సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రోజుకో స్కాం వెలుగు చూస్తోంది. ఇటీవలే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విక్రమ్ కొఠారీల కుంభకోణాలు మరవక ముందే తాజాగా కెనరా బ్యాంక్‌ను భారీగా టోకరా ఇచ్చిన వైనం వార్తల్లోనిలిచింది. రూ.515 కోట్ల స్కాం ఆరోపణలతో సీబీఐ కేసులు నమోదు చేసింది. కోలకత్తాకు చెందిన ఆర్ పి ఇన్ఫోసిస్టం కంపెనీ,దాని డైరెక్టర్లపై రూ.515.15 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీల ఫిర్యాదుతో సీబీఐ ఈ చర్యకు పూనుకుంది. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. సంస్థ కార్యాలయం సహా ఆరుచోట్ల బుధవారం సోదాలు నిర్వహించింది.
ఫిబ్రవరి 26న కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్ డివి ప్రసాద్ రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో శివాజీ పాంజా, కస్తూవ్ కౌస్తువ్ రే, వినయ్ బాఫ్నా, దేవ్‌నాత్ పాల్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) కెనరా బ్యాంక్‌ను, బ్యాంక్ ఆఫ్ కన్సార్టియంను రూ .515.15 కోట్ల మోసి చేసినట్టు పేర్కొన్నారు. కోల్‌కతా కేంద్రంగా ఆర్‌పీ ఇన్ఫోసిస్టమ్స్‌ను ఏర్పాటు చేసిన శిబాజీ పంజా (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు) నకిలీ పత్రాలతో వందల కోట్ల రూపాయల రుణాన్ని పొందాడు. లేని నిల్వలు ఉన్నట్టు హామీగా చూపడం, డాక్యుమెంట్ల ఫోర్జరీ, ఇతర కంపెనీల నుంచి పైసా కూడా బకాయిలు అందాల్సి లేకపోయినా, డాక్యుమెంట్ల ఫోర్జరీ ద్వారా బకాయిలు రావలసి ఉందని చూపించడం, నిజంగానే కొద్ది మొత్తం రావలసి ఉన్నా ఫోర్జరీ ద్వారా దాన్ని అధికంగా చూపించడం ద్వారా పంజా, అతడి సహచరులు కెనరా బ్యాంక్ నాయకత్వంలోని 9 బ్యాంకులను రూ.515కోట్లు ముంచినట్టు సీబీఐ కేస్ నమోదు చేసింది. శిబాజీ పంజాకు కొంతమంది కెనరా బ్యాంక్ అధికారులు కూడా సహకరించినట్టు, వారిపై కూడా కేసులు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment