
లబ్ధిదారులతో జనసైనికుల వాగ్వాదం
పెంటపాడు(ప.గో. జిల్లా): జగనన్న కాలనీలో జనసేన జెండాల ప్రదర్శన తగదు.. మమ్ములను సంప్రదించకుండా కాలనీలోకి రావడం సహించబోం.. మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి.. జనసేన పార్టీ వాళ్లు వచ్చి ఇక్కడ కిరికిరిలు పెట్టొద్దు.. జగనన్న ప్రభు త్వం మాకెంతో మేలు చేస్తోంది.. గతంలో ఏ ప్ర భుత్వం మాకు ఇళ్లు ఇవ్వలేదు.. ఇంతకాలానికి జ గనన్న ప్రభుత్వం ఇళ్లు అందించింది.. అంటూ పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు శివారు బిళ్లగుంట జగనన్న కాలనీవాసులు జనసేన నాయకులకు అడ్డుతగిలారు. ఆదివారం జనసేన గోబ్యాక్ అంటూ ఏపూరి నాగలక్ష్మి తదితర మహిళలు నినదించారు.
ఆదివారం జనసేన నాయకులు, కార్యకర్తలు సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా జెండాలతో బిళ్లగుంట జగనన్న కాలనీలోకి ప్రవేశిస్తుండగా ఇళ్ల లబ్ధిదారులు వారిని అడ్డుకున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తాము ఇళ్ల నిర్మాణాలను ము మ్మరం చేస్తున్నామని, ఈలోపు సౌకర్యాలు కల్పించడం లేదంటూ జనసైనికులు రావడం కుదరదన్నారు. జనసేన నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా లబ్ధిదారులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. మాకు సీఎం జగనన్న, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నిరకాలుగా అండగా నిలుస్తుంటే ఓర్వలేకపోతున్నారా అని లబ్ధిదారులు ప్రశ్నించారు. దీంతో జనసైనికులు తాము తెచ్చిన జెండాలను ముడిచి వెనుదిరిగారు.
అప్రతిష్టపాలు చేసేలా..
ప్రభుత్వం లక్షల ఖర్చులతో స్థలాలు కొని ఇచ్చింది. ఇంటి నిర్మాణం పూర్తిచేసుకుంటు న్నాం. ఇళ్లు ఇచ్చిన ప్రభుత్వం రోడ్లు పోయకుండా ఉంటుందా.. అయితే జనసేన పార్టీ వాళ్లు కాలనీలోకి ఎందుకు వస్తున్నారో అర్థం కావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇటువంటి చర్యలు తగదు.
– ఏపూరి నాగ విజయలక్ష్మి, దర్శిపర్రు
ప్రభ్వుత సాయంతో నిర్మాణం
గతంలో ఏ పార్టీ వాళ్లూ మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు జగనన్న స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకునేందుకు సొమ్ములు కూడా ఇస్తున్నారు. అధిక వర్షాలతో ఇళ్ల నిర్మాణం ఆలస్యమవుతోంది. ఇప్పుడిప్పుడే పనులు మళ్లీ మొదలెడుతున్నాం. ఈలోపు జనసేన పార్టీ వాళ్లు కాలనీలోకి వచ్చి ఏం చేస్తారో తెలియడం లేదు.
–కలగంటి శేషవేణి, దర్శిపర్రు
Comments
Please login to add a commentAdd a comment