంఎస్ఏఎఫ్ కొత్తగా ఎంఎస్ లైఫ్ 600 ప్లస్ పేరుతో భూకంపాలను తట్టుకునే టీఎంటీ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. సొంతంగా తామే దీనిని అభివృద్ధి చేశామని, ఇటువంటి ఉత్పాదన దేశంలో తొలిసారి అని కంపెనీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు. హైదరాబాద్ సమీపంలోని తూప్రాన్ వద్ద ఉన్న ప్లాంటులో తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ లైఫ్ 600, ఏఎఫ్ స్టార్ 500–డి పేరుతో స్టీల్ ఉత్పత్తులను దక్షిణాదిన 750 చానెల్ పార్ట్నర్స్ ద్వారా కంపెనీ విక్రయిస్తోంది. గంగవరం, కృష్ణపట్నం పోర్టు, హైదరాబాద్, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయాలు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు స్టీల్‌ను సరఫరా చేసింది. -
తుంగభద్ర పుష్కరాలు..సీఎం జగన్‌కు ఆహ్వానం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న తుంగభద్ర పుష్కరాలను కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ప్రారంభించాలంటూ సీఎం జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించిన మఠం ప్రతినిధులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. (చదవండి : సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు) -
మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ పి.తిక్కారెడ్డి అరెస్ట్
ఎమ్మిగనూరు రూరల్: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పి.తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లిక్కర్ పరిశ్రమ కోసం రూ.12 కోట్ల విలువైన వరి ధాన్యం తీసుకొని డబ్బు చెల్లించకపోవటంతో బాధితుడు సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు పెట్టినట్లు తెలిసింది. -
ఉత్కంఠ రేపుతున్న శ్రీమఠం ‘కరెన్సీ’ కథ
సాక్షి, మంత్రాలయం : కరెన్సీ కథ మలుపులు తిరుగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు సమస్య జటిలం కావడంతోపాటు ఉత్కంఠను రేపుతోంది. ఈనెల 18న రాఘవేంద్రస్వామి మహారథోత్సవం సందర్భంగా పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు రూ.100 కరెన్సీ నోట్లు విసరడంతో మొదలైన వివాదం ఆజ్యం పోసుకుంటోంది. నోట్లు విసిరి తొక్కిసలాటకు కారకులైన మఠాధీశులపై కేసు నమోదు చేయాలంటూ సీఐ కృష్ణయ్యకు 22న మంత్రాలయానికి చెందిన వి.నారాయణ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం మఠం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టాలని ఉదయం నుంచి సాయంత్రం వరకు మల్లగుల్లాలు పడి చివరకు మిన్నకుండిపోయారు. మఠం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పీఠాధిపతిపై కేసు నమోదుకు ఫిర్యాదు చేయడం ఇదే ప్రథమం. అయితే పీఠాధిపతిపై ఫిర్యాదు చేసిన నారాయణపై కేసు నమోదు చేయాలంటూ కోడుమూరుకు చెందిన అనిల్‌శర్మ అనే అర్చకుడు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం సాయంత్రం కర్నూలులో ఓఎస్డీ రామాంజనేయులుకు ఫిర్యాదు చేయగా మంత్రాలయం స్టేషన్‌కు ఎండార్స్ చేశారు. శనివారం అనిల్ శర్మ తన సహచరులతో కలిసి వచ్చి ఎస్ఐ మధుసూదన్‌కు ఫిర్యాదు అందజేశారు. పీఠాధిపతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, గతంలోనూ పీఠాధిపతి పట్ల అనుచిత వాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఉండగా నారాయణ సైతం మరోమారు స్టేషన్ మెట్లెక్కారు. కొందరు మఠం ఉద్యోగులు శుక్రవారం తనపై అనుచిత వాఖ్యలు చేయడమే గాకుండా ఇంటిని ముట్టడిస్తామని చర్చించారని ఎస్ఐకి ఫిర్యాదు చేశాడు. ముగ్గురు ఉద్యోగుల నుంచి తనకు హాని ఉందని వారి పేర్లు, ఫోన్‌నంబర్లు ఎస్ఐకి అందజేశాడు. ఇలా ఫిర్యాదుల పర్వంతో కరెన్సీ కథ రక్తి కట్టిస్తోంది. రోజురోజుకు మలుపులు తిరుగుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఎంత వరకు ఈ వ్యవహారం దారి తీస్తుందో వేచిచూద్దాం.. ఇది చదవండి : నోట్లు విసిరిన మంత్రాలయం మఠాధీశులు.. తీవ్ర వివాదం -
ఫ్లెక్సీల ఏర్పాటుపై ఆలయాల మధ్య గొడవ
సాక్షి, మంత్రాలయం : అత్యుత్సాహమో.. అనాలోచితమో తెలియదుగానీ ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో శ్రీమఠం, ఆదోని మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆలయం మధ్య వార్ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆరాధన వేడుకల మునుపు స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం ప్రాంగణంలో ఇనుప బోర్డుపై ఆదోని మహాయోగి లక్ష్మమ్మవ్వ ఫ్లెక్సీ ప్రదర్శించారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా అవ్వ ఫ్లెక్సీని తొలగించి రాములోరి, పీఠాధిపతుల ఫ్లెక్సీ వేశారు. ఉత్సవాలు ముగియడంతో భక్తులు అవ్వ ఫ్లెక్సీ తెచ్చి గురువారం పాత బోర్డుపై అతికించారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు సన్నిహితుడు గోరుకల్లు కృష్ణస్వామి చూసి ఏర్పాటును అడ్డుకున్నారు. ఇరువురు మధ్య కాసేపు చర్చలు జరిగాయి. అంతటితో ఆగకుండా శ్రీమఠం వారు రాత్రికి రాత్రి ఆ ఫ్లెక్సీని తొలగించేశారు. ఉదయానికంతా రాములోరి, పీఠాధిపతి ఫ్లెక్సీని ప్రదర్శించి రంగులు సైతం అద్దారు. ఈ క్రమంలో ఇరు ఆలయాల మధ్య కాసింత రగడ మొదలైంది. ఎవరికైనా దేవుళ్లు సమానమే. దీనికి విరుద్ధంగా శ్రీమఠం కొత్త సంప్రదాయానికి తెరతీయడంపై స్థానికులు విస్తుపోతున్నారు. ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందోనని మంత్రాలయంలో చర్చసాగుతోంది.. -
నోట్లు విసిరిన మంత్రాలయం మఠాధీశులు.. తీవ్ర వివాదం
సాక్షి, మంత్రాలయం : కరెన్సీ నోట్లు విసరడం శ్రీమఠంలో దుమారమే రేపుతోంది. మఠాధీశులను మొదలు అధికారులను ఓ కుదుటున కూర్చోనివ్వకుండా చేస్తోంది. అనుకోని పరిణామాలతో ఆందోళన రేకెత్తించింది. ఊహించని రీతిలో వి.నారాయణ అనే భక్తుడు పీఠాధిపతి సబుదేంద్రతీర్థులపై కేసు నమోదు చేయాలంటూ స్టేషన్ మెట్లు ఎక్కడం.. ఈ వార్త కర్ణాటక, ఆంధ్ర మీడియాల్లో హైలెట్ కావడంతో మఠంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావుడి నెలకొంది. ఉదయం పీఠాధిపతికి మద్ధతుగా టీడీపీ నాయకులు ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత మఠం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సాయంత్రం ఏకమై భారీ ర్యాలీ చేపట్టాలని పిలుపు నిచ్చారు. ఈ మేరకు వందలాది మంది నాయకులు, అనునయులు మఠంలోనే తిష్ట వేసి పరిస్థితిపై మల్లాగుల్లాలు చేశారు. నాయకులు, అధికారులు చర్చించుకున్న తర్వాత సీఐ కృష్ణయ్యను పిలిచి కేసు విషయంపై ఆరా తీశారు. ఆందోళన చేయడంతో సమస్య మరింత జఠిలంగా మారే అవకాశం ఉందని ఆయన సూచించినట్లు సమాచారం. సాయంత్రం సంఘం నాయకులు ఇంజినీర్ సురేష్ కోనాపూర్ సూచన మేరకు ఉద్యోగులు, సంభావణ కార్మికులు ర్యాలీకి సమాయత్తమవుతున్న తరుణంలో అనుకోకుండా బ్రేక్ వేశారు. పీఠాధిపతి సూచన మేరకు ఆందోళన విరమించుకున్నట్లు ఉద్యోగులకు తెలపడంతో అందరూ గమ్మున ఇంటి ముఖం పట్టారు. ఫిర్యాదు దారుడిపై రివర్స్ కేసుకు యోచన 18 వ తేదీన రాఘవేంద్రుల మహారథంపై నుంచి పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు రూ.100 కరెన్సీ నోట్లు విసరడంతో కాస్త తొక్కిసలాట జరిగింది. దీనికి కారకులైన పీఠాధిపతిపై కేసు నమోదు చేయాలని స్థానిక భక్తుడు వి.నారాయణ గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం అధికారులు, సన్నిహితులతో కలిసి పీఠాధిపతి మంతనాలు చేశారు. నారాయణపై రివర్స్ కేసు పెట్టాలని యోచించారు. విషయాన్ని పెద్దది చేయడం ఎందుకని సూచించడంతో పీఠాధిపతి రివర్స్ కేసు అంశాన్ని వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏది ఏమైనా అనుకోని సంఘటన దుమారం రేగడంతో మఠంలో ఉత్కంఠ నెలకొంది. ఇంకా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
రాఘవేంద్రా.. ఇదేమిటి?
సాక్షి, మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి సశరీరంగా బృందావనస్తులైన పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం. రాఘవేంద్రులు కొలువై మహిమలతో వివిధ ఖండాల్లోనూ భక్తుల మదిని దోచారు. అంతటి ప్రశస్థి కలిగిన క్షేత్రంలో గతమెన్నడూ లేని విధంగా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భక్తుల సొమ్మును దిగమింగుతున్నారన్న ఆరోపణలు మొదలు.. పీఠాధిపతి తీరుపై సైతం విమర్శలు వచ్చాయి. గతంలో టీడీపీ ఇన్చార్జిగా ఉన్న పాలకుర్తి తిక్కారెడ్డి లెటర్ ప్యాడ్‌పై పీఠాధిపతిగా సుబుదేంద్రతీర్థులు అనర్హుడంటూ సీఎం చంద్రబాబుకు లేఖ ఇచ్చారు. అదే సమయంలో మఠంలో ఇంజినీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్న ఈఈ సురేష్ కోనాపూర్, మరో ఇంజినీర్ బద్రి, అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని స్థానిక భక్తుడు వి.నారాయణ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుల నేపథ్యంలో దేవదాయశాఖ కమిషనర్ భ్రమరాంబ విచారణ చేపట్టారు. ఫిర్యాదు దారులను పిలిపించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ప్రస్తుతం విచారణ రిపోర్టు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్దే ఉండిపోయింది. పీఠాధిపతిపై కేసు నమోదుకు ఫిర్యాదు.. అసలే ఉద్యోగులు ఆదాయానికి మించి ఆస్తుల కూడబెట్టారని ఆరోపణలు శ్రీమఠానికి కొంత మచ్చ తెచ్చాయి. ఈ గాయం నుంచి తేరుకోక ముందే శ్రీమఠంపై మరో పిడుగుపడింది. ఈసారి ఏకంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు రావడం విశేషం. ఈనెల 19న రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాల్లో భాగంగా మహారథోత్సవం నిర్వహించారు. రథయాత్ర ప్రారంభానికి ముందు రథంపై నుంచి పీఠాధిపతి రూ.100 కరెన్సీ నోట్లు విసిరారు. ఆ సమయంలో భక్తులు ఒక్కసారి నోట్ల కోసం ఎగబడ్డారు. ఈ సందర్భంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కుంటుంబ సభ్యులతోపాటు, కొందరు భక్తులు తూలిపడిపోయారు. తొక్కిసలాట చోటుచేసుకుంది. విచక్షణ మరిచి నోట్లు విసిరిన పీఠాధిపతిపై చట్ట పరంగా కేసు నమోదు చేయాలని గురువారం మంత్రాలయానికి చెందిన భక్తుడు వి.నారాయణ స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అంతటా చర్చ.. యాదృచ్ఛికమో.. లేక మెప్పులో భాగమో తెలీదుగానీ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు కరెన్సీ విసరడం చర్చనీయాంశమైంది. తొక్కిసలాట ఇరు రాష్ట్రాల్లోనూ పెద్ద దుమారమే రేపింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని భక్తులు పేర్కొంటున్నారు. శ్రీమఠం చరిత్రలో ఎన్నడూ ఎరుగని రీతిలో పీఠాధిపతిపైనే కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో దావానలంలా పాకింది. -
తాగొచ్చా..ఐతే ఏంటి?!
సాక్షి, మంత్రాలయం(కర్నూలు) : ‘ఔను..నేను తాగొచ్చా. ఐతే ఏంటి?! నన్నెవ్వరూ ఏమీ చేయలేరం’టూ ఓ ఆర్టీసీ డ్రైవర్ చిందులు తొక్కాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మంత్రాలయంలో చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ21జడ్ 0772 నంబర్ గల బస్సు (సర్వీస్ నం 6513) సోమవారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లేందుకు మంత్రాలయం చేరుకుంది. ఎమ్మిగనూరు డిపోలో బస్సు బయలుదేరే సమయంలో డ్రైవర్ కృష్ణకు బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు చేసి పంపించారు. అయితే.. అతను మార్గమధ్యంలో మద్యం సేవించి బస్సును తీసుకుని మంత్రాలయం చేరుకున్నాడు. మంత్రాలయం నుంచి హైదరబాద్‌కు బస్సు బయలుదేరే సమయంలో మద్యం వాసన వస్తుండటంతో ప్రయాణికులు నిలదీశారు. మద్యం సేవించినట్లు అతను ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఎమ్మిగనూరు డీఎం దృష్టికి ప్రయాణికులు తీసుకెళ్లడంతో అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపారు. కాగా..మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కృష్ణ ప్రయాణికులతో దురుసుగా మాట్లాడాడు. -
మత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి బాలనాగిరెడ్డి రోడ్ షో
-
మంత్రాలయంలో ‘‘తిక్క’’ చేష్టలు..
సాక్షి, మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి చేష్టలు శ్రుతిమించాయి. ఆయన తీరు కారణంగా మంత్రాలయం మండలం ఖగ్గల్ గ్రామంలో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తిక్కారెడ్డి గన్మెన్లు అత్యుత్సాహం ప్రదర్శించి.. ఫైరింగ్ చేయడంతో ఆయనతో పాటు ఏఎస్ఐకి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ముందస్తు వ్యూహంలో భాగంగా ఎన్నికల ప్రచార నిమిత్తం తిక్కారెడ్డి అనుచరులతో కలిసి శనివారం ఉదయం 8.30 గంటలకు ఖగ్గల్ గ్రామం చేరుకున్నారు. ఎన్నికల కోడ్‌ను తుంగలో తొక్కుతూ అంగన్వాడీసెంటర్ ఎదుట టీడీపీ జెండాను ఎగురవేశారు. తర్వాత గ్రామ వీధుల్లో ప్రచారం ముగించుకుని మళ్లీ అంగన్వాడీ కేంద్రం వద్దకే వచ్చి కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఐదేళ్లలో తమ గ్రామం వైపు రాలేదని, ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని, పైగా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా జెండా ఎలా ఎగురవేస్తారంటూ కొందరు యువకులు నిలదీశారు. అదే సమయంలో గ్రామానికి ప్రచారం నిమిత్తం వచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు కూడా అంగన్వాడీ సెంటర్ వద్దకు సమీపించారు. వారు మామూలుగానే వస్తుండగా.. తిక్కారెడ్డి గన్‌మెన్ శ్రీనివాసులు మాత్రం ఆవేశంతో ఊగిపోతూ గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. బెంబేలెత్తిన ఇరువర్గాలతో పాటు గ్రామస్తులు కేకలు వేశారు. దీంతో శ్రీనివాసులు మరింత రెచ్చిపోయాడు. మరో గన్‌మెన్ ఆర్.విజయ్‌కుమార్‌తో కలిసి గాల్లోకి, నేలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తిక్కారెడ్డి ఎడమ కాలి మోకాలి పైభాగంలోనూ, ఏఎస్ఐ వేణుగోపాల్ కుడి కాలికి గాయాలయ్యాయి. దారి మళ్లించి గ్రామ ప్రవేశం వ్యూహంలో భాగంగా తిక్కారెడ్డి ముందుగా మంత్రాలయం చేరుకున్నారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రాలయం మండలం సౌలహళ్లి గ్రామానికి ప్రచారానికి వెళ్తున్నట్లు చెప్పి, కోసిగి మీదుగా ఐరన్‌గల్లు నుంచి ఖగ్గల్ గ్రామం చేరుకున్నారు. వెళ్లే సమయంలో ఎవరూ విలేకరులు రావద్దంటూ తన అనుకూల మీడియాను వెంటేసుకుని వెళ్లారు. గ్రామంలో అలజడి సృష్టించాలనుకుని.. ఎన్నికల కోడ్‌ను సైతం ఉల్లంఘించి అంగన్వాడీ కేంద్రం ఎదురుగా పార్టీ జెండాను ఎగుర వేశారు. గ్రామస్తులకు ఇష్టం లేకున్నా వీధుల్లో పర్యటించారు. కాగా.. ఉద్రిక్తత నేపథ్యంలో ఆదోని డీఎస్పీ వెంకటరాముడు నేతృత్వంలో పోలీసు బలగాలను గ్రామంలో మోహరించారు. ఆరుగురు సీఐలు, 12 మంది ఎస్ఐలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు గ్రామం చేరుకున్నారు. టీడీపీ నాయకుడు సురేష్‌నాయుడు ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే సతీమణి జయమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మురళీరెడ్డి, భీమిరెడ్డి, పలువురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. తిక్కారెడ్డిపై ఫిర్యాదు పాలకుర్తి తిక్కారెడ్డి, అనుచరులు ఖగ్గల్ గ్రామ చావిడిలో కూర్చున్న యువకులను పిలిచి టీడీపీకి ఓటేయాలని అడిగారు. గ్రామానికి ఏ పనీ చేయనందున తాము వేయబోమని అయ్యప్ప, అనుమంతు, సురేంద్ర అనే యువకులు చెప్పారు. దీంతో తిక్కారెడ్డితో పాటు టీడీపీ నాయకులు మాధవరం రాజశేఖర్‌రెడ్డి, గుడిసె శివన్న, గోతులదొడ్డి సరేష్నాయుడు, బూదూరు మల్లికార్జునరెడ్డి, రామాంజి, మంత్రాలయం యేబు యువకులపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు అయ్యప్ప మాధవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన తిక్కారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆర్వో మోహన్‌దాసుకు వైఎస్సార్సీపీ నాయకులు అత్రితనయగౌడ్, బెట్టనగౌడ్, వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ‘కొడకల్లారా’ అంటూ ... ఉద్రిక్తత పరిస్థితుల్లో సహనం పాటించాల్సిన గన్‌మెన్ శ్రీనివాసులు ‘కొడకల్లారా.. కాల్చి పాడేస్తా’నంటూ రెచ్చిపోయాడు. అలా అంటూ కొన్ని క్షణాల్లోనే తుపాకీ తీసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పుల్లో గన్మెన్లిద్దరూ 13 రౌండ్లు పేల్చినట్లు డీఎస్పీ వెంకటరాముడు తెలిపారు. సంఘటన ప్రాంతంలో ఎనిమిది ఖాళీ బుల్లెట్లు కనిపించాయి. మిగతా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. కాల్పుల్లో గాయపడి కింద పడగానే తిక్కారెడ్డి కూడా ‘కొడకల్లారా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు అందుకున్నారు. కాల్పుల్లో గాయపడిన ఇరువురిని హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. గన్మెన్ల సస్పెన్షన్ కర్నూలు : మంత్రాలయం మండలం ఖగ్గల్ గ్రామంలో శనివారం జరిగిన ఘటనలో ప్రైవేటు వ్యక్తులు ఎవరూ కాల్పులు జరపలేదని పోలీసు విచారణలో తేలింది. అక్కడి ఘటనపై కేసు నమోదు చేసి.. ఆదోని డీఎస్పీ వెంకటరాముడితో ఎస్పీ ఫక్కీరప్ప విచారణ చేయించారు. కాల్పులు జరపాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో అత్యుత్సాహం ప్రదర్శించి కాల్పులు జరిపిన గన్మెన్లు క్రమశిక్షణ ఉల్లంఘించడమే కాక నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినట్లు తేలడంతో ఏఆర్ పీసీలు ఎం.సి.శ్రీనివాసులు (నం.1414), ఆర్.విజయ్‌కుమార్(నం.805)లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఫక్కీరప్ప ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖలో విధుల పట్ల అలసత్వం వహించి..క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. దుష్ప్రచారం సరికాదు వైఎస్సార్సీపీ నాయకులు కాల్పులు జరపడంతోనే తిక్కారెడ్డి గాయపడినట్లు దుష్ప్రచారం చేయడం సరికాదని వై.బాలనాగిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. వేటకొడవళ్లు, గన్లతో దాడి చేశారని తిక్కారెడ్డి టీవీల్లో చెప్పడం హాస్యాస్పదమన్నారు. నిజాలు తెలుసుకోకుండా మంత్రి లోకేష్ సైతం ట్విట్టర్లో పేర్కొనడం విడ్డూరకరమన్నారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేసుకుంటే తాము అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. జనాలకు ఇష్టం లేకున్నా.. కోడ్‌ను కాదని ఇలాంటి ప్రచారాలకు యత్నించడం బాధాకరమన్నారు. జనాలను రెచ్చగొట్టడంతో పాటు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలన్న ఉద్దేశంతోనే గ్రామాల్లోకి వచ్చి హల్చల్ చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతలెవ్వరూ అధైర్య పడవద్దన్నారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణులకు దూరంగా ఉండి ప్రశాంతతకు సహకరించాలని కోరారు. – వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే -
కగ్గల్లులో కాల్పుల కలకలం
-
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గన్‌మెన్ కాల్పులు
సాక్షి, కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం కగ్గల్లులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి శనివారం ఉదయం ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ సమయంలో తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయన గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. -
తెలుగుదేశం పార్టీలో భగ్గుమన్న అసమ్మతి
సాక్షి, మంత్రాలయం: తెలుగుదేశం పార్టీలో అసమ్మతి సెగ భగ్గుమంది. ప్రాధాన్యత విషయంలో అలకలు రోడ్డెక్కి కూత పెట్టాయి. తీరు మార్చుకో లేకపోతే మద్దతుకు దూరంగా ఉంటామంటూ నినదించాయి. ఎన్నికల నేపథ్యంలో మంత్రాలయం టీడీపీలో సీనియర్ నేతలు అలకబూనారు. కోసిగి మండల కన్వీనర్ పెండ్యాల ఆదినారాయణశెట్టి, మాజీ సర్పంచు ముత్తురెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామకృష్ణ, నాయకులు పల్లెపాడు రామిరెడ్డి, నర్సారెడ్డి, సొట్టయ్య, సాతనూరు మాజీ సర్పంచు మారెప్ప, నేతృత్వంలో కార్యకర్తలతో తిరుగుబావుట ఎగరేశారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడంలో టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి కినుక వహిస్తున్నారంటూ రోడ్డెక్కారు. గురువారం కోసిగి మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆదినారాయణశెట్టి ఇంటి నుంచి ఎల్లెల్సీ అతిథి గృహం వరకు మౌన ర్యాలీ నిర్వహించారు. అక్కడ నేతలు మాట్లాడుతూ నియోజకవర్గంలో తిక్కారెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తూ సీనియర్ నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇతర పార్టీ నుంచి పార్టీలో చేరిన కొత్త నాయకులకు ప్రాధాన్యత కల్పిస్తూ పాత క్యాడెర్‌కు అన్యాయం చేస్తున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరిన కోసిగి ఆంజనేయస్వామి ట్రస్టుబోర్డు చైర్మన్ నాడిగేని అయ్యన్నకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం సరికాదన్నారు. పార్టీ కార్యాలయం ప్రారంభానికి సైతం తమను పిలవకుండా చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొత్త ముఖాలకు లభిస్తున్న ప్రాధాన్యం పార్టీలో తమకు లేదని మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే ఎన్నికల్లో తమ సహాయ సహకారాలు ఉండబోవని తేల్చి చెప్పారు. పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నా తిక్కారెడ్డి మూలంగా సరైన గుర్తింపు లేకపోయిందన్నారు. ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసి ఇళ్లకే పరిమిత మవుతామన్నారు. ఎల్లెల్సీ అతిథి గృహంతో సమావేశమైన విషయాన్ని తెలుసుకున్న తిక్కారెడ్డి అక్కడికి చేరుకున్నారు. పాత నాయకుల గోడు విని చూస్తాం చేస్తామన్నారు. అయితే లెక్కలేని విధంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ నన్ను నిందించడం సరికాదన్నారు. ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేస్తే బాగుంటుందని హెచ్చరిక దోరణిలో సూచించారు. తర్వాత నాయకులు రాసుకున్న అసమ్మతి పత్రం ఆయనకు అందజేశారు. -
రైతు కుటుంబాలకు రేణుదేశాయ్ పరామర్శ
మంత్రాలయం/ఆలూరు: రైతాంగ సమస్యలపై అధ్యయనం కోసం సినీనటి రేణుదేశాయ్ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. స్థానిక ఎస్వీబీ అతిథిగృహంలో బస చేసిన ఆమె ఉదయాన్నే.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆత్మహత్యకు కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితులు తెలుసుకుంటారు. ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన నెరణికి రామయ్య దంపతులు గతేడాది ఆగస్టులో, అదే ఏడాది డిసెంబర్ 25న పెద్దకడబూరుకు చెందిన పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ ఇవాళ ఉదయం తుంబళబీడు, మధ్యాహ్నం పెద్దకడబూరులో పర్యటించనున్నారు. ఆమె పర్యటనపై సాక్షి టీవీలో లైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా రైతు సమస్యలను ఇతివృత్తంగా ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు గతంలో రేణు దేశాయ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆమె తాజాగా దర్శకురాలుగా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. అందుకోసం రేణు దేశాయ్ స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్‌ప్లే వర్క్ కూడా పూర్తి అయింది. ఇక 2014లో డైరెక్టర్‌గా ’ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించిన రేణు దేశాయ్.... ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులోనూ డబ్ చేశారు. -
మంత్రి తమ్ముడా.. మజాకా!
మంత్రాలయం: అధికారం ఉంటే ఎలాంటి మర్యాదైనా అలా నడిచివస్తుందేమో! మంత్రి తమ్ముడి రాకతో ఇక్కడి రెవెన్యూ అధికారులు రాచమర్యాదలు చేశారు. అడుగడుగునా వంగి వంగి దండాలు పెట్టారు. అడిగిన వెంటనే స్వామి దర్శనంతో పాటు పీఠాధిపతి ఆశీర్వచనాలూ అందజేయించారు. ఆఖరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి ఫొటోగ్రాఫర్లుగానూ మారిపోయారు. మండల మేజిస్ట్రేట్ మొదలు ఇద్దరు వీఆర్వోలు ‘తమ్ముడి’ సేవలో తరించారు. ఈ దృశ్యం చూసి భక్తులంతా ముక్కున వేలేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తమ్ముడు మురళీ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చారు. రెవెన్యూ అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించి.. దగ్గరుండి ‘తమ్ముడి’ సేవలో తరించారు. విడిది కోసం వసతి మొదలు పీఠాధిపతి ఆశీర్వచనం వరకు దగ్గరుండి చేయించారు. తహసీల్దార్ చంద్రశేఖర్, వీఆర్వోలు జనార్దన్‌రావు, భీమయ్య వారి సేవల్లో తరించారు. గ్రామ దేవత మంచాలమ్మ, శ్రీరాఘవేంద్రస్వామి దర్శనం, పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల ఆశీర్వచనాలు రాచమర్యాదలతో చేయించారు. ప్రసాదాల పార్శిళ్లతో పాటు ఆశీర్వచన ఫల, పూల మంత్రాక్షింతలు, శేషవస్త్రాలను రెవెన్యూ అధికారులే మోసుకుని ప్రదక్షిణ చేశారు. శ్రీమఠంలో చివరికి కుటుంబ సభ్యుల ఫొటోలు తీయడానికి వీఆర్వో జనార్దన్‌రావు ఫొటోగ్రాఫర్‌గా మారిపోయారు. మంత్రులు వస్తే ఇవ్వాల్సిన ప్రొటోకాల్ వారి తమ్ముళ్లకు సైతం లభిస్తోందంటే నిజంగా దౌర్భాగ్యమని భక్తులు వ్యాఖ్యానించారు. కార్యాలయాల్లో పనులు పక్కనపెట్టి రెవెన్యూ అధికారులు ఇలా ‘తమ్ముడి’ సేవలో తరించడం విమర్శలకు తావిస్తోంది. -
గోశాల ఘోష!
గోమాతను సకల దేవతా స్వరూపంగా హిందువులు భావిస్తారు. గోపూజతోనే శ్రీరాఘవేంద్రుడి ఆరాధనోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. అయితే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీమఠంలో గోసంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది. గోశాలకు కోట్ల రూపాయల్లో విరాళాలు పోగవుతున్నా శ్రీమఠం అధికారులు గోసంరక్షణ మరచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుత గోశాల దుస్థితి ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. సాక్షి, మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో కొండాపురం ఆంజనేయస్వామి ఆలయం సమీపాన గోశాల నిర్వహిస్తున్నారు. పరిశుభ్రత చర్యలు చేపట్టకపోవడం..దోమల విజృంభణతో గతేడాది థ్రిప్స్ వ్యాధి (మెదడువాపు వ్యాధి) ప్రబలింది. ఫలితంగా నెలలోనే 50 గోవులు మృత్యువాత పడ్డాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో శ్రీమఠం అధికారులు రూ.అరకోటితో సంరక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు. అయితే ఇవి మున్నాళ్ల ముచ్చటగాగా మారాయి. కారణంగా గతేడాది పరిస్థితే గోవులకు దాపురించింది. చేపట్టాల్సిన సంరక్షణ చర్యలు.. గోశాల విస్తరణ రూ.25 లక్షలతో చేపట్టాల్సి ఉంది. అపరిశుభ్రత తొలగింపునకు రూ.8లక్షలు వెచ్చించాలి. రెడిమేడ్ డ్రెయినేజీకి రూ.8 లక్షలు, కాంక్రీట్ ప్లాట్పామ్ నిర్మాణానికి రూ.12 లక్షలు అవసరమని తేల్చారు. బంతిపూలతోట, ఉసిరివనం, పౌంటైన్ ఏర్పాటుకు రూ.3 లక్షలు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. అలాగే 40 ఎకరాల్లో పచ్చగడ్డి, 10 ఎకరాల్లో లూసెర్నీ, కోపియాన్, స్టెల్లోహెమటా జాతుల న్యూట్రిన్ గడ్డి పెంపకం చేపట్టేందుకు పూనుకున్నారు. స్వచ్ఛఅభియాన్ పేరుతో ప్రతి 15 రోజులకు ఏకాదశి రోజున మఠం ఉద్యోగులంతా అక్కడే పరిశుభ్రత పనులు చేపట్టాలని నిశ్చయించారు. ఏం చేశారంటే.. సంరక్షణ చర్యల్లో భాగంగా గోశాలను విస్తరణ చేపట్టారు. డ్రెయినేజి, క్రాంకీటు ప్లాట్‌పాం నిర్మించారు. మిగతా పనులు ఏవీ చేపట్టలేకపోయారు. దోమల నివారణ కోసం బంతిపూల సాగు చేపడతామని చెప్పినా పనులు ఇంచు కూడా కదలేదు. గోశాలలో స్వచ్ఛత కనుచూపు మేరలో ఉండిపోయింది. ఏకాదశిన ఉద్యోగుల శ్రమదానానికి దారి లేకపోయింది. వానొచ్చినా.. దోమకుట్టినా.. ఆకలి వేసినా గోవులు మూగవేదన భరించాల్సి వస్తోంది. చిన్న వానొచ్చినా గోశాల ప్రాంగణం పేరుకుపోయిన పేడతో చిత్తడిగా మారుతోంది. గోవులు వానలో తడుస్తూ జాగారం చేయాల్సి వస్తోంది. దాతలు ఇచ్చిన పశుగ్రాసంతోనే గోవులు కడుపు నింపుకోవాలి. న్యూట్రిన్స్ గడ్డిలేకపోవడంతో గోవులు బలహీనంగా మారుతున్నాయని పశువైద్యాధికారులు మొత్తుకుంటున్నా చెవిన వేసుకునే నాథుడు లేకపోయాడు. గోవుల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం గోశాలలో గోవుల సంరక్షణ కోసం కట్టుకడి పనిచేస్తాం. త్వరలోనే బంతిపూలతోట, ఉసిరి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. స్వామిజీ సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో గోశాలలో వసతులపై సమీక్ష నిర్వహించి సంరక్షణ కోసం పాటుపడతాం. పశుగ్రాసం పెంపకం పనులు వేగవంతం చేస్తాం. ఎస్కే శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ -
భారీ టీ స్కాం : రోజుకి 18,500 కప్పులు?
ముంబై : మంత్రాలయలో ఏడు రోజుల్లో సుమారు 3 లక్షల ఎలుకలను చంపారనే ఆరోపణపై వివాదం చెలరేగిన వెంటనే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కార్యాలయంలో భారీ టీ స్కాం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో రోజుకి సగటున 18,500 కప్పుల టీ సర్వ్ చేస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గత మూడేళ్లుగా సీఎంఓలో టీ వినియోగం పెరుగుతూ వచ్చిందని, దానికి తగ్గ ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయని ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ అన్నారు. ఆర్టీఐ ద్వారా పొందిన డాక్యుమెంట్లను ట్విటర్లో పొందుపరిచారు. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు 2015-16లో టీకి వెచ్చించిన ఖర్చు సుమారు రూ.58 లక్షలు గాక, 2017-18లో సుమారు రూ.3.4కోట్లగా నమోదైనట్టు కాంగ్రెస్ లీడర్ పేర్కొన్నారు. అంటే 577 శాతం మేర పెరిగినట్టు తెలిపారు. అంటే సగటున సీఎంఓలో రోజూ 18,591 కప్పుల టీ సర్వ్ చేస్తున్నారన్నారు. ఇదెలా సాధ్యమంటూ ఆయన ప్రశ్నించారు. ఎలాంటి టీని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తాగుతారు? అని ప్రశ్నించగా.. తమకు తెలిసినంత వరకు ఆయన గ్రీన్ టీ, ఎల్లో టీ.. వంటివి తాగుతారని నిరుపమ్ పేర్కొన్నారు. అయితే ‘గోల్డెన్ టీ’కి సీఎం, సీఎంఓ ఎక్కువగా వెచ్చిస్తుందని, దీనికి ఎక్కువ మొత్తంలో ఖర్చు వస్తుందని చెప్పారు. సీఎంఓ టీ బిల్లుల్లో అవినీతి చోటు చేసుకుందని తెలిపిన ఆయన... ప్రధాన మంత్రి ‘ఛాయ్‌వాలా’ అని చెప్పుకుంటూ ఎంతో గొప్పగా ఫీలవుతారని, మరోవైపు ఫడ్నవిస్ అనవసరంగా టీకి ఎక్కువగా వెచ్చిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ప్రధాని, మహారాష్ట్ర సీఎం ఇద్దరూ కూడా దేశాన్ని ఛాయ్‌తోనే నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే ప్రతిరోజూ సీఎంఓలో 18,000 కన్నా ఎక్కువ మందికి టీ సర్వ్ చేయడం సాధ్యమయ్యే పనేనా? అని నిరుపమ్ అన్నారు. లేదా ఆ టీ అంతటిన్నీ మంత్రాలయంలోని ఎలుకలు తాగాల్సిందేనన్నారు. మహారాష్ట్ర సచివాలయంలో ఎలుకలు పట్టుకునేందుకు ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరిగినట్లు కొన్ని రోజుల క్రితమే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క వారంలో మంత్రాలయలో సుమారు 3 లక్షల ఎలుకలను తొలగించినట్టు బీజేపీ మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే చెప్పారు. ఎలుకల స్కాం మాదిరి సీఎంఓ ఆఫీసులో భారీ మొత్తంలో టీకి కూడా వెచ్చించినట్టు నిరుపమ్ ఆరోపిస్తున్నారు. -
మంత్రాలయ వచ్చి నేను ఆత్మహత్య చేసుకోవాలా?
సాక్షి, సతారా : 'న్యాయం కోసం ప్రతి ఒక్క వృద్ధుడు మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడాల్సిందేనా?' ఈ ప్రశ్న వేసింది చంద్రశేఖర్ జంగం అనే వ్యక్తి. ఆయన వయసు ఇప్పుడు 98 ఏళ్లు. అయితే, ఆయన సామాన్యుడేం కాదు. గొప్ప పోరాటయోధుడు.. యుద్ధ వీరుడు. భారత ఆర్మీలో సైనికుడిగా విశిష్ట సేవలు అందించాడు. 1962లో చైనాతో, 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధాల్లో ఆయన పాల్గొన్నారు. 1971 సుబేదార్ హోదాలో పదవీ విరమణ పొందారు. అయితే, ఒకప్పుడు ఈ దేశం కోసం పోరాడి చివరి మజిలీకి చేరిన సమయంలో ఆయన నోటి నుంచి ఆత్మహత్య మాట ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? సమస్య షరా మాములే. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు టోకరా పెట్టింది. సైనికులకు కేటాయించే భూమిని ఆయనకు కేటాయించలేదు. రెండు సార్లు ఆయన యుద్ధం నిలిచి గెలిచాడుగానీ, తన హక్కుల కోసం మాత్రం సొంత దేశంలోనే 54 ఏళ్లుగా ఓడిపోతూనే ఉన్నారు. చివరకు తనకు న్యాయం జరగడం కోసం మంత్రాలయ వచ్చి ఆత్మహత్యకు పాల్పడమంటారా అని ఆవేదనతో ప్రశ్నించారు. వివరాల్లోకి వెళితే.. చంద్రశేఖర్ జంగం తొలిసారిగా 1943లో భారత ఆర్మీలో చేరారు. ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్ కింద యుద్ధ ట్యాంకుల విభాగంలో పనిచేశారు. 1962లో ఇండో-చైనా, 1965 ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నారు. రక్ష మెడల్ కూడా స్వీకరించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సైనికులు స్థలం కొనుక్కునే అవకాశం ఉండటంతో 1964లో 15.5 గుంటల భూమిని సతారాలో కొనుగోలుచేశారు. అందుకు రూ.3,547లు చెల్లించారు. ఇప్పటికీ ఆ రశీదు కూడా ఉంది. అయితే, ఆ భూమిని మాత్రం చంద్రశేకర్‌కు బదిలీ చేయలేదు. ఆ ప్రొసీజర్ కూడా ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో ఆయన 1968 నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 1971లో ఆయన పదవీ విరమణ పొందాక కూడా ప్రతివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగారు. ఇక ఆ పనిపూర్తికాకపోవడంతో కనీసం తన డబ్బు తనకైనా తిరిగి ఇవ్వాలని 1977 నుంచి అడగడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆ పని కూడా జరగలేదు. 1983వరకు పోరాడిన వాళ్లు తిరిగి ఆశ వదులుకున్నారు. మళ్లీ చిగురించిన ఆశ సతారాలోని రహీమత్‌పూర్‌లో ఉంటున్న చంద్రశేఖర్‌కు ముగ్గురు కూతుర్లు.. ఇద్దరు కుమారులు. కుమారుల్లో ఒకరు తమకు ప్రభుత్వం చేసిన అన్యాయంపై గట్టిగా పోరాటం చేయాలనుకున్నారు. ఒక ఎన్జీవో, అఖిల్ భారతీయ వీర్షవ్య లింగాయత్ మహాసంఘ(ఏబీవీఎల్‌ఎం) సహాయంతో ఆర్టీఐ ద్వారా కొనుగోలు చేసిన భూమి వివరాలు రాబట్టాడు. అయితే, కొన్ని రికార్డులు లభించగా కొన్ని మాత్రం మాయమయ్యాయి. 15.5గుంటల భూమిని వారు కొనుగోలు చేయగా అందులో రోడ్డు విస్తరణకోసం దాదాపు సగానికిపైగా భూమి పోయి ఇప్పుడు 5.5గుంటలు మాత్రం మిగిలినట్లు తెలిసింది. దీంతో తమకు ఇక భూమి దక్కదని నిర్ణయించుకొని వేరే చోట అయినా కనీసం భూమి కేటాయించాలని కోరారు. గత వారం కుటుంబ సభ్యులు ఏబీవీఎల్‌ఎం చీఫ్ డాక్టర్ విజయ్ జంగమ్‌తో కలిసి మహారాష్ట్ర విధాన భవన్‌కు వెళ్లగా అక్కడి రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్‌కు ఫైల్ పంపించాలని ఆదేశించారు. అయితే, ఈ విషయంపై ఓ సీనియర్ కలెక్టర్ స్పందించి ప్రభుత్వం తలుచుకుంటే అది పెద్ద విషయం కాకపోయినా ఎందుకో ప్రతిసారి రివ్యూల పేరిట వాయిదాలు వేస్తుందని అభిప్రాయపడ్డారు. -
శ్రీ రాఘవేంద్రునిపై రజనీ అమితమైన భక్తి.. భారీ విరాళం
తమిళసినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు మంత్రాలయ శ్రీ రాఘవేంద్రస్వామి అంటే అమిత భక్తి. ఆయన తాజాగా మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రాలయంలో శ్రీ మఠానికి రూ. 20 కోట్లను విరాళంగా అందించారు. రజనీకాంత్ మంగళవారం ఉదయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. శ్రీ మఠానికి వచ్చిన ఆయనకు అర్చకులు సాదర స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం రజనీకాంత్ మఠాధిపతి సుబుదేంద్రతీర్థులను కలిసి కొంచెం సేపు చర్చించారు. మఠంలో నిర్మాణాలు శిధిలావస్థకు చేరుకున్నాయని, భక్తులకు వసతుల అవసరం ఉందని తెలుసుకున్నారు. దీంతో మఠం ఆధునీకరణకు రూ.20 కోట్లను విరాళంగా అందించారు. ఆ నిధితో భక్తుల బస కోసం 25 ఏసీ గదులను, మరిన్ని వసతి గదులను నిర్మించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. -
రాఘవేంద్రుడి ఆశీస్సులతోనే...
ఆయన చుట్టూ మందీ మార్బలం లేరు.. ఎవరికీ ముందస్తు సమాచారం లేదు... సామాన్య భక్తుల్లో ఒకరిగా, సడన్‌గా మంగళవారం ఉదయం మంత్రాలయంలో ప్రత్యక్షమయ్యారు రజనీకాంత్. ఆయనకు రాఘవేంద్ర స్వామి అంటే ఎంత భక్తి అనేది అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడూ కర్నూల్లోని మంత్రాలయంలో గల ఆలయానికి వచ్చి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుంటుంటారు రజనీ. మంగళవారం కూడా అలానే వచ్చి, తుంగభద్ర నదిలో పుణ్యస్నానం ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన రజనీకి స్వామివారి జ్ఞాపిక, శేష వస్త్రం, ప్రసాదాలు అంద జేశారు. మఠాధికారులు రజనీని పూర్ణకుంభంతో ఆహ్వానించారు. స్వామివారి కరుణాకటాక్షంతోనే సినిమా రంగంలో ఈ స్థాయికి చేరుకున్నాన ని రజనీ పేర్కొన్నారు. అన్నట్లు... రజనీ ‘శ్రీ రాఘవేంద్రర్’(తెలుగులో ‘శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం’)లో టైటిల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
రాఘవేంద్ర స్వామి సన్నిధిలో రజనీ
-
రాఘవేంద్ర స్వామి సన్నిధిలో రజనీ
సాక్షి, మంత్రాలయం: కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ మంగళవారం ఉదయం వచ్చారు. శ్రీ మఠం అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని కుంకుమార్చన, మహా మంగళ హారతి పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుబుదేంద్రతీర్థులు శేష వస్త్రం, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వాదించారు. కాగా, రజనీకాంత్ వచ్చారని తెలుసుకున్న ఆయన అభిమానులు, భక్తులు చూసేందుకు భారీగా తరలిరావడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. -
మంత్రాలయంలో అగ్ని ప్రమాదం
-
శ్రీమఠం పీఠాధిపతి తులాభారం
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులకు తులాభారం వేడుక వైభవంగా జరిగింది. శ్రీమఠంలో శనివారం రాత్రి 9గంటలకు బెంగళూరు నగరానికి చెందిన అలసురమ్మ కుటుంబం సభ్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఫలాలు, ధాన్యంతో పీఠాధిపతిని తూగించారు. రాయరు అనుగ్రహ సందేశంతో పాటు ఫలపూల మంత్రాక్షితలతో పీఠాధిపతి ఆశీర్వదించారు. వేడుకల్లో ఏఏఓ మాధవశేట్టి, మేనేజరు శ్రీనివాసరావు, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
రాఘవేంద్రుడికి బంగారు పల్లకీ సేవ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో గురువారం బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఊంజలలో రజత బృందావన ప్రతిమను కొలువుంచి భక్తులతో సంకల్పం చేయించారు. అనంతరం పుష్పాలంకార బంగారు పల్లకీలో బృందావన ప్రతిమను మాడ వీధుల్లో ఊరేగించారు. పల్లకీ సేవ భక్తులకు ఎంతగానో ఆకట్టుకుంది. వేడుకల్లో ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్ శ్రీనివాస రావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. కొనసాగుతున్న హుండీ లెక్కింపు : శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించి జూన్ నెల హుండీ లెక్కింపు కొనసాగుతోంది. బుధవారం రూ.42.03లక్షలు రాగా.. గురువారం రూ.51.99 లక్షలు సమకూరింది. రెండు రోజులకు గానూ మొత్తం రూ.94.02లక్షలు వచ్చినట్లు ఏఏఓ మాధవ శెట్టి, మేనేజర్ శ్రీనివాస రావు తెలిపారు. రెండురోజుల్లో హుండీ లెక్కింపు పూర్తి కావస్తోందన్నారు. -
మంత్రాలయం రైల్వేలైన్‌కు రీసర్వే
ఎంపీ బుట్టా రేణుక అభ్యర్థనను అంగీకరించిన రైల్వే అధికారులు కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు నుంచి మంత్రాలయం రైల్వేలైన్ పనులకు రీసర్వే చేపట్టాలంటూ ఎంపీ బుట్టా రేణుక చేసిన అభ్యర్థనపై రైల్వే శాఖ అధికారులు స్పందించారు. బుధవారం ఎంపీ దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ వినోద్కుమార్యాదవ్ను సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిశారు. కర్నూలు–మంత్రాలయం రైల్వేలైన్ రీసర్వే పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు జీఎం.. ఎంపీకి హామీ ఇచ్చారు. అలాగే డోన్ పట్టణంలోని 150, 166 రైల్వే గేట్లను ప్రజల సౌకర్యార్థం యథావిధిగా కొనసాగించాలనే అభ్యర్థనపై జీఎం సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఎంపీ అభ్యర్థన మేరకు బెంగుళూరు–యశ్వంత్‌పుర రైలును మద్దికెర రైల్వే స్టేషన్లో ఆపే సదుపాయం కల్పించనున్నట్లు జీఎం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎంపీ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన వెలువడింది. -
రాఘవేంద్రుని సన్నిధిలో రాజమౌళి
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థమై ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రచయిత విజయేంద్రవర్మ, రాజమౌళి సతీమణి రమారాజమౌళి, నిర్మాత సాయి సోమవారం మధ్యాహ్నం మంత్రాలయం వచ్చారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతలు పట్టారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. మఠం దివాన్ వాజీరాజాచార్ ఫల, పూల, మంత్రాక్షలను అందజేశారు. రాజమౌళి కుటుంబ సభ్యులు ముగతి వ్యవసాయక్షేత్రంలో పర్యటించారు. సోమవారం ఉదయం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకొని మార్గమధ్యంలో ముగతి ఫారంలో వనభోజనాలు చేశారు. వనభోజనాల్లో రాజమౌళి దంపతులు, సినీడిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి దంపతులు, ఎమ్మిగనూరు డిస్ట్రిబ్యూటర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా సువ్రతీంద్రుల ఆరాధన
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సువ్రతీంద్రుల ఆరాధనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నేతృత్వంలో ముందుగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశిష్ట పూజలు చేశారు. అనంతరం సువ్రతీంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పంచామృతాభిషేకాలు గావించి విశేషంగా అలంకరించారు. శాస్త్రోక్త పూజలనంతరం మంగళహారతులు పట్టారు. వేడుకల్లో మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
వైభవంగా సుశమీంద్రుల ఆరాధన
మంత్రాలయం : నడిచే రాఘవేంద్రులుగా ఖ్యాతి పొందిన శ్రీ మఠం పూర్వపు పీఠాధిపతి సుశమీంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవం నయానందకరంగా సాగింది. గురువారం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో ఆరాధన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనంకు విశేష దినసరి పూజలు శాస్రోత్తంగా కానిచ్చారు. అనంతరం సుశమీంద్ర తీర్థుల మూలబృందావనంకు నిర్మల్య విసర్జన, ఫల, పుష్ప, పంచామృతాభిషేకాలు గావించి çపుష్ప, బంగారు కవచ ధారణతో విశేషపూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పట్టువస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం సుశమీంద్రుల చిత్రపటాని డోలోత్సవ మండపంలో ఉంజలసేవ గావించి ప్రవచనాలు చేశారు. స్వర్ణ రథం పై సుశమీంద్రుల చిత్రపటాని కొలువుంచగా పీఠాధిపతి మంగళహరతులతో రథయాత్రకు అంకురార్పణ పలికారు. మంగళ వాయిద్యాలు, అశేష భక్త జన హర్షధ్వనుల మధ్య శ్రీ మఠం మాఢ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. వేడుకల్లో శ్రీ మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, అసిస్టెంట్ పీఆర్వో వ్యాసరాజాచార్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రాలయంలో ముగ్గురి బలవన్మరణం
శ్రీమఠం వసతి గృహంలో ఫ్యానుకు ఉరేసుకున్న పాండిచ్చేరి వాసులు మంత్రాలయం: ఏ కష్టం వచ్చిందో.. ప్రాంతంగాని ప్రాంతానికి వచ్చి వారు ప్రాణాలు తీసుకున్నారు.తమకు ఎవరూ లేరని.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నామని.. పవిత్ర మంత్రాలయంలోనే అంత్యక్రియలు చేయాలని తమిళంలో లేఖ రాసి మరీ బలవన్మరణం పొందారు. అన్నా, చెల్లి.. చెల్లికూతురు కలసి ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీమఠం వసతి గృహంలో చోటుచేసుకుంది. పాండిచ్చేరికి చెందిన శరవణ్(42), చెల్లెలు శాంతి (28), చెల్లెలి కూతురు పవిత్ర (13) ఈనెల 21న మంగళవారం.. మంత్రాలయం వచ్చారు. విజయేంద్ర వసతి గృహంలో ఓ గదిని తీసుకున్నారు. మరో రెండు రోజులకు రెన్యూవల్ చేయించుకున్నారు. అయితే ఆదివారం ఉదయం వారున్న గది నుంచి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది మఠాధికారుల ద్వారా పోలీసులకు తెలిపారు.పోలీసులు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా శరవణ్, శాంతి ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని కనిపించారు. చిన్నారి పవిత్ర విగత జీవిగా పడి ఉంది. పోలీసులకు తమిళంలో రాసిన సూసైడ్ నోట్ దొరికింది.ఆర్థిక ఇబ్బందులతో తాము చనిపోతున్నామని.. పవిత్ర మంత్రాలయంలోనే అంత్యక్రియలు జరిపాలని రాసినట్లు పోలీసులు వివరించారు. మృతుడికి సెల్‌ఫోన్ ఉన్నా.. అందులో నంబర్లు లేకుండా సిమ్‌కార్డును తొలగించారు. మరణించిన వారు లేఖలో పేర్కొన్న మేరకు వారి అంత్యక్రియలు మంత్రాలయంలోనే నిర్వహించారు. -
కుటుంబ సభ్యుల బలవన్మరణం
– శ్రీమఠం వసతి గృహంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య – పాండిచేరి వాసులుగా గుర్తింపు – మృతుల కోరిక మేరకు మంత్రాలయంలో అంత్యక్రియలు మంత్రాలయం : పాపం ఏ కష్టం వచ్చిందో.. ప్రాంతంగాని ప్రాంతానికి వచ్చి ప్రాణాలు తీసుకున్నారు. తమకు ఎవరూ లేరని.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నామని.. పవిత్ర మంత్రాలయంలోనే తమ దేహాలకు అంత్యక్రియలు చేసి.. తమ ఆఖరి కోరికను తీరుస్తారని ఆశిస్తున్నామని మాతృభాష (తమిళంలో..) లేఖ రాసి మరీ బలవన్మరణం పొందారు. అన్నాచెల్లి.. చెల్లికూతురు కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఈ ఘటన మంత్రాలయం శ్రీమఠం వసతి గృహంలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు పాండిచ్చేరి నంబర్ 26, 5వ క్రాస్ వీధి, కవికుల్ నగర్, సారమ్కి చెందిన శరవణ్(42), చెల్లెలు శాంతి (28), చెల్లెలి కూతురు పవిత్ర (13) ఈనెల 21న మంగళవారం.. మంత్రాలయం వచ్చారు. శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చామని శ్రీమఠం సెంట్రల్ రిసెప్సన్ సెంటర్లో మఠం రూమును బాడుగ తీసుకున్నారు. విజయేంద్ర వసతి గృహంలో 52 నెంబర్లో చేరారు. 22న, 23 తేదీల్లో రూము బాడుగను రెన్యూవల్ చేయించుకున్నారు. 24 తేదీ శుక్రవారం సాయంత్రం సమయంలోనూ వసతి గృహంలో పనిచేసే సిబ్బందికి కనిపించారు. ఆదివారం ఉదయం గది నుంచి విపరీతమైన వాసన రావడంతో అనుమానం వచ్చి సిబ్బంది.. మఠం సీఆర్వో ఐపీ నరసింహమూర్తి తెలియజేశారు. అధికారుల సమాచారం మేరకు సీఐ నాగేశ్వరరావు అక్కడి చేరుకుని తలుపు గడిని పగలకొట్టించగా శరవణ్, శాంతి ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని కనిపించారు. చిన్నారి పవిత్ర విగత జీవిగా కింద పడి ఉంది. ఇక్కడే అంత్యక్రియలు చేయండి.. పోలీసుల పరిశీలనలో తమిళంలో రాసిన సూసైడ్ నోట్ దొరికింది. తాము అన్నాచెల్లెలు, చిన్నారి చెల్లెలి కూతురని.. ఆర్థిక ఇబ్బందులతో తాము చనిపోతున్నామని.. తమ దేహాలకు పవిత్ర మంత్రాలయంలోనే అంత్యక్రియలు జరిపాలని.. ఇదే చివరి కోరికని.. తమిళం, ఆంగ్లం పదాలతో కూడిన సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు వివరించారు. మృతుడికి సెల్‌ఫోన్ ఉన్నా.. అందులో నంబర్లు లేకుండా సిమ్‌కార్డును తొలగించారు. ఫొటో గ్యాలరీలోనూ ఏ ఆధారం లేకపోయింది. తీవ్ర మనోవేదనతోనే ఈ అఘయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ రవికృష్ణ అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల కోరిక మేరకు అంత్యక్రియలు మంత్రాలయంలోనే నిర్వహించారు. -
విషాదం: కుటుంబమంతా ఆత్మహత్య
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనానికి వచ్చిన ఒక కుటుంబంలోని ముగ్గురు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానిక విజయేంద్ర వసతి భవనంలో పుదుచ్చేరికి చెందిన దంపతులు తమ పదేళ్ల కూతురికి విషం ఇచ్చి అనంతరం ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీమఠంలో కర్ణాటక డీజీపీ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్ణాటక డీజీపీ జైల్స్ సత్యనారాయణరావు శనివారం మంత్రాలయం వచ్చారు. మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి మఠం మర్యాదలతో ఆహ్వానం పలకగా ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాఘవేంద్రుల మూలబృందావనం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాఘవేంద్రుల జ్ఞాపిక అందజేసి ఆశీర్వదించారు. గుల్బర్గ జైల్స్ ఎస్పీ సోమశేఖర్, సీఐ నాగేశ్వరరావు, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. -
కనుల పండువగా మధ్యారాధన
-నవ నిర్మాణ శిల్పికి భక్త నీరాజనం – వైభవంగా నవరత్న రథోత్సవం – బంగారుపూత బృందావన గోపుర ప్రారంభోత్సవం మంత్రాలయం : నవ మంత్రాలయ శిల్పి, శ్రీమఠం పూర్వపు పీఠాధిపతి సుయతీంద్రతీర్థులకు భక్తజనం నీరాజనం పలికింది. సుయతీంద్రతీర్థుల చతుర్థి మహా సమారాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం మధ్యారాధన నిర్వహించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో వేకువజామున రాయరు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సుయతీంద్రతీర్థుల బృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, విశేష పంచామృతాభిషేకం గావించారు. తర్వాత స్వామీజీ చిత్రపటాన్ని నవరత్న రథంపై ఉంచి పీఠాధిపతి హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. మంగళవాయిద్యాల సుస్వరాలు, హరిదాస సాహిత్యం, మహిళల సంకీర్తనలతో శ్రీమఠం మాడవీధుల్లో అశేష భక్తజనం మధ్య రథయాత్ర కనుల పండువగా సాగింది. యజ్ఞమంటపంలో బెంగళూరుకు చెందిన సంగీత కులకర్ణి దాసవాణి భక్తులను ఎంతగానో అలరించింది. డోలోత్సవ మండపంలో విద్వాన్లు గురుప్రసాదాచార్య, రామవిఠలాచార్య ప్రవచనాలు ఆకట్టుకున్నాయి. పీఠాధిపతి పూజామందిర్లో మూల,జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు. బంగారు బృందావన గోపురం ప్రారంభోత్సవం : శ్రీమఠం ముఖద్వార శిఖరాన బృందావనాన్ని బంగారు పూత తొడిగారు. హైదరాబాద్‌కు చెందిన దాత సహకారంతో బంగారు పూత పూశారు. వేడుక సందర్భంగా శుక్రవారం బృందావన గోపురాన్ని ప్రారంభించారు. వేడుకలో పండిత కేసరి గిరియాచార్, మఠం ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ద్వారపాలక అనంతస్వామి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. నేడు ఉత్తరారాధన : ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉత్తరారాధన నిర్వహించనున్నారు. సుప్రభాత సేవ, పాదపూజ, తీర్థ ప్రసాద వితరణ, మహా మంగళహారతులు ఉంటాయి. బెంగళూరుకు చెందిన వేదవ్యాసాచార్, బండిశ్యామాచార్, హుబ్లి దేఖాదినేష్ ప్రవచనాలు వినిపిస్తారు. -
విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం
మంత్రాలయం(కర్నూలు): కర్నూలు జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పాఠశాలకు వెళ్లి వస్తున్న అభం శుభం తెలియని విద్యార్థినిపై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. భయాందోళనకు గురైన బాలిక తనను తాను రక్షించుకోవడానికి ఆటోలో నుంచి కిందకు దూకింది. దీంతో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లాలోని మంత్రాలయం మండలం మాధవరంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని(11) పాఠశాల నుంచి ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆటోలో ఎవరు లేకపోవడంతో.. డ్రైవర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. అప్రమత్తమైన బాలిక ఆటోలో నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
హరి సర్వోత్తమ..వాయు జీవోత్తమ
– ఘనంగా నాల్గో రోజు గురు వైభవోత్సవాలు – విశేషంగా ఉపనయనం వేడుక – ఆకట్టుకున్న మూలరాముల సంస్థాన పూజలు మంత్రాలయం : హరి సర్వోత్తమ..వాయు జీవోత్తమ నామంతో శ్రీమఠం మార్మోగింది. వైభవోత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తి వేడుకలు కనుల పండువగా సాగాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో మూలబృందావనంకు పవిత్ర పూజలు గావించారు. పూజామందిరంలో మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో పీఠాధిపతి తరించారు. యాగమండపంలో బ్రాహ్మణ చిన్నారులకు ఉపనయనం నిర్వహించారు. అర్చకులు శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణలు మధ్య ఎంతో కమనీయంగా ఉపనయం కానిచ్చారు. పీఠాధిపతి ఉపనయన చిన్నారులకు శేషవస్త్రం, పూజా సామగ్రి అందజేసి ఆశీర్వదించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను శ్రీమఠం మాడా వీధుల్లో చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై ఊరేగించారు. అనంతరం డోలోత్సవ మండపంలో ఊంజల సేవ, దివిటీ సేవ, హారతి సహిత పూజలు చేపట్టారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆం«ద్ర ప్రాంతాల నుంచి భక్తుల వేలాదిగా తరలివచ్చారు. భక్తుల కోలాహలంతో శ్రీమఠం కనువిందు చేసింది. వేడుకలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, దివాన్ వాదీరాజాచార్, డీఎం ఆనందరావు, ప్రిన్సిపాల్ వాదీరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వార పాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
పావన వేదం.. శ్రీగురుచరణం
– ఘనంగా ప్రారంభమైన రాఘవేంద్రుల వైభవోత్సవాలు – కనుల పండువగా పాదుక పట్టాభిషేకం – నవరత్న రథంపై బంగారు పాదుకల ఊరేగింపు మంత్రాలయం : వేదభూమి పులకించింది.. భక్తిపారవశ్యంతో పరవశించింది. సద్గురు బంగరు పాదుకల పట్టాభిషేకం కనువిందు చేసింది. భక్తజనం మది ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడింది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వైభవోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ముందుగా రాఘవేంద్రుల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం, తులసీమాల సమర్పణ, పట్టువస్త్ర అలంకరణ గావించి మంగళహారతులు పట్టారు. శ్రీరాఘవేంద్రుల సన్యాసం పుచ్చుకున్న రోజును కావడంతో డోలోత్సవ మండపంలో రాఘవేంద్రుల బంగరు పాదుకలను స్వర్ణపీఠంపై కొలువుంచారు. శాస్త్రోక్తంగా పాదుకలకు ముత్యాలు, వెండి, స్వర్ణ, నవరత్నాలతో అభిషేకాలు చేశారు. పరమ నిష్టతో సాగిన పట్టాభిషేక ఘట్టం భక్తులను మైమరిపించింది. బృందావన ప్రతిమ, పాదుకలు, శ్రీమన్‌న్యాయ సుధా పరిమళగ్రంథ తాళ పత్రాలను నవరత్నరథంపై కొలువుంచారు. పీఠాధిపతులు పాదుకలకు పూజలు, హారతులు పూర్తిచేసి రథోత్సవానికి అంకురార్పణ పలికారు. అశేష భక్తజనం, మంగళవాయిద్యాలు మధ్య శ్రీమఠం మాడవీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. ఉత్సవంలో పండిత కేసరి గిరియాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, వేద పాఠశాల ఉపకులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దివాన్ వాదీరాజాచార్, ద్వారకపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
గురుభక్తి.. భక్తకోటికి ముక్తి
- నేటి నుంచి శ్రీమఠంలో రాఘవేంద్రుల గురు వైభవోత్సవాలు - 6 రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ - పీఠాధిపతి నేతృత్వంలో ఏర్పాట్లు మంత్రాలయం : సద్గురు శ్రీరాఘవేంద్రుల జన్మదినం, పట్టాభిషేకాన్ని పురష్కరించుకుని నిర్వహిస్తున్న గురువైభవోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో మార్చి 5వతేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. మంగళవారం 396వ పట్టాభిషేక మహోత్సవం చేపడతారు. ఉత్సవంలో భాగంగా రాఘవేంద్రుల స్వర్ణపాదుకలకు ముత్యాలు, రత్నాలు, పుష్పాలతో అభిషేకిస్తారు. 1-4 తేదీల వరకు దినసరి రాయరు పాదపూజ, సంస్థానపూజ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. 5వ తేదీన రాఘవేంద్రుల 422వ జయంత్యుత్సవం నిర్వహిస్తారు. రాఘవేంద్రుల చరిత్ర మూలరూపం : శంఖు కర్ణ గోత్రం : గౌతమి తండ్రి : తిమ్మన భట్ తల్లి : గోపికాంబ జననం : క్రీ.శ.1595 మన్మథనామ సంవత్సరం పాల్గుణ శుద్ధ సప్తమి, గురువారం జన్మ నక్షత్రం : మృగశిర జన్మభూమి : భువనగిరి, కర్ణాటక పూర్వ నామం : వెంకటనాథుడు వివాహం : క్రీ.శ.1614, ఆనందనామ సంవత్సరం, పాల్గుణ శుద్ధ భార్య : సరస్వతీబాయి ఆశ్రమంలో పేరు : శ్రీరాఘవేంద్ర తీర్థులు రచన గ్రంథాలు : శ్రీమన్యాయసుధ పరిమళ, 48 గ్రంథాలు బిరుదులు : వెంకటనాథాచార్య, పరిమళాచార్య, మహాభాష్య బృందావన ప్రవేశం : క్రీ.శ. 1671 వీరూధినామ సంవత్సరం, శ్రావణ బహుళ విదియ, శుక్రవారం అనుగ్రహ ప్రశస్థి అవార్డులు .. గురు వైభవోత్సవాలను పురష్కరించుకుని ప్రముఖులకు రాఘవేంద్రుల అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రదానం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈఏడాది ఎల్బర్గాకు చెందిన పండితుడు వెంకోబ ఆచార్, రాయచూరు నవోదయ మెడికల్ కాలేజీ చైర్మన్ ఎస్.ఆర్.రెడ్డి, బెంగళూరు ఎంఆర్జీ గ్రూప్స్ చైర్మన్ ప్రకాష్‌శెట్టి, బెంగళూరు కిద్వాయి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లింగేగోడ్వార్, హైదరాబాద్ విజయకుమార్, కన్నడ టీవీ9 డైరెక్టర్ మహేంద్రమిశ్రా, బీటీవీ మేనేజింగ్ డైరెక్టర్ జీఎం కుమార్, టౌన్ ప్లానింగ్ రిటైర్డు డైరెక్టర్ రాజన్ అరవింద్, బెంగళూరు అనసూయమ్మకు బహుమతులు అందజేస్తారు. అనుగ్రహ ప్రాప్తి : సుబుధేంద్రతీర్థులు, పీఠాధిపతి శ్రీరాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాం. తుంగభద్ర నదిలో నీరు లేకపోవడంతో స్నానాలకు ప్రత్యేక షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశాం. మఠం ప్రాకారాలను పుష్పశోభిత, విద్యుద్దీపాలంకరణలు గావిస్తాం. రోజూ సాయంత్రం భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. -
శ్రీమఠంలో సినీ నటుడు లారెన్స్
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ హీరో, దర్శకుడు రాఘవలారెన్స్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి మంత్రాలయం వచ్చారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టారు. రాఘవేంద్రస్వామి మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేసుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రథయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు పంచముఖి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు తల్లి కల్మణి, తమ్ముడు ఎల్విన్విన్ పాల్గొన్నారు. లారెన్స్ మాట్లాడుతూ దాదాపు 420 చిత్రాలకు నృత్య దర్శకుడిగా, 10 చిత్రాలకు దర్శకుడిగా, 16 చిత్రాల్లో నటుడిగా పనిచేసినట్లు వెల్లడించారు. -
వైభవం.. ముంజీ మహోత్సవం
– శాస్త్రోక్తంగా పీఠాధిపతి పూర్వాశ్రమ పుత్రుడికి యజ్ఞోపవీతం – వేలాది మంది భక్తుల మధ్య సాగిన జంజధారణ మంత్రాలయం: ప్రముఖ శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు పూర్వాశ్రమ పుత్రుడు అప్రమేయ ముంజీ మహోత్సవం వైభవంగా సాగింది. గురువారం పీఠాధిపతి ఆశీస్సులతో వేద పాఠశాల ఆవరణలో అప్రమేయ చేతుల మీదుగా హోమాలు చేపట్టారు. శాస్త్రోక్తంగా పండిత కేసరి గిరియాచార్ అప్రమేయకు యజ్ఞోపవీతం కానిచ్చారు. పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాలు, అశేష భక్తజన సందోహం మధ్య జంజధారణ గావించారు. పీఠాధిపతి పూర్వాశ్రమ తండ్రి పండితకేసరి గిరియాచార్ సమక్షంలో పండిత మహాశయులు అప్రమేయకు జంజం తొడిగించారు. ఉదయం 10.15 గంటలకు శుభ మేషలగ్న, వృషభాంశ గడియలో ముంజీ చేశారు. ముందుగా ప్రత్యేక హోమాలు చేపట్టి పుష్పశోభిత సభపై మంత్రజపాల మధ్య యజ్ఞోపవీతం ముగించారు. అనంతరం అప్రమేయ పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల పాద పూజ చేసుకున్నారు. టీటీడీ కల్యాణ మండప ఆవరణలో భోజనాలు నిర్వహించారు. వేడుకలో బెంగళూరు ఎమ్మెల్యే అరవింద లింబావలి, విజయ్‌కుమార్, ఎమ్మెల్సీ నారాయణస్వామి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, మఠం ఈఈ సురేష్ కోనాపూర్, పాఠశాల ప్రిన్సిపాల్ వాదీరాజాచార్ పాల్గొన్నారు. -
శ్రీమఠం అభివృద్ధికి కృషి
- పీఠాధిపతి సుబధేంద్ర తీర్థులు – అన్నపూర్ణ భోజనశాలతో ఏసీ వెయిటింగ్ హాల్‌కు భూమి పూజ – బృందావన గార్డెన్తో 66 నూతన గదుల నిర్మాణానికి శ్రీకారం – దాతల సహకారంతో శ్రీమఠానికి ప్రగతి కళ మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్లు పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. బుధవారం అన్నపూర్ణ భోజన శాలతో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఏసీ వెయిటింగ్ హాల్, బృందావన గార్డెన్తో 66 గదులు, డార్మిటరీ సముదాయం నిర్మాణానికి పీఠాధిపతి భూమిపూజ చేశారు. కర్ణాటక ఎమ్మెల్సీ నారాయణస్వామి సౌజన్యం రూ.80 లక్షలతో ఏసీ వెయిటింగ్ హాల్, ఆపైన రెండు ఏసీ వీవీఐపీ సూట్స్ నిర్మిస్తారు. కర్ణాటక శ్రీరాఘవేంద్ర కో–ఆపరేటివ్ సొసైటీ నేతృత్వంలో డార్మిటరీ, 66 గదులు నిర్మాణం చేపడతారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పీఠాధిపతి నారీకేళ సమర్పణ, భూమిపూజ గావించారు. పీఠాధిపతి మాట్లాడుతూ.. దాతలు, భక్తుల సహకారంతో శ్రీమఠం గర్భాలయ శిలామండపం, స్వర్ణగోపురాలు, సుయతీంద్రతీర్థుల 200 గదులు సముదాయం, సుశీలేంద్ర 100 గదుల భవన నిర్మాణాలు చేపట్టామన్నారు. ప్రస్తుతం వికలాంగుల విశ్రాంత నిలయం, శ్రీమఠం క్వార్టర్స్‌తో విశ్రాంత పార్కు పనులు సాగుతున్నాయన్నారు. రాఘవేంద్రస్వామి కృపతో మఠం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందన్నారు. దాతలు మాట్లాడుతూ ఆగస్టులో జరిగే రాయరు సప్తరాత్రోత్సవాలకు.. నిర్మాణాలు పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఈఈ సురేష్ కోనాపూర్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం : ప్రముఖ శ్రీరాఘవేంద్రస్వామి మఠం భక్తుల రద్దీతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి భక్తులు వేలాది తరలివచ్చారు. తుంగభద్ర నదీలో పుణ్యస్నానాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చనలు చేసుకున్నారు. తర్వాత రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. బృందావన దర్శన, మంచాలమ్మ, అన్నపూర్ణభోజనశాల, పంచామృతం, పరిమళ ప్రసాదాల వద్ద భక్తులు బారులు తీరారు. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో రాఘవేంద్రుల బృందావన ప్రతిమకు ఊంజలసేవ, బంగారు పల్లకిసేవలు గావించారు. పూజోత్సవాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
బళ్లారి జిల్లా వాసి ఆత్మహత్య
మంత్రాలయం రూరల్: బళ్లారి జిల్లా కుడితిని గ్రామానికి చెందిన కమ్మరి గోవిందప్ప కుమారుడు కమ్మరి సురేష్ మారుతీ లాడ్జ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాల మేరకు..సురేష్ రెండ్రోజులు క్రితం శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం మంత్రాలయం వచ్చాడు. మారుతి లాడ్జ్‌లో దిగి రూం నెంబరు 15లో బస చేశాడు. శనివారం ఉదయం అద్దె డబ్బుల కోసం వెళ్లిన రూంబాయ్ గదిలోనుంచి దుర్వాసన వస్తుండడంతో తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే కమ్మరి సురేష్(27) మరణించి ఉన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఘనంగా ద్వాదశి వేడుకలు
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో బుధవారం ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేకువజామునే వేడుకలు ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా రాఘవేంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్పాభిషేకాలు గావించి మహా మంగళహారతులు పట్టారు. మంగళవారం ఏకాదశి సందర్భంగా బ్రాహ్మణులు ఉపవాస దీక్షలో ఉండటంతో 8 గంటలకే అన్నపూర్ణభోజన శాలలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు. భక్తుల రాకతో పంచామృతం, దర్శన, అన్నపూర్ణభోజనశాల క్యూలైన్లు›కళకళలాడాయి. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అంబారీ, వెండి, బంగారు, చెక్క రథాలపై కన్నుల పండువగా ఊరేగించారు. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
మంత్రాలయం రైల్వే లైన్‌కు రీసర్వే
– ఎంపీ బుట్టా రేణుక కర్నూలు(రాజ్‌విహార్): మంత్రాలయం నుంచి కర్నూలు వరకు కొత్త రైల్వే లైను నిర్మాణానికి రీ సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడంపై పార్లమెంటులో ప్రశ్నించానన్నారు. అయితే కర్నూలు – మంత్రాలయం మధ్య రోడ్డు ట్రాఫిక్ అంతంత మాత్రంగానే ఉందని, ఈ క్రమంలో రైల్వే లైను వేస్తే ప్రయాణికుల రద్దీ లేక తమ శాఖకు నష్టం వాటిల్లుతుందనే సమాధానం వచ్చిందన్నారు. అయితే ఇది వరకే చేసిన సర్వే 2010 సంవత్సరం నాటిదని, ప్రస్తుతం ఏడేళ్లు గడిచాయని.. మంత్రాలయానికి భక్తుల రద్దీ పెరిగడంతో పాటు పశ్చిమ ప్రాంతానికి ప్రయాణ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరోసారి సర్వే చేయాలని ఒత్తిడి తేవడంతో కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ఆమె వెల్లడించారు. -
శ్రీ మఠంలో సినీ సంగీత దర్శకుడు
మంత్రాలయం రూరల్: శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబసభ్యులతో సోమవారం మంత్రాలయం వచ్చారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శేషవస్త్రం, స్వామివారి మెమొంటో, ఫలమంత్రాక్షితలిచ్చి ఆశీర్వాదించారు. -
శ్రీమఠం.. భక్తజనసంద్రం
మంత్రాలయం : అధ్యాత్మిక కేంద్రమైన శ్రీరాఘవేంద్రస్వామి మఠం భక్తజనమయమైంది. శనివారం రాత్రి కర్ణాటక రాష్ట్రం నుంచి కాలినడకన భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీమఠం క్షేత్రం భక్తజనులతో కళకళలాడింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు భక్తజన సందోహం మధ్య చెక్క, వెండి, బంగారు, స్వర్ణ రథాలపై రమణీయంగా ఊరేగారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు శనివారమే వేలాదిగా తరలివచ్చి రాఘవేంద్రుల సేవలో తరించారు. మంచాలమ్మ, రాఘవేంద్రుల దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, శ్రీమఠం ప్రాంగణంలో భక్తజనులతో కనువిందు చేశాయి. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ..ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
శంభో శివ శంభో
– రమణీయం రామలింగేశ్వరుడి మహారథోత్సవం – భక్తులతో కిటకిటలాడిన రాంపురం క్షేత్రం – రథోత్సవంలో ప్రముఖులు మంత్రాలయం/రూరల్ : భక్తజనుల హర్షధ్వానాలు .. మంగళవాయిద్యాల సుస్వరాలు.. శంభో శివ శంభో అంటూ భక్తులు పఠిస్తుండగా రామలింగేశ్వరుడు రాతిగాళ్ల మహారథంపై కొలువు దీరారు. అశేషభక్తజనుల మధ్య ఉత్సవమూర్తి ఎంతో వైభవంగా మహారథంపై ఊరేగారు. మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలో శ్రీరామలింగేశ్వరస్వామి జాతర రమణీయంగా సాగింది. ఆలయ ధర్మకర్తలు వై.సీతారామిరెడ్డి, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి నేతృత్వంలో స్వామివారి రథయాత్రను కనుల పండువగా నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తి రామలింగేశ్వరుడికి గ్రామోత్సవం జరిపారు. ధర్మకర్తల ఇంటి వరకు వైభవంగా ఉత్సమూర్తిని ఊరేగించారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు ఇచ్చి పల్లకీలో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం అర్చకులు వేదపఠనం చేస్తుండగా.. ఉత్సవమూర్తులను మహారథంపై కొలువుంచి యాత్రకు అంకురార్పణ పలికారు. శివనామస్మరణ పఠిస్తూ భక్తులు రథం గొలుసులను లాగసాగారు. ఆలయం నుంచి 100 మీటర్ల మేర రథాన్ని లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. వేలాదిగా భక్తులు కర్ణాటక, ఆంధ్రప్రాంతాల నుంచి తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. తుంగాతీరమంతా భక్తులజనులతో కనువిందు చేసింది. రాంపురం క్షేత్రదారులు తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసాయి. చెక్కభజనలు, ఊయల ఆటలు భక్తులను ఆకట్టుకున్నాయి. హాజరైన ప్రముఖులు : జాతరను తిలకించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు రాంపురం వచ్చారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఎంపీ బుట్టారేణుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఆదోని, మంత్రాలయం ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి, వై.బాలనాగిరెడ్డి, ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే వెంకటరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, పత్తికొండ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి, నంద్యాల ఇన్చార్జి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, గుంతకల్లు సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్గౌరవ అధ్యక్షుడు వై.సీతారామిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్‌రెడ్డి, యూత్ కమిటీ నాయకులు ధరణీధర్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి పురుషోత్తం, మండల అధ్యక్షుడు భీమిరెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కోసిగి ఇన్చార్జి మురళీరెడ్డి, సర్పంచులు విజయమ్మ, భీమయ్య, సుకూర్సాబ్, నాయకులు బెట్టనగౌడ్, అత్రితనయగౌడ్, సీఐలు నాగేశ్వరరావు, కంబగిరి నాయుడు, ఎస్ఐ శ్రీనివాసనాయక్, రాజారెడ్డి, భానుమూర్తి పాల్గొన్నారు. -
సుమధురం..గోవిందుడి నామస్మరణం
- శ్రీవారికి దివిటి సేవ గావించిన పీఠాధిపతి - వైకుంఠ ద్వార ప్రవేశంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి - ఆకట్టుకున్న పూలంకరణ, భజన కీర్తనలు మంత్రాలయం : పుష్పతోరణ పరిమళాలు.. మంగళవాయిద్యాల సుస్వరాలు.. దాససాహిత్య మహిళల భజన కీర్తనలు.. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సోమవారం భక్తులు గోవిందుడి నామస్మరణలో తరించారు. మంత్రాలయం నడిబొడ్డున శ్రీరాఘవేంద్రస్వామి చేతుల మీదుగా ప్రతిష్టితమైన శ్రీవేంకటేశ్వరుడి సన్నిధానంలో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. శ్రీమఠం పంచాంగం రీత్యా సోమవారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల నేతృత్వంలో శ్రీవారికి విశేషపూజలు, దివిటీసేవ, ప్రత్యేక మంగళహారతులు గావించారు. అనంతరం వైకుంఠ ద్వారానికి హారతులు పట్టి ఉత్తరదిశ ముఖస్థితులైన వేంకటనాథుడు, నైరుతిభాగంలో కొలువుదీరిన పద్మావతికి పూజలు చేశారు. అనంతరం వైకుంఠ ఏకాదశి విశిష్టతను పీఠాధిపతి భక్తులకు ప్రవచించారు. గురుసార్వభౌమ దాససాహిత్య అకాడమీ మహిళలలు ఆలపించిన భక్తి కీర్తనలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ఆలయ పూజారి మదుప్రసాద్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠ మార్గ ప్రవేశం చేసి వెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే కూతురు ప్రియాంక, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచు గోరుకల్లు కృష్ణస్వామి తదితరులు పూజల్లో పాల్గొన్నారు. -
రాఘవేంద్రుల సేవలో ఉమ్మడి హైకోర్టు జడ్జి
మంత్రాలయం రూరల్: ఉమ్మడి హైకోర్టు జడ్జి రామసుబ్రమణ్యం ఆదివారం శ్రీ రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకోసం ఆయన శనివారమే ఆయన మంత్రాలయం చేరుకున్నారు. తెల్లవారుజామున గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులతో కలిసి వేదపాఠశాల భవనం, గోశాల, పరిమళ పాఠశాల, సుశీలేంద్రవసతిగృహం, తుంగభద్ర నది తీరాన్ని పరిశీలించారు. ఈయనతో పాటు మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ.నరసింహమూర్తి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ శ్రీనివాసనాయక్ తదితరులు ఉన్నారు. -
శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న భన్వర్ లాల్
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం మంత్రాలయం వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. భన్వర్ లాల్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు -
సుధా 'మంగళ ప్రదం'
– శోభాయమానంగా మహోత్సవం – పీఠాధిపతులు, పండితుల మధ్య సాగిన విద్యార్థుల వ్యాఖ్యార్థం – ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రాలయం : వేద పండిత మహాశయులు ఒకే వేదికపై కొలువుదీరిన వేళ. పుష్కర కాలం వేద అభ్యసనం చేసిన విద్యార్థుల పరీక్ష సమయం. భక్తలోకం కను, వీనుల గావింతు వేదిక. దేశ సంస్కృత విద్యాపీఠాల్లో ఏనాడు కనీవినీ ఎరుగని సుధా మంగళ మహోత్సవం. శ్రీరాఘవేంద్రస్వామి సన్నిదానంలో మంగళప్రదంగా సాగిన వేడుక ఆసాంతం శోభాయమానం. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో పన్నెండేళ్ల విద్వత్ సభ బుధవారం ఆసక్తిదాయకంగా సాగింది. శ్రీమఠం డోలోత్సవ మంటపంలో పుష్పశోభిత అలంకార సభ నిర్వహించారు. ముందుగా సుబుధేంద్రతీర్థులు, పుత్తిగె మఠం పీఠాధిపతి సుగుణేంద్రతీర్థులు శ్రీరాఘవేంద్రస్వామికి విశిష్ట పూజలు నిర్వహించారు. వేదికపై కొలువుదీరిన వేదవ్యాసులు, 25 శ్రీమన్‌న్యాయ సుధా గ్రంథాలు, జయతీర్థులు(టీకాచార్యులు) చిత్రపటాలకు శాస్త్రోక్తంగా పూజా ఘట్టాలు గావించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్య స్వరాలు, భక్తుల హర్షధ్వానులు కురుస్తుండగా సుబుధేంద్రతీర్థులు జ్యోతి ప్రజల్వనతో సుధా మంగళ మహోత్సవానికి అంకురార్పణ పలికారు. పీఠాధిపతులు ఉత్సవ విశిష్టత, వాఖ్యార్థ ఉచ్ఛరణ విధానం ప్రవచించారు. అణువణువునా వేదం : తుంగాతీరాన సుధా మంగళం వేడుక అణువణువునా వేదం పలికించింది. పీఠాధిపతులు సుబుధేంద్రతీర్థులు, సుగుణేంద్రతీర్థులు, హణసోగె విశ్వనందన తీర్థులు, బెంగుళూరు విశ్వగురుప్రియ తీర్థులు, పండిత కేసరి గిరియాచార్ సమక్షంలో విద్యార్థులు శ్రీమన్ న్యాయ సుధా గ్రంథ వాఖ్యార్థం కానిచ్చారు. విద్యార్థులు వల్లించిన శ్లోకాలకు పీఠాధిపతులు, విద్వాన్లు విచారణ జరిపారు. విద్యార్థులు ఎంతో వినయ విధేయలతో పండితుల ప్రశ్నావళికి అర్థవంత సమాధానాలు చెప్పుకొచ్చారు. మొత్తం 20 మంది విద్యార్థులు 12 ఏళ్లపాటు వేద విద్యను అభ్యసించారు. మూడేళ్లలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, పండిత కేసరి గిరియాచార్తో పఠనం చేసిన గ్రంథాలపై వాఖ్యార్థం నిర్వహించారు. మూడు బ్యాచ్‌ల విద్యార్థులూ తమ ప్రతిభతో విద్వాన్లను మెప్పించి పీఠాధిపతుల ఆశీస్సులతో అనుగ్రహ ప్రాప్తి పొందారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎంతో పవిత్రంగా సుధా మంగళం మహోత్సవం సాగింది. గురువారం విద్యార్థులకు 'వేదాంత శాస్త్ర విద్వాన్'గా పట్టా, ఒక్కోవిద్యార్థికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాలు అందజేస్తారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు : వేడుక సందర్భంగా యోగీంద్ర మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పండిత శేషగిరిరావు ఆలపించిన దాసవాణి భజన సంకీర్తనలు భక్తులను అలరించాయి. ఉడిపికి చెందిన భార్గవి నృత్య ప్రదర్శన మైమరిపించింది. గురుసార్వభౌమ దాస సాహిత్య అకాడమీ నేతృత్వంలో 1000 మందితో హరిదాస భజన గేయాలపనలు వీనుల విందు చేశాయి. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సంస్కృత విద్యాపీఠం ఉప కులపతి పంచముఖి, ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, దాస సాహిత్య అకాడమీ అప్పన్నాచార్యులు, వాదిరాజాచార్, హనుమేశాచార్ పాల్గొన్నారు. -
'మహాత్మా'తో మంచి పేరు
– శ్రీరాఘవుడి సన్నిధిలో సినీ నటుడు శ్రీకాంత్ – అమ్మ అనే పదానికి నిర్వచనం జయలలిత – వచ్చే నెలలో రారా చిత్రం విడుదల మంత్రాలయం : మహాత్మా సినిమాతో తనకు మంచి గుర్తింపు లభించిందని సినీ హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం బుధవారం ఆయన స్నేహితులతో కలిసి మంత్రాలయం వచ్చారు. స్నేహితుడు మనోహర్ (మహాత్మా సినిమా నిర్మాత, కర్ణాటక ఎమ్మెల్సీ) పుట్టినరోజును పురస్కరించుకుని మఠం యాగమండపంలో ఆయుష్షు, నవగ్రహ హోమం నిర్వహించారు. ముందుగా వారు గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు ఇచ్చారు. తర్వాత శ్రీరాఘవేంద్రస్వామి మూలబృందావనం చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు శేషవస్త్రం, రాఘవేంద్రుల జ్ఞాపిక అందజేసి ఫల, పూల మంత్రాక్షింతలతో ఆశీర్వచనాలు గావించారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ మహాత్మా సినిమా నటనతో రాష్ట్రస్థాయి అవార్డు వచ్చిందన్నారు. ఆపరేషన్ దుర్యోధన, ఖడ్గం, శంకర్‌దాదా ఎంబీబీఎస్ చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయన్నారు. వచ్చే నెలలో తాను నటించిన రారా చిత్రం విడుదలవుతుందన్నారు. ఇప్పటి వరకు 122 చిత్రాల్లో నటించినట్లు వివరించారు. కర్ణాటకలోని గంగావతిలో జన్మించానని, చిన్నప్పటి నుంచి శ్రీమఠం వస్తున్నట్లు తెలిపారు. ‘అమ్మ’లేనిలోటు తీరనిది అమ్మగా పేరుగాంచిన జయలలిత లేని లోటు దేశానికి తీరనిదని శ్రీకాంత్ అన్నారు. మరెవరినీ ఆమె స్థానంలో ఊహించలేమన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనసార దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అనంతరం కొత్త హీరో ఈషాంత్ మాట్లాడుతూ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రోక్ అనే చిత్రంలో నటించానన్నారు. తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో విడుదల అవుతుందన్నారు. వారికి మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికారు. -
గజలక్ష్మికి ఘన వీడ్కోలు
మంత్రాలయం : 36 ఏళ్లు రాఘవేంద్ర స్వామి సేవలు తరించిన గజలక్ష్మికి శ్రీమఠం ఘన వీడ్కోలు పలికింది. అటవీ శాఖ నిర్ణయం మేరకు శ్రీమఠం పీఠాధిపతులు సుబుదేంద్ర తీర్థులు నేతృత్వంలో ఆదివారం సాగనంపారు. çగజలక్ష్మికి పవిత్ర స్నానం చేయించి శ్రీమఠానికి తీసుకొచ్చారు. పీఠాధిపతి అలంకార శేషవస్త్రం కప్పి మాలలతో అలంకరించి వేదమంత్రోఛ్చారణల మధ్య విశేష పూజలు గావించారు. రాగి ముద్దలు, చెరుకు గడలు, అరటి పండ్లు నైవేద్య ఆహారంగా అందించారు. భక్తజన సంద్రం మధ్య మాడావీధుల్లో ఊరేగించారు. గజలక్ష్మి తొండంతో పీఠాధిపతికి ఆఖరి మాలధారణ గావించి టీటీడీ దేవస్థానం జంతు ప్రదర్శన శాల అధికారుల అప్పగింతలు కానిచ్చారు. ప్రత్యేక లారీలో టీటీడీ అధికారులు గజలక్ష్మిని తీసుకెళ్లారు. పీఠాధిపతి పూర్వ అస్తమ తండ్రి, పండితకేసరి గిరియాచార్ , మఠం మేనేజర్ శ్రీనివాస రావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, ధార్మికసహాయక అ«ధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
నేడు గజలక్ష్మికి వీడ్కోలు
– శాస్త్రోక్తంగా సాగనంపేందుకు శ్రీమఠం ఏర్పాట్లు – టీటీడీ జూ పార్కుకు తరలింపు మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి సేవలో తరించిన గజలక్ష్మికి (ఏనుగు) నేడు వీడ్కోలు పలుకనున్నారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థుల నేతృత్వంలో శాస్త్రోక్తంగా పూజలు గావించి సాగనంపనున్నారు. శ్రీమఠంలో పాతికేళ్లపాటు ప్రహ్లాదరాయల సేవలో గజలక్ష్మి తరించింది. 2009 వరద కారణంగా జింకల పార్కులో జింకలు మృత్యువాత పడగా వన్యప్రాణుల సంరక్షణ శాఖ శ్రీమఠంపై కొరడా ఝలిపించింది. ఏనుగుకు అనుమతులు లేని కారణంగా ప్రత్యక్ష సేవను నిలిపేశారు. అప్పటి నుంచి ఏనుగు వీఐపీల స్వాగతం, భక్తుల ఆశీర్వాదానికి పరిమితమైంది. వయోభారం దృష్ట్యా జంతు సంరక్షణ శాఖ సూచన మేరకు ఏనుగును తరలించేందుకు శ్రీమఠం నిర్ణయం తీసుకుంది. ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం జంతు ప్రదర్శన శాలకు తరలించనున్నారు. ఏనుగు సేవకు సెలవు పలికేందుకు ప్రత్యేక పూజలు చేపట్టిన్నట్లు మేనేజర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏనుగు రవాణా ఖర్చులు శ్రీమఠమే భరిస్తున్నట్లు తెలిపారు. భక్తులు తరలివచ్చి వీడ్కోలు వేడుకలో తరలించాలని కోరారు. -
శ్రీమఠం హుండీ లెక్కింపు ప్రారంభం
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం హుండీ లెక్కింపు సోమవారం సీసీ కెమెరాలు, అధికారుల నిఘా నేత్రాల మధ్య కొనసాగింది. లెక్కింపులో పలు ఆసక్తికర కానుకలు కనిపించాయి. ఓ భక్తుడు హుండీలో కేజీ వెండి బిస్కెట్లు, కంకణం, స్వామి రేకు వేశాడు. మరో భక్తుడు రూ.500 నోట్ల (100 నోట్లు) కట్టను సమర్పించారు. మొదటి రోజు హుండీ ఆదాయం రూ.63,95,600 సమకూరింది. రూ.2000 నోట్లు 106, రూ.వెయ్యి నోట్లు 746, రూ.500 నోట్లు రూ.3,466, రూ.100 నోట్లు 31,746, రూ.50 నోట్లు వెయ్యి, రూ.20 నోట్లు 1500 లెక్కలో తేలాయి. మఠం ప్రధాన హుండీతోపాటు 3 హుండీల ఆదాయాన్ని గణించారు. తహసీల్దార్ చంద్రశేఖర్‌వర్మ, ఎస్ఐ శ్రీనివాసనాయక్, మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు సమక్షంలో ఎండోమెంట్ సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు హుండీలను తెరిచారు. మరో రెండు రోజుల పాటు హుండీ లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది. -
శ్రీమఠంలో సినీ నటి హరిప్రియ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి హరిప్రియ ఆదివారం మంత్రాలయం వచ్చారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆమెకు అధికారులు మఠం మర్యాదలతో స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మ ఆలయంలో అర్చనల అనంతరం రాఘవేంద్రస్వామి మూలబృందావనం దర్శించుకుని పూజలు, హారతులు పట్టారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు శేషవస్త్రాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. తెలుగులో పిల్ల జమిందార్, తకిట తకిట, ఈ వర్షం సాక్షిగా, గలాట చిత్రాలు, కన్నడలో 16, తమిళంలో ఓ చిత్రంలో నటించినట్లు హరిప్రియ విలేకరులకు తెలిపారు. పిల్ల జమిందార్ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు లభించిందన్నారు. -
మంత్రాలయంలో పుణ్యహారతి
మంత్రాలయం : '' వరాహ వదనోద్భవతే శ్రీశైలోత్సంగ గామిని! తుంగభద్రే మహాపుణ్యే నమోస్తుతే సురప్రియే!!''.. అంటూ తుంగభద్రమ్మను స్మరిస్తూ భక్తలోకం ఆత్మజ్యోతులను సమర్పించుకుంది. కార్తిక పూర్ణిమను పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతి సుభుధేంద్రతీర్థులు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి పుణ్యహారతి నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రస్వామి మూల బృందావనం నుంచి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ప్రత్యేక వాహనంపై ఊరేగింపుగా బయలు దేరారు. శ్రీమఠం ప్రాంగణం ఎదుట కార్తిక ఘటం జ్యోతి ప్రజ్వలన చేశారు. అక్కడి నుంచి గజరాజు, మంగళవాయిద్యాలు, భజనలతో ఊరేగింపుగా తుంగభద్ర తీరం చేరుకున్నారు. తుంగభద్ర నదికి శాస్త్రోక్తంగా అర్చనలు చేశారు. అర్చకులు వేదపఠనం గావిస్తూ సప్త హారతులు పట్టారు. శ్రీమఠం చేరుకుని గురుసార్వభౌమ దాస సాహిత్య ప్రాంగణంలో భజనలు చేశారు. దీపోత్సవంలో జిల్లా కోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి, జిల్లా పరిషత్ సీఈవో ఈశ్వర్ పాల్గొన్నారు. -
నేడు తుంగా హారతి
– ఏర్పాట్లలో శ్రీమఠం అధికారులు – నదీ తీరం, ప్రాంగణంలో దీపోత్సవం మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి సన్నిధిలో సోమవారం పవిత్ర తుంగా హారతి ఇవ్వనున్నారు. ఇందుకు పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో తుంగభద్ర నది తీరంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 11 గంటల వరకు పుణ్యహారతి, కార్తీక దీపోత్సవం చేపడతారు. ముందుగా ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ప్రత్యేక వాహనంపై గజరాజు స్వాగతిస్తుండగా మంగళవాయిద్యాలు, భజనలు, వేద పఠనంతో ఊరేగింపుగా నది చెంతకు తీసుకువస్తారు. అక్కడ పీఠాధిపతి తుంగా హారతి విశిష్టతను భక్తులకు ప్రవచిస్తారు. పవిత్ర నది జలంతో ఆజ్యం ఇచ్చి కుంకుమార్చన, నారీకేళ సమర్పణ, వాయినాలు వదిలి శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. అర్చకులు కార్తీక దీపాలతో వేదపఠనం సాగిస్తూ హారతులు పడతారు. భక్తులు వేలాదిగా నదీ తీరం, శ్రీమఠం ప్రధాన ద్వారం, ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఈ నేపథ్యంలో మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.17కోట్లు
మంత్రాలయం : అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీ మఠం రాఘవేంద్ర స్వామి హుండీ నుంచి రూ.1,17,29, 253 సమకూరినట్లు మఠం మేనేజర్ శ్రీనివాస రావు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగిన హుండీ లెక్కింపులో 50 గ్రాముల బంగారం, 442 గ్రాముల వెండీ , 1933 విదేశీ కరెన్సీ వచ్చినట్లు వివరించారు. దసరా సెలవులు, శ్రీ మఠంలో కార్తీక పూజలు మెదలు కావడంతో భక్తుల రద్దీ పెరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా హుండీ ఆదాయం అధికంగా వచ్చినట్లు చెప్పారు. -
శ్రీ మఠానికి మినీ బస్సు విరాళం
మంత్రాలయం రూరల్: రాఘవేంద్రస్వామి మఠానికి రూ.30 లక్షలు విలువ చేసే మినీ బస్సును విరాళంగా అందజేసినట్లు శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. చెన్నైకి చెందిన రమేష్ అనే భక్తుడు బస్సును విరాళంగా అందజేశాడని, శ్రీ మఠం అవసరాలకు వినియోగిస్తామన్నారు. దాత కుటుంబసభ్యులకు శేషవస్త్రం, స్వామివారి మెమొంటో, ఫలమంత్రాక్షితలిచ్చి ఆశీర్వాదించారు. -
మంచాలమ్మకు శ్రీమఠం పీఠాధిపతి పూజలు
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. దశమి సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు గ్రామ దేవత మంచాలమ్మకు విశేష పూజలు చేశారు. అమ్మవారికి పట్టువస్త్రం, బంగారు కిరీటం సమర్పించి అర్చన, అభిషేకాలు చేపట్టారు. అమ్మ సన్నిధిలో అరగంటపాటు గడిపారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూలబృందావనానికి హారతులు పట్టి మూలరాముల పూజలకు ఉపక్రమించారు. రాత్రి శ్రీమఠం ప్రాంగణంలోని బన్ని(శమీ) వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మఠం నుంచి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను ఊరేగింపుగా అక్కడికి తీసుకెళ్లి వృక్షం ఎదుట ఆశీనులు చేశారు. పండితుల వేదపఠనం చేస్తుండగా శాస్త్రోక్తంగా పుష్ప, ముత్యాలభిషేకం జరిపారు. దసరా సెలవులు రావడంతో భక్తులు వేలాదిగా శ్రీక్షేత్రాన్ని సందర్శించారు. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
జిల్లాలో పలు చోట్ల వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 30 మండలాల్లో ఆదివారం రాత్రి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికగా మంత్రాలయంలో 28.2 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం మీద 5మిమీ వర్షపాతం నమోదు అయింది. ఈ వర్షాల వల్ల రబీ పంటలకు, ఖరీప్‌లో సాగు చేసిన కంది పంటకు ఉపశమనం లభించింది. ఎమ్మిగనూరులో 26.2, గొనెగండ్లలో 26.4, కొసిగిలో 19.4, మిడుతూరులో 17.2, ఓర్వకల్లో 17.2, ఉయ్యలవాడలో 14.6,నందవరంలో 13.8, ఆళ్లగడ్డలో 12.4, బండిఆత్మకూరులో 11.8మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. -
టెంపో, కారు ఢీ..10 మందికి గాయాలు
కర్నూలు జిల్లా తుగ్గలి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది కర్ణాటక వాసులు గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం హెబ్బళి సమీపంలోని దాసనహళ్లికి చెందిన పది మంది టయోటా కారులో మంత్రాలయం పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. వారి వాహనాన్ని తుగ్గలి మండల కేంద్రం సమీపంలో పత్తికొండ నుంచి గొర్రెల లోడుతో వస్తున్న టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 10మంది గాయాలపాలయ్యారు. వారిలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
శ్రీమఠంలో వేదవ్యాస పూజ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠంలో ఆదివారం వేదవ్యాసుడి ఆరాధన పూజలు ఘనంగా జరిగాయి. స్థానిక పూజామందిరంలో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు వేదవ్యాసుడి ప్రతిమకు, జయ, దిగ్విజయ, మూలరాముల విశేష పూజలు గావించారు. శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు పుష్ప, పంచామృతాభిషేకం, మహా మంగళహారతులు చేపట్టారు. పూజా విశిష్టతలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా సెలవులు భక్తులు వేలాదిగా తరలివచ్చి రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకున్నారు. భక్తుల రాకతో శ్రీమఠం కళకళలాడింది. మఠం మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి భక్తుల ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
పీఠాధిపతికి పుష్పాభిషేకం
మంత్రాలయం : చాతుర్మాస దీక్షలో కొనసాగుతున్న రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులకు పుష్పాభిషేకం నిర్వహించారు. సోమవారం బళ్లారికి చెందిన భక్తుడు హెచ్.జి.రాములు నేతత్వంలో మఠం అర్చకులు అభిషేకం గావించారు. డోలోత్సవ మండపంలో వేద మంత్రోచ్ఛారణలు పఠిస్తుండగా పీఠాధిపతి శిరస్సుపై నుంచి పూల వర్షం కురిపించారు. అనంతరం భక్తులకు పీఠాధిపతి ప్రవచనం చేశారు. చాతుర్మాస దీక్ష పవిత్రతను వివరించారు. భక్తులకు రాఘవేంద్రస్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుందన్నారు. పుష్పాభిషేకం వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వేడుకలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సంస్కత విద్యాపీఠం ప్రధానాచార్యులు వాదిరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
శ్రీమఠంలో సినీ నటి ప్రేమ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి ప్రేమ గురువారం మంత్రాలయం వచ్చారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమార్చన, హారతులు పట్టారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆమెకు శేషవస్త్రం, ఫల, పూల, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. -
శ్రీమఠంలో సినీ నటి హరిప్రియ
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం సినీ నటి హరిప్రియ బుధవారం రాత్రి మంత్రాలయం వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసిరాగా అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి మఠం మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆమె గ్రామ దేవత మంచాలమ్మ ఆలయంలో అర్చనలు చేసుకున్నారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూలబందావనం దర్శించుకుని పూజలు, హారతులు పట్టారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు.. శేషవస్త్రాలు, రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ఫల,పూల మంత్రాక్షింతలతో ఆశీర్వదించారు. ఆమె మాట్లాడుతూ తెలుగులో పిల్ల జమిందార్, తకిట తకిట, ఈ వర్షం సాక్షిగా, గలాట చిత్రాలు, కన్నడలో 16, తమిళంలో ఓ చిత్రంలో నటించినట్లు వివరించారు. పిల్ల జమిందార్ చిత్రం తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. -
కనుల పండువగా ఊంజలసేవ
– మూలబృందావనానికి పంచామృతాభిషేకం – ఉరుకుంద భక్తులతో శ్రీమఠం కిటకిట – అలరించిన సంగీత, నాట్య ప్రదర్శన మంత్రాలయం : శ్రీ రాఘవేంద్రస్వామి 345 సప్తరాత్రోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రహ్లాదరాయలకు ఊంజలసేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు రాయరు మూలబృందావనానికి మహా పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ గావించారు. అనంతరం పూర్వపు పీఠాధిపతి సుజ్ఞానేంద్రతీర్థుల ఆరాధన నిర్వహించారు. పీఠాధిపతి వారి మృత్తిక బృందావనానికి అభిషేకం, హస్తోదకం, పుష్పార్చన, హారతులు పట్టారు. అనంతరం మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అశ్వవాహనంపై ఆశీనులను చేసి ఊంజల సేవ నిర్వహించారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు : డోలోత్సవ మండపంలో హైదరాబాద్‌కు చెందిన శేషులత కోసరు, యోగీంద్ర మండపంలో బెంగళూరు కృష్ణప్ప జోగి దాసవాణి భక్తులకు వీనుల విందు చేశాయి. విజయవాడ రోహిత కూచిపూడి నాట్య భంగిమలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. నేడు సర్వ సమర్పణోత్సవం : రాయరు సప్తరాత్రోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం సర్వ సమర్పణోత్సవం నిర్వహిస్తారు. ఉదయం మండలంలోని నవ మంత్రాలయం (తుంగభద్ర)లో రథయాత్ర ఉంటుంది. పీఠాధిపతి అక్కడికి చేరుకుని రాఘవేంద్రుల మృత్తిక బృందావనానికి పంచామృతాభిషేకం, విశేషాలంకరణ, పూజలు, హారతులు పడతారు. చెక్క రథంపై రాయరును పురవీధుల్లో ఊరేగిస్తారు. రాత్రి శ్రీమఠంలో సర్వ సమర్పణోత్సవంలో భాగంగా పంచవాహనాలపై ప్రహ్లాదరాయలకు రథయాత్ర గావిస్తారు. -
సింహ వాహనంపై విశ్వమోహనుడు
– ఘనంగా పూర్వారాధన వేడుకలు – అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం – సింహవాహనంపై ఊరేగిన ప్రహ్లాదరాయలు మంత్రాలయం: విశ్వమోహనుడు సింహవాహనంపై అలరారుతూ ఊరేగుతుండగా శ్రీమఠం ఆధ్యాత్మిక తరంగాల్లో ఓలలాడింది. భక్తజనం భువనమోహనుడి వైభవం తిలకించి మైమరిచారు. శ్రీరాఘవేంద్రస్వామి సప్త రాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పూర్వారాధన వేడుక కన్నుల పండువగా నిర్వహించారు. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతత్వంలో రాఘవేంద్రులకు సుప్రభాతసేవ, పంచామతాభిషేకం, పుష్పాలంకరణలు గావించారు. మూలరాముల పూజ, రాయరు పాద పూజలో పీఠాధిపతి తరించిన తురణం భక్తులను ఆకట్టుకుంది. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు ఊంజలలో సింహవాహనంపై తూగారు. అనంతరం పండితులు వేదాలు వల్లిస్తుండగా.. మంగళవాయిద్యాలు సుస్వరనాదం వాయించగా.. భక్తులు ఉత్సవమూర్తి నామ స్మరణ అందుకున్నారు. శ్రీమఠం మాడవీధుల్లో సింహవాహనం ఊరేగిన దశ్యం మహా అద్భుతం. అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం : ఆనవాయితీలో భాగంగా వేడుకలను పురష్కరించుకుని ప్రముఖులకు రాఘవేంద్రస్వామి అనుగ్రహ ప్రశస్థి అవార్డులు ప్రధానం చేశారు. యోగీంద్ర మంపడంలో పీఠాధిపతి చేతుల మీదుగా సామాజిక సేవకుడు సూర్యనారాయణరెడ్డి, సంస్కత విద్యాపీఠం ఉప కులపతి డాక్టర్ వీఆర్ పంచముఖి, అద్వైత వేదాంత, మీమాంశ సబ్జెక్టు ప్రొఫెసర్ డాక్టర్ మణిద్రవిడకు రూ.లక్ష నగదుతోపాటు రాఘవేంద్రస్వామి జ్ఞాపిక, ప్రశంశపత్రాలు అందజేశారు. గ్రహీతల సేవలు, ప్రతిభను కొనియాడారు. సాంస్కతిక ప్రదర్శనలో భాగంగా బెంగళూరుకు చెందిన ముద్దుమోహన్ సంగీత విభావరి, ముంబాయి రాధాకష్ణ నత్య శాల కళాకారులు నాట్య భంగిమలు భక్తులను అలరించాయి. వేడుకలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్, ద్వార పాలక అనంతస్వామి పాల్గొన్నారు. నేడు మధ్యారాధన : ఆరాధనలో భాగంగా శనివారం మధ్యారాధన నిర్వహిస్తారు. రాఘవేంద్రుల మూల బందావనానికి మహా పంచామతాభిషేకం, గజవాహన, రజత, స్వర్ణ, నవరత్న రథోత్సవాలు ప్రత్యేకం. భక్తులు రాత్రి ఒంటి గంట వరకు వేడుకలు తిలకిస్తారు. -
రాయరు సన్నిధిలో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం గురువారం తెలుగు సినీ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన మంత్రాలయం చేరుకున్నారు. శ్రీమఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మఠం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు కుంకుమర్చాన, సంకల్పం చేసుకున్నారు. అనంతరం ఆమె రాఘవేంద్రస్వామి మూలబందావనాన్ని దర్శించుకున్నారు. -
ఆధ్యాత్మిక పరవళ్లు
– శ్రీమఠంలో రెండోరోజు ఘనంగా వేడుకలు – కనువిందు చేసిన శాఖోత్సవం – అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు మంత్రాలయం: విరుల తోరణాల పరిమళాలు.. మంగళవాయిద్యాల సుస్వరాలు.. భక్తజన కోలాహలంతో శ్రీరాఘవేంద్రుల క్షేత్రంలో ఆధ్యాత్మికం పరవళ్లు తొక్కింది. రాయరు 345వ సప్తరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం వేడుకలు శాస్త్రోక్తంగా సాగాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో శాఖోత్సవం, రజత మంటపోత్సవం ప్రత్యేకం. శాఖోత్సవంలో భాగంగా పచ్చి కూరగాయలు, ఫలాలకు విశేష పూజలు చేపట్టి పీఠాధిపతి హారతులు పట్టారు. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు పీఠాధిపతి డోలోత్సవ మండపంలో దివిటీ, ఊంజల సేవ భక్తులను ఆకట్టుకుంది. ఉదయం రాఘవేంద్రుల మూలందావనంకు పంచామతాభిషేకం గావించారు. యాగశాలలో యజుర్వేద ఉపాకర్మ యజ్ఞం కానిచ్చారు. బ్రాహ్మణులు జంజముల మార్పిడి చేపట్టారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు: వేడుకలు పురష్కరించుకుని యోగీంద్ర మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. బెంగళూరుకు చెందిన రాఘవేంద్ర సంగీత కచేరి, బళ్లారికి చెందిన చిన్నారి పల్లవి దేశాయ్ నాట్య ప్రదర్శన ఆకట్టుంది. గీతా సంజీవ్ కులకర్ణి దాసవాణి భక్తి గేయాలు మైమరిపించాయి. వేడుకల్లో ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు. నేడు పూర్వారాధన : ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం పూర్వారాధన జరగనుంది. మూలబృందావనానికి మహా పంచామృతాభిషేకం, ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల సింహవాహనోత్సవం నిర్వహిస్తారు. మంత్రాలయం హనుమేష్, బెంగుళూరు ముద్దుమోహన్చే దాసవాణి ఉంటుంది. ముఖ్యంగా మంత్రాలయం సంస్కృత విద్యాపీఠం ఉప కులపతి పంచముఖి, మహోపాధ్యాయ మద్రాసు మీమాంస సంస్కృత కళాశాల ప్రొఫెసర్ మణి ద్రవిడ, బళ్లారికి చెందిన సామాజిక సేవకుడు, బళ్లారి మఠం అభివద్ధి ప్రదాత సూర్యనారాయణరెడ్డికి రాఘవేంద్ర అనుగ్రహ ప్రశస్థి అవార్డుల ప్రదానం పీఠాధిపతి చేతుల మీదుగా గావిస్తారు. -
కనుల పండువగా కలశ ప్రతిష్టాపన
– గర్భాలయ శిలా మండపానికి వాస్తు పూజ – స్వర్ణ లేపన గోపుర ప్రారంభోత్సవం మంత్రాలయం : శ్రీమఠంలో శనివారం స్వర్ణ లేపన శిఖర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. శిలా మండపానికి వాస్తు పూజ కానిచ్చారు. ముందుగా పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు స్వహస్తాలతో మంగళవాయిద్యాల మధ్య గోమాత, అశ్వ, గజరాజు పూజలు గావించారు. శ్రీమఠం మాడ వీధులు చుట్టేసుకుంటూ గర్భాలయ ద్వారాలకు విశేష పూజలు చేశారు. మూలబృందావనం చేరుకునే ద్వారం గుండా ముందుగా గో ప్రవేశం చేయించారు. అనంతరం గర్భాలయంలో వాస్తు, శాంతి హోమాల్లో పీఠాధిపతి తరించారు. అనంతరం కలశంతో శ్రీమఠం వీధుల్లో భారీ ఊరేగింపుగా బయలు దేరారు. పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాలు, భక్తుల హర్షద్వానాల మధ్య బంగారు లేపనంతో నిర్మించిన శిఖరం చేరుకుని విశేష పూజల అనంతరం కలశ ప్రతిష్టాపనకు అంకురార్పణ పలికారు. కలశ శిఖరాన కపిరాజు విజయ ధ్వజారోహణ చేశారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి ప్రతిష్టాపనోత్సవాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు. -
చాతుర్మాస దీక్షలో శ్రీమఠం పీఠాధిపతి
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు చాతుర్మాస దీక్ష బూనారు. ఆదివారం వేకువజామున రాఘవేంద్రుల మూలబందావనానికి విశేష పూజలు చేసిన అనంతరం మూల, జయ, దిగ్విజయ రామ పూజల్లో తరించారు. అనంతరం దీక్షను స్వీకరణ చేశారు. 41 రోజుల పాటు చాతుర్మాస దీక్షలో పీఠాధిపతులు ఉంటారు. లోక కల్యాణార్థం శ్రీమఠంలోనే జపతప అనుష్టానం చేస్తారు. దీక్ష వాస్తవంగా త్రయోదశి రోజున స్వీకరించడం ఆనవాయితీ. తిథిలోపం కారణంగా ఆదివారం ద్వాదశి, త్రయోదశి కలిసిరావడంతో పీఠాధిపతి చాతుర్మాస దీక్షకు ఉపక్రమించారు. 41 రోజుల తర్వాత సీమోల్లంఘన ఉంటుంది. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ధార్మిక సహాయ అధికారి వ్యాసరాజాచార్, ద్వారపాలక అనంతస్వామి పాల్గొన్నారు -
అదుపు తప్పిన స్కూల్ బస్సు
కల్లుదేవకుంట(మంత్రాలయం రూరల్): ఓ స్కూల్ బస్సు బుధవారం ఉదయం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామ శివారులో చోటుచేసుకుంది. రవీంద్రావిద్యానికేతన్కు చెందిన స్కూల్ బస్సు బుధవారం ఉదయం మంత్రాలయం నుంచి ఇబ్రహీంపురం గ్రామానికి విద్యార్థులను తీసుకుని వచ్చేందుకు బయలుదేరింది. కల్లుదేవకుంట గ్రామ శివారులోకి వెళ్లే సరికి రోడ్డు చిత్తడిగా ఉండటంతో బస్సు అదుపు తప్పి పంటల పొలాల్లోకి దూసుకెళ్లింది. విద్యార్థులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఇదేమి తిరకాసు!
- ఇసుక రీచ్ నిధులు తిరిగి ఇవ్వాలని ఆదేశం - ఎంపీడీవో కార్యాలయం రూ.8 లక్షలు, మంత్రాలయం పంచాయతీ రూ.4 లక్షలు చెల్లించాలట.. - ఖర్చు చేసిన నిధులు ఎలా ఇవ్వాలని ఆందోళన మంత్రాలయం: మూడేళ్ల క్రితం జమ చేసిన నిధులు తిరిగి చెల్లించాలంటూ మంత్రాలయం ఎంపీడీవో, మంత్రాలయం మేజర్ పంచాయతీ ఆదేశ పత్రాలు జారీ అయ్యాయి. నిధులన్నీ ఖర్చు అయ్యాక ఎలా చెల్లించాలంటూ పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక వేలములో భాగంగా మంత్రాలయంలో 2011–12లో ఇసుక రీచ్‌ను ఎంఎస్ చౌడేశ్వరి మైనింగ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ ఇసుక తవ్వకాల హక్కు పొందింది. మొదటి బిడ్ కింద రూ.1.20 కోట్లు వేలం ద్వారా జిల్లా పరిషత్‌కు జమ చేసింది. అందులో జిల్లా పరిషత్‌కు రూ.30.16 లక్షలు (25 శాతం), మంత్రాలయం మండల పరిషత్ కార్యాలయానికి రూ.60.32 లక్షలు (50శాతం), మంత్రాలయం పంచాయతీకి రూ.30.16 లక్షలు (25 శాతం) ప్రకారం జమ చేశారు. ఈ నిధులతో వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, మట్టిరోడ్లు, నీటి వసతి కల్పనతోపాటు పలు అభివృద్ధి పనులు చేశారు. నిధులు మంజూరు సమయంలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగింది. ఇసుక రీచ్ నిధులు ప్రస్తుతం ఖాతాల్లో చిల్లిగవ్వ లేదు. ఇసుక తవ్వలేదంట.. నిధులు వెనక్కు ఇవ్వాలట చౌడేశ్వరి కంపెనీ 2011 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2011 మే 27వ తేదీ వరకు మొత్తం 57 రోజులు ఇసుక తవ్వకాలు చేపట్టలేకపోయింది. ఈ మేరకు జమ చేసిన నిధుల్లో రూ.16.08 లక్షలు చెల్లించాలని జెడ్పీ సీఈఓ ఈశ్వర్ లేఖ పంపారు. మంత్రాలయం మండల పరిషత్ రూ.8.04 లక్షలు, మంత్రాలయం పంచాయతీ రూ.4.02 లక్షలు తిరిగి చెల్లించాలని ఆదేశించారు. మొత్తాన్ని జిల్లా పరిషత్ సాధారణ ఖాతాలో వేయాలని సూచించారు. -
భయపెట్టే మంత్రం!
తెలుగులో హారర్ థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అదే తరహా కథాంశంతో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం రూపొందనుంది. మమతా రావత్, ప్రదీప్ ముఖ్యతారలుగా యం.ఎస్.బాబు స్వీయదర్శకత్వంలో నిర్మించనున్న చిత్రం ‘మంత్రం తంత్రం యంత్రం’. ఈ చిత్రం ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి వరంగల్ ఎంపి దయాకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని దర్శక-నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: గిరి దోసాడ, కథ: మహేశ్వర్, సహ నిర్మాతలు: అంబాల రవి, మోతే ప్రకాశ్‌రెడ్డి, ఎన్. అప్సర,యస్.కె.మఖ్బూల్. -
రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నకీరవాణి
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి బుధవారం ఉదయం వచ్చిన కీరవాణి ముందుగా గ్రామదేవత మాంచాలమ్మ దర్శనం చేసుకుని అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనం దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ సహాయక ప్రజా సంబంధాల అధికారి స్వాగతం పలికారు. -
రాఘవేంద్రుడికి వెంకన్న పట్టువస్త్రాలు
మంత్రాలయం (కర్నూలు) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ నెల 10న ప్రారంభమైన గురు వైభవోత్సవాలు మంగళవారం నాటితో ముగిశాయి. చివరి రోజున టీటీడీ జేఈఈఓ శ్రీనివాసరాజు, ట్రెజరీ అధ్యక్షుడు గురురాజాచార్ పట్టువస్త్రాలను తీసుకురాగా.. శ్రీమఠం అధికారులు ప్రధాన ముఖద్వారం వద్ద పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీమఠం ప్రాంగణంలో పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఎదురేగి పట్టువస్త్రాలను స్వీకరించారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బందావనానికి పట్టువస్త్రాలను అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డోలోత్సవ మండపంలో పీఠాధిపతి మాట్లాడుతూ.. పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వామి నామం వెంకటనాథుడని గుర్తు చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు అయితే.. జగద్గురువుగా రాఘవేంద్ర స్వామి ప్రజల హదయాల్లో కొలువై ఉన్నారన్నారు. ఇరు దైవాల అనుబంధానికి ప్రతీకగా పట్టువస్త్రాల సమర్పణ ఆనవాయితీగా వస్తోందన్నారు. కార్యక్రమంలో మఠం ఏఓ రొద్దం ప్రభాకర్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రాలయంలో ప్రముఖులు
మంత్రాలయం : కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని ఆదివారం హైకోర్టు జడ్జి జస్టిస్ శివశంకర్, ఏపీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఐవైఆర్ కృష్ణారావు, కర్నాటక రాష్ట్రంలోని మత్తూరు మఠం పీఠాధిపతి భోదానంద సరస్వతిస్వామిజీ దర్శించుకున్నారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనంను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి ఆశీర్వాచనాలు అందజేశారు. వీరి వెంట ఎమ్మిగనూరు జడ్జి రవిశంకర్, సీఐ నాగేశ్వరావు, ఎస్సై సునిల్‌కుమార్ తదితరులు ఉన్నారు. -
మంత్రాలయంలో గురు వైభవోత్సవాలు
మంత్రాలయం (కర్నూలు) : రాఘవేంద్రస్వామి నామస్మరణతో తుంగభద్ర నదీ తీరం పులకించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో గురు వైభవోత్సవ కార్యక్రమాలు ఆదివారంతో నాల్గవ రోజుకు చేరుకున్నాయి. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో తెల్లవారుజాము నుంచి రాఘవేంద్రస్వామి మూల బృందావనంకు సుప్రభాతసేవ, నిర్మల విసర్జన, పాదపూజ, సంస్థాన పూజ నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను బంగారులో పల్లకిలో శ్రీ మఠం మాడ వీధుల్లో ఊరేగించారు. పూజామందిరంలో మూల, దిగ్విజయ, జయరాములకు పీఠాధిపతి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. -
భక్తులతో కిక్కిరిసిన శ్రీమఠం
మంత్రాలయం (కర్నూలు) : శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. భక్తులు ముందుగా తుంగభద్ర నదిలో స్నానమాచిరించి గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూలబృందావనంను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఏకదాశి కావడంతో రాఘవేంద్రస్వామి నిర్మల బృందావన దర్శనం భక్తులకు అందుబాటులో ఉంది. స్వామి వారి దర్శనం కోసం ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, అసిస్టెంట్ పీఆర్వో వ్యాసరాజాచార్ తదితరులు ఉన్నారు. -
ఆటో బోల్తా: నలుగురికి తీవ్రగాయాలు
మంత్రాలయం (కర్నూలు) : టైర్ పంక్చరై ఆటో బోల్తాపడిన ఘటన మంత్రాలయం మండలంలోని చిలకలదోన గ్రామ శివారులో గురువారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం వైపు వెళ్తున్న ఆటో టైర్ పంక్చర్ కావడంతో బోల్తా పడింది. డ్రైవర్ వీరేంద్ర,ప్రయాణీకులు భీమేశ్, నాగరాజు, హనుమంతు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మంత్రాలయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్
మంత్రాలయం (కర్నూలు జిల్లా) : కర్నూలు జిల్లా మంత్రాలయంలో కొలువైన శ్రీరాఘవేంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఆయన గ్రామదేవత మాంచాలమ్మను దర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు శ్రీపీఠం పీఠాధిపతి శేషవస్త్రం సమర్పించి ఆశీస్సులు అందజేశారు. -
రాఘవేంద్రుని సన్నిధిలో ఆప్కాబ్ చైర్మన్
మంత్రాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు(ఆప్కాబ్) చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గురువారం ఉదయం మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా మంత్రాలయం చేరుకున్న ఆయన ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా శ్రీమఠం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
ఆటోలోనుంచి పడి విద్యార్థి మృతి
మంత్రాలయం (కర్నూలు) : పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న చిన్నారి ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం విద్యానగర్‌లో జరిగింది. వివరాల ప్రకారం.. మండలంలోని సాలహలి గ్రామానికి చెందిన జీవరత్నం(12) విద్యానగర్‌లోని పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. కాగా మంగళవారం పాఠశాల అనంతరం ఇంటికి వెళ్లడానికి బస్సు రాకపోవడంతో.. ఆటో ఎక్కాడు. ఆటో విద్యానగర్ చివరకు రాగానే ప్రమాదవశాత్తూ ఆటోలో నుంచి జారిపడ్డాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికులు విద్యార్థిని వెంటనే ఆదోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతిచెందాడు. -
మంత్రాలయంలో భక్తుల రద్దీ
మంత్రాలయం (కర్నూలు) : కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. -
పొలంలో మహిళను బెదిరించి ...
కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారుల్లో ఒంటరిగా పొలం పనులు చేసుకుంటున్న మహిళను దుండగుడు కత్తితో బెదిరించాడు. మెడలోని గొలుసు ఇవ్వకుంటే చంపేస్తానని అన్నాడు. దాంతో బయపడిన మహిళ మెడలోని రెండు తులాల గొలుసును దుండగుడికి ఇచ్చేసింది. ఆ గొలుసును తీసుకుని దుండగుడు బైక్‌పై పరారైయ్యాడు. దాంతో మహిళ బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే ఆమె వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందులోభాగంగా నిందితుడి వివరాలను బాధితురాలిని అడిగి తెలుసుకుంటున్నారు. -
నదిలో దూకిన గర్భిణీ
మంత్రాలయం (కర్నూలు) : అత్తింటి ఆరళ్లతో ఓ గర్భిణీ నదిలో దూకింది. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని తుంగభద్ర గ్రామానికి చెందిన మాధవి(20)కి ఏడాది కిందట వివాహమైంది. అయితే ఆమె ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. కాగా మంగళవారం ఆమెకు భర్త తరపు కుటుంబసభ్యులతో వాగ్వాదం జరిగింది. దీంతో మనస్థాపం చెంది ఆమె నదిలో దూకింది. కుటుంబసభ్యులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ ఆమె ఆచూకీ తెలియలేదు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
మంత్రాలయం (కర్నూలు) : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామంలోని తోట హనుమప్ప ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు విగ్రహాలను చిందరవందరగా పడేసి తవ్వకాలు చేశారు. తవ్వకాలు జరపడానికి ముందు పూజలు నిర్వహించినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శనివారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
రాఘవేంద్రునికి తితిదే పట్టువస్త్రాలు
మంత్రాలయం: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) తరపున ఆలయ అధికారులు మంత్రాలయ రాఘవేంద్రస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సోమవారం ఉదయం పట్టువస్త్రాలు తీసుకువచ్చిన ఈవో సాంబశివరావుకు శ్రీ పీఠం అధిపతి శ్రీసుబుధేంద్ర స్వామి ఘనంగా స్వాగతం పలికారు. ఏటా జరిగే సప్తరాత్రోత్సవాల సందర్భంగా మధ్యారాధన రోజున తితిదే పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ మేరకు తితిదే అధికారులు పట్టు వస్ర్తాలు అందజేశారు. -
శ్రీ రాఘవేంద్రుల సప్తరాత్రోత్సవాలు
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రాఘవేంద్రస్వామి ఆలయంలో ఏడురోజుల పాటు సప్తరాత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తెలిపారు. శుక్రవారం నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించన్నునారు. ఆగస్టు 31న మధ్యారాధన సందర్భంగా టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ, మహా పంచామృతాభిషేకం, రజత, స్వర్ణ, నవరత్న రథోత్సవాలు జరుపుతారు. సెప్టెంబర్ 1న ఉత్తరారాధన సందర్భంగా మహా రథోత్సవం సంస్కృత పాఠశాల వరకు ఉత్సవ మూర్తి ప్రహాల్లాదరాయుల ఊరేగింపు నిర్వహిస్తారు. -
రాఘవేంద్రుని సన్నిధిలో ఆర్బీఐ జీఎం
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని ఆర్బీఐ జనరల్ మేనేజర్ విజయసింగ్ షెకావత్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్బీఐ ఇంచార్జీ ఆర్ఎన్. దాసు స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మాంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బృందావనం చేరుకొని రాఘవేంద్రస్వామి పూజలు నిర్వహించారు. వీరికి శ్రీమఠం ఫిఠాదిపతి సుభుదేంద్రతీర్థులు ఫలమంత్ర అక్షింతలు సమర్చించారు. -
మంత్రాలయంలో భారీవర్షం : వాగులో చిక్కుకున్న మహిళలు
కర్నూలు (మంత్రాలయం) : మంత్రాలయం మండల పరిధిలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి సమీపంలోని నల్లవాగు పొంగిపొర్లుతోంది. దురదృష్టవశాత్తూ ఎనిమిది మంది మహిళలు, ఓ పురుషుడు నల్లవాగులో చిక్కుకుపోయారు. విషయం తెలిసిన పట్టణ సీఐ ప్రత్యేక పుట్టీలను తెప్పించి వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
భక్తులతో మంత్రాలయం కిటకిట
మంత్రాలయం (కర్నూలు జిల్లా) : వరుసగా రెండు రోజులు సెలవుదినాలు కావడంతో మంత్రాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు తొలుత గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. కర్నూలు జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ రాఘవేంద్ర కూడా స్వామివారిని దర్శించుకున్నారు. -
తుంగభద్ర నదిలో పడి వ్యక్తి మృతి
మంత్రాలయం: మద్యం మత్తులో నది దాటుతూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. శనివారం కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రాలయం కు చెందిన గురురాజు(40) శనివారం ఉదయం సరిహద్దు కర్ణాటకలోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేసి తిరుగు ప్రయాణంలో తుంగభద్ర నది దాటుతూ ప్రమాదవశాత్తూ నీటిలో పడి మునిగిపోయాడు. తోటి ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. గురురాజు మద్యం మత్తులో ఉన్నాడని వారు తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
రాఘవేంద్రుడి సేవలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
మంత్రాలయం: ఇన్ఫోసిస్ మాజీ చైర్మన్ నారాయణమూర్తి బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. తొలుత ఆయన గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణ భక్తునివలే ఆయన జనరల్ క్యూలైన్లో వెళ్లి రాఘవేంద్రస్వామి మూల విగ్రహానికి పూజలు చేశారు. మంత్రాలయం వచ్చిన ఆయనకు బుధవారం ఉదయం శ్రీమఠం మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ వైష్ణవమూర్తి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. -
ఆత్మహత్యలు వద్దు
రైతులకు మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ మహాస్వామీజీ హితవు రైతులకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలి బళ్లారి : దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతన్నలు ఎట్టి పరిస్థితుల్లోను ఆత్మహత్యలు చేసుకోకూడదని మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థ మహా స్వామీజీ పేర్కొన్నారు. ఇటీవల బళ్లారి తాలూకా కప్పగల్లు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు ఏ.మల్లయ్య, దాదావలి కుటుంబాలను ఆదివారం రాత్రి స్వామీజీ పరామర్శించి సాంత్వన పలికారు. మంత్రాలయం స్వామీజీతో పాటు కురుగోడు మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి తదితరులు వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరి కుటుంబాలకు ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. మంత్రాలయం మఠం నుంచి బియ్యం, బ్యాళ్లు, బెల్లం తదితర నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ దేశానికి రైతులే వెన్నెముకలాంటి వారని గుర్తు చేశారు. అలాంటి వెన్నెముక విరిగిపోతే దేశం ముందడుగు వేయలేదన్నారు. అన్నదాత ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ఆత్మహత్యలే సమస్యకు పూర్తి పరిష్కారం కాదన్నారు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల వారిని నమ్ముకున్న కుటుంబం కష్టాల్లోకి నెట్టినట్లు అవుతుందన్నారు. కుటుంబంలో తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, అన్నదమ్ములు ఇలా ప్రతి ఒక్కరినీ బాధల్లోకి తీసుకెళతారని గుర్తు చేశారు. మనిషి జన్మ ఎంతో ఉత్తమమైనది, భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలన్నారు. చావు,పుట్టుకలు రెండు భగవంతునికే వదిలి వేయాలన్నారు. జన్మనివ్వడం, తీసుకెళ్లడం ఆయన చేతుల్లో ఉంటుందన్నారు. అయితే ఇటీవల కొందరు ఇలా బలవన్మరణాలు చేసుకోవడం ద్వారా తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవడం మహాపాపమన్నారు. కష్టాలను ఈదుతూ జీవనాన్ని సాగించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పోతుంటాయని, అయితే వాటిని చూస్తూ భయపడకూడదన్నారు. ధైర్యంగా ఎదుర్కొని జీవనాన్ని సాగించాలన్నారు. కష్టాలు వచ్చినప్పుడు బంధువులు లేదా స్నేహితుల వద్ద చెప్పుకుని వాటికి పరిష్కార మార్గం కోసం అన్వేషించాలని సూచించారు. ఆయా ప్రాంతాలకు చెందిన ముఖ్యులు, ఆర్థికంగా బాగా స్థిరపడిన వారి వద్దకు కూడా వెళ్లి తమ బాధలను చెప్పుకోవాలని సూచించారు. -
వైభవంగా జైతీర్థుల ఆరాధన
మంత్రాలయం: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీమఠంలో మంగళవారం వైభవంగా జై తీర్థుల ఆరాధన నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర స్వామివారి మఠంలో ముడో పిఠాధిపతి జై తీర్థుల ఆరాధనను ఘనంగా జరిపారు. శ్రీ మఠం పిఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారజాము నుంచి మఠంలోని మూల బృందావనానికి ఫల, పూల, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
మంత్రాలయంలో భక్తుల రద్దీ
మంత్రాలయం (కర్నూలు) : మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. శ్రీమఠం పీఠాధిపతి ఆధ్వర్యంలో రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మంత్రాలయంలో ప్రత్యేక పూజలు
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు వైభవం జరుగుతున్నాయి. ఉదయం తులసివనం వరకు బంగారు పల్లకితో ఊరేగింపుగా వెళ్లి మృత్తికను తీసుకువచ్చారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. -
మంత్రాలయంలో పెరిగిన భక్తుల రద్దీ
మంత్రాలయం: కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీరాఘవేంద్రస్వామి దర్శించుకోవడానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది. -
మంత్రాలయంలో ఆకతాయి చేష్టలు
బాత్రూంలో స్నానం చేస్తుండగా ఫొటో తీశారని ఓ మహిళ ఫిర్యాదు ఫిర్యాదును స్వీకరించని పోలీసులు మంత్రాలయం/మంత్రాలయం టౌన్ : శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం బెంగళూరు నుంచి వచ్చిన దంపతులు ఆదివారం ఉదయం మంత్రాలయంలో ఆకతాయి చేష్టలను భరించాల్సి వచ్చింది. టీడీపీ నేతకు చెందిన లాడ్జిలో వారు అద్దెకు దిగారు. ఉదయం బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో కెమెరా ఫ్లాష్ వెలిగినట్లు గుర్తించిన మహిళ ఎవరో ఫొటోలు తీసినట్లు గ్రహించి కిటికీ వైపు చూసింది. అక్కడి నుంచి ఓ యువకుడు పరారైనట్లు గుర్తించింది. అనంతరం దంపతులు జరిగిన విషయంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు ఉచిత సలహాలు ఇచ్చి పంపించేశారు. లాడ్జీకి వెళ్లి దృశ్యాల చిత్రీకరణకు అవకాశం లేదని వదిలేశారు. సాయంత్రం మరో ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి విచారణ చేయించిన సీఐ నాగేశ్వరావు సదరు బాత్రూం కిటికీ నుంచి వీడియో తీయడానికి వీలున్నట్లు నిర్ధారించారు. దీంతో ఎస్ఐ మునిస్వామి తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరణ కోరగా లాడ్జీ నిర్వాహకులు, రూం బాయ్‌లను విచారించి నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. విచక్షణ కోల్పోతున్న ఖాకీలు : భక్తులకు భరోసాగా నిలవాల్సిన పోలీసులు విచక్షణ మరిచిపోతున్నారు. ప్రేమజంటలను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజిన సంఘటనలున్నాయి. ఇటీవల ఓ లాడ్జీలో ప్రేమజంట పట్టుబడితే రూ.30 వేల దాకా లాగేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మొన్నటికి మొన్న తుంగభద్ర నదీతీరంలో పార్కు చేసి ఉన్న కారు డోరు అద్దం పగలగొట్టి కొంత నగదు,సెల్‌ఫోన్ తస్కరించడం తెలిసిందే. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన ఎస్ఐ మునిస్వామిని వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని చెప్పడం విడ్డూరం. -
స్వామివారి హుండిలో పాము
కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం పాము కలకలం సృష్టించింది. భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న రాఘవేంద్ర స్వామి వారి దేవాలయంలోకి పాము ప్రవేశించింది. ఆ విషయం గమనించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాంతో పాము అక్కడే ఉన్న దేవుని హుండీలోకి వెళ్లింది. దీంతో స్వామి వారి ఆలయంలోకి వీఐపీ దర్శనాలతోపాటు హుండిలో భక్తులు వేసే కానుకలను నిలిపివేశారు. పామును బయటకు రప్పించేందుకు ఆలయ భద్రత సిబ్బంది చర్యలు చేపట్టారు. -
ఎడ్లబండిని ఢీకొన్న లారీ: ఒకరి మృతి
కర్నూలు : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని సుంకేశ్వరి ప్రధాన రహదారిపై వేగంగా వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఎడ్ల బండిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బండిలో ఉన్న రైతు నరసింహలు(35) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు రెండు ఎద్దులు మృతిచెందాయి. నరసింహులు స్వగ్రామం కోస్గి మండలం పల్లెపాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. (మంత్రాలయం) -
ఈసారీ.. ఫలించని బుట్టా ప్రయత్నం
మంత్రాలయం-కర్నూలు కొత్త రైలు మార్గం ఏర్పాటు కోసం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తను గెల్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు. అయినా నిధుల జాడ లేక ఆ ప్రాజెక్టు మూలనపడింది. ఈ విషయాన్ని ఆమె శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ స్పష్టం చేశారు. ఏటేటా పెరిపోతున్న అంచనాలు గతంలో రూపొందించిన రూ.165 కోట్లు అంచనా విలువ 2011 నాటికి రూ.900 కోట్లకు చేరింది. తాజాగా ఇప్పుడు నిర్మాణ వ్యయం కిలో మీటరుకు రూ.10 కోట్లు చొప్పున 110 కిలో మీటర్లుకు రూ.1100 కోట్లకు పైగా చేరుతుందని అంచనా. అయితే రైల్వే శాఖ నిబంధల ప్రకారం ఆ శాఖ మంజూరు చేసే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా అందుకు సిద్ధపడితేనే పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌కు ముందు ప్రతిపాదనలు పంపుతారని సమాచారం. జిల్లాపైన టీడీపీ ప్రభుత్వం ఆది నుంచి వివక్ష ధోరణి ప్రదర్శిస్తోందన్న విషయం మరోసారి రుజువైంది. ఏళ్ల తరబడి ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సుముఖత చూపకపోవడంతో మళ్లీ నిరాశే మిగిలింది. కర్నూలు రాజ్‌విహార్: ఒకటి కాదు.. రెండు కాదు.. నలభై మూడేళ్ల నిరీక్షణ... ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఆధ్యాత్రిక కేంద్రమైన మంత్రాలయం నుంచి కర్నూలు వరకు నిర్మించాల్సిన రైల్వే కొత్త మార్గానికి దిక్కులేదు. ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పైన పేర్కొన్న రైలు మార్గం ప్రస్తావనే లేదు. కొత్త రైలు ప్రాజెక్టుల జాబితాలో దీనికి స్థానం కల్పించకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం పైన పేర్కొన్న రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన తన వాటా ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా రెండు సార్లు సర్వే కోసం కేటాయించిన నిధులు వృధా అయ్యాయి. భూ సేకరణ, పనుల ప్రారంభానికి నిధులు మంజూరు కాకపోడంతో సర్వేతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో కోరుతున్నా... మంత్రాలయం నుంచి ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని పల్లెలు, కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైల్వే మార్గం నిర్మించాలన్నది దశాబ్దాల ప్రతిపాదన. 1970లో కర్నూలు ఎంపీ, ఎమ్మిగనూరు ప్రాంతనేత వై.గాదిలింగన్న గౌడ్ మంత్రాలయం నుంచి కర్నూలు మీదుగా శ్రీశైలం వరకు రైలు మార్గం ఏర్పాటు చేయాలన్న అంశాన్ని పార్లమెంటులో చర్చించారు. అప్పటి నుంచి ఇది కలగానే మిగిలింది. చివరకు 2004లో రాఘవేంద్రస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు, ప్రయాణికుల సౌకర్యార్థం, వాణిజ్య, వ్యాపార రంగాల అభివృద్ధికి ఈ లైను నిర్మించాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.165 కోట్లతో రైల్వే లైను నిర్మించేందుకు అంగీకరించారు. సర్వే పనుల కోసం రూ.9.43 లక్షలు కేటాయించారు. సర్వే పూర్తి చేసి నివేదికలు సైతం అందజేశారు. అంతటితో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. 2010లో మళ్లీ ఒత్తిడి తెచ్చినా... ఎన్నికల అస్త్రంగా మారిన మంత్రాలయం రైల్వేలైన్ ఏర్పాటును కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, అప్పటి రైల్వే సహాయ మంత్రి మునియప్ప ద్వారా 2010లో మళ్లీ తెరపైకి తెచ్చారు. దీంతో 2010 ఫిబ్రవరి 24న అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ బడ్జెట్లో రైల్వే లైను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించి బడ్జెట్లో రూ.10 కోట్లు కేటాయించారు. అయితే వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం, పెరిగిన నిర్మాణ, భూ కొనుగోలు వ్యయం దృష్ట్యా రీసర్వే చేయాలని నిర్ణయించారు. 2011 ఫిబ్రవరి 23న రైల్వే పనుల సర్వేకు రూ.6 కోట్లతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన రైల్వే కాంట్రాక్టరు ఒకరు టెండర్ దక్కించుకుని సర్వే చేసి 2011 డిసెంబర్లో సర్వే నివేదికలు సమర్పించారు. గతంలో రూపొందించిన మార్గంలోనే రైలు మార్గం నిర్మించుకోవచ్చని, మంత్రాలయం సమీపంలోని కొండాపురం వద్ద రైల్వే స్టేషను నిర్మించాలని సూచించారు. రైలు మార్గం ఏర్పాటయ్యే ప్రాంతాల్లోనే రైతుల పొలాల్లో హద్దులు కూడా నిర్ధరించారు. -
రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు
జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే ఎం. మణిగాంధీ దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
పని సమయం పూర్తి చెయ్..
సాక్షి, ముంబై: విధులకు ఆలస్యంగా వచ్చే మంత్రాలయ ఉద్యోగులకు కఠినంగా అమలుచేసే నియమాలను బీజేపీ, శివసేన కాషాయ కూటమి ప్రభుత్వం కొంత సడలించింది. ఇదివరకు నెలలో రెండు సార్లు మాత్రమే విధులకు అలస్యంగా వచ్చేందుకు మినహాయింపు ఉండేది. ఆ తరువాత ఆలస్యంగా వస్తే సెలవుల్లో ఒకరోజు కోత విధించేవారు. అయితే జనవరి ఒకటో తేదీ (గురువారం) నుంచి ఈ నియమాల్లో మార్పులు చేశారు. ఆ రోజు ఉద్యోగులు ఎన్ని నిమిషాలు, గంటలు ఆలస్యంగా వచ్చారో సాయంత్రం అన్ని గంటలు ఎక్కువ పనిచేయాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ కొత్త నియమాల వల్ల ఉద్యోగుల సెలవులు కోతకు గురికాకుండా ఉన్నప్పటికీ సాయంత్రం మాత్రం ఆలస్యంగా పనిచేయాల్సి ఉంటుంది. మంత్రాలయలో పనివేళలు ఉదయం 9.45 గంట నుంచి సాయంత్రం 5.3 గంటల వరకు ఉన్నాయి. ఇందులో పనిచేసే ఉద్యోగుల్లో అత్యధిక శాతం ఠాణే, కల్యాణ్, కర్జత్ తదితర నగర శివారు ప్రాంతాల నుంచి వస్తారు. సెంట్రల్, హార్బర్, పశ్చిమ లోకల్ రైల్వే మార్గాలలో తరుచూ ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక సాంకేతిక కారణంవల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూనే ఉంటుంది. మరోపక్క ట్రాఫిక్ జాంలో ఎలాగో దారి వెతుక్కుంటు పరిగెత్తాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ కార్యాలయాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. సమయానికి కార్యాలయానికి చేరుకోవాలనే తపనతో ఇంటి నుంచి తొందరగా బయటపడినప్పటికీ ట్రాఫిక్ జాం, లోకల్ రైళ్ల కారణంగా ఆలస్యమవుతోంది. దీంతో అనేక మంది ఉద్యోగులకు లేట్ మార్క్ పడుతోంది. చేయని తప్పుకు శిక్ష పడడంతో ఉద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారు. దీంతో ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని కాషాయకూటమి ప్రభుత్వం యోచించింది. అందులో భాగంగా ఎంత ఆలస్యంగా వచ్చారో సాయంత్రం విధులు ముగిసిన తర్వాత కార్యాలయంలో కూర్చుని అదనంగా పనిచేయాలని ఆంక్షలు విధించారు. దీంతో ప్రభుత్వ, ప్రజల పనులు సకాలంలో పూర్తవుతాయని ప్రభుత్వం భావించింది. ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీలు సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని కాషాయకూటమి ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. అందులో భాగంగా ప్లానింగ్ విభాగం అప్పర్ ప్రధాన కార్యదర్శి కె.పి.బక్షి కి హోం శాఖ బాధ్యతలు అప్పగించారు. హోం శాఖ అప్పర్ ప్రధాన కార్యదర్శి అమితాబ్ రాజన్ బుధవారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం బక్షిని నియమించింది. మైనార్టీ శాఖ అప్పర్ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్‌ను మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మైనార్టీ శాఖ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను జయశ్రీ ముఖర్జీకి అప్పగించారు. మహిళ, శిశు సంక్షేమ శాఖలో పనిచేసిన ఉజ్వల్ ఉకే ను సామాజిక న్యాయ శాఖ ప్రధాన కార్యదర్శి పదవిలో నియమించారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వంలో మ్యుచ్యువల్ ట్రాన్స్‌ఫర్‌పై వచ్చిన విజయ్ కుమార్‌ను మంత్రాలయలోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మహానగర పాలక సంస్థ (బీఎంసీ) లో అదనపు కమిషనర్ వికాస్ ఖర్గేను రెవెన్యూ, అటవీ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. -
ప్రవేశం మరింత సులభం
సాక్షి, ముంబై: సందర్శకులకు శుభవార్త. మంత్రాలయ ప్రవేశాన్ని సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలంటూ సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ఆదేశించారు. మంత్రాలయలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులు, సంబంధిత శాఖ మంత్రులతో భేటీ అయ్యేందుకు నిత్యం ముంబైకర్లతోపాటు రాష్ట్రం నలుమూల నుంచి వందలాది సామాన్యులు వస్తుంటారు. ఇలా వచ్చిన వారంతా గంటల కొద్దీ క్యూలో నిలబడతారు. మధ్యాహ్నం రెండు గంటల తరువాత సంబంధిత అధికారులు ఒక్కొక్కరినీ లోపలికి అనుమతిస్తారు. అంతకు ముందు ప్రవేశం పొందేందుకు కౌంటర్ వద్ద గుర్తింపు కార్డు చూపించి ‘ఎంట్రీ పాస్’ తీసుకోవాల్సి ఉంటుంది. లోపలికి పంపించే సమయంలో ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తారు. ఈ తతంగ మంతా పూర్తయ్యేసరికి సందర్శకుడు తాను కలుసుకోవాలనుకున్న అధికారి లేదా మంత్రి ఉంటారనే నమ్మకం లేదు. ఒకవేళ వారు లేరంటే మళ్లీ మంత్రాలయకు మరోరోజు రావాల్సి ఉంటుంది. ఇక నుంచి ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం నాగపూర్‌లో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాలు పూర్తికాగానే ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టునున్నారు. ఇందుకు హోం శాఖ, ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) అధికారులు సమాచార,సాంకేతిక విభాగాలతో చర్చలు జరపనున్నారు. మంత్రాలయ భవనానికి సమీపంలో ఉన్న వాంఖేడే స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కేవలం 20 నిమిషాల్లో దాదాపు 50 వేల మందికి తనిఖీలు నిర్వహించి స్టేడియంలోకి పంపిస్తారు. మంత్రాలయకు పంపించే సందర్శకులకు కూడా ఇదే విధానాన్ని అవలంబించాలనే అంశం తెరపైకి వచ్చిందని సాంకేతిక,సమాచార శాఖ ప్రధాన కార్యదర్శి రాజేశ్ అగ్రవాల్ తెలిపారు. త్వరలో సాధ్యసాధ్యాలను పరిశీలించి స్టేడియంలో అవలంభించే భద్రతా ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. తీసుకోనున్న చర్యలివే... ప్రవేశ ద్వారాల సంఖ్య పెంపు అత్యాధునిక తనిఖీ వ్యవస్థ మహిళలు, సీనియర్ సిటిజన్లకు వెంటనే ప్రవేశం -
ప్రస్తుతానికి పాత కేబిన్లే గతి
సాక్షి, ముంబై: తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి తమకు నచ్చినరీతిలో మంత్రాయల భవనం, మంత్రుల క్యాబిన్లలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆధునీకరణ పేరిట ప్రభుత్వం ఇప్పటికే రూ.162 కోట్లకుపైగా ఖర్చు చేసింది. అంచనాకు మించి వ్యయం కావడంతో ఈ పనులను చేపట్టిన యూనిటీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మంత్రాలయ భవనంలో రెండేళ్ల క్రితం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. భవనాన్ని పునర్నిర్మించాల్సి ఉన ్నప్పటికీ కేవలం ఆధునీకరణ పనులకే పరిమితం కావాలని గత ప్రజాస్వామ్య కూటమి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ పనులకు ఎల్.అండ్ టీ, షాపూర్జీ పాలన్‌జీ, యూనిటీ కన్స్ట్రక్షన్ కంపెనీ టెండర్లు వేశాయి. ఎల్ అండ్ టీ రూ.176 కోట్లు, షాపూర్జీ పాలన్‌జీ రూ.166 కోట్లు, యూనిటీ కన్స్ట్రక్షన్ కంపెనీ రూ.162 కోట్లమేర టెండర్లు వేశాయి. అయితే ఈ సంస్థలు ప్రతిపాదించిన టెండర్ మొత్తం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం దీన్ని రద్దు చేసి టెండర్లను మళ్లీ ఆహ్వానించాలని నిర్ణయించింది. అయితే ఇవే పనులను రూ.139 కోట్లకు చేస్తామంటూ యూనిటీ కన్స్ట్రక్షన్ కంపెనీ ముందుకొచ్చింది. దీంతో డీఎఫ్ ప్రభుత్వం 2012, డిసెంబర్లో ఈ పనుల బాధ్యతలను అప్పగించింది. ఒప్పందం ప్రకారం ఈ పనులు 10 నెలల్లోగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే తరచూ జరుగుతున్న మార్పుల వల్ల సమయానికి పనులు పూర్తికాలేదని, పైగా వ్యయం కూడా రూ.162 కోట్లకు చేరుకుందని యూనిటీ కన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ కిశోర్ చెప్పారు. -
సద్గురుడికి సర్వం సమర్పయామి
కనుల పండువగా ఏకకాల వాహనోత్సవం కొనసాగుతున్న భక్తుల రద్దీ మంత్రాలయం (కర్నూలు) : భక్తకోటికి ఏడు రోజుల పాటు ఆధ్యాత్మిక పరవశాన్ని పంచిన రాఘవేంద్రుడి సప్తరాత్రోత్సవాలు శుక్రవారం సర్వ సమర్పణోత్సవంతో ముగిశాయి. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో.. భక్తుల హర్షధ్వానాలు, మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవం కనుల పండువగా సాగింది. వేకువజామునే శ్రీమఠంలో పూజలు ప్రారంభమయ్యాయి. రాఘవేంద్రుడి మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వాయుదేవుడికి, రాఘవేంద్రుడికి పీఠాధిపతి ఏకకాల హారతులిచ్చి వేడుకలకు అంకురార్పణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు పాదపూజ, తులసి అర్చన, వెండి, బంగారు పల్లకీ సేవలు చేపట్టారు. ఏక కాల వాహనోత్సవ ఉరేగింపు భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. అనుమంత్రాలయంలో రథయాత్ర అనుమంత్రాలయంగా పేరొందిన తుంగభద్ర గ్రామంలోని రాఘవేంద్రుడి మృత్తిక బృందావన మఠంలో రాయరుకు రథోత్సవం నిర్వహించారు. పీఠాధిపతి ఉదయం గ్రామం చేరుకుని బృందావనానికి అభిషేకాలు చేసి మంగళ హారతులిచ్చారు. అనంతరం రాఘవుడి బృందావన ప్రతిమ, వేంకటనాథుడి ఉత్సవమూర్తిని రథంపై కొలువుంచారు. మఠం ప్రాంగణంలో వేలాదిమంది భక్తుల మధ్య రథయాత్ర రమణీయంగా కొనసాగింది. పండితులు గిరియాచార్, ఆప్తకార్యద ర్శి సుయమీంద్రాచార్, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, తుంగభద్ర మఠం మేనేజర్ ప్రహ్లాద ఆచార్, జోనల్ మేనేజర్ శ్రీపతి ఆచార్, ద్వారపాలక అనంతస్వామి, అర్చకులు జయరామాచార్, గౌతమ్ ఆచార్, వైఎస్ఆర్సీపీ నాయకుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాల్లో భాగంగా బెంగళూరుకు చెందిన కమాలాకర్ సంగీత కచేరి, ప్రబాత్కలవిదార్ నిర్వహించిన బ్యాలెట్ వెంకటనరసింహచారి ఉపన్యాసాలు ఆకట్టుకున్నాయి. యోగీంద్ర కళామండపంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
పర్సంటేజీ ఇచ్చుకో..పని చేసుకో!
మంత్రాలయం: ఇది నా ఏరియా.. ఎవరిని అడిగి టెండర్ వేశావు.. తమాషాగా ఉందా.. వెంటనే వచ్చి కలువు. పర్సెంజెటీ ఇచ్చుకో లేదంటే.. బిల్లులు రాకుండా చేస్తానంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న సంఘటన మంత్రాలయం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తెలుగు పార్టీని ప్రజలు ఆదరించి అధికారం కట్టబెడితే.. నెల రోజులు నిండక ముందే వసూళ్లకు పాల్పడుతున్నారు. పర్సెంటేజీ ఇస్తావా.. పని ఆపేస్తావా.. ఇచ్చుకుంటే బిల్లు.. లేదంటే చెల్లు అన్న విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు. అలాగే డీలర్‌షిప్‌లు, మధ్యాహ్న ఏజెన్సీలను వదలడం లేదు. బెంబేలెత్తుతున్న కాంట్రాక్టర్లు..:నియోజకవర్గంలోని కల్లుదే వకుంట-మాధవరం గ్రామాల మధ్య రూ.5.30 కోట్లతో ఆర్అండ్బీ శాఖ పరిధిలో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. మాధవరంకు చెందిన అధికార పార్టీ చోటా నాయకుడు 10 శాతం పర్సెంటేజీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రూ.50.30 లక్షలు ఇచ్చుకుంటే తనకు ఎంత మిగులుతుందని కాంట్రాక్టర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంత ఇచ్చుకోలేనని కాంట్రాక్టర్ చెప్పినా వినిపించుకోలేదు. ఇలా చాలా మంది కాంట్రాక్టర్లను ఆయన డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి ఇలాంటి డిమాండ్లు ఏంటని కాంట్రాక్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. తెరవెనుక ఉండి అక్రమాలకు పాల్పడుతున్న నాయకులను పోలీసు అధికారులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మనోడే డీడీ కట్టించుకో..: అదే చోటా నాయకుడు అతో డీలర్షిప్ల్లోనూ తన ధికార దర్పం చూపుతున్నాడు. తమ్ముడు వస్తాడు.. ఈ నెల నుంచి డీడీ కట్టించుకో అంటూ రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. మండలంలో నలుగురు టీడీపీ నాయకులు ఇలా అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో షాపుకు నలుగురు అనుచరులను పంపి డీలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరితో డీడీలు కట్టించుకోవాలో అర్థంకాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
శ్రీమఠం పూర్వ పీఠాధిపతి కళాకర్షణ
45రోజుల తర్వాత పార్థివదేహం వెలికితీత 6 నుంచి 11గంటల వరకు ముఖదర్శనం మంత్రాలయం, : కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీమఠం పూర్వ పీఠాధిపతి శ్రీ సుయతీంద్ర తీర్థుల కళాకర్షణ ఆదివారం నిర్వహించారు. స్వామి ముఖ దర్శనంతో భక్తులు పరవశించారు. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గత మార్చి 8న పూర్వ పీఠాధిపతి పరమపదించిన విషయం తెలిసిందే. మధ్వమత ఆచారంలో భాగంగా పరమపదించిన పీఠాధిపతుల పార్థివ దేహాన్ని ముఖ దర్శనార్థం బృందావనం నుంచి వెలికితీశారు. ఆదివారం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు స్వామి ముఖ దర్శనంతో భక్తులు తరించారు. పార్థివదేహానికి ముందుగా ఆయన కుమారుడు, మఠం ఆప్త కార్యదర్శి సుయమీంద్రాచార్ మంగళహారతినిచ్చారు. 45 రోజుల తర్వాత వెలికి తీసిన పార్థివదేహం చెక్కుచెదరకపోవడం విశేషం. దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చివరగా స్వామి కుమారుడు మరోసారి హారతినిచ్చిన అనంతరం బృందావనం చేశారు. -
ఫ్యాన్ గాలిని ఎవరూ ఆపలేరు
మంత్రాలయం, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గుర్తు ప్రభంజనం సృష్టిస్తుందని వైఎస్సార్సీపీ మంత్రాలయం అభ్యర్థి బాలనాగిరెడ్డి అన్నారు. దీన్ని ఆపడం ఎవరి తర మూ కాదన్నారు. పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని, జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆరోపణలు చేసినా ఎన్నికల్లో ప్రజాతీర్పు ముందు దిగదుడుపేనని పేర్కొన్నారు. సోమవారం ఆయన మంత్రాలయంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూలబృందావ నానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత ఊరిలో ఉద యం 11.50 నుంచి ప్రచారం మొదలెట్టిన బాలనాగిరెడ్డి కోట వీధి, పంప్‌హౌస్ గేరి, వెంకటేశ్వరస్వామి వీధుల్లో ఓట్లు అభ్యర్థించారు. వైఎస్సార్ మరణం తర్వా త అనేక ఇబ్బందులకు గురవుతున్న జనం జగన్మోహన్రెడ్డిపై ఆశలు పెట్టుకున్నారని బాలనాగిరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్ భీమారెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, నాయకులు వెంకటేష్‌శెట్టి, విశ్వనాథ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ప్రభాకర్ఆచారి, వడ్డెప్పస్వామి, ఐపీ నరసింహమూర్తి, వీరన్నశెట్టి పాల్గొన్నారు. -
మంత్రాలయ మూగబోయింది..
సాక్షి, ముంబై: నిత్యం వివిధ పనుల నిమిత్తం వచ్చే విజిటర్లతో కిటకిటలాడే మంత్రాలయ భవనం ఎన్నికల పుణ్యమా అని బోసిపోయి కనిపిస్తోంది. మంత్రులు తమతమ పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభలు, రోడ్ షోలు తదితర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మంత్రాలయలో పనిచేసే అనేక మంది సిబ్బంది ఎన్నికల పనులకు వెళ్లిపోయారు. దీంతో క్లర్క్‌లు, ప్యూన్లు, చిన్న చితక ఉద్యోగులు మాత్రమే దర్శనమిస్తున్నారు. వీరివల్ల ఎలాంటి పనులు జరగకపోవడంతో ప్రజలు మంత్రాలయ ఛాయలకు రావడం మానుకున్నారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్‌లో బదిలీలు, పాఠశాలల అడ్మిషన్ల కోసం పైరవీలు, వివిధ పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే విజిటర్ల తాకిడి ఎక్కువ శాతం ఉంటుంది. కాని ఎన్నికల కారణంగా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మంత్రులు, వారి కార్యదర్శులు, సంబంధిత అధికారులు మంత్రాలయ ఛాయలకు రాకపోవడంతో ప్రభుత్వ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో పెండింగు ఫైళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్‌తోపాటు పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభమైంది. మంత్రులు, కార్యదర్శులు, సంబంధిత ఉన్నతాధికారులు లేకపోవడంతో వారి కింద పనిచేసే ఉద్యోగులు కూడా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సెలవులపై వెళుతున్నారు. దీంతో వివిధ పనుల నిమిత్తం గంపెడాశతో మంత్రాలయకు వచ్చిన ప్రజలకు నిరాశే మిగులుతోంది. ఈ పరిస్థితి లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే శాసన సభ ఎన్నికల తంతు పూర్తయ్యేంత వరకు తప్పదేమోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు రాకపోవడంతో విజిటర్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో మంత్రాలయ ప్రవేశ ద్వారాల వద్ద వాహనాలను తనిఖీకి ఏర్పాటుచేసిన భద్రతా సిబ్బందిని సైతం తగ్గించారు. -
శ్రీ సుయతీంద్ర తీర్థులు కన్నుమూత
మంత్రాలయం : ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థులు కన్నుముశారు. కొంత కాలంగా మూత్రపిండాలు, చక్కెర వ్యాధితో బాధపడుతున్న ఆయన గత రాత్రి తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యం బారిన పడిన ఆయన గత 15 రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు. సుయతీంద్ర తీర్ధులకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శ్రీ సుయతీంద్ర తీర్థులు మంత్రాలయం రాఘవేంద్ర మఠానికి 39వ పీఠాధిపతి. కర్ణాటకలోని గదగ్ జిల్లా పేటే ఆలూరులో అనంతాచార్య-యమునాబాయి దంపతులకు జన్మించిన ఆయన అసలు పేరు సుశీలేంద్రాచార్. బీఏ, బీఈడీ పూర్తి చేసిన ఆయన... బెంగళూరులోని భారతీయ సంస్కృతి విద్యాపీఠంలో విశేష సేవలందించారు. 2006లో సుశమీంద్ర తీర్థుల ఆధ్వర్యంలో సన్యాసం స్వీకరించి రాఘవేంద్రస్వామి మఠం ఉత్తరాధికారిగా నియమితులయ్యారు. 2009లో మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. అటు... సుయతీంద్ర తీర్థుల మరణవార్తతో మంత్రాలయం మౌన రోదనలో మునిగిపోయింది. గ్రామ ప్రజలు, భక్తులు అశ్రు నివాళి అర్పిస్తున్నారు. -
గురుభక్తి.. ఆధ్యాత్మిక దీప్తి
మంత్రాలయం, న్యూస్‌లైన్: రాఘవుడి నామస్మరణతో శ్రీమఠం మార్మోగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్రుల జన్మదిన వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉభయ పీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు, సుభుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వేకువ జాము నుంచే శ్రీమఠంలో గురుభక్తి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా చివరోజు శనివారం రాఘవేంద్రుల జన్మదినం వేడుకలు నిర్వహించారు. మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, క్షీర, మహా పంచామృతాభిషేకాలు చేశారు. అనంతరం పుష్పాలతో అలంకరించి బంగారు కవచ సమర్పణ గావించారు. శ్రీమఠం ప్రాంగ ణంలో వేదపండితులు పఠిస్తుండగా.. మంగళవాయిద్యాల మధ్య నవరత్న రథంపై గురురాఘవేంద్రుల ప్రతిమ ఉంచారు. ఉభయ పీఠాధిపతులు నలుదిక్కులా నారీకేళ సమర్పణ, హారతులు ఇచ్చి రథోత్సవానికి అంకురార్పణ పలికారు. అశేష భక్తజనుల మధ్య రమణీయంగా రాఘవరాయలు ఊరేగారు. అంతుకు ముందు బృందావన ప్రతిమను వెండి, బంగారు పల్లకీల్లో ఊరేగించారు. తమిళనాడుకు చెందిన 500 మంది పండితులు నాదస్వరం ఆలపించారు. గర్భాలయ శిలామంటపానికి శంకుస్థాపన : రాఘవేంద్రుల గర్భాలయానికి శిలామంటపం నిర్మాణార్థం శనివారం ఉభయ పీఠాధిపతులు సుయతీంద్రతీర్థులు, సుభుధేంద్రతీర్థులు శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్ల అంచనాతో శిలా మంటపం నిర్మించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా పీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేసి పనులకు అంకురార్పణ పలికారు. భక్తులు శిలా మంటప నిర్మాణానికి సహ కరించాలని పీఠాధిపతులు కోరారు. ఒక్కో శిలాఫలకం రూ.5000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. సదరు శిలపై వారి పేర్లు సైతం ముద్రిస్తామని చెప్పారు. -
ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. చంపేశాడు
మంత్రాలయం : ప్రేమతో వంచించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. పెద్దలు సైతం పెళ్లి పత్రికలు వేయించారు. ఐదు రోజులు గడిస్తే పెళ్లి పీటలెక్కాల్సిన యువతిని కసితీరా చంపేసి ప్రేమపెళ్లిని మసి చేశాడు. తాళి కట్టాల్సిన చేతులతో యువతిని కడతేర్చిన ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల సమాచారం మేరకు వివరాలివి.. చిలకలడోణ గ్రామానికి చెందిన యాకోబు, హైమావతి రెండో కుమార్తె మార్తమ్మ (18), అదే గ్రామానికి చెందిన పౌలు, జయమ్మ మూడో కుమారుడు యోహాను ప్రేమించుకున్నారు. అయితే, వివాహం చేసుకునేందుకు యోహానుకు ఇష్టంలేదు. విషయం తెలిసిన పెద్దలు బలవంతంగా యోహానును ఒప్పించారు. ఈనెల 26న వివాహం చేసేందుకు పెళ్లి పత్రికలు సైతం ముద్రించారు. దీంతో యోహాను గురువారం రాత్రి మార్తమ్మను కడతేర్చేందుకు వ్యూహం పన్నాడు. 8 గంటల సమయంలో యువతికి ఫోన్‌చేసి రమ్మని చెప్పాడు. యువతిని మాటలతో మభ్యపెట్టి తుంగభద్ర దిగువ కాలువ మీదుగా బాపురం గ్రామ మార్గాన 2 కి.మీ దూరం తీసుకెళ్లాడు. యువతి కాళ్లను విద్యుత్ తీగలతో కట్టేశాడు. కసితీరా చంపేసి కాలువ చాంబర్లో పడేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మరోవైపు రాత్రి 8 గంటలకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో యోహాను దగ్గరకి వెళ్లి ఉంటుందేమోనని తల్లి హైమావతి భావించింది. అయితే, రాత్రి 10.30 గంటల సమయంలో ఓ పెళ్లి మెరవణిలో యోహాను ఈలలు వేస్తూ చిందులేస్తూ కనిపించాడు. అక్కడేమైనా ఉందేమోనని తల్లి వెళ్లి చూడగా కుమార్తె ఆచూకీ లేకపోవడంతో ఊరంతా వెతికారు. ఉదయం చాంబర్లో కాలిపడి ఉన్న మహిళా మృతదేహాన్ని ఓ పశువుల కాపరి చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు. కూతురు కాలిన మంటల్లో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. యువతిని చంపేందుకు వినియోగించిన కటింగ్ ప్లేయర్, పెనుగులాడిన ప్రదేశాలను పోలీసులు పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు యోహానును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, యోహాన్‌పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ముంబైకి వలస వెళ్లి అక్కడో యువతిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, అక్కడి వారు దేహశుద్ధి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే, బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైనట్లు తెలుపుతున్నారు. యువతిని ఒక్కడే మట్టుబెట్టాడా.. వేరొకరి సాయం తో దారుణానికి ఒడిగట్టాడా అనే కోణాలలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఆదిత్యా.. నమోనమః
మంత్రాలయం, న్యూస్‌లైన్ : పీఠాధిపతులు సుయతీంద్రతీర్థుల ఆశీస్సులతో గురువారం శ్రీమఠంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా రాఘవేంద్రుల మూలబృందావనానికి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం పీఠాధిపతి బంగారు రథానికి పూజలు నిర్వహించి రథోత్సవాలకు అంకురార్పణ పలికారు. మూలరాముల ప్రతిమను వెండి అంబారీ, రాఘవేంద్రుల ప్రతిమలను చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై కొలువుంచి ఏకకాలంలో రథోత్సవాలు నిర్వహించారు. రథాల ముందు బృందావన ప్రతిమను బంగారు పల్లకిలో ఊరేగించారు. కార్యక్రమానికి భక్తులు వేలాదిగా త రలివచ్చారు. శ్రీశైలంలో..: శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో గురువా రం రథసప్తమి పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగం గా అమ్మవారి ఆలయప్రాంగణం యాగశాల దగ్గర సూర్యారాధన నిర్వహించారు. ముందుగా వేదికపై సూర్యయంత్రాన్ని లిఖించిన అనంతరం పూజాధికాలకు సంబంధించి సంకల్పం పఠించారు. అనంతరం కలశస్థాపన చేసి పూజలు నిర్విఘ్నంగా సాగాలని కోరుతూ గణపతిపూజ నిర్వహించారు. ఆయా బీజ మంత్రాలు, ప్రత్యేక ముద్రలతో సూర్య నమస్కారా లు చేసిన అనంతరంఅరుణపారాయణ, షోడశోపచార పూజాధికా లు జరిపించారు. చతుర్వేద పారాయణ చేసి సూ ర్యాభిషేక జలాన్ని భక్తులపై చల్లారు. నందికొట్కూరు టౌన్: నందికొట్కూరు కోట వీధి సూర్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీసూర్యనారాయణస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి కనుల పండువగా రథోత్సవం నిర్వహించారు. అవుకు: అవుకు మండలం శివవరంలో వెలసిన సూర్యనారాయణ స్వామికి గురువారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయాన్నే అభిషేకం, ఆదిత్యహృదయ పారాణయం, భగవద్గీత పారాయణం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా అనంతపురం, వైఎస్ఆర్ జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. మహానందిలో.. మహానంది, న్యూస్‌లైన్: మహానంది క్షేత్రంలో డీసీ సాగర్‌బాబు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణపతిపూజ, పుణ్యాహవాచనం, ద్వాదశాదిత్యపూజలు, సూర్యనమస్కారాలు, త్రిచ, సూర్య, అరుణ పూజలు చేపటా ్టరు. వేదపండితులు రవిశంకరఅవధాని మాట్లాడుతూ రథంలో అష్టదిక్పాలకులు, బ్రహ్మదేవుడు, మహాకాళి అమ్మవారు, పార్వతీపరమేశ్వరులు, ఆదిదేవతలు కొలువై ఉంటారన్నారు. కార్యక్రమంలో సహా య కార్యనిర్వహణాధికారి ఎం.శివయ్య, అసిస్టెంట్ ఇంజినీర్ మురళీధర్‌రెడ్డి, సూపరింటెడెంట్లు, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
అంతా వట్టిదే
ముంబై: పొవాయిలో చౌక ఇళ్ల పథకం అంతా బోగసేనని తేలిపోయింది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇదంతా వట్టిదేనని స్పష్టం చేయడం పొవాయి వాసులను నిర్వేదంలోకి నెట్టేసింది. ఆర్థికంగా వెనుకబడిన తమకు ప్రభుత్వం రూ.54 వేలకే సొంత ఫ్లాట్ ఇస్తుందన్న ఆశతో మంత్రాలయలో రోజంతా నిలబడి చేసుకున్న దరఖాస్తుకు విలువ లేదని తెలుసుకున్న స్థానికులు నిరాశ చెందారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించిన అతి తక్కువ ధరకే ఇళ్ల పథకం కింద రూ.54 వేలకే పొవాయిలో ఫ్లాట్లు లభిస్తుందన్న గంపెడాశతో మంత్రాలయానికి మంగళవారం వచ్చిన వందలాదిమంది దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి సమర్పించారు. దీని గురించి తెలుసుకున్న సీఎం కార్యాలయ వర్గం ప్రభుత్వం అటువంటి పథకాన్ని మంజూరుచేయలేదని వివరణ ఇచ్చింది. ఎవరో తప్పుదారి పట్టించడంతో ఇదంతా జరిగిందని పేర్కొంది. అటువంటి పథకం మనుగడలో లేదని స్పష్టం చేసింది. అయినా కూడా రెండోరోజు బుధవారం కూడా అనేకమంది వచ్చి దరఖాస్తు చేసేందుకు ఎగబడ్డారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎంవో కార్యాలయం లేని పథకాన్ని ఉన్నట్టుగా చెప్పి పొవాయి వాసులను తప్పుదారి పట్టించడానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించింది. ‘1987 పొవాయి అభివృద్ధి పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వం ఇళ్లు కేటాయిస్తుందని తెలుసుకున్నాం. ఈ పథకం కింద హీరాంనందాని బిల్డర్స్ అభివృద్ధి చేసిన 400 చదరపు అడుగుల మేర నిర్మించిన మూడు వేల ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నామ’ని సదరు ఫారమ్ పేర్కొంది. హీరానందని కాంప్లెక్స్‌లో అపార్ట్మెంట్లు ఉన్నాయని తెలుసుకున్న పేదలు అతి చౌక ఇళ్ల పథకం కింద దరఖాస్తు చేసుకున్నారని కార్మిక నాయకుడు మిలింద్ రణడే తెలిపారు. ‘1986లో పట్టణ భూపరిమితి చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం పొవాయిలో 240 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. దీనిని అభివృద్ధి చేసేందుకు ఎకరాకు రూ.40 పైసల చొప్పున డెవలపర్‌కు సర్కార్ లీజుకిచ్చింది. 400 చదరపు అడుగులు, 800 చదరపు అడుగుల పరిధిలో ఆధునిక ఫ్లాట్‌ను డెవలపర్ నిర్మించారు. వీటిలోనే 70 శాతం రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లను సంపన్నవర్గాల కోసం 1,200 నుంచి 5,000 చదరపు అడుగుల ఫ్లాట్లు నిర్మించడం వివాదాస్పదమైంది. దీంతో రూ.135లకే చదరపు అడుగుల ధరకు 15 శాతం ఫ్లాట్లను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసింద’న్నారు. దీనినే ఆధారంగా చేసుకొని 400 చదరపు అడుగుల ప్లాట్లకు రూ.54వేల ధర సదరు ఫారమ్‌లపై ప్రచురణ అయి ఉందని రణడే వివరించారు. అయితే కొందరి చేతుల్లోనే భూమి, ఇళ్లు ఉండకుండా నిరోధించేందుకు 2007లో యూఎల్సీఏ చట్టాన్ని ప్రభుత్వం రద్దుచేసిందని రణడే గుర్తు చేశారు. -
చనిపోయిన బిడ్డ కోసం 30 గంటలు నిరీక్షించిన తల్లిదండ్రులు
నచ్చజెప్పి అంత్యక్రియలు జరిపించిన అధికారులు మంత్రాలయం, న్యూస్‌లైన్: ఒక్కగానొక్క కుమారునిపై వారి మమకారం మూఢనమ్మకాల వైపునకు దృష్టి మరల్చేలా చేసింది. బతికొస్తాడనే ఆశ 30 గంటల నిరీక్షణకు కారణమైంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గర్భగుడిలో శుక్రవారం అదే గ్రామానికి చెందిన శ్రీదత్త(4) పాముకాటుతో మృతి చెందాడు. అదే రోజు కల్లుదేవకుంట ప్రాథమిక కేంద్రం వైద్యుడు ప్రతాప్ బాలుడు చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే కొందరు పాము కాటు లక్షణాలు లేవని, మరికొందరు చర్మం నల్లబడలేదని.. ఇంకొందరు చలనం కనిపించిందనే పుకార్లు పుట్టించడంతో బాలుడు బతికొస్తాడని తల్లిదండ్రులతో పాటు బంధువుల్లో నమ్మకం కలిగింది. అదే భావనతో దాదాపు 30 గంటల పాటు నిరీక్షించారు. బాలుడి శరీరమంతా ఆవుపేడ పూశారు. ఓ వైద్యుడు నోట్లో మాత్ర వేశాడు. కొందరు నీళ్లు తాగించే ప్రయత్నం చేయగా మింగినట్లు భ్రమపడ్డారు. అలా వాళ్లు చేయని ప్రయత్నమంటూ లేదు. శనివారం కల్లుదేవకుంటకు చెందిన హోమియో వైద్యుడు తిమ్మారెడ్డి బాలుడిని పరిశీలించి ప్రాణం లేదని చెప్పినా వారికి నమ్మకం కలగలేదు. సాయంత్రం 5గంటల వరకు కన్నీళ్లు పెట్టుకుంటూనే.. ఎంతో ఆశగా బతికొస్తాడని ఎదురుచూడసాగారు. ఈ విషయం బయటకుపొక్కడంతో అధికారులు రంగప్రవేశం చేశారు. బాధిత కుటుంబానికి నచ్చజెప్పి అంత్యక్రియలు జరిపించారు. కాగా, స్వామీజీ ఒకరు చెప్పడంతో తామిలా చేశామని వస్తున్న వార్తలు సత్యదూరమని మృతుడి తల్లిదండ్రులు ఖండించారు. -
బతుకుతాడని కొడుకు మృతదేహానికి పూజలు
-
బతుకుతాడని కొడుకు మృతదేహానికి పూజలు
కర్నూలు: ఆధునిక సమాజంలోకి మానువుడు అడుగుపెట్టిన రోజులివి. అటు సాంకేతికపరంగా, ఇటు సంస్కృతిపరంగానూ ఎంతో అభివృద్ధి చెందిన హైటెక్ యుగమిది. మంత్రాలకు చింతకాయలు రాలవన్నది మన తెలుగు సామెతను సరిగ్గా పోలే వింత సంఘటన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో శనివారం చోటుచేసుకుంది. జిల్లాలో పాముకాటుకు గురైన ఓ బాలుడు మృతి చెందాడు. అయితే పూజలు చేస్తే ఆ బాలుడు బతుకుతాడని ఓ స్వామిజీ చెప్పటంతో తల్లిదండ్రులు బాలుడి మృతదేహానికి పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా తన కొడుకు బతుకుతాడనే నమ్మకంతో మంత్రాలయంలోని గర్భగుడిలో తల్లిదండ్రులు పూజలు జరిపించడం విశేషం. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన నారాయణ, అర్చనల ఏకైక కుమారుడు శ్రీదత్త (4). తల్లితో కలిసి శుక్రవారం ఉదయాన్నే స్వామి దర్శనానికి వెళ్లాడు. బృందావనాన్ని దర్శించుకుంటుండగా ఓ పాము బాలుడి ఎడమ చేతిపై కాటు వేసింది. ఒక్కసారిగా అరుపులు, కేకలతో భక్తులు పరుగులు తీశారు. బాలుడిని వెంటనే కల్లుదేవకుంట ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. అయితే బాలుడికి పూజలు చేస్తే బతుకుతాడని ఓ స్వామిజీ చెప్పటంతో వారు కుమారుడికి అంత్యక్రియలు చేసే ఆలోచన మానుకుని శ్రీమఠం గర్భగుడిలో పూజలు నిర్వహించారు. -
ప్రకృతి సంపదపై పంజా
మంత్రాలయం/నందవరం, న్యూస్‌లైన్: ప్రకతి సంపదకు అక్రమార్కుల రూపంలో చెదలు పట్టింది. ఫలితంగా కొండలు, గుట్టలు, నదులు, వాగులు, వంకలు తేడా లేకుండా తమ స్వరూపాన్నే కోల్పోతున్నాయి. అక్రమ గునపాలతో గోతులు మిగులుతున్నా అధికార గణం మాత్రం వేడుక చూస్తోంది. కొందరు అధికారులు సంబంధం లేదంటూ అక్రమ తరలింపులను గాలికి వదిలేయగా.. మరికొందరు నామమాత్రపు దాడులతో సరిపెడుతున్నారు. రోజుకు టన్నుల కొద్ది ప్రకృతి సంపద అక్రమంగా తరలిపోతున్నా అబ్బే అలాందేమి లేదని తోసిపుచ్చుతున్నారు. ఉన్నతాధికారులను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ప్రకృతి సంపద కరిగిపోయేందుకు పరోక్షంగా కారణమవుతున్నారు. మట్టి, ఇసుకతో కాసులు.. మంత్రాలయం నియోజకవర్గం, ఎమ్మినూరు నియోజకవర్గంలోని నందవరం మండలంలో మట్టి, ఇసుక అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. నదులు, గుట్టలను యథేచ్చగా నమిలేస్తూ జేబులు నింపుకొంటున్నా వారిని కట్టడి చేయాల్సిన అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారు. అక్రమాల పర్వం ఎంతలా సాగుతోందంటే రోజుకు ఇసుక, గ్రావెల్ రూపంలో 800 టన్నుల వరకు ప్రకృతి సంపద ట్రాక్టర్లు, లారీలో అక్రమంగా తరలిపోతోంది. మంత్రాలయం, మాధవరం, కోసిగి మండలం సాతనూరు, తుంబిగనూరు, అగసనూరు, కౌతాళం మండలం అచ్చోళి, గుడికంబాళి, నదిచాగి, పెద్దకడబూరు మండలం కంబలదిన్నె, జాలవాడి, దొడ్డిమేకల, నందవరం మండలం నాగలదిన్నె, గురుజాల తదితర గ్రామాల సమీపంలో నది నుంచి ఇసుకను యథేచ్చగా తరలిస్తున్నారు. మంత్రాలయం మండలం చెట్నెహళ్లి, మోహినిపురం, పెద్దకడబూరు మండలం రాగిమాన్‌దొడ్డి, ఎల్ఎల్సీ కాలువ గట్లు, దుద్ది చెరువు, బూగేని చెరువు, బసలదొడ్డి చెరువు నుంచి మట్టి తవ్వకాలు అడ్డూఅదుపు లేకుండా సాగుతున్నాయి. నిబంధనలను పట్టించుకోకుండా అక్రమార్కులు తమదే రాజమార్గం అనే రీతిలో కార్యకలాపాలను సాగిస్తూ పంచాయతీల ఆదాయానికి గండికొడుతున్నారు. నందవరం మండలం నాగలదిన్నె, గురుజాలను గతంలో ఇసుక కేంద్రాలుగా గుర్తించిన అధికారులు గతంలో వాటికి టెండర్లు కూడా నిర్వహించారు. రెండేళ్లుగా వాటి జోలికెళ్లకపోవడంతో అక్రమార్కుల పంట పండుతోంది. పైసా పెట్టుబడి లేకుండా లక్షలు.. ఈ అక్రమ మార్గంలో పైసా పెట్టుబడి లేకుండా లక్షలకులక్షల జేబులో వేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ.1500 చొప్పున విక్రయిస్తున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో రూ.2వేల నుంచి 2,500 వరకు అమ్ముకుంటున్నారు. మట్టి ధర రూ.1200 నుంచి రూ.1700 దాకా నడుస్తోంది. ఇలా సహజ సంపదను కొల్లగొడుతూ అక్రమార్కులు లక్షలు ఆర్జిస్తుంటే అధికారులు మాత్రం వందలు, వేల జరిమానాతో సరిపెడుతున్నారు. అది కూడా ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్నారు. రోజుకు ఎనిమిది వందల టన్నులకుపైగా ఇసుక, మట్టి తరలిపోతుంటే ఏడాదంతా కలిపి అధికారులు నమోదు చేసిన కేసులెన్నో తెలుసా.. పట్టుమని పది కేసులు. వసూలు చేసిన జరిమానా రూ. 35వేలే కావడం గమనార్హం. అవి కూడా మంత్రాలయం పరిధిలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించినవే. మిగతా ప్రాంతాల అధికారులు పూర్తిగా నిద్రపోతున్నారు. చర్యలు తీసుకుంటాం : చంద్రశేఖర్, తహశీల్దార్, నందవరం అక్రమ ఇసుక రవాణాపై ఫిర్యాదులు వస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తాం. రెవెన్యూ తరపున ఎవరికీ అనుమతి ఇచ్చిందీలేదు. ఇలా రవాణా చేయడం చట్టరీత్యా నేరం. రెండు రోజుల్లో దాడులు ప్రారంభిస్తాం. -
రూ.6.5 కోట్లతో ‘బనవాసి’ అభివృద్ధి
మంత్రాలయం, న్యూస్‌లైన్: ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి ఫారం అభివృద్ధికి ప్రభుత్వం రూ.6.50 కోట్లు మంజూరు చేసినట్లు పశుగణాభివృద్ధి శాఖ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ పీడీ కొండారావు పేర్కొన్నారు. రాఘవేంద్రుల దర్శనార్థం బుధవార ం ఆయన మంత్రాలయం వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బనవాసిలో ఫారం అభివృద్ధి, కొత్త ఆబోతుల కొనుగోలు, ఘనీకృత వీర్యం నిల్వ పరికరాల కోసం ఈ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. కరీం నగర్, బనవాసి క్షేత్రాల్లో 66 నుంచి 120 జెర్సీ ఆబోతులు పెంచుతామని వివరించారు. లైవ్ స్టాకు కోసం రూ.9 కోట్లు, ఘనీకృత వీర్య కేంద్రాల అభివృద్ధికి జాతీయ డెయిరీ ప్రణాళిక నుంచి రూ.20 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. రాష్ట్రంలో గతేడాది 108 లక్షల పశువులు ఉండగా ఈ ఏడాది 93 లక్షలకు పడిపోయాన్నారు. కృత్రిమ గర్భదారణ ద్వారా 25 శాతం పశువులు వృద్ధి చెందుతున్నట్లు చెప్పారు. సెమెన్ ధన రూ.30 నుంచి 40కి పెరిగిందన్నారు. ఆయనతోపాటు పశుగణాభివృద్ధి శాఖ జిల్లా సీఈవో హమీద్‌బాషా, డాక్టర్ శ్యాంప్రసాద్, వరప్రసాద్, ఆచారి పాల్గొన్నారు. -
మంత్రాలయ కళకళ
సాక్షి, ముంబై: మంత్రాలయ ఆధునీకరణ పనులు పూర్తి కావస్తుండటంతో ఆయా అంతస్తుల్లోని క్యాబిన్లలో చేరి విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర మంత్రులు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయా గదులు కళకళలాడనున్నాయి. ఇన్నాళ్లు సరైన గదులు లేక ఇబ్బందులు పడ్డ మంత్రులు ఇక నుంచి తమ పాలనను సాఫీగా సాగించేందుకు తమకు నచ్చిన క్యాబిన్లను దక్కించుకునే వేటలో పడ్డారు. ఇందులో అందరి కంటే ముందుగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆరో అంతస్తులో ఉన్న తన క్యాబిన్లోకి ప్రవేశించి విధులు నిర్వహించడం మొదలెట్టారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సోమవారం తన క్యాబిన్లోకి గృహప్రవేశం చేయనున్నారు. ఇక నుంచి కొత్త క్యాబిన్ నుంచి తమ కార్యకలాపాలు చేపడతారని మంత్రాలయ వర్గాలు వెల్లడించాయి. మారిన క్యాబిన్ల రూపురేఖలు 2012 జూన్ 21వ తేదీన మంత్రాలయ భవనానికి జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం నాలుగు అంతస్తులు కాలిబూడిదయ్యాయి. దీంతో కోట్ల రూపాయలు ఖర్చుచేసి మొత్తం మంత్రాలయ భవనం రూపురేఖలు పూర్తిగా మార్చివేశారు. ప్రస్తుతం మంత్రాలయ భవనానికి పూర్వవైభవం తెచ్చే పనులు తుది దశలో ఉన్నాయి. ఇందులో కొన్ని క్యాబిన్లు సిద్ధం కావడంతో మంత్రులకు అప్పగిస్తున్నారు. అగ్నిప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి మొదలుకుని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, సహాయ మంత్రులు తమతమ క్యాబిన్లు, చాంబర్లు ఆధునిక హంగులతో ఎవరికిష్టమున్నట్లు వారు తయారు చేయించుకుంటున్నారు. ప్రతి అంతస్తులో క్యాబిన్ల రూపురేఖలు మారిపోయాయి. ఇందులో ఖరీదైన కుర్చీలు, టేబుళ్లు, ఏసీ, కర్టెన్లు తదితర సామగ్రి అమర్చుకుని ప్రజా ధనాన్ని వృథా చేశారు. ఆధునీకరణ పనుల తర్వాత క్యాబిన్లు, చాంబర్లు మారిపోవడంతో అధికారులు, సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందులు... వివిధ పనుల కోసం మంత్రాలయకు వచ్చే సందర్శకులకు ఇక నుంచి ఒకే పాస్ జారీ చేయనున్నారు. గతంలో ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద పాస్ తీసుకున్న సందర్శకులు లోపలికి వెళ్లిన తర్వాత మంత్రాలయ భవనంలో ఎక్కడ తిరిగినా అడిగే వారు లేరు. ఏ అధికారి వద్దకైనా, ఏ అంతస్తుకైనా వెళ్లేందుకు అవకాశముండేది. కానీ మంత్రాలయ భవన ఆధునీకరణ తర్వాత కొత్త పద్ధతిని ప్రారంభించారు. ఏ అంతస్తు, ఎవరి క్యాబిన్లోకి వెళ్లాలో ఆ అంతస్తు పాస్ మాత్రమే జారీ చేస్తారు. దీంతో ఇతరుల వద్దకు వెళ్లేందుకు వీలుపడదు. గేట్ దగ్గర ఇచ్చిన పాస్ స్వైప్ చేస్తే ఆ అంతస్తు డోరు, సంబంధిత అధికారి క్యాబిన్ తెరుచుకుంటుంది. ఇతర పనులుగాని, మరో అధికారిని కలవాలంటే ఇక నుంచి కుదరదు. -
మంత్రాలయంలో దోపిడి దొంగల బీభత్సం
-
మంత్రాలయంలో దోపిడీ దొంగలు బీభత్సం
మంత్రాలయం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శ్రీమఠం అన్నపూర్ణ భోజనశాలలో దొంగలు చొరబడి అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాన హుండీ తాళం పగులగొట్టి అందులోని నగదు దోచుకెళ్లారు. దొంగిలించిన సొమ్ము లక్షల్లో ఉంటుందని మఠం అధికారులంటున్నారు. మరోవైపు... శ్రీమఠంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే మీ వస్తువులు మీరే చూసుకోవాలంటూ నిర్లక్ష్యంగా బదులిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోణపలై సీఐ ప్రకాష్‌ను వివరణ కోరగా... ఆయన మీడియాపైనే విరుచుకుపడ్డారు. 2012లోనూ దుండగులు అన్నపూర్ణ భోజనశాలలో హుండీని దోచుకు వెళ్లిన విషయం తెలిసిందే. మరోవైపు నల్లగొండ జిల్లాలో దొంగలు చెలరేగిపోయారు. తిప్పర్తి మండల కేంద్రంలో 8 దుకాణాల తాళాలు పగులగొట్టి నగదు దోచుకెళ్లారు. 2 లక్షలకు పైగా సొమ్ము ఎత్తుకుపోయారని, దొంగల కోసం గాలింపు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. వారం క్రితం నార్కట్‌పల్లిలో మొబైల్షాపుల్లో కూడా ఇలాగే దొంగతనాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.