yarapathineni srinivasa rao
-
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
-
యరపతినేని శ్రీనివాసరావుకు ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే తక్షణమే తప్పుకుంటా
-
లక్షల టన్నుల సున్నపు రాయి అక్రమంగా తవ్వి తరలించేసిన యరపతినేని
-
నీకు ఉరి శిక్ష పడేలా చేస్తా...టీడీపీ నేతకు వార్నింగ్..
-
ఈ హత్యకు కారణం ఆయనే..!
-
గురజాల నియోజకవర్గంలో టీడీపీ శవ రాజకీయాలు: ఎమ్మెల్యే కాసు
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో టీడీపీ శవ రాజకీయాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. మైనింగ్ గుంటలో పడి ప్రమాదవశాత్తు నలుగురు బాలురు చనిపోయారు. గురజాలలో జరగబోయే లోకేష్ సభకు వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చెప్పాలని చనిపోయిన ఇద్దరు బాలురు కుటుంబ సభ్యులపై యరపతినేని ఒత్తిడి చేస్తున్నాడని ఎమ్మెల్యే కాసు ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా లోకేష్ దగ్గర చెప్తే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానంటూ యరపతినేని శ్రీనివాసరావు ప్రలోభాలు పెడుతున్నారని కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: Viveka Case: ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ విశ్లేషణాత్మక కథనం–2 -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరాచకం.. మహిళా వాలంటీర్‌ను నిర్బంధించి..
సాక్షి, గుంటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు రెచ్చిపోయారు. మహిళా వాలంటీర్‌ను యరపతినేని కుటుంబ సభ్యులు బంధించారు. మ్యాపింగ్ చేసేందుకు వెళ్లిన మహిళా వాలంటీర్ షేక్ ఎస్మావుల్ వెళ్లగా ఆమెను మూడు గంటల పాటు నిర్భందించి భయబాంత్రులకు గురిచేశారు. ఈ క్రమంలో మహిళా వాలంటీర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యాపింగ్ చేయడానికి నిన్న(మంగళవారం) సాయంత్రం 6.30గంటలకు వాళ్ల ఇంటికి వెళ్లాను. అన్ని విషయాలు మాట్లాడారు. వారితో అన్ని వివరాలు మాట్లాడి ఇంటికి వెళ్తుండగా.. అపార్ట్మెంట్ సెక్యూరిటీకి ఫోన్ చేసి మళ్లీ ఇంట్లోకి పిలిచిపించారు. నేను మళ్లీ పైనకి వెళ్లడంతో మేడం వాళ్ల తమ్ముడి మాతో వాగ్వాదానికి దిగి నిర్భందించారు. రాత్రి 9 తర్వాత మళ్లీ విడిచిపెట్టారు. ఇంట్లో నుంచి కాల్స్ వచ్చినా నన్ను వాళ్లు విడిచిపెట్టలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే బాబుకు ఈ భయమంతా’
తాడేపల్లి: ఓటుకు నోటు, బెల్టు షాపులు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడేనని మండిపడ్డారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేవ్రెడ్డి. అసలు రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబని మహేశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ‘2024లో బాబుకు రిటైర్మెంట్ ఖాయం. వృద్దాప్యంలోనైనా గౌరవంగా బతకండి. వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ అనే సర్వేలతో బాబు వెన్నులో వణుకు. ఆనాడు మద్యపాన నిషేదం ఎత్తేసింది చంద్రబాబు కాదా..? , మీ బాబు తెచ్చిన మద్యం బ్రాండ్లే నేటికీ ఉన్నాయి..తెలుసుకో యరపతినేని. లోకేశ్ స్టాన్‌ఫర్డ్ చదువుకు డోనేషన్ కట్టింది ఎవరో లోకానికి తెలియదా..?, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకేంటి..? అది చంద్రబాబు ప్రచారమే’ అని విమర్శించారు. కాసు మహేశ్ రెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే: వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందనే బాబుకు ఈ భయమంతా..!: యరపతినేని ఒక నీతి జాతి లేని నాయకుడు మాట్లాడినట్లు చిల్లరగా మాట్లాడుతున్నాడు. పేస్ యరపతినేనిది...బ్యాక్‌గ్రౌండ్ చంద్రబాబుది...ఈ గుంట నక్క రాజకీయాలు ఎన్నిరోజులు..? చంద్రబాబు మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, అమెరికాలో ఉంటున్న మహిళలతో పోస్టులు పెట్టిస్తున్నాడు. ఎన్ని రోజులు ఈ రాజకీయాలు...ఎందుకింత భయపడుతున్నాడు..? టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేలు వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని చెప్తుంటే ఈయన భయపడిపోయి ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన చేసిన తప్పులన్నీ జగన్ గారికి ఆపాదిస్తూ ఏదంటే అది మాట్లాడిస్తున్నాడు..మాట్లాడుతున్నాడు. ఒకడు లిక్కర్ అంటాడు...ఒకడు సిమెంట్ అంటాడు. అసలు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి ఉందా...? మద్యపాన నిషేదం పెడితే ఎత్తేసింది చంద్రబాబు కాదా..? ఇంటింటికీ లిక్కర్ పథకాన్ని పెట్టింది చంద్రబాబు కాదా..? దేశంలోనే మొట్టమొదటి సారిగా బెల్టు షాపులు పెట్టి వైన్ షాపులకు టార్గెట్లు ఇచ్చిన నాయకుడు చంద్రబాబే. మాట్లాడితే లిక్కర్లో జే టాక్స్ అంటారు...250 బ్రాండ్లను రాష్ట్రంలోకి తెచ్చింది చంద్రబాబే. చంద్రబాబు పెట్టిన డిస్టిలరీలే నేటికీ వ్యాపారం చేస్తున్నాయి. ఆదికేశవులనాయుడిది డిస్టిలరీ లేదా..? ఆయన టీడీపీ కాదా..? తాను డిస్టిలరీని అమ్మేసుకున్నాను అని అయ్యన్నపాత్రుడు మొన్నీ మధ్య చెప్తున్నాడు...ఆయన టీడీపీ నేత కాదా..? యనమల రామకృష్ణుడు వియ్యంకుడు టీడీపీ నేత కాదా..? ఎస్పీవై రెడ్డి వైఎస్సార్సీపీలో గెలిస్తే ప్రమాణ స్వీకారం చేయకముందే లాగేసుకుని ఆయన చేత డిస్టిలరీ పెట్టించింది చంద్రబాబే. ఈ రోజుకీ చంద్రబాబు పెట్టిన బ్రాండ్లే రాష్ట్రంలో నడుస్తున్నాయి. వీళ్లు చెప్తున్న భూమ్ భూమ్ బ్రాండు, వివిధ రకాల మెడల్స్ వారి హయాం నుంచి వస్తున్నవే. ఆనాడు ఆ సంస్థల వద్ద లంచాలు తీసుకుని వాటికి అనుమతులు ఇచ్చింది మీరే కదా. చేసిన తప్పంతా మీరు చేసి మాపై రుద్దాలనుకుంటే ఎలా..?: చేసిన తప్పంతా మీరు చేసి ఆ బురదంతా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి పుయ్యాలంటే ఎలా..? ప్రజలు ఇవన్నీ తెలుసుకోలేని అమాయకులా..? చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు అన్నట్లుంది చంద్రబాబు తీరు. సిమెంట్ సంస్థలు ముఖ్యమంత్రి గారికి లంచాలు ఎందుకిస్తారు..? ఈ రాష్ట్రంలో అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గతంలో 2014–19 మధ్య ధరలు 10–15శాతం పెరిగాయి... ఈ రోజు అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరిగి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగాయి. ఒక్క సిమెంట్ ధరలే కాదు స్టీల్ ధరలు కూడా పెరిగాయి. బహుశా ఆ తప్పులన్నీ వాళ్లే చేశారేమో..? అందుకే ఇవన్నీ మాపై ఆపాదిస్తున్నారు. ప్రజలకు అంతా తెలుసు..ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఎవరు...మాట తప్పింది ఎవరు అనేది వారు గమనిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్ గారి నాయకత్వంలో 99 శాతం మేనిఫెస్టో ను అమలు చేశాం. నువ్వేదో విలువలు కలిగిన నాయకుడి ఫోజులెందుకు చంద్రబాబూ..?: ఎందుకీ కుటిలరాజకీయాలు..ఆలా ఎన్ని రోజులు చేస్తారు..? చంద్రబాబునే నేరుగా వచ్చి మాట్లాడమనండి...ఆ బూతులేవో తానే మాట్లాడమనండి. ఎందుకీ నాటకాలు..? ముందొక మాట..వెనకొక మాట. ఆయనేదో పెద్ద విలువలు కలిగిన నాయకుడిలా ఫోజులెందుకు..? ఈ దేశంలోనే రాజకీయాలను బ్రష్టు పట్టించింది చంద్రబాబే. ఓటుకు నోటును తీసుకొచ్చింది చంద్రబాబు. ఎన్టీఆర్ చనిపోయిన నాడు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ఓటుకు యాభై రూపాయలు అనే విధానాన్ని ప్రవేశపెట్టింది చంద్రబాబే. ఈ రోజు రాజకీయ వ్యవస్థలో ఓటుకు నోటు ఒక క్యాన్సర్‌లా మారింది. మీడియాను, వ్యవస్థలను వాడుకోవడం, వారికి ప్రలోభాలు పెట్టడం వల్ల మిమ్మల్ని గత ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. మళ్లీ ఇక గెలవలేమనే ఫ్రస్టేషన్‌తో నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. చిన్నవయసులో ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ..కేంద్రంతో మంచి రిలేషన్స్ నడుపుతూ ముందుకు వెళ్తూ నిధులు తీసుకొస్తున్నారు. అది తట్టుకోలేక అక్కసుతో, కుళ్ళుతో చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడు. సొంత బలంతో నిలబడగలుగుతాడా అంటే అదీ ఆయనకు చేతకాదు. ఆ రోజు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 270 సీట్ల వరకూ ఉన్నాయి. ఈ రోజు తెలంగాణాలో జీరో...అక్కడ పోటీ చేసే దిక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ 175 సీట్లలో సొంతంగా పోటీ చేయలేని దుస్థితి. పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీ కావాలి..కమ్యూనిస్టులు కావాలి... ఇదీ ఈ రోజు టీడీపీని చంద్రబాబు ఈ స్థాయికి దిగజార్చాడు.. సొంత బలంలో జగన్ గారు ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా తన రాజకీయాన్ని మొదలు పెట్టి 151 సీట్లు, 50 శాతం ఓట్లు సంపాదించాడు. 90 శాతం ఎంపీటీసీ, సర్పంచ్‌లు, జడ్పీటీసీలు వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఎక్కడ చదివామన్నది కాదు..ఎంత సంస్కారం ఉందనేది ముఖ్యం: జగన్ చదువులు గురించి కూడా విచిత్రంగా మాట్లాడుతున్నారు. జగన్ చదివింది బేగంపేటలో కాదా..? పది వరకూ కష్టమైన ఐసీఎస్సీ సిలబస్ చదివారు. ఇంటర్ ఐఎస్సీలో చదివారు. డిగ్రీ చదివారు. ఎంబీఏ చేశారు. మాట్లాడితే నీ డిగ్రీ ఎక్కడ అని అడుగుతున్నారు. లోకేశ్ స్టాన్‌ఫర్డ్‌లో చదివాడట...ఆయన టెన్త్ క్లాస్, ఇంటర్ వివరాలు తీయమనండి. చదువు రాక నారాయణతో ట్రైనింగ్ ఇప్పించారు. సత్యం రామలింగరాజు వద్ద లంచంగా తీసుకుని అక్కడ ఫీజు కట్టారు. ఆ సీటు కూడా మెరిట్లో రాలేదు...డొనేషన్ కడితే అక్కడ సీటు వచ్చింది. దానికేదో లోకేశ్‌కు డాక్టరేట్ వచ్చినంత బిల్డప్‌లు ఇస్తున్నారు. అయినా ఎక్కడ చదివామనేది కాదు...సంస్కారం, బుద్ధి, నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయనేది ముఖ్యం. సొంత బలంతో జగన్ గారు 151 సీట్లు గెలుచుకున్నాడు...మా ఖర్మ లోకేశ్ ఆయనతో పోటీ పెట్టుకుంటాడు. ప్రజాస్వామ్యంలో సమాధానం చెప్పాలి కదా..? అదీ మా ఖర్మ ఏం చేస్తాం. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి అడ్డదారిలో లోకేశ్ మంత్రి అయ్యాడు. లోకేశ్ తన ఎమ్మెల్యే సీటు తాను గెలవలేడు..ఆయనకు మాతో పోటీ అట. ఆయన పాదయాత్ర చేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులు భయపడుతున్నారట..నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు. ప్రశాంతతకి, ప్రశాంతి అత్తకి తేడా తెలియని వాడికి వైఎస్సార్సీపీ భయపడుతోందట... ఈ రోజు ఏదో సర్కస్‌లా లోకేశ్ పాదయాత్ర నడుస్తోంది...దాన్ని చూసి మాకు నిద్ర పట్టడం లేదనడం హాస్యాస్పదం. ఈ రోజు ధైర్యంగా ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్తున్నారు..గడచిన కాలంలో ఏనాడైనా జరిగిందా..? ఇంత ధైర్యంగా మేం జనం వద్దకు వెళ్తున్నామంటే వెనుకున్న జగన్ గారి బొమ్మ వల్ల..ఆయన చేసిన ప్రజారంజక పాలన వల్ల. మేనిఫెస్టో ఇచ్చి అదిరిందా తమ్ముళ్లూ..అంటున్నాడు..ఇదేమన్నా రికార్డింగ్ డాన్సా..?: జగన్ పథకాలు జిరాక్స్ తీసి ప్లస్ వన్ అని యాడ్ చేసుకుని మొన్న చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారు. పక్క రాష్ట్రాల్లో ఇస్తున్న పథకాలను కాపీ కొట్టి ప్రకటిస్తాడు.. మళ్లీ అదిరిందా తమ్ముళ్లూ అంటాడు..అదేమన్నా రికార్డింగ్ డాన్సా అదిరిపోడానికి..? అక్కడున్న టీడీపీ వాళ్లే జగన్ గారే పథకాలే మనం చెప్తుంటే ఇక మనకెవరు ఓట్లు వేస్తారని అనుకున్నారట. అదే స్టేజ్ మీద కూర్చుని లోకేశ్ మాలోకం లెక్కలేస్తున్నాడట..ఇంత డబ్బు ఎలా తెస్తాం అని ఆందోళన చెందుతున్నాడట. ఖర్మ కాలి అధికారంలోకి వస్తే లక్ష కోట్లు ఎక్కడనుంచి తెస్తాం అని చంద్రబాబును అడిగాడట. చంద్రబాబు పిచ్చోడా..ఇచ్చేదైతే కదా లెక్కలు కట్టడానికి అని లోకేశ్‌కి చెప్పాడట. వీళ్లు జగన్ గారి నిబద్ధతను, ఆయన్ను విమర్శించడం విడ్డూరంగా ఉంది. పనీ పాటా లేకుండా బూతులు మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారు. మా నాయకుడిపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేదే లేదు: అనైతికంగా జగన్ గారిని, భారతి రెడ్డి గారిని ఏది నోటికొస్తే అది మాట్లాడతున్నారు. ధైర్యముంటే చెప్పండి...ఈ పథకం ఇవ్వలేదని, ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయాడని చెప్పగలరా..? మెరుగైన రాజకీయం కోసం ఒక్క సలహా ఇవ్వలేరు. కేవలం తమ చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయంటే ఎలా పడితే అలా మాట్లాడటం, అభూత కల్పనలుచేయడం టీడీపీ వారికి అలవాటుగా మారింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చి వాళ్లు కాదు. ఎవరేం చేస్తున్నారో అన్నీ చూస్తున్నారు. ఒక్క తొమ్మిది నెలలు ఆగండి...151 కాదు ఈసారి 175 సీట్లు జగన్ గారు కైవసం చేసుకుంటారు. అప్పుడే వీళ్లకి బుద్ధి వస్తుంది...అప్పటి వరకూ వీళ్ల బతుకులు ఎవరూ మార్చలేరు. జగన్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రతి కార్యకర్త స్పందిస్తాడు. వయసు పెద్దదైంది..గౌరవంగా బతకండి...రేపు ఎన్నికల తర్వాత ఎలాగూ రిటైర్ అవుతారు. కనీసం రిటైర్మెంట్ అయ్యేటప్పుడైనా గౌరవంగా అవ్వండి అని ఉచిత సలహా ఇస్తున్నా. రాజకీయాల్లో వచ్చేటప్పుడు ఎంత గౌరవంగా వచ్చామో అంతే గౌరవంగా రిటైర్ అవ్వాలి. అలా జరగాలంటే అవతలి వారికి గౌరవం ఇస్తే మీకు గౌరవం దక్కుతుంది. మేం ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఏముంది..?: రెండేళ్ల నుంచి ముందస్తు అనే చెప్తున్నారు. వాళ్లకి భయం పట్టుకుంది..వాళ్లకి కార్యకర్తలు నిలబడటం లేదు. ఇదిగో ఎన్నికలు వస్తున్నాయంటే ఆఫీసుల్లో జనం కనిపిస్తారని వారి భావన. అందుకే తమ పత్రికల్లో, టీవీల్లో వాళ్లే క్రియేట్ చేసి ముందస్తు రాగం పాడుతుంటారు. జగన్ ప్రధానిని కలవడానికి వెళ్లింది అనేక పథకాల గురించి.. పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై వెళ్లారు. ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, ప్రధాని కార్యాలయం కానీ...ఏమైనా చెప్పిందా. అసలు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలి..ప్రజలు ఐదేళ్లు పూర్తి విశ్వాసం జగన్ గారికి ఇచ్చారు. బ్రహ్మాండంగా ప్రభుత్వం నడుస్తోంది...ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఉన్న మాకు ముందస్తు ఎందుకు..? వారాహి యాత్ర మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎంత మైనస్ అయ్యాడో వాళ్ల పార్టీ వాళ్లనే అడగండి. ఒక రోజు ముఖ్యమంత్రి అంటాడు..ఒక రోజు కాదంటాడు.. ఆ బూతులేంటి..ఒక రోజు పొత్తు అంటాడు..మరో రోజు లేదంటాడు. పవన్ కళ్యాణ్ ఏంటో, ఆయన విధానాలేంటో అర్ధం కాక వారి పార్టీ నాయకులే తలపట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత జనంలో తిరిగితే అంత క్లారిటీ ప్రజలకు వస్తుంది. -
టార్గెట్ యరపతినేని.. టీడీపీలో హాట్ టాపిక్.. అసలేం జరుగుతోంది?
ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలకు ఒకప్పుడు యరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ నుంచి ఆరు సార్లు పోటీ చేసిన ఆయన మూడు సార్లు విజయం సాధించారు. 2014లో టీడీపీ విజయంతో గురజాలలో యరపతినేని అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పోలీసుల పోస్టింగ్లనుంచి మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియాల వరకు నేరాలకు నాయకత్వం వహించాడు. అన్నిటికీ తన ఇంటినే అడ్డాగా మార్చాడు. నియోజకవర్గంలోని లైమ్ స్టోన్, ముగ్గురాయి అక్రమ క్వారీయింగ్‌తో మైనింగ్ డాన్‌గా ఎదిగాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఐదువేల కోట్లకుపైగా సంపాదించాడనే ఆరోపణలున్నాయి. అయ్యగారు చేసిన అరాచకానికి గత ఎన్నికల్లో గురజాల ఓటర్లు గట్టి గుణపాఠం నేర్పారు. జనం కొట్టిన దెబ్బకు ఏడాదివరకూ యరపతినేని శ్రీనివాసరావు నియోజకవర్గంలో కనిపించలేదు. ఎన్నిక రాగానే హడావిడి ప్రజలకు కనిపించకపోతే ఎక్కడ ఉనికి కోల్పోతానో అన్న భయంతో అప్పుడప్పుడు గురజాల వచ్చి తెగ హడావుడి చేస్తున్నారు యరపతినేని శ్రీనివాసరావు. ఆయన ఎంత హడావుడి చేసినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి రెండు గ్రామాల్లో తప్ప నియోజకవర్గంలో ఎక్కడా పార్టీని గెలిపించలేకపోయాడు. పిడుగురాళ్ల మున్సిపాలిటీలో అయితే పోటీ చేసేందుకు ఒక్క అభ్యర్ది కూడా దొరకలేదు. దీంతో మున్సిపాలిటీలో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అయినా యరపతినేనికి బుద్దిరాలేదు. ఈసారి నేనే గెలుస్తా... మీ సంగతి తేలుస్తానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్ని రెచ్చగొడుతున్నారు. అయితే యరపతినేనికి ఇప్పుడు ఆయన పార్టీలోనే ఊహించని స్థాయిలో ఎదురుదెబ్బ తగిలింది. గురజాలకు చెందిన టీడీపీ నేత చల్లగుండ్ల శ్రీనివాస్ తెరపైకి వచ్చారు. యరపతినేనికి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ క్యాంపులతో నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేశారు. రెండుసార్లు చంద్రబాబును కలిసి యరపతినేనికి టికెట్ ఇవ్వద్దని, ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోవడం గ్యారెంటీ అని చెప్పారట. చిన వర్సెస్ పెద్ద యరపతినేని వ్యతిరేకులందరినీ కలిపి ఒకేతాటిపైకి తీసుకొచ్చి వ్యవహారం మొదలుపెట్టారు చల్లగుండ్ల శ్రీనివాస్. దీనికితోడు చంద్రబాబు కుటుంబానికి దగ్గరగా ఉన్న టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం కూడా యరపతినేనికి ఎర్త్ పెట్టడానికి చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా చినకమ్మ, పెద్దకమ్మ ఫీలింగ్ తీసుకొచ్చారు. యరపతినేని పెదకమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. డాక్టర్ చల్లగుండ్ల శ్రీనివాస్, నాదెండ్ల బ్రహ్మంలు చినకమ్మ వర్గానికి చెందిన నేతలు. నియోజకవర్గంలో చినకమ్మ వర్గం ఓటర్లు 23వేల వరకూ ఉంటే, పెదకమ్మ ఓటర్లు కేవలం రెండు వేలే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే.. తమ ఓట్లతో గెలిచి తమనే అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్న యరపతినేనిని ఎలాగైనా ఓడిస్తామంటున్నారు చిన్న కమ్మ వర్గం నాయకులు. అందుకే యరపతినేనితో ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు విసురుతున్నారు. యరపతినేనిపై తిరుగుబాటులో భాగంగానే నూతన సంవత్సర శుభాకాంక్షల పేరుతో గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్లలో చల్లగుండ్ల శ్రీనివాస్ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో ఎక్కడా యరపతినేని ఫొటో లేదు. ఇదే ఇప్పుడు గురజాల నియోజకవర్గంలోని టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్లెక్సీల వ్యవహారంతో ఆగ్రహించిన యరపతినేని వర్గీయులు రాత్రికి రాత్రే చల్లగుండ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మొత్తం పీకేయించారు. అంతటితో ఆగకుండా వాటి స్థానంలో యరపతినేని ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం నాయకుల మధ్య ఫ్లెక్సీల యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. చదవండి: ఏపీలో బీఆర్ఎస్.. ‘కారు’ సీన్ ఎంత?.. ఈ ప్రశ్నకు సమాధానమిదే.. యరపతినేని శ్రీనివాసరావుతో అమీతుమీ తేల్చుకునేందుకు చినకమ్మ సామాజికవర్గం నేతలందరూ ఏకమవుతున్నారు. గతంలో జనసేన తరపున పోటీ చేసిన చింతలపూడి శ్రీనివాసరావు కూడా రంగంలోకి దిగారు. ఇలా అందరూ యరపతినేనిని టార్గెట్ చేస్తూ అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారట. సొంతపార్టీ నేతలే తనపై తిరుగుబాటు చేస్తూ అధిష్టానం వద్ద పంచాయతీ పెట్టేందుకు రెడీ అవుతున్నారని తెలుసుకుని యరపతినేని వర్గీయులు తెగ హైరానా పడుతున్నారట. పచ్చ పార్టీలో యరపతినేని పరిస్థితి ఏమవుతుందో చూడాలి. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుడు, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచరులకు అక్రమ మైనింగ్ ఉచ్చు మెల్లమెల్లగా బిగుస్తోంది. అక్రమ మైనింగ్‌పై నమోదు చేసిన కేసుల విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దూకుడు పెంచింది. గుంటూరులోని యరపతినేని నివాసం, ఆఫీస్‌తో పాటు, దాచేపల్లి, నడికుడి, పిడుగు రాళ్లకు చెందిన నిందితుల ఇళ్లు, హైదరాబాద్ సహా 25 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులు చేపట్టారు. శాటిలైట్ సర్వే ద్వారా మైనింగ్ మాఫియా ఏ మేరకు సహజ వనరులను కొల్లగొట్టిందో అంచనా వేస్తామని వెల్లడించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీఐ 17 మందిపై కేసు నమోదు చేయగా నిందితుల్లో 13 మంది యరపతినేని బినామీలు, అనుచరులే. సీబీఐ లోతైన విచారణ దిశగా అడుగులు వేస్తుండటంతో మైనింగ్ మాఫియా, టీడీపీ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో సాక్ష్యాలతో హైకోర్టు ముందుంచిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో నడుస్తున్న అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి. కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు 2018లో అక్రమ మైనింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ చేపట్టి పిడుగురాళ్ళ మండలం సీతారామపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా కేవలం 31 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపురాయిని దోచేసినట్లుగా చూపారు. దీంతో తాము ఒడ్డున పడ్డామని మైనింగ్ మాఫియా ఊపిరి పీల్చుకుంది. అయితే అప్పట్లో అధికారులను మేనేజ్ చేసి దోచి, దాచేసిన లెక్కలు శాటిలైట్ సర్వే ద్వారా బయటపడనున్నాయి. టీజీవీ కృష్ణారెడ్డి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) ద్వారా సేకరించిన శాటిలైట్ సర్వే ప్రకారం కేసానుపల్లి, నడికుడిల్లో 2015 జూలై నుంచి 2017 జనవరి వరకూ, సీతారామపురంలో 2015 సెప్టెంబర్ నుంచి 2017 మార్చి నాటికి 68.53 లక్షల మెట్రిక్ టన్నుల తెల్లరాయిని దోచేసినట్లు అంచనా. (అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా) కోనంకి వద్ద అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతానికి సంబంధించిన శాటిలైట్ చిత్రం 2017 జూలై నెలలో ఈ సాక్ష్యాలను ఆయన హైకోర్టుకు సైతం అందించారు. 2016లో దాఖలు చేసిన పిల్లో 2014–15 మధ్య 34లక్షల మెట్రిక్ టన్నులు దోచేసినట్టు పేర్కొన్నారు. కోర్టులో దాఖలు చేసిన శాటిలైట్ సర్వే ఆధారాలకు, 2017 జనవరి నుంచి 2018 జూలైల మధ్య జరిగిన అక్రమ మైనింగ్ శాటిలైట్ అంచనాలు తోడైతే సుమారు 1.50 కోట్ల మెట్రిక్ టన్నుల వరకూ లైమ్ స్టోన్‌ను మైనింగ్ మాఫియా దోచేసినట్టు తెలుస్తోంది. సీబీఐ శాటిలైట్ సర్వే అంచనాల ఆధారంగా చేపట్టే లోతైన విచారణలో మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల ఆర్జన, ఇతర ఆర్థిక నేరాలు బయటపడతాయేమోనని మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. వేల కోట్ల అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర, అధికారుల సహకారం తదితర అంశాలు కూడా సీబీఐ వెలుగులోకి తీయాలని రాజకీయంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దాడులు... వేధింపులు గత ప్రభుత్వ హయాంలో యరపతినేని కనుసన్నల్లో నడిచిన అక్రమ మైనింగ్‌పై కోర్టులను ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నాయకుడు కుందుర్తి గురువాచారిని చిత్రహింసలకు గురిచేశారు. మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిపై అక్రమ కేసులను బనాయించారు. అందరి పాత్రలూ వెలికితీయాలి పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో మాజీ ఎమ్మెల్యే యరపతినేని తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్ల సహజ సంపదను కొల్లగొట్టారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారుల పాత్ర ఉంది. సామాన్యుడు ట్రాక్టర్ మట్టి సొంత అవసరాల కోసం తీసుకెళ్తే కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టే అధికారులు రూ.వేల కోట్ల సహజ సంపదను దోచేస్తుంటే అప్పట్లో కళ్లు మూసుకుని కూర్చున్నారు. కోర్టుకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారు. ఇలా అక్రమ మైనింగ్‌కు సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. – టి.జి.వి. కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ -
యరపతినేని కేసు: కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గుంటూరు, హైదరాబాద్ సహా 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో కీలక డాక్యుమెంట్లు, నగదు, పలు వస్తువులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కాగా లైమ్‌స్టోన్ అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రకృతి వనరులను దోచుకున్నారనే అభియోగాలపై యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన ముఖ్య అనుచరులు 13 మందితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2014-18 మధ్య చంద్రబాబు నాయుడు పాలనలో కొనకి, కేసానుపల్లి, నడికుడి గ్రామాలలో కొనసాగిన అక్రమ మైనింగ్ పరిమాణాన్ని నిర్ధారించేందుకు సీబీఐ శాటిలైట్ ఇమేజ్‌లను విశ్లేషిస్తోంది.(చదవండి: ఉల్లం‘గనుల్లో బినామీలు’) నిందితుల్లో యరపతినేని అనుచరులు 1. నెల్లూరి శ్రీనివాసరావు (కేశానుపల్లి) 2. వేముల శ్రీనివాసరావు (నారాయణపురం, నడికుడి) 3. ఓర్సు వెంకటేశ్వరరావు (నడికుడి) 4.వేముల ఏడుకొండలు (నారాయణపురం, నడికుడి) 5. ఇర్ల వెంకటరావు (నారాయణపురం, నడికుడి) 6. బత్తుల నరసింహారావు (దాచేపల్లి) 7. మీనిగ అంజిబాబు (జనపాడు) 8. గ్రంధి అజయ్‌కుమార్ (పిడుగురాళ్ల) 9. జి.వెంకట శివకోటేశ్వరరావు (పిడుగురాళ్ల) 10. ఓర్సు ప్రకాశ్ (కొండమోడు–రాజుపాలెం) 11. వర్ల రత్నం (పిడుగురాళ్ల) 12. నంద్యాల నాగరాజు (కొండమోడు–రాజుపాలెం) 3. ఆలపాటి నాగేశ్వరరావు (ధరణికోట–అమరావతి) సహా మరో నలుగురు కేసులో నిందితులుగా ఉన్నారు. -
ఉల్లం‘గనుల్లో బినామీలు’
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన అక్రమ మైనింగ్‌పై సీబీఐ కేసు నమోదు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో యరపతినేని బినామీల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు బినామీలపై కేసు నమోదు కావడంతో మిగిలినవారు భయపడుతున్నారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరట ఇస్తున్నా ముందు ముందు తమ పేర్లు, పాత్ర బయటపడుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన విషయం బహిరంగ రహస్యమే. ఆయన బినామీలు, అనుచరులను అడ్డుపెట్టుకుని పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి గ్రామాల పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్ విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. బుధవారం 17 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఆరుగురు యరపతినేని బినామీలేనని టీడీపీలోనే చర్చ నడుస్తోంది. అక్రమ మైనింగ్‌పై కేసుల నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు మరికొందరిపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యరపతినేని బినామీలపై కేసులు నమోదవ్వడంతో అక్రమ మైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన ఘట్టమనేని బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు తదితరులు ఆందో ళనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీబీఐ నమోదు చేసి న ఎఫ్ఐఆర్లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరటనిస్తున్నప్పటికీ పూర్తి స్థాయి విచారణ మొదలైతే తమ పేర్లు, పాత్ర బయపడుతుందని భయం వారిని వెంటాడనుంది. యరపతినేని బినామీల చరిత్ర ఇదీ.. ఏ–1 నెల్లూరి శ్రీనివాసరావు : కేశానుపల్లికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు పెట్రోలు బంకులో సూపర్వైజర్గా పనిచేస్తూ టీడీపీలో యరపతినేని అనుచరుడిగా తిరుగుతుండేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేశానుపల్లి గ్రామంలో ఉన్న క్వారీలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం నెల్లూరు శ్రీనివాసరావుకు అప్పగించేశారు. క్వారీల్లో అక్రమంగా లైమ్‌స్టోన్‌ను తవ్వడం నుంచి మిల్లులకు సరఫరా చేయడం వరకు ఇతనే చూశాడని ప్రచారం. అక్రమ మైనింగ్ పుణ్యమా అని పెట్రోల్ బంకులో పనిచేసిన శ్రీనివాసరావు నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. ఏ–6 బత్తుల నరసింహారావు: 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు నడుస్తున్న వడ్డెర కో–ఆపరేటీవ్ సొసైటీని రద్దు చేసి యరపతినేని అండతో కొత్త సొసైటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా కొనసాగాడు. కేశానుపల్లిలో 25 ఎకరాలు, నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలోని అంజనీపురం కాలనీ పక్కనే ఉన్న జేపీ సిమెంట్, ప్రభుత్వ భూములు సుమారు 150 ఎకరాలు ఆక్రమించేశారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా అండతో వడ్డెర సొసైజీలోని యరపతినేని అనుచరులతో లైమ్ స్టోన్‌ను దోచేయడంలో కీలకపాత్ర పోషించాడు. నడికుడి, కేశానుపల్లిల్లో అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్స్, తదితర వ్యవహారాలను చూసుకున్న నరసింహారావు కుమారుడు బత్తుల రాంబాబుపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఏ–7 మీనిగ అంజిబాబు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన మీనిగ అంజిబాబు 2014 టీడీపీ అధికారంలోకి రాకముందు వరకూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా ముఠాలో ఇతను ఒక సభ్యుడుగా మారాడు. ఇతను క్వారీ వద్ద కాపలాగా ఉంటూ రోజువారి టిప్పర్లలో లైమ్‌స్టోన్‌ను ఏఏ మిల్లులకు తరలించారనే వివరాలను బుల్లెబ్బాయి ద్వారా యరపతినేనికి తెలిపేవాడు. అక్రమ మైనింగ్ జరిగే క్వారీల్లో కొందరు కురాళ్లను అంజిబాబు నిఘా కొనసాగించేవాడు. కూలీలకు డబ్బు చెల్లించడం, క్వారీవైపు ఇతరులు ఎవ్వరినీ కన్నెత్తకుండా చేయడం లాంటివి చేస్తూ చోటా డాన్‌లా ఇతను వ్యవహరించాడు. ఏ–9 గ్రంధి అజయ్‌కుమార్: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గ్రంధి అజయ్ కొండమోడులో యరపతినేని కనుసన్నల్లో నడిచే అక్రమ క్వారీ వ్యవహారాలను చూసుకున్నాడు. ఏ–12 గుదె వెంకట శివకోటేశ్వరరావు: పిడుగురాళ్లకి పట్టణానికి చెందిన గుదె వెంకట శివకోటేశ్వరరావు అలియాస్ కోటి అక్రమ మైనింగ్‌కు మందు గుండు సామాగ్రి సరఫరా చేస్తూ మైనింగ్ కార్యక్రమాలను పరిశీలిస్తుంటాడు. మిల్లులకు సరఫరా చేసిన లైమ్‌స్టోన్ తాలుకూ డబ్బును వసూలు చేసి ఏ రోజుకు ఆ రోజు యరపతినేనికి లెక్కలు చెప్పడం వంటి కార్యకలాపాలు ఇతనే చూసుకున్నాడు. ఏ–16 నీరుమల్ల శ్రీనివాసరావు: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నీరుమల్ల శ్రీనివాసరావు వార్డు స్థాయిలో టీడీపీ క్రీయాశీల నేత, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బినామిల్లో ఒకడు. ఇతడు 1.30 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమ మైనింగ్ ద్వారా దోచేశాడని మైనింగ్ అధికారులు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యరపతినేని అనుచరులపై సీబీఐ కేసు
సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్ కేసు విచారణలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అనుచరులు 13 మందితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖపట్నం ఏసీబీ పోలీసుస్టేషన్లో సీబీఐ దర్యాప్తు అధికారి పి.విమలాదిత్య పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి గ్రామాల్లో 2010 జనవరి నుంచి 2018 ఆగస్టు వరకు సున్నపురాయి గనుల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లుగా మైనింగ్ విభాగం గుంటూరు–2 అసిస్టెంట్ డైరెక్టర్ బి.జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ, 2018లో అక్రమ మైనింగ్‌పై పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న విడుదల చేసిన నోటిఫికేషన్‌ను, అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఎఫ్ఐఆర్లో జతచేశారు. నిందితుల్లో యరపతినేని అనుచరులు 1. నెల్లూరి శ్రీనివాసరావు (కేశానుపల్లి) 2. వేముల శ్రీనివాసరావు (నారాయణపురం, నడికుడి) 3. ఓర్సు వెంకటేశ్వరరావు (నడికుడి) 4.వేముల ఏడుకొండలు (నారాయణపురం, నడికుడి) 5. ఇర్ల వెంకటరావు (నారాయణపురం, నడికుడి) 6. బత్తుల నరసింహారావు (దాచేపల్లి) 7. మీనిగ అంజిబాబు (జనపాడు) 8. గ్రంధి అజయ్‌కుమార్ (పిడుగురాళ్ల) 9. జి.వెంకట శివకోటేశ్వరరావు (పిడుగురాళ్ల) 10. ఓర్సు ప్రకాశ్ (కొండమోడు–రాజుపాలెం) 11. వర్ల రత్నం (పిడుగురాళ్ల) 12. నంద్యాల నాగరాజు (కొండమోడు–రాజుపాలెం) 13. ఆలపాటి నాగేశ్వరరావు (ధరణికోట–అమరావతి) సహా మరో నలుగురు కేసులో నిందితులుగా ఉన్నారు. -
యరపతినేనిపై సీబీఐ గురి
సాక్షి, గుంటూరు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక డాక్యుమెంట్లను సీఐడీ నుంచి తాజాగా సీబీఐ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్ 24న యరపతినేనిపై కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. (క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరమైన చర్యలు) ► యరపతినేని గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉండగా పెద్దఎత్తున మైనింగ్ అక్రమాలకు పాల్పడటంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ► కోర్టు జోక్యంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాడు చంద్రబాబు ప్రభుత్వం దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. పిడుగురాళ్ల మండలం కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకం, రవాణాతోపాటు దాచేపల్లి మండలం నడికుడిలో అక్రమ మైనింగ్ జరిగినట్టు సీఐడీ విచారణలో వెల్లడైంది. కోనంకిలో 690, 691, 692 సర్వే నంబర్‌లోను, కేసానుపల్లిలోని 324/ఎ, 336/1బి, 336/5, 336/6లోను, నడికుడిలోని 17/4, 17/5, 17/6, 17/7, 15 సర్వే నంబర్లలో అక్రమ మైనింగ్ జరిగినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి యరపతినేనితోపాటు 16 మందిపై 18 కేసులు నమోదయ్యాయి. -
టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ల సంగతి చూస్తా
పిడుగురాళ్ల (గురజాల): గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియాకు చెందిన యువకులపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యువకులు ప్రతి ఒక్కరి పేర్లు, చిరునామాలు అన్నీ డైరీలో నమోదు చేస్తున్నామని, టీడీపీ ప్రభుత్వం వస్తే వారి సంగతి చూస్తామంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. యరపతినేని వ్యాఖ్యలను నియోజకవర్గంలో పలువురు నేతలు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ప్రవర్తన మారలేదని, బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. కాగా, గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల విచారణను గత ఏడాది డిసెంబర్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. (2014లో సొంత ఇల్లు లేదు.. నేడు కోట్లకు పడగలు!) -
2014లో సొంత ఇల్లు లేదు.. నేడు కోట్లకు పడగలు!
సాక్షి, ఒంగోలు: గ్రానైట్ మాఫియా గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ మాఫియా డొంక కదులుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. ఆయన తన అనుచరులు పావులూరి చిన కోటయ్య, చంద్రమౌళి ద్వారా ప్రకాశం జిల్లా నుంచి వేలాది లారీల గ్రానైట్‌ను బిల్లులు లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రానైట్ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారికంగా నిర్ధారించారు. అనధికారిక సమాచారం ప్రకారం.. గ్రానైట్ మాఫియా రూ.1,000 కోట్లకుపైగానే దోచేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటిదాకా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో యరపతినేని అనుచరుడు చంద్రమౌళి అలియాస్ సీఎం కూడా ఉన్నాడు. కోట్లకు పడగలెత్తిన చిన కోటయ్య గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పావులూరి కోటేశ్వరరావు అలియాస్ చిన కోటయ్య 2014కు ముందు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంటిలో నివాసం ఉండేవాడు. అతడిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని నేతృత్వంలో నడిచిన గుట్కా, రేషన్, గ్రానైట్ మాఫియాకు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఐదేళ్లలోనే చిన కోటయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు. అక్రమాలకు సహకరించిన అధికారుల్లో వణుకు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు వంటి ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో నకిలీ కంపెనీలు సృష్టించి, వాటి పేరిట ఆన్లైన్ ద్వారా ఈ–వే బిల్లులు పొంది గ్రానైట్ లారీలను అక్రమంగా రాష్ట్రం దాటించారు. కొన్నిసార్లు అసలు బిల్లులు కూడా లేకుండా గ్రానైట్ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. గత టీడీపీ సర్కారు హయాంలో ఈ బాగోతం నిరాటంకంగా సాగిపోయింది. అద్దంకి సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వి.పి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి, లోతుగా దర్యాప్తు జరిపారు. గ్రానైట్ మాఫియా డొంకను కదిలించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక నకిలీ వే బిల్లులతో వెళ్లిన లారీల సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రానైట్ లారీలు సక్రమంగా పన్నులు చెల్లించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని తేల్చారు. ప్రకాశం జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు యరపతినేని అనుచరుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియగానే మరో అనుచరుడు చిన కోటయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో మరో 123 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్ మాఫియాకు సహకరించిన ప్రభుత్వ అధికారుల్లో కలవరపాటు మొదలైంది. -
గ్రానైట్ మాఫియా దోపిడీ రూ.1,000 కోట్ల పైమాటే!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గ్రానైట్ మాఫియా గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ మాఫియా డొంక కదులుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. ఆయన తన అనుచరులు పావులూరి చిన కోటయ్య, చంద్రమౌళి ద్వారా ప్రకాశం జిల్లా నుంచి వేలాది లారీల గ్రానైట్‌ను బిల్లులు లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రానైట్ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారికంగా నిర్ధారించారు. అనధికారిక సమాచారం ప్రకారం.. గ్రానైట్ మాఫియా రూ.1,000 కోట్లకుపైగానే దోచేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటిదాకా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో యరపతినేని అనుచరుడు చంద్రమౌళి అలియాస్ సీఎం కూడా ఉన్నాడు. అక్రమాలకు సహకరించిన అధికారుల్లో వణుకు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు వంటి ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో నకిలీ కంపెనీలు సృష్టించి, వాటి పేరిట ఆన్లైన్ ద్వారా ఈ–వే బిల్లులు పొంది గ్రానైట్ లారీలను అక్రమంగా రాష్ట్రం దాటించారు. కొన్నిసార్లు అసలు బిల్లులు కూడా లేకుండా గ్రానైట్ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. గత టీడీపీ సర్కారు హయాంలో ఈ బాగోతం నిరాటంకంగా సాగిపోయింది. అద్దంకి సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వి.పి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేక టాస్‌్కఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి, లోతుగా దర్యాప్తు జరిపారు. గ్రానైట్ మాఫియా డొంకను కదిలించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక నకిలీ వే బిల్లులతో వెళ్లిన లారీల సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రానైట్ లారీలు సక్రమంగా పన్నులు చెల్లించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని తేల్చారు. ప్రకాశం జిల్లా టాస్‌్కఫోర్స్ పోలీసులు యరపతినేని అనుచరుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియగానే మరో అనుచరుడు చిన కోటయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో మరో 123 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్ మాఫియాకు సహకరించిన ప్రభుత్వ అధికారుల్లో కలవరపాటు మొదలైంది. కోట్లకు పడగలెత్తిన చిన కోటయ్య గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పావులూరి కోటేశ్వరరావు అలియాస్ చిన కోటయ్య 2014కు ముందు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంటిలో నివాసం ఉండేవాడు. అతడిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని నేతృత్వంలో నడిచిన గుట్కా, రేషన్, గ్రానైట్ మాఫియాకు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఐదేళ్లలోనే చిన కోటయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు. -
యరపతినేని పై 18కేసులు నమోదు
-
సీబీఐకి యరపతినేని అక్రమ మైనింగ్ కేసు
సాక్షి, అమరావతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మరో 15 మందిపై నమోదైన అక్రమ మైనింగ్ కేసుల విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యరపతినేని, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారనే అభియోగాలు రావడం తెలిసిందే. అయినప్పటికీ ఆయనపై గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో యరపతినేనిపై చర్యలు తీసుకోవాలంటూ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అనంతరం 2018లో గుంటూరు జిల్లా దాచేపల్లి, కొండమోడు, పిడుగురాళ్ల, నడికుడి, అమరావతి ప్రాంతాలకు చెందిన మరో 15 మందిపై 17 కేసులు నమోదయ్యాయి. వీరిలో వేముల శ్రీనివాసరావు, తిప్పవజుల నారాయణశర్మలపై రెండేసి కేసులు, మరో 13 మందిపై ఒక్కో కేసు రిజిస్టర్ అయ్యాయి. యరపతినేనితో కలిపి 16 మందిపై మొత్తం 18 కేసులు నమోదయ్యాయి. పిడుగురాళ్ల మండలం కేసనుపల్లి, కోనంకి గ్రామాల్లో సున్నపురాయి అక్రమ తవ్వకం, రవాణా, దాచేపల్లి మండలం నడికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరిగినట్టు గుర్తించారు. కోనంకిలో 690, 691, 692 సర్వే నంబర్‌లోను, కేసనుపల్లిలోని 324/ఎ, 336/1బి, 336/5, 336/6లోను, నడికుడిలోని 17/4, 17/5, 17/6, 17/7, 15 సర్వే నంబర్లలో జరిగిన అక్రమ మైనింగ్‌ను నిర్ధారించారు. ఇందుకు సంబంధించి ఐపీసీ, ప్రివెన్షన్ ఆఫ్ డేమేజీ పబ్లిక్ ప్రాపర్టీ(పీడీపీపీ) యాక్ట్, మైన్స్ అండ్ మినరల్స్(ఎంఎం) యాక్ట్, ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ ప్రకారం పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై సీఐడీ విచారణకు గత ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేసిన సీఐడీ తన నివేదికను సర్కారుకు అందజేసింది. అయితే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ కొనసాగడంతో సీబీఐ దర్యాప్తు అంశం ప్రస్తావనకు వచ్చింది. అక్రమ మైనింగ్‌లో అనేక కీలక అంశాలకు సంబంధించి విçస్తృత స్థాయి దర్యాప్తు అవసరమని సీఐడీ సైతం హైకోర్టుకు నివేదించగా, పిల్ దాఖలు చేసిన టీజీవీ కృష్ణారెడ్డి కూడా సీబీఐ దర్యాప్తును కోరారు. ప్రభుత్వం అనుకుంటే సీబీఐ దర్యాప్తునకు చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ హైకోర్టు కేసు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. యరపతినేని, ఆయన అనుచరులపై ►నమోదైన కేసులివీ.. ►యరపతినేని శ్రీనివాసరావు–హైకోర్టు పిల్ 170/2016, మీనిగ అంజిబాబు– 308/2018, ►తిప్పవజుల నారాయణశర్మ–309/2018, ►గ్రంధి అజయ్‌కుమార్–310/2018, ►తిప్పవజుల నారాయణశర్మ–311/2018, ►రాజేటి జాకబ్–312/2018, గుదె వెంకట ►కోటేశ్వరరావు–313/2018, ►వర్సు ప్రకాశ్–314/2018, ►వర్ల రత్నం దానయ్య–315/2018, ►నంద్యాల నాగరాజు–316/2018, ►నీరుమళ్ల శ్రీనివాసరావు–317/2018, ►ఆలపాటి నాగేశ్వరరావు–318/2018, ►వేముల శ్రీనివాసరావు–181/2018, ►వర్సు వెంకటేశ్వరరావు–182/2018, ►వేముల ఏడుకొండలు–183/2018, ►ఈర్ల వెంకటరావు–184/2018, బి. నరసింహా ►రావు–185/2018, వి. శ్రీనివాసరావు–186/2018 -
