Jagananna Colonies
-
వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కూటమి సర్కారు కన్ను
-
జగనన్న కాలనీల పేరు మార్పు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు అంటూ రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల అమలులో శ్రద్ధ చూపించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం వాటికి గాలికొదిలేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పథకాలు, కార్యక్రమాలకు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పరంపరలో భాగంగా వైఎస్సార్, జగనన్న కాలనీల పేర్లను పీఎంఏవై–ఎన్టీఆర్ నగర్లుగా మారుస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై పేదలు మండిపడుతున్నారు.రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతింటిని సమకూర్చేలా 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలుచేసింది. ఈ పథకం కింద ఐదేళ్లలో ఏకంగా 71 వేలకు పైగా ఎకరాల్లో 31 లక్షల మందికి పైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వీటి మార్కెట్ విలువ రూ.76 వేల కోట్ల పైమాటే. 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. పేదలకు పంపిణీ చేసిన ఈ స్థలాల మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటోంది. మరోవైపు.. ఈ స్థలాల్లో సొంతింటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇవ్వడంతో పాటు, పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయం, ఉచితంగా ఇసుక, సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి సమకూర్చారు. ‘సెంటు’కూడా ఇవ్వకుండా పేరు మార్పా? ఇక రాష్ట్రంలో పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తామని గత ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి హామీ ఇచ్చింది. కానీ, ఈ ఏడునెలల పాలనలో ఒక్క అడుగూ ముందుకేయలేదు. కనీసం సెంటు స్థలం కూడా పేదలకు పంచలేదు. మరోవైపు.. గృహ నిర్మాణ శాఖపై చంద్రబాబు నిర్వహించిన మొదటి సమీక్షలో ప్రకటించినట్లు పేదల ఇంటి నిర్మాణ సాయాన్ని రూ.నాలుగు లక్షలకు పెంచలేదు. గత ప్రభుత్వంలో చేసిన సాయాన్ని యథావిధిగా కొనసాగిస్తామని ఉత్తర్వులిచ్చారు. ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పేదల ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు చేసిన సాయం వీసమెత్తు లేకపోయినా పేర్లను మాత్రం ఇష్టారాజ్యంగా మార్చేశారు. చంద్రబాబు ప్రభుత్వ పేర్ల పిచ్చికి ఇదొక పెద్ద నిదర్శనం అని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. -
జగనన్న లేఅవుట్లోని ఇళ్లు ధ్వంసం
దుత్తలూరు: జగనన్న లేఅవుట్లలోని ఇళ్లను కూడా టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో జగనన్న లేఅవుట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు 36 ఇళ్లు మంజూరు చేసింది. వాటిలో 20 ఇళ్లు పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీవాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారనే అక్కసుతో సోమవారం సాయంత్రం అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశ్నిaస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు.ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఇళ్ల కూల్చివేతను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కావలి డీఎస్పీ వెంకటరమణ, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తమ ఇళ్లను ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు టీడీపీ నాయకుడు పిడికిటి వెంకటేశ్వర్లును, జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జేసీబీని స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
సీఎం వైఎస్ జగన్, సొంతింటి కల నెరవేర్చారు: లబ్దిదారులు
-
సొంత ఇంటి కల సాకారం
-
పేదలకు ఇళ్ల స్థలాల్లో సరికొత్త చరిత్ర
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదల పక్షపాతి అని మరోసారి రుజువు అవుతోంది. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు కూడా చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించనుంది. తద్వారా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసిన తొలి ప్రభుత్వంగా రికార్డులకెక్కనుంది. ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇవ్వడం, వాటికి రిజిస్టర్ చేస్తుండటం దేశంలోనే ప్రప్రథమం. దీనివల్ల పేదలకు ఆ స్థలాలపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఈ నెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం భారీ ఎత్తున మొదలు కానుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ నేడో, రేపో జారీ కానుంది. ఈలోపు రిజిస్ట్రేషన్లు చేసేందుకు రెవెన్యూ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో 31.19 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇందుకోసం 17 వేలకుపైగా వైఎస్సార్ జగనన్న కాలనీలు నిర్మించింది. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు దక్కేవి కాదు. డి–పట్టాలు కావడంతో అనుభవించడం మినహా వాటిపై సర్వ హక్కులు లేకపోవడంతో పేదలు వాటిని అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. అందుకే ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ఇప్పుడు దాని ప్రకారమే 30 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్లు అందించనుంది. అంటే పట్టాలు పొందిన వారికి ఆ స్థలాలను రిజిస్టర్ చేయనుంది. ఈ పట్టాలు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పేదలు ఇబ్బంది పడకూడదనే.. చాలా ఏళ్ల క్రితం ఇచ్చిన డి–పట్టాలను క్రమబద్ధీకరించుకోవడం ప్రస్తుతం ఎంత కష్టమో తెలిసిన విషయమే. దానికి రెవెన్యూ శాఖ ఎన్ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చే ప్రక్రియ ఎంతో క్లిష్టంగా ఉంది. పేదలు అలా ఇబ్బందులు పడకుండా ఆ స్థలాలను వారి పేరుతోనే ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్లు ఇస్తోంది. పదేళ్ల తర్వాత అవి సేల్ డీడ్లుగా మారతాయి. ఇళ్ల పట్టాల చరిత్రలోనే ఇది గొప్ప ముందడుగు. యుద్ధప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు.. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ప్రభుత్వం తరఫున వీఆర్వో పేదలకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలన కార్యదర్శులు జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన ఈ పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం మంగళవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే నెల 9వ తేదీకల్లా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు ఆయా మండలాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల డేటా, లబ్ధిదారుల వివరాలు, వారికి కేటాయించిన ప్లాట్లు, వాటి నంబర్లు, హద్దులు పరిశీలించి రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్లు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలను సందర్శించి క్షేత్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. పేదలకిచ్చే కన్వేయన్స్ డీడ్లు సరిగా ఉన్నాయో లేదా, అందులో కచ్చితమైన డేటా ఉందా లేదా చూడడంతో పాటు రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ పూర్తవగానే అర్హులకు కన్వేయన్స్ డీడ్లను పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. అందుకు అవసరమైన ప్రింటింగ్ ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనుంది. అక్కడి నుంచి జేసీలు గంట గంటకు రిజిస్ట్రేషన్ల కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ సమయంలో వీఆర్వోలు సచివాలయాల్లోనే అందుబాటులో ఉండేలా చూసే బాధ్యతను తహశీల్దార్లకు అప్పగించింది. -
జగనన్న కాలనీలకు స్వాగత ద్వారాలు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు ప్రభుత్వం గృహ యోగం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్ కమ్యూనిటీల రీతిలో తీర్చిదిద్దుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 75 వేల కోట్ల విలువ చేసే స్థలాలను 30.7 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే నిర్మిస్తోంది. కాలనీల్లో మౌలిక వసతులను కల్పించి గేటెడ్ కమ్యూనిటీల్లా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 25 అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న కాలనీలకు స్వాగత ద్వారాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 5,684 ఆర్చిల నిర్మాణానికి శ్రీకారం 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ+2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణ ఇళ్లు నిర్మిస్తున్న 5,684 కాలనీలకు ఆర్చ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇప్పటికే ఈ పనుల కోసం 2,314 ప్రాంతాల్లో టెండర్లను ఖరారు చేయగా వీటిలో 594 కాలనీల్లో పనులు ప్రారంభించారు. పలు కాలనీల్లో వీటి నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. 32,909 కోట్లతో కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. -
గృహ యజ్ఞం మెగా డ్రైవ్
తొలిసారిగా ఇళ్లకు అడ్వాన్స్ నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ పేదల ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన దాఖలాల్లేవు. పెద్ద కాంట్రాక్టు సంస్ధలకు మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించేవి. తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులను మంజూరు చేసింది. ఇన్నాళ్లూ పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా నెలలు తరబడి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేసిన ప్రభుత్వాలనే చూశామని, గృహ నిర్మాణాలకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమాచారం, అభ్యర్ధనల మేరకు నిరుపేద ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు అడ్వాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2,06,020 మంది లబ్ధిదారులకు రూ.376.82 కోట్లను అడ్వాన్స్‌గా విడుదల చేసింది. అడ్వాన్స్ నిధులు పొందిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ నెలాఖరు నాటికి తదుపరి దశకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహా యజ్ఞంలా కృషి చేస్తోంది. ఇప్పటికే అక్టోబర్‌లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టగా అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా డిసెంబర్ 1వతేదీ నుంచి జనవరి 31 వరకు క్షేత్రస్థాయిలో సచివాలయాలు కేంద్రంగా కార్యాచరణ సిద్ధమైంది. ఈమేరకు మెగా కంప్లీషన్ డ్రైవ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. బేస్మెంట్, లెంటల్, రూఫ్ స్థాయిలోని 4.18 లక్షల ఇళ్ల నిర్మాణాలను డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 10,044 సచివాలయాల వారీగా కలెక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించారు. డ్రైవ్‌పై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి గృహ నిర్మాణ సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. మెగా కంప్లీషన్ డ్రైవ్ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్‌ను సోమవారాని కల్లా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లి నాలుగు దఫాలు సందర్శించడం ద్వారా ఇళ్ల పురోగతిని జియో ట్యాగింగ్ చేసి ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. మెటీరియల్, నిర్మాణ సిబ్బందిని సమీకరించుకునేందుకు జిల్లా, మండల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని తేదీలతో సహా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్ల పురోగతిని కూడా కలెక్టర్లు సమీక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వలంటీర్ల కీలక పాత్ర గ్రామ, వార్డు వలంటీర్లు మెగా కంప్లీషన్ డ్రైవ్‌లో కీలక పాత్ర పోషిస్తారని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ తెలిపారు. వచ్చే నెల 1వతేదీ నుంచి జనవరి నెలాఖరు వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి మొత్తం నాలుగు సార్లు క్షేత్ర స్థాయిలో ఇళ్లను సందర్శిస్తారని వెల్లడించారు. తొలిసారి సందర్శనలో మెటీరియల్, లేబర్ అవసరాన్ని అంచనా వేస్తారన్నారు. రెండోసారి పురోగతిని యాప్‌లో అప్డేట్ చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో జిల్లా స్థాయిలో మెబిలైజేషన్ సమావేశాలను నిర్వహించాలని ఆదేశించామన్నారు. డిసెంబర్ 1వ తేదీన మండల, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో సమావేశాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీలోగా సచివాలయాల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. వలంటీర్ల తొలి విడత సందర్శన డిసెంబర్ 7 నుంచి 14 వరకు ఉంటుంది. రెండో విడత 15వ తేదీ నుంచి 31 వరకు జరుగుతుంది. మూడో విడత జనవరి 1వ తేదీ నుంచి 15 వరకు ఉంటుంది. నాలుగో విడత సందర్శన జనవరి 16 నుంచి 31 వరకు ఉంటుందని జైన్ వివరించారు. ఫిబ్రవరిలో మరో ఐదు లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయాలు కేంద్రంగా మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరు నాటికి 4.18 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని వెల్లడించారు. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్‌ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
టార్గెట్ 5 లక్షల ఇళ్లు
-
Fact Check: పేదల ఇళ్లపై ఇవేం రాతలు!?
సాక్షి, అమరావతి: రామోజీరావుకు కథలంటే భలే ఇష్టం.. కట్టుకథలు, కాకమ్మ కథలంటే ఇంకా ఇష్టం.. ప్రభుత్వంపై బురద జల్లేవి అయితే లొట్టలు వేసుకునేంతగా మరీ ఇష్టం. ఎందుకంటే.. ఆయనకో రోగం ఉంది. దాని పేరు కడుపుమంట. ఇలాంటి కట్టుకథలు, కాకమ్మ కథలు, రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే స్టోరీలే ఆ బాధ నుంచి ఆయనకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి. అది తగ్గిపోగానే మళ్లీ కడుపు రగులుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ షరా మామూలే.. మరో కల్పిత కథనం. ఇది రామోజీకి నిత్యకృత్యం. కానీ, ఈ మధ్య ఈ రోగం ముదురుతోంది. తన పార్ట్నర్ జైలు నుంచి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో ఆయన వెర్రెక్కిపోతున్నారు. ఫలితంగా ఆయన కట్టుకథల శృతి మించుతోంది. ఎంతలా అంటే.. ‘నవరత్నాలు పేదలందరీ ఇళ్లు’ పథకంలో శరవేగంగా ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తుంటే వాటిని చూసి ఓర్వలేనంత. పైగా.. పేదలు సంతోషంగా సొంతిళ్లలోకి వెళ్తుంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. సాధారణంగా.. ఎక్కడైనా లేఔట్లలో పూర్తిస్థాయి నిర్మాణాలు చేసిన తర్వాతే శాశ్వత డ్రెయిన్లు, రోడ్లు వేస్తారు. ఎందుకంటే.. వాటిని ముందే నిర్మిస్తే ఇళ్ల నిర్మాణంలో భాగంగా లేఔట్లలో లారీలు, ట్రాక్టర్లు తిరిగేటప్పుడు ధ్వంసమవుతాయి కాబట్టి. ఇది ఒక్క జగనన్న కాలనీల్లోనే కాదు.. ఏ ప్రైవేటు వెంచర్‌లోనైనా ఇలానే చేస్తారు. కానీ, ఈ చిన్న లాజిక్‌ను రామోజీ మిస్ అయ్యారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈనాడు శనివారం ‘జగనన్నా.. ఇవేం కాలనీలు’ అంటూ పెడబొబ్బలు పెట్టింది. పేదల ఇళ్లతో ఏర్పడ్డ కాలనీల స్థితిగతులపై లేనిపోని అపోహలు సృష్టించేందుకు ఆపసోపాలు పడింది. పెత్తందారీ ముసుగులో కలియుగ రాక్షసులు.. టీడీపీ, రామోజీరావు పెత్తందారుల ముసుగులో చెలామణీ అవుతున్న కలియుగ రాక్షసులు. అందుకే నిత్యం పేదలకు ఇళ్ల స్థలాల మహాయజ్ఞాన్ని భగ్నం చేసే కుట్ర చేస్తూనే ఉన్నారు. కోర్టుల్లో దాదాపు వెయ్యికి పైగా కేసులు వేయించి విశాఖతో పాటు ఎక్కడా కూడా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా చాలాకాలం అడ్డుకున్నారు. అమరావతిలో అయితే మరింత పేట్రేగిపోయి.. పేదలకు ఇళ్ల పట్టాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నీచంగా రాతలు రాశారు. వీటన్నింటినీ ఛేదించుకుంటూ జగన్ సర్కార్ పేదల సొంతింటి కలలో భాగంగా ఇళ్ల పట్టాలను అందించింది. లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేలా ఆర్థిక చేయూతనిస్తోంది. మూడు ఆప్షన్లు ద్వారా అక్కచెల్లెమ్మలను సొంతింటి యజమానులను చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అత్యంత పారదర్శకంగా, అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు చేసింది. పైగా ఇళ్ల పట్టాల పంపిణీతో ప్రభుత్వం సామాజిక న్యాయానికి బాటలు వేసింది. పట్టాలు అందుకున్న వారిలో 20 శాతం ఎస్సీలు, ఆరు శాతం ఎస్టీలు, 54 శాతం బీసీలు, 21 శాతం ఇతరులున్నారు. గతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వకున్నా జన్మభూమి కమిటీలు పేదలకు ఆశ చూపించి వారి రెక్కల కష్టాన్ని దోచుకున్నాయి. కానీ, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో ప్రతి అక్కచెల్లెమ్మను లేఅవుట్ దగ్గరకు తీసుకెళ్లి, అక్కడ స్వయంగా వారికి కేటాయించిన పట్టాభూమిని చూపించి, వారికి పట్టా పత్రాలు అందించడం జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మార్కెట్ ధరలకన్నా తక్కువకు నిర్మాణ సామాగ్రి ఇక ప్రతి లబ్ధిదారుడికి 4.5 మెట్రిక్ టన్నుల సిమెంట్, 0.48 మెట్రిక్ టన్నుల స్టీలు మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. తలుపులు, కిటికీ ఫ్రేములు, షట్టర్లు, ఎలక్ట్రిక్, శానిటరీ సామాన్లు కింద 12 రకాల గృహ వస్తువులను కూడా తక్కువ రేటుకే ఇస్తోంది. కాలనీల్లోనే తాత్కాలిక గోడౌన్లను ఏర్పాటుచేసి మరీ లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది. వీటన్నింటి కోసం ఒక్కో ఇంటికి రూ.40వేల వరకు అదనపు సాయంతో పాటు, మహిళలకు పావలా వడ్డీకే రూ.35వేల రుణాన్ని అందించి, మిగిలిగిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తూ ఇంటి నిర్మాణానికి చేదోడుగా నిలుస్తోంది. అలాగే, 20 టన్నుల చొప్పున ఉచితంగా ఇసుకును సమకూరుస్తోంది. దీనివిలువ రూ.15వేల వరకు ఉంటుంది. మధ్యవర్తులకు ప్రమేయం లేకుండా డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బును జమచేస్తూ పారదర్శకతను పాటిస్తోంది. ఇలా.. మొత్తం మీద యూనిట్‌కు రూ.1.80 లక్షలు కట్టుకోడానికి.. పావలా వడ్డీ కింద రూ.35వేలు.. మార్కెట్ ధరల కన్నా నిర్మాణ సామగ్రిని తక్కువకు సరఫరా చేయడం ద్వారా మరో రూ.55వేలు చొప్పున వెరసి ప్రతీ లబ్ధిదారునికి రూ.2.70లక్షల చొప్పున ప్రభుత్వం లబ్ధిచేకూరుస్తోంది. నిన్నటి వరకు అలా.. నేడు ఇలా.. రామోజీరావు ‘అసత్యాల బకాసురుడు’. ఈనాడులో ఎన్ని అసత్యాలు రాస్తే ఆయన కడుపు అంతగా నిండుతుంది. నిన్నమొన్నటి వరకు అసలు ఇళ్ల స్థలాలు ఎక్కడున్నాయో లబ్ధిదారులకు తెలియడం లేదన్నారు. ఇళ్ల నిర్మాణం ముందుకు సాగట్లేదన్నా రు.కాలనీ లన్నీమునిగిపోతున్నాయన్నారు. అసలు ఇళ్లు కడతారా? అని చెవికోసిన మేకలా అరిచారు. ఇప్పుడేమో కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ పెడబొబ్బలు పెడుతున్నారు. అంటే.. ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు కట్టిందని, తద్వారా కాలనీలు ఏర్పడ్డాయని, అందులో లబ్ధిదారులు ఉంటున్నారని ఈనాడు ద్వారా పరోక్షంగా అంగీకరించారు. ఈనెల 12న నిర్మాణాలు పూర్తిచేసుకున్న 7,43,396 ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒకేసారి ప్రారంభించారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. మరో 14,42,425 ఇళ్ల పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. తొందర్లోనే వీటిని కూడా ప్రారంభిస్తారు. ఇన్ని లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాన్ని సహించలేని టీడీపీ, దుష్టచతుష్టయం కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ రోత రాతలు ప్రారంభించాయి. వాస్తవానికి జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అంటే.. తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, విద్యుదీకరణ, ఇంటర్నెట్, ఆర్చెస్, సోక్పిట్స్ ఏర్పాట కోసం రూ.35,859 కోట్లతో కార్యాచరణను రూపొందించింది. ఇందులో శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తోంది. లేఔట్లలో ముందుగా కనీస అవసరాల కింద.. కరెంటు, తాగునీరు, సోక్పిట్స్, రోడ్ల కోసం కనీసంగా రూ.4,800 కోట్లు ఖర్చుచేసింది. పేదలకు రూ.1.5 లక్షల కోట్ల ఆస్తి.. రాష్ట్రంలో సొంతిళ్లు లేని కుటుంబం ఉండకూడదన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం. అందుకే దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 31లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు ఇచ్చారు. మహిళా సాధికారతలో భాగంగా వారికి ఆర్థిక భరోసా ఉండాలనే ధ్యేయంతో అక్కచెల్లెమ్మల పేరుతోనే వాటిని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మరో విశేషం. అంతేకాదు.. వీటిల్లో సుమారు 22 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నారు. తద్వారా 17వేలకు పైగా కొత్త కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పుడు ఒక్కో ఇంటి పట్టా విలువ రూ.2.5 లక్షల మొదలు రూ.12లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉండటం గమనార్హం. ఈ లెక్కన చూస్తే పేదలకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అక్షరాల రూ.1.5 లక్షల కోట్లు. రాష్ట్రంలో ఇదంతా జరుగుతుందని 14ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు, ఆయన రాజగురువు రామోజీ కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే వాళ్లకు పేదలంటే గిట్టదు. ఇన్నేళ్లలో తన పార్ట్నర్ చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమి ఇవ్వకపోయినా ఈనాడులో ఏనాడు ప్రశ్నించలేదు. బడుగు జీవులు ఇళ్ల స్థలాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేసినా ఈనాడులో ఒక్క అక్షరం ముక్క కూడా రాయలేదు. అలాంటిది తమ కళ్లెదుటే పేదోడు సంతోషంగా ఉండటం, వారి జీవన ప్రమాణాలు పెరగడం చూసి ఆయన వెర్రెక్కిపోతున్నారు. -
సామాజిక సంబంధాలు బలపడేలా జగనన్న కాలనీలు
మాకు గతంలో వేరుగా కాలనీలు ఉండేవి. అప్పుడు అవమానంగా భావించేవాళ్లం. కానీ ఇక్కడ అలా కాదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల ఆధారంగా నెంబర్ల ప్రకారం డ్రా తీశారు. అందులో మాకు ఏ ప్లాటు వస్తే అదే కేటాయించారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా అందరికీ కలిపి ఇళ్లు ఇచ్చారు. దీనివల్ల మాకు సంతోషంగా ఉంది. ఎస్సీలమనే పేరుతో దూరంగా పెట్టే విధానం తొలగించడం సంతోషం.. :::జగనన్న కాలనీలోని ఓ మహిళా లబ్ధిదారు దేశంలో దాదాపుగా పల్లెటూళ్లలో దళితులుండే కాలనీలన్నీ ఊరికి ఓ చివరలో ఉంటాయి. అయితే వివిధ స్కీమ్‌ల పేరిట.. ఎస్సీల కోసం ఊరి బయటే ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంటాయి ప్రభుత్వాలు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అలా కాదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం.. సామాజిక సంబంధాల్లో మార్పునకు మార్గాన్ని ఏర్పరుస్తోంది. ఇటీవల కాకినాడ సామర్లకోటలో స్వయంగా సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన జగనన్న కాలనీలను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ పరిశీలించి ఒక కథనం ఇచ్చింది. సామర్లకోట కాలనీలో 2020లో ఇళ్ల పట్టాలు కేటాయించగా, ప్రస్తుతం సుమారు 60 శాతం మంది తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. దాదాపుగా 90 కుటుంబాలు అక్కడే నివాసం కూడా ఉంటున్నాయి కూడా. అయితే.. ఇళ్ల కేటాయింపులో కులాల ప్రస్తావన లేకుండా అన్ని కులాల వారికి ఒకే చోట కేటాయించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, కమ్మ కులస్థులు కూడా పక్క పక్కనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని నివాసాలు కూడా ఉంటున్నారు. తనకు పెళ్లయిన 17 ఏళ్లకు సొంత ఇంటి కల తీరిందని, ఇన్నాళ్లుగా ఎస్సీ కాలనీల్లోనే అద్దె ఇళ్లల్లో ఉండేవారమని ఆయన బీబీసీకి తెలిపారు. ప్రభుత్వం స్థలం ఇచ్చినప్పటికీ ఇంటి నిర్మాణం కోసం తాము సొంతంగా రూ. 13 లక్షల వరకూ వెచ్చించామని సమర్పణ రాజు అన్నారు. జగనన్న కాలనీలు మాత్రం వేరు.. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఇళ్ల పంపిణీలో కులాల ప్రస్తావన లేకుండా చాలాకాలంగానే అమలు చేస్తున్నారు. వాంబే, రాజీవ్ గృహకల్ప వంటి పథకాల్లో సైతం అన్ని కులాల వారికీ కలిపి ఇళ్లను కేటాయించారు. కానీ, గ్రామాల్లో పరిస్థితుల దృష్ట్యా.. అలాంటి పనులు చేయట్లేదు. కానీ, జగనన్న కాలనీలు మాత్రం వేరు పరిస్థితులకు వేదికైంది. కులాల బేధాలు లేకుండా అందరూ కలిసి ఉండేలా కాలనీ ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తోందని పలువురు అంటున్నారు. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత.. ఇన్నాళ్లకు మాకు ఓ ఇల్లు వచ్చింది. కులాల గురించి పట్టించుకోలేదు. ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకుంటే అన్ని కులాల వారితో సమానంగా మాకు కూడా స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం. మా ఎదురుగా కమ్మవారున్నారు. మా పక్కన తూర్పు కాపులున్నారు. అంతా కలిసే ఉంటున్నాం" అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి జగనన్నకాలనీకి చెందిన గుండుగోలు అరుణ అంటున్నారు. గతంలో ఎస్సీలు, ఇతర కులాల మధ్య కుల పరమైన విబేధాలు వివాదాలుగా మారిన చోట్ల కూడా ఇప్పుడు అందరికీ కలిపి కాలనీలు నిర్మాణం జరుగుతున్నాయి. జగనన్న ప్రభుత్వ ఉద్దేశం.. నిరుపేదలకు ఇళ్లు అందించడం. ఆ ఒక్క అర్హతతోనే లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి కూడా. ఎస్సీలు, ఇతర కులాలన్నీ కలిపి ఒకే కాలనీలో నివాసం ఉండడం వల్ల కులపరమైన వ్యత్యాసాలు కొంత వరకూ తగ్గుతాయనే అభిప్రాయం మేధావుల తరఫు నుంచి కూడా వ్యక్తం అవుతోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పేదల ఇళ్లల్లో.. ‘ఉచిత’ వెలుగులు
ఈ చిత్రంలో కనిపిస్తున్న వివాహిత పేరు.. జర్రిపోతుల పార్వతి. పెళ్లయిన పన్నెండేళ్ల నుంచి గున్నవానిపాలెం అగ్రహారంలో చిన్న ఇంటిలో ఉంటూ అవస్థలు పడుతోంది. సొంత ఇంటి కోసం గతంలో ఎంతో మంది నేతలకు, అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. ఎట్టకేలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందడంతో సొంతింటి కలను నెరవేర్చుకుంది. విద్యుత్ శాఖ.. స్తంభాలు వేసి, వైర్లు లాగి ఆ ఇంటికి కనెక్షన్, మీటర్, బల్బులు ఉచితంగా అందించింది. ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వనవసరం లేకుండా పార్వతి సొంతింటిలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. అమ్మఒడి సాయంతో పాటు తన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను ఈ ప్రభుత్వం అందిస్తోందని పార్వతి సంతోషంతో చెబుతోంది. అనకాపల్లి జిల్లా లంకెలపాలెం విద్యుత్ సెక్షన్‌లోని మారేడుపూడి కాలనీ (బోణం గణేష్, అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి) .. ఇలా ఒక్క పార్వతే కాదు.. ఎంతోమంది మహిళలు తమ కుటుంబంతో కలిసి జగనన్న ఇళ్లల్లో విద్యుత్ వెలుగుల మధ్య సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అనకాపల్లి జిల్లా మారేడుపూడి కాలనీలో పర్యటించిన ‘సాక్షి’తో లబ్ధిదారులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల్లో ఇళ్లకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యుత్ సౌకర్యాలను కల్పిస్తూ పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని, అందుకు తామే నిదర్శనమని చెబుతున్నారు. పచ్చని ప్రకృతి నడుమ, ఎతైన కొండల మధ్య ఉన్న మారేడుపూడి కాలనీలో 67 విద్యుత్ సర్విసులను అక్కడ కొత్తగా నిర్మించిన ఇళ్లకు అందించారు. ఇందుకోసం కాలనీ మొత్తం విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. స్తంభం నుంచి ఇంటి వరకు సర్విసు వైరును సమకూర్చారు. మీటర్‌తో సహా అన్ని పరికరాలు, సర్విసును ఉచితంగా ఇచ్చారు. ఆ విద్యుత్ సదుపాయంతో అక్కడి ప్రజలు తమ కొత్త ఇంటిలో రంగురంగుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. తమకు ఈ భాగ్యం కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు చెమర్చిన కళ్లతో కృతజ్ఞతలు చెబుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద తొలి దశలో పేదలకు ప్రభుత్వం నిరి్మస్తున్న లేఔట్లలో ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కంలు)ల ద్వారా ముందుగా 14,49,133 సర్విసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది. ముఖ్యంగా లేఔట్లలో విద్యుత్ లైన్లు వేసి, పేదల ఇళ్లకు, బోర్లకు ఉచితంగా విద్యుత్ సర్విసులను అందిస్తోంది. ఈ పనులకు రూ.7,080 కోట్లు ఖర్చవుతోంది. ఇందులో మొదటి దశలో 10,741 లేఔట్లకు రూ.5,541.94 కోట్లతో విద్యుత్ సంస్థలు పనులు చేపట్టాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో విద్యుత్ సౌకర్యం.. తూర్పు డిస్కంలో వాటర్ వర్క్స్‌కు సంబంధించి ఇప్పటివరకు 2,492 దరఖాస్తులు నమోదు కాగా రూ.50.36 కోట్లతో 2,386 బోర్లకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు అందించారు. లైన్ షిఫ్టింగ్ కోసం 76 ప్రాంతాలను గుర్తించారు. ఈ పనులకు రూ.1.85 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి పని మొదలుపెట్టారు. ఇక దక్షిణ డిస్కంలో రూ.49.17 కోట్లతో 2,555 బోర్లను విద్యుదీకరించారు. 435 ప్రాంతాల్లో లైన్లు మార్చడానికి రూ.9.73 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. జగనన్న కాలనీల్లో రెండు విధాలుగా విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 550 ప్లాట్ల కంటే తక్కువ ఉన్న లేఔట్లకు ఓవర్ హెడ్, 550 ప్లాట్ల కంటే ఎక్కువగా ఉన్న లేఔట్లకు భూగర్భ విద్యుత్‌ను వేస్తున్నారు. ఇలా మొత్తం 389 లేఔట్లకు భూగర్భ, 9,678 లేఔట్లకు ఓవర్ హెడ్ విద్యుత్ అందిస్తున్నారు. ఓవర్ హెడ్ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.98,521 ఖర్చవుతుండగా, భూగర్భ విద్యుదీకరణకు ఒక్కో ఇంటికి సగటున రూ.1,32,284 ఖర్చవుతోంది. అందరం సంతోషంగా ఉన్నాం.. జగనన్న మాకు స్థలం ఇచ్చి.. ఇల్లు కట్టుకోవడానికి ఆరి్థక సాయం కూడా చేశారు. ఇంటికి విద్యుత్ సర్విసును కూడా ఉచితంగా అందించారు. మేం గతంలో పాతూరులో ఉమ్మడి కుటుంబంలో చాలా ఇబ్బందులు పడుతుండేవాళ్లం. ఇక్కడికి వచ్చాక నా భర్త, ఇద్దరు పిల్లలతో అందరం సంతోషంగా ఉన్నాం. –మౌనిక, మారేడుపూడి కాలనీ మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.. పదేళ్లుగా సాలోపల్లిపాలెంలో అద్దెకు ఉన్నాం. నా భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంటిలో అవస్థలు పడ్డాం. సీఎం జగనన్న చలువ వల్ల మాకు సొంతిల్లు వచి్చంది. వీధి లైట్లు వేశారు. మా ఇంటికి ఉచితంగా కరెంటు మీటర్, బల్బు ఇచ్చారు. మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. –కనుమూరి దేవి, మారేడుపూడి కాలనీ ఉచితంగానే విద్యుత్ సర్విసులు.. పేదలందరికీ ఉచితంగా విద్యుత్ సర్విసులు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానికి తగ్గట్టుగానే జగనన్న కాలనీల్లో ఉచితంగా మీటర్లు అమర్చుతున్నాం. ఇందుకు అవసరమైన సబ్ స్టేషన్లు నిర్మించి విద్యుత్ స్తంభాలు, లైన్లు వేస్తున్నాం. –ఎల్.మహేంద్రనాథ్,ఎస్ఈ విశాఖ సర్కిల్, ఏపీఈపీడీసీఎల్ తాగునీటి అవసరాలకూ త్వరితగతిన విద్యుత్.. జగనన్న కాలనీల్లో నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన విద్యుత్ పంపిణీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం. అలాగే తాగునీటి అవసరాలకు బోర్లకు కూడా త్వరితగతిన విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నాం. కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ -
మా సొంత ఇంటి కలను నిజం చేసినందుకు జగనన్నకు ధన్యవాదాలు
-
వెంకటాచలంలో అట్టహాసంగా జగనన్న ఇళ్ల ప్రారంభం
-
ఒకే రోజు 5 లక్షల కుటుంబాలకు ఇళ్లు “జగనే మా ఇంటి దేవుడు..”
-
సొంత పార్టీ, వర్గాన్ని అమ్ముకునే వ్యక్తి పవన్: సీఎం జగన్ కౌంటర్
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు పాలనలో పేదవాడికి ఒక్కసెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో కూడా పేదలకు చంద్రబాబు సెంటు స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాకే కుప్పంలో కూడా 20 వేల ఇళ్ల పట్టాలిచ్చినట్లు తెలిపారు.రాష్ట్ర ప్రజలపై, పేదలమీద బాబుకు ఏమాత్రం ప్రేమ లేదని దుయ్యబట్టారు. నెలరోజులు వరుసగా రాష్ట్రంలో ఉన్నారా? జగనన్న కాలనీలోని ఇళ్లను సీఎం జగన్ గురువారం సామర్లకోటలో ప్రారంభించారు. అనంతరం స్థానికంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఏపీలో ఇళ్లు కూడా కట్టుకోలేదని విమర్శించారు. ఈ 52 నెలల కాలంలో చంద్రబాబు ఒక నెల పాటు కంటిన్యూగా రాష్ట్రంలో కనిపించాడా? అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో కనిపిస్తున్నాడని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వాళ్లెవవరికి ఇక్కడ సొంతిల్లు లేదు చంద్రబాబు, లోకేష్, ఆయన బావమరది బాలకృష్ణ, దత్తపుత్రుడు ఎవరూ రాష్ట్రంలో ఉండరని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు సొంతిల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఆయన దత్తపుత్రిడి శాశ్వత చిరునామా కూడా హైదరాబాద్‌లోనే ఉందని తెలిపారు. ప్యాకేజీ స్టార్‌కు ఓడిపోయిన భీమవరంతో, గాజువాకతో సంబంధమే లేదని మండిపడ్డారు. దత్తపుత్రుడి ఇల్లాలు మాత్రం మూడు నాలుగేళ్లకు మారుతుందని అన్నారు. ఒకరు స్టేట్, ఒకరు నేషనల్, మరొకరు ఇంటర్నేషనల్ అంటూ సెటైర్లు వేశారు. ఇది దత్తపుత్రుడికి ఆడవాళ్లు, ఇల్లాలిపై ఉన్న గౌరవమంటూ చురుకలంటించారు. చదవండి: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్ ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకే ‘వివాహ వ్యవస్థపై దత్తపుత్రుడికి గౌరవం లేదు. ఎల్లో బ్యాచ్‌కు ప్రజల మీద ప్రేమలేదు. వీళ్లు కావాల్సింది కేవలం అధికారం. వీళ్లు కేవలం ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది హైదరాబాద్‌లో పంచుకుంటారు. వీళ్లంతా మనతోనే చేసేది కేవలం వ్యాపారమే. తన అభిమానుల ఓట్లను హోల్‌సేల్‌గా అమ్ముకునేందుకే అప్పుడప్పుడు ప్యాకేజీ స్టార్ వస్తుంటాడు. సరుకులు అమ్ముకునే వాళ్లను చూశాం. కానీ పార్టీ, సొంతవారిని అమ్ముకునే వాళ్లను ఇప్పుడే చూస్తున్నాం. యూజ్ అండ్ త్రో అన్నది పవన్ పాలసీ. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి సొంత పార్టీని, సొంత వర్గాన్ని అమ్ముకునే వ్యాపారి పవన్. షూటింగ్ గ్యాప్‌లలో రాష్ట్రానికి వస్తుంటాడు. మన మట్టి, మన మనుషులతో అనుబంధం లేని వ్యక్తులు వీరు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడా అనలేరు. ప్యాకేజీ స్టార్‌కు మనపై ఎంత ప్రేమ ఉందో కాపులు కూడా ఆలోచించాలి. రాష్ట్రంపై ప్రేమలేని వాళ్లు రాష్ట్రం గురించి ఊగిపోతున్నారు. బాబుకు అధికారం పోతే వీళ్లకు ఫ్యూజులు పోతాయి. పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టులకెళ్తారు. ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారు. రాజకీయాలంటే విలువలు, విశ్వసనీయత ఉండాలి రాజకీయాలు అంటే విలువలు విశ్వసనీయత ఉండాలి. చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం ఉండాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా నిలబడేవాడే నాయకుడు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, ఇప్పుడు చేస్తున్నాం, అప్పుడెందుకు చేయలేకపోయారు. రాష్ట్రంలో 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. లంచాలు, వివక్షకు తావు లేకుండా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు. ప్రతి నెల 1వ తారీకే ఇంటింటికి పెన్షన్లు. సచివాలయాల ద్వారా ఇంటి వద్దకే పరిపాలన. నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం దిశ యాప్‌తో మహిళలకు అండగా నిలిచాం. ఆరోగ్య శ్రీ పరిధిని 3,300 రోగాలకుపైగా విస్తరించాం. నాలుగేళ్లలో 2.07 లక్షల ఉద్యోగాలిచ్చాం. 2.07 లక్షల ఉద్యోగాల్లో 80శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. చంద్రబాబు పేరు చెబితే గుర్చొచ్చేది స్కాంలే. జగన్ పేరు చెబితే స్కీంలు గుర్తుకొస్తాయి. బాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుంది. జగన్ పేరు చెబితే లంచాలు లేని డీబీటీ పాలన గుర్తొస్తుంది.’ అంటూ చంద్రబాబు, పవన్‌లపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. -
రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చాం: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80 శాతం ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన సీఎం జగన్.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అనిచెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. సామర్లకో లేఅవుట్లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, లక్షల విలువ చేసే ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవును తనకు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయని, పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ‘గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదని సీఎం విమర్శించారు. పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని దుయ్యట్టారు. వేలకోట్లు ఖర్చు చేసి పేదల ఇంటి కలను సాకారం చేస్తున్నామని.. పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. చదవండి: Updates: చంద్రబాబు కేసు టుడే అప్డేట్స్ -
సీఎం జగన్ కు లబ్దిదారుల కృతజ్ఞతలు
-
రాష్ట్రంలో గృహ నిర్మాణం యజ్ఞం చేపట్టిన సీఎం వైఎస్ జగన్
-
12న సామర్లకోటకు సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 12వ తేదీన కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడి ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పేదల గూడు.. ఇదిగో చూడు
కర్నూలు: పేదల సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా పక్కా గృహాలు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి మూడు విడతల్లో రూ.1.80 లక్షలను ఇస్తోంది. డబ్బులు లేని లబ్ధిదారులకు వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా రూ. 35 వేలు రుణం ఇప్పిస్తోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను రాయితీపై అందజేస్తోంది. అంతే కాకుండా కాలనీల్లో విద్యుత్, రోడ్లు, మంచినీరు తదితర మౌలిక సదుపాయాలను కలి్పస్తోంది. దీంతో లబి్ధదారులు రెట్టింపు ఉత్సాహంతో ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఓర్వకల్లు సమీపంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలోని పేదల ఇళ్లు ఇవీ.. -
తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా.. రామోజీ ఎందుకిలా?
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. సుమారు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, పదిహేను లక్షల మందికి తొలి విడతగా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికి సుమారు నాలుగున్నర లక్షల ఇళ్లు పూర్తి అయ్యాయి. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయి. ఇది ప్రతిపక్ష తెలుగుదేశంకు ఇబ్బందికరమైన విషయమే. తన హయాంలో పేదలు ఎవరికి ఇలా ఇళ్ల జాగాలు అందచేయలేదు. కాని జగన్ భారీ స్థాయిలో స్థలాలు ఇవ్వడంతో పేద వర్గాలలో విపరీతమైన ఆదరణ చూరగొంటున్నారు. దానిని దెబ్బతీయడానికి టిడిపి మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటివి ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. అందులో భాగంగా జగనన్న కాలనీలు నీట మునక అంటూ బానర్ కథనాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో అనేక వార్తలను ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడబలుక్కుని రాస్తున్నాయి. గతంలో ఇలా రాయాలంటే సిగ్గు పడే పరిస్థితి ఉండేది. ఒకరిపై ఒకరికి పోటీ ఉండేది. కాని ఇప్పుడు ఈ వర్గం మీడియా లక్ష్యం ఒకటే కాబట్టి అంతా కలిసిపోయి జగన్‌పై అక్రమ యుద్దం చేస్తున్నారు. ఈనాడు, జ్యోతివారికి ఇలా కాలనీలు మునిగిపోవడం ఎంతో సంతోషకరమైన వార్త అన్నమాట. వర్షాలు భారీగా కురిసినప్పుడు ఎక్కడైనా కొన్ని చోట్ల నీటి ముంపునకు గురి కావచ్చు. వర్షాలు తగ్గిన తర్వాత ఆ ముంపు అంతటిని తొలగించి, అక్కడ నివాసం ఉండేవారికి సదుపాయాలు కల్పిస్తారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చేయవలసిన పనే. గత టీడీపీ ప్రభుత్వం అసలు ఇళ్ల స్థలాలే ఇవ్వలేదు కనుక వారికి ఆ ఇబ్బంది లేదు. కాని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పేదలందరికి ఇళ్లు ఉండాలన్న సదుద్దేశంతో ఇన్ని లక్షల ఇళ్లు ఇవ్వడం వీరికి జీర్ణం కావడం లేదు. అంతే వర్షం పడితే చాలు.. ఈనాడు, జ్యోతి రాబందుల మాదిరి ఆ కాలనీవద్దకు వాలిపోయి.. ఇంకేముంది అవి మునిగిపోయాయి అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ వార్తలు రాస్తున్నాయి. ఆ కాలనీలు నివాస యోగ్యంగా ఉండవని ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మీడియా వేసిన ఫోటోలు గమనిస్తే అక్కడ అన్ని సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు అర్ధం అవుతుంది. ఉదాహరణకు కాకినాడ వద్ద ఒక లే అవుట్ ఫోటో ప్రచురించారు. దానిని చూస్తే కరెంటు స్తంభాలు వేసి తీగలు కూడా లాగి విద్యుత్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. మరో వైపు లే అవుట్ లో పునాదులు లేచాయి. రోడ్ల నిర్మాణం సాగుతోంది. ఇదంతా చూసి టీడీపీ మీడియాకు కన్ను కుట్టింది. దానిని ఎలాగైనా చెడగొట్టాలని అనుకుని, వర్షం నీటిని సాకుగా తీసుకుని వారి మనసులో ఉన్న విషం అంతా కక్కేశారు. ఎక్కడైనా లే అవుట్లలో నీరు వస్తే రాయడం తప్పు కాదు. కాని అవుట్ ప్రపోర్షన్ లో అంటే జర్నలిజం ప్రమాణాలను పాటించకుండా చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించే యత్నం చేయడమే ఛండాలంగా ఉంది. రామోజీరావు మాదిరి కొండ మీద అంతా పాలెస్ లను కట్టుకోలేరు కదా! వారికి చిన్న గూడు ఏర్పడుతుంటే ఎందుకంత కడుపు మంట. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోనే అనేక కాలనీలు వర్షాలవల్ల నీట మునిగాయి. ప్రజలు నానా పాట్లు పనడుతున్నారు. వరంగల్, ములుగు వంటి జిల్లాలలో గ్రామీణ జీవనం చిన్నాభిన్నం అయింది. ఖమ్మంలో ఇళ్లలోకి నీరు వచ్చి మొత్తం విలువైన వస్తువులన్నీ పాడయ్యాయి. రామోజీకి దమ్ముంటే అదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యం వల్లే అని రాయగలరా? నిజానికి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏ ప్రభుత్వం అయినా బాధితులను ఆదుకునే యత్నం చేస్తుంది. కాని ఈనాడు వంటి ఎల్లోమీడియా తెలంగాణలో ఒక రకంగా, ఏపీలో మరో రకంగా వార్తలు రాస్తున్నదని చెప్పడానికే ఈ విషయం ప్రస్తావించవలసి వస్తోంది. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? ఏపీలో లే అవుట్లలో మెరక చేసిన పనులు కూడా జగన్ వందిమాగధులే చేపట్టారని పచ్చి అబద్దాలు రాయడానికి కూడా ఈనాడు షేమ్ ఫీల్ కావడం లేదు. అవన్ని చిన్న, చిన్న కాంట్రాక్టర్లు చేస్తుంటారు. వారికి కూడా రాజకీయాలు అంటగట్టి చెత్త వార్తలు రాస్తున్నారు. ఇంతకీ వారి బాధ ఏమిటి? జగనన్న కాలనీలు నివాసయోగ్యం కావని చెప్పడమే వారి లక్ష్యం అన్నమాట. వారు చెప్పేదాని ప్రకారం హైదరాబాద్ లోని మునిగిపోయిన కాలనీలవారు అక్కడ నివాసం ఉండవద్దని చెబుతోందా? ఆ మాట ఈనాడు అనగలదా? కొన్ని కాలనీలు వారం రోజులపాటు నీట మునిగే ఉన్నాయి. వాటన్నిటికి కేసీఆర్‌నే బాధ్యుడిగా ఈనాడు రాస్తుందా? ఈ మీడియాకు ఏపీ అంటే ఎందుకు ఇంత కక్ష అంటే తమ మార్గదర్శి సంస్థలో జరుగుతున్న నల్లధనం లావాదేవీలను జగన్ ప్రభుత్వం బయటపెడుతుందా అన్న కోపంతో ఇలా చేస్తున్నారు. జగనన్న కాలనీలలో పరిస్థితి ఇలా ఉందని రాసినవారు రాజధాని గ్రామాలు ఎన్నిసార్లు నీట మునిగింది. చివరికి హైకోర్టుకు వెళ్లే రహదారి కూడా నీటి ముంపునకు గురైతే ఎన్నడైనా వార్తలు ఇచ్చారు. పేదల ఇళ్లపై విషం చిమ్మేవారు. అమరావతి రాజధాని గ్రామాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నోరు మెదపరు. అసలు అమరావతి గ్రామాలు లోతట్టు ప్రాంతమని, కృష్ణానది కన్నా తక్కువ మట్టం లో ఉన్నాయని నిపుణులు చెబితే తెలుగుదేశంతో పాటు, ఈనాడు, తదితర ఎల్లో మీడియా అంతా ఎలా బుకాయించింది తెలుసు. కొండవీటి వాగు ముంపు నీటిని తోడి కృష్ణానదిలో కలపడానికి ప్రత్యేక స్కీమును కూడా చేపట్టారు. అయినా అది గొప్ప విషయమే. అమరావతి అధ్బుత ప్రదేశం అని భజన చేస్తారు. ఎక్కడైనా సమస్యలు ఉండవచ్చు.వాటిని ప్రభుత్వాలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళతాయి. విజయవాడలో నిత్యం కృష్ణానది వరదలకు గురయ్యే కృష్ణలంక ప్రజలకు పెద్ద రిలీఫ్ ఇస్తూ భారీ రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత జగన్ ది. ఆ విషయం ఏనాడైనా ఈ ఎల్లో మీడియా రాసిందా? ఈ మధ్య విస్సన్నపేట గ్రామం లో ఒక స్కూలు బడిలో వర్షం కురుస్తోందని చెబుతూ కొందరు విద్యార్ధులు గొడుగులు వేసుకుని కూర్చున్నట్లు ఫోటో తీసి పత్రికలలో మొదటి పేజీలలో ప్రముఖంగా వేశారు. తీరా చూస్తే అవన్ని కల్పిత ఫోటోలని తేలింది. పాడైపోయిన ఒక బిల్డింగ్ లో నీరుకారుతున్న చోట కొందరు స్టూడెంట్స్‌ను కూర్చోబెట్టి గొడుగులు పట్టించి ఫోటోలు తీసి ప్రజలను మోసం చేయడానికి కూడా ఈ ఎల్లో మీడియా బరితెగించింది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం వేలాది స్కూళ్లను వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి బాగు చేస్తుంటే, దానిని చూడలేక అసూయతో ఇలాంటి దారుణమైన, నీచమైన కథనాలు ఇస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఎక్కడైనా ఈ పరిస్థితి ఉంటే స్థానికంగా వార్త ఇవ్వవచ్చు. లేదా లోపలి పేజీలలో ఇవ్వవచ్చు. అదే సమయంలో ఆ బిల్డింగ్ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉందా? మరి చంద్రబాబు పాలన టైమ్‌లో బ్రహ్మాండంగా ఉందా? అన్నది రాయాలి కదా? ప్రభుత్వం చక్కగా మార్పులు చేస్తున్న స్కూళ్ల గురించి ఎన్నడైనా ఒక్క ముక్క రాశారా? వాటిని రాయని జర్నలిస్టులకు ఈ వార్తలు రాసే నైతిక హక్కు ఉంటుందా? పోనీ అది కూడా సమతుల్యంగా రాయడం లేదంటే ఏమని అనుకోవాలి. వారు ఆత్మవంచన చేసుకుని అయినా ఉండాలి. లేదా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారన్న విమర్శలకు సిద్దపడైనా ఉండాలి. ఆ మీడియా యాజమాన్యాలు తెలుగుదేశంతో కుమ్మక్కు అయ్యాయి కనుక, ఆ సంస్థలలో పనిచేసే జర్నలిస్టులకు ఇదొక అగ్నిపరీక్షగా మారుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగి మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యేంతవరకు ఆ జర్నలిస్టులకు ఇలాంటి విషమ పరీక్ష తప్పదు. వారికే కాదు.. ఏపీ ప్రజలకు ఈ పీడ పోవాలంటే వచ్చే ఎన్నికలవరకు ఆగక తప్పదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
పేదలకు శరవేగంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం
-
‘టిడ్కో ఇళ్లపై ఓ వర్గం మీడియా విషప్రచారం’
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఊళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్న ఒక వర్గం మీడియా, టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. టీడీపీ నేతలు టీడ్కో గృహాలు తమవని సెల్ఫీ చాలెంజ్‌లు చేస్లున్నారని, టిడ్కో ఇళ్లను సీఎం జగన్ సమూలంగా సంస్కరించారన్నారు. ‘70 వేల టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేశాం.ఆనాడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో..ఇప్పుడు వారే ఉన్నారు.పేదలకు తమ సొంత ఇంటి కల వాస్తవానికి చాల దూరంగా ఉంటుంది.సొంత ఇళ్ళు ఉన్నప్పుడు సమాజంలో చాల గౌరవం ఉంటుంది.అన్ని సముదాయాలతో పేదల ఇంటి కలను సిఎం జగన్ సాకారం చేశారు.లబ్ధిదారుల చెలించాల్సిన సొమ్మును సగానికే తగ్గిండం తో పాటుగా ..రూపాయికే సొంతింటిన అప్పగించిన ఘనతవ సిఎం జగన్‌ది.గత పాలకులు ఓట్ల రాజకీయం చేశారు.30 లక్షల ఇళ్ళ పట్టాల ఇవ్వడం ప్రపంచ రికార్డ్’ అని పేర్కొన్నారు. -
విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా 68 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం
అమరావతి: విద్యుత్ పంపిణ సంస్థలు పంపిణీ నష్టాలను సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఇపిడిసిఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, అదే క్రమంలో విద్యుత్ బకాయిల విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలకు సంబంధించిన పెండింగ్ బకాయిలును వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఇపిడిసిఎల్ పరిధిలో 33 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం పనులు మందకొడిగా జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు సర్కిళ్ళ పరిధిలో సాంకేతికంగా ఎక్కడైతే లో ఓల్టేజీ సమస్య ఉందో పరిశీలించి, అక్కడ మాత్రమే కొత్త సబ్ స్టేషన్లను నిర్మించాలని సూచించారు. 33 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేసినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ఆదేశించారు. కోస్తా ప్రాంతంలో పీక్ లోడ్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పరిశ్రమల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాలని కోరారు. జగనన్న హౌసింగ్ కాలనీల్లో విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేయాలి. ఎస్పీడిసిఎల్ పరిధిలో వినియోగదారులకు అందిస్తున్న సేవల కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేశారని, అదే మాదిరిగా ఇపిడిసిఎల్ లోనూ ఆన్లైన్ లో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చేలా అవగాహన పెంచాలని, సచివాలయ స్థాయిలో ఎనర్జీ అసిస్టెంట్ ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ భద్రతపై సిబ్బందికి శిక్షణ కల్పించాలి. ప్రమాదాల నివారణకు పోల్ టు పోల్ సర్వే చేయాలి. లూజ్ లైన్లను మార్చడంతో పాటు పాడైపోయిన కండక్టర్ లను ఎప్పటికప్పుడు మార్చాలని సూచించారు. ఈదరు గాలుల వల్ల విద్యుత్ స్థంబాలు పడిపోయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై అధికారులు యుద్ద ప్రాతిపదికన వాటిని సరిచేయాలని ఆదేశించారు. గోదావరిజిల్లాల్లో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతో లో ఓల్టేజీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. అలాగే విశాఖ సర్కిల్ పరిధిలో కొత్తగా జగనన్న కాలనీల్లో లక్ష ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయని, వాటికి అవసరమైన విద్యుత్ ను అందించేందుకు కొత్తగా 68 సబ్ స్టేషన్లను మంజూరు చేశామని, త్వరలోనే వాటికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 250 ఎంయుల విద్యుత్ డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తూ, కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యంను మెరుగుపరుచుకుంటే, సబ్ స్టేషన్లు ఏర్పాటు, విద్యుత్ లైన్ల నిర్మాణంను కూడా ప్రణాళికాయుతంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ విజయానంద్, జెన్కో ఎండి కెవిఎన్ చక్రథర్ బాబు, ఇపిడిసిఎల్ సిఎండి పృథ్వితేజ్ తదితరులు హాజరయ్యారు. -
బిగ్ క్వశ్చన్: గూడులేని నిరుపేదల జీవితాల్లో సొంతింటి వెలుగులు
-
మానసిక రోగ గ్రస్తుడు...!రామోజీ క్షమిచారని రాత
-
‘హౌస్’ ఫుల్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రణాళికతో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఆయా కాలనీల్లో అవసరమైన రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. లబ్ధిదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షిస్తూ ముందుకు సాగుతోంది. – కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాక్షి, అమరావతి: పేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని కేంద్ర గృహ నిర్మాణ–పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భూములను సేకరించి.. ఏకంగా 68,677 ఎకరాలు పంపిణీ చేసిందని కొనియాడింది. ఇళ్ల స్థలాల పట్టాలన్నీ మహిళల పేరుపై మంజూరు చేయడం ద్వారా వారి సాధికారతకు తోడ్పడుతోందని మెచ్చుకుంది. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలన్న బృహత్తర లక్ష్య సాధన కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ జరగలేదని, వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం కొత్తగా ఏకంగా 17,005 జగనన్న కాలనీలను నిర్మిస్తోందని వివరించింది. దేశంలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ‘సరసమైన గృహాలు–ఉత్తమ పద్ధతులు’ అంశంపై అధ్యయనం చేసిన కేంద్ర గృహ నిర్మాణ – పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇటీవల నివేదికను విడుదల చేసింది. దీనిని హౌసింగ్– పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన హౌసింగ్ మిషన్ డైరెక్టరేట్ ఇతర రాష్ట్రాలకు అందజేసింది. ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ కార్యక్రమాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అనుసంధానం చేసి, లబ్ధిదారులకు ప్రయోజనాలు అందిస్తోందని ఆ నివేదికలో పేర్కొంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజనతో గృహాలకు ఎల్పీజీని, ప్రధానమంత్రి సహజ బిజిలీ హర్ ఘర్ యోజన కింద విద్యుత్, జలజీవన్ మిషన్ కింద తాగునీరు, జన్ ధన్ యోజన కింద బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అండగా నిలిచిందని వెల్లడించింది. వీటితో పాటు మహిళా సాధికారతలో భాగంగా అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ఆర్థిక సాయం చేస్తూ.. పిల్లలను చదివించేందుకు తల్లులకు అధికారం కల్పించే పథకాన్ని అమలు చేస్తోందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ నివేదికలో ఇంకా ఏముందంటే.. భారీ ఉపాధి, ఆర్థిక ప్రగతికి దోహదం ► రెండు దశల్లో 30 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొలి దశలో 15 లక్షలకు పైగా (ప్రస్తుతం టిడ్కోఇళ్లతో కలిపి 21.25 లక్షలకు పైగా) ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ఇంత పెద్ద ఎత్తున గృహాల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహం ఇస్తోంది. ► తాపీ పని, వడ్రంగి వంటి 30 వృత్తిపరమైన వర్గాలకు చెందిన వ్యక్తులకు భారీగా ఉపాధి కలుగుతుంది. ప్లంబింగ్, ఇతర తక్కువ ఆదాయ వర్గాలు, రోజువారీ వేతనాలు, అనధికారిక రంగ వలస కార్మికులకు ఉపాధి లభిస్తుంది. ఉత్తమ విధానాలతో నిర్మాణంలో వేగం ► ఇళ్ల నిర్మాణం వేగంగా సాగడానికి ఏపీ ప్రభుత్వం ఉత్తమ విధానాలను అమలు చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులందరికీ సబ్సిడీ ధరలపై స్టీలు, సిమెంట్‌ను సరఫరా చేయడంతో పాటు ఇసుకను ఉచితంగా అందజేస్తోంది. ► బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేయడం ద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించింది. పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు ఇచ్చేలా జగనన్న కాలనీల లే–అవుట్లను రూపొందించింది. ► ఇళ్ల లబ్ధిదారులకు అవసరమైన నాణ్యమైన గృహోపకరణాలను తయారీ దారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వమే రివర్స్ టెండరింగ్ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అందిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఇళ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం ఉండటంతో ఏపీలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ట్రాన్స్జెండర్లకు కూడా ఇళ్లు ► చిత్తూరు నగరంలో వీధి వ్యాపారాలు చేస్తున్న 17 మంది ట్రాన్స్జెండర్లకు గృహాలను మంజూరు చేసింది. తద్వారా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో ఇబ్బందిని అధిగమించేలా చేసి.. వివక్ష నుంచి విముక్తి కలిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అన్ని సౌకర్యాలతో వారు సొంత ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ► సొంత ఇంటి రూపంలో ఆస్తి సమకూరడంతో స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు మరింత మెరుగైన జీవనోపాధి పొందేందుకు అవకాశం లభించింది. వీరిలో కొందరు ప్రభుత్వ సహాయంతో చిన్న చిన్న దుకాణాలు, టైలరింగ్ నిర్వహిస్తున్నారు. తాటి ఆకుల గుడిసెల్లో ఉండే వారికి పక్కా ఇళ్లు ► గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు పంచాయతీ ఎస్సీ, ఎస్టీ కాలనీలో 111 మందికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరు చేసింది. వీరందరూ మట్టి, వెదురు కర్రలు, తాటి ఆకులతో రూపొందించిన గుడిసె తరహా ఇళ్లలో నివసించే వారు. వారికి ఇళ్లు మంజూరు చేయడంతో కొత్త ఇంటి స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నారు. ► ఇళ్ల నిర్మాణ పనుల కోసం స్థానిక పంచాయతీ 15 నీటి కనెక్షన్లు ఇచ్చింది. కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక శాశ్వత విద్యుత్ కనెక్షన్లతో పాటు వీధి లైట్ల ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. ► నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో తొలి దశలో 27,888 నివాస యూనిట్లు చేపట్టారు. ఇందులో వెంకటేశ్వరపురంలో 4,800 యూనిట్లు పూర్తయ్యాయి. 3,000 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. రెండవ దశ కింద 18,864 యూనిట్లతో 70 శాతం పూర్తయ్యాయి. కనీస మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించారు. మూడవ దశ కింద 5,464 యూనిట్లు నిర్మిస్తున్నారు. -
జగనన్న లేఔట్లు : ఇవీ ఆధారాలు, నమ్మకండి అవాస్తవాలు
కంకిపాడు (పెనమలూరు): జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. సకల హంగులు సమకూరుతుండటంతో ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుంది. నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలతో లే అవుట్లు కాస్తా ఊళ్లను తలపిస్తున్నాయి. పేదలకు కేటాయించిన లే అవుట్లు కార్పొరేట్ సంస్థలు నిర్మించే లే అవుట్లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు నిధులు కేటాయింపులు, పరిపాలనా ఆమోదం లభించాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 670 లే అవుట్లను ఏర్పాటు చేశారు. వీటిలో 93,245 గృహాలు మంజూరు చేయగా, 91,250 గృహాలు వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఉగాది నాటికి 13వేల గృహాలు నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా 14,023 గృహాలు పూర్తయ్యేలా జిల్లా యంత్రాంగం కృషి చేయటంతో జిల్లా ప్రథమస్థానం దక్కటం తెలిసిందే. ఇప్పటి వరకూ రూ. 362.15 కోట్ల సొమ్మును లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాల నిమిత్తం చెల్లింపులు చేశారు. వేగంగా వసతుల కల్పన.. ఇళ్ల నిర్మాణాలకు అనువుగా జగనన్న లే అవుట్లు (జగనన్న కాలనీలు)లో వసతుల కల్పన పనులు వేగంగా సాగుతున్నాయి. ఆయా లే అవుట్ల మెరక పనులు, అంతర్గత రహదారులు, విద్యుదీకరణ పనులకు ఇప్పటికే రూ. 82.66 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో కాలనీలకు విద్యుత్ వసతి, రహదారి వసతి సమకూరింది. మెరక పనులతో ముంపు సమస్య నుంచి లబ్ధిదారులకు ఊరట లభించింది. తాగునీటి వసతుల కల్పనకు గానూ రూ. 64.88 కోట్లు నిధులు వెచ్చించి వసతులు కల్పించారు. దీంతో నివేశనస్థలం కేటాయించిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ప్రభుత్వం చెల్లించే సొమ్ముతో పాటుగా డ్వాక్రా మహిళలకు రూ. 35 వేలు, సీఐఎఫ్ కింద రూ. 35 వేలు, ఉన్నతి పథకం కింద రూ. 50 వేలు రుణాలను బ్యాంకుల నుంచి అందిస్తుండటంతో నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఫలితంగా జగనన్న లే అవుట్లు వసతులతో కూడిన ఊళ్లను తలపిస్తున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా.. పేదలకు కేటాయించిన జగనన్న లే అవుట్లలో వసతుల కల్పనతో పాటుగా కార్పొరేట్‌కు దీటుగా కాలనీలను తయారు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఆయా కాలనీలకు ఆకర్షణీయంగా కార్పొరేట్ సంస్థలు నిర్మించే రియల్ వెంచర్లను తలదన్నేలా స్వాగత ద్వారాలను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా కృష్ణాజిల్లాలో తొలి విడత 63 లే అవుట్లలో స్వాగత ద్వారాల ఏర్పాటుకు రూ. 2.90 కోట్లు నిధులు కేటాయించింది. ఇందుకు సంబంధించి పరిపాలనా ఆమోదం లభించటంతో గృహనిర్మాణ సంస్థ ఆర్చ్‌ల నిర్మాణ పనులపై దృష్టి సారించింది. వారంలో పనులు ప్రారంభించేందుకు సమాయత్తం అయ్యింది. సకల వసతులు కల్పిస్తున్నాం.. జగనన్న లే అవుట్లను సకల వసతులతో తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఇప్పటికే 15వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో 23 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాం. వసతుల కల్పనలో రాజీ పడకుండా సమర్థంగా పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నాం. స్వాగత ద్వారాల పనులు వారంలో ప్రారంభమవుతాయి. – జి.వి.సూర్యనారాయణ, ఇన్చార్జి పీడీ, గృహ నిర్మాణ సంస్థ, కృష్ణాజిల్లా -
ఏది నిజం?: చూడు బాబూ... ఇవిగో ఇళ్లు.. కలలోనైనా ఇది ఊహించారా?
72 ఏళ్ల వయసు. 45 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం. కానీ ప్రజలకు చేసిందేంటి? ఓ సెల్ఫీ ఛాలెంజ్!!. మేం లక్షల ఇళ్లు కట్టాం? మీరెన్ని కట్టారో చెప్పండంటూ ప్రభుత్వానికో సవాలు!!. ఏం... తెలీదా చంద్రబాబు గారూ? ఈ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలుండకూడదనే దృఢ సంకల్పంతో ఒకేసారి 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వటం మీరు కలలోనైనా ఊహించారా?.. మీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా అందరికీ నీడ కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రాలేదెందుకు? 30.25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటమే కాక... అందులో 21.25 లక్షల ఇకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతిచ్చి ఆరంభించటం చరిత్ర ఎరుగని వాస్తవం కాదా? స్థలాలిచ్చి రెండున్నరేళ్లు కూడా తిరక్కుండానే... ఈ నెలాఖరుకల్లా 5 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేస్తున్నారంటే... ఆ గృహ యజమానులంతా మీకెన్ని సెల్ఫీ చాలెంచ్లు విసరాలి? మీ 14 ఏళ్ల పాలనలో కట్టని ఇళ్లు ఈ రెండున్నరేళ్లలోనే పూర్తయ్యాయంటే... మీకు ఇంకా ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు అవసరమా? 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. వీటికోసం 17, 005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపం ఏకంగా ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో ప్లాటూ కనీసం రూ.2.50 లక్షలనుకున్నా ఏకంగా రూ.75 వేల కోట్లు. పైపెచ్చు ఇంటికి రూ.1.8 లక్షల సాయం. ఉచిత ఇసుక, సబ్సిడీ సిమెంటు, మెటీరియల్స్ రూపంలో మరో రూ.55వేలు అదనం. అంటే ప్రతి ఇంటికోసం అందజేస్తున్న సాయం రూ.2.35 లక్షలు. అంటే 70వేల కోట్లకు పైనే. ఇవికాక ఈ కాలనీల మౌలిక సదుపాయాల కోసం దశలవారీగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.33వేల కోట్లు. అంటే మొత్తంగా ఈ గృహ యజ్ఞం కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 1.78 లక్షల కోట్లు. ఇంతటి బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకోవాలంటే... అందరికీ నిలువ నీడ కల్పించాలన్న ఆశయం ఎంత బలంగా ఉండాలి? వాస్తవరూపం దాలుస్తున్న ఆ ఆశయబలం ముందు మీ జిత్తులమారి రాజకీయాలు సరితూగుతాయనే అనుకుంటున్నారా? విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడినే తీసుకుందాం. అక్కడ పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న గిరిజన కుటుంబాలు... వర్షం పడితే కొండ మీద నుంచి గుడిసెల్లోకి పారే వరద నీరు... దోమలు, కీటకాలు, తేళ్లు, పాముల సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడిపే కుటుంబాలు... ఇవన్నీ చంద్రబాబు నాయుడి పాలనలో అక్కడి వారందరికీ అనుభవం. అసలు అలాంటి ప్రాంతమొకటి ఉన్నదని, అక్కడి గిరిజన కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయనే విషయమే నారా వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడో ఊరు రూపుదిద్దుకుంటోంది. ఎందుకంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే... ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని చదును చేసి, వరద ముప్పు లేకుండా తీర్చిదిద్దింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నవారికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. తమ బతుకు చిత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మార్చేశారని చెబుతున్న రోజు కూలీ తలుపుల కవితలాంటి స్థానికుల భావోద్వేగం ముందు బాబు సెల్ఫీలు ఎన్ని సరితూగుతాయి? షమీ కుటుంబంలో సంబరం షేక్ షమీ భర్త రసూల్ కూలి పనులు చేస్తాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నివసిస్తున్న ఈ కుటుంబం ఇంటద్దె కోసం నెలకు రూ.3 వేలు చెల్లిస్తోంది. రసూల్ సంపాదన ఇంటద్దె, ముగ్గురు పిల్లల పోషణకు చాలక నానా అవస్థలూ తప్పడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పసుమర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే రసూల్ కూలి పనులు మానాలి. అందుకని ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం స్లాబ్ దశ పూర్తయింది. త్వరలో ఆ కుటుంబం సొంతింట్లోకి మారనుంది. ఎలాంటి ప్రయాస లేకుండా తమకు స్థలం, ఇల్లు వచ్చిందని చెబుతున్న షమీ సంతోషం ముందు... చంద్రబాబు రాజకీయాలు ఎన్నయినా దిగదుడుపే కదా? లేఅవుట్‌కు వెళ్లి సొంతింటిని చూసుకున్నప్పుడు ఒక్కోసారి ఇదంతా కలేమో అనిపిస్తుందని భావోద్వేగంతో చెబుతుంది షమీ. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ కర్నూలు జిల్లా నందవరం మండలం కొత్త కైరవాడి గ్రామానికి చెందిన కురువ సరోజమ్మ చాలా ఏళ్లుగా గుడిసెలోనే జీవిస్తోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే సరోజమ్మ గతంలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా సొంతింటి కల నెరవేరలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించింది. ఇటీవలే సొంతింట్లోకి మారారు. ‘అద్దె కట్టుకునే స్థోమత లేక చాలా ఏళ్లు గుడిసెలోనే ఉన్నాం. వర్షాలకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. భగవంతుడు మా మొర ఆలకించాడు. అందుకే సీఎం జగన్ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం’ అంటున్న సరోజమ్మ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదేమో!!. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30.25 లక్షల మంది పేద మహిళలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. అసలింతటి విలువైన స్థలాన్ని ప్రజలకు అందించటమే ఓ చరిత్ర. వేరెవరైనా అయితే అంతమందికి స్థలాలిచ్చామని ఘనంగా ప్రచారం చేసుకోవటంతో పాటు... అక్కడితో వదిలిపెట్టేసేవారు. కానీ వై.ఎస్.జగన్ ఓ అడుగు ముందుకేశారు. స్థలాలివ్వటంతో సరిపెట్టకుండా వెనువెంటనే దశలవారీగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. సొంతింటి ద్వారా ఒకో పేదింటి అక్క చెల్లెమ్మల చేతికి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే స్థిరాస్తి అందుతోంది. తద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతోంది. ఇటు ఇళ్ల నిర్మాణం.. అటు సదుపాయాలు రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. 20.28 లక్షల ఇళ్ల నిర్మాణాలు (95 శాతం) వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3,37,631 గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 1.27 లక్షల ఇళ్లు పైకప్పు, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం ఈ నెలాఖర్లోగా పూర్తయి... వారూ గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 28,377, విజయనగరంలో 27,895, శ్రీకాకుళంలో 23,611 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరుసటి ఏడాది నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఐదు లక్షల వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లను సమకూరుస్తోంది. ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రి సమకూరుస్తుండగా కొందరు నిరుపేద లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంకోచించారు. దీంతో వీరి కోసం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ప్రవేశపెట్టారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి, వారికి లాభాపేక్ష లేని నిర్మాణ సంస్థలను ఎంపిక చేసి అనుసంధానించడం ద్వారా ఆప్షన్–3 ఇళ్లను నిర్మిస్తున్నారు. 3.03 లక్షల ఇళ్లు పునాది, ఆపై దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,923 ఇళ్లు లింటెల్ లెవెల్, 12,252 ఇళ్లు స్లాబ్ దశలో నిర్మాణంలో ఉన్నాయి. షీర్ వాల్ టెక్నాలజీతో చకచకా నా భర్త హోల్‌సేల్ మెడికల్ షాపులో సేల్స్‌మెన్‌గా చేస్తారు. చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గతంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. నా భర్త పనిచేసే చోట పెద్దగా సెలవులివ్వరు. నేను ఇంటి వద్ద చిన్న వ్యాపారం చేస్తుంటా. మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరాం. షీర్వాల్ టెక్నాలజీ విధానంలో మా ఇంటిని నిర్మిస్తున్నారు. స్లాబ్ అయిపోయింది. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తవుతోంది. ఈ జన్మకు సొంతిల్లు అనేది ఉంటుందో ఉండదోనని ఆవేదన చెందేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ మా కలను నెరవేర్చారు. నా బిడ్డ చదువు కోసం అమ్మ ఒడి కింద సాయం కూడా అందిస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ప్రభుత్వం మాకు అండగా నిలుస్తోంది. – జి.శోభారాణి, ఆప్షన్–3 లబ్ధిదారురాలు, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వివక్ష లేకుండా మంజూరు గత ఏడాది డిసెంబర్ 15న ప్రభుత్వం ఇచ్చిన సొంతింటికి మారాం. కరెంట్, నీటి కనెక్షన్.. ఇలా అన్ని వసతులనూ కల్పించారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నేను గత ప్రభుత్వంలో ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు తప్ప రాజకీయాలతో సంబంధం లేని మాకెవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు చూడకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్థలం మంజూరు చేసింది. ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. – ఎం.హరిత, ఆరూరు ఎస్టీ కాలనీ, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా అంతా కలలా.. ఆర్నెల్లలోనే నాకు 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. వడ్రంగి పని చేసే నా భర్త సంపాదనతో కుటుంబ పోషణే భారంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఇంటి స్థలం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. కొద్ది రోజులకే స్థలం మంజూరైంది. ఆర్నెల్లలో సొంతిల్లు కట్టుకున్నాం. అంతా కలలా ఉంది. సొంతింట్లో ఉంటున్నామంటే నాకే నమ్మకం కలగటం లేదు. – నాగేశ్వరమ్మ, శనివారపుపేట జగనన్నకాలనీ ఏలూరు రూ.9 లక్షల విలువైన స్థలం ఇచ్చారు మా గ్రామం జాతీయ రహదారి 26ని అనుకుని ఉండటంతో సెంట్ స్థలం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు పలుకుతోంది. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చింది. నిర్మాణం పూర్తవడంతో గత ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేసి సొంతింట్లో ఉంటున్నాం. – బోడసింగి సీత, బోడసింగి పేట గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా -
అర్ధరాత్రి టీడీపీ నాయకుల గూండాగిరి.. ఎదురుతిరిగిన ప్రజలు
సంతబొమ్మాళి: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లపై టీడీపీ నాయకులు అర్ధరాత్రి సమయంలో ప్రొక్లెయినర్లతో దాడి చేశారు. నిర్దాక్షిణ్యంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. లబ్ధిదారులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేసి.. స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురంలో గొనప సునీత, కోత అమ్మోజీ, నౌపడ తవిటమ్మ, బస్వల తులసమ్మ, బస్వల మహాలక్ష్మి, గోరుబండ తులసమ్మకు ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు ఇచ్చింది. దీంతో వారు అక్కడ ప్రభుత్వ సాయంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఎప్పటి నుంచో ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకులు కన్నేశారు. ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరుకోవడంతో.. లబ్ధిదారులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేసేందుకు ఇదే సరైన సమయమనుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ప్రొక్లెయినర్లతో ఆ ఏడుగురి ఇళ్ల నిర్మాణాలపై దాడి చేసి.. వాటిని కూల్చివేశారు. మంగళవారం ఉదయం అక్కడకు చేరుకున్న లబ్ధిదారులు.. నేలమట్టమైన తమ ఇళ్లను చూసి భోరున విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామస్తులంతా తిరగబడటంతో నిందితులైన టీడీపీ నాయకులు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారు. కాగా, ఇళ్ల కూల్చివేతపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ ఆరంగి వసంతరావు, బెండి విష్ణు, బెండి సూర్యనారాయణ, రాము, అరుణ్‌కుమార్, కైలాష్, ప్రదీప్, అనిల్, బాలక ప్రసాద్, నారాయణ, పొందల సురేశ్, మధు, ఆరంగి శ్రీధర్, హరిపై కేసు నమోదు చేసినట్లు సంతబొమ్మాళి ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. -
జగనన్న కాలనీలు: ‘తూర్పు’లో ఉగాదికి రెడీ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉగాది పండగ నాటికి లబ్ధిదారులను శాశ్వత గృహ యజమానులుగా మార్చేందుకు, తద్వారా వారి కుటుంబాల్లో పండగ సంతోషాన్ని సంపూర్ణంగా నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యాన్ని ఉగాదికి ఒక రోజు ముందే అధిగమించే ఏర్పాట్లలో జిల్లా అధికారులు తలమునకలవుతున్నారు. జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న పేదల ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కాలనీల్లో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను పూర్తి చేస్తున్నారు. మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేక బృందంగా ఏర్పడి గృహ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇల్లు కట్టుకోలేని వారికి అవగాహన కల్పించి, నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుండటంతో లబ్ధిదారులు సైతం ముందుకు వస్తున్నారు. ఉగాదికి 6,319 గృహ ప్రవేశాలు పేదలకు శాశ్వత నివాసం కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1.46 లక్షల మందికి ఉచితంగా ఇంటి పట్టాలు పంపిణీ చేసింది. వీటిలో తొలి దశలో రూ.113.48 కోట్లతో 63 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మరికొన్నింటిలో లబ్ధిదారులు గృహప్రవేశాలు సైతం చేసుకున్నారు. మిగిలిన వాటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఉగాది నాటికి 6,318 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికార యంత్రాంగం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,211 ఇళ్ల పనులు వంద శాతం పూర్తయ్యాయి. మిగిలిన 5,107 నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి మండలంలో హౌసింగ్ అధికారులు, తహసీల్దార్లు ప్రత్యేక బృందంగా ఏర్పడి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి వసతికి బోర్లు తవ్వుతున్నారు. తాగు, ఇతర అవసరాలకు నీటిని సమకూరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన కాలనీల్లో నివసించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. అనపర్తి, బిక్కబోలు, తొర్రేడు, చాగల్లు, కొవ్వూరు కృష్ణారావు చెరువు, కడియం, దామిరెడ్డిపల్లి, నిడదవోలు వైఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయి. జగనన్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం కల్పించే పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 755 కాలనీల్లో రూ.411 కోట్ల అంచనాతో పనులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో సైతం అధునాతన విధానం అవలంబిస్తున్నారు. మూడు పెద్ద లే అవుట్లు అయిన కొమరగిరి, వాకలపూడి (కాకినాడ), వెలుగుబంద (రాజానగరం) జగనన్న కాలనీల్లో ప్రయోగాత్మకంగా భూగర్భ విద్యుత్ సరఫరాకు కార్యాచరణ సిద్ధమైంది. ప్రతి వారం లబ్ధిదారులతో ముఖాముఖి ఉగాది నాటికి గృహప్రవేశాలకు ముమ్మర కసరత్తు చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. మిగిలినవి కూడా వేగవంతం చేసేందుకు ప్రతి శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతున్నాం. ఏవైనా సమస్యలుంటే చెప్పాలని కోరుతున్నాం. ఇల్లు కట్టుకుంటే బిల్లు సకాలంలో వస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైతన్యం తీసుకువస్తున్నాం. ఉగాది నాటికి అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి గృహప్రవేశాలు చేపడుతాం. జిల్లాలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 13,019 ఇళ్లకు విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. – కె.మాధవీలత, కలెక్టర్ లక్ష్యాన్ని అధిగమిస్తాం ఉగాది నాటికి ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణాల లక్ష్యాన్ని అధిగమిస్తాం. జిల్లా వ్యాప్తంగా 6,318 గృహప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఇప్పటికే 1,211 పూర్తి చేశాం. మిగిలినవి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రత్యేక హౌసింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ లబ్ధిదారులను చైతన్యపరుస్తున్నాం. – జి.పరశురాం, ఇన్చార్జి హౌసింగ్ పీడీ -
పోరాటాలు లేకుండానే మా ఆశయం నెరవేర్చారు.. సీఎం జగన్‌పై ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీపీఎం కురువృద్ధుడు, కృష్ణా జిల్లా నిడుమోలు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాటూరు రామయ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. పేదల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, రైతు బాంధవుడు, భూపోరాట యోధుడుగా పేరు పొందారు. ఉద్యమాలే ఊపిరిగా బతికిన ఆయన ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన రామయ్య సీఎంను కలిశారు. సీఎం జగన్ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఉద్యమాలు, పోరాటాలు లేకుండా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్న సీఎంను రామయ్య అభినందించారు. తమ ఆశయాన్ని నెరవేర్చారని ప్రశంసించారు. 2024లో మళ్లీ అధికారంలోకి రాగానే పేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయాలని సీఎంను కోరారు. ప్రజల గుండెల్లో ఉంటారు పేద, మధ్య తరగతి కుటుంబాల జీవితాలను మెరుగు పరిచేందుకు విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వటం చాలా గొప్ప విషయమని రామయ్య అన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం లాంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా వైఎస్ జగన్ నేడు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. తాను జన్మించిన కొన్ని ఘడియలకే పోషకాహార లోపంతో తన తల్లి కన్నుమూసిందని తెలిపారు. ‘మీ లాంటి మనసున్న మహారాజు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే, ప్రభుత్వమే పోషకాహారం అందజేసి ఉంటే తన తల్లి బతికి ఉండేది’ అంటూ రామయ్య గద్గద స్వరంతో అన్నారు. పేదల గురించి ఇంతలా ఆలోచించటం చాలా గొప్ప విషయమని, ఇదే దృక్ప«థం కొనసాగించాలని సీఎం జగన్‌కు సూచించారు. సీఎంను ప్రశంసించాలనే వచ్చా సీఎంతో భేటీ అనంతరం రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ను కలవటంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. ఎలాంటి కోర్కెలు, అవసరాల కోసం కలవలేదన్నారు. సీఎం జగన్ చేపట్టిన కార్యక్రమాలు చాలా బాగున్నాయని ప్రశంసించడానికే వచ్చానని తెలిపారు. ఊహ తెలిసినప్పటి నుంచి సీపీఎం ఆశయాలకు కట్టుబడి పని చేశానని, తుది శ్వాస వరకు అలాగే ఉంటానని అన్నారు. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిన్నానని, జైలు జీవితం కూడా అనుభవించానని చెప్పారు. -
వెంకటాచలంలో జగనన్న కాలనీని పరిశీలించిన మంత్రి కాకాణి
-
నగరి నియోజకవర్గంలో నెరవేరిన పేదల సొంతింటి కల
-
విశాఖ జిల్లాలో చురుగ్గా జగనన్న లేఅవుట్ పనులు
-
పొలిటికల్ కారిడార్: దేవినేని ఉమాను మర్చిపోయిన క్యాడర్, ప్రజలు
-
దేశ చరిత్రలోనే ‘గృహ’త్తర అధ్యాయం
పాత గుంటూరు: గతంలో ఇంటి స్థలం కావాలంటే రోజుల తరబడి పోరాడాల్సి వచ్చేదని, సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మేధావులు, ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ‘పేదల ఇళ్లు – రాజకీయ సవాళ్లు’ అంశంపై మేధావులు, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని ఎన్జీవో హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు జి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదల ఇళ్లపై రాజకీయం చేస్తున్న పలు పార్టీల వైఖరిని ఎండగట్టారు. విపక్షాల రాద్ధాంతం తగదు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తుండటం గొప్ప విషయం. విపక్షాలు విజ్ఞత కోల్పోయి విమర్శలు చేయడం తగదు. – ఆచార్య డీఏఆర్ సుబ్రహ్మణ్యం, మహాత్మా గాంధీ కళాశాల వ్యవస్థాపకుడు బాబు, పవన్ రాజకీయాలకు తగరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు. నా దృష్టిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయ నేతలే కారు. ప్రజల బాధలు పట్టనోళ్లు రాజకీయాలకు తగరు. – ఆచార్య గురవయ్య, ఏసీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఇది స్వర్ణయుగం గుప్తుల స్వర్ణ యుగం గురించి మనం పుస్తకాలలో చదువుకున్నాం. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పాలనలో దానిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందరికీ ఇళ్లు ఇవ్వడం అనేది అతిపెద్ద యజ్ఞం. – చక్రపాణి, విశ్రాంత ఎస్పీ పేదల ఇళ్లు – పవర్‌స్టార్ కన్నీళ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్లను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మహిళా సాధికారతకు నిదర్శనం. పేదల ఇళ్లు–పవర్ స్టార్ కన్నీళ్లు అనే నినాదంతో మహిళలంతా ఉద్యమిస్తే కానీ వాళ్లకు బుద్ధి రాదు. – మంజుల, సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సీఎం నిజమైన ప్రజా పాలకుడు ఏకంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. జగనే నిజమైన ప్రజా పరిపాలకుడు. – గోళ్లమూడి రాజసుందరబాబు, ఐద్వా వ్యవస్థాపకులు రాజకీయాలకు అతీతంగా హర్షిద్దాం గతంలో ఇళ్ల స్థలాలు కావాలంటే రోజుల తరబడి ఆందోళన చేయాల్సి వచ్చేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇది అందరూ హర్షించదగ్గ అంశం. – జి.శ్రీనివాస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు గొప్ప విషయం ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమి సేకరించింది. నిరుపేదల ఇళ్ల కోసం మొత్తం 25 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది వాస్తవం. – పరిశపోగు శ్రీనివాసరావు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పవన్ ఆందోళన హాస్యాస్పదం జగనన్న ఇళ్లపై పవన్ కళ్యాణ్ ఆందోళన హాస్యాస్పదం. జగనన్న ఇళ్లు – జనసేనాని కన్నీళ్లు అని కార్యక్రమం పేరు మార్చితే బాగుంటుంది. – భగవాన్ దాస్, రాష్ట్ర విద్యార్థి ఉద్యమ నేత గూడు చెదరగొట్టే కుట్ర అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు ముఖ్యమంత్రి జగన్ కల్పిస్తున్న గూడు చెదర గొట్టేందుకు రాష్ట్రంలో ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. – తిప్పాబత్తుని గోవింద్, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇది సరికొత్త చరిత్ర తాడి తన్నేవాడి తల తన్నేవాడే జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని ఎత్తులు వేసినా.. వాటికి పైఎత్తు వేసి చిత్తు చేయగల సమర్థుడు. ఇళ్ల నిర్మాణం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు. – వేముల భారతి, అస్మిత మహిళా మండలి అధ్యక్షురాలు పవన్‌కొచ్చిన నొప్పేంటి? సొంత ఇంటి కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డాం. సీఎం జగన్ పుణ్యాన ఇప్పుడు సొంతింటిలో దర్జాగా ఉంటున్నాం. మాలాంటోళ్లకు జగనన్న ఇళ్లు ఇస్తే మీకొచ్చిన నొప్పేమిటి? – రత్నకుమారి, ఇంటి లబ్ధిదారురాలు -
పొలిటికల్ కారిడార్ : దత్తపుత్రుడి అగచాట్లు ..
-
30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్ర : మంత్రి ధర్మాన
-
పేదలు బాగుపడుతుంటే చంద్రబాబు, పవన్ కు నచ్చడం లేదు : మంత్రి జోగి రమేష్
-
జగనన్న మేలును ఎన్నటికీ మరువలేం
రాప్తాడు రూరల్ (అనంతపురం): ‘జగనన్న లేఅవుట్లో నిర్మిస్తున్న ఇళ్లు చాలా బాగున్నాయి. ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ వచ్చాం. సొంతింటి కల నెరవేర్చిన జగనన్న మేలును ఎప్పటికీ మరువలేం’ అని అనంతపురం మండలం ఆలమూరు సమీపంలోని జగనన్న హౌసింగ్ లే–అవుట్లో లబ్ధిదారులు తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఆలమూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్‌ను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గంగాదేవి అనే లబ్ధిదారు మాట్లాడుతూ ప్రస్తుతం నెలకు రూ.3 వేల చొప్పున ఇంటి అద్దె చెల్లిస్తున్నామని తెలిపింది. తమకు సొంతిల్లు నిర్మిస్తుండటంతో త్వరలో అద్దె సమస్య తీరుపోతుందని పేర్కొంది. ఇల్లు బాగా కడుతున్నారని, తనకెంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. వరలక్ష్మి అనే మరో లబ్ధిదారు మాట్లాడుతూ ఆలమూరులో నెలకు రూ.2 వేలు చెల్లిస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపింది. ఇక్కడ జగనన్న ఇల్లు కట్టిస్తుండటంతో తమ సొంతింటి కల నెరవేరుతోందని చెప్పింది. అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇచ్చి.. 21 లక్షల ఇళ్లను యజ్ఞంలా నిర్మిస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించడం సిగ్గు చేటన్నారు. -
నీ పార్ట్నర్ కోసం నిరాధార ఆరోపణలు చేస్తావా?
సాక్షి, అమరావతి: జగనన్న కాలనీల్లో అవినీతి జరిగినట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధారాలతో నిరూపించగలరా? అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ చేశారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే తల దించుకోవడానికి తాను సిద్ధమని ప్రకటించారు. జగనన్న కాలనీల్లోకి రావద్దంటూ లబ్ధిదారులైన అక్కచెల్లెమ్మలు నీ పార్టీ నేతలు, కార్యకర్తలకు చీవాట్లు పెడుతుండటం కళ్లకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ‘మీకు వాస్తవాలు చెప్పేందుకు మావాళ్లు వచ్చేవాళ్లు.. కానీ నిన్ను అడ్డుకున్నామని నిందలు మోపుతావనే ఆగాం’ అని పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ బాటలో మహాయజ్ఞం వైఎస్సార్ బాటలోనే రాష్ట్రంలోని పేదలందరి సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసే మహాయజ్ఞాన్ని సీఎం జగన్ చేపట్టారని బొత్స తెలిపారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలకు భూమి కొనుగోలు, సదుపాయాల కల్పనకు ఇప్పటిదాకా రూ.15 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. జగనన్న కాలనీల్లో ప్రభుత్వం రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని పవన్ కళ్యాణ్ ఆరోపించడం ఆయన అజ్ఞానం, అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు. ప్రజలు నువ్వు ఏది చెబితే అది నమ్మేందుకు నువ్వేమైనా యుగపురుషుడివా? అని నిలదీశారు. దాదాపు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 71,813 ఎకరాల భూమిని సేకరించామని, ఇందులో 25 వేల ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ.11 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేశామని బొత్స తెలిపారు. భూమి చదును చేయడానికి, విద్యుత్, నీటి సౌకర్యం, అంతర్గత రహదారులు లాంటి సదుపాయాల కోసం ఇప్పటివరకూ రూ.నాలుగు వేల కోట్ల మేర ఖర్చు చేశామన్నారు. జగనన్న కాలనీల్లో ఖర్చు చేసిందంతా వైఎస్సార్సీపీ నేతలు కాజేశారని నువ్వు ఆరోపిస్తే నమ్మడానికి ప్రజలేమైనా చెవిలో పువ్వులు పెట్టుకున్నారనుకుంటున్నావా? అని పవన్‌ను నిలదీశారు. ఏ ఒక్కరైనా చెప్పారా? విజయనగరం జిల్లాలోని గుంకలాం వద్ద 400 ఎకరాల్లో 12 వేల ఇళ్ల స్థలాలను సిద్ధం చేసి పది వేల మందికి పట్టాలను సీఎం జగన్ పంపిణీ చేశారని బొత్స గుర్తు చేశారు. రాష్ట్రంలోని అతిపెద్ద లే అవుట్లలో ఇది రెండోదన్నారు. అక్కడకు వెళ్లిన పవన్ వద్దకు ఏ ఒక్క లబ్ధిదారుడూ రాలేదని, ఆయన వెంట ఉన్నది అభిమానులు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ లేవుట్లోని భూమి కొనుగోలులో అవినీతి జరిగిందని, సదుపాయాల కల్పన పనుల్లో అక్రమాలు జరిగాయని, ఇంటి బిల్లుల చెల్లింపు కోసం కమీషన్లు అడిగారని ఏ ఒక్కరితోనైనా చెప్పించగలవా? అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. 21 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అత్యంత పారదర్శకంగా రూ.7,700 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని గుర్తు చేశారు. అవినీతి జరగడానికి అధికారంలో ఉన్నది నీ పార్ట్నర్ చంద్రబాబు కాదు.. ఇది వైఎస్ జగన్ ప్రభుత్వమని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తైతే రాష్ట్రంలో కొత్తగా 17,005 గ్రామాలు, పట్టణాలు ఆవిష్కృతమవుతాయని చెప్పారు. ఆ అవసరం మాకేముంది? జగనన్న కాలనీలను పరిశీలించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తనపై వైఎస్సార్సీపీ నేతలు ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదమని మంత్రి బొత్స చెప్పారు. ‘నీపై మేం ఫిర్యాదులు చేయడానికి నువ్వేమైనా పెద్ద పుడింగివనుకుంటున్నావా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘నీపై ప్రధానికి ఫిర్యాదు చేయాల్సిన అవసరం మాకేముంది? నీ గుణాలన్నీ మాకు ఆపాదిస్తే ఎలా’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఏదో నీ పార్ట్నర్కు ఇచ్చిన కాల్షీట్ ప్రకారం రాష్ట్రానికి వచ్చిపోయే నీకు మా మాదిరిగా ప్రజాసేవ చేయాలనే ఆలోచనలు వస్తాయని అనుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. క్రేన్లు కట్టి లేపినా చంద్రబాబు నిలబడే పరిస్థితి లేదన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం రాష్ట్ర ప్రయోజనాలే తమకు ప్రధానమని, రాజకీయ ప్రయోజనాలు కాదని ప్రధాని మోదీ సమక్షంలో చెప్పడం ద్వారా సీఎం జగన్ మంచి సందేశం ఇచ్చారని బొత్స పేర్కొన్నారు. సింగరేణిలో కేంద్ర వాటా 49 శాతం, తెలంగాణ వాటా 51 శాతం ఉంది కాబట్టే ప్రైవేటీకరణ తమ చేతుల్లో లేదని మోదీ చెప్పారని బొత్స పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పూర్తి వాటా కేంద్రానిదేనన్నారు. ప్రభుత్వ రంగంలోనే లాభాల బాటలో నడిపేలా సీఎం వైఎస్ ప్రత్యామ్నాయ మార్గాలను ప్రధానికి సూచించారని, ప్రైవేటీకరణకు తాము పూర్తి వ్యతిరేకమని తేల్చి చెప్పారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన.. ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన చేయడానికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారని మంత్రి బొత్స చెప్పారు. కొన్ని దుష్ట శక్తులు సాంకేతిక కారణాలను అడ్డం పెట్టుకుని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి మార్గం సుగమమైనట్లే ప్రజల మంచి కోసం సీఎం జగన్ చేస్తున్న యజ్ఞం సఫలమవుతుందని స్పష్టం చేశారు. బీజేపీతో కాపురం.. బాబుతో పొత్తా? బీజేపీతో కాపురం చేస్తూ చంద్రబాబుతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ అర్రులు చాస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి బొత్స చెప్పారు. ప్రజలు తమను చొక్కా పట్టుకుని నిలదీసేందుకు తామేమైనా పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ నేతల్లా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నామా? అని ప్రశ్నించారు. జనసేన రాజకీయ పార్టీనే కాదని, అది ఓ సెలబ్రిటీ పార్టీ అని పునరుద్ఘాటించారు. తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటారేమోనని పవన్ కళ్యాణ్ ఆరోపించడాన్ని చూస్తే అధిక శాతం సీట్లలో ఆయన పార్ట్నర్ పోటీ చేస్తారని సంకేతాలిస్తున్నట్లుగా ఉందన్నారు. -
జనసేనపై ఆగ్రహం: ప్రభుత్వ సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నారా?
పెంటపాడు(ప.గో. జిల్లా): జగనన్న కాలనీలో జనసేన జెండాల ప్రదర్శన తగదు.. మమ్ములను సంప్రదించకుండా కాలనీలోకి రావడం సహించబోం.. మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి.. జనసేన పార్టీ వాళ్లు వచ్చి ఇక్కడ కిరికిరిలు పెట్టొద్దు.. జగనన్న ప్రభు త్వం మాకెంతో మేలు చేస్తోంది.. గతంలో ఏ ప్ర భుత్వం మాకు ఇళ్లు ఇవ్వలేదు.. ఇంతకాలానికి జ గనన్న ప్రభుత్వం ఇళ్లు అందించింది.. అంటూ పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు శివారు బిళ్లగుంట జగనన్న కాలనీవాసులు జనసేన నాయకులకు అడ్డుతగిలారు. ఆదివారం జనసేన గోబ్యాక్ అంటూ ఏపూరి నాగలక్ష్మి తదితర మహిళలు నినదించారు. ఆదివారం జనసేన నాయకులు, కార్యకర్తలు సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా జెండాలతో బిళ్లగుంట జగనన్న కాలనీలోకి ప్రవేశిస్తుండగా ఇళ్ల లబ్ధిదారులు వారిని అడ్డుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తాము ఇళ్ల నిర్మాణాలను ము మ్మరం చేస్తున్నామని, ఈలోపు సౌకర్యాలు కల్పించడం లేదంటూ జనసైనికులు రావడం కుదరదన్నారు. జనసేన నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా లబ్ధిదారులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. మాకు సీఎం జగనన్న, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నిరకాలుగా అండగా నిలుస్తుంటే ఓర్వలేకపోతున్నారా అని లబ్ధిదారులు ప్రశ్నించారు. దీంతో జనసైనికులు తాము తెచ్చిన జెండాలను ముడిచి వెనుదిరిగారు. అప్రతిష్టపాలు చేసేలా.. ప్రభుత్వం లక్షల ఖర్చులతో స్థలాలు కొని ఇచ్చింది. ఇంటి నిర్మాణం పూర్తిచేసుకుంటు న్నాం. ఇళ్లు ఇచ్చిన ప్రభుత్వం రోడ్లు పోయకుండా ఉంటుందా.. అయితే జనసేన పార్టీ వాళ్లు కాలనీలోకి ఎందుకు వస్తున్నారో అర్థం కావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇటువంటి చర్యలు తగదు. – ఏపూరి నాగ విజయలక్ష్మి, దర్శిపర్రు ప్రభ్వుత సాయంతో నిర్మాణం గతంలో ఏ పార్టీ వాళ్లూ మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు జగనన్న స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు సొమ్ములు కూడా ఇస్తున్నారు. అధిక వర్షాలతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతోంది. ఇప్పుడిప్పుడే పనులు మళ్లీ మొదలెడుతున్నాం. ఈలోపు జనసేన పార్టీ వాళ్లు కాలనీలోకి వచ్చి ఏం చేస్తారో తెలియడం లేదు. –కలగంటి శేషవేణి, దర్శిపర్రు -
జగనన్న కాలనీల పై సజ్జల కామెంట్స్
-
పవన్ కల్యాణ్ పై మండిపడుతున్న గుంకలాం ఇళ్ళ లబ్ధిదారులు
-
టీడీపీ, జనసేన పార్టీలు కనుమరుగు అవ్వడం ఖాయం : మంత్రి ఉషశ్రీ చరణ్
-
పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాన్ పరిస్థితి చూస్తుంటే జగనన్న ఇళ్లు.. పవన్, చంద్రబాబు కన్నీళ్లు లాగా ఉందని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. ఆయన పర్యటనలకు ఈ ట్యాగ్ లైన్ పెట్టుకోవడం బెటర్ అని సూచించారు. విజయనగరం పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ అసలు ఏం చేసినట్లు అని ప్రశ్నించారు. పవన్ మాటలు, చేష్టలు వింతగా ఉన్నాయన్నారు. వీకెండ్లో గెస్ట్ ఆర్టిస్ట్‌గా వచ్చి ప్రభుత్వాన్ని తిట్టి వెళ్లాడు. 21 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే చూడలేక పవన్‌కు కడుపుమంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంకలాంలో కూడా 12 వేల ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే ఏమీ జరగనట్టు చెప్తున్నాడు. కళ్లుంటే, సరిగా చూస్తే ఆ ఇళ్ల నిర్మాణం కనిపిస్తుంది అని మండిపడ్డారు. 2014లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పారు. మరి ఒక్క ఇళ్లయినా ఎందుకు కట్టించలేదు? సెంటు స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు? మరి ఆరోజు చంద్రబాబు చొక్కా పట్టుకుని పవన్ ఎందుకు అడగలేదు? అని వరుస ప్రశ్నలు సంధించారు. చదవండి: (విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ టూర్ అట్టర్‌ఫ్లాప్) పిల్ల సైకోలను పోగేసుకుని వచ్చి గుంకలాంలో మీటింగ్ పెట్టారు. లబ్ధిదారులు తిరగబడితే ఈ పిల్ల సైకోలు పరుగెత్తుతున్నారు. జనాల్ని రెచ్చగొట్టి హైదరాబాద్ పారిపోవటం తప్ప ఇక ఏం చేస్తున్నావ్?. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ఏ రాష్ట్రంలోనూ జరగటం లేదు. కేంద్ర ప్రభుత్వమే శభాష్ అని మెచ్చుకున్నదని తెలుసుకో. మనసున్న ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు. గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వస్తే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారో, మెచ్చుకుంటున్నారో తెలుస్తుంది. పవన్, ఆయన దత్తతండ్రి కలిసొచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. రాక్షసులు, దుర్మార్గులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం. అసలు ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారో చూసుకో. నువ్వు ఎక్కడెక్కడ పోటీ చేయాలో అది చూసుకో. గెలుస్తావో లేదో అది కూడా చూసుకో పవన్ అని సూచించారు. చంద్రబాబుకే ఎక్కడ పోటీ చేయాలో అర్థం కావడం లేదు. ఇక దత్తపుత్రుడు, సొంత పుత్రుడుకి ఎక్కడ సీట్లు ఇస్తాడో చూడాలి. లోకేష్ మోకాళ్లతో నడిచినా మీరు చేసిన పాపాలు పోవు. మిమ్మల్ని 23 సీట్లకు పరిమితం చేశారు. 2024లో చంద్రబాబు, లోకేష్, పవన్ ఎవరూ అసెంబ్లీలో అడుగు పెట్టలేరు. అసలు లోకేష్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నట్టు?. ఏనాడైనా ప్రజల ఓట్లతో గెలుపొందారా?. తండ్రి పడేసిన పదవులతో రాజకీయం చేసిన వ్యక్తి లోకేష్. అన్నివర్గాల ప్రజలకు సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. ఇక ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తావ్ లోకేష్? అంటూ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: (కేఏ పాల్కి పవన్ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదు: ఎంపీ చంద్రశేఖర్) -
పవన్ పై విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ ఫైర్
-
పేదలకు ఇళ్ళు ఇస్తుంటే మీకెందుకు కడుపు మంట : మంత్రి జోగి రమేష్
-
కేఏ పాల్కి పవన్ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదు: ఎంపీ చంద్రశేఖర్
సాక్షి, విజయనగరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న తీరు యువతను పెడదోవ పట్టించేటట్లు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్.. 651 లే ఔట్లలో నిర్మించిన 79వేల ఇళ్లను పరిశీలించారు. ఎక్కడా అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారు. రాజకీయాల్లో కేఏ పాల్కి పవన్ కల్యాణ్‌కి పెద్ద తేడా లేదని మండిపడ్డారు. ఇవాళ పవన్ కల్యాణ్ యువతను ఉద్దేశించి నా మీద కేసులు ఉన్నాయి. మీ మీద కేసులు వచ్చినా పోరాడండి అంటూ యువతను రెచ్చగొడుతున్నారు. ఆయనను సినిమా నటుడిగా ప్రజలు గౌరవిస్తారు కానీ, ఓట్లు వేయరు అనే సంగతి గుర్తించాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతికి ఆస్కారం లేకుండా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించామన్నారు. పైసా అవినీతి లేకుండా టిడ్కో ఇళ్లు ఇస్తున్నామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. చదవండి: (విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ టూర్ అట్టర్‌ఫ్లాప్) -
జగనన్న కాలనీలపై జనసేన ఓవర్ యాక్షన్ చేస్తోంది : డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
-
విజయనగరం జిల్లాలో పవన్ కల్యాణ్ టూర్ అట్టర్‌ఫ్లాప్
సాక్షి, విజయనగరం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంకలాం జగనన్న కాలనీ పర్యటన అట్టర్ ప్లాప్ అయింది. జగనన్న గృహ లబ్ధిదారుల నుంచి కనీస స్పందన కరువైంది. గత కొద్ది రోజులుగా జనసేన నాయకులు జగనన్న ఇళ్లు పేదల కన్నీళ్లు అంటూ ప్రచారం చేశారు. అయినా కూడా ఒక్క లబ్ధిదారుడు కూడా తమకు నష్టం వచ్చిందని చెప్పకపోవడంతో పవన్ కల్యాణ్ కంగుతిన్నారు. జనసేన నాయకులు గత మూడు రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పమని లబ్ధిదారులను తీవ్రంగా ప్రలోభ పెట్టారు. అయినా లబ్ధిదారుల నుంచి స్పందన లేకపోవడంతో కారుపై నుంచి పవన్ ఒక్కరే ప్రసంగించి పర్యటననను ముగించారు. అనంతరం.. తనకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ జిల్లా జనసేన నాయకులపై పవన్ కల్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చదవండి: (రాజకీయాలు చేయడానికే మా ఇళ్లకు వచ్చారా?) -
జనసేన నేతలపై తిరగబడుతున్న జనం
-
ఆ ఇళ్లు.. బడుగుల ఆత్మగౌరవ సౌధాలు
ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకం వెలుగులు నింపుతోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అలాగే, పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. ఇప్పుడు వీరి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీకి ‘సాక్షి’ వెళ్లి తెలుసుకుంది. రోజంతా నా భర్త వెంకటేశ్వరరావు కూలికెళ్తే వచ్చే డబ్బు ఇద్దరు పిల్లల పెంపకం, కుటుంబ పోషణకే సరిపోయేది. దీంతో చాలాసార్లు అద్దె ఇంట్లోకి వెళ్దామనుకున్నా ఆర్థిక స్థోమత సహకరించక ఆ ప్రయత్నం విరమించుకున్నాం. గుడిసెల్లో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. వర్షం వస్తే పైకప్పు నుంచి నీరు ధారలా కారుతుండేది. దీంతో పిల్లలను నేను, నా భర్త ఒళ్లో పడుకోబెట్టుకుని, పురుగు పుట్రా వస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ బతికాం. మా పరిస్థితి చూసి బంధువులెవరూ పెద్దగా ఇంటికి వచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడా అవస్థలు మాకులేవు. మేం ఉంటున్న గుడిసెలను ఖాళీ చేయించి ఇక్కడే మాకు ప్రభుత్వం ఇళ్ల పట్టా ఇవ్వడమే కాక ఇంటిని కూడా నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం అందులో దర్జాగా ఉంటున్నాం. ఇదంతా తల్చుకుంటే నిజంగా కలలాగే ఉంది. కేవలం మాకు గూడు కల్పించడమే కాదు.. నా బిడ్డల చదువుకు అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది. అంతేకాక.. వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండుసార్లు రూ.10వేల చొప్పున లబ్ధిపొందాను. గతంలో ఏ ప్రభుత్వం మాకు ఇంతలా సాయపడలేదు. మా బతుకు చిత్రాన్నే మార్చిన ముఖ్యమంత్రి జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – కవిత, జక్కంపూడి, విజయవాడ రూరల్ మండలం పూరి గుడిసెల్లో ఉన్నప్పుడు ఏటా రెండుసార్లు పైకప్పు మార్చాల్సి వచ్చేది. ఇందుకు రూ.20వేలకు పైగానే ఖర్చయ్యేది. నా భర్త కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ నేను కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. కుటుంబ పరిస్థితులు సరిగాలేక నా కొడుకు పదో తరగతితో చదువు మానేసి ఫ్యాక్టరీలో పనికెళ్తున్నాడు. అమ్మాయి ఇంటి వద్దే ఉంటుంది. దీనావస్థలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంది. పక్కా ఇంటిని నిర్మించి ఇచ్చి ఎంతో మేలు చేసింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండుసార్లు రూ.17 వేల చొప్పున ఆర్థిక సాయం అందింది. సున్నా వడ్డీ, ఇతర పథకాలు మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నాయి’’. – వి. పద్మ, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్ మండలం .. ఇలా ఎంతో మంది పేదల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం వెలుగులు నింపుతోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అలాగే పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు నా భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. మేం కూడా పూరి గుడిసెలో ఉండే వాళ్లం. గత ప్రభుత్వ హయాంలో స్థలం, ఇంటికోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మాకు స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాకే నాకు వితంతు పింఛన్ మంజూరైంది. పూరిగుడిసెల్లో ఉన్నపుడు వర్షం కారుతుండేది. పాములు, తేళ్లు కుట్టి ఆస్పత్రులకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పడు మాకంటూ ఒక ఇల్లుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంతేకాదు.. మా కాలనీ వద్దకే రేషన్ బండి కూడా వస్తోంది. – అవనిగడ్డ లక్ష్మి, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్ మండలం మా కష్టాలు తీరాయి.. నాకు పెళ్లి కాకముందు నుంచి నా భర్త కుటుంబం పూరి గుడిసెలో ఉంటోంది. నాకు ఇద్దరు పిల్లలు. బాలింతగా ఉన్న సమయంలో చలికాలం, వర్షాకాలం చిన్న పిల్లలతో గుడిసెలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఐదు, ఆరు మంది చిన్న గుడిసెలో ఉండేవాళ్లం. మేం పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఉండటానికి ఇల్లులేక, అద్దెలు కట్టడానికి స్థోమత లేని మాలాంటి నిరుపేదల కష్టాలు అనుభవించే వారికే తెలుస్తుంది. జగనన్న పుణ్యమా అని మా కష్టాలన్నీ తీరాయి. సొంతింట్లో ఉంటున్నాం. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. – వి. సీతమ్మ, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్ మండలం ఇప్పుడు వీరి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీకి ‘సాక్షి’ వెళ్లింది. అక్కడి ఎస్టీ మహిళలతో మాట్లాడితే వారు పైవిధంగా స్పందించారు. అంతా కలలా ఉందని చెబుతుంటే వారి కళ్లల్లో ఎంతో సంతోషం సాక్షాత్కరించింది. 42 ఇళ్ల నిర్మాణం పూర్తి.. జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీలో పేదలకు 156 ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 136 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. ఇప్పటికే 42 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ 42 ఇళ్లలో 20కు పైగా ఇళ్లు గతంలో ఇక్కడే పూరిగుడిసెల్లో నివాసం ఉండే ఎస్టీలకు సంబంధించినవి. మరో 30 ఇళ్లు శ్లాబ్ దశ పూర్తయి ఫినిషింగ్ దశల్లో ఉన్నాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.3 లక్షల మేర ఉంటుంది. ఇంత ఖరీదైన స్థలాలను ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందిస్తోంది. ఉచితంగా ఇసుక, మార్కెట్ ధరల కన్నా తక్కువకు నిర్మాణ సామగ్రి అందిస్తోంది. మూడు శాతం వడ్డీకి రూ.35వేల బ్యాంకు రుణాలు అందిస్తూ అదనపు సాయం సమకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నిరుపేదలకు గూడు జక్కంపూడి గ్రామానికి చెందిన ఎస్టీలు, ఇతర నిరుపేద కుటుంబాల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది నిలువ నీడలేని పేదలకు సీఎం జగన్ ప్రభుత్వం సొంత గూడు కల్పిస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30 లక్షల మందికి పైగా పేదలకు పక్కా గృహాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా.. 30.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులివ్వగా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. జక్కంపూడి గ్రామంలోని ఎస్టీల తరహాలో ఇళ్లు నిర్మించుకునే స్థోమతలేని నిరుపేదల కోసం ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఇచ్చారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా 3.24 లక్షల మంది ఎంచుకున్నారు. లాభాపేక్ష లేకుండా ఈ ఇళ్లను నిర్మించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకు 10–20 మంది లబ్ధిదారులను గ్రూప్‌గా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. (జక్కంపూడి జగనన్న కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్) -
కృష్ణాజిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవర్ యాక్షన్
-
జనసేన నాయకుల ఓవరాక్షన్.. దెబ్బకు జారుకున్నారు
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. జగనన్న లే ఔట్‌ను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నాయకులు సౌకర్యాలు లేవని చెప్పాలంటూ లబ్ధిదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు దిగిన జనసేన నాయకులపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఇల్లు లేని తమకు జగనన్న కాలనీలో ఇళ్లు ఇచ్చారని, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక జనసేన నాయకులు తోకముడిచి అక్కడినుంచి జారుకున్నారు. చదవండి: (సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి: సీఎం జగన్) -
జగనన్న కాలనీలు కంటికి కనపడటం లేదా?
గుడివాడ టౌన్: పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా మూడున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ పాలన కొనసాగుతోందని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు 31లక్షల మంది ఉన్నట్లు గుర్తించారన్నారు. వారికి నివాసం కల్పించేందుకు సుమారు 71 వేల ఎకరాలను సేకరించారని తెలిపారు. రోడ్లు, విద్యుత్, డ్రెయిన్లు, నీటి సరఫరా లాంటి కనీస సదుపాయాలను కల్పిస్తూ పొలాలను మెరక చేసి లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రూ.వేల కోట్లు వెచ్చించి జగనన్న కాలనీలలో ఇళ్లను నిర్మిస్తుంటే విపక్ష నాయకులకు ఏం చేయాలో తోచక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అనుకూల మీడియాలో పాత ఫొటోలతో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 71 వేల ఎకరాలను అభివృద్ధి చేసి జగనన్న కాలనీలను నిర్మిస్తుంటే ఏమీ చేయలేదని జనసేన నాయకులు ప్రచారం చేయడం నీచ రాజకీయమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారో కాలర్ పట్టుకుని ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్‌కు సూచించారు. ఇప్పటం గ్రామంలో ఆక్రమణలను తొలగించేందుకు ఏప్రిల్‌లో నోటీసులు ఇస్తే స్పందించని లోకేశ్ ఇప్పుడు హడావుడి చేయటాన్ని చూసి అంతా నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జీవిత కాలంలో పులివెందుల నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామ పంచాయతీలోనైనా టీడీపీ అభ్యర్థిని గెలిపించగలరా? అని సవాల్ చేశారు. కనీసం నారావారి పల్లెలో టీడీపీని గెలిపించుకునే సత్తా ఉందా? అని ప్రశ్నించారు. ఆలయంలో ప్రమాణం చేద్దామా? ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి బంధువులున్నట్లు టీడీపీ ఆరోపించటాన్ని ఖండించారు. ఈడీ కేసులో ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి అల్లుడు కాదన్నారు. అరబిందో కంపెనీ నుంచి చంద్రబాబు 2004, 2009, 2014, 2019లో పార్టీ ఫండ్ తీసుకోలేదా? అని ప్రశ్నించారు. ‘దీనిపై చంద్రబాబు గుడిలో ప్రమాణం చేస్తారా? అందుకు నేను సిద్ధమే’ అని నాని ప్రకటించారు. -
పలకని పవన్.. నాదెండ్ల సైగ చేసినా సరే మౌన ప్రేక్షకుడిగానే !
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈసారి విలేకరుల సమావేశంలో పూర్తి ప్రేక్షక పాత్ర వహించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్‌కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది. అనంతరం అరగంటకుపైగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవన్‌కళ్యాణ్ వేదికపై మౌనంగా కూర్చోగా, పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఒక దశలో పవన్‌ను మాట్లాడాలంటూ నాదెండ్ల సైగ చేస్తూ మైక్ జరిపినా స్పందించేందుకు నిరాకరించారు. 3 రోజులు జనసేన సోషల్ ఆడిట్.. నవంబరు 12, 13, 14వతేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలలో జనసేన తరఫున సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ నేతలు మూడు రోజుల పాటు జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణంపై నివేదిక ఇస్తారని చెప్పారు. పవన్‌కళ్యాణ్ ఏదో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 26 జిల్లా కేంద్రాల్లోనూ ‘జనవాణి’ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
AP: కళ్లెదుటే కలల గృహం
పేదల సొంతింటి కల సాకారమవుతోంది.. పల్లెల స్వరూపం మారుతోంది.. జగనన్న కాలనీలు కొంగొత్త గ్రామాలుగా అవతరిస్తున్నాయి.. కళ్లెదుటే ఆనందాల లోగిళ్లను చూస్తూ పేదల మోము వికసిస్తోంది.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో గృహనిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా పేదల సంక్షేమమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా ప్రతి పేదవాడికీ సొంతింటిని అందించాలని సంకల్పించి చర్యలు తీసుకుంది. ఈ మేరకు అర్హులందరికీ స్థలాల పట్టాలు అందించి గృహనిర్మాణాలకు అన్నివిధాలా తోడ్పాటు అందిస్తోంది. ఈ క్రమంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 1,863 లేఅవుట్లు గ్రామాలుగా విస్తరిస్తున్నాయి. ఒక్కో లేఅవుట్లో ఇళ్ల నిర్మాణంతో కొత్త ఊరిని తలపిస్తోంది. లేఅవుట్ల వద్ద మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వివిధ దశల్లో నిర్మాణాలు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,863 లేవుట్లు ఉండగా.. 2,12,895 ఇళ్లు మంజూరయ్యాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో 17,916 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా లబ్ధిదారులు నివాసముంటున్నారు. ఇదిలా ఉండగా రెండు జిల్లాల్లోనూ వివిధ దశల్లో ఉన్న గృహాలను వచ్చే డిసెంబర్ 21 నాటికి పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారీస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ప్రతి రోజూ లక్ష్యాలను నిర్దేశించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. వందల కోట్లతో.. రెండు జిల్లాల్లో నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల కోసం ప్రభుత్వం ఇప్పటివరకూ రూ. 322.48 కోట్లు వెచ్చించింది. అలాగే వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.600 కోట్లు అందిస్తోంది. వీటితో పాటుగా ప్రతి ఇంటికీ డీఆర్ డీఏ ఆధ్వర్యంలో రూ.35 వేలు అదనంగా అందిస్తూ నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు కూడా అడిగిన వెంటనే ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంది. నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి ఏలూరు జిల్లావ్యాప్తంగా గృహనిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాం. వీలైనంత ఎక్కువ మందికి గృహాలు అందించాలని నిర్ణయించి ఆ దిశగా లక్ష్యాన్ని నిర్దేశించి పనులు పూర్తి చేయిస్తున్నాం. ఇప్పటికే పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎప్పటికప్పుడు ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ గృహనిర్మాణాల వేగవంతానికి చర్యలు తీసుకుంటున్నాం. – వె.ప్రసన్న వెంకటేష్, కలెక్టర్, ఏలూరు ప్రభుత్వమే అన్నీ సమకూర్చుతూ.. అధికారులు సిమెంట్, ఐరన్, ఇసుకను ఇంటి వద్దనే అందిస్తున్నారు. నిర్మాణ పనుల కోసం నీటిని సరఫరా చేస్తున్నారు. నేను, నా భార్య కూలీలతో కలిసి పనిచేస్తున్నాం. మా ఇద్దరికీ ఉపాధి పథకం ద్వారా 90 రోజుల కూలీ డబ్బు లు రూ.30 వేలు బ్యాంకు ఖాతాలో జమచేశారు. మొత్తంగా రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. సంతోషంగా నిర్మాణం పూర్తి చేస్తాం. – పాలే ఈశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం. పక్కాగా మౌలిక వసతులు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీ భూమి మెరక చేసింది. దీంతో మాకు పునాది ఖర్చు రూ.50 వేల వరకు తగ్గింది. కాలనీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంటు ఇచ్చారు. గ్రావెల్ రోడ్డు వేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. అధికారులు అన్ని పనులు దగ్గరుండీ చేయిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. – బసవరాజు వెంకటేశ్వరరావు, చాటపర్రు, ఏలూరు మండలం స్థిరాస్తిని అందించిన ప్రభుత్వం ఇతడి పేరు కిల్లారి రాంబాబు, భీమడోలు మండలంలోని గుండుగొలను గ్రామం. వీరి కుటుంబానికి ప్రభుత్వం సెంటున్నర భూమి ఇచ్చి ఇంటిని మంజూరు చేసింది. ఐదు నెలల క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం పూర్తిచేసి కుటుంబంతో అక్కడే నివసిస్తున్నారు. సొంతింటి కల సాకారం చేయడంతో పాటు జగనన్న తనను రూ.5 లక్షల ఆస్తికి హక్కుదారుడిని చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా నిర్మాణం ఈమె పేరు కానూరి పార్వతి, భీమడోలు మండలం గుండుగొలను గ్రామం. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో అవస్థలు పడుతుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిని మంజూరు చేసింది. సెంటున్న స్థలాన్ని ఉచితంగా అందించగా ఆనందంగా నిర్మాణ పనులు చేపట్టింది. తన దశాబ్దాల కల సాకారమైందని, జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటానని ఆమె అంటున్నారు. -
ఆదర్శ రాష్ట్రంగా ఏపీ
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రమంత్రి అభినందించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మూడ్రోజుల పాటు జరిగే జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనం శుక్రవారం ప్రారంభమైంది. ఏపీలో జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న ఇళ్లలో విద్యుత్ ఆదాకు చేపడుతున్న చర్యలను ఈ సమ్మేళనంలో అజయ్‌జైన్ వివరించారు. అత్యాధునిక సాంకేతికత.. తొలిదశలో 15.6 లక్షల ఇళ్లకు ఏపీ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సాయంతో ఒక్కో ఇంటికీ నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను అందజేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ చొప్పున మొత్తం 1,145 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెప్పారు. నిర్మాణంలో ఇండో–స్విస్ బిల్డింగ్ టెక్నాలజీతో పాటు రీఇన్ఫోర్డ్స్ కాంక్రీట్ (ఆర్సీసీ) ప్రీకాస్ట్ టెక్నాలజీ, షియర్‌వాల్ టెక్నాలజీ, ఈపీఎస్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీవల్ల ఇంటి లోపల కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అజయ్‌జైన్ వివరించారు. కాలనీలు కాదు.. అధునాతన గ్రామాలు ఇక అల్పాదాయ వర్గాలు, పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో తయారవుతున్న ఇళ్లలో వారు సగౌరవంగా జీవించేలా చూడడమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రభుత్వ లక్ష్యమని అజయ్‌జైన్ స్పష్టంచేశారు. అందుకు అనుగుణంగానే కాలనీలకు బదులు అధునాతన గ్రామాలను సృష్టిస్తున్నామని, 17,005 లే అవుట్లలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు. రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలాన్ని పేదలకు పంపిణీ చేసినట్లు వివరించారు. లేఅవుట్ అభివృద్ధికి రూ.3,525 కోట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు వెచ్చించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, మరో 18.9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, నిర్వహణ అంశాలను మొబైల్ యాప్‌లు, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. హౌసింగ్ జేఎండీ ఎం. శివప్రసాద్, చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్ ఈ సదస్సులో పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలను చూస్తే అభివృద్ధి కనిపిస్తుంది
నగరి: ప్రతిపక్ష నాయకులు జగనన్న కాలనీలను వీక్షిస్తే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటో కనిపిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. తిరుపతి జిల్లా, నగరి మునిసిపల్ పరిధి నాగరాజకుప్పం వద్ద ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలో శరవేగంగా జరుగుతున్న నిర్మాణాల్లో భాగంగా 108 ఇళ్లకు స్లాబ్ వేసే కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా పేదవాడి సొంతింటి కలను ఏపీ సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని తెలిపారు. నగరి మునిసిపాలిటీ నాగరాజకుప్పంలో 1,248 ఇళ్లు కాంట్రాక్టర్ ద్వారా నిర్మిస్తుంటే.. వాటిలో ఇప్పటికే 420 ఇళ్లకు స్లాబ్‌లు పూర్తయ్యాయని, ఇప్పుడు మరో 108 ఇళ్లకు స్లాబ్ వేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొదటి దశలో 7,580 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, రూ.13.64 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ ఏసీ రూమ్‌లో పచ్చ పత్రికలకు ఇంటర్వ్యూలిచ్చేవారంతా జగనన్న కాలనీలకు వచ్చి చూస్తే అర్థమవుతుందని చెప్పారు. ప్యాకేజీలకు ప్లేటు తిప్పే వ్యక్తి పవన్‌కల్యాణ్ ఉత్తరాంధ్ర తమకు పరిపాలన రాజధాని కావాలని కోరుతుంటే.. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైజా గ్‌కి వచ్చి.. తనను చంపడానికి ప్రయత్నించారన్నది నిజం కాదా అని మంత్రి రోజా ప్రశ్నించారు. పవన్ అరైవల్‌లో దిగితే.. అక్కడ ఉండాల్సిన జనసేన నాయకులు డిపార్చర్ వద్ద ఎందుకున్నారని ప్రశ్నించారు. అక్కడ రాళ్లు, రాడ్లు పెట్టుకుని దాడి చేయాల్సిన అవసరమేంటని ధ్వజమెత్తారు. పక్కా ప్రణాళిక ప్రకారమే అక్కడికొచ్చి దాడి జరిపించారని విమర్శించారు. జనవాణి చేసిన చోట ఎక్కడా ర్యా లీ చేయని పవన్.. వైజాగ్‌లోనే ఎందుకు ర్యాలీ చేశారని ప్రశ్నించారు. పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకొనే కొందరు సైకోలకు, వారి తల్లిదండ్రులకు కూడా మంచి చేసేది జగనన్నే అన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు. -
గడప గడపకు పనులు 'నెలలో మొదలు'
సాక్షి, అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆయా సచివాలయాల పరిధిలో నెల రోజుల్లోగా ప్రాధాన్యత పనులు ప్రారంభం కావాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ–క్రాప్ జాబితాలను అక్టోబర్ 25న సచివాలయాల్లో ప్రదర్శించాలని నిర్దేశించారు. డిసెంబర్ 21 నాటికి ఐదు లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్ – 3 కింద డిసెంబర్లో ఇళ్లను మంజూరు చేయాలన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనే కలెక్టర్ల పనితీరుకు ప్రామాణికమని, వాటి ఆధారంగానే మార్కులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 26న రైతు భరోసా రెండో విడత సాయంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కూడా విడుదల చేస్తామని తెలిపారు. వసతి దీవెన నవంబర్ 10న విడుదల చేస్తామని చెప్పారు. స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెలలో ఆరు సచివాలయాలు.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల అభ్యర్థనల మేరకు ప్రాధాన్యత పనులకు ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు కేటాయించాం. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎలాంటి ఆలస్యం, అలసత్వానికి తావు ఉండకూడదు. 15,004 సచివాలయాలను ఈ కార్యక్రమం ద్వారా సందర్శిస్తున్నాం. ఎమ్మెల్యేలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, మండల స్థాయి సిబ్బంది అంతా నెలలో కనీసం 6 సచివాలయాలను సందర్శించాలి. ఎమ్మెల్యేలు కనీసం రెండు రోజుల పాటు సంబంధిత సచివాలయంలో గడిపి ప్రతి ఇంటినీ సందర్శించాలి. ఒక రోజులో కనీసం 6 గంటల పాటు గడప గడపకూ నిర్వహించాలి. మండల అధికారులు, పాలనా సిబ్బంది, సచివాలయ సిబ్బంది కూడా అంతే సమయం గడపాలి. పక్కాగా ఈ–క్రాపింగ్ ఈ– క్రాప్ అత్యంత ముఖ్యమైన కార్యక్రమం. పొరపాట్లకు తావులేకుండా నూరు శాతం పూర్తి చేయాలి. కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. ఈ సీజన్లో 107.62 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రైతులను వారి క్షేత్రాల్లోకి తీసుకెళ్లి ఫొటో తీసుకోవడం, వివరాల నమోదు సెప్టెంబరు 30లోగా పూర్తిచేయాలి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వీఆర్వోలు బయోమెట్రిక్ ద్వారా వీటిని ఆధీకృతం చేయాలి. అక్టోబరు 3లోగా ఇది పూర్తి చేయాలి. రైతుల కేవైసీలను అక్టోబరు 10లోగా పూర్తి చేయాలి. అక్టోబరు 10 నుంచి రైతులకు ఇ– క్రాప్ డిజిటల్ రశీదులు, ఫిజికల్ రశీదులు ఇవ్వాలి. అక్టోబరు 15 లోగా అది పూర్తి చేసి సోషల్ ఆడిట్ చేపట్టాలి. అక్టోబరు 25 నుంచి వారం రోజుల పాటు ఇ–క్రాప్ తుది జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. నవంబరు 1 నుంచి తుది జాబితాను అన్ని పోర్టల్స్‌లో అందుబాటులో ఉంచాలి. ఈ షెడ్యూల్ ప్రకారం ఇ– క్రాప్ పూర్తిచేసే బాధ్యత కలెక్టర్లదే. కనీసం 10 శాతం ఇ–క్రాప్‌ను స్వయంగా ఎంఏవో, ఎమ్మార్వోలు పరిశీలించాలి. కనీసం 6 శాతం ఆర్డీఏలు, ఏవీఏలు పరిశీలించాలి. కనీసం 5 శాతం ఇ–క్రాప్‌లను డీవోలు, 2 శాతం ఇ–క్రాప్‌లను జేసీలు, ఒక్క శాతం కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలి. 17.05 కోట్ల పని దినాలు ఉపాధిహామీ కింద ఇప్పటివరకూ 17.05 కోట్ల పనిదినాలను సృష్టించడం అభినందనీయం. ఇప్పటివరకూ సగటు వేతనం రూ.210.02 ఉండగా కనీసం రూ.240 చొప్పున అందేలా కృషి చేయాలి. కేంద్రం నుంచి రూ.1,400 కోట్ల ఉపాధిహామీ బకాయిలు త్వరలోనే వస్తాయి. రాగానే వెంటనే విడుదల చేస్తాం. సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌లను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. డిజిటల్ లైబ్రరీలపై ప్రత్యేక శ్రద్ధ డిసెంబర్‌లోగా 4,500 గ్రామ సచివాలయాలకు కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కలుగుతుంది. అక్కడ డిజిటల్ లైబ్రరీలను పూర్తి చేయాలి. మిగిలిన చోట్ల కూడా డిజిటల్ లైబ్రరీలపై కలెక్టర్లు దృష్టి సారించాలి. పులివెందుల నియోజకవర్గం వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌లో ఏర్పాటైన డిజిటల్ లైబ్రరీని వినియోగించుకుంటూ గ్రామానికి చెందిన 30 మంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం గృహ నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్ధ పుంజుకుంటుంది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, ఏలూరు, కర్నూలు జిల్లాల్లో గృహ నిర్మాణం బాగుంది. సత్యసాయి, ప్రకాశం, అనకాపల్లి, కృష్ణా, అనంతపురం జిల్లాలు దీనిపై దృష్టి పెట్టాలి. విశాఖలో 1.24 లక్షల ఇళ్లను కేటాయించాం. అక్టోబరు నాటికి అన్ని ఇళ్ల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపట్టాలి. కనీస సదుపాయాలు (బోర్‌వెల్స్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, అప్రోచ్ రోడ్లు, సీడీ వర్క్స్, గోడౌన్స్) ఇప్పటికే 85 శాతం పూర్తయ్యాయి. ఇక్కడ ఇళ్ల పనులు వేగంగా జరిగేలా సంబంధిత కలెక్టర్లు చూడాలి. పూర్తయిన పనులకు సంబంధించి పేమెంట్లు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగంగా ముందుకు సాగాలి. ఆప్షన్ 3 కింద 3.27 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. 10 వేల ఇళ్లకు పైబడి ఉన్న లే అవుట్లలో స్టేజ్ కన్వర్షన్ వేగంగా జరగాలి. విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, కాకినాడ, మచిలీపట్నం, విజయనగరం, ఏలూరు, ఆదోని, తిరుపతి, జీవీఎంసీ లే అవుట్లపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలి. డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా అడుగులు ముందుకేయండి. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేయాలి. ఇళ్లు పూర్తయ్యే నాటికి ఎలక్ట్రిసిటీ, వాటర్, డ్రైనేజ్ సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. మిగిలిపోయిన లబ్ధిదారులకు డిసెంబర్లో ఫేజ్ 3 కింద ఇళ్ల మంజూరుకు కలెక్టర్లు కార్యాచరణ రూపొందించాలి. పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలపై ఆడిట్ ప్రక్రియ వచ్చే 20 రోజుల్లో సంపూర్ణంగా పూర్తి కావాలి. డిసెంబర్ నాటికి 1.75 లక్షల టిడ్కో ఇళ్లను పూర్తిచేసి ఇవ్వబోతున్నాం. ఈమేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావాలి. ఎస్వోపీల ప్రకారం సర్వే జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష సర్వేలో భాగంగా ఇప్పటివరకూ 5,738 గ్రామాల్లో డ్రోన్ ఫ్లైయింగ్ పూర్తైంది. 2,662 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలు జిల్లాలకు విడుదలయ్యాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం సర్వే ప్రక్రియ సాగాలి. స్పందన ఆర్జీల్లో సమయ పాలన, నాణ్యత స్పందన అర్జీల్లో సమయ పాలన, నాణ్యత కనిపిస్తోంది. దీనికి దోహదపడ్డ అధికారులకు అభినందనలు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాని పెండింగ్ కేసులు, తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గింది. పరిష్కారంలో నాణ్యత ఉందనేందుకు ఇది నిదర్శనం. కలెక్టర్లు అందరికీ అభినందనలు. అర్జీ పరిష్కారానికి ముందు విచారణ వివరాలను అర్జీదారులకు ఫోన్ ద్వారా తెలియజేయాలి. ఈ కొత్త ఫీచర్ సెప్టెంబరు 14 నుంచి ప్రారంభమైంది. ఇది తప్పనిసరిగా అమలు చేయాలి. దరఖాస్తుదారుడితో లొకేషన్లో సెల్ఫీ తీసుకుని అప్లోడ్ చేయాలి. ఈ ఫీచర్ కూడా సెప్టెంబరు 26 నుంచి మొదలైంది. ఇది కూడా తప్పనిసరిగా పాటించాలి. సచివాలయాల్లో రోజూ సాయంత్రం స్పందన ప్రతి బుధవారం కలెక్టర్లు స్పందనపై సమీక్ష చేయాలి. సచివాలయాల్లో రోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ స్పందన నిర్వహించాలి. కలెక్టర్ల నుంచి దిగువ స్థాయి అధికారుల వరకూ తప్పనిసరిగా స్పందనలో పాల్గొనాలి. స్పందనలో పాల్గొన్న అధికారులు కలెక్టర్లు నిర్వహించే సమీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి. స్పందన అర్జీల పరిష్కారంలో కలెక్టర్లు, అధికారులు, ఎస్పీలు మానవీయత ప్రదర్శించాలి. తిరిగి విచారణ చేయాల్సిన అర్జీల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టాలి. అలా జరిగితేనే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉన్నట్లు. తిరిగి అదే సమస్యపై అర్జీ వస్తే పై అధికారి లేదా మరో అధికారితో విచారణ చేయించండి. ఎస్డీజీ లక్ష్యాలపై కలెక్టర్ల పర్యవేక్షణ ఎస్డీజీ లక్ష్యాలపై కలెక్టర్లు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలి. డేటాను సక్రమంగా అప్లోడ్ చేయాలి. అప్పుడే ఎస్‌డీజీల్లో మార్పులు కనిపిస్తాయి. ఎస్డీజీల ఆధారంగానే కలెక్టర్లకు మార్కులు కేటాయిస్తాం. పనితీరు, సమర్థత ఎస్డీజీ లక్ష్యాల సాధన ఆధారంగా నిర్ణయిస్తాం. ఎస్డీజీ లక్ష్యాల సాధనను మన రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం చూస్తుంది. ఏసీబీ, ఎస్ఈబీ నంబర్లతో పోస్టర్లు దిశ యాప్‌ను ప్రతి ఇంట్లో డౌన్లోడ్ చేసుకునేలా చూడాలి. దిశ పనితీరుపై పర్యవేక్షణ చేసేలా కలెక్టర్లు, ఎస్పీలు మాక్ కాల్స్ చేయాలి. అవినీతి నిర్మూలనకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏసీబీ నంబర్ 14400 పోస్టర్ అందరికీ కనిపించేలా 3 గీ 5 సైజులో ఉండాలి. ఈ పోస్టర్ లేకపోతే సంబంధిత కార్యాలయంలో ఉండే ముఖ్య అధికారిని బాధ్యుడ్ని చేయాలి. ప్రతి యూనివర్శిటీ, కాలేజీలో కూడా ఎస్ఈబీ నంబర్ 14500 ఉండాలి. మాదక ద్రవ్యాలకు సంబంధించిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి. భూసేకరణపై దృష్టి పెట్టాలి జాతీయ రహదారులకు భూ సేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలి. బెంగళూరు– విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలో 345 కి.మీ మేర ఉంది. దాదాపు రూ.17 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణపై దృష్టిపెట్టాలి. జాతీయ రహదారులకు సంబంధించి 2,758 కి.మీ పరిధిలో రూ.33,507 కోట్లతో చేపడుతున్న 95 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. మరో 2,687 కిలోమీటర్ల పరిధిలో రూ.55,890 కోట్లతో చేపడుతున్న మరో 63 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధంగా ఉన్నాయి. జాతీయ రహదారులకు సంబంధించి దాదాపు రూ.1.05 లక్షల కోట్లకు పైగా విలువైన పనులు చేపడుతున్నాం. వీటికి భూసేకరణపై కలెక్టర్లు దృష్టి సారించాలి. సమీక్షలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీస్ అజయ్ జైన్, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వేగంగా మంజూరు.. ప్రారంభం ఒక సచివాలయంలో రెండు రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగిశాక అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులను మంజూరు చేయాలి. వాటిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. మంజూరైన నెల రోజుల్లోగా పనులు ప్రారంభం కావాలి. నిర్దేశించుకున్న మేరకు ప్రతి వార్డు లేదా గ్రామ సచివాలయంలో రెండు రోజులపాటు రోజుకు 6 గంటలపాటు గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించకుంటే పనులు మంజూరు కావు. ఇప్పటివరకూ గడప గడపకూ నిర్వహించిన సచివాలయాల్లో ప్రాధాన్యతగా గుర్తించి పెండింగ్‌లో ఉన్న పనులను అక్టోబర్ 5లోగా మంజూరుచేయాలి. అవి అక్టోబర్ చివరి నాటినుంచి ప్రారంభం కావాలి. -
మీ ఇల్లు చల్లగుండ!
సాక్షి, అమరావతి: కూల్ రూఫ్ పెయింట్ ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లలో ఉష్ణోగ్రతలు తగ్గించడంపై ప్రయోగం చేపడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఇండో–స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (బీఈఈపీ) ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) చేపడుతున్న కూల్ రూఫ్ ప్రాజెక్టుపై మంగళవారం విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి అజయ్‌జైన్ వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం వార్షిక విద్యుత్ డిమాండ్ 60,943 మిలియన్ యూనిట్లు ఉంటే, అందులో భవనాలకు వాడుతున్నది 17,514 మిలియన్ యూనిట్లు (28 శాతం) ఉందన్నారు. దీన్ని తగ్గించేందుకు జగనన్న ఇళ్లల్లో విద్యుత్ ఆదా చర్యలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కూల్ రూఫ్‌ను విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ జిల్లాల్లోని పన్నెండు ఇళ్లపై వేసి వచ్చే ఫలితాలను అధ్యయనం చేస్తామన్నారు. -
జగనన్న కాలనీల్లోనే మహిళలకు ఉపాధి
రాప్తాడురూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో నివాసాలు ఉండే మహిళలకు గార్మెంట్స్ పరిశ్రమల ద్వారా స్థానికంగానే ఉపాధి కల్పిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే ఇప్పటికే పలుమార్లు తమిళనాడు, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలకు వెళ్లి కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. వారిని స్వయంగా పిలిపించి ఇక్కడి ప్రదేశాలను చూపించారు. తాజాగా ఎమ్మెల్యే చొరవతో తిర్పూర్‌కు చెందిన బెస్ట్ ఇంటర్నేషనల్ గార్మెంట్స్ చైర్మన్ ఎస్.రామస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.రాజ్‌కుమార్, సీఈఓ గౌతంరెడ్డి శుక్రవారం ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చారు. అనంతపురం మండలం ఆలమూరు సమీపంలోని పీవీకేకే కళాశాల వద్ద హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తదితరులు బొకేలు అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి వాహనంలో ఆలమూరు జగనన్న కాలనీకి చేరుకుని పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల కోసం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో నివాసాలు ఉండే మహిళలకు స్థానికంగానే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉదయం, రాత్రి రెండు షిఫ్టులూ పరిశ్రమలు నడిపేందుకు అనుకూలంగా ఉంటాయని యజమానులు భావిస్తున్నట్లు చెప్పారు. కారి్మకుల రవాణా కోసం బస్సు సదుపాయం కూడా కలి్పంచేలా చర్యలు తీసుకుంటారన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తే తమిళనాడు, జైపూర్ నుంచి అనేకమంది వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. గార్మెంట్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ మంచి వాతావరణం ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. వారివెంట రాప్తాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ బెడదూరి గోపాల్‌రెడ్డి, మాజీ చైర్మన్ తాటిచెర్ల నాగేశ్వరెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, అనంతపురం వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పవన్‌కుమార్, నాయకులు వడ్డే శీనా, ఉప్పరపల్లి సర్పంచ్ సావిత్రి శ్రీనివాసులు, కక్కలపల్లి సర్పంచ్ గార్లదిన్నె కృష్ణయ్య, నాయకులు ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు. పరిశ్రమలతోనే రాష్ట్రాభివృద్ధి రాప్తాడు: పరిశ్రమల ఏర్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో పరిశ్రమల కోసం సేకరించిన భూములను శుక్రవారం బెస్ట్ ఇంటర్నేషనల్ గార్మెంట్స్ చైర్మన్ రామస్వామి, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.రాజ్‌కుమార్, సీఈఓ గౌతంరెడ్డి, రామ్ రాజ్ కాటన్ సంస్థ ప్రతినిధి సుందరమూర్తితో కలిసి వారు పరిశీలించారు. సమీపంలోని జగనన్న లేఅవుట్, టిడ్కో ఇళ్లను పరిశీలించారు. (చదవండి: నువ్వా నేనా..అనంత అసెంబ్లీ టెక్కెట్ దక్కేదెవరికో..?) -
3 రాజధానులే మా విధానం
మధురవాడ (భీమిలి): రాష్ట్రంలో మూడు రాజధానులే తమ ముఖ్యమంత్రి ఉద్దేశం, తమ ప్రభుత్వ విధానం అని విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. ఆమె సోమవారం విశాఖ జిల్లా ఆనందపురం మండలం తంగుడుబిల్లిలో 519 ఎకరాల్లో 263 కోట్లతో నిర్మించనున్న 16,690 ఇళ్ల జగనన్న హౌసింగ్ కాలనీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మలతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విశాఖలో పరిపాలన, కర్నూలులో న్యాయ, అమరావతిలో శాసన రాజధానుల ఏర్పాటుతో మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని చెప్పారు. చంద్రబాబునాయుడుకి రాష్ట్రం బాగుపడడం, మంచి జరగడం ఇష్టం ఉండదని, అందుకే అమరావతి పేరుతో పాదయాత్ర ప్లాన్ చేశారని విమర్శించారు. ఈ వయసులో చంద్రబాబు పాదయాత్ర చేయలేడని, లోకేశ్ చేసినా ఉపయోగంలేదని భావించి అమరావతి పేరుతో అక్కడి వారిని రెచ్చగొట్టి పాదయాత్రకు ప్లాన్ చేశారని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా జనం జగనన్న వెంటే ఉన్నారన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న పాదయాత్ర వల్ల ఎటువంటి శాంతిభద్రతల సమస్య తలెత్తినా చంద్రబాబే బాధ్యత వహించాలని చెప్పారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అటు సూర్యుడు ఇటు వచ్చినా విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని పేర్కొన్నారు. చంద్రబాబులాంటి వారు ఎన్ని కుట్రలు పన్నినా అడ్డుకోలేరన్నారు. పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసినా ఆగదని చెప్పారు. ప్రజలకు మేలు చేయడానికి కావాల్సింది పెద్ద వయసు కాదని, పెద్ద మనసని పేర్కొన్నారు. ఆ పెద్ద మనసు సీఎం జగన్మోహన్రెడ్డికి ఉందని ఆయన చెప్పారు. -
నీటిపై రాతలు అవాస్తవం
ఫిరంగిపురం(పల్నాడు జిల్లా): ఫిరంగిపురం ఆరోగ్యనగర్‌లోని జగనన్న లేఅవుట్‌ల్లో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా బోర్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రూ.41లక్షలు వెచ్చించి పైపులైన్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేస్తున్నారు. కానీ కొన్ని పత్రికలు కట్టు కథలు ప్రచారం చేస్తున్నాయి. నీటి సరఫరాపై ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్వరరావు ఖండించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం లేఅవుట్లను సందర్శించారు. 3,4 నెంబర్‌గల లేఅవుట్లలో జరుగుతున్న పైపులైన్ పనులను పరిశీలించారు. బోర్లు రెండు నెలల కిందట వినియోగంలోకి వచ్చాయన్నారు. నాలుగో లేఅవుట్లో 625 గృహాల నిర్మాణం జరుగుతుందని, నీటి అవసరాల కోసం రేపూడి గ్రామంలోని సమగ్ర మంచినీటి పథకం ద్వారా తాళ్లూరు రోడ్డు నుంచి వసంతనగర్ మీదుగా ఆరోగ్యనగర్‌కు పైపులైను ఏర్పాటు చేశామన్నారు. పైపులైను వేసే సమయంలో స్థానికంగా ఉన్న వారితో కొన్ని ఇబ్బందులు ఏర్పడటంతో ఆసమస్యలను పరిష్కరించుకొని రెండురోజుల కిందట నీటి సరఫరా చేశామన్నారు. వాటిలో లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చొరవతో పూర్తిస్థాయిలో నేడు నీటిని విడుదల చేసి 70 వరకు ట్యాప్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు నీటిని కొనుగోలు చేస్తున్నారని చెప్పడం అవాస్తవమన్నారు. లోతట్టులో గృహాలు లేవు ప్రధాన రహదారి లోతట్టులో లేదు. అంతర్గత రోడ్ల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలి. ప్రధాన రహదారితో పోల్చకూడదు. అంతర్గత రోడ్ల కన్నా ఇచ్చిన ప్లాట్లు లోతులో ఉంటే మాత్రమే మెరక చేయాలి, లేనిఎడల అవసరం లేదు. నీటికోసం రూ.41 లక్షలు మంజూరు చేశారని వాటితో పైపులైన్ వేశారు. లబ్ధిదారులు ఆ నీటినే వాడుకుంటున్నారు. – పింకి, ఏఈ, హౌసింగ్ శాఖ బోర్లు, కొళాయిలు ఏర్పాటుచేశారు.. ఆరోగ్యనగర్‌లోని జగనన్న కాలనీలో నీటి కోసం అధికారులు బోర్లు, కొళాయిలు ఏర్పాటుచేశారు. కొళాయిలు నుంచి నీరు కూడా వస్తుండటంతో ఆ నీటిని డ్రమ్ములతో పట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకోడానికి నీటికోసం ఇబ్బందులు లేవు. కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో పనివారు రాకపోవడంతో పనులు చేయలేక పోతున్నాం. – ఆర్.ఇన్నయ్య లబ్ధిదారుడు నీటి ఇబ్బందులు లేవు జగనన్న కాలనీలో నీటికి ఇబ్బందులు లేవు. రెండురోజుల కిందట అధికారులు నీటి సరఫరా చేశారు. రెండు నెలల కిందటే బోర్లు వేశారు. మా లేఅవుట్ ప్రాంతంలో 17 ట్యాప్‌లు ఏర్పాటుచేశారు. బజారుకో పంపు రెండు కొళాయిలు ఇచ్చారు. వాటిని వినియోగించుకుంటున్నాం. – పి.లూర్దుమరియన్న. గృహ లబ్దిదారుడు. -
YSR Jagananna Colonies: కాలనీ కాదు.. ఊరే..
ఆనందపురం(భీమిలి): అర్హత గల ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పంతో రాష్ట్రంలో కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లకు ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో ఒకటి అరా కాలనీ ఇళ్లు మంజూరు చేసి.. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో.. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను సగంలోనే విడిచి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని సౌకర్యాలతో కాలనీలను నిర్మించి నివాసయోగ్యంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో.. జగనన్న కాలనీ నిర్మాణ పనులు ఓ పద్ధతిలో జరిగి గ్రామాలను తలపిస్తున్నాయి. అందుకు ఉదాహరణే మండలంలోని వెల్లంకి జగనన్న కాలనీ. ఇక్కడ సుమారు రూ.60 కోట్లు విలువ చేసే 10 ఎకరాల ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీకి కేటాయించి సుమారు 300 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ముందుగానే విశాలమైన గ్రావెల్ రోడ్డును ఏర్పాటు చేశారు. విద్యుద్ధీకరణ పనులు చేపట్టారు. దీంతో మొత్తం లబ్ధిదారులందరూ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారు. అందులో దాదాపు వంద ఇళ్లు వరకూ పూర్తయ్యాయి. లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేసేశారు. సకాలంలో ఇసుక, సిమెంట్‌తోపాటు ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుండడంతో మిగతా ఇళ్ల నిర్మాణం కూడా చురుగ్గా సాగుతోంది. ఇక్కడ ఒకేసారి మూడు వందల ఇళ్లు నిర్మిస్తుండడంతో ఓ కొత్త ఊరును తలపిస్తోంది. నిర్దేశించిన స్థలంలో లబ్ధిదారుడు తనకు నచ్చిన విధానంలో ఇంటిని నిర్మించుకోవచ్చని ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. దీంతో లబ్ధిదారులు ఆధునిక సౌకర్యాలతో నిర్మించుకోవడంతో ఇక్కడ పట్టణ వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న అధికారులు ఆదర్శకాలనీగా తీర్చిదిద్దుతున్నారు. కలలో కూడా ఊహించలేదు వలస వచ్చి వెల్లంకిలో భర్త, ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నా భర్త ముసిలిబాబు వంటల పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నారు. చాలీచాలని కూలి వల్ల అద్దె చెల్లించుకోలేని పరిస్థితిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇల్లు మంజూరు చేశారు. అధికారులు అన్ని రకాలగా సహకారం అందించడంతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని.. అందులోనే నివాసం ఉంటున్నాం. అద్దె భారం తొలగిపోయింది. ముఖ్యమంత్రి జగనన్నకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. – వెర్రి దేవి, జగనన్న కాలనీ లబ్ధిదారు, వెల్లంకి జగనన్న రూ.లక్షల ఆస్తినిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాలాంటి పేదలకు లక్షలు విలువ చేసే ఆస్తిని కాలనీ ఇంటి రూపంలో అందజేసి ఎంతో సాయపడ్డారు. నేను నా భర్త రోజు కూలి చేసుకుని ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాం. దీనికి ముందు తెలిసిన వారి స్థలంలో కమ్మలపాక వేసుకుని ఉండేవాళ్లం. వర్షాకాలం వస్తే కారిపోయి నానా ఇబ్బందులు పడ్డాం. రూపాయి ఖర్చే లేకుండా స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించిన జగన్ బాబే మరలా ముఖ్యమంత్రి కావాలి. – బూస రామయ్యమ్మ, ఇంటి లబ్ధిదారు, వెల్లంకి (చదవండి: అదిగో పులి... ఇదిగో తోక) -
జగనన్న లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు
సాక్షి,తోటపల్లిగూడూరు: జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు అన్నారు. మండలంలోని నరుకూరు, పేడూరు, పాపిరెడ్డిపాళెం, ఇస్కపా ళెం, మల్లికార్జునపురం గ్రామాల్లోని జగనన్న లేఅవుట్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పునర్విభజన అనంతరం జిల్లా పరిధిలోని దాదాపు 58,075 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇందులో ఇళ్లు 4 వేల పైచిలుకు ఇళ్ల నిర్మాణాలను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేసేందుకు రానున్న 15 రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు. వర్షాలు ప్రారంభమయ్యేలోపు రాబోయే రెండు నెలల్లో 90 శాతం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. ఇళ్ల నిర్మాణాలను చేపట్టిన లబ్ధిదారులకు కావాల్సిన అన్ని రకాల రా మెటీరియల్స్‌ను లేఅవుట్లలోనే అందుబాటులో ఉంచేందుకు అధికారులను ఆదేశించామన్నారు. ఆగస్ట్ నాటికి 30 వేల ఇళ్ల నిర్మాణాలను రూఫ్ లెవల్‌కు పూర్తి చేయాలనే లక్ష్యాని పెట్టుకున్నట్లు చెప్పారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల విషయంలో పెద్ద లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ ప్రత్యేక గౌడన్లను ఏర్పాటు చేసి స్టీల్, సిమెంట్, ఇసుకను డంపింగ్ చేసి లబ్ధిదారులకు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉపాధి కింద హౌసింగ్ లబ్ధిదారులకు 90 రోజుల పని కల్పించామన్నారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్యామలమ్మ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, గృహ నిర్మాణశాఖ నెల్లూరు డివిజన్ ఈఈ దయాకర్, మండల ఏఈ ముక్తార్‌బాషా, వర్క్ ఇన్స్పెక్టర్ సుమన్, వెలుగు సీసీ సైదా, ఇంజినీరింగ్ అసిస్టెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం -
Jagananna Housing Colony: సుఖినో ‘భవంతి’
ప్రత్తిపాడు (గుంటూరు): ఆనందాలే హరివిల్లులై విరిసినట్టు.. సంతోషాలే రంగురంగుల రంగవల్లులై మెరిసినట్టు.. నవరత్నాలు పొదిగిన ముత్యాలై కాంతులీనుతున్నట్టు.. భువిపై వెలిసిన ఇంద్రభవనాల్లా శోభిల్లుతున్నట్టు.. జగనన్న లోగిళ్లు చక్కని ఎలివేషన్లతో సుందరంగా ముస్తాబై తళుకులీనుతున్నాయి. సెంటు, సెంటున్నర్రలో ఇల్లా అంటూ పెదవి విరిచిన వారి కళ్లు కుట్టేలా సరికొత్త సొగసులద్దుకుని హొయలొలుకుతున్నాయి. కాంతిరేఖలై మిలమిలా మెరుస్తున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జగనన్న కాలనీలో అత్యాధునిక డిజైన్లలో అందంగా నిర్మితమైన ఈ పేదల గృహాలను చూసి అందరూ మంత్రముగ్ధులవుతున్నారు. ఔరా అంటూ అబ్బురపడుతున్నారు. జయహో జగన్ అంటూ కీర్తిస్తున్నారు. -
జగనన్న కాలనీలు.. ఆనందాల లోగిళ్లు
పెంటపాడు(పశ్చిమగోదావరి జిల్లా): పల్లెలు నూతన గృహాలతో సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి.. జగనన్న కాలనీలు ఊళ్లుగా రూపాంతరం చెందుతున్నాయి.. రాష్ట్రంలో పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్నారు. అర్హులందరికీ ఇప్పటికే స్థలాలు అందించగా.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ సాయం, అధికారుల ప్రోత్సాహంతో నెల రోజులుగా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో జగనన్న కాలనీలు ఆనందాల లోగిళ్లను తలపిస్తున్నాయి. కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో లబ్ధిదారులు నిర్మాణాలకు మరింత ఆసక్తి చూపుతున్నారు. నిర్మాణాల ప్రగతి భళా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పెంటపాడు మండలంలోని 22 గ్రామాల్లో 27 లేఅవుట్లను ఏర్పాటుచేశారు. మొత్తం 2,193 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకూ 1,340 మంది ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే 760 ఇళ్లు పునాది దశ దాటాయి. మిగిలిన లబ్ధిదారులు కూడా నిర్మాణాలు చేపట్టేలా అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పెంటపాడు మండలం 55 శాతం ప్రగతితో జిల్లాలో రెండో స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్‌ను రాయితీపై ఇస్తోంది. పెంటపాడు మండలంలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆర్థిక సాయం, మెటీరియల్ ఖర్చు కింద రూ.15,00,79,366 అందిం చినట్టు గృహనిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. సదస్సులతో స్ఫూర్తి గ్రామాల్లో అధికారులు, సర్పంచ్‌లతో అవగాహన సదస్సులు నిర్వహించాం. దీని ద్వారా చాలా మంది పేదలు గృహనిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. వారికి గూడు సమకూరుతోంది. – ఓ.శ్రీనివాసరావు, హౌసింగ్ ఏఈ, పెంటపాడు జిల్లాలో రెండో స్థానంలో.. పెంటపాడు మండలంలో ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాం. అవగాహన సదస్సులతో స్ఫూర్తి పొందిన లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. దీనిద్వారా 55 శాతం ప్రగతి సాధించి జిల్లాలో రెండో స్థానంలో నిలిచాం. – ఎ.ప్రసాద్, హౌసింగ్ డీఈ ఆన్లైన్ కాగానే బిల్లులు జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి దశల వారీగా ఆన్లైన్ కాగానే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తోంది. స్టాక్ పాయింట్ల ద్వారా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా మెటీరియల్ అందిస్తున్నాం. – జయరాజు, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్, పెంటపాడు పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన యల్లా బాలాజీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారు. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కాగా సొంతిల్లు కలగా ఉంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో వారికి గృహం మంజూరు కాగా.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. సీఎం జగన్ దయవల్లే తమకు గూడు సమకూరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. పెంటపాడు మండలం బి.కొండేపాడుకు చెందిన గూడూరి పుణ్యవతి చాలా కాలంగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్థలం మంజూరు చేయడంతో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకు అధికారులు ఆమెను ప్రోత్సహించారు. దశల వారీగా బిల్లులు మంజూరు చేయడంతో ఆమె ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోగలిగారు. సీఎం జగన్ సంకల్పంతోనే తన సొంతింటి కల సాకారమైందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. -
ఇళ్లపై కుళ్లు రాతలు!
మొన్న ఐదేళ్లు. అంతకు ముందో ఎనిమిదేళ్లు. ఇన్నాళ్లు పాలించడాన్ని చంద్రబాబు నాయుడు రికార్డుగా చెబుతుంటారు. రామోజీరావు దాన్నో అద్భుతంలా ప్రశంసిస్తారు. బాబు ఆ కాలంలో ఏమీ చేయకున్నా సరే!! అదంతా గుప్తుల స్వర్ణయుగం మాదిరే చూపించాలని తాపత్రయపడుతుంటారు. మరోవైపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలోపే ఏకంగా 30.76 లక్షల కుటుంబాల సొంతింటి కలను నిజం చేస్తున్నారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. దీనికోసం ఏకంగా రాష్ట ప్రభుత్వం తరఫున 1,05,886 కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా రామోజీకి నచ్చటం లేదు. ఇళ్లు కట్టుకోవటానికి కేంద్రమే 1.8 లక్షలిస్తోందని... రాష్ట్రమేమీ చేయట్లేదనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ బాబు హయాంలో ఎన్నిళ్లు ఇచ్చారో ఎన్నడూ అడగరు. ఎందుకిన్ని ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నించరు. అసలిన్నాళ్ల తరవాత కూడా 30.76 లక్షల కుటుంబాలకు ఇళ్లు ఇవ్వాల్సిన దయనీయ పరిస్థితులున్నాయనే వాస్తవం వయసు మీరిన ఆయన కళ్లకు ఆనదు. మరీ ఇంత దారుణమైన రాతలా రామోజీరావుగారూ? రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్లకు ఏం చేస్తోందో మీకు కనిపించటం లేదా? లేక మీరు చూడాలనుకోవటం లేదా? అసలు పనిగట్టుకుని ‘ఈనాడు’ రాస్తున్న రాతల్లో నిజమెంత!. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్లకోసం ఏం చేస్తోంది? ఎంత వెచ్చిస్తోంది? ఏది నిజం?... ఒకసారి చూద్దాం... అసలు 30.76 లక్షల మంది సొంతింటి కలను నిజం చేయటం కోసం భారీ లే ఔట్లు వేస్తుండటంతో ఏకంగా ఊళ్లే పుట్టుకొస్తున్న చరిత్ర దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.56,102 కోట్ల విలువైన భూములు కేటాయించింది. ఆ కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.36,026 కోట్లు వెచ్చిస్తోంది. ఇసుకను ఉచితంగా ఇవ్వటమే కాక ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందిస్తోంది. ఇన్ని చేసినా కొందరి ఇళ్లకు ఇంకా నిధులు కావాల్సి రావటంతో... వారికి రూ.35 వేల వరకూ బ్యాంకు రుణాన్ని పావలా వడ్డీకే ఇప్పిస్తోంది. వారిపై వడ్డీ భారం పడకుండా మిగిలిన వడ్డీని తనే చెల్లిస్తోంది. అయితే ఇన్ని ప్రత్యామ్నాయాలున్నప్పటికీ కొందరికి ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేదు. అలాంటివారికి ఆప్షన్–3 కింద తనే ఇళ్లు పూర్తిగా నిర్మించి ఇస్తోంది. అలా ఇప్పటికి 3.27 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తోంది. ఇదీ... రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇదంతా కేంద్రం చెల్లిస్తున్న 1.8 లక్షలకు అదనంగా..!!. చూస్తున్నారా రామోజీరావు గారూ!! ‘‘నాకు రూ.11 లక్షల విలువైన ఇంటి స్థలంతో పాటు ఉచితంగా 20 టన్నుల ఇసుక, 90 బస్తాలు సిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది’’ అంటున్న విశాఖ వాసి జి.అప్పల నారాయణమ్మకు జవాబు చెప్పే ధైర్యం మీకుందా? మీకోసం ఇవిగో... మీరు చెప్పని నిజాలు... ఈనాడు ఆరోపణ జగనన్న కాలనీల్లో స్థలం ఇస్తున్నారు. కట్టుకోవడానికి రూ.1.8 లక్షలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. నిజానికి ఇది కేంద్రం ఇచ్చే సాయం. నిజం ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలే ఇస్తోంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇంటి పట్టా విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 30.76 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.56,102 కోట్లు. ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా జగనన్న కాలనీల్లో భూమిని చదును చేయడంతో పాటు రోడ్లు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.36,026 కోట్లు వ్యయం చేస్తోంది. ఈనాడు ఆరోపణ అరకొరగా సామగ్రి పంపిణీ. ఆశించిన మేర లబ్ధిదారులకు అందించడం లేదు. నిజం లబ్ధిదారులకు సమీప గిడ్డంగుల వద్దే సామగ్రి అందచేస్తున్నారు. గత ఐదేళ్లలో 2.12 లక్షల టన్నుల సిమెంట్ ఇచ్చారు. వాటితో పోల్చితే గత సంవత్సరంలో ఇచ్చిన సిమెంట్ మూడు రెట్లు ఎక్కువ. ఈనాడు ఆరోపణ ఇల్లు కట్టుకునేందుకు రూ.ఐదారు లక్షలు అవుతుంది. అత్యంత సాధారణ ఇల్లు అయితే రూ.మూడు లక్షలు అవుతుంది. నిజం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మాత్రమే కాకుండా రూ.15,000 విలువైన ఇసుక, సామగ్రిలో ధరల వ్యత్యాసంతో రూ.45,000 మేర ప్రయోజనం, పావలా వడ్డీ ద్వారా రూ.35 వేల దాకా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇంటి నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి చేకూర్చిన ప్రయోజనం రూ.2.75 లక్షలు ఉంటుంది. వీటికి స్థలం విలువ, మౌలిక వసతుల కోసం వెచ్చిస్తున్నది అదనం. ఈనాడు ఆరోపణ అది కేంద్ర సాయమే నిజం కేంద్ర సాయాన్ని మినహాయిస్తే... ఇళ్ల స్థలాలు, ఇసుక, రాష్ట్ర ప్రభుత్వ వాటా, పావలా వడ్డీ, కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,05,886 కోట్లను వ్యయం చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ చేయనంత ఖర్చు ఇది. పేదలకు ఎలాగైనా సొంతిల్లు ఇవ్వాలన్న వై.ఎస్.జగన్ బలమైన సంకల్పానికి ఫలితమిది. ఈ స్థాయిలో వెచ్చిస్తున్నా కళ్లు మూసుకుని, తానేమీ చూడటం లేదు కాబట్టి అక్కడేమీ జరగటం లేదన్న తీరులో వ్యవహరిస్తోంది ‘ఈనాడు’. అదే దురుద్దేశంతో కుట్రపూరిత కథనాలు వండి వారుస్తోంది. ఇంకెన్నాళ్లు రామోజీ ఈ బరితెగింపు? వాస్తవాలు తెలిసినా.. భారీ గృహ నిర్మాణ బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రభుత్వం... తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పేదలకిచ్చిన ఇంటి స్థలం విలువ గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండగా పట్టణ ప్రాంతాల్లో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా ఉంటోంది. రానురాను ఈ విలువ ఇంకా పెరుగుతూ వస్తోంది. ఈ పనే గనక చంద్రబాబు చేసి ఉంటే ‘ఈనాడు’ ఆయన్ను ఆకాశానికెత్తేసి ఇప్పటికీ కిందకు దించేది కాదు. కానీ చేసింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏదో ఒకరకంగా దుష్ప్రచారం చేస్తూ ఆయనకొస్తున్న ఆదరణను తగ్గించటమే రామోజీ పన్నాగం. అసలు చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఓ పేదవాడి ఇల్లున్న లే అవుట్‌కి కనీసం కరెంట్ వైర్ లాగిన సందర్భాలున్నాయా? ఇప్పుడు 2,563 జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ పనులు ప్రారంభం కావడం నిజం కాదా? గతంలో ఏ ప్రభుత్వమైనా ఇల్లు కట్టుకునేందుకు స్టీలు సమకూర్చిందా? ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 67 వేల టన్నులు స్టీలు ఇవ్వటం నిజం కాదా? చెప్పండి రామోజీరావు గారూ? పొంతన ఉందా? కోవిడ్ కారణంగా గతేడాది నాలుగు నెలల పాటు ఇళ్ల పనులు మందగించాయి. ఈర్షా్య ద్వేషాలతో న్యాయస్థానాల్లో దాఖలు చేసిన కేసులతో మరో మూడు నెలలు నష్టపోవాల్సి వచ్చింది. ఇన్ని అవాంతరాలు సృష్టించినా ఇప్పటివరకు 67 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. తొలిదశలో చేపట్టిన గృహ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మూడు లక్షల మంది అక్క చెల్లెమ్మలు పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున సాయం అందుకున్నారు. ఇంటి నిర్మాణానికయ్యే ఖర్చు గురించి ఒకచోట రూ.2.25 లక్షలు అని, అతి సాధారణంగా నిర్మించుకుంటే రూ.3 లక్షలు అని, అదే జిల్లాలవారీగా అయితే రూ.ఐదారు లక్షలు అని రామోజీ రాసుకొచ్చారు. నిజమే.. రామోజీ ఇంటికి, పేదవాడి ఇంటికీ పొంతన ఉంటుందా? మార్బుల్ ఫ్లోర్, ఎయిర్ కండిషన్‌తో కూడిన రామోజీ విలాసవంతమైన భవనాన్ని ఓ పేదవాడు నిర్మించుకునే ఇంటితో ఎలా పోల్చగలం? జగనన్న రూ.6 లక్షల ఆస్తిచ్చారు మేం ముగ్గు అమ్ముకుంటూ, ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తూ జీవనం సాగిస్తాం. దుర్భర దారిద్య్రంలో ఉన్న మా కుటుంబానికి సుమారు రూ.6 లక్షల విలువైన స్థలాన్ని ఎలాంటి పైరవీలు లేకుండా జగనన్న ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు సాయం అందించారు. డ్వాక్రా ద్వారా సున్నా వడ్డీకి రూ.50 వేలు, సుమారు రూ.30 వేలు విలువ చేసే నాలుగు లారీల ఇసుకను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. రాయితీపై సిమెంట్, ఐరన్ తదితర సామగ్రిని సమకూర్చారు. కాలనీకి తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. – ముదరగడ దానమ్మ, ఆలమూరు మండలం, ఎర్రకాలనీ, కోనసీమ జిల్లా రూ.11 లక్షల ఇంటి స్థలం ఇచ్చారు ప్రభుత్వం నాకు ఇటీవల 72 గజాల స్థలాన్ని కేటాయించి పట్టా (ప్లాట్ నెంబర్ 201) అందించింది. ప్రస్తుతం ఇక్కడ గజం విలువ రూ.15 వేలు ఉంది. దీని ప్రకారం స్థలం విలువ దాదాపు రూ.11 లక్షలు ఉంటుంది. ఇంటి నిర్మాణం కోసం 20 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేశారు. రూ.1,18,765 బిల్లు మంజూరు చేసి 90 బస్తాలు సిమెంట్ ఇచ్చారు. ఇన్నాళ్లూ అద్దె ఇళ్లలో తలదాచుకున్న మేం జగన్ బాబు దయతో కష్టం లేకుండా సొంతిల్లు కట్టుకోగలుగుతున్నాం. టీడీపీ ప్రభుత్వం మాలాంటి పేదలకు నీడ కల్పించలేకపోయింది. – జి.అప్పల నారాయణమ్మ– వెల్లంకి, ఆనందపురం మండలం, విశాఖపట్నం జిల్లా విలువైన స్థలం ఉచితంగా.. అద్దె ఇంటికి ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ఏళ్ల తరబడి చెల్లించాం. ప్రభుత్వం మాకు రాప్తాడు సమీపంలోని జగనన్న లేఅవుట్లో ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాం. ఇక్కడ సెంటు స్థలం దాదాపు రూ.3 లక్షలు ఉంది. విలువైన స్థలాన్ని ప్రభుత్వంమాకు ఉచితంగా ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.90 వేలు బిల్లు చెల్లించడంతోపాటు ఇసుక, సిమెంట్, స్టీల్, ఇటుకలు అందించారు. – దివానం రుద్రమ్మ, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా -
జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక బృందాలు
సాక్షి, భీమవరం: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో గృహాలను మంజూరు చేస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా జగనన్న కాలనీల్లో నిర్మాణ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. వీటిని మరింత వేగవంతం చేసేందుకు పట్టణాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్లు నిర్మించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 71,797 మందికి స్థలాల పట్టాలు మంజూరు చేయగా ఇప్పటికే 63,933 ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. వీటి నిర్మాణాల కోసం ప్రభు త్వం రూ.257.21 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే సుమారు 21 వేల మంది లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టగా వివిధ దశల్లో ఉన్నాయి. నిర్మాణం చేపట్టిన లబ్ధిదా రులకు ప్రభుత్వం రూ.1.80 లక్షల చొప్పున ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు మరో రూ.30 వేలు బ్యాంకు రుణంగా అందించే ఏర్పాట్లు చేసింది. పట్టణాల్లో పక్కా ప్రణాళికతో.. జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు పట్టణాల్లో ఇళ్ల నిర్మాణానికి అధికారులు పటిష్ట ప్రణాళిక రూపొందించారు. కాంట్రాక్టర్ ద్వారా పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. లబ్ధిదారులు విడివిడిగా గృహ నిర్మాణం చేపడితే మెటీరియల్ రవాణా, కొనుగోలు వంటి వాటికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడంతో పాటు వ్యయప్రయాసలు తప్పవు. ఈ నేపథ్యంలో 30 మంది లబ్ధిదారులను యూనిట్‌గా విభజించి సచివాలయ ఉద్యోగులు ఆరుగురిని బృందంగా ఏర్పాటుచేసి కాంట్రాక్టర్‌కు నిర్మాణాన్ని అప్పగిస్తారు. ఇలా ముందుగా పట్టణాల్లో ని ర్మాణాలు చేపట్టి అనంతరం గ్రామాల్లో నిర్మాణాలపై అధికారులు దృష్టి పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కాంట్రాక్టర్లు చేసే పనులను సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పర్యవేక్షించేందుకు వీలున్నందున నాణ్యతా ప్రమా ణాలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఈ విధా నం ద్వారా సత్ఫలితాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. భీమవరంలో 42 బృందాలు భీమవరంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకంలో త్వరితగతిన గృహాల నిర్మాణానికి 42 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేస్తున్నాం. ఒక్కో బృందం 30 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తాయి. టీమ్ సభ్యులంతా ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పటికే కొందరు కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు. గృహ నిర్మాణ ఆవశ్యకత, లబ్ధిదారుల ఇబ్బందులను కాంట్రాక్టర్లకు వివరించి కాంట్రాక్ట్ పద్ధతిన పనులు చేయించేందుకు సన్నద్ధం చేస్తున్నాం. – ఎస్.శివరామకృష్ణ, మునిసిపల్ కమిషనర్, భీమవరం -
కొత్త ఊళ్లకు ఊపిరి...విపక్షం ఉక్కిరిబిక్కిరి
సొంతింటి కల సాకారమవుతోంది. పేదల్లో సంతోషం పరవళ్లు తొక్కుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలకు వేల ఇళ్లతో ఏకంగా ఊళ్లే ఊపిరి పోసుకుంటున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమం ద్వారా నిర్మాణరంగం కళకళలాడుతోంది. వేలాది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. స్టీల్, సిమెంట్, ఇటుకలు తదితర నిర్మాణ సామాగ్రి వ్యాపారాలు సైతం జోరుగా సాగుతూ మార్కెట్ టర్నోవర్ ను పెంచుతున్నాయి. జగనన్న కాలనీల పథకంతో ఇన్ని రకాలుగా మేలు జరుగుతున్నా.. విపక్షం కళ్లు లేని కబోదిలా వ్యవరిస్తోంది. ఇళ్ల నిర్మాణంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందని కుళ్లుకుంటోంది. పచ్చ మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. తన పాలనలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని టీడీపీ శరవేగంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై తప్పుడు ప్రచారానికి తెగబడుతూ పైశాచిక ఆనందం పొందుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో జగనన్న కాలనీల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గృహ ప్రవేశాలు కూడా మొదలైపోయాయి. కానీ వీటిని చూసి టీడీపీ ఓర్చుకోలేకపోతోంది. పచ్చ పత్రికలతో గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయస్థానాల్లో పలు పిటీషన్లు వేసి అడ్డు తగిలినా చివరికి ధర్మమే గెలిచింది. జిల్లాలో 1156 లేఅవుట్లు జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణ చేసింది. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల కోసం 1795.80 ఎకరాలు అవసరం కాగా 1227.17ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించింది. మిగతా 568. 63 ఎకరాల మేరకు ప్రైవేటు భూమి కొనుగోలు చేశారు. ఒక్క భూమి కొనుగోలు కోసమే రూ.178.31కోట్లు వెచ్చించారు. అర్హులైన వారందరి కోసం జిల్లాలో 1156 లేఅవుట్లు వేశారు. లేఅవుట్ కోసం భూముల చదును చేయడం, జంగిల్ క్లియరెన్స్, అంతర్గత రోడ్లు, హద్దుల రాళ్లు, డ్రైనేజీ తదితర వాటి కోసం రూ. 30కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇవి కాకుండా లేఅవుట్లకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ.74కోట్లు ఖర్చు చేసింది. అలాగే లేఅవుట్లలో విద్యుత్ సౌకర్యం కోసమని రూ.10 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. వేసిన లేఅవుట్లలో పచ్చదనం కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతోంది. తొలి విడతలో 695 లేఅవుట్లు జిల్లా వ్యాప్తంగా 1156 లేఅవుట్లు వేసినప్పటికీ తొలి విడతగా 695 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 40,630 స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో లబ్ధిదారులు ఉత్సాహంగా ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. రెండేళ్ల కరోనాతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో కొంత జాప్యం జరుగుతున్నా... సొంతిళ్లు సాకారం చేసుకునేందుకు ప్రభుత్వమిచ్చిన ఆర్థిక సాయంతో నిర్మాణాలు వేగవంతం చేశారు. అధికారులు కూడా పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అవసరమైన సాయం అందిస్తున్నారు. మంజూరైన వాటిలో 38,174 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కొత్త కాలనీలు.. ప్రస్తుతం నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో కొత్తగా నిర్మిస్తున్న కాలనీలు కొత్త ఊళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఆ కాలనీల్లో నిర్మాణ సందడి కనిపిస్తోంది. అద్దెల భారం నుంచి బయటపడాలని లబ్ధిదారులు సైతం వ్యక్తిగత శ్రద్ధతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ పూర్తయితే జిల్లాలో కొత్తగా 695 కాలనీలు అవతరించనున్నాయి. సంపూర్ణ గృహ హక్కుతో.. 1983 నుంచి 2011 వరకు ప్రభుత్వ గ్రాంట్‌తో, గృహ నిర్మాణ సంస్థ రుణంతో నిర్మించుకున్న ఇళ్లకు చాలా మంది పేరుకే యజమానులు తప్ప ఎలాంటి హక్కులు లేని పరిస్థితి ఉంది. మన పేరున హౌసింగ్ రుణం ఉండటంతో ఆ ఇళ్లను అమ్ముకోవడానికి, బదిలీకి, కనీసం లీజుకివ్వడానికి గానీ, అవసరం మేరకు బ్యాంకు రుణం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎన్నాళ్లైనా ఆ ఇంటిలో ఉండటమే తప్ప అవసరాలకు దాన్ని వినియోగించుకోలేని దుస్థితి ఉండేది. సరికదా ఇళ్ల నిర్మాణం కోసమని తీసుకున్న రుణాన్ని వాయిదాల పద్ధతిలో వడ్డీతో కలిపి చెల్లించాల్సిన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ విధంగా తరాలు మారుతున్నా ప్రభుత్వ ఇళ్లకు సర్వహక్కులు పొందలేకపోయారు. ఇలాంటి వారి బాధలను దృష్టిలో పెట్టుకుని నామమాత్రం రుసుంతో ఇంటిపై సర్వహక్కులను కల్పించే సదుద్దేశంతో సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో జిల్లాలో లక్షా 93వేల 881మందికి ఉపశమనం కలిగింది. ఇప్పటికే 43వేల మంది రిజిస్ట్రేషన్లతో పక్కా పత్రాలు పొందారు. ఇంటివారమయ్యాం.. నాకు వివాహమై 15 ఏళ్లవుతోంది. ఇన్నాళ్లకు మేం ఓ ఇంటి వారమయ్యాం. నా భర్త కూలి పని చేస్తుంటారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేక ఇన్నాళ్లు అద్దె ఇంటిలోనే ఉన్నాం. జగనన్న వచ్చి విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి డబ్బు మంజూరు చేశారు. చాలా ఆనందంగా ఉంది. తొందరగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేద్దామనుకుంటున్నాం. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. – నక్క ఆరుద్ర, గడ్డెయ్యపేట, జమ్ము, నరసన్నపేట కల సాకరమైంది.. కుప్పిలికి చెందిన కుప్పిలి నారాయణమ్మది పేద కుంటుంబం. సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు–వైఎస్సార్ ఇళ్లులో ఈమెకు సెంటున్నర స్థలం ఇంటి పట్టా ఇచ్చారు. రూ. 1.80 లక్షలు యూనిట్ మంజూరు చేశారు. ఇసుక కూపన్లు, నిబంధనల మేరకు ఐరన్, సిమ్మెంట్, పునాదులు తవ్వకానికి 90 రోజులు ఉపాధి హామీ పథకం మస్టర్ వేసి వేతనం ఇచ్చారు. ఇలా ఈమె సొంతింటి కల సాకారమైంది. 20 ఏళ్ల కల టెక్కలికి చెందిన కరుకోల షణ్ముఖరావు, విజయలక్ష్మి దంపతుల 20 ఏళ్ల నిరీక్షణ వైఎస్సార్ జగనన్న కాలనీతో నెరవేరింది. షణ్ముఖరావు స్థానికంగా ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా పట్టణంలో అద్దె ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా టెక్కలి జగతిమెట్ట వద్ద ఆయనకు ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసింది. దీంతో వారు ఎంతో సుందరంగా ఇంటిని కట్టుకున్నారు. 20 ఏళ్లుగా కలగానే ఉండిపోయిన సమస్యను వైఎస్ జగన్ తీర్చారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఏ ఊళ్లోనూ 50% పైగా ఎస్సీలు లేరట!) -
వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు షురూ
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఇళ్లలో 25 శాతం ఇళ్లు పునాది దశను దాటిన లేఅవుట్లలో ఈ పనులను చేపడుతున్నారు. ఇళ్లులేని పేదలకు ఈ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 17,005 లేఅవుట్లలో ప్రభుత్వం పేదలకు ప్లాట్లు పంపిణీ చేసింది. తొలిదశలో 10,067 లేఅవుట్లలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇక 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తోంది. 354 లేఅవుట్లలో విద్యుత్ పనులు తొలిదశ నిర్మాణాలు చేపడుతున్న 10వేల లేఅవుట్లలో రూ.24వేల కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే 354 లేఅవుట్లలో విద్యుత్ సరఫరా పనులు ప్రారంభించారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. మరో 2,343 లేఅవుట్లలో పనులు ప్రారంభించడానికి డిస్కమ్‌లు సర్వే చేపడుతున్నాయి. ఇక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి ఆధారంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు విద్యుత్ అధికారుల సమన్వయంతో పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. విదుత్ సదుపాయాల కల్పనకు రూ.4,600 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖకు నిధులు çసమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రుణదాతలకు హామీ ఇచ్చింది. మరోవైపు.. ఈ ఇళ్లలో అత్యున్నత ఇంధన పొదుపు ప్రమాణాలను పాటించేందుకు ఇండో–స్విస్ బీప్ (బిల్డింగ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రాజెక్టు) సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. దీంతో బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ ఇళ్లలో 3–5 డిగ్రీలు తగ్గుతుంది. అదే విధంగా రోడ్లు, డ్రెయిన్లు, కాల్వల నిర్మాణం, నీటి సరఫరా, సహా ఇతర సదుపాయాలు కల్పించడానికి సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీకి ప్రాధాన్యం కాలనీల్లో ఇళ్ల సంఖ్య, లేఅవుట్ విస్తీర్ణాన్ని బట్టి 20, 30, 40 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు. 40 అడుగుల రోడ్లు నిర్మించిన చోట రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటుచేస్తారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. 17వేల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చుచేస్తుండగా ఇందులో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10,251 కోట్లు, సీసీ డ్రెయిన్లకు రూ.7,227 కోట్లు, నీటి సరఫరాకు రూ.4,128 కోట్లు, విద్యుత్‌కు రూ.7,080 కోట్లు, ఇంటర్నెట్కు రూ.909 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని లేఅవుట్లో వసతుల కల్పనకు రూ.3,204 కోట్లు కేటాయించారు. అదే విధంగా కాలనీల్లో పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యం నిర్వహణకు సంబంధించిన వసతుల కల్పనకు రూ.110 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా.. కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతోంది. ఆ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. విద్యుత్ సదుపాయాల కల్పన పనులు చకచకా సాగుతున్నాయి. మిగిలిన శాఖలు తమ పనులు ప్రారంభిస్తున్నాయి. ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన సీఎం లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు కృషిచేస్తున్నాం. – ఎం. శివప్రసాద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, గృహ నిర్మాణ సంస్థ -
రెండంతస్తుల శోభ
తెనాలి: జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల్లో గుంటూరు జిల్లా తెనాలిలో సరికొత్త ప్రయోగం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా అమలవుతున్న ఈ విధానంలో పునాదుల నుంచి గోడలతో సహా ఇళ్లను పటిష్టంగా నిర్మిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో ప్రతి ఇంటిపైనా మరో రెండు అంతస్తులు (జీ+2) నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానంలో ఇళ్లు నిర్మించడంపై లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో తెనాలి పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలాలతో కలిపి రికార్డు స్థాయిలో 27 వేల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశారు. తొలి దశలో 17 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. డెల్టా ప్రాంతమైన తెనాలిలోని లే–అవుట్లలో మెరక సమస్యలను అధిగమించి ప్రస్తుత వేసవిలో ఇళ్ల నిర్మాణం ఆరంభమైంది. ప్రస్తుత సీజనులో కనీసం 10 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని సంకల్పంతో శరవేగంతో పనులు జరుగుతున్నాయి. సిరిపురం లే–అవుట్లో బోర్లలో రెడీమిక్స్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్లపై లబ్ధిదారులు భవిష్యత్‌లో మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా ఆధునిక బోర్ కటింగ్ యంత్రంతో ఒక్కో ఇంటికి 10 అడుగుల లోతు, అడుగు డయామీటరుతో తొమ్మిది బోర్లు తీస్తున్నారు. ఒక్కో బోరులో 12 ఎం.ఎం. ఇనుప రాడ్లు నాలుగు చొప్పున కడుతున్నారు. పైన పైల్ కాపింగ్ మరో ప్రత్యేకత. దానిపై ప్లింత్బీమ్కు 10 ఎం.ఎం. స్టీల్ రాడ్లు ఐదేసి చొప్పున వాడుతున్నారు. ప్లింత్ బీమ్‌పై 9 అంగుళాల గోడ నాలుగు అడుగులు మేర కట్టి, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇసుకతో నింపి బెడ్ వేస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కో కాలమ్‌కు 10 ఎం.ఎం. రాడ్లు నాలుగు చొప్పున 9 కాలమ్స్‌ను శ్లాబ్ వరకు తీసుకెళుతున్నారు. లోడ్ బేరింగ్ కోసం పునాదిని పకడ్బందీగా వేయడం, డిజైన్‌లో లేనప్పటికీ 9 కాలమ్స్ నిర్మించటంతో ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు అదే ఇంటిపై మరో రెండు అంతస్తుల నిర్మాణం నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ఇళ్ల నిర్మాణ పర్యవేక్షకుల్లో ఒకరైన ఏఆర్ఏ కనస్ట్రక్షన్స్ నిర్వాహకుడు అడుసుమల్లి వెంకటేశ్వరరావు వెల్లడించారు. కట్టుబడి చాలా బాగుంది సిరిపురం లే–అవుట్లో నాకు ఇంటిస్థలం ఇచ్చారు. డబ్బులు చాలక లబ్ధిదారులు ఎవరికి వారు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఇంటి నిర్మాణాల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. పర్యవేక్షకులను నియమించి కట్టుబడి బాగా చేయిస్తున్నారు. పునాదులు, గోడలు పటిష్టంగా వేస్తున్నందున మళ్లీ ఎప్పుడైనా మేం పైన మరో రెండంతస్తులు వేసుకునే అవకాశం ఉండేలా కడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. – అద్దంకి హేమలత, 10వ వార్డు, తెనాలి ఊపందుకున్న నిర్మాణాలు తెనాలి పట్టణ లబ్ధిదారులకు కేటాయించిన పెదరావూరు, సిరిపురం లే–అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. లే–అవుట్లలోనే తాత్కాలిక గిడ్డంగులను నిర్మించి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇసుకతో సహా ఇనుము, సిమెంట్, ఇటుకలను ముందుగానే చేర్చటం కలిసొచ్చింది. లే–అవుట్లలో అవసరమైన నీటి వసతి, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. మెప్మా సహకారంతో లబ్ధిదారులకు రూ.50 వేల వంతున రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా లే–అవుట్లలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. బోర్లు తీయడం నుంచి ప్లింత్‌బీమ్, పైల్ కాపింగ్, కాలమ్స్ అన్నీ ఆయన డిజైన్ ప్రకారం ఏడెనిమిది మంది పర్యవేక్షకులతో ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. -
లబ్దిదారులకు నిర్మాణసామాగ్రి అందుబాటులో ఉంచుతున్నాం: మంత్రి జోగి రమేష్
-
జగనన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ సర్వీసు
సాక్షి, అమరావతి: నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుండగా 17 వేల జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కాలనీలకు డిస్కమ్‌ల ద్వారా మొదటిదశలో 14,49,133 సర్వీసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనికి అవసరమైన నిధులను గృహ నిర్మాణ శాఖకు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రుణ దాతలకు హామీ ఇస్తోంది. రూ.4,600 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్(ఆర్ఈసీ) ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మొదటి దశ పనులు మొదలు పేదలందరికీ ఇళ్లు పథకం మొదటి దశకి సంబంధించి ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 3,951 లే అవుట్లు ఉండగా 3,28,383 ఇళ్లకు విద్యుత్ సర్వీసులు అందించనున్నారు. దీని కోసం రూ.1,217.17 కోట్లు వెచ్చిస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2,813 లే అవుట్లు ఉండగా 5,16,188 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను రూ.2,519.73 కోట్లతో అందించనున్నారు. ఏపీసీపీడీసీఎల్‌లోని మూడు జిల్లాలతోపాటు సీఆర్డీఏ పరిధిలో 3,977 లే అవుట్లు ఉన్నాయి. వీటిలో 6,04,562 ఇళ్లకు విద్యుత్ సర్వీసులను రూ.1,805.04 కోట్లతో ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించి ఇప్పటికే పనులు ప్రారంభించారు. వాటర్ వర్క్స్‌కు సంబంధించి బోర్లకు విద్యుత్ సర్వీసులు అందిస్తున్నారు. లైన్లు మారుస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సహకారం రాష్ట్రంలో 15,000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం ఇప్పటికే ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)–2017ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సహకారంతో ఒక్కో ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లను అందించనున్నారు. లబ్ధిదారుల అంగీకారంతో ఇంటి నిర్మాణానికి విద్యుత్ పొదుపు డిజైన్లను అనుసరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ 152 మిలియన్ యూరోలు అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యున్నత ప్రమాణాలు.. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగంలో 42 శాతం బిల్డింగ్ సెక్టార్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన సామర్థ్య సాంకేతికత పరిజ్ఞానం కలిగిన గృహాల నిర్మాణాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జగనన్న ఇళ్లలో అత్యున్నత ఇంధన పొదుపు ప్రమాణాలను పాటించేందుకు ఇండో స్విస్ బీప్ (బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్) సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దీనివల్ల బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇళ్లలో 3 నుంచి 5 డిగ్రీలు తగ్గుతుంది. సహజ సిద్ధమైన గాలి, వెలుతురు ఉండటం వల్ల విద్యుత్ వినియోగం 20 శాతం తగ్గి కరెంటు బిల్లులు ఆదా కానున్నట్లు ఇంధన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
జగనన్న కాలనీ: ఇళ్ల నిర్మాణం చకచకా.. (ఫోటోలు)