
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చిలో ముగియనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ నెలలో ట్రేడింగ్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ట్రేడింగ్‌ను బాగా ప్లాన్ చేయడానికి మార్చి నెలలో స్టాక్ మార్కెట్ ఏయే రోజుల్లో పనిచేస్తుంది.. ఎప్పుడు మూసివేత ఉంటుంది అన్నది తెలుసుకోవడం మంచిది. ఈ హాలిడే క్యాలెండర్ ను స్టాక్ ఎక్స్ఛేంజీలు జారీ చేస్తాయి. తమ అధికారిక వెబ్ సైట్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయి.
బీఎస్ఈ ప్రతి సంవత్సరం పూర్తి ట్రేడింగ్ హాలిడేస్ జాబితాను ప్రచురిస్తుంది. సాధారణంగా ఈ జాబితాలో పండుగలు, జాతీయ సెలవులు, వారాంతపు సెలవులు ఉంటాయి. బడ్జెట్ సమర్పణ వంటి ప్రత్యేక సందర్భాలు మినహా అన్ని వారాంతాల్లో స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉండవు. అందువల్ల మార్కెట్ షెడ్యూల్‌ను తెలుసుకుని తదనుగుణంగా ట్రేడింగ్‌ను ప్లాన్ చేయడానికి ఇన్వెస్టర్లు సెలవుల జాబితాపై ఆధారపడాలి.
మార్చిలో స్టాక్ మార్కెట్ కు 12 రోజులు సెలవులు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈ రోజుల్లో మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ లు చేయలేరు. వారాంతపు సెలవులతో పాటు ఈ నెలలో హోలీ, రంజాన్ పండుగకు కూడా మార్కెట్లు మూతపడతాయి. అందువల్ల మార్చిలో చివరి ట్రేడింగ్ రోజు 28వ తేదీ. ఎందుకంటే 29, 30 తేదీలు వారాంతపు సెలవులు. ఆ రోజుల్లో మార్కెట్లు పనిచేయవు.
మార్చిలో స్టాక్ మార్కెట్ సెలవులు ఇవే
» మార్చి 1 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 2 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 8 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 9 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 14 శుక్రవారం హోలీ
» మార్చి 15 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 16 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 22 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 23 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 29 శనివారం వీకెండ్ హాలిడే
» మార్చి 30 ఆదివారం వీకెండ్ హాలిడే
» మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్)
Comments
Please login to add a commentAdd a comment