సాక్షి, కర్నూలు: మంత్రాలయంలో తుంగభద్ర నది వెలవెలబోతుంది. నీళ్లు లేక భక్తులు స్నానాలకు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీమఠం అధికారులు తూతూ మంత్రంగా షవర్లు ఏర్పాటు చేశారు. మురుగునీటితో నిండిన తుంగభద్ర.. దుర్వాసన వెదజల్లుతుంది.
కాగా, శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు అంగరవైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం విశ్వమోహనుడిని దర్శించుకుంటున్నారు. బుధవారం శ్రీమఠంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆశీస్సులతో వేకువజాము నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
తొలుత రాఘవేంద్రుల మూల బృందావనికి నిర్మల్య విసర్జన, జల, పుష్ప, పంచామృతాభిషేకాలు చేశారు. స్వామి బృందావనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే రాఘవేంద్రుల బృందావన ప్రతిమను బంగారు పల్లకీలో ఊరేగించారు. పూజామందిరంలో స్వామిజీ మూలరామ, వేదవ్యాసుల పూజోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
చదవండి: మాట ఇచ్చారు.. వెంటనే ఆదుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment