కల్లుదేవకుంట(మంత్రాలయం రూరల్): ఓ స్కూల్ బస్సు బుధవారం ఉదయం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామ శివారులో చోటుచేసుకుంది.
కల్లుదేవకుంట(మంత్రాలయం రూరల్): ఓ స్కూల్ బస్సు బుధవారం ఉదయం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామ శివారులో చోటుచేసుకుంది. రవీంద్రావిద్యానికేతన్‌కు చెందిన స్కూల్ బస్సు బుధవారం ఉదయం మంత్రాలయం నుంచి ఇబ్రహీంపురం గ్రామానికి విద్యార్థులను తీసుకుని వచ్చేందుకు బయలుదేరింది. కల్లుదేవకుంట గ్రామ శివారులోకి వెళ్లే సరికి రోడ్డు చిత్తడిగా ఉండటంతో బస్సు అదుపు తప్పి పంటల పొలాల్లోకి దూసుకెళ్లింది. విద్యార్థులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.