కెనరా బ్యాంక్ లాభం 16 శాతం డౌన్
న్యూఢిల్లీ: కెనరా బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు 16 శాతం క్షీణించింది. గత క్యూ2లో రూ.627 కోట్లు గా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.529 కోట్లకు తగ్గిపోయిందని కెనరా బ్యాంక్ పేర్కొం ది. మొత్తం ఆదాయం మాత్రం రూ.11,915 కోట్ల నుంచి రూ.12,478 కోట్లకు పెరిగిందని తెలిపింది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.814 కోట్ల నుంచి రూ. 1,212 కోట్లకు పెరిగాయని పేర్కొంది.
స్థూల మొండి బకాయిలు 2.92 శాతం నుంచి 4.27 శాతానికి, నికర మొండి బకాయిలు 2.3 శాతం నుంచి 2.9 శాతానికి పెరిగాయని వెల్లడించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కెనరా బ్యాంక్ షేర్ బీఎస్‌ఈలో 1.8 శాతం క్షీణించి రూ.274 వద్ద ముగిసింది.