సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్ కేసు విచారణలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అనుచరులు 13 మందితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖపట్నం ఏసీబీ పోలీసుస్టేషన్‌లో సీబీఐ దర్యాప్తు అధికారి పి.విమలాదిత్య పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి గ్రామాల్లో 2010 జనవరి నుంచి 2018 ఆగస్టు వరకు సున్నపురాయి గనుల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లుగా మైనింగ్ విభాగం గుంటూరు–2 అసిస్టెంట్ డైరెక్టర్ బి.జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ, 2018లో అక్రమ మైనింగ్‌పై పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న విడుదల చేసిన నోటిఫికేషన్‌ను, అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఎఫ్‌ఐఆర్‌లో జతచేశారు.
నిందితుల్లో యరపతినేని అనుచరులు
1. నెల్లూరి శ్రీనివాసరావు (కేశానుపల్లి)
2. వేముల శ్రీనివాసరావు (నారాయణపురం, నడికుడి)
3. ఓర్సు వెంకటేశ్వరరావు (నడికుడి)
4.వేముల ఏడుకొండలు (నారాయణపురం, నడికుడి)
5. ఇర్ల వెంకటరావు (నారాయణపురం, నడికుడి) 6. బత్తుల నరసింహారావు (దాచేపల్లి)
7. మీనిగ అంజిబాబు (జనపాడు)
8. గ్రంధి అజయ్‌కుమార్ (పిడుగురాళ్ల)
9. జి.వెంకట శివకోటేశ్వరరావు (పిడుగురాళ్ల)
10. ఓర్సు ప్రకాశ్ (కొండమోడు–రాజుపాలెం)
11. వర్ల రత్నం (పిడుగురాళ్ల) 12. నంద్యాల నాగరాజు (కొండమోడు–రాజుపాలెం) 13. ఆలపాటి నాగేశ్వరరావు (ధరణికోట–అమరావతి) సహా మరో నలుగురు కేసులో నిందితులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment