CBI case
-
నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం(జులై 17) విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఇదే స్కామ్‌లో సీబీఐ కేసులో ఇంకా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉండటంతో కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
స్వస్థలం ఉండి నియోజకవర్గమైనా.. ఉండేది మాత్రం రాజధానుల్లోనే.. సంక్రాంతి కోడిపందాల సమయంలో హడావుడి తప్ప మిగిలిన రోజుల్లో నియోజకవర్గానికి వచ్చింది అరుదే.. రచ్చబండంటూ.. అందలమెక్కించిన వారిపై నోరుపారేసుకోవడం తప్ప ఎంపీగా తనను గెలిపించిన ప్రజల వైపు కన్నెత్తి చూసింది లేదు.. ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదు.. ఆయనే మాజీ ఎంపీ, టీడీపీ ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు. ఢిల్లీలో తన బిల్డప్ పాచికలు పారకపోవడంతో ఉండిలో టీడీపీ అభ్యర్థిగా గెలుపు కోసం ఆపసోపాలు పడుతున్నారు. సాక్షి, భీమవరం: బ్యాంకు అప్పులకు సంబంధించిన వ్యవహారాలు, సీబీఐ కేసుల నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటూ లాబీయింగ్ చేసుకునేందుకు ఎంపీ సీటుపై చాలానే ఆశలు పెట్టుకున్నారు రఘు రామకృష్ణరాజు. తానే నరసాపురం కూటమి అభ్యర్థినంటూ తాడేపల్లిగూడెం జెండా సభలో స్వయంగా ప్రకటించేసుకున్నారు. ఇంతకన్నా భారీ సభ ఏర్పాటు చేస్తానంటూ బిల్డప్‌లూ ఇచ్చారు. అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. కేంద్రంలో ఆయన పలుకుబడి ఏ పాటిదో సీట్ల కేటాయింపుల్లోనే తేలిపోయింది. బీజేపీ సీటు మరొకరికి ఇవ్వడంతో ఏం చేయాలో పాలుపోలేదు. మరికొద్ది రోజుల్లో మంచి మాట వింటారంటూ మీడియా ముందు బిల్డప్‌లు ఇస్తూ ఎన్ని పైరవీలు చేసినా, జిల్లాలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరితో సంప్రదింపులు చేయించినా బీజేపీ నిర్ణయాన్ని మార్చలేకపోయారు. ఏదో క చోట నుంచి పోటీ చేయకపోతే తన బిల్డప్‌లు పనిచేయవనుకున్నారేమో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు సీటుకు ఎసరుపెట్టి ఉండి అసెంబ్లీ నుంచి పోటీలో నిలిచారు. గెలుపు కోసం ఆపసోపాలు గత ఎన్నికల ప్రచారంలో తప్ప స్వతహాగా రఘురామకృష్ణరాజు ప్రజల మధ్య తిరిగింది ఏమీలేదు. నియోజకవర్గానికి వచ్చినా సొంత సామాజికవర్గంలోని కొందరితో తప్ప మిగిలిన సామాజిక వర్గాల వారిని పట్టించుకున్నది లేదు. నిత్యం తన సొంత వ్య వహారాల్లో తలమునకలై ఉండే ఆయనకు, నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి కష్టాలు, మౌలిక పరమైన అవసరాల గురించి అవగాహన ఏ మేరకు ఉందనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు ఆయనకు అదే పెద్ద సమస్యగా తయారైందని స్థానికంగా చర్చ నడుస్తోంది. ఎల్లప్పుడూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ అభివృద్ధికి అహరి్నశలు పాటుపడిన వైఎస్సార్సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, మరోపక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కలిగి, ప్రస్తుతం టీడీపీ రెబల్‌గా బరిలో నిలిచిన వేటుకూరి వెంకట శివరామరాజు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మునుపెన్నడూ లేని విధంగా గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం అధికారపక్ష అభ్యర్థి పీవీఎల్‌కు లాభించే అంశం కావడంతో పాటు ఇప్పటికే ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు. దళితులు, క్రైస్తవులపై చిన్నచూపు దళితులు, క్రైస్తవులు టీడీపీకి ఓట్లే వేయరన్న భావనలో రఘురామకృష్ణరాజు వారిని చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం ఎక్కువగానే ఉంది. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారానికి ఆయన పెద్దగా ప్రాధాన్యమివ్వడం లేదంటున్నారు. ఎప్పు డూ ఢిల్లీ, హైదరాబాద్‌లో ఉంటూ నియోజకవర్గ ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరని, సామాన్యులకు అపాయింట్మెంట్ దొరకడం కష్టమేనంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం రఘురామను ఇరకాటంలో పడేస్తుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. తన ఎన్నికల ప్రచారానికి పెద్దగా స్పందన లేకపోవడం, రోజురోజుకూ విజయావకాశాలు సన్నగిల్లుతుండటంతో నిరాశకు లోనై చిన్నపాటి విషయాలకు కేడర్‌పై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని సమాచారం. అసమ్మతి సెగలు టీడీపీకి చెందిన కొందరు నేతలు పార్టీని వీడి రెబల్‌గా పోటీలో ఉన్న శివరామరాజు వెంట వెళ్లిపో గా మిగిలిన వారిలో అధిక శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్గమే. సీటు మార్చొద్దంటూ రామరాజుకు మద్దతుగా ఆందోళన చేసిన టీడీపీ నాయకులను బెట్టింగ్రాయుళ్లని రఘురామ అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీలో అంతర్గతంగా అసమ్మతి జ్వాలలు రగిలిస్తూనే ఉంది. పైకి రామరాజుతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్నా సిట్టింగ్ సీటును లాక్కోవడంపై ఆయన వర్గం ఎంత వరకు తనకు సహకరిస్తారనే అనుమానం రఘురామను వెంటాడుతోందంటున్నారు. జనసేన కేడర్‌పైనే ఆయన నమ్మకం పెట్టుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కాపులను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కాపు యువకులపై కేసులు పెట్టి స్టేషన్లో పెట్టించిన సంఘటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘మీరు కాపు కాసేవారు మీ పని మీరు చేసుకోండి.. నార తీసే వృత్తి వేరు, తాట తీసే వృత్తి వేరంటూ’ ఆయన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో జనసేన కేడర్ అన్నీ మర్చిపోయి ఆయనకు ఎంతవరకు కలిసివస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్.. అందుకేనా ?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. యూపీఏ హయంలో ప్రఫుల్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15న హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. శరద్‌పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీని ఆయన మేనల్లుడు అజిత్‌పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అవసరం లేకున్నా ఎయిర్ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్‌పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. ఇదీ చదవండి.. బీజేపీకి అర్థం కావడం లేదు.. చిదంబరం -
విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ విచారణలో సంచలన విషయాలు..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెచ్చింది. ఈ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులోనూ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. వివరాల ప్రకారం.. విశాఖ పోర్టు డ్రగ్స్ కేసుపై సీబీఐ దృష్టిసారించింది. ఈ క్రమంలో సంధ్యా ఆక్వాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ సంధ్యా ఆక్వా పాత్ర ఉన్నట్టు సీబీఐ గుర్తించింది. అలాగే, లిక్కర్ స్కాంకు పాల్పడిన సిండికేట్‌లో సంధ్యా ఆక్వా భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. దీంతో.. మద్యం, డ్రగ్స్ మాఫియా గుట్టును చేధించే పనిలో సీబీఐ దూకుడు పెంచింది. ఇక, పది మంది సీబీఐ అధికారులు స్థానిక పోలీసుల సహకారంతో కాకినాడలోని సంధ్యా ఆక్వా కంపెనీలో సోదాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు ఆ కంపెనీని పరిశీలించారు. ఇదే సమయంలో కంటైనర్లలో మెటీరియల్‌కు సంబంధించి మరిన్ని శాంపిల్స్‌ను విశాఖలో పరిశీలించగా ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. ఇది కూడా చదవండి: విశాఖ డ్రగ్స్ కేసు: చంద్రబాబు ఇంగితం లేని మాటలు -
శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు.. చిక్కుల్లో ప్రముఖ యూట్యూబర్!
అందాల తార, తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్రీదేవి. కానీ ఉహించని విధంగా దుబాయ్‌లోని ఓ హోటల్లో కన్నుమూసింది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న తుదిశ్వాస విడిచింది.బాలీవుడ్ నిర్మాత బోనీ కపూప్ పెళ్లాడిన శ్రీదేవికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పెద్దకూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరలో కనిపించనుంది. మరోవైపు చిన్నకూతురు ఖుషీ కపూర్ సైతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే శ్రీదేవి మరణంపై ఒడిశాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సహా పలువురు ప్రముఖుల పేర్లతో నకిలీ లేఖలను యూట్యూబ్‌లో ఉంచింది. శ్రీదేవి మరణంపై విచారణను రెండు ప్రభుత్వాలు దాచిపెడుతున్నాయంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో ఆమెపై గతేడాది ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆమె యూట్యూబ్ వీడియోలో ఉంచిన పత్రాలు నకిలీవని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా శ్రీదేవి మరణానికి స్పాన్సర్‌గా ప్రభుత్వాన్ని కించపరిచేలా పదేపదే మాట్లాడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి లేఖలతో పాటు సుప్రీంకోర్టుకు సంబంధించిన పత్రాలు, యూఏఈ ప్రభుత్వం నుంచి వచ్చిన రికార్డులు నకిలీవని తేలిందని న్యాయవాది ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆయన ఫిర్యాదుతో యూట్యూబర్ దీప్తితో ఆమె లాయర్ భరత్ సురేశ్ కామత్‌లపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తానికి శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేసి ఇబ్బందుల్లో ఇబ్బందుల్లో పడ్డారు యూట్యూబర్. తాజాగా సీబీఐ ఛార్జిషీట్ వేయడంపై దీప్తి స్పందించారు. ఆ ఛార్జ్ షీట్ నమ్మేలా లేదని దీప్తి ఆరోపించారు. నా స్టేట్మెంట్ను రికార్డ్ చేయకుండా ఛార్జిషీట్ దాఖలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. కాగా.. గతేడాది డిసెంబర్ 2న భువనేశ్వర్‌లోని ఆమె నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించి ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుంది. శ్రీదేవి మరణంతో పాటు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో జరిగిన చర్చల్లోనూ దీప్తి చురుకుగా పాల్గొంది. -
డీకే శివకుమార్ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసుపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు. డీకే కేసులో సీబీఐ విచారణ జరిపేందుకు గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి(కన్సెంట్) అక్రమమని చెప్పారు. తాము ఆ అనుమతిని ఉపసంహరించుకుంటామని చెప్పారు. ‘సాధారణంగా సీబీఐ కేసుల్లో ఎమ్మెల్యేలకు స్పీకర్, మంత్రులకు గవర్నర్ విచారణ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డీకే కేసులో కేలం గవర్నర్ మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పీకర్ పర్మిషన్ ఇవ్వలేదు. డీకే ఎమ్మెల్యే కూడా. ఆయనపై సీబీఐ విచారణజరపాలంటే స్పీకర్ అనుమతి కావాలి. స్పీకర్ అనుమతివ్వనందున సీబీఐ విచారణకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతి అక్రమం’ అని సిద్ధరామయ్య తెలిపారు. ‘అయితే డీకే అక్రమాస్తుల కేసులో గత ప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన అనుమతిపై ప్రస్తుతం హై కోర్టులో ఉన్న కేసు గురించి నేను మాట్లాడను. ప్రభుత్వం మాత్రం అనుమతి ఉపసంహరిస్తుంది. ఆ అనుమతి కేవలం అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప మౌఖిక ఆదేశాల మేరకు ఇచ్చింది’ అని సిద్ధరామయ్య అన్నారు. 2013 నుంచి2018 వరకు సిద్ధరామయ్య ప్రభుత్వంలో డీకే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ టర్ములో ఆయన అక్రమంగా 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విచారణకుగాను తరువాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం సీబీఐకి కన్సెంట్ ఇచ్చింది. పబ్లిక్ సర్వెంట్లను విచారించాలంటే సీబీఐకి ప్రభుత్వ కన్సెంట్ తప్పనిసరి. తాను మంత్రిగా ఉన్నప్పటి అక్రమాస్తుల కేసులో కేవలం గవర్నర్ మాత్రమే కన్సెంట్ ఇచ్చారని, స్పీకర్ కన్సెంట్ ఇవ్వలేదని పేర్కొంటూ కేసు విచారణను కొట్టి వేయాలని డీకే ఇప్పటికే హైకోర్టులో కేసు వేశారు. ఇదీచదవండి..చైనా కొత్త వైరస్ కేసులతో ప్రమాదం లేదు : భారత ఆరోగ్య శాఖ -
వివేకా హత్య కేసులో గత చార్జ్ షీట్ కు వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్ షీట్
-
Karnataka CM Post: డీకే విషయంలో కాంగ్రెస్ తటపటాయింపు!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పంచాయితీ ఎటు తేలడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి స్పష్టమైన మెజార్టీ అందుకున్న హస్తం పార్టీకి.. ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం కష్టతరంగా మారింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. అయితే ముఖ్యమంత్రి రేసులో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కేసుల గండం చుట్టుముడుతోంది. డీకే శివకుమార్‌పై నమోదైన సీబీఐ కేసులు.. కాంగ్రెస్‌ను కలవరపెడుతున్నాయి. డీకేను సీఎంగా నియమిస్తే సీబీఐ ఏమైనా ఇబ్బంది పెడుతుందా అన్న ఆలోచనలో పడింది హైకమాండ్. దీనికి తోడు కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్‌ను సీబీఐ బాస్‌గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. కాగా 2020-23 మధ్య ఆయనపై 13 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికీ శివకుమార్ పై 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2013-18లో మంత్రిగా డీకే అక్రమంగా ఆస్తులు సంపాదించారని సీబీఐ అభియోగం మోపింది. ఈనెల 30న డీకే అక్రమాస్తుల కేసు విచారణ కూడా ఉంది. అంతేగాక అక్రమాస్తుల కేసులో ఇప్పటికే ఓసారి అరెస్టై విడుదలయ్యారు శివకుమార్. చదవండి: కర్ణాటక సీఎం ఎవరు?.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. కర్ణాటక ఏఐసీసీ ఇంచార్జి రణదీప్ సింగే సూర్జేవాలాతో డీకే సమావేశం ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు చర్చలు కొనసాగాయి. డీకే శివకుమార్‌ను బుజ్జగించేందుకు సుర్జేవాలా చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘కాంగ్రెస్ కోసం నేను ఎంతో పనిచేశాను. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి.. లేదంటే అసుల కేబినెట్లో స్థానం కూడా వద్దు’ సూర్జేవాలాకు డీకే తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి సిద్ధరామయ్య కాగా ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లారు. సాయంత్రం రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. కాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో ఏఐసీసీ బృందం సమావేశం కానుంది. కేబీనెట్ కూర్పుపై కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకోనుంది. అయితే సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు చెరో రెండున్నరేళ్లు కర్ణాటక సీఎం పదవి ఇచ్చే ప్రతిపాదనను మల్లికార్జున ఖర్గే తెచ్చినట్లు తెలుస్తోంది. దీనిని సిద్దరామయ్యా అంగీకరించినా డీకే శివకుమార్ మాత్రం నో చెప్పినట్టు సమాచారం. ఇక నూతన ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం మే 18న జరుగనుంది. ఇదీ చదవండి: మల్లికార్జున ఖర్గేకు షాక్.. పంజాబ్ కోర్టు సమన్లు -
ఢిల్లీ లిక్కర్ స్కాం... ఆగని ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దాడులు శుక్రవారం మళ్లీ దేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల అధికారులు దాడులు కొనసాగించారు. అలాగే బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్‌లోనూ దాడులు సాగాయి. మాదాపూర్‌కు చెందిన అభినవ్‌రావ్, ఓ తెలుగు దినపత్రికలో పెట్టుబడులు పెట్టిన అభిషేక్‌రెడ్డి, ఎం.గోపాలకృష్ణ, కూకట్‌పల్లికి చెందిన మరో వ్యక్తి ఇంట్లో దాడులు నిర్వహించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ముఖ్య అనుచరుడి ఇంట్లో ఈడీ ముందుగా సోదాలు జరిపింది. దినేష్ అరోరా ఇంటితో పాటు ఆఫీస్, అతని స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఏ11గా ఉన్న దినేష్‌కు చెందిన అకౌంట్లోకి సమీర్ మహేంద్రు ద్వారా రూ.కోటి నగదు బదిలీ జరిగింది. ఈ కోణంలో సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సమీర్ మహేంద్రును ఈడీ కస్టడీలోకి తీసుకుంది. అతను ఇచ్చిన వాంగ్మూలంతోనే అధికారులు నాలుగు చోట్ల సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. -
వాన్ పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు ఊరట
-
‘ఐపీఎల్ బెబెట్టింగ్’పె సీబీఐ దూకుడు
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచుల్లో బెట్టింగ్ వ్యవహారంపై సీబీఐ దూకుడు పెంచింది. ఈ మేరకు రెండు కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. 2019లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో భారీగా బెట్టింగ్ జరిపినట్టు పక్కా సమాచారం అందటంతో శనివారం దేశంలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు జోధ్‌పూర్, జైపూర్, హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. బెట్టింగ్‌లో వచ్చిన డబ్బు కోసం బ్యాంక్ అకౌంట్లు సైతం తీసినట్టు సీబీఐ గుర్తించింది. దీనితో పలు ప్రైవేట్ వ్యక్తులతోపాటు అనుమానిత ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదుచేసినట్టు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. మ్యాచ్‌ల గెలుపు ఓటములను సైతం నిర్ణయించేలా బెట్టింగ్ మాఫియా పాకిస్తాన్ నుంచి కథ నడిపించినట్టు సీబీఐ అనుమానిస్తోంది. లావాదేవీల నిర్వహణ కోసం ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంకు అకౌంట్లు తెరవడంతోపాటు కేవైసీ(నో యువర్ కస్టమర్) డాక్యుమెంట్లలో పలువురు బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇలా ఒక గ్యాంగ్ రూ.11 కోట్లకు పైగా లావాదేవీలు జరపగా, మరో గ్యాంగ్ రూ.1.5 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్టు సీబీఐ ఆధారాలు సేకరించింది. రెండు ఎఫ్ఐఆర్లు పాకిస్తాన్‌లోని వఖాస్ మాలిక్ అనే వ్యక్తితో రెండు గ్యాంగులు బెట్టింగ్ దందా సాగించినట్టు సీబీఐ అనుమానిస్తోంది. రూ.11 కోట్ల మేర లావాదేవీ నడిపిన కేసులో హైదరాబాద్‌కు చెందిన దిలీప్ కుమార్, గుర్రం సతీశ్, గుర్రం వాసును నిందితులుగా చేర్చినట్టు తెలిసింది. వీరు 2013 నుంచి ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్నట్టు సీబీఐ అనుమానిస్తోంది. మరో ఎఫ్ఐఆర్లో ఢిల్లీ, జోధ్‌పూర్, జైపూర్‌కు చెందిన సజ్జన్ సింగ్, ప్రభులాల్మీనా, రామ్ అవతార్, అమిత్ కుమార్ శర్మతోపాటు మరికొంత మంది గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులను నిందితుల జాబితాలో చేర్చినట్టు తెలిసింది. వీరు 2010లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్ పాల్పడినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. -
'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!!
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ ప్రస్తావించిన ‘అజ్ఞాత యోగి’ గురించి మరిన్ని వివరాలు బైటపడుతున్నాయి. సదరు యోగి పేరిట ఈమెయిల్ ఐడీని సృష్టించినది ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) ఆనంద్ సుబ్రమణియన్ అని కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వెల్లడించింది. రుగ్యజుర్సామ @అవుట్‌లుక్‌డాట్‌కామ్ పేరిట క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడీని ఆయనే ఉపయోగించేవారా లేక మరొకరు ఎవరైనా ఆపరేట్ చేసే వారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్యేక సీబీఐ కోర్టుకు తెలిపింది. అలాగే యోగి, చిత్రాకు మధ్య ఈమెయిల్ ద్వారా జరిగిన ఉత్తరప్రత్యుత్తరాల్లో ప్రస్తావనకు వచ్చిన సీషెల్స్ పర్యటనపై కూడా దృష్టి పెడుతున్నట్లు వివరించింది. చిత్రా సిఫార్సుల మేరకు సుబ్రమణియన్‌ను జీవోవోగా నియమించడం తదితర చర్యల ద్వారా ఎన్ఎస్ఈలో పాలనాపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆమెతో పాటు ఇతరులపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. నిరాకారుడైన ఓ సిద్ధపురుషుడు తనకు పలు అంశాల్లో మార్గదర్శకత్వం చేసే వారంటూ విచారణ సందర్భంగా చిత్రా వెల్లడించడంతో అజ్ఞాత యోగి పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో చిత్రా, తదితరులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు ప్రకటించింది. అటు వివాదాస్పద ఎన్ఎస్ఈ కో–లొకేషన్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ, తాజా కేసుపై కూడా విచారణ జరుపుతోంది. చదవండి: మూడు కోట్ల కార్లు..కోటి రూపాయల డైనింగ్ టేబుల్.. చివరికి -
‘వివేకా హత్యపై బాబు డైరెక్షన్లో దుష్ప్రచారం’
కడప సెవెన్‌రోడ్స్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో వైఎస్ కుటుంబంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్లో దుష్ప్రచారం జరుగుతోందని వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రం కడపలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వివేకా హత్య జరిగిందని గుర్తుచేశారు. చంద్రబాబు అప్పుడే నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి నిజాలు ఎందుకు వెలికి తీసుకురాలేదని ప్రశ్నించారు. నేడు పథకం ప్రకారం స్క్రిప్ట్ తయారు చేసుకుని దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారని చెప్పారు. వైఎస్ కుటుంబానికి రక్తపు మరకలు అంటించాలని ప్రయత్నించడం దురదృష్టకరమన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై బురద చల్లేందుకు యత్నించడం అన్యాయమని చెప్పారు. అవినాష్‌రెడ్డి సౌమ్యుడని, హత్యారాజకీయాలను ఏనాడూ ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. ఆయన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని యత్నించడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివేకానందరెడ్డి స్వయాన చిన్నాన్న అని, ఆ కుటుంబాన్ని సీఎం పట్టించుకోలేదనడం దుర్మార్గమని చెప్పారు. వైఎస్ కుటుంబానికి ఉభయ రాష్ట్రాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలున్నాయన్నారు. వివేకా కుటుంబం చంద్రబాబు ఉచ్చులో పడరాదని కోరారు. వైఎస్ కుటుంబంలో చిచ్చుపెట్టడం ద్వారా రాజకీయలబ్ధి పొందాలని చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్యకేసులో దోషులను గుర్తించాలని తాము ఆరోజే డిమాండ్ చేశామని గుర్తుచేశారు. తమకు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి తదితరులపై అనుమానాలున్నాయని చెప్పారు. సీబీఐ అధికారులు వారిని ఎందుకు విచారించరని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను చట్టానికి అప్పగించాలన్నారు. వివేకా కుటుంబం అపోహాలు వీడి నిష్పక్షపాతంగా దర్యాప్తు సాగేందుకు యత్నించాలని కోరారు. -
ఈపీఎఫ్ ఖాతాల్లో అక్రమాలపై సీబీఐ కేసు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) ఖాతాల్లో అక్రమాలకు పాల్పడిన గుంటూరులోని ఈపీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలోని పలువురు అధికారులపై సీబీఐ బుధవారం కేసులు నమోదు చేసింది. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, చీరాల, గుంటుపల్లి తదితర చోట్ల ఈపీఎఫ్ అధికారులకు చెందిన 40 నివాసాలు, ఇతర ప్రదేశాలపై సీబీఐ విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈపీఎఫ్ అధికారులు కొందరు ప్రైవేటు కన్సల్టెన్సీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ గుర్తించింది. ఈపీఎఫ్ క్లెయిములు, సేవలు, ఉద్యోగులకు బకాయిల చెల్లింపు వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. అందుకోసం గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే మొదలైన మొబైల్ వాలెట్ల ద్వారా భారీగా లంచాలు తీసుకున్నట్టు కూడా ఆధారాలు సేకరించింది. అక్రమాలకు పాల్పడిన ఈపీఎఫ్ అధికారులపై 4 కేసులు నమోదు చేసినట్టు సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. -
రఘురామకృష్ణరాజుపై సీబీఐ చార్జ్‌షీట్
సాక్షి, అమరావతి: ఆర్థిక సంస్థలు, బ్యాంకులను మోసం చేసిన కేసులో నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులోని ట్యూటీకొరిన్‌లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఇండ్ భారత్ థర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్ అనే కంపెనీ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినందున 2019 ఏప్రిల్ 29న సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.947.71 కోట్ల మేరకు మోసం చేసిన ఇండ్ భారత్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణరాజుతో సహా ఆ కంపెనీ డైరెక్టర్లు, అనుబంధ కంపెనీలు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాంట్రాక్టర్లు కలిపి మొత్తం 16 మందిపై న్యూ ఢిల్లీలోని సీబీఐ న్యాయస్థానంలో శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరిట ఆర్థిక సంస్థలను రఘురామకృష్ణరాజు ఎలా మోసం చేశారనేది సీబీఐ ఓ ప్రకటనలో సవివరంగా వెల్లడించింది. ఇండ్ భారత్ పవర్ కంపెనీ చైర్మన్, ఎండీగా ఉన్న కె.రఘురామకృష్ణం రాజు పక్కా పన్నాగంతోనే బ్యాంకులను మోసం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. తమిళనాడులోని ట్యూటికోరిన్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆర్థిక సంస్థల కన్సార్షియం నుంచి రూ.947.71 కోట్లు రుణం తీసుకున్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ), ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్)లతో కూడిన కన్సార్షియం రుణం మంజూరు చేసింది. కానీ రఘురామకృష్ణరాజు తమిళనాడులో థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయలేదు. రుణ ఒప్పంద నిబంధనలను పాటించలేదు. రుణం ద్వారా తీసుకున్న నిధులను నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించారు. ఆ నిధులను కాంట్రాక్టర్లకు అడ్వాన్స్‌లు చెల్లించేందుకుగాను బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అనంతరం ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు హామీగా చూపించి ఆ రెండు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. వాటితో కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించినట్టుగా చూపించారు. ఆ తర్వాత ఆ రెండు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించనే లేదు. దాంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లను ఆ రుణం కింద జమ చేసుకున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం రుణం ఇచ్చిన ఆర్థిక సంస్థల కన్సార్షియం పూర్తిగా మోసపోయింది. ఆ విధంగా ఆర్థిక సంస్థల కన్సార్షియంను రఘురామకృష్ణరాజు రూ.947.71 కోట్ల మేర మోసం చేశారని సీబీఐ దర్యాప్తులో నిగ్గు తేలింది. పూర్తి ఆధారాలు సేకరించిన సీబీఐ ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో సంచలన చర్యలకు ఉపక్రమించనుందని సమాచారం. సీబీఐ చార్జిషీట్లో పేర్కొన్న నిందితులు ► ఇండ్ భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ,కె.రఘురామకృష్ణరాజు, చైర్మన్, ఎండీ, ఇండ్ ► భారత్ పవర్ మద్రాస్ లిమిటెడ్ కంపెనీ మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్, ఇండ్ భారత్ పవర్ ► మద్రాస్ లిమిటెడ్ కంపెనీ ► ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ ► ఆర్కే ఎనర్జీ లిమిటెడ్ ► శ్రీబా సీబేస్ ప్రైవేట్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కళ్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ పవర్ కమాడిటీస్ లిమిటెడ్ ► ఇండ్ భారత్ ఎనర్జీస్ మహారాష్ట్ర లిమిటెడ్ ► ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ ► సోకేయి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ► వై.నాగార్జున రావు, ఎండీ, సోకేయి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ ► ఎం.శ్రీనివాసుల రెడ్డి, చార్టెడ్ అకౌంటెంట్ ► ప్రవీణ్ కుమార్ జబద్, చార్టెడ్ అకౌంటెంట్ ► సి.వేణు, ఇండ్ భారత్ గ్రూప్స్ చార్టెడ్ అకౌంటెంట్ -
అడ్డగోలు మాటలకు అర్థం ఏమిటి?
