
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించినట్లు డీఈవో తాహెరాసుల్తానా శుక్రవారం తెలిపారు. మిషనరీ పాఠశాలకు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సెలవులు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలోని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడదని పేర్కొన్నారు.
నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని మేనేజ్‌మెంట్లకు చెందిన పాఠశాలలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు.