Holidays
-
బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులు
2024 డిసెంబర్ నెల ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా బ్యాంకులకు ఈ నెలలో వరుస సెలవులు రానున్నాయి. ఈ సెలవులు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులకు వర్తిస్తాయా?.. సెలవు రోజుల్లో ఆన్లైన్ కార్యకలాపాల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.➤డిసెంబర్ 25న క్రిస్మస్, కాబట్టి దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 26, 27వ తేదీలలో మిజోరం, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. ఈ కారణంగా అక్కడి బ్యాంకులకు మాత్రమే సెలవు.➤డిసెంబర్ 28, 29వ తేదీలు వరుసగా నాల్గవ శనివారం, ఆదివారం. ఈ కారణంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు.➤డిసెంబర్ 30వ తేదీ మేఘాలయాలో యు కియాంగ్ నంగ్బా.. ఈ సందర్భంగా అక్కడి బ్యాంకులకు సెలవు.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పనిని.. సెలవులను గమనించి ముందుగానే పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
వచ్చే వారంలో బ్యాంకులు పనిచేసేది మూడు రోజులే!.. ఎందుకంటే..
ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 2024 సెలవులను వెల్లడించింది. ఈ నెలలో సుమారు 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నట్లు (సెలవు) తెలుస్తోంది. ఇందులో మతపరమైన పండుగలు, ప్రాంతీయ కార్యక్రమాలు, ఆదివారాలు ఇలా అన్నీ ఉన్నాయి. అయితే వచ్చే వారం వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు ఉన్నట్లు సమాచారం.వచ్చే వారంలో 7, 8వ తేదీల్లో ఛత్ పూజ, 9వ తేదీ రెండో శనివారం, 10న ఆదివారం కావడంతో.. ఇలా వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు పనిచేయవు.ఛత్ పూజ బీహార్, ఢిల్లీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో మాత్రమే జరుపుకుంటారు. కాబట్టి ఆ రాష్ట్రాల్లోని బ్యాంకులకు మాత్రమే సెలవు. 8వ తేదీ బీహార్, జార్ఖండ్, మేఘాలయాలలో ఛత్ సంబంధిత వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రాల్లోని బ్యాంకులు ఆ రోజు పనిచేయవు. ఇక 9 రెండో శనివారం, 10 ఆదివారం కావడంతో యధావిధిగా బ్యాంకులకు సెలవు. ఇలా మొత్తం నాలుగు రోజులు బ్యాంకులకు సెలవన్న మాట.ఇదీ చదవండి: 85 లక్షల ఖాతాలపై నిషేధం!.. వాట్సప్ కీలక నిర్ణయంఛత్ పూజఛత్ అనేది బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్ వంటి ప్రాంతాలలో జరుపుకునే హిందూ పండుగ. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో ఆరవ రోజు జరుగుతుంది. దీనిని సూర్య షష్టి అని కూడా అంటారు. కాబట్టి సూర్య దేవుడిని పూజిస్తారు.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. -
ఆ రాష్ట్రంలో దీపావళికి ఐదు రోజులు సెలవు
జమ్ము: ఈనెల 31న దీపావళి పండుగను వేడుకగా జరుపుకునేందుకు దేశమంతా సిద్ధమైంది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి సెలవులను ప్రకటించాయి. తాజాగా జమ్ము పాఠశాల విద్యా డైరెక్టర్ దీపావళి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించించారు.దీపావళి సందర్భంగా అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకూ సెలవులను ప్రకటించారు. నవంబర్ 3 ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. నవంబర్ 4న విద్యాసంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ తన అధికారిక వెబ్సైట్లో నోటీసు జారీ చేశారు.దీపావళికి ఆదివారంతో కలుపుకుని ఆరు రోజుల పాటు సెలవు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ ఒకటిన కూడా సెలవు ప్రకటించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తిరిగి తమ స్వస్థలానికి వచ్చేందుకు వీలుగా నవంబర్ ఒకటిన సెలవు ప్రకటించారు.ఇది కూడా చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..! -
దసరా సందడి మొదలైంది.. సొంతూళ్లకు చలో చలో..(ఫొటోలు)
-
రేపటి నుంచి దసరా సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి పాఠశాలలు ఈ నెల 14న పునఃప్రాంరంభమవుతాయని పేర్కొన్నారు.వాస్తవానికి ఈ నెల 4వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు మార్పులు చేశారు. అయితే, బుధవారం గాంధీ జయంతి కావడంతో మరో రోజు సెలవు కలిసి వచ్చింది. అన్ని జూనియర్ కాలేజీలకు సైతం ఈ నెల 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
అక్టోబర్‌లో బ్యాంకులు పనిచేసేది సగం రోజులే!.. ఎందుకంటే?
సెప్టెంబర్ నెల ముగుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ సెలవుదినాల్లో పబ్లిక్ హాలిడేస్, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాల సాధారణ సెలవులు ఉన్నాయి.సెలవుల పూర్తి జాబితా➤అక్టోబర్ 1: రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు 2024 (జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి (జాతీయ సెలవుదినం)➤అక్టోబర్ 3: నవరాత్రి (జైపూర్)➤అక్టోబర్ 5: ఆదివారం➤అక్టోబర్ 10: దుర్గాపూజ - మహా సప్తమి (అగర్తల, గౌహతి, కోహిమా, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 11: దసరా - దుర్గా అష్టమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గాంగ్టక్, గౌహతి, ఇంఫాల్, ఇటానగర్, కోహిమా, కోల్‌కతా, పాట్నా, రాంచీ, షిల్లాంగ్‌లలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 12: రెండవ శనివారం / విజయదశమి (తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 13: ఆదివారం➤అక్టోబర్ 14: దుర్గా పూజ (గ్యాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 16: లక్ష్మీ పూజ (అగర్తల, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 17: మహర్షి వాల్మీకి జయంతి (బెంగళూరు, గౌహతి, సిమ్లాలోని బ్యాంకులకు సెలవు)➤అక్టోబర్ 20: ఆదివారం➤అక్టోబర్ 26: నాల్గవ శనివారం➤అక్టోబర్ 27: ఆదివారం➤అక్టోబర్ 31: దీపావళి (దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులకు సెలవు)ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
AP: 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: అక్టోబర్ 3వ తేదీ నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యామంత్రి లోకేశ్ చెప్పారు. ఆయన శుక్రవారం పాఠశాల విద్యపై సమీక్షించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందు నుంచే సెలవులు ఇస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 13 వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.ఇదీ చదవండి: నిరుద్యోగులకు సర్కార్ షాక్ -
2 నుంచి దసరా సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని స్కూళ్లకు అక్టోబర్ 2 నుంచి 14 వరకూ దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి 15వ తేదీన తెరుచుకుంటాయని పేర్కొంది. సెలవుల తర్వాత సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వాలని అధికారులు అన్ని పాఠశాలలప్రధానోపాధ్యాయులకు సూచించారు. -
సెప్టెంబర్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. ఏకంగా 14 రోజులు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం.. ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ సెలవుదినాలు ఉన్నాయి.►5 సెప్టెంబర్: శ్రీమంత శంకరదేవుని తిథి (అస్సాంలో బ్యాంకులు సెలవు)►7 సెప్టెంబర్: వినాయక చవితి, శనివారం►8 సెప్టెంబర్: ఆదివారం►13 సెప్టెంబర్: రామ్‌దేవ్ జయంతి (రాజస్థాన్‌లో బ్యాంకులు సెలవు)►14 సెప్టెంబర్: రెండవ శనివారం►15 సెప్టెంబర్: ఆదివారం ►16 సెప్టెంబర్: మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) ►17 సెప్టెంబర్: ఇంద్ర జాత్ర (సిక్కింలో బ్యాంకులు సెలవు)►18 సెప్టెంబర్: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో బ్యాంకులు సెలవు)►21 సెప్టెంబర్ 21: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో బ్యాంకులు సెలవు)►22 సెప్టెంబర్: ఆదివారం►23 సెప్టెంబర్: బలిదాన్ డే (హర్యానాలో బ్యాంకులు సెలవు)►28 సెప్టెంబర్: నాల్గవ శనివారం ►29 సెప్టెంబర్: ఆదివారంబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
సెలవులొచ్చాయ్.. ఛలో ఊరికి..
సాక్షి, అమరావతి : గురువారం నుంచి సోమవారం వరకు వరుస సెలవులు రావడంతో ప్రజలంతా ప్రయాణాలు కట్టారు. సొంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు రావడంతో ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రయాణికులతోపాటు పలువురు ఎంపీలు దక్షిణ మధ్య రైల్వేను కోరారు. దాంతో రైల్వే శాఖ ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లకు అదనంగా మరికొన్నింటిని ప్రకటించింది. 18న నర్సాపూర్– సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్– నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్సోల్, కాచిగూడ– తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతామని తెలిపింది. వాటన్నింటిలోనూ ఏసీ కోచ్‌లున్నాయి. కానీ, వీటిలో ప్రయాణికులకు ఇచ్చేందుకు బెడ్ రోల్స్ లేవు. దక్షిణ మధ్య రైల్వే రోజూ నిత్యం 210 రెగ్యులర్ రైళ్లను నిర్వహిస్తోంది. ఇక ఏడాదిలో వివిధ సందర్భాలను పరిగణలోకి తీసుకుని 200 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. నిర్ణీత తేదీల్లో వీటిని నడుపుతుంటుంది. రెగ్యులర్, ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు (బెడ్‌రోల్స్) ఇస్తుంది. విజయవాడ, తిరుపతి, గుంతకల్, కాచిగూడల్లో ఉన్న రైల్వే మెకనైజ్డ్ లాండ్రీల్లో వాటిని శుభ్రపరిచి, తిరిగి సరఫరా చేస్తుంటుంది. కానీ ఇప్పుడు అదనంగా ప్రకటించిన ప్రత్యేక రైళ్లలోని ఏసీ కోచ్‌ల ప్రయాణికులకు సరిపడా దుప్పట్లు లేవు. దాంతో ఈ రైళ్లలో బెడ్ రోల్స్ అందించలేమని, ప్రయాణికులు దుప్పట్లను వారే తెచ్చుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. బస్సుల్లో సీట్లన్నీ రిజర్వ్ ఆర్టీసీ రాష్ట్రంలో రోజుకు 11 వేల బస్సు సర్వీసులు నిర్వహిస్తోంది. వరుస సెలవుల కారణంగా బస్సుల్లో టికెట్లు దొరకడంలేదు. రానున్న వారం రోజులకు సీట్లన్నీ రిజర్వ్ అయిపోయాయి. దాంతో ప్రయాణికులు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై ఆధారపడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నంకు ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సు చార్జీ రూ.1,200 ఉండగా ఇప్పుడు రూ.2 వేలకు పెంచేశారు. స్లీపర్ ఏసీ బస్సుల్లో రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఊళ్లకు వెళ్తుండటంతో టోల్ గేట్ల వద్ద రద్దీ భారీగా పెరిగింది. పలు చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నందున డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇవీ సెలవులు15వ తేదీ గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సెలవు16వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఐచ్ఛిక సెలవు17వ తేదీ శనివారం – సాధారణ సెలవు 18వ తేదీ ఆదివారం – సాధారణ సెలవు 19వ తేదీ సోమవారం – రాఖీ పౌర్ణమి సెలవు -
ఒకేసారి 10 రోజుల సెలవు.. ఆనందంలో 50వేల ఉద్యోగులు
గుజరాత్‌లోని సూరత్‌లో వున్న ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ కిరణ్ జెమ్స్ తన 50000 మంది ఉద్యోగులకు 10 రోజులు (ఆగస్టు 17 నుంచి 27 వరకు) సెలవును ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా పడిపోతున్న డిమాండ్‌ను అధిగమించడానికి.. వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ప్రపంచ మార్కెట్లో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ లేదని కంపెనీ తెలిపింది. అయితే వజ్రాల ఉత్పత్తిని నియంత్రించేందుకు వీలుగా 10 రోజుల సెలవు ప్రకటించామని, కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని కంపెనీ చైర్మన్ వల్లభాయ్ లఖానీ తెలిపారు.గుజరాత్‌లోని డైమండ్ ఫ్యాక్టరీలు దీపావళి సందర్భంగా సుదీర్ఘ సెలవులు తీసుకుంటాయి. అయితే ఇప్పుడు పండుగకు ముందే.. కంపెనీ సంచనల నిర్ణయం తీసుకుంది. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.సంస్థలో పనిచేస్తున్న 50,000 మందికి పైగా డైమండ్ పాలిషర్లు పనిచేస్తున్నారు. ఇందులో 40,000 మంది సహజ వజ్రాలను కత్తిరించి పాలిష్ చేస్తారు. మిగిలిన 10,000 మంది ల్యాబ్‌లో తయారయ్యే డైమండ్ యూనిట్లో పని చేస్తున్నారని లఖానీ పేర్కొన్నారు. కిరణ్ జెమ్స్ కంపెనీ ప్రపంచంలోని అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారు మాత్రమే కాకుండా.. పాలిష్ చేసిన వజ్రాల అతిపెద్ద ఎగుమతిదారులలో కూడా ఒకటి. -
ఆగష్టులో బ్యాంక్ హాలిడేస్: పనిదినాలు 18 రోజులే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగష్టు నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి.ఆగస్టు 3: కేర్ పూజ - అగర్తల రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుఆగస్టు 4: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్టు 8: టెన్డాంగ్‌లో రమ్ ఫాత్ సిక్కింఆగస్టు 10: రెండో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్టు 11: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగష్టు 13: పేట్రియాట్ డే (ఇంఫాల్)ఆగస్ట్ 15: స్వాతంత్య్ర దినోత్సవం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్ట్ 18: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్టు 19: రక్షా బంధన్/రాఖీ - దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుఆగష్టు 20: శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, తిరువనంతపురం)ఆగస్ట్ 24: నాల్గవ శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్ట్ 25: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్ట్ 26: జన్మాష్టమి - దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
జూన్‌లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి.జూన్ 2024లో సెలవుల జాబితా2 జూన్ 2024 (ఆదివారం)- తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (తెలంగాణ)8 జూన్ 2024 - రెండో శనివారం9 జూన్ 2024 (ఆదివారం) - మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ బ్యాంకులకు సెలవు10 జూన్ 2024 (సోమవారం) - శ్రీ గురు అర్జున్ దేవ్ మార్టిర్డమ్ డే సందర్భంగా పంజాబ్‌లో సెలవు.14 జూన్ 2024 (శుక్రవారం) - పహిలి రాజా డే సందర్భంగా ఒడిశాలో బ్యాంకులకు సెలవు15 జూన్ 2024 (శనివారం) - రాజా సంక్రాంతి సందర్భంగా ఒరిస్సాలో, YMA డే సందర్భంగా మిజోరం బ్యాంకులకు సెలవు16 జూన్ 2024 - ఆదివారం17 జూన్ 2024 (సోమవారం) - బక్రీద్ సందర్భంగా జాతీయ సెలవుదినం21 జూన్ 2024 (శుక్రవారం) - వట్ సావిత్రి వ్రతం కారణంగా అనేక రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు22 జూన్ 2024 (శనివారం) - సంత్ గురు కబీర్ జయంతి సందర్భంగా ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్ బ్యాంకులకు సెలవు23 జూన్ 2024 - ఆదివారం30 జూన్ 2024 (ఆదివారం) - శాంతి దినోత్సవం (మిజోరం)బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. (బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేసవి సెలవులు అనంతరం జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిగిరి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ విడుదలు చేసింది.అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. రానున్న విద్యా సంవత్సరంలో పాఠశాలలు మొత్తం 229 రోజులు పనిచేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 చివరి వర్కింగ్ డే. ఇక, 2025 ఏప్రిల్ 24 నుంచి 2025 జూన్ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఈ ఏడాది దసరాకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు అంటే 13 రోజులపాటు పండుగ సెలవులు ఉంటాయి. డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు. ఇక, 2025 జనవరిలో సంక్రాంతి సెలవులు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు ఉంటాయని విద్యా శాఖ వెల్లడించింది.మరోవైపు, 2025 జనవరి పదో తేదీ వరకు పదో తరగతి సిలబస్‌ను పూర్తి చేయనున్నారు. తర్వాత రివిజన్ క్లాసులు ఉంటాయి. ఫిబ్రవరి 28, 2025 వరకు ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి సిలబస్ పూర్తి చేస్తారు. ప్రతీ రోజూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి. పదో తరగతి బోర్డు పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్లో పేర్కొంది. -
ఈ సమ్మర్ సెలవుల్లో.. పిల్లలు ఫోన్‌కి దూరంగా ఉండాలంటే?
సెలవులొచ్చేది ఆటల కోసం, స్నేహాల కోసం బంధువుల కోసం, విహారాల కోసం, వినోదాల కోసం పిల్లలు ఇంతకాలం ఫోన్లలో కూరుకుపోయారు. వారిని ఫోన్ల నుంచి బయటకు తెండి. మీ బాల్యంలో సెలవుల్లో ఎలా గడిపారో అలా గడిపేలా చేయండి. పెద్దయ్యాక తలుచుకోవడానికి బాల్యం లేకపోవడానికి మించిన విషాదం లేదు.ఆటస్థలాలు లేని స్కూళ్లలో చదివించడం, ఆడుకునే వీలు లేని ఇళ్లలో నివసించడం, పార్కులు లేకపోవడం, ఆడుకోవడానికి తోటి పిల్లలు లేని వాతావరణంలో జీవించడం, ఇవన్నీ ఉన్నా పిల్లలతో గడిపే సమయం తల్లిదండ్రులకు లేకపోవడం... వీటన్నింటి వల్ల పిల్లలకు స్కూల్, ఇల్లు కాకుండా తెలిసింది ఒకే ఒక్కటి. సెల్‌ఫోన్. పిల్లలకు సెల్ఫోన్లు ఇచ్చి వారు వాటిలో కూరుకుపోతే ‘అమ్మయ్య. మా జోలికి రావడం లేదు’ అనుకునే తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆటలు, విహారం, అనుబంధాల విలువ, కొత్త విషయాల ఎరుక ఎలా కలుగుతుంది?అందుకే వేసవి సెలవలు ఒక పెద్ద అవకాశం. ఇరవై ముప్పై ఏళ్ల క్రితం వరకు తెలుగు ్రపాంతాలలో వేసవి సెలవులు వస్తే పిల్లలు ఎలా గడిపేవారో ఇప్పుడూ అలా గడిపే అవకాశం కల్పించవచ్చు. కాకుంటే తల్లిదండ్రులు ప్రయత్నించాలి. పిల్లలను మోటివేట్ చేయాలి.బంధువులు– బంధాలు..బంధువులు ఎవరో తెలియకపోతే బంధాలు నిలవవు. ఎంత స్వతంత్రంగా జీవిద్దామనుకున్నా, సాటి మనుషుల విసిగింపును తప్పించుకుని తెగదెంపులు చేసుకుని బతుకుదామనుకున్నా మనిషి సంఘజీవి. అతడు బంధాలలో ఉండాల్సిందే. బంధాల వల్ల బతకాల్సిందే. పిల్లలకు బంధాలు బలపడేది, బంధాలు తెలిసేది వేసవి సెలవుల్లోనే. ఇంతకు ముందు పిల్లలు వేసవి వస్తే తల్లిదండ్రులను వదిలిపెట్టి పిన్ని, బాబాయ్, పెదనాన్న, తాతయ్య... వీళ్ల ఇళ్లకు వెళ్లి రోజుల తరబడి ఉండేవారు. వారి పిల్లలతో బంధాలు ఏర్పరుచుకునేవారు.దీని వల్ల కొత్త ఊరు తెలిసేది. ఆటలు తెలిసేవి. కలిసి వెళ్లిన సినిమా అలా ఓ జ్ఞాపకంగా మిగిలేది. ఇవాళ పెద్దల పట్టింపులు పిల్లలకు శాపాలవుతున్నాయి. రాకపోకలు లేని బంధుత్వాలతో పిల్లలు ఎక్కడకూ వెళ్లలేని స్థితి దాపురించింది. దీనిని సరి చేయాల్సిన బాధ్యత పెద్దలదే. లేకుంటే పిల్లలు ఫోన్లనే బంధువులుగా భావించి అందులోని చెత్తను నెత్తికెక్కించుకుంటారు. జీవితంలో సవాళ్లు ఎదురైన సమయంలో ఒంటరితనం ఫీలయ్యి అతలాకుతలం అవుతారు.తెలుగు ఆటలు..సెలవుల్లో పిల్లలకు తెలుగు ఆటలు తెలియడం ఒక పరంపర. బొంగరాలు, గోలీలు, వామనగుంటలు, పరమపదసోపాన పటం, ఒంగుళ్లు–దూకుళ్లు, నేల–బండ, ఏడుపెంకులాట, పులి–మేక, నాలుగు స్తంభాలాట, వీరి వీరి గుమ్మడిపండు, లండన్ ఆట, రైలు ఆట, ΄÷డుపుకథలు విప్పే ఆట, అంత్యాక్షరి, కళ్లకు గంతలు... ఈ ఆటల్లో మజా తెలిస్తే పిల్లలు ఫోన్ ముట్టుకుంటారా?కథ చెప్పుకుందామా..కథలంటే పిల్లలకు ఇష్టం. పెద్దలు చె΄్పాలి గాని. ఈ సెలవుల్లో రాత్రి పూట భోజనాలయ్యాక, మామిడి పండ్లు తిన్నాక, పక్కలు వేసుకుని అందరిని కూచోబెట్టి పెద్దలు కథలు చెప్తే ఎన్నెన్ని తెలుస్తాయి! ఎన్ని ఊహల కవాటాలు తెరుచుకుంటాయి. మర్యాద రామన్న, తెనాలి రాముడు, బేతాళుడు, సింద్బాద్, ఆలీబాబా, పంచతంత్రం, రామాయణం, మహాభారతం... భీముడిలోని బలం, అర్జునుడిలోని నైపుణ్యం... ఇవి కదా చె΄్పాలి.బలం కోసం తిండి..పిల్లలను సరిగ్గా గమనించి వారికి కావలసిన బలమైన తిండి తినిపించడానికి వీలయ్యేది ఈ సెలవుల్లోనే. బలహీనంగా ఉండే పిల్లలు, ఎదిగే వయసు వచ్చిన ఆడపిల్లలకు ఏమేమి వొండి తినిపించాలో పెద్దల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ కాలంలో తినిపిస్తారు. శిరోజాల సంరక్షణ, చర్మ సంరక్షణ, పంటి వరుస సరి చేయించడం, జీర్ణశక్తిని ఉద్దీపన చేయడం, బంధువుల రాక వల్ల లేదా బంధువుల ఇంటికి వెళ్లడం వల్ల పిల్లలందరికీ కలిపి వారికి వృద్ధి కలిగించే ఆహారం చేసి పెట్టవచ్చు. తోటి పిల్లలు పక్కన ఉంటే ఇష్టం లేకపోయినా పిల్లలు తింటారు.సెలవులొచ్చేది పిల్లల మానసిక, శారీరక వికాసానికి. కదలకుండా మెదలకుండా ఫోన్ పట్టుకుని కూచుని వారు ఈ సెలవులు గడిపేస్తే నింద తల్లిదండ్రుల మీదే వేయాలి... పిల్లల మీద కాదు.ఇవి చదవండి: Indian Navy Women Officers: సముద్రంపై సాహస సంతకం -
ఏప్రిల్‌లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. చూశారా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి. ఏప్రిల్ 2024లో సెలవుల జాబితా ఏప్రిల్ 1 (సోమవారం): మిజోరాం, చండీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ కారణంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 5 (శుక్రవారం): బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు. జుమాత్-ఉల్-విదా కోసం తెలంగాణ, జమ్మూ మరియు శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 9 (మంగళవారం): మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్మూలో గుఢి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 10 (బుధవారం): రంజాన్ ( కేరళలోని బ్యాంకులకు హాలిడే) ఏప్రిల్ 11 (గురువారం): చండీగఢ్, గ్యాంగ్‌టక్, కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం మినహా చాలా రాష్ట్రాల్లో రంజాన్ కారణంగా బ్యాంకులకు హాలిడే. ఏప్రిల్ 13 (శనివారం): అగర్తలా, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్‌లలో బోహాగ్ బిహు/చీరోబా/బైసాఖీ/బిజు ఫెస్టివల్ ఏప్రిల్ 15 (సోమవారం): గౌహతి, సిమ్లాలో బోహాగ్ బిహు/హిమాచల్ డే ఏప్రిల్ 17 (మంగళవారం): గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో శ్రీరామ నవమి ఏప్రిల్ 20 (శనివారం): అగర్తలాలో గరియా పూజ కోసం బ్యాంకులకు హాలిడే ఏప్రిల్ 21- ఆదివారం ఏప్రిల్ 27- నాలుగో శనివారం ఏప్రిల్ 28- ఆదివారం బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. -
మార్చిలో బ్యాంక్ సెలవులు ఇవే - చూసారా..
2024 ఫిబ్రవరి ముగియడానికి మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెలతో పోలిస్తే వచ్చే నెలలో (మార్చి) బ్యాంకులకు సెలవులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో ఏకంగా 14 రోజులు బ్యాంకులు మూత పడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 1 - చప్చుర్ కుట్ - మిజోరాం మార్చి 6 - మహర్షి దయానంద్ సరస్వతి జయంతి మార్చి 8 - మహా శివరాత్రి / శివరాత్రి మార్చి 12 - రంజాన్ ప్రారంభం మార్చి 22 - బీహార్ డే - బీహార్ మార్చి 23 - భగత్ సింగ్ అమరవీరుల దినోత్సవం - అనేక రాష్ట్రాలు మార్చి 25 - హోలీ మార్చి 29 - గుడ్ ఫ్రైడే మార్చి 31 - ఈస్టర్ హాలిడే ఈ సెలవులు కాకుండా మార్చి 9, 23 రెండవ, నాలుగవ శనివారాలు.. 3, 10, 17, 24, 31 ఆదివారం సెలవులు ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 14 సెలవులు ఉన్నాయి. కాబట్టి బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇదీ చదవండి: స్విగ్గీ అకౌంట్‌తో రూ.97 వేలు మాయం చేశారు - ఎలా అంటే? -
పల్లెకు బైబై.. పట్నం దారిలో కిటకిటలాడుతున్న బస్సులు, రైళ్లు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి సెలవులు ముగియడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణమవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ఏపీకి తరలి వెళ్లిన వారంతా రిటర్న్ అవుతున్నారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైదరాబాద్ వైపు వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వేలాది వాహనాల్లో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు. చౌటుప్పల్ వద్ద పంతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి వద్ద కొర్లపాడ్ టోల్ ప్లాజాల వద్ద రద్దీకి అనుగుణంగా బూత్‌ల సంఖ్యను పెంచారు. మరోపక్క ఏపీలో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. కాకినాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు బస్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ట్రావెల్స్ బస్సులైతే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇదీచదవండి.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలివే -
ఢిల్లీ స్కూళ్లకు మరో 5 రోజులు సెలవులు
న్యూఢిల్లీ: ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలకు ఈ నెల 12వ తేదీ వరకు సెలవులను పొడిగించింది. ఢిల్లీలో పాఠశాలలకు సోమవారంతో శీతాకాల సెలవులు ముగియాల్సి ఉంది. ‘ఢిల్లీలో చలి వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను మరో అయిదు రోజుల పాటు మూసి ఉంచాలని నిర్ణయించాం’అని విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం ‘ఎక్స్’లో తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తమ విద్యార్థుల కోసం ఆన్లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని తెలుపుతూ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలు–సాయంత్రం 5 గంటల మధ్యలోనే తరగతులు నడపాలని కోరింది. -
బ్యాంక్ హాలిడేస్ జనవరిలో ఎన్ని రోజులంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే 2024లో బ్యాంకుల సెలవులకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇప్పటికే విడుదకైనా జాబితా ప్రకారం, జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవని (సెలవు దినాలు) తెలుస్తోంది. రిపబ్లిక్ డే కారణంగా జనవరి 26 నేషనల్ హాలిడే, మిగిలిన రోజుల్లో ప్రాంతీయ పండుగలు, రెండవ & నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఉన్నాయి. ఇవన్నీ వేరు వేరు రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంటాయి. జనవరి 2024లో బ్యాంక్ సెలవుల జాబితా జనవరి 1 (సోమవారం): దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జనవరి 11 (గురువారం): మిజోరంలో మిషనరీ డే జరుపుకున్నారు జనవరి 12 (శుక్రవారం): పశ్చిమ బెంగాల్లో స్వామి వివేకానంద జయంతిని జరుపుకున్నారు జనవరి 13 (శనివారం): పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో లోహ్రీ జరుపుకుంటారు జనవరి 14 (ఆదివారం): చాలా రాష్ట్రాల్లో మకర సంక్రాంతి జరుపుకుంటారు జనవరి 15 (సోమవారం): తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పొంగల్, తమిళనాడులో తిరువల్లువర్ దినోత్సవం జరుపుకుంటారు. జనవరి 16 (మంగళవారం): పశ్చిమ బెంగాల్, అస్సాంలో తుసు పూజ జరుపుకుంటారు జనవరి 17 (బుధవారం): కొన్ని రాష్ట్రాల్లో గురు గోవింద్ సింగ్ జయంతి జరుపుకుంటారు జనవరి 23 (మంగళవారం): సుభాష్ చంద్రబోస్ జయంతిని అనేక రాష్ట్రాల్లో జరుపుకున్నారు జనవరి 26 (శుక్రవారం): భారతదేశం అంతటా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు జనవరి 31 (బుధవారం): అస్సాంలో మీ-డ్యామ్-మీ-ఫై జరుపుకుంటారు -
తెలంగాణ: 2024 సెలవుల్ని ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: మరికొన్నిరోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. ఈ క్రమంలో సెలవులపై మంగళవారం ఒక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్), 25 ఆఫ్షనల్(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న మహా శివరాత్రి, మార్చి 25న హోలి, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళికి సెలవులుగా పేర్కొంది. -
విద్యార్థులకు శీతాకాలపు సెలవులు తగ్గింపు
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు శీతాకాలపు సెలవులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈసారి పాఠశాలలకు శీతాకాలపు సెలవులు 6 రోజులు మాత్రమే ఉండనున్నాయి. గతంలో జనవరి ఒకటి నుండి జనవరి 15 వరకు పాఠశాలకు సెలవులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు మాత్రమే మూసివేయనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అందుకే పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈసారి శీతాకాలపు సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌లో.. 2023-24 అకడమిక్ సెషన్లో శీతాకాలపు సెలవులు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
నేటినుంచి మళ్లీ బడులు
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు గురువారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి విజయదశమి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నికల వేడి నెలకొనడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే సిలబస్ అనుకున్న మేర పూర్తవ్వలేదు. చాలా స్కూళ్లల్లో 40 శాతం సిలబస్ కూడా పూర్తవ్వలేదు. దీంతో ఎన్నికల లోపు సిలబస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ సూచించింది. రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది టీచర్లు పోలింగ్ విధులకు హాజరవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి శిక్షణ కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఇప్పుడు జిల్లాల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత మండల స్థాయిలో టీచర్లకు శిక్షణ ఇస్తారు. అంటే మరో 15 రోజుల్లో ఉపాధ్యాయులు పూర్తిగా ఎన్నికల శిక్షణలోనే పెద్ద సంఖ్యలో పాల్గొనే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిలబస్ పూర్తి చేసేందుకు కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ముఖ్యంగా టెన్త్ పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. పబ్లిక్ పరీక్షలు కావడంతో సిలబస్ కోసం అదనపు క్లాసులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఎన్నికల తర్వాత డిసెంబర్లో ఈ ప్రక్రియ చేపట్టే వీలుందని చెబుతున్నారు. దసరా వరకూ 70 శాతం సిలబస్ పూర్తవ్వాల్సి ఉంటుంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని, మిగిలిన సిలబస్‌ను డిసెంబర్లో ప్రత్యేక క్లాసుల ద్వారా చేపట్టాలని భావిస్తున్నారు. దశల వారీగా అల్పాహారం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి దసరా తర్వాత దీన్ని అమలు చేయాలని భావించినా, ఎన్నికల షెడ్యూల్డ్ వస్తుందని తెలియడంతో ముందే ప్రారంభించారు. పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్ళల్లో దసరా తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని అనుకున్నారు. కానీ ఇందుకు అవసరమైన ప్రణాళిక పూర్తవ్వలేదని అధికారులు చెబుతున్నారు. ప్రతీ స్కూలులో వంట సామాగ్రి, బడ్జెట్ అంశాలపై స్పష్టత లేదంటున్నారు. దీంతో తొలి రోజు మండలానికి ఒక స్కూల్లో సీఎం అల్పాహారం పథకం అమలు చేయాలనిఅధికారులు నిర్ణయించారు. ప్రతీ వారం ప్రతీమండలంలో ఒక్కో స్కూల్ చొప్పున, దశలవారీగా విస్తరించబోతున్నట్టు అధికారులు తెలిపారు. -
25 నుంచి 27 వరకు హైకోర్టుకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సెలవులు ఇస్తూ హైకోర్టు రిజ్రిస్టార్ జనరల్ వై.లక్ష్మణరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి ఈ నెల 30న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి వెకేషన్ బెంచ్‌లను ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ ఏవీ రవీంద్ర బాబు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి వెకేషన్ కోర్టు జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇందులో జస్టిస్ వెంకటేశ్వర్లు, జస్టిస్ రవీంద్రబాబు ధర్మాసనంలో కేసులను విచారిస్తారు. జస్టిస్ జ్యోతిర్మయి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. హెబియస్ కార్పస్, బెయిల్స్, ముందస్తు బెయిల్స్, ఇతర అత్యవసర వ్యాజ్యాలపై మాత్రమే వెకేషన్ జడ్జిలు విచారణ జరపాల్సి ఉంటుంది. ఈ సెలవుల్లో అత్యవసర కేసులు దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 25న దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా దాఖలైన వ్యాజ్యాలను న్యాయమూర్తులు ఈ నెల 27న విచారిస్తారు.