యరపతినేనిపై సీబీఐ విచారణకు ఆదేశం
సాక్షి, అమరావతి : మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యరపతినేనిపై ఉన్న 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ మంగళవారం రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలోని కోణంకి, కేసనుపల్లి, నదికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్ పై విచారణ జరపాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. కాగా, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో యరపతినేని అక్రమంగా మైనింగ్ చేపట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. (గ్రానైట్ అక్రమ రవాణా సూత్రధారి యరపతినేని!) 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ విమర్శలు ఎదురర్కొన్నారు. దీంతోనే గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. దీంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. -
గ్రానైట్ అక్రమ రవాణా సూత్రధారి యరపతినేని!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్ మాఫియా గత ఐదేళ్లు యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడినట్లు తేలింది. నకిలీ వే బిల్లులతో వేలాది లారీల గ్రానైట్‌ను రాష్ట్రం దాటించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. నకిలీ కంపెనీలు సృష్టించి వే బిల్లులు అమ్ముకున్న ముఠా తెలిపిన వివరాలతో ప్రకాశం జిల్లా పోలీసులు నివ్వెరపోయారు. గుంటూరు జిల్లా పల్నాడులో మైనింగ్ మాఫియాను నడిపి రూ.వేల కోట్లు దోచుకున్న యరపతినేని తన అనుచరుడు సీఎం (నిక్‌నేమ్) అనే వ్యక్తి ద్వారా ప్రకాశం జిల్లాలో సైతం గ్రానైట్ మాఫియాను ఏర్పాటు చేశారు. ఈ అక్రమ వ్యవహారంలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల్లోని కొందరు అధికారులు భాగస్వాములయ్యారు. మార్టూరు ఎస్ఐ విచారణలో భారీ కుంభకోణం బయటపడటంతో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రానైట్ లారీలకు రక్షణ కవచంలా యరపతినేని అనుచరులు గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి బయలుదేరిన గ్రానైట్ లారీలకు కిలోమీటర్ దూరంలో ముందుగా ఒక కారు వెళ్తుంది. అందులోని యువకులు ఎప్పటికప్పుడు అధికారుల కదలికలను లారీల్లో ఉన్నవారికి చేరవేస్తుంటారు. అధికారులు తారసపడితే వారిని వెంబడిస్తూ నానా హంగామా సృష్టిస్తారు. అప్పటికీ వెళ్లకపోతే యరపతినేనితో ఉన్నతాధికారులకు ఫోన్ చేయించి వారిని అక్కడ నుంచి పంపించివేస్తారు. లారీలకు ముందు, వెనుక సుమారు పది మంది యువకులు బైక్‌లపై రక్షణ కవచంలా ఉంటారు. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి వెళ్లేందుకు సుమారుగా 20 మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. రోజుకో మార్గంలో వెళ్తుంటారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య ఈ అక్రమ రవాణా జరుగుతుంది. యరపతినేని ముఖ్య అనుచరుడు సీఎం (నిక్‌నేమ్) వీరందరినీ పర్యవేక్షిస్తూ లారీలను సరిహద్దు చెక్‌పోస్టులు దాటిస్తాడు. కాపలాగా వచ్చిన యువకులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.వెయ్యి చొప్పున డబ్బు, మద్యం ఎరగా వేస్తాడు. ఇవన్నీ ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో బయటపడ్డాయి. ఇప్పుడు సిట్‌ను కూడా ఏర్పాటు చేయడంతో గ్రానైట్ మాఫియా అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంది. -
చెప్పినట్లు వినకపోతే నీ అంతుచూస్తా !
సాక్షి, గుంటూరు : గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పినట్లు వినకపోతే హతమార్చుస్తానని బెదిరించి తన ఇల్లును బలవంతంగా ఓ కోల్డ్‌స్టోరేజ్ యజమాని కుమారుడి పేరుతో రాయించి అన్యాయం చేశాడంటూ పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి చెందిన అనబోతుల గురవారెడ్డి బుధవారం రూరల్ స్పందన కేంద్రంలో రూరల్ అదనపు ఎస్పీ కె. చక్రవర్తికి ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... మా ప్రాంతంలోని గ్రామాల్లో మిరపకాయల కొనుగోళ్లు, చేస్తుంటాను. 2016లో మిరపకాయల ధర తక్కువగా ఉండటంతో రైతుల పేర్లతోనే మా ప్రాంతాంలోని బాలాజీ కోల్డ్ స్టోరేజ్‌లో నాలుగు వేల బస్తాల మిరపకాయలు దాచాను. కోల్ట్‌స్టోరేజ్ హామీతో బ్యాంకు నుంచి రూ.కోటి 10 లక్షలు అప్పుగా తీసుకున్నాను. మిర్చి రేటు తగ్గుదల అవుతున్న క్రమంలో కోల్డ్ స్టోరేజ్ యజమాని భవనాసి ఆంజనేయులు, మేనేజరు కొత్తా పాండు రంగారావు నన్ను పిలిచి మిర్చి మొత్తం తమకు అప్పగిస్తే బ్యాంకు రుణం తీర్చుతామని నమ్మించి అగ్రిమెంటు రాయించుకున్నారు. ఆపై బ్యాంకు రుణం తీర్చకుండా బ్యాంకు మేనేజర్‌తో కుమ్మకై నాకు, రైతులకు రుణం తీర్చాలంటూ నోటీసులు జారీ చేశారు. బ్యాంకు మేనేజరు మా ఇళ్లకు వచ్చి రుణం తీర్చకపోతే మీ ఇళ్లు, పొలాలు వేలం వేస్తామని భయపెట్టారు. మిర్చి తీసుకున్న వారిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నన్ను పిలిపించి రూ.70 లక్షల విలువచేసే ఇంటిని శ్రీరామ్ వెంకట శ్రీనివాసరావు అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ చేయాలనీ, లేకుంటే హతమారుస్తామని బెదిరించడంతో గత్యంతరం లేని స్థితిలో రిజస్టర్ చేశాను. అనంతరం 2017లో బ్యాంకు వారితో వన్‌టైమ్ సెటిల్ మెంట్ చేయడంతో రూ.40 లక్షలు నాకు రావాల్సి ఉంది. ఇల్లు తీసుకున్నారు కదా కనీసం ఆ డబ్బు అయినా ఇవ్వాలని అడిగితే దుర్భాషలాడి మళ్లీ ఈ విషయం గురించి మాట్లాడితే చంపేస్తామని అక్కడ నుంచి గెంటేశారని వివరించారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా నీ అంతు చూస్తామని హెచ్చరిండంతో ఇప్పటి వరకు మౌనంగా ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేసు త్వరలో సీబీఐకి
పల్నాడు ప్రాంతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పులిచింతల, ఎత్తిపోతల వంటి నీటి ప్రాజెక్టుల రాకతో పచ్చని పంటల సాక్షిగా రైతుల నవ్వులు కళ్ల ముందు కదలాడతాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌కు తెరదీశారు. వందల కోట్ల రూపాయల సహజ వనరులను అడ్డగోలుగా దోచుకున్నారు. అడిగిన వారిని పోలీసులతో కుళ్లబొడిపించారు. అప్పటి ప్రభుత్వ అండతో అవినీతి కేసుల నుంచి తప్పించుకున్నారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో యరపతినేని పాపం పండింది. అక్రమ మైనింగ్ భరతం పట్టేందుకు న్యాయస్థానాల అనుమతి తీసుకుంది. ఇప్పటి వరకు సీబీసీఐడీ ఆధ్వర్యంలో సాగిన విచారణ మరో వారంలో సీబీఐ చేతుల్లోకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన యరపతినేనిసహా ఆయన అనుచరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో పల్నాడు ప్రాంతంలో మైనింగ్ మాఫియాకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గురజాల నియోజకవర్గంలో సహజ వనరులను యథేచ్ఛగా దోచుకున్నారు. వందల కోట్ల రూపాయలను దండుకున్నారు. మైనింగ్ మాఫియాలో ప్రధాన నిందితుడుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతోపాటుగా మరి కొందరిని బాధ్యులుగా చేస్తూ గత ప్రభుత్వ హయాంలో సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగించారు. టీడీపీ అండదండలతో యరపతినేని అప్పట్లో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసును వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో హైకోర్టు కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో సీబీఐ అధికారులు అక్రమ మైనింగ్ కేసులకు సంబంధించిన దర్యాప్తు నివేదికలను సీఐడీ అధికారుల నుంచి స్వాధీనం చేసుకోనున్నారు. వెలుగు చూసిందిలా.. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ వ్యవహారంపై అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు న్యాయ పోరాటానికి దిగారు. హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాదిలో అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టింది. అయితే అప్పట్లో అధికార పార్టీ ఆదేశాలతో మైనింగ్ మాఫియాకు పాల్పడిన వారిని సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టలేదు. అనంతరం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టు ఆదేశంతో విచారణ వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్‌పై 17 కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ట్రాక్టర్ డ్రైవర్లు, కూలీలు, మిల్లర్లు, ఇతర వ్యక్తులను సీఐడీ అధికారులు విచారించారు. సుమారు 700 మందిని విచారించి వారి నుంచి స్టేట్మెంట్లు నమోదు చేశారు. ఆయా కేసుల్లో కీలకమైన సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచి సెక్షన్ 164 ప్రకారం మొత్తం 24 మంది నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో హైకోర్టు పరిధిలో ఉన్న కేసులను సీఐడీ అధికారులు ఉపసంహరించుకున్నారు. రోజుల వ్యవధిలో... నెల రోజుల క్రితం సీబీఐకి కేసు అప్పగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనంతరం సీఐడీ అధికారులు అయా కేసుల వారీగా వారు జరిపిన దర్యాప్తు పత్రాలను సిద్ధం చేశారు. ఎప్పుడు సీఐడీ అధికారులు వచ్చినా అన్ని పత్రాలను అందచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. వారం రోజుల్లో సీఐడీ అధికారులు వచ్చి కేసుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అక్రమార్కుల గుండెల్లో వణుకు కేసు సీఐడీ అధికారులకు వెళుతున్న విషయం తెలుసుకున్నప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపాటు అక్రమ మైనింగ్‌లో భాగస్వాములైన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ హయాంలో బినామీల పేరిట దాచుకున్న సొత్తునంతా కక్కిస్తారని భయపడుతున్నారు. ఎప్పుడు తమను విచారణకు పిలుస్తారోనని వణికిపోతున్నారు. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన వందల కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్‌కు వెళతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. -
బాధితులంతా రావాలి; మేం కూడా ‘ఛలో ఆత్మకూరు’
సాక్షి, గుంటూరు : వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అంతానికి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే గందరగోళం సృష్టించేందుకు బాబు యత్నిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో చాలా దారుణాలు జరిగాయని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో పల్నాడు ప్రశాంతంగా ఉందని తెలిపారు. తన పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకుల అడ్డగోలు ప్రచారాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. అందుకే తాము కూడా ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చామని అన్నారు. మంగళవారం జరిగిన పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న అంబటి మీడియాతో మాట్లాడారు. ‘పచ్చ నేతల ఆగడాలను అడ్డుకోవడానికి మేం కూడా ఆత్మకూరు వెళ్తున్నాం. కోడెల బాధితులు, యరపతినేని బాధితులు, పుల్లారావు బాధితులు, ఆంజనేయులు బాధితులతో కలిసి ఆత్మకూరు వెళతాం. రేపు (బుధవారం) ఉదయం 9 గంటలకు గుంటూరు వైఎస్సార్సీపీ ఆఫీసు నుంచి ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునిస్తున్నాం. టీడీపీ శిబిరంలో ఉన్నవారంతా పెయిడ్ ఆర్టిస్టులే. గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు జరిగితే మా ప్రమేయం ఉందని చంద్రబాబు ఆరోపించడం దారుణం. గుంటూరు జిల్లాలో చాలా వరకు ఫ్యాక్షన్ తగ్గింది. వాస్తవాలు గ్రహించాలని ప్రజలను కోరుతున్నాం’అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొల్లా బ్రహ్మానాయుడు టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం సుభిక్షంగా ఉంది. చంద్రబాబుకు కేవలం 23 సీట్లు వచ్చినా ఇంకా బుద్ధి రాలేదు. మా ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేస్తే అప్పుడు ఏమైంది మీ లా అండ్ ఆర్డర్ అని ప్రశ్నిస్తున్నా. రేపు ఛలో ఆత్మకూరుకు టీడీపీ బాధితులంతా వస్తారు. వారికి చంద్రబాబు సమాధానం చెప్పాలి.’అన్నారు. ఇక పల్నాడులో చాలా ప్రశాంత వాతావరణం ఉందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఛలో ఆత్మకూరుకు టీడీపీ బాధితులను తీసుకొస్తామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్సీపీ సానుభూతి పరులను వేధించారని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు గుర్తు చేశారు. తమకు ఎలాంటి గొడవలు లేవని చంద్రబాబే కావాలనే గొడవలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు ఇప్పటికైనా కుటిల రాజకీయాలు మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజలు చల్లగా ఉంటే చంద్రబాబుకు కడుపు మంట అని చురకలంటించారు. -
కొంపముంచిన కోడెల.. పల్నాడులో పతనం
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడు అల్లకల్లోలం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే టీడీపీ నేతలు డ్రామాలకు దిగుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గురజాలలోని అక్రమ మైనింగ్ వ్యవహరాన్ని సీబీఐకి బదిలీ చేయడంతో చంద్రబాబు, అండ్ కో లొసుగులు బయటకు వస్తాయనే భయంపట్టుకుందని స్థానిక నేతల సమాచారం. గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లపాటు అనేక అక్రమాలకు పాల్పడి.. ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన టీడీపీ నేతలపై తాజా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణను రాజకీయ వేధింపులుగా చూపించే ప్రయత్నం చేయడం కోసం.. వైఎస్సార్సీపీ నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ కొందరు టీడీపీ నేతలు అసత్య ప్రచారానికి దిగుతున్నారు. బిగుసుకుంటున్న అక్రమ మైనింగ్ ఉచ్చు.. మరోవైపు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై కూడా ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అక్రమ మైనింగ్ వ్యవహరాన్ని సీబీఐకి బదిలీ చేసింది. బ్యాంకు ఖాతాల్లో భారీగా జరిగిన అక్రమ ఆర్థిక లావాదేవీల చిట్టాలు ఒక్కొక్కటీ బయటపడతుండటంతో టీడీపీ నేతల్లో అలజడి మొదలైంది. వీటి వెనుక ఉన్న నేతల పునాదులు కదులుతున్నాయి. ఇదిలావుండగా.. ఐదేళ్ల పాటు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించామని, ఆ కష్టాలు పగవారికి కూడా రాకూడదు అంటూ యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల దాడులకు గురైన బాధితులు హోంమంత్రి సుచరిత ఎదుట ఇటీవల తమ గోడు వెళ్లబోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల టీడీపీ పాలనలో యరపతినేని, ఆయన అనుచరుల వేధింపులకు గురైన బాధితుల కష్టాలు, బాధలు విన్న హోం మంత్రి వారికి భరోసా ఇచ్చారు. వారిపై నమోదు అయిన కేసులపై పునఃవిచారణ చేపడతామని మంత్రి వాగ్ధానం చేశారు. దీంతో పల్నాడులోని టీడీపీ నేతలు భయాందోళకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయ దాడుల పేరిట చంద్రబాబు కొత్త డ్రామాలకు దిగుతున్నారు. కొంపముంచిన కోడెల.. మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బాగోతం అసెంబ్లీ ఫర్నీచర్ దోపిడీ రూపంలో గుంటూరు జిల్లాలో టీడీపీ పరువు రోడ్డుపాలైంది. జిల్లాలో వ్యాప్తంగా పార్టీ పూర్తిగా పతానావస్థకు చేరడంతో పచ్చ పార్టీల నేతలు అనేక దుశ్చర్యలకు పాల్పడుతూ.. ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగుతున్నారు. తమ అనుకూల మీడియా సహాయంతో ప్రభుత్వ కార్యక్రమాలను మరుగునపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుండగా గత ఐదేళ్లకాలంలో అభివృద్ధికి నోచుకోని పల్నాడు ప్రాంతంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. త్వరలో గురజాలలో మెడికల్ కాలేజీకి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పల్నాడులో తాగునీటి వసతి కోసం ప్రభుత్వం బృహత్ ప్రణాళికలను రచిస్తోంది. త్వరలోనే వీటిని అమలు చేయనుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న వరికెశలపూడి ప్రాజెక్టుకు ముందడుగులు పడుతోన్న విషయం తెలిసిందే. -
టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు
-
యరపతినేని కేసు సీబీఐకి అప్పగింత
సాక్షి, అమరావతి : టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.యరపతినేనిపై వచ్చిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి అని, అందుకే అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలియజేశారు. రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్లలో పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల మండలంలో కోనంకి, దాచేపల్లి మండలంలోని నడికుడి, కేశానుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే యరపతినేనిశ్రీనివాసరావు అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతూ సుమారు కోటి మెట్రిక్ టన్నుల తెల్లరాయి (లైమ్ స్టోన్)ని దోచేశారు. యరపతినేని కనుసన్నల్లో సాగిన అక్రమ మైనింగ్‌పై గత ఏడాది ఆగస్టులో సీబీసీఐడీ విచారణచేపట్టింది.ఇప్పటి వరకూ అక్రమ మైనింగ్‌పై జరిపిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికను షీల్డ్ కవర్లో గత సోమవారం అధికారులు హైకోర్టు ముందుంచారు. మనీ ల్యాండరింగ్ కోణంలో కేసు దర్యాప్తు జరపాల్సి ఉందనిఅధికారులు పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అప్పగించకూడదో తెలపాలంటూ ధర్మాసనం యరపతినేనని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తుసంస్థలకు ఈ కేసు విచారణను కోరే వ్యవహారంపై నేడు స్పష్టత వచ్చింది. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు బదలాయించడంతో మైనింగ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏడాదిపాటు అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీలు అక్రమ మైనింగ్ కారణంగా రూ. వేల కోట్లు గడించినట్టు గుర్తించారు. మైనింగ్ మాఫియాలో కీలక సభ్యులైన బుల్లెబ్బాయి, ఘట్టమనేనినాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు మొదలైన వ్యక్తులు యరపతినేని బినామీలుగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే.గత ఐదేళ్లలో వీరందరూ అక్రమ మైనింగ్ కారణంగా రూ. కోట్లు సంపాదించినట్టు దర్యాప్తులో వెలువడినట్టు పోలీస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు అక్రమ మైనింగ్ కేసుబదలాయించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన బినామీల్లో ఆందోళన మొదలైంది. -
అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగింత
-
యరపతినేని మైనింగ్ కేసులో హైకోర్టు కీలక సూచన
సాక్షి, అమరావతి : టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక సూచన చేసింది. అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. సోమవారం యరపతినేని మైనింగ్ కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. సీఐడీ విచారణలో యరపతినేని అక్రమాలపై సాక్ష్యులు కీలక విషయాలు వెల్లడించారని, అక్రమ మైనింగ్ జరిగిందని సీఐడీ నివేదిక ద్వారా అర్థమవుతోందని హైకోర్టు పేర్కొంది. యరపతినేనికి సంబంధించిన బ్యాంకుల లావాదేవీల్లోనూ అక్రమాలు జరిగినట్లు అనుమానాలున్నాయని అంది. పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సీబీఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
యరపతినేని అండతో పొలం కాజేశారు
సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వం హయాంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అండతో పొలం కాజేశారని దాచేపల్లి మండలం నడికూడు శివారు నారాయణపురానికి చెందిన బాధితురాలు కొరిమెళ్ల రమణ శనివారం రూరల్ ఎస్పీ కార్యాలయంలోని స్పందన కేంద్రంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... కొరిమెళ్ల రమణ మూడెకరాల పొలం సాగు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లలను పోషించుకుంటున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా 2010లో పిడుగురాళ్లకు చెందిన వడ్డీ వ్యాపారి ధనలక్ష్మి ఆటో ఫైనాన్స్ యజమాని వడ్లమూడి బ్రహ్మానందాన్ని కలసి రూ.6 లక్షల రుణం కావాలని కోరారు. అప్పు కావాలంటే పొలం తన పేరుతో జీపీఏ చేసి ప్రతినెల తీసుకున్న అసలుకు రూ.25వేలు వడ్డీ రూపంలో చెల్లిస్తూ ఐదేళ్లలోపు అప్పు మొత్తం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం బాధితురాలు 2012 జూలై వరకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చింది. మరుసటి నెల వడ్డీ చెల్లించలేక పోవడంతో బ్రహ్మానందంతో పాటు అతని కుమారుడు ఇంటికి వెళ్లి రమణను దుర్భాషలాడారు. ఎలాగైనా అప్పుతీర్చాలని నిర్ణయించుకొని మరోచోట అప్పుచేసి గ్రామ పెద్దలను తీసుకొని పిడుగురాళ్ల వెళ్లింది. అప్పు మొత్తం తీర్చుతానని లెక్క చూడాలని కోరింది. అందుకు బ్రహ్మానందం నిరాకరించి మీ పొలం తిరిగి ఇచ్చేది లేదని, నేను వేరే వాళ్లకు అమ్ముకున్నాని తేల్చిచెప్పాడు. దీంతో రమణ సమస్యను అప్పటి ఎమ్మెల్యే యరపతినేని వద్దకు తీసుకువెళితే ఆయన కూడా వారికే వత్తాసు పలికారు. నమ్మించి మోసం చేశాడని బాధితురాలు అప్పటి ఎస్పీ, డీఎస్పీ, సీఐలతో పాటు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న బ్రహ్మానందం యరపతినేనితో పోలీసులకు ఫోన్ చేయించి తదుపరి చర్యలు చేపట్టకుండా కేసును మూలన పడేయించారు. పెండింగ్ కేసుల విచారణలో భాగంగా ఇటీవల పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. విచారణ విషయం తెలుసుకున్న రమణ బంధువు గళ్ల నారాయణ మీరు మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అసలు విషయాలు చెపితే అందర్నీ కాల్చిపారేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు రూరల్ ఏఎస్పీ కె.చక్రవర్తి ఎదుట కన్నీటిపర్యంతమైంది. విచారించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెంటనే పూర్తి స్థాయిలో విచారించాలని గురజాల రూరల్ సీఐ కోటేశ్వరరావును ఆదేశించారు. -
టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు
సాక్షి, గుంటూరు: టీడీపీ నేతల మైనిగ్ మాఫియా అక్రమాలు బయటపడుతున్నాయి. కోర్టు ఆదేశాలతో టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా యరపతినేనితో పాటు,ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 12 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరితో పాటు మైనింగ్ ఏడీ జగన్నాధరావు, ఆర్డీవో మురళీ, సీఐ హనుమంతావులపై కూడా కేసు నమోదు చేశారు. గతంలో అక్రమ మైనింగ్ తవ్వకాలపై గురవాచారి అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దాంతో తనపై వ్యతిరేకంగా కేసు పెట్టాడనే కోపంతో యరపతినేని.. గురవాచారిని కాళ్లు, చేతులు విరిగేలా కొట్టించాడు. తనపై జరిగిన దాడి గురించి గురవాచారి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు పెట్టినా వారు పట్టించుకోలేదు. దీంతో చేసేది ఏమీ లేక గురవాచారి హైకోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఆదేశాలతో యరపతినేనితో సహా రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులపై కేసుల నమోదయ్యాయి. -
నన్ను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి
సాక్షి, అమరావతి : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేసానుపల్లి, దాచేపల్లి, కొండమోడుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన లైమ్‌స్టోన్(సున్నం రాయి) అక్రమ తవ్వకాల వ్యవహారంలో పోలీసులు తనను నిందితుడిగా చేర్చి, అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా యరపతినేని తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. లైమ్‌స్టోన్ అక్రమ తవ్వకాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చేస్తోందని, ఇందులో పిటిషనర్ యరపతినేని నిందితుడు కాదని తెలిపారు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు పిటిషనర్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసు జారీ చేసి, అరెస్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలీసులను నిరోధించాలని చూస్తున్నారు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. భారీ మొత్తంలో లైమ్‌స్టోన్‌ను కొల్లగొట్టారన్న ఆరోపణలు యరపతినేనిపై ఉన్నాయని తెలిపారు. ఈ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా పోలీసులు చేస్తున్న పనిని చేయకుండా వారిని నిరోధించాలని యరపతినేని కోర్టును కోరుతున్నారని వివరించారు. ఇలాంటి పిటిషన్లను న్యాయస్థానాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసుల్లో న్యాయస్థానాల జోక్యం సరికాదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ను ఉల్లంఘిస్తూ ఏవైనా చర్యలు తీసుకుంటే అప్పుడు పిటిషనర్ కోర్టుకు రావొచ్చని, కేవలం భయాందోళన ఆధారంగా కోర్టుకు రావడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీ, గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఏజీని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేశారు. -
తహశీల్దార్ ఆఫీస్‌లో ఆటోలకు టీడీపీ జెండాలు
-
టీడీపీ అభ్యర్థి బరితెగింపు.. తహశీల్దార్ ఆఫీస్‌లోనే..
సాక్షి, గుంటూరు : గురజాల టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘించారు. ప్రభుత్వ కార్యాలయాన్ని టీడీపీ ఆఫీసుగా మార్చేసుకున్నారు. ప్రచారంలో ఉపయోగించే ఆటోలకు పచ్చ జెండాలు, బ్యానర్లు కట్టడానికి ఏకంగా తహశీల్దారు ఆఫీసును అడ్డాగా చేసుకుని బరితెగించారు. నియోజకవర్గంలో ర్యాలీ చేపట్టేందుకు ఆటోలను పిడుగురాళ్ల తహశీల్దార్ కార్యాలయానికి రప్పించిన యరపతినేని అక్కడ నుంచే ర్యాలీ చేపట్టారు. ఇక మొదటినుంచీ ఇసుక దోపిడీ, అక్రమ మైనింగ్‌తో వివాదాస్పద నేతగా పేరున్న యరపతినేని ఇటీవల మరోసారి వార్తల్లో నిలిచారు. గత బుధవారం దాచేపల్లి మండలం ఇరికేపల్లి ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ‘మేము అభివృద్ధి చేశాం.. కాలనీ వాసులు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.. నన్ను మరోవైపు చూడవద్దు.. నేను మంచికి మంచివాడిని.. తేడా వస్తే తాట తీస్తా’ అంటూ బెదిరించారు. (చదవండి : ఎమ్మెల్యే యరపతినేని వివాదాస్పద వ్యాఖ్యలు) -
మరోవైపు చూడాలనుకోవద్దు..
దాచేపల్లి(గురజాల): ‘నన్ను ఒకవైపు మాత్రమే చూశారు.. మరోవైపు చూడాలనుకోవద్దు.. తేడా వస్తే తాట తీస్తా..అంటూ’ గురజాల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడారు. ‘మేము అభివృద్ధి చేశాం.. కాలనీ వాసులు టీడీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.. ‘నన్ను మరోవైపు చూడవద్దు.. నేను మంచికి మంచివాడిని.. తేడా వస్తే తాట తీస్తా’ అంటూ బెదిరించారు. వైఎస్సార్ సీపీకి బలమైన గ్రామం ఇరికేపల్లి ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి ఇరికేపల్లి బలమైన గ్రామం. ఎస్సీ కాలనీలో ఎక్కువగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఉన్నారు. ఈ కాలనీకి చెందిన మాతంగి మమత వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచింది. ఎస్సీ కాలనీలో పట్టుకోసం టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఏ విధంగానైనా సరే బెదిరించి అయినా ఎస్సీ కాలనీలో పాగా వేయాలనే ఉద్దేశం టీడీపీ నేతలకు ఉన్నప్పటికీ..కాలనీలో ఇప్పటివరకు వీరికి ఆదరణ లభించలేదు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన యరపతినేని ఎస్సీ కాలనీలో వారిని ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. కాగా, యరపతినేని చేసిన ఘాటు వ్యాఖ్యలపై దళిత సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దళితులను బెదిరించి లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. -
ఏపీలో మరో కుట్ర బట్టబయలు
సాక్షి, గుంటూరు: ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి.. రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన అనుచరుల మధ్య వివాదాన్ని.. వైఎస్సార్సీపీ మెడకు చుట్టాలనుకున్నారు. తన హత్యకు కుట్ర పన్నారంటూ వైఎస్సార్సీపీ మీద బురద జల్లుతూ ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించారు. అయితే జిల్లా రూరల్ ఎస్పీ ఇది యరపతినేని అనుచరుల మధ్య ఆధిపత్య పోరు మాత్రమే అని పక్కాగా తేల్చడంతో.. ఇప్పుడు ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వివరాలు.. పల్నాడు ప్రాంతంలో తుపాకులు పట్టుకుని తిరుగుతున్న గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరులైన నల్లబోతు శ్రీనివాసచౌదరి, వడ్లమూడి శివరామకృష్ణ చౌదరి, పూర్ణచంద్రరావును ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఓటమి భయంతో ఉన్న యరపతినేని.. తమ అనుచరులు తుపాకులతో పట్టుబడటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇది తనకు మరింత చెడ్డ పేరు తెచ్చిపెట్టిందని భావించారు. తనకు రాజకీయ సమాధి తప్పదనుకున్న ఆయన వెంటనే.. తన హత్యకు వైఎస్సార్సీపీ కుట్ర పన్నిందంటూ ఎల్లో మీడియాలో కథనాలు రాయించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నించారు. అయితే యరపతినేని ప్రధాన అనుచరుడు, మైనింగ్ మాఫియాలో కీలక సూత్రధారి అయిన ముప్పన వెంకటేశ్వర్లును మట్టుబెట్టేందుకు.. మిగతా అనుచరులంతా ఏకమై తుపాకులు తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. యరపతినేని నామినేషన్ కార్యక్రమంలోనే వెంకటేశ్వర్లును కాల్చి చంపాలనుకున్నట్లు వెల్లడైంది. ఇదంతా యరపతినేని అనుచరుల ఆధిపత్య పోరులో భాగమేనని గుంటూరు రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖర్‌బాబు స్పష్టం చేశారు. అయినా కూడా ఓటమి భయంతో ఉన్న యరపతినేని.. ఎల్లో మీడియా ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు యరపతినేని అనుచరులు అనుకున్నది పక్కాగా జరిగితే.. ఆ నేరాన్ని వైఎస్సార్సీపీ నేతలపైకి నెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారేమోననే అనుమానాలను స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, తుపాకులతో పట్టుబడ్డ నలబోతు శ్రీనివాసరావు చౌదరితో పాటు ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచురుడు ముప్పన వెంకటేశ్వర్లు.. గతంలో జరిగిన కాంగ్రెస్ నేత ఉన్నం నరేంద్ర హత్య కేసులో నిందితులు. అయినా కూడా దొంగే దొంగా అని అరిచినట్లుగా ఉంది ఆయన తీరు అని స్థానికులు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఇలాంటి కుట్రలు పన్నుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పల్నాడులో యథేచ్ఛగా అక్రమ క్వారీయింగ్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలు భారీగా మోహరించి తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ.. పిడుగురాళ్ళ, దాచేపల్లి, కేశానుపల్లి, తంగెడ తదితర ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా యథేచ్ఛగా తెల్లరాయి అక్రమ తవ్వకాలకు పాల్పడుతోంది. భారీ ఎత్తున బ్లాస్టింగ్‌లకు పాల్పడుతూ అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచుతోంది. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎన్నికల సమయంలో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళితే.. ఘోర సంఘటనలు జరిగే ప్రమాదముంది. పోలీస్స్టేషన్లకు కూతవేటు దూరంలో బ్లాస్టింగ్లు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం
సాక్షి, గుంటూరు: జిల్లాలోని గురజాలలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అనుచరులు మరోసారి రౌడీయిజం ప్రదర్శించారు. మాజీ ఎమ్మెల్యే గడిపూడి మల్లికార్జునరావుకు చెందిన క్వారీ ఆక్రమణకు సంబంధించి ఆయన కుమారుడు ఆదినారాయణ, యరపతినేని శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దీంతో యరపతినేని అనుచరులు ఆదినారాయణపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతల అమానుష ప్రవర్తనతో మనస్తాపానికి లోనైన ఆదినారాయణ ఆత్మహత్య యత్నం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆదినారాయణ సోదరుడు కోటి మీడియాతో మాట్లాడుతూ.. యరపతినేని వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. యరపతినేని తమ క్వారీని బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. యరపతినేని ఆరాచాకాలపై పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా టీడీపీ నేతలు అతనిపై దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేతలు చికెన్ బాబు మరికొందరితో కలిసి కోటిని అక్కడి నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. -
టీడీపీ నేతల దౌర్జన్యం.. ఆదినారాయణ ఆత్మహత్యాయత్నం
-
చంద్రబాబు, కరువు.. కవలలు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు నాయుడు, కరువు.. కవల పిల్లలని, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువుతో రాష్ట్రం అల్లాడిపోతుందని మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు విమర్శించారు. కృష్ణానది ఒడ్డునే ఉన్న పల్నాడు ప్రాంతంలో కరువు విలయ తాండవం చేస్తున్నా బాబు సర్కారు పట్టించుకోలేదని మండిపడ్డారు. గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి అధ్యక్షత దాచేపల్లిలో గురువారం జరిగిన ‘పల్నాడు గర్జన’ సభలో ఆనం ప్రసంగించారు. కృష్ణా నదిలో నీరు ఉన్నప్పటికీ పంటలకు ప్రభుత్వం నీరు విడుదల చేయక పోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టాలపాలై అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు నవనిర్మాణ దీక్ష, ధర్మ పోరాటమంటూ దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జత కట్టడం చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. సీఎం రమేష్, సుజన చౌదరిలు వేల కోట్లు దోచుకున్నట్లు ఐటీ, ఈడీ సోదాల్లో తేలితే వారిపై కక్ష సాధింపుగానే దాడులు జరిగాయంటూ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ల నుంచి లోకేశ్‌కు కమీషన్లు ఇప్పించే బ్రోకర్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పల్నాడును అవినీతి మయం చేసిన యరపతినేని పౌరుషాల పురిటిగడ్డ పల్నాడును యరపతినేని అవినీతిమయంగా మార్చారని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే అంటే దోపిడీ దొంగలనే మాదిరిగా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే చంద్రబాబు రాహుల్‌ను చంకన పెట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పంటలు వేసుకోండి.. నీరిస్తామని పల్నాడు రైతులకు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు నిండా ముంచారని మండిపడ్డారు. హైకోర్టు విచారణకు ఆదేశించగానే తెల్లరాయిని దోచేసిన యరపతినేని తప్పుకొని.. డ్రైవర్లు, పాలేర్లను కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్, పేకాట క్లబ్‌లు, గంజాయి సరఫరా, క్రికెట్ బెట్టింగ్‌లు, అనేక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా చివరకు లైంగిక దాడులకు నిలయంగా మార్చేశారని మండిపడ్డారు. లైమ్‌సిటీగా ఉన్న పిడుగురాళ్లను క్రైమ్ సిటీ మార్చేశారన్నారు. దేశంలో పంటలకు సెలవు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. అధికారులు, పోలీసుల అండతో అక్రమాలు అధికారులు, పోలీసులను అడ్డు పెట్టుకుని యరపతినేని వందల కోట్లు దోచుకున్నారని వైఎస్సార్సీపీ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. యరపతినేనికి దమ్ముంటే కాసు బ్రహ్మనందరెడ్డి మనవడు కాసు మహేష్‌రెడ్డిపై గెలవాలని సవాల్ చేశారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడు ప్రాంత ప్రజలు తమపై ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో, ఎక్కడ అక్రమ కేసుల్లో ఇరికిస్తారోననే భయాందోళనలో జీవిస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడు పల్లెల్లో యరపతినేని చిచ్చుపెట్టే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబుకు పల్నాడు ప్రాంత రైతులు గుర్తుకు వచ్చారని, పక్కనే ఉన్న కృష్ణానది నీరు ఇవ్వలేని దద్దమ్మ.. ఎక్కడో ఉన్న గోదావరి నీరు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, వినుకొండ, చిలకలూరిపేట నియోజకవర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజని, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి.కృష్ణారెడ్డి తదితరులు ప్రసంగించారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, యనుమల మురళీధర్‌రెడ్డి, దేవళ్ల రేవతి, జంగా కోటయ్య, జెడ్పిటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
నేనే రాజు.. నేనే మంత్రి
పల్నాడు ప్రాంతంలోని సున్నపురాయి, ఖనిజ నిక్షేపాల అక్రమ తరలింపులో తెర వెనుక సూత్రధారి. కోర్టు నోటీ సులు అందుకున్న ప్రజాప్రతినిధి. ఆయన గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో అడుగుపెడితే చాలు పోలీస్ వాహనాలు ఎదురొచ్చి మరీ స్వాగతం పలుకుతాయి. మంత్రులకు కూడా లేని ఆర్భాటపు హంగులు ఆయన వెన్నంటే నడుస్తాయి. నిబంధనలన్నీ తన అధికార పీఠం కింద నలిగిపోతుంటాయి. జిల్లా పోలీస్ బాస్‌లకే తెలియకుండా ఎస్కార్ట్ వాహనాలు ఆయన కాన్వాయ్‌లో వచ్చి చేరుతుంటాయి. చిన్నబాబు అండతో ప్రజాస్వామ్య విలువలకు పాతర పడుతుంటాయి. ఆయనే అక్రమ మైనింగ్‌కు కేరాఫ్‌గా మారిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్ వ్యవస్థను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. అదెలాగో ఒక్కసారి చూడండి. సాక్షి, గుంటూరు: ఆయన స్పీకర్ కాదు.. మంత్రి కాదు.. కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే... ఎటువంటి కేబినెట్ హోదాగానీ, రాష్ట్రస్థాయిలో ప్రొటోకాల్ పదవిగానీ లేవు.. ఉన్నదల్లా అక్రమ మైనింగ్ ఆరోపణలు మాత్రమే.. ఆయన వస్తున్నారనే సమాచారం అందీ అందగానే అర గంట ముందు నియోజకవర్గ ముఖ ద్వారం వద్ద టీడీపీ నేతలతోపాటు, రెండు, మూడు పోలీసు వాహనాలు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తూ ఉంటాయి. ఇదేంటి ఏ ఎమ్మెల్యేకూ ఈ స్థాయిలో ప్రోటోకాల్ ఇవ్వరు కదా..! అని ఆలోచిస్తున్నారా ? చినబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడు.. పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న ప్రజాప్రతినిధి.. ఆయనే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. చినబాబు అండ ఉండడంతోనే హోంమంత్రికి కూడా లేని విధంగా ఈయనకు కాన్వాయ్‌ను ఏర్పాటు చేసి పోలీసులు స్వామి భక్తిని చాటుకుంటున్నారు. హోదా లేకపోయినా.. జిల్లాలో స్పీకర్‌తోపాటు, ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎంపీలతోపాటు కేబినెట్ హోదా ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. పోలీసు శాఖలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని పరపతి వేరు. మంత్రులు జిల్లాలో ఎక్కడకు వెళ్ళినా సం బంధిత పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో వాహనం ఎస్కార్ట్‌గా వెళుతుంది. అయితే యరపతినేని మా త్రం నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గమైన మాచర్ల వరకు ఎక్కడకు వెళ్ళినా ప్రత్యేక పో లీసు వాహనం వెంట నడుస్తుంది. ఆయన కోసం పిడుగురాళ్ళ పోలీసు స్టేషన్లో హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ప్రత్యేక ఎస్కార్ట్ కోసం ఉంచా రు. పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాల్లో ఎక్కడకు వెళ్లినా ఈ వాహనం ఆయన కాన్వాయ్ ముం దు సైరన్ మోగిస్తూ దూసుకుపోతుంది. ఈ వాహనంతోపాటు, ఆయా పోలీసు స్టేషన్ల సీఐలు ఎస్కా ర్ట్ ఇస్తూ ఆయన కాన్వాయ్‌ను ఫాలో అవుతారు. మళ్లీ ఆయన నియోజకవర్గం దాటిన తరువా త మాత్రమే వెనక్కు వస్తుంది. రాష్ట్రంలోనే కాదు దే శంలో ఏ ఎమ్మెల్యేకు పోలీసులు ఈ స్థాయిలో ప్రో టోకాల్ పాటిస్తున్న దాఖలాలు లేవని అధికా ర పార్టీ ప్రజాప్రతినిధులే చెబుతున్నారు. ప్రభు త్వం వ్యవస్థలను ఏ స్థాయిలో దుర్వినియోగం చే స్తున్నారో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాల ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నా రు. విజయవాడ నుంచి ప్రత్యేక వాహనం గతంలో గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి పిడుగురాళ్లకు ప్రత్యేక వాహనాన్ని పంపి యరపతినేని కాన్వాయ్‌కు కేటాయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ ఇవ్వడంపై ఆగ్రహించిన జిల్లా ఉన్నతాధికారులు.. ఆ వాహనాన్ని వెనక్కి పిలిపించారు. దీంతో చిన్నబుచ్చుకున్న ఎమ్మెల్యే తన అధికారాన్ని ప్రయోగించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా విజయవాడ నుంచి హైవే పెట్రోలింగ్ వాహనాన్ని పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తెప్పించారు. ఎమ్మెల్యే యరపతినేని తన అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారో దీనిని బట్టి అర్థమవుతోంది. ఆయన అధికార దుర్వినియోగంపై ప్రతిపక్షాలతోపాటు, సొంత పార్టీ నేతలు సైతం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ మండిపడుతున్నారు. అధికార దుర్వినియోగం ఎమ్మెల్యే యరపతినేని అధికార దుర్వినియోగం చేస్తున్నారు. నిత్యం ఒక సీఐ, ఎస్సైతో వాహనాలతో ముందు వెళుతూ పోలీసులను ఇష్టానురీతిగా వినియోగించుకుంటున్నారు. అంబులెన్సు వచ్చినా దారి ఇవ్వకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నుకున్న ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.-కొఠారి నరసింహారావు, పిడుగురాళ్ల ఇది సరైన పద్ధతి కాదు ముందు రెండు పోలీసు వాహనాలు, వె నుక ఐదారు స్కార్పియోలతో కాన్వాయ్. ఎస్సై, సీఐ కూడా కాన్వాయ్‌లో ఉంటారు. ఇతను ఎవరా అని ఆరా తీస్తే స్థానిక ఎమ్మెల్యే. ప్రజలకు అందుబాటులో ఉండని ఆయన.. ఇలా పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తూ తిరుగుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. – జానపాడు ఖాశిం, పిడుగురాళ్ల -
టీడీపీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌పై విచారణ
సాక్షి, గుంటూరు:టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీసీఐడీ విచారణ ప్రారంభించింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న ఈ దందాపై ఎట్టకేలకు విచారణను ప్రారంభించారు. దీనిలో భాగంగా సీబీఐ, మైనింగ్ అధికారులు పిడుగురాళ్ల పీఎస్‌కు చేరుకున్నారు.18 ఏళ్ల మైనింగ్ లావాదేవీలపై సీబీఐ విచారణ జరుపుతోంది. సున్నం తయారీ మిల్లర్లతోనూ సమావేశం ఏర్పాటుచేశారు. అంతకుముందు అక్రమ మైనింగ్ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. యరపతినేనికి క్లీన్ చిట్ ఇవ్వటానికే... గురజాల అక్రమ మైనింగ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే యరపతి శ్రీనివాస రావుకు క్లీనచీట్ ఇవ్వటానికే సీఐడీ విచారణను జరుపుతున్నారని వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. సీబిఐతో జరపాల్సిన విచారణను సీఐడీతో జరిపించాల్సిన అవసరమేంటని నిలదీశారు. టీడీపీకి సీఐడీ తోక సంస్థ అని, ఏ ఎమ్మెల్యే నైనా విచారించిన ఘనత సీఐడికి ఉందా అని ప్రశ్నించారు. ఐదు వందల కోట్లు దోచిన స్కాంను సీబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డెబ్బై వేలు విలువ చేసే భూములను అప్పట్లోనే రెండు మూడు లక్షల చొప్పున కొన్నారని, ఈ భూములపై యరపతినేని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..?