Canara Bank
-
వడ్డీ రేట్లను పెంచిన ప్రభుత్వ బ్యాంకులు ఇవే..
భారతదేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. మార్జినల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బెంచ్ మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించిన తర్వాత ఇది జరిగింది.వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూసీఓ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా & కెనరా బ్యాంక్‌లకు సవరించిన రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి వస్తాయి. కాగా యూసీఓ బ్యాంక్ వడ్డీ రేట్లు ఆగష్టు 10 నుంచి అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది.ఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
జీవిత బీమా ఐపీవోపై కన్ను
న్యూఢిల్లీ: జీవిత బీమా భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 14.5 శాతం వాటా విక్రయానికి పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. వాటా విక్రయం ద్వారా కెనరా హెచ్ఎస్బీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ(జేవీ) పబ్లిక్ ఇష్యూ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలియజేసింది. వెరసి జేవీని స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆర్బీఐ, ఆర్థిక సేవల శాఖ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు లభించవలసి ఉన్నట్లు తెలియజేసింది. తగిన సమయంలో ఇష్యూ పరిమాణం తదితర అంశాలను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. జేవీలో కెనరా బ్యాంక్‌కు 51 శాతం వాటా ఉంది. విదేశీ భాగస్వామిగా హెచ్ఎస్బీసీ ఇన్సూరెన్స్(ఆసియా పసిఫిక్) హోల్డింగ్స్ 26 శాతం, మరో ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ 23 శాతం చొప్పున వాటాలను కలిగి ఉన్నాయి. సీఆర్ఏఎంసీలోనూ...మ్యూచువల్ ఫండ్ అనుబంధ సంస్థ కెనరా రొబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(సీఆర్ఏఎంసీ)లోనూ 13 శాతం వాటాను కెనరా బ్యాంక్ విక్రయించాలని చూస్తోంది. తద్వారా ఎంఎఫ్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే ప్రణాళికలున్నట్లు పేర్కొంది. ఈ బాటలో గత డిసెంబర్లోనే లిస్టింగ్‌కు వీలుగా సూత్రప్రాయ అనుమతిని మంజూరు చేసింది. నిధుల సమీకరణబాండ్ల జారీ ద్వారా రూ. 8,500 కోట్ల సమీకరణకు కెనరా బ్యాంక్ బోర్డు తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో వ్యాపార వృద్ధిని సాధించేందుకు నిధులను వెచి్చంచనుంది. శుక్రవారం(31న) నిర్వహించిన సమావేశంలో బ్యాంక్ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిలో భాగంగా బాసెల్–3 నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్–1 బాండ్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమీకరించనుంది. అంతేకాకుండా మరో రూ. 4,500 కోట్లను బాసెల్–3 నిబంధనల టైర్–2 బాండ్ల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 3 శాతం జంప్‌చేసి రూ. 118 వద్ద ముగిసింది. -
కెనరా బ్యాంక్ నుంచి సరికొత్త సేవలు
హైదరాబాద్: కెనరా బ్యాంక్ పలు కొత్త ఉత్పత్తులు, సరీ్వసులు ప్రారంభించింది. ‘కెనరా హీల్’ పేరుతో వినూత్న హెల్త్ ప్రొడక్ట్ ప్రవేశపెట్టింది. ఆసుపత్రుల్లో చికిత్సలకు బీమా క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లో ‘కెనరా హీల్’ ద్వారా రుణ సహాయం అందించనుంది. మహిళల కోసం ‘కెనరా ఏంజెల్’ అనే పేరుతో కస్టమైజ్డ్ సేవింగ్స్ ఖాతాను ప్రవేశపెట్టింది. ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులకు ఆన్లైన్ ద్వారా తక్షణ రుణ సదుపాయానికి ‘కెనరా ఎస్‌హెచ్‌జీ ఈ–మనీ’ తీసుకొచి్చంది. అలాగే ప్రీ–అప్రూడ్ వ్యక్తిగత రుణాలకు ‘కెనరా రెడీక్యా‹Ù’; ఆన్లైన్ టర్మ్ డిపాజిట్ రుణాలకు ‘కెనరా మైమనీ’; అవాంతరాలు లేని చెల్లింపులకు ‘కెనరా యూపీఐ 123పే ఏఎస్ఐ’ సేవలు ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ సీఈఓ రాజేష్ బన్సాల్, కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా!
మూడు ప్రముఖ బ్యాంకులపై ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్‌లపై దాదాపు రూ. 3 కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) తెలిపింది. డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్, 2014కి సంబంధించిన కొన్ని నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( SBI ) పై రూ. 2 కోట్ల పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. 'ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, అడ్వాన్స్‌లకు సంబంధించిన ప్రొవిజనింగ్‌పై ప్రుడెన్షియల్ నిబంధనలు - ఎన్పీఏ ఖాతాలలో విభేదాలు' అలాగే కేవైసీకి సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 66 లక్షల జరిమానా విధించినట్లు మరో ప్రకటనలో తెలిపింది. కొన్ని నిర్దిష్టమైన ఆదేశాలను పాటించనందుకు కెనరా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.32.30 లక్షల జరిమానా విధించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఒడిశాలోని రూర్కెలాలోని ఓషన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌పై రూ.16 లక్షల జరిమానా విధించింది. -
గుర్తుపట్టారా? ఒకప్పుడు ‘బాగా రిచ్’.. ఇప్పుడు షార్ప్‌షూటర్లు మధ్య జైలు జీవితం!
ఓ వ్యక్తి ఫోటో ప్రస్తుతం అటు వ్యాపార ప్రపంచంలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెల్లని గడ్డం.. సాదాసీదా బట్టలు. కళ్లల్లో అన్నీ కోల్పోయామనే బాధ, ఆ చూపులో తప్పు చేశాననే పశ్చాత్తాపం స్పష్టంగా కనపడుతుంది. ఒకప్పుడు విమానయాన రంగంలో రారాజులా వెలిగిన ఓ బడా వ్యాపారవేత్త. వందల్లో విమానాలు, వేల కోట్లల్లో ఆస్తులు. పిలిస్తే పలికే మంది మార్బలం. ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు. ఒక్క చిటికేస్తే ఆయన ఏం కోరుకున్నా క్షణాల్లో జరిగే పవర్స్. కానీ కాలం కలిసి రాకపోతే అది కొట్టే దెబ్బలకు ఎవరూ అతీతులు కారు. అలా కాలం ఈడ్చి కొట్టిన దెబ్బకి ఇప్పడు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రూ.538.62 కోట్ల రుణాల ఎగవేతకు పాల్పడి కరడు గట్టిన నేరస్థులు, షార్ప్‌షూటర్లు, గూండాలతో కలిసి జైలు జీవితం అనుభవిస్తున్నారు. కడవరకు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తనకే తెలియని దిక్కుతోచని స్థితిలో కోర్టును చావును ప్రసాదించమని కోరారు. సమాజంలో బతకలేక.. జైలులో చనిపోయేందుకు అనుమతి అడిగారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎంతటి శత్రువుకైనా తలెత్తకూడదని కోరుకుంటూ నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆయనను గుర్తు పట్టారా? ఇంతకీ ఆఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? బ్యాంకు రుణాల ఎగవేత కేసులో జైలు పాలైన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ది. నాలుగు నెలలుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈయన ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో జాతీయ మీడియా ఆయనను ఫోటోలు తీసింది. ఇక జనవరి 26న ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచనల మేరకు తనని ప్రైవేట్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అమనుమతి కావాలని పిటిషన్లో కోరారు. ఎస్కార్ట్‌తో ప్రైవేట్ ఆస్పత్రికి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎంజే దేశ్‌పాండే..‘నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని ఇప్పటికే (చివరి విచారణలో) గుర్తించాము. ఎవరి సహాయం లేకుండా తనంతట తానుగా నిలబడలేకపోతున్నారు. కాబట్టి అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎస్కార్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారను కాబట్టి ఎస్కార్ట్ కోసం అయ్యే ఖర్చును గోయల్ చెల్లిస్తారని తెలిపారు. -
ఒకప్పుడు కింగ్ మేకర్..ఇప్పుడు బతుకు భారమై..జైల్లో జెట్ ఎయిర్వేస్ అధినేత!
‘‘జీవితంపై నేను పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. కలలు కరిగి పోయాయి. భవిష్యత్తు నాశనం అయ్యింది. బయట జీవించడం కంటే నేను జైల్లో చనిపోతేనే బాగుంటుంది.’’ ఇంతకీ ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ఒప్పుడు విమానయాన రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగి పాతాళంలోకి కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేష్ గోయల్ జెట్ ఎయిర్వేస్.. ప్రైవేట్ విమానయాన రంగంలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన సంస్థ. ఇండియాలోనే టాప్ ఎయిర్‌లైన్స్‌లో ఇది ఒకటి. కానీ అదంతా గతం.. ఇప్పుడు పెరిగిన అప్పులతో కుప్పకూలిపోయింది. 200కిపైగా విమానాలతో నడిచే ఈ సంస్థ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా, 1990ల నుంచి 2000ల వరకూ భారతదేశ విమానయాన రంగానికి ముఖచిత్రంగా మెరిసిపోయిన కంపెనీ అదాళ పాతంలోకి కూరుకుపోయింది. పిలిస్తే పలికే నాధుడు లేక ఫలితంగా నిన్నమొన్నటి వరకు ఏవియేషన్ రంగాన్ని శాసించి .. సంస్థను వరుస లాభాలతో పరుగులు పెట్టించిన జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేష్ గోయల్ దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. జీవిత చరమాంకంలో పెరిగిన అప్పులు, వెంటాడుతున్న కేసులు, చుట్టు ముట్టిన అనారోగ్య సమస్యలు. వెరసి శరీరం సహరించిక.. పిలిస్తే పలికే నాధుడు లేక. ఆ బాధనుంచి బయట పడడానికి న్యాయమూర్తిని చావు శరణు కోరారు. మనీలాండరింగ్ కేసులో కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీ కింద ఆర్ధర్ రోడ్ జైలులో ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై ఉన్న ఆయన ఇప్పటికే పలు మార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. కోర్టులో చేతులు జోడించి.. జైల్లో నరకయాతన రోజులన్నీ ఒకేలా ఉండవు. ఒకప్పుడు భార్య, కుమార్తె.. వేలల్లో ఉద్యోగులు.. వందల్లో విమానాలు.. కోట్లలో లావాదేవీలు చేసిన నరేష్ గోయల్ పరిస్థితి తలకిందులైంది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగే ముందే కొన్ని నిమిషాల పాటు తనని వ్యక్తిగతంగా విచారణ చేయాలని గోయల్ ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి ఎంజే దేష్ పాండేను కోరారు. అందుకు న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో.. జెయిట్ ఎయిర్వేస్ అధినేత ఎదుట చేతులు జోడించి ‘‘ వయస్సు రిత్యా తన రోజువారి ఆటకం ఏర్పడుతుంది. జైలు సిబ్బంది అందుకు సహకరించినా అవి సరిపోవడం లేదని, తాను పడుతున్న బాధ పగవాడికి కూడ రావొద్దని.. జైల్లో నరకయాతన పడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇకపై నేను ఇలాంటివి భరించలేను తాను బలహీనంగా ఉన్నానని, చికిత్స నిమిత్తం జేజే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేదని గోయల్ న్యాయమూర్తికి తెలిపారు. ఆర్థర్ రోడ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో జైలు సిబ్బంది, ఎస్కార్ట్ వాహనంతో పాటు ఇతర ఖైదీలతో ప్రయాణం చేయడం ఒత్తిడి గురై బతుకు దుర్భరంగా మారింది. ఇకపై నేను ఇలాంటివి భరించలేను. జేజే ఆస్పత్రిలో ఎప్పుడూ పెద్ద క్యూ ఉంటుంది. ఇతర అనారోగ్య బాధితులకు చికిత్స అందించి.. డాక్టర్ల నా వంతుగా వైద్యం చేసేందుకు మరింత సమయం పడుతుంది. ఇలాంటి పరిణామాలు నా ఆరోగ్యంపై దుష్ప్రప్రభావాన్ని చూపుతున్నాయి. జైల్లో చనిపోవడమే మంచిది నాకు 75 ఏళ్లు నిండాయి. భవిష్యత్తుపై ఎలాంటి ఆశ లేదు. నేను జైలులో చనిపోవాలనుకున్న ప్రతి సారి విధి నన్ను కాపాడుతుంది. జీవితంపై నేను పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. కలలు కరిగి పోయాయి. భవిష్యత్తు నాశనం అయ్యింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో జీవించి ఉండటం కంటే జైల్లో చనిపోవడమే మంచిది అందుకు అనుమతించండి" అని కోర్టు ఎదుట మొకరిల్లాడు. కన్నీటి పర్యంతరం నా భార్య అనిత క్యాన్సర్ ముదిరిపోయి చికిత్స పొందుతోంది. ఒక్కగానొక్క నమ్రత గోయల్ కూతురు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో ఆమెను చూసుకునే వారు లేరని కన్నీటి పర్యంతమయ్యారు గోయల్. తనను జెజె ఆసుపత్రికి పంపవద్దని, బదులుగా ‘‘ జైలులోనే చనిపోవడానికి అనుమతించండి’’ అని కోర్టును అభ్యర్థించాడు. చివరిగా.. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావడానికి ఆరోగ్యం సహకరించడం లేదు. ఇప్పుడు కోర్టుకు హాజరయ్యాను. ఇకపై కోర్టు అడిగిన ఆధారాల్ని సమర్పిస్తాను. కానీ భౌతికంగా కోర్టుకు హాజరు కాలేనని చెప్పాడు. జనవరి 16న తదుపరి విచారణ గోయల్ అభ్యర్ధనను విన్న ప్రత్యేక న్యాయ మూర్తి.. జెట్ ఎయిర్ వేస్ నరేష్ గోయల్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా నరేష్ గోయల్ బెయిల్ పిటిషన్‌పై ఈడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణ జనవరి 16 న జరగనుంది. -
పెరిగిన వడ్డీరేట్లు - కెనరా బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ – ఐదు బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. ఇటీవలే ప్రైవే టు రంగ దిగ్గజం– హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఇదే స్థాయిలో కొన్ని కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ను పెంచిన సంగతి తెలిసిందే. అయితే కెనరా బ్యాంక్ మాత్రం అన్ని కాలపరిమితులపై రుణ రేటును పెంచింది. దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన అన్ని రుణాలపై వడ్డీరేట్లు పెరగనున్నాయి. పెంచిన రేట్లు ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. కెనరా బ్యాంక్ తాజా రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం– సాధారణంగా ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదికన అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 8.70 శాతం నుంచి 8.75%కి చేరింది. ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు కూడా 5 బేసిస్ పాయింట్ల చొప్పున పెరిగాయి. -
ఈడీ కస్టడీకి జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేష్ గోయల్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో శుక్రవారం రాత్రి అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను.. మనీ లాండరింగ్ కేసులను విచారించేందుకు ఏర్పాటైన ముంబైలోని ప్రత్యేక కోర్టు సెపె్టంబర్ 11 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపుతూ శనివారం ఆదేశించింది. కెనెరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు జెట్ ఎయిర్వేస్ ఛైర్మన్ నరేష్ గోయల్, భార్య అనితపై సీబీఐ మే 3న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్కు రూ.848.86 కోట్ల రుణ పరిమితులు, రుణాలు మంజూరు చేశామని.. అందులో రూ.538.62 కోట్లు బకాయిలున్నాయన్న కెనరా బ్యాంకు ఫిర్యాదుపై కేసు నమోదైంది. -
పొదుపు సంఘాల రుణాల వడ్డీ తగ్గింపునకు కెనరా బ్యాంకు ఒకే
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వడ్డీ తగ్గించగా, ఇప్పుడు కెనరా బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది. పొదుపు సంఘాల రుణాలకు వడ్డీ తగ్గింపునకు ఆమోదం తెలిపే ఆదేశాలను కెనరా బ్యాంకు ప్రాంతీయ జనరల్ మేనేజర్ రవివర్మ బుధవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్‌కు అందజేశారు. ఇటీవలే ఎస్బీఐ పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీని 12.15 శాతానికి బదులు 9.70 శాతం చేసింది. కెనారా బ్యాంకు కూడా ‘ఎ’ కేటగిరీలో ఉండే పొదుపు సంఘాలకు రూ. 5 లక్షల పైబడి రుణాలపై 9.70 శాతం వడ్డీనే వసూలు చేస్తామని తెలిపింది. దీంతో పాటు రుణాలపై ఎలాంటి అదనపు, ప్రాసెసింగ్, ఇన్స్పెక్షన్, యాన్యువల్ రివ్యూ లేదా రెన్యువల్ చార్జీలను పూర్తిగా మినహాయించింది. బుధవారం సెర్ప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సెర్ప్ బ్యాంకు లింకేజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.కేశవకుమార్, కెనరా బ్యాంకు డివిజనల్ మేనేజర్ ఐ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు -
కెనరా బ్యాంక్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్.. ఇక్కడ మామూలు రూపాయిలు కాదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తాజాగా యూపీఐ ఇంటరాపరబుల్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. వ్యాపారుల యూపీఐ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డిజిటల్ కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఇది ఉపయోగపడగలదని బ్యాంక్ ఎండీ కె. సత్యనారాయణ రాజు తెలిపారు. అలాగే ప్రత్యేకంగా సీబీడీసీ బోర్డింగ్ ప్రక్రియ అవసరం లేకుండా ప్రస్తుతం తమకున్న యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారానే వ్యాపారులు డిజిటల్ కరెన్సీలో చెల్లింపులను పొందవచ్చని ఆయన వివరించారు. అనుసంధానించిన ఖాతా నుంచి కస్టమర్లు తమ సీబీడీసీ వాలెట్‌లోకి కరెన్సీని లోడ్ చేసుకోవచ్చని, దాన్ని సీబీడీసీ వాలెట్ ఉన్న ఎవరికైనా బదలాయించవచ్చని, అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని, స్వీకరించవచ్చని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాల్లో దీన్ని కస్టమర్లు, వ్యాపారులకు పైలట్ ప్రాతిపదికన దీన్ని ఆఫర్ చేస్తున్నట్లు వివరించారు. -
ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లపై కీలక ప్రకటన - ఆ రెండు బ్యాంకులు..
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మూడవ సారి కూడా 6.5 శాతం వద్దనే ఎటువంటి సవరణ చేయకుండా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తరువాత యాక్సిస్ బ్యాంక్ & కెనరా బ్యాంక్ రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు వడ్డీ రేట్లను సవరించాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్.. యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, సవరణల తరువాత సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్లలోపు చేసుకునే డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.3 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు మాత్రం ఈ డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 8.05 శాతం వరకు వడ్డీ అందించనుంది. అంతే కాకుండా నగదును ముందస్తుగా ఉపసంహరించుకునే వెసలుబాటు కూడా ఇందులో లభిస్తుంది. 7 రోజుల నుంచి 14 రోజులు, 15 రోజుల నుంచి 29 రోజులు, 30 రోజుల నుంచి 45 రోజులు 3.50% 46 రోజుల నుంచి 60 రోజుల వరకు 4.00% 61 రోజులు నుంచి 3 నెలలు 4.50% 3 నెలలు నుంచి 4 నెలలు, 4 నెలలు నుంచి 5 నెలలు, 5 నెలలు నుంచి 6 నెలలు 4.75% 6 నెలలు నుంచి 7 నెలలు, 7 నెలలు నుంచి 8 నెలలు, 8 నెలలు నుంచి 9 నెలలు 5.75% 9 నెలలు నుంచి 10 నెలలు, 10 నెలలు నుంచి 11 నెలలు, 11 నెలల నుంచి 11 నెలల 24 రోజులు 6.00% 11 నెలల 25 రోజులు నుంచి 1 సంవత్సరం 6.00% 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 4 రోజులు 6.75% 1 సంవత్సరం 5 రోజుల నుంచి 1 సంవత్సరం 10 రోజులు & 1 సంవత్సరం 11 రోజుల నుంచి 1 సంవత్సరం 24 రోజులు 6.80% 1 సంవత్సరం 25 రోజులు నుంచి 13 నెలలు 6.80% 13 నెలలు నుంచి 14 నెలలు, 14 నెలలు నుంచి 15 నెలలు, 15 నెలలు నుంచి 16 నెలలు వరకు 7.10% 16 నెలలు నుంచి 17 నెలలు 7.30% 17 నెలలు నుంచి 18 నెలలు & 18 నెలలు నుంచి 2 సంవత్సరాలు 7.10% 2 సంవత్సరాలు నుంచి 30 నెలలు 7.20% 30 నెలలు నుంచి 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నుంచి 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 7.00% కెనరా బ్యాంక్.. ఇక కెనరా బ్యాంక్ విషయానికి వస్తే.. అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కొత్త సవరణ తర్వాత, సాధారణ ప్రజలకు ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకు చేసుకునే డిపాజిట్లపై బ్యాంక్ 4 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందజేస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 4 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేట్లు ఇప్పటికే అమలులో ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇదో చెత్త కారు.. రూ. 4 కోట్ల మసెరటిపై గౌతమ్ సింఘానియా ట్వీట్ 7 రోజుల నుంచి 45 రోజుల వరకు 4.00% 46 రోజుల నుంచి 90 రోజుల వరకు 5.25% 91 రోజుల నుంచి 179 రోజులు 5.50% 180 రోజుల నుంచి 269 రోజుల వరకు 6.25% 270 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ 6.50% 1 సంవత్సరం మాత్రమే 6.90% 444 రోజులు 7.25% 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.90% 2 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ 6.85% 3 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 5 సంవత్సరాల కంటే తక్కువ 6.80% 5 సంవత్సరాలు & అంతకంటే ఎక్కువ - 10 సంవత్సరాల వరకు 6.70% -
ఆర్బీఐ వదిలినా.. ఆ మూడు బ్యాంకుల ఖాతాదారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) నిధుల సమీకరణ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల వరకూ (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచుతూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా మూడవసారి 6.5 శాతం వద్ద కొనసాగిస్తూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకున్నప్పటికీ బ్యాంకులు మాత్రం వడ్డీరేట్ల పెంపువైపే మొగ్గుచూపుతుండడం గమనార్హం. వ్యవస్థలో తగిన రుణ డిమాండ్ ఉందన్న విషయాన్ని బ్యాంకుల తాజా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సూచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకింగ్ నిర్ణయాలతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణరేట్లు పెరగనున్నాయి. సాధారణంగా వినియోగ రుణాలు ఏడాది కాల వ్యవధి ఎంసీఎల్ఆర్కు అనుసంధానమై ఉంటాయి. తాజా మార్పుతో ఏడాది బ్యాంకింగ్ ఎంసీఎల్ఆర్ రేట్ల పెరుగుదల తీరిదీ... బీఓబీ: రుణ రేటు 8.65 శాతం నుంచి 8.70 శాతానికి పెరగనుంది. ఆగస్టు 12 నుంచి ఈ రేటు అమలవుతుంది. కెనరా బ్యాంక్: ఆగస్టు 12 నుంచి 8.65 శాతం నుంచి 8.7 శాతానికి పెరగనుంది. బీఓఎం: తక్షణం అమల్లోకి వచ్చే విధంగా రేటు 10 బేసిస్ పాయింట్లు ఎగసి 8.60కి ఎగసింది. -
డివిడెండ్‌పై హర్షం
బెంగళూరు: కెనరా బ్యాంక్ బోర్డ్ 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ. 12 డివిడెండ్ సిఫారసు చేయడంపై షేర్ హోల్డర్లు హర్షం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన షేర్‌హోల్డర్ల 21 వార్షిక సార్వత్రిక సమావేశం యాజమాన్యంపై పూర్తి విశ్వాసాన్ని వెలిబుచి్చంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బ్యాంక్ ఎండీ, సీఈఓ కే సత్యనారాయణ రాజును చిత్రంలో తిలకించవచ్చు. ఇదిలావుండగా, రూపే క్రెడిట్ కార్డ్‌ల ద్వారా వ్యాపారులకు యూపీఐ చెల్లింపులను ఆఫర్ చేస్తున్నట్లు మరో ప్రకటనలో బ్యాంక్ తెలిపింది. తద్వారా ఈ తరహా సేవలు ప్రారంభిస్తున్న మొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా కెనరా బ్యాంక్ నిలిచిందని పేర్కొంది. -
బ్యాంకులు నిష్పాక్షికంగా వ్యవహరించాలి
సాక్షి, అమరావతి: ఓ ఆస్తి వేలం వ్యవహారంలో కెనరా బ్యాంకు తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. బాకీదారుతో వన్‌టైం సెటిల్మెంట్కు అంగీకరించి, అతని రుణ ఖాతాను మూసివేసిన కెనరా బ్యాంకు.., మరో వైపు అదే ఆస్తిని బ్యాంకు వేలంలో కొన్న వ్యక్తి నుంచి ముందస్తుగా కొంత వసూలు చేసి, గడువు తేదీకి ముందే దానిని జప్తు/సర్దుబాటు చేయడాన్ని తప్పుపట్టింది. చెల్లింపు చివరి తేదీ వరకు మొత్తం డబ్బు చెల్లించేందుకు వేలంలో విజేతకు అవకాశం ఉంటుందని తెలిపింది. చివరి తేదీన మొత్తం డబ్బు చెల్లించని పక్షంలో మాత్రమే అతని ముందస్తు చెల్లింపులను జప్తు చేసే అధికారం బ్యాంకుకు ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ కేసులో కెనరా బ్యాంకు హద్దుమీరడమే కాక, చట్ట విరుద్ధంగా కూడా వ్యవహరించిందని స్పష్టం చేసింది. వేలం వేసిన స్థలం విషయంలో బ్యాంకు నిష్పాక్షికంగా వ్యవహరించలేదంది. ఆ స్థలానికి రెండు భారీ భవంతుల మధ్య సన్నని తోవ గుండా వెళ్లాలన్న విషయాన్ని వేలం ప్రకటనలో తెలియజేయకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. జాతీయ బ్యాంకుగా దాని చర్యలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉండాలని తేల్చి చెప్పింది. పిటిషనర్ ముందుగా చెల్లించిన రూ.22.50 లక్షలు, గడువు తేదీ రోజు చెల్లించిన రూ.15 లక్షలను కూడా వాపసు చేయాలని బ్యాంకును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. జరిగిందిదీ.. పెరుమాళ్లు ఆగ్రో ఇండస్ట్రీస్ గుంటూరు విద్యానగర్‌లోని 302.50 చదరపు గజాల స్థలాన్ని తనఖా పెట్టి కెనరా బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. ఆ రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు ఆ స్థలాన్ని వేలం వేసింది. వేలంలో చిలకలూరిపేటకు చెందిన సయ్యద్ హిదయతుల్లా బిడ్‌ను 2019 ఆగస్టు 26న ఆమోదించారు. నిబంధనల ప్రకారం బిడ్ మొత్తంలో 25 శాతం కింద రూ.22.50 లక్షలు ఆయన చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించేందుకు 2019 అక్టోబరు 25 చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తేదీన హిదయతుల్లా రూ.15 లక్షలు మాత్రమే చెల్లించారు. కెనరా బ్యాంకు 2019 సెప్టెంబరు 9న రూ.22.50 లక్షలను పెరుమాళ్లు ఆగ్రో ఇండస్ట్రీస్ రుణ ఖాతా కింద సర్దుబాటు చేసింది. హిదయతుల్లా స్థలం లింకు డాక్యుమెంట్లు, ఇతర వివరాలను కోరినా బ్యాంకు ఇవ్వలేదు. స్థలం ఎల్ ఆకారంలో ఉండటం, రెండు భారీ భవంతుల మధ్య నుంచి సన్నని తోవ గుండా వెళ్లాల్సి రావడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తాను చెల్లించిన మొత్తాన్ని వాపసు ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరారు. వారు స్పందించకపోవడంతో 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపి, తీర్పు ఇచ్చింది. -
నిబంధనలు పాటించని కెనరా బ్యాంకు: ఆర్బీఐ భారీ పెనాల్టీ
సాక్షి, ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు కెనరా బ్యాంకునకు భారీ షాక్ ఇచ్చింది. రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించిందని ఆగ్రహించిన ఆర్బీఐ భారీ పెనాల్టీ విధించింది. ప్రధానంగా రిటైల్ రుణాలపై ఫ్లోటింగ్ రేట్ వడ్డీని, ఎంఎస్ఎంఈ రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో బ్యాంక్ విఫలమైందని పేర్కొంది. (మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి) వడ్డీ రేట్లను బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం, అనర్హులకు పొదుపు ఖాతాలు తెరవడం వంటి పలు నిబంధనలను ఉల్లంఘించినందుకు కెనరా బ్యాంక్‌పై రూ.2.92 కోట్ల జరిమానా విధించింది. ఆర్బీఐ చేపట్టిన తనిఖీల్లో విషయాలు వెలుగులోకి రావటంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. బ్యాంక్ ఫ్లోటింగ్ రేట్ రిటైల్ రుణాలపై వడ్డీని, ఎంఎస్ఎంఈలకి ఇచ్చే రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో లింక్ చేయడంలో విఫలమైందని గుర్తించినట్టు కేంద్ర బ్యాంకు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన,ఫ్లోటింగ్ రేటు రూపాయి రుణాలపై వడ్డీని దాని మార్జినల్ కాస్ట్‌తో లింక్ చేయడంలో విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఇదీ చదవండి: 18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్ అలాగే పలు క్రెడిట్ కార్డ్ ఖాతాలలో నకిలీ మొబైల్ నంబర్లను నమోదు చేయటం, 24 నెలలలోపు ముందుగానే ఉపసంహరించుకోవడం, కస్టమర్ల నుండి ఎస్ఎంఎస్ అలర్ట్ చార్జీలను వసూలు చేసిందనితెలిపింది. కస్టమర్ ప్రొఫైల్‌కు విరుద్ధంగా లావాదేవీలు జరిగినప్పుడు అలర్ట్‌లను రూపొందించడానికి కొనసాగుతున్న కస్టమర్ డ్యూ డిలిజెన్స్‌ను చేపట్టడంలో విఫలమైందని పేర్కొంది. రోజువారీ డిపాజిట్ పథకం కింద ఆమోదించిన డిపాజిట్లపై వడ్డీని చెల్లించడంలో కూడా విఫలమైందని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. -
యూపీఐలో కెనరా బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్
హైదరాబాద్: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన రూపే క్రిడెట్ కార్డులను యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పరిధిలోకి తీసుకొచ్చింది. బ్యాంక్ కస్టమర్లందరూ తమ యాక్టివ్ రూపే క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి అనుసంధానం చేసుకోవచ్చు. ఖాతా ఆధారిత యూపీఐ లావాదేవీల తరహాలోనే కార్డ్‌ని భౌతికంగా వినియోగించకుండానే చెల్లింపులు జరపవచ్చు. పీఓఎస్ మెషీన్లు లేని వ్యాపారులు యూపీఐతో అనుసంధానమైన రూపే క్రెడిట్ కార్డు కలిగి ఉన్న కస్టమర్ల నుంచి చెల్లింపులు పొందవచ్చు. దీనివల్ల చిన్న వ్యాపారులు తక్కువ ఖర్చుతో విక్రయాల టర్నోవర్‌ను, వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. -
కెనరా బ్యాంక్‌కు ఎంఎస్ఎంఈ ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ను ‘ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డు 2022’ వరించింది. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించే దిశగా బ్యాంక్ అందించిన సేవలకుగానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఢిల్లీలోని చాంబర్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ అవార్డు అందించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ భవేంద్ర కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. -
కెనరా బ్యాంక్ 400 రోజుల డిపాజిట్
హైదరాబాద్: కెనరా బ్యాంక్ నూతనంగా 400 రోజుల ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది. దీనిపై 7.75 శాతం వరకు వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇందులో నాన్ కాలబుల్ డిపాజిట్ (గడువుకు ముందు ఉపసంహరించుకోలేనివి)పై 7.25 శాతం రేటును ఆఫర్ చేస్తుండగా, కాలబుల్ డిపాజిట్‌పై (గడువుకు ముందు రద్దు, పాక్షిక ఉపసంహరణకు వీలైనవి) 7.15 శాతం వార్షిక వడ్డీ రేటును ఇస్తున్నట్టు కెనరా బ్యాంక్ తెలిపింది. 60 ఏళ్లు నిండిన వారికి 0.50 శాతం అదనపు రేటును ఇస్తోంది. -
కొత్త సంవత్సరం.. కస్టమర్లకు షాకిచ్చిన బ్యాంక్!
ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ కొత్త సంవత్సరం తన కస్టమర్లకు షాకిచ్చింది. జనవరి నెల నుంచి రుణ రేట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్న వారిపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం పడనుంది. తాజా పెంపుతో రుణగ్రహితలపై అధిక వడ్డీల భారం పడనుంది. ఇప్పటికే పలు బ్యాంకుల తమ వడ్డీరేట్లను పెంచిన సంగతి తెలిసిందే. కెనరా బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR) 15 నుంచి 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ప్రకటించిన పెంపు నిర్ణయం జనవరి 7 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. రేట్ల పెంపు తర్వాత వీటిపై లుక్కేస్తే.. ఓవర్ నైట్, ఒకనెల రోజులకు ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతంగా ఉండగా, 3 నెలలకు ఎంసీఎల్ఆర్ 7.85 శాతంగా ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.2 శాతం, ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం పెంచిన కొత్త రేట్లు కారణంగా ఇకపై కొత్తగా రుణాలు తీసుకునే వారికి వర్తించనున్నాయి. వీటితో పాటు రెన్యూవల్, రీసెట్ డేట్ తర్వాత కూడా ఈ కొత్త రుణ రేట్లు అమలులోకి వస్తాయి. చదవండి: అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది -
మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..? మారిన ఏటీఎం విత్‌డ్రా నిబంధనలు
కెనరా బ్యాంక్ ఖాతా దారులకు ముఖ్య గమనిక. ఖాతాదారులు నిర్వహించే రోజూ వారీ ఏటీఎం లావాదేవీలపై మార్పులు చేసింది. ఏటీఎం నుంచి క్యాష్ విత్డ్రాల్, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఈకామర్స్ ట్రాన్సాక్షన్లలో ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది ► క్లాసిక్ డెబిట్ కార్డుల కోసం రోజువారీ ఏటీఎం విత్డ్రాల్ పరిమితిని ప్రస్తుతం రూ.40వేలు ఉండగా.. రూ.75వేలకు పెంచింది. ► ప్రస్తుతం ఉన్న పీఓఎస్,ఈ కామర్స్ పరిమితిని రూ.1 లక్ష నుండి రోజుకు రూ. 2లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ► రూ.25వరకు లిమిట్ ఉన్న ఎన్ఎఫ్సీ (కాంటాక్ట్‌లెస్)ని తటస్థంగా ఉంచింది. కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు ఒక్కో సందర్భంలో రూ. 5000 వరకు, రోజుకు 5 లావాదేవీలకు అనుమతి ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం డెబిట్ కార్డ్ లావాదేవీల పరిమితిలో మార్పులు చేసింది. పీఎన్బీ వెబ్సైట్ ప్రకారం.. ప్లాటినం మాస్టర్ కార్డ్, రూపే, వీసా గోల్డ్ డెబిట్ కార్డ్‌లతో పాటు రూపే సెలెక్ట్, వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డ్‌ల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగదారులకు షాక్ ఇచ్చింది. థర్డ్ పార్టీ పద్దతుల ద్వారా రెంట్ పేమెంట్ చేస్తే..సదరు వినియోగదారులు చేసిన లావాదేవీ మొత్తంలో 1శాతం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చదవండి👉 మారనున్న నిబంధనలు!, పాన్ కార్డు అమలులో కేంద్రం మరో కీలక నిర్ణయం? -
కెనరా బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ఐబీఏ అవార్డులు
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ఐబీఏ అవార్డులు లభించాయి. ‘‘బెస్ట్ టెక్నాలజీ టాలెంట్ ’’ కేటగిరీ అవార్డుతోపాటు బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్, బెస్ట్ డిజిటల్ ఎంగేజ్మెంట్, బెస్ట్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కేటగిరీల్లోనూ బ్యాంక్‌కు అవార్డులు లభించాయి. ముంబైలో జరిగిన ఐబీఏ 18వ బ్యాంకింగ్ టెక్నాలజీ సదస్సు, ఎక్స్పో అండ్ అవార్డులు– 2022 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ లెండింగ్ ద్వారా రుణ వృద్ధి’ అనే అంశంపై జరిగిన ఒక చర్చా గోష్టిలో అశోక్ చంద్ర పాల్గొని, ఈ విభాగంలో లభ్యమవుతున్న అవకాశాల గురించి మాట్లాడారు. -
ఘనంగా కెనరా బ్యాంక్ 117వ వ్యవస్థాపక దినోత్సవం
బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ 117వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. బెంగళూరు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంక్ వ్యవస్థాపకుడు దివంగత అమ్మెంబళ్ సుబ్బారావు పాయ్‌కు ఘనంగా నివాళులర్పించారు. బ్యాంక్ 117 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణాన్ని విజవంతంగా పూర్తి చేసుకోవడంలో ఖాతాదారుల పాత్ర అమోఘమైందని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎల్వీ ప్రభాకర్ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా క్యూర్ ఇంటర్నేషనల్ ఇండియా ట్రస్ట్‌కు ఆర్థిక చేయూతను అందించినట్లు తెలిపారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ చిరంతనకు కూడా ఆర్థిక సాయాన్ని అందించినట్లు ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. చదవండి: ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’ -
Hyderabad: ఏటీఎంలో భద్రపరచాల్సిన నగదుతో డ్రైవర్ పరారీ
సాక్షి, హైదరాబాద్: కెనరా బ్యాంక్ ఏటీఎం కేంద్రాల్లో డబ్బును లోడ్ చేసేందుకు వచ్చిన డ్రైవర్ అదును చూసి రూ.3 లక్షలతో ఉడాయించాడు. వాహనంలో రూ. 37 లక్షలు ఉన్నప్పటికి బ్యాక్సులను మోయలేక రూ.3 లక్షల బాక్సుతో పాటు రెండు సెక్యూరిటీ గన్లతో పరారయ్యాడు. రాజేంద్రనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్లలో రైటర్ సేఫ్ గార్డు సంస్థ నగదును లోడ్ చేస్తుంది. ప్రతి రోజు వివిధ రూట్లలో ఈ సంస్థ ఆధ్వర్యంలో వాహనాల్లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఏటీఎం సెంటర్ల వద్దకు వెళ్లి నగదును లోడ్ చేస్తారు. గురువారం సిబ్బంది అశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ గార్డులు కె.వి.రామ్, చంద్రయ్యలు రూ.72 లక్షలతో డ్రైవర్ ఫారూఖ్‌తో కలిసి వాహనంలో బయలుదేరారు. అహ్మద్‌నగర్, ఎన్ఎండీసీ, గగన్‌పహాడ్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో నగదును లోడ్ చేసి ఆయా కేంద్రాల్లో మిగిలిన బాక్సులను తీసుకుని వాహనంలో లోడ్ చేశారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో రాజేంద్రనగర్‌లోని కెనరా బ్యాంకు ఏటీఎం సెంటర్‌కు వచ్చారు. సిబ్బంది ఆశోక్, భాస్కర్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కె.వి.రామ్, చంద్రయ్య లోపలికి వెళ్లి షట్టర్ వేసుకుని నగదును లోడ్ చేస్తున్నారు. సెక్యూరిటీకి చెందిన రెండు ఏయిర్ పిస్తల్‌లను వాహనంలోనే ఉంచారు. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఫారూఖ్ వాహనంతో ఉడాయించాడు. రాజేంద్రనగర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జీ వద్దకు చేరుకున్నాడు. అక్కడ రోడ్డు పక్కన వాహనాన్ని పార్కు చేసి అందులో ఉన్న ఒక బాక్సు, రెండు గన్లను తీసుకుని పరారయ్యాడు. ఒక్కడే ఉండడం, బాక్సులు పెద్దగా ఉండడంతో నగదు మొత్తం తీసుకెళ్లేందుకు అతడికి వీలు కాకపోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఏటీఎంలో డబ్బులు లోడ్‌చేసి బయటికి వచ్చిన సిబ్బంది చూడగా వాహనం కనిపించకపోవడంతో 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. చదవండి: Road Accident: బస్సు, టవేరా వాహనం ఢీ.. 11 మంది దుర్మరణం ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో రాజేంద్రనగర్ పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బ్యాంకు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనానికి జీపీఎస్ సౌకర్యం ఉండడంతో ఏజెన్సీ నిర్వహకుల సమాచారంతో పోలీసులు కిస్మత్పూర్ బ్రిడ్జి వద్ద వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు. వాహనంలో మిగిలిన నగదు బాక్సులు ఉండడం, ఒక్క బాక్సు మాత్రమే కనిపించకపోవడం, రెండు గన్లు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు నగదును లెక్కించగా రూ.3 లక్షలు బాక్సుతో డ్రైవర్ పారిపోయినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల పరిశీలన... డ్రైవర్ ఫారూఖ్ ఒక్కడే నగదును దొంగలించాడా అతడికి ఎవరైనా సహకరించారా అన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం సెంటర్ నుంచి కిస్మత్పూర్ బ్రిడ్జీ వరకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అతను ట్రంక్ బాక్సుతో పాటు రెండు గన్లను తీసుకువెళ్లడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సెక్యూరిటీ గార్డులకు చెందిన ఈ తుపాకులు బరువుగా ఉంటాయని వాటిని తీసుకువెళ్లే సమయంలో ప్రతి ఒక్కరు గుర్తిస్తారన్నారు. స్థానికంగా వాటిని పడేసి ఉండవచ్చునని భావించిన పోలీసులు దాదాపు గంట సేపు గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. -
గాయత్రి ప్రాజెక్ట్స్‌పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: భారీగా పేరుకుపోయిన బాకీలను రాబట్టుకునేందుకు ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్‌పై కెనరా బ్యాంక్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తదుపరి విచారణను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అక్టోబర్ 10న (నేడు) చేపట్టనుంది. గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ బ్యాంకులకు దాదాపు రూ. 6,000 కోట్లు బకాయిపడింది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) అత్యధికంగా రుణాలిచ్చాయి. -
ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!
హైదరాబాద్: ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు ప్రత్యేక టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ను తన కస్టమర్ల కోసం ప్రకటించింది. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల వరకు పెంచి తన ఖాతాదారులకు ఈ ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్ అందించింది. కెనరా బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం సవరించిన కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 7 నుండి అమలులోకి వచ్చాయి. (మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్, ధర తక్కువ, ఇక జియో ఆఫర్ తెలిస్తే!) 666 రోజుల కాల వ్యవధికి డిపాజిట్ చేస్తే 7 శాతం వార్షిక రేటును ఆఫర్ చేస్తోంది. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇదే డిపాజిట్‌పై అర శాతం అధికంగా 7.50 శాతం రేటును ఆఫర్ చేస్తోంది. రూ.2 కోట్లలోపు ఉండే డిపాజిట్లకు ఇది వర్తిస్తుందని కెనరా బ్యాంకు ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకు నుంచి ఇది అత్యధిక రేటుగా పేర్కొంది. (సంచలనం: ఓలా, ఉబెర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం) ఇదీ చదవండి : హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. బుకింగ్.. ఫీచర్లు, ధర వివరాలు -
నిధుల సమీకరణలో కెన్ ఫిన్ హోమ్స్
న్యూఢిల్లీ: గృహ రుణ రంగంలో ఉన్న కెన్ ఫిన్ హోమ్స్ రూ.4,000 కోట్ల నిధుల సమీకరణలో ఉంది. నాన్ కన్వర్టబుల్ రిడీమేబుల్ డిబెంచర్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని అందుకోనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. కెనరా బ్యాంకును ప్రమోట్ చేస్తున్న ఈ సంస్థ అక్టోబర్ 17న జరిగే సమావేశంలో ఈ మేరకు బోర్డ్ అంగీకారం కోరనుంది. రుణాల పెంపు ప్రణాళికకు 2022 సెప్టెంబర్ 7న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులు ఆమోదం తెలిపారని కెన్ ఫిన్ హోమ్స్ వెల్లడించింది. కెన్ ఫిన్ హోమ్స్‌లో కెనరా బ్యాంక్‌నకు 29.99 శాతం వాటా ఉంది. -
కెనరాబ్యాంక్ కస్టమర్లకు మెరుగైన డిజిటల్ సేవలు
ముంబై: ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించే దిశగా ముందడుగు వేసింది. రోజువారీ లావాదేవీలను సులభతరం చేస్తూ, యూపీఐ ఎల్ఐటీఈ, కెనరా క్యూఆర్ సౌండ్‌బాక్స్, కెనరా ఏఐ1 మర్చంట్ యాప్‌లను ఆవిష్కరించింది. ‘యూపీఐ ఎల్ఐటీఈ’.. రూ.200 వరకూ తక్కువ స్థాయిలో విలువ లావాదేవీ నిర్వహించడంసహా పలు ప్రయోజనాలను అందించే ఒక ‘‘ఆన్–డివైస్’’ వాలెట్. గరిష్ట రోజువారీ వినియోగ విలువ పరిమితి రూ.4,000. ఇక ఇన్స్టెంట్ క్యూఆర్ పేమెంట్ కన్ఫర్మేషన్సహా పలు ప్రయోజనాలను ‘కెనరా క్యూఆర్ సౌండ్‌బాక్స్’ ద్వారా లభ్యమవుతాయి. ఆన్బోర్డెడ్ బీహెచ్ఐఎం క్యూఆర్ మర్చంట్స్‌కు ‘కెనరా ఏఐ1’ యూజర్ ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్‌గా ఉండనుంది. ఈ కీలక ఫీచర్ల కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంక్ సీనియర్ అధికారులను చిత్రంలో తిలకించవచ్చు. -
కెనరా బ్యాంక్‌కు ఈజ్ 4.0 సంస్కరణల సూచీ అవార్డు
ముంబై: ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్‌కు ప్రతిష్టాత్మక ‘ఈఏఎస్‌ఈ (ఈజ్) 4.0 సంస్కరణల సూచీ అవార్డు, 2022’ లభించింది. అత్యుత్తమ పనితీరుకు గాను 2021–22 మార్చి త్రైమాసికానికి సంబంధించి ఈజ్ అవార్డు మూడవ ర్యాంక్‌ను దక్కించుకున్న బ్యాంక్, ‘ప్రూడెంట్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషనలైజింగ్ థీమ్’ కింద మొదటి బహుమతిని కూడా అందుకుంది. ముంబైలో ఐబీఏ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ చేతుల మీదుగా ఈజ్ 4.0 సంస్కరణల సూచీ అవార్డును అందుకుంటున్న బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ ఎల్వీ ప్రభాకర్‌ను చిత్రంలో తిలకించవచ్చు. దీర్ఘకాల సుస్థిర వ్యాపారవృద్ధి, డిజిటల్ సామర్థ్యాల విభాగాల్లో బ్యాంక్ చక్కటి పనితీరు కనబరుస్తున్నట్లు ప్రభాకర్ ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
మరో బాదుడు.. కెనరా బ్యాంక్ రుణ రేటు పెంపు
ఇప్పటికే ఇందన ధరలు, నిత్యవసరాల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నెలలో ద్రవ్యోల్బణం కట్టడిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటుని పెంచిన సంగతి తెలిసింది. ఈ క్రమంలో పలు బ్యాంకులు వారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలపై మరింత భారమనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.15 శాతం వరకూ పెంచింది. పెంచిన రేట్లు బుధవారం(సెప్టంబర్ 7) నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంక్ పేర్కొంది. తాజా పెంపుతో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు భారం కానున్నాయి. తాజా పెంపుతో ఏడాది రుణ రేటు 7.65 శాతం నుంచి 7.75 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్, నెల వ్యవధుల ఎంసీఎల్ఆర్ 0.10% మేర పెరిగింది. -
వావ్.. అదిరిపోయే లాభాలు అందుకున్న కెనరా బ్యాంక్!
ముంబై: మెరుగైన రుణ వృద్ధి, వడ్డీ ఆదాయాల ఊతంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం 72 శాతం ఎగిసి రూ. 2,022 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 1,177 కోట్లు. ‘నికర వడ్డీ ఆదాయంతో (ఎన్ఐఐ) పాటు వడ్డీయేతర ఆదాయం కూడా 25 శాతం పెరిగింది. కేటాయింపులు అదుపులోనే ఉన్నాయి. రుణ వృద్ధి కూడా సానుకూలంగా నమోదైంది‘ అని సోమవారం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో ఎల్వీ ప్రభాకర్ తెలిపారు. సమీక్షాకాలంలో ఎన్ఐఐ 10.15 శాతం పెరిగి రూ. 6,160 కోట్ల నుంచి రూ. 6,785 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 24.55 శాతం వృద్ధితో రూ. 4,155 కోట్ల నుంచి రూ. 5,175 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 2.71 శాతం నుంచి 2.78 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.90 శాతం స్థాయికి పెరిగే అవకాశం ఉందని ప్రభాకర్ తెలిపారు. సమీక్షాకాలంలో స్థూల రుణాల వృద్ధి 13.14 శాతంగాను, డిపాజిట్ల వృద్ధి 8.49 శాతంగాను నమోదైంది. తగ్గిన మొండిబాకీలు మరోవైపు, స్థూల మొండిబాకీల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 8.50 శాతం నుంచి 6.98 శాతానికి దిగి రాగా, నికర ఎన్పీఏల నిష్పత్తి కూడా 3.46 శాతం నుంచి 2.48 శాతానికి తగ్గింది. క్యూ1లో రూ. 1,886 కోట్ల మొత్తం రికవర్ అయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000 కోట్ల రికవరీలను లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభాకర్ చెప్పారు. అలాగే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి బదిలీ చేసేందుకు రూ. 2,300 కోట్ల విలువ చేసే మొండి పద్దులను గుర్తించినట్లు వివరించారు. చదవండి: Huawei: భారత్‌కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం -
నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్
సాక్షి, హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లతో గ్రానైట్ కటింగ్ మిషన్ కోసం బ్యాంకు రుణం తీసుకొని ఎగ్గొట్టిన వారిపై సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. కెనరా బ్యాంకు నుంచి ఓమ్ సాయి ఎంటర్ప్రైజెస్ యజమాని అద్లురీ రాజు బాలానగర్ కెనరా బ్యాంకులో రూ. 95 లక్షల రుణం కోసం దరఖాస్తు చేశాడు. తన వ్యాపార కార్యాలయం పంజాగుట్ట ద్వారాకపూరి కాలనీలో శ్రీదేశి అపార్టుమెంట్లో ఉందని సంబంధింత పత్రాలు బ్యాంకుకు అందించాడు. అనంతరం రూ. 95 లక్షల రుణం బ్యాంకు మంజూరు చేసింది. తరువాత కొన్ని వాయిదాలు చెల్లించి చేతులెత్తేశాడు. వాయిదాలు సక్రమంగా రాకపోవడంతో ఎందుకు చెల్లించడం లేదని, కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ అతని కార్యాలయమే లేదని తేలింది. అతడి వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, కోటేషన్లు కూడా నకిలీవని తేలాయి. ఒక పథకం ప్రకారం బ్యాంకును మోసం చేసి రూ. 89 లక్షల వరకు నష్టం చేశారంటూ కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సీసీఎస్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో అద్లురీ రాజుతో పాటు అతనికి సహకరించిన నరహరి గంటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ‘నీట్’గా దోచేశాడు... ఎంబీబీఎస్ సీటు పేరుతో గోల్మాల్ ) -
మెహుల్ చోక్సీపై తాజా కేసు
న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియంను రూ. 55.27 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై సీబీఐ తాజా ఎఫ్ఐఆర్ను నమోదు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. చోక్సీ, చేత్నా ఝవేరి, దినేష్ భాటియా, మిలింద్ లిమాయేసహా గతంలో గీతాంజలి జెమ్స్‌లో భాగమైన డిడామస్ జ్యువెలరీగా పిలవబడే బెజెల్ జ్యువెలరీ, దాని పూర్తికాల డైరెక్టర్లపై 2021 ఆగస్టు 30న బ్యాంక్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు అనంతరం దాదాపు ఏడాది తర్వాత ఏజెన్సీ చర్య తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 22న అనుమతించడంతో సీబీఐ ఈ కేసు విచారణను ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ముంబైలోని ఝవేరీ, భాటియా, లిమాయే నివాసాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జనవరి 2018లో చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోడీ చేసిన రూ. 13,000 కోట్ల భారీ మోసాన్ని వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. -
వెలుగులోకి మెహుల్ చోక్సీ మరో స్కాం: షాకిచ్చిన సీబీఐ
సాక్షి, ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు, డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియంను రూ. 55.27 కోట్లకు ముంచేసిన మెహుల్ చోక్సీపై సీబీఐ కొత్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చోక్సీతోపాటు, చేత్నా ఝవేరి, దినేష్ భాటియా, మిలింద్ లిమాయేలతో సహా బెజెల్ జ్యువెలరీ ఫుల్ టైం డైరెక్టర్లపై కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ కంపెనీలను రూ. 55.27 కోట్ల మోసం చేసి పారిపోయిన మెహుల్ చోక్సీపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. కెనరా బ్యాంక్ ,బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బెజెల్ జ్యువెలరీకి వర్కింగ్ క్యాపిటల్‌గా రూ. 30 కోట్లు, రూ. 25 కోట్లు మంజూరు చేశాయి. అయితే అక్రమంగా నిధుల మళ్లించిందని బ్యాంకుల ఆరోపణ. కంపెనీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో కన్సార్టియంకు రూ.55.27 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ అభియోగం. కాగా 13,500 కోట్ల పీఎన్బీ స్కాంలో చోక్సీని ఇండియా రప్పించేందుకు సీబీఐ, ఈడీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 16న చోక్సీ ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది. నాసిక్‌లో చోక్సీకి చెందిన తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూమిని కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. పీఎన్బీ స్కాం వెలుగులోకి వచ్చిన తరువాత 2018లో ఆంటిగ్వా బార్బుడా పారిపోయి అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. చోక్సీ. అయితే 2021లో అక్కడి నుంచి అదృశ్యమై డొమినికాలో తేలడం చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
కెనరా బ్యాంక్ వడ్డీరేటు పెంపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తన నిధుల సమీకరణ వ్యయ ఆధారిత వడ్డీరేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. గురువారం నుంచి తాజా రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఆటో, వ్యక్తిగత, గృహ రుణాలకు ప్రాతిపదిక అయిన ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల కాలాలకు సంబంధించి కొత్త రేట్లు 6.75 శాతం నుంచి 7.45 శాతం శ్రేణిలో ఉన్నాయి. రెపో ఆధారిత రుణ రేటును 7.30 శాతం నుంచి 7.80 శాతానికి పెంచుతున్నట్లు కూడా బ్యాంక్ ప్రకటించింది. -
వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో (4 నుంచి 4.4 శాతానికి) పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా బ్యాంకింగ్ నిర్ణయాలను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్... నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రేటు (ఎంసీఎల్ఆర్)ను 0.25 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 7.7 శాతానికి చేరింది. మే 7 నుంచి తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వినియోగ రుణాలకు సంబంధించి ప్రాతిపదికగా ఉండే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి చేరింది. రెండు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ వరుసగా 7.6 శాతం, 7.7 శాతాలకు పెరిగింది. కాగా, ఓవర్‌నైట్, ఒకటి, మూడు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లు 7.15 నుంచి 7.35 శాతం శ్రేణిలో ఉండనున్నాయి. కరూర్ వైశ్యా బ్యాంక్... రెపో ఆధారిత (ఈబీఆర్–ఆర్) రేటును 7.15 శాతం నుంచి 7.45 శాతానికి పెంచింది. మే 9వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. కెనరా బ్యాంక్ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ బ్యాంక్... రెపో ఆధారిత రుణ రేటు (బీఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి అమల్లోకి వచ్చే విధంగా 7.30 శాతానికి పెంచింది. ఎంసీఎల్ఆర్ రేటు ఏడాది కాలానికి 7.35 శాతంగా సవరించింది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ ఎంసీఎల్ఆర్ శ్రేణి 6.65 శాతం నుంచి 7.30 శాతంగా ఉండనుంది. తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు 2022 మే 7 లేదా అటు తర్వాత మంజూరయిన కొత్త రుణాలు, అడ్వాన్స్‌లు, మొదటి రుణ పంపిణీకి మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పుణే కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ అన్ని కాలపరిమితులకు సంబంధించి 0.15% పెరిగింది. 7వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుంది. ఏడాది ఎంసీఎల్ఆర్ 7.25% నుంచి 7.4 శాతానికి పెరుగుతుంది. ఓవర్‌నైట్ నుంచి ఆరు నెలల వరకూ రేట్లు 6.85%– 7.30% శ్రేణిలో ఉంటాయి. రెపో ఆధారిత రుణ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను మే 7 నుంచి వర్తించేట్లు 6.8% నుంచి 7.20 శాతానికి పెంచుతున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రెపో ఆధారిత రుణ రేటును (ఆర్ఎల్ఎల్ఆర్) మే 10 నుంచి వర్తించే విధంగా 7.25 శాతానికి సవరించింది. రెపో రేటు 4.40 శాతానికి 2.85 శాతం అదనమని తెలిపింది. -
కెనరా బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!
Canara Bank Hikes Fixed Deposit Rates: కెనరా బ్యాంక్ తన ఎఫ్డీ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు(౦.25) శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ఎఫ్డీ వడ్డీ రేట్లు మార్చి 1, 2022 నుంచి అమల్లోకి వస్తాయని కెనరా బ్యాంక్ తెలిపింది. కెనరా బ్యాంక్ 7 నుంచి 45 రోజుల మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. వినియోగదారులకు 46 రోజుల నుంచి 90 రోజులు మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.90 శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల మధ్య గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.95 శాతం వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఇంకా 180 రోజులు లేదా అంతకంటే తక్కువ మెచ్యూరిటీ వ్యవధి కలిగిన ఎఫ్డీలకు 4.40% వడ్డీ రేటును అందిస్తుంది. అలాగే కస్టమర్లు 2-3 సంవత్సరాల కాల వ్యవధితో ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.20 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే కస్టమర్లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ, 5 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు 5.25 శాతానికి బదులుగా.. 5.45 శాతం వడ్డీ రేటు లభించనుంది. మిగత ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల గురించి బ్యాంక్ పోర్టల్ సందర్శించండి. సీనియర్ సిటిజన్లు తమ ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడులపై అధిక వడ్డీ రేటును స్వీకరిస్తారని బ్యాంక్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు చేసే పెట్టుబడులపై బ్యాంక్ 50 బేసిస్ పాయింట్లు లేదా 0.5% అధిక వడ్డీ రేటును అందిస్తోంది. బ్యాంకు "1111 డేస్" రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకం కింద డిపాజిట్ రేటుకంటే అదనంగా 0.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ డిపాజిట్లపై అందించే వడ్డీ రేటు 5.55 శాతం. (చదవండి: ఆ విషయంలో ఢిల్లీ, ముంబైలతో పోటీ పడుతున్న హైదరాబాద్!) -
కెనరా బ్యాంక్ సర్కిల్లో విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం
-
తెలుగు అకాడమీ కేసులో కీలక పరిణామం, మొత్తం 10మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీ డిపాజిట్ కేసులో కీలక పరిణాయం చోటుచేసుకుంది. చందానగర్ కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలుగు అకాడమీ స్కాంలో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. ఈ రోజు ఒక్క రోజే సీసీఎస్ పోలీసులు అరుగురిని అరెస్టు చేశారు. A1 మస్తాన్ వలీ, A2సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్, A3 సత్యనారాయణ, A4 పద్మావతి, A5 మోహినుద్ధిన్, A6 వెంకట సాయి, A7 నండూరి వెంకట్, A8వెంకటేశ్వరరావు, A9 రమేష్, A10 సాధన ఉన్నారు. ఈ ముఠా గతంలోనూ పలు స్కాంక్‌లకు పాల్పడినట్లు తేల్చారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేసినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. చదవండి: తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మూడు బ్యాంకుల నుంచి కోట్లు డ్రా చేసిన ముఠా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు స్కాంకు పాల్పడినట్టు గుర్తించారు. డిసెంబర్‌కల్లా అకాడమీకి చెందిన 324 కోట్లు కొట్టేయాలని స్కేచ్ వేసినట్లు తెలిపారు. కమిషన్ల ఎర చూపి బ్యాంక్ అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపినట్లు తెలిపారు. సాయి, వెంకట్‌పై గతంలో కేసులున్నాయని పేర్కొన్నారు. మరికాసేపట్లో హైదరాబాద్ కమీషనరేర్లో మీడియా ముందుకు నిందితులను ప్రవేశపెట్టనున్నారు. చదవండి: Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు ఈ స్కామ్‌పై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు గత వారమే నలుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మస్తాన్ వలీతోపాటు ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దీన్‌లను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా మస్తాన్ వలీకి 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. మరో ముగ్గురి కస్టడీ పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
సీసీఎస్ అదుపులో స్కామ్ సూత్రధారులు?
