
కర్నూలు: పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా పక్కా గృహాలు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి మూడు విడతల్లో రూ.1.80 లక్షలను ఇస్తోంది.
డబ్బులు లేని లబ్ధిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా రూ. 35 వేలు రుణం ఇప్పిస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను రాయితీపై అందజేస్తోంది. అంతే కాకుండా కాలనీల్లో విద్యుత్, రోడ్లు, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలను కలి్పస్తోంది. దీంతో లబి్ధదారులు రెట్టింపు ఉత్సాహంతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఓర్వకల్లు సమీపంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలోని పేదల ఇళ్లు ఇవీ..