కేంద్ర నిఘా సంస్థల దగ్గర కూడా లేని సమాచారం చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట్టుంది. అందుకే తాలిబన్లు, తాడేపల్లి అంటూ అడ్డగోలుగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే దించేయాలన్నంత కసితో ప్రకటనలు గుప్పించారు. సమస్య ఏమిటంటే– ప్రజాక్షేత్రంలో ఓటమిని ఆయన ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడం అన్న మాటే మరిచిపోయారు. రాజకీయాలను విషక్రీడగా మార్చారు. తిరిగి అధికారంలోకి రావడానికి ఎంతకైనా దిగజారడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పకనే చెబుతున్నారు. తన ప్రత్యర్థులు ఎవరిపైన అయినా తట్టెడు బురద చల్లడం మొదటినుంచీ చంద్రబాబు నైజం. ఈ విషయంలో ఆయనకు ఎన్టీఆర్ అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా, మరొకరు అయినా ఒకటే. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన రెండు ప్రకటనలు గమనించదగినవి. తన పార్టీ ఓడిపోవడం ఆయనకు జీర్ణించుకోలేని విషయమే. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎవరు కావాలని అనుకుంటే వారిని ఎన్నుకుంటారు. అయినా ప్రతిపక్షంలో ఉన్నా తామే పెత్తనం చేయాల నుకుంటే కష్టమే. ఇంతకీ బాబు చేసిన ప్రకటనలు ఏమిటో చూద్దాం. తాలిబన్లకూ తాడేపల్లికీ ఉన్న లింక్ బయటపెడతామని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని రిపేరు చేయాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఈ రెండు ప్రకటనలు చూస్తే ఏమని పిస్తుంది! తక్షణమే ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపాలు చేయా లన్న వ్యూహం ఏమైనా ఉందా అన్న సంశయం కలుగుతుంది. తాలిబన్లు అఫ్గానిస్తాన్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చి, అధికారం చేపట్టారు. ఆ తర్వాత ఎన్నో ఘాతుకాలకు పాల్పడు తున్నారు. మరి ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిని తాలిబన్లతో పోల్చ డమే కాకుండా, లింకులు బయటపెడతామని చంద్రబాబు అనడంలో ఆంతర్యం ఏమిటి? నిజంగా అలాంటి లింకులు ఉంటే కేంద్ర ప్రభు త్వానికీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకూ తెలియదా? వారికన్నా చంద్ర బాబుకే ఎక్కువ అంతర్జాతీయ నెట్వర్క్ ఉందా? ఆ దేశ అధ్యక్షుడు తెలుసు... ఈ దేశ ప్రధాని తెలుసు... తాను, బిల్ క్లింటన్, టోనీ బ్లేయర్ అంటూ గతంలో ఏవేవో కబుర్లు చెప్పేవారు. సింగపూర్, మలేíషియాలతో సంబంధం ఉందనీ, జపాన్‌కు చెందిన ప్రముఖుడిని అమరావతికి తెచ్చాననీ అనేవారు. వీటన్నింటిని బట్టి కేంద్రం కన్నా చంద్రబాబే తెలివైనవాడనీ, ఎక్కడి సమాచారం అయినా ఆయనకు ఇట్టే వస్తుందని అనుకోవాలి కదా? చంద్రబాబే స్వయంగా ఆ దర్యాప్తు సంస్థలకు తన వద్ద ఉన్న సమాచారం అందించవచ్చు కదా! తాలిబన్లతో పోల్చుతూ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించా ల్సిన సమయం వచ్చిందని చంద్రబాబు అంటున్నారు. అంటే ఇప్పటి కిప్పుడు జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే తాను ఆ కుర్చీ ఎక్కాలని ఉబలాటపడుతున్నారా! 1989–94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పక్షాన బాబు ఇలాగే మాట్లాడేవారు. దానికి ఆనాటి మంత్రి రోశయ్య ‘బాబూ... నువ్వు దిగు, దిగు... నేను ఎక్కుతా అంటే కుదర’దనీ; ‘ఉట్టి శాపనార్థాలకు ప్రభుత్వం పడిపో’దనీ అనేవారు. కానీ ఎలాగైతే నేమి 1995లో తన మామ ఎన్టీ రామారావును చంద్రబాబు పదవీచ్యు తుడిని చేశారు. అంటే ఆ ప్రభుత్వాన్ని కూలదోశారు. తాలిబన్లు మరో పద్ధతిలో అఫ్గాన్ ప్రభుత్వాన్ని కూల్చారు. మరి అలాంటప్పుడు చంద్ర బాబు ఆధ్వర్యంలోని టీడీపీ తాలిబన్ల మాదిరి వ్యవహరించిందని చెప్పవచ్చా? చంద్రబాబును తాలిబన్ అనడం లేదు. కానీ ఆయన ముఖ్యమంత్రి జగన్‌పై అలాంటి విమర్శ చేసినప్పుడు, సహజంగానే ఆయా విషయాలు స్ఫురణకు వస్తాయి. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని కూలదోసినప్పుడు కూడా ఆయా వ్యవస్థలను విజయవంతంగా చంద్రబాబు వాడుకున్నారని ప్రచారం జరిగేది. తన మామను దించినట్లుగా జగన్ ప్రభుత్వాన్ని దించడం సాధ్యమయ్యే పని కాదు కనుక, కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని ఏమైనా కుట్ర పన్నుతారా అన్న సందేహం కలగవచ్చు. ఇలాంటివి చేసేవారిని కదా తాలిబన్లు అనాలి! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్‌కు జగన్ ఒక వినతిపత్రం సమర్పిం చిన సందర్భంలో– చంద్రబాబు ప్రభుత్వంపై ఒక్క మాట అంటేనే ఇంకేముంది ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని హోరెత్తిం చారే! మరో వైపు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారే! ఇంకో సంగతి చెప్పాలి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బాబు ప్రయత్నించి అభాసుపాలయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఒకరిని కొనుగోలు చేయడం ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుని, ఆ తర్వాత వీలైతే మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాన్ని కూలదోయాలని యత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ కాస్త అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది... లేకుంటే ఆయన బాబు చేతిలో ఇబ్బంది పడవలసి వచ్చేది. ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడా నికి చేసే ప్రయత్నాన్ని కదా తాలిబన్ అని అనాలి! డ్రగ్స్ వ్యవహారానికీ, జగన్ ప్రభుత్వానికీ లింక్ పెట్టడానికి విశ్వ యత్నం చేశారు. చోటామోటా నేతలతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి మరికొందరు నేతలపై ఆరోపణలు చేయిం చారు. అక్కడ మత్స్యకారుల బోటు దగ్ధం అయితే అందులో డ్రగ్స్ ఉన్నాయని ప్రచారం చేశారట. దానిపై మత్య్సకారులు టీడీపీ ఆఫీస్ వద్ద నిరసన చెప్పారట. దీనిని వైసీపీ వారు దాడి చేశారని చంద్ర బాబు ప్రచారం చేశారు. అక్కడ ఒక ఎగుమతిదారుడితో వైసీపీ వారికి సంబంధాలు అంటగట్టే యత్నం చేశారు. తీరా చూస్తే ఆ ఎగుమతి దారుడు అలీ షాతో చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు దిగిన ఫొటోలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డి బయటపెట్టారు. పైగా స్వయంగా అలీ షా జిల్లా ఎస్పీని కలిసి తనపై విచారణ చేయాలనీ, డ్రగ్స్ ఆరోపణలు నిజం కాదని తేలితే, ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకోవాలనీ కోరారు. దాని గురించి టీడీపీ సమాధానం ఇవ్వాలి కదా? దీనిపై పోలీసులు తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇస్తే దానిపై మళ్లీ గగ్గోలు పెడుతున్నారు. ఆరోపణలు చేయడం, తర్వాత జారి పోవడం టీడీపీకి అలవాటుగా మారింది. కాకినాడలో నిజంగానే పడవలో డ్రగ్స్ ఉంటే కేంద్ర నిఘా సంస్థలు నిద్రపోతున్నాయా? ఇన్ని కబుర్లు చెప్పే జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గుజరాత్లో అంత పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడితే ఆ ప్రభుత్వాన్ని కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట అనే సాహసం చేయడం లేదేమి? ఒకప్పుడు మోదీని తీవ్రంగా దూషించిన టీడీపీ ఇప్పుడు నోరు విప్పడానికే ఎందుకు భయపడు తోంది? చంద్రబాబు పీఏ ఇంటిలో సోదాలు చేసి, రెండు వేల కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు సీబీటీడీ అధికారిక ప్రకటన చేస్తే దానిపై చంద్ర బాబు ఇంతవరకు నోరు విప్పలేదు. అలాగే పండోరా పత్రాలలో పలువురు భారత ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. వెంటనే దానిని జగన్‌కు పులిమే యత్నం చేశారు. ఇందులో జగన్ పేరు కూడా ఉండ వచ్చేమో అని టీడీపీ నేతలు అనుకున్నారట. దానిని ఈనాడు పత్రిక పెద్ద శీర్షిక పెట్టి వార్త ఇచ్చింది. తద్వారా పత్రికా ప్రమాణాలను మరింతగా దిగజార్చింది. వాస్తవంగా ఎవరిపై ఆధారాలు ఉన్నా బయటపెట్టవచ్చు. అలాకాకుండా ఒక ప్రతిపక్ష పార్టీ ఇలా అను కుంది... అలా అనుకుంది... అనుకుంటే అందులో చెత్త ఉన్నా, అలాగే రాస్తారా? అందుకే సజ్జల ఒక ప్రశ్న వేశారు. రామోజీరావు పేరు కూడా పండోరా జాబితాలో ఉందని తామెవరైనా అనుకుంటే రాస్తారా అని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందని అంటూ అలీషాతో ఆయన ఉన్న ఫొటోలను చూపించారు. లోకేశ్ హడావుడిగా దుబాయి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రాజకీయాన్ని ప్రజాసేవగా కన్నా, ఒక విషక్రీడగా చంద్రబాబు మార్చారన్న విమర్శలకు గురి అవుతున్నారు. గతంలో 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు– అసెంబ్లీలో చంద్ర బాబు మాట్లాడుతూ... కర్నూలులో ఒక అటవీ అధికారితో కుమ్మక్కై విజయభాస్కరరెడ్డి పదికోట్లు తీసుకున్నారని ఆరోపించారు. ఆ విషయాన్ని తన చాంబర్లో ఉన్న కోట్ల విన్న వెంటనే అసెంబ్లీ హాల్లోకి ఆగ్రహావేశాలతో వచ్చి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తన ప్రత్యర్థులు ఎవరిపైన అయినా, ఏ అవకాశం వచ్చినా తట్టెడు బురద చల్లడం చంద్రబాబు నైజం. ఈ విషయంలో ఆయ నకు ఎన్టీఆర్ అయినా, జగన్ అయినా, మరొకరు అయినా ఒకటే. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే అనుమానిస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిపై అనుమానం వ్యక్తం చేస్తారా అని ఏపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదిని హైకోర్టు నిలదీసింది. ఆ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీలు చేయలేదని.. అలాంటప్పుడు ఆ ఆదేశాలను ప్రస్తావిస్తూ, అనుమానాలు ఎలా వ్యక్తం చేస్తారని న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. తాను కూడా ఇలాంటి కేసుల్లో నిందితులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించానని చెప్పారు. ఇది సహేతుక కారణం కాదని.. సదరు కోర్టు ఎదుట ఉన్న పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. అత్యవసర విచారణలో.. పెట్టుబడుల కేసులో బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టులో తాను వేసిన పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ట్రాన్స్ఫర్ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ మంగళవారం భోజన విరామం తర్వాత అత్యవసర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత నెల 26న తాము దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసిందంటూ సాక్షి వెబ్సైట్లో కథనాన్ని ఉంచిందని కోర్టుకు వివరించారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రెండు వారాలపాటు దుబాయ్, మాల్దీవులు, ఇండోనేషియా దేశాల్లో పర్యటించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక కోర్టుపై అనుమానాలు ఉన్నాయని, అందువల్ల తమ పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేసి విచారించేలా ఆదేశించాలని కోరారు. అయితే.. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎప్పుడు పిటిషన్ దాఖలు చేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఏప్రిల్ నెలలో వేశామని న్యాయవాది బదులిచ్చారు. ఆగస్టు 25న తమ పిటిషన్‌పై ఆదేశాలు రావాల్సి ఉందని, అయితే విజయసాయిరెడ్డి బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ తాము పిటిషన్ వేయడంతో.. రెండు పిటిషన్లపై ఈ నెల 15న ఆదేశాలు ఇస్తామని ప్రత్యేక కోర్టు పేర్కొన్నదని వివరించారు. అప్పీలు చేయకుండానే.. విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంపై అభ్యంతరం ఉన్నట్లయితే.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీల్ చేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. అప్పీల్ చేయలేదని రఘురామ తరఫు న్యాయవాది బదులిచ్చారు. అలాంటప్పుడు ప్రత్యేక కోర్టు ఆదేశాలను ఎలా ప్రస్తావిస్తున్నారని న్యాయమూర్తి నిలదీశారు. గతంలోనూ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. అప్పుడు ప్రత్యేక కోర్టు విధించిన షరతులను విజయసాయిరెడ్డి ఏమైనా ఉల్లంఘించారా అని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్‌ను ప్రశ్నించారు. అలాంటిదేమీ లేదని స్పెషల్ పీపీ తెలిపారు. అంతేగాకుండా మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సహేతుక కారణాలేవీ చూపకుండానే, బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు వెలువరించనున్న తరుణంలో ఇలా పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని స్పష్టం చేశారు. నిందితులు విదేశాల్లో పర్యటించేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనేక సార్లు ఆదేశాలు ఇస్తూ ఉంటుందని.. అంత మాత్రాన పిటిషన్ మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరడం సరికాదని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. -
ఎంపీ కవిత పీఏలం.. అంతా చూసుకుంటాం..!
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత పీఏలమంటూ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలోని న్యూగుప్తా కాలనీకి చెందిన మన్మీత్ సింగ్ లాంబా నివాసాన్ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కూల్చేయనుందని, కూల్చకుండా చూసుకుంటామని లాంబాను నిందితులు సంప్రదించారు. ఎంసీడీలో ఓ అధికారి తెలుసని, ఇల్లు కూల్చకుండా ఉండేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ కవిత నివాసంలో గురువారం రూ.లక్ష లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్‌గా ముగ్గురు నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. వారిలో రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్‌కుమార్ ఉన్నారు. లాంబా ఫిర్యాదు ప్రకారం.. ఎంసీడీలో అధికారి తనకు తెలుసని, టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏనంటూ రాజీవ్ భట్టాచార్య తొలుత పరిచయం చేసుకున్నాడు. ఎంపీ కవితకు కో–ఆర్డినేటర్ అంటూ శుభాంగి గుప్తాను పరిచయం చేశాడు. ఆ తర్వాత దుర్గేశ్కుమార్ను ఎంపీ మరో పీఏ అంటూ పరిచయం చేశాడు. ముగ్గురూ కలిసి రూ.5 లక్షలు డిమాండు చేశారు. తదనంతరం జరిపిన చర్చల్లో చివరకు రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నారు. బీష్మంబర్దాస్ మార్గ్‌లోని ఎంపీ నివాసానికి డబ్బు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లాంబా సీబీఐకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీలో నాకు పీఏలెవరూ లేరు: ఎంపీ ఢిల్లీలో తనకు వ్యక్తిగత సహాయకులు ఎవరూ లేరని ఎంపీ మాలోత్ కవిత స్పష్టం చేశారు. ఓ గృహ నిర్మాణదారుడి నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠాలో తన పీఏ ఉన్నాడంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన దుర్గేశ్ అనే వ్యక్తి కేవలం 2 నెలల కిందటే కారు డ్రైవర్‌గా చేరాడని, అతడికి స్టాఫ్ క్వార్టర్స్ ఇచి్చనట్లు వెల్లడించారు. యూపీకి చెందిన దుర్గేశ్‌కు తాను ఢిల్లీ వెళ్లినప్పుడే వాహనం ఇస్తానని, గురువారం జరిగిన ఘటన నేపథ్యంలో తక్షణమే విధుల నుంచి తొలగించానని వివరణ ఇచ్చారు. చదవండి: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
‘ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు.. చట్టానికి అతీతులా?’
ముంబై: మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ ముంబై పోలీసు కమిషనర్ పరంవీర్ సింగ్‌పై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా.. సీబీఐ విచారణ కోరుతున్నారు మీరు చట్టానికి అతీతులా’’ అని ప్రశ్నించింది. అనిల్ దేశ్‌ముఖపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ పరంవీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ని బాంబే హైకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా కోర్టు ‘‘ మీరు ఓ పోలీసు కమిషనర్. మీ కోసం చట్టాన్ని పక్కకు పెట్టాలా. మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసులు చట్టానికి అతీతులా.. మాకు ఏ చట్టాలు వర్తించవని మీ అభిప్రాయమా’’ అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాక ‘‘పోలీసు డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థానంలో ఉండి.. 30 ఏళ్లకు పైగా ఈ నగరానికి సేవలందించిన మీలాంటి ఓ వ్యక్తి వద్ద నుంచి ఇలాంటి కఠిన నిజాలు వెలువడటం శోచనీయం. అనిల్ దేశ్‌ముఖ్ అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించాలని మీరు కోరుతున్నారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలాంటి విచారణ జరపలేం అనే విషయం మీకు తెలియదా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు. నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అది మీ బాధ్యత కాదా’’ అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు కలిగిన వాహనం కలకలం కేసుకు సంబంధించి పోలీసు సహచరుల తప్పిదాలకు కమిషనర్ పరంవీర్ సింగ్‌ను బాధ్యుడిగా చేస్తూ మహారాష్ట్ర హోంమంత్రి బదిలీ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరంవీర్ సింగ్ అనిల్ దేశ్‌ముఖ్ బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు 100 కోట్ల రూపాలయు వసూలు చేయాలని వజేకు టార్గెట్ విధించాడని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో ఆరోపించాడు. ఇందుకు సంబంధించి సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. చదవండి: వాజే టార్గెట్ వంద కోట్లు -
ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసినందుకు ఆయనపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసి ఏకకాలంలో ఆయన ఆఫీసు, ఇళ్లపైన సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులకు టోకరా వేసినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది. పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో రూ.237.84 కోట్ల రుణం తీసుకుని మోసం చేసినట్టు చెన్నై ఎస్బీఐ డీజీఎం ఎస్.రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ ఎస్పీ అశోక్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాలను సీబీఐ కార్యాలయం గురువారం విడుదల చేసింది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఆయన భార్య, కుమార్తె, ఇంకా పలువురిపై కేసు నమోదైంది. తమిళనాడులోని తూత్తుకూడిలో ఇండ్ భారత్ పవర్ జెన్‌కం లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు పేరుతో ఫోర్జరీ పత్రాలు పెట్టి రుణంగా పొందిన రూ.237.84 కోట్ల మొత్తాన్ని పక్కదారి పట్టించినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లపై ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 467, 468, 471తోపాటు పీసీ యాక్ట్–1988 ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆయన బ్యాంకులను మోసం చేయాలనే ఉద్దేశపూర్వకమైన నేర స్వభావంతోనే పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో కోట్లాది రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా పొందినట్టు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు, కనుమూరు రమాదేవి, కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, అంబేద్కర్ రాజ్‌కుమార్ గంటా, దుంపల మధుసూదనరెడ్డి, నారాయణప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ బాలకృష్ణ.. మరికొందరిని నిందితులుగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. చదవండి: ‘చంద్రబాబు డైరెక్షన్లో రఘురామ కృష్ణంరాజు’ -
సీళ్లు సేఫ్.. బంగారం ‘ఉఫ్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎనిమిదేళ్ల క్రితం ఒక ప్రైవేటు సంస్థ నుంచి సీబీఐ సీజ్ చేసిన 400 కిలోల బంగారంలో 103 కిలోల మేర మాయమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. దీంతో ఉలిక్కిపడిన సీబీఐ ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో మొత్తం ఘటనపై అంతర్గత విచారణకు సిద్ధమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై మరోవైపు సీబీసీఐడీ(తమిళనాడు) విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఆరునెలల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని సూచించింది. స్థానిక పోలీసులు విచారణ జరిపితే తమ పరువు పోతుందన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది సీబీఐకి అగ్ని పరీక్ష సమయమని వ్యాఖ్యానించింది. ఏం జరిగింది? చెన్నై ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని సురానా కార్పొరేషన్‌తో కొందరు స్వదేశీ, విదేశీ ఉన్నతాధికారులు, వ్యాపార సంస్థలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఎంఎంటీసీ అధికారుల అండతో ఈ కంపెనీ బంగారం, వెండిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో 2012లో సీబీఐ సదరు సంస్థలో సోదాలు చేసి దాదాపు 400.47 కిలోల బంగారు బిస్కెట్లు, నగలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఆ బంగారాన్ని సురానా కార్యాలయంలోని లాకర్లో భద్రం చేసి సీలువేశారు. ఈ లాకరుకు సంబంధించిన 72 తాళం చెవులను, స్వాధీనం చేసుకున్న బంగారు వివరాల జాబితాను చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అప్పగించారు. సురానా అనేక బ్యాంకుల్లో రూ.1,160 కోట్లను రుణంగా పొంది తిరిగి చెల్లించకపోవడంతో ఆ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని నిర్వహించేందుకు బ్యాంకుల తరఫున రామ సుబ్రమణియం అనే వ్యక్తిని జాతీయ కంపెనీ లా బోర్డు ప్రత్యేకాధికారిగా నియమించింది. సీబీఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని రుణ బకాయి చెల్లింపు కింద తమకు అప్పగించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేసి అనుమతి పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాకర్‌ను తెరిచిచూడగా లోపల ఉంచిన మొత్తం 400.47 కిలోల బంగారులో 103.86 కిలోల బంగారం తగ్గింది. ఈఘటనపై ప్రత్యేకాధికారి రామసుబ్రమణియం మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. బం గారం మాయమైన ఘటనపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేయాలని రామసుబ్రమణియంకు కోర్టు సూచించింది. ఈ ఫిర్యాదును అనుసరించి ఎస్పీ హోదాకు తక్కువగాని అధి కారి విచారణ చేయాలని పేర్కొంది. సీబీఐ ఏమంటోంది? ఇప్పటికే సీబీఐ ఈ విషయమై అంతర్గత విచారణకు ఎస్పీ స్థాయి అధికారిని నియమించింది. అయితే కోవిడ్ నిబంధనలు, లాక్డౌన్ తదితర కారణాల వల్ల ఈ విచారణ పూర్తికాలేదని సంస్థ వర్గాలు తెలిపాయి. బంగారం తమ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి మాయమై ఉంటే సీబీఐ వెంటనే చర్యలు తీసుకునేదని, కానీ ఇప్పుడు మాయమైన బంగారం సురానా కంపెనీ లాకర్ నుంచి మాయం కావడంతో ఏం జరిగిందో లోతైన విచారణ జరగాలని సీబీఐ అధికారులు చెప్పారు. ఇదే సమయంలో సురానా సంస్థ కోర్టును ఆశ్రయించిందని, తాము ఆదేశించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు చెప్పిందని వెల్లడించారు. 2012లో ఈ రైడ్‌లో పాల్గొన్న అధికారులు కొందరు రిటైరయ్యారని, కోవిడ్ లాక్డౌన్ సమయంలో వారిని విచారించడం కుదరలేదని వివరించారు. బంగారమా? గంజాయా? వేసిన సీళ్లు వేసినట్లుండగానే బంగారం మాయం కావడంపై విచారించిన హైకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కోర్టు లేదా సీబీఐ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి చోరీ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకునేవారని హైకోర్టు విచారణలో భాగంగా ప్రశ్నించింది. అదే జరిగితే స్థానిక పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి పోలీసు దర్యాప్తు జరిపేవారని, సదరు పోలీసులు పట్టుకున్న బంగారం 296.66 కిలోలేనని, తప్పుగా 400.47 కిలోలుగా ఎంటర్ చేశారని నిర్ధారించేవాళ్లని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇంకా ఇలాంటి వాదన రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నది. వ్యత్యాసం కొన్ని గ్రాములైతే ఏదో ఒక సమాధానం చెప్పవచ్చని, కానీ వంద కిలోల బంగారం తేడా రావడం ఎలా జరుగుతుందో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదని, గంజాయి లాగా బంగారం బరువు కాలంతో పాటు తగ్గదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. -
సీబీఐ కేసు: రఘురామకృష్ణం రాజు ఔట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వేటుపడింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అతన్ని తప్పించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రుణాల ఎగవేత కేసులో రాఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు, నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నందున అతన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. -
బ్యాంకు రుణం ఎగ్గొట్టి సొంత ఖాతాలకు..
-
ఉల్లం‘గనుల్లో బినామీలు’
టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సాగించిన అక్రమ మైనింగ్‌పై సీబీఐ కేసు నమోదు వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో యరపతినేని బినామీల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు బినామీలపై కేసు నమోదు కావడంతో మిగిలినవారు భయపడుతున్నారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరట ఇస్తున్నా ముందు ముందు తమ పేర్లు, పాత్ర బయటపడుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. సాక్షి, గుంటూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌కు పాల్పడిన విషయం బహిరంగ రహస్యమే. ఆయన బినామీలు, అనుచరులను అడ్డుపెట్టుకుని పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి గ్రామాల పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్ విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. బుధవారం 17 మందిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిందితుల్లో ఆరుగురు యరపతినేని బినామీలేనని టీడీపీలోనే చర్చ నడుస్తోంది. అక్రమ మైనింగ్‌పై కేసుల నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు మరికొందరిపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యరపతినేని బినామీలపై కేసులు నమోదవ్వడంతో అక్రమ మైనింగ్‌లో కీలక పాత్ర పోషించిన ఘట్టమనేని బుల్లెబ్బాయి, ఘట్టమనేని నాగేశ్వరరావు, ముప్పన వెంకటేశ్వర్లు తదితరులు ఆందో ళనలో ఉన్నట్టు తెలుస్తోంది. సీబీఐ నమోదు చేసి న ఎఫ్ఐఆర్లో తమ పేర్లు లేకపోవడం తాత్కాలికంగా ఊరటనిస్తున్నప్పటికీ పూర్తి స్థాయి విచారణ మొదలైతే తమ పేర్లు, పాత్ర బయపడుతుందని భయం వారిని వెంటాడనుంది. యరపతినేని బినామీల చరిత్ర ఇదీ.. ఏ–1 నెల్లూరి శ్రీనివాసరావు : కేశానుపల్లికి చెందిన నెల్లూరి శ్రీనివాసరావు పెట్రోలు బంకులో సూపర్వైజర్గా పనిచేస్తూ టీడీపీలో యరపతినేని అనుచరుడిగా తిరుగుతుండేవాడు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేశానుపల్లి గ్రామంలో ఉన్న క్వారీలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం నెల్లూరు శ్రీనివాసరావుకు అప్పగించేశారు. క్వారీల్లో అక్రమంగా లైమ్‌స్టోన్‌ను తవ్వడం నుంచి మిల్లులకు సరఫరా చేయడం వరకు ఇతనే చూశాడని ప్రచారం. అక్రమ మైనింగ్ పుణ్యమా అని పెట్రోల్ బంకులో పనిచేసిన శ్రీనివాసరావు నేడు రూ.కోట్లకు పడగలెత్తాడు. ఏ–6 బత్తుల నరసింహారావు: 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు నడుస్తున్న వడ్డెర కో–ఆపరేటీవ్ సొసైటీని రద్దు చేసి యరపతినేని అండతో కొత్త సొసైటీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా కొనసాగాడు. కేశానుపల్లిలో 25 ఎకరాలు, నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలోని అంజనీపురం కాలనీ పక్కనే ఉన్న జేపీ సిమెంట్, ప్రభుత్వ భూములు సుమారు 150 ఎకరాలు ఆక్రమించేశారు. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా అండతో వడ్డెర సొసైజీలోని యరపతినేని అనుచరులతో లైమ్ స్టోన్‌ను దోచేయడంలో కీలకపాత్ర పోషించాడు. నడికుడి, కేశానుపల్లిల్లో అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్స్, తదితర వ్యవహారాలను చూసుకున్న నరసింహారావు కుమారుడు బత్తుల రాంబాబుపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఏ–7 మీనిగ అంజిబాబు: పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన మీనిగ అంజిబాబు 2014 టీడీపీ అధికారంలోకి రాకముందు వరకూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా ముఠాలో ఇతను ఒక సభ్యుడుగా మారాడు. ఇతను క్వారీ వద్ద కాపలాగా ఉంటూ రోజువారి టిప్పర్లలో లైమ్‌స్టోన్‌ను ఏఏ మిల్లులకు తరలించారనే వివరాలను బుల్లెబ్బాయి ద్వారా యరపతినేనికి తెలిపేవాడు. అక్రమ మైనింగ్ జరిగే క్వారీల్లో కొందరు కురాళ్లను అంజిబాబు నిఘా కొనసాగించేవాడు. కూలీలకు డబ్బు చెల్లించడం, క్వారీవైపు ఇతరులు ఎవ్వరినీ కన్నెత్తకుండా చేయడం లాంటివి చేస్తూ చోటా డాన్‌లా ఇతను వ్యవహరించాడు. ఏ–9 గ్రంధి అజయ్‌కుమార్: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన గ్రంధి అజయ్ కొండమోడులో యరపతినేని కనుసన్నల్లో నడిచే అక్రమ క్వారీ వ్యవహారాలను చూసుకున్నాడు. ఏ–12 గుదె వెంకట శివకోటేశ్వరరావు: పిడుగురాళ్లకి పట్టణానికి చెందిన గుదె వెంకట శివకోటేశ్వరరావు అలియాస్ కోటి అక్రమ మైనింగ్‌కు మందు గుండు సామాగ్రి సరఫరా చేస్తూ మైనింగ్ కార్యక్రమాలను పరిశీలిస్తుంటాడు. మిల్లులకు సరఫరా చేసిన లైమ్‌స్టోన్ తాలుకూ డబ్బును వసూలు చేసి ఏ రోజుకు ఆ రోజు యరపతినేనికి లెక్కలు చెప్పడం వంటి కార్యకలాపాలు ఇతనే చూసుకున్నాడు. ఏ–16 నీరుమల్ల శ్రీనివాసరావు: పిడుగురాళ్ల పట్టణానికి చెందిన నీరుమల్ల శ్రీనివాసరావు వార్డు స్థాయిలో టీడీపీ క్రీయాశీల నేత, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బినామిల్లో ఒకడు. ఇతడు 1.30 లక్షల టన్నుల తెల్లరాయిని అక్రమ మైనింగ్ ద్వారా దోచేశాడని మైనింగ్ అధికారులు 2018లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సీబీఐ కార్యాలయానికి రియా చక్రవర్తి
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును విచారిస్తున్న సీబీఐ హీరో గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తికి సమన్లు జారీ చేసింది. ఈ రోజు(శుక్రవారం) విచారణకు హాజరు కావలని రియాకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబైలోని సీబీఐ కార్యాలయానికి రియా చేరుకున్నారు. రియాతోపాటు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానీని మరోసారి ప్రశ్నించనున్నాను. రియా సోదరుడిని 14 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. సుశాంత్ ఇంటి సిబ్బంది, స్నేహితుడు సిద్దార్ధ్‌ను కూడా విచారించారు. సుశాంత్‌ది అసలు ఆత్మహత్యా? లేదా హత్యా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. (సుశాంత్ మెసేజ్ చేశాడు.. బ్లాక్ చేశా: రియా) రియా తన కొడుకును మానసికంగా వేధించిందని, డబ్బుల్ని వ్యక్తిగతంగా వినియోగించుకుందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న క్రమంలో గత వారం సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సీబీఐ సుశాంత్ కేసులో దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. సుశాంత్ తండ్రి బిహార్‌లో ఫిర్యాదు చేసిన కేసు ఆధారంగా రియా, ఆమె కుటుంబాన్ని సీబీఐ విచారిస్తోంది. రియా చక్రవర్తి తండ్రి, సోదరుడిని అధికారులు ప్రశ్నించగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ పిథానీని కూడా ఏడు రోజుల పాటు ప్రశ్నించారు. (అన్నలాంటి వాడు.. సిగ్గుపడండి) -
యరపతినేని అనుచరులపై సీబీఐ కేసు
-
యరపతినేని అనుచరులపై సీబీఐ కేసు
సాక్షి, గుంటూరు: అక్రమ మైనింగ్ కేసు విచారణలో భాగంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అనుచరులు 13 మందితో పాటు మొత్తం 17 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. విశాఖపట్నం ఏసీబీ పోలీసుస్టేషన్లో సీబీఐ దర్యాప్తు అధికారి పి.విమలాదిత్య పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకి, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి గ్రామాల్లో 2010 జనవరి నుంచి 2018 ఆగస్టు వరకు సున్నపురాయి గనుల్లో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లుగా మైనింగ్ విభాగం గుంటూరు–2 అసిస్టెంట్ డైరెక్టర్ బి.జగన్నాథరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ, 2018లో అక్రమ మైనింగ్‌పై పిడుగురాళ్ల, దాచేపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 19న విడుదల చేసిన నోటిఫికేషన్‌ను, అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఎఫ్ఐఆర్లో జతచేశారు. నిందితుల్లో యరపతినేని అనుచరులు 1. నెల్లూరి శ్రీనివాసరావు (కేశానుపల్లి) 2. వేముల శ్రీనివాసరావు (నారాయణపురం, నడికుడి) 3. ఓర్సు వెంకటేశ్వరరావు (నడికుడి) 4.వేముల ఏడుకొండలు (నారాయణపురం, నడికుడి) 5. ఇర్ల వెంకటరావు (నారాయణపురం, నడికుడి) 6. బత్తుల నరసింహారావు (దాచేపల్లి) 7. మీనిగ అంజిబాబు (జనపాడు) 8. గ్రంధి అజయ్‌కుమార్ (పిడుగురాళ్ల) 9. జి.వెంకట శివకోటేశ్వరరావు (పిడుగురాళ్ల) 10. ఓర్సు ప్రకాశ్ (కొండమోడు–రాజుపాలెం) 11. వర్ల రత్నం (పిడుగురాళ్ల) 12. నంద్యాల నాగరాజు (కొండమోడు–రాజుపాలెం) 13. ఆలపాటి నాగేశ్వరరావు (ధరణికోట–అమరావతి) సహా మరో నలుగురు కేసులో నిందితులుగా ఉన్నారు. -
ముంబై ఎయిర్‌పోర్టు పనుల్లో జీవీకే స్కాం!
సాక్షి, హైదరాబాద్: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్)కు చెందిన రూ. 705 కోట్ల నిధులను దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై ప్రముఖ కార్పొరేట్ సంస్థ జీవీకే గ్రూప్‌తోపాటు మరికొన్ని కంపెనీలు, వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముంబై విభాగం కేసులు నమోదు చేసింది. లెక్కల్లో అధిక వ్యయం, తక్కువ ఆదాయం చూపడంతోపాటు రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నట్లు అధికారులు తెలిపారు. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్, ముంబై ఎయిర్‌పోర్టు లిమి టెడ్, జీవీకే గ్రూప్ చైర్మన్ జీవీ కృష్ణారెడ్డి, ఎంఐ ఏఎల్ ఎండీ జీవీ సంజయ్‌రెడ్డి, ఐశ్వర్యగిరి కన్స్ట్ర క్షన్స్, కోటా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మరికొన్ని కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ అభియోగాలతోపాటు ఐపీసీ 120బీ, 420, 467, 468, 471, పీసీ యాక్ట్ 1988 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ముంబై, హైదరాబాద్‌లలోని జీవీకే కార్యాలయాల్లో సీబీఐ అధికారులు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు జరిపారు. ఏం జరిగింది? దేశంలో విమానాశ్రయల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చూస్తుంది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు జీవీకే గ్రూప్ ప్రమోటర్‌గా ఉన్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్, మరికొన్ని విదేశీ సంస్థలు (పీపీపీ పద్ధతిలో) సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఏఎల్) పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. 2006 ఏప్రిల్‌లో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), ఎంఐఏఎల్‌తో జీవీకే ఆపరేషన్, మేనేజ్మెంట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ (ఓఎండీఏ) ప్రకారం ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణ పనులను మొదలు పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎంఐఏఎల్ తొలుత ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి, మిగిలిన నిధులను ఎయిర్‌పోర్టు అభివృద్ధి, నిర్వహణకు వినియోగించాలి. అయితే ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఎంఐఏఎల్ వివిధ అభివృద్ధి పనుల పేరిట ఐశ్వర్యగిరి కన్స్టక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్, సుభాష్ ఇన్ఫ్రా ఇంజనీర్స్ ప్రైవేటు లిమిటెడ్, అక్వా టెక్‌సొల్యూషన్స్‌తోపాటు మరికొన్ని కంపెనీలతో బోగస్ కాంట్రాక్టు పనులు సృష్టించి రూ. 705 కోట్ల వరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి నష్టం కలిగించినట్లు సీబీఐ అభియోగం మోపింది. 2017–18లో బోగస్ కాంట్రాక్టుల ద్వారా రూ. 310 కోట్ల మేర, సొంత సంస్థలకు రుణాల పేరిట రూ. 395 కోట్ల మేర జీవీకే నిధులు మళ్లించిందని సీబీఐ తెలిపింది. ఇందుకు కొందరు ఏఏఐ ఉద్యోగులు సహకరించారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. -
జీవీకే గ్రూప్ చైర్మన్‌కు సీబీఐ షాక్..
-
డాక్టర్ సుధాకర్‌పై 3 సెక్షన్ల కింద సీబీఐ కేసు
సాక్షి, విశాఖపట్నం: నడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోనే నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా డాక్టర్ సుధాకర్‌పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది. ఈ మేరకు తన వెబ్సైట్లో కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని బుధవారం పొందుపర్చింది. గత నెల 16న డాక్టర్ సుధాకర్ విశాఖ పోర్టు ఆస్పత్రి సమీపంలోని జాతీయ రహదారిపై తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని ఫోర్త్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీబీఐ ఇన్స్పెక్టర్ ఎన్.రాఘవేంద్ర కుమార్ ఎఫ్ఐఆర్ ప్రతిలో పేర్కొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ వెంకటరమణ ఘటన జరిగిన రోజే సుధాకర్‌పై ఫోర్త్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డాక్టర్ సుధాకర్‌పై ఐపీసీ 353 (ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం), 427 (తుంటరి చేష్టలతో న్యూసెన్స్ సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం), 506 (ఎదుటి వ్యక్తులను నేరపూరితంగా బెదిరిస్తూ భయోత్పాతం సృష్టించడం) మొదలైన సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్ల ఆధారంగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టం చేసింది. -
డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు
సాక్షి, విశాఖపట్నం, మహారాణిపేట(విశాఖ దక్షిణ): వివాదాస్పద వ్యవహార శైలితో కలకలం రేపి.. ప్రస్తుతం మానసిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్టు సీబీఐ ఎస్పీ విమలా ఆదిత్య మంగళవారం రాత్రి వెల్లడించారు. కేసు వివరాలను తమ వెబ్సైట్లో పొందు పరిచినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. ⇔ నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్‌గా పని చేస్తున్న సుధాకర్ ఏప్రిల్ 6వ తేదీన కరోనా నియంత్రణపై ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ⇔ మే 16వ తేదీ సాయంత్రం 3.50 ప్రాంతంలో డాక్టర్ సుధాకర్.. విశాఖ నగరం మర్రిపాలెం నుంచి బాలయ్యశాస్త్రి లేఅవుట్లో ఉన్న తన ఇంటికి వెళ్తూ మార్గం మధ్యలో పోర్టు ఆస్పత్రి వద్ద జాతీయ రహదారిలో కారు ఆపి స్థానికులను, ఆటో డ్రైవర్లను దుర్భాషలాడారు. ⇔ దీంతో స్థానికులు 100 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో వెంటనే నాలుగో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాక్టర్‌కు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ⇔ అయినా వినిపించుకోకుండా మతం, కులాల పేరిట దూషిస్తూ ప్రధాని, సీఎం, మంత్రులతో పాటు పోలీసులను, అక్కడ ఉన్న స్థానికుల్ని సైతం నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. ⇔ డాక్టర్ ప్రవర్తనను మొబైల్లో వీడియో చిత్రీకరిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ చేతి నుంచి సెల్‌ను లాక్కొన్ని రోడ్డుకేసి కొట్టారు. ⇔ చొక్కా విప్పుకుని జాతీయ రహదారిపై వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నిలువరించాలని ప్రయత్నించిన పోలీసులపై తిరగబడి.. చొక్కాను చించుకుని హైవేపైకి మళ్లీ వచ్చి.. లారీకి అడ్డంగా వెళ్లారు. ⇔ ఈ పరిణామంతో అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే.. తనకు కరోనా ఉందని, తనను పట్టుకుంటే వైరస్ అంటించేస్తానంటూ భయపెట్టారు. పోలీసుల సహాయంతో.. స్థానిక ఆటోడ్రైవర్ వైద్యుడి చొక్కాతోనే.. అదుపు చేయడం కోసం అతని చేతులు కట్టేశారు. ⇔ మద్యం మత్తులో ఉన్న డాక్టర్‌ను ఎమ్మెల్సీ చేయించడం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కరోనా కారణంగా బ్రీత్ ఎనలైజర్‌ను వాడకుండా కేజీహెచ్‌లో రక్త నమూనాలను సేకరించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు సుధాకర్ మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ప్రభుత్వ మానసిక వైద్యశాలకు రిఫర్ చేశారు. ⇔ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి పంపించిన పరిణామాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత రాసిన లేఖ, ఎడిట్ చేసిన వీడియోను సుమోటో పిల్‌గా పరిగణించిన హైకోర్టు.. కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ⇔ నాలుగు రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సీబీఐ.. నాలుగో పట్టణ పోలీసుస్టేషన్ సిబ్బందితో పాటు సుధాకర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను, ఆయనకు వైద్యం చేసిన కింగ్ జార్జ్ ఆస్పత్రి అధికారులను, వైద్యులను విచారించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి సుధాకర్‌పై 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ⇔ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడి రోడ్డుమీద ప్రజాప్రతినిధులను దూషింంచడం, విధి నిర్వహణలో వున్న పోలీసులను తూలనాడటంతో పాటు స్థానికులను భయ బ్రాంతులకు గురి చేశారని సీబీఐ తన కేసులో పేర్కొన్నట్టు సమాచారం. కాగా, 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సిడి ఫైల్‌ను నాలుగో పట్టణ టౌన్ పోలీసులు సీబీఐకి అందించారు. -
రాణా కపూర్‌పై కొత్తగా మరో కేసు..
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్యపై ఈడీ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. అవంతా రియల్టీ గ్రూప్ సంస్థలకు యస్ బ్యాంక్ ద్వారా రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు గాను .. వారు రూ. 307 కోట్ల మేర ముడుపులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక బంగ్లాను మార్కెట్ రేటులో సగం ధరకే దక్కించుకోవడం ద్వారా వారు లబ్ధి పొందినట్లు ఈసీఐఆర్‌లో ఈడీ పేర్కొంది. మొండిబాకీల వసూలు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించినందుకు గాను కొన్ని బడా కార్పొరేట్ల నుంచి కపూర్‌కు ముడుపులు ముట్టాయంటూ ఈడీ ఇప్పటికే ఒక కేసు నమోదు చేసింది. ఈడీ విచారణకు హాజరు కాని వాధ్వాన్ సోదరులు.. యస్ బ్యాంక్ ప్రమోటరు రాణా కపూర్‌పై మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసినప్పటికీ.. డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లయిన వాధ్వాన్ సోదరులు (కపిల్, ధీరజ్) మాత్రం హాజరు కాలేదు. దీంతో కొత్తగా సమన్లు జారీ చేయడంతో పాటు, మరో కేసులో కపిల్ వాధ్వాన్‌కి ఇచ్చిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ కోర్టును ఈడీ కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యస్ బ్యాంక్ నుంచి డీహెచ్ఎఫ్ఎల్ తీసుకున్న రూ. 3,700 కోట్లు ప్రస్తుతం మొండిబాకీలుగా మారాయి. కార్పొరేట్లకు యస్ బ్యాంకు నుంచి రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్ రూ. 4,300 కోట్ల మేర ముడుపులు అందుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. -
‘పద్మశ్రీ’ లీలాశాంసన్‌పై సీబీఐ కేసు
సాక్షి, చెన్నై: చెన్నైలో కళాక్షేత్రలోని ఆడిటోరియం పునరుద్ధరణ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అక్రమాలను గుర్తించింది. ఆ క్షేత్ర మాజీ డైరెక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్‌పై కేసు నమోదు చేసింది. ఆమెతో పాటు అప్పటి నిర్వాహకులు తదితరులపై కేసులు నమోదయ్యాయి. చెన్నై తిరువాన్నియూరులోని ‘కళాక్షేత్ర’ ఫౌండేషన్‌లో 2006–12 మధ్య కాలంలో ఆడిటోరియం పునరుద్ధరణ కోసం కేంద్ర సాంస్కృతిక విభాగం నుంచి రూ. 7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు దుర్విని యోగమైనట్లు ఆరోపణలున్నాయి. -
సీబీఐ విచారణతో టీడీపీలో ఉలికిపాటు
సాక్షి, గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకరించటం సర్వత్రా చర్చనీయాంశమైంది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి, పిడుగురాళ్ల మండలం కొనంకి, సీతారామపురంలో ఐదేళ్లపాటు యథేచ్ఛగా జరిగిన అక్రమ మైనింగ్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సీబీఐ విచారణకు ఆమోదం తెలపటంతో టీడీపీ నేతలు హడలెత్తిపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు జోరుగా జరిగిన అక్రమ మైనింగ్ ద్వారా 32 లక్షల టన్నుల ఖనిజ సంపద దోచుకున్నారని లోకాయుక్త, సీబీ సీఐడీ అధికారులు నిర్ధారించారు. అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయలకు గండికొట్టారని విచారణలో తేలింది. తాజాగా రాష్ట్ర మంత్రి వర్గం భేటీలో సీబీఐ విచారణకు అంగీకారం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకోవటంతో స్థానికంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ విచారణ జరిగితే అక్రమ మైనింగ్ వ్యవహారంలో పూర్తిస్థాయి నిజాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొంటున్నారు. ఇది చదవండి : యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీ‘ఐ’ తిన్నదంతా రాబట్టాల్సిందే.. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర నుంచి యరపతినేని వరకు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఈ రోజు అక్రమ మైనింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అక్రమ మైనింగ్‌లో తిన్నదంతా కక్కితీరాల్సిందే. అక్రమ మైనింగ్ వలన ప్రభుత్వం, ప్రజలకు జరిగిన నష్టం వడ్డీతో సహ వసూలు చేయాలి. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాల్సిందే. –షేక్ జాకీర్‌హుస్సేన్, దాచేపల్లి అక్రమార్కులను బయటపెట్టాలి అక్రమ మైనింగ్ వ్యవహారంలో టీడీపీ నాయకులు చేసిన అక్రమాలన్నింటినీ బయటపెట్టాలి. సీఐడీ విచారణ పూర్తిస్థాయిలో అక్రమాలను గుర్తించలేకపోయారు. సీఐడీ విచారణపై కూడా అనుమానాలు లేకపోలేదు. సీబీఐ విచారణ ద్వారానే అక్రమ మైనింగ్ వ్యవహారం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నాం. –మోమిన్ నాగుల్‌మీరా, కేసానుపల్లి -
‘లోన్’లొటారం!
సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : ఐడీబీఐ స్కాం వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రతోపాటు ప్రభుత్వ శాఖల సిబ్బందిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిసాన్ క్యాష్ క్రెడిట్ స్కీమ్(కేసీసీ)లో భాగంగా చేపల చెరువుల పేరిట 2009 నుంచి 2011 వరకు జిల్లాలోని మూడు ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు సుమారు రూ.1100 కోట్లను రుణంగా పొందిన వ్యవహారం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. అక్రమార్కుల గుండెల్లో వణుకుపుట్టిస్తోంది. బ్యాంకు అధికారుల ఆశీస్సులతో రుణగ్రహీతలు చేపల చెరువులను తవ్వకుండానే రుణాలను తీసుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారం అంతా గప్‌చుప్‌గా జరిగినా సీబీఐ రంగ ప్రవేశంతో స్కాంలో వాస్తవాలు బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంకు ఉన్నతాధికారులు కూడా అంతర్గత క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా కొంతమందిపై చర్యలు తీసుకోడానికి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. పర్యవసానంగా వివరణలు నమోదు చేసి, క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసినట్టు ఒక స్కెచ్ ప్రకారం వ్యవహారం నడుపుతున్నట్టుగా గత మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ శాఖల సిబ్బందిపైనా దర్యాప్తు! కేవలం బ్యాంకు అధికారులనే కాకుండా అసలు చేపల చెరువులు లేకుండానే చెరువులను సృష్టించడం, చెరువులలో చేపలు చనిపోకుండానే చనిపోయినట్టు, నష్టం జరిగినట్టుగా రికార్డులు సృష్టించడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మత్స్యశాఖ అ«ధికారుల పాత్రపైనా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాకు చెందిన కొందరు ఐడీబీఐ కిసాన్ క్యాష్ క్రెడిట్ స్కీమ్‌లో స్కామ్‌కు సంబంధించి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని విశాఖ పట్టణంలో సీబీఐ అధికారులకు అందించే ప్రయత్నం చేశారు. వి«ధి నిర్వహణలో , దాడుల్లో ఉన్న సీబీఐ అధికారులను కలవడానికి అవకాశం ఉండదని, నేరుగా ఉన్నతాధికారులకే సమాచారం అందించాలనే మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో వారికే వాస్తవ విషయాలను అందించడానికి కొందరు సిద్ధపడుతున్నారు. మూడు శాఖల పాత్రపై అనుమానం ఐడీబీఐ కేసీసీ స్కీమ్ కింద అడ్డగోలుగా వ్యవహరించిన బ్యాంకు అధికారుల పాత్రతోపాటు, ఈ స్కీమ్ అమలు చేసిన సమయంలో జిల్లాలో చేపల చెరువుల అనుమతులు, రిజిస్ట్రేషన్లు, వంటి వ్యవహారాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖ, మత్స్యశాఖ అధికారుల పాత్రపై కేంద్ర ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. చేపల చెరువులకు హామీలుగా చూపించిన భూముల విలువను ఎక్కువగా చూపిస్తూ, సర్టిఫికెట్లు ఇవ్వడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అవతవకలకు పాల్పడినట్టు సమాచారం. చేపల చెరువులు లేకున్నా, ఉన్నట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో మత్స్యశాఖ అధికారులు ఆ సమయంలో భారీస్థాయిలో ముడుపులు తీసుకున్నారనే అభియోగాలున్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా చర్యలు బ్యాంకుల నుంచి చేపల చెరువుల కోసం రుణాలు పొందే సమయంలో హామీగా చూపించిన స్థలాలలో కొందరి సంతకాలు ఫోర్జరీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఈ స్కీం స్కాం వ్యవహారంలో ఫోర్జరీ సంతకాల ఎపిసోడ్ కూడా ఉంది. సంతకాలు అసలువా, ఫోర్జరీ చేశారా అనే విషయంపై ఫోరెన్సిక్ సైన్సు ల్యాబ్ ( ఎఫ్ఎస్ఎల్) నివేదికలను ఇక్కడి పోలీసులు తెప్పించుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వ్యవహారం ఫోర్జరీతో పాటుగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈడీ దృష్టికి విషయం స్కాం గురించి గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాకూ వెళ్లాయి. అంతేకాకుండా విశాఖపట్నంలోని డెట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)కి కూడా వెళ్లాయి. కొంతమందికి డీఆర్టీ నోటీసులు ఇచ్చింది. నోటీసులలో పేర్లు ఉన్నవారు ఆ నోటీసులను అందుకోకుండానే అందుకున్నట్టుగా, వీటి కోసం కొందరు న్యాయవాదులకు వకాల్తా ఇచ్చినట్టు తప్పుడు రిపోర్టులు డీఆర్టీకి పంపినట్టు సమాచారం. డీఆర్టీ విచారణలో ఈ వ్యవహారం బయటపడటంతో రాజీ మార్గాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఐడీబీఐ స్కాం వ్యవహారంలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సరిగ్గా ఇదేసమయంలో సీబీఐ కూడా తనిఖీల వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అప్పట్లో ఈ విషయంలో క్రియాశీలక భూమిక పోషించిన వివిధ శాఖల అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
మధుకాన్ కంపెనీల పై సీబీఐ కేసు
-
చందా కొచర్‌పై మనీల్యాండరింగ్ కేసు
ముంబై : ఐసీఐసీఐ బ్యాంక్-వీడియాకాన్ రుణాల వ్యవహారం కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్, వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ ఇతరులపై మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్-వీడియాకాన్ రుణం కేసులో రూ 1875 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఫిర్యాదు ఆధారంగా మనీల్యాండరింగ్ చట్టం కింద ఆయా నిందితులను ప్రస్తావిస్తూ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)ను ఈడీ నమోదు చేసింది. కాగా, ఈడీ ఈసీఐఆర్ పోలీస్ ఎఫ్ఐఆర్తో సమానం. రుణ వ్యవహారంలో స్వీకరించిన ముడుపులు ఆస్తుల కొనుగోలుకు దారి మళ్లించారా అనే కోణంలో విచారణ సాగుతుందని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈసీఐఆర్‌లో నిందితులకు త్వరలోనే ఈడీ సమన్లు జారీ చేయనుంది. ఇదే కేసులో సీబీఐ ఇప్పటికే చందా కొచర్ దంపతులతో పాటు వీడియాకాన్ చీఫ్ వేణుగోపాల్ ధూత్ ఇతరులపై చార్జిషీటు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ కీలక సోదాలు, దాడులు చేపట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్‌కు రుణాలు జారీ చేయడంలో క్విడ్‌ప్రోకో జరిగినట్టు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
సీబీఐలో మరో నలుగురిపై వేటు
న్యూఢిల్లీ: అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించిన రోజుల వ్యవధిలోనే ఆ సంస్థలోని మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో అలోక్‌వర్మతో గొడవ పెట్టుకున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా కూడా ఉన్నారు. అస్థానాతోపాటు జేడీ అరున్ కుమార్ శర్మ, డీఐజీ మనీశ్ కుమార్ సిన్హా, ఎస్పీ జయంత్ నైక్నవారేల పదవీకాలాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఖురేషీ దెబ్బకు ముగ్గురు సీబీఐ చీఫ్‌లు ఔట్!
సీబీఐ అధిపతి ఆలోక్ వర్మ ఉద్వాసనతో మాంసం వ్యాపారి మొయిన్ అక్తర్ ఖురేషీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఖురేషీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు అటు తిరిగి ఇటు తిరిగి ఆలోక్ వర్మ ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఖురేషీ నుంచి లంచం తీసుకున్నారంటూ సీబీఐలో నంబర్ 1, 2 స్థానాల్లో ఉన్న అధికారులు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, దాంతో కేంద్రం వర్మను సెలవుపై పంపడం, చివరికి ఆయనకు ఉద్వాసన చెప్పడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఖురేషీ కేసు దెబ్బకు గతంలో సీబీఐ చీఫ్లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలు కూడా పదవుల నుంచి వైదొలగాల్సి వచ్చింది. కాన్పూర్‌కు చెందిన ఖురేషీ 1993లో ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో మాంసం ఎగుమతి వ్యాపారం ప్రారంభించాడు. అధికారంలో ఉన్నవారితో సత్సంబంధాలు నెరపడం ద్వారా అనేక అక్రమాలకు పాల్పడి అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. దుబాయ్, లండన్, ఐరోపాల్లో హవాలా వ్యాపారం చేసేవాడు. పన్ను ఎగవేత నుంచి మనీ లాండరింగ్ వరకు ఆయనపై బోలెడు కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుల నుంచి బయటపడటం కోసం సీబీఐ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకునేవాడు. కేసులు లేకుండా చేస్తానని చెప్పి సీబీఐ అధిపతుల పేరుతో పలువురి నుంచి కోట్లు రాబట్టేవాడు. ఖురేషీ కేసుకు సంబంధించి ఆలోక్‌వర్మ రూ.2 కోట్లు లంచం తీసుకున్నారని మరో అధికారి రాకేశ్ అస్తానా ఆరోపించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చివరికది వర్మ ఉద్వాసనకు దారితీసింది. 2014లో సీబీఐ అధిపతిగా ఉన్న రంజిత్ సిన్హా ఇంటికి ఖురేషీ పదే పదే వెళ్లారని, 15 నెలల్లో 70 సార్లు ఖురేషీ సిన్హాను కలిశారని వార్తలు వచ్చాయి. సీబీఐ కేసులో ఇరుక్కున్న తన స్నేహితుడికి బెయిలు రావడం కోసం తాను రంజిత్ సిన్హా ద్వారా ఖురేషీకి కోటి రూపాయలు ఇచ్చానని హైదరాబాద్‌కు చెందిన సానా సతీశ్‌బాబు ఈడీ విచారణలో వెల్లడించాడు. ఈ ఆరోపణలను సిన్హా ఖండించినప్పటికీ చివరికి పదవి నుంచి వైదొలగక తప్పలేదు. 2010–12 మధ్య సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఏపీ సింగ్, ఖురేషీ చాలాసార్లు సెల్ మెసేజ్‌ల ద్వారా సంభాషించుకున్నారని 2014 చివర్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఖురేషీ, సింగ్‌ల మధ్య సంబంధాలపై దర్యాప్తు జరపడం కోసం సీబీఐ సింగ్‌పై కేసు నమోదు చేసింది. ఫలితంగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. -
సీబీఐ జేడీ బదిలీ.. వెంటనే నిలిపివేత
న్యూఢిల్లీ: ఉన్నతాధికారుల అవినీతి ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న సీబీఐ..శుక్రవారం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాపై తీవ్ర అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టర్ వి.మురుగేశన్‌ను మరో కేసు దర్యాప్తునకు బదిలీ చేస్తూ శుక్రవారం సీబీఐ అంతర్గత ఉత్తర్వు జారీ చేసింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మురుగేశన్‌ను అవినీతి వ్యతిరేక విభాగం నుంచి ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేస్తున్నట్లు సీబీఐ ఇన్చార్జి డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు వెలువరించిన ఉత్తర్వు మీడియాకు లీకైంది. బొగ్గు కుంభకోణం కేసుల దర్యాప్తును వేగవంత చేయటానికి గాను ఆయన్ను ఆ విభాగానికి మార్చుతున్నట్లు అందులో పేర్కొన్నారు. -
సీబీఐ వివాదం : సుప్రీంలో ముగిసిన వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో నెలకొన్న వివాదం నేపథ్యంలో తనను అకారణంగా ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ చీఫ్ అలోక్ వర్మ, ఎన్జీవో కామన్ కాజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేశామని కోర్టు పేర్కొంది. సర్వోన్నత న్యాయస్ధానంలో ఈ కేసుపై గురువారం వాదనలు వినిపించిన కామన్ కాజ్ తరపు న్యాయవాది దుష్యంత్ దవే.. సీబీఐ చీఫ్‌గా వర్మ అధికారాలను కేంద్ర కత్తిరించడాన్ని తప్పుపట్టారు. సీబీఐ డైరెక్టర్ పదవి నిర్ణీత పదవీకాలంతో కూడుకుని ఉన్నందున దీనికి అఖిల బారత సర్వీస్ నిబంధనలు వర్తించవని కోర్టుకు నివేదించారు. అయితే అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంటుందని అంతకుముందు కేంద్ర విజిలెన్స్ కమిషన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అనూహ్య, అసాధారణ సందర్భాల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ జోక్యం అనివార్యమైందని విజిలెన్స్ కమిషన్ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. సీబీఐలో పరిస్థితులు ఈ ఏడాది జులైలోనే గాడితప్పడం ప్రారంభించాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. సెలక్షన్ కమిటీని సంప్రదించకుండానే సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాలను కత్తిరించే అవసరం ఎందుకొచ్చిందని కోర్టు విజిలెన్స్ కమిషన్‌ను ప్రశ్నించింది. సీబీఐ ఉన్నతాధికారులు వర్మ, ఆస్ధానాల మధ్య రాత్రికి రాత్రే వివాదం చెలరేగలేదని పేర్కొంది. సీబీఐ ఉన్నతాధికారులు కేసుల దర్యాప్తును గాలికొదిలేసి వారిద్దరి మధ్య కేసులపై విచారణ చేపడుతున్నారని మెహతా కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాలను చక్కదిద్దాల్సిన పరిధి విజిలెన్స్ కమిషన్‌కు ఉందని, లేకుంటే భారత రాష్ట్రపతి, సుప్రీం కోర్టులకు సీవీసీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సీబీఐ డైరెక్టర్‌పై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నుంచి సిఫార్సు వచ్చిందని, విజిలెన్స్ కమిషన్ విచారణ ప్రారంభించినా నెలల తరబడి వర్మ సంబంధిత పత్రాలను ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. మరోవైపు ఈ కేసులో తమ క్లెయింట్ ముందస్తు హెచ్చరికలతో వ్యవస్థను మేలుకొల్పేందుకు ప్రయత్నించినా ప్రభుత్వం ఆయననూ అదే తరహాలో చూస్తోందని రాకేష్ ఆస్ధానా తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ్తగీ వాదించారు. వర్మపై సీవీసీ విచారణను ప్రభుత్వం ముందుకుతీసుకువెళ్లాలని కోరారు. ఇక రాకేష్ ఆస్ధానా సహా సీబీఐ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులను కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. కాగా, ఈ కేసులో వాదనలు ముగిశాయని, తీర్పును రిజర్వ్‌లో ఉంచామని సుప్రీం బెంచ్ పేర్కొంది. -
సీబీఐ డైరెక్టర్ కేసు ఇప్పట్లో తేలేనా?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తనను విధులను తప్పించి బలవంతంగా సెలవుపై పంపించడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించడంలేదు. ఆయన పదవీ విరమణ ముగియనున్న జనవరిలోగానైనా సుప్రీం కోర్టు తీర్పు వెలువడుతుందా? అన్నది ఇప్పుడు కోటి రూకల ప్రశ్న. అలోక్ వర్మ పదవీ విరమణలోగా తీర్పు వెలువడితే అది తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నారు. పదవీ విరమణ తర్వాత తీర్పు వెలువడితే తమకు ప్రయోజనం ఉండదని, పైగా అప్పుడు తీర్పు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వెలువడవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా పదవీ విరమణ తర్వాత తీర్పు వెలువడితే అది అలోక్ వర్మకు అప్రయోజనమే అవుతుంది. ఇప్పటి వరకు అలోక్ వర్మ పిటిషన్‌పై విచారణ జరిగిన తీరే పలు అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. సీబీఐ డైరెక్టర్ విధుల నుంచి వర్మను తప్పించి, బలవంతపు సెలవుపై పంపిస్తూ మోదీ ప్రభుత్వం అక్టోబర్ 23వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ నియామకమిటీ అనుమతి లేకుండా కేంద్రం ఏకపక్షంగా తనపై చర్య తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ వర్మ అక్టోబర్ 26వ తేదీన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ డైరెక్టర్‌ను రెండేళ్ల కాల పరిమితికి నియమించేందుకు ప్రధాన మంత్రి, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి సూచించిన సుప్రీం కోర్టు జడ్జీతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టే గతంలో మార్గదర్శకాలను సూచించింది. సీబీఐ డైరెక్టర్‌ను రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే విధులను తొలగించాలన్న ఈ కమిటీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కూడా మార్గదర్శకాల్లో సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకు విరుద్ధంగా తనను తొలగించారన్నదే అలోక్ వర్మ వాదన. హవాలా కేసులో భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారంటూ సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానపై సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ కేసు నమోదు చేయడంతో కలహం మొదౖలñ న విషయం తెల్సిందే. అలోక్ వర్మనే ముడుపులు తీసుకుంటారని, తనకు అలాంటి అలవాటు లేదని అస్థాన ప్రత్యారోపణలు చేశారు. దీంతో మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా జోక్యం చేసుకొని ఇద్దరిని విధుల నుంచి తప్పించి బలవంతపు సెలవులపై పంపించింది. రాకేశ్ అస్థాన మోదీకి మంచి మిత్రుడన్న విషయం అందరికి తెల్సిందే. అలోక్ వర్మ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచీ అక్టోబర్ 26వ తేదీన విచారణ చేపట్టింది. అలోక్ వర్మను తొలగించడంలో మోదీ ప్రభుత్వం నియమ నిబంధనలను పాటించిందా, లేదా అన్న అంశాన్ని పరిశీలించాల్సిన బెంచీ అందుకు భిన్నంగా వర్మపై అస్థాన చేసిన ఆరోపణల్లో నిజమెంతో దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివీసీ)’ను ఆదేశించింది. రెండు వారాల తర్వాత సివీసీ దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిందిగా కోరుతూ ఓ సుప్రీం కోర్టు జడ్జీ ఏకే పట్నాయక్‌ని నియమించింది. సీవీసీ దర్యాప్తుపై అనుమానం ఉంటే అప్పుడే సుప్రీం కోర్టు జడ్జీని నియమించి ఉండాల్సిందని, రెండు వారాల అనంతరం నియమించడం అంటే దర్యాప్తును సాగదీయడానికే కావొచ్చని న్యాయ వర్గాలే అనుమానిస్తున్నాయి. వర్మ పిటిషన్ తదుపరి విచారణ నవంబర్ 12వ తేదీన ఉండగా అదే రోజు ఉదయం సీవీసీ తన నివేదికను సమర్పించింది. నివేదికను పరిశీలించినప్పటీకీ లోతుగా పరిశీలించేందుకు సమయం చాలదంటూ కేసు విచారణను నవంబర్ 16కు వాయిదా వేసింది. ఆరోజున విచారణ చేపట్టాక నివేదిక కొన్ని అంశాల్లో వర్మను ఎక్కువ అభినందించిందని, కొన్ని అంశాల్లో తక్కువ అభినందించిందని, తక్కువ అభినందించిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా వర్మను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఆదేశిస్తూ కేసు విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు. నవంబర్ 19వ తేదీనే వర్మ తన సమాధాన పత్రాన్ని సమర్పించారు. సీవీసీ నివేదిక, వర్మ సమాధాన పత్రంలోని పలు అంశాలు ఓ న్యూస్ వెబ్సైట్లో రావడం పట్ల 20వ తేదీ విచారణలో ప్రధాన న్యాయమూర్తే అసహనం వ్యక్తం చేశారు. అసలు కేసునే విచారించమంటూ విసుక్కున్నారు. ఆ తర్వాత నవంబర్ 29వ తేదీకి విచారణను వాయిదా వేశారు. ఆ రోజు కూడా ఏ కారణంతో వాయిదా వేస్తారో చూడాలి. -
కేంద్ర మంత్రి లంచం తీసుకున్నారు..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీబీఐలో అంతఃకలహం కేసు సోమవారం మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర గనులు, బొగ్గు శాఖల సహాయ మంత్రి హరిభాయ్ ప్రతిభాయ్ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) కేవీ చౌదరి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర, తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె. లక్ష్మారెడ్డిలపై సీబీఐలో డీఐజీగా ఉన్న మనీశ్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషి కేసులో నిందితుడిగా ఉన్న సానా సతీశ్‌ను కేసు నుంచి బయటపడేసేందుకు హరిభాయ్ చౌదరి జూన్ తొలిపక్షంలో కోట్లాది రూపాయల లంచం తీసుకున్నారనీ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు అనుకూలంగా విచారణను ప్రభావితం చేసేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ దర్యాప్తులో జోక్యం చేసుకున్నారనీ, కేంద్ర ప్రధాన విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని సతీశ్ సానా కలిశారని మనీశ్ సిన్హా ఆరోపించారు. రాకేశ్ అస్థానాపై వచ్చిన అవినీతి ఆరోపణలను సిన్హా విచారిస్తుండగా, ఇటీవల సీబీఐలో కీలక మార్పులు చేపట్టిన సమయంలో ఆయనను నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు.ఆ బదిలీని కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లోనే ఆయన పై విషయాలన్నీ పొందుపరిచారు. అజిత్ దోవల్ అడ్డుకున్నారు.. రాకేశ్ అస్థానాపై విచారణలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కలుగజేసుకుని సోదాలు జరపకుండా, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోకుండా అడ్డుకున్నారని మనీశ్ సిన్హా పిటిషన్లో ఆరోపించారు. మొయిన్ ఖురేషి, సానా సతీశ్‌ల కేసులో ఇప్పటికే దుబాయ్ నుంచి వచ్చి అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, అతని సోదరుడు సోమేశ్ ప్రసాద్‌లతో అజిత్ దోవల్‌కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానాకు సన్నిహితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్ర కుమార్ కూడా ఈ కేసులో ఇప్పటికే అరెస్టవ్వడం తెలిసిందే. అస్థానాపై కేసును మరో సీబీఐ అధికారి ఏకే బస్సీ విచారించారు. ‘ఆధారాలుగా వాట్సాప్ చాట్లను సేకరించడం కోసం అస్థానా, దేవేంద్రల ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని సీబీఐ డెరెక్టర్ అలోక్ వర్మను బస్సీ కోరారు. కానీ అలోక్ వర్మ అనుమతి ఇవ్వలేదు. అజిత్ దోవల్ తనకు ఆ అనుమతి ఇవ్వడం లేదనీ, సెల్ఫోన్లు తీసుకోవద్దంటున్నారని అలోక్ వర్మ చెప్పారు’ అని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. అస్థానా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చిన విషయాన్ని దోవల్‌కు అలోక్ వర్మ చెప్పగా, అదే రోజు ఆ విషయాన్ని దోవల్ అస్థానాకు చేరవేశారని సిన్హా ఆరోపించారు. ఈ కేసు నుంచి బయటపడేయాల్సిందిగా దోవల్‌ను అస్థానా కోరారన్నారు. ‘అరెస్టు చేసి తీసుకొచ్చినప్పుడు తన తండ్రి రా (పరిశోధన, విశ్లేషణ విభాగం)లో గతంలో పనిచేశారనీ, ఎన్ఎస్ఏ దోవల్ ఆయనకు బాగా తెలుసని మనోజ్ ప్రసాద్ చెప్పాడు. ప్రస్తుతం రాలో పనిచేస్తున్న సామంత్ గోయల్ అనే ఉన్నతాధికారి కూడా తన సోదరుడికి బాగా తెలుసన్నాడు. సీబీఐ అధికారుల ఉద్యోగాలు పీకేయించి అంతం చేస్తానని కూడా మనోజ్ బెదిరించాడు. సోమేశ్, సామంత్‌లు ఇటీవలే ఒక వ్యక్తిగత విషయంలో దోవల్‌కు బాగా సాయం చేశారని కూడా చెప్పాడు’ అని పిటిషన్లో సిన్హా పేర్కొన్నారు. మనోజ్ ప్రసాద్‌తో సంబంధాలు నెరిపిన అధికారులపై విచారణకు కూడా దోవల్ అనుమతించలేదని ఆరోపించారు. అలాగే సామంత్‌తో ఓ వ్యక్తి ఫోన్లో మాట్లాడాడనీ, సీబీఐ నుంచి బయటపడేయాలని కోరగా ‘ప్రధాన మంత్రి కార్యాలయంతో మాట్లాడి అంతా సెట్ చేశాం. ఏం భయం లేదు’ అని హామీనిచ్చారనీ, ఆ రాత్రే సీబీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని సిన్హా ఆరోపించారు. కేసుల నుంచి రక్షణకు సురేశ్ హామీ.. సతీశ్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామంటూ న్యాయశాఖ కార్యదర్శి సురేశ్ చంద్ర హామీనిచ్చారని సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రేఖా రాణి సతీశ్‌కు, సురేశ్‌కు మధ్యవర్తిగా వ్యవహరించారు’ అని పిటిషన్లో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలనీ, తానెప్పుడూ లండన్ వెళ్లలేదనీ, రేఖా రాణి ఎవరో తనకు తెలీదని సురేశ్ చంద్ర చెప్పారు. ఖండించిన హరిభాయ్ చౌదరి: తనపై వచ్చిన ఆరోపణలను హరిభాయ్ చౌదరి ఖండించారు. సతీశ్ సానా ఎవరో తనకు అస్సలు తెలీదనీ, అతణ్ని ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఏ విచారణను ఎదుర్కొనేందుౖకైనా సిద్ధమనీ, లంచం తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పారు. మనీశ్ తాజా ఆరోపణల నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చౌదరిని సతీశ్ కలిశాడు అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలపై సీవీసీ కేవీ చౌదరి విచారణ జరపడం తెలిసిందే. అయితే సీవీసీని ఆయన బంధువు గోరంట్ల రమేశ్ ద్వారా సానా సతీశ్ ఢిల్లీలో కలిశాడని కూడా సిన్హా పిటిషన్లో పేర్కొన్నారు. మెయిన్ ఖురేషీ కేసు విషయమై చౌదరితో సతీశ్ మాట్లాడాడనీ, అనంతరం అస్థానాకు చౌదరి ఫోన్ చేసి కేసు విషయమై వాకబు చేయగా.. సతీశ్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలేవీ లేవని అస్థానా చెప్పారని సిన్హా తెలిపారు. ఈ విషయాలను విచారణలో సతీశే బయటపెట్టారన్నారు. ‘ఇందులో అక్రమమేమీ లేదు. కానీ విషయాన్ని పూర్తిగా తెలియజెప్పడం కోసం పిటిషన్లో ఈ విషయాలను కూడా పొందుపరిచా’ అని సిన్హా చెప్పారు. అలాగే హరిభాయ్ చౌదరికి లంచం విషయమై సతీశ్ తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడారన్నారు. సిన్హా ఆరోపణలపై సీవీసీని స్పందన కోరగా, కోర్టులో ఈ కేసు ఉన్నందున మీడియాతో దీనిపై మాట్లాడటం సరికాదంటూ వెళ్లిపోయారు. -
అసమగ్రంగా సీవీసీ నివేదిక
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్‌కుమార్ వర్మ అవినీతికి సంబంధించి కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సమర్పించిన భారీ ప్రాథమిక నివేదిక అసమగ్రంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అభియోగాల్లో కొన్నింటిలో సీవీసీ విచారణ అభినందించదగ్గ స్థాయిలో ఉందని, మరికొన్నింటి విషయంలో దర్యాప్తు అసమగ్రంగా ఉందని పేర్కొంది. అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం దర్యాప్తు జరిపిన అత్యున్నత న్యాయస్థానం..‘సీవీసీ సుదీర్ఘమైన ప్రాథమిక నివేదికను సమర్పించింది. అభియోగాల్లో కొన్ని ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ అభియోగాలపై విచారణ జరిపేందుకు మరికొంత సమయం కావాలని సీవీసీ కోరింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేస్తున్నాం’ అని తెలిపింది. సీబీఐ సంస్థ గౌరవం దృష్ట్యా ఈ నివేదికను గోప్యంగా ఉంచాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నివేదిక ప్రతిని తనకు అందజేయాలని సీవీసీ తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోర్టును కోరారు. దీంతో నివేదికను అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు అలోక్ వర్మకు సీల్డ్ కవర్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తును పర్యవేక్షించిన సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ పట్నాయక్‌కు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే సీవీసీ నివేదికపై ప్రతిస్పందనను ఈనెల 19న మధ్యాహ్నం ఒంటి గంటలోపు సీల్డ్ కవర్లో అందజేయాలని అలోక్‌వర్మను ఆదేశించింది. ఈ సందర్భంగా తమ క్లయింట్, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు కూడా నివేదిక ప్రతిని అందజేయాలన్న ఆయన న్యాయవాది విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎన్టీవో సంస్థ కామన్‌కాజ్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే దాఖలుచేసిన పిటిషన్లను నవంబర్ 20న విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. -
అలోక్ వర్మ చేతికి సీవీసీ నివేదిక ప్రతి
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీవీసీ నివేదిక ప్రతిని వర్మకు అందచేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. నివేదికపై సీల్డ్ కవర్లో సమాధానం తెలపాలని కోరింది. వర్మపై సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా చేసిన ఆరోపణలపై సీవీసీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. సీబీఐ వివాదం నేపథ్యంలో ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. మరోవైపు సీవీసీ న్యాయవాదినైనా తానిప్పటివరకూ దర్యాప్తు నివేదికను చూడలేదని విజిలెన్స్ కమిషన్ తరపు న్యాయవాది తుషార్ మెహతా పేర్కొన్నారు. నివేదికను రూపొందించింది మీరే అయినా దాన్ని మీరు చూడలేదా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ పేర్కొనగా, ఓ న్యాయవాదిగా తాను నివేదికను పరిశీలించలేదని మెహతా చెప్పుకొచ్చారు.ఇక నివేదిక ప్రతిని తనకు అందచేయాలన్న రాకేష్ ఆస్ధానా వినతిని ప్రధాన న్యాయమూర్తి తోసిపుచ్చారు. -
‘సీబీఐ వార్’లోకి కాంగ్రెస్
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాల్ని తొలగించడం చట్టవిరుద్ధం, ఏకపక్ష నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడిందని ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్ చట్టబద్ధ అధికారాలు తొలిగించి, ఆయన్ని సెలవుపై పంపుతూ అక్టోబర్ 23 అర్ధరాత్రి దాటిన తరువాత కేంద్ర విజలెన్స్ కమిషన్(సీవీసీ), సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీఓపీటీ) జారీచేసిన ఆదేశాలు చెల్లవని పేర్కొన్నారు. ఈ మేరకు ఖర్గే శనివారం కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలుచేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం(డీఎస్‌పీఈఏ) ప్రకారం సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణ ఉందని, హైపవర్డ్ కమిటీ ఆమోదం లేనిదే ఆయన్ని బదిలీ కూడా చేయరాదని గుర్తుచేశారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపికచేసే హైపవర్డ్ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ ఆదేశాలు జారీచేసే ముందు కమిటీ సభ్యుడినైన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీవీసీ, డీఓపీటీ ఉత్తర్వులను రద్దుచేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కమిటీ సమావేశం లేకుండానే కానిచ్చేశారు అలోక్ వర్మ అధికారాలు, విధులు తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు..సీబీఐ స్వతంత్రతను దెబ్బతీసేందుకు నేరుగా జరిగిన మూకుమ్మడి ప్రయత్నాలు అని ఖర్గే అభివర్ణించారు. సీబీఐలో ముదిరిన వివాదంపై చర్చించడానికి కమిటీ సమావేశం కాలేదని అక్టోబర్ 25నే లేఖ రాసినట్లు గుర్తుచేశారు. ‘సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిలోకి రాజకీయ కార్యనిర్వాహక వర్గం చొరబడి యథేచ్ఛగా నిబంధనల్ని ఉల్లంఘించిన సంగతిని సంబంధిత భాగస్వామిగా కోర్టు దృష్టికి తెస్తున్నా. డైరెక్టర్ అధికారాల్ని తొలగిస్తూ సీవీసీ, డీఓపీటీ జారీచేసిన ఆదేశాలు చట్టవిరుద్ధం. సీబీఐ డైరెక్టర్‌పై చర్య తీసుకునే అధికారాలు సీవీసీకి లేవని చట్టాలు చెబుతున్నాయి. ఎంపిక కమిటీని తక్కువచేసేలా డీఎస్పీఈ చట్టం కింద కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టరాదు’ అని ఖర్గే పేర్కొన్నారు. సీబీఐ డైరెక్టర్ పదవీకాలానికి రక్షణనిస్తున్న డీఎస్పీఈ చట్టం ప్రకారం హైపవర్డ్ కమిటీ ఏర్పాటైందని, ఆ కమిటీ పాత్రకు పూర్తి వ్యతిరేకంగా డీఓపీటీ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొన్నారు. మధ్యవర్తికి బెయిల్ నిరాకరణ సీబీఐ అవినీతి కేసులో అరెస్టయిన మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌కు బెయిల్ ఇచ్చేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. బెయిల్ కోరుతూ ప్రసాద్ పెట్టుకున్న అర్జీని జడ్జి శనివారం తోసిపుచ్చారు. ఈ దశలో ఆయనకు బెయిల్ మంజూరుచేయడం సరికాదని జడ్జి పేర్కొన్నారు. నిందితుడికి ఎంతో పలుకుబడి ఉందని, బెయిల్‌పై విడుదల అయితే విచారణను ప్రభావితం చేయగలడని సీబీఐ వాదించింది. తనను కస్టడీలో ఉంచడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదన్న ప్రసాద్ పిటిషన్‌తో కోర్టు విభేదించింది. అక్టోబర్ 17న అరెస్టయిన ప్రసాద్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో అరెస్టయిన సహ నిందితుడు, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్‌కు అక్టోబర్ 31నే బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. -
ఆ ఆరోపణలు కేసు పెట్టదగినవే
న్యూఢిల్లీ: అవినీతి కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దుచేయాలన్న ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంలో అస్థానాతో పాటు ఇతర అధికారులపై వచ్చిన ఆరోపణలు కేసు పెట్టదగినవేనని ఢిల్లీ కోర్టుకు తెలిపింది. అస్థానా పిటిషన్‌పై అభిప్రాయం తెలపాలని కోర్టు ఆదేశించగా సీబీఐ గురువారం ఈ మేరకు బదులిచ్చింది. ఇంకా చార్జిషీట్ దాఖలుచేయలేదని, విచారణ పూర్తయ్యే సరికి చాలా విషయాలు బయటికి వస్తాయని తెలిపింది. అస్థానా, సీబీఐ డీఎస్పీ దేవేంద్రకుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌ల పిటిషన్లను జస్టిస్ నజ్మీ వాజిరి బెంచ్ విచారణకు చేపట్టింది. ఈ దశలో అనవసర సందేహాలొద్దు.. ‘అవినీతి సంబంధ కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్ను రిట్ పిటిషన్ ద్వారా సవాలుచేసినప్పుడు, ఆ ఎఫ్ఐఆర్లోని ఆరోపణల్లో కేసు పెట్టదగినవి ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని పరిశీలించాలి. ఈ దశలో కేసుతో సంబంధంలేని విషయాలు, సందేహాల్ని లేవనెత్తకూడదు. ఇక ప్రస్తుత కేసులో వచ్చిన ఆరోపణలు కేసుపెట్టదగినవే అని తేలడంతోనే ఎఫ్ఐఆర్ నమోదుచేసి విచారణ ప్రారంభించాం. కొత్త బృందం దర్యాప్తును ప్రారంభించి, కీలక పత్రాలను పరిశీలిస్తోంది. తదుపరి దశలో సవివర అఫిడవిట్ దాఖలుచేస్తాం’ అని సీబీఐ పేర్కొంది. కాగా, అస్థానాపై విచారణ చేపట్టకుండా యథాతథ స్థితిని కోర్టు నవంబర్ 14 వరకు పొడిగించింది. -
భార్యలకు బ్యాంకు ఖాతాలు తెరుస్తూ...
సాక్షి, సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఒడిశా నుంచి తీసుకువ్చన మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) కేసు నిందితుడు మీర్ షహీరుద్దీన్ గ్రీన్ రే ఇంటర్నేషనల్ లిమిటెడ్ (గ్రిల్) ముసుగులో దేశ వ్యాప్తంగా పాల్పడిన స్కామ్ రూ.1000 కోట్లు ఉంటుందని సీబీఐ నిర్థారించింది. గతేడాది భువనేశ్వర్‌కు చెందిన సీబీఐ యూనిట్ అతడిని అరెస్టు చేసిన విషయం విదితమే. 2015లో కాలాపత్తర్‌లో నమోదై, తమకు బదిలీ అయిన కేసు దర్యాప్తులో భాగంగానే సీసీఎస్ పోలీసులు మీర్ షహీరుద్దీన్తో పాటు సంస్థ డైరెక్టర్ అయూబ్‌లను నగరానికి తీసుకువచ్చారు. ఎంఎల్ఎం దందాతో పాటు చిట్‌ఫండ్ వ్యాపారంతో లక్షల మందికి టోకరా వేయడంతో వీరిపై దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. షహీరుద్దీన్ ఇలా సంపాదించిన సొమ్మును హవాలా రూపంలో దుబాయ్, నైజీరియాలకు పంపినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇతడికి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలు ఉన్నట్లు గతేడాది అరెస్టు సమయంలో ఆరోపించింది. ఏడాదిలో కేసుల నమోదు... ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, జలేశ్వర్‌కు చెందిన మీర్ షాహిరుద్దీన్ బాలాసోర్ కేంద్రంగా 2012లో గ్రిల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కైలాష్ సాహ, అయూబ్ సాహ, మీర్ తహీరుద్దీన్ డైరెక్టర్లుగా ఉన్నారు. నగరంలోని కాలాపత్తర్‌తో పాటు దేశ వ్యాప్తంగా 108 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసిన ‘గ్రిల్’ తక్కువ ధరకు బంగారం పేరుతో ఎంఎల్ఎం, చిట్‌ఫండ్స్ వ్యాపారం నిర్వహించారు. వీటితో పాటు భారీగానూ ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించిన ఈ సంస్థ ఆ మొత్తాలను తిరిగి చెల్లించడంతో విఫలమైంది. దీంతో 2013 నుంచి గ్రిల్‌పై కేసులు నమోదు కావడం ప్రారంభమైంది. కాలాపత్తర్‌లో 2015లో కేసు రిజిస్టరై సీసీఎస్‌కు బదిలీ అయింది. పోలీసుల వేట ప్రారంభం కాగానే షాహిరుద్దీన్ తన ముగ్గురు భార్యలతో కలిసి నైజీరియాకు పారిపోయాడు. ఈ కేసులకు ఉన్న తీవ్రత దృష్ట్యా 2014 మేలో ఒడిశాలో నమోదైన కేసుల దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. నైజీరియా నుంచి షాహిరుద్దీన్, అతడి భార్యలు దుబాయ్, సౌదీ అరేబియాలకు తిరుగుతూ అరెస్టు నుంచి తప్పించుకోగా, ముగ్గురు డైరెక్టర్లను సీబీఐ అరెస్టు చేసింది. షాహిరుద్దీన్పై లుక్ ఔట్ సర్క్యులర్స్ (ఎల్ఓసీ) జారీ చేసింది. మారుపేరుతో బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్... గ్రిల్ ద్వారా సంపాదించిన సొమ్ముతో షాహిరుద్దీన్ నైజీరియాలో ఓ ఐరన్ ఓర్ మైన్‌ను లీజుకు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. చాలా ఏళ్లుగా విదేశాల్లో ఉన్న అతడిని హవాలా ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాడనే అభియోగంపై నైజీరియాకు చెందిన అధికారిక సంస్థ స్టేట్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్ఎస్ఎస్) 2015 జూలై 15న అరెస్టు చేసింది. ఏడాదికి పైగా అక్కడి జైల్లో ఉన్న షాహిరుద్దీన్ బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ కేసు నేపథ్యంలో గత ఏడాది భారత్‌కు తిరిగి రావాలని భావించాడు. అయితే తనపై ఎల్ఓసీ జారీ అయి ఉండటంతో మరో దేశం నుంచి మా రు పాస్‌పోర్ట్ పొంది భారత్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నైజీరియా నుంచి దుబాయ్ మీదుగా బంగ్లాదేశ్‌కు చేరుకున్న షాహిరుద్దీన్, అతడి ముగ్గురు భార్యలు అక్కడ కొన్ని రోజులు బస చేశారు. అక్కడే ఓ దళారి ద్వారా షాహిరుద్దీన్ తన పేరును హమీద్ హుస్సేన్‌గా పేర్కొంటూ మ రో పాస్‌పోర్ట్ పొందాడు. దీని ఆధారంగా పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్‌లోకి అడుగుపెట్టాడు. భార్యలకు బ్యాంకు ఖాతాలు తెరుస్తూ... ఈ విషయాన్ని గుర్తించిన సీబీఐ షాహిరుద్దీన్‌ను పట్టుకునేందుకు నిఘా ముమ్మరం చేసింది. కోల్‌కతాలో కొన్ని రోజుల పాటు షెల్డర్ తీసుకున్న అతను తన భార్యల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు గాను గత ఫిబ్రవరిలో రాజర్‌హత్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు వెళ్లాడు. దీనిపై సమాచారం అందడంతో సీబీఐ అధికారులు దాడి చేసి షాహిరుద్దీన్‌ను పట్టుకున్నారు. గ్రిల్ స్కామ్ నేపథ్యంలో ‘సెబీ’ గతేడాది సదరు సంస్థపై రూ.కోటి పెనాల్టీ విధించింది. ఎండీ, డైరెక్టర్లు సహా అంతా జైలులో ఉండటంతో ఈ మొత్తాన్ని ఎవరూ చెల్లించలేదు. సీబీఐ కంటే ముందే ఈ కేసును దర్యాప్తు చేసిన ఒడిశా పోలీసులు 13 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి భారీగా నగదు, స్థిరచరాస్తులు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసులో బాధితులుగా ఉన్న వారికి న్యాయం చేయాలంటే సీబీఐతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. -
అ అంటే అవినీతి.. ఆ అంటే ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికలో ఏకి పారేసింది. అంచనా వ్యయాలను పెంచేస్తూ కాంట్రాక్టర్లకు ఆయాచితంగా లబ్ధి చేకూర్చడాన్ని తూర్పారబట్టింది. అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ నిధులను దారి మళ్లిస్తుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అక్రమాలకు పాల్పడిందని హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు, సీబీఐ తేల్చిన కాంట్రాక్టు సంస్థకే అధిక ధరలకు కాంట్రాక్టును అప్పగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు సభకు జనసమీకరణ కోసం పాల కేంద్రానికి చెందిన రూ.22 లక్షలను వినియోగించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖజానా శాఖ చెబుతోన్న లెక్కలకూ క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులకూ పొంతనే లేదని కాగ్ తేల్చిచెప్పింది. ఆర్థిక క్రమశిక్షణలో అడుగడుగునా ఉల్లంఘనలే కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికతో అక్రమాలు బట్టబయలవడంతో సర్కార్ ఆత్మరక్షణలో పడింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నియమావళి సెక్షన్ 3 ప్రకారం వ్యక్తిగత చెక్కుల రూపంలో ఎలాంటి నిధులను విడుదల చేయకూడదు. కానీ.. నిధులు మురిగిపోవడాన్ని తప్పించుకునే ముసుగులో భారీగా నిధులను దారిమళ్లించినట్లు నిర్ధారించింది. 2016–17లో జిల్లాల ఖజానా అధికారులు రూ.257.89 కోట్లను వ్యక్తిగత చెక్కుల రూపంలో జారీ చేశారని.. వివిధ బ్యాంకుల మేనేజర్ల పేరుతో రూ.1,325.88 కోట్ల విలువైన 353 చెక్‌లను జారీ చేసినట్లు గుర్తించింది. మొత్తం రూ.1,583.77 కోట్ల నిధులను ఏ పనుల కోసం చెల్లించారన్నది చెక్కుల్లో పేర్కొనలేదని స్పష్టం చేసింది. ఆ నిధులు మొత్తం దారిమళ్లినట్లు భావిస్తున్నట్లు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం చివరిలో అంటే మార్చి నెలలో భారీ ఎత్తున నిధులు ఖర్చు అయినట్లు సర్కార్ లెక్కలు చూపడంపై కాగ్ నివ్వెరపోయింది. సచివాలయంలో ఆర్థిక సేవలు పేరుతో ఏడాది మొత్తం రూ.868.81 కోట్లు ఖర్చు చేస్తే.. ఒక్క మార్చి నెలలోనే రూ.426.23 కోట్లు ఖర్చు చేసినట్లు చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు, సీబీఐ అక్రమార్కుడని తేల్చినా హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ఫలకాల (హెచ్ఎస్ఆర్పీ)ప్రాజెక్టులో లింక్ పాయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్(ఎల్ఐపీఎల్) అక్రమాలకు పాల్పడినట్లు హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే ప్రాజెక్టు అమలులో అక్రమాలకు పాల్పడటంతో ఉత్సవ్ సేఫ్టీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (యూఎస్ఎస్ఎల్)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అక్రమాలకు పాల్పడిన ఈ సంస్థలు ఏర్పాటు చేసిన కన్సార్టియంకు అధిక ధరకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎస్ఆర్పీ ప్రాజెక్టును అప్పగించడంపై కాగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కన్సార్టియంకు పనులు అప్పగించవద్దంటూ ఏపీఎస్ఆర్టీసీ న్యాయ సలహాదారు ఇచ్చిన న్యాయ అభిప్రాయాన్ని కూడా తోసిపుచ్చడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒక్కో ఫలకం సగటున రూ.119 నుంచి రూ.146కు ఇదే సంస్థ అమర్చితే.. రాష్ట్రంలో మాత్రం ఒక్కో ఫలకం అమర్చడానికి ఆ సంస్థకు రూ.220.34 చెల్లించి నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేల్చింది. కాంట్రాక్టర్లకు భారీగా లబ్ధి రాష్ట్రంలో నిర్మాణంలోని 44 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.27,403.74 కోట్లు పెంచేసినా ఒక్క ప్రాజెక్టునూ ప్రభుత్వం పూర్తి చేయలేకపోవడాన్ని కాగ్ తప్పుబట్టింది. ఈ ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.49,107.78 కోట్లు. వివిధ కారణాల వల్ల పనుల్లో జాప్యం చోటుచేసుకుందని.. వాటిని మార్చి 31, 2017 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించిన సర్కార్ అంచనా వ్యయాన్ని రూ.76,511.52 కోట్లకు పెంచేసింది. ఆ మేరకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చినట్లు కాగ్ ఎత్తిచూపింది. 2016–17లో ‘నీరు–చెట్టు’ పథకానికి బడ్జెట్లో రూ.135 కోట్లు కేటాయించి.. చివరికి రూ.1,242 కోట్లు ఖర్చు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎక్సైజ్ శాఖలో 143.46 కోట్ల లూటీ ఎక్సైజ్ శాఖ్లో అస్మదీయులకు రూ.143.46 కోట్లు దోచిపెట్టడంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి 2 వేల లక్షల ప్రూఫ్ లీటర్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తామని అంగీకార లేఖ (లెటర్ ఆఫ్ ఇంటెంట్) ఇచ్చారు. ఇందుకు ఫీజు కింద రూ.129 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ డిస్టిలరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని వెయ్యి లక్షల ప్రూఫ్ లీటర్లకు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం ఓకే చెప్పడాన్ని కాగ్ ఆక్షేపించింది. దీని వల్ల ఎస్పీవై రెడ్డి సంస్థకు రూ.60 కోట్లకుపైగా లబ్ధి చేకూర్చినట్లు గుర్తించింది. అటు విత్తనాభివృద్ధి సంస్థలో చోటుచేసుకున్న అవకతవకలను తూర్పా రబట్టింది. 2015–16 రబీలో జేజీ–11 అనే శనగ సర్టిఫైడ్ విత్తనాల సేకరణలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు 3సార్లు విత్తన ధరను పెంచారు. దాంతో.. రూ.38.24 కోట్లు దుర్విని యోగమయ్యాయని కాగ్ తేల్చింది. విత్తన పంపిణీ ఏజెన్సీల నుంచి 12.26 కోట్ల బకాయిలు వసూలు చేయకపోవడాన్ని ఎత్తి చూపింది. అస్మదీయ కాంట్రాక్టర్ కోసం.. ఏపీ జెన్కోలో కాంట్రాక్టర్లకు అడుగులకు అధికారులు మడుగులొత్తడం వల్ల భారీ ఎత్తున నిధులు దారిమళ్లినట్లు కాగ్ గుర్తించింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో బూడిద చెరువు–2ను పటిష్ఠం చేసే పనులను రూ.30.21 కోట్లకు కేసీఎల్– ఆర్వీఆర్(జేవీ) సంస్థకు అప్పగించారు. ఒప్పందం ప్రకారం మట్టి ఎంత దూరం నుంచి తెచ్చినా ఏపీ జెన్కోకు సంబంధం ఉండదు. అదనపు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మట్టిని 42 కి.మీల దూరం నుంచి తెచ్చానని.. అదనపు బిల్లులు ఇవ్వాలన్న కాంట్రాక్టర్ ప్రతిపాదనను అంగీకరించడంతో రూ.7.10 కోట్లు దుర్వినియోగమయ్యాయని కాగ్ తేల్చింది. సీఎం సభ జనసమీకరణ కోసం గ్రామీణ నీటి సరఫరా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ), గిరిజన ప్రాంత అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో రూ.42.92 కోట్లను దుర్వినియోగం చేసినట్లు కాగ్ ఎత్తి చూపింది. అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు సభకు జనసమీకరణ కోసం పాల కేంద్రానికి చెందిన రూ.22 లక్షలను దుర్వినియోగం చేసినట్లు తేల్చింది. -
ఐడీబీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం
-
ఐడీబీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: చేపల పెంపకం.. వాటి సంబంధిత వ్యాపారం పేరిట వారంతా ఐడీబీఐ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల్లో రుణం తీసుకున్నారు. ఆ తర్వాత సదరు రుణం చెల్లించకుండా కొందరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యారు. దీంతో వీరి రుణాలను నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చేశారు. ఈ మొత్తం ఇప్పుడు సుమారు రూ. 445 కోట్లకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఐడీబీఐ జీఎంతో పాటు 31 మందిపై కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఐడీబీఐ బషీర్‌బాగ్, హబ్సిగూడ, విశాఖలోని సిరిపురం బ్రాంచ్‌ల నుంచి 22 మంది చేపల పెంపకం, వాటి సంబంధిత వ్యాపారం పేరిట 2009 నుంచి 2012 వరకు రూ.192.98 కోట్ల రుణాలు తీసుకున్నారు. వీటిని చెల్లించకుండా బ్యాంకు అధికారులతో కుమ్మక్కు కావడంతో వీరి రుణాలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించారు. దీని వల్ల 2017 సెప్టెంబర్ వరకు రూ.445.32 కోట్లు అప్పుగా ఉన్నట్టు ఐడీబీఐ నిర్ధారించింది. అయితే బ్యాంకులో రుణం పొందేందుకు చూపించిన ఆస్తి పత్రాలు, చేపల పెంపకం చేస్తున్నట్టు చూపించిన భూములు అన్నీ నకిలీవేనని ఐడీబీఐ సీనియర్ రీజినల్ హెడ్, జనరల్ మేనేజర్ మంజునాథ్ గుర్తించారు. రుణాలు పొందిన వారితో బ్యాంకు అధికారులు కుమ్మక్కై నష్టాలను తెచ్చిపెట్టారని ఆరోపిస్తూ హైదరాబాద్ రేంజ్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. కంపెనీల పేరిట రుణాలు తీసుకున్న వారు వాటిని సొంత ఖాతాల్లోకి మళ్లించి.. ఇతర ఖాతాలకు తరలించినట్టు సీబీఐ గుర్తించింది. ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన వారు రుణాలు పొంది తిరిగి చెల్లించకుండా మోసం చేసినట్టు సీబీఐ గుర్తించింది. సీబీఐ కేసు వీరిపైనే.. ఐడీబీఐ జనరల్ మేనేజర్ బట్టు రామారావు(ప్రస్తుతం ఉద్యోగం నుంచి తొలగించారు), ఆర్.దామోదర్(సీజీఎం రిటైర్డ్), ఆదిలక్ష్మీ గ్రూపునకు చెందిన ముప్పిడి లక్ష్మణ్‌రావు, ఎస్ సుధాకర్ గ్రూపునకు చెందిన సుధాకర్, ఎన్వీ సుబ్బరాజు గ్రూపునకు చెందిన వెంకటసుబ్బరాజు, చంద్రకాంత్ గ్రూపునకు చెందిన తోరం చిన్న వెంకటేశ్వర్రావు, ఎన్ రామరాజు గ్రూపునకు చెందిన నడింపల్లి రామరాజు, కేఎస్వీ ప్రసాద్‌రాజు గ్రూపునకు చెందిన కేఎస్వీ ప్రసాద్‌రాజు, సునీల్ చౌదరి గ్రూపునకు చెందిన ఆంజనేయరాజు, పాతూరి సునీల్ చౌదరి, ఎయిర్టెల్ సోమరాజు గ్రూపునకు చెందిన పీవీ కృష్ణంరాజు, బెల్లాల గ్రూపునకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, చైతన్యరాజు గ్రూపునకు చెందిన కేవీవీ సత్యనారాయణరాజు, వికేస్కుమార్ అగర్వాల్ గ్రూపునకు చెందిన వికేష్‌కుమార్ అగర్వాల్, సురేంద్రవర్మ గ్రూపునకు చెందిన సురేంద్రవర్మ, హరిప్రియా గ్రూపునకు చెందిన తోరం వెంకటేశ్వర్రావు, మింటే గ్రూపునకు చెందిన రమావత్ బాలు, గుట్టకోటయ్య గ్రూపునకు చెందిన కోటయ్య, ఓక్ట్రీ గ్రూప్‌నకు చెందిన కడాలి వెంకటరమణ, సూరం రవీందర్ గ్రూపునకు చెందిన రవీందర్, రంగరాజు గ్రూపునకు చెందిన కలిదిండి రామరాజు, సాయివర్మ గ్రూపునకు చెందిన అల్లూరి సాయిబాబా, సూరం వెంకటేశ్వర్‌రెడ్డి, సాయిబాబా గ్రూపునకు చెందిన ఏవీవీఎస్ సాయిబాబాతో పాటు ఏడుగురు బ్యాంకు ప్యానల్ వాల్యూయర్స్పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ పేర్కొంది. పీసీయాక్ట్ 1988 సెక్షన్ 13(2), రెడ్‌విత్ 13(1), (సీ)(డీ), భారత శిక్షా స్మృతి (ఐపీసీ) 120–బి, రెడ్‌విత్ 420, 409, 468, 471 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సీబీఐ ఎస్పీ వివేక్దత్ వెల్లడించారు. -
మరో స్కాం: రూ.515కోట్లకు ముంచేశారు
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రోజుకో స్కాం వెలుగు చూస్తోంది. ఇటీవలే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విక్రమ్ కొఠారీల కుంభకోణాలు మరవక ముందే తాజాగా కెనరా బ్యాంక్‌ను భారీగా టోకరా ఇచ్చిన వైనం వార్తల్లోనిలిచింది. రూ.515 కోట్ల స్కాం ఆరోపణలతో సీబీఐ కేసులు నమోదు చేసింది. కోలకత్తాకు చెందిన ఆర్ పి ఇన్ఫోసిస్టం కంపెనీ,దాని డైరెక్టర్లపై రూ.515.15 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీల ఫిర్యాదుతో సీబీఐ ఈ చర్యకు పూనుకుంది. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. సంస్థ కార్యాలయం సహా ఆరుచోట్ల బుధవారం సోదాలు నిర్వహించింది. ఫిబ్రవరి 26న కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్ డివి ప్రసాద్ రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో శివాజీ పాంజా, కస్తూవ్ కౌస్తువ్ రే, వినయ్ బాఫ్నా, దేవ్నాత్ పాల్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) కెనరా బ్యాంక్‌ను, బ్యాంక్ ఆఫ్ కన్సార్టియంను రూ .515.15 కోట్ల మోసి చేసినట్టు పేర్కొన్నారు. కోల్‌కతా కేంద్రంగా ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్ను ఏర్పాటు చేసిన శిబాజీ పంజా (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు) నకిలీ పత్రాలతో వందల కోట్ల రూపాయల రుణాన్ని పొందాడు. లేని నిల్వలు ఉన్నట్టు హామీగా చూపడం, డాక్యుమెంట్ల ఫోర్జరీ, ఇతర కంపెనీల నుంచి పైసా కూడా బకాయిలు అందాల్సి లేకపోయినా, డాక్యుమెంట్ల ఫోర్జరీ ద్వారా బకాయిలు రావలసి ఉందని చూపించడం, నిజంగానే కొద్ది మొత్తం రావలసి ఉన్నా ఫోర్జరీ ద్వారా దాన్ని అధికంగా చూపించడం ద్వారా పంజా, అతడి సహచరులు కెనరా బ్యాంక్ నాయకత్వంలోని 9 బ్యాంకులను రూ.515కోట్లు ముంచినట్టు సీబీఐ కేస్ నమోదు చేసింది. శిబాజీ పంజాకు కొంతమంది కెనరా బ్యాంక్ అధికారులు కూడా సహకరించినట్టు, వారిపై కూడా కేసులు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. -
భారీ కుంభకోణం: సీఎం అల్లుడు బుక్
సాక్షి, లక్నో: ప్రభుత్వ రంగ బ్యాంకులో మరో భారీ కుంభకోణం వెలుగు చూసింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రుణాల ఎగవేతకు సంబంధించి సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. ప్రైవేట్ చక్కెర ఉత్పాదక సంస్థ శింబోలీ షుగర్స ఓబీసీకి రూ.109 కోట్ల మేర రుణాలు ఎగవేసిన కేసులో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అల్లుడు, శింభోలీ షుగర్స్ డిప్యూటీ డైరెక్టర్ గురుపాల్ సింగ్ కీలక నిందితుడుగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంస్థ శింభోలీ షుగర్స్ రుణాల చెల్లింపులో విఫలంకావడంతో ఓబీసీ సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసులో పంజాబ్ సీఎం కుమార్తె జై ఇందర్ సింగ్ భర్త, కంపెనీ డిప్యూటీ డైరెక్టర్లలో ఒకరైన గురుపాల్ సింగ్, శింభోలీ సీఎండీ, సీఈవో, సీఎఫ్‌వో సహా,13మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మొత్తం ఎనిమిది కంపెనీల్లో గురుపాల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. 20111 లో చక్కెర రైతులు 5700మందికి సహాయం చేసే ఉద్దేశంతో ఆర్బీఐ పథకంకింద 150కోట్ల మేర రుణం మంజూరైంది. అయితే ఈ మొత్తం రైతులకు పంపణీ చేయకుండా అక్రమార్గాల్లో కంపెనీ అకౌంట్లో మళ్లించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ. అలాగే శింభోలీ సిబ్బందితోపాటు బ్యాంక్ అధికారులు కొందరిపై సైతం కేసు రిజిస్టర్ అయింది. ఈ వార్తలతో శింబోలి షుగర్స్షేరు 15 శాతం కుప్పకూలి నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, హపూర్, నోయిడాలలో కంపెనీల డైరెక్టర్ల నివాసాలు, ఫ్యాక్టరీ, కార్పోరేట్ ఆఫీస్, రిజిస్ట్రేషన్ ఆఫీసు సహా ఎనిమిది ప్రాంగణాలలో సోదాలు నిర్వహించామని సిబిఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ వెల్లడించారు. నిందితులపై నేరపూరిత కుట్ర, మోసంఅవినీతి నిరోధక చట్టంకింత కేసు నమోదు చేశామన్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ప్రకారం, 97.85 కోట్ల రూపాయల నగదును బ్యాంకు ప్రకటించగా, అసలు రుణం రూ.109.08 కోట్లకు చేరింది. మరోవైపు ఈ రుణాన్ని తీర్చేందుకు జనవరి 28, 2015 లో రూ.110కోట్ల మరో కార్పొరేట్ రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు మొత్తం రుణాన్ని రూ.113 కోట్లుగా తేల్చింది. అయితే 2016 నవంబరులో ఎన్పీఏగా ప్రకటించింది. కాగా 2017 నవంబరు 17న బ్యాంకు సిబిఐకి ఫిర్యాదు చేయగా, ఫిబ్రవరి 22, 2018 న మాత్రమే నమోదు చేయడం గమనార్హం. -
మరో బ్యాంకు కుంభకోణం
న్యూఢిల్లీ/ముంబై: ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.390కోట్లకు ముంచేసిన ఓ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. పీఎన్బీ, రొటొమ్యాక్ కుంభకోణాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఢిల్లీలో వెలుగుచూసిన ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఢిల్లీకి చెందిన వజ్రాల నగల ఎగుమతిదారు ద్వారకాదాస్ సేథ్.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రూ.389.85కోట్ల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ‘ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రుణఎగవేతకు పాల్పడినట్లు ఆరు నెలల క్రితమే బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తాజాగా సంస్థ డైరెక్టర్లుగా ఉన్న సభ్య సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవిసింగ్లతోపాటుగా ద్వారకాదాస్ సేథ్ సెజ్ ఇన్ కార్పొరేషన్ సంస్థపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. 2007–12 మధ్య రూ.389 కోట్లమేర ఓబీసీ నుంచి రుణాలు పొందింది. ఆ తర్వాత గుర్తుతెలియని సంస్థలతో ఈ సంస్థ లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఇచ్చిన ‘లెటర్ ఆఫ్ క్రెడిట్స్’ను అడ్డం పెట్టుకుని బయటి వ్యక్తుల దగ్గర బంగారం, వజ్రాభరణాలపై మరిన్ని రుణాలు తీసుకున్నారని, విదేశాలతో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించామని బ్యాంకు అధికారులు సీబీఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాంకుల ఫిర్యాదుతో మరో మూడు కేసులు ద్వారకాదాస్ సేథ్తో పాటుగా ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త, ఓ బ్యాంకు అధికారి మోసం చేశారంటూ మూడు వేర్వేరు బ్యాంకులు ఈవారం ప్రారంభంలోనే సీబీఐకి ఫిర్యాదు చేశాయి. వీటి ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. బుధ, గురువారాల్లోనే ఈ కేసులు నమోదైనా ఆలస్యంగా వెలుగుచూశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, నేరపూరితంగా చట్టాలను దుర్వినియోగం చేసి రుణాలు పొందారంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చిన ఫిర్యాదుమేరకు అమిత్ సింగ్లా అనే వ్యాపారవేత్తపై కేసు నమోదైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పీఎన్బీ బార్మర్ బ్రాంచ్ మాజీ మేనేజర్ ఇందర్‌చంద్ చుండావత్‌ను సీబీఐ అరెస్టు చేసింది. రూ.523కోట్ల ఆస్తులు అటాచ్ పీఎన్బీ కుంభకోణం దర్యాప్తులో భాగంగా నీరవ్ మోదీకి సంబంధించిన రూ.523 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ అటాచ్ చేసింది. ఇందులో ఓ పెంట్‌హౌస్, ఫామ్‌హౌస్‌లున్నాయని పేర్కొంది. ‘ముంబైలోని సముద్ర మహల్ అపార్ట్మెంట్లోని రూ.15.45 కోట్ల విలువైన ఫ్లాట్, మూడు ఫ్లాట్లు ఉన్న రూ.81.16కోట్ల విలువైన పెంట్‌హౌస్, ఆరు రెసిడెన్షియల్ ఆస్తులు, 10 ఆఫీసులు, ఓ సోలార్ పవర్ ప్లాంట్, అలీబాగ్‌లోని ఫామ్‌హౌస్, అహ్మద్‌నగర్ జిల్లాలోని 135 ఎకరాల స్థలాలను అటాచ్ చేసుకున్నాం. వీటి మార్కెట్ విలువ రూ. 523కోట్లు ఉంటుంది’ అని ఈడీ పేర్కొంది. నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు ఈడీ ఫిర్యాదుతో నీరవ్ మోదీతోపాటు ఆయన మామ మెహుల్ చోక్సీల పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈడీ సూచన మేరకు ఫిబ్రవరి 16 నుంచి నాలుగువారాలపాటు వీరిద్దరి పాస్‌పోర్టులను విదేశాంగ శాఖ సస్పెండ్ చేసింది. దీంతోపాటుగా వారం రోజుల్లో వారి పాస్‌పోర్టులను ఎందుకు జప్తు, రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ‘నీరవ్, చోక్సీలనుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అందుకే ఇద్దరి పాస్‌పోర్టులను రద్దుచేస్తున్నాం’ అని రవీశ్ కుమార్ తెలిపారు. పాస్‌పోర్టుల రద్దుపై నీరవ్ న్యాయవాది విజయ్ అగర్వాల్ మండిపడ్డారు. ‘నీరవ్, చోక్సీలు విచారణకు హాజరవ్వాలని ఈడీ పిలుస్తోంది. అటు విదేశాంగ శాఖ మొదట పాస్‌పోర్టును సస్పెండ్ చేసింది.. ఇప్పుడు రద్దు చేసింది. పాస్‌పోర్టు లేకుండా విదేశాలనుంచి ఎలా రాగలరు?’ అని విజయ్ ప్రశ్నించారు. మరోవైపు, గీతాంజలి జెమ్స్, రొటొమ్యాక్ కంపెనీల ఆస్తులపై ఈడీ, ఆదాయపుపన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రొటొమ్యాక్ కంపెనీ ఇంతవరకు చెల్లించాల్సిన పన్ను బకాయి రూ.106కోట్లుగా ఉందని అధికారులు వెల్లడించారు. విక్రమ్ కొఠారీపై పన్ను ఎగవేతకు సంబంధించిన మరో ఆరు ఫిర్యాదులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది ‘జన్‌ధన్ లూటీ’ యోజన ప్రధానిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ: తాజాగా మరో బ్యాంకు కుంభకోణం వెలుగులోకి రావటంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని మోదీపై విమర్శల పదును పెంచింది. ‘ఊహించినట్లే నీరవ్ మోదీ, విజయ్ మాల్యాల్లాగే మరో సంస్థ ప్రమోటర్ ప్రభుత్వం కన్నుగప్పి పారిపోయాడు. మోదీ పాలనలతో జన్‌ధన్ లూటీ పథకం నడుస్తోంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ట్వీటర్లో విమర్శించారు. పీఎన్బీ కుంభకోణంలో ఆర్బీఐ ద్వారా సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బ్యాంకులను మోసం చేసే కేసుల్లో 60 రోజుల్లో నేరగాళ్లను అదుపులోకి తీసుకునే వ్యవస్థను ఏర్పాటుచేయాలని మోదీని కోరారు. ‘ఈ కొద్ది రోజుల్లోనే భారత బ్యాంకులు రూ.21వేల కోట్లమేర నష్టపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యాంకు మోసాలు బయటపడొచ్చు. ప్రపంచంలోనే ప్రధాని మోదీ ఖరీదైన కాపలాదారు’ అని సిబల్ విమర్శించారు. ‘ప్రధాని ఈ అంశంపై ప్రజలకు భరోసా ఇవ్వనంతవరకు ప్రభుత్వమే ఈ నేరస్తులు పారిపోయేందుకు మద్దతిచ్చిందని దేశమంతా భావిస్తుంది. అందుకే పీఎన్బీ కుంభకోణంపై ఆర్బీఐ దర్యాప్తుకు వీలైనంత త్వరగా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం’ అని సిబల్ పేర్కొన్నారు. -
బ్యాంకును ముంచేసిన మరో డైమండ్ వ్యాపారి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి మరిన్ని కేసులు వెలుగులో వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన వజ్రాల వ్యాపారి బుట్టలో మరో ప్రభుత్వ రంగ బ్యాంకు పడటం పలు ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది. ఇటీవల నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వేల కోట్ల కుంభకోణం తాలూకు ప్రకంపనల వేడి ఇంకా చల్లాకరముందే మరో డైమండ్ వ్యాపారిపై సీబీఐ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ) రూ. 389 కోట్ల మేర మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలపై సంస్థపైనా, డైరెక్టర్లపైనా కేసు నమోదైంది. ఢిల్లీకి చెందిన వజ్రాల ఎగుమతిదారుడు ద్వారకా దాస్ సేథ్ కూడా నీరవ్ మోదీ, చోక్సీ మోడస్ ఒపరాండీని ఫాలో అయ్యాడు. అక్రమ లావాదేవీలతో భారీ ఎత్తున ప్రభుత్వ రంగ బ్యాంకు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు కుచ్చుటోపీ పెట్టాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గమనించిన బ్యాంకు సీబీఐకు ఫిర్యాదు చేసింది. దీంతో ద్వారకా దాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. డైమండ్ వ్యాపారి నిరవ్ మోడీ, మెహల్ చోక్సిల తరహాలోనే ఓబీసీలో 2007-2012 మధ్య కాలంలో ద్వారకా దాస్ రూ.389.85 కోట్లు మోసానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో సంస్థలోని మొత్తం డైరెక్టర్లు సభా సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవి సింగ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వీరితోపాటు ద్వారకా దాస్ సేథ్ సెజ్ ఇన్కార్పొరేషన్ అనే మరో సంస్థను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది. కంపెనీలెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ఓసీ)ల ద్వారానే మోసానికి పాల్పడినట్టు బ్యాంకు ఆరోపించింది. ఈ సంస్థ కూడా ఉనికిలో లేని సంస్థలపేర్లతో వ్యాపార లావాదేవీలు చేసినట్టు చెప్పింది. కాగా బ్యాంకు ఆరు నెలల క్రితమే సీబీఐకి ఫిర్యాదు చేయడం గమనార్హం. -
బాధలేదు.. ఇప్పుడు నా కొడుకున్నాడు : లాలూ
సాక్షి, రాంచీ : దాణా కుంభకోణం కేసులో శనివారం తన భవితవ్యం తేలనున్న నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కాస్త మనోనిబ్బరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2013లో ఈ కేసుకు సంబంధించి తీర్పు వచ్చే సమయంలో తాను జైలుకు వెళితే తన పార్టీని ముందుకు నడిపించేది ఎవరు అని బాధపడ్డారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయనకు ఆ బాధ అస్సలు లేదు. 'పార్టీ గురించి నేనిప్పుడు బాధపడాల్సిందేమి లేదు.. అక్కడ తేజస్వీ ఉన్నాడు. అయినా మాకు అన్యాయం జరగదు. బీజేపీ కుట్రలను న్యాయం విడిచిపెట్టదు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అదే సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా మేం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం' అంటూ ఆయన ఓ టీవీ చానెల్‌తో పంచుకున్నారు. రాంచీలోని సీబీఐ కోర్టుకు మరికొద్ది గంటల్లో వెళ్లనుండగా ఆయన మీడియాతో మాట్లాడారు. నితీష్ కుమార్ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ అనుభవంతోనే ఆర్జేడీని సమర్ధంగా నడిపిస్తారని లాలూ విశ్వసిస్తున్నారు. కాగా, బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా సహా 22 మందిపై నమోదైన దాణా కుంభకోణం కేసులో సీబీఐ కోర్టు శనివారం తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. విచారణకు హాజరయ్యేందుకు లాలూ తన కుమారుడు తేజస్వీతో కలిసి శుక్రవారం రాంచీకి చేరుకున్నారు. 1991-1994 కాలంలో దియోగఢ్(ప్రస్తుతం జార్ఖండ్‌లో ఉంది) ట్రెజరీ నుంచి దాణా కోసం రూ.89 లక్షలకుపైగా అక్రమంగా డ్రా చేసినట్లు లాలూ సహా 38 మందిపై సీబీఐ 1997, అక్టోబర్ 27న చార్జిషీట్ దాఖలుచేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్న కాలంలో 11 మంది చనిపోగా, ముగ్గురు అప్రూవర్లుగా మారిపోయారు. -
ఒక హత్య..రెండు స్టోరీలు
గుర్గావ్: రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్నహత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రద్యుమ్న హత్య కేసులో తాజా నిందితుడిని జువెనైల్ హోమ్ కు తరలించాలని జువైనల్ కోర్టు ఆదేశించింది. విద్యార్థిని ప్రశ్నించేందుకు స్వతంత్ర సంక్షేమ అధికారిని నియమించింది. తదుపరి విచారణను నవంబరు 22వ తేదీకి వాయిదా వేసింది. ఈ హత్యకేసులో కీలక నిందితుడుగా అరెస్ట్ చేసిన సీనియర్ విద్యార్థిని సీబీఐ ప్రశ్నించింది. నిందితుడిని తీసుకొని స్కూలుకెళ్లి డమ్మీ బొమ్మతో సంఘటన మొత్తాన్ని ఎనాక్ట్ చేయించామనీ, ప్రతీ చిన్న అంశాన్ని క్షుణ్ణంగా విచారించినట్టు సీబీఐ అధికారులు తెలిపారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని అధికారులు స్పష్టం చేశారు. బస్ కండక్టర్‌ను అరెస్ట్ చేసినపుడు కూడా కండక్టర్ నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు ప్రకటించడం గమనార్హం. మరోవైపు తన కొడుకు అమాయకుడని.. మైనర్ అయిన తన కొడుకునుదారుణంగా హింసించారని తండ్రి ఆరోపించారు.. విచారణలో భాగంగా తలకిందులుగా వేలాడదీసి చిత్ర హింసలకు గురిచేశారన్నారు. అంతేకాదు తన కుమారుడి ప్రతిభ, మంచి ప్రవర్తనపై టీచర్లనుంచి అనేకసార్లు ప్రశంసలు లభించాయని చెప్పారు. దీంతో జువైనల్ జస్టిస్ బోర్డు సీబీఐని వివరణ కోరింది. 11 వ తరగతి విద్యార్థి విచారణ సమయం విషయంలో ఎందుకు నిబంధనలు ఉల్లఘించారంటూ సీబీఐని ప్రశ్నించింది. అయితే నిందితుడి తండ్రి ఆరోపణలను సీబీఐ తీవ్రంగా ఖండించింది. ఏడేళ్ల విద్యార్థి ప్రద్యుమ్నను లైంగికంగా వేధించి చంపాడని ఆరోపిస్తూ పోలీసులు బస్ కండక్టర్ అశోక్ కుమార్‌పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించారు. దీంతో కేసు మరో మలుపు తిరిగింది. అదే స్కూల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్ధి పరీక్ష వాయిదా కోసమే ప్రద్యుమ్నను హత్య చేశాడని సీబీఐ విచారణలో అధికారులు తేల్చారు. తాజా పరిణామంతో ప్రద్యుమ్న హత్య కేసులో బాధిత కండక్టర్ పోలీసులపై న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నారు. తన క్లయింట్‌తో బలవంతంగా నేరాన్ని అంగీకరింప చేశారని, బలిపశువును చేశారని ఆయన తరపు న్యాయవాది మోహిత్ వర్మ ఆరోపించారు. అటు తన కుమారుడిమరణంపై న్యాయం జరిగేంతరకు పోరాటంచేస్తామని ప్రద్యుమ్న తండ్రి ప్రకటించారు. హంతకుడికి మరణ శిక్ష పడాలని డిమాండ్ చేశారు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో హర్యానా పోలీసులపైనా, రియాన్ స్కూల్ యాజమాన్యంపైనా దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగే ట్విస్ట్‌లు ట్విస్టులు తిరుగుతున్న చిన్నారి హత్య కేసులో అసలు హంతకులెవరో తేలతారా? నిందితుడు మైనర్ కావడంతో ..ఒక వేళనేరస్తుడిగా తేలిగా ఎలాంటి శిక్ష పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. -
జీవీ బ్యాంక్‌లో ఇంటి దొంగలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీ జీవీబీ)కు ఇంటి దొంగలే కుచ్చుటోపీ పెట్టారు. గృహరుణాల పేరుతో అప్పటికే లోన్లు తీసుకున్న ఖాతాదారుల డాక్యుమెంట్లు పెట్టి, ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంపై ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఖాతాదారుల సంతకాలు ఫోర్జరీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇస్నాపూర్ బ్రాంచ్ లో ఫీల్డ్ అధికారిగా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా వాసి పి.దుర్గాప్రసాద్.. అదే బ్యాంకుకు చెందిన ఇద్దరు బ్రాంచ్ మేనేజర్లు ఎస్వీ రమణమూర్తి, ఎ.ప్రభాకర్‌తో కలిసి ఇంటి లోన్ల పేరిట రూ.5.2కోట్లు దండుకున్నారు. ఏపీ జీవీబీలో అప్పటికే 15మంది ఖాతాదారులు ఇంటి లోన్ తీసుకున్నారు. ఆ సమయంలో ఖాతాదారులు ష్యూరిటీగా సమర్పించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకొని దుర్గాప్రసాద్ అండ్ కో, మరో 15 గృహరుణాల నకిలీ దరఖాస్తులు సృష్టించి, ఖాతా దారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.5.2 కోట్ల నగదు ఆ ఖాతాదారుల బ్యాంకు ఖాతా లోకి మళ్లించారు. లోన్ తీసుకున్నప్పుడు కస్టమర్లు ముందస్తు ఓచర్స్‌పై చేసిన సంతకాలను ఉపయోగించి కొంతనగదును దుర్గాప్రసాద్ బంజారాహిల్స్‌లోని తన కోటక్ మహీంద్రా అకౌంట్, విక్రంపురిలోని హెచ్డీఎఫ్సీ ఖాతాలోకి మళ్లించాడని రీజనల్ మేనేజర్ మల్లెంపాటి రవి మంగళవారం సీబీఐ జేడీ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దుర్గాప్రసాద్ తన బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకున్న నగదుతో పాటు ప్రీ ఓచర్స్‌తో లోన్ డబ్బును డ్రా చేసుకొన్నట్లు సీబీఐ గుర్తించింది. -
స్టెర్లింగ్ బయోటెక్ డైరెక్టర్లు, పలువురిపై చీటింగ్ కేసు
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజా కేసు నమోదు చేసింది. స్లెర్లింగ్ బయోటెక్ సీనియర్ అధికారులు, మరికొంతమందిపై చీటింగ్ కేసు నమోదు చేసింది. రూ. 5,383 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ సంస్థ డైరెక్టర్స్ చేతన్ జయంతిలాల్ సండేశ్వర, దీప్తి చేతన్ సందేశరా, రాజ్‌భూషణ్ ఓంప్రకాష్ దీక్షిత్, నితిన్ జయంతిలాల్ సందేశ్రా, విలాస్ దత్తాత్రేయ జోషి పై కేసు నమోదు చేసింది. వీరితోపాటు చార్టర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాథి, ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్ అనూప్ గార్గ్, గుర్తు తెలియని ప్రైవేట్ , ప్రభుత్వ అధికారులను కూడా ఈ కేసులో చేర్చింది. స్టెర్లింగ్ బయోటెక్ గ్రూపు లోని కంపెనీల ద్వారా విదేశాల్లోని తన సంస్థలకు రుణాన్ని స్టెర్లింగ్ బయోటెక్ మళ్లించిందని సీబీఐ ఆరోపించింది. స్టెర్లింగ్ బయోటెక్ షేర్లలో వర్తకం కోసం ఆఫ్-మార్కెట్ లావాదేవీలకు "బినామి" సంస్థలను ఉపయోగించినట్టు పేర్కొంది. హవాలా ఆపరేటర్ల సహాయంతో ఢిల్లీలోని ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ అనూప్ కుమార్ గార్క్‌కు డబ్బు సరఫరా చేస్తున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇది కచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్, సాధారణ ప్రజల్ని మోసగించడం కిందికే వస్తుందని తెలిపింది. కాగా 2011 లో జరిగిన విచారణల నేపథ్యంలో గత ఆగస్టులో స్టెర్లింగ్ బయోటెక్ డైరెక్టర్లు సహా ముగ్గురు సీనియర్ ఆదాయ పన్ను అధికారులపై కేసు నమోదు చేసింది. -
లియో ప్రమోటర్లకు ఎదురుదెబ్బ
- సీబీఐ కేసుల కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ - పిటిషనర్లు తీవ్రమైన ఆర్థిక నేరానికి పాల్పడ్డారు - ఇలాంటి వారిని వదిలేస్తే నష్టపోయేది ప్రజలే - పిటిషన్లు కొట్టేస్తూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు సాక్షి, హైదరాబాద్: హోటల్ నిర్మాణం నిమిత్తం మూడు జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి కోట్లలో రుణం తీసుకుని మోసగించిన ఉదంతంలో లియో మెరీడియన్ ప్రాజెక్ట్స్ యాజమాన్యానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ విషయమై తమపై సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ లియో ప్రమోటర్లు జీఎస్ చక్రవర్తి రాజు, గోకరాజు స్వర్ణకుమారి, టి.వి.నరసింహం, డి.రామచంద్రరాజు తదితరులు వేర్వేరుగా దాఖలు చేసిన ఆరు వ్యాజ్యాలను ఉమ్మడి హైకోర్టు కొట్టేసింది. బ్యాంకుల నుంచి కోట్లలో రుణం పొందిన పిటిషనర్లు హోటల్ నిర్మాణం పూర్తి చేయకుండా నిధులను పక్కదారి పట్టించారని తేల్చిచెప్పింది. ‘‘ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశాలతోనే పిటిషనర్లు ఇలా చేశారు. తద్వారా తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. ఎగవేసిన డబ్బు బ్యాంకులది కాదు. ప్రజలది. ఇలాంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేయడమే గాక జాతి ఆర్థిక వెన్నెముకనే విరిచేస్తాయి. ఆర్థిక వ్యవస్థనే గాక ప్రజలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని స్వేచ్ఛగా వదిలేస్తే, అంతిమంగా నష్టపోయేది ప్రజలే’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వారిపై సీబీఐ కేసులను కొట్టేయడం సాధ్యం కాదంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. రంగారెడ్డి జిల్లా, బొమ్మరాస్‌పేటలో హోటల్ నిర్మాణం నిమిత్తం లియో మెరీడియన్‌కు బ్యాంక్ ఆఫ్ బరోడా నేతృత్వంలోని కన్సార్షియం రూ.432.22 కోట్ల రుణం మంజూరు చేసింది. కొంతకాలం తర్వాత ప్రమోటర్లు హోటల్ నిర్మాణాన్ని ఆపేశారు. రుణ చెల్లింపులు కూడా చేయలేదు. బ్యాంక్ ఆఫ్ బరోడా దీనిపై ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది. తనఖా భూమిని ప్లాట్లు చేసి లియో ప్రమోటర్లు ఎప్పుడో అమ్మేశారని దర్యాప్తులో తేలింది. దాంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిర్యాదు మేరకు 2015లో సీబీఐ కేసు నమోదు చేసింది. కన్సార్షియంలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా 2017 ఫిబ్రవరిలో సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తమపై సీబీఐ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ చక్రవర్తి రాజు, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పునిచ్చారు. పిటిషనర్లంతా బంధువు లేనని, కూడబలుక్కొనే ఆర్థిక నేరానికి పాల్పడ్డారని ఆయన తేల్చారు. -
తపాలా శాఖ ఉద్యోగులపై సీబీఐ కేసు
సాక్షి, హైదరాబాద్: పాత నోట్లను కమీషన్ పద్ధతిలో మార్పిడి చేసిన పోస్టల్ శాఖ ఉద్యో గులపై సీబీఐ మరో కేసును నమోదు చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పోస్టల్ ఉద్యోగులపై ఆరు కేసులు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్ హుమాయూన్‌నగర్ సబ్ పోస్టాఫీస్ లో పనిచేస్తున్న ట్రెజరర్ శ్రీనివాస్, పోస్టల్ అసిస్టెంట్ రాజ్యలక్ష్మి నోట్ల రద్దు సమయంలో ప్రైవేట్ వ్యక్తులకు రూ.27.27 లక్షల కొత్త నోట్లను కమీషన్ పద్ధతిలో మార్పిడి చేసినట్టు హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరిం టెండెంట్ హెచ్ఆర్ చంద్రశేఖరాచార్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ట్రెజరర్ శ్రీనివాస్ గతేడాది నవంబర్ 11న రూ.15.63 లక్షల పాతనోట్లను మార్పిడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యలక్ష్మి గతేడాది నవంబర్ 17 నుంచి 24 వరకు ఇన్చార్జి ట్రెజరర్ బాధ్యతలో ఉండి రూ.11.64 లక్షలకు ధ్రువపత్రాలు లేకుండా నోట్ల మార్పిడి చేసినట్టు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ వారిద్దరిపై పీసీ యాక్ట్ 1988 కింద 13(2), రెడ్‌విత్ 13(1)డి, ఐపీసీ 409, 468, 471, 477ఏ, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ రేంజ్ సీబీఐ డీఐజీ చంద్రశేఖర్ తెలిపారు. -
పోస్టల్ శాఖకే కుచ్చుటోపీ...!
- ముత్యాల కంపెనీతో ఉద్యోగుల ములాఖత్ - రూ.7.6 కోట్లు నష్టం చేకూర్చడంపై సీబీఐ కేసు సాక్షి, హైదరాబాద్: పోస్టల్ విభాగంలో పని చేస్తూ అదే శాఖకు కోట్లు నష్టం చేకూర్చిన అధికారులు, మరో ప్రైవేట్ కంపెనీ బాగోతం బయటపడింది. హుమాయూన్‌నగర్ పోస్టల్ ఉద్యోగులు సంస్థకు రూ.7.6 కోట్లు నష్టం తెచ్చిపెట్టారని, ప్రీషా పెరల్స్ కంపెనీతో ములాఖత్ అయి అక్రమాలకు పాల్పడ్డారని హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హెచ్ఆర్ చంద్రశేఖర్ అచార్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ పూర్తిచేసిన హైదరాబాద్ రేంజ్ సీబీఐ అధికారులు ముగ్గురు పోస్టల్ ఉద్యోగులు, ప్రీషా పెరల్స్ కంపెనీ, ఇద్దరు ప్రతినిధులపై కేసు నమోదు చేశారు. ఇదీ తతంగం.. ఆబిడ్స్‌కు చెందిన ప్రీషా పెరల్స్ వ్యాపారం నిమిత్తం పలు రాష్ట్రాలకు ముత్యాలను పోస్టల్ శాఖ ద్వారా పంపిస్తుంది. ఈ పార్సిళ్లను హుమాయూన్‌నగర్ పోస్ట్ఆఫీస్ నుంచి వినియోగదారులకు పంపడం, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెప్పించుకోవడం చేస్తోంది. అయితే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నీలేశ్ కుమార్ అగర్వాల్, డైరెక్టర్ శైలేష్ అగర్వాల్ హుమాయూన్ నగర్ సబ్ పోస్టాఫీస్‌లో పనిచేస్తున్న సబ్‌పోస్ట్‌మాస్టర్ ఎన్.కామేశ్వర్రావు, డిప్యూటీ సబ్ పోస్ట్ మాస్టర్ పద్మావతి, ఎస్.వెంకట స్వామితో కలసి పోస్టల్ శాఖకు నష్టం చేకూర్చేలా కుట్ర పన్నారు. ఇందులో భాగంగా సంబంధిత పెరల్స్ కంపెనీ పంపించే పార్సిళ్ల బరువును తక్కువ వెయిట్ చేయడం, అన్ని పార్సిళ్లకు ఒకే క్రమ సంఖ్యతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు సీబీఐ గుర్తించింది. ఒక పార్సిల్‌కు సంబంధించిన వివరాలున్న ఒరిజినల్ కాపీతో పలు కలర్ జిరాక్స్ కాపీలు తీసి అన్నింటికీ ఒకే చార్జి కింద జమ చేసి అక్రమాలకు పాల్పడ్డట్టు సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా 2015 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 32.91 వేల పార్సిళ్లు పంపిస్తే, వాటిని లెక్కలో చూపించకుండా 14.66 వేల పార్సిళ్లు మాత్రమే చూపించి, వాటికి డబ్బులు వసూలు చేశారని, మిగతా 18.25 వేల పార్సిళ్లను లెక్కలోకి తీసుకోకుండా నష్టం చేకూర్చినట్టు ఆధారాలు సేకరించింది. ఇలా పెరల్స్ కంపెనీతో కలసి పోస్టల్ ఉద్యోగులు రూ.7.66 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టారని సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టంచేసింది. ఈ మేరకు పీసీయాక్ట్ 1988 కింద రెడ్‌విత్ 13(2), 13(1)(డి), ఐపీసీ రెడ్‌విత్ 120–బి, 468, 471, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీబీఐ హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఎఫ్ఐఆర్ కాపీలో స్పష్టంచేశారు. -
లాలూ చుట్టూ అవినీతి ఉచ్చు
► రైల్వే మంత్రిగా ఉన్నప్పటి అవకతవకలపై తాజాగా సీబీఐ కేసు ► భార్య రబ్రీ, కుమారుడు తేజస్వీతో పాటు కుటుంబ సభ్యులపై కూడా ► పట్నా, రాంచీ, భువనేశ్వర్, గుర్గావ్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ చుట్టూ అవినీతి ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో పాటు పలువురిపై తాజాగా నమోదైన అవినీతి కేసుకు సంబంధించి సీబీఐ శుక్రవారం 4 నగరాల్లో దాడులు చేసింది. యూపీఏ హయాంలో లాలూ రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపై నమోదైన కేసులో పట్నాలోని రబ్రీదేవీ ఇంటితో పాటు పట్నా, రాంచీ, గుర్గావ్, భువనేశ్వర్‌లోని 12 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. ఈ నెల 5న నమోదైన ఎఫ్ఐఆర్లో లాలూ సన్నిహితుడు ప్రేమ్‌చంద్ గుప్తా భార్య సరళ, సుజాతా హోటల్స్ డైరెక్టర్లు విజయ్ కొచ్చర్, వినయ్ కొచ్చర్, డిలైట్ మార్కెటింగ్ కంపెనీ(ప్రస్తుత లారా ప్రాజెక్ట్స్), ఐఆర్సీటీసీ మాజీ ఎండీ పీకే గోయల్ పేర్లు ఉన్నాయి. లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు.. సరళకు చెందిన బినామీ కంపెనీ ద్వారా పట్నాలోని విలువైన భూమిని లంచంగా తీసుకుని రైల్వేలకు సంబంధించిన రాంచీ, పూరీలోని రెండు హోటళ్ల నిర్వహణ బాధ్యతలను సుజాతా హోటల్స్‌కు కట్టబెట్టినట్టు సీబీఐ పేర్కొంది. 2004–14 మధ్య ఈ కుట్ర జరిగిందని సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా చెప్పారు. సుజాతా హోటల్స్ పట్నాలోని మూడెకరాల విలువైన భూమిని లాలూ కుటుంబానికి చెందిన సరళాగుప్తాకు చెందిన డిలైట్ మార్కెటింగ్‌కు రూ. 1.47 కోట్ల అతి తక్కువ ధరకే కట్టబెట్టిందని ఆరోపించారు. 2010–14 మధ్యలో డిలైట్ కంపెనీ నుంచి రూ. 32.5 కోట్ల విలువైన ఈ భూమిని రూ. 64 లక్షలకే లాలూ కుటుంబ సభ్యుల లారా ప్రాజెక్ట్స్‌కు బదిలీ చేశారని చెప్పారు. దాణా స్కాంలో సీబీఐ కోర్టు ఎదుట లాలూ హాజరైన రోజే ఈ దాడులు జరిగాయి. కాగా, సీబీఐ దాడులు బీజేపీ, మోదీ కుట్ర అని లాలూ ఆరోపించారు. మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కనుసన్నల్లోనే సోదాలు జరిగాయన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఏ విచారణౖకైనా సిద్ధమని ప్రకటించారు. కేంద్రం ప్రతిపక్ష నేతపై వేధింపులకు పాల్పడుతోందన్నారు. -
‘సీబీఐ కేసులకు భయపడుతున్న కేసీఆర్’
హైదరాబాద్: సీబీఐ కేసులకు భయపడే సీఎం కేసీఆర్ మోడీ తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సహారా ప్రావిడెంట్ ఫండ్ మినహాయింపు కేసులు సీఎం కేసీఆర్ పై ఉన్నాయి. ఈ కుంభకోణం యూపీఏ హయంలోనే జరిగిందని అయితే అది ఇప్పుడు బయటపడిందని అన్నారు. కుంభకోణం జరగలేదని , తనపై కేసులు లేవని కేసీఆర్ ఖండించగలరా అని నిలదీశారు. జీఎస్టీ వల్ల తెలంగాణకు రూ.19 వేల కోట్ల నష్టమని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల చెబుతున్నారు. మరోపైపు మాత్రం జీఎస్టీ ఈవెంట్లో టీఆర్ఎస్ ఎంపీలంతా పాల్గొన్నారని ఆయన అన్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏంటని ప్రశ్నించారు. ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌పై సీబీఐ కేసులు..!
► కేసీఆర్‌ను సీబీఐ అధికారులు నాలుగుసార్లు ప్రశ్నించారు ► మోదీ పేరు వింటే సీఎంకు మోకాళ్లు వణుకుతాయి ► టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెడకు చుట్టుకున్న సీబీఐ కేసుల భయంతోనే ప్రధానమంత్రి మోదీకి మోకరిల్లుతున్నారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు సీఎం అయిన తర్వాత నాలుగుసార్లు కేసీఆర్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నించారని చెప్పారు. కేసుల నుంచి రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద కేసీఆర్ తాకట్టు పెడుతున్నాడని రేవంత్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లేరాష్ట్రంలో నగదుకొరత ఏర్పడిందని, రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణపై జీఎస్టీ వల్ల 20వేల కోట్ల భారం పడుతుందన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఈఎస్ఐ ఆసుపత్రుల కుంభకోణంలోనూ, సహారా ఇండియాకు చెందిన ప్రావిడెంట్‌ఫండ్ కుంభకోణంలోనూ సీబీఐ కేసులను నమోదుచేసిందని వివరించారు. ఈ కేసులే ఇప్పటికీ కేసీఆర్‌పై ఉన్నాయని, మద్రాసు నుంచి 20 మందికి పైగా సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు వచ్చి నాలుగుసార్లు ప్రశ్నించారని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ వార్తలేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. ఈ కేసుల భయంతోనే ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరికంటే ముందుగా కేసీఆర్ మద్ధతును ఇస్తున్నాడని చెప్పారు. ప్రధాని మోదీ పేరు వింటే సీఎం కేసీఆర్‌కు మోకాళ్లు వణుకుతున్నాయని ఎద్దేవాచేశారు. -
సీబీఐ మాజీ చీఫ్‌కు సీబీఐ షాక్
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన వ్యక్తిని సీబీఐ విచారించనుండటం, ఆయనపై కేసు నమోదు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సీబీఐ చీఫ్‌గా పనిచేసినప్పుడు సిన్హా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, బొగ్గు స్కాం నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కోల్గేట్ కేసు వెలుగు చూసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపులు పారదర్శకంగా జరగలేదని, భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణ సమయంలో సీబీఐ డైరెక్టర్‌గా రంజిత్ సిన్హా పనిచేశారు. బొగ్గు కుంభకోణంలో పలువురు నిందితులు.. అప్పట్లో రంజిత్‌ను ఆయన నివాసంలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. కొందరు నిందితులను కాపాడేందుకు రంజిత్ ప్రయత్నించినట్టు అభియోగాలు వచ్చాయి. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు బొగ్గు కుంభకోణం కేసు విచారణలో రంజిత్ సిన్హా పాత్రపై విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సీబీఐ.. రంజిత్‌పై కేసు నమోదు చేసింది. -
తృణమూల్ ఎంపీలు, మంత్రులపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: నారద స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎంపీలు, పశ్చిమ బెంగాల్ మంత్రులతో పాటు ఓ ఐపీఎస్ అధికారిపై సీబీఐ కేసు నమో దు చేసింది. కుట్రపూరిత నేరం, అవినీతి తదితర సెక్షన్ల కింద రాజ్యసభ ఎంపీ ముకుల్ రాయ్, లోక్‌సభ సభ్యులు సుల్తాన్ అహ్మద్, సౌగతా రాయ్, కకోలీ ఘోష్ దస్తీదార్, అపురూప పొద్దర్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. కేంద్రం చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దుయ్యబట్టారు. 2016 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచాక లబ్ధి చేకూరుస్తామన్న తృణమూల్ నేతలు డబ్బులు పుచ్చుకుంటూ స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. -
పోస్టాఫీసుల్లో ‘నోట్ల’ దందా!
కోట్ల రూపాయలు మార్పిడి చేసిన తపాలా అధికారులు - మూడు నెలల్లో పది కేసులు నమోదు చేసిన సీబీఐ - ఎస్‌ఎస్‌పీవో నుంచి అటెండర్ల వరకు అందరూ ఒకే గ్యాంగ్ - తాజాగా ఖైరతాబాద్ పోస్టాఫీస్‌పై సీబీఐ కేసు నమోదు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత సాధారణ ప్రజలకు నోట్ల మార్పిడి చేయాల్సిన తపాలా సిబ్బంది కమీషన్ల కోసం చేసిన ఘన కార్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతేడాది నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగిన నోట్ల మార్పిడి వ్యవహా రాల్లో పోస్టల్ విభాగంపైనే సీబీఐ 10 కేసులు నమోదు చేసింది. హిమాయత్‌నగర్ డివిజన్ పోస్టాఫీస్ నుంచి ఖైరతాబాద్ హెడ్‌పోస్టాఫీస్ కేసు వరకు కోట్ల రూపాయలను అధికారులు, సిబ్బంది పక్కదారి పట్టించినట్టు సీబీఐ ఆధారాలతో బయటపెట్టింది. మిగతా కేసుల్లో... జనవరి 30న వరంగల్ హెడ్‌పోస్టాఫీస్‌లో రూ.11.01 లక్షల నోట్లను కమీషన్ పద్ధతిన నలుగురు అధికారులు మార్చినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. పెద్దపల్లి జిల్లాలోని పో స్టాఫీస్‌లో పనిచేస్తున్న ట్రెజరర్, ఆ పరిధిలోకి వచ్చే మేడారం సబ్ పోస్టుమాస్టర్ ఇద్దరూ కలసి రూ.50 లక్షల కొత్తనోట్లను కమీషన్ పద్ధతిలో మార్పిడి చేసినట్టు గుర్తించి అరెస్ట్ చేసింది. గతేడాది నవంబర్ 25న రాష్ట్ర జీపీవో (జనరల్ పోస్టాఫీస్), హిమాయత్‌నగర్ పో స్టాఫీస్‌లో పనిచేస్తున్న సీనియర్ సూపరింటెం డెంట్‌తో పాటు ముగ్గురు అధికారులు, ముగ్గురు సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టింది. రూ.70 లక్షలకుపైగా కొత్తనోట్లను కమీషన్ కోసం వీరు పక్కదారి పట్టించినట్టు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 2న గోల్కొండ, లంగర్‌హౌస్ పోస్టాఫీసుల్లోనూ స్కాం జరిగిందని సీబీఐ గుర్తించి రూ.22 లక్షలకు పైగా కొత్త నోట్లు మార్పిడి చేసినట్టు బయటపెట్టింది. డిసెంబర్ 6న కార్వాన్ పోస్టాఫీస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. రూ.1.2 కోట్ల కొత్త నోట్లు మార్పిడి చేసినట్టు గుర్తించి ఆరుగురిని అరెస్ట్ చేసింది. డిసెంబర్ 9న బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్ పోస్టా ఫీస్పై దాడి చేసి సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు రూ.80 లక్షల కొత్తనోట్లను మార్పిడి చేసినట్టు సీబీఐ గుర్తించింది. ఇప్పటివరకు జరిగిన కేసుల్లో పోస్టల్ ఉద్యోగు ల నుంచి కొత్త నోట్లు మార్పిడి చేసుకున్న 16 మంది వ్యాపారులు, 22 మంది ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు వ్యాపారు లను సీబీఐ ప్రశ్నించింది. ఖైరతాబాద్‌లో రూ.64.97 లక్షలు ఖైరతాబాద్ డివిజన్ హెడ్ పోస్టాఫీస్‌లో ధ్రువపత్రాలు లేకుండా 8మంది ఉద్యోగు లు రూ.64.97 లక్షల కొత్త నోట్లను కమీషన్ పద్ధతిన మార్పిడి చేసినట్టు సీబీఐకి డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆచారి ఫిర్యాదు చేశారు. మెయిన్ ట్రెజరర్ ఎం.మహేష్ ఆధ్వర్యంలో సేవింగ్ బ్యాంక్ పీఏ ఆర్.జ్యోతి, కౌంటర్ క్లర్క్ సీహెచ్ వేణు, అసిస్టెంట్ ట్రెజరర్ దుర్గాబాయి, ఎక్సే్ఛంజ్ కౌంటర్ పీఏ ఎస్.భాస్కర్, కౌం టర్ క్లర్క్ పి.సంతోషిమాత, కౌంటర్ పీఏ అమ్రైల్ సింగ్, ఎక్సే్ఛంజ్ కౌంటర్ పీఏ టీవీ భాస్కర్ రూ.64.97 లక్షల కొత్త నోట్లను పలువురు వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులకు కమీషన్ పద్ధతిన మార్పిడి చేశారని కేసు నమోదు చేసినట్టు సీబీఐ డీఐజీ చంద్రశేఖర్ తెలిపారు. -
పెద్దపల్లి పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ కేసు
పాత నోట్లకు కొత్తనోట్లు మార్పిడి చేసిన ఇద్దరు ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దును అదునుగా చేసుకొని భారీగా నోట్ల మార్పిడికి పాల్పడ్డ పెద్దపల్లి పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది. పెద్దపల్లి డివిజన్ సూపరింటెండెంట్ జె.పండరి ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ రంగం లోకి దిగి ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. గతేడాది నవంబర్ 9 నుంచి 24 వరకు పెద్దపల్లి డివిజన్ కార్యాలయంలో పనిచేస్తున్న ట్రెజరర్ సురేశ్రావు, మేడారం సబ్ పోస్టుమాస్టర్ సీహెచ్ భగత్‌సింగ్ పోస్టాఫీస్ అకౌంట్ నుంచి కొత్త నోట్లు డ్రాచేసి నకిలీ ధ్రువపత్రాలతో ప్రైవేట్ వ్యక్తులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు పాత నోట్లు మార్పిడి చేశారని పండరి సీబీఐకి ఇచ్చిన ఫిర్యా దులో తెలిపారు. సురేశ్రావు రూ.30.76 లక్షలు, భగత్‌సింగ్ రూ.19.50 లక్షలు మార్పిడి చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొ న్నారు. ప్రాథమిక విచారణ చేసిన సీబీఐ ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు సీబీఐ డీఐజీ వి.చంద్రశేఖర్ ఎఫ్ఐఆర్లో స్పష్టంచేశారు. విచార ణలో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని, డబ్బు మార్పిడి చేసుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తులను కూడా విచారించాల్సి ఉంటుందని సీబీఐ ఉన్నతాధికారులు తెలిపారు. గతంలోనూ హైదరాబాద్ జనరల్ పోస్టాఫీస్, హిమాయత్ నగర్ తదితర బ్రాంచ్ కార్యాలయాల్లోని అధికారులు, సిబ్బందిపై నోట్ల మార్పిడికి సంబంధించి కేసులు నమోదు చేసిన సీబీఐ... ఆరోపణలెదుర్కుంటున్న వారిని కటకటాల్లోకి నెట్టింది. -
ముగ్గురు తపాలా అధికారులపై సీబీఐ కేసు
రూ.36 లక్షలు అక్రమ మార్పిడి జరిగినట్లు గుర్తింపు - నల్లధనాన్ని వైట్ చేసే ప్రయత్నం - సాధారణ ప్రజలు మార్చుకున్నట్లుగా రికార్డులు సృష్టించే యత్నం - గుర్తించాల్సిన వారిలో మరికొందరు ప్రభుత్వోద్యోగులు సాక్షి, హైదరాబాద్: నోట్ల మార్పిడిలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు తపాలా శాఖ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. కమీషన్లకు కక్కుర్తిపడి రూ.36 లక్షల మేర అక్రమంగా మార్పిడి చేసినట్లు గుర్తించింది. పోస్టాఫీసులపై గురువారం దాడులు చేసిన అధికారులు.. ప్రాథమిక విచారణ పూర్తరుున తర్వాత శుక్రవారమే కేసు (ఆర్సీ నం.24 (ఎ)/2016) నమోదు చేసినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందులో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ (ఎస్‌ఎస్‌పీఓఎస్) సుధీర్‌బాబు, హిమాయత్‌నగర్ సబ్ పోస్టుమాస్టర్ జి.రేవతి, ఎస్‌ఎస్‌పీఓఎస్ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.రవితేజ నిందితులుగా ఉన్నారు. వీరిపై కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, ప్రభుత్వ ఉద్యోగి ద్వారా నమ్మక ద్రోహం, ఖాతాలు/పుస్తకాలను తారుమారు చేయడం తదితర ఆరోపణలను నమోదు చేశారు. ఇక ఈ వ్యవహారంలో మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్నామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఎవరికి సంబంధించిన నగదును ఈ రకంగా అక్రమ మార్పిడి చేశారనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నోట్లు ఇచ్చే దగ్గరే.. పాత నోట్ల మార్పిడి ప్రక్రియలో భాగంగా.. హైదరాబాద్‌లో జీపీఓలోని పోస్టల్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ (ఎస్‌ఎస్‌పీఓఎస్)కు రోజూ కొంత మొత్తంలో కొత్త రూ.2 వేల నోట్లను మంజూరు చేసింది. అందులో భాగంగా హిమాయత్‌నగర్ సబ్ పోస్టాఫీస్‌కు ఈ నెల 11న రూ.70 లక్షలు కేటారుుంచింది. ఆ మరుసటి రోజు ఎస్ఎస్పీఓఎస్లో పనిచేస్తున్న రవితేజకు 11 సబ్ పోస్టాఫీసులకు బట్వాడా చేయడానికి మొత్తం రూ.1.59 కోట్లు (హిమాయత్‌నగర్ పోస్టాఫీసుకు కేటారుుంచిన రూ.70 లక్షలు సహా) కొత్త రూ.2 వేల నోట్లు అందించారు. అరుుతే ఎస్‌ఎస్‌పీఓఎస్‌గా పనిచేస్తున్న సుధీర్‌బాబు రూ.36 లక్షల విలువైన పాత రూ.1,000, రూ.500 నోట్లను రవితేజకు ఇచ్చి, వాటిని హిమాయత్‌నగర్ సబ్ పోస్ట్‌మాస్టర్‌కు ఇవ్వాలని సూచించారు. ఈ రూ.36 లక్షల విలువకు సరిపడా కొత్త రూ.2 వేల నోట్లను రవితేజ నుంచి తీసుకున్నారు. అదేరోజు హిమాయత్‌నగర్ సబ్ పోస్టాఫీసుకు వెళ్లిన రవితేజ... రూ.36 లక్షల పాతనోట్లు, రూ.34 లక్షల విలువైన కొత్త నోట్లను సబ్ పోస్ట్‌మాస్టర్ రేవతికి అందించారు. అప్పటికే సుధీర్‌బాబు ఫోన్ ద్వారా రేవతితో మాట్లాడడంతో.. ఆమె ఆ పాత, కొత్త నగదును తీసుకున్నారు. ఈ సందర్భంలో క్యాష్ ట్రెజరీ పుస్తకంలో సంతకం చేసిన రేవతి ‘ఫోన్ ద్వారా ఎస్‌ఎస్‌పీఓఎస్ ఇచ్చిన ఆదేశాల మేరకు నగదు తీసుకుంటున్నాను’అని రాశారు. రికార్డులు సృష్టించే యత్నం.. సుధీర్‌బాబు ద్వారా వచ్చిన పాత నోట్లను సాధారణ ప్రజల నుంచే తీసుకున్నట్లుగా రికార్డులు రూపొందించడానికి పోస్టల్ అధికారులు సిద్ధమయ్యారు. 12వ తేదీ నాటికి ‘మార్పిడి’కోసం వచ్చిన మొత్తం రూ.74,73,500 సొమ్ముకుగాను.. కేవలం రూ.36,28,000 మార్చినట్లుగా 987 రసీదులు మాత్రమే సిద్ధమయ్యారుు. మిగతా రూ.38,45,500 మార్పిడికి సంబంధించి ఎలాంటి రసీదులు లేవు. ఈ వ్యవహారంపై సీబీఐకి సమాచారం అందడంతో... గురువారం పోస్టల్ విజిలెన్స అధికారులతో కలసి ఆకస్మిక దాడులు చేశారు. కమీషన్లు తీసుకుని కొందరు పెద్దలకు చెందిన నల్లధనాన్ని పోస్టల్ అధికారులు తెల్లధనంగా మార్చినట్లు గుర్తించారు. దీంతో సుధీర్‌బాబు, రేవతి, రవితేజలపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(2) రెడ్‌విత్ 13(1)(డీ), ఐపీసీలోని 120బీ, 406, 409, 420, 477ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. సుధీర్‌బాబు మార్చిన రూ.36 లక్షలు ఎవరివనే అంశంపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దీని మూలాలు తేలిన తర్వాత సంబంధిత వ్యక్తుల్నీ ఈ కేసులో నిందితులుగా చేర్చనున్నారు. చాలా పోస్టాఫీసుల్లో గోల్మాల్! రాష్ట్రంలోని చాలా పోస్టాఫీసుల్లో కరెన్సీ మార్పిడి అవకతవకలు జరిగినట్లు బహిర్గతమవుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు అధికారులు, సిబ్బంది కమీషన్లకు కక్కుర్తి పడి నల్ల ధనికులకు సహకారం అందించినట్లు వెల్లడవుతోంది. ఈ అక్రమాలకు సంబంధించి హైదరాబాద్‌లో ముగ్గురు తపాలా అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్ ఉప తపాలా కార్యాలయాల్లోనూ అవకతవకలు జరిగి నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇక హైదరాబాద్ సిటీ రీజియన్ పరిధిలోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ సోదాలు కొనసాగుతూనే ఉన్నారుు. వరంగల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని మరిన్ని పోస్టాఫీసుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నారుు. గ్రామీణ ప్రాంతాల్లోనూ తపాలా సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. -
నా కుమారుడు నిర్దోషి...
* ఆధారాలతో రుజువు చేస్తాం: సీబీఐ మాజీ డెరైక్టర్ విజయరామారావు * శ్రీనివాస్ కల్యాణ్ నా కొడుకు కాకపోతే ఇంత ప్రచారం ఉండేదా? * సీబీఐ కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టడం లేదు * ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే దోషి కాదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ‘‘నా కుమారుడు శ్రీనివాస్ కల్యాణ్ డాషింగ్ యంగ్మన్. తప్పుడు పనులు చేసేవాడు కాదు. మంచి ఆలోచనలు ఉన్నవాడు. నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు. వాస్తవాలేమిటో ఆధారాలతో సహా ఏ కోర్టులోనైనా నిరూపించుకునేందుకు మేం సిద్ధం. కొన్ని వాస్తవాలు నాకు తెలిసినా... ఇప్పుడు బహిర్గతం చేయలేను. బ్యాంకు రుణం విషయంలో సీబీఐ నా కుమారుడి మీద కేసు నమోదు చేసిన మాట వాస్తవం. ఇంట్లో సోదాలు కూడా చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే దోషి కాదు’ అని సీబీఐ మాజీ డెరైక్టర్, మాజీ మంత్రి కె. విజయరామారావు పేర్కొన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు శ్రీనివాస్ కల్యాణ్రావుపై బ్యాంకు రుణం ఎగవేత కేసుకు సంబంధించి వివరణ ఇచ్చారు. సీబీఐ కేసు వివరాలు వెల్లడించకుండా, సీబీఐని తప్పుపట్టకుండా, కేంద్ర మంత్రి సుజనా చౌదరిపైగానీ, టీడీపీ నేతలపైగానీ ఆరోపణలు చేయకుండా... మీడియా అడిగిన ప్రశ్నలకు ఆచితూచి సమాధానాలిచ్చారు. ఆవేదనతో కూడిన స్వరంతో తన కుమారుడు నిజాయితీపరుడు, నిర్దోషని చెప్పేందుకు విజయరామారావు ప్రయత్నించారు. శ్రీనివాస్ కల్యాణ్ తన కుమారుడు కావడం వల్లే ఇంత ప్రచారం జరిగిందన్నారు. బ్యాంకును మోసం చేసి రూ.304 కోట్లు ఎగ్గొట్టారనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించారని, అందుకే తాను వివరణ ఇస్తున్నానని చెప్పారు. ‘మీరు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరినందుకు కుట్రలో భాగంగానే శ్రీనివాస్ కల్యాణ్‌ను సీబీఐ కేసులో ఇరికించారా?..’ అన్న ప్రశ్నకు ‘ఏదీ కాదనలేను.. ఏదీ ఔననలేను..’ అని సమాధానమిచ్చారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఈ కేసులో ఇరికించారా? అని ప్రశ్నించగా... ‘నేనెవరి పేరు చెప్పలేను’ అన్నారు. సుజనా చౌదరి నుంచి మీకు బెదిరింపులు వచ్చాయా అని అడిగితే... ‘అంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా?’ అని ఎదురు ప్రశ్నించారు. సీబీఐ తప్పుడు కేసు నమోదు చేసిందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా... ‘‘సీబీఐకి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసింది. తప్పుడు కేసు నమోదు చేసిందని అనను. అయితే నమోదు చేసిన కేసు ఎంత వరకు నిజమనే విషయం దర్యాప్తులో తేలుతుంది. నేను సీబీఐ డెరైక్టర్‌గా పనిచేశాను కాబట్టే ఈ కేసుకు ఇంత ప్రచారం వచ్చింది. నా కుమారుడు కావడమే శ్రీనివాస్ కల్యాణ్ తప్పయింది..’’ అని విజయరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు గురించి మాజీ డెరైక్టర్‌గా మీకు తెలిసిందేమిటని అడగగా... తనకేమీ తెలియదని, ఒక తండ్రిగా తాను మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. తాను సీబీఐతో ఏమీ మాట్లాడలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. తన కుమారుడు ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నాడని తెలిపారు. తనకు ఆస్తులేవీ లేవని, హైదరాబాద్‌లోని ఇల్లు, సొంత ఊళ్లో వ్యవసాయ భూములు తప్ప ఏమీ లేవని... వాటిని తన ఖా పెట్టినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. తన కుమారుడికి పంట రుణాలు తప్ప ఏ బ్యాంకులోనూ ఇతర రుణాలేవీ లేవని వివరించారు. -
సీబీఐ మాజీ చీఫ్ కేవీఆర్ కుమారుడిపై సీబీఐ కేసు
తప్పుడు పత్రాలతో రుణం సీబీఐకి బ్యాంకు అధికారుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ డెరైక్టర్ కె.విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కళ్యాణ్‌రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో బ్యాంకు ను మోసం చేసి రూ.304 కోట్ల రుణం పొందారన్న ఆరోపణలపై బెంగళూరులోని సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈ కేసు నమోదు చేసి శ్రీనివాస్ కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్‌లోని ఆయన నివాసాలపై దాడులు నిర్వహించింది. శనివా రం రాత్రి జరిపిన ఈ సోదాల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై కేంద్రంగా శ్రీనివాస్ తమిళనాడు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు ఎండీగా ఉన్నారు. సంస్థ పేరుతో కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.124 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.60 కోట్లు రుణం తీసుకున్నారు. యంత్రాలతోపాటు వివిధ పరికరాలు కొనుగోలు కోసం ఈ రుణం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తప్పుడు బిల్లులు సమర్పించారని, ఈ విషయం అంతర్గత ఆడిటింగ్‌లో తేలిందని బ్యాంకు అధికారులకు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో రం గంలోకి దిగిన సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం అధికారులు ఐపీసీలోని 120(బీ) నేర పూరిత కుట్ర, 420 (మోసం), 471 (మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించడం), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన విజయరామారావు 1993 నుంచి 1996 వరకు సీబీఐ డెరైక్టర్‌గా విధులు నిర్వహిం చారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, దర్యా ప్తు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. -
లియోనియా రిసార్ట్స్‌పై సీబీఐ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయల రుణాలు పొంది బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన లియోనియా రిసార్ట్స్ యాజమాన్యంపై సీబీఐ కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాసిపేటలో అత్యాధునిక రిసార్టు నిర్మిం చేందుకు ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ నుంచి రూ.120 కోట్ల రుణాన్ని పొంది ఎగనామం పెట్టారనే ఆరోపణలపై రిసార్టు మేనేజింగ్ డెరైక్టర్ జీఎస్ చక్రవర్తుల రాజుపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. బెంగళూరులోని సీబీఐ బ్యాంకింగ్ మోసాల నిరోధక విభాగం ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ సాగుతోంది. కాగా, లియోనియా రిసార్ట్స్‌పై సీబీఐ కేసు నమోదు చేసిన వార్త సోమవారం రాత్రి రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలో కలకలం రేపింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రాజు.. బొమ్మరాసిపేట గ్రామంలో 2001లో మొదట 12 ఎకరాల విస్తీర్ణంలో లియోనియా రిసార్ట్స్‌ను ప్రారంభించారు. ఏటా విస్తీర్ణాన్ని పెంచుకుంటూ పోతుండడంతో ఇప్పుడది 140 ఎకరాలకు చేరింది. ఈ 140 ఎకరాల్లో ఎక్కువ శాతం పేదలకు చెందిన అసైన్ట్ భూములున్నాయని, తమనుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని పలువురు గతంలో లియోనియా వద్ద ఆందోళన చేశారు. తాజాగా 11 బ్యాంకుల్లో సుమారు రూ. 630కోట్లు అప్పు చేసి మోసం చేశారని వస్తున్న వదంతులు స్థానికంగా కలకలం రేపాయి. లియోనియాలో వందల సంఖ్యలో స్థానికులు పనిచేస్తున్నారు. -
లియోనియా రిసార్ట్స్‌పై సీబిఐ కేసు
హైదరాబాద్: నగర శివార్లలో శామీర్‌పేట మండలం బొమ్మరాస్పేట వద్ద ఉన్న లియోనియా (లియో మెరిడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ లిమిటెడ్) రిసార్ట్ప్పై బెంగళూరు సీబిఐ కేసు నమోదు చేసింది. ఈ సంస్థ 11 బ్యాంకులలో అక్రమంగా 650 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు భూమి పత్రాలతో ఈ సంస్థ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు ఆరోపణల నేపధ్యంలో సీబిఐ కేసు నమోదు చేసింది. శామీర్‌పేటలోని 116 ఎకరాల్లో లియోనియా రిసార్ట్స్‌ను నిర్వహిస్తున్న ఈ సంస్థ అక్రమంగా రుణాలు పొందడమే కాకుండా, భూములు కూడా ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. -
నాపై సీబీఐ కేసును కొట్టివేయండి: శ్రీలక్ష్మి
హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) కేసులో సీబీఐ అధికారులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తును అన్యాయం, ఏకపక్షం, అక్రమంగా ప్రకటించాలని, ఇదే సమయంలో తన జీవితాన్ని, స్వేచ్ఛను కోల్పోయినందుకు తగిన పరిహారం అందచేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఆమె గురువారం పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసుతో సంబంధం లేకుండా తనకు రావాల్సిన అన్ని సర్వీసు ప్రయోజనాలను ఇచ్చేలా కూడా ఆదేశాలివ్వాలని విన్నవించారు. సీబీఐ కోర్టులో జరుగుతున్న కేసులో తన అరెస్ట్, హాజరుతోసహా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేయాలని హైకోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, గనులశాఖ కార్యదర్శి, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సీబీఐ ఎస్పీ, ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ప్రతివాదులుగా ఆమె పేర్కొన్నారు. -
నళిని పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ హత్య కేసులో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితురాలు నళిని శ్రీహరన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సీబీఐ కేసుల్లో విధించిన శిక్షను రద్దు చేసే అధికారం ఒక్క కేంద్ర ప్రభుత్వానికే కట్టబెట్టే చట్టాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న నళిని ప్రస్తుతం తమిళనాడులోని వెళ్లూరు జైలులో ఉంది. -
బిర్లాకు బొగ్గు మసి !
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూపు అధినేత కుమారమంగళం బిర్లా(46)పై సీబీఐ కేసు నమోదు చేసింది. గనుల కేటాయింపులో ఆయనతోపాటు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్, కొంతమంది అధికారులు అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అవినీతి నిరోధక చట్టం కింద మంగళవారమిక్కడి సీబీఐ కోర్టులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. తర్వాత వెంటనే ఢిల్లీ, హైదరాబాద్, భువనేశ్వర్, ముంబైలలో ఆరుచోట్ల సోదాలు నిర్వహించింది. సోదాలు జరిగిన వాటిలో ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన హిండాల్కో కార్యాలయాలు, సికింద్రాబాద్‌లోని పరేఖ్ నివాసం ఉన్నాయి. ఒడిశాలోని తలబిరాలో ఉన్న రెండో, మూడో నంబరు గనుల కేటాయింపులో అవినీతి, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆదిత్య బిర్లా ప్రతినిధిగా కుమారమంగళం బిర్లా, పరేఖ్లతోపాటు హిండాల్కో, బొగ్గు శాఖకు చెందిన కొంతమంది అధికారులు, గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని సీబీఐ ప్రతినిధి కంచన్ ప్రసాద్ చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలకు ఉద్దేశించిన తలబిరా గనులను ఓ ప్రభుత్వ సంస్థతోపాటు హిండాల్కోకు కూడా కేటాయించారని, 2005లో బిర్లా, పరేఖ్‌ల మధ్య భేటీ తర్వాత స్క్రీనింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందని, అందుకే ఎఫ్ఐఆర్లో బిర్లా పేరు చేర్చామని సీబీఐ వర్గాలు చెప్పాయి. తలబిరా గనులను తమిళనాడు ప్రభుత్వ సంస్థ నైవేలీ లిగ్నైట్ లిమిటెడ్‌కు కేటాయించాల్సి ఉండగా, పరేఖ్ వాటిని విద్యుదుత్పత్తి కోసం నైవేలీ లిగ్నైట్, హిండాల్కోలు కలిసి పంచుకోవడానికి అనుమతించారని పేర్కొంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేందుకు కారణమయ్యారని తెలిపింది. అయితే గనుల్లో పని ప్రారంభించకపోవడంతో ఎంత నష్టం వచ్చిందో చెప్పలేమని, ప్రస్తుతం అంచనా వేస్తున్నామని సీబీఐ వర్గాలు తెలిపాయి. బిర్లా, పరేఖ్లను విచారణకు పిలిపిస్తామన్నాయి. తాజా కేసుతో ఈ స్కాంలో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ల సంఖ్య 14కు చేరింది. కాగా, తమకు ఎఫ్ఐఆర్ ప్రతి అందలేదని, తాము ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదని ఆదిత్య బిర్లా గ్రూపు తెలిపింది. సీబీఐ కేసు నేపథ్యంలో హిండాల్కో, ఏబీ నువో కంపెనీల షేర్ల విలువ మంగళవారం కాస్త ఒడిదుడుకులకు లోనైంది. బొగ్గు కుంభకోణంలో మందకొడి దర్యాప్తు, గనుల కేటాయింపుల ఫైళ్ల గల్లంతుపై సుప్రీం కోర్టు సీబీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టడం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించిన అన్ని కేసులపై ఈ ఏడాది డిసెంబర్ నాటికి దర్యాప్తు పూర్తి చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ స్కాంలో సీబీఐ కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్, బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావులపైనా కేసు పెట్టడం విదితమే. -
నియంతలు మట్టి పాలయ్యారు
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ :సోనియాగాంధీ ఓ నియంతలాగా తెలుగు ప్రజలను చీల్చడానికి ప్రయత్నిస్తున్నారని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. కలెక్టరేట్ ఎదుట మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, హఫీజుల్లా కాల్టెక్స్, అల్లాడు పాండురంగారెడ్డి, సంపత్‌కుమార్‌లతో కలిసి ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష బుధవారానికి మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంతోమంది నియంతలు రాజ్యాలు పోగొట్టుకుని మట్టి పాలయ్యారనే విషయం సోనియాగాంధీ గుర్తించాలన్నారు. ఎన్జీఓల సమ్మెను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని, వారికి వైఎస్సార్ సీపీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ బెదిరింపులకు ఉద్యోగులు భయపడవద్దని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఈ దుస్థితి తలెత్తడానికి ప్రధాన కారణం సోనియాగాంధీ, చిరంజీవి, చంద్రబాబులేనని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొడితే నిలబెడతానంటూ చిరంజీవి ఒకసారి రక్షించాడని, అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు దానికి మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు మరోసారి రక్షించారన్నారు. సీబీఐ కేసులకు భయపడి చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారన్నారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లు పాస్ కావడానికి కూడా టీడీపీ ఎంపీలు సహకరించారన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్లమెంటులో విప్ ధిక్కరించి ఆహార భద్రతా బిల్లును బహిష్కరించాలన్నారు. అలాగైతైనే సీమాంధ్ర ప్రాంతంలో అడుగు పెట్టాలని తేల్చి చెప్పారు. పదవుల కోసం ఆరు కోట్ల మంది సీమాంధ్రుల పొట్టకొడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రక్షణశాఖ కొనుగోళ్లలో జరిగిన స్కాంపై ఆంటోని కమిటీ చేసిందేమి లేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజనపై కూడా ఆ కమిటీ పెద్దగా చేసేదేమి ఉండదని చెప్పారు. ఆ కమిటీలోని వారికి రాష్ట్రంలోని ప్రజల జీవనశైలి, ఇక్కడున్న నదీ జలాల వివాదాలు తెలుసా? అని ప్రశ్నించారు. ఆ కమిటీ ఇక్కడికి రాదట! మనమే ఢిల్లీకి వెళ్లి బొత్స సత్యనారాయణ ఎవరు చెబితే వారు వెళ్లి కమిటీని కలవాలంట! ఇదేం ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు సిగ్గుపడాలన్నారు. సోనియాగాంధీ, సీఎం కిరణ్, చంద్రబాబు వీరిలో ఎవరైనా పేద ప్రజల కోసం ఒక్కరోజు కడుపు మాడ్చుకున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు నీతి, నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో చరిత్ర హీనుడిగా మిగిలిపోక తప్పదని హెచ్చరించారు. ఎన్టీఆర్ బ్రతికివుంటే ఆత్మహత్య చేసుకునేవారు -మాజీ మేయర్ : తెలుగుదేశం పార్టీకి పట్టిన గతి చూసి దివంగత ఎన్టీఆర్ బ్రతికివుంటే ఆత్మహత్య చేసుకునేవారని మాజీ మేయర్ పి.రవీంద్రనాధరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్థాపించిన టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్‌కు అమ్మేశారని ఆరోపించారు. కమీషన్ల కోసం సీబీఐ కేసులకు భయపడి పార్టీని గంగపాలు చేశారన్నారు. ఫలితంగా ఆ పార్టీ ఉనికిని కోల్పోయిందన్నారు. టీడీపీ ఊసరవెల్లి రాజకీయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు. తమ జీవితాలు ఆరిపోయినా సమైక్యాంధ్రను కాపాడుకుంటామన్నారు. విభజన వల్ల రాష్ట్రవ్యాప్తంగా 340 మంది ఆత్మహత్య చేసుకుని గుండె పగిలి చనిపోయారన్నారు. వారందరికీ ఉద్యమాభివందనాలు తెలిపారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, బ్రతికి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు, కడప నగర సమన్వయకర్త ఎస్బి అంజద్‌బాషా పాల్గొన్నారు.