
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను సైతం వదలడం లేదు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న భూ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో టీడీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.
గురజాల మండలంలోని పులిపాడు గ్రామంలో జగనన్న కాలనీని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు కబ్జా చేసేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పులిపాడులో 70 సెంట్ల లో 40 మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ భూములంటూ యరపతినేని అనుచరులు నకిలీ సర్టిఫికెట్ సృష్టించారు. పొజిషన్ సర్టిఫికెట్ జారీ చేయడంలో వీఆర్వో జ్యోతి కీలక పాత్ర పోషించారు.
పొజిషన్ సర్టిఫికెట్ ఆధారంగా 70 సెంట్లు జగనన్న కాలనీని తొమ్మిది మంది టీడీపీ నేతలు తమ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎవరైనా గొడవ చేస్తే చంపేస్తామంటూ టీడీపీ గూండాలు బెదిరింపులకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.

Comments
Please login to add a commentAdd a comment