రేపటి నుంచి దసరా సెలవులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు | Telangana Dussehra Holidays 2023 Began From Tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి దసరా సెలవులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు

Published Thu, Oct 12 2023 6:35 PM | Last Updated on Thu, Oct 12 2023 6:51 PM

Telangana Dussehra Holidays 2023 Began From Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో దసరా సందడి మొదలైంది. సర్కార్‌, ప్రైవేట్‌ బడులకు రేపటి(అక్టోబర్‌ 13) నుంచి సెలవులు కావడంతో కోలాహలం నెలకొంది. ఇవాళ సాయంత్రం నుంచే బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

దాదాపు అన్ని పాఠశాలల్లో నిన్నటి వరకు పరీక్షలు ముగిశాయి. ఈ రోజు స్కూల్స్, కాలేజీలలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మలతో స్కూళ్లు, కాలేజీలకు తరలి వచ్చారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఆడుకున్నారు. హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులతో పాటు సొంతూళ్లకు జనాల ప్రయాణాలతో బస్సులు కిక్కిరిసిపోయాయి. 

మరోవైపు మరోవైపు జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.  తిరిగి ఈ నెల 26న విద్యాసంస్థలన్నీ పునప్రారంభం అవుతాయి.

ఇప్పటికే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా.. సాధారణ ఛార్జీలతో ఆర్టీసీ ఐదువేలకు పైగా స్పెషల్‌ సర్వీసులను నడపాలని నిర్ణయించుకుంది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement