వివిధ సెలవుల కారణంగా 2023 జూలైలో హైదరాబాద్‌లోని బ్యాంకులు ఎనిమిది రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు సెలవులు ప్రకటించింది. ఆర్బీఐ ప్రకారం.. దేశంలోని వివిధ రాష్ట్రాలలో జూలై నెలలో ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు కలిపి మొత్తం 15 సెలవులు ఉన్నాయి.
అయితే, ఈ సెలవులు రాష్ట్రానికి, రాష్ట్రానికి మారవచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ మొత్తం 15 రోజులూ సెలవులు ఉండవు. హైదరాబాద్‌లో ఉండే బ్యాంకులు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, అదనంగా మొహర్రం కారణంగా జూలై 29 న పనిచేయవు. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ కస్టమర్‌లు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కార్యకలాపాలను కొనసాగించవచ్చు.
హైదరాబాద్‌లో బ్యాంకు సెలవులు
- జూలై 2: ఆదివారం
- జూలై 8: రెండో శనివారం
- జూలై 9 : ఆదివారం
- జూలై 16 : ఆదివారం
- జూలై 22 : నాలుగో శనివారం
- జూలై 23 : ఆదివారం
- జూలై 29: మొహర్రం
- జూలై 30: ఆదివారం
ఇదీ చదవండి: July Deadlines: ఆధార్-పాన్ లింక్ ముగిసింది.. ఇక మిగతా డెడ్‌లైన్ల సంగతేంటి?
Comments
Please login to add a commentAdd a comment