సాక్షి, మంత్రాలయం రూరల్(కర్నూల్): అనుమానం పెనుభూతంగా మారి భార్యను ఓ భర్త హతమార్చాడు. ఈ ఘటన మాధవరం తండా గ్రామంలో వెలుగు చూసింది. స్థానికులు, మాధవరం పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గోవిందనాయక్ వంట మాస్టారుగా పనిచేస్తున్నాడు. ఈయనకు విజయాబాయితో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్నాడు.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విజయాబాయిని(35) గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, గోవిందునాయక్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.
చదవండి: టీడీపీ కార్యకర్తల వీరంగం.. పెట్రోల్ బంక్‌పై దాడి
Comments
Please login to add a commentAdd a comment