Gurazala
-
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
-
ముఖ్యమంత్రి జగన్ పాలన సౌలభ్యాన్ని తీసుకొచ్చారు: ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
-
మాచర్లలో భరతుడంటా!.. లోకేశ్ మళ్లీ ఏసేశాడు
సాక్షి, నరసరావుపేట : ‘యుద్ధానికి వెళుతున్న భరతుడికి వీర తిలకం దిద్దిన ప్రాంతం మా చర్ల’ అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ తన అ జ్ఞానాన్ని మరోసారి చాటుకున్నారు. పల్నా డు జిల్లా గురజాలలో బుధవారం జరిగిన బహిరంగ సభలో లోకేశ్ పైవిధంగా నాలుక ను మడతేసిపడేశారు. వాస్తవానికి బాలచంద్రుడికి వీర తిలకం దిద్ది పంపింది మగువ మాంచాల. పల్నాటి గడ్డపై పసివాడిని అడిగినా ఈ విషయం ఇట్టే చెప్పేస్తాడు. కానీ లోకేశ్ మాత్రం తన మిడిమిడి జ్ఞానంతో భరతుడిని మాచర్లలోకి దించేశారు. పిడుగురాళ్ల వావెళ్ల గార్డెన్స్ నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర సత్తెనపల్లి నియో జకవర్గం రాజుపాలెం మండలం మీదుగా పెద కూరపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది చదవండి: చంద్రబాబు, సీఎం జగన్ మధ్య తేడా ఇదే.. -
ఎవరు చర్చకు వచ్చినా రెడీ.. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఓపెన్ సవాల్
సాక్షి, పిడుగురాళ్ల: గురజాల అభివృద్ధిపై చర్చకు నేను సిద్దమంటూ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఓపెన్ సవాల్ విసిరారు. కాగా, మహేష్ రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘2019-2022 మధ్య కాలంలో గురజాల అభివృద్ధి కోసం రూ.2,673 కోట్లు ఖర్చు చేశాము. టీడీపీతోపాటు ఏపార్టీ వచ్చినా చర్చకు రెడీ. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో గత 40 నెలలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. పల్నాడులోని గురజాల వెనుకబడ్డ ప్రాంతం. వైఎస్సార్ హయంలోనే ఇక్కడ అభివృద్ధి మొదలైంది. విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరిచాము. ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపేందుకు చర్యలు చేపట్టాము. టీడీపీ హయంలో ఒక్క పథకమైనా చేపట్టారా?’ అని ప్రశ్నించారు. -
గురజాల అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం
-
‘ఆ ప్రశ్నకు టీడీపీ నుంచి ఇంతవరకు సమాధానమే లేదు’
సాక్షి, గుంటూరు: యుద్ధాలు చేస్తాం, మీసాలు తిప్పుతాం, తొడలు చరుస్తాం అనే మాటలన్నీ టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం కోసం చేసే చీప్ ట్రిక్స్ అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. మున్సిపల్ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 2019లో వైఎస్సార్సీపీ సత్తా ఏంటో చూపించాం. ప్రజలే నిర్ణయించారు మగాళ్లు ఎవరు.. మడత గాళ్లు ఎవరు అనేది. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చంద్రబాబు డబ్బులు పంపితే రేవంత్‌రెడ్డి పట్టుబడలేదా, అదేమైనా ప్రతపక్షాల కుట్రా..?. దాచేపల్లి పట్టణంలో చంద్రబాబు డబ్బులు పంపితే మద్యం పంచుతూ ఒకరిద్దరు టీడీపీకి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం..?. దాచేపల్లి పట్టణానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పాలి అని ప్రశ్నిస్తే ఇంతవరకు జవాబు లేదు. దమ్ము, ధైర్యం గురించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం పుష్కలంగా ఉండబట్టే కదా 2019లో పోరాటాలు చేసి గెలిచింది. రాష్ట్రంలో ఏ ఎలక్షన్‌కి వెళ్లిన వైఎస్సా్ర్సీపీనే గెలుస్తుంది అంటే ప్రజల మనసుల్లో మా పార్టీ పదిలంగా ఉంది అని అర్థం. 1996 నుంచి ఎన్నికల్లో డబ్బులు పంచే సంస్కృతిని చంద్రబాబే తీసుకువచ్చాడు. డబ్బులు పంచే సంస్కృతి ఈ రోజు యావత్తు రాష్ట్రాన్ని దహించివేస్తుంది. మేము పట్టుబట్టి దాచేపల్లి, గురజాలని మున్సిపాల్టీలుగా చేశాం. తెలుగుదేశం నాయకులు కోర్టులకు వెళ్లి ఎన్నికలు ఆపాలని చూశారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు' అంటూ కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: (అసలు లోకేష్‌కు ఎయిడెడ్ విద్యాసంస్థలంటే ఏంటో తెలుసా..?: ఆదిమూలపు సురేష్) -
ఆయనెవరో నాకు తెలీదు.. చంపితే మాకేం వస్తుంది!
సాక్షి, గుంటూరు : దీక్ష చేస్తున్న వంగవీటి రంగాను నడిరోడ్డుపైన హత్య చేసిన చరిత్ర చంద్రబాబుదని గురజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనలో జరిగిన హత్యలన్ని ఆయన ప్రేరేపించాడని భావించాలా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయటం మంచిది కాదని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంగళవారం జిల్లాలో మాట్లాడుతూ.. తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తున్నారని తెలిపారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారని, విచారణలో అసలు విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కఠినంగా ఉన్నారని, తెలుగుదేశం నాయకుడు అంకులు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను ఆయనను చూడలేదన్నారు. ఆయన్ను చంపితే మాకేం వస్తుందని, ఈ హత్య కేసులో ఎంతటి వారున్నా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. చదవండి: కూల్చే సంస్కృతి టీడీపీదే: జయరామ్ తెలుగుదేశం నాయకులు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఇంత గొప్పగా ఉంటుందని తెలుగుదేశం నాయకులు ఊహించలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజల దృష్టి మళ్లించడానికే టీడీపీ శవ రాజకీయాలు, దేవాలయాలపై దాడులు చేపిస్తోందన్నారు. యరపతినేని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నాలుగైదు హత్యలు జరిగాయని, అంటే వాటిని ఆయన చేయించాడా అని సూటిగా ప్రశ్నించారు. యరపతినేని నరేంద్ర హత్య కేసులో ముద్దాయి అన్న సంగతి మర్చిపోయాడా అని నిలదీశారు. కాగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు ఆదివారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. -
అభివృద్ధి పథంలో గురజాల
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. గురజాల నియోజకవర్గంలో కూడా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేపడుతున్న పనులకు విశేష ఆదరణ లభిస్తోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే నియోజకవర్గానికి ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల, పిడుగురాళ్లలో ప్రతి ఇంటికీ త్రాగునీరు, గ్రామాల్లో సీసీ రోడ్లు.. వంటి పథకాలు మంజూరు అయ్యేలా చేశారు. ఇలా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన చేస్తున్న కృషిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న జననేత సీఎం వైఎస్ జగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా సొంత ఇల్లు లేని 19 వేల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ► రూ. 350 కోట్లతో ఆసుపత్రితో కూడిన వైద్య కళాశాల.. తన అదే బాట కార్యక్రమంలో భాగంగా కాసు మహేష్‌రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక గర్భిణీ కాన్పు కొరకు సుమారు 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందడం ఆయనను కలచివేసింది. ఆ సమయంలో ఆయన మదిలో మెదిలిన ఆలోచనే ఈ ఆసుపత్రి తో కూడిన వైద్య కళాశాల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పల్నాడు లోని ఏ ఒక్కరూ వైద్యం అందక ఇబ్బంది పడకూడదనే కృత నిశ్చయంతో తన మొదటి ప్రాధాన్యత క్రింద ఈ విషయాన్ని జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం వైఎస్ జగన్.. మొదటి బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయడమే కాక, పరిపాలనా పరమైన అన్ని ఆమోదాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి శ్రావణ మాసంలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా భూమి పూజ చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ► రూ. 2650 కోట్లతో 7 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్‌రెడ్డి ఆయన తాత దివంగత సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి నమ్మిన జలం జనానికి జీవనమనే సిద్ధాంతాన్ని అనుసరించి ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గుంటూరు, ప్రకాశం జిల్లాల ప్రజల కోసం బ్రహ్మానందరెడ్డి సాధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాగునీరు అందించే విషయంలో సఫలీకృతం అయింది. అయితే త్రాగునీరు విషయంలో పల్నాడు నియోజకవర్గాలైన మాచర్ల, గురజాలతోపాటు వినుకొండ, చిలకూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుండటంపై మహేష్‌రెడ్డి దృష్టిసారించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినప్పటికీ.. మహేష్‌రెడ్డి ఇందుకు సంబంధించి తానే స్వయంగా ఒక ప్రణాళిక రూపొందించారు. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణదేవరాయలతోపాటు మిగిలిన ఆరుగురు శాసససభ్యులను కలుపుకుని ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా సమస్య తీవ్రతను వివరించి సీఎం జగన్ అభినందనలు కూడా పొందారు. అలాగే తాను కోరిన పథకానికి కావాల్సిన ఆర్థిక, పరిపాలన పరమైన అన్ని అనుమతులు అందుకున్నారు. ► రూ. 34 కోట్లతో డ్రెయినేజీ నిర్మాణం.. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో రహదారుల తర్వాత మురుగు కాల్వల నిర్మాణం ప్రధానమైనది. ఈ నేపథ్యంలో మురుగు నీటి వ్యవస్థ క్రమబద్దీకరణ ఆవశ్యకతను మహేష్‌రెడ్డి గుర్తించారు. రహదారి నిర్మాణం జరిగే ప్రతి చోటా రహదారి ఇరువైపుల మురుగు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు కాల్వల నిర్మాణం కొరకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ వారితో అంచనాలు తయారు చేయించారు. రూ. 34 కోట్లతో అవసరమైన ప్రతి గ్రామంలో మురుగు నీటి పారుదల వ్యవస్థ ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నారు. ► రూ. 140 కోట్లతో పిడుగరాళ్ల పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీరు.. మహేష్‌రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో పిడుగురాళ్ల నగర పంచాయతీగా మార్పు చెందింది. అయితే పిడుగరాళ్ల పట్టణంలోని ప్రజలు త్రాగునీరు కొరకు విపరీతమైన ఇబ్బందులు పడటాన్ని తన అదే బాట కార్యక్రమంలో మహేష్‌రెడ్డి ప్రత్యక్షంగా గమనించారు. ఈ విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ముఖ్యంగా తాగునీరు తెచ్చుకునే సమయంలో మహిళలు పడుతున్న అవస్థలను సీఎం వైఎస్ జగన్‌కు మహేష్‌రెడ్డి వివరించారు. దగ్గరలోని బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నేరుగా పిడుగురాళ్ల పట్టణానికి త్రాగు నీరందించే పథకానికి యుద్ధ ప్రాతిపదికన అంచనాలు తయారు చేయించి వాటికి సీఎం జగన్‌ను మెప్పించారు. రెండవ అసెంబ్లీ సమావేశాల్లోనే నిధులు మంజూరు చేయించడమే కాకుండా త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభ కార్యక్రమం జరపటానికి ప్రయత్నం చేస్తున్నారు. ► రూ. 55 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నిర్మాణం.. గత ప్రభుత్వం గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను అందించటం లో పూర్తిగా విఫలమైన విషయాన్ని తన అదే బాట కార్యక్రమంలో కాసు మహేష్‌రెడ్డి నిశితంగా గమనించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ అంతర్గత రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన ప్రతి గ్రామంలో.. కులాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా 55 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి అంకురార్పణ చేయటం జరిగింది. ► మున్సిపాలిటీలుగా గురజాల, దాచేపల్లి గ్రామాలు గురజాల, దాచేపల్లి ప్రజల చిరకాల కోరిక ఆ రెండు గ్రామాలు మున్సిపాలిటీలుగా మార్పు చెందటం. ఈ మేరకు తన ఎన్నికల ప్రచారంలో కాసు మహేష్‌రెడ్డి ఆ రెండు గ్రామాలను మున్సిపాలిటీలుగా మారుస్తానని వాగ్దానం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో గురజాల, దాచేపల్లి గ్రామాలను మున్సిపాలిటీలుగా మార్చటం ద్వారా కాసు మహేష్‌రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆ రెండు గ్రామాల ప్రజల ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమయ్యారు. -
గురజాల కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు
సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి హత్య కేసులో నలుగురికి మరణశిక్ష విధిస్తూ 2018లో గుంటూరు జిల్లా, గురజాల పదో అదనపు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఆ నలుగురు నిర్దోషులని ప్రకటించింది. ఇతర ఏవైనా కేసుల్లో వీళ్ల అవసరం లేకుంటే, వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. కాలిబాటకు సంబంధించిన వివాదంలో గుంటూరు జిల్లా, తంగేడ గ్రామానికి చెందిన సైదా అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన గాదెరిపల్లె సుభాని, పెదజాన్, మౌలాలి, మహ్మద్ కత్తితో పొడిచి చంపారన్న ఆరోపణలపై దాచేపల్లి పోలీసులు 2011లో కేసు నమోదు చేశారు. 2012లో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ జరిపిన గురజాల పదో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు.. సుభాని తదితరులు సైదాను హత్య చేశారని నిర్ధారిస్తూ 2018లో మరణశిక్ష విధించింది. అదే సమయంలో మరణశిక్ష పడ్డ దోషులు నలుగురు కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.సురేశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. హతుడిని ఈ నలుగురు వ్యక్తులు చంపుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరన్నారు. అరుదైన, హేయమైన కేసుల్లోనే మరణశిక్ష విధిస్తారని నివేదించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసు మరణశిక్ష విధించదగ్గ కేసు కాదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మృతుడు సైదాతో ఆ నలుగురు వ్యక్తులకు ఏవో వివాదాలు ఉన్నంత మాత్రాన అతనిని వారే హత్య చేశారని చెప్పడానికి ఏ మాత్రం వీల్లేదంది. గురజాల కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. -
రాత్రి దాడులు.. పొద్దున్న రాజీలు..!
సాక్షి, గుంటూరు: రాత్రి పూట ఇష్టానుసారం దాడులకు తెగబడటం.. పొద్దున్నే పోలీసుల ద్వారా రాజీలకు పంపడం.. టీడీపీ నేతల తీరిది. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారనే అక్కసుతో ఎస్సీ, ముస్లిం మైనార్టీ వర్గాలే టార్గెట్‌గా దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతలు విచక్షణా రహితంగా దాడులకు తెగబడుతుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు శాంతి కమిటీల పేరుతో వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరువర్గాలపై కేసుల నమోదు పేరుతో హడావుడి చేసి, ఇరువర్గాల పెద్దలను పిలిపించి రాజీ కుదిర్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి. పోలింగ్ నిలిపేశారంటూ గ్రామస్తులు తిరగబడితే మాత్రం హత్యాయత్నం కేసులు నమోదు చేస్తూ పోలీసుస్టేషన్లకు లాక్కెళుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పోలీసులు పక్షపాత ధోరణి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. గుంటూరు జిల్లాలో ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల కళ్లెదుటే దౌర్జన్యకాండ జిల్లాలో ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఓటమి భయంతో టీడీపీ నేతలు రెచ్చిపోతూ అరాచకాలకు, దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే టార్గెట్‌గా పోలీసుల ఎదుటే వీరంగం వేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. తమకు ఓట్లు వేయలేదనే అక్కసుతో ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీ నేతలు గురజాల పట్టణంలోని ముస్లింల ఇళ్లపై విచక్షణా రహితంగా దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేశారు. మూడు గంటల పాటు గురజాల పట్టణంలో తిరుగుతూ విధ్వంస కాండకు పాల్పడ్డారు. ఇదంతా అక్కడి సీఐ రామారావు సమక్షంలోనే జరగడం గమనార్హం. డీఎస్పీ హెడ్‌క్వార్టర్ అయిన గురజాల పట్టణంలో మూడు గంటలపాటు రోడ్లపై కత్తులు, రాడ్లు, కర్రలతో టీడీపీ నేతలు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు అడ్డుకున్న దాఖలాలు లేవంటే వీరు టీడీపీ నేతలకు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నారో అర్థమవుతోందని బాధితులు వాపోతున్నారు. ఎట్టకేలకు ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు తీసుకుని రెండు కేసులు నమోదు చేశారు. అయితే విధ్వంసం సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా శాంతి కమిటీల పేరుతో రాజీ అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇంత దారుణ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా ఏ ఒక్కరినీ అరెస్టు చేసిన దాఖలాలు లేవు. దాడులు చేస్తే కేసులు పెట్టరా? పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్న ఎస్సీ వర్గీయులను టీడీపీ నేతలు అడ్డుకుని దాడులకు యత్నించారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేస్తారా అంటూ దూషిస్తూ తరుముకుంటూ వెళ్లారు. కర్రలు, రాడ్లతో వీరంగం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో ఎస్సీ మహిళలంతా అంబేడ్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగినప్పటికీ టీడీపీ నేతలు వెనక్కు తగ్గలేదు. ఇదిలా ఉండగా ఎస్సీలపై దాడికి దిగిన టీడీపీ నేతలపై కేసు నమోదు చేయని పోలీసులు సోమవారం రాత్రి ఇరువర్గాల పెద్దలతో రాజీ కోసం తెరతీసినట్లు సమాచారం. ఇరువర్గాలతో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు. నిజంగా పోలీసులకు గ్రామాల్లో శాంతిని నెలకొల్పాలనే ఉద్దేశమే ఉంటే దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తేనే వారు భవిష్యత్‌లో దాడులకు దిగకుండా భయం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. పోలింగ్ సమయంలో బూత్‌లోకి వెళ్లి రెండు గంటలపాటు తలుపులు మూసుకుని ఉద్రిక్తతకు కారణమైన స్పీకర్ కోడెలపై కేసు నమోదు చేయకుండా, అది తప్పు అని చెప్పినా వినకపోవడంతో తిరగబడిన గ్రామస్తులపై మాత్రం హత్యాయత్నం కేసు నమోదు చేసి వేధింపులకు గురిచేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు: జిల్లాలోని గురజాలలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అనుచరులు మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావుకు చెందిన క్వారీ ఆక్రమణకు సంబంధించి ఆయన కుమారుడు ఆదినారాయణ, యరపతినేని శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దీంతో యరపతినేని అనుచరులు ఆదినారాయణపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతల అమానుష ప్రవర్తనతో మనస్తాపానికి లోనైన ఆదినారాయణ ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆదినారాయణ సోదరుడు కోటి మీడియాతో మాట్లాడుతూ.. యరపతినేని వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. యరపతినేని తమ క్వారీని బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. యరపతినేని ఆరాచాకాలపై పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా టీడీపీ నేతలు అతనిపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతలు చికెన్ బాబు మరికొందరితో కలిసి కోటిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం
-
టీడీపీ నేతల వల్లే వేధింపులు
-
గురజాల పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
-
అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..?
సాక్షి, గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో కిందిస్థాయి ఉద్యోగులను బలి చేసే కుట్ర జరుగుతోందని అధికారులు వాపోతున్నారు. అక్రమ మైనింగ్‌లో ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేసి.. అక్రమ సున్నపురాయి క్వారీల కేసును ప్రభుత్వం నీరుగార్చేందుకు పావులు కదుపుతోందని వారు అంటున్నారు. ఈ కేసు నుంచి ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించడానికి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని వారు చెప్తున్నారు. అక్రమ మైనింగ్ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మైనింగ్ అక్రమాలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ నలుగురు తహశీల్దార్లు, ఐదుగురు వీఆర్వోలు, ఐదుగురు గ్రామ కార్యదర్శులకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. కిందిస్థాయి ఉద్యోగుల్ని బదిలీ చేసి అక్రమాలకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇవ్వాలని భావిస్తోందని, అందుకే కిందిస్థాయిలో ఉన్న తమను టార్గెట్ చేస్తున్నారని ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన రాజకీయ నేతలు, వారికి సహకరించిన ఉన్నత అధికారులపై చర్యలు తీసుకోకుండా.. తమను లక్ష్యంగా చేసుకోవడంపై వారు మండిపడుతున్నారు. -
పోలీసుల అదుపులో తప్పించుకున్న ఖైదీ
గురజాల (గుంటూరు) : భార్యను చంపిన కేసులో ముద్దాయిగా ఉండి మూడు సంవత్సరాలు శిక్ష అనుభవించిన అనంతరం పేరోల్ పై బయటకు వచ్చి అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా దుర్గి మండలం కంచరకుంట గ్రామంలో చోటుచేసుకుంది. గుంటూరుకు చెందిన కొప్పుల యోగయ్య(45) 1990 నవంబర్ 26న భార్యను హత్య చేశాడు. దీంతో గుంటూరు కోర్టు 1991లో అతనికి జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసింది. అప్పటి నుంచి మూడేళ్ల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించిన యోగయ్య 1994 జూలై 6న పేరోల్ పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా.. కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. యోగయ్య దుర్గి మండలం కంచరగుంటలో నివాసముంటున్నాడనే సమాచారం అందడంతో.. జైలర్ తన సిబ్బందితో రంగంలోకి దిగి అతన్ని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. -
అనుమానం పెనుభూతమై..
- మాడుగులలో భార్యను చంపిన భర్త - జమ్మలమడకలో కొడవలితో భార్య గొంతు కోసిన భర్త - తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు అనుమానం రెండు సంసారాల్లో చిచ్చుపెట్టింది. భార్యను శంకించి ఒకరేమో కొడవలితో గొంతు కోశాడు. ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మరో ప్రబుద్ధుడు సుత్తితో భార్య తలపై మోది హత్య చేశాడు. ఈ రెండు ఘటనలు పల్నాడులోని మాచర్ల, గురజాల మండలాల్లో జరిగాయి. బాధితులు ఇద్దరూ గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన ఆడపడుచు, కోడలు కావడం విషాదకరం. గురజాల: అనుమానంతో భార్యను కడతేర్చిన ఘటన మండలంలోని మాడుగులలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురజాలకు చెందిన చిటిమాల మల్లమ్మ(38)కు మాడుగుల గ్రామానికి చెందిన పగిడిపల్లి సుందరరావుతో 17 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లమ్మ మాడుగుల గ్రామంలో అంగడీవాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. మల్లమ్మపై భర్త అనుమానం పెంచుకోవడంతో కుటుంబ కలహాలు పెరిగాయి. ఈ క్రమంలో ఏడాదిన్నరగా మల్లమ్మ పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ మాడుగులలో విధులు నిర్వర్తిస్తోంది. అనుమానంతో తన భర్త వేధిస్తున్నాడని గతంలో మల్లమ్మకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం సుందరరావు మాడుగులలోని అంగన్వాడీ కేంద్రం వద్దకు వెళ్లి.. మనస్పర్థలు మరిచి కలిసి ఉందామని మల్లమ్మకు నమ్మబలికాడు. అనంతరం ఇంటికి తీసుకువెళ్లి ఇనుప సుత్తితో తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఇంటిలోంచి మల్లమ్మ శవాన్ని బయట పడేసి, పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలాన్ని ఎస్‌హెచ్‌వో ఎం.రాజేష్‌కుమార్ సందర్శించి, వివరాలు సేకరించారు. మృతిరాలి తండ్రి చిటిమాల వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. జమ్మలమడకలో భార్య గొంతు కోసిన భర్త మాచర్ల టౌన్: అనుమానంతో భార్య గొంతు కోసి, హతమార్చేందుకు ఓ ప్రబుద్ధుడు ప్రయత్నించిన ఘటన మండలంలోని జమ్మలమడక గ్రామంలో గురువారం జరిగింది. ఆస్పత్రిలో బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలేటి విక్రమ్‌కు గురజాల మండలం మాడుగులకు చెందిన సౌజన్యతో ఏడేళ్ల కిందట వివాహమైంది. ఇటీవల సౌజన్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న విక్రమ్ తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం భార్యతో గొడవపడ్డాడు. మాటమాట పెరగడంతో ఇంట్లో ఉన్న కొడవలితో సౌజన్య గొంతు కోసేందుకు విక్రమ్ యత్నించాడు. ఆమె ప్రతిఘటించి చేతులను అడ్డుపెట్టుకోవడంతో తెగాయి. చేతులు పక్కకు తీయగానే గొంతు కోశాడు. గొడవను గమనించి భయపడిన వారి కుమారుడు వినయ్‌కుమార్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో విక్రమ్ అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడి ఉన్న సౌజన్యను చికిత్స కోసం పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ ఎస్ఐ సోమేశ్వరరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి సౌజన్య నుంచి వివరాలు సేకరించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.