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న రూ.63.47 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కామ్‌లో సూత్రధారులు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు చిక్కినట్లు సమాచారం. మొత్తం నలుగురిలో ఇద్దరిని ఆదివారం అర్ధరాత్రి పట్టుకున్నారని తెలిసింది. మరోపక్క ఈ స్కామ్ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆదివారం అకాడమీ అధికారులతో పాటు కెనరా బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ స్కామ్‌కు సూత్రధారుల్లో ఒకరైన రాజ్‌కుమార్‌కు మరో రెండు మారుపేర్లు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అకాడమీకి చెందిన రూ.కోట్ల చెక్కులను రూపొందించేది అకౌంట్స్ ఆఫీసర్ రమేష్ అయినా.. వాటిని నిర్వహించేది ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రఫీక్ అని తెలిసింది. ఇతడి ద్వారానే యూబీఐ, కెనరా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన మొత్తాలకు సంబంధించిన చెక్కులు, కవరింగ్ లెటర్స్ రాజ్‌కుమార్‌కు చేరాయి. ఇదే అదునుగా భావించిన రాజ్‌కుమార్.. సోమశేఖర్, శ్రీనివాస్‌తో పాటు మరొకరి సాయంతో స్కామ్‌కు ప్లాన్ చేశాడు. అధికారుల నిర్లక్ష్యం... అకాడమీ నిధుల విషయంలో అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా ఉన్నారని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి, అకౌంట్స్ అధికారి రమేష్‌తో పాటు రఫీక్‌ను సీసీఎస్ పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అకాడమీ నిధుల నిర్వహణ విషయంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై ఆరా తీశారు. రఫీక్, రాజ్‌కుమార్ మధ్య ఉన్న సంబంధాలపై దృష్టి పెట్టారు. వీరిలో కొందరికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. గడిచిన నెల రోజుల్లో అకాడమీలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ మొత్తం తమకు అప్పగించాల్సిందిగా పోలీసులు అధికారులను కోరారు. అయితే దాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి అందించామని వాళ్లు వివరణ ఇచ్చారు. దీన్ని పరిశీలిస్తే రాజ్‌కుమార్ అకాడమీకి ఎప్పుడెప్పుడు వచ్చాడు? ఎవరెవరిని కలిశాడు? అనేదానిపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ కేసులో అదనపు ఆధారాలు సేకరించడానికి ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులైన ఏపీ మర్కంటైల్ కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ సత్యనారాయణరావు, మేనేజర్లు పద్మావతి, మెహినుద్దీన్లతో పాటు యూబీఐ బ్యాంకు కార్వాన్ బ్రాంచ్ మాజీ ఛీప్ మేనేజర్ మస్తాన్‌వలీ సాబ్‌ను న్యాయస్థానం అనుమతితో కస్టడీకి తీసుకోవా లని నిర్ణయించి పిటిషన్ దాఖలు చేశారు. -
పక్కా స్కెచ్‌తో బ్యాంక్‌ను బురిడి కొట్టించారు
సాక్షి, హైదరాబాద్: వ్యాపార అవసరాల పేరిట కెనరా బ్యాంక్‌ను బురిడీ కొట్టించారు రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు. రూ.338 కోట్ల రుణం తీసుకుని చెల్లించకుండా ఎగ నామం పెట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది. రాజమహేంద్రవరం వై.జంక్షన్‌కు చెందిన తోట కన్నారావు, అతని భార్య వెంకట రమణ పశ్చిమ గోదావరి జిల్లా ఐ.పంగిడిలో విత్త నాల వ్యాపారం పేరుతో కృష్ణా స్టాకిస్ట్ అండ్ ట్రేడ ర్స్ ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు డైరెక్టర్లుగా ఉంటూ.. వ్యాపార అవసరాల నిమిత్తం వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే కెనరా బ్యాంక్ నుంచి రెండు దఫా లుగా రూ.338 కోట్ల రుణం పొందారు. తర్వాత ఆడిట్ రిపోర్టులు తప్పుగా నమోదు చేసి నష్టాలు వచ్చినట్టు చూపించి రుణం ఎగవేయడానికి ప్రయ త్నించారు. దీనిపై హైదరాబాద్‌లోని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ టి.వీరభద్రారెడ్డి తెలంగాణ సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు గత నెల 30న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు శనివారం రాజమహేంద్రవరం వచ్చినట్టు తెలుస్తోంది. చదవండి: Karimnagar: రూ. 10 కోట్లతో వ్యాపారి అదృశ్యం -
కెనరా రోబెకో వేల్యూ ఫండ్
కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ కొత్తగా వేల్యూ ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్ ప్రకటించింది. ఉండాల్సిన విలువ కన్నా తక్కువ ధరకు ట్రేడవుతున్న నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లకు గణనీయమైన రాబడులు అందించడం ఈ ఫండ్ లక్ష్యం. సముచిత స్థాయిలో పెట్టుబడులకు భద్రత కలిపిస్తూ, రిస్కు భారం తక్కువగా ఉండే స్టాక్స్‌కు ప్రాధాన్యం లభిస్తుందని సేల్స్, మార్కెటింగ్ హెడ్ మోహిత్ భాటియా తెలిపారు. ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఈక్విటీలకు అధిక కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. కెనరా రోబెకో వేల్యూ ఫండ్ ఎన్ఎఫ్వో ఆగస్టు 27న ముగుస్తుంది. తిరిగి క్రయ, విక్రయాలకు సెప్టెంబర్ 6న అందు బాటులోకి వస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌కు బీఎస్ఈ 500 టీఆర్ఐ ప్రామాణికంగా ఉంటుంది. -
కెనరా బ్యాంక్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: పీఎస్‌యూ సంస్థ కెనరా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో స్టాండెలోన్ నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 1,177 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 406 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. మొత్తం ఆదాయం స్వల్పంగా బలపడి రూ. 21,210 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం సైతం నామమాత్ర వృద్ధితో రూ. 6,147 కోట్లయ్యింది. అయితే ఇతర ఆదాయం 67 శాతంపైగా జంప్‌చేసి రూ. 4,438 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.13 శాతం నీరసించి 2.71 శాతంగా నమోదయ్యాయి. ఎన్పీఏలు తగ్గాయ్: క్యూ1లో కెనరా బ్యాంక్ స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 8.84% నుంచి 8.5%కి తగ్గాయి. నికర ఎన్పీఏలు 3.95% నుంచి 3.46%కి వెనకడుగు వేశాయి. మొత్తం ప్రొవిజన్లు 18 శాతం పెరిగి రూ. 4,574 కోట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం పుంజుకుని రూ. 149 వద్ద ముగిసింది. -
ఈ బ్యాంకు కస్లమర్లకు అలర్ట్..!
ముంబై: బ్యాంకుల విలీన ప్రక్రియలో భాగంగా పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్నట్లు 2019 లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకుతో విలీనమైంది. బ్యాంకుల వీలినంతో సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు ఐఎఫ్ఎస్సీ కోడ్లు, చెక్‌బుక్‌లు జూన్ 30 వరకే చెల్లుబాటు కానుంది. జూలై 1 నుంచి సిండికేట్ బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారనున్నాయి. ఈ మార్పును గమనించాలని, వెంటనే చెక్‌బుక్‌లను ఆప్డేట్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సిండికేట్ బ్యాంకు ఖాతాదారులు జరిపే నెఫ్ట్, ఆర్జిజీఎస్, ఐఎంపీఎస్ లావాదేవీలు జరిపేటప్పుడు కచ్చితంగా కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌ను వినియోగించాలని తెలిపింది. పాత ఎమ్ఐసీఆర్, ఐఎఫ్ఎస్సీ లతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ-సిండికేట్ బ్యాంక్ చెక్ బుక్ కూడా జూన్ 30, 2021 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. థర్డ్ పార్టీకి జారి చేసిన ఈ-సిండికేట్ చెక్‌బుక్ లేదా చెక్‌లు జూన్30,2021వ తేది తరువాత చెల్లవు. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని కెనరా బ్యాంకు ఖాతాదారులకు తెలిపింది. చదవండి: క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తోన్న భారతీయులు..! -
గోల్డ్ లోన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్!
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కుటుంబాల పరిస్థితి ఇలా ఉంటే ఇంకా వ్యాపారాల పరిస్థితి మరి దారుణంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా అనేక చిన్న, చిన్న వ్యాపారాల మీద పడింది. అయితే, ఈ ఎమ్ఎస్ఎమ్ఈలకు తాము అండగా ఉంటామని కెనరా బ్యాంక్ భరోసా ఇచ్చింది. మన దేశంలో గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక సాయంగా పరిగణిస్తారు. కెనరా బ్యాంక్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎమ్ఎస్ఎమ్ఈల) కోసం గోల్డ్ లోన్ లను అందిస్తోంది. "కెనరా బ్యాంక్ మా ఖాతాదారులకు ఆకర్షణీయమైన గోల్డ్ లోన్స్ తక్కువ వడ్డీరేట్లతో అత్యవసర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. మీకు ఎల్లప్పుడూ మాతో భద్రతా ఉంటుంది" అని కెనరా బ్యాంక్ ట్వీట్ చేసింది. Canara Bank #GoldLoans provide emergency financial assistance to our customers in exchange for gold with attractive interest rates. With us, you’ll always have a safety net.#CanaraBank pic.twitter.com/Hy4i0REvPt — Canara Bank (@canarabank) June 20, 2021 కెనరా బ్యాంక్ తన ఖాతాదారులకు 7.35 శాతం వడ్డీరేటుకే "గోల్డ్ లోన్"ను అందిస్తోంది. ఈ గోల్డ్ లోన్ అత్యవసర ఆర్థిక అవసరాలకు అనువైనదని పేర్కొంది. తక్కువ వడ్డీ రేటుకు గోల్డ్ లోన్ ను వేగంగా అందిస్తున్నట్లు తెలిపింది. ఏవైనా ఎంక్వైరీల కోసం 1800 425 0018 /1800 103 0018కు కాల్ చేయవచ్చు అని తెలిపింది. మీ లాకర్ లోని బంగారం మీ వ్యాపారానికి గోల్డ్ మైన్ కావచ్చు అని కెనరా బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ఎమ్ఎస్ఎమ్ఈల కొరకు ఓవర్ డ్రాఫ్ట్ లేదా డిమాండ్ లోన్ సదుపాయాన్ని అందిస్తోంది. ఈ లోన్ కింద రూ.లక్ష నుంచి రూ.20 లక్షల వరకు రుణ మొత్తాన్ని అప్పుగా తీసుకోవచ్చని బ్యాంకు తెలిపింది. రేపో రేటుతో ముడిపడి ఉన్న 7.35 శాతం పోటీ వడ్డీ రేటును అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బ్యాంకుకి దేశ వ్యాప్తంగా 10,495 శాఖలు, 13,023 ఎటిఎంలు ఉన్నాయి. Need funds to kickstart your MSME business? Avail “CANARA MSME GOLD LOAN” from Canara Bank, for financial assistance up to 20 lakhs. With us, your business goals can be achieved!#CanaraBank #TogetherWeCan #MSME #BusinessLoans pic.twitter.com/2rpDhRkp5K — Canara Bank (@canarabank) June 18, 2021 చదవండి: పాన్ కార్డులో ఉన్న ఈ సీక్రెట్ కోడ్స్ తెలుసా? -
ఐఎఫ్ఎస్సీ కోడ్లను అప్డేట్ చేసుకోండి
సీండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్లు 1 జూలై 2021 నుంచి నిలిపివేయనున్నట్లు కెనరా బ్యాంక్ తన వినియోగదారులకు తెలియజేసింది. సీండికేట్ బ్యాంక్ వినియోగదారులు తమ బ్యాంక్ బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్లను జూన్ 30లోగా అప్డేట్ చేసుకోవాలని కోరింది. "సీండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌తో విలీనం చేసిన తర్వాత SYNBతో ప్రారంభమయ్యే అన్ని ఈ-సీండికేట్ ఐఎఫ్ఎస్సీ కోడ్లు మార్చారు. అందుకే SYNBతో ప్రారంభమయ్యే అన్ని ఐఎఫ్ఎస్సీ కోడ్లను 01.07.2021 నుంచి నిలిపివేయనున్నట్లు" కెనరా బ్యాంక్ తెలిపింది. "నెఫ్ట్/ ఆర్టీజీఎస్/ఐఎమ్పీఎస్ లావాదేవీల కోసం "CNRB"తో ప్రారంభమయ్యే క్రొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్లను మాత్రమే ఉపయోగించాలని వినియోగదారులకు కోరింది. ఐఎఫ్ఎస్సీ కోడ్లు ఎందుకు మారుస్తున్నారు? మెగా విలీన ప్రక్రియలో భాగంగా10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా మారుస్తున్నట్లు 2019లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ విలీనం ఏప్రిల్ 2020లో అమల్లోకి రాగా ఐఎఫ్ఎస్సీ, ఎమ్ఐసీఆర్ కోడ్లను 2022 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ఏప్రిల్ 1, 2021 నుంచి నవీకరిస్తున్నారు. ఐఎఫ్ఎస్సీ కోడ్ అంటే ఏమిటి? ఐఎఫ్ఎస్సీ(ది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్) అనేది ఒక ప్రత్యేకమైన 11-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎమ్పీఎస్ ద్వారా జరిగే ఆన్లైన్ ఫండ్ లావాదేవీల కోసం ఉపయోగిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో సిండికేట్ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌లో విలీనం చేశారు. 1 ఏప్రిల్ 2019 నుంచి విజయ బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి. అందుకే ఈ ఖాతాదారుల ఐఎఫ్ఎస్సీ, ఎమ్ఐసీఆర్ కోడ్లు మారుతాయి. అయితే, ఈ బ్యాంకులు ఇంకా తన వినియోగదారులకు తెలియజేయలేదు. చదవండి: భారత్ లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్? -
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) 2020 నవంబర్‌లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ)తో కుదుర్చుకున్న వేతన ఒప్పందం ప్రకారం పీఎల్‌ఐలను పంపిణీ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే పనితీరు మెరుగ్గా ఉంటే ఉద్యోగులకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 2021లో కెనరా బ్యాంక్ నికర లాభం రూ.2,557 కోట్లు. దీంతో కెనరా బ్యాంక్ ఈ వారం తన సిబ్బందికి 15 రోజుల జీతం విలువైన పీఎల్ఐ(పనితీరు-ఆధారంగా ప్రోత్సాహకాల)ను చెల్లించింది. బ్యాంకులు మే 18న నాలుగవ త్రైమాసికంలో 1,010.87 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని ఆర్జించాయి. 2020-21 నాలుగో త్రైమాసికంలో 165 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పీఎల్ఐ కింద నగదును తన ఉద్యోగులకు విడుదల చేసింది. అన్ని ర్యాంకులు, హోదాల్లోని ఉద్యోగులకు ఈ పీఎల్ఐలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐలో 2.5 లక్షల మందికి ఈ లాభం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 2 శాతం నుంచి 5 శాతం మధ్య వస్తే వారికి 5 రోజుల వేతనం, 10 నుంచి 15 శాతం వస్తే 10 రోజుల వేతనం, 15 శాతం కంటే ఎక్కువ లాభం వస్తే ప్రోత్సాహకంగా ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా లభిస్తుంది. చదవండి: నాలుగు బ్యాంకులపై జరిమానా విధించిన ఆర్బీఐ Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు -
బ్యాంకులో ఉరివేసుకున్న బ్యాంక్ మేనేజర్
కన్నూర్: కేరళ రాష్ట్రంలోని కన్నూర్ పరిధిలో గల తొక్కిలంగడిలోని కెనరా బ్యాంకులో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా బ్యాంక్ మేనేజర్ తన కార్యాలయంలోనే ఉరి వేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తోక్కిలంగడి కెనరా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్, కె.స్వప్న(38) శుక్రవారం ఉదయం 9 గంటలకు బ్యాంకు కార్యాలయంలో ఉరి వేసుకొని చనిపోయారు. మరొక మహిళా బ్యాంకు ఉద్యోగి ఉదయం 9 గంటలకు పని నిమిత్తం బ్యాంకు కార్యాలయంలోకి వెళ్లగానే మేనేజర్ ఉరివేసుకుని కనిపించడం చూసి బ్యాంకు అలారం నొక్కారు. వెంటనే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు, బ్యాంకు సిబ్బంది కలిసి ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమెను రక్షించలేకపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం కుతుపరంబా తాలూకా ఆసుపత్రికి తరలించారు. కుతుపరంబా ఎసీపీ కెజి సురేష్, ఎస్ఐ కెటి సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని సీసీటివి విజువల్స్ తనిఖీ చేశారు. పోలీసులు స్వప్న డైరీని స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ఆమె పని ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అందులో వ్రాయబడింది. స్వప్నను సెప్టెంబర్ 2020లో తోక్కిలంగడి బ్రాంచ్‌లో పోస్ట్ చేశారు. కన్నూర్‌లోని నిర్మలగిరిలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. త్రిసూర్ జిల్లాలోని మన్నూతి స్వప్న స్వస్థలం. చదవండి: విషాదం: పెళ్లయిన నాలుగు నెలలకే.. -
నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు!
దేశవ్యాప్తంగా రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇందులో రెండు రోజులు(శని, అది) సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా బ్యాంకు సేవలు ఆగిపోనున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 15న రెండు రోజుల సమ్మెను ప్రారంభించాలని 9 బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్‌బియు) 2021 మార్చి 15, 16 తేదీలలో బ్యాంక్ ఉద్యోగుల అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఎ) తమకు తెలిపినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. సమ్మె జరిగే రోజుల్లో బ్యాంకు శాఖలు, కార్యాలయాలు సజావుగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కెనరా బ్యాంక్ తెలిపింది. కేంద్ర 2021 బడ్జెట్ సందర్భంగా మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్బి)ను ప్రైవేటీకరించనున్నట్లు ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. 10 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. చదవండి: 'వరల్డ్ వైడ్ వెబ్’ కోటకు బీటలు గోల్డ్ పెట్టుబడులపై తగ్గని ఆదరణ -
దిల్సుఖ్నగర్ ఏటీఎం లూటీ, మేనేజర్‌కు జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: కెనరా బ్యాంక్ డబ్బులను స్వాహ చేసిన మేనేజర్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ ఆరో అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పునిచ్చింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహాలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం... కెనరా బ్యాంక్ దిల్సుఖ్నగర్ బ్రాంచ్‌లో మేనేజర్‌గా వి.భాస్కర్‌రావు 2007 మార్చి–1 నుంచి మే–31 వరకు పని చేశారు. అదే బ్యాంక్‌లో ఏటీఎం నిర్వహిస్తున్నారు. సదరు ఏటీఎం సైతం మేనేజర్ భాస్కర్‌రావు ఆధీనంలో ఉండేది. అప్పుడు ఏటీఎంలో మూడు నెలలుగా రూ.10,34,500 నగదు తక్కువగా చూపించింది. విషయాన్ని గమనించిన బ్యాంక్ ఉన్నతాధికారులు డిపార్టుమెంటల్ ఎంక్వైరీతో పాటు సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రాంచ్ మేనేజర్ భాస్కర్‌రావు నిధులు నిర్వర్తించే సమయంలో మోసపూరితంగా డబ్బులు స్వాహా చేశారని తేలడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో అభియోగ పత్రాలను నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పునిచ్చారు. -
టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు
సాక్షి, హైదరాబాద్ /పట్నంబజార్/నగరంపాలెం: (గుంటూరు): తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు శుక్రవారం ఉదయం హైదరాబాద్, గుంటూరులోని ఆయన నివాసం, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. గుంటూరు నగరం లక్ష్మీపురంలో ఉన్న ఆయన నివాసంలో ఉ.8 నుంచి మ.2.30 గంటల వరకు ఇవి కొనసాగాయి. ఈ సమయంలో రాయపాటి ఇంట్లోనే ఉన్నారు. పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, పన్నుల ఎగవేతకు సంబంధించిన నోటీసులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం తొమ్మిది మంది అధికార బృందం ఈ సోదాల్లో పాల్గొనగా అందులో ఐదుగురు సీబీఐ అధికారులు కాగా, నలుగురు కెనరా బ్యాంకు అధికారులున్నట్లు తెలిసింది. రాయపాటికి చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ రూ.7,926.01 కోట్లు మోసానికి సంబంధించి పాల్పడిందని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. అసలేం జరిగిందంటే..? తాము చేపట్టబోయే పలు ప్రాజెక్టులకు రుణాలు కావాలని ట్రాన్స్‌టాయ్ కంపెనీ పలు బ్యాంకులను సంప్రదించింది. కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకు కెనరా బ్యాంకు నేతృత్వం వహించింది. అనంతరం.. వీరి నుంచి తీసుకున్న నిధులను తప్పుడు పత్రాలు, నకిలీ బ్యాలెన్స్ షీట్లు, మోసపూరిత స్టేట్మెంట్లు, తప్పుడు లెక్కల పుస్తకాలు, పత్రాలు చూపించి బ్యాంకు నిధులను తప్పుడు మార్గంలో మళ్లించారని.. ఫలితంగా తమకు రూ.7,926.01 కోట్లు నష్టం వాటిల్లినట్లు కెనరా బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది. గతేడాది కూడా ఓ కేసు అలాగే.. వివిధ క్రెడిట్ లిమిట్స్ నుంచి రూ.264 కోట్లను పలు దఫాల్లో వేరే ఖాతాలకు ట్రాన్స్‌టాయ్ మళ్లించిందని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఉద్దేశపూర్వకంగా వేరే ఖాతాలకు మళ్లించారంటూ హైదరాబాద్‌లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు సీబీఐ 2019 డిసెంబరు 30న కేసు నమోదు చేసింది. అందులో చెరుకూరి శ్రీధర్, రాయపాటి సాంబశివరావు, ఇదే కంపెనీకి చెందిన ఇండిపెండెంట్ నాన్–ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, గుర్తుతెలియని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగులనూ ఎఫ్ఐఆర్లో చేర్చింది. నిందితులు వీరే.. ఈ కేసుతో సంబంధమున్న ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి చెందిన కార్యాలయాలు, పలువురు డైరెక్టర్ల ఇళ్లలోనూ ఈ సోదాలు జరిగాయి. ఈ కేసులో ఏ1గా ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్‌ను సీబీఐ పేర్కొంది. ట్రాన్స్ట్రాయ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ రాయపాటి సాంబశివరావు, అడిషనల్ డైరెక్టర్ అక్కినేని సతీష్, గుర్తుతెలియని ప్రభుత్వోద్యోగులను కూడా సీబీఐ నిందితులుగా చూపించింది. -
చనిపోయిన పినతల్లి చెక్కుల ఫోర్జరీ
మదనపల్లె టౌన్: చనిపోయిన పినతల్లి చెక్కులపై సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్న సస్పెండెడ్ మెజిస్ట్రేట్ రామకృష్ణ, ఆయన తనయుడు వంశీకృష్ణను మదనపల్లె టూటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ వివరాలను డీఎస్పీ రవి మనోహరాచారి మీడియాకు వెల్లడించారు. బి.కొత్తకోటకు చెందిన సస్పెండెడ్ మెజిస్ట్రేట్ రామకృష్ణకు పినతల్లి అయిన సుచరిత గతేడాది మరణించారు. అయితే ఆమెకు సంబంధించిన కెనరా బ్యాంక్ చెక్కులను ఫోర్జరీ సంతకాలతో రామకృష్ణ, వంశీకృష్ణలు డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. దీన్ని గుర్తించిన సుచరిత కుటుంబసభ్యులు బి.కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఐ సునీల్ కుమార్ కెనరా బ్యాంక్ మేనేజర్‌ను విచారించగా.. ఫోర్జరీ సంతకాలతో చెక్కులు డ్రా చేసింది వాస్తవమేనని తేలింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం హార్సిలీహిల్స్ వద్ద ఉన్న రామకృష్ణ, వంశీకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం అరెస్టు చేసి.. స్థానిక కోర్టులో హాజరుపరచగా 24 వరకు రిమాండ్ విధించారని డీఎస్పీ తెలిపారు. -
ఏటీఎం చోరికి యత్నించిన దుండగులు
సాక్షి, హైదరాబాద్ : నాచారం చౌరస్తాలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎమ్ కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు చోరికి పాల్పడుతుండగా మిషన్ లో ఉన్న సెన్సార్ ఆధారంగా చోరీ జరుగుతుందని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోగా.. అప్పటికే దొంగలు అక్కడినుంచి పరారయ్యారు. ఏటీఎమ్ లో ఉన్న డబ్బును దొంగిలించడానికి దుండగులు నానా విధాలుగా ప్రయత్నం చేశారు. చోరీ చేసే యత్నంలో ఏటీఎమ్ మిషన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏటీఎం సెంటర్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు. -
కెనరా బ్యాంక్- ఇన్ఫ్రాటెల్.. బోర్లా
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు దీర్ఘకాలంగా వేచిచూస్తున్న ఇండస్ టవర్స్‌తో విలీన అంశం మరోసారి వాయిదా పడటంతో టెలికం రంగ మౌలిక సదుపాయాల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ నష్టాలతో కళ తప్పాయి. వివరాలు చూద్దాం.. కెనరా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం క్యూ4(జనవరి-మార్చి)లో పీఎస్‌యూ కెనరా బ్యాంక్ రూ. 3259 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2108-19) క్యూ4లో రూ. 552 కోట్ల నష్టం మాత్రమే నమోదైంది. పన్నుకు ముందు నష్టం సైతం రూ. 2550 కోట్ల నుంచి రూ. 3335 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) తగ్గడం, ఉద్యోగ వ్యయాలు పెరగడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎన్ఐఐ 9 శాతం తక్కువగా రూ. 3319 కోట్లను తాకింది. ఉద్యోగ వ్యయాలు రెట్టింపై రూ. 2175 కోట్లను తాకగా.. ఇతర ఆదాయం 19 శాతం పుంజుకుని రూ. 2175 కోట్లుగా నమోదైంది. ఫలితాల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కెనరా బ్యాంక్ కౌంటర్ బలహీనపడింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు దాదాపు 5 శాతం పతనమై రూ. 104 వద్ద ట్రేడవుతోంది. బుధవారం సైతం ఈ షేరు 4 శాతం తిరోగమించి రూ. 110 దిగువన స్థిరపడింది. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇండస్ టవర్స్‌తో విలీనానికి ఇంతక్రితం నిర్ణయించిన జూన్ 24 గడువును తాజాగా రెండు నెలలు పొడిగిస్తున్నట్లు భారతీ ఇన్ఫ్రాటెల్ పేర్కొంది. బుధవారం సమావేశమైన బోర్డు ఆగస్ట్ 31వరకూ విలీన గడువును పొడిగించేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. నిజానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇండస్ టవర్స్ విలీన అంశానికి గడువును ఈ 24 వరకూ పొడిగిస్తున్నట్లు ఏప్రిల్ 24న భారతీ ఇన్ఫ్రాటెల్ తెలియజేసింది. టెలికం టవర్ల కంపెనీ ఇండస్ టవర్స్‌లో వొడాఫోన్ ఐడియాకు సైతం 11.15 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం పతనమై రూ. 222 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 218 వరకూ జారింది. కాగా.. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా భారతీ ఇన్ఫ్రాటెల్ షేరుకి అండర్‌వెయిట్ రేటింగ్‌ను ఇచ్చింది. రూ. 175 టార్గెట్ ధరను సైతం ప్రకటించింది. -
కెనరా బ్యాంక్ నష్టం 6 రెట్లు జంప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌కు గత ఆర్థిక సంవత్సరం (2019–20) మార్చి క్వార్టర్లో రూ.3,259 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.552 కోట్ల నికర నష్టాలు వచ్చాయని, 6 రెట్లు పెరిగాయని కెనరా బ్యాంక్ తెలిపింది. ఆదాయం మాత్రం రూ.14,000 కోట్ల నుంచి రూ.14,222 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ► గత క్యూ4లో రూ.5,375 కోట్ల మేర కేటాయింపులు జరిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కేటాయింపులు రూ.5,524 కోట్లు. ► 2018–19లో రూ.347 కోట్ల నికర లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,236 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► గత ఏడాది మార్చి నాటికి 8.83 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 8.21 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 5.37 శాతం నుంచి 4.22 శాతానికి తగ్గాయి. ► విలువ పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.39,224 కోట్ల నుంచి రూ.37,041 కోట్లకు, నికర మొండి బకాయిలు 22,955 కోట్ల నుంచి రూ.18,251 కోట్లకు తగ్గాయి. ► ప్రొవిజన్ కవరేజ్ రేషియో 68.13 శాతం నుంచి 70.97 శాతానికి పెరిగింది. ► ఈ ఏడాది ఏప్రిల్ 1న కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ విలీనమైంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ 4% నష్టంతో రూ.109 వద్ద ముగిసింది. -
అతడిపై కఠిన చర్యలు తీసుకోండి: నిర్మల
న్యూఢిల్లీ : గుజరాత్లో మహిళా బ్యాంక్ ఉద్యోగినిపై దాడి కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కాగా సూరత్‌లోని కెనరా బ్యాంక్(ఒకప్పటి సిండికేట్ బ్యాంక్) మహిళా ఉద్యోగినిపై సోమవారం సాయంత్రం ఓ కానిస్టేబుల్ దాడి చేయడమే కాకుండా బ్యాంకులో నానా హంగామా సృష్టించాడు. ఈ ఘటన అనంతరం ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. ఇలాంటి చర్యల నుంచి బ్యాంకు ఉద్యోగులను రక్షించాలని ఈ లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి బుధవారం మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి పోలీస్ కమిషనర్‌తోపాటు సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి, కేసు విచారణణు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. (కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం) ఈ మేరకు ట్వీట్ చేసిన ఆమె ‘బ్యాంకు ఉద్యోగుల భద్రత ప్రాముఖ్యత. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ బ్యాంకులు తమ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. బ్యాంకుకు చెందిన మహిళ సిబ్బంది దాడి ఘటనపై డాక్టర్ ధవాల్ పటేల్, సూరత్ జిల్లా కలెక్టర్, కమిషనర్ భ్రాంభట్తో మాట్లాడాను. మహిళా బ్యాంక్ ఉద్యోగి ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఈ కేసుపై సకాలంలో చర్యలు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అలాగే నిందితుడు కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేస్తామని పోలీస్ కమిషనర్ భ్రాంభట్ పేర్కొన్నారు’ అని నిర్మలా తెలిపారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. (అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్! ) -
రూ.3,000 కోట్లు సమీకరించిన కెనరా బ్యాంక్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ రూ.3,000 కోట్లు సమీకరించింది. బాసెల్– త్రి బాండ్ల ద్వారా ఈ నిధులు సమీకరించామని కెనరా బ్యాంక్ వెల్లడించింది. ఈ బాండ్లకు కూపన్ (వడ్డీ)రేట్ 7.18 శాతమని, మొత్తం 20 సంస్థలకు ఈ బాండ్లను జారీ చేశామని పేర్కొంది. బాసెల్–త్రి మూలధన నిబంధనలను పాటించడానికి బ్యాంక్‌లు మూలధన ప్రణాళిక ప్రక్రియలను మెరుగుపరచుకోవడమే కాకుండా వాటిని శక్తివంతం చేసుకోవలసి ఉంటుంది. రుణ నాణ్యత సమస్యలను అధిగమించడానికి ఈ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. కాగా 2013, ఏప్రిల్ 1 నుంచి బాసెల్ త్రి ప్రమాణాలు దశలవారీగా అమలవుతున్నాయి. రూ.3,000 కోట్ల మేర నిధులు సమీకరించినప్పటికీ, బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ 4 శాతం నష్టంతో రూ. 117 వద్ద ముగిసింది. -
వడ్డీరేటు తగ్గించిన ఎస్బీఐ, కెనరా బ్యాంక్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శుక్రవారం అన్ని కాలపరిమితులపై రుణరేట్లను స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. కెనరాబ్యాంక్ కూడా ఇదే బాటన పయనించింది. కాగా ద్రవ్య లభ్యత బాగున్న నేపథ్యంలో డిపాజిట్ రేట్లనూ ఎస్బీఐ తగ్గించడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ నిర్ణయాల ప్రకటన మరుసటి రోజు బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు వర్తించే ఏడాది కాల వ్యవధి రుణ రేటు ప్రస్తుత 7.90 శాతం నుంచి 7.85 శాతానికి తగ్గింది. ► రూ.2 కోట్లకన్నా తక్కువ ఉన్న రిటైల్ టర్మ్ డిపాజిట్‌పై వడ్డీరేటు అలాగే రూ.2 కోట్ల పైబడిన బల్క్ టర్మ్ డిపాజిట్ రేటును బ్యాంక్ సవరించింది. రిటైల్ విభాగంలో డిపాజిట్ రేటు 10–50 బేసిస్ పాయింట్లు తగ్గగా, బల్క్ సెగ్మెంట్లో 25–50 బేసిస్ పాయింట్లు తగ్గింది. ► తగ్గించిన రేట్లు ఫిబ్రవరి 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. కెనరాబ్యాంక్ 25 బేసిస్ పాయింట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల కాలానికి ఎంసీఎల్ఆర్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఏడాది కాలానికి ఈ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఫిబ్రవరి 7 నుంచీ తాజా రేటు అమల్లోకి వచ్చింది. బ్యాంకింగ్‌కు ఈనెలలోనే 50,000 కోట్లు! బ్యాంకింగ్ వ్యవస్థలో మరిన్ని నిధులు లభ్యమయ్యే కీలక చర్యలకు ఆర్బీఐ శ్రీకారం చుడుతోంది. ఫిబ్రవరి 17, 24 తేదీల్లో రూ.50,000 కోట్ల రీపర్చేజింగ్ ఆపరేషన్స్ (రెపో) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సంబంధిత 2 రోజుల్లో రూ.25,000 చొప్పున రెపో ఆపరేషన్స్‌ను ఆర్బీఐ నిర్వహించనుంది. అయితే 17న మూడేళ్ల కాలవ్యవధి రెపో ఆపరేషన్‌కాగా, 24వ తేదీ రెపో ఆపరేషన్ ఏడాది కాల వ్యవధికి ఉద్ధేశించినది. దీనివల్ల బ్యాంకింగ్‌కు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయి. వడ్డీరే ట్లు మరింత తగ్గడానికి ఈ చర్యలు వీలుకల్పిస్తాయి. -
కెనరా బ్యాంక్‌కు తగ్గిన మొండి బకాయిలు
ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) మూడో త్రైమాసిక కాలంలో రూ.330 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో లాభం, రూ.318 కోట్లుతో పోల్చితే 4% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం రూ.13,513 కోట్లతో నుంచి రూ.14,002 కోట్లకు పెరిగింది. బ్యాంక్ మొండి బకాయిలు తగ్గాయి. గత క్యూ3లో 6.37 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 5.05 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 10.25% నుంచి 8.26 శాతానికి చేరాయి. గత క్యూ3లో రూ.1,977 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ3లో రూ.1,803 కోట్లకు తగ్గాయి. -
కెనరాబ్యాంక్, బీఓబీ, బీఓఐలకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), కెనరాబ్యాంక్‌లకు కొత్త ఎండీ అండ్ సీఈఓలు నియమితులయ్యారు. నియామకపు వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది. బీఓబీ: సంజయ్ చంద్ర ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం సంజయ్ చంద్ర బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీఎస్ జయకుమార్ స్థానంలో సంజయ్ చంద్ర నియామకం జరిగింది. బీఓఐ: బ్యాంక్ ఎండీ సీఈఓగా అతనూ కుమార్ దాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం దాస్ ఇదే బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ కుర్చీ గత ఏడాది జూలై నుంచీ భర్తీకాలేదు. కెనరా బ్యాంక్: లింగమ్ వెంకట్ ప్రభాకర్ ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రభాకర్ పీఎన్బీలో ఈడీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ నెలాఖరున రిటైర్ కానున్న ఆర్ఏ శంకర్ నారాయణన్ స్థానంలో బాధ్యతలు చేపడతారు. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త సీఈఓలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కొత్తగా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను (ఎండీ–సీఈఓ) బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బీబీబీ) బుధవారం సిఫారసు చేసింది. ఈ మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులకూ వరుసగా సంజీవ్ చద్దా, ఎల్.వి.ప్రభాకర్, అతనూ కుమార్ దాస్ పేర్లను సూచించింది. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూల్లో వీరి పేర్లను ఖరారు చేశామని, ప్రతిభ ఆధారంగా తుది జాబితాను రూపొందించామని వెల్లడించింది. చద్దా ప్రస్తుతం ఎస్బీఐ కాపిటల్ మార్కెట్స్ ఎండీ – సీఈఓగా ఉండగా.. ప్రభాకర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈడీగా, దాస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీగా ఉన్నారు. ఇక రిజర్వ్ జాబితాలో.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఎండీ–సీఈఓగా ఎ.ఎస్.రాజీవ్, కరూర్ వైశ్య బ్యాంక్‌కు పీ ఆర్ శేషాద్రి పేర్లను ప్రకటించింది. -
ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ
ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్ డ్రాయల్స్ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు ఆథెంటికేషన్ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుంది’’ అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే. -
ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్ రుణరేట్ల తగ్గింపు
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజా 35 బేసిస్ పాయింట్ల రెపో కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.40) నేపథ్యంలో తమ రుణాలపై వడ్డీరేటు తగ్గిస్తున్న బ్యాంకుల వరుసలో తాజాగా ఆంధ్రాబ్యాంక్, కెనరా బ్యాంక్‌లు చేరాయి. పావుశాతం వరకూ ఆంధ్రా బ్యాంక్: ఓవర్‌నైట్, నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది రేట్లను ఆంధ్రాబ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. దీనితో బెంచ్‌మార్క్ ఎంసీఎల్ఆర్ 8.20 శాతం నుంచి 7.95 శాతానికి దిగింది. కెనరా బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు కట్: అన్ని కాలపరిమితుల రుణ రేటు 10 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గింది. ఆగస్టు 7వ తేదీ నుంచీ తగ్గిన రుణ రేటు (ఎంసీఎల్ఆర్– నిధుల సమీకరణ వ్యయ ఆధారిత–ఎంసీఎల్ఆర్) అమల్లోకి వస్తుందని తెలిపింది. గడచిన ఆరు నెలల కాలంలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 20 బేసిస్ పాయింట్లు తగ్గింది. ఈ కాల వ్యవధిలో ఏడాది ఎంసీఎల్ఆర్ 8.70 నుంచి 8.50 శాతానికి తగ్గింది. -
నిధి రాత
-
గుప్తనిధుల వేటకు వెళ్లిన కెనరా బ్యాంక్ ఉద్యోగి మృతి
సాక్షి, ఒంగోలు: వారు ముగ్గురు స్నేహితులు. వీరికి సులువుగా డబ్బు సంపాదించుకోవాలనే ఆశ కలిగింది. గుప్తనిధుల వేటలో పడ్డారు. అందుకు అవసరమైన సామగ్రితో పాటు మంచినీరు, ఆహారం, మజ్జిగ తీసుకుని బయల్దేరారు. ఇంకే ముంది ఎవరు చెప్పారో ఏమో ముగ్గురు కలిసి తర్లుపాడు మండలం తాడివారిపల్లె సమీపంలోని వెలిగొండ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. గత ఆదివారం రాత్రి అడవిలోకి వెళ్లిన వీరు తిరిగి వచ్చేందుకు రహదారి కనుగొనలేక ముగ్గురూ మూడు దారుల్లో వెళ్లారు. ఒకరు దాహార్తికి తట్టుకోలేక మృత్యువాత పడగా మరొకరు చెట్టు, పుట్టను పట్టుకుని రోడ్డుకెక్కారు. ఇంకొకరి కోసం పోలీసులు అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు.. గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన కృష్ణనాయక్, హనుమంత నాయక్, హైదరాబాద్‌లో కెనరా బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న కట్టా శివకుమార్‌లు తాడివారిపల్లె వెలిగొండ అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఒక రాత్రంతా అడవిలోనే గడిపారు. తిరిగి రెండో రోజు కూడా కొండ నుంచి కిందకు దిగేందుకు బయల్దేరారు. వీరిలో కృష్ణానాయక్ మాత్రమే సోమవారం మధ్యాహ్నానికి తీవ్ర దాహంతో కర్నూలు–ఒంగోలు రోడ్డుకు చేరుకున్నాడు. సమీపంలోని గుడి వద్దకు వెళ్లి దాహం తీర్చుకున్నాడు. మరో ఇద్దరు అటవీ ప్రాంతాన్ని దాటలేకపోయారు. బయటకు వచ్చిన కృష్ణానాయక్ అదృశ్యమైన హనుమంతనాయక్, శివకుమార్ బంధువులకు చెప్పాడు. అటవీ ప్రాంతానికి చేరుకున్న శివకుమార్ బంధువులతో పాటు కృష్ణానాయక్ మంగళవారం, బుధవారం అదృశ్యమైన ఇద్దరి కోసం తీవ్రంగా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తాడివారిపల్లె పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పొదిలి సీఐ చిన్న మీరా సాహెబ్ నేతృత్వంలో 15 మంది ప్రత్యేక బలగాలు, పోలీసులు, ఫారెస్ట్ ఉద్యోగి నాగరాజు గాలించేందుకు అడవిలోకి వెళ్లారు. ఉదయం 8 నుంచి తీవ్రంగా శ్రమించగా ఒంటి గంట ప్రాంతంలో శివకుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మరో వ్యక్తి కోసం ఇంకా అడవిలోనే గాలిస్తున్నారు. తాగేందుకు నీరు లేకపోవడంతోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఐదు బ్యాంకులపై రూ. 10 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్– ఆర్బీఐ ఐదు బ్యాంకులపై రూ.10 కోట్ల జరిమానా విధించింది. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. నోస్ట్రో ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంవల్ల ఆర్బీఐ అలహాబాద్ బ్యాంక్‌పై జరిమానా విధించింది. ఒక బ్యాంక్ వేరే బ్యాంక్‌లో విదేశీ కరెన్సీలో నిర్వహించే ఖాతాను నోస్ట్రో ఖాతాగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ మెసేజింగ్ సాఫ్ట్వేర్..స్విఫ్ట్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలకుగాను ఈ రెండు బ్యాంక్‌లపై ఆర్బీఐ చెరో కోటి రూపాయలు జరిమానా విధించింది. -
కెనరా బ్యాంక్ లాభం రెండు రెట్లు అప్...
న్యూఢిల్లీ: మొండిబాకీలకు కేటాయింపులు తగ్గడంతో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రెండు రెట్లు ఎగిసి రూ.318 కోట్లకు చేరింది. 2017 అక్టోబర్–డిసెంబర్ కాలంలో బ్యాంక్ లాభం రూ.126 కోట్లు. మరోవైపు, తాజా క్యూ3 లో కెనరా బ్యాంక్ ఆదాయం రూ. 12,341 కోట్ల నుంచి రూ. 13,513 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 10.38 శాతం నుంచి 10.25%కి, నికర ఎన్పీఏలు 6.78% నుంచి 6.37%కి తగ్గాయి. అటు మొండిబాకీలకు కేటాయింపులు రూ. 2,674 కోట్ల నుంచి రూ. 1,977 కోట్లకు తగ్గాయి. జనవరి 21న ప్రారంభించిన ఎంప్లాయీ స్టాక్ పర్చేజ్ స్కీమ్(ఈఎస్‌పీఎస్) 25తో ముగిసిందని, 134% ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యిందని బ్యాంకు పేర్కొంది. ఈ స్కీమ్ కింద తొలి విడతలో రూ. 557 కోట్లు సమీకరిస్తున్నట్లు వివరించింది. సోమవారం కెనరా బ్యాంక్ షేరు 5 శాతం క్షీణించి రూ. 240.30 వద్ద క్లోజయ్యింది. -
కెనరా బ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం
సాక్షి, వెల్దుర్తి(తూప్రాన్): మాసాయిపేట కెనరాబ్యాంక్‌లో చోరీకి విఫలయత్నం జరిగింది. వెల్దుర్తి సెంట్రల్‌బ్యాంక్‌లో చోరీకి ప్రయత్నించిన ఘటన మరువకముందే మళ్లీ దుండగులు మరో బ్యాంకులో చోరీకియత్నించారు. గ్యాస్‌కట్టర్ సహాయంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అప్రమత్తతతో దుండగులు పరారయ్యారు. బ్యాంక్‌లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ కెనరాబ్యాంక్‌లో దుండగులు చొరబడి బంగారు నగలతో పాటు లాకర్లలోని నగదు ఎత్తుకెళ్లండంతో, చోరీ ప్రయత్నం ఘటన తెలుసుకున్న ఖాతాదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. చివరికి లోనికి ప్రవేశించకుండానే దుండగులు పరారయ్యారని తెలుసుకుని ఇళ్లల్లోకి వెళ్లిపోయారు. సంఘటనకు సంబంధించిన వివరాలను చేగుంట ఎస్సై సత్యనారాయణ, బ్యాంక్ మేనేజర్ వినితాకృష్ణ వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2గంటల 30నిమిషాల సమయంలో బ్యాంక్‌లో అలారం మోగింది. దీంతో అక్కడే కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు గణేష్ అప్రమత్తమై బ్యాంకు చుట్టూ కలియతిరిగాడు. ఈ క్రమంలో బ్యాంక్ వెనుక భాగంలో ఇద్దరు దుండగులు కిటికీ గ్రిల్స్ గ్యాస్‌కట్టర్‌తో తొలగించి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. సెక్యూరిటీ గట్టిగా అరుపులు చేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించడంతో దుండగులు గ్యాస్ సిలిండర్లను అక్కడే వదిలి పరారయ్యారు. సెక్యూరిటీ గార్డు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, బ్యాంక్‌మేనేజర్ బ్యాంక్‌లో పరిశీలించి ఎలాంటి అపహరణ జరగలేదన్నారు. బ్యాంక్ వద్ద ప్రత్యేక సెక్యూరిటీ గార్డును ఉంచడంతో పాటు బ్యాంకులో రక్షణ చర్యలు తీసుకున్నట్లు బ్యాంక్ మేనేజర్ వినితాకృష్ణ తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందవద్దన్నారు. -
కెనరా బ్యాంక్‌లో చోరికి దుండగుల యత్నం
-
బీమా చెల్లించకుండా నష్టం కలిగించారు
సాక్షి, హైదరాబాద్: సకాలంలో బీమా చెల్లించకుండా ఓ ఖాతాదారుడికి నష్టం కలిగించడమే కాకుండా, తప్పు తమది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసిన కెనరా బ్యాంకు తీరును రాష్ట్ర వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. వ్యాపారం కోసం ఖాతాదారుడు రుణం తీసుకున్నప్పుడు, రుణ ఒప్పందం ప్రకారం బీమా చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుదేనని తేల్చి చెప్పింది. సకాలంలో బీమా మొత్తం చెల్లించకపోవడం వల్ల ఆ ఖాతాదారుడికి కలిగే నష్టాన్ని భరించాల్సింది బ్యాంకేనంది. సకాలంలో బీమా చెల్లించకపోవడం వల్ల వైఎన్ ప్రెస్‌కు జరిగిన ఆస్తినష్టానికి బాధ్యత వహించాల్సిందేనని కెనరా బ్యాంకును వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అతనికి రూ.7 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో చెల్లించాలని బ్యాంకుకు స్పష్టం చేసింది. ఖర్చుల కింద రూ.10వేలను చెల్లించాలంది. ఈ మేరకు ఫోరం అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్, సభ్యులు కె.రమేశ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఖమ్మం జిల్లాకు చెందిన వై.శేఖర్ వైఎన్ ప్రెస్ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. వ్యాపార టర్నోవర్ బాగుండటంతో ఖమ్మంలోని కెనరా బ్యాంకు శేఖర్ ప్రెస్‌కు 2010లో రూ. 20 లక్షల రుణం ఇచ్చింది. ఒప్పందం మేరకు ప్రెస్ స్టాక్‌కు బ్యాంకే బీమా చెల్లించాలి. దీని ప్రకారం 2013 వరకు బీమా చెల్లించింది. 2014 నుంచి చెల్లించలేదు. పాలసీ రెన్యువల్ చేసుకోవాలని బీమా కంపెనీ నోటీసు పంపినా కెనరా బ్యాంకు పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా 2015లో వైఎన్ ప్రెస్‌లో విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగింది. దీంతో శేఖర్ పరి హారం కోసం బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోగా, తమకు బ్యాంకు ప్రీమియం చెల్లించలేదని బీమా కంపెనీ తెలిపింది. దీంతో శేఖర్ కెనరా బ్యాంకుపై రాష్ట్ర వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీనిపై జస్టిస్ జైశ్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కెనరా బ్యాంకు వాదనను తోసిపుచ్చింది. బీమా కంపెనీ చూపిన రుజువులూ పరిశీలించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరిస్తూ కెనరా బ్యాంకు వాదనను తప్పుపట్టింది. తన తప్పును బీమా కంపెనీపై నెడుతోందంటూ ఆక్షేపించింది. ఇది పూర్తిగా బ్యాంకు బాధ్యతారాహిత్యమే కాక, సేవలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని తేల్చింది. దీని వల్ల వైఎన్ ప్రెస్‌కు జరిగిన నష్టానికి కెనరా బ్యాంకే బాధ్యత వహించాలంది. వైఎన్ ప్రెస్ రూ.43 లక్షల మేర నష్టం వాటిల్లిందని సర్వేయర్ నివేదిక చెబుతోందని, పోలీసులు రూ.6.8 లక్షల మేరే నష్టమని చెబుతున్నారని తెలిపింది. అందువల్ల వైఎన్ ప్రెస్‌కు రూ.7 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో సహా చెల్లించాలని కెనరా బ్యాంకును ఆదేశించింది. అలాగే ఖర్చుల కింద మరో రూ.10వేలు ఇవ్వాలంది. -
కెనరా బ్యాంక్ లాభం రూ.300 కోట్లు
బెంగళూరు: కెనరా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 15 శాతం పెరిగి రూ.300 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కెనరా బ్యాంక్ తెలియజేసింది. ఆదాయం 6 శాతం పెరిగి రూ.12,679 కోట్లకు చేరుకుంది. రుణాలు 14 శాతం వృద్ధి చెందాయని, గత క్యూ2లో 11.05 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 10.56 శాతానికి తగ్గాయని బ్యాంకు పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు 6.91 శాతం నుంచి 6.54 శాతానికి తగ్గాయని వివరించింది. సిండికేట్ బ్యాంక్ నష్టాలు రూ.1,543 కోట్లు ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్‌కు రెండో త్రైమాసికంలో రూ.1,543 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత క్యూ2లో రూ.105 కోట్ల నికర లాభం వచ్చిందని సిండికేట్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు బాగా పెరగడంతో ఈ స్థాయి నష్టాలు వచ్చాయని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,419 కోట్ల నుంచి రూ.5,889 కోట్లకు తగ్గింది. గత క్యూ2లో 9.39 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు 12.98 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 5.76 శాతం నుంచి 6.83 శాతానికి పెరిగాయి. -
కెనరా బ్యాంక్ లాభం 12 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం సుమారు 12 శాతం పెరిగింది. రూ. 281 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో ఇది రూ. 252 కోట్లు. ఇక తాజాగా తొలి త్రైమాసికంలో ఆదాయం రూ. 12,304 కోట్ల నుంచి రూ. 13,192 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ. 10,196 కోట్ల నుంచి రూ. 11,360 కోట్లకు చేరినట్లు కెనరా బ్యాంక్ వెల్లడించింది. మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 10.56 శాతం నుంచి 11.05 శాతానికి పెరిగాయి. అయితే, నికర నిరర్ధక ఆస్తులు మాత్రం 7.09 శాతం నుంచి 6.91 శాతానికి తగ్గాయి. విలువపరంగా చూస్తే స్థూల ఎన్పీఏలు రూ. 44,660 కోట్లుగాను, నికర ఎన్పీఏలు రూ. 26,694 కోట్లుగాను ఉన్నాయి. మొండిబాకీలకు ప్రొవిజనింగ్ రూ. 2,270 కోట్ల నుంచి రూ. 2,466 కోట్లకు పెరిగింది. మొత్తం మీద కేటాయింపులు రూ. 2,582 కోట్లుగా ఉన్నాయి. బుధవారం బీఎస్ఈలో కెనరా బ్యాంకు షేరు 1.78 శాతం పెరిగి రూ. 257.60 వద్ద క్లోజయ్యింది. -
బ్యాంకులో అక్రమాల బాగోతం
సంస్థాన్ నారాయణపురం : మండలంలోని పుట్ట పాక కెనరా బ్యాంకులో అక్రమాల బాగోతం బట్ట బయలైంది. గ్రామంలో 2011లో ప్రారంభమైన బ్యాంకులో ఇక్కడ మేనేజర్‌గా పనిచేసిన చంద్రకళ రూ.86 లక్షల అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. వివరాల ప్రకారం.. చంద్రకళ పుట్టపాకలో మేనేజర్‌గా 15–07–2013న బాధ్యతలు చేపట్టి, 24–01–2017 వరకు పని చేశారు. ఆ కాలంలో సుమారు 1100 మందికి కొత్త ఖాతాలు ఇచ్చారు. అందులో 67 ఖాతాలును ఆమే సృష్టించారు. అవసరమైన ద్రువీకరణ పత్రాలను హైదరాబాద్‌కు చెందిన సురేష్ సాయంతో తయారు చేయిం చారు. సురేష్ కొంతమంది కార్డులు, ఫొటోలు, చిరునామాలు, ఇతర వివరాలుతో సంబంధం లేకుండా పుట్టపాక చిరునామాలు సృష్టించి, ఐడెంటి కార్డులు తయారు చేశారు. ఆ ఐడెంటితో సబంధంలేని వ్యక్తులకు ఆమె ఖాతాలు ఇచ్చింది. వారికి రూ.4లక్షల నుంచి రూ.94 వేల వరకు రుణాలు ఇచ్చింది. 67 ఖాతాలకు రూ.75లక్షల 87వేలు రుణాలు మంజూరు చేసింది. ఇందులో ఎక్కువగా చేనేత కార్మికుల రుణాలు కాగా, కొన్ని ఇతర రుణాలు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా పి.భద్యాకు కారు రుణంగా రూ.4లక్షలు, కిరణ్‌కుమార్‌కు రూ.2లక్షలు, ఫిరజ్ఖాన్కు రూ.96 వేలు, నారాయణకు రూ.94 వేలు.. ఇలా రూ.75 లక్షల 87వేల వరకు రుణాలు మంజురు చేసింది. ఈ ఖాతాలకు సబంధించిన ఏటీఎంలు, చెక్కుబుక్లను ఇచ్చి.. మేనేజర్ చంద్రకళ కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాడావల్సిన రూ.10,83,682 లను కూడా వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. మొత్తం రూ.86,70,682 కాజేసింది. అప్పట్లో రుణాలు రికవరీ చేయాలని అధికారులు ఒత్తిడి చేయడంతో రూ.11లక్షలు రికవరీ చేసినట్లుగా ఆమే చెలించింది. మేనేజర్ మారడంలో వెలుగులోకి.. అమె బదిలీపై వెళ్లడంతో కొత్తగా వచ్చిన మేనేజర్లు రుణాల రికవరీకి వెళ్లినప్పుడు రుణాల పొందిన వ్యక్తులు పుట్టపాకలో లేకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో బ్యాంకు ఉన్నతాధికారులు ఇతర బ్యాంకులకు చెందిన ఇద్దరు బ్రాంచి మేనేజర్లు, అప్పటి బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ బ్యాంకు పరంగా విచారించి.. కాజేసిన మొత్తాన్ని గుర్తించారు. ఈ మేరకు మేనేజర్ శ్రీనివాస్ 17 జనవరి 2018న సంస్థాన్ నారాయణపురం పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ చేసి సెక్షన్ 402, 406, 468, 471 కింద కేసు నమెదు చేశారు. కేసు విషయంలో.. సీఐపై వేటు.. ఈ కేసు విచారణ చేపట్టాల్సిందిగా మార్చిలో నూతనంగా చౌటుప్పల్ రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన ఆకుల సతీష్‌కు ఇచ్చారు. కేసు విచా రించిన అయన ఈ నెల 20న చంద్రకళ, సహకరించిన సురేష్‌ను రిమాండ్ చేయాల్సి ఉండగా.. సురేష్‌ను మాత్రమే రిమాండ్ చేశారు సీఐ సతీష్ తన నుంచి లంచం డిమాండ్ చేస్తున్నాడని ఇటీవ ల మేనేజర్ చంద్రకళ రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసింది. కేసు విచారించిన సీపీ సీఐపై సస్పెన్షన్ వే టు వేశారు. దీంతో ఆమె అక్రమాలు బయటకొ చ్చాయి. ఈ విషయమై ప్రస్తుత బ్యాంకు మేనేజర్ సంజయ్‌కుమార్‌ను వివరణ కోరాగా.. తాను రెం డు రోజుల క్రితమే మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టానని.. నాకు ఏమీ తెలియదని సమాధానం చెప్పారు. రుణమాఫీ అవుతుందనే.. చేనేత రుణాలు మాఫీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటనతో.. అక్రమ రుణాల మంజూరీకి బీజం పడిందిని పలువురు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. మేనేజర్‌గా చంద్రకళ లేని వ్యక్తులకు ఇచ్చిన రుణాలు అన్ని చేనేత రుణాలు ఉన్నాయి. చేనేత రుణాలు మాఫీ అయితే.. కాజేసిన మొత్తానికి ఇబ్బందులు ఉండవనే ఆమె పెద్ద పన్నాగం పన్నిట్లుగా అనుమానలు వ్యక్తమవుతున్నాయి. చౌటుప్పల్ రూరల్ సీఐ సస్పెన్షన్ చౌటుప్పల్ : చౌటుప్పల్ రూరల్ సీఐ ఆకుల సతీష్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో సీసీఎస్ సీఐగా పనిచేస్తున్న ఆయన మార్చి 25న బదిలీపై ఇక్కడికి వచ్చారు. స్థానిక బంగారిగడ్డ కాలనీలో గురుకుల పాఠశాల పక్కన ఇటీవల సీఐ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలోని కెనరా బ్యాంకులో జరిగిన అవినీతికి సంబంధించి బ్యాంకు మేనేజర్ వద్ద లంచం డిమాండ్ చేసినట్లు తేలింది. అందులో భాగంగా ముందుగా కొంత నగదు సైతం తీసుకున్నాడు. మిగతా డబ్బు కోసం వేధిస్తుండగా మేనేజర్ చంద్రకళ వారం క్రితం రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ముందుగా హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఉన్న హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేశారు. విచారణలో వాస్తవమేనని తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు బ్యాంకు మేనేజర్ వద్దపెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడంతో పాటు తన కార్యాలయానికి వచ్చిన ఆమెపై సీఐ దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ మేరకు గురువారం రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ విలేకరులతో మాట్లాడుతూ తన వద్ద లంచం డిమాండ్ చేసినట్లు బ్యాంకు మేనేజర్ చంద్రకళ తమకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. విచారణ నిర్వహించగా వాస్తవమని తేలడంతో సస్పెండ్ చేశామన్నారు. ప్రస్తుతం శాఖా పరమైన విచారణ చేపట్టాల్సి ఉందన్నారు. -
కెనరా బ్యాంకుకు భారీ జరిమానా
భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటైన కెనరా బ్యాంకుకు యూకే రెగ్యులేటరీ భారీ షాక్ ఇచ్చింది. యాంటీ మనీలాండరింగ్ నిబంధనలను పాటించని కారణంగా బ్యాంకుకు చెందిన లండన్ బ్రాంచ్‌లో యూకే ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటర్(ఎఫ్సీఏ) 896,100 పౌండ్లు (సుమారు రూ.8 కోట్లు) జరిమానా విధించింది. అంతేకాదు దాదాపు 5 నెలలు డిపాజిట్లను స్వీకరించకుండా నిలిపివేసింది. కొత్త ఖాతాదారుల నుండి 147 రోజులు పాటు డిపాజిట్లను నిషేధించింది. కెనరా బ్యాంక్ నవంబర్ 26, 2012, జనవరి 29, 2016 మధ్యకాలంలో ప్రిన్సిపల్ 3 (యాజమాన్యం అండ్ కంట్రోల్) ఉల్లంఘించిన కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు ఎఫ్సీఏ తన నోటీసులో తెలిపింది. అంతేకాదు ఎఫ్సీఏ విచారణను ప్రారంభ దశలోనే సెటిల్ చేసుకునేందుకు అంగీకరించినందున పెనాల్టీని 30 శాతం తగ్గించినట్టు తెలిపింది. లేదంటే పెనాల్టీ 1280175పౌండ్లు( సుమారు రూ.11కోట్లు) గాను, డిపాజిట్లను స్వీకరణపై నిషేధం 210 రోజులుగానూ ఉండేది. -
కెనరా బ్యాంక్ నష్టం 4,860 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నష్టాలు గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో భారీగా పెరిగాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016–17) క్యూ4లో రూ.214 కోట్ల నికర లాభం వచ్చిందని, అయితే గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.4,860 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కెనరా బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు దాదాపు మూడు రెట్లు పెరిగాయని పేర్కొంది. ఈ కేటాయింపులు రూ.2,924 కోట్ల నుంచి 200 శాతం వృద్ధితో రూ.8,763 కోట్లకు చేరాయని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.12,889 కోట్ల నుంచి రూ.11,555 కోట్లకు తగ్గిందని వివరించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,122 కోట్ల నికర లాభం రాగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.4,222 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కెనరా బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.48,942 కోట్ల నుంచి రూ.48,195 కోట్లకు తగ్గిందని పేర్కొంది. తగ్గిన రుణ నాణ్యత.. బ్యాంక్ రుణ నాణ్యత తగ్గింది. గత ఏడాది మార్చినాటికి రూ.34,202 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి రూ.47,468 కోట్లకు పెరిగాయని కెనరా బ్యాంక్ పేర్కొంది. నికర మొండి బకాయిలు రూ.21,649 కోట్ల నుంచి రూ.28,542 కోట్లకు పెరిగాయని వివరించింది. శాతం పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు 9.63 శాతం నుంచి 11.84 శాతానికి, నికర మొండి బకాయిలు 6.33 శాతం నుంచి 7.48 శాతానికి పెరిగాయని వివరించింది. మొండి బకాయిల విషయంలో తమ అంచనాలకు, ఆర్బీఐ మదింపునకు తేడా రూ.3,249 కోట్లుగా ఉందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.34,202 కోట్లుగా మొండి బకాయిలు ఉండగలవని తాము నివేదించామని, ఆర్బీఐ మాత్రం రూ.37,451 కోట్ల మొండి బకాయిలు ఉండొచ్చని మదింపు చేసిందని వివరించింది. నికర మొండి బకాయిల విషయంలో తమకు, ఆర్బీఐ మదింపునకు తేడా రూ.1,847 కోట్లని తెలిపింది. రూ.21,649 కోట్ల నికర మొండి బకాయిలు ఉండొచ్చని నివేదించామని, ఆర్బీఐ మదింపు రూ.23,496 కోట్లని పేర్కొంది. ఫలితంగా రూ.1,401 కోట్ల కేటాయింపులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేర్ 0.9 శాతం నష్టపోయి రూ.246 వద్ద ముగిసింది. -
మరో బ్యాంక్ ఫ్రాడ్: మాజీ సీఎండీపై చార్జిషీటు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ప్రభుత్వ రంగబ్యాంకు, ముఖ్యమైన వాణిజ్య బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు మరోసారి వార్తల్లో నిలిచింది. బ్యాంకు మాజీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఇతర డైరెక్టర్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది. మోసం, ఫోర్జరీ ఆరోపణలతో ఈ చర్యకు దిగింది. 2013లో రూ68కోట్ల రుణాలను అక్రమంగా మంజూరు చేసినట్టుగా టిఎస్ హజారీలో ప్రత్యేక సిబిఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేర్కొంది. కెనరా బ్యాంకు సీఎండీ ఆర్.కె. దుబే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లపై అవినీతి నిరోధక చట్టంలోని నేర కుట్ర, మోసం, ఫోర్జరీ, నిబంధనల ఆరోపణలు నమోదు చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అశోక్ కుమార్ గుప్తా వీఎస్ కృష్ణ కుమార్‌తోపాటు అకేషన్ సిల్వర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపైనా, కంపెనీ ఇద్దరు డైరెక్టర్లు కపిల్ గుప్తా, రాజ్ కుమార్ గుప్తా పేర్లను కూడా చార్జ్‌షీట్‌లో చేర్చింది. కాగా ఈ స్కాంకు సంబంధించి 2016, జనవరిలో సీబీఐ కేసులు నమోదు చేసింది. వెండి ఆభరణాలు, ఆర్టికల్స్, డైమండ్, బంగారు ఆభరణాలు, ఇమిటేషన్ జ్యూయలరీ ఆభరణాలు, టపాకాయల వస్తువులు తదితర అంశాలపై రీటైల్ వ్యాపారం చేసే అకేషన్ సిల్వర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాంకును మోసం చేసిందన్న ఆరోపణలపై ఈ నమోదు చేసింది. న్యూఢిల్లీ శాఖలోని కమలా నగర్లో బ్రాంచ్ వ ఖాతాల ద్వారా సుమారు రూ.68.38 కోట్లు చెల్లించిందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు. -
మరో స్కాం: రూ.515కోట్లకు ముంచేశారు
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రోజుకో స్కాం వెలుగు చూస్తోంది. ఇటీవలే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విక్రమ్ కొఠారీల కుంభకోణాలు మరవక ముందే తాజాగా కెనరా బ్యాంక్‌ను భారీగా టోకరా ఇచ్చిన వైనం వార్తల్లోనిలిచింది. రూ.515 కోట్ల స్కాం ఆరోపణలతో సీబీఐ కేసులు నమోదు చేసింది. కోలకత్తాకు చెందిన ఆర్ పి ఇన్ఫోసిస్టం కంపెనీ,దాని డైరెక్టర్లపై రూ.515.15 కోట్ల విలువైన మోసపూరిత లావాదేవీల ఫిర్యాదుతో సీబీఐ ఈ చర్యకు పూనుకుంది. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. సంస్థ కార్యాలయం సహా ఆరుచోట్ల బుధవారం సోదాలు నిర్వహించింది. ఫిబ్రవరి 26న కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్ డివి ప్రసాద్ రావు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో శివాజీ పాంజా, కస్తూవ్ కౌస్తువ్ రే, వినయ్ బాఫ్నా, దేవ్నాత్ పాల్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) కెనరా బ్యాంక్‌ను, బ్యాంక్ ఆఫ్ కన్సార్టియంను రూ .515.15 కోట్ల మోసి చేసినట్టు పేర్కొన్నారు. కోల్‌కతా కేంద్రంగా ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్ను ఏర్పాటు చేసిన శిబాజీ పంజా (పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు) నకిలీ పత్రాలతో వందల కోట్ల రూపాయల రుణాన్ని పొందాడు. లేని నిల్వలు ఉన్నట్టు హామీగా చూపడం, డాక్యుమెంట్ల ఫోర్జరీ, ఇతర కంపెనీల నుంచి పైసా కూడా బకాయిలు అందాల్సి లేకపోయినా, డాక్యుమెంట్ల ఫోర్జరీ ద్వారా బకాయిలు రావలసి ఉందని చూపించడం, నిజంగానే కొద్ది మొత్తం రావలసి ఉన్నా ఫోర్జరీ ద్వారా దాన్ని అధికంగా చూపించడం ద్వారా పంజా, అతడి సహచరులు కెనరా బ్యాంక్ నాయకత్వంలోని 9 బ్యాంకులను రూ.515కోట్లు ముంచినట్టు సీబీఐ కేస్ నమోదు చేసింది. శిబాజీ పంజాకు కొంతమంది కెనరా బ్యాంక్ అధికారులు కూడా సహకరించినట్టు, వారిపై కూడా కేసులు నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. -
రూ.515 కోట్ల కుచ్చుటోపి
కోల్‌కతా: పీఎన్బీ, రొటోమ్యాక్ కుంభకోణాలపై చర్చ జరుగుతుండగానే కోల్‌కతాలో మరో బ్యాంకు అవినీతి బట్టబయలైంది. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీకి గతంలో సన్నిహితంగా ఉన్న ఓ వ్యాపారవేత్తకు చెందిన ఆర్పీ ఇన్ఫో సిస్టమ్స్ సంస్థ కారణంగా కెనరా బ్యాంకుతోపాటు మరో తొమ్మిది బ్యాంకులకు రూ.515 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. సంస్థ కార్యాలయం సహా ఆరుచోట్ల బుధవారం సోదాలు నిర్వహించింది. ఆర్పీ ఇన్ఫో సిస్టమ్స్ డైరెక్టర్లైన శివాజీ పంజా, కౌస్తవ్ చటర్జీ, వినయ్ బాఫ్నా, ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ దేవ్నాత్ పాల్ సహా.. పలువురు బ్యాంకు అధికారుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. 2012–13లో రూ.515 కోట్ల మోసం జరిగిందంటూ కెనరాతోపాటు తొమ్మిది బ్యాంకుల కన్సార్షియం సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా రంగంలోకి దిగిన సీబీఐ.. బాధ్యులపై మోసం, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, అధికారులతో అమర్యాదకరంగా వ్యవహరించారంటూ కేసు నమోదు చేసింది. ఇందులో శివాజీ పంజా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి సన్నిహితుడు. 2015లోనే వెలుగులోకి తొలి మోసం ఈ సంస్థ ‘చిరాగ్’ పేరుతో దేశవ్యాప్తంగా డెస్క్‌టాప్స్, ల్యాప్టాప్స్ తయారీ, వ్యాపారం, కంప్యూటర్ల సర్వీసింగ్, నెట్వర్కింగ్ ఇంటిగ్రేషన్తోపాటుగా హార్డ్‌వేర్ ఉత్పత్తులను అమ్మేది. బ్యాంకుల కన్సార్షియానికి తప్పుడు డాక్యుమెంట్లను ఇచ్చి రుణాలు పొందిన ఆర్పీ ఇన్ఫో సిస్టమ్స్.. ఆ తర్వాత రుణాలు చెల్లించటంలో విఫలమైంది. దీంతో సరైన రుణాలు చెల్లించక ఎన్పీఏ ముద్రవేసుకుంది. 2015లోనే ఐడీబీఐ బ్యాంకును రూ. 180 కోట్లకు మోసం చేసిన కేసులో సీబీఐ ఈ సంస్థపై కేసు నమోదు చేసింది. ఫిర్యాదు చేసిన బ్యాంకుల కన్సార్షియంలో ఎస్బీఐ, ఎస్బీఐలో విలీనం అయిన రెండు బ్యాంకులు, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లున్నాయి. విచారణకు రాను: నీరవ్ పీఎన్బీ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు నీరవ్ మోదీ నిరాకరించారు. వ్యాపార కారణాల రీత్యా విచారణకు హాజరు కాలేనని వెల్లడించారు. ఏ దేశంలో ఉన్నా అక్కడున్న భారత దౌత్యకార్యాలయాన్ని సంప్రదించాలని.. అక్కడి అధికారులే భారత్ వచ్చేందుకు వాళ్లు ఏర్పాటుచేస్తారని నీరవ్ మోదీకి రాసిన లేఖలో పేర్కొంది. కేసులో దోషిగా ఉన్నవారెవరైనా పిలిచినప్పుడు విచారణకు రావాల్సిందేనని హెచ్చరించింది. వచ్చేవారం కేసు విచారణకు హాజరవ్వాలని తెలిపింది. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా పీఎన్బీ ఇంటర్నల్ చీఫ్ ఆడిటర్ ఎంకే శర్మను సీబీఐ అరెస్టు చేసింది. కుంభకోణానికి కేంద్రమైన పీఎన్బీ బ్రాడీహౌజ్ శాఖలో ఆడిటింగ్ వ్యవహారాలకు ఈయనే బాధ్యుడు. -
చిల్లర కోసం వచ్చి..
చిట్యాల (నకిరేకల్) : రూ.20వేల చిల్లర కోసం వచ్చిన ఓ వ్యక్తి.. క్యాషియర్ పొరపాటున ఇచ్చిన రూ.2లక్షల నగదును తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన స్థానిక కెనరా బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బ్యాంకుకు వచ్చిన శుక్రవారం మధ్యాహ్నం ఓ యువకుడు నూతనంగా విడుదలైన నోట్లు కావాలని తన వద్ద ఉన్న పది రెండు వేల రూపాయల నోట్లను క్యాషియర్‌కు ఇచ్చాడు. వాటికి చిల్లరగా క్యాషియర్ రూ.20 నోట్లనుకుని క్యాషియర్ పొరపాటును రూ.200 బెండల్ను సదరు యువకుడికి ఇచ్చాడు. యువకుడు ఇచ్చిన రూ.20వేలుపోను.. రూ.లక్షా 80 వేల తీసుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం బ్యాంకు లావాదేవీల జమ, ఖర్చుల్లో భారీ తేడాలు రావడంతో.. బ్యాంకు అధికారులు సీసీ పుటేజీలను పరిశీలించారు. పసువు రంగు చొక్కా వేసుకుని, మెడలో నల్లటి బ్యాగుతో వచ్చిన గడ్డంతో ఉన్న యువకుడు క్యాషియర్ కిష్టయ్య పొరపాటున ఇచ్చిన నగదును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ మొత్తం క్యాష్ పోవటంతో బ్యాంకు సిబ్బంది తీవ్ర ఆందోళన ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. -
కెనరా బ్యాంక్‌కు కేటాయింపుల భారం
ముంబై: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 27 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.357 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.260 కోట్లకు తగ్గినట్లు కెనరా బ్యాంక్ తెలిపింది. ఆదాయం తగ్గడం, కేటాయింపులు అధికంగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.12,187 కోట్ల నుంచి రూ.11,995 కోట్లకు తగ్గింది. స్థూల మొండి బకాయిలు 9.81 శాతం నుంచి 10.51 శాతానికి, నికర మొండి బకాయిలు 6.69 శాతం నుంచి 7.02 శాతానికి పెరిగాయి. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే స్థూల మొండి బకాయిలు ఆదే స్థాయిలో ఉండగా, నికర మొండి బకాయిలు తగ్గాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.1,558 కోట్ల నుంచి రూ.1,950 కోట్లకు పెరిగాయని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.2,783 కోట్లకు పెరిగింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ 5 శాతం తగ్గి రూ.404 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.250, గరిష్ట స్థాయి రూ.463గా ఉన్నాయి. -
కెనరా బ్యాంక్‌లో ఘరానా మోసం
-
బ్యాంకులో చోరీకి యత్నం
తాడిపత్రి టౌన్: పట్టణంలోని కెనరాబ్యాంకులో గురువారం దొంగలు చోరీకి యత్నించారు. బ్యాంకు వినియోగదారులు ,బ్యాంకు మేనేజర్ వారిని గుర్తించడంతో దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే దొరికిన ఒక దొంగకు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసుస్టేషన్లో అప్పగించినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని ఆర్అండ్బి సమీపంలోని కెనరా బ్యాంకు గురువారం ఉదయం వినియోగదారులతో రద్దీగా ఉంది. అదే సమయంలో కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన వెంకటేసు, శివ అనే దొంగలు బ్యాంకులో చోరీ యత్నానికి వచ్చారు. బ్యాంకులో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని బ్యాంకు మేనేజర్ ఓబుళరెడ్డితో పాటు కొందరు వినియోగదారులు ప్రశ్నించడంతో వారు పారిపోయేందుకు యత్నించారు. అయితే వెంకటేసు అనే దొంగ దొరకగా మరో దొంగ పారిపోయాడు. వెంకటేసుకు బ్యాంకు ఖాతాదారులు దేహశుద్ధి చేసి పట్టణ పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు వెంకటేసును విచారిస్తున్నారు. -
బ్యాంకుల విలీనమే.. మందు!!
♦ అసెట్ క్వాలిటీ కష్టాలకు చెక్ ♦ ప్రభుత్వ రంగంలో పటిష్టమైన బ్యాంకుల ఆవిర్భావం ♦ ప్రతికూలతల కన్నా ప్రయోజనాలే అధికం ♦ అనువుగా పీఎన్బీ, కెనరా తదితర బ్యాంకులు సాక్షి, బిజినెస్ విభాగం : ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) విలీన ప్రక్రియలను వేగవంతం చేస్తూ కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు బ్యాంకింగ్ రంగంలో చర్చనీయమవుతున్నాయి. ఓ వైపు సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలతో తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ... మరోవైపు కేంద్రం మాత్రం విలీనాల దిశగా చర్యలు తీసుకుంటూనే ఉంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర కూడా వేసింది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణిస్తూ... విలీనానికి వాణిజ్యపరమైన ప్రయోజనాలే ప్రాతిపదికగా ఉంటాయని, ఆయా బ్యాంకుల బోర్డులే మెర్జర్ల ప్రతిపాదనలను ముందుకు తేవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బ్యాంకు ఉద్యోగుల సంఘాలు పీఎస్‌బీల విలీనాలను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. చిన్న స్థాయిలోనే మిగిలిపోతున్న పలు పీఎస్బీలకు విలీనాలు ప్రయోజనకరమే అంటున్నారు విశ్లేషకులు. నిధుల సమీకరణ వ్యయాలు తక్కువ స్థాయిలో ఉంచుకుంటూ.. లాభదాయకంగా ఉంటే భారీ, పటిష్ట బ్యాంకుల ఏర్పాటే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని వారు చెబుతున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ సమస్యల గురించి అందరికీ తెలిసినవే కాబట్టి... ప్రత్యామ్నాయ యంత్రాంగం (ఏఎం) ఏర్పాటు ప్రకటన సమయం గురించి పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రాతిపదికలు ఇవే కావొచ్చు.. అనలిస్టుల అభిప్రాయం ప్రకారం ప్రాంతీయంగా ఆయా పీఎస్‌బీలకి ఉన్న పట్టు.. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి, ఆదాయాల వృద్ధి తదితర అంశాలే విలీనాలకు ప్రాతిపదిక కావచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ మొదలైనవి విలీనాలకు శ్రీకారం పలికే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బ్యాంకులకు తమ తమ ప్రాంతాల్లో గట్టి పట్టు ఉండటం.. విలీన ప్రతిపాదనకు ఊతమిస్తోంది. గడిచిన ఆరు నెలలు, ఏడాది కాలంలో ఏదో ఒక సందర్భంలో విలీనాలకు తాము అనుకూలమేనని ప్రకటించడమే కాక రైట్స్ ఇష్యూ తదితర మార్గాల్లో సొంతంగా వనరులు సమకూర్చుకునే సామర్థ్యాన్ని కూడా ఇవి చాటుకున్నాయి. విలీన ప్రక్రియపై కొంత మేర అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కూడా బరిలో ఉండగలదని అంచనా. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మెర్జర్‌కి అనువైన బ్యాంకులుగానే కనిపిస్తున్నప్పటికీ.. విలీనాలకు సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మరింత మూలధనం అవసరం అవుతుందని ఓ బ్రోకరేజి సంస్థకు చెందిన ఈక్విటీస్ విభాగం హెడ్ చెప్పారు. ఇక ఇండియన్ బ్యాంక్ మెరుగ్గానే ఉన్నప్పటికీ.. విలీనాల బరిలో దూకేంత పెద్ద బ్యాంకు కాదని పేర్కొన్నారు. ప్రధాన కారణాలు ఏంటంటే... విలీనాలకు ప్రధానంగా రెండు కారణాలు చూపుతున్నారు. కరెంటు అకౌంటు, సేవింగ్ అకౌంటు (కాసా) నిష్పత్తి తక్కువగా ఉండటం ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రధానమైన బలం. కాసా డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు 34% వాటా ఉంటే.. ప్రైవేట్ బ్యాంకులకు 30% ఉంది. ఇక బ్యాంకుల్లో జరిగే డిపాజిట్లలో సుమారు 70% వాటా పీఎస్‌బీలదే. ఇప్పుడిప్పుడే ప్రైవేట్ బ్యాంకులు పుంజుకుంటున్నప్పటికీ.. పీఎస్‌బీల్లోకి వచ్చి పడే డిపాజిట్ల పరిమాణం భారీగానే ఉంటోంది. గతేడాది పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇది మరోసారి సుస్పష్టంగా కనిపించింది. పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు కోతతో.. డిపాజిట్లు తరలిపోకుండా తమ దగ్గరే అట్టే పెట్టుకోవడానికి కూడా పీఎస్బీలకు విలీనాలు తప్పనిసరిగా మారుతోంది. రుణాలకు డిమాండ్ పుంజుకున్న పక్షంలో తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఇది చాలా కీలకం. చాలా బ్యాంకులకు ఎస్బీఐ, పీఎన్బీ వంటి అగ్రశ్రేణి బ్యాంకుల స్థాయి లేకపోవడంతో భారీ కార్పొరేట్ రుణాలు వంటి వాటి విషయంలో అవి చిన్నా, చితకా బ్యాంకులుగానే కొనసాగాల్సి వస్తోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నా విలీనాలే ఉత్తమ మార్గంగా పరిశీలకులు చెబుతున్నారు. -
అంతా బాగున్నా.. అప్రమత్తత అవసరమే!
నా వయస్సు 50 సంవత్సరాలు. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. పన్ను ఆదా, లేదా పన్ను రాయితీ తదితర ప్రయోజనాలు నాకు అవసరం లేదు. నేను పదేళ్ల పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి. నాకు కెనరా బ్యాంక్, ఎస్బీఐల్లో ఖాతాలున్నాయి. నా బ్యాంక్ ఖాతాల నుంచే నేను మ్యూచువల్ ఫండ్స్‌ను కొనుగోలు చేయాలా ? –గంగాధర్, విజయవాడ మీరు ఏదైనా ఒక బ్యాంక్ ఖాతా నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ ఉంటే చాలు. నో యువర్ కస్టమర్(కేవైసీ) ప్రక్రియ పూర్తి చేయడానికి ఇవి అవసరం. ఏదైనా మ్యూచువల్ ఫండ్ సంస్థ, ఒకసారి మీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసినట్లయితే, ఇతర సంస్థల ఫండ్స్‌లోనూ మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. ఒకటి లేదా రెండేళ్లలో మ్యూచువల్ ఫండ్స్‌పై తగినంత అవగాహన వచ్చిన తర్వాత ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి హెచ్డీఎఫ్సీ, టాటా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, కెనరా రొబెకొ సంస్థల బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో సొమ్ములున్నప్పటికీ, ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా, వాటిని సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఒక క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో ఏడాది క్రితం నేను రూ.3 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు నాకు అత్యవసరంగా కొంత సొమ్ము అవసరమైంది. ఈ క్లోజ్డ్ ఎండ్ ఫండ్ నుంచి నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉందా ? –మాధురి, విశాఖపట్టణం క్లోజ్డ్ ఎండ్ మ్యూచువల్ ఫండ్‌లో మెచ్యూరిటీ తేదీలోపు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకునే అవకాశం లేదు. అయితే మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరే లిస్టయి ట్రేడవుతుంటాయి. ఇలా మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను మీరు స్టాక్ మార్కెట్ ద్వారా విక్రయించుకోవచ్చు. ఈ తరహా ఫండ్స్‌లో ట్రేడింగ్ లావాదేవీలు చాలా స్వల్పంగా ఉంటాయి. ఈ మార్గంలో మీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించుకోవడం కొంచెం కష్టమైన పనే. ఈ యూనిట్లను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే ట్రేడర్లు చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ ఉన్నా, ఈ ఫండ్స్.. ఎన్ఏవీ(నెట్ అసెట్ వేల్యూ) కంటే తక్కువగానే ట్రేడవుతాయి. ఫండ్స్ అసలు విలువ కంటే తక్కువకే మీరు అమ్ముకోవలసి రావచ్చు. మీకు కావలసిన సొమ్ముల కోసం స్నేహితులు, బంధువుల వద్ద ప్రయత్నించండి. లేదా మీరు ఈక్విటీ, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈ యూనిట్లు తనఖాగా కొన్ని బ్యాంక్‌లు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి రుణం పొందవచ్చు. రుణ మొత్తం, కాలపరిమితి ఆధారంగా వడ్డీరేట్లు 10–12 శాతం రేంజ్లో ఉంటాయి. మీ యూనిట్ల విలువలో 70 శాతం వరకూ రుణం వచ్చే అవకాశం ఉంటుంది. రుణ చెల్లింపుల్లో విఫలమైతే, ఆ సంస్థ, తనఖా ఉంచుకున్న ఫండ్ యూనిట్లను విక్రయించుకొని, ఏవైనా మిగిలితే రుణ గ్రహీతకు ఇస్తుంది. నేను గత కొంతకాలంగా నాలుగు బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌కు సంబంధించి చాలా సానుకూలాంశాలు చోటు చేసుకుంటున్నాయి. స్టాక్ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. అమెరికా, ఇతర విదేశీ మార్కెట్లు బాగా ఉన్నాయి. వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. చమురు ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విధానాలు మెరుగవుతున్నాయి. ఇన్ని సానుకూలాంశాల నేపథ్యంలో సాధారణ ఇన్వెస్టర్ ఎలా వ్యవహరించాలి ? –సురేందర్, హైదరాబాద్ స్టాక్ మార్కెట్‌కు సంబంధించి పలు సానుకూలాంశాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇప్పుడు కొంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్టాక్ మార్కెట్లోకి నిధుల ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ ఉంది. కానీ ఆ స్థాయిలో కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగుపడటం లేదు. కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగుపడకుండా మార్కెట్ పెరుగుతుండటమంటే.. మార్కెట్ ఖరీదవుతుందని(అధిక వేల్యుయేషన్) అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఫండ్ మేనేజర్లు జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. మీరు నాలుగు బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారని పేర్కొన్నారు. సాధారణంగా బ్యాలన్స్డ్ ఫండ్స్ తమ మొత్తం నిధుల్లో 30–35 శాతం వరకూ డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మార్కెట్ పెరుగుతున్నప్పుడు బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఫండ్ మేనేజర్లు లాభాల స్వీకరణ చేస్తారు. అందుకని నష్టభయం(రిస్క్) తగ్గించుకునే ఫండ్స్‌గా బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను పరిగణిస్తారు. ఇక సాధారణ ఇన్వెస్టర్లు నష్టభయాన్ని తగ్గించుకోవడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది.. భవిష్యత్తులో వచ్చే ఒడిదుడుకులకు సిద్ధపడి, మీ ఇన్వెస్ట్మెంట్ కాలాన్ని పెంచుకోవడం, ఇక రెండోది మీ మొత్తం మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు బ్యాలన్స్డ్ ఫండ్స్‌లోనే ఉన్నట్లయితే, కొంత ఇన్వెస్ట్‌మెంట్‌ను డెట్ ఫండ్స్‌లోకి మళ్లించండి. ఒకేసారి ఇలా కాకుండా దశలవారీగా ఈ మళ్లింపు ప్రక్రియను చేపట్టిండి. కంపెనీల ఆర్థిక ఫలితాలు మెరుగుపడితే మార్కెట్ ఎంతోకాలం ఖరీదైనదిగా ఉండదు. -
కెనరా బ్యాంక్ లాభం 10% అప్
♦ క్యూ1లో రూ.252 కోట్లు ♦ తగ్గిన వడ్డీ ఆదాయం ♦ 7.09 శాతానికి నికర ఎన్పీఏలు న్యూఢిల్లీ: వడ్డీ ఆదాయం తగ్గుదలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభ వృద్ధి 10 శాతానికి పరిమితమైంది. సుమారు రూ. 252 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో బ్యాంకు లాభం దాదాపు రూ. 229 కోట్లు. ఇక తాజాగా ఆదాయం రూ. 11,786 కోట్ల నుంచి రూ. 12,304 కోట్లకు పెరిగింది. మరోవైపు గత క్యూ1లో నమోదైన రూ. 10,202 కోట్లతో పోలిస్తే వడ్డీ ఆదాయం ఈసారి రూ. 10,196 కోట్లకు తగ్గింది. అటు మొత్తం రుణాల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) పరిమాణం 9.71 శాతం నుంచి 10.56 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు 6.69 శాతం నుంచి 7.09 శాతానికి చేరాయి. ఫలితంగా మొండిబకాయిలకు చేయాల్సిన ప్రొవిజనింగ్ కూడా పెరిగి రూ. 1,469 కోట్ల నుంచి రూ. 2,270 కోట్లకు ఎగిసింది. బుధవారం బీఎస్ఈలో కెనరా బ్యాంకు షేరు ధర 0.58 శాతం పెరిగి రూ. 371 వద్ద ముగిసింది. -
కెనరాబ్యాంక్‌కు ముళ్లకంప!
- రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ - సీపీఎం, రైతు సంఘం నాయకుల ఆందోళన రాప్తాడు : రైతుల పంట రుణాలు రీషెడ్యూల్ చేసి, అసలు వడ్డీ లేకుండా రుణాలు రెన్యూవల్ చేసి, ఖరీఫ్ సాగుకు కొత్త రుణాలను ఇవ్వాలనే డిమాండ్‌తో సీపీఎం, ఏపీ రైతు సంఘం నాయకులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నా అధికారుల్లో స్పందన లేకపోవడంతో బుధవారం పలు గ్రామాల రైతులతో కలిసి కెనరా బ్యాంక్‌కు ముళ్ల కంప కొట్టి ధర్నా చేశారు. ఉదయం 9 గంటలకే బ్యాంకు ముందు ధర్నా చేస్తుండటంతో బ్యాంకు అధికారులు వచ్చి చేసేదేం లేక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం రాప్తాడు డివిజన్ కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ పదేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పంటలు పొలాల్లోనే ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం రైతుల దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని, కరువును దృష్టిలో ఉంచుకుని రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసి, అసలు, వడ్డీ లేకుండా రైతుల రుణాలను రెన్యూవల్ చేయలన్నారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ధరణిబాబు సిబ్బందితో వచ్చి సీపీఎం ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఎం రాప్తాడు డివిజన్ కార్యదర్శి రామాంజినేయులు, కదిరప్ప, పోతులయ్య, బి.చంద్రశేఖర్‌రెడ్డిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఒకదశలో వారిని ఈడ్చుకుంటూ స్టేషన్ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డికి గాయమైంది. అనంతరం నాయకుల్ని సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. దిగొచ్చిన అధికారులు : సీపీఎం, రైతు సంఘం నాయకులు చేసిన ధర్నాకు స్పందించిన కెనరాబ్యాంకు చీఫ్ మేనేజర్ తిరుపతయ్య స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అక్కడ ఎస్ఐ ధరణిబాబు, బ్యాంక్ సిబ్బంది, సీపీఎం, రైతు నాయకులతో సంప్రదించారు. రేపటి నుంచి బ్యాంక్‌లో రైతుల రుణాలను అసలు, వడ్డీ లేకుండా రెన్యూవల్ చేస్తామని హామీ ఇచ్చారు. -
కెనరా బ్యాంక్ లాభం రూ. 214 కోట్లు
► 57% తగ్గిన ఎన్పీఏ కేటాయింపులు ► ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్ బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.214 కోట్ల నికర లాభం సాధించింది. మొండి బకాయిలకు కేటాయింపులు బాగా తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం సాధించామని కెనరా బ్యాంక్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.3,905 కోట్ల నికర నష్టాలు వచ్చాయని కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ రాకేశ్ శర్మ చెప్పారు. మొండి బకాయిలకు కేటాయింపులు 57 శాతం తగ్గి రూ.2,708 కోట్లకు తగ్గాయని వివరించారు. మొత్తం ఆదాయం రూ.12,116 కోట్ల నుంచి రూ.12,889 కోట్లకు పెరగిందని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,708 కోట్లు నికర వడ్డీ ఆదాయం14 శాతం వృద్ధితో రూ.2,708 కోట్లకు పెరిగిందని రాకేశ్ శర్మ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో రూ.1,981 కోట్లుగా ఉన్న నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో రూ.2,937 కోట్లకు పెరిగిందని వివరించారు. ఏ క్వార్టర్లోనూ ఈ స్థాయి నిర్వహణ లాభం రాలేదని పేర్కొన్నారు. నికర వడ్డీ మార్జిన్ కూడా 2.19 శాతం నుంచి 2.24 శాతానికి పెరిగిందని వివరించారు. 2015–16 ఆర్థిక సంవత్సరం క్యూ4లో 9.4 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 9.63 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. నికర మొండి బకాయిలు 6.42 శాతం నుంచి 6.33 శాతానికి తగ్గాయని వివరించారు. ఇక 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.2,813 కోట్ల నికర నష్టాలు రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,122 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు. -
కెనరా బ్యాంక్ నికర లాభం రూ.214కోట్లు
ముంబై: కెనరా బ్యాంక్ క్యూ4 ఫలితాలు సోమవారం ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.214.2 కోట్ల నికరలాభాన్నినమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.48,942 కోట్లుగా ఉంది. , గత ఏడాది ఇదే కాలంలో రూ .3,905.49 కోట్లు నష్టపోయింది. గ్రాస్ ఎన్‌పిఏలు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో 9.97 నుంచి 9.63శాతానికి తగ్గాయ్. ఇక క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో 6.72 నుంచి 6.33శాతానికి తగ్గాయ్. నికర ప్రొవిజన్లు రూ.2708కోట్లుగా నమోదవ్వగా, నికర ఎన్‌పిఏలు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్‌లో రూ.34202కోట్లుగా నిలిచాయ. ఇవి గత ఏడాదిలో రూ.34338.7కోట్లుగా ఉన్నాయి. ఇక క్వార్టర్ బేసిస్‌లో చూస్తే నికర ఎన్‌పిఏలు రూ.21649కోట్లుగా నమోదు అవగా..గతేడాది ఇదే సమయానికి అవి రూ.22295కోట్లుగా ఉన్నాయి. మరోవైపు రిజల్ట్స్ ఇచ్చిన ఉత్సాహంతో కెనరా బ్యాంక్ ఇంట్రాడేలో దాదాపు 3శాతం లాభాలను ఆర్జించింది. -
కెన్ ఫిన్ హోమ్స్‌లో 13.5% వాటా విక్రయించిన కెనరా బ్యాంక్
డీల్ విలువ రూ.759 కోట్లు ముంబై: ప్రభుత్వ రంగ కంపెనీ కెనరా బ్యాంక్, తన అనుబంద సంస్థ, కెన్ ఫిన్ హోమ్స్‌లో 13.45 శాతం వాటాను విక్రయించింది. సింగపూర్ జీఐసీకి ఈ వాటాను రూ.758.8 కోట్లకు విక్రయించామని కెనరా బ్యాంక్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ఒక్కో షేర్‌ను రూ.2,105 చొప్పున మొత్తం 35,80,849 షేర్లను జిఐసీ సింగపూర్ అనుబంధ సంస్థ కలాడియమ్ ఇన్వెస్ట్మెంట్(సింగపూర్ సావరిన్ హెల్త్ఫం డ్)కు అమ్మేశామని పేర్కొంది. ఈ ధర గురువారం కెన్ ఫిన్ హోమ్స్ ముగింపు ధరకు 9 శాతం అధికమని జేఎమ్ ఫైనాన్షియల్ తెలిపింది. ఈ వాటా విక్రయంలో కెనరా బ్యాంక్‌కు సలహాదారుగా ఈ సంస్థే వ్యవహరించింది. ఈ వాటా విక్రయ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కెన్‌ఫిన్ హోమ్స్ షేర్ 2.1%లాభపడి రూ.1,978 వద్ద ముగిసింది. గతేడాది డిసెంబర్ నాటికి కెన్ ఫిన్ హోమ్స్‌లో కెనరా బ్యాంక్‌కు 44.1% వాటా ఉంది. కాగా స్టాక్ మార్కెట్లో లిస్ట్‌కాని అనుబంధ కంపెనీ కెనరా ఫ్యాక్టర్స్‌లో వాటా విక్రయం నిమిత్తం మర్చంట్ బ్యాంకర్లను నియమించామని గత నెలలోనే కెనరా బ్యాంక్ వెల్లడించిది. -
కెనరా బ్యాంక్ లాభం మూడింతలు
మొండి బకాయిలు రెట్టింపు న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. మొండి బకాయిలు రెట్టింపైనప్పటికీ, ఈ స్థాయి నికర లాభం సాధించామని కెనరా బ్యాంక్ తెలిపింది. గత క్యూ3లో రూ.85 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.322 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.12,051 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.12,079 కోట్లకు చేరిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 5.84 శాతం నుంచి 9.97శాతానికి, నికర మొండి బకాయిలు 2.42 శాతం నుంచి 6.72 శాతానికి పెరిగాయని పేర్కొంది. గత క్యూ3లో రూ.19,813 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో రూ.34,339 కోట్లకు పెరిగాయని తెలిపింది. మొత్తం కేటాయింపులు (ఆదాయపు పన్ను మినహా) రూ.1,429 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.1,485 కోట్లకు చేరాయని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలానికి రూ. 908 కోట్ల నికర లాభం సాధించామని, గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన నికర లాభం(రూ.1,093 కోట్లు)తో పోల్చితే 17% క్షీణత నమోదైందని తెలిపింది. ఇక మొత్తం ఆదాయం రూ.36,781 కోట్ల నుంచి రూ.36,053 కోట్లకు తగ్గిందని కెనరా బ్యాంక్ పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు ధర 5% దిగజారి రూ.273 వద్ద ముగిసింది. -
సీఏలు వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలి
- నగదు రహితమే మేలు - జనవరి 1 తర్వాత అద్భుత ఫలితాలు - సీఏల సదస్సులో కెనరా బ్యాంక్ చైర్మన్ మనోహరన్ యూనివర్సిటీ క్యాంపస్: దేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ)లు తమ వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని కెనరా బ్యాంక్ చైర్మన్ టీఎన్ మనోహరన్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో మంగళవారం సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్(ఎస్‌ఐఆర్‌సీ) 48వ వార్షిక సదస్సును మనోహరన్ ప్రారంభిం చారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సును ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌం టెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తిరుపతి బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మనోహరన్ మాట్లాడుతూ సీఏలు నిరంతరం తమను తాము అప్డేట్ చేసు కోవాలని, రోజురోజుకు వస్తున్న కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాని సూచించారు. అప్పుడే వృత్తిలో రాణించగలరన్నారు. సీఏ కోర్సులను ఎంచుకొనే విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టి చదివినప్పుడే కోర్సు పూర్తి చేయగలరన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక సంస్కరణలు, పెద్దనోట్ల రద్దువల్ల దేశానికి మేలు కలుగుతుందన్నారు. పెద్దనోట్ల రద్దు ఫలితంగా సమస్యలు రావటం, సామాన్యులకు ఇబ్బందులున్నప్ప టికీ డిసెంబర్ 30 తర్వాత దీని ఫలితాలు తెలుస్తాయన్నారు. ఐసీఏఐ చైర్మన్ దేవరాజా రెడ్డి మాట్లాడుతూ రూ.500, 1000 నోట్ల రద్దుతో ఉగ్రవాద సంస్థల వద్ద ఉన్న కరెన్సీ ఏమాత్రం ఉపయోగపడకుండా పోతుంద న్నారు. జనవరి నుంచి నూతన సిలబస్ సీఏ కోర్సు చదివే విద్యార్థులకు జనవరి నుంచి కొత్త సిలబస్ అమలవుతుందని దేవరాజారెడ్డి అన్నారు. నూతన సిలబస్‌ను కార్పొరేట్ ఫైనాన్స మంత్రిత్వశాఖ ఆమోదం కోసం పంపామన్నారు. భవిష్యత్‌లో సీఏ సిలబస్ కఠినతరంగా ఉంటుందన్నారు. ఎస్‌ఐఆర్‌సీ చైర్మన్ ఫల్గుణకుమార్ మాట్లాడుతూ నగదురహితం వల్ల నల్లధనం బయటకు వస్తుందన్నారు. -
విరివిగా రుణాలు ఇవ్వండి
– కెనరా బ్యాంకు అధికారులతో ఎంపీ బుట్టా రేణుక కర్నూలు (ఓల్డ్‌సిటీ): వివిధ పథకాల ద్వారా ప్రజలకు విరివిగా రుణాలు అందించాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కెనరా బ్యాంకు అధికారులను కోరారు. ఎంపీ స్థానిక బాబా బృందావన్ నగర్‌లోని తన నివాసంలో మంగళవారం కెనరా బ్యాంకు రీజనల్, డివిజనల్ మేనేజర్ల, మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. నేషనల్ బీసీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్‌బీసీఎఫ్‌డీసీ), మైనారిటీల పథకాలు, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, జన్‌ధన్ యోజన, ముద్ర పథకాలను కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అర్హులందరికీ అందేలా చూడాలని ఎంపీ కోరారు. ఆయా పథకాల అమలుకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆర్ఎం తిరుపతయ్య, డివిజనల్ మేనేజర్లు బాల సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ ఉన్నారు. -
కెనరా బ్యాంకులో కొనసాగుతున్న విచారణ
మచిలీపట్నం : స్థానిక కెనరా బ్యాంకులో బంగారు నగల మాయంపై విచారణ కొనసాగుతోంది. బ్యాంకులో ఖాతాదారులు కుదువ పెట్టిన బంగారు నగలు మాయమయ్యాయని ప్రచారం ఇటీవల జరిగింది. బ్యాంకులో అప్రైజర్‌గా పనిచేస్తున్న జి.శ్రీరామసుబ్రహ్మణ్యం బంగారు నగలను మాయం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో గత నెల 28వ తే దీన బ్యాంకు డీజీఎం కే సుశీల, బ్యాంకు చీఫ్ సెక్యూరిటీ అధికారి వి.ప్రసాద్ బ్యాంకుకు వచ్చి విచారణ చేశారు. అధికారులు నాలుగు రోజులుగా బంగారు నగల మాయంపై విచారణ చేస్తున్నారు. బంగారు నగల తాకట్టుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ ప్రక్రియ జరుగుతుండగానే ఖాతాదారులు తాము తాకట్టు పెట్టిన బంగారు నగలపై ఆరా తీసి వాటిని చూపాలని కోరారు. సోమవారం బ్యాంకుకు వచ్చిన ఖాతాదాలకు వారి వద్ద స్లిప్పుల ఆధారంగా తనిఖీ చేసి వివరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాంకు వద్ద పోలీస్‌బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై బ్యాంకు అధికారుల నుంచి ఇంకా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆర్‌పేట ఎస్ఐ హబీబ్ బాషా ‘సాక్షి’కి తెలిపారు. అప్రైజర్ శ్రీరామసుబ్రహ్మణ్యం కెనరాబ్యాంకు నుంచి నగలను తీసుకుపోయి ముత్తూట్ ఫైనాన్స్, మరో బ్యాంకులో కుదువ పెట్టారని విశ్వసనీయ సమాచారం. కెనరా బ్యాంకు అధికారుల నుంచి పోలీసులకు ఫిర్యాదు వస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
మా నగలు ఉన్నాయో.. పోయాయో?
బందరు కెనరాబ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన నగల మాయంపై అంతర్గత విచారణ మచిలీపట్నం : మచిలీపట్నం కెనరా బ్యాంకులో బంగారు నగల మాయం కుంభకోణంపై విచారణ జరుగుతోంది. కెనరా బ్యాంకు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన అధికారులు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల వివరాలను పరిశీలిస్తున్నారు. బంగారం మిస్సింగ్ ఘటనతో తాము కుదువపెట్టని నగలు, దాచుకున్నవి ఉన్నాయో పోయాయోనంటూ ఖాతాదారులు పెద్దసంఖ్యలో గురువారం బ్యాంకు వద్ద బారులుతీరడంతో గందరగోళం నెలకొంది. ఆర్ పేట సీఐ వరప్రసాద్ బ్యాంకు వద్ద బందోబస్తు చేపట్టాల్సి వచ్చింది. ఒకానొక దశలో పోలీసులు, ఖాతాదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. సోమ మంగళవారాల్లో చెబుతాం ఉన్నతాధికారులు, బ్యాంకు సెక్యూరిటీ చీఫ్ అధికారి వి ప్రసాద్, మేనేజరు జయరాజ్ తదితరులు రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో ఖాతాదారులు బ్యాంకుకు వస్తే పూర్తి వివరాలు అందజేస్తామని అధికారులు తెలిపారు. ఖాతాదారులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కెనరా బ్యాంకు వెబ్సైట్ హ్యక్
ముంబై: జాతీయ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు వెబ్ సైటు ఈ నెల 2వ తేదిన హ్యాకింగ్ కు గురైంది. పాకిస్తాన్ కు చెందిన ఓ హ్యాకర్ బ్యాంకు వెబ్ సైట్ హోం పేజీ రూపాన్ని మార్చేశాడు. పేజీలో తన పేరు ఫైసల్ గా పేర్కొన్నాడు. భారత ప్రభుత్వానికి చెందిన వెబ్ సైట్ పై ఫైసల్ 1337 తన ముద్ర పడిందని రాశాడు. భద్రత కావాలంటే ఫేస్ బుక్ లో తనపేజీని సందర్శించాలంటూ.. పాకిస్తాన్ జిందాబాద్ అని కామెంట్లు పెట్టాడు. వెబ్ సైట్ హ్యాక్ కు గురవడంతో చర్యలు చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్విఫ్ట్ ద్వారా అకౌంట్లలోని డబ్బును చెక్ చేసింది. స్విఫ్ట్ మెసేజింగ్ సర్వీసు ద్వారా ప్రతిరోజూ వేల కోట్ల డాలర్లు బ్యాంకుల మధ్య మారుతుంటాయి. వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఫైసల్ ఈ-పేమెంట్లను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. వెబ్ సైట్ హ్యాంకింగ్ కు గురైందని తెలిసిన వెంటనే సర్వర్ ను నిలిపివేసినట్లు కెనరా బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యూజర్లు వినియోగించేందుకు వీలుగా ప్రత్యేక స్టాండ్ బై సర్వర్ ను హ్యాక్ కు గురైన వెబ్ సైట్ స్థానంలో వినియోగించినట్లు చెప్పారు. బ్యాంకు వెబ్ సైట్ ను హ్యాక్ చేసి కొత్త పేజీని ఆ స్థానంలో ఉంచేందుకు కొత్త యూఆర్ఎల్ ను హ్యాకర్ వాడినట్లు వివరించారు. బ్యాంకుకు చెందిన సమాచారాన్ని వారు దొంగిలించలేదని వెల్లడించారు. కాగా స్వతంత్ర దినోత్సవానికి ముందు గతేడాది కూడా రెండు ప్రైవేట్ బ్యాంకులు, ఓ ప్రభుత్వ బ్యాంకు వెబ్ సైట్ లు హ్యాకింగ్ కు గురయ్యాయి. -
కెనరా బ్యాంక్ లాభం 52 శాతం డౌన్
పెరిగిన ఎన్పీఏ కేటాయింపులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.229 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.479 కోట్లతో పోలిస్తే 52 శాతం క్షీణించినట్లు బ్యాంక్ తెలియజేసింది. మొండి బకాయిలకు అధిక కేటాయింపులు జరపడమే నికర లాభం క్షీణతకు ప్రధాన కారణమని వివరించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,360 కోట్లుగా ఉన్న కేటాయింపులు ఈ క్యూ1లో రూ.1,493 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.12,253 కోట్ల నుంచి రూ.11,786 కోట్లకు తగ్గింది. రుణ నాణ్యత కూడా బాగా తగ్గిందని తెలిపింది. స్థూల మొండి బకాయిలు 3.98 శాతం నుంచి 9.71 శాతానికి, నికర మొండి బకాయిలు 2.74 శాతం నుంచి 6.69 శాతానికి పెరిగాయని వివరించింది. మార్కెట్ ముగిసిన తర్వాత బ్యాంక్ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 5.3 శాతం లాభపడి రూ.254 వద్ద ముగిసింది. -
కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం
విజయవాడ : విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీ ఆవరణలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం లో చోరీకి ఓ దొంగ విఫలయత్నం చేశాడు. రాత్రి సమయంలో ముఖానికి వస్ర్తాన్ని కట్టుకున్న ఆగంతకుడు ఇనుప రాడ్ తో ఏటిఎం లోకి ప్రవేశించాడు. ఏటీఎం సెక్యూరిటీ గార్డు ఏటీఎం రూంలోనే నిద్రిస్తున్న విషయాన్ని గమనించాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు పై ఇనుపరాడ్ తో దాడిచేశాడు. ఒక్కసారిగా జరిగిన దాడి తో గార్డు మరియన్న తీవ్రంగా గాయపడ్డాడు. తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. ఈలోగా దుండగుడు ఏటీఎం కింది భాగంలోని తలుపులు తెరిచాడు. అప్పటికే తేరుకున్న మరియన్న గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అప్రమత్తమయ్యారు. విషయం గ్రహించిన దొంగ వెంటనే పరారయ్యాడు. మరియన్న ఫిర్యాదుతో మాచవరం పోలీసులు ఏటీఎం ను పరిశీలించారు. పధకం ప్రకారమే నిందితుడు ఎటిఎం చోరీకి ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన లో డబ్బు భద్రంగా ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. -
బ్యాంక్ మేనేజర్‌పై రౌడీయిజం
రుణం చెల్లించమంటే రుబాబు పార్వతీపురం : ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పార్వతీపురం పట్టణంలో ప్రస్తుతం రౌడీయిజం ఛాయలు కనిపిస్తున్నాయి. తీసుకున్న రుణం చెల్లించమన్నందుకు స్థానిక నవిరి కాలనీలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్‌ను కొత్తవలసకు చెందిన కొండూరు గణేష్, అతని అనుచరులు బెదిరించారు. దీనికి సంబంధించి బ్రాంచి మేనేజర్ జె. బాలకృష్ణ, మెయిన్ బ్రాంచి మేనేజర్ ఎ. రవికుమార్ సోమవారం రాత్రి వివరాలు వెల్లడించారు. కొత్తవలసకు చెందిన కొండూరు గణేష్ అనే వ్యక్తి పల్సర్ బైక్ కొనుగోలుకు 2015 మార్చిలో రూ.45 వేల రుణం తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు బైక్‌కు రిజిస్ట్రేషన్ చేయించలేదు సరికదా...రుణం కూడా చెల్లించలేదు. ఈ విషయమై బైక్‌కు రిజిస్ట్రేషన్ చేయించాలని బీఎం బాలకృష్ణ కోరగా, సోమవారం సాయంత్రం పూటుగా మద్యం తాగిన మరో ఐదుగురు వ్యక్తులను బ్రాంచికి తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతనితో వచ్చిన వ్యక్తులు ఏ ఊరు నీది...ఎక్కడుంటున్నావ్...మీ ఇంటికి భోజనానికొస్తాం... బ్యాంకు ఎప్పుడు కడతావ్... బ్యాంకు కట్టి బయటికి రా...? నీ సంగతి చూస్తామంటూ...బెదిరించారు. ఈ విషయాన్ని ఎస్సై సురేంద్రనాయుడు దృష్టికి తీసుకెళ్లారు. -
కూకట్పల్లి కెనరా బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం
హైదరాబాద్: కూకట్పల్లి ప్రగతి నగర్‌లోని ఓ బ్యాంక్‌లో ఆదివారం సాయంత్రం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కెనరా బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలికి చేరుకుని మంటాలను అదుపులోకి తెచ్చినట్టు తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
వరంగల్ జిల్లా ఏటూరు నాగారంలో ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కెనరా బ్యాంకు శాఖలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సురేందర్‌రెడ్డి ఇంటి వద్దే పురుగుల ముందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఏటీఎం చోరికి యత్నం
హైదరాబాద్: తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ బ్యాంక్ ఏటీఎంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి యత్నించారు. ఆల్వాల్‌లోని కెనరా బ్యాంకు ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు మిషన్‌ను ధ్వంసం చేసి, డబ్బును తీసేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావటంతో పరారయ్యారు. శుక్రవారం ఉదయం కొందరు వినియోగదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. -
ప్రగతి నగర్ లో దొంగల బీభత్సం
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక కెనరాబ్యాంక్ ఏటీఎంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషన్‌ను పగలగొట్టేందుకు దుండగులు ప్రయత్నించారు. అది తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేలానికి రైతన్న పరువు!
రైతుల బంగారం వేలానికి బ్యాంకులు సిద్ధం గత రెండేళ్లలో పోరుయింది పది కిలోల పైవూటే తాకట్టు పెట్టి ఆశలు వదులుకున్న కుప్పం అన్నదాతలు సీఎం సొంత నియోజకవర్గమైన కుప్పంలో రైతులకు గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఆయన మాటలు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. మొన్నటిదాకా బ్యాంకుల్లో తాకట్టుపెట్టిన బంగారు నగలు చేతికొస్తాయని ఆశపడ్డ అన్నదాతకు తీవ్ర నిరాశే ఎదురయ్యింది. రుణమాఫీకాకపోవడంతో ఇప్పటికే పదికిలోల బంగారు ఆభరణాలను వేలం వేసిన బ్యాంకులు ఇప్పుడు మరో నాలుగు కిలోల బంగారాన్ని వేలం వేసి, రైతుల పరువును బజారుకీడ్చే పనిలో నిమగ్నమవడం విమర్శలకు తావిస్తోంది.శాంతిపురం: కుప్పం రైతన్నల పరువు వురోవూరు బ్యాంకుల్లో వేలానికి వచ్చింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రుణవూఫీ హామీని నమ్మిన పాపానికి అష్ట కష్టాలతో సంపాదించుకున్న బంగారం అప్పనంగా బ్యాంకుల పాలవుతోంది. నగలతో పాటు తమ పరువు కూడా బజారున పడుతోందని రైతులు తల్లడిల్లుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో గత ఏడాది రైతులు తాకట్టు పెట్టిన పది కిలోలకు పైగా బంగారాన్ని బ్యాంకులు వేలం వేశాయి. ఈ దారుణం వురువక వుుందే వురోవూరు వేలానికి ఏర్పాట్లు సాగుతున్నారుు. వివిధ బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న 4 కిలోలకు పైగా రైతుల బంగారాన్ని త్వరలో అప్పులకు జమ కానుంది. బంగారం ధరలు స్థిరంగా ఉండకపోవడం, అప్పులు, వాటి వడ్డీ నానాటికీ పెరుగుతుండడంతో బ్యాంకులు తవు సొవుు్మ రాబట్టుకోవటానికి వేలానికి సిద్ధమవుతున్నాయి. వేలం బాటకుప్పంలోని కెనరా బ్యాంకు 400 వుంది రైతుల బంగారాన్ని ఈనెల 12వ తేదీన వేలం వేసింది. 56 వుంది రైతుల బంగారాన్ని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఈనెల 18న వేలం వేయునున్నట్టు ప్రకటించించింది. మిగతా బ్యాంకులు కూడా ఇదే బాటన సాగుతున్నారుు. నగల వేలానికి సంబంధించి ఆయూ బ్యాంకులు నిబంధనల మేరకు రైతుల వివరాలతో పత్రికల్లో ప్రకటనలు ఇస్తుండటంతో అన్నదాతలు అవవూనాలకు గురవుతున్నారు. ఏడాది క్రితం కొందరు రైతులు వడ్డీ వూత్రం చెల్లించి వేలం నుంచి తప్పించుకున్నారు. అప్పుడు తప్పించుకున్న రైతుల బంగారమే ఇప్పుడు వుళ్లీ వేలానికి వచ్చింది. అప్పుల ‘కుప్ప’ం వ్యవసాయు, ఉద్యానవన పంటల సాగులో అత్యుత్తవు ప్రతిభ చూపుతున్న కుప్పం నియోజకవర్గ రైతులు పెట్టుబడుల కోసం భారీగా అప్పులుచేశారు. పేద, వుధ్య తరగతి వారే వ్యవసాయుంలో సింహభాగం ఆక్రమించడంతో పెట్టుబడుల కోసం పాట్లు తప్ప లేదు. కానీ ప్రకృతి కరుణించక, కరువు కోరల్లో చిక్కుకుని పంటలతో పాటు వాటిపై పెట్టిన పెట్టుబడులు కూడా దక్కలేదు. పర్యవసానంగా 2014 వూర్చి చివరికి బ్యాంకుల్లో రూ.60.46 కోట్ల పంట రుణాలు, బంగారు తాకట్టు పెట్టి తీసుకున్న రూ.186.54 కోట్ల రుణాలు నెత్తికి వచ్చారుు. నియోజకవర్గంలో ప్రభుత్వం విడతల పేరుతో రుణవూఫీకి కరుణించిన మొత్తం రూ.40 కోట్లే కావటంతో మిగతా రూ.200 కోట్లకు పైగా భారం అన్నదాతలకు తప్పలేదు. -
దోపి'ఢీ'
- పేట్రేగుతున్న దొంగలు వరుస దోపిడీలతో హడల్ - యథేచ్ఛగా సొత్తు అపహరణ చోద్యం చూస్తున్న పోలీసులు - భయం నీడలో జనం మెతుకుసీమ నేరాలకు అడ్డాగా మారుతోంది. ఎక్కడెక్కడో హత్యలు చేసి శవాలను జిల్లా సరిహద్దుల్లో పారేసి వెళుతున్నారు. మరోవైపు దొంగలు తెగబడుతున్నారు.. ముత్తూట్ ఫైనాన్స్.. గ్రామీణ వికాస బ్యాంకు.. కెనరా బ్యాంకు.. ఏటీఎంలు ఇలా ఒక్కొక్కటి టార్గెట్ చేసి లూటీ చేస్తున్నారు.. పోలీసులు మాత్రం చేతులు పెకైత్తి చోద్యం చూస్తున్నారు. దొంగలు, హంతకుల నేరాలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు అసలు పని వదిలేసి వ్యక్తిగత ‘సేవ’లో మునిగి తేలుతుండటం గమనార్హం. సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో నేరాలకు అడ్డూఅదుపులేకుండాపోతోంది. నిత్యం దోపిడీలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అదుపు చేయాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. సీసీఎస్ ఉనికే లేదు. స్పెషల్ బ్రాంచ్, ఐడీ పార్టీ, ఇంటెలిజెన్సీ బలగాలు విధులను మర్చిపోయి ప్రతిపక్ష నేతల దిన చర్య, ఇతరుల వ్యక్తిగత వివరాలు సేకరించే పనులతోనే కాలం వెళ్లదీస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. బీరంగూడ ముత్తూట్ మినీ గోల్డ్‌లోన్స్ ఫైనాన్స్‌లో జరిగిన లూటీ మరిచిపోక ముందే దొంగలు తెగబడి మూడు చోట్ల ఏటీఎంలను టార్గెట్ చేయడం పోలీసుల డొల్ల తనాన్ని తెలియజేస్తోంది. ఎస్పీ కార్యాలయం ఉన్న సంగారెడ్డిలోనే పక్కా స్కెచ్‌తో ఏటీఎం పగులగొట్టి నగదు తస్కరించడం సామాన్య ప్రజలను కలవర పెడుతోంది. దొంగలదే పై చేయి ... వెల్దుర్తి మండలం మాసాయిపేటలో ఉన్న కెనరా బ్యాంకు దోపిడీ జరిగి నాలుగు నెలలు గడస్తున్నా ఇప్పటికీ దొంగలు దొరకలేదు. అక్టోబర్ నెల 28న బ్యాంక్ దోపిడీ జరిగింది. దొంగలు స్ట్రాంగ్‌రూమ్ గోడకు కన్నం వేసి ప్రత్యేక లాకర్లను ధ్వంసం చేసి 5 కిలోల బంగారు ఆభరణాలు, 15లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆ బ్యాంకును లూటీ చేసింది ఎవరనే విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోయారు. శివ్వంపేట మండలం గోమారంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో సంవత్సరం క్రితం దొంగలు చోరీకి పాల్పడ్డారు. ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేసి లాకర్లు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి విఫలయయ్యారు. ఇప్పటి వరకు దొంగలను గుర్తించలేదు. తాజాగా కౌడిపల్లిలో దొంగలు ఏటీఎం పగుల గొట్టడానికి విఫలయత్నం చేశారు. జహీరాబాద్‌లో.. జహీరాబాద్ పట్టణంతో పాటు, నియోజకవర్గం పరిధిలోని బ్యాంకులను, ఏటీఎంలు, ఫైనాన్స్‌లను దొంగలు లక్ష్యంగా చేసుకొని లూటీ చేస్తున్నారు. ఇక్కడ దొంగలు దోచుకోవడమేగాని ఇప్పటి వరకు దొరికింది లేదు. 2014 ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి జహీరాబాద్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగలు పడ్డారు.రూ.13.45లక్షల నగదు, 7.5 కిలోల బంగారు నగలు దోచుకుపోయారు. ఆరు నెలలు గడిచినా పోలీసులు వాళ్లను పట్టుకోలేకపోయారు. సంగారెడ్డి డీఎస్పీగా తిరుపతన్న వచ్చిన తరువాత ముత్తూట్ ఫైనాన్స్‌పై కొంత ప్రగతి సాధించారు. సెప్టెంబర్ 9న జహీరాబాద్ పట్టణంలోని రఫి జ్యూయలర్స్ దుకాణంలో దొంగలు చొరబడి అర కిలో బంగారం, 20 కిలోల వెండిని దొంగిలించారు. ఈ దొంగలు ఇంకా దొరకలేదు. 2013 మార్చి 18న కొత్తూర్(బి) గ్రామంలో గల సిండికేట్ బ్యాంకులో చోరికి పాల్పడి రూ.3.75లక్షల నగదును దోచుకెళ్లారు. మార్చి 28న కోహీర్ మండలం కవేలి గ్రామంలో గల సిండికేట్ బ్యాంకును దోపిడీ చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఒకే రోజు మూడు చోట్ల.... బుధవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు దొంగల స్వైర విహారం చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ఉన్న సంగారెడ్డి పాత బస్టాండ్ ఆవరణలోని ఇండిక్యాష్ ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 3.24 లక్షలను అపహరించారు. అక్కడి నుంచి కౌడిపల్లి, మెదక్ పట్టణాల్లోని ఏటీఎంలను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. మెదక్‌లో పోలీసులు దొంగలను వెంబడించినప్పటికీ వారిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఆరితేరిన వారి పనే.. దొంగలు మొదటగా సీసీ కెమెరాల మీదనే దృష్టి పెడుతున్నారు. కెమెరాలకు హార్డ్ డిస్కును కనెక్ట్ చేసే వైర్లను ముందుగా కత్తిరించడమో...లేదంటే కెమెరా విజన్ గుర్తించి దాని పైకి తిప్పడం చేస్తున్నారు. 2014 నవంబర్ 3న అల్లాదుర్గంలోని భారతీయ స్టేట్ బ్యాంకులో దొంగలు చోరికి యత్నించారు. అప్పుడు జరిగిన దొంగతనానికి రామచంద్రాపురం మండలం బీరంగూడలో జరిగిన లూటీకి కొంత సారూప్యం ఉందని తేలింది. అనంతర కాలంలో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ సిమీ ఉగ్రవాదుల పనే అని నల్లగొండ ఉగ్రవాదుల కాల్పుల సంఘటనలో బయటపడింది. బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీలో మొత్తం ఐదుగురు యువకులు పాల్గొనగా.. వారిలో ఇద్దరు మాత్రమే నల్లగొండ జిల్లా ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగిలిన ముగ్గురు ఏమయ్యారో మన పోలీసులు ఇప్పటి వరకు గుర్తించలేదు మిగిలిన బ్యాంకు దోపిడీకి పాల్పడిన దొంగల వివరాలు మన పోలీసుల వద్ద లేనే లేవు. వరుస దొంగతనాలు జరుగుతున్నా ఇప్పటి మన పోలీసులు ఒక్క దొంగను కూడా పట్టుకోలేక పోయారు. -
బ్రీఫ్స్..
కెనరా స్మార్ట్ ఫ్యూచర్ ప్లాన్ కెనరా హెచ్ఎస్బీసీ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘స్మార్ట్ ఫ్యూచర్ ప్లాన్’ పేరుతో యులిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీదారుల రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడానికి 5 రకాల ఫండ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించే వెసులుబాటు, పాలసీ కాలపరిమితి మధ్యలో అవసరాలకు అనుగుణంగా కొంత మొత్తం వెనక్కి తీసుకునే అవకాశాన్ని ఈ పథకం అందిస్తోంది. పిల్లల భవిష్యత్తు ఆర్థిక అవసరాలకు అక్కరకు వచ్చే విధంగా ఈ పథకాన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. పీర్లెస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ పీర్లెస్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీం (ఈఎల్ఎస్ఎస్- ట్యాక్స్ సేవింగ్)ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై గరిష్టంగా రూ. 1.50 లక్షలు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం మినహాయింపులు పొందవచ్చు. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటే ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 21తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ విలువను రూ. 500గా నిర్ణయించారు. అంతా ఆన్లైన్లోనే ఫ్యూచర్ జెనరాలీ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని పాలసీల వివరాలను ఒకే చోట చూసుకునే వెసులుబాటుతో పాటు, తర్వాత చెల్లించాల్సిన ప్రీమియంలు, యులిప్ టాప్ అప్స్ అన్నీ ఆన్లైన్ ద్వారానే చేసుకోవచ్చు. అలాగే పాలసీదారుల వ్యక్తిగత వివరాలు, పాన్‌కార్డు, నామినీ వివరాలను ఆన్లైన్లోనే మార్చుకోవచ్చు. పాలసీదారులకు సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఆన్లైన్ పోర్టల్న్ అభివృద్ధి చేసినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యాప్‌తో విదేశాల నుంచి డబ్బులు సామాజిక వైబ్సైట్ల ద్వారా విదేశాల నుంచి నగదు బదిలీ సేవలను ఎక్స్‌ప్రెస్ మనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ జోపో’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా వాట్సప్, ఫేస్బుక్, ట్వీట్టర్, వుయ్‌చాట్ వంటి సామాజిక వెబ్‌సైట్స్ ద్వారా విదేశాల నుంచి నగదును సులభంగా పొందవచ్చు. ఇందుకోసం ఫాస్ట్క్యాష్తో ఎక్స్‌ప్రెస్ మనీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. హెచ్డీఎఫ్సీ ఇండెక్స్ ఈటీఎఫ్ హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ సంస్థ సెన్సెక్స్, నిఫ్టీ ఈటీఎఫ్‌లను ప్రవేశపెట్టింది. నిఫ్టీ ఈటీఎఫ్‌ను ఎంచుకుంటే నిఫ్టీకి చెందిన 50 కంపెనీల్లో, అదే సెన్సెక్స్ ఈటీఎఫ్ ఎంచుకుంటే సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీటి రాబడులు ఇండెక్స్ రాబడులకు ఇంచుమించు సమానంగా ఉంటాయి. నవంబర్ 30న ప్రారంభమయ్యే న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 2తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తం రూ. 5,000. చిన్న మొత్తంతో నేరుగా లార్జ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇవి అనువుగా ఉంటాయి. -
కెనరా బ్యాంక్ లాభం 16 శాతం డౌన్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 16 శాతం క్షీణించింది. గత క్యూ2లో రూ.627 కోట్లు గా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.529 కోట్లకు తగ్గిపోయిందని కెనరా బ్యాంక్ పేర్కొం ది. మొత్తం ఆదాయం మాత్రం రూ.11,915 కోట్ల నుంచి రూ.12,478 కోట్లకు పెరిగిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.814 కోట్ల నుంచి రూ. 1,212 కోట్లకు పెరిగాయని పేర్కొంది. స్థూల మొండి బకాయిలు 2.92 శాతం నుంచి 4.27 శాతానికి, నికర మొండి బకాయిలు 2.3 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగాయని వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 1.8 శాతం క్షీణించి రూ.274 వద్ద ముగిసింది. -
కెనరా బ్యాంక్ సీఈఓగా రాకేశ్ శర్మ బాధ్యతలు
బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓగా రాకేశ్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. కెనరా బ్యాంక్‌లో చేరడానికి ముందు ఆయన 2014 మార్చి 7 నుంచీ లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఎండీ, సీఈఓగా పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. పభుత్వ రంగంలోని ఐదు బ్యాంకులకు ఇటీవల కొత్త చీఫ్‌ల ఎంపిక జరిగింది. వీటిలో రెండు బ్యాంకులకు ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ నిపుణులు చీఫ్లుగా నియమితులయ్యారు. ఈ బ్యాంకుల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)కాగా మరొకటి కెనరాబ్యాంక్. రాకేశ్ శర్మ ప్రైవేటు బ్యాంకు నుంచి ప్రభుత్వ రంగ చీఫ్‌గా నియమితులయినప్పటికీ 33 సంవత్సరాల క్రితం ఆయన కెరియర్ ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ప్రారంభమైంది. ఎస్బీఐలో ఆయన చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి వరకూ పదోన్నతి పొందారు. -
పేద విద్యార్థులకు కెనరా బ్యాంకు సాయం
పార్వతీపురం (విజయనగరం) : పార్వతీపురంలోని కెనరాబ్యాంక్ శాఖ నిరుపేద విద్యార్థులకు నగదు సాయం అందించింది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్లోని పేద విద్యార్థులకు కెనరా బ్యాంక్ మేనేజర్ ఎ.రవికుమార్ శుక్రవారం రూ.22,500 నగదును అందించారు. పేదరికంతో బాధపడకుండా చదువుపైనే దృష్టి పెట్టాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కోరారు. -
కెనరా బ్యాంక్ లాభం 41% డౌన్
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ నికర లాభం సుమారు 41 శాతం క్షీణించి రూ. 479 కోట్లకు పరిమితమైంది. మొండిబకాయిల కోసం అధిక కేటాయింపులు చేయడం ఇందుకు కారణం. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో బ్యాంక్ నికర లాభం రూ. 807 కోట్లు. తాజా త్రైమాసికంలో ఆదాయం రూ. 11,728 కోట్ల నుంచి రూ. 12,253 కోట్లకు పెరిగింది. ప్రొవిజనింగ్ 72 శాతం ఎగిసి రూ. 788 కోట్ల నుంచి రూ. 1,360 కోట్లకు చేరింది. అటు స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 2.67 శాతం నుంచి 3.98 శాతానిఇక ఎగిశాయి. నికర ఎన్పీఏలు కూడా 2.03 శాతం నుంచి 2.74 శాతానికి పెరిగాయి. ఇక సవరించిన వేతన బకాయిల కింద కెనరా బ్యాంకు రూ. 151 కోట్లు ప్రొవిజనింగ్ చేసింది. అటు రూ. 370.08 ప్రీమియంతో ఎల్ఐసీకి 4 కోట్ల షేర్లు కేటాయించింది. వీటి విలువ రూ. 1,520 కోట్లు. మొండి బకాయిల కారణంగా రాబోయే క్వార్టర్లలో ఒత్తిడి పెరగకుండా ముందస్తుగా అధిక కేటాయింపులు చేయడం వల్ల లాభాలు తగ్గాయని కెనరా బ్యాంక్ ఈడీ పీఎస్ రావత్ తెలిపారు. ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు రూ. 2,000 కోట్ల విలువ చేసే ఎన్పీఏలను విక్రయించే ప్రక్రియ ప్రారంభించినట్లు ఆయన వివరించారు. -
కెనరా బ్యాంక్ లాభం రూ.613 కోట్లు
డివిడెండ్ ఒక్కో షేర్‌కు రూ.10.5 న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.613 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఈ బ్యాంక్ నికర లాభం రూ.611 కోట్లుగా ఉందని బ్యాంక్ ఈడీ పి. ఎస్. రావత్ చెప్పారు. మొండి బకాయిలు పెరగడం వల్ల నికర లాభం ఫ్లాట్‌గా ఉందని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.11,610 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.12,429 కోట్లకు పెరిగిందని, స్థూల మొండి బకాయిలు 2.49 శాతం నుంచి 3.89 శాతానికి, నికర మొండి బకాయిలు 1.98 శాతం నుంచి 2.65 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి(2014-15) బ్యాంక్ నికర లాభం 11 శాతం పెరిగి రూ.2,703 కోట్లకు పెరిగిందని రావత్ వివరించారు.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.2,438 కోట్లుగా ఉందని చెప్పారు. మొత్తం ఆదాయం కూడా రూ.43,480 కోట్ల నుంచి 11% వృద్ధితో రూ.48,300 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రోడ్లు, ఉక్కు, విద్యుత్, టెక్స్టైల్స్ వంటి భారీ పరిశ్రమ కంపెనీలకు రుణాలిచ్చామని పేర్కొన్నారు. ఒక్కో షేర్‌కు రూ.10.5 డివిడెండ్‌ను ఇస్తామని వివరించారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కోషేర్‌ను రూ.398.95 ప్రీమియం ధరకు 1,39,38,134 షేర్లను ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ ప్రాతిపాదికన కేటాయించి రూ.569.99 కోట్లు సమీకరించామని పేర్కొన్నారు. -
ఓబీసీ, కెనరా బ్యాంక్ బేస్ రేట్ తగ్గింపు
న్యూఢిల్లీ: ఇతర బ్యాంకుల బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, కెనరా బ్యాంక్ కూడా రుణాలపై వడ్డీ రేటును తగ్గించాయి. కెనరా బ్యాంక్ బేస్ రేటు (కనీస వడ్డీ రేటు)ను 0.20 శాతం మేర తగ్గించడంతో ఇది 10 శాతానికి దిగివచ్చింది. కొత్త రేటు మే 11 నుంచి అమల్లోకి వస్తుంది. అలాగే ఓబీసీ బేస్ రేటును పావు శాతం తగ్గించడంతో ఇది 10 శాతానికి తగ్గుతుంది. కొత్త రేటు మే 15 నుంచి అమలవుతుంది. -
డీసీ చైర్మన్‌ను విచారించిన సీబీఐ
* దురుద్దేశంతోనే ఇతర బ్యాంకుల నుంచి రుణాలు * హైకోర్టుకు కెనరా బ్యాంకు నివేదన సాక్షి, హైదరాబాద్: రుణాల పేరుతో కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారించి సాయంత్రం 5.30కు తిరిగి జైలుకు తరలించారు. ఈ కేసులో జైల్లో ఉన్న మరో నిందితుడు వినాయక రవిరెడ్డికి మంగళవారం విచారణ సమయంలో ఛాతీ నొప్పి రావడంతో సీబీఐ అధికారులు ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చడం తెలిసిందే. ఆరోగ్యం కుదటపడటంతో బుధవారం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు... వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డి తమ నుంచి రుణం పొందేందుకు తాకట్టు పెట్టిన ఆస్తులనే తమకు చెప్పకుండా మరో బ్యాంకుకు సైతం తాకట్టు పెట్టి అక్కడా రుణాలు పొందారని హైకోర్టుకు కెనరా బ్యాంకు నివేదించింది. వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డిలపై కేసులను కొట్టేయాలని కోరుతూ వారి సతీమణులు టి.మంజులారెడ్డి, టి.శాంతి ప్రియదర్శినిరెడ్డి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. కోర్టు ఆదేశం మేరకు కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ ఎం.చంద్రశేఖరరెడ్డి బుధవారం దానిపై కౌంటర్ దాఖలు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలను కంపెనీ ఆస్తి అప్పుల పట్టీలో చూపలేదని ఆరోపించారు. ‘‘పైగా దాని ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు చూపారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఇది విశ్వాసఘాతుకమే. వారి చర్యలు ప్రజాద్రోహం కిందకు వస్తాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఉన్న కేసులను కొట్టేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది’’ అని అందులో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావన్నారు. మంజులారెడ్డి, శాంతి ప్రియదర్శినిరెడ్డిల పిటిషన్‌ను కొట్టేయాలని కోర్టును అభ్యర్థించారు. -
60 శాతం పెరిగిన కెనరా నికర లాభం
ట్రెజరీ ఆదాయం భారీ వృద్ధి ముంబై: కెనరా బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసిక కాలానికి 60 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.409 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.656 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వి.ఎస్. కృష్ణకుమార్ చెప్పారు. గత క్యూ3లో రూ.77 కోట్లుగా ఉన్న ట్రెజరీ ఆదాయం ఈ క్యూ3లో రూ.301 కోట్లకు పెరిగిందని, అలాగే నగదు రికవరీ రూ.1,214 కోట్ల నుంచి రూ.4,427 కోట్లకు, ఫీజు ఆదాయం రూ.851 కోట్ల నుంచి 38 శాతం వృద్ధితో రూ. 1,176 కోట్లకు పెరిగిందని, వ్యయాలపై నియంత్రణ మంచి ఫలితాలనిచ్చిందని వివరించారు. వీటన్నింటి కారణంగా నికర లాభం భారీగా వృద్ధి చెందిందని పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.2,380 కోట్లకు చేరిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 2.36 శాతానికి, అంతర్జాతీయంగా ఎన్ఐఎం 2.21 శాతం నుంచి 2.24 శాతానికి పెరిగిందని వివరించారు. స్థూల మొండి బకాయిలు 3.35 శాతం, నికర మొండి బకాయిలు 2.42 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాని బాకీలకు కేటాయింపులు రూ.543 కోట్ల నుంచి రూ.952 కోట్లకు పెంచామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,095 కోట్ల రుణాలను పునర్వ్యస్థీకరించామని పేర్కొన్నారు. రుణాలు 9 శాతం వృద్ధితో రూ.3.12 లక్షల కోట్లకు, డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.4.62 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. ఫలితాలు అంచనాలను మించడంతో బీఎస్ఈలో కెనరా బ్యాంక్ షేర్ 3.2 శాతం వృద్ధితో రూ.453 వద్ద ముగిసింది. -
పీఎస్‌యూ బ్యాంక్‌కు తెలుగు సీఎండీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌ల ఎంపిక కోసం జరిగిన షార్ట్‌లిస్ట్‌లో తెలుగు వ్యక్తి పి.శ్రీనివాస్ ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఎనిమిది ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకు చీఫ్‌ల భర్తీకి సంబంధించి 10 మంది ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ల పేర్లను షార్ట్‌లిస్ట్ చేయగా అందులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.శ్రీనివాస్ ఒక్కరే తెలుగు ప్రాంతానికి చెందినవారు. ఈయనతో పాటు ఇదే బ్యాంకు లకు చెందిన మరో ఈడీ బీబీ జోషితో పాటు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఈడీలు ఎంకే జైన్, కేకే శాన్సీ, ఐడీబీఐ బ్యాంక్ డిప్యూటీ ఎండీ బీకే బాత్రా తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు సం బంధిత వర్గాలు తెలిపాయి. 1978లో ఆంధ్రాబ్యాంక్‌లో వృత్తిని ప్రారంభించిన శ్రీనివాస్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీగా వ్యవహరిస్తున్నారు. ఏదో ఒక బ్యాంక్ సీఎండీగా శ్రీనివాస్ తప్పక ఎంపికవుతారని ప్రభుత్వ బ్యాంకింగ్ అధికారులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ పేర్లను ఆర్థిక మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం. ఈ నెలాఖరుకల్లా సీఎండీల భర్తీకి కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఇంట ర్వ్యూలకు 19 మంది హాజరయ్యారు. సీఎండీ స్థానాలు భర్తీ కావాల్సిన బ్యాంకుల్లో పీఎన్బీ, బీఓబీ, కెనరా బ్యాంక్, ఐఓబీ, ఓబీసీ, యునెటైడ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ సీఎండీగా పనిచేసిన నగేష్ పైడా, 2012లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి బ్యాంకు సీఎండీలుగా తెలుగు వాళ్లు లేరు. -
కెనరా బ్యాంకులో భారీ చోరీ
వెల్దుర్తి, తూప్రాన్: దాచుకున్న సొమ్ములు దోచుకెళ్లిండ్రు... కాయకష్టం చేసుకుని పైసాపైస కుడబెట్టి దొంగల భయంతో నగదు, బంగారాన్ని బ్యాంకుల్లో దాచుకున్నా చోరీకి గురయ్యాయని బాధితులు విలపించారు. మంగళవారం వెల్దుర్తి మండలం 44వ జాతీయ రహదారి పక్కనే మాసాయిపేట కెనరా బ్యాంకులో చోరీ విషయం తెలిసి బాధితులంతా పరుగుపరుగున సంఘటాన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ సొమ్మును బ్యాంకులోని లాకర్లలో దాచుకునేందుకు ఏడా దికి రూ.1,400 చెల్లిస్తున్నామని తెలిపారు. ఆభరణాలు, నగదు... సినీఫక్కీలో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠా సభ్యులు బ్యాంకుకు కన్నం వేసి బీరువాలో దాచి ఉంచిన రూ.15 లక్షల నగదు, వ్యవసాయ రుణాలు పొందేందుకు రైతులు తాకట్టు పెట్టిన సుమారు ఐదు కిలోల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. బ్యాంకు లోపలి గదిలో లాకర్లలో ఖాతాదారులు దాచి ఉంచిన ఆరు లాకర్లను ధ్వంసం చేసి నగదు, బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. దోపిడీకి పాల్పడింది ఇలా... బ్యాంకు దోపిడీ చేసేందుకు ముందుగానే పతకం పన్నినట్లు దొంగతనం చేసిన తీరును పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అర్ధరాత్రి సమయంలో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న బ్యాంకును చోరీ కోసం ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే బ్యాంకుకు రహదారి వైపు ఉన్న దుకాణాల వెనుక కిటికీని ఎంచుకుని కన్నం వేశారు. అనంతరం లోపలికి ప్రవేశించి సీసీ కెమెరాలను ధ్వంసం చేసి స్ట్రాంగ్‌రూంకు రంధ్రం చేసి లాకర్లను పగులగొట్టి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అనంతరం బ్యాంకు పక్కనే ఉన్న తన ఇంటి తాళం పగులగొట్టి రూ.1,500 దోచుకెళ్లినట్లు బాధితుడు నరేందర్ తెలిపాడు. విషయం తెలిసిందిలా... ఉదయం బ్యాంకు సిబ్బంది బాషా, గోపాల్‌లు బ్యాంకును తెరిచేందుకు వెళ్లారు. దోపిడీ జరిగినట్లు గుర్తించి వెంటనే బీఎం ఇసాక్‌కు, బ్యాంకు అధికారులకు విషయం తెలిపారు. ఉదయం 10గంటలకు స్థానిక బ్యాంకు అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దోపిడీ విషయం తెలుసుకున్న ఖాతాదారులు, పెద్ద సంఖ్యలో అక్కడకు చేరారు. అప్పటికే తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజాయ్కుమార్, రామయంపేట సీఐ నందీశ్వర్, ఎస్ఐ ప్రవీణ్‌రెడ్డి, చేగుంట ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డిలు పోలీసు బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు లోపల చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు, దోపిడీ జరిగిన తీరును గమనించి వెంటనే క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. వారు మధ్యాహ్నం 12.45 నిమిషాలకు సంఘటన స్థలానికి చేరకున్నారు. వేలిముద్రలను సేకరించారు. డాగ్‌స్క్వాడ్ మాత్రం బ్యాంకు ఆవరణలో కలియ తిరిగి అనంతరం బ్యాంకు సమీపంలోని వ్యవసాయ పొలాల్లోంచి రైల్వే స్టేషన్ వరకు నిలిచిపోయింది. త్వరలోనే పట్టుకుంటాం... బ్యాంకు దోపిడీకి పాల్పడింది అంతరాష్ట్ర ముఠా సభ్యులుగా భావిస్తున్నట్లు తూప్రాన్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బీహార్, గుల్బార్గా ముఠా సభ్యులు మాత్రమే ఇలాంటి దోపిడీలకు పాల్పడుతారని తెలిపారు. చేగుంట, రామయంపేట ఎస్ఐల ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, సైబరాబాద్‌లలో ఉన్న పాత నేరస్తులను విచారించి త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు. గతంలోనే బ్యాంకు అధికారులకు సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. -
మాసాయిపేట కెనరాబ్యాంకులో భారీ చోరీ
-
మాసాయిపేట కెనరాబ్యాంకులో భారీ చోరీ
కెనరా బ్యాంకులో భారీ చోరీ జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని కెనరా బ్యాంకు గోడకు కొంతమంది దొంగలు కన్నం వేశారు. వాళ్లు బ్యాంకులోకి దూరి ముందుగా అక్కడున్న సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత లాకర్ రూంను కూడా ధ్వంసం చేసి, అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. దాంతో పాటు బ్యాంకులో ఉన్న ఆరు కంప్యూటర్లను కూడా దొంగలు తీసుకెళ్లారు. లాకర్ రూం వెనకవైపు గోడకు కూడా వాళ్లు కన్నం వేశారు. ఉదయం బ్యాంకు తెరిచిన తర్వాత గానీ ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే.. హైదరాబాద్ నుంచి క్లూస్ టీం వచ్చి, ఇక్కడి ఆధారాలు సేకరించేవరకు ఎంత మొత్తం పోయినదీ ఇంకా తెలిసే అవకాశం లేదు. ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేసి చోరీ చేశారంటే, బ్యాంకు ఆనుపానులు ముందునుంచి బాగా తెలిసున్నవాళ్లే అయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సాధారణంగా ఇక్కడి కెనరా బ్యాంకులో రైతులకు బంగారు రుణాలు ఎక్కువగా ఇస్తుంటారు. దాంతో ఆ నగలు ఏమయ్యాయన్న ఆందోళన కూడా స్థానిక రైతుల్లో వ్యక్తమవుతోంది. -
కెనరా బ్యాంకు టెక్నాలజీ సేవలు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు తన కస్టమర్ల కోసం ప్రవేశ పెట్టిన మూడు అధునాతన టెక్నాలజీ సేవలను బ్యాంకు చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఆర్కే దుబే శనివారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘కెనరా ఎం-వాలెట్’ అనే టెక్నాలజీ సేవ ద్వారా మొబైల్ ఫోన్‌తో పౌర సేవల బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు. ఆన్లైన్ షాపింగ్‌కు కూడా ఈ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. మరో పథకం ‘కెనరా ఈజీ క్యాష్’ ద్వారా బ్యాంకింగ్ సదుపాయం లేని వారికి రూ.25 వేల వరకు నగదును పొందే వీలు కల్పించవచ్చని చెప్పారు. ఖాతాదారు తమ బంధువులు లేదా మిత్రులకు ఈ విధంగా పంపే మొత్తం కోసం వన్ టైమ్ పాస్‌వర్డ్‌ను సృష్టించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇంకో పథకం ‘కెనరా పీ-సర్వ్’ ద్వారా చెక్‌బుక్ విజ్ఞప్తులు సమర్పించుకోవచ్చని, సేవింగ్స్ బ్యాంకు ఖాతాను ప్రారంభించుకోవచ్చన్నారు. కెనరా బ్యాంకు ఈ-లాంజ్లలో టచ్ స్క్రీన్‌తో కూడిన ఈ సదుపాయం ద్వారా 12 సేవలను పొందవచ్చు. -
ఆర్బీఐ అనుమతిలేకుండా మాఫీ ప్రకటనా?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్బీఐ అనుమతి లేకుండా రుణ మాఫీ పథకాన్ని ఎలా ప్రవేశపెడతారని, రాజకీయ పార్టీల అనాలోచిత నిర్ణయాల వల్ల బ్యాంకింగ్ రంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, ఇలా మాట్లాడాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉందంటూ కెనరా బ్యాంక్ సీఎండీ ఆర్.కె.దుబే తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. రుణ మాఫీ పథకంపై స్పష్టత లేకపోవడంతో కట్టే స్తోమత ఉన్న వారు కూడా రుణాలు చెల్లించడం లేదని, దీంతో పెరుగుతున్న ఎన్పీఏలు బ్యాంకింగ్ రంగాన్ని గడ్డు పరిస్థితుల్లోకి నెడుతున్నాయంటూ వాపోయారు. మంగళవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చన దుబే కలిసిన విలేకరులతో మాట్లాడుతూ రుణ మాఫీ పథకంపై ఆర్బీఐతో పాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా ఒక స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బకాయిలు వసూలు కాకపోవడంతో దీని ప్రభావం కొత్త రుణాల మంజూరుపై ప్రభావం చూపుతుందని, తద్వారా రైతులు దెబ్బతింటారన్నారు. కొత్త రుణాల మంజూరుపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ, ఎన్‌పీఎల ఒత్తిడి వల్ల బ్యాంకు మేనేజర్లు కొత్త రుణాల మంజూరుపై ఆసక్తి చూపలేరని ఒక ప్రశ్నకు సమాధానంగా దుబే తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాపార విస్తరణపై ఈ నిర్ణయం ప్రభావం చూపదని, రెండు రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా మరో 150 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కెనరా బ్యాంకుకు 350 శాఖలున్నాయి. రూ. 3,000 కోట్ల క్విప్ ఇష్యూ వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల సేకరణకు త్వరలోనే క్విప్ ఇష్యూ ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఇష్యూకి ఆర్బీఐ నుంచి అనుమతి లభించిందని తృతీయ త్రైమాసికంలో ఇష్యూకు వచ్చే ఆలోచన ఉందన్నారు. దీంతో పాటు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఫాలో ఆన్ పబ్లిక్ ఇష్యూకు(ఎఫ్‌పీవో) వస్తామని, కాని దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వచ్చే ఏడాదిలో ఎఫ్‌పీవోకి వచ్చే అవకాశం ఉందన్నారు. రుణాల రీకవరీ బాగుండటంతో ఈ ఏడాది చివరికి ఎన్పీఏలు తగ్గే అవకాశం ఉందన్నారు. మార్చి, 2014 నాటికి కెనరా బ్యాంక్ స్థూల ఎన్పీఏ 2.94%, నికర ఎన్పీఏలు 1.98%గా ఉన్నాయి. ఓటీఎస్‌కి ఒకే అంటే కేసులు వెనక్కి తీసుకుంటాం... డీసీకి కెనరా బ్యాంక్ ఆఫర్ డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్(డీసీహెచ్ఎల్) వన్ టైమ్ సెటిలిమెంట్ (ఓటీఎస్)కి ముందుకు వస్తే, ఆ సంస్థపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని కెనరా బ్యాంక్ ప్రకటించింది. చెల్లించలేకపోతున్న రుణాలను పునర్ వ్యవస్థీకరించాలంటూ డీసీహెచ్ఎల్ ప్రమోటర్లు తమను కలిసి కోరారని, కాని మేము సీబీఐ వద్ద మోసం కేసు నమోదు చేయడంతో ఇది సాధ్యం కాదని, అవసరమైతే ఓటీఎస్‌కి అవకాశం ఇస్తామని చెప్పినట్లు దుబే తెలిపారు. ఓటీఎస్ కింద నిర్ణయించి మొత్తాన్ని చెల్లించడానికి వస్తే కేసులు ఉపసంహరించుకుంటామని, ఇంతవరకు డీసీ ప్రమోటర్లు ముందుకు రాలేదన్నారు. ఓటీఎస్‌కి రాకపోతే ఈ ఎన్పీఏలను అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించే ఆలోచనలో ఉన్నామని, సీబీఐ కేసు ఉండటంతో దీనికి ఆర్బీఐ నుంచి అనుమతి లభించాల్సి ఉందన్నారు. కెనరా బ్యాంక్‌కి డీసీహెచ్ఎల్ రూ.350 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. తప్పుడు తనఖా పత్రాలను పెట్టి రుణం తీసుకుంది అంటూ కెనరా బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇది విచారణలో ఉందని దుబే తెలిపారు. రెండో ఆర్థిక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో రెండవ ఆర్థిక రాజధానిగా ఎదగడానికి హైదరాబాద్‌కి అన్ని అర్హతలు ఉన్నాయని, ఇందుకు కావల్సిన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి కె.టి.రామారావు తెలిపారు. దేశ జీడీపీలో 25 శాతం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుండటం, ఐఆర్డీఏ ప్రధాన కార్యాలయం, ఆర్థిక జిల్లాతో పాటు అనేక ఆర్థిక సంస్థలు ఉండటంతో ముంబై తర్వాత ఆర్థిక రాజధానిగా హైదరాబాద్‌కు అన్ని హంగులు ఉన్నాయన్నారు. గ్రామీణ ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసే విధంగా క్షేత్రస్థాయి నుంచి బడ్జెట్ అంచనాలు తీసుకుంటున్నామని, కేవలం ప్రకటనలే కాకుండా నిధులు కూడా మంజూరు చేస్తామన్నారు. ఫిక్కీ నిర్వహిస్తున్న ‘ఫిన్సెక్-2014’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. గ్రామీణ ఆర్థిక రంగాన్ని పటిష్టం చేయడానికి అవసరమైతే బ్యాంకులు, బీమా, సూక్ష్మ రుణ సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం రూ. లక్ష లోపు వ్యయసాయ రుణాల మాఫీకి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. -
వదంతులకు వేగం ఎక్కువ: మమత
కోల్‌కతా: వదంతులు వ్యాపించినంత వేగంగా మంచి వార్తలు జనంలోకి వెళ్లడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాపోయారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులు గురించి ఎవరూ చెప్పుకోవడం లేదని అన్నారు. చిన్న విషయాలను మాత్రం పెద్దవి చేసి చూపుతున్నారని పేర్కొన్నారు. "మంచి పనులు గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఏమీ లాభం లేకపోయినప్పటికీ చిన్న విషయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. మన ప్రమేయం లేకపోయినప్పటికీ వదంతులు వేగంగా వ్యాపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి' అని మమత వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎంపీ తపస్ పాల్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో పరోక్షంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. -
కెనరా బ్యాంక్
ముగిసిన రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి కెనరాబ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్‌రావు బళ్లారి అర్బన్ : రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో కెనరా బ్యాంకు బెంగళూరు జట్టు విజయకేతనం ఎగురవేసింది. ఆకుల సూర్యనారాయణ జ్ఞాపకార్థకం బళ్లారి జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్, బళ్లారి బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ క్రీడామైదానంలో ఈనెల 13న ప్రారంభమైన రాష్ట్రస్థాయి బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల్లో మొత్తం 16 జట్లు పాల్గొనగా క్వార్టర్ ఫైనల్లో ఏ పూల్ కెనరాబ్యాంక్ బెంగళూరు, సహ్యాద్రి బీబీసీ బెంగళూరు, బీ పూల్‌లో స్పుట్నిక్ ఏ టీం భద్రావతి, గాంధీనగర్ ఏ టీం తుమకూరు, సీ పూల్‌లో బనశంకరి బెంగళూరు ఆలూరు చామరాజ్ నగర్, డీ పూల్‌లో బళ్లారి బీబీబీఏ ఏ టీం బళ్లారి, శికారిపుర్ ఫైస్ శికారిపుర్ జట్లు తలపడగా కెనరా బ్యాంక్ బెంగళూరు వర్సెస్ బళ్లారి బీబీబీఏ ఏ టీం బనశంకరి బెంగళూరు, గాంధీనగర్ ఏ టీం తుమకూరు సెమిఫైనల్‌కు చేరుకున్నాయి. ఆదివారం కెనరా బ్యాంక్ బెంగళూరు బనశంకరి బెంగళూరు జట్లు, థర్డ్ లెవెల్లో బీబీబీఏ బళ్లారి, ఫోర్త్ లెవెల్లో గాంధీనగర్ తుమకూరు జట్లు ఫైనల్ పోటీల్లో పాల్గొన్నాయి. ఉత్కంఠంగా సాగిన పోటీల్లో కెనరా బ్యాంక్ బెంగళూరు టీం విజయ కేతనం ఎగురవేసింది. దీంతో ఆ జట్టుకు రూ.25 వేలు నగదుతో పాటు షీల్డ్ బహుమతిని అందుకుంది. బనశంకరి బెంగళూరు టీం రూ.15 వేలు నగదు, పాటు షీల్డ్, గాంధీనగర్ ఏ టీం తుమకూరు జట్టు రూ.10 వేలు నగదు పొందింది. బళ్లారి బీబీఏ బాల్‌బ్యాడ్మింటన్ ఏ టీం రూ.5 వేలు నగదు అందజేశారు. దావణగెరెకు చెందిన 67 ఏళ్ల సూర్యనారాయణకు ఓల్డెస్ట్ ప్లేయర్‌గా, మూడబిద్రెకు చెందిన ఆలాస్ టీంలో 16 ఏళ్ల యువకుడు పునీత్‌కు విశేష బహుమతులు అందించారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో కెనరాబ్యాంక్ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ గెలుపోటముల కన్నా క్రీడల్లో పాల్గొనడమే ప్రధాన ధ్యేయమన్నారు. క్రీడాకారులు ప్రతిభకు పదును పెట్టుకొని జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్, సీనియర్ క్రీడాకారుడు వెంకోబ రావ్ మాట్లాడుతూ ఆకుల సూర్యనారాయణ జ్ఞాపకార్థం నిర్వహించిన బాల్‌బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు క్రీడాకారులకు మరింత ఉత్సాహాన్ని అందించిందన్నారు. కార్యక్రమంలో బళ్లారి బాల్‌బ్యాడ్మింటన్ రాష్ట్ర కార్యదర్శి దినేష్, సిటీ అధ్యక్షుడు నవీన్‌రావ్, కార్యదర్శి హెచ్.రాఘవేంద్ర, మారేగౌడ, మల్లేశప్ప, జయతీర్థ తదితరులు పాల్గొన్నారు. -
చెల్లని చెక్కు... తెచ్చింది చిక్కు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితుడికి నాలుగు నెలల జైలుశిక్షతోపాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... ఎల్బీనర్లో నివాసం ఉండే రాజశేఖర్‌రెడ్డి అదే ప్రాంతంలో నివాసం ఉండే రాజన్ నాయర్ పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2012 సంవత్సరంలో రాజన్నాయర్ రూ.4 లక్షలను అప్పుగా రాజశేఖర్‌రెడ్డి నుంచి తీసుకొని 6 నెలల్లోగా తిరిగి చెల్లిస్తానంటూ హామీ ఇచ్చాడు. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించాలని రాజన్నాయర్ను కోరగా కెనరాబ్యాంక్ దిల్సుఖ్నగర్ బ్యాంక్‌కు చెందిన రూ. 4 లక్షల చెక్కును రాజశేఖర్‌రెడ్డి పేరిట జారీ చేశాడు. సదరు చెక్‌ను బ్యాంకు ఆఫ్ ఇండియా ఎల్బీనగర్ బ్యాంచ్‌లో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో అది చెల్లలేదు. నోటీసు పంపినా రాజన్నాయర్ డబ్బులు చెల్లించకపోవడంతో రాజశేఖర్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ సత్యనారాయణరావు పై విధంగా తీర్పు చెప్పారు. -
బ్యాంక్‌పై స్కెచ్... మేనేజర్ ఇంట్లో చోరీ
కెనరా బ్యాంక్ చోరీకి విఫలయత్నం మేనేజర్ ఇంట్లో బైక్, ల్యాప్‌టాప్ చోరీ అరకులోయ/అరకు రూరల్, న్యూస్‌లైన్: బ్యాంకు చోరీకి విఫలయత్నం చేసిన దొంగలు... ఆ కోపాన్ని మేనేజర్ ఇంటిపై ప్రదర్శించారు. మోటార్ బైక్‌ను, ల్యాప్‌టాప్‌ను అపహరించుకుపోయారు. సినీఫక్కీలో జరిగిన ఈ చోరీపై పోలీసుల వివరాలివి. యండపల్లివలస కెనరా బ్యాంక్‌లో తాత్కాలికంగా ఏటీఎం ఏర్పాటు చేశారు. బ్యాంకులో ఆదివారం రాత్రి దొంగలు ప్రవేశించి ఏటీఎంను ధ్వంసం చేశారు. లోపలున్న లాకర్‌ను తీసేందుకు ఎంత ప్రయత్నించినా వీలవక వదిలేసి వెళ్లిపోయారు. అక్కడినుంచి అరకులోయ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని వైఎస్సార్ కాలనీలో నివసిస్తున్న కెనరా బ్యాంక్ మేనేజర్ ఎం.వెంకటకుమార్ ఇంట్లో చొరబడ్డారు. ఆదివారం సెలవు కావడంతో మేనేజర్ స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఇంట్లో ఎవరూ లేరు. ఇంటి బయట పెట్టిన హీరో హోండా, ఇంట్లో మంచంపై ఉంచిన లాప్‌టాప్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం 9.15 గంటలకు స్వీపర్ గుజ్జెలి సువర్ణ బ్యాంక్ తాళాలు తీయబోయేసరికి గేటు, తలుపుల తాళాలు పగులగొట్టి ఉండటం చూసి అవాక్కయింది. వెంటనే బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్లో సమాచారం అందించింది. హుటాహుటిన మేనేజర్ ఎం.వెంకటకుమార్ బ్యాంక్‌కు చేరుకుని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు సిద్ధమవుతుండగా, ఆయన ఇంట్లో చోరీ జరిగినట్టు అదే కాలనీవాసి ఫోన్లో తెలిపారు. ఒకేసారి రెండు సంఘటనలు జరగడంతో ఆందోళన చెందిన బ్యాంకు మేనేజర్ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మూడు నెలల క్రితం కొన్న బైక్ ఖరీదు రూ. 65 వేలు, నెలరోజుల క్రితం కొన్న లాప్టాప్ ఖరీదు రూ.40 వేలుంటుందని మేనేజర్ కుమార్ తెలిపారు. రక్షణ ఏర్పాట్లు లేని బ్యాంకు అరకులోయ సీఐ మురళీరావు, ఎస్ఐ జి.నారాయణరావు బ్యాంకును తనిఖీ చేసి లాకర్లను పరిశీలించారు. పైసా కూడా దొంగలు ఎత్తుకెళ్లలేదని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. బ్యాంక్‌ను అద్దె ఇంట్లో నిర్వహిస్తుండటం, ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడమే చోరీకి ఆస్కారమిచ్చిందని తెలుస్తోంది. సాయంత్రం క్లూస్ టీం బ్యాంక్‌కు చేరుకొని ఆధారాలు సేకరించాయి. వెంటనే వాచ్‌మన్‌ను నియమించుకోవాలని బ్యాంక్ అధికారులకు నోటీసు జారీ చేశామని సీఐ మురళీరావు విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
ఎంజీబీఎస్‌లో నాలుగు కిలోల బంగారం స్వాధీనం
హైదరాబాద్ : హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్టాప్‌లో సోమవారం పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద నాలుగు కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు ? నాలుగు కిలోల బంగారం ఎక్కడిది ? అని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు మెదక్ జిల్లా జహీరాబాద్ ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. లాకర్లు తెరుచుకోకపోవడంతో వెనుతిరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంజీబీఎస్‌లో అదుపులోకి తీసుకున్న వ్యక్తే... జహీరాబాద్‌లో చోరీకి ప్రయత్నించింది కూడా ఒకరేనా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక విశాఖ జిల్లా అరకు యండపల్లివలస కెనరాబ్యాంక్‌లో చోరీకి యత్నం జరిగింది. కాగా ఎంత ప్రయత్నించినా లాకర్లు ఓపెన్ కాకపోవడంతో దొంగలు పరారయ్యారు. -
చెల్లించగలిగితే చాలు.. రుణమిస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చెల్లించగలిగే స్థోమత ఉన్న వారికి రుణమిస్తామని ప్రభుత్వరంగ కెనరా బ్యాంకు తెలిపింది. ఇల్లు కట్టుకోవాలని, కారు కొనుక్కోవాలని, ఉన్నత విద్య అభ్యసించాలని, వ్యాపారం ప్రారంభించాలని.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సామాన్యుల ఆకాంక్షను నెరవేరుస్తామని బ్యాంకు సీఎండీ ఆర్.కె.దూబే స్పష్టం చేశారు. రెండు రోజులపాటు జరుగనున్న కెనరా బ్యాంకు మెగా రిటైల్, ఎంఎస్ఎంఈ ఎక్స్పోను బుధవారమిక్కడ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. చిల్లర వర్తకం, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, కార్పొరేట్ రంగాలకు విరివిగా రుణాలిస్తున్నట్టు చెప్పారు. మరో మూడు సర్కిల్స్..: రాష్ట్రంలో రాజకీయంగా సమస్యలున్నాయని బ్యాంకు సిబ్బంది తనతో అన్నారని దూబే తెలిపారు. రాజకీయ అంశాలతో బ్యాంకు సేవలను ముడిపెట్టవద్దని వారికి సూచించినట్లు తెలిపారు. ఎక్స్పో సందర్భంగా 16,695 మంది లబ్ధిదారులకు రూ.359 కోట్ల మేర రుణాలిస్తున్నట్టు చెప్పారు. తిరుపతి, విజయవాడ, వరంగల్‌లో సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎన్పీఏ మరింత తగ్గుతుంది.. కెనరా బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ) ప్రస్తుతం 2.5 శాతముంది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గుతుందని బ్యాంకు ఆశిస్తోంది. మార్చికల్లా రూ.2,500 కోట్ల నిధులు సమీకరించే అవకాశం ఉంది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి రావాల్సిన రూ.350 కోట్ల బకాయికి సంబంధించి కోర్టు నుంచి ఆ కంపెనీ ఆస్తుల అటాచ్మెంట్ లేదా అమ్మకం ఆదేశాలు రావొచ్చని బ్యాంకు ఆశిస్తోంది. ఇ-లాంజ్‌లో ఎన్నో సేవలు.. కెనరా బ్యాంకు ఇ-లాంజ్ పేరుతో వినూత్న కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. రాష్ట్రంలో తొలిసారిగా హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో నగదు డ్రా చేసుకోవడంతోపాటు చెక్కులను డిపాజిట్ చేయవచ్చు. లావాదేవీల వివరాలను పాస్ బుక్‌లో ముద్రించుకోవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రేడింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఏవైనా సమస్యలు తలెత్తితే కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఫోన్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లకు సహాయపడేందుకు ఒక ఉద్యోగి ఉంటారు. దేశవ్యాప్తంగా ఇటువంటి లాంజ్‌లు 35 ఉన్నాయి. -
డిపాజిట్ రేట్ల పెంపు..
న్యూఢిల్లీ: పీఎన్బీ, కెనరాబ్యాంక్‌లు స్థిర డిపాజిట్లకు సంబంధించి కొన్ని మెచ్యూరిటీలపై వడ్డీరేట్లను పెంచాయి. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సర్దుబాటు అవసరాల దిశలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. వేర్వేరుగా చూస్తే... పీఎన్బీ...: డిపాజిట్ రేట్లు 50 శాతం వరకూ పెరిగాయి. తాజా రేట్లు 11వ తేదీ నుంచీ అమల్లోకి రానున్నాయి. కోటి రూపాయల లోపు 271 రోజులు-ఏడాది మధ్య డిపాజిట్ రేటు 7.50 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది. 91-179 రోజుల మధ్య డిపాజిట్ రేటు 6.75 శాతం నుంచి 7 శాతానికి ఎగసింది. ఏడాది నుంచి 10 యేళ్ల మధ్య డిపాజిట్ రేటు వరకూ రేటు 9 శాతంగా ఉంటుంది. ఎన్ఆర్ఈ డిపాజిట్ రేటు ఏడాది నుంచి 3యేళ్ల మధ్య 8.75 శాతం నుంచి 9 శాతానికి చేరింది. కాగా కోటి రూపాయల నుంచి రూ.10 కోట్ల వరకూ 180-270 రోజుల డిపాజిట్‌పై వడ్డీరేటు 8.25 శాతం నుంచి 8 శాతానికి దిగింది. కనీస రుణ రేటు పెంపు విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బ్యాంక్ సీఎండీ కేఆర్ కామత్ పేర్కొన్నారు. కెనరాబ్యాంక్: ఈ బ్యాంక్ కూడా డిపాజిట్‌పై వడ్డీరేటు అరశాతం వరకూ పెరిగింది. తక్షణం ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. 46-60 రోజులు, 61-90 శ్రేణి డిపాజిట్ రేటు 7శాతం నుంచి 7.50 శాతానికి చేరింది. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్ రేటు 8.75 శాతం నుంచి 9.05శాతానికి చేరింది. 7 నుంచి 8 యేళ్ల మధ్య డిపాజిట్ రేటు 8.75 శాతం నుంచి 9.05 శాతానికి ఎగసింది. అధిక రేటు 9.05 శాతంగా ఉండనుంది. ఏడాది నుంచి 10 యేళ్ల డిపాజిట్లకు ఈ రేటు వర్తిస్తుంది. వృద్ధులకు అరశాతం అదనపు వడ్డీరేటు అందుబాటులో ఉంటుంది. -
రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులు
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి పట్టణాల అభివృద్ధి పథకం కింద రెండవ విడతలో నగరసభల పరిధిలో రూ.1,023 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఖమరుల్ ఇస్లాం తెలిపారు. పట్టణాల అభివృద్ధి పథకం కింద 2 వ విడతలో రూ.15 కోట్లతో పట్టణంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం ఆయన కేంద్ర మంత్రి వీరప్పమొయిలీతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 13 జిల్లాల్లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, మరో 19 జిల్లాల్లో టెండర్ ప్రక్రియ జరుగుతోందన్నా రు. చేపట్టిన పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. నగర సభల అధ్యక్ష, ఉపాధ్యక్షుల రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేతకు ఈనెల 30 లోపు ప్రమాణపత్రం అందజేస్తామన్నారు. వీరప్ప మొయిలీ మాట్లాడుతూ నగరసభల పరిధిలోని వార్డులలో నీటి శుద్ధీకరణ కేంద్రాల ఏర్పాటుకు చమురు కంపెనీల నుంచి రూ.2.5కోట్లు, నగర సభ పరిపాలన కట్టడాల నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఘాటి పుణ్యక్షేత్రం సమీపంలోని విశ్వేశ్వరయ్య పికప్ డ్యాం పునరుద్ధరణకు ని ధులు విడుదల చేస్తామన్నారు. నవంబర్ 23న చిక్కబళ్లాపురంలో కెనరా బ్యాంక్ సహకారంతో రుణ మేళా, నిరుద్యోగ యువతీ యువకులకు విద్యాభ్యాసానికి రుణాలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పట్టణంలో యూజీడీ పనుల కారణంగా అధ్వాన్నంగా మారిన రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని స్థానిక ఎమ్మె ల్యే వెంకట రమణయ్య వీరప్ప మొయిలీని కోరారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతి నిధులు, అధికారులు పాల్గొన్నారు. -
BANKING AWARENESS
1. The first Indian bank to open a branch outside India in London in 1946? a) SBI b) PNB c) BOB d) Canara Bank e) BOI 2. Coins are minted at ? a) Mumbai b) Hyderabad c) Noida d) Kolkatta e) All of these 3. Which of the following is not a function of commercial bank? a) Providing project finance b) Selling mutual funds c) Deciding policy rates like CRR, Repo rates/SLR etc. d) Settlement of payments on behalf of the customers e) Providing services such as locker facilities, remittances etc.. 4. The New Capital Adequacy Frame work prescribed for the banks is commonly known as? a) KYC norms b) Credit Policy c) Basel accord d) Fiscal Policy e) None of these 5. Expand the term FRBM? a) Financial Responsibility and Business management b) Fiscal Responsibility and Business management c) Financial Responsibility and Budget Management d) Fiscal Responsibility and Budget Management e) Formal Responsibility and Business Management 6. What is an Indian Depository Receipt? a) A deposit account with a Public Sector Bank b) A depository account with any of depositories c) An instrument in the form of depository receipt created by an Indian depository against underlying equity shares of the issuing company d) An instrument in the form of deposit receipt issued by Indian depositories e) None of these 7. Land Development Banks form a part of the? a) Commercial Banks b) Industrial Development Bank of India c) Food Corporation of India d) Co-operative Credit Structure e) None of these 8. Which of the following cannot be called as a value Added Service offered by bank? a) Special Accounts for poor sections of society b) Accident Insurance Cover c) Instant credit of outstations cheques d) free cheque books e) All of these 9. The minimum number of women required for formation of women groups under Development of women and children in Rural Areas Programme is? a) 20 b) 15 c) 10 d) 05 e) None of these 10. What is the full form of 'FINO', a term we see frequently in financial newspapers? a) Financial Investment Network and Operations b) Farmer's Investment in National Organization c) Farmers Inclusion News and Operations d) Financial Inclusion Network and Operations e) None of these 11. With an aim to provide better services to the debit card holders, the Reserve Bank of India (RBI) has directed all commercial and public sector banks to introduce new Automated Teller Machines (ATM) that can deliver lower denomination notes such as? a) Rs 10 b) 20 c) 50. d) None of the above e) All the above 12. Which of the following banks is limited to the needs of agriculture and rural finance? a) RBI b) SBI c) IFC d) NABARD e) Axis Bank 13. Open-market operations of Reserve Bank Of India refer to? a) Trading in securities b) Auctioning c) Transaction in gold d) All of these e) None of these 14. Which of the following has introduced a new tool named Data Warehousing and Business Intelligence System for speedy analysis of data and identifica-tion of violations? a) IRDA b) SBI c) RBI d) TRAI e) None of these 15. The Reserve Bank hiked the limit for foreign investment in Asset Reconstruction Companies (ARCs) from the earlier cap of 49 percent to? a) 74 % b) 47 % c) 57 % d) 72 % e) None of the above 16. Which of the following is NOT the part of the scheduled banking structure in india? a) Money Lenders b) Public Sector Banks c) Private Sector Banks d) Regional Rural Banks e) State Co-operative Banks 17. Who is the chairman of the committee constituted by RBI to study issues and concerns in the Micro Finance Institutions sector? a) Y.H. Malegam b) Dr K.C.Chakraborty c) C.Rangarajan d) M.Damodaran e) Smt Usha Thorat 18. An instrument of qualitative credit control in india is? a) Open market operations b) Credit rationing c) Change in reverse ratio d) Bank rate policy e) None of these 19. Which of the following is the full form of the term SLR as used in the banking sector? a) Social Lending Ratio b) Statutory Liquidity Ratio c) Scheduled Liquidity Rate d) Separate Lending Rate e) None of these 20. World Bank Headquarters is in? a) India b) USA c) Switzerland d) Japan e) UK Answers 1) e; 2) e; 3) c;4) c; 5) d; 6) c; 7) d; 8) d; 9) c; 10) a; 11) e; 12) d; 13) a; 14) b; 15) a; 16) a; 17) a; 18) b; 19) b: 20) b. -
ఉద్యోగాలు
కెనరా బ్యాంక్‌లో 550 ఖాళీలు కెనరా బ్యాంకు.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు మేనేజర్ (ఎంఎంజీఎస్ గ్రేడ్-2) పోస్టుల సంఖ్య: 450; విభాగం: జనరలిస్ట్ అర్హతలు: ఏదైనా డిగ్రీ/పీజీతోపాటు సీఏఐ ఐబీ/రిస్క్ మేనేజ్మెంట్/ట్రెజరీ మేనే జ్మెంట్/ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌లో డిప్లొమా ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య సీనియర్ మేనేజర్(ఎంఎంజీఎస్ గ్రేడ్-3) పోస్టుల సంఖ్య: 100; విభాగం: క్రెడిట్ అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సీఏఐఐబీ/ సీఏ/ఎంబీఏ/ పీజీడీబీఎం /పీజీడీబీఏ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లోని క్రెడిట్ విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రస్తుతం ఎంఎం జీఎస్ గ్రేడ్-2గా పనిచేస్తూ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఎంపిక:అకడెమిక్ మెరిట్, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 26 చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: www.canarabank.com ఏపీఐఐసీలో స్టూడెంట్ ట్రైనీలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఐఐసీ).. తాత్కా లిక పద్ధతిలో స్టూడెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: స్టూడెంట్ ట్రైనీ అర్హతలు: కాస్ట్ అకౌంటెంట్/చార్టెడ్ అకౌంటెంట్ ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును పోస్టు ద్వారా పంపాలి. చివరి తేది: ఆగస్టు 31 చిరునామా: ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఏపీఐఐసీ లిమిటెడ్, ఫిఫ్త్ ఫ్లోర్, పరిశ్రమ భవన్, బషీర్‌బాగ్, హైదరాబాద్-500004 -
ఉద్యోగాలు
కెనరా బ్యాంక్‌లో 550 ఖాళీలు కెనరా బ్యాంకు.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు మేనేజర్ (ఎంఎంజీఎస్ గ్రేడ్-2) పోస్టుల సంఖ్య: 450; విభాగం: జనరలిస్ట్ అర్హతలు: ఏదైనా డిగ్రీ/పీజీతోపాటు సీఏఐ ఐబీ/రిస్క్ మేనేజ్మెంట్/ట్రెజరీ మేనే జ్మెంట్/ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌లో డిప్లొమా ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య సీనియర్ మేనేజర్(ఎంఎంజీఎస్ గ్రేడ్-3) పోస్టుల సంఖ్య: 100; విభాగం: క్రెడిట్ అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సీఏఐఐబీ/ సీఏ/ఎంబీఏ/ పీజీడీబీఎం /పీజీడీబీఏ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లోని క్రెడిట్ విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రస్తుతం ఎంఎం జీఎస్ గ్రేడ్-2గా పనిచేస్తూ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఎంపిక:అకడెమిక్ మెరిట్, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 26 చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: www.canarabank.com ఏపీఐఐసీలో స్టూడెంట్ ట్రైనీలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఐఐసీ).. తాత్కా లిక పద్ధతిలో స్టూడెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: స్టూడెంట్ ట్రైనీ అర్హతలు: కాస్ట్ అకౌంటెంట్/చార్టెడ్ అకౌంటెంట్ ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును పోస్టు ద్వారా పంపాలి. చివరి తేది: ఆగస్టు 31 చిరునామా: ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఏపీఐఐసీ లిమిటెడ్, ఫిఫ్త్ ఫ్లోర్, పరిశ్రమ భవన్, బషీర్‌బాగ్, హైదరాబాద్-500004 -
ఉద్యోగాలు
కెనరా బ్యాంక్‌లో 550 ఖాళీలు కెనరా బ్యాంకు.. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు మేనేజర్ (ఎంఎంజీఎస్ గ్రేడ్-2) పోస్టుల సంఖ్య: 450; విభాగం: జనరలిస్ట్ అర్హతలు: ఏదైనా డిగ్రీ/పీజీతోపాటు సీఏఐ ఐబీ/రిస్క్ మేనేజ్మెంట్/ట్రెజరీ మేనే జ్మెంట్/ఇంటర్నేషనల్ బ్యాంకింగ్‌లో డిప్లొమా ఉండాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 25 నుంచి 35 ఏళ్ల మధ్య సీనియర్ మేనేజర్(ఎంఎంజీఎస్ గ్రేడ్-3) పోస్టుల సంఖ్య: 100; విభాగం: క్రెడిట్ అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. సీఏఐఐబీ/ సీఏ/ఎంబీఏ/ పీజీడీబీఎం /పీజీడీబీఏ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు లోని క్రెడిట్ విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. ప్రస్తుతం ఎంఎం జీఎస్ గ్రేడ్-2గా పనిచేస్తూ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వయసు: 27 నుంచి 40 ఏళ్ల మధ్య ఎంపిక:అకడెమిక్ మెరిట్, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 26 చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: www.canarabank.com ఏపీఐఐసీలో స్టూడెంట్ ట్రైనీలు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీఐఐసీ).. తాత్కా లిక పద్ధతిలో స్టూడెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: స్టూడెంట్ ట్రైనీ అర్హతలు: కాస్ట్ అకౌంటెంట్/చార్టెడ్ అకౌంటెంట్ ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును పోస్టు ద్వారా పంపాలి. చివరి తేది: ఆగస్టు 31 చిరునామా: ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఏపీఐఐసీ లిమిటెడ్, ఫిఫ్త్ ఫ్లోర్, పరిశ్రమ భవన్, బషీర్‌బాగ్, హైదరాబాద్-500004 -
4 బ్యాంకుల రుణ, డిపాజిట్ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: నాలుగు బ్యాంకులు తమ వడ్డీరేట్లలో మార్పులు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. వీటిలో యాక్సిస్, కరూర్ వైశ్యా, కెనరా, దేనా బ్యాంకులు ఉన్నాయి. ఆర్బీఐ అనుసరిస్తున్న కఠిన లిక్విడిటీ పరిస్థితుల నేపథ్యంలో పలు బ్యాంకులు ద్రవ్య లభ్యతను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఇందుకనుగుణంగా డిపాజిట్ రేట్లు, రుణ రేట్లను పెంచుతున్నాయి. యాక్సిస్...: ప్రైవేటు రంగంలో మూడవ అతిపెద్ద యాక్సిస్ బ్యాంక్ కనీస(బేస్) రుణ రేటును పావుశాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.25%కు ఎగసింది. తాజా రేటు ఆగస్టు 19 నుంచీ అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ సోమవారం తెలిపింది. తాజా నిర్ణయంతో కనీస రేటుకు అనుసంధానమైన గృహ, ఆటో, కార్పొరేట్ రుణ రేట్లు పెరగనున్నాయి. కెనరా బ్యాంక్ డిపాజిట్ రేట్లు పెంపు ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను 1.75% వరకూ పెంచింది. కొత్త రేట్లు మంగళవారం నుంచీ అమల్లోకి వస్తాయి. దీనిప్రకారం 31-45 రోజలు మధ్య డిపాజిట్ రేటు 6.50 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. 46-90 రోజుల మధ్య డిపాజిట్ రేటు 7% నుంచి 8.30 శాతానికి చేరింది. దేనా ఎన్ఆర్ఐ డిపాజిట్ రేట్ అప్ దేనా బ్యాంక్ మూడేళ్లు పైబడిన ఎన్ఆర్ఐ డిపాజిట్లపై వడ్డీరేట్లను 1శాతం పెంచింది. అమెరికా డాలర్, పౌండ్, యూరో, జపాన్ యన్, కెనడా డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్లో ఎన్ఆర్ఐల ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ బ్యాంక్ (ఎఫ్సీఎన్ఆర్-బీ) ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరగనున్నట్లు బ్యాంక్ తెలిపింది. కరూర్ వైశ్యా.. కాగా ప్రైవేటు రంగంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ రుణ రేటును మంగళవారం నుంచీ పావుశాతం పెంచుతోంది. దీనితో ఈ రేటు 11 శాతానికి చేరనుంది. ప్రాథమిక వడ్డీరేటు (బీపీఎల్ఆర్)ను కూడా బ్యాంక్ 15.75 % నుంచి 16%కు పెంచింది.