టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం | Yarapathineni Srinivasa Rao Followers Attacks Former MLA Family | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం

Published Sun, Feb 17 2019 2:49 PM | Last Updated on Sun, Feb 17 2019 3:19 PM

Yarapathineni Srinivasa Rao Followers Attacks Former MLA Family - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లాలోని గురజాలలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ అనుచరులు మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావుకు చెందిన క్వారీ ఆక్రమణకు సంబంధించి ఆయన కుమారుడు ఆదినారాయణ, యరపతినేని శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దీంతో యరపతినేని అనుచరులు ఆదినారాయణపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతల అమానుష ప్రవర్తనతో మనస్తాపానికి లోనైన ఆదినారాయణ ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనపై ఆదినారాయణ సోదరుడు కోటి మీడియాతో మాట్లాడుతూ.. యరపతినేని వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. యరపతినేని తమ క్వారీని బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. యరపతినేని ఆరాచాకాలపై పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా టీడీపీ నేతలు అతనిపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతలు చికెన్‌ బాబు మరికొందరితో కలిసి కోటిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement