తెలంగాణలో ఎల్లుండి ఆ స్కూళ్లకు హాలీడే | TS TET Exam 2023: Telangana Govt Declared One And Half Day Holiday For Exam Centre Schools - Sakshi
Sakshi News home page

Telangana School Holidays: తెలంగాణలో ఎల్లుండి ఆ స్కూళ్లకు హాలీడే

Published Wed, Sep 13 2023 9:28 PM | Last Updated on Thu, Sep 14 2023 11:02 AM

TS TET Exam 2023: Examination Centre Schools Declared Holiday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా టెట్‌ పరీక్ష ఈ నెల 15వ(శుక్రవారం) తేదీన జరగనుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటాయి. అయితే, ఎగ్జామ్‌ సెంటర్లుగా ఎంపిక చేసిన స్కూళ్లకు ఎల్లుండి పూర్తిగా హాలీడే ప్రకటించింది ప్రభుత్వం. అంతేకాదు.. రేపు(గురువారం కూడా) మధ్యాహ్నాం నుంచి సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. టీఎస్‌ టెట్‌-2023 నోటిఫికేషన్‌ ఈ ఏడాది ఆగస్టు ఒకటిన విడుదలైంది. ఆగస్టు 2 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 2,83,620 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. హల్‌ టికెట్లను అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచారు కూడా. 

టెట్‌ అభ్యర్థుల కోసం..

  • హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకోవాలి.
  • పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, జెండర్‌, డిసేబిలిటీ తదితర వివరాలు సరిగా లేకుంటే పరీక్ష హాలులో నామినల్‌ రోల్‌ కమ్‌ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి.
  • హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగ్గా లేకపోతే అభ్యర్థుల ఇటీవలి తాజా ఫొటోను అతికించి గెజిటెడ్‌ అధికారితో అటెస్టేషన్‌ చేయించుకోవాలి. ఆధార్‌ కార్డు, ఇతర ఐడీతో సంబంధిత జిల్లా డీఈవోను సంప్రదించాలి. డీఈవో పర్మిషన్‌ అనంతరమే పరీక్షకు అనుమతించడంలో తగు నిర్ణయం తీసుకుంటారు.
  • పరీక్షాకేంద్రం చిరునామాను ఒకరోజు ముందుగానే సంప్రదించడం ఉత్తమం.

హల్‌ టికెట్‌ ఇతర వివరాల కోసం https://tstet.cgg.gov.in/ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement