
గుంటూరు, సాక్షి: కర్ణాటక రాయ్‌చూర్ జిల్లా సింధనూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ విద్యార్థులు మరణించడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ఫ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారాయన.
కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి కర్ణాటకలోని హంపీ ఆరాధన కార్యక్రమాలకు వెళ్తుండగా...వాహనం బోల్తా పడిన ఘటనలో ముగ్గురు వేదపాఠశాల విద్యార్ధులు, డ్రైవర్ చనిపోయిన ఘటన అత్యంత బాధాకరం. ఈ ఘటన తీవ్ర దిగ్భాంత్రికి గురి చేసింది. .చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని కోరుతున్నాను అని తన ప్రకటనలో పేర్కొన్నారాయన.
In a tragic incident near Sindhanur taluk in #Raichur district, four people lost their lives when a vehicle carrying devotees overturned.
The victims include three students from the Mantralayam Sanskrit School—Ayavandan (18), Sujendra (22), and Abhilash (20)—along with the… pic.twitter.com/ze2dALIfk1— South First (@TheSouthfirst) January 22, 2025
మంగళవారం రాత్రి మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు కర్ణాటకలోని హంపి క్షేత్రానికి బయల్దేరారు. అక్కడ నరహరి తీర్థుల ఆరాధనకు 14 మంది విద్యార్థులతో వాహనం బయల్దేరింది. ఈ క్రమంలో సింధనూరు సమీపంలో వాహనం బోల్తాపడింది. డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి.

క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment