
సాక్షి, కాకినాడ: రెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 80 శాతం ఇళ్లు పూర్తిచేశామని తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం జగనన్న కాలనీలో ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
అనంతరం జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహన్ని ఆవిష్కరించిన సీఎం జగన్.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అనిచెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 7 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 14.33 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు.
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందన్నారు. సామర్లకో లేఅవుట్‌లో వెయ్యికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, లక్షల విలువ చేసే ఆస్తిని అక్క చెల్లెమ్మల చేతులో పెడుతున్నామని పేర్కొన్నారు. పేదలకు మంచి చేసే అవకాశం దేవును తనకు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. నవరత్నాల్లోని ప్రతి పథకాన్ని బాధ్యతతో అమలు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 35కు పైగా పథకాలు అమలవుతున్నాయని, పేదవాడి బతుకులు మార్చాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
‘గత ప్రభుత్వం ఏనాడూ పేదల మీద కనికరం చూపలేదని సీఎం విమర్శించారు. పేదలకు మంచి జరగకుండా అడుగడుగునా అడ్డుపడ్డారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా చంద్రబాబు కోర్టులకు వెళ్లారని దుయ్యట్టారు. వేలకోట్లు ఖర్చు చేసి పేదల ఇంటి కలను సాకారం చేస్తున్నామని.. పేద అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
చదవండి: Updates: చంద్రబాబు కేసు టుడే